
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశం ఈనెల 15వ తేదీన ప్రారంభం కావొచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జూన్ మూడోవారంలో లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయని, తొలి రెండు రోజులు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. ఆ తర్వాత స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
మూడోరోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల సంయుక్త సమావేశంలో మాట్లాడతారని వెల్లడించాయి. ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గ సహచరులను ఉభయసభలకు పరిచయం చేస్తారు. జూన్ 22న సమావేశాలు ముగుస్తాయని తెలిపాయి. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం ముగిశాక కేబినెట్ భేటీ జరగనుంది. అందులో లోక్‌సభ సమావేశాల తేదీలపై తుది నిర్ణయం తీసుకుంటారు.