
అక్కడ అణుబాంబులు ఉంటే, ఇక్కడ 56 అంగుళాల ఛాతీ ఉంది
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్పషీ్టకరణ
బస్తీ/శ్రావస్తి: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ఆ రెండు పార్టీలు మన దేశాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కలిసి ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజుల ఫ్లాప్ సినిమా రీరిలీజ్ అవుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ, శ్రావస్తిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఉగ్రవాదంతో మనల్ని భయపెట్టాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తిండి లేక అల్లాడుతోందని చెప్పారు. పాకిస్తాన్ పని అయిపోయిందని తేల్చిచెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ సానుభూతిపరులైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మనల్ని బెదిరించడంలో బిజీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉంటే, ఇండియాలో 56 అంగుళాల ఛాతీ ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలను చూసి బెదిరిపోవడానికి ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, బలమైన మోదీ ప్రభుత్వమని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment