
అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్ మాట్లాడారు.
గవర్నర్ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ప్రతిపక్ష హోదా దక్కేది.
ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్‌సీపీ బహిష్కరించడం కరెక్ట్ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి’’ అని పవన్ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అన్నారు.
ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం!
Comments
Please login to add a commentAdd a comment