swearing ceremony
-
నేడే ఢిల్లీ సీఎం పట్టాభిషేకం
-
రెండోసారి ట్రంప్ ప్రమాణస్వీకారం
-
ట్రంప్ అధ్యక్ష పట్టాభిషేకం.. ఈ విశేషాలు తెలుసా?
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టనున్నారు. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం(జనవరి 20వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఈ ఘట్టానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రపంచంలోని పలు దేశాధినేతలకు ఆహ్వానం వెళ్లింది.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రాజకీయ ప్రముఖులుచైనా తరపున అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బృందం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిఅర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరవుతున్నట్లు తెలిపారు ఇంగ్లండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారేజ్, ఎరిక్ జెమ్మూర్ (ఫ్రాన్స్), మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోలు సైతం ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారంలో వ్యాపార దిగ్గజాలు టెస్లా సీఈవో ఇలాన్ మస్క్అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ టిక్ టాక్ సీఈవో షౌ జి చెవ్ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖుల డుమ్మాట్రంప్ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆహ్వానం అందలేదు. అయితే ప్రమాణ స్వీకారం తరువాత పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గైర్హాజరు కానున్నారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్కు ఆహ్వానం వెళ్లిందా? అనేదానిపై స్పష్టత లేదు. మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా.. ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ముందస్తు సమాచారం ఇచ్చారు. అధ్యక్ష ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ సమయంలో మాజీ అధ్యక్షులు.. వాళ్ల వాళ్ల సతీమణులు హాజరుకావడం ఆనవాయితీ వస్తోంది. గడ్డకట్టే చలిలోనూ గడ్డకట్టే చలిలోనూ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజధాని వాషింగ్టన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అయితే మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ట్రంప్ వాషింగ్టన్ చేరుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ మేర ఉంటాయని వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ట్రంప్ రోటుండా సముదాయం లోపల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తొలిసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారంఅమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం రాజధాని వాషింగ్టన్ అందంగా ముస్తాబైంది. 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారిగా 2017లో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 నుంచి 2021 వరకు సేవలందించారు. అయితే 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ విజయం సాధించారు. దీంతో ట్రంప్ రెండో దఫా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. జనవరి 20, 2025న 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు ఆహ్వానం2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతు దారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ మద్దతు దారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేలా ఆహ్వానాలు పంపించినట్లు సమాచారం.కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లుట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు. -
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 40 ఎళ్ల తరువాత ట్రంప్ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ట్రంప్ జనవరి 20న(సోమవారం) అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ప్రమాణస్వీకార కమిటీ ఏర్పాటు ముమ్మరం చేసింది. అయితే, తీవ్రమైన మంచుతోపాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో ప్రమాణ స్వీకారం అవుట్‌డోర్‌లో కాకుండా యుఎస్ క్యాపిటల్లోనే చేస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్వీట్ చేశారు.తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ‘ప్రమాణ స్వీకారం రోజైన సోమవారం నాడు వాషింగ్టన్లో విపరీతమైన చలి ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు కనిష్టంగా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉండగా గరిష్టంగా మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉంది. అందుకే నా ప్రారంభోత్సవ ప్రసంగం, అలాగే ఇతర ప్రసంగాలు అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపల జరుగుతాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఉష్ణోగ్రతలను తీవ్ర రికార్డు స్థాయికి చేరుకోనున్నాయి. వణికించే మంచు తుపానుతో ప్రజలు ఇబ్బది పడటం నాకు ఇష్టం లేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. 1985లో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా చలి తీవ్రత కారణంగా అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపలే చివరిసారిగా ప్రారంభోత్సవం జరిగిందని ట్రంప్ గుర్తు చేశారు.మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం.ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే. -
కాగ్ చీఫ్ గా సంయ్ మూర్తి ప్రమాణస్వీకారం
-
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం
-
Parliament Special Session: సభ్యుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: లోక్‌సభ తొలిరోజు సమావేశాల్లో ప్రమాణస్వీకార పర్వం కొనసాగింది. సోమవారం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్యానెల్ స్పీకర్లు రాధా మోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తేలు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్‌లో భర్తృహరి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణంచేయించారు. ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం అయిన వెంటనే వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. అనంతరం 11:07 గంటలకు ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ఎంపీగా హిందీలో ప్రమాణం చేయడంతో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. ప్రధాని తర్వాత ప్యానెల్ స్పీకర్లు రాధామోహన్, కులస్తేలు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రిమండలి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ప్రమాణం చేశారు. ముందుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితర మంత్రులు ప్రమాణం చేశారు. తర్వాత స్వతంత్ర హోదా ఉన్న సహాయకమంత్రులు తర్వాత సహాయక మంత్రులు ప్రమాణంచేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో ‘నీట్ ఫెయిల్డ్ మినిస్టర్’, నీట్–నెట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. తర్వాత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు కె.సురేశ్, డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, టీఎంసీ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ్లు స్పీకర్ప్యానెల్ సభ్యులుగా ప్రమాణంచేయలేదు. ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన దళిత నేత సురేశ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపికచేయనందుకు నిరసన తెలపాలని విపక్షపార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ముగ్గురు ప్యానెల్ స్పీకర్ల పదవులకు దూరంగా ఉండిపోయారు. ప్రమాణస్వీకారం మొదలుకాగానే సురేశ్, టీఆర్ బాలు, సుదీప్‌లు సభ నుంచి వాకౌట్‌చేశారు. ప్యానెల్ సభ్యుల ప్రమాణంవేళ ‘ రాజ్యాంగ ఉల్లంఘన’ అని విపక్షసభ్యులు నినాదాలు చేశారు. తర్వాత అక్షరమాల ప్రకారం రాష్ట్రాలవారీగా సభ్యులు ప్రమాణంచేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు.పలు భాషల్లో ప్రమాణాలుప్రమాణస్వీకారం వేళ సభలో భాషా వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణంచేశారు. ఇంగ్లిష్‌తోపాటు సంస్కృతం, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, మరాఠీ, తదితర భాషల్లో ప్రమాణంచేశారు. అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, ఖట్టర్ హిందీలో ప్రమాణంచేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి కన్నడలో, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడియాలో, పోర్ట్‌లు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సామీలో, విద్యుత్, పునరుత్పాదక ఇంధన సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్ సంస్కృతంలో, పర్యాటకం, పెట్రోలియం మంత్రి సురేష్ గోపి మలయాళంలో సభ్యులుగా ప్రమాణంచేశారు. లోక్‌సభ ప్రారంభానికి శుభసూచకంగా సభ్యులంతా తొలుత లేచి నిలబడి కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.తొలి వరుసలో రాహుల్, అఖిలేశ్సభలో విపక్షాలకు కేటాయించిన కుర్చీల్లో మొదటి వరుసలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ, ఎస్పీ నేతలు అఖిలేశ్ యాదవ్, అవధేశ్ ప్రసాద్‌లు కూర్చున్నారు. మాజీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మూడో వరుసలో కూర్చున్నారు. తొలిసారి సభకు ఎన్నికైన దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె భాన్సురీ స్వరాజ్ సభలో అందరినీ పలకరిస్తూ కనిపించారు. సెల్ఫీలు దిగారు. ఎస్పీ సభ్యులు ఎర్రని టోపీలు, ఎర్ర కండువాలు ధరించి హిందీలో ముద్రించిన రాజ్యాంగ ప్రతులను పట్టుకొచ్చారు.సభలో హైలైట్స్→ రైతు నేత, సీపీఐ (ఎం) ఎంపీ ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్‌కు వచ్చారు.→ కొందరు సభ్యులు తమ రాష్ట్ర సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.→ ‘రేసుగుర్రం’ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ధోతీలో అలరించారు.→ తొలిసారి ఎంపీగా గెలిచిన మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు అనిత నగర్‌సింగ్ చౌహాన్ వేళ్లకు పెద్ద ఉంగరాలు, మెడలో భారీ సంప్రదాయ నగలతో సభకు వచ్చారు. → శ్వేతవర్ణ చీరకట్టులో మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.→ తిహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు. → టీవీ రాముడు అరుణ్ గోవిల్ అందరితో మాట్లాడుతూ కనిపించారు. → మోదీ ప్రమాణం చేసేటపుడు ఎన్డీఏ నేతలంతా జైశ్రీరాం అని నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష సభ్యులంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు. కొందరు సభ్యులు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వచ్చారు -
ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారం
-
మంత్రిగా నారా లోకేష్ ప్రమాణస్వీకారం
-
పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం
-
రాష్ట్రపతి భవన్ లో చిరుత ?
-
ప్రధాని మోదీ సరికొత్త రికార్డు..
-
వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన మోదీ
-
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వినయంగా ఉండండి.. కష్టపడి పని చేయండి
న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించకుండా వినయంగా ఉన్న నాయకులనే ప్రజలు అభిమానిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే వినయంగా ఉండాలని నూతన మంత్రులకు సూచించారు. రుజువర్తన, పారదర్శకత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అన్నారు. మీకు అప్పగించిన పనిని నిజాయతీగా పూర్తి చేయండి అని సూచించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరికీ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రులు అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను గౌరవించాలని చెప్పారు. అందరిని కలుపుకొనిపోవాలని, బృంద స్ఫూర్తితో పని చేయాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. -
15న లోక్‌సభ తొలి భేటీ!
-
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
విజయవాడ, సాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 12వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంగా గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన టీడీపీ సీనియర్లు.. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో చంద్రబాబును తమ లీడర్‌గా ఎన్నుకోనున్నారు. ఆపై 12వ తేదీ బుధవారం ఉదయం 11.27ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఎన్డీయే ప్రధాన మిత్రపక్షం కావడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్డీయే పక్ష నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కావొచ్చని టీడీపీ భావిస్తోంది. -
9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం..
-
వైఎస్సార్సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం
-
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
-
ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసి
-
Live: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..
-
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ సీఎంగా ఆరు గ్యారంటీల తొలిఫైల్‌పై రేవంత్ సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై సీఎం అందజేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డి. అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది గత ప్రభుత్వం.. ప్రజల బాధలు పట్టించుకోలేదు పదేళ్లు బాధలను ప్రజలు మౌనంగా భరించారు తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తా అమరవీరుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది పొన్నం ప్రభాకర్ కామెంట్స్ మంత్రి అవుతానని ముందే ఊహించా ఏ పోర్ట్ పోలీయో ఇచ్చినా సమ్మతమే మంత్రి కావాలనే కోరిక నెరవేరింది మంత్రి అయినా ప్రజా సేవకుడిగా పని చేస్తాను సాక్షి టీవీతో పొంగులేటి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మా పాలన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం గత ప్రభుత్వంలా కక్షపూరితంగా మేం వ్యవహరించం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కామెంట్స్ అబద్ధాలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారు కేసీఆర్ రిటైర్ అయ్యి ఫాం హౌస్‌కే పరిమితమైతే మంచిది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఖరారు వికారాబాద్ నుంచి ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్ ఎల్బీ స్టేడియంకు చేరుకున్న ఉత్తమ్, సీతక్క, పొన్నం ఎల్బీబీ స్టేడియంకు చేరుకున్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 12:10PM, Dec 7, 2023 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్ తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు రాజకీయంగా ఎన్నో అవకాశాలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్, ప్రియాంక, రేవంత్‌లకు ధన్యవాదాలు ఈ జీవితం ప్రజలకే అంకితం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏ మంత్రి పదవి ఇచ్చినా నిజాయితీతో పనిచేస్తా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మరకలేకుండా పని చేశా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన రాబోతుంది ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయబోతున్నాం 11: 35AM, Dec 7,2023 హోటల్ ఎల్లా నుంచి ఎల్బీ స్టేడియం బయలు దేరిన ఎమ్మెల్యేలు 11: 10AM, Dec 7,2023 హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి. శంషాబాద్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి 10: 50AM, Dec 7, 2023 భట్టి విక్రమార్క నివాసానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ సీఎం గా ఎన్నికైన భట్టికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10: 20AM, Dec 7, 2023 జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం.. మంత్రివర్గంలో పొంగులేటికి చోటుదక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న అనుచరులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు గెలవడం వెనక కీలకంగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లాలో సైతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి ప్రచారం నిర్వహించిన పొంగులేటి 10: 15AM, Dec 7, 2023 హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. 9:50AM, Dec 7, 2023 పొన్నం ప్రభాకర్ కు స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి పొన్నం ఇంట సందడి.. స్వీట్ తినిపించి అభినందించిన కుటుంబసభ్యులు తల్లి మల్లమ్మ ఆశీర్వాదం తీసుకున్న పొన్నం ప్రభాకర్. పొన్నంకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో ఆనందోత్సవాలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ కాబోయే మంత్రులు వివరాలను రాజ్‌భవన్‌కు తెలియజేసిన రేవంత్ కాబోయే మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుపుతున్న ఠాక్రే తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో 11మందికి చోటు నేటి (గురువారం) మధ్యాహ్నం కొత్త మంత్రివర్గం ప్రమాణం ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న భట్టి 9:15AM, Dec 7, 2023 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీల నిర్మాణం ప్రధాన స్టేజీకి ఇరువైపులా రెండు వేదికలు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రమాణీస్వీకారానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞత సభ ఎల్బీ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు 3వేల మందితో భద్రతా ఏర్పాట్లు స్టేడియం లోపల, బయట మెటల్ డిటెక్టర్లు, పోలీస్ జాగిలాలతో తనిఖీలు స్టేడియం లోపలికి వెళ్లే ప్రతీ గేటు వద్ద డిటెక్టర్లు ఏర్పాటు నిజాం కాలేజీ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వరకూ వాహనాల పార్కింగ్ హైదరాబాద్‌కు సోనియా, రాహుల్ నేడు హైదరాబాద్‌కు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక ఉదయం 9:30కి హైదరాబాద్ చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వేడుక కోసం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఆరు గ్యారంటీల అమలు ఫైల్‌పై రేవంత్ తొలి సంతకం చేసే చాన్స్ మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా సచివాలయంలోకి ఎంట్రీ భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నేతలు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు. కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఏర్పాట్లు ఇలా.. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఉన్న మార్గం పర్యవేక్షణకు ప్రత్యేక రూట్ పార్టీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మార్గాలను ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీ చేయిస్తున్నారు. ఎల్బీ స్టేడియం చుట్టూ అనునిత్యం ప్యాట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించనున్నారు. రూఫ్ టాప్ వాచ్ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం దాదాపు ఆరు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు. -
నేడు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
-
తెలంగాణ సీఎం ఎవరు?.. అప్డేట్స్
లైవ్ అప్డేట్స్.. ఎప్పటికప్పటి సమాచారం సీఎం ఎవరు.. ఓవర్ టు ఢిల్లీ ►తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం ►సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తేలని పంచాయితీ ►ఎవరికి వారు పట్టు వీడని నేతలు ►మ్యూజికల్ చెయిర్ గేమ్‌ను తలపిస్తున్న టీ కాంగ్ నేతల వ్యవహారం ►ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి ► తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి ►హైదరాబాదులో సీఎల్పీ సమావేశం జరిగింది ►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది ►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది ►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు. తేలేదాకా హోటల్లోనే.. ►హైదరాబాద్ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు ►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు ►రేపు డీకే శివకుమార్ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్ అధిష్టానం ►రేపటితో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే ►కేసీఆర్‌ను కలిసిన తెల్లం వెంకట్రావు ►కాంగ్రెస్‌లోకి మారతారంటూ ఉదయం నుంచి ప్రచారం ►సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన తెల్లం ►సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ వెళ్లి కేసీఆర్‌తో భేటీ కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చేరింది ►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు ►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు ►కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది ►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్ ప్రకటిస్తుంది ‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ! ►కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ ►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం ►ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సోనియా ►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా ►రేపు డీకే శివకుమార్, ఇతర పరిశీలకుతో చర్చించనున్న ఖర్గే ► నిర్ణయాన్ని డీకేఎస్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంపనున్న హైకమాండ్ రేపు జనగామకు మాజీ సీఎం కేసీఆర్! ►రేపు జనగామకు వెళ్లనున్న మాజీ సీఎం కేసీఆర్ ►బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం ►సంతాప ప్రకటన వెలువరించిన కేసీఆర్ ►తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువ నేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ ఆవేదన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? ►తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కాంగ్రెస్ సీనియర్ల గుస్సా ►సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రమాణ స్వీకార ఏర్పాట్ల లీకులపైనా ఆగ్రహం ►ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశారంటూ హైకమాండ్‌కు ఫిర్యాదు ఏం జరుగుతుందో చూద్దాం: కేసీఆర్ ►తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ►గెలిచిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు ►ఇంకో నెల ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ప్రజా తీర్పుతో హుందాగా తప్పుకున్నాం ►కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం ►చూద్దాం ఏం జరుగుతుందో ►త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం ►ఓటమిపై సమీక్ష జరుపుదాం ►శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంతో ఎన్నికల కోడ్ ముగిసింది ►సోమవారం సాయంత్రంతో కోడ్ ముగిసినట్లు ఈసీ అధికారిక ప్రకటన చేసింది ►అక్టోబర్ 9వ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ►ఆ మరుక్షణం నుంచే అమల్లోకి వచ్చిన కోడ్ ►డిసెంబర్ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ నోటిఫికేషన్ ►తాజాగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్ ముగిసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అబ్బే.. సీఎల్పీపై చర్చించలేదు: జైరాం రమేష్ ►సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ అంశంపై చర్చ జరగలేదు ►డీకే శివకుమార్, ఇతర పరిశీలకులు ఢిల్లీ వస్తున్నారు ►పరిశీలకులతో చర్చించాల్సిన అవసరం ఉంది ►వాళ్ల అభిప్రాయం హైకమాండ్ తీసుకుంటుంది ►సీఎల్పీ ఖరారుపై రేపు నిర్ణయం తీసుకోవచ్చు ►మీడియాతో సీనియర్‌నేత జైరాం రమేష్ తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రాజీనామా ►తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ రాజీనామా ►అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా.. ►ఫాక్స్ ద్వారా రాజీనామాను పంపిన ఏజీ, ఏడీజీ ►ప్రభుత్వం మారడంతో.. రాజీనామా బాటలో మరికొందరు అధికారులు రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోయిన.. ►రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమ వాయిదా ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన జీఏడీ, పోలీస్, ప్రోటోకాల్, ఐ అండ్ పీఆర్ అధికారులు రాజ్‌భవన్ వద్ద ‘సీఎం రేవంత్’ నినాదాలు ►సీఎల్పీ ఎవరనేది తేల్చని ఏఐసీసీ ►రేపటి వరకు కొనసాగనున్న ఉత్కంఠ ►సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా ►రాజ్‌భవన్ వద్ద నుంచి కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హంగామా ►సీఎం రేవంత్ అంటూ రేవంత్ అభిమానుల నినాదాలు ►ఢిల్లీకి పయనమైన డీకే శివకుమార్ ►డీకేఎస్ వెంట భట్టి, దామోదర, ఉత్తమ్‌లు ►రేపు ఖర్గేతో భేటీ తర్వాతే సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన వంద కోట్ల ఖర్చుతో నన్ను ఓడించారు: దుర్గం చిన్నయ్య ►బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంచలన వ్యాఖ్యలు ►కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేగా నెగ్గారంటూ గడ్డం వినోద్‌పై ఆరోపణలు ►గడ్డం కుటుంబం.. వేల కోట్ల రూపాయలు ఉన్న కుటుంబం ►నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేసింది ►అధర్మంగా యుద్ధం చేసి నాపై గెలిచారు ►ఏడాది కాలంగా నాపై ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి తెచ్చారు ►కుట్రలతో నన్ను దెబ్బ తీశారు ►డబ్బు మందు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలిచారు ►బెల్లంపల్లిలో వంద కోట్లు ఖర్చు చేసి గెలిచారు ►నైతికంగా మేము గెలిచినాం. వాళ్లు గెలిచినా ఓడిపోయినట్టే! ►బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేస్తున్నారు.. ఆపకపోతే ఖబడ్దార్ సీఎల్పీ ఎంపిక వాయిదా? ►తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక వాయిదా ►ఢిల్లీకి పయనం అయిన కాంగ్రెస్ నేతలు ►రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►ఇవాళ రాత్రే సీఎం ప్రమాణం ఉంటుందని ఏర్పాట్లు చేసిన అధికారులు ►తాజా పరిణామాలతో కార్యక్రమం వాయిదా అయినట్లే! ►రేపు కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ►తెలంగాణ సీఎం ఎవరనే దానిపై కొనసాగనున్న సస్పెన్స్ ► తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ రాజీనామా ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ►కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ ► ఢిల్లీకి తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడు డీకే శివకుమార్ ►శివకుమార్‌తో పాటు మరో నలుగురు పరిశీలకులు కూడా? ►రేపు ఖర్గేతో ఏఐసీసీ పరిశీలకుల సమావేశం ►ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు గులాబీ నేతల క్యూ ►బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేల క్యూ ►బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వాళ్లంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి.. ►ఎమ్మెల్యేలతో పాటు నేతలు కూడా ►హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, తులా ఉమ, మల్లారెడ్డి,కడియం శ్రీహరి, పద్మ దేవేందర్ రెడ్డి,జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,కేటీఆర్, సుదీర్ రెడ్డి,సత్యవతి రాధోడ్ ఎమ్మెల్సీ, మహమూద్ అలీ, రెడ్యానాయక్ తదితరులు కాసేపట్లో వీడనున్న ‘సీఎం’ ఉత్కంఠ? ►కొద్దిసేపట్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్న డీకే శివకుమార్ ►ఢిల్లీలో సోనియా నివాసంలో జరుగుతున్న పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ► ఈ సమావేశంలో తెలంగాణ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం వినోద్ కుమార్ రాజీనామా ►రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా ►కిందటి ఏడాది బాధ్యతలు చేపట్టిన వినోద్ ►గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. స్నేహపూర్వకంగా కేబినెట్ హోదాలో వినోద్‌కు కీలక పదవి అప్పజెప్పిన కేసీఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి వినోద్ ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా పోషిస్తాం: కేటీఆర్ ►గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు ►పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది ►ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించింది ►తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం ►ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం తెలంగాణ సీఎం ఎవరనేది మరికాసేపట్లో.. ►సోనియా గాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ►తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ►ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ నివేదిక పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక కోసం టీ కాంగ్రెస్ శ్రేణులు వెయిటింగ్ ►నిర్ణయం వెలువడగానే తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ప్రకటన ►ఆ వెంటనే రాజ్‌భవన్‌లో తెలంగాణ కొత్త సీఎం ప్రమాణం ►సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా?? తెలంగాణలో కొత్త శాసనసభ ►తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ►పాత అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్‌భవన్ ►ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకు సమర్పించిన సీఈవో వికాజ్‌రాజ్ ►119 మంది ఎమ్మెల్యేల ఎంపికను ధృవీకరించిన గవర్నర్ ►గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ►గెజిట్ ను గవర్నర్ కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి ►అంతకు ముందు అసెంబ్లీ రద్దు ప్రతులను అందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ► ఇక కొలువుదీరనున్న కొత్త శాసనసభ వరుస రాజీనామాలు ►తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత వరుస రాజీనామాలు ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులు కూడా ►ఇప్పటికే రకరకాల కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా ► 15 మంది కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు ►హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు ►పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం ►కౌంటింగ్ సందర్భంగా నిన్న పోలీసులతో వాగ్వాదం కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్.. ►రాజ్ భవన్ వద్ద కొత్త సీఎం కోసం న్యూ కాన్వాయ్ ►రాజ్ భవన్ పక్కన దిల్కుషా వద్ద సిద్ధం చేసిన ప్రోటోకాల్ అధికారులు ►ఆరు కొత్త ఇన్నోవా వెహికిల్స్ రెఢీ చేసిన అధికారులు తమిళసై చేతికి నెగ్గిన ఎమ్మెల్యేల జాబితా.. ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన సీఈఓ వికాస్ రాజ్ బృందం ►గవర్నర్ తమిళ్ సై కి రిజల్ట్ ను సమర్పించిన సీఈఓ ►గెలిచిన ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను అందించిన సీఈవో కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం ►ఛాంబర్లను సిద్ధం చేస్తున్న జీఏడీ శాఖ ►పాత బోర్డులను తొలగించిన అధికారులు ►ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలు ఖాళీ చేసిన సిబ్బంది ►కొత్త మంత్రులకు కొత్త సిబ్బంది కేటాయింపు ►గ్రౌండ్ ఫ్లోర్లో మీడియాకు ప్రత్యేక గది తెలంగాణ టాస్క్ ఫోర్స్ OSD రాధా కిషన్ రావు రాజీనామా ►మూడేళ్ల క్రితం ముగిసిన రాధాకిషన్ పదవీ కాలం ►టాస్క్ ఫోర్స్ లో ఎక్స్ టెన్సన్ మీద కొనసాగుతున్న రాధా కిషన్ రావు ►ప్రస్తుత ప్రభుత్వం ఓడిపోవడంతో నిర్ణయం? ►తన రాజీనామా ను ప్రభుత్వానికి పంపిన రాధా కిషన్ రావు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్ ►గవర్నర్ తమిళిసైతో సీఈవో వికాస్ రాజ్ భేటీ ►గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కి ఇచ్చిన వికాస్ రాజ్ ►రాజ్‌భవన్‌లోనే ఉన్న అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి ►ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తి ►ఈ రాత్రికి కొత్త సీఎం ప్రమాణానికి రాజ్‌భవన్ లో ఏర్పాట్లు దాదాపు పూర్తి పార్టీ మారను: పాడి కౌశిక్‌రెడ్డి ►హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను ►హుజూరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం ►నా పాత ఫోటో పెట్టీ రేవంత్ రెడ్డి నీ కలిసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు ►నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో కేసీఆర్ కుటుంబం తోనే ఉంట ►ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మొద్దు బీఆర్ఎస్ ఓటమిపై అసదుద్దీన్ ఒవైసీ ►రాజకీయాల్లో గెలుపోటములు సహజం ►ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్ఎస్ సరి చేసుకుంటుంది ►కేటీఆర్, హరీష్‌రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికింది. -
కాసేపట్లో టీటీడీ ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
-
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం
-
సిద్దిరామయ్య క్యాబినెట్...24 మంది ప్రమాణస్వీకారం
-
Live: శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సిద్ధరామయ్య
-
అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ: నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు అంబటి , కారుమురి, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన 9 మంది ఎమ్మెల్సీలు.. మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇస్రాయిల్, జయ మంగళ వెంకటరమణ, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పెనుమత్స సూర్యనారాయణ రాజు, మంగమ్మ. చదవండి: ‘జగనన్నే మా భవిష్యత్తు’.. అడిగి మరీ తీసుకుని ఇళ్లకు, ఫోన్లకు స్టిక్కర్లు.. -
సుప్రీంలో ఊరట.. జడ్జిగా గౌరీ ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: మద్రాస్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా లాయర్ లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలో చర్చ జరిగాకే ఆమె పేరు ప్రతిపాదించినట్టు పేర్కొంది. సంబంధిత హైకోర్టు జడ్జిల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తేలినా లేదా ప్రమాణానికి లోబడి విధులను నిర్వర్తించకున్నా రెండేళ్ల తర్వాత ఆమె పనితీరు సంతృప్తికరమని భావిస్తేనే శాశ్వత జడ్జిగా ప్రతిపాదించే అవకాశం కొలీజియంకు ఉందని గుర్తు చేసింది. గతంలో అడిషనల్ జడ్జిలుగా పనిచేసిన వారు శాశ్వత జడ్జీలు కాలేకపోయిన ఘటనలు అనేకం ఉన్నాయంది. ఒక వ్యక్తి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు ఆ వ్యక్తి పేరును జడ్జిగా సిఫారసు చేయకపోవడానికి కారణం కాదని కొలీజియం భావించిందని పేర్కొంది. గౌరి మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ కొందరు లాయర్లు కేసు వేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే... మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుకు ముందే మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరి ప్రమాణం చేశారు! తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజా మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఆమెతో ప్రమాణం చేయించారు. తనకు గొప్ప అవకాశమిచి్చన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1973లో జని్మంచిన గౌరి, 1995లో లాయర్‌గా పేరు నమోదు చేయించుకున్నారు. మదురై బెంచ్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా 2022 నుంచి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 17వ తేదీన గౌరితో కలిపి మొత్తం ఐదు పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేసింది. -
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
-
నేడు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటివరకు సీజేగా పనిచేసిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సీజేగా బాధ్యతలు స్వీక రిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు. 2019, జనవరి 1న ఏర్పా టైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ వ్యవహరించిన విషయం విదితమే. జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకు న్నారు. అస్సాం బార్ కౌన్సిల్లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకు న్నారు. పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ లో ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్ కౌన్సి ల్గా, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011, అక్టోబర్ 17న నియమితులయ్యా రు. 2019, అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవ లందించారు. 2021, అక్టోబర్ 22న సీజేగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు. -
సీదిరి అప్పలరాజు అనే నేను..
-
తానేటి వనిత అనే నేను..
-
రాజన్న దొర అనే నేను..
-
పినిపె విశ్వరూప్ అనే నేను..
-
విడదల రజిని అనే నేను..
-
ఆర్కే రోజా అనే నేను..
-
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే నేను..
-
మేరుగ నాగార్జున అనే నేను..
-
కె నారాయణ స్వామి అనే నేను..
-
ఉషశ్రీ చరణ్ అనే నేను..
-
కొట్టు సత్యనారాయణ అనే నేను..
-
కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనే నేను..
-
అడగకుండానే సీఎం జగన్ వరం ఇచ్చారు: జోగిరమేష్
-
కొత్త మంత్రివర్గంపై వెల్లంపల్లి స్పందన
-
నాకు ఏ శాఖ ఇచ్చినా ఒకే..
-
ఆ కుటుంబానికి తరతరాలు రుణపడి ఉంటా: మేరుగు నాగార్జున
-
ప్రమాణ స్వీకారానికి సిద్దమౌతున్న మంత్రులు
-
AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. చదవండి: AP: కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతో పాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆహ్వానించినందుకు ధన్యవాదాలు!.. కానీ రాలేను: కాంగ్రెస్ ఎంపీ
న్యూఢిల్లీ: భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితరుల సమక్షంలో భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఆహ్వానం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్విట్టర్లో మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్‌ను నేను అభినందిస్తున్నాను. ఆయన ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున నేను హాజరు కాలేక పోతున్నాను. కానీ పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్‌జిత్ సింగ్ నన్ను ఆహ్వానించకపోవడం విడ్డూరం." అని తివారీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ సాహిబ్ కూడా పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తాను వేడుకకు హాజరు కాలేనని చెప్పారు. అంతేకాదు తివారీ పంజాబ్ సీఎం ఆహ్వాన కార్డును కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలోని 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 92 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమైంది. పంజాబ్‌లో కాంగ్రెస్ స్పష్టమైన ఓట్ల చీలికను చవి చూసింది. అయితే తివారీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన లేరు. అయితే భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్దగా కేంద్ర మంత్రి లేదా జాతీయ స్థాయిలోని పెద్ద నాయకులెవరిని ఆహ్వానించ లేదు. I congratulate @BhagwantMann on being sworn in as Chief Minister I thank him for inviting me to his swearing in . Due to Parliament being in session I will not be able to make it . It is ironic I was not invited to @CHARANJITCHANNI ‘s swearing in though he was one of my MLA’s pic.twitter.com/AyW91uNyYE — Manish Tewari (@ManishTewari) March 16, 2022 (చదవండి: రెండోసారి సీఎంలుగా ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్) -
వాషింగ్టన్లో హై అలర్ట్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్, డీసీ మిలటరీ కేంద్రాన్ని తలపిస్తోంది. దేశ నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వాషింగ్టన్లో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత వర్గాలు అప్రమత్తమయ్యాయి. అత్యంత పటిష్ట భద్రతాచర్యలతో వాషింగ్టన్‌ను అష్టదిగ్బంధనం చేశాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే కేంద్రానికి దారితీసే రహదారులను మూసేశారు. వేలాది స్థానిక పోలీసులతో పాటు, సుమారు 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌లతో పాటు నగరంలోని ప్రధాన భవనాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌ల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆయా భవనాల బయట 8 అడుగుల ఎత్తైన ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానులతో కిక్కిరిసే నేషనల్ మాల్‌ను మూసేశారు. వాషింగ్టన్‌తో పాటు 50 రాష్ట్రాల రాజధానుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాణ స్వీకారం రోజు హింసాత్మక ఘటనలకు పాల్పడతామంటూ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అనుకూల బృందాలతో పాటు వివిధ గ్రూపుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయని, దాంతో, ఆయా బృందాలపై, ట్రంప్ అనుకూల వర్గాలపై, జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారిపై సునిశిత దృష్టి పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ‘కోవిడ్ నిబంధనల కారణంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అసాధారణంగా జరగబోతోంది. ఎంపిక చేసిన కొద్దిమంది అతి«థులు పాల్గొంటారు. అయితే, జనవరి 6 నాటి ఘటన నేపథ్యంలో భద్రతను మరింత పెంచాల్సిన పరిస్థితి నెలకొంది’ అని వాషింగ్టన్ డీసీ మేయర్ మురియెల్ బౌసర్ పేర్కొన్నారు. ‘దేశ పౌరులే క్యాపిటల్ భవనంపై దాడి చేసి, పోలీసు అధికారులను చంపేస్తారని ఊహించలేదు. కానీ, అది జరిగింది. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందే’ అన్నారు. వాషింగ్టన్లోనే కాకుండా, ప్రధాన నగరాల్లో హింస చెలరేగే అవకాశముందని ఎఫ్‌బీఐ నివేదికల్లో హెచ్చరించింది. ‘ప్రమాణ స్వీకారం పూర్తయ్యేవరకు భద్రత బలగాలు దూకుడుగానే వ్యవహరిస్తాయి’ అని ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టఫర్ స్పష్టం చేశారు. సొంత బలగాల నుంచే ముప్పు? బైడెన్‌కు భద్రత కల్పించే దళాల్లోని వ్యక్తుల నుంచే ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు అమెరికా రక్షణ అధికారులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దాంతో, ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతలో, నగర రక్షణలో పాలు పంచుకుంటున్న మొత్తం 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను నిశితంగా పరీక్షిస్తున్నారు. ఈ అంతర్గత దాడి ముప్పు గురించే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని ఆర్మీ సెక్రటరీ రయాన్ మెక్ కెర్తి పేర్కొన్నారు. బైడెన్‌పై, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులపై దాడికి పాల్పడే అవకాశమున్న వారిని గుర్తించేందుకు పలు విధాలుగా గార్డ్స్‌ను పరీక్షిస్తున్నామన్నారు. దాడి చేసేందుకు వారికి లభించే అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుని.. దాడులను అడ్డుకునే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విప్లవ కాలం నాటి దుస్తులు ధరించి, రైఫిల్‌తో కొలంబస్‌లోని ఒహాయో స్టేట్‌హౌస్ ముందు కనిపించిన ఓ వ్యక్తి -
'ఆటా' కొత్త అధ్యక్షునిగా భువనేశ్ బుజాల
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా భువనేశ్ బుజాల పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి అయిన భువనేశ్ 2004వ సంవత్సరం నుంచి ఆటాలో ఉత్సాహంగా పాలుపంచుకొంటున్నారు. 2014లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌లో కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన నాశ్విల్లే నగరంలో జనవరి 16న జరిగిన 'ఆటా' కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారు. డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్‌గా జయంత్ చల్లా, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హనుతిరుమల్ రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నాడీ , రవీందర్ గూడూర్, రింద సామ, శరత్ వేముల, సుధీర్ బండారు & విజయభాస్కర్ తూపల్లి ఎన్నికయ్యారు. ఇక ఆటా ప్రెసిడెంట్‌గా భువనేశ్ భూజాల, సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రెజరర్‌గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రెజరర్‌గా విజయ్ కుందూరు ఎన్నిక అయ్యారు. నష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ప్రెసిడెంట్‌గా మధు బొమ్మినేని ఎన్నికయ్యారు. ఇక ప్రెసిడెంట్ భువనేశ్ మాట్లాడుతూ.. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న తెలుగు వారు ఆటా సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆటా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూ పెద్ద పీఠ వేస్తుందని పేర్కొన్నారు. మన మాతృభూమిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నిర్వహణ కార్యక్రమంలో అమెరికాలో పుట్టిపెరిగిన మన పిల్లలను భాగస్వాములను చేయడానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన బోర్డును కోరారు. యూత్ కమిటీ ఏర్పాటు చేశారు. మొట్ట మొదటసారిగా ఆటా కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1 నుంచి 3 తేదీలలో నిర్వహిస్తున్నామని అందరూ తప్పక పాలుపంచుకోవాలన్నారు. కోవిడ్-19 సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డిని బోర్డు అభినందించింది. నాశ్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సభ్యులకు బోర్డు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఆటాకి తోడ్పాటునందిస్తున్న లోకల్ ఆర్గనైజషన్స్ను బోర్డు కొనియాడింది. -
ఏపీ హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఇవాళ ఉదయం 11 గంటలకు వీరితో ప్రమాణం చేయించారు. కాగా ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది. -
తరలి వచ్చిన అంబానీ కుటుంబం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు కొలువు దీరినట్టయింది. ముంబై శివాజీ పార్క్‌లో గురువారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అతిరధ మహారధులు హాజరయ్యారు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంబానీతోపాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఉద్ధవ్‌కు అభినందనలు తెలిపారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్ కుమార్ షిండే, ఎంకే స్టాలిన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సుమారు నెల రోజుల తరువాత అనేక అనూహ్య పరిణామాల మధ్య చివరికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో మహా వికాస్ అఘాడి కూటమి ఆధ్వర్యంలో సర్కార్ కొలువు దీరింది. చదవండి : మహా పీఠంపై శివ సైనికుడు.. సీఎంగా ఠాక్రే ప్రమాణం -
ముగ్గురు నానీలు.. ఇద్దరు శ్రీదేవిలు
సాక్షి, అమరావతి: కొంగొత్తగా కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభలో 173 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా పూర్తయింది. వైఎస్సార్సీపీ సభ్యులంతా పార్టీ కండువాలు ధరించి సభకు రాగా టీడీపీ సభ్యుల్లో ఇద్దరు మినహా మిగతావారంతా పచ్చ చొక్కాలతో సభకు వచ్చారు. ఎన్నికైన సభ్యులంతా సభకు వచ్చిన వెంటనే పరస్పరం అభినందించుకున్నారు. మంత్రులు చాలామంది శాసనసభ్యుల స్థానాల వద్దకు వెళ్లి అభినందనలు తెలపగా అధికార పక్ష సభ్యులు మంత్రుల వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర అభినందనలు, కరచాలనాలతో సభలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. తాజాగా ఎన్నికైన 175 మంది శాసనసభ్యుల్లో ప్రొటెం స్పీకర్‌తో కలిపి 174 మంది సభకు హాజరయ్యారు. శంబంగి చిన వెంకట అప్పల నాయుడు ఈనెల 8వ తేదీన గవర్నరు ఎదుట ఎమ్మెల్యేగా, ప్రొటెం స్పీకరుగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం 149 మంది వైఎస్సార్ సీపీ సభ్యులతోపాటు 23 మంది టీడీపీ సభ్యులు, జనసేన నుంచి ఒక్క సభ్యుడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. నరసరావుపేట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి పెద్ద కర్మ ఉన్నందున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన వెంటనే శాసనసభ గురువారానికి వాయిదా పడింది. హర్షధ్వానాల మధ్య సభలోకి సీఎం జగన్ సరిగ్గా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.05 గంటలకు అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలోకి ప్రవేశించారు. ముకుళిత హస్తాలతో రెండు చేతులూ జోడించి అందరికీ నమస్కరిస్తూ వైఎస్ జగన్ సభలోకి ప్రవేశించారు. జై జగనన్నా, జయహో జగనన్నా, జోహార్ వైఎస్సార్ అంటూ అధికార పక్ష సభ్యులంతా నినదించారు. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభలోకి ప్రవేశించడంతో అందరూ గౌరవసూచికంగా లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. ఉదయం పది గంటలకే శాసనసభ ప్రాంగణం సభ్యులు, సందర్శకులతో కిటకిటలాడింది. సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కావడంతో చాలామంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులు రావడంతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది. జాతీయ గీతాలాపనతో ప్రారంభం ఉదయం 11.06 గంటలకు జాతీయ గీతాలాపనతో సభ ఆరంభమైంది. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి కృష్ణమాచార్యులు ప్రకటించారు. రాజ్యాంగంలోని 188 ఆర్టికల్ ప్రకారం సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రొటెం స్పీకరు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం శాసన సభ్యులుగా బాధ్యతలు స్పీకరించినట్లు సంతకాలు చేయాలని ప్రొటెం స్పీకరు సూచించారు. ఆ ప్రకారం ప్రొటెం స్పీకర్ పేర్లు చదవగా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అక్షర క్రమంలో మొదట అంజాద్ బాషా (కడప శాసన సభ్యుడు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి) ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి అక్షర క్రమంలో శాసనసభ కార్యదర్శి ఒక్కొక్కరి పేరును చదవగా స్పీకర్ ఎదుట పోడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బల్ల వద్ద 173 మందితో శాసన సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్ప శ్రీవాణి, ఆళ్ల నాని, అంజాద్ బాషా, కె.నారాయణస్వామితో పాటు మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేకపాటి గౌతంరెడ్డి, కురసాల కన్నబాబు, తానేటి వనిత, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, పినిపే విశ్వరూప్, శ్రీరంగనాథరాజు, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మునూరు జయరాం, బాలినేని శ్రీనివాసరెడ్డి, శంకర నారాయణలతోపాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఇతర శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు నానీలు.. ఇద్దరు శ్రీదేవిలు తాజా శాసససభలో కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆళ్ల వంశీకృష్ణ శ్రీనివాస్ (నాని) ముగ్గురూ తమ పేర్లతో పాటు ‘నాని’ అని కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు సభ్యుల నిక్ నేమ్స్ ‘నాని’ కావడం, వారు ప్రమాణ స్వీకారంలో ‘నాని’ అని పేర్కొనటం విశేషం. అలాగే ఇంటి పేర్లు వేరైనప్పటికీ సభలో ఇద్దరు శ్రీనివాసరావులు (ముత్తంశెట్టి , వెలంపల్లి), ఇద్దరు రామచంద్రారెడ్డిలు (కాపు, పెద్దిరెడ్డి) ఉండటం ఆసక్తికరమైన అంశం. ఇంటి పేర్లు వేరైనప్పటికీ ఇద్దరు శ్రీదేవిలు (ఉండవల్లి, కంగాటి) కూడా ఉన్నారు. సీఎం హోదాలో తొలిసారి సభకు వైఎస్ జగన్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తొలిసారిగా శాసనసభకు వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉండగా శాసనసభ ఎడమ వైపు ద్వారం నుంచి వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కుడి ద్వారం నుంచి ప్రధాన గేటు ద్వారా కాన్వాయ్‌తో సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. ఉదయం 10.45 గంటలకు ఆయన సభ వద్దకు చేరుకోగానే ముఖద్వారం వద్ద శాసనసభ కార్యదర్శి (ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులు పుష్ఫగుచ్ఛాన్ని అందచేసి స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనం నుంచి దిగగానే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాల నడుమ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి ఛాంబర్లోకి తోడ్కొని వెళ్లారు. జగన్ అందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ, పలుకరిస్తూ ముందుకు సాగారు. ఆయన తన కుర్చీలో కూర్చోగానే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో కలసి ఫొటో దిగారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సీఎం వైఎస్ జగన్‌తో కలసి ఫోటోలు తీయించుకున్నారు. పాస్టర్ ఒకరు కుటుంబ సమేతంగా వచ్చి వైఎస్ జగన్‌ను దీవించారు. ‘‘వైఎస్ జగన్ అనే నేను....’’ దైవసాక్షిగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అధికార పక్ష సభ్యులంతా అభినందన పూర్వకంగా బల్లలు చరుస్తూ చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. సరిగ్గా ఉదయం 11.11 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార టేబుల్ వద్దకు చేరుకుని ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి’’ అనే నేను అని పలకగానే సభలో హర్షధ్వానాలు వెల్లివిరిశాయి. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని..’’ పేర్కొంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రెండో ప్రమాణం ‘‘ఆంధ్రప్రదేశ్ శానసభ సభ్యుడినైన వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా’’ అని వైఎస్ జగన్ ప్రతిజ్ఞ చేశారు. సభ్యులంతా ఇదే విధంగా రెండు ప్రమాణాలు చేశారు. సభ జరిగిన క్రమమిది.. నిరాడంబరంగా తొలి సమావేశం – బుధవారం 15వ శాసనసభ తొలి సమావేశం నిరాడంబరంగా ప్రారంభమైంది. నూతన ముఖ్యమంత్రి సభలోకి ప్రవేశించే తొలిరోజు అయినప్పటికీ ఎక్కడా హంగామా, ఆర్భాటం లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిపించారు. శాసనసభ ప్రధాన ద్వారం, ముఖ్యమంత్రి ప్రవేశ ద్వారాలకు మాత్రమే సంప్రదాయబద్ధంగా పూలమాలలు వేశారు. అంతకుమించి అలంకరణలు చేయలేదు. – ఉదయం 10.30 గంటల నుంచే అధికార పక్ష సభ్యులు సభలోకి రావడం ప్రారంభమైంది. – వైఎస్సార్సీపీ సభ్యుల్లో అత్యధికులు పార్టీ కండువాలను ధరించి రాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శేషవస్త్రాన్ని కండువాగా కప్పుకున్నారు. చెవిరెడ్డి సభలోకి ప్రవేశించే ముందు అసెంబ్లీ ద్వారానికి మొక్కారు. తర్వాత తన సీటుకు కూడా నమస్కరించి ఆశీనులయ్యారు. – సభ్యుల్లో అత్యధికులు తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. మేకపాటి గౌతంరెడ్డి, ఉషా శ్రీచరణ్, అబ్బయ్య చౌదరి, అబ్దుల్ హఫీజ్‌ఖాన్, నవాజ్ బాషా తదితరులు ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. – రెడ్డిశాంతి, డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు(వైఎస్సార్సీపీ), గద్దె రామ్మోహన్రావు (టీడీపీ) తదితరులు పవిత్ర హృదయంతో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ప్రకటించారు. – ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నవాజ్ బాషా తదితరులు అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దైవసాక్షిగా, నా ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. – అసెంబ్లీ కార్యదర్శి తన పేరు పిలవగానే స్పీకరు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా ప్రొటెం స్పీకరు సీటు వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్పీకరు వెల్ నుంచి కిందకు వస్తూ విపక్షనేతతోపాటు సభ్యులందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరించారు. సభ్యులంతా ఆయనకు ప్రతి నమస్కారాలు చేశారు. – ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగానే స్పీకరు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం ఎమ్మెల్యేలుగా బాధ్యతలు స్వీకరించినట్లు సంతకాలు చేశారు. – టీడీపీ సభ్యుల్లో ఇద్దరు మినహా మిగిలిన వారంతా పచ్చ చొక్కాలు ధరించి వచ్చారు. – పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ప్రమాణ స్వీకార పత్రాన్ని చదవలేక తడబడ్డారు. -
ప్రమాణస్వీకార ఏర్పాట్లపై డీజీపీ ఆరా
-
రేపు ఉ.11.49 గంటలకు మంత్రివర్గ ప్రమాణస్వీకారం
-
రేపు ఉ.11.49 గంటలకు మంత్రివర్గ ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి : అమరావతి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, గ్యాలరీలు, బారి కేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారంకు 5వేల మంది వస్తారని గుంటూరు జాయింట్ కలెక్టర్ హీమాన్షు శుక్ల తెలిపారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తామన్నారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్ లేకుండా సామాన్యులు ప్రమాణస్వీకారంకు హాజరుకావొచ్చన్నారు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 1500 మందితో భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి గెలిచిన మాజీ మంత్రి తమ్మినేని సీతారంను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ఎల్పీ సమావేశం అనంతరం తమ్మినేని సీతారం వైఎస్ జగన్‌తో భేటీకావడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. బీసీ (కళింగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు స్పీకర్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. -
‘మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు’
సాక్షి, అమరావతి : ఈనెల 8న అమరావతి సచివాలయ ప్రాంగణంలో జరగనున్న ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇందుకు సంబంధించి సీఎస్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవేడుకకు విచ్చేసే అత్యంత ప్రముఖులు, ప్రముఖులు, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వారి కుటుంబ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలకు కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా ఆయా మార్గాల గుండా సైనేజి బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పదవీ స్వీకార ప్రమాణ ప్రాంగణానికి చేరుకునే రహదారుల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రమాణ స్వీకారోత్సవంపై ప్రచురించిన ఆహ్వాన పత్రికలకు వెనుకవైపున తెలుగులో రూట్ మ్యాప్ ను ముద్రించాలని తద్వారా ఆహ్వానితులు తదితరులు సులభంగా వేడుక ప్రాంగనానికి చేరుకునేందుకు వీలుంటుందని సీఎస్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిధులు, మీడియాతో సహా ప్రతి ఒక్కరికీ వారు కూర్చున్న ప్రాంతంలోనే తాగునీరు, అల్పాహారం వంటివి అందించాలని, ఈఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. బందోబస్తు ఏర్పాటు, తాగునీరు, అల్పాహారం వంటివి అందించడంలో ఎంతమాత్రం రాజీపడవద్దని అదే సమయంలో అనవసర ఖర్చులకు తావీయకుండా అవసరమైన మేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధింత శాఖల అధికారులకు సీఎస్ స్పష్టం చేశారు. ఈవేడుకలకు విచ్చేసిన వారు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సక్రమంగా తిలకించేందుకు వీలుగా ప్రాగణంలో సరిపడిన మేరకు ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు సచివాలయం సందర్శనకు వస్తారని కావున సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో మరుగుదొడ్లు తదితర అన్నీపరిశుభ్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంకా మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఆయా శాఖలపరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని సీఎస్ ఆదేశించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేలా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆహ్వాన పత్రికల వెనుకవైపు ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి ఏవిధంగా చేరుకోవాలనే దానిపై రూట్ మ్యాప్ ముద్రిస్తే అతిధులు తదితరులు సులభంగా ప్రాంగణాన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక క్రమపద్ధతిలో సజావుగా జరిగేందుకు వీలుగా పోలీస్ శాఖ తరుపున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ 8వ తేదీ ఉ.11.49 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమానికి సుమారు 5 వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 8వ తేదీ ఉదయం11.44 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, 11.45 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వేడుక ప్రాంగణానికి చేరుకుంటారని ఆయన తెలిపారు. ఈకార్యక్రమానికి సంబంధించి అవసరమైన వివిధ రకాల పాస్ లను ముద్రించి పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం అతిధులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు తదితరులకు తేనీటి విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. -
20 నుంచి రాజ్యసభ సమావేశాలు
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఈ నెల 20 నుంచి జూలై 26 వరకు నిర్వహించనున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ ప్రకటనలో వెల్లడించారు. ఇక లోక్‌సభ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 17, 18 తేదీల్లో కొత్తగా ఎంపికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 19వ తేదీన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
అవినీతి, వివక్ష లేని పాలన అందిస్తా
-
అజ్ఞాతం నుంచి అత్యున్నత పీఠం దాకా
దామోదర్‌దాస్ మూల్‌చంద్‌దాస్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్నగర్లో నరేంద్ర మోదీ జన్మించారు. బాల్యంలో తండ్రితో కలిసి టీ అమ్మిన మోదీ, ఆ తర్వాత సోదరుడితో కలిసి సొంతంగా టీ షాపును పెట్టారు. 8 ఏళ్ల ప్రాయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) పట్ల మోదీ ఆకర్షితులయ్యారు. 1968లో ఇంట్లోవాళ్లు మోదీకి జశోదాబెన్‌తో వివాహం జరిపించగా, ఇది ఇష్టంలేని మోదీ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. తిరిగి 1971లో గుజరాత్‌కు చేరుకున్న మోదీ, ఆరెస్సెస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చేరారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మోదీ, మారువేషంలో సంఘ్ కార్యకలాపాలను కొనసాగించారు. సీనియర్ల గుస్సా.. మోదీ క్రమశిక్షణను, వాక్చాతుర్యాన్ని గుర్తించిన ఆరెస్సెస్ నేతలు 1985లో గుజరాత్ బీజేపీ విభాగం నిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో విస్తృతంగా పర్యటించిన మోదీ పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేశారు. అడ్వాణీ ప్రారంభించిన ‘రథయాత్ర’, బీజేపీ నేత మురళీమనోహర్ జోషీ ప్రారంభించిన ‘ఏక్తాయాత్ర’ బాధ్యతలను మోదీ దగ్గరుండి చూసుకున్నారు. పార్టీలో మోదీ ఎదుగుదలపై ఆందోళన చెందిన సీనియర్లు కేశూభాయ్‌పటేల్, శంకర్‌సింఘ్‌వాఘేలా, కాన్షీరామ్ రాణా, మోదీ గుజరాత్లో ఉండేందుకు వీల్లేదని తీర్మానించారు. దీంతో బీజేపీ అధిష్టానం మోదీని జాతీయ కార్యదర్శిగా నియమించగా, దేశంలోని పార్టీ శ్రేణులతో ఆయన సత్సంబంధాలు పెంచుకున్నారు. సీఎంగా బాధ్యతలు.. సవాళ్లు గుజరాత్ సీఎం కేశూభాయ్‌పటేల్ ఆరోగ్యం క్షీణించడం, అవినీతి ఆరోపణలతో కేశూభాయ్‌ను తప్పించి మోదీని బీజేపీ గుజరాత్ సీఎంను చేసింది. 2001, అక్టోబర్7న మోదీ గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్‌కోట్–2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశ్విన్‌పై 14 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 2002, ఫిబ్రవరి 27న గోద్రాలో రైలుదహనం అనంతరం చెలరేగిన మతఘర్షణలను అణచివేయడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మోదీకి క్లీన్చిట్ ఇచ్చింది. ఘర్షణల అనంతరం మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ, 182 సీట్లకు గానూ 127 చోట్ల విజయదుందుభి మోగించింది. అప్పటి నుంచి గుజరాత్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించిన మోదీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. 2001 నుంచి 2014 వరకూ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014లో మోదీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 282 సీట్లతో అధికారంలోకి వచ్చింది. -
అమిత్ షాకు ఆర్థిక శాఖ..?
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కేంద్ర ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు చెప్పినట్లు ఇండియా టుడే గురువారం వెల్లడించింది. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న జైట్లీ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోసారి మంత్రిపదవి చేపట్టే ఓపిక తనకు లేదని ఆయన ఇప్పటికే మోదీకి స్పష్టం చేశారు. మోదీ, రాజ్‌నాథ్ తర్వాత మూడో స్థానంలో అమిత్ షా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో మోదీ తర్వాత మంత్రివర్గంలో రెండో కీలక వ్యక్తి రాజ్‌నాథేననీ, ఆయన గతంలో చేపట్టిన హోం మంత్రి పదవిలో ఇప్పుడు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. జైట్లీ అనారోగ్యంతో విధులకు దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్ పనిచేశారు. దీంతో ఆర్థిక మంత్రి పదవి గోయల్‌కు దక్కవచ్చని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాకు ఆర్థిక మంత్రిగా పనిచేసి, వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరం. అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్‌షా ఇప్పుడు కేబినెట్లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను ఆయన పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ కూడా ఆరోగ్య సమస్యల కారణంగానే ఈసారి పదవి చేపట్టబోవడం లేదు. దీంతో విదేశాంగ శాఖకు కూడా కొత్త మంత్రి రానున్నారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ 2018లో ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అమెరికా, చైనాలకు భారత రాయబారిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో సుష్మ స్థానాన్ని జైశంకర్‌కు ఇవ్వొచ్చనే వార్తలు వస్తున్నాయి. అలాగే పియూష్ గోయల్‌కు రైల్వే శాఖను అలాగే ఉంచి, గడ్కరీకి మౌలిక సదుపాయాలు, గజేంద్ర సింగ్ షెకావత్‌కు వ్యవసాయ శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రొటెం స్పీకర్‌గా మేనకా గాంధీ! 17వ లోక్‌సభ ఎన్నికల్లో తాత్కాలిక స్పీకర్‌గా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ ఉంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మేనకాగాంధీ తాజా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి గెలుపోందారు. గత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా ఆమె ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి మాత్రమే స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అధికారం ప్రొటెం స్పీకర్‌కు ఉంటుంది. అలాగే లోక్‌సభకు స్పీకర్, ఉపస్పీకర్‌ను ఎన్నుకునే సమయంలోనూ ప్రొటెం స్పీకరే సభను నడిపిస్తారు. -
మోదీ కేబినెట్ @ 58
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్ షా కేబినెట్లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..ఆశ్చర్యకరంగా మోదీకి సన్నిహితుడిగా భావించే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. ‘దేశానికి సేవ చేసే గౌరవం దక్కింది’ అని వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కారీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, జవదేకర్, గోయల్, నఖ్వీ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన అకాలీదళ్ (హర్సిమ్రాత్ కౌర్ బాదల్), శివసేన (అర్వింద్ సావంత్), ఎల్జేపీ (పాశ్వాన్)లకు కేబినెట్ హోదా మంత్రి పదవులు లభించాయి. తెలంగాణకు ప్రాతినిధ్యం సంతోష్‌గంగ్వార్, రావ్ ఇంద్రజీత్ సింగ్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు తదితరులు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డితో పాటు ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్వినీకుమార్ చౌబే, పర్షోత్తమ్ రూపాలా, రామ్‌దాస్ అథావలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, మేనకా గాంధీలు కొత్త మంత్రివర్గంలో లేరు. సురేష్ ప్రభు, జేపీ నడ్డాలకు చోటు దక్కలేదు. అమిత్ షా స్థానంలో నడ్డా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా సుష్మాస్వరాజ్ ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కేబినెట్లో చేరలేనని పేర్కొంటూ మరో సీనియర్ మంత్రి జైట్లీ బుధవారం మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కేబినెట్లో తిరిగి చోటు సంపాదించుకోగలిగారు. మాజీ దౌత్యవేత్త అయిన పూరితో పాటు జైశంకర్ ఆరు నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నిక కావాలి. పాశ్వాన్ ఏ సభలోనూ సభ్యులు కాదు. గత ఏడాదే ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) నుంచి రిటైర్ అయిన జైశంకర్ ఓ ప్రధాన మైలురాయి వంటి భారత్–అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరిపిన బృందంలో కీలక సభ్యుడు. కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం దక్కింది. మోదీ గత మంత్రివర్గంలో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. షా, జైశంకర్‌తో పాటు 20 మంది (1/3) కొత్త వారున్నారు. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందికి చోటు లభించింది. బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న పశ్చిమబెంగాల్లో ఇద్దరికి (బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురి) అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి మళ్లీ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. పాత మంత్రుల్లో ఒకరిని కొనసాగించి, తొలగించిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మొత్తం మీద గత మంత్రివర్గంలో ఉన్న 37 మంది మళ్లీ అవకాశం చేజిక్కించుకున్నారు. గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు గురువారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు మోదీ ఘన నివాళులర్పించారు. ఇక్కడి ఇండియా గేట్ పక్కనే ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి కమలాకృతిలో తీర్చిదిద్దిన వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్దకు వెళ్లారు. అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆయనతో ఉన్నారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ ప్రత్యేక సందర్భం.. బాపూజీ ఉదాత్త సిద్ధాంతాలు మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని, బడుగు, బలహీనవర్గాలకు సాధికారత కల్పన దిశగా మనలో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలని మోదీ ఆకాంక్షించారు. వాజ్‌పేయి ఉండి ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీకి లభించిన గొప్ప అవకాశాన్ని చూసి బాగా ఆనందించేవారన్నారు. అటల్జీ జీవితం, ఆయన కార్యదక్షత ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెచ్చేందుకు, మరింత మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తామని గురువారం నాటి వరుస ట్వీట్లలో మోదీ పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. కేబినెట్లో చేరని జేడీ(యూ) బీజేపీ ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) కేంద్ర కేబినెట్లో చేరలేదు. ఆ పార్టీకి మంత్రి పదవుల విషయంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేబినెట్ బెర్తుల విషయంలో చివరి నిమిషం వరకు అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే ‘మోదీ ప్రభుత్వంలో మేము చేరడం లేదు. ఇది మా నిర్ణయం..’ అని జేడీ(యూ) అధికార ప్రతినిధి పవన్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు నితీశ్ కూడా బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అయితే ఎన్డీయేకి నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ఒకేఒక్క మంత్రి పదవి ఆఫర్ చేసిందని, పైగా ఇవ్వజూపిన శాఖ కూడా జేడీ(యూ)ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 16 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) 2017లోనే బీజేపీతో జట్టు కట్టినా మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా చేరలేదు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దాదాపు 80 మంది వరకు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానితో కలిపి మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండటానికి వీల్లేదు. మోదీ సర్కార్ 2.0 ఇదే గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని ప్రమాణ స్వీకార వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న సీజేఐ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న తల్లి హీరాబా -
ఇక స్వచ్ఛమైన పాలన
వైఎస్ జగన్ అనే నేను.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూముఖ్యమంత్రి పదవినిస్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లుఈ నేల మీద నడిచినందుకు,పదేళ్లుగా మీలో ఒకడిగానిలిచినందుకు ఆకాశమంతవిజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు,ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి,ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరున హృదయపూర్వకకృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాక్షి, అమరావతి : అవినీతి రహిత పాలన అందిస్తామని నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను 72 గంటల్లోనే ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను ప్రజల ముందుకు తెస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టులను రద్దు చేసి, దోచుకున్నదెంతో ప్రజల ఎదుట ఉంచుతామన్నారు. నవరత్నాల అమలులో భాగంగా అవ్వాతాతల పెన్షన్‌ను పెంచుతూ తొలి సంతకం చేశారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో 5.60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని యువతకు తీపి కబురు చెప్పారు. పాలనలో తీరు తెన్నులపై స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కబురందించేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అశేష జనవాహిని ఆనందోత్సాహాల మధ్య ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతితో పాటు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నే విన్నాను.. నేనున్నాను.. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో పేదలు పడ్డ కష్టాలుచూశాను. మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు విన్నాను. వారి కష్టాలు చూసిన, విన్న నేను.. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేనీ రోజు మాటిస్తున్నాను. మీ కష్టాలను నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఇవాళ మీ అందరికీ చెబుతున్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టో తీసుకువచ్చాం. మేనిఫెస్టోను కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కన్పించే విధంగా తీసుకొచ్చాం. గత పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు.. బుక్కులు తీసుకురాలేదు. ఇందులో ప్రతి కులానికో పేజీ పెట్టి ఎలా మోసం చెయ్యాలన్న ఆలోచనతో తీసుకురాలేదు. ఎన్నికలయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకు రాలేదు. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఇది వైఎస్సార్ పెన్షన్ కానుక నవరత్నాల్లో మీ అందరికీ మాటిచ్చినట్టుగానే, మేనిఫెస్టోలోని ఒక అంశం గురించి మీ అందరికీ చెబుతాను. ఈ రోజు ఆ అవ్వా తాతల ఆశీస్సులు తీసుకునేందుకు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం చెబుతున్నా. నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆ అవ్వా తాతలను పెన్షన్ ఎంత అని అడిగితే రూ.వెయ్యి అని చెప్పారు. కొంతమంది అవ్వలైతే అది కూడా రావడం లేదని చేతులూపుతూ చెబుతుండేవాళ్లు. ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే గడువున్నప్పుడు పింఛన్‌ను పెంచారు. అందుకే ఈ పరిస్థితి పూర్తిగా మార్చబోతున్నాను. నవరత్నాలలో ప్రతి అవ్వ, తాత, ప్రతి వితంతువుకు ఇచ్చిన మాట ప్రకారం వారి పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళతాను. ఆ అవ్వా తాతల పెన్షన్‌ను జూన్ నెల నుంచి అక్షరాల రూ.2,250 నుంచి మొదలు పెట్టబోతున్నాను వైఎస్సార్ పెన్షన్ కానుకగా. దీనికి సంబంధించిన ఫైల్‌పై నేనీ రోజు మొట్ట మొదటి సంతకం పెడుతున్నాను. (సంతకం పెట్టారు.) ఈ సంవత్సరం రూ.2,250తో మొదలు పెడుతున్నాం. రేపు సంవత్సరం రూ.2,500కు తీసుకెళ్తాం. ఆ తర్వాత సంవత్సరం రూ.2,750కు.. ఆ తర్వాత ఏడాది రూ.3 వేలకు తీసుకెళ్తాం. అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామని చెబుతూ.. ఆశీస్సులు ఇవ్వమని పేరుపేరునా ప్రతి అవ్వా తాతను మీ మనవడిగా రెండు చేతులు జోడించి కోరుతున్నా. ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశమూ ప్రతి పేదవాడికీ అందాలి. ఇందులో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఇది జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగా ఆగస్టు 15 నాటికి, అంటే ఇవాల్టి నుంచి కేవలం రెండున్నర నెలల కాలంలో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా, లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తున్నాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, సేవ చెయ్యాలనే ఆరాటం ఉన్న పిల్లలకు రూ.5 వేలు జీతమిస్తూ గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటాం. రూ.5 వేలు ఎందుకిస్తున్నామో తెలుసా? ఈ వ్యవస్థలోకి లంచాలు రాకుండా చెయ్యాలని. ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి, పక్షపాతం, లంచాలు ఉండకూడదని. సేవా దృక్పథం గల పిల్లలకు వేరే చోట మెరుగైన ఉద్యోగం దొరికే వరకు గ్రామ వాలంటీర్లుగా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నాలుగు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వస్తాయి. సర్కారీ సేవ అందకపోతే ఫోన్ కొట్టండి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటున లంచాలు కన్పించినా ఊరుకోం. అదే ఆగస్టు 15వ తేదీన ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే అనుసంధానమై ఉంటుంది. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష కన్పించినా, ఏ ఒక్కచోట లంచాలు కన్పించినా, ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా వక్రీకరణ వార్తలు రాసే మీడియాను కోర్టుకీడుస్తాం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కన్పిస్తాడు. మిగిలిన వాళ్లను ఎప్పుడెప్పుడు దించాలా అని ఆలోచన చేస్తారు. వాళ్ల రాతలు అలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇది మన ఖర్మ. వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నా. పారదర్శకంగా, జ్యుడీషియల్ కమిషన్ ద్వారా కాంట్రాక్టులను ఖరారు చేసిన తర్వాత కూడా వక్రీకరిస్తూ, దురుద్దేశంతో వార్తలు రాస్తే ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరకు వెళ్లి, శిక్షించమని గట్టిగా అడుగుతాం. అమ్మానాన్నకు పాదాభివందనం... చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు పేరుపేరున ఇక్కడకు వచ్చిన, ఇక్కడికి రాలేకపోయిన, ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి మరోసారి పేరుపేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ, మీ గ్రామంలో అక్షరాల పది మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తున్నామని అందరికీ హామీ ఇస్తున్నా. అక్టోబర్ 2, గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమం చేపట్టి, మరో 1.60 లక్షల ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి తెస్తాం. మీ పిల్లలే పది మంది మీ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తారు. మీకు పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నవరత్నాల్లోని ఏ పథకమైనా, ఏది కావాలన్నా.. మీరు చెయ్యాల్సిందల్లా గ్రామ సెక్రటేరియట్‌కు వెళ్లి అప్లికేషన్ పెట్టండి. దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే మీకు మంజూరయ్యేలా చేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా లంచాలుండవు. ఇప్పటి వరకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా మరేది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచమనేదే లేకుండా, రికమండేషన్‌కు తావు లేకుండా ఏ ఒక్కరికైనా ఏ అవసరం ఉన్నా, 72 గంటల్లో మంజూరయ్యేలా చేస్తామని సీఎంగా హామీ ఇస్తున్నాను. గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై పని చేస్తారు. నవరత్నాలతో పాటు, ప్రతి ప్రభుత్వ పథకం లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా నేరుగా మీ ఇంటికొచ్చేలా డోర్ డెలివరీ చేస్తారు. ఇదొక్కటే కాదు.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటీ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను. కాంట్రాక్టుల్లో అవినీతి నిగ్గు తేలుస్తాం ఈ రాష్ట్రంలో అవినీతి, వివక్ష లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. ఇందులో భాగంగా ఏయే కాంట్రాక్టుల్లో, ఏయే పనుల్లో అవినీతి జరిగిందో వాటిని పూర్తిగా రద్దుచేస్తాం. గతంలో చేసిన ట్రైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండీషన్స్‌ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేలా అవకాశమిస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొస్తాం. అంతేకాదు.. ఇంకో ఉదాహరణ. కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, మీ ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యడంతోనే ఆగకుండా పారదర్శకతను తీసుకొస్తాం. ఇందులో భాగంగా రేపో మర్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి, ఓ హైకోర్టు జడ్జిని ఇవ్వమని కోరతాం. ఆయన ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్‌గా జ్యుడీషియల్ కమిషన్‌ను నియమిస్తాం. టెండర్లకు పోకముందు, ప్రతి కాంట్రాక్టును జ్యుడీషియల్ కమిషన్‌కు పంపి, ఆ హైకోర్టు జడ్జి చేసే ఏ సూచనలు, మార్పుల మేరకు కాంట్రాక్టులకు పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా టెండర్లు పిలుస్తాం. -
సభా ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ జగన్
-
విజయవాడలో పండుగ వాతావరణం
-
విజయవాడకు స్టాలిన్
-
రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు
-
రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న అభిమానులు,ప్రజలు
-
రాష్ట్రంలో తిరుగులేని ప్రజా నాయకుడు
-
రాష్ట్ర ప్రగతికి తొలి అడుగు
-
చంద్రబాబు,కేవీపీ,చిరు, పవన్‌లకు జగన్ ఆహ్వానం
-
చిరు, పవన్‌లకు జగన్ ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ సంచలన విజయానికి సారథ్యం వహించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి జాతీయ, రాష్ట్ర నాయకులకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, సీపీఐ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను కూడా ఆహ్వానించారు. సినీ నటుడు చిరంజీవి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఫోన్ చేసిన వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (చదవండి: రేపే పదవీ స్వీకారం) సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి విజయవాడ చేరుకున్న గవర్నర్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు గవర్నర్ చేరుకున్నారు. ఈరోజు ఆయన అక్కడే బస చేస్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రమాణ స్వీకారోత్సవానికి చకచకా ఏర్పాట్లు..
-
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
-
మోదీ ప్రమాణ స్వీకారానికి సూపర్‌స్టార్
సాక్షి, తమిళనాడు: దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నర్రేంద మోదీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తరువాత అంతటి చరిష్మా గల నాయకుడు మోదీ అని వర్ణించారు. మోదీ గెలుపును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని ఆయన కోరారు. ఈనెల 30న రెండోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతున్నానని రజనీ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించినప్పటికీ.. తమిళనాడులో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పరాజయం పాలైనంత మాత్రానా రాహుల్ రాజీనామా చేస్తాననటం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమన్నారు. అధికార పక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని అన్నారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకేతో కూటమి కట్టిన బీజేపీ బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే. కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. రజనీతో మరో తమిళ నటుడు, మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యే అవకాశం ఉంది. వీరిద్దరిని మోదీ స్వయంగా ఆహ్వానించారు. దీనిపై కమల్ ఇప్పటివరకూ స్పందిచలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ పార్టీ.. ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.