
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్ ఎస్‌ఎంఎస్-2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.
మరో నలుగురిని స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీను, బంగారయ్య, అనిల్ బిశ్వాల్, సూరిబాబు, జై కుమార్ పోతయ్య, ఈశ్వర్ నాయుడు, అప్పలరాజు, సాహు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై విచారణ జరిపి మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులు కోరారు.