ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. అటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరు భేటీతో ఏకమయ్యాయి. అయితే.. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష కూటమి 'ఇండియా' ఏకతాటిపై నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఇందుకు తొలిసారిగా 'ఇండియా' కూటమి తొలిసారిగా రేపు సమావేశం కానుంది. ఈ మేరకు రాజ్యసభలోని విపక్షాల ఛాంబర్‌లో భేటీ జరగనుందని సమాచారం.
వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై సందించాల్సిన ప్రశ్నల గురించి చర్చించనున్నారని ఓ విపక్ష పార్టీ నేత తెలిపారు. అయితే.. బెంగళూరులో మంగళవారం 26 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిపై పోరుకు సిద్ధమయ్యాయి. విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరును కూడా సూచించారు.
గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నీపార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను ఒకే గొంతుకగా వినిపించనున్నారు. అటు.. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్‌లో నేడు అఖిలపక్షాల భేటీని కేంద్రం నిర్వహించింది. సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. మణిపూర్ హింస, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించనున్నాాయి విపక్షాలు.
ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
Comments
Please login to add a commentAdd a comment