సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సాయం చేసేందుకు గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. రెండేళ్ల కిందట ప్రధాని మోదీ ఎందుకు పాకిస్థాన్‌లో అనూహ్యంగా ఆగి.. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట పెళ్లి వేడుకకు హాజరయ్యారని నిలదీసింది.
'ప్రధాని మోదీ పాకిస్థాన్‌లో దిగి.. అప్పటి ప్రధాని షరీఫ్ ఇంట పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఎందుకు ఆయన వెళ్లారు. ఆయనను ఆహ్వానించారా' అని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు పాక్ అధికారులను ఎందుకు అనుమతించారని అడిగారు. ఉగ్రదాడి సూత్రధారులను పాక్ శిక్షించకపోయినా.. ఆ దేశ అధికారులను వైమానిక స్థావరంలోకి అనుమతించడం గతంలో రాజకీయంగా విమర్శలకు తావిచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు పాక్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్‌ను ఎందుకు కలిశారని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ప్రశ్నించారు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను గుజరాత్ సీఎంను చేసేందుకే కాంగ్రెస్ నేతలు పాక్ అధికారులను కలుస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment