workers injured
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్ ఎస్ఎంఎస్-2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురిని స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీను, బంగారయ్య, అనిల్ బిశ్వాల్, సూరిబాబు, జై కుమార్ పోతయ్య, ఈశ్వర్ నాయుడు, అప్పలరాజు, సాహు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై విచారణ జరిపి మెరుగైన వైద్యం అందించాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులు కోరారు. -
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. మరుగుతున్న ఉక్కుద్రవం పడి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
వాహనం బోల్తా : 30 మంది కూలీలకు గాయాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు గ్రామం వద్ద బుధవారం బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ఉపాధి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని మల్లానూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. వాహనం అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. -
అనంతలో టీడీపీ నేతల దౌర్జన్యం
అనంతపురం : అనంతపురం జిల్లాలో తెలుగు దేశం పార్టీ నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో వైఎస్ఆర్సీపీ కదిరప్పపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మరోవైపు ఎన్సీకుంట మండలం జవకులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాబురెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నల్లచెరువు మండలం గోళ్లవాండ్లపల్లిలో పార్టీ కార్యకర్త నర్సింహులుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మరోవైపు తలుపుల మండలం ఇందుకూరుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలు కొడవళ్లతో దాడి చేయటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివారెడ్డి గాయపడ్డాడు. -
పల్ప్ మిల్ లిక్విడ్ మీద పడి 7 గురికి విషమం
-
ఐటీసీ పేపర్ మిల్లులో ప్రమాదం,ఏడుగురికి గాయాలు
ఖమ్మం : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్‌మిల్లులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. కాగితపు గుజ్జును వేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు మీద పడింది. ఈ ఘటనలో గాయపడినవారిలో రాంబాబు అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.