Opposition
-
రోడ్డుకు సిద్ధరామయ్య పేరు.. ప్రతిపక్షాల ఫైర్
బెంగళూరు:కర్ణాటకలోని మైసూరు(Mysuru) మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నగరంలోని ఒక ప్రధాన రోడ్డుకు సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)పేరు పెట్టాలని మైసూరు కార్పొరేషన్ ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజలను అవమానపరచడమేనని జనతాదళ్ సెక్యులర్(JDS) పార్టీ విమర్శించింది.మైసూరు నగరంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి సర్కిల్ నుంచి మెటగల్లిలోని రాయల్‌ఇన్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్యమార్గ అని పేరు పెట్టేందుకు మైసూరు మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని చామరాజ ఎమ్మెల్యే హరీశ్‌గౌడ తొలుత సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(Muda) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సిద్ధరామయ్య పేరును రోడ్డుకు ఎలా పెడతారని బీజేపీ ప్రశ్నిస్తోంది.కార్పొరేషన్లో ఎన్నికైన పాలకవర్గంలేని ప్రస్తుత సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వ మెప్పు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: గులాబ్జామూన్తో మాజీ మంత్రికి చిక్కులు -
ధన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది. ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్ ఇది’’ అంటూ హరివంశ్ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్‌ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్‌ఖడ్‌పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి. ‘‘ నోటీస్ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. డిసెంబర్ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్‌పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్ నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
పార్లమెంట్లో అదే రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్లో ఇదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్‌లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం లాభం?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తే.. వాళ్లను ఎక్కడ ఎండగడతామని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంపై స్పందించారు.ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లను ప్రతిపక్షంగా గుర్తించరా?. సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం కాబట్టి మైక్ ఇవ్వరు. అసెంబ్లీలో మాకు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం ఉపయోగం. అందుకే ఇక నుంచి మీరే నా స్పీకర్లు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.‘‘అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొస్తాం. మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ.. ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాను’’ అని అన్నారాయన. -
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
ల్యాటరల్ ఎంట్రీ దుమారం.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖలలో ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని 45 కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన ‘ల్యాటరల్ ఎంట్రీ’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గింది.ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ నిర్ణయం సామాజిక న్యాయంతో ముడిపడి ఉండాలని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని యూపీఎస్సీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా గతవారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాల్లో ‘ల్యాటరల్ ఎంట్రీ’ద్వారా నియమాకాల కోసం ప్రతిభావంతులైన భారతీయులు కావాలంటూ యూపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంత్రిత్వ శాఖలలో 45 పోస్టులు ఉన్నాయి. వీటిలో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు. ఈ పోస్టుల నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేక వ్యక్తమవుతుండటంతో కేంద్ర మంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్య స్థాయి, సీనియర్ స్థాయి పదవులను సాధారణంగా ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తారు. అయితే ఈ పదవులను సివిల్ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడాన్నే ‘ల్యాటరల్ ఎంట్రీ’అంటారు. మూడేళ్లు, అయిదేళ్ల ఒప్పందంతో వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని ప్రధానిగా మోదీ తొలి హయాంలో 2018లో అమలు చేశారు.ఈ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ పద్దతిని తప్పుపట్టారు. దానిని జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. -
అదానీ–సెబీ చైర్పర్సన్ ఉదంతంపై... జేపీసీతో దర్యాప్తు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో సెబీ చైర్పర్సన్ మాధబీ పురీ బచ్ పెట్టుబడుల వ్యవహారంపై నిజానిజాలు నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు ఆదివారం డిమాండ్ చేశాయి. ‘‘అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. దీనిపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించాలి’’ అన్నాయి. అదానీ గ్రూప్‌లో మాధబీ దంపతులు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌వర్గ్ తాజాగా ఆరోపించడం తెలిసిందే. అదానీ గ్రూప్, సెబీ చైర్పర్సన్ బంధంపై కేంద్రం నోరు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న సంపన్న మిత్రులను కాపాడుకొనేందుకు మోదీ ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబీ పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. ఆమె ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని రాహుల్ ప్రశ్నించారు. నియంత్రణ సంస్థ సమగ్రతను కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్పర్సన్–అదానీ బంధం స్పష్టంగా కనిపిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని సీతా రాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), మహువా మొయిత్రా (టీఎంసీ), సంజయ్ సింగ్ (ఆప్), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ–ఎంఎల్) ఆరోపించారు. అదానీ గ్రూప్‌ను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. విపక్షాల కుట్ర: బీజేపీ దేశంలో ఆర్థిక అస్థిరత సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ మండిపడింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. విదేశీ కుతంత్రాల్లో ప్రతిపక్షాలు భాగంగా మారాయని ధ్వజమెత్తింది. -
మణిపూర్‌పై రాజకీయాలు ఆపండి: విపక్షాలకు మోదీ చురకలు
న్యూఢిల్లీ: నీట్ వివాదం, మణిపూర్ హింసపై చర్చ జరపాలంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రం తరపున ఆయన సమాధానమిచ్చారు.మణిపూర్ అంశంలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాధారణ స్థితిని తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. మణిపూర్‌లో హింస తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు.చిన్న రాష్ట్రంలో 11 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారని తెలిపారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్‌లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్‌లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.‘మణిపూర్‌లో కాంగ్రెస్ సుదీర్ఘ పాలనను ప్రస్తావిస్తూ.. మణిపూర్ చరిత్ర తెలిసిన వారికి మణిపూర్‌లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని తెలుస్తుంది. ఈ సామాజిక సంఘర్షణ మూలం చాలా లోతైనదని ఎవరూ కాదనలేరు. ఇంత చిన్న రాష్ట్రంలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు మర్చిపోకూడదు.ఈ తరహా హింస 1993లో జరిగిందన్నారు. ఐదేళ్లపాటు ఇలాంటి ఘటనలు నిరంతరం జరిగాయన్నారు. మణిపూర్‌ను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. అక్కడి ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారు’. అని పేర్కొన్నారు. -
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే ఆలోచన అదేనా!
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండగా... మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అవధేశ్ ప్రసాద్‌కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.అయితే డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు సమాచారం, డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా 2019 నుంచి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ పదవిని కేటాయించారు. అయితే ఇది ఎల్లప్పుడూ కొనసాగదని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఉండటంతో.. తమ ఎంపీలలో ఒకరికి డిప్యూటీ పదవి దక్కాలని డిమాండ్ చేస్తోంది. కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. ఇక స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించి రెండవసారి స్పీకర్ పదవిని చేపట్టారు. -
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
న్యూ లుక్‌లో రాహుల్.. పీక్‌లో 20 ఏళ్ల పొలిటికల్ కెరియర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు. -
‘లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీనే ఎన్నుకోవాలి’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ తర్వాత సింగిల్‌గా కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు సంపాధించుకుంది. ఇండియా కూటమిలో సైతం కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.కాగా, గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని పుంజుకోవటంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీనే లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండాలని తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా రాహుల్ గాంధీ ఉండాలని తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్ స్థానంలో గెలుపొందిన మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘ నా పార్లమెంట్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పేరు మీదనే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాను. నాకు తెలిసి లోక్‌సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రతిపక్షనేత ఉండాలి. ఎన్నికైన ఎంపీలందరిలో ఇదే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ’’ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వివేక్ తన్ఖా సైతం లోక్‌సభలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనేతగా ఎన్నకుంటే బాగుంటుందని తలిపారు. ‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ ముందుండి నడిపించారు. లోక్‌సభలో కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే రాహుల్ గాంధీ తన కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఇలాంటి నిర్ణయాలను పార్టీ పెద్దలు, ఎంపీలు తీసుకుంటారు. కానీ ఏకగ్రీవంగా ఉన్న ఒకే ఒక అవకాశం.. రాహుల్ గాంధీనే’’ అని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం కూడా స్పందించారు. నా వ్యక్తిగతంగా.. లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్షపార్టీ నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుంటే అది సరైన నిర్ణయంగా భావిస్తానని అన్నారు. ఇక 2019లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలుకావటంతో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ గతం కంటే మెరుగైన స్థానాలు గెలవటంతో లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలనే చర్చ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది. -
అటు అధికారం.. ఇటు విపక్ష హోదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుందని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు. అయితే అదే సమయంలో జనసేన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతోందని, ఈ రెండింటి మధ్య టెక్నికల్‌గా ఎలా సాధ్యమో చూడాలంటూ వ్యాఖ్యానించారు.బుధవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విజయం సాధించిన జనసేన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఓటును బాధ్యతగా భావించి జవాబుదారీతనంతో పని చేయాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ సందర్భంగా పవన్ సూచించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కీ లభించని గెలుపును రాష్ట్ర ప్రజలు జనసేనకు అందించారన్నారు. జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.రూపాయి జీతం మాటలు చెప్పను.. కేవలం రూపాయి జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు కాకుండా ఓ ప్రజా ప్రతినిధిగా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటా. దీనివల్ల తాము చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున పనులు ఎందుకు చేయవనే అధికారం ప్రజలకు ఉంటుంది. అందుకే సంపూర్ణంగా జీతం తీసుకొని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతా. ప్రజల కోసం ఎంత జీతం తీసుకున్నా దానికి వెయ్యి రెట్లు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తా. యువతకు ప్రజాప్రతినిధులు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా జనసేన ప్రయాణం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. వ్యక్తిగత దూషణలు లేకుండా కొత్త ఒరవడిని తెద్దాం. కొత్తగా నిరి్మస్తున్న జనసేన కార్యాలయం తలుపులు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు నిరంతరం తెరిచే ఉంటాయి. -
Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్‌ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు. తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట! -
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శల దాడులను చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీని పక్కనపెట్టి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సీఎం యోగిని టార్గెట్ చేశారు. జూన్ 4 తర్వాత బీజేపీ సీనియర్ నేతలందరి పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.. ‘వాళ్లంతా పారిపోతారు. రాహుల్ గాంధీ గానీ, భారత కూటమిలోని సభ్యులు గానీ ఎన్నడూ పారిపోరు. దేశానికి అండగా నిలుస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం చేశారు. దేశం కోసం ఏ బీజేపీ నేత అయినా బలిదానం చేశారా? వీళ్లంతా వ్యాపారస్తులు, భయపడతారు. ఆ వ్యాపార వలయంలో చిక్కుకుపోయానని యోగి గ్రహించాలి’ అని నానా పటోలే అన్నారు.అరవింద్ కేజ్రీవాల్ కూడా మీడియా సమావేశంలో సీఎం యోగిపై పలు వ్యాఖ్యానాలు చేశారు. యోగి ఢిల్లీకి వచ్చి తనపై దుర్భాషలాడారని ఆరోపించారు. అయితే ఆయనకు అసలు శత్రువులు బీజేపీలోనే ఉన్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎం యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు. యూపీలో పరిస్థితి గందరగోళంగా ఉన్నందున సీఎం యోగి అక్కడే ఉండాలని అన్నారు. యూపీలో పరిస్థితి కనిపించిన దానికి భిన్నంగా ఉందన్నారు.ఉత్తరప్రదేశ్‌లో పదేళ్లుగా అధికారంలో ఉంటూ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే మరోమారు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాపంగానూ ఆయన స్థాయి పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం యోగి పేరు ఉంది. ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
Lok Sabha Election 2024: కాంగ్రెస్‌కు కనీసం 50 సీట్లు కూడా రావు
ఫూల్బాణీ/బోలాంగిర్/బార్గఢ్/ఛాత్రా: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 చోట్ల కూడా గెలవబోదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. విజయం కాదుకదా కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఒడిశా, జార్ఖండ్‌లోని ఫూల్బాణీ, బోలాంగిర్, బార్గఢ్, ఛాత్రాలలో ఎన్నికల ప్రచారసభల్లో మోదీ ప్రసంగించారు. ‘‘ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనీసం 10 శాతం సీట్లు కూడా కాంగ్రెస్ సాధించబోదు. వాళ్లు కనీసం 50 సీట్లు కూడా గెలవలేరు’ అని అన్నారు. రాహుల్ గాం«దీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ గాంధీ యువరాజు 2014 నుంచి అదే స్క్రిప్ట్ చదువుతున్నారు. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లు సాధిస్తుంది’’ అని అన్నారు. సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది మణిశంకర్ అయ్యర్ ‘అణుబాంబు’ వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘ పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది. వర్చువల్‌గా ఇప్పటికే చనిపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల గుండెల్లో నిండిన దేశ స్ఫూర్తిని చంపేస్తున్నారు. సొంత అణుబాంబుల నిర్వహణ బాధ్యతలు కూడా పాక్‌కు చేతకావట్లేదు. అందుకే అణుబాంబులను అమ్మేద్దామని భావిస్తోంది. బాంబులను అమ్ముదామన్నా కొనేవారు లేరు. అవి ఎంత నాసిరకానివో ఇతర దేశాలకు తెలుసు. జమ్మూకశీ్మర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న బలహీనమై న నిర్ణయాల వల్ల ఆ ప్రాంతం ఆరు దశాబ్దా లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ హ యాంలో భారత్ ఎన్నోసార్లు ఉగ్రదాడుల బా రినపడింది. కఠిన నిర్ణయాలకు బదులు చర్చలకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు.పాండియన్‌పై విసుర్లు తమిళనాడుకు చెందిన మాజీ ఉన్నతాధికారి పాండియన్‌పై మోదీ విమర్శలు గుప్పి ంచారు. ‘‘ పటా్నయక్ తన ప్రభుత్వ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేశారు. బయటివ్యక్తి(ఔట్‌సైడర్) పాండియన్ ఒడిశాను పాలిస్తున్నారు. ముఖ్యమంత్రిని మించి సూపర్ సీఎం పాలిస్తున్నారు. ఒడిశా బిడ్డలు, కూతుళ్లకు సొంత ప్రభుత్వాన్ని నడుపుకునే సత్తా లేదా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దమ్ము ఇక్కడి వారికి లేదా?’’ అని ప్రశ్నించారు.నవీన్ పటా్నయక్ జిల్లాల పేర్లు చెప్పగలరా? ‘‘ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పటా్నయక్‌కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్లో చూడకుండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థంచేసుకోగలరు?’’ అని మండిపడ్డారు. -
Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్‌వే
ఉత్తరప్రదేశ్. లోక్‌సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి. స్టేట్ స్కాన్ దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు... ఈ ఎన్నికలు అత్యంత కీలకం... ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్(ఎస్) 2 సీట్లు గెలిచింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్‌బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతోంది. అయోధ్య.. బీజేపీ బ్రహా్మస్త్రం ఈసారి 400 పైగా లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే. యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్ నింపింది. చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్ (ఎస్)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు. ‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా? విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్‌బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి. ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్ఎల్డీ గుడ్‌బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ముస్లింల రూటెటు? యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్‌సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్ భారత్ జోడో యాత్ర, అఖిలేశ్ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి. సర్వేలు ఏమంటున్నాయి...? యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవినీతిపరుల కూటమి: ప్రధాని మోదీ
మీరట్/ లక్నో: సార్వత్రిక సమరానికి షెడ్యూల్ మొదలయ్యాక ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రధాని మోదీ తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాల ‘ఇండియా’కూటమిపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఆదివారం మీరట్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈడీ అరెస్ట్‌తో కేజ్రీవాల్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్లిన వేళ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ‘ఇండియా’ కూటమి ‘లోక్తంత్ర బచావో’ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే మోదీ విపక్షాల కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘అవినీతిపై నేను పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించగానే విపక్ష నేతలంతా కలిసి ఇండియా కూటమిగా పోగయ్యారు. నన్ను భయపెట్టొచ్చని భావించారు. కానీ నా భారతదేశమే నా సొంత కుటుంబం. అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు యుద్ధం మొదలుపెట్టా. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. వాళ్లకు సుప్రీంకోర్టు నుంచి కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. ఈసారి రెండు శిబిరాల మధ్యనే సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగబోతోంది. నా మంత్రం ‘భ్రష్టాచార్ హటావో’ (అవినీతి అంతం). వాళ్ల తంత్రం ‘భ్రష్టాచార్ బచావో’ (అవినీతిని కాపాడుకోవడం). పేదల కోసం ఉద్దేశించిన డబ్బు అవినీతిపరులకు దక్కకుండా పదేళ్లుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తున్న ఎన్డీఏ ఒకవైపు ఉంటే, అదే అవినీతి నేతలను కాపాడేందుకు అలుపెరగక కష్టపడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు మరోవైపు ఉన్నారు. అవినీతికి అంతం పలకాలో వద్దో మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘‘అవినీతిపరులకు చెప్పేదొక్కటే. కుటుంబం లేదంటూ నన్నెంతగా అవమానించినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, బీజేపీ నేతలపై దాడులు చేసినా అవినీతిపై నేను పోరాటం ఆపబోను. అవినీతికి పాల్పడింది ఎంత పెద్ద నేతలైనా సరే కఠిన చర్యలు ఖాయం. దేశాన్ని లూటీ చేసిన వారు తిరిగి ఆ సొమ్ము కక్కాల్సిందే. ఇదే మోదీ గ్యారెంటీ’’ అని అన్నారు. ప్రజల కోసం ఆశల పల్లకీని మోసుకొచ్చామంటూ సభకు ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పదేళ్లలో దేశవ్యాప్తంగా నా కుటుంబసభ్యులందరి ఆకాంక్షలూ తీర్చాం. కొంగొత్త కోరికలను తీర్చేందుకు మళ్లీ మీ ముందుకొచ్చాం. ఆశలు నెరవేర్చిన ఎన్డీఏఏ కూటమికే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అన్నారు. పదేళ్ల అభివృద్ధి ట్రైలరే ‘‘ఈసారి లోక్‌సభ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవు. ఈ ఎన్నికలు వికసిత భారత్‌కు పునాది వేయనున్నాయి. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మేం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. మా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు మార్గసూచీని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల్లో అమలుజరపాల్సిన పనులపై ఆలోచిస్తున్నాం. గత పదేళ్లకాలంలో మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత శరవేగంతో అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తాం. నేను పేదరికంలో జీవించా కాబట్టే పేదల గురించి తెల్సు నాకు. ప్రతి ఒక్క పేదవాడి బాధలు, కష్టాలను అర్ధంచేసుకోగలను. అందుకే పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేశాం. ఈ పథకాలు పేదల సాధికారతకు మాత్రమే బాటలు వేయవు. అవి పేదలకు ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చి ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. ‘‘అయోధ్యలో రామాలయం అసాధ్యమ ని చాలామంది అ న్నారు. నేడు రోజూ లక్షలాది మంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్‌పై కఠిన చట్టం, ఆరి్టల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం అసాధ్యమన్నారు. మేం చేసి చూపాం’ అని మోదీ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది. ‘తానాషాహీ హటావో, లోక్తంత్ర్ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్‌మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ–పవార్), ఉద్దవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్ పవార్ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. తృణమూల్ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్ చెప్పారు. కూటమి డిమాండ్లు... కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం ‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు. అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్ సోరెన్‌ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్‌కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేజ్రీవాల్ సింహం: సునీత ‘‘కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్‌సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. మా రక్తంలోనే పోరాటం: కల్పన రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు. నిర్ణాయక ఎన్నికలివి... ‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్‌ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. లోక్‌సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్‌సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్‌ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అహంకారానికి అంతం తప్పదు ‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ – కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా -
ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, తాడేపల్లి: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ గెలవాలన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ గెలుపునకు తాను పనిచేస్తానన్నారు. పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ‘‘2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి -
ప్రతిపక్షాల ప్రవర్తన బాధించింది
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్షాల ప్రవర్తన తనను బాధించిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న 15వ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రతిపక్షాల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. గురువారం సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సభ్యులతో తన ఆవేదనను పంచుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించానని, కానీ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని ఐదేళ్లపాటు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తన విధులను కర్తవ్యదీక్షతో నిర్వర్తించానని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడటానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా తొలిసారి సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, మహిళా సభ్యులను మాట్లాడించడానికి ప్రోత్సహించినట్లు తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ద్వారా సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేశానన్నారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు బిల్లు, మహిళా రక్షణకు ఉద్దేశించిన దిశ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. కానీ, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ పరిధిని దాటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రతిష్టాత్మక వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించారన్నారు. సభలో భిన్న వాదనలు ముఖ్యమని, అయితే పరిధి దాటి స్పీకర్ పోడియం మీదకు వచ్చి కాగితాలు, ఫైళ్లు విసిరారని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, గౌరవ ప్రదమైన స్పీకర్ స్థాయిని, శాసనసభ స్థాయిని తగ్గించడమేనని తమ్మినేని అన్నారు. సభను హుందాతనంగా నడపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్లుగా వ్యవహరించిన కోన రఘుపతి, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 15వ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు 10 గంటల రెండు నిమిషాలు జరిగాయని, ఇందులో 9 బిల్లులను ఆమోదించగా, 20మంది సభ్యులు మాట్లాడినట్లు తెలిపారు. ఫిబ్రవరి 8 నాటికి సభలో వైఎస్సార్సీపీకి 151 మంది, టీడీపీకి 22 మంది, జనసేనకు ఒకరు చొప్పున సభ్యులు ఉన్నారని, ఒక స్థానం ఖాళీగా ఉందని స్పీకర్ వెల్లడిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ప్రతిపక్షాలవి నక్కజిత్తుల రాజకీయాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా యుద్ధానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చే మోసగాళ్లొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. శనివారం విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో వారు ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. పంచుతున్నాడంటున్నారే గానీ.. గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలెవరూ అనడంలేదు. పథకాలు అందలేదని, వివక్ష చూపారని, ధనబలం, కండబలం, కుల బలం చూశారని ఎవ్వరూ అనడంలేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది. జగన్మోహన్రెడ్డి ప్రజలకు అన్నీ పంచుతున్నాడు, ఇస్తున్నాడు అని అంటున్నారు గానీ, ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడంలేదని ఒక మహిళ నాతో అన్నది. ఇదీ ఒక సాధారణ మహిళ సూక్ష్మ పరిశీలన. ఇదీ మన నాయకుడికి ఉన్న గుడ్‌విల్. ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎన్నుకొనే వారు వీరులు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఓటు వేయొద్దని చెబుతున్నారు. విద్యుత్ ధరలు తగ్గిస్తానని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని టీడీపీ వారిని అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో జగన్ ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్, ఇళ్లు, స్థలం, సంక్షేమం అందాయి. గ్రామాల్లో మనం ఉన్నంత గౌరవంగా మరే ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలూ లేరు. టీడీపీ కార్యకర్తల్లా దోచుకుని ఉంటే గ్రామాల్లో గౌరవంగా ఉండగలమా? రానున్న ఎన్నికల్లో అనేక బలాలు కలిగిన మన ప్రత్యర్థులు అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలెవ్వరూ నమ్మడంలేదు. 60 శాతం ప్రజలు మన పార్టీకే ఓటు వేస్తున్నామని చెబుతున్నారు. – రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌కు చెడు తలపెట్టాలని కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను, అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక ఆయనకు చెడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. సీఎం జగన్ దేశంలో మరే ముఖ్యమంత్రీ అందించనంత సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరే సీఎం చేయనంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులను, మహిళలను ఉన్నత స్థితిలోకి తెస్తున్నారు. సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టారు. మంత్రులే ప్రజల ఇంటికి వెళ్లి మాట్లాడిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కటీ పరిష్కరించాం. నక్క జిత్తుల నాయకులు మనల్ని చెడు మార్గంలో నడిపించి అధికారం పొందాలని చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. మన నాయకుడు జగన్ సింహంలా సింగిల్‌గానే వస్తారు. ప్రతిపక్షాల ప్రచారంపై తిరుగుబాటు చేయాలి. దేనికైనా రెడీ అన్నట్టు మనం ఉండాలి. పొత్తులతో వస్తున్న మాయగాళ్లతో, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. – ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం జగన్‌ను మరోసారి సీఎంని చేసే వరకు విశ్రమించొద్దు పేదలను ఉన్నత స్థితికి తెస్తూ, సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ దేశంలో నంబర్ వన్ నాయకుడు. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించారాయన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ను సీఎంను చేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. జగనన్నను సీఎంగా కూరోబెట్టే వరకు విశ్రమించకూడదు. సైనికుల్లా పోరాడుదాం. – భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ సైన్యమై కదలాలి జగనన్న సైనికులుగా, వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తా సైన్యమై కదలాలి. రాష్ట్రంలో ప్రతి పేద విద్యారి్థకి నాణ్యమైన విద్య, ఆంగ్ల విద్య అందాలన్నా, రాష్ట్రంలో రైతుకు మంచి జరగాలన్నా, గౌరవంగా వ్యవసాయం చేయాలన్నా, ఇంటి వద్దకే ఎరువులు రావాలన్నా, పంటను అక్కడికక్కడే అమ్ముకోవాలన్నా జగనన్నే మళ్లీ సీఎం కావాలి. పేదవాడు జన్మభూమి కమిటీల వద్ద తలదించుకోకుండా, ఎవరి వద్దా చేతులు కట్టుకోకుండా నేరుగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నా, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా జగనే ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రతి వైఎస్సార్సీపీ సభ్యుడు, జగనన్న శ్రేయోభిలాషులు అందరూ సైన్యమై కదలాలి. – మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అంబేడ్కర్ ఆశయాలు అమలు చేసే ఏకైక సీఎం జగన్ పేదల పెన్నిధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఎవ్వరికీ ఆకలి చావు లేకుండా, ప్రతి ఒక్కరూ గౌరవంగా తలెత్తుకుని బతికేలా సుపరిపాలన అందించారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారిని అక్కున చేర్చుకొన్న మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. సామాజికంగా వెనకబడిన వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అనేక పదవులిచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా నా వంటి దళితుడిని రాజ్యసభకు పంపుతున్న మహానుభావుడు. ఇది నాకిచ్చిన కానుక కాదు. పేద దళిత, అణగారిన వర్గాలకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిన కానుక. రాజ్యసభలో మన ప్రభుత్వ సంస్కరణలను వినిపిస్తాను. సీఎం జగన్ మరోసారి గెలిస్తేనే సంక్షేమ ఫలాలు కొనసాగుతాయి. లేదంటే ప్రజలకు అందవు. అందుకే జగన్నీ ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలి. – పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు -
లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు
ఢిల్లీ: పార్లమెంట్లో నేడు మరింత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై గందరగోళం సృష్టించిన కారణంగా ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో నిన్న 78 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నిన్న 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Ram Mandir Ayodhya: రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.. -
పార్లమెంట్లో మొత్తం 92 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈరోజు లోక్‌సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన లోక్‌సభ ఎంపీల్లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU — ANI (@ANI) December 18, 2023 సస్పెన్షన్‌పై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'నాతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన మా ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండే చేశాం. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని కోరాం.' అని చెప్పారు. #WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG — ANI (@ANI) December 18, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 47 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Covid 19 Cases: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!