తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం | Revanth Reddy to Take Oath as a Telangana CM Live Updates, - Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Published Thu, Dec 7 2023 8:14 AM | Last Updated on Thu, Dec 7 2023 2:47 PM

Telangana CM News Live Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు. రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ సీఎంగా ఆరు గ్యారంటీల తొలిఫైల్‌పై రేవంత్‌ సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై సీఎం అందజేశారు.

డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉ‍త్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, డి. అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌

  • త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
  • తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది
  • గత ప్రభుత్వం.. ప్రజల బాధలు పట్టించుకోలేదు
  • పదేళ్లు బాధలను ప్రజలు మౌనంగా భరించారు
  • తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా
  • ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తా
  • అమరవీరుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది

పొన్నం ప్రభాకర్‌ కామెంట్స్‌

  • మంత్రి అవుతానని ముందే ఊహించా
  • ఏ పోర్ట్‌ పోలీయో ఇచ్చినా సమ్మతమే
  • మంత్రి కావాలనే కోరిక నెరవేరింది
  • మంత్రి అయినా ప్రజా సేవకుడిగా పని చేస్తాను

సాక్షి టీవీతో పొంగులేటి

  • తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మా పాలన
  • ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం
  • గత ప్రభుత్వంలా కక్షపూరితంగా మేం వ్యవహరించం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కామెంట్స్‌

  • అబద్ధాలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారు
  • కేసీఆర్‌ రిటైర్‌ అయ్యి ఫాం హౌస్‌కే పరిమితమైతే మంచిది

  • తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఖరారు
  • వికారాబాద్‌ నుంచి ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌

  • ఎల్బీ స్టేడియంకు చేరుకున్న ఉత్తమ్‌, సీతక్క, పొన్నం
  • ఎల్బీబీ స్టేడియంకు చేరుకున్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు

12:10PM, Dec 7, 2023

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్‌

  • తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు
  • రాజకీయంగా ఎన్నో అవకాశాలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి, సోనియా, రాహుల్‌, ప్రియాంక, రేవంత్‌లకు ధన్యవాదాలు
  • ఈ జీవితం ప్రజలకే అంకితం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • ఏ మంత్రి పదవి ఇచ్చినా నిజాయితీతో పనిచేస్తా
  • 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా
  • ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మరకలేకుండా పని చేశా
  • తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన రాబోతుంది
  • ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయబోతున్నాం

11: 35AM, Dec 7,2023

  • హోటల్ ఎల్లా నుంచి ఎల్బీ స్టేడియం బయలు దేరిన ఎమ్మెల్యేలు

11: 10AM, Dec 7,2023

  • హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • హైదరాబాద్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్
  • శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి.
  • శంషాబాద్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి

10: 50AM, Dec 7, 2023

  • భట్టి విక్రమార్క నివాసానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • డిప్యూటీ సీఎం గా ఎన్నికైన భట్టికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

10: 20AM, Dec 7, 2023

  • జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం..
  • మంత్రివర్గంలో పొంగులేటికి చోటుదక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న అనుచరులు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు గెలవడం వెనక కీలకంగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • నల్గొండ జిల్లాలో సైతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి ప్రచారం నిర్వహించిన పొంగులేటి

10: 15AM, Dec 7, 2023

  • హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ.
     
  • 9:50AM, Dec 7, 2023
  • పొన్నం ప్రభాకర్ కు స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి.
  • మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
  • పొన్నం ఇంట సందడి.. స్వీట్ తినిపించి అభినందించిన కుటుంబసభ్యులు
  •  తల్లి మల్లమ్మ ఆశీర్వాదం తీసుకున్న పొన్నం ప్రభాకర్.
  • పొన్నంకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో ఆనందోత్సవాలు
  • మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ
  • కాబోయే మంత్రులు వివరాలను రాజ్‌భవన్‌కు తెలియజేసిన రేవంత్‌
  • కాబోయే మంత్రులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుపుతున్న ఠాక్రే

  • తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో 11మందికి చోటు
  • నేటి (గురువారం) మధ్యాహ్నం కొత్త మంత్రివర్గం ప్రమాణం
  • ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న భట్టి

9:15AM, Dec 7, 2023

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన రేవంత్‌రెడ్డి

  • ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీల నిర్మాణం
  • ప్రధాన స్టేజీకి ఇరువైపులా రెండు వేదికలు
  • 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
  • ప్రమాణీస్వీకారానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం
  • రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ
     
  • ఎల్బీ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు
  • 3వేల మందితో భద్రతా ఏర్పాట్లు
  • స్టేడియం లోపల, బయట మెటల్‌ డిటెక్టర్లు, పోలీస్‌ జాగిలాలతో తనిఖీలు
  • స్టేడియం లోపలికి వెళ్లే ప్రతీ గేటు వద్ద డిటెక్టర్లు ఏర్పాటు
  • నిజాం కాలేజీ నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా వరకూ వాహనాల పార్కింగ్‌

హైదరాబాద్‌కు సోనియా, రాహుల్‌

  • నేడు హైదరాబాద్‌కు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక
  • ఉదయం 9:30కి హైదరాబాద్‌ చేరుకోనున్న సోనియా, రాహుల్‌, ప్రియాంక
  • మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం
  • ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 
  • వేడుక కోసం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు 
  • ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం 
  • ఆరు గ్యారంటీల అమలు ఫైల్‌పై రేవంత్‌ తొలి సంతకం చేసే చాన్స్‌ 
  • మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా సచివాలయంలోకి ఎంట్రీ 
  • భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు


మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్‌
ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. 

ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా
రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్‌ నేతలు కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు.

కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్‌ ఆంక్షలు
ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్‌బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు.

జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్‌ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్‌ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు.  

ఏర్పాట్లు ఇలా..
జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఉన్న మార్గం పర్యవేక్షణకు ప్రత్యేక రూట్‌ పార్టీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మార్గాలను ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీ చేయిస్తున్నారు. ఎల్బీ స్టేడియం చుట్టూ అనునిత్యం ప్యాట్రోలింగ్‌ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్‌, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, సీఏఆర్‌ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించనున్నారు. రూఫ్‌ టాప్‌ వాచ్‌ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం దాదాపు ఆరు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement