
మోడీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు.
ఇస్లామాబాద్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. ఈనెల 26న భారతదేశ 15వ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా సార్క్ దేశాధిపతులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్, నేపాల్ ప్రధానులు షెరింగ్‌తొబ్గే, సుశీల్ కొయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యెమీన్ అబ్దుల్ గయూమ్‌లు ఆహ్వానితుల్లో ఉన్నారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించటం ఇదే తొలిసారి.