first meeting
-
15న లోక్‌సభ తొలి భేటీ!
-
జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ నేడు ఢిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక జరపడానికి కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, నిపుణుల సలహాలు స్వీకరించనున్నారు. ఒకే దేశం-ఒకే దేశం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ నిన్న ఒడిశా పర్యటనలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న జమిలి ఎన్నికల కమిటీ మొదటి భేటీ ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీని ఏర్పరిచింది. ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సర్దుబాట్లు, సూచనలను కమిటీ పరిశీలించనుంది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఇదీ చదవండి: Tender Voting: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? -
భోపాల్‌లో ‘ఇండియా’ మొట్టమొదటి ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు. ‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
'ఇండియా' కూటమి తొలి భేటీ రేపే.. కేంద్రాన్ని ఇరుకున పెట్టడంపైనే చర్చ..
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. అటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరు భేటీతో ఏకమయ్యాయి. అయితే.. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష కూటమి 'ఇండియా' ఏకతాటిపై నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఇందుకు తొలిసారిగా 'ఇండియా' కూటమి తొలిసారిగా రేపు సమావేశం కానుంది. ఈ మేరకు రాజ్యసభలోని విపక్షాల ఛాంబర్లో భేటీ జరగనుందని సమాచారం. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై సందించాల్సిన ప్రశ్నల గురించి చర్చించనున్నారని ఓ విపక్ష పార్టీ నేత తెలిపారు. అయితే.. బెంగళూరులో మంగళవారం 26 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిపై పోరుకు సిద్ధమయ్యాయి. విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరును కూడా సూచించారు. గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నీపార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను ఒకే గొంతుకగా వినిపించనున్నారు. అటు.. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్లో నేడు అఖిలపక్షాల భేటీని కేంద్రం నిర్వహించింది. సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. మణిపూర్ హింస, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించనున్నాాయి విపక్షాలు. ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్.. -
కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్థేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంత్రిత్వశాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కొత్త, పాత మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుండగా.. మంత్రుల మండలి రాత్రి 7 గంటలకు సమావేశం కానుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రధాన మంత్రి కేంద్ర మంత్రివర్గ సమావేశాలతో పాటు మంత్రుల మండలి సమావేశాలను జరపడం సర్వసాధారణం. నిన్న జరిగిన సమావేశంలో 15 మంది క్యాబినెట్ మంత్రులు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఇక ఏడుగురు మంత్రుల క్యాబినెట్ ర్యాంకుకు పెంచారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో 43 మంది నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. -
సచిన్ నాకు 12 ఏళ్ల పిల్లాడిలా, క్యూట్‌గా కనిపించాడు.. అందుకే వెంటపడ్డా
ముంబై: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి చూసిన మధుర క్షణాలను అతని సతీమణి అంజలి గుర్తు చేసుకున్నారు. 1990 ఇంగ్లండ్ పర్యటన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన సచిన్‌ను మొదటిసారిగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చూశానని, అప్పటికీ సచిన్ ఎవరో తనకు తెలీదని, క్యూట్‌గా ఉండడం వల్ల అతని వెంట పడ్డానని అంజలీ వెల్లడించారు. అప్పుటికి సచిన్ వయసు 17 ఏళ్లని, అయినా తనకి 12 ఏళ్ల పిల్లాడిలా కనిపించాడని ఆమె తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సచిన్‌తో తన తొలి పరిచయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అంజలీ వెల్లడించారు. సచిన్‌ను తొలిసారి ఎయిర్‌పోర్ట్‌లో చూసినప్పుడు నా ఫ్రెండ్అపర్ణ నాతో ఉందని, తనే నాకు సచిన్ గురించి చెప్పిందని అంజలీ గుర్తు చేసుకున్నారు. క్రికెట్లో సచిన్ ఒక అద్భుతమని.. అతి చిన్న వయసులో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన ఆటగాడని అపర్ణ తనతో తెలిపిందన్నారు. అప్పట్లో క్రికెట్ పట్ల తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అందుకే అతడెవరైతే నాకేంటని అనుకున్నానని ఆమె నవ్వుతూ చెప్పారు. అయితే సచిన్ క్యూట్‌నెస్‌ని చూసి తాను ఫిదా అయ్యానని, అందుకే అతని వెంట పరుగెత్తానని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో నేను వెంటపడుతున్నానని తెలిసి సచిన్ చాలా ఇబ్బంది పడ్డాడని, కనీసం నా వైపు చూసే సాహసంకూడా చేయలేకపోయాడని చెప్పుకొచ్చారు. కాగా, 1995లో సచిన్,అంజలి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సారా, అర్జున్అనే ఇద్దరు పిల్లలున్నారు. సచిన్ సతీమణి అంజలి వృత్తిరిత్యా డాక్టర్. ఆమె సచిన్ కంటే 5 ఏళ్లు పెద్దవారు. ప్రస్తుతం సచిన్ వయసు 48 కాగా.. అంజలికి 53. ఇదిలా ఉంటే, 1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్‌ను కొనసాగించిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్-3'కి ప్రిపేర్ అవుతున్నావా బ్రో.. -
తుస్సుమన్న తొలి సభ
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎన్నికల తొలి సభ తుస్సుమనిపించింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపుతుందనుకున్న మొదటి సభ టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహన్ని నింపింది. మరో వైపు తొలి సభకే జనం లేక వెలవెలబోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ జిల్లా నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి తారకరామ స్టేడియంలో శనివారం టీడీపీ బూత్ లెవల్ కన్వీనర్లు, సేవా మిత్రలు, పార్టీ ఇతర కేడర్‌తో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభించి 3 గంటలకు ముగించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంటకు 2 వేల మంది కూడా జనం లేకపోవడంతో సభను కొంత సమయం వాయిదా వేయమని చంద్రబాబు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన కొందరు నేతలు నగరంలో జనాన్ని తరలించేందుకు అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు చంద్రబాబు సభకు చేరుకునే సమయానికి సగం కుర్చీలు నిండాయి. దీంతో కార్యక్రమం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభించాల్సి వచ్చింది. సభా వేదికపైకి వచ్చిన చంద్రబాబు కుర్చీలు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యారు. జిల్లా నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కార్యక్రమం కావడంతో జన సమీకరణలో ఎవరికి వారు చేతులెత్తేశారు. సభ వెలవెలబోయింది. వర్ల రామయ్య, మంత్రి అమరనాథ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిపై చంద్రబాబు మండిపడినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తొలి సభలోనే జనం లేకపోతే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయో తెలుసా? అంటూ ఆయన తనదైన శైలిలో చురకలంటించారు. చప్పగా సాగిన ప్రసంగం ఎన్నికల సమర శంఖారావం పేరుతో టీడీపీ తిరుపతిలో నిర్వహించిన సభ చప్పగా సాగడంతో కేడర్ నిరుత్సాహంతో వెనుదిరిగింది. మాట్లాడిందే మళ్లీ మళ్లీ మాట్లాడడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మోదీ, కేసీఆర్, జగన్ పేర్లు ప్రస్తావిస్తూ.. ప్రతిసారీ ఏం తమ్ముళ్లూ మనం ఎవరికైనా భయపడతామా? అంటూ పదే పదే చెప్పడం కేడర్‌లో కొంత అసహనం కనిపించింది. ప్రతి మాటకు చివరిన ఔనా, కాదా తమ్ముళ్లూ? అంటూ బోరు కొట్టించారు. డ్రైవర్లకు మేలు చేశానని చెప్పుకునేందుకు చంద్రబాబు పదే పదే నేను నంబర్ వన్ డ్రైవర్‌గా ఉంటాను అంటూ చెప్పుకున్నారు. ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబు మాటల్లో కరుకుదనం కనిపించలేదు. కచ్చితత్వం లేదు. చెప్పిందే చెప్పి.. పాత పాటనే పాడుతూ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపారు. సాధారణ సమావేశంలా సాగిందని, ఎన్నికల శంఖారావంలా లేదని ప్రతి ఒక్కరూ నిరుత్సాహంగా వెనుతిరిగారు. అసంతృప్తుల డుమ్మా ఎన్నికల్లో టికెట్లను ఆశించి భంగపాటుకు గురైన కొందరు నేతలు టీడీపీ ఎన్నికల శంఖారావానికి డుమ్మా కొట్టారు. తిరుపతిలో సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని కేడర్ మొత్తం వ్యతిరేకించింది. అయినా చంద్రబాబు ఆమె వైపే మొగ్గుచూపారు. దీంతో చాలామంది నేతలు సభకు డుమ్మాకొట్టారు. ఆమెను వ్యతిరేకించిన నరసింహయాదవ్, పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాత్రం సభకు హాజరయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజి, కాపు కార్పొరేషన్ చైర్మన్ ఊకా విజయ్‌కుమార్, డాక్టర్ ఆశాలత, బుల్లెట్ రమణ తదితరులు హాజరు కాలేదు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, నగరి నియోజక వర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులు, మదనపల్లె నాయకులు, పలమనేరు, పూతలపట్టు నుంచి ముఖ్యమైన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు సభకు హాజరు కాకపోవడం గమనార్హం! -
‘మైనర్ ఇరిగేషన్’పై రంగంలోకి ఎన్ఆర్ఎస్సీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలో మైనర్ ఇరిగేషన్ కింద తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి వినియోగంపై లెక్కలు తేల్చేందుకు ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రంగంలోకి దిగనుంది. ఈ నెల 30న కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ అధికారులతో మొదటి సమావేశం నిర్వహించ నుంది. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని ఏ ప్రాతిపదికన లెక్కించాలన్న దానిపై సూచనలు తీసుకోనుంది. ఈ మేరకు ఎన్ఆర్ఎస్సీతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం అందించింది. గోదావరి ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది. -
స్మార్ట్ సిటీకి త్వరలో శ్రీకారం
♦ 6న స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం ♦ హాజరుకానున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ♦ జీవీఎంసీకి వారం రోజుల్లో రూ.376 కోట్లు ♦ కనీసం రూ.200 కోట్ల పనులకు సన్నాహాలు ♦ జూన్ 25న శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు ♦ త్వరలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌కు పునాదిరాయి సాక్షి, విశాఖపట్నం : దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు గత ఏడాది జూన్ 25న కేంద్రం ప్రకటించింది. అదే రోజున స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో స్మార్ట్ పనులకు శ్రీకారం చుట్టాలని జీవీఎంసీ కసరత్తు చేస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రణాళికల అమలు కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్ తొలి సమావేశం ఈ నెల 6న భేటీ కానుంది. మున్సిపల్ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ తో సహా డెరైక్టర్లంతా హాజరు కానున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఇప్పటికే మంజూరైన 15 మెగా వాట్స్ సామర్ధ్యంగల సాలిడ్ వేస్ట్‌మేనేజ్ మెంట్ ఎనర్జీ ప్లాంట్‌ను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ కోసం ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ)ని నియమించారు. ఇప్పటికే స్మార్ట్సిటీస్టేక్ హోల్డర్స్‌తో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అంశాల వారీగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన 15 సబ్ కమిటీలు గతనెల 31న ఎస్పీవీకి నివేదించింది. ఈనెల 6న జరుగనున్న ఎస్పీవీ భేటీలో కమిటీలు ఇచ్చిన నివేదికలపై చర్చించి కార్యాచరణను రూపొందించనున్నారు. త్వరలో నిధులు విడుదల తొలి ఏడాది చేప ట్టాల్సిన పనుల కోసం రానున్న వారం పదిరోజుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వాటాల కింద రూ.346 కోట్లు విడుదల కానున్నాయి. ఈ నిధులను ఎస్పీవీ అకౌంట్లో జమ చేయనున్నారు. తొలి ఏడాది గుర్తించిన పనులకు సంబంధించి టెండర్లను పిలవడం, ఫైనలైజ్ చేయడం, వర్కు ఆర్డర్స్ ఇవ్వడం ఇలా అన్ని పనులు ఎస్పీవీ పర్యవేక్షణలో పీఎంసీ చేయనుంది. పథకం ప్రకటించిన జూన్-25న కనీసం రూ.200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టే విధంగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణకుమార్ కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్ల కాలపరిమితితో ప్రణాళిక ఆర్కే బీచ్, రుషికొండ, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1602 కోట్లతో ఐదేళ్ల కాల పరిమితిలో స్మార్ట్‌సిటీ ప్రణాళికలను అమలు చేయనున్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ఏడాదికి చెరో వందకోట్ల చొప్పున రూ.1000కోట్లు సమకూర్చనుండ గా, మిగిలిన రూ. 602 కోట్ల పనులను పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నారు. స్మార్ట్‌సిటీ కోసం ఏంపికైన ప్రాంతంలో ప్రతిపాదించిన పనులతో పాటు తొలి ఏడాది రూ.139.96 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటు, ఆనందపురం మండలం గిరజాంలో 20 ఎకరాల్లో రూ.150 కోట్లతో 15 మెగావాట్స్ సామర్ధ్యంతో చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పీఎంఏవై (హౌసింగ్ ఫర్ ఆల్) స్కీమ్‌లో 20,030 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.110.79 కోట్లతో మల్టీస్టోరెడ్ పార్కింగ్ ఫెసిలిటీ పనులు చేపట్టనున్నారు. ఎస్పీవీ బేటీ అనంతరం ప్రాధాన్యం ప్రకారం ఏఏ పనులు చేపట్టాలో గుర్తిస్తామని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఏది ఏమైనా జూన్-25 నాటికి స్మార్ట్ సిటీలో తొలిదశలో అభివృద్ధి చేయనున్న ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ ప్రాంతా ల్లో ప్రతిపాదించిన పనుల్లో కనీ సం రూ.200 కోట్ల విలువైన పనులనైనా ప్రా రంభించాలన్న పట్టుదలతో ఉన్నామని చెప్పారు. నిధుల ప్రణాళిక ఇలా.. (రూ. కోట్లలో) 5 ఏళ్ల కాలపరిమితిలో చేసే ఖర్చు... 1602 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా.. 1000 పీపీపీ పద్ధతిలో సమీకరించేది.. 602 తొలివిడత విడుదలయ్యే నిధులు.. 346 జూన్ 25న చేపట్టే పనుల విలువ.. 200 -
కోటి ఆశలు
- ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ అమలు అయ్యేనా? - పూర్తి స్థాయిలో భర్తీ కాని ఉద్యోగాలు - ఉద్యోగులకు రెఫరల్ ఆస్పత్రుల మంజూరు జరిగేనా? - ఇళ్ల స్థలాల కల నేరవేరేనా ! సాక్షి ప్రతినిధి,తిరుపతి/అర్బన్: తిరుమలలో మంగళవారం జరగనున్న టీటీడీ పాలకమండలి తొలి సమావేశంపై టీటీడీ ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు. గతంలో జరి గిన పాలకమండళ్ల సమావేశాల్లో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలుకు నోచుకోలేదు. అయితే ప్రస్తుత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్థానికుడు కావడంతో ఈ పాలకమండలి సమావేశం తమ సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని టీటీడీ ఉద్యోగులు భావిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల్లో ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయపోవడంతో కొత్త పాలక మండలి ఈ అంశంపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం టీటీడీలోని ఉద్యోగులందరికీ అత్యాధునిక వైద్యసౌకర్యాలు అందేలా బెంగళూరు, చెన్నై, వేలూరు, విజయవాడ నగరాల్లో కార్పొరేట్ ఆస్పత్రులను రెఫరెల్ ఆస్పత్రులుగా కేటాయించేందుకు చేసిన తీర్మానం వాయిదా పడుతూ వస్తోంది. ఈ అంశాన్ని కొత్త పాలకమండలి పరిష్కరిస్తుందన్న ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. వీటన్నింటితో పాటు ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో మేలు జరిగే నిర్ణయాలు, ఇళ్ల స్థలాల మంజూరు కూడా కొత్త పాలకమండలి పరిగణనలోనికి తీసుకోవాలని టీటీడీ యూనియన్లు, ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా టీటీడీ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేసేలా చర్యలు తీసుకునేందుకు ఈవో ప్రారంభించిన ప్రతిపాదనలు ఆచరణలోకి త్వరగా తీసుకొచ్చి న్యాయం చేయాలన్న ఉద్యోగుల డిమాండ్ ఫలిస్తుందని వేచి చూస్తున్నారు. 2010లో జరిగిన కొద్దిపాటి నియామకాల్లో కూడా అటెండర్ల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో వసతి గృహాలు, గెస్ట్ హౌస్‌లు, టీటీడీ కార్యాలయ భవణాల నిర్మాణాలు భారీ స్థాయిలో జరిగాయి. దీంతో వీటన్నింటికీ అటెండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని అతిథి గృహాలకైతే అటెండర్లు కూడా లేకుండానే ఉద్యోగులే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. సుమారు 300 అటెండర్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. తిరుపతిలోని స్విమ్స్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల వైద్యసేవలు, మరిన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలను టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు పాలకమండలి చర్యలు తీసుకోవాల్సి ఉంది. చివరిగా ఉద్యోగుల జీతభత్యాలు పెంచే దిశగా పాలకమండలి ఇప్పటికే ఓ ప్రణాళిక రూపొందించుకుని నివేదికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో చర్యలు జోరుగా జరుగుతాయా? అని ఉద్యోగులు, సిబ్బంది ఎదురుచూస్తున్నారు. టీటీడీలో 9వేల మంది ఉద్యోగులున్నారు. వీరికి నెలకు దాదాపు *21 కోట్ల జీతాలు చెల్లిస్తోంది. అయితే పీఆర్సీ వస్తే అదనంగా *4.5 కోట్ల భారం పడుతుందని నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. టీటీడీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు పాలక వర్గం కొత్త నిర్ణయాలు ప్రకటిస్తుందేమోనని భక్తులు ఎదురు చూస్తున్నారు. తిరుపతి అభివృద్ధిపై.. తిరుపతి నగరం టీటీడీలో అంతర్భామేననని, దీనిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదేపదే చెబుతున్నారు. ఈ హామీ కార్య రూపం దాల్చితే బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. -
శాసనసభా సంఘాల తొలిభేటీ
హైదరాబాద్: గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏర్పాటైన ప్రభుత్వ పద్దుల కమిటీ(పీఏసీ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ), అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్) బుధవారం అసెంబ్లీలోని సమావేశ మందిరాల్లో వేర్వురుగా భేటీ అయ్యాయి. ఈ కమిటీలు ఏర్పాటయ్యాక తొలిసారిగా జరిగిన భేటీ కావడంతో కమిటీల పని విధానానికి సంబంధించి భవిష్యత్ కార్యక్రమాలను నిర్ధేంచుకోవడం, అధికారులతో పరిచయాలకే పరిమితమయ్యా యి. ఈ సమావేశాలకు స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ పి.కిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశానికి అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మే 11న మరోమారు సమావేశం కావాలని, దీనికి అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరు కావాలని నిర్ణయించారు. ఎన్.దివాకర్‌బాబు అధ్యక్షతన జరిగిన పీయూసీ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై, కార్పొరేషన్లపై సమీక్షలు జరపాలని నిర్ణయించారు. కమిటీ మే 18న తిరిగి సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. అన్ని జిల్లాల్లో పర్యటించాలని ఎస్టిమేట్స్ కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మే 12 నుంచి మూడు రోజుల పాటు వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. కమిటీ మే 11న భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం. -
నేడు కేజ్రీవాల్ కేబినెట్ తొలి భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి కేబినెట్ సమావేశాన్ని సోమవారం నిర్వహించుకోబోతోంది. అసలు ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఈ సమావేశం జరగాల్సి ఉండగా, సీఎం కేజ్రీవాల్ అనారోగ్యం కారణంగా వాయిదాపడింది. మరోవైపు ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను కొత్త సీఎం ఎలా నెరవేర్చబోతున్నారనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే ఫిబ్రవరి 23,24 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారైంది. మొదటి రోజు స్పీకర్ ఎన్నిక, అనంతరం ఎన్ని కైన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. రెండవరోజు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. -
నేడు ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం
-
కేంద్ర మంత్రి మండలి తొలి సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి తొలిసారిగా సమావేశమైంది. సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నల్లధనంపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్ధేశం చేస్తారు. రాష్ట్ర విభజన అంశం గురించి ఉన్నతాధికారులు కేంద్ర కేబినెట్‌కు వివరిస్తారు. తొలి సమావేశంలో రాష్ట్ర విభజనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
నేడు వైఎస్సార్ సీఎల్పీ తొలి సమావేశం
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి బుధవారం సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఏర్పాటు, ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో గట్టి ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలవాలన్నదే సమావేశం ప్రధాన ఎజెండాగా నిర్ణయించారు. సభలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత గట్టిగా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలన్న ఆలోచనలో పార్టీ నేతలున్నారు. జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు తన సోదరుని కుమారుడి వివాహం కారణంగా వైఎస్సార్ సీఎల్పీ తొలి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలుసుకుని సమావేశానికి రాలేనని అనుమతి కోరారు. -
మంత్రుల బృందం తొలి భేటి