Samajwadi Party
-
ఆపరేషన్ మిల్కీపూర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మిల్కీపూర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎస్పీ, బీజేపీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పూర్తి బలాన్ని చాటుతున్నాయి. మిల్కీపూర్‌లో విజయం సాధించడం ద్వారా ఫైజాబాద్ లోక్‌సభ స్థానం ఓటమి నుంచి కోలుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, 2022లో తాను దక్కించుకున్న అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలవగా... ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 2024 జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) సీటును బీజేపీ కోల్పోయింది. ఇది లౌకికవాద విజయమని ఎస్పీ అప్పట్లో చాలా ప్రచారం చేసింది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా అవధేష్ ప్రసాద్ ఎన్నిక కావడంతో మిల్కీపూర్ సీటు ఖాళీ అయింది. అయితే ఇప్పుడు మిల్కీపూర్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా యావత్ దేశానికి అయోధ్యలో తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కాగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మ«ధ్య ప్రత్యక్ష పోటీగా మారింది. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో ఉన్న మిల్కీపూర్‌లో ఓటర్లను సమీకరించేందుకు ఐదారుగురు మంత్రులను బీజేపీ మొహరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కుందర్కిలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలుపునకు కారణమైన మంత్రి జేపీఎస్ రాథోడ్, ఎమ్మెల్సీ ధర్మేంద్ర సింగ్‌లకు కమలదళం మిల్కీపూర్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు అయోద్య జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి సూర్యప్రతాప్ షాహితో పాటు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ శర్మ, గిరీష్ యాదవ్, మయాంకేశ్వర్ సింగ్‌లతో సహా నేతల బృందం కూడా మిల్కీపూర్‌లో విజయం సాధించే బాధ్యతను తీసుకుంది. నియోజకవర్గంలో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. అదనంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మిల్కీపూర్ను మూడుసార్లు సందర్శించి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేగాక మిల్కీపూర్‌లో 5,500 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయడంతోపాటు 3,415 మంది యువకులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు. మరోవైపు, బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోగా, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తమ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను రంగంలోకి దింపింది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజకీయ యుద్ధం ఊపందుకుంది. అక్రమాలకు కారణమయ్యే యూపీ డీజీపీని వెంటనే తొలగించాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. యూపీ డీజీపీని పదవిలో కొనసాగిస్తే, అది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల్లో అక్రమాలకు దారితీయవచ్చని ఎస్పీ ఆరోపిస్తోంది. డీజీపీని తొలగించి ఎన్నికలు నిర్వహిస్తే మిల్కీపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీని ఏ శక్తీ ఓడించలేదని సమాజ్‌వాదీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై ఉద్యమించాలి : సమాజ్‌వాదీ పార్టీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై సమాజ్‌వాదీ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలతో కలిసి పోరాడాలని సమాజ్‌వాదీ పార్టీ నేషనల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ యాదవ్ అన్నారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, సామాజికవేత్త దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదిరె నర్సింగ్‌రావు నేషనల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలో గ్రేటర్ వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న కార్యక్రమాలతో పాటు సభ్యత్వ నమోదు, సామాజిక కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. నేషనల్ సెక్రటరీ జగదీష్ యాదవ్ సూచించినట్లుగా త్వరలోనే ప్రజా సమస్యలపై కూడా పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
సమాజ్‌వాదీ పార్టీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సింగ్ రావు
హైదరాబాద్: సమాజ్ వాది పార్టీ ఎస్సీ ఎస్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మదిరె నర్సింగ్ రావు నియమితులయ్యారు. లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్ వాది పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి వ్యాస్ జి గోండ్ చేతుల మీదుగా మదిరె నర్సింగ్ రావు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నగరానికి చెందిన సామాజికవేత్త, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత దండు బోయిన నిత్య కళ్యాణ యాదవ్‌తో కలిసి నర్సింగ్ రావు సోమవారం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ పట్ల యువతను, మహిళలను రైతులను ఆకర్షించే విధంగా కృషి చేయాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు సమాజ్‌వాది పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని, తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవిని తనకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ జాతీయ అధ్యక్షుడు రాహుల్ నిగమ్ వసి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాలెట్ రావాలి: అఖిలేశ్
లక్నో: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నాయి. భారత్‌లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్‌కుమార్ కాంబోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్ పేపర్లు వాడితే పోలింగ్‌లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్‌కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు. -
కాంగ్రెస్‌పై కత్తులు!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేతలు గొంతు విప్పుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఎస్) నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది! అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు ఇండియా పక్షాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనడం లేదు. ఇతర అంశాల్లోనూ భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు. పార్లమెంట్ లోపల, బయట కలిసి ఒక్కతాటిపై పని చేస్తున్న దాఖలాలు లేవు. ప్రధానంగా హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిమానం కోల్పోయి బలహీనపడుతున్న కాంగ్రెస్ విపక్ష కూటమిని ముందుకు నడిపించలేదని కుండబద్ధలు కొడుతున్నారు. సారథ్యం నుంచి కాంగ్రెస్ తప్పుకుని సమర్థులకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమన్న పశి్చమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. ఇండియా కూటమికి ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇదేనా పొత్తు ధర్మం? బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 జూన్‌లో 17 పార్టీలతో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఫ్రంట్ ఏర్పాటైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఒకే వేదికపైకి చేరాయి. కాంగ్రెస్‌తో పాటు భావసారూప్యం కలిగిన పార్టీలు చేతులు కలిపాయి. అయితే, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిపోయారు! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా పక్షాలు కొన్నిచోట్ల కలివిడిగా, మరికొన్ని రాష్ట్రాల్లో విడివిడిగా పోటీచేశాయి. అంతిమంగా పరాజయమే మిగిలింది. లోక్‌సభలో స్వీయ బలం పెరగడం ఒక్కటే కాంగ్రెస్‌కు కొంత ఊరట కలిగించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణాలో మిత్రపక్షాలను పక్కనపెట్టి దాదాపుగా ఒంటరిగా పోటీచేయడం వికటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌వి ఒంటెత్తు పోకడలంటూ భాగస్వామ్య పార్టీలు మండిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని, పొత్తుధర్మం పాటించడంలేదని ఆక్షేపిస్తున్నాయి. అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి సమాజ్‌వాదీ ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉందని ఆ పార్టీ ఎంపీ జావెద్ అలీఖాన్ చెప్పారు. అయితే కూటమిలో అభిప్రాయభేదాలు నిజమేనని అంగీకరించారు. లుకలుకలపై కాంగ్రెసే స్పందించి భాగస్వాములను సమాధానపరచాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. మిత్రపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక కూటమి ఎందుకని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్ల సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు, అందుకే అవమానాలు ఎదురయ్యాయి’’ అని ఆరోపించారు. కూటమి ఒక్కటిగా కలిసి ఉంటుందన్న నమ్మకం తమకు లేదని, ఏ క్షణమైనా అది ముక్కలయ్యే అవకాశం ఉందని జేడీ(యూ) సీనియర్ నేత రాజీవ్ రంజన్ వ్యాఖ్యానించారు. కూటమికి ఎవరు సారథ్యం వహించాలో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. సారథ్యానికి సిద్ధమన్న మమత ప్రతిపాదనపై దృష్టి పెట్టాలని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉదయ్‌వీర్ సింగ్ కోరారు. ఆమెకు తమ మద్దతు, సహకారం ఉంటాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మాత్రం మమత వ్యాఖ్యలపై గుర్రుగా ఉంది. తమ కూటమి పెద్దగా మరొకరు అవసరమని భావించడం లేదని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ తేల్చిచెప్పారు. మమత వ్యాఖ్యలను పెద్ద జోక్‌గా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ కొట్టిపారేశారు.ఎంవీఏకు సమాజ్‌వాదీ గుడ్బైముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ఎంవీఏతో తెగదెంపులు చేసుకుంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తెలిపింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను కీర్తిస్తూ శివసేన(యూబీటీ) ఇటీవల ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. అదేవిధంగా ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ మసీదు విధ్వంసాన్ని పొగుడుతూ ‘ఎక్స్’లో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’అని మహారాష్ట్ర ఎస్పీ చీఫ్ అబూ అజ్మీ చెప్పారు. ఈ పరిణామంపై శివసేన(యూబీటీ) స్పందించింది. బాబ్రీ మసీదుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. ఈ విషయం తెలుసుకునేందుకు ఎస్పీకి దశాబ్దాలు పట్టిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎస్పీ),ఎస్పీ ఉన్నాయి.‘‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. నాకు చాన్సిస్తే కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన’’ – శుక్రవారం మీడియాతో మమత -
ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ..?
జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బెంగాలీ న్యూస్ ఛానల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. అవకాశం వస్తే తాను ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తానని తెలిపారు. అయితే బెంగాల్ సీఎం పదవిని మాత్రం వదులుకోనని ఆమె స్పష్టం చేశారు.రెండు పాత్రలకు న్యాయం చేస్తాబెంగాల్ సీఎంగా, విపక్ష కూటమి నాయకురాలిగా రెండు పాత్రలకు న్యాయం చేయగలనని మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమిని నేనే స్థాపించా. దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై ఉంటుంది. వారలా చేయలేకపోతే నేనేం చేయగలను? ప్రతీ ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’ అని మమత అన్నారు. ‘దీదీ’ ప్రకటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.అందుకే కూటమికి దూరమయ్యారా?ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలవకుండా మమత ఒంటరిగా పోటీ చేశారు. మొదటి నుంచి విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించిన ఆమె చివరి నిమిషంలో పక్కకు తప్పుకోవడంపై అప్పట్లో హాట్‌టాపిక్ అయింది. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు తనకు అప్పగించడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఒప్పుకోకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఒంటరిగా బరిలోకి దిగారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే సీట్ల పంపకంలో తేడాలు రావడం వల్లే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది. మమతా బెనర్జీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ తాను అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనే సాకుతో మమత సింగిల్‌గానే పోటీ చేశారు. ఇండియా కూటమి గెలిస్తే కచ్చితంగా మద్దతు ఇస్తానని ప్రకటించి తనదారి తాను చూసుకున్నారు. కాగా, బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.మమతకు పగ్గాలు అప్పగిస్తారా?ఇండియా కూటమి నడిపించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ తాజాగా తనకు తానుగా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రస్తుతం ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 101 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలో అతి పెద్ద భాగస్వామిగా ఉంది. 37 ఎంపీలను కలిగిన సమాజ్‌వాదీ పార్టీ రెండో పెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన (యూబీటీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది.చదవండి: మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయంమమతకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతుఈ నేపథ్యంలో ఇండియా కూటమిని బలోపేతం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీకి సమాజ్‌వాదీ పార్టీ సూచనప్రాయంగా మద్దతు ప్రకటించింది. ‘ఇండియా కూటమి నాయకురాలిగా మమతా బెనర్జీ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆమెకు మద్దతు ఇవ్వాలి. కూటమి బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. బెంగాల్లో బీజేపీని నిలువరించడంలో మమత కీలకపాత్ర పోషించారు. ఆమె పట్ల మాకు సానుభూతి ఉంది. చాలా కాలం నుంచి ఆమెతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయ’ని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉదయ్ వీర్ సింగ్ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మమత వారసుడు అతడేనా?ఇదిలావుంటే తన రాజకీయ వారసుడి ఎంపికపై మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీ నాయకత్వం అంతా కలిసి తన రాజకీయ వారసుడిని ఎంపిక చేస్తుందని ఆమె చెప్పారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మమత తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆయననే ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టయింది. -
పదవికి ఎసరు పెట్టిన కొడుకు పెళ్లి.. బీఎస్పీ సీనియర్ నేత సస్పెండ్
లక్నో: అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న కొడుకు పెళ్లి.. తన పొలిటికల్ కేరీర్‌ను దెబ్బకొట్టింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కారణమైంది. ఇందుకు కారణం.. తనకు కాబోయే కోడలు మరో పార్టీ నాయకుడి కూతురు కావడమే. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నాయకుడు సురేంద్ర సాగర్ తన కుమారుడితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీకి చెందిన నేతతో వియ్యం అందుకోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సీరియస్ అయ్యారు. తక్షణమే సురేంద్ర సాగర్‌పై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఓ లేఖను ఇచ్చారు.ఈ సందర్భంగా సురేంద్ర సాగర్ స్పందిస్తూ.. పార్టీ వ్యతిరేక చర్యలకు నేను పాల్పడలేదు. ఎమ్మెల్యే త్రిభువన్ కూతురితో నా కుమారుడికి వివాహం జరిపించడం నేరమా?. నేను ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సురేంద్ర కుమార్.. బరేలీ డివిజన్లో బీఎస్పీకి కీలక నేతగా ఉన్నారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాగర్ పోటీ చేసి ఓడిపోయారు.ఇక, ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ త్రిభువన్ దత్ ప్రస్తుతం అంబేద్కర్ నగర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ మాయావతి ఇలాంటి నిర్ణయం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే పార్టీలో వచ్చినప్పుడు మాజీ డివిజనల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. -
కాంగ్రెస్‌కు అఖిలేష్ యాదవ్ షాక్.. ఆ ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌కి ‘నో’
హర్యానా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హస్తం పార్టీ ఓటమిపై ప్రతిపక్ష బీజేపీతోపాటు మిత్రపక్షాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అతి విశ్వాసం, అహంకారమే ఎన్నికల ఫలితాల్లో ఓటమికి కారణమని మండిపడితున్నాయి. రాష్ట్రంలో ఇండియా కూటమి పోటీ చేయలేదని, కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసంతో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ, లేక ఆప్‌తో కలిసివెళ్లి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్‌కి భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది చివర్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. ఈ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. అయితే, ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ.. ఆ ప్రపోజల్‌ను ఎస్పీ తిరస్కరించింది.తాజాగా ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కర్హల్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను, సిసాము నుంచి నసీమ్ సోలంకి, ఫుల్పూర్ (ప్రయాగ్‌రాజ్) నుంచి ముస్తఫా సిద్దిఖీ, మిల్కిపూర్ (అయోధ్య) నుంచి అజిత్ ప్రసాద్‌కు, కతేహరి నుంచి శోభావాయ్ వర్మ, మజ్వాన్ స్థానం నుంచి జ్యోతి బింద్‌లకు పార్టీ టిక్కెట్లు ఇచ్చినట్లు పేర్కొంది. అయితే వీటి పోలింగ్‌కు ఇంకా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల తేదీని ప్రకటించలేదు -
హర్యానా ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఒంటరి పోరు?
యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పార్టీని మరో ముందడుగు వేయించనున్నారు. పార్టీని ప్రాంతీయానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అఖిలేష్ యాదవ్ సమాయత్తమవుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా హర్యానాలో కూడా ఒంటరిగా పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టి యూపీలో 37 సీట్లు గెలుచుకుంది. ఈ ఫలితాల అనంతరం పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించేదిశగా కసరత్తు ప్రారంభించారు.హర్యానాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో అహిర్ ఓటర్లు నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. ఎనిమిది నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. దీనికితోడు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది వలస ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ఓటర్లు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం. ఇవన్నీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అంశాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్‌వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
ఎంపీగా కొనసాగుతా.. ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా: అఖిలేష్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని, కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.కాగా 2022లో కర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ యాదవ్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా బరిలో దిగిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట అయిన కన్నౌజ్ నుంచి అఖిలేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు.అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, “నేను కర్హల్, మొయిన్‌పురి కార్యకర్తలను కలిశాను. రెండు ఎన్నికల్లోనూ రెండు స్థానాల నుంచి గెలిచాను. కాబట్టి ఒక సీటును వదులుకోవాలి. కర్హల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నాననే విషయం మీకు తెలియజేస్తున్నానను` అని పేర్కొన్నారు.’లోక్‌సభలో ఎస్పీ నేతగా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో పూర్తవుతాయి. యాదవ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేస్తారు` అని పార్టీ సీనియర్ నేత తెలిపారు.కాగా ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ.. మొత్తం 80 స్థానాల్లో కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీ 37 సీట్లలో సొంతంగా విజయం సాధించి లోక్‌సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. -
Akhilesh Yadav: బీజేపీని అడ్డుకున్నాం
కన్నౌజ్/ఎటావా: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని అడ్డుకోవడంలో తాము విజయవంతం అయ్యామని సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేశామని అన్నారు. అనుకున్న లక్ష్యం సాధించామని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ చూపిన బాటలో నడుస్తూ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేశామన్నారు. యూపీలో లోక్‌సభల్లో ఎస్పీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్పీ సొంతంగా 37 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ 1.70 లక్షల ఓట్ల మెజారీ్టతో బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌పై విజయం సాధించారు. -
Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
బస్తీ/శ్రావస్తి: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ఆ రెండు పార్టీలు మన దేశాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కలిసి ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజుల ఫ్లాప్ సినిమా రీరిలీజ్ అవుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ, శ్రావస్తిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఉగ్రవాదంతో మనల్ని భయపెట్టాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తిండి లేక అల్లాడుతోందని చెప్పారు. పాకిస్తాన్ పని అయిపోయిందని తేల్చిచెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ సానుభూతిపరులైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మనల్ని బెదిరించడంలో బిజీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉంటే, ఇండియాలో 56 అంగుళాల ఛాతీ ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలను చూసి బెదిరిపోవడానికి ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, బలమైన మోదీ ప్రభుత్వమని స్పష్టంచేశారు. -
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల పోరు పశి్చమ యూపీ నుంచి యాదవ భూమికి చేరింది. బ్రజ్, రోహిఖండ్ ప్రాంతాల్లోని 10 లోక్‌సభ స్థానాలకు 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. యాదవులు, ముస్లింలు ఒక్కటైతే అక్కడ వారి తీర్పే ఫైనల్. వారి ఓట్లపైనే ఆశలు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీకి మూడో విడత అగ్నిపరీక్ష కానుంది. యూపీలో తొలి రెండు విడతల్లో జాట్ బెల్ట్‌గా భావించే పశి్చమ యూపీలోని 16 స్థానాలకు పోలింగ్ ముగియడం తెలిసిందే... సంభల్ యాదవ ఆధిపత్య స్థానమిది. దివంగత ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ 1998, 1999ల్లో ఇక్కడి నుంచే లోక్‌సభకు వెళ్లారు. 2004లోనూ ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత సత్యపాల్ సింగ్ సైని గెలిచారు. 2019లో ఎస్పీ నేత షఫీకుర్ రెహమాన్ బార్క్ భారీ విజయం సాధించారు. ఆయన అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈసారి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే జియావుర్ రెహమాన్‌కు ఎస్పీ టికెటిచి్చంది. బీజేపీ మళ్లీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర్ లాల్ సైనీనే రంగంలోకి దింపింది. బీఎస్పీ నుంచి షౌలత్ అలీ పోటీ చేస్తున్నారు.హథ్రస్ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం 1991 నుంచీ బీజేపీ కంచుకోట. కాంగ్రెస్ అయితే 1971 తర్వాత ఇక్కడ ఎన్నడూ గెలవలేదు! ఇక ఎస్పీ, బీఎస్పీ ఈ స్థానంలో ఒక్కసారి కూడా గెలుపు ముఖమే చూడలేదు! 2009లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆరెల్డీ ఇక్కడ విజయం సాధించింది. 2019లో ఎస్పీ అభ్యర్థి రామ్‌జీ లాల్ సుమాన్‌పై బీజేపీ అభ్యర్థి రాజ్వీర్ సింగ్ దిలార్ 2.6 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 66 ఏళ్ల దిలార్ ఏప్రిల్ 24న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో బీజేపీ టికెట్ అనూప్ ప్రధాన్‌కు లభించింది. ఎస్పీ తరఫున జస్వీర్ వాలీ్మకి పోటీ చేస్తున్నారు.బరేలీ కేంద్ర మాజీ మంత్రి సంతోష్ గంగ్వార్ ఇక్కడి నుంచి ఎనిమిదిసార్లు బీజేపీ తరఫున గెలిచారు! ఒక్క 2009 మినహాయిస్తే 1989 నుంచి అన్ని ఎన్నికల్లో గంగ్వార్దే గెలుపు! ఈసారి మాత్రం బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది. అదే సామాజిక వర్గానికి చెందిన ఛత్రపాల్ సింగ్ గంగ్వార్‌కు టికెటిచి్చంది. ఎస్పీ నుంచి ప్రవీణ్ సింగ్ అరాన్ బరిలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి చోటేలాల్ గంగ్వార్ నామినేషన్ తిరస్కరణకు గురవడం ఆ పారీ్టకి షాకిచి్చంది. దీంతో ఇక్కడ ద్విముఖ పోటీయే నెలకొంది.ఫతేపుర్ సిక్రీ 2009లో ఈ స్థానాన్ని బీఎస్పీ సొంతం చేసుకుంది. గత రెండు ఎన్నికల నుంచి మాత్రం బీజేపీదే విజయం. 2019లో ఆ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ చాహర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్‌కు 1.72 లక్షల ఓట్లు పోలైతే, చాహర్ ఏకంగా 6.67 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు! దాంతో ఈ విడత కూడా చాహర్‌కే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రామ్‌నాథ్ సికర్వార్, బీఎస్పీ నుంచి రామ్నివాస్ శర్మ పోటీలో ఉన్నారు. ఎస్పీ మాజీ నేత భగవాన్ శర్మ (గుడ్డూ పండిట్) స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో ఉండటం కాంగ్రెస్‌కు ప్రతికూలం కానుంది.బదాయూ ఎస్పీకి కీలకమైన స్థానమిది. 1996 నుంచి 2014 దాకా ఆ పారీ్టకి కంచుకోట. 2009, 2014ల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ నెగ్గారు. 2019లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య ఆయనపై కేవలం 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విడత దురి్వజయ్ శాక్యను బీజేపీ పోటీలో దించింది. ఎస్పీ కూడా సీనియర్ నేత శివపాల్ యాదవ్ ఒత్తిడితో ఆయన కుమారుడు ఆదిత్యకు టికెటిచ్చింది. ధర్మేంద్ర యాదవ్‌ను పక్కన పెట్టడం దానికి ప్రతికూలంగా మారొచ్చంటున్నారు.ఫిరోజాబాద్ ఇదీ ఎస్పీ ఆధిపత్యమున్న స్థానమే. 2009లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, 2014లో ఆయన సోదరుడు అక్షయ్ యాదవ్ విజయం సాధించారు. 2019లో మాత్రం ఫిరోజాబాద్ బీజేపీ పరమైంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రసేన్ జడాన్ 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి అక్షయ్ యాదవ్‌పై గెలిచారు. ఈసారి ఎస్పీ నుంచి మళ్లీ అక్షయ్ బరిలో ఉన్నారు. బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎంపీని మార్చి విశ్వదీప్ సింగ్‌కు టికెటిచి్చంది.ఎటా ఆది నుంచీ బీజేపీని ఆదరిస్తున్న స్థానమిది. 1999, 2004 ఎన్నికల్లో మాత్రం ఎస్పీ నెగ్గింది. 2009 ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం విశేషం! ఆయన కుమారుడు రాజ్వీర్సింగ్ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ తరఫున దవేశ్ శాక్య, బీఎస్పీ నుంచి మహమ్మద్ ఇర్ఫాన్ బరిలో ఉన్నారు.ఆవ్లా 1989 నుంచి బీజేపీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 2009 నుంచి ఆ పారీ్టకే ఇక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన ధర్మేంద్ర కశ్యప్‌కే ఈసారి కూడా బీజేపీ టికెట్ దక్కింది. ఎస్పీ నుంచి నీరజ్ మౌర్య, బీఎస్పీ తరఫున అబిద్ అలీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2014లో ఎస్పీ, 2019 ఎన్నికల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచాయి.బీజేపీ హవా కొనసాగేనా!? మూడో విడతలో పోలింగ్ జరిగే 10 స్థానాల్లో ఎనిమిది 2019లో బీజేపీ గెలుచుకున్నవే. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి బరిలో దిగగా బీఎస్పీ ఒంటరి పోరు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాటి మధ్య చీలితే బీజేపీ లాభపడనుంది. ఈ 10 లోక్‌సభ స్థానాల్లో ముస్లింలతో పాటు ఓబీసీలు, ముఖ్యంగా యాదవ్‌ల పాటు ఓట్లు ఎక్కువ. ఎటా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, బుదౌన్, సంభాల్ యాదవ ప్రాబల్య స్థానాలు. సంభాల్, ఆవ్లా, ఫతేపుర్ సిక్రీ, ఆగ్రా, ఫిరోజాబాద్‌ల్లో ముస్లిం ఓటర్లు 13 శాతమున్నారు. బరేలీలోనైతే ఏకంగా 33 శాతం దాకా ఉంటారు! ఇతర లోక్‌సభ స్థానాల్లో లోధ్, కచి్చ, శాక్య, మురావోల ప్రాబల్యమూ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
దివంగత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరుణంలో శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్‌పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు. శివపాల్ యాదవ్‌కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్ యాదవ్ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెయిన్‌పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్ స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్‌కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. -
లోక్‌సభ ఎన్నికల తరుణంలో.. సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లోక్‌సభ ఎన్నికల తరుణంలో సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగలింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోకి చెందిన కీలక నేతలు బీజేపీ చేరారు.సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జై చౌబే, బలరామ్ యాదవ్, జగత్ జైస్వాల్ సహా పలువురు నేతలు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, పలువురు జిల్లా అధ్యక్షులు ఈరోజు బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీపై ప్రజలకు చేరువైంది. ఆయన నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం కృషి చేస్తాం. అందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పాఠక్ అన్నారు. -
బీజేపీ ఆటనే.. మేమూ మొదలుపెట్టాం!
లక్నో : తాజా ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేనివారిని తాజా ఉప ఎన్నికలు ఓడించాయని ఆయన చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ ఆడుతున్న ఆటను.. తాము కూడా ఆడుతున్నామని, విపక్షాలను చీల్చి గండి కొట్టాలన్న బీజేపీ ఎత్తుగడలకు బ్రేక్ వేశాయని ఆయన అన్నారు. గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ‘బీజేపీ మాతో ఆడుతున్న ఆటనే.. మేం ఆ పార్టీ నుంచి నేర్చుకొని.. ఆడుతున్నాం. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఏమైంది? రుణమాఫీ కాదు రైతుల ప్రాణాలను బీజేపీ సర్కారు బలిగొంటోంది. ఇది పెద్ద మోసం’ అని అఖిలేశ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 55వేల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్ఎల్డీకి మద్దతునిచ్చాయి. మరోవైపు నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ నియోజకవర్గమైన ఇక్కడ ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. -
‘యోగి.. నువ్వేం ముఖ్యమంత్రివి?’
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని యోగికి రామ్ గోపాల్ సూచించారు. (సల్మాన్ గెటప్‌లో యోగి.. వైరల్) శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత.. యోగి పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘లేపేస్తాం.. చంపి పడేస్తాం’ అంటూ యోగి మాట్లాడుతున్నారు. ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. ఆయన అధికారంలోకి వచ్చాక ఫేక్ ఎన్కౌంటర్లు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అమాయకులు ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు’ అని రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ముజఫర్ నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకడు తప్పించుకుని పోయాడు. ఈ కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడగా.. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామ్‌గోపాల్ యాదవ్ యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీహర్‌లో బీజేపీ-జేడీయూ కూటమికి షాక్
-
రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని.. బీజేపీలోకి జంప్!
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాంరాం చెప్పి సోమవారం బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి, పార్టీ నేత పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన సోమవారం కమలం కండువా కప్పుకున్నారు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిన నరేశ్ అగర్వాల్ పార్టీ మారారు. సమాజ్‌వాదీ పార్టీలో నరేశ్ అగర్వాల్ అత్యంత సీనియర్ నేత. ఆయన ఏడుసార్లు హర్దోయి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత కొన్నాళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నరేశ్ పార్టీని వీడటం.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
అక్కడ విపక్షాల అనైక్యత బీజేపీకి వరం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం ఎవరిదే ముందే తేలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు సంయుక్తంగా బీజేపీకి పళ్లెంలో పెట్టి అందిస్తున్నాయని చెప్పవచ్చు. గతేడాది ఉత్తరప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఇకముందు కలిసికట్టుగా పోటీ చేయాలని ఈ మూడు పార్టీల నాయకులు ప్రకటించారు. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేయగా, బీఎస్పీ విడిగా పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈసారి గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేస్తాయని, తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పాలకపక్ష బీజేపీకి ఓ సవాల్‌ను విసురుతాయని రాజకీయ పరిశీలకులు భావించారు. సాక్షి ప్రత్యేకం. ఈసారి ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. ఆయన మొండితనం తెలిసిన కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ నాయకురాలు మాయావతిని కదిపి చూసింది. ఆమె ఎలాంటి ఐక్యతా పిలుపునకు స్పందించలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలోపెట్టుకొని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ గోరఖ్‌పూర్ నుంచి సంతోష్ నిషాద్, ఫూల్పూర్ నుంచి నాగేంద్ర పటేల్‌ను రంగంలోకి దించింది. గోరఖ్‌పూర్‌లో నిషాద్ కులస్థులు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని, ఫూల్పూర్లో కుర్మీలు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ గోరఖ్‌పూర్ నుంచి సుర్హీత ఛటర్జీ కరీంను, ఫూల్పూర్ నుంచి మనీష్ మిశ్రాను బరిలోకి దింపింది. బీఎస్పీ నాయకురాలు మాయావతి మాత్రం ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.సాక్షి ప్రత్యేకం. యూపీలోని ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతగా తీవ్రంగా ప్రయత్నించిందీ ఒక్క కాంగ్రెస్ పార్టీనే. ప్రతిపక్షాల ఐక్యత వల్ల లాభపడేది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే కావడంతో ప్రాంతీయ పార్టీలు, ఇతర చిన్న పార్టీలు పట్టించుకోలేదు. 2014లో జరిగిన లోక్‌సభ, ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీనే బాగా దెబ్బతిన్నప్పటికీ ఐక్యత కోసం మాయావతి కలిసి రావడం లేదు. ఆమె నిర్ణయాలు ఎవరికి అర్థం కాకుండా ఉంటున్నాయి. పొత్తుకు అంగీకరించని ఆమె ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎలాగూ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లయితే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో విజయం బీజేపీ అభ్యర్థులదేనని ఎవరైనా చెప్పవచ్చు! -
'అదంతా టైం వేస్ట్.. ఇప్పటికే హర్ట్ అయ్యా'
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న అఖిలేశ్ యాదవ్ కాస్త చిరాకుతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులు అనేవి సమయం వృధా చేసే పనులు అని, సీట్ల పంపిణీ విషయంలో పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెడతాయని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై బుధవారం అఖిలేశ్ స్పందిస్తూ తన గురి మొత్తం ఇప్పుడు ఆ ఎన్నికలపైనే అన్నారు. 2019 ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నామని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సమాజ్‌వాది పార్టీని బలోపేతం చేయడమేనని అన్నారు. '2019 ఎన్నికల ద్వారా ఉత్తరప్రదేశ్ నుంచి దేశం మొత్తానికి ఓ సందేశం వెళ్లనుంది. ఇప్పుడు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే విషయాన్ని నేను ఆలోచించడం లేదు. అదంతా కూడా సమయం వృధా. ఇక నేను తికమక అవ్వాలని అనుకోవడం లేదు. అయితే, పొత్తులు గురించి కాకుండా మాలాగే ఆలోచించే పార్టీతో స్నేహం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాము' అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ పొత్తుపెట్టుకొని పనిచేసి ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. -
వీడియో సాక్ష్యం.. చిక్కుల్లో నటుడు సంజయ్!
-
సమాజ్‌వాదీ ముసలం.. ముగియలేదా?
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములాయం కుటుంబంలోని గొడవలతో సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ములాయం, తనయుడు అఖిలేష్‌ల వర్గాలుగా చీలిపోయిన పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించుకోగా.. ఒకానోక టైంలో తనను తాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ ప్రకటించుకోవటం.. సైకిల్ గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించటం లాంటివి చూశాం. చివరకు పరిస్థితి సర్దుమణిగినా.. పార్టీకి భారీ ఓటమి మాత్రం తప్పలేదు. ఇదిలా ఉంటే నాలుగైదు నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ పార్టీలో పరిస్థితులు ఏం మారలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23న రాష్ట్ర సర్వసభ్య సమావేశం, అక్టోబర్ 5న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ యువనేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. అయితే విభేధాల అనంతరం భారీ స్థాయిలో నిర్వహించబోతున్న పార్టీ సమావేశాల విషయంలో నేతాజీ ములాయం పేరు ప్రస్తావన రాకపోవటం విశేషం. ములాయం వర్గీయులకు కూడా ఈమేర ఆహ్వానం అందలేదనే తెలుస్తోంది. మరోవైపు ములాయం సింగ్ నేతృత్వంలో ఈ నెల 21న లొహియా ట్రస్ట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రస్ట్ 11 మంది సభ్యుల్లో తనయుడు అఖిలేష్‌తోపాటు, సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్‌లు కూడా ఉన్నారు. అయినప్పటికీ మొన్నామధ్య నిర్వహించిన సమావేశాలకు వీరిద్దరూ హాజరుకాకపోవటంతో.. త్వరలో నిర్వహించబోయేదానిపై కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటంతో సమాజ్‌వాదీ పార్టీ అధికార జగడం ఇంకా సర్దుమణగలేదనే చెప్పుకుంటున్నారు. -
అమర జవాన్ భార్యను అవమానించిన అఖిలేష్
సాక్షి, లక్నో: సమాజ్ వాదీ పార్టీ యువ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమర జవాన్ కుటుంబాన్ని అవమానించాడంటూ విమర్శలు మొదలయ్యాయి. ఒకరికి బదులుగా మరోకరికి సన్మానం చేయటమే అందుకు కారణం. 1965 ఇండో-పాక్ యుద్ధంలో అబ్దుల్ హమీద్ అనే జవాన్ చనిపోగా, ఆరు రోజుల తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అజంఘడ్ జిల్లా నాథ్‌పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమీద్ భార్య రసూలన్ బీబిని అఖిలేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అయితే ఆ వార్తను టీవీల్లో చూసిన హమీద్ అసలు భార్య రసూలన్ షాక్‌కి గురైంది. అఖిలేష్ సన్మానం చేసింది ఎవరికోనని, అసలు ఆ రోజంతా తాను ఇంట్లోనే ఉన్నానని 90 ఏళ్ల రసూలన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆమె మనవడు కూడా ధృవీకరించాడు. ఇక విషయం ఆ నోటా ఈ నోటా పాకి బీజేపీ చెవిన పడటంతో అఖిలేష్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ వీరుడి కుటుంబాన్ని ఘోరంగా అవమానించారంటూ సమాజ్ వాదీ చీఫ్ పై మండిపడింది. అంతేకాదు సెప్టెంబర్ 10న రసూలన్ను తాము ఘనంగా సత్కరించబోతున్నామని బీజేపీ ప్రకటించింది. తప్పు జరిగిపోయింది: సమాజ్‌వాదీ పార్టీ సన్మాన కార్యక్రమంలో తప్పు జరిగిపోయిందన్న విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఒప్పుకుంది. నిజానికి అక్కడ రామ్ సముజ్ యాదవ్ అనే అమర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించాం. రసూలన్ బిబి పేరు జాబితాలో ఉండగా మైక్‌లో నిర్వాహకులు పేరు చదివారు. వెంటనే ఓ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు వేదికపైకి రావటంతో ఆమెకు అఖిలేష్ సన్మానం చేశారు. ఆమె రసూలన్ అవునో.. కాదో... నిర్ధారణ చేసుకోకపోవటం మా తప్పే. ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాం అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతేకాదు త్వరలో పార్టీ తరపున ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎమ్మెల్సీల రాజీనామా.. సీఎంకు లైన్‌క్లియర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లైన్ క్లియర్ అయింది. ఆయన ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. శాసనమండలిలో ఆయన అడుగుపెట్టేందుకు వీలుగా ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్సీలు రాజీనామా చేసి.. మార్గం సుగమం చేశారు. శాసనమండలి సభ్యులైన బుక్కాల్ నవాబ్, యశ్వంత్ సింగ్ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. మరింతమంది రాజీనామా చేసే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు స్వతంత్రదేవ్ సింగ్, మోసిన్ రజాలు శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నికకావాల్సి ఉంది. వీరికి రెండు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానిక మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఎంపీలుగా ఉన్న సీఎం యోగి, డిప్యూట్యీ సీఎం మౌర్య తమ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. గత ముఖ్యమంత్రులైన మాయావతి, అఖిలేశ్ యాదవ్ సైతం ఇదేవిధంగా ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టారు. -
దేవుళ్లను అవమానించారు!
♦ రాజ్యసభలో ఎస్పీ ఎంపీ అగర్వాల్ వ్యాఖ్యపై దుమారం ♦ క్షమాపణకు అధికార పక్షం డిమాండ్ ♦ సభ రెండుసార్లు వాయిదా.. ఎట్టకేలకు దిగొచ్చిన నరేశ్ అగర్వాల్.. ♦ మన్ కీ బాత్ ఆపండి.. రుణాల్ని మాఫీ చేయండి: లోక్‌సభలో విపక్షాలు న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లపై రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు బుధవారం తీవ్ర దుమారం సృష్టించాయి. హిందూ దేవుళ్లను ఆల్కహాల్ బ్రాండ్లతో అగర్వాల్ పోల్చారని, సభ వెలుపల ఆయన ఆ వ్యాఖ్యలు చేసుంటే తప్పకుండా కేసు పెడతారని సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా తప్పుపట్టారు. ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ, ఇతర మిత్రపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ.. ఆయన క్షమాపణకు పట్టుబట్టాయి. అందుకు అగర్వాల్ నిరాకరించడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం సమావేశమయ్యాక ఆయన క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ‘దళితులు, మైనార్టీలపై పెరుగుతున్న హత్యాచారాలు, దాడులు’ అంశంపై చర్చ సందర్భంగా అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ‘మీరు వాడిన మాటల తీవ్రత ఇంకా గుర్తించలేదు. ఇతర మతాల దేవుళ్ల గురించి అలా మాట్లాడేందుకు మీరు సాహసించగలరా?’ అని ప్రశ్నించారు. అగర్వాల్ వ్యాఖ్యల్ని డిప్యూటీ చైర్మన్ వినకపోవడంతో రికార్డుల పరిశీలనకు సభను 10 నిమిషాలు వాయిదావేశారు. అనంతరం భేటీ కాగానే కురియన్ మాట్లాడుతూ ‘అగర్వాల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే ఆ వ్యాఖ్యల్ని ఎక్కడా వాడవద్దని మీడియాకు సూచించారు. ఇంతలో అగర్వాల్ లేచి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటానని చెప్పగా.. ‘దేవుళ్లని అవమానిస్తే ఊరుకోం’ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార సభ్యుల నిరసనలతో సభ వాయిదాపడింది. అనంతరం సమావేశమయ్యాక.. తన వ్యాఖ్యలకు అగర్వాల్ క్షమాపణలు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఏ కుల, మత విశ్వాసాల్ని అవమానించలేదని వివరణ ఇచ్చారు. రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించింది రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించిందన్న ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ మార్మోగింది. రైతుల దుస్థితిని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ‘మన్ కీ బాత్ బంద్ కరో, కర్జా మాఫీ షురూ కరో’(రేడియోలో మాట్లాడడం ఆపి.. రైతు రుణ మాఫీ మొదలుపెట్టండి) అని నినాదాలు చేశారు. బీజేపీ మిత్రపక్షం స్వాభిమాని ప„Š (ఎస్డబ్లు్యపీ) ఎంపీ రాజు షెట్టీ కూడా విపక్షాలతో జతకలిశారు. దీంతో సభ ప్రారంభంలోనే గంట వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని, రైతు రుణాల మాఫీతో పాటు.. పెట్టుబడి ఖర్చుల్లో 50 శాతం కంటే ఎక్కువ చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. 193వ నిబంధన కింద చర్చకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ చెప్పా రు. ప్రభుత్వ సమాధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వాకౌట్ చేశారు. ‘గోరక్షణ’పై రాష్ట్రాలకు పూర్తి అధికారం ‘గోరక్షణ’ పేరిట హత్యలపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలాంటి సంఘటనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ సమాధానంపై ఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. వెల్‌లోకి దూసుకెళ్లారు. పాకిస్తాన్‌తో కలసి భారత్‌పై దాడి చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని మాజీ రక్షణ మంత్రి, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభలో పేర్కొన్నారు. అలాంటి ముప్పు ఎదురైతే ఎలా ఎదుర్కొంటారో పార్లమెంట్‌కు చెప్పాలని ఆయన కోరారు. ట్రిపుల్ ఐటీలకు చట్టబద్ధ హోదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)లకు చట్టబద్ధ హోదా కల్పిస్తూ పెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పేద విద్యార్థుల ఫీజులు పెంచబోమని, రిజ్వరేషన్ల చట్టం వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.‘ద ట్రిపుల్ ఐటీ (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) బిల్లు’లో భాగంగా 15 ట్రిపుల్ ఐటీల్ని ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్’గా పరిగణిస్తారు. -
అపర్ణా యాదవ్ సంస్థకు 86% ‘నిధులు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గో సంరక్షణకు కేటాయించిన నిధుల్లో 86 శాతం డబ్బులు అపర్ణ యాదవ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఖాతాలోకి చేరాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ప్రభుత్వం తాజాగా ఈ వివరాలు వెల్ల డించింది. నాటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు తమ్ముడు ప్రతీక్ యాదవ్ భార్యనే అపర్ణ. గో సంరక్షణకు కేటాయించిన నిధుల వివరాలు తెలపాలంటూ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ భార్య నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. 2012 నుంచి 2017 మధ్య యూపీ ప్రభుత్వం మొత్తం రూ.9.66 కోట్లను గో సంరక్షణకు కేటాయించగా, అందులో రూ.8.35 కోట్లను అపర్ణ నడిపే జీవ్ ఆశ్రయ అనే సంస్థకు కేటాయించింది. -
అఖిలేష్.. ఇక చాలు దిగిపో!
తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ రగడ మొదలైంది. తన కొడుకు అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు. పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను అఖిలేష్ నెరవేర్చలేకపోయారని ములాయం విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేటప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ తనకు తిరిగి అప్పగిస్తానని అఖిలేష్ చెప్పాడని ఆయన ఆగ్రాలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. తనకు పదవుల మీద ఆశ లేదని, అయితే అఖిలేష్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో జాతీయ మీడియా అతడినే అడగాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏంటని అడిగితే మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. వాస్తవానికి ములాయం జాతీయాధ్యక్షుడిగా ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఆ విషయం తనకు పెద్దగా తెలియదని ములాయం అన్నారు. -
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
-
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
తన పేరు చెప్పేటప్పుడు ఆ యువకుడి గొంతులో కాస్తంత గర్వం తొణికిసలాడింది. ''నా పేరు మోహిత్ యాదవ్..'' అంటూనే ఒక్కసారిగా అక్కడున్న పోలీసు అధికారి చెంప మీద కొట్టాడు. తన మేనమామ పేరు చెప్పుకొంటూ అతగాడు రెచ్చిపోయాడు. ఎందుకంటే అతడి మేనమామ ఉత్తరప్రదేశ్‌లోని ఇటా నియోజకవర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ!! మోహిత్ యాదవ్ అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. తనను స్టేషన్‌కు పిలిపించినందుకు అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో ఎస్ఐ జితేంద్ర కుమార్‌ను లాగి ఒక్కటిచ్చాడు. అక్కడున్న మిగిలిన పోలీసులు అతడిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా, వాళ్లలో ఒకరి కాలర్ పట్టుకున్నాడు. పోలీసు అధికారుల విధి నిర్వహణను అడ్డుకున్నందుకు యాదవ్‌ను అరెస్టు చేశారు. మోహిత్ యాదవ్ మామ రమేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. యూపీ ఎన్నికల సమయంలో ఆయనను బీజేపీ తమ పార్టీ నుంచి తప్పించింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు చాలావరకు జరిగాయి. రాజకీయ నాయకులు, వాళ్ల బంధువులు పలువురు అధికారుల మీద దాడులు చేసేవారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇలా ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మోహిత్ యాదవ్ నిరుద్యోగి. వాళ్ల నాన్నకు తుపాకుల దుకాణం ఉంది. మోహిత్ పొద్దున్న ఆస్పత్రికి వెళ్లి, తన బంధువుకు ఎక్స్‌రే తీయించుకోడానికి వీఐపీ ట్రీట్మెంట్ కావాలని డిమాండ్ చేశాడు. వాళ్లను వెంటనే చూడాలని, క్యూలో వేచి ఉండేది లేదని అన్నాడు. అలా కుదరదని అక్కడి సిబ్బంది చెప్పడంతో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను కొట్టడంతో పాటు డాక్టర్ మీద కూడా దాడి చేశాడు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు చెప్పడంతో వాళ్లొచ్చి అతడిని స్టేషన్‌కు లాక్కెళ్లారు. అక్కడ కూడా అలాగే చేయడంతో లోపల వేశారు. అతడు బాగా తాగినట్లు తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ చెప్పారు. -
శివపాల్ సన్నిహితులపై వేటు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. శివపాల్ యాదవ్‌కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై వేటు పడింది. మహ్మద్ షాహిద్, దీపక్ మిశ్రా, కల్లు యాదవ్, రాజేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్ సహా ఆరుగురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. 'సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా' అనే పేరుతో కొత్త పార్టీ పెడుతున్న ములాయం సింగ్ తమ్ముడు, శివపాల్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మద్దతుదారులపై వేటు వేయడం గమనార్హం. స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులెవరో రాజకీయాల్లో ఉన్న తమకు బాగా తెలుసునని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషం. తన కొడుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశానని అంతకుముందు ములాయం సింగ్ అన్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి పార్టీని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. -
ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వేదికపై చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరికీ ఆసక్తి కలిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌ను పలకరించగా.. ఆయన మోదీ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పారు. పక్కనే ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. మోదీలో చెవిలో ములాయం ఏం చెప్పారన్న దానిపై అప్పట్లో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ బయటపెట్టారు. 'నేతాజీ (ములాయం) ప్రధాని మోదీతో.. కాస్త చూసుకోండి, ఇతను నా కొడుకు అఖిలేష్ అని చెప్పారు' అని అఖిలేష్ వెల్లడించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తాను నమ్మింది చెబుతున్నాని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎస్పీ ఓడిందని అఖిలేష్ ఆరోపించారు. -
ములాయం కొత్త పార్టీ!!
-
ములాయం కొత్త పార్టీ!!
కన్న కొడుకుతో విభేదాలు.. తమ్ముడికి అందలం.. చివరకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగింపు.. ఇంతటి ఘోర అవమానాలను చూసిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్.. పాతికేళ్ల తర్వాత మళ్లీ కొత్త పార్టీ పెడుతున్నారు. అన్నయ్య ములాయం సింగ్ నేతృత్వంలో 'సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా' అనే ఈ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన తమ్ముడు, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. నేతాజీకి ఆయన గౌరవం తిరిగి ఇప్పించడానికి, సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాళ్లందరినీ మళ్లీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నామని శివపాల్ యాదవ్ చెప్పారు. సుమారు పాతికేళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో విభేదాలతో ఒక విధంగా రోడ్డున పడ్డారు. తాను స్థాపించిన పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించినా.. ప్రచారపర్వంలో మళ్లీ ఆ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. కేవలం తన తమ్ముడు పోటీ చేసిన నియోజకవర్గంతో పాటు చిన్నకోడలు పోటీ చేసిన లక్నో కంటోన్మెంటు స్థానంలో మాత్రమే ములాయం ప్రచారం చేశారు. అందులో చిన్నకోడలు అపర్ణాయాదవ్ ఓడిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు అధికారం లేక, అటు పార్టీ మీద కూడా పట్టులేకుండా ఎందుకని అనుకున్నారో ఏమో.. చివరకు సొంత పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీని పెట్టినప్పుడు తనకు తోడుగా ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నవారిలో ఎంతమంది ములాయం వెంట వస్తారో చూడాల్సి ఉంది. ఈ వయసులో మళ్లీ ఆయన రాష్ట్రమంతా తిరిగి కొత్త పార్టీకి ప్రచారం చేసి, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం కూడా ఎంవతరకు సాధ్యమో తెలియాల్సి ఉంది. -
జనం మెచ్చని జోడీ.. విడాకులే దారి
- ఎస్పీతో కాంగ్రెస్ తలాక్ లక్నో: ‘ఈ జోడీ ప్రజలకు నచ్చింది.. బంపర్ మెజారిటీ గెలిపిస్తారు..’ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ మధ్య పొత్తుపై సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలివి. సీన్ కట్‌చేస్తే ‘జనం మెచ్చని జోడీకి విడాకులే దారి.. ఎస్పీతో పొత్తుకు రాంరాం..’ అని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు! ఆదివారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మీడియాకు చెప్పారు. యూపీ వ్యవహారాల ఇన్చార్జి గులామ్ నబీ ఆజాద్ సహా కీలక నేతల సమక్షంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అఖిలేశ్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల.. ఆయనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా దారుణంగా నష్టపోయిందని భేటీలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ‘3కే’ ఫార్ములాకు పునరంకితం.. సమాజ్‌వాదీ పార్టీతో తెగదెంపుల అనంతరం తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించిన ‘3కే’ ఫార్ములాకు పునరంకితం అవుతున్నట్లు యూపీ కాంగ్రెస్ ప్రకటించింది. కోల్పోయిన చరిష్మాను తిరిగి సాధించుకోవడం కాంగ్రెస్‌కు తెలుసని, అతి త్వరలోనే నేలకు కొట్టిన బంతిలా దూసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ సూచించిన ‘కార్యకర్త.. కార్యాలయం.. కార్యక్రమం..’ అనే 3కే ఫార్ములాతో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం కలుగజేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. -
ఆ ప్రశ్న అడగ్గానే.. అఖిలేష్‌కు కోపం వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశంలో సహనం కోల్పోయారు. పార్టీ పగ్గాలను తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు అప్పగించాలంటూ బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన ప్రతిపాదన గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అఖిలేష్‌కు కోపం వచ్చింది. 'ఈ విలేకరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు. ఆయన చొక్కా కూడా కాషాయ రంగులో ఉంది. అతనితో పాటు ఇతర జర్నలిస్టులకు చెబుతున్నా.. మేలో ఏ తేదీ అయినా నిర్ణయించుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. అయితే ఆ తర్వాత మీరు నా కుటుంబం గురించి ఏ ప్రశ్న కూడా అడగరాదు' అని అఖిలేష్ అన్నారు. నీలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమవుతోందని, దేశం నాశనమైతే నీవు కూడా ఉండవంటూ ఆ విలేకరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ మీడియా సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అఖిలేష్ భద్రత సిబ్బంది ఓ సీనియర్ జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్, శివపాల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగిన సంగతి తెలిసిందే. ములాయం తన సోదరుడు శివపాల్ వర్గానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎస్పీ చీఫ్‌గా ఉన్న ములాయంను పదవి నుంచి తొలగించి, అఖిలేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఆయన వర్గీయులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వర్గాలు రాజీపడ్డాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలేష్ స్థానంలో ములాయంకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని వారి కుటుంబంలో డిమాండ్లు వస్తున్నాయి. -
సమాజ్‌వాదీ రాష్ట్ర అధ్యక్షుడిగా సింహాద్రి
సాక్షి, హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో సోమనబోయిన రామలింగయ్య, భద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా సింహాద్రి జన్మించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు నల్లగొండలో, పీజీ, పీహెచ్డీ ఉస్మా నియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. 35 ఏళ్ల పాటు ఓయూలో ఫ్రొఫెసర్‌గా పని చేశారు. 30 ఏళ్ల నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమంపై 1996 నుంచి ప్రొఫెసర్ జయశంకర్‌తో కలసి అనేక పుస్తకాలు రాశారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రోడ్డు మ్యాప్ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. ఓబీసీ స్థితిగతులపై అనేక పరిశోధనలు చేయడమే కాకుండా, పుస్తకాలూ ప్రచురించారు. ‘మండలి ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి–రాజకీయాలు’ వంటి సమకాలిన అంశాలపై పుస్తకాలు రాశారు. ఓబీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. -
మాజీ సీఎం విద్యుత్ బకాయి రూ.4 లక్షలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీఐపీ సంస్కృతికి చెక్ పెట్టడంతో విద్యుత్ శాఖ సిబ్బంది మొండి బకాయిలను వసూలు చేసేందుకు తనిఖీ నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 4 లక్షల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించలేదని గుర్తించారు. ఎతావ్లోని ములాయం ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. రోజుకు 5 కిలోవాట్ల విద్యుత్ వాడేందుకు అనుమతి ఉండగా, ములాయం ఇంట్లో ఎనిమిది రెట్లు ఎక్కువగా వాడుతున్నట్టు గుర్తించారు. ఈ నెలలోపు విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు గడువు విధించారు. ములాయం సొంత నియోజకవర్గమైన ఎతావ్లో సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆయనకు సువిశాలమైన బంగ్లా ఉంది. 12 గదులు ఉన్న ఈ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్ ఉంది. -
‘బీజేపీని ఓడించేందుకు ఎవ్వరితోనైనా సై’
లక్నో: బీజేపీని ఓడించడమే తన లక్ష్యం అని బీఎస్పీ అదినేత్రి మాయావతి శపథం చేశారు. అందుకోసం ఏ పార్టీతోనైనా తాను చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. విషాన్ని(పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ) విషంతోనే దెబ్బకొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల కిందట సమాజ్‌వాది పార్టీతో పొత్తుపెట్టుకొని విడిపోయిన ఆమె ఈ వ్యాఖ్యల ద్వారా తొలిసారిగా బహిరంగంగా ఎస్పీతో పొత్తుకు కూడా స్వాగతం అంటూ పరోక్షంగా చెప్పారు. అంబేద్కర్ జయంతి మాట్లాడిన ఆమె భవిష్యత్తులో బహుజన ఉద్యమం తీసుకొచ్చేందుకు, మత శక్తులను నిలువరించేందుకు ఇతర పార్టీలతో సత్సంబంధాలు అవసరం అని ఆమె అన్నారు. అంతకుముందు సమాజ్‌వాది పార్టీ నేత రాజేంద్ర చౌదరీ మాట్లాడుతూ దేశంలో లౌకిక రాజకీయాలు రక్షించేందుకు మేం ఏమైనా చేస్తాం. విభజన శక్తులను అడ్డుకోవాలి. మాలాగా ఆలోచించే పార్టీలన్నీ కూడా కలిసి రావాలి. కావాలంటే బీఎస్పీ కూడా’ అని చెప్పారు. అయితే, అలాంటి కూటమి ఒకటి వస్తే దానికి నాయకత్వం ఎవరు వహిస్తారనే దానిపై మాత్రం బదులివ్వలేదు. -
'బావగారూ... మాట నిలబెట్టుకోండి'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్ష బాధ్యతలు ములాయం సింగ్ కు అప్పగించాలని అఖిలేశ్ యాదవ్ ను ఆయన మరదలు అపర్ణ యాదవ్ కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. ములాయంను పదవీత్యుడిని చేయడం తనను కలచివేసిందని వెల్లడించారు. ఈగో సమస్యల వల్లే ఎన్నికల్లో తాను ఓడిపోయానని చెప్పారు. 'అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తిరిగి అప్పగిస్తానని అఖిలేశ్ జనవరిలో చెప్పారు. తాను మాటమీద నిలబడే వ్యక్తినని అఖిలేశ్ చెబుతుంటారు. ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకుంటారని భావిస్తున్నాను. నేతాజీ బతికున్నంత వరకు మా ఇంట్లో ఆయన మాటే ఫైనల్. ఎన్నికలకు ముందు ఆయనను పరాభవానికి గురిచేయడం నన్ను కలచివేసింది. ఆయన కూడా చాలా బాధ పడ్డారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. కుటుంబమంతా కలిసివుండాలని కోరుకుంటున్నాను. మా పార్టీ ఎప్పుడు గెలవని లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేశాను. మేము నియమించిన బృందం ఈగో సమస్యలతో సమన్వయంతో పనిచేయలేదు. ఈ విషయాన్ని నేతాజీ, అఖిలేశ్ దృష్టికి తీసుకెళ్లినా వారేమీ చేయలేకపోయార'ని అపర్ణ యాదవ్ వివరించారు. -
ముఖ్యమంత్రితో బాబాయ్ మంతనాలు
లక్నో : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది నానుడి. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, రాజకీయ సమీకరణలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం హాట్ టాఫిక్‌గా మారింది. సుమారు అరగంటపాటు వీరిద్దరి మధ్య భేటీ కొనసాగింది. . ముఖ్యమంత్రి నివాసంలో జశ్వంత్‌నగర్ ఎమ్మెల్యే అయిన శివపాల్‌యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమే అని చెబుతున్నా, శివపాల్ ...సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం కొత్త చర్చలకు దారితీసింది. ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణ యాదవ్ పలుమార్లు యోగి ఆదిత్యనాథ్‌తో కలిసిన విషయం తెలిసిందే. త్వరలో అపర్ణయాదవ్ కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు శివపాల్ కూడా సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ములాయం కుటుంబసభ్యులు కమలానికి చేరువ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ.. అబ్బాయ్ అఖిలేష్, బాబాయ్ శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావలనుకున్న అఖిలేష్‌కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఎస్పీ ఓటమితో ములాయంతో పాటు శివపాల్ కూడా అఖిలేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడిన విషయం తెలిసిందే. -
సమాజ్‌వాదికి ఝలక్.. బీజేపీలోకి కీలక నేత
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీకి తాజాగా ఓ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చడం లేదంటూ ఎస్పీలో కీలక అధికార ప్రతినిధిగా పనిచేసిన గౌరవ్ భాటియా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఫిబ్రవరిలోనే సమాజ్‌వాది పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన తాజాగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ న్యాయవాదిగా ఉన్న గౌరవ్ భాటియా బీజేపీలో చేరకముందు సమాజ్‌వాది పార్టీ తరుపున జాతీయ చానెళ్లలో రాజకీయ చర్చల్లో పాల్గొనేవారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. విషయ పరిజ్ఞానంతోపాటు మంచి చతురత కలిగిన నాయకుడు అని కూడా గౌరవ్‌కు పేరుంది. అయితే, సమాజ్‌వాది పార్టీలో సామాజిక స్పృహ తగ్గిపోతుందని, సామ్యవాద భావాలు కొరవడుతున్నాయని, పరిపాలన కుటుంబానికి పరిమితమై పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పదవులకు తాను ఫిబ్రవరిలోనే రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. ‘నూతన భారత నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్రమోదీ కొత్త ఆలోచనను ఇస్తున్నారు. ఆయన ఆలోచన విధానమే నన్ను బీజేపీలో చేరేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని భాటియా తెలిపారు. అంకిత భావానికి, కలుపుగోలుతనానికి బీజేపీ పెట్టిందని కొనియాడారు. సమాజ్‌వాది పార్టీలో మాత్రం రాజకీయ కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, పార్టీపై పట్టుకోసం సాక్షాత్తు అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ పోటీ పడ్డారని గుర్తు చేశారు. ఇక నుంచి తాను కూడా భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు. గౌరవ్ భాటియా తండ్రి వీరేంద్ర భాటియా ములాయంసింగ్‌కు చాలా సన్నిహితుడు. ఆయన 2010లో చనిపోయారు. ములాయం సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. -
ఎస్పీకి ఝలక్.. బీజేపీలోకి జంప్!
చాలాకాలంపాటు సమాజ్‌వాదీ పార్టీకి గొంతుకగా టీవీ చర్చలలో ప్రముఖంగా కనిపించిన గౌరవ్ భాటియా తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్పీ పదవులకు రాజీనామా చేసిన భాటియా ఆదివారం కమలం కండువా కప్పుకున్నారు. ఎస్పీ అధికార ప్రతినిధిగా, ఆ పార్టీ లీగల్ వింగ్ అధ్యక్షుడిగా గతంలో భాటియా పదవులు నిర్వహించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పరాజయం పాలై.. అంతర్గత కుటుంబ విభేదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఆ పార్టీకి మీడియా ముఖంగా వ్యవహరించిన భాటియా తాజా చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొంతముందే గత ఫిబ్రవరిలో తాను ఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు భాటియా ఫేస్బుక్లో ప్రకటించారు. తన ప్రధాన సిద్ధాంతమైన సోషలిజానికి ఎస్పీ దూరం జరిగిందని, అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరుతారని గత రెండునెలలుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఆయన తాజాగా కమలం గూటికి చేరారు. -
అఖిలేశ్‌లా నన్నెవరూ అవమానించలేదు
-
అఖిలేశ్‌లా నన్నెవరూ అవమానించలేదు
ఎస్పీ చీఫ్ ములాయం ఆవేదన లక్నో: మాజీ సీఎం అఖిలేశ్‌లా ఇప్పటివరకు తననెవరూ అవమానించలేదని ఆయన తండ్రి, ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు శివ్పాల్నూ అగౌరవపరిచాడన్నారు. ‘తండ్రిని అవమానపరిచిన పుత్రుడు రాష్ట్ర ప్రజలకు ఎలా విధేయుడిగా ఉండగలడు’అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అఖి లేశ్పై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ములాయం ప్రస్తావించారు. మోదీ నిజమే చెప్పారని, తండ్రినే పట్టించుకోనివాడు ఇంకెవరికీ ఉపయోగపడలేడని శనివారం ఇక్కడ ఓ హోటల్ ప్రారంభోత్సవంలో ములాయంసింగ్ ఘాటుగా విమర్శించారు. మోదీ వ్యాఖ్యలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయని, ఎస్పీ పరాజయానికి నాంది పలికాయని చెప్పారు. ‘నాలా పూర్తిస్థాయి రాజకీయ జీవితంలో ఉన్న నేతలెవరూ తమ కుమారులను ముఖ్యమంత్రులను చేయలేదు. 2012 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు ఓటేసి గెలిపించినా అఖిలేశ్ యాదవ్‌ను ఆ పీఠంపై కూర్చోబెట్టా. కానీ అతను నన్ను తీవ్రంగా అవమానించాడు. నా రక్తమే నాకు వ్యతిరేకంగా మారింది’ అని ములాయం చెప్పుకొచ్చారు. తనపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌తో అఖిలేశ్ జతకట్టడం అత్యంత బాధాకరమన్నారు. -
ఢిల్లీలో అఖిలేష్, డింపుల్ ప్రచారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అఖిలేష్ దంపతులతో పాటు సినీ నటి, ఎంపీ జయా బచ్చన్, అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 76 మంది ప్రచారం చేస్తారని ఢిల్లీ ఎస్పీ చీఫ్ ఉషా యాదవ్ చెప్పారు. ఏప్రిల్ 23న జరిగే ఎంసీడీ ఎన్నికలకు ఎస్పీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. త్వరలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ఉషా యాదవ్ చెప్పారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ బరిలో ఉన్నాయి. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తారు. 2007 నుంచి ఎంసీడీని బీజేపీ పాలిస్తోంది. ఎంసీడీలో మొత్తం 272 కార్పొరేటర్ల స్థానాలున్నాయి. -
ములాయంకు ఎమ్మెల్యేల ఝలక్
-
ములాయంకు ఎమ్మెల్యేల ఝలక్
సమాజ్‌వాదీ పార్టీకి ఇంకా తానే పెద్ద అనుకుంటున్న ములాయం సింగ్ యాదవ్‌కు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు భారీ షాకిచ్చారు. వాళ్లందరితో ఓ సమావేశం ఏర్పాటుచేసి, వాళ్లకు భోజన ఏర్పాట్లు కూడా చేద్దామనుకున్న పెద్దాయనను కాదని, తాము ఉండబోయేది అఖిలేష్ యాదవ్‌తోనే అని తేల్చిచెప్పేశారు. దాంతో చిన్నబుచ్చుకున్న పెద్దాయన.. తాను ఏర్పాటుచేసిన సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున గత ఎన్నికల్లో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వాళ్లతో పాటు ఎమ్మెల్సీలు కూడా కలిసి తమ శాసనసభాపక్ష నాయకుడిగా అఖిలేష్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అఖిలేష్ యాదవ్ ఏర్పాటుచేసే సమావేశాలకు మాత్రమే వెళ్లాలి తప్ప పార్టీ తరఫున మరెక్కడికీ వెళ్లకూడదని సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే లలాయ్ సింగ్ ప్రతిపాదించారు. సమావేశంలో ఎక్కడా ములాయం పేరు ప్రస్తావనకే రాలేదు. జనవరి వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ములాయం నుంచి.. అఖిలేష్ యాదవ్ ఆ పదవి లాగేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ పగ్గాలను పూర్తిగా తన చేతిలో పెట్టుకుని కూడా అఖిలేష్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడక తప్పలేదు. అయినా సరే పార్టీ మీద మాత్రం తన ఆధిపత్యం కొనసాగించాలని అఖిలేష్ గట్టి పట్టుతో ఉన్నారు. అయితే.. అఖిలేష్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన బాబాయ్, ఎమ్మెల్యే శివపాల్ యాదవ్ డుమ్మా కొట్టారు. అలాగే తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆజంఖాన్ కూడా ఈ సమావేశానికి రాలేదు. అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయకపోవడంతో ఆజంఖాన్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. శాసనమండలిలో సభ్యుడిగా ఉన్న అఖిలేష్ యాదవ్.. ఆ హోదాతో శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యేందుకు, ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలకు కలిపి 325 స్థానాలు రాగా, రెండోస్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలే వచ్చాయి. -
ఆ రెండు పార్టీలు కూటమిలోకి వస్తేనే..
పట్నా: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకికవాద పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు ఈ కూటమిలోకి రావాలని సూచించారు. ఆదివారం పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో లాలు మాట్లాడుతూ.. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే ఇదే మార్గమమని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మహా కూటమి (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) విజయం సాధించడాన్ని ఉదాహరించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించగా, సమాజ్‌వాదీ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత లౌకికవాద పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాలని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఆర్జేడీకి మిత్రపక్షమైన జేడీయూ నేతలు కూడా ఇలాంటి సూచనే చేయగా.. తాజాగా లాలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. -
త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం
-
త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం
ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నుకుంటామని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మరీ ఎన్నికల్లో పోరాడినా బీజేపీ చేతిలో చావుదెబ్బ తినడానికి ప్రధాన కారణం యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతర్యుద్ధమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి గతంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవిని లాగేసుకున్న అఖిలేష్.. ఆ తర్వాత మాత్రం మళ్లీ వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు, మరదలు అపర్ణా యాదవ్‌కు టికెట్ ఇచ్చి తండ్రిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరిలో అపర్ణ ఓడిపోగా.. శివపాల్ గెలిచారు. అప్పట్లో ఎంతో ఉత్సాహంగా జాతీయాధ్యక్ష పదవి చేపట్టిన అఖిలేష్.. ఇప్పుడు దాన్ని ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. త్వరలోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద అఖిలేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన 5 కాళిదాస్ మార్గ్‌ను శుద్ధి చేస్తారని వార్తలు రావడంతో.. తాము మళ్లీ 2022 సంవత్సరంలో అధికారం చేపట్టినప్పుడు అగ్నిమాపక యంత్రాల సాయంతో గంగాజలం చల్లుతామని, అప్పుడు కేవలం 5 కాళిదాస్ మార్గ్‌లోనే కాక.. మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చల్లుతామని అన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని, అయితే వాటిని మీడియాలో చూపించడం లేదని చెప్పారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తనమీద బురద చల్లేవారన్నారు. -
రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర
బీసీ కమిషన్ రద్దుపై రాజ్యసభలో విపక్ష ఆందోళన న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)ను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో విపక్షాలు శుక్రవారం రాజ్యసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీని వెనుక రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర ఉందని ఆరోపించాయి. ఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రధాని అనేకసార్లు స్పష్టం చేశారని చెప్పారు. వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యంగబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందన్నారు. 1992లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటైన ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించేందుకు బదులుగా రద్దు చేయాలని చూస్తున్నారని రామ్‌గోపాల్ యాదవ్(ఎస్పీ) మండిపడ్డారు. ఎన్సీబీసీ స్థానంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్‌సీఎస్‌ఈబీసీ)ను ఏర్పాటు చేయడం వెనుక దళితులకు, యాదవులకు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర ఉందన్నారు. నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని పరోక్షంగా పేర్కొన్నారు. ఎస్పీ సభ్యలకు కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు మద్దతు పలికారు. రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయం ఐటీశాఖ గత 3 ఆర్థిక సంవత్సరాల్లో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 2,534 వ్యక్తులు, గ్రూపులకు సంబంధించి సోదాలు జరిపి, రూ. 45,622 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని బహిర్గతం చేసిందని ఆర్థిక సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో చెప్పారు. నగలు, నగదు సహా రూ. 3,625 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను జప్తు చేసిందన్నారు. బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి 140 కేసుల్లో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2016 నాటికి రూ. 8,08,318 కోట్ల వ్యవసాయ రుణాలను అందించామన్నారు. ‘గోవధకు పాల్పడితే మరణ శిక్ష’ గోవధ, గోవుకు సంబంధించిన ఇతర నేరాలకు పాల్పడితే మరణదండన విధించాలని ప్రతిపాదిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన రాజ్యంగంలోని 37వ అధికరణ ప్రకారం ఆవుల సంరక్షణకు కేంద్ర పరిధిలో సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. లోక్‌సభకు ‘ఆత్మహత్య’ బిల్లు మానసిక ఆరోగ్యరక్షణ బిల్లును ఆరోగ్య మంత్రి నడ్డా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మానసిక రోగులకు మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్న దీనికి అన్ని పార్టీల సభ్యు లూ మద్దతు పలికారు. ఆత్మహత్యను నేరంగా పరిగణించకూడదనే ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉంది. ఇతర ముఖ్యాంఖ్యాలు ► రూ. 5వేల, రూ. 10వేల నోట్లను ప్రవేశపెట్టే యోచన లేదని ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు తెలిపారు. దీనిపై రిజర్వు బ్యాంకుతో చర్చించగా, వీటిని ప్రవేశపెట్టే పరిస్థితి లేదని తేలిందన్నారు. ► మాజీ ఎంపీల పింఛన్ నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ ఎంపీల్లో 80 శాతం మంది కోటీశ్వరులని సుప్రీం కోర్టు అన్నట్లు వచ్చిన వార్తలను లోక్‌భలో సభ్యులు ప్రస్తావించడంతో ఆయన స్పందించారు. ► వైద్యవిద్యా సంస్థల్లో అదనంగా 5వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను కల్పించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి నిధులను 28 శాతం పెంచామన్నారు. -
అబ్బాయికి బాబాయ్ సపోర్ట్!
నిన్న మొన్నటి వరకు ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరు అభిమానం కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఇది. యూపీలో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే గానీ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ది కాదని పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ అన్నారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు శివపాల్ - అఖిలేష్ ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉన్న విషయం తెలిసిందే. ఇంతటి మోదీ గాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా శివపాల్ మాత్రం జస్వంత్‌నగర్ స్థానంలో బీజేపీ నాయకుడు మనీష్ యాదవ్ పాత్రేను 52 వేల ఓట్ల తేడాతో ఓడించారు. పార్టీ ఓటమికి ఏ ఒక్కరినీ నిందించబోమని, నేతాజీ పోరాటానికి ఇప్పుడు కూడా తామంతా మద్దతుగా ఉంటామని ఆయన అన్నారు. పార్టీ ఇంతకుముందు ఎక్కడ ఉండేదో మళ్లీ అక్కడకు తీసుకెళ్తామన్నారు. ములాయం సింగ్ యాదవ్ మరో తమ్ముడు అభయ్ రామ్ యాదవ్ మాత్రం ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. జరిగిందేదో జరిగిపోయిందని నిట్టూర్చారు. -
403లో ముస్లిం ఎమ్మెల్యేలు 24
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ముస్లింల బలం అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రంలో 19 శాతం ముస్లింలు ఉండగా... తాజా శాసనసభ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన 24 మంది మాత్రమే విజయం సాధించారు. 2012 ఎన్నికల్లో 69 మంది ముస్లిం సభ్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ నినాదం ‘సబ్కా సాత్... సబ్కా వికాస్’ఊదరగొట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)... మొత్తం 403 స్థానాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎన్నికల బరిలోకి దింపకపోవడం గమనార్హం. ముస్లింలు అధికంగా ఉండే రోహిల్‌ఖండ్, తెరాయ్తో పాటు యాదవులు, దళితులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న తూర్పు ప్రాంతం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు పెద్ద ఓటు బ్యాంకులు. ఈ సామాజిక లెక్కల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్‌తో జతకట్టింది ముస్లింల ఓటు బ్యాంకు కోసమే. ఈ ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య చీలిపోతే... అంతిమంగా అది బీజేపీకి లాభం చేకూరుస్తుందన్నది వారి అంచనా. మరోవైపు యూపీలో మహిళల ప్రాతినిధ్యం కూడా ఆందోళనకరంగా తగ్గుతోంది. ఈసారి 479 మంది మహిళా అభ్యర్థులు పోటీపడితే... 40 మంది మాత్రమే గెలిచారు. వీరి గెలుపు శాతం పది కంటే తక్కువ. ఇక... 403 మంది నూతన శాసనసభ్యుల్లో డిగ్రీ ఆపై చదువులు చదివినవారు 290 మంది. 143 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 403 కొత్త ఎమ్మెల్యేల్లో 143 మంది నేర చరితులు, 322 మంది కోటీశ్వరులు ఉన్నారు. నేర చరితుల్లో హత్య తదితర తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నట్టు ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో బీజేపీ తరుఫున కోలొనెల్గంజ్ స్థానం నుంచి నెగ్గిన అజయ్ప్రతాప్సింగ్ టాప్‌లో ఉన్నారు. ఈయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.49 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 1,455 మంది కోటీశ్వరులు పోటీపడ్డారు. -
అందుకే ఓడిపోయాం: ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపై ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. ఓటమికి ఏ ఒక్కరూ కారణం కాదని ములాయం అన్నారు. ఓటర్లను సంతృప్తి పరచలేకపోయామని, అందుకే ఓటమి చవిచూశామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి 54 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ అంచనాలకు మించి 325 సీట్లు కైవసం చేసుకుంది. ములాయం కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికలకు ముందు ములాయం కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలు ఎస్పీ ఓటమి కారణాలుగా భావిస్తున్నారు. ములాయం ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. కేవలం సోదరుడు శివపాల్ యాదవ్, కోడలు అపర్ణ పోటీచేసిన జశ్వంత్ నగర్, లక్నో కంటోన్మెంట్లలో మాత్రమే ప్రచారం చేశారు. శివపాల్ విజయం సాధించగా, అపర్ణ ఓటమి చవిచూశారు. కాగా తమకు ఓటమి కొత్త కాదని, పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని ములాయం అన్నారు. -
‘అఖిలేశ్‌తో అంతా గూండాలే.. పార్టీ బతకాలంటే..’
న్యూఢిల్లీ: కుటుంబ రాజకీయాలు పక్కకు పెట్టి నాయకత్వంపై సమాజ్‌వాది పార్టీ దృష్టిసారిస్తే బావుంటుందని సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజ్‌వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని ఆ విషయాన్ని అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో ఆదివారం అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలోగానీ, వామపక్ష పార్టీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని వాజపేయి, అద్వానీలాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వారసత్వం వెలుపలి నుంచి వెతికి చూడాల్సిందేనని అన్నారు. ‘ఎస్పీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎంతోమంది ఎస్పీ నేతలు పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయంగారు. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంట్ తీసుకెళ్లడంలో విఫలమైంది. అఖిలేశ్‌తో ఉన్నవాళ్లంతా రౌడీలు, దందాలు చేసేవాళ్లు. చూద్దాం పార్టీ భవిష్యత్ ఏమవుతుందో’ అని అమర్ సింగ్ అన్నారు. -
అఖిలేశ్ భవితవ్యం..!?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ కోలుకుంటుందా? తండ్రిని కాదని అన్ని తానై నడిపించిన అఖిలేశ్ పరిస్థితి ఏంటి? మళ్లీ ములాయం పార్టీ పగ్గాలు చేపడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో తాత్కాలిక స్నేహమేగాని ఏనాడూ అధికారం పంచుకోని ములాయం మార్గాన్ని వదిలి అఖిలేశ్ సాధించింది శూన్యమే. 1967లో ఎన్నికల బరిలో దిగి.. తొలి ప్రయత్నంలోనే ములాయం విజయం సాధించా రు. సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ బాటలో పయనించి యూపీలో పెను మార్పులకు పునాదులు వేశారు. మొదటినుంచి బ్రాహ్మణేతర, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్ని ములాయం వంటపట్టించుకున్నారు. అయితే యాదవ పరివారంలో తండ్రి నేతృత్వం లోని వర్గాన్ని పక్కకు నెట్టి నాయకత్వాన్ని అఖిలేశ్ కైవసం చేసుకున్నా.. తండ్రి బాటలో మాత్రం పయనించలేదు. 2007లో 97 స్థానాలతో, 2012లో 80 స్థానాలతో బీఎస్పీ ప్రతిపక్ష హోదా సాధించగా.. ఈ సారి ప్రతిపక్ష హోదా పొందిన ఎస్పీ 47 సీట్లకే పరిమితమైంది. అయితే అఖిలేశ్ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని పరిస్థితి. కాంగ్రెస్‌ను పొత్తుకు ఒప్పించి అఖిలేశ్ విజయం సాధించినా... 40 సీట్లకు మించి పోటీచేసే సామర్థ్యం లేని ఆ పార్టీకి 60కిపైగా సీట్లిచ్చి ఆయన పెద్ద తప్పిదం చేశారు. 2019లో బీఎస్పీతో పొత్తు? 1995లో ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య వైరం కొనసాగుతోంది. దానికి ముగింపు పలికే అవకాశాన్ని అఖిలేశ్ ఉపయోగించుకుంటే లౌకిక, సామాజిక శక్తులు ఏకం కావచ్చు. నరేంద్ర మోదీ దెబ్బతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపి విజయం సాధించిన నితీశ్, లాలూను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయడమే మాయ, అఖిలేశ్‌ల ముందున్న మార్గమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శివ్‌పాల్ గెలుపు.. అపర్ణ ఓటమి లక్నోలో బలంగా ఉందనుకున్న ఎస్పీకి రాజధానిలోనూ చుక్కెదురైంది. కంటోన్మెంట్ ప్రాంతంలో ములాయం రెండో కోడలు అపర్ణా యాదవ్ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ రీటా బహుగుణ జోషి 33,796 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ అలహాబాద్ (పశ్చిమ) స్థానం బరిలో దిగి 25వేల పైచిలుకు ఓట్లతో ఎస్పీ అభ్యర్థి రీచా సింగ్‌పై గెలిచారు. రాజ్‌నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ నోయిడా నుంచి లక్షా నాలుగు వేల ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థిని ఓడించారు. అయితే, మాజీ మంత్రి, ఎస్పీ సీనియర్ నేత శివ్‌పాల్ యాదవ్ తన సిట్టింగ్ నియోజక వర్గం జస్వంత్‌పూర్ నుంచి 52 వేల ఓట్లతో గెలిచారు. ‘‘ఈ ఓటమి ఎస్పీదో, కార్యకర్తలదో కాదు. కేవలం అహంకారం కారణంగానే ఓడిపోయాం’’ అని ఫలితాలు వెల్లడయ్యాక శివ్‌పాల్ తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆఖరి పోరు.. ఎవరిది జోరు?
వారణాసిపైనే అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల యుద్ధం బుధవారంతో ముగుస్తోంది. చివరిదైన ఏడో దశలో పోలింగ్ 40 సీట్లకు జరుగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగాల్సి ఉన్న ఆలాపూర్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో అక్కడ గురువారం ఎన్నిక ఉంటుంది. ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లా ఈ చిట్టచివరి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఉండటంతో ఈ దశకు సహజంగానే ప్రాధాన్యం పెరిగింది. మొత్తం ఏడు జిల్లాల్లో పోలింగ్ జరగనుండగా వాటిలోని వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలీ, జౌన్ భోజ్‌పురీ ప్రాంతంలోనివే. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 40 సీట్లలో ఎస్పీ అత్యధికంగా 23 గెల్చుకోగా, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇతర పార్టీలు 5 సీట్లు సాధించాయి. ఈ ఏడింటిలో సీట్ల రీత్యా చిన్న జిల్లా భదోహీ( 3 సీట్లు) కాగా, పెద్దది జౌన్ పూర్(9). కులం ప్రభావం ఎక్కువే! అన్ని విధాలా వెనుకబడిన ఆరు జిల్లాల్లో యాదవులు, బ్రాహ్మణులు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో వీరే యాదవ పరివార్ నాయకత్వంలోని ఎస్పీ 20కి పైగా సీట్లు కైవసం చేసుకోవడానికి తోడ్పడ్డారు. అలాగే బ్రాహ్మణులు, ఠాకూర్‌లతోపాటు యాదవేతర బీసీల మద్దతు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాన్నందించింది. కొండలు, అడవులతో పాటు సంపన్న వర్గాల దోపిడీ కూడా ఉండటంతో నక్సలైట్లకు కూడా మూడు జిల్లాల్లో జనాదరణ ఉంది. అప్నాదళ్‌తో పొత్తు లాభిస్తుందా? కుర్మీల(పటేళ్లు) పార్టీగా పరిగణించే అప్నాదళ్(సోనేలాల్)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పార్టీ నాయకురాలు మీర్జాపూర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్. అనుప్రియ అప్నాదళ్ ఈ ప్రాంతంలో 11 సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. ఆమె తల్లి కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ కూడా యూపీలో 150 సీట్లకు ఒంటరిగా పోటీచేసింది. భారతీయ సమాజ్ పార్టీతో కూడా బీజేపీ కలిసి పోటీచేస్తుండడంతో చివరి దశ పోలింగ్ జిల్లాల్లో ఈసారి పరిస్థితి కమలానికి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. -
ఆ మంత్రి పోలీసుల ఎదుట లొంగిపోవాలి
లక్నో: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతిని మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంపై వస్తున్న విమర్శలకు అధికార సమాజ్‌వాదీ పార్టీ స్పందించింది. ప్రజాపతి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి, పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఎస్పీ నేత అబు అజ్మీ సూచించారు. ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీనిపై స్టే విధించాలని ప్రజాపతి కోరాగా సుప్రీం కోర్టు నిరాకరించింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గంలో కొనసాగించడంపై యూపీ గవర్నర్ తప్పుపట్టారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపతి ఎస్పీ తరఫున పోటీచేశారు. -
స్టార్ లీడర్
‘ఒకప్పటి’ అనే మాట జయప్రదకు ఎప్పటికీ వర్తించదేమో! సినిమాల్లో ఉన్నా, లేకున్నా.. గ్లామర్‌లో ఆమె స్టార్. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీకి ఆమె బ్రాండ్ లీడర్. పన్నెండేళ్ల వయసుకే సినిమాల్లోకి, ముప్పై రెండేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చేశారు జయప్రద. పెళ్లి కూడా అంతే! చిన్న వయసులోనే జరిగిపోయింది. ఇరవైనాలుగేళ్లన్నది పెళ్లికి చిన్న వయసేం కాదు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న ఒక స్టార్ నటికి అది బాల్య వివాహమే! జయప్రద తొలి సినిమా ‘భూమికోసం’. తొలి పార్టీ ‘తెలుగుదేశం’. ఇవి రెండూ ఆమెను మరికొన్ని సినిమాలకు, మరికొన్ని పార్టీలకు నడిపించాయి. పెళ్లే.. ఆమెను ఏడడుగులకు మించి ముందుకు నడిపించలేకపోయింది. జయప్రదకు పిల్లల్లేరు. వద్దనుకుంటే లేకపోవడం కాదు. పుట్టే భాగ్యం లేక లేకపోవడం కాదు. మరి ఎందుకు? బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 సమీపంలోని జయప్రద విడిది గృహంలో కొన్నాళ్ల క్రితం సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆమెను కలిశారు. ఆ రోజు మిగతా మీడియా ప్రతినిధులెవరూ లేరు. జయప్రద, సాక్షి. అంతే. అదొక అపూర్వమైన సందర్భం. జయప్రద ఎన్నో సినిమాల్లో నవ్వి ఉంటారు. ఆ రోజు నవ్విన నవ్వు ఏ సినిమాలోనూ లేనిది. చిన్న పిల్ల నవ్వినట్టు పడీ పడీ నవ్వారు. ఆమె పోటీ నటి శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో ‘కట్టుకథలు సెప్పి నేను కవ్విస్తే.. నేను నవ్విస్తే..’ అనే పాటలో నవ్విన నవ్వేం పనికొస్తుంది? అలా నవ్వారు. అంత నవ్వూ.. ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అన్న ప్రశ్న దగ్గర సడన్‌గా ఆగిపోయింది! ‘మీరు పిల్లలెందుకు వద్దనుకున్నారు?’ అని నేరుగా అడగలేకపోయారు సాక్షి ప్రతినిధి. అందుకే ‘మీకు పిల్లలెందుకు లేరు?’ అని అడిగారు. జయప్రద గ్రహించారు. ‘మీరు నేరుగా అడగలేని ప్రశ్నకు సమాధానం కూడా నేను నేరుగా చెప్పలేనిదే’ అన్న భావం సాక్షి ప్రతినిధికి ఆమె మౌనంలో ధ్వనించింది. జయప్రద గత సోమవారం షిర్డీ దర్శనానికి వచ్చి వెళ్లారు. ఆలయ ప్రాంగణం బయట ఈ సౌందర్యరాశి కొన్ని నిమిషాలపాటు అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమెలో నేటికీ ‘పూర్వపు నటి’ ఛాయలు మొదలు కాలేదు! సినిమాలు చేస్తే మళ్లీ చూస్తారు. రాజకీయాల్లోకి వస్తే మళ్లీ రాణిస్తారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లో ఉన్నారు! దేశంలో కాంగ్రెస్ ఉండీ లేనట్లు ఉన్నట్లే, జయప్రద కాంగ్రెస్‌లో ఉన్నారు. బీజేపీ ఆహ్వానిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి వరకు జయప్రద పార్టీ ఆర్.ఎల్.డి. రాష్ట్రీయ లోక్ దళ్. 2014లో యూపీలోని బిజ్నోర్ నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అది అజిత్‌సింగ్ పార్టీ. అంతకు ముందు ఆమె పార్టీ ఆర్.ఎల్.ఎం. రాష్ట్రీయ లోక్ మంచ్. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అప్పటికి ఆమె సమాజ్‌వాదీ పార్టీ నుంచి రెండోసారి రాంపూర్ ఎంపీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అమర్‌సింగ్‌తో పాటు, అతడికి బహిరంగ మద్దతు ఇచ్చిన జయప్రదనూ పార్టీ నుంచి బహిష్కరించడంతో అమర్‌సింగ్ సొంత పార్టీ పెట్టుకుని (అదే ఆర్.ఎల్.ఎం) జయప్రదను కూడా కలుపుకున్నారు. రీ ఎంట్రీ? నో ఎంట్రీ? సమాజ్‌వాదీ పార్టీలోకి రాకముందు టీడీపీలో ఉన్నారు జయప్రద. ఎన్టీఆర్ ఆమెను రాజకీయాల్లోకి తెచ్చారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఆమెను తన రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు. తెలుగు మహిళను చేశారు. రాజ్యసభకూ పంపారు. చివరికి పార్టీ నుంచే బయటికి పంపేశారు. అక్కడి నుంచి సమాజ్వాదిలోకి వెళ్లిపోయారు జయప్రద. సినిమా ప్రొఫైల్ కన్నా, రాజకీయాల్లో జయప్రద ప్రొఫైల్ చాలా పెద్దది! మూడు వందల సినిమాల్లో నటించారు కదా అనిపించవచ్చు. ఒకవేళ నరేంద్రమోదీ కనుక 2019 ఎన్నికల కోసం ఆమెను పార్టీలోకి తీసుకోదలిస్తే ఆమె నటించిన సినిమాలన్నిటినీ ముందేసుకుని చూడమని మాత్రం అమిత్‌షాకు కచ్చితంగా పురమాయించరు. ఆరేళ్లు రాజ్యసభ సభ్యురాలిగా, పదేళ్లు ఎంపీగా జయప్రద అతి కీలకమైన అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యురాలిగా ఉన్నారు. అదొక పెద్ద జాబితా. మోదీకి పరిశ్రమలు ముఖ్యం. విదేశీ వ్యవహారాలు ముఖ్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యం. ఇక ముఖ్యం అయినా కాకున్నా.. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఆయనకు ముఖ్యం. ఈ కమిటీలన్నింటిలోనూ పనిచేసిన అనుభవం జయప్రదకు ఉంది. అది మోదీ ఇమేజీకి ఉపయోగపడుతుంది. జయప్రద కూడా ఇప్పుడు మోదీ పాలనా విధానాలను సమర్థిస్తున్నారు. మొన్న షిర్డీ వచ్చినప్పుడు మోదీ నోట్ల ఉపసంహరణ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ మాట్లాడ్డం ఒక ఎత్తుగడగా జరిగిందని మాత్రం అనుకోవడానికి లేదు. జయప్రదలోని రాజకీయ విజ్ఞత ఇంకా అంత ‘ఎత్తుకు’ ఎదగలేదు. ఇరవై ఆరేళ్ల రాజకీయ జీవితంలోనూ ఎక్కడా ఆమె తన ఉద్దేశాలను, ఉద్వేగాలను దాచుకోలేదు. కోపం వస్తే అరిచేశారు. భయం వేస్తే ఏడ్చేశారు. తను నమ్మినవాళ్ల వెంట వెళ్లిపోయారు. తనను నమ్ముకున్న వాళ్ల వెంట వచ్చేశారు. ఎన్నికల కోడ్‌ని కూడా చూసుకోకుండా.. మహిళా ఓటర్ల నుదుటిపై ఆప్యాయంగా బొట్టు పెట్టారు. ఇప్పుడు కూడా, తను మోదీ వైపు మాట్లాడుతున్నప్పటికీ.. మోదీకి రాజకీయ ప్రత్యర్థులైన ములాయంని కానీ, అఖిలేశ్‌ని కానీ ఆమె విమర్శించడం లేదు. ములాయం తనను పార్టీ నుంచి బహిష్కరించారన్న బాధ ఆమెలో లేదు. అఖిలేశ్ నాకు తమ్ముడి లాంటి వాడు. ములాయం నాకు తండ్రి లాంటి వారు అంటున్నారు. అలాగని ఆ తండ్రీకొడుకుల పాలనలో యూపీ భలే బాగుందని అనడం లేదు. ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని జయప్రద ఏమాత్రం సంశయం గానీ, సంకోచం గానీ లేకుండా అంటున్నారు. రాజకీయాల్లో ఇది అరుదైన గుణం. ఈ గుణం బీజేపీకైనా, ఇంకొక పార్టీకైనా ఎంతవరకు పనికొస్తుందనేదాన్ని బట్టి మాత్రమే జయప్రద రాజకీయ పునఃప్రవేశం అన్నది సంభవం అవుతుంది. అంతులేని కథ ‘భూమికోసం’ చిత్రం తర్వాత జయప్రద నటించిన పెద్ద సినిమా ‘అంతులేని కథ’. అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు. డైరెక్టర్ కె.బాలచందర్! తమిళంలో హిట్ అయిన సినిమానే తెలుగులో తీస్తున్నారు ఆయన. తమిళ్లో సుజాత చేసిన పాత్రను ఇక్కడ జయప్రద వెయ్యాలి. అంత నిండైన పాత్రను ఈ అమ్మాయి చెయ్యగలదా? పెళ్లీడు దాటిపోయిన అమ్మాయిగా కనిపించాలి. కనిపించగలదా? సందేహాలన్నీ ఎగరగొట్టేశారు జయప్రద. బాలచందర్ ఎప్పుడో గానీ చప్పట్లు కొట్టరట. షూటింగ్లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు ఆయన క్లాప్స్ కొట్టారు. ‘సినిమాలకు పనికొస్తానా?’ అని ముందు భయపడిన జయప్రద.. ‘అంతులేని కథ’ విడుదలయ్యాక సినిమాలే జీవితంగా స్క్రీన్ మీదికి వచ్చేశారు. సిరిసిరిమువ్వ, భద్రకాళి, అడవిరాముడు, యమగోల, అందమైన అనుభవం, సాగర సంగమం, దేవత, మేఘసందేశం.. ఇవి కాక.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేశారు. ఇప్పటికీ అలాగే! జయప్రద ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆమె అందం. ఆ అందానికి కారణం మాత్రం ఆమె తీసుకునే ఆహారం, తీసుకోని ఆహారం కూడా! ఎప్పుడోగానీ జయప్రద లంచ్‌లో, డిన్నర్లో రైస్ ఉండదు. పండ్లు, పండ్ల రసాలు, తాజా కూరగాయలు, ఎగ్ వైట్ ఆమ్లెట్ తీసుకుంటారు. సూప్స్ తాగుతారు. పూర్తిగా ఆకలి వేసే వరకు ఆగరు. కడుపు నిండా తినరు. పొట్ట తేలిగ్గా ఉంటే, ఒళ్లు హుషారుగా ఉంటుందట. ఈ ఆహార నియమాలతో పాటు యోగా చేస్తుంటారు. జిమ్‌కు వెళుతుంటారు. తొలి పారితోషికం 10 రూపాయలు ‘భూమికోసం’ చిత్రంలో చెల్లి చంద్రమ్మగా చిన్న వేషం వేశారు జయప్రద. తొలిషాట్ నెల్లూరులో. పొలాల మధ్య నుంచి తలపై బుట్ట పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంటుంది. ఆ సినిమాకు ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ పది రూపాయలు. పోటా పోటీ జయప్రద, శ్రీదేవి ఇంచుమించు ఒకే ఈడు వారు. ఒక స్క్రీన్ కడుపున పుట్టిన తోబుట్టువుల్లా కనిపించేవారు. శోభన్‌బాబు నటించిన ‘దేవత’ సినిమాలో వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా కూడా నటించారు. అయితే బయట మాత్రం ఒకరితో ఒకరు ముభావంగా ఉండేవారు! ఎందుకనో దగ్గరితనం ఉండేది కాదు. ‘పోటీ ఉండేది కాబట్టి అలా ఉండేవాళ్లమేమో’ అని అనేవారు జయప్రద. రెండేళ్ల క్రితం 2015 నవంబర్ 27న హైదరాబాద్‌లో జయప్రద దత్తపుత్రుడు సిద్ధార్థ్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి శ్రీదేవి వచ్చారు. ఆ సందర్భంలో వాళ్లిద్దరూ చాలా ఆత్మీయంగా కనిపించారు. పదవులు–బాధ్యతలు 1996–2002 : రాజ్యసభ సభ్యురాలు 1996–97 : పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సంప్రదింపులు, సమాచారం–ప్రసారాలు.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2004 : ఎంపీగా ఎన్నిక. (యూపీలోని రాంపూర్ నియోజకవర్గం) 2004–09 : సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మహిళా సాధికారత, జల సంరక్షణ, నిర్వహణలపై పార్లమెంటరీ ఫోరం.. ఈ కమిటీలన్నింటిలో సభ్యురాలు. 2009 : రెండోసారి ఎంపీగా ఎన్నిక (మళ్లీ అదే నియోజకవర్గం) 2009 : ఫైనాన్స్ కమిటీలో సభ్యురాలు. ఇవన్నీ కాక.. 2014 వరకు ప్రభుత్వ, ప్రైవేటు సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకైన పాత్ర. వ్యక్తిగతం జయప్రద (54): నటి, రాజకీయ నాయకురాలు అసలు పేరు: లలితారాణి జననం: 3 ఏప్రిల్ 1962 జన్మస్థలం: రాజమండ్రి (ఆం.ప్ర) తల్లిదండ్రులు: కృష్ణారావు, నీలవేణి చదువు: బి.ఎ. భర్త: శ్రీకాంత్ నహతా సంతానం: లేరు ఉండడం: ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ అభిరుచులు: మ్యూజిక్, డ్యాన్స్, చిత్రలేఖనం - మాధవ్ శింగరాజు -
నాడు 300 ర్యాలీల్లో ములాయం.. నేడు ఏమైంది?
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల హోరాహోరీ ప్రచారం, దూషణల పర్వం కొనసాగుతుంటే.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఒకప్పటి రాజకీయ యోధుడు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైందని విమర్శలు వినబడుతున్నాయి. 2012 ఎన్నికల్లో 300 ర్యాలీల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించిన ములాయం.. ఈసారి కేవలం రెండంటే రెండే ర్యాలీలకు హాజరయ్యారు. అదీ తమ్ముడు శివ్‌పాల్ తరపున ఒకటి.. చిన్న కోడలు అపర్ణయాదవ్ తరపున మరొకటి. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ.. అనారోగ్య కారణాలతో కేవలం 18 ర్యాలీల్లోనే ములాయం పాల్గొన్నారు. ‘పార్టీ సంరక్షకుడిగా ములాయంను నియమించిన మరుక్షణమే.. ఆయన అధికారాలు తగ్గిపోయాయి. ఎస్పీలో ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం.. ములాయం బాధ్యతలు అఖిలేశ్ తీసుకున్నారు’ అని బీజేపీ సీనియర్‌నేత హృదయ్ నారాయణ్ దీక్షిత్ తెలిపారు. ‘ఎస్పీ కార్యకర్తలే కాదు. ఇతర పార్టీన నేతలూ ములాయం గురించి బాధపడుతున్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు’ అని సీనియర్ సోషలిస్టు నాయకుడు రఘునందన్ సింగ్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థాపకుడికి ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా లేదని ఆర్ఎల్డీ అధ్యక్షుడు సునీల్ సింగ్ అన్నారు. బాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం సైకిల్ (ఎస్పీ పార్టీ గుర్తు)ను పంక్చర్ చేస్తే.. శివ్‌పాల్ చైన్ తెంపేశాడు’ అని విమర్శించారు. ములాయం పుత్రవ్యామోహంలో పడిపోయారని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం.. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి ములాయం ఆశీస్సులున్నాయంటున్నారు. -
ప్రధాని కోటలోనూ మాదే విజయం
అజాంగఢ్: సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఇద్దరికీ కలసి వస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ప్రచారం చేస్తున్న అఖిలేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన ఐదు దశల ఎన్నికల్లో ఎస్పీ ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఆరు, ఏడో దశల ఎన్నికల్లోనూ తమ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని, తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అఖిలేష్ అన్నారు. 300 సీట్లు గెలుస్తామని చెప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. యూపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మోదీ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నా, తమదే విజయమని, సంపూర్ణ మెజార్టీ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నియోజకవర్గంలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉందన్నారు. -
ఎస్పీ తప్ప ఏ పార్టీలోనైనా చేరతా
షిర్డీ: సమాజ్‌వాదీ పార్టీలోకి తప్ప ఏ పార్టీ ఆహ్వానించినా అందులో చేరతానని సమాజ్‌వాదీ బహిష్కృత నేత, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. షిర్డీలో సోమవారం ఆమె మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవ మర్యాదలు లేవన్నారు. సమాజ్‌వాదీ పాలనలో యూపీ గుండారాజ్‌గా మారిపోయిందన్నారు. అజంఖాన్ వంటి నేతలున్న సమాజ్‌వాదీ పార్టీలో ఎప్పటికీ వెళ్లనని చెప్పారు. మోదీని ఉద్దేశించి అఖిలేశ్ గాడిద అని సంబోధించడం సరికాదన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైందని కొనియాడారు. -
సమాజ్ వాది పార్టీ అభ్యర్థిపై కాల్పులు
లక్నో: సమాజ్ వాది పార్టీ అభ్యర్థి కుమారున్ని ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో గురువారం ఉదయం కాల్చారని పోలీసులు తెలిపారు. ఇందులో అభ్యర్థి చాలా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థి సిద్దా గోపాల్ కుమారుడు దీనికి కారణమని చెప్పారు. బాధితున్ని చికత్స కోసం కాన్పూర్‌కి తరలించారు. బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి అరిదర్మాన్ సింగ్ బాధితుని కుటుంబసబ్యులతో్ మాట్లాడారు. Uttar Pradesh, Samajwadi Party, Siddha Gopal Sahu, victim, ఉత్తరప్రదేశ్, సమాజ్ వాది పార్టీ, సిద్దా గోపాల్, బాధితుడు -
అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్
-
అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్
న్యూఢిల్లీ: యావద్దేశంలో ఆసక్తి రేకెత్తించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కుటుంబ కలహమంతా నాటకమేనా? పార్టీ సమావేశాల్లో మైకు లాక్కోవడం, ఆగ్రహావేశాలు.. తర్వాత కన్నీళ్లు, ఆలింగనాలతోసద్దుమణిగిన యాదవ పరి‘వార్’ అంతా తూచ్ వ్యవహారమేనా? అవుననే అంటున్నారు ఈ గొడవలకు కారకునిగా ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ సీనియర్ నేత, ములాయంకు అత్యంత సన్నిహితుడూ అయిన అమర్‌సింగ్. ఎస్పీ అంతర్గత వివాదమంతా ములాయం సింగ్ యాదవ్ పథకం ప్రకారం ఆడించిన నాటకమేనని, కొడుకు అఖిలేశ్‌కు లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేశారని అమర్ బాంబు పేల్చారు. ‘ములాయం, అఖిలేశ్ ఒక్కటిగానే ఉన్నారు, ఉంటారు’ అని అని సీఎన్ ఎన్–న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘కొడుకు చేతిలో ఓడిపోవాలని ములాయం కోరిక. సైకిల్ (పార్టీ గుర్తు), కొడుకు, ఎస్పీ ఆయన బలహీనతలు. మరైతే ఎందుకీ నాటకం? ఇదంతా పథకం ప్రకారం ఆడించిన డ్రామా. మా అందరికీ పాత్రలు దక్కాయి. మమ్మల్ని వాడుకుంటున్నట్లు తర్వాత తేలింది.. ఎస్పీతో ఉన్న అనుబంధం నా బహిష్కరణతో(పార్టీ నుంచి) తెగిపోయింది.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి పన్నిన ప్రణాళిక అని తెలుసుకున్నా.. దీనికి మాస్టర్ స్క్రిప్ట్ రైటర్ ములాయం. కాంగ్రెస్‌తో పొత్తు ములాయంకు ఇష్టం లేకపోతే ఆయన ప్రియాంక గాంధీతో అంతసేపు ఎందుకు సమావేశం అయ్యారు?’ అని పేర్కొన్నారు. -
ములాయంపై అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై అమర్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆ డ్రామా అడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ పొత్తుకు కారణం ములాయం సింగే అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాదు, ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ కూడా అంటూ చతుర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు సమాజ్‌వాది పార్టీలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను అసలు పదవినే ఆశించనని, పోటీ కూడా చేయననే ములాయం తనకు గుండెలాంటివాడని ఆయన ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పిన అమర్ సింగ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మా పొత్తుతో మోదీ నవ్వు మాయం
రాహుల్ గాంధీ వ్యాఖ్య బందా(యూపీ): ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ చేతులు కలపడంతో ప్రధాని మోదీ ముఖంలో నవ్వు మాయమైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ యూపీకి సొంత కొడుకు కాడని, దత్తపుత్రుడు మాత్రమేనని విమర్శించారు. ‘గంగామాత తన కొడుకు వారణాసికి పిలిపించుకుందని 2014లో మోదీ చెప్పారు.. మోదీజీ.. సంబంధాలనేవీ చెప్పుకుంటే కాదు పెంపొదించుకుంటే ఏర్పడతాయి’ అని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.7వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని, మోదీకి మాత్రం ఆ ఉద్దేశం లేదని ఆరోపించారు. మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి: న్యూఢిల్లీ: యూపీలో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, ఎన్నికల వాతావరణాన్ని మోదీ కలుషితం చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల సంఘం తగిన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ‘మోదీ ఎన్నికల సభల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఖబరిస్తాన్ ఉన్నప్పుడు శ్మశానం కూడా ఉండాలని ఆదివారం ఆయన అన్న మాటలు సమాజాన్ని విడగొట్టేవే. ఆయన మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. -
యూపీలో గూండా రాజ్యం
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ► ఓటమి భయంతో అఖిలేశ్ ముఖం కళ తప్పింది ► యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం ఫతేపూర్: ఉత్తరప్రదేశ్‌లో గూండా రాజ్యం నడుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో సమాజ్‌వాదీ ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రిపై అత్యాచారం కేసు పెట్టాలంటూ చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించారని ఆయన తప్పుపట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫతేపూర్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ... యూపీలో పోలీసుస్టేషన్లు సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ‘అఖిలేశ్ యాదవ్ ముఖం కళ తప్పింది. అతని మాటతీరు నీరసపడింది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో పాటు, మాటల కోసం వెదుకులాడుతున్నారు. ఆటలో ఓటమిని ఆయన అంగీకరించారు’ అని మోదీ పేర్కొన్నారు అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ‘రాష్ట్రంలో పోలీసు విభాగం ఎందుకు అంత అసమర్ధంగా ఉంది? ఫిర్యాదులు ఎందుకు తీసుకోవడం లేదు? ఇదేం పనితీరు?’ అంటూ మోదీ ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ప్రజాపతి తరఫున అఖిలేశ్ ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం పదేళ్లుగా యూపీ అభివృద్ధికి దూరంగా ఉందంటూ ఎస్పీ, బీఎప్పీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ఎన్డీఏ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన మోదీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి మరింత వేగవంతం చేస్తామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శిస్తూ... ‘ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదన్న విషయం పుట్టుకతోనే ప్రముఖులైనవారికి అర్థమైంది. అందుకే ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడింది’ అని విమర్శించారు. యూపీని దత్తత తీసుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. శివాజీయే ఆదర్శం న్యూఢిల్లీ: మరాఠా యోధుడు శివాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. శివాజీ ఆలోచనలతోనే తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. ‘శివాజీ వంటి గొప్ప నేత మన గడ్డపై పుట్టి మనల్ని పాలించటం గర్వకారణం. ధైర్య, సాహసాలు, సుపరిపాలనకు ఆయన పర్యాయపదం. ముంబైలో గొప్పగా శివ్‌స్మారక్ నిర్మించటమే ఆయన గొప్పతనానికి జాతి ఇచ్చే అసలైన నివాళి’ అని అన్నారు. -
సమరాంగుణ
ఏడు విడతలుగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్న ఆదివారం మూడో విడత పోలింగ్ ముగిసింది. పోలింగ్ జరిగిన 69 నియోజకవర్గాలలోనూ అత్యంత కీలకమైన లక్నో కంటోన్మెంట్లో ప్రధానంగా బహుజన సమాజ్‌పార్టీ (బిఎస్పీ), భారతీయ జనతాపార్టీ (బీజేపి), సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) ల మధ్యే పోటీ నడిచింది. ఈ మూడు పార్టీలలోనూ మళ్లీ బీజేపీ, ఎస్పీల మధ్యే గట్టి ఫైట్ జరిగింది. ఇందుకు ఒక కారణం ఈ రెండు పార్టీల అభ్యర్థులూ మహిళలే కావడం. ఇంకో కారణం ఆ ఇద్దరు మహిళలూ సీనియారిటీలో ఒకరు, సీఎం ఇంటి నుంచి ఒకరు ప్రముఖ వ్యక్తులు కావడం! ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ... సమాజ్‌వాది పార్టీ నుంచి, డాక్టర్ రీటా బహుగుణ జోషి.. బీజేపీ నుంచి ఒకరితో ఒకరు తలపడ్డారు. కౌంటింగ్ మార్చి 11న. ‘ఎన్నికలవారి’ కుటుంబం కనుక అపర్ణ గెలవడంలో ఆశ్చర్యం లేదు. రీటా బహుగుణ ఓడిపోతేనే విశేషం. ఎందుకంటే రీటా... కాంగ్రెస్ అనే పెద్దింటి నుంచి వచ్చి, అంతే పెద్దదైన బీజేపీ అనే మెట్టినింట అడుగుపెట్టిన అమ్మాయి. రీటా బహుగుణ 2016 అక్టోబర్ 20న ‘వాస్తవాధీన హస్తరేఖ’ దాటి బీజేపీలోకి వచ్చేశారు. భారత సైనికులు 2016 సెప్టెంబర్ 29న వాస్తవాధీన రేఖ దాటి వచ్చిన పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపారు. ఏమిటి కారణం ఈ రెండు ఘటనలకు? సహనం నశించడం! 24 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కాపుకాసిన తనను పక్కన పెట్టి, యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలాదీక్షిత్‌ను పార్టీ పైకి తేవడంతో బహుగుణ షాక్‌కు గురయ్యారు. వెనువెంటనే సహనం కోల్పోకుండా ఉండేందుకు కొంత సమయం తీసుకున్నారు. భారత సైన్యం కూడా అంతే! చూసింది.. చూసింది. పాక్ మాట వినకపోవడంతో సహనం కోల్పోయి షాక్ ఇచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఏమిటి సంబంధం ఈ రెండు పరిణామాలకు? బీజేపీలో చేరడానికి బహుగుణ చెప్పని కారణం షీలాదీక్షిత్ అయితే, చెప్పిన కారణం.. సర్జికల్ స్ట్రైక్స్! ‘సైనికులు రక్తం చిందిస్తుంటే, మోదీజీ ఆ సైనికుల వెనుక దాక్కున్నారు’ అని కాంగ్రెస్ కామెంట్ చేసింది. ఆ కామెంట్ నచ్చకనే తను బీజేపీలోకి వచ్చినట్టు రీటా బహుగుణ చెప్పుకున్నారు. ప్రతీకారంలో.. అసమాన ప్రతిభ! కామెంట్లకు తీరిగ్గా చింతించేంత సున్నిత హృదయురాలేమీ కాదు రీటా. కామెంట్లకు వెంటనే కోపం తెచ్చుకునేంత అపరిణత మనస్కురాలు కూడా కాదు. రాటు దేలిన పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అమెది! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంతి హెచ్.ఎన్. బహుగుణ కూతురు ఆమె. ఎంపీ కమలా బహుగుణ ముద్దుల కూతురు ఆమె. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ చెల్లెలు ఆమె. అలహాబాద్ మేయర్ ఆమె. అఖిలభారత మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆమె. జాతీయ మహిళా కౌన్సిల్ ఉపాధ్యక్షురాలు ఆమె. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె. అన్నిటినీ మించి కాంగ్రెస్ పార్టీ ఆడకూతురు ఆమె! అయితే ఇవన్నీ అతి ప్రాచీనమైన విషయాలు. ఈ కాంగ్రెస్ రాజనీతిజ్ఞురాలు ప్రస్తుతం బీజేపీ కార్యకర్త! ఇప్పుడామె భుజంపై వేసుకున్న కార్యం.. అపర్ణా యాదవ్‌పై గెలిచి, లక్నో కంటోన్మెంట్ సీటును బీజేపీకి బహుమతిగా ఇవ్వడం! బహుగుణ ఇచ్చిన బహుమతిగా అమిత్‌షా మెప్పు పొందడం. కాంగ్రెస్‌ను కుళ్లికుళ్లి చచ్చేలా చేయడం. కానీ ఒక్కసీటు పోయినందుకు కాంగ్రెస్ కుళ్లికుళ్లి చస్తుందా? చావదు. రీటాను కోల్పోయినందుకు మాత్రం చస్తుంది. కాంగ్రెస్‌ను వదిలి రీటా వెళ్లిపోవడానికి, మిగతావాళ్లు వెళ్లిపోవడానికీ తేడా ఉంది. ప్రత్యర్థికి ఫినిషింVŠ టచ్ ఇవ్వడంలో రీటా.. కాంగ్రెస్ పరిభాషలో ప్రతిభావంతురాలు. యూపీలో ఆ ప్రతిభ ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర లేదు. మాటను వదిలితే.. అది బాణమే! మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీటా 14 రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాహుల్, దిగ్విజయ్‌సింగ్‌లతో పాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. రీటా ఎం.ఎ. చదువుకున్నారు. హిస్టరీలో పీహెచ్డీ చేశారు. అలహాబాద్ యూనివర్సిటీలో ఇప్పటికీ ఆమె మధ్యయుగాల, ఆధునిక కాలాల చరిత్రను బోధిస్తూ ఉంటారు. ఐక్యరాజ్య సమితి ఆమెకు ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమెన్ ఇన్ సౌత్ ఏషియా’ అంటూ ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా ఇచ్చింది. అయితే రీటా రాజకీయ జీవితంలో ఇవేవీ ఆమె అసలైన పాటవాలు కావు. కాంగ్రెస్‌లోకి రాకముందు ఆమె రాసిన చరిత్ర పుస్తకాలు సైతం పార్టీలో ఆమెకు ఇవ్వని గుర్తింపును.. సుతిమెత్తగా కనిపించే ఆమెలోని సూదంటు స్వరం ఇచ్చింది. ఆ స్వరంలోంచి బాణాల్లా దూసుకొచ్చే మాటలు ఇచ్చాయి. పార్టీలో ఆమెను ప్రముఖురాలిగా చేసిన ఆ మాటలే.. కొన్నిసార్లు ఆమెను చట్టం దృష్టిలో దోషినీ చేశాయి. మాయావతికి కోటి పరిహారం! రీటా ప్రసంగం మరీ అంత రెచ్చగొట్టేలా ఏమీ ఉండదు కానీ ఆ గొంతులో ఎంతో సౌమ్యంగా గంధకం మండుతుంది. ఓసారి రీటా ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్యలపై మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోయాయి అన్నారు. అత్యాచార బాధితులకు చేతిలో ఓ పాతిక వేలు పెట్టి మాయావతి చేతులు దులుపుకుంటోంది అన్నారు. అంతవరకు బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్లారు రీటా. ‘డబ్బు తీసుకోకండి. డబ్బు ఇవ్వబోతే మాయావతి ముఖాన కొట్టండి’ అని అత్యాచార బాధితులకు పిలుపునిచ్చారు. అక్కడితో ఆగలేదు. ‘నీపై కూడా అత్యాచారం జరుగుతుంది. అప్పుడు నీకు మేము కోటి రూపాయల పరిహారం ఇస్తాం’ అని మాయవతిని ఉద్దేశించి అన్నారు! అలా అన్నప్పుడే మొరాదాబాద్ జైల్లో రీటా రెండు వారాల పాటు జ్యుడీషియల్ రిమాండులో ఉండవలసి వచ్చింది. ఇంకోసారి పశ్చిమ యూపీలోని భట్టా పర్సౌల్ గ్రామంలో రైతు సమస్యలపై మాట్లాడుతున్నారు రీటా బహుగుణ. పక్కన రాహుల్, దిగ్విజయ్‌సింగ్ కూడా ఉన్నారు. రైతుల ఇక్కట్లకు కారణం మాయావతేనని రీటా అంటున్నారు. రైతుల ఉసురు తీస్తున్న ఈ ప్రభుత్వాన్ని కలుపు మొక్కల్లా ఏరిపారేద్దాం రండి అన్నారు. మీరట్ రేంజి పోలీసులు పరుగున అక్కడి వచ్చారు. రీటాను, మిగతా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఖాకీ రంగ్ కి హాఫ్ ప్యాంట్ వాలే మహిళా ఉద్యమాలలో పాల్గొని, మహిళా రిజర్వేషన్ల కోసం పట్టుపట్టి, మహిళలకు సమన్యాయం కోసం పోరాడిన రీటా బహుగుణ.. ఒక మహిళ అయిన మాయవతి విషయంలో మాత్రం ఏమాత్రం సహానుభూతితో లేకపోవడం వింతగా అనిపిస్తుంది. ఆ మాటకొస్తే శుక్రవారం వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో రీటా తన రాజకీయ ప్రత్యర్థి అపర్ణతో కూడా అంతే విసురుగా ఉన్నారు! ‘ఆ పిల్లకు సభ్యతగా మాట్లాడ్డం తెలీదు. పొగరుగా ఉంటుంది. నేలపైకి దిగి నడవాలని నా సలహా’ అని అపర్ణ గురించి అన్నారు రీటా. అపర్ణ కూడా తక్కువేం అనలేదు. ‘ఆవిడ ఎంత సభ్యతగా మాట్లాడేవారో నేను విన్నాను. అయినప్పటికీ నేను ఆవిడను గౌరవిస్తాను. పెద్దల్ని గౌరవించడం మన సంప్రదాయం కదా’ అని అంటించారు. కాంగ్రెస్ యు.పి.చీఫ్ రాజ్ బబ్బర్ కూడా రీటాపై అసహనంతో ఉన్నారు. ఆ అసహనం ఆమె కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినందుకో, బీజేపీలో చేరినందుకో స్పష్టంగా తెలియనివ్వడం లేదు బబ్బర్. ‘ఖాకీ రంగ్ కి హాఫ్ ప్యాంట్ వాలే.. అపర్ణ చేతిలో ఓడిపోవడం ఖాయం’ అని ఆయన కామెంట్ చేశారు. అయితే ఓటమికి చలించిపోయే మనిషి కాదు రీటా బహగుణ జోషీ. 2014లో లక్నో నుంచి రాజ్‌నాథ్‌సింగ్‌పై లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2009లోనూ అదే నియోజకవర్గంలో లాల్జీ లాండన్పై పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అప్పుడలా.. ఇప్పుడిలా... రీటా బహుగుణ బీజేపీలో చేరాక ఆర్ణబ్ గోస్వామి, మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ çసర్దేశాయ్ ఆమెను ఇంటర్వూ్య చేశారు. ‘మోదీజీ రెండేళ్ల పాలననీ, మోదీజీ అచ్ఛేదిన్ని, మోదీజీ స్వచ్ఛభారత్‌ని, మోదీజీ గోద్రా దారుణాలను విమర్శించారు. ఇప్పుడేమో మోదీజీకి ప్రత్యామ్నాయం లేదు అంటున్నారు! అకస్మాత్తుగా ఇప్పుడు మోదీజీ మంచివారు ఎలా అయ్యారు? బీజేపీలో మీరెలా చేరారు? అని అడిగారు. అన్నిటికీ రీటా చెప్పిన సమాధానం ఒక్కటే. వాటి అర్థం.. సర్జికల్ స్ట్రైక్స్ మోదీజీని పునీతుణ్ణి చేశాయని! అయితే ఈ ఎన్నికల్లో రీటా బహుగుణ గెలిస్తే కనుక అదే మాటను ఆమె మరింత స్పష్టంగా చెప్పడానికి ఉత్సాహం కనబరచవచ్చు. రీటా బహుగుణ జోషి (67) జననం : 1949 జూలై 22 జన్మస్థలం : ఉత్తరాఖండ్ పార్టీ : కాంగ్రెస్ (1992–2016) బీజేపీ (2016 నుండి) ప్రాతినిధ్యం : లక్నో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే (2012 నుంచి) ప్రస్తుతం : మళ్లీ అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ. తల్లిదండ్రులు : దివంగతులు బహుగుణ, కమల తోబుట్టువులు : విజయ్, శేఖర్ భర్త : పి.సి.జోషి (ఇంజనీరు) సంతానం : మయాంక్ జోషి రీటాను గుర్తు పట్టని తివారీ! గత పార్లమెంటు ఎన్నికలకు (2014) ముందు జరిగిన ఒక ‘రాజకీయ సంఘటన’ను రీటా జీవితంలోని ఒక ఆసక్తికరమైన సందర్భంగా చెప్పుకోవాలి. లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్, కాంగ్రెస్ నుంచి రీటా బహుగుణ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. యు.పి.కురువృద్ధ కాంగ్రెస్ నేత ఎన్.డి.తివారీ (88) ఆశీస్సుల కోసం రాజ్‌నాథ్‌సింగ్ ఆయన ఇంటికి వెళ్లి, వంగి ఆయన కాళ్లకు నమస్కరించారు. తివారీ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, తలపై చెయ్యి ఉంచి ‘విజయీభవ’ అని దీవించారు. ఈ సంగతి తెలిసి, మర్నాడే రీటా బహుగుణ తివారీ ఆశీస్సుల కోసం వెళ్లారు. అయితే తివారీ ఆమె ఎవరో తెలియనట్లుగా ముఖం పెట్టారు! ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్యా జరిగిన సంభాషణ ఇది: తివారీ : నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? రీటా: నేను లక్నో నుంచి పోటీ చేస్తున్నాను. మీ ఆశీస్సుల కోసం వచ్చాను. తివారీ: నీ పేరేంటి? రీటా: రీటా బహుగుణ జోషీ. తివారీ: నీది ఏ పార్టీ? రీటా: దాదా.. నేను కాంగ్రెస్. నేను మీకు తెలుసు. గత నెలలో కూడా నేను మిమ్మల్ని కలిశాను. నిన్న రాజ్‌నాథ్‌జీ మీ ఆశీస్సుల కోసం వచ్చారని తెలిసి, నేనూ వచ్చాను. తివారీ: నిన్న రాజ్‌నాథ్ నన్ను కలిశాడా? రీటా: అవును. తివారీ: నేను అతడిని బ్లెస్ చేశానా? రీటా: అవునట. అలా అని చెప్పుకుంటున్నాడు. (ఇలా సాగుతోంది సంభాషణ..) తివారీకీ, రీటా తండ్రి హెచ్.ఎన్.బహుగుణకు పూర్వ స్నేహవైభవం ఉండేది. ఆ వైభవాన్ని రీటా గుర్తు చేశారు. ఆ తర్వాతే ఆయన.. రీటాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తన లెటర్ హెడ్‌పై లక్నో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజానికి రీటా ఎవరో తివారీకి బాగా గుర్తుందనీ, ఉత్తరాఖండ్ టికెట్‌ను తన కొడుకు రోహిత్ కు ఇవ్వకపోవడంతో సోనియా గాంధీపై కోపాన్ని ఇలా రీటా మీద ప్రదర్శించారని మీడియా ఊహించింది. ఈసారైతే తివారీ ఆశీస్సుల కోసం వెళ్లలేదు రీటా. (తివారీ కూడా ఆయన కొడుకు రోహిత్ శేఖర్‌తో పాటు ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు.) తివారీ ఆశీస్సుల కోసం... (ఫైల్ ఫొటో) -
అఖిలేష్ ప్రచారానికి వార్ రూమ్ సపోర్టు
-
త్రిముఖ హోరాహోరీ
మూడో దశ పోరు ముగ్గురికీ ప్రతిష్టాత్మకం - 2012 ఫలితాల పునరావృతం కోసం ఎస్పీ తహతహ - 2014 ఫలితాలను మళ్లీ రాబట్టేందుకు బీజేపీ కృషి - ఆ రెండిటినీ మౌనంగా అధిగమించేంలా బీఎస్పీ వ్యూహం - మారుతున్న పరిస్థితుల్లో మూడు పక్షాల హోరాహోరీ (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరుగనున్న మూడో దశ ఎన్నికలు.. అధికార సమాజ్‌వాది పార్టీతో పాటు.. అటు బీజేపీకి, ఇటు బీఎస్పీకి కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న సమాజ్‌వాది పార్టీకి ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కీలకం. రాష్ట్రంలో అధికారంలోకి రెండో స్థానంలోనన్నా నిలవడం బీజేపీకి ముఖ్యం. ఆ రెండు పార్టీలనూ ఓడించి.. ప్రస్తుత సమీకరణాలను మార్చివేయడం బీఎస్పీకి అత్యవసరం. మూదో దశలో ఫరూకాబాద్, హర్దోయ్, కన్నౌజ్, మయిన్‌పురి, ఇటావా, అరాయియా, కాన్పూర్, కాన్పూర్ , ఉన్నావ్, లక్నో, బారాబంకి, సితాపూర్ – మొత్తం 12 జిల్లాల్లోని 69 శాసనసభ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరుగనుంది. శుక్రవారం సాయంత్రం ఇక్కడ ప్రచారం ముగిసింది. 2012 శాసనసభ ఎన్నికల్లో ఈ 69 సీట్లలో ఎస్పీ 55 సీట్లు గెలుచుకోగా బీఎస్పీ ఆరు సీట్లు, బీజేపీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటు చొప్పున గెలుచుకున్నారు. అయితే.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ నాయకత్వానికి చెందిన యాదవ్ కుటుంబానికి సొంత కోటలైన కన్నౌజ్, మయిన్‌పురి జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్లా బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో.. 2012 ఫలితాలను పునరావృతం చేయాలని ఎస్పీ.. 2014 ఫలితాలను నిలుపుకోవాలని బీజేపీ.. ఆ రెండిటినీ అధిగమించాలని బీఎస్పీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్యా హోరాహోరీ పోరాటం నెలకొంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం లక్నో, ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ స్వస్థలమైన ఇటావా, ఆయన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం కన్నౌజ్, ఎస్పీ ఎంపీ, ములాయం బంధువు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మయిన్‌పురి ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలకు మరింత ప్రతిష్టాత్మకం అవుతున్నాయి. ఇది కోటీశ్వరుల ఖిల్లా! మూడో దశ ఎన్నికల్లో పోటీపడుతున్న 826 మంది అభ్యర్థుల్లో 250 మంది కోటీశ్వరులు, 110 మంది నేర చరితులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్‌లు వెల్లడించాయి. మొత్తం ఆరు జాతీయ పార్టీలు, ఏడు రాష్ట్ర పార్టీలు, 92 గుర్తింపులేని పార్టీల అభ్యర్థులతో పాటు.. 225 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ‘మూడో దశ’లో.. 67 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో 56 మంది, 68 మంది బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది, 59 మంది ఎస్పీ అభ్యర్థుల్లో 51 మంది, 14 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, 40 మంది ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో 13 మంది, 225 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 24 మంది.. తమకు కోటి రూపాయల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎస్పీకి చెందిన అనూప్‌కుమార్ గుప్తా (రూ. 42 కోట్లు) అత్యధిక ధనవంతుడు. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌కపూర్ (రూ. 31 కోట్లు), ఎస్పీ అభ్యర్థి సీమా సచన్ (రూ. 29 కోట్లు) ఉన్నారు. 110 మంది నేరచరితులు: ఇక నేరారోపణలు గల 110 మంది అభ్యర్థుల్లో.. 82 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల్లో 21 మంది, బీఎస్పీ అభ్యర్థుల్లో 21 మంది, ఎస్పీ అభ్యర్థుల్లో 13 మంది, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఐదుగురు, ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో ఐదుగురు, స్వతంత్రుల్లో 13 మందిపై ఈ కేసులు ఉన్నాయి. ఐదేళ్లలో పరిస్థితులు మారాయి సమాజ్‌వాది పార్టీకి గత ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని అందించిన ఈ 12 జిల్లాల్లో ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఆ పార్టీ ఓటు బ్యాంకును ఒకవైపు బీఎస్పీ, మరోవైపు బీజేపీలు కొల్లగొడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. 2012 ఎన్నికల్లో మయిన్‌పురి, ఇటావా, ఆరాయియా, బారాబంకి, కన్నౌజ్ జిల్లాల్లో ఎస్పీ స్వీప్ చేసింది. హర్దోయ్ జిల్లాలోని 8 సీట్లలో ఆరు సీట్లను, ఫరూఖాబాద్ జిల్లాలోని నాలుగు సీట్లలో మూడు సీట్లను, ఉన్నావ్ జిల్లాలోని ఆరు సీట్లలో ఐదు సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీలకు ఇక్కడ విజయం నామమాత్రంగానే ఉండింది. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకట్టి పోటీ చేస్తున్న అధికార పార్టీకి.. అభ్యర్థుల ఎంపికల్లో గొడవలు, అసమ్మతి నేతల తిరుగుబాట్లు, కులాల పునఃసమీకరణలు వంటి అంశాలు చిక్కుల్లోకి నెడుతున్నాయని అంచనా. పట్టణాల్లో మారుతున్న గాలి అలాగే సంప్రదాయంగా గతంలో బీజేపీకి ఆలంబనగా ఉన్న పట్టణ ప్రాంతాలు లక్నో, కాన్పూర్లలో ఐదేళ్ల కిందట సైకిల్ హవా వీచినా.. ఇప్పుడు గణనీయమైన మార్పులు రావచ్చునంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 19 సీట్లు (కాన్పూర్ రూరల్ మినహాయించి) ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఇమేజీని గ్రామీణ పార్టీ నుంచి ఆధునిక పార్టీగా మార్చడానికి అఖిలేశ్ చేసిన కృషితో పాటు.. ఉచిత ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉచిత వైద్యం వంటి హామీలు ఇక్కడ కలిసివచ్చాయి. మరోవైపు అంతర్గత పోరుతో పాటు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఫలితంగా.. బీజేపీ ఆధిక్యం ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీని ఎస్పీ అధిగమించింది. లక్నోలోని 9 సీట్లలో ఏడు, కన్పూర్‌లోని 10 సీట్లలో ఐదింటిని గెలుచుకుంది. ఇక్కడ గతంలో ఎన్నడూ ఎస్పీకి ఈ విజయం అందలేదు. ఇక బీజేపీ లక్నోలో ఒక్క సీటు, కాన్పూర్‌లో నాలుగు సీట్లు గెలుచుకుంది. కన్పూర్లో మరొక సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంత ఓటర్లు మళ్లీ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల ఎంపికలో లోపాలు, కొన్నిచోట్ల అసంతృప్త నేతల తిరుగుబాటుతో పాటు.. బీజేపీ బలమైన అభ్యర్థులను నిలపడం ఇందుకు ఒక కారణమైతే.. బీఎస్పీ అభ్యర్థుల వల్ల కూడా అధికార పార్టీకి నష్టం వాటిల్లేలా ఉందని చెప్తున్నారు. లక్నోలో లక్కు ఎవరిదో..? రాష్ట్ర రాజధాని లక్నో నగరంలోని 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ఎస్పీకి చాలా కీలకమైన విషయం. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఏడు స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ, బీఎస్పీలో చెరొకటి ఖాతాలో వేసుకున్నాయి. అయితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో లక్నో లోక్‌సభ స్థానం బీజేపీ వశమైంది. ఇప్పుడు.. ములాయం చిన్న కోడలు అపర్ణాయాదవ్ లక్నో కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. మరో ముగ్గురు మంత్రులు కూడా నగరంలో బరిలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటాబహుగుణజోషి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. ఆమె మీద అపర్ణాయాదవ్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ తరఫున యోగేష్దీక్షిత్ బరిలో ఉన్నారు. సరోజినీ నగర్లో అఖిలేశ్ బంధువైన అనురాగ్యాదవ్కు ఎస్పీ టికెట్ ఇవ్వడంతో.. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యే ఆర్ఎల్డీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఎస్పీ ఆకర్షణ మంత్రం.. ఇక ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి బీఎస్పీ రచించిన వ్యూహం.. ఈ మూడో దశ ఎన్నికల్లో ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందనీ చెప్తున్నారు. బారాబంకి, రామ్‌నగర్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఏనుగు వైపు మొగ్గుచూపుతుండటం.. ఎస్పీ ఠాకూర్ అభ్యర్థులకు ప్రతికూలంగా మారవచ్చు. సీతాపూర్ జిల్లాలోని లహార్పూర్, సెవాటా సీట్లతో పాటు.. కన్నౌజ్ జిల్లాలోని చిబ్రమావు, ఉన్నావ్ జిల్లాలోని బంగేర్‌మావు, ఫరూకాబాద్ జిల్లాలోని ఫరూకాబాద్ సదర్, హర్దోయ్ జిల్లాలోని షాహాబాద్ సీట్లలో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగా బీఎస్పీ వైపు చూస్తున్నట్లు పరిశీలకులు చెప్తున్నారు. అలాగే.. ఎతావా, భగ్వంత్నగర్ సీట్లలో బీఎస్పీ ముస్లిమేతర అభ్యర్థులకు.. బీజేపీ అభ్యర్థులను ఓడించగల సత్తా ఉండటంతో అక్కడి ముస్లిం ఓటర్లు కూడా ఏనుగు గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు. దీనికి బీఎస్పీ మౌనంగా ఉపయోగిస్తున్న ‘బ్రాహ్మణ కార్డు’ కూడా తోడవుతోంది. ఈసారి 67 మంది బ్రాహ్మణ అభ్యర్థులను ఆ పార్టీ బరిలోకి దించింది. రాష్ట్రంలో మరే పార్టీ ఇంత మంది బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదు. పార్టీ ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడకపోయినా కూడా.. అది దోహదం చేస్తోంది. హర్దోయ్ జిల్లాలోని సవాయిజ్పూర్, బిల్గ్రామ్-మల్లవాన్ సీట్లు, ఆరాయియా జిల్లాలోని దిబియాపూర్, ఎతావా జిల్లాలోని ఎతావా సదర్ సీట్లలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని బ్రాహ్మణ వర్గాలు సంప్రదాయంగా బీజేపీ మద్దతుదారులైనప్పటికీ.. ఈసారి వారిలో బీఎస్పీ అభ్యర్థులకు ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. బీఎస్పీకి శివ్‌పాల్ సాయం! ఇక ఎస్పీ నాయకత్వ కుటుంబంలో ఇటీవల రచ్చరచ్చ అయిన ఆధిపత్య పోరు.. యాదవ్‌ల కోటలైన ఇటావా, మయిన్‌పురి జిల్లాల్లో ప్రతిఫలిస్తోంది. ఇక్కడ అఖిలేశ్ బాబాయ్ శివ్‌పాల్ యాదవ్ శిబిరం.. బీఎస్పీ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు చెప్తున్నారు. శివ్‌పాల్ సన్నిహితులైన కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం.. ఆయన మద్దతుదారులను ఆగ్రహానికి గురిచేసింది. మయిన్‌పురి జిల్లాలోని కిష్నీ, కర్హాల్, భోగావ్ సీట్లలో బీజేపీ కన్నా.. బీఎస్పీ నుంచే అధికార పార్టీ బలమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇక్ మయిన్‌పురి సదర్ నియోజకవర్గంలో శివ్‌పాల్ మద్దతుదారులు ఎస్పీ అభ్యర్థికి వ్యతిరేకంగా బాహాటంగానే పనిచేస్తున్నారు. ఇక సీతాపూర్ జిల్లాలో సెవాతా, బిస్వాన్ నియోజవర్గాల్లో పార్టీ టికెట్ లభించిన ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి.. ఎస్పీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మారుతున్న కుల సమీకరణాలు ఇక ఎస్సీ వర్గాల వారిలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతుండటం ఎస్పీకి ఇబ్బందులు కలిగించే అవకాశముంది. ఈ ప్రాంతంలో బలమైన ఎస్సీ వర్గమైన పాసీలు సంప్రదాయంగా ఎస్పీ, బీఎస్పీ మద్దతుదారులు. అయితే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ వర్గం ఓట్లను గణనీయంగా సంపాదించుకోగలిగింది. ఇప్పుడు కూడా లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్, హర్దోయ్ జిల్లాలోని బలామావు, సాండీ (మూడూ ఎస్సీ రిజర్వుడు స్థానాలు)ల్లో కమలదళం బలమైన పాసీ అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆ వర్గాల వారు బీజేపీ వైపు మొగ్గుతున్నట్లు చెప్తున్నారు. బారాబంకి-సీతాపూర్ ప్రాంతంలో కుర్మీల అసంతృప్తి కూడా ఎస్పీకి సమస్యగా మారిందని పరిశీలకులు చెప్తున్నారు. ఎస్పీ రాజ్యసభ్యుడు, కుర్మీ నాయకుడు అయిన బేణీప్రసాద్‌వర్మ కుమారుడికి టికెట్ నిరాకరించడంతో.. ఆ వర్గం వారు బీఎస్పీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. -
మాటలు - మంటలు
-
నేడు యూపీ, ఉత్తరాఖండ్‌లలో పోలింగ్
-
నేడు యూపీ, ఉత్తరాఖండ్‌లలో పోలింగ్
లక్నో/డెహ్రాడూన్ : రెండో విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. అలాగే ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70 నియోజకవర్గాలకు గానూ 69 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. పశ్చిమ యూపీలోని ఫిలిబిత్, బిజ్నూర్, మొరాదాబాద్ తదితర 11 జిల్లాల్లో ఉన్న 67 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2.28 కోట్ల మంది ఓటేయనుండగా, అందులో మహిళలు 1.04 కోట్ల మంది ఉన్నారు. 720 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బర్హాపూర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని 69 స్థానాలకు మొత్తం 628 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మిస్డ్ కాల్ మేనిఫెస్టో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కొత్త విధానంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలను తెలుసుకోవాలనే ఓటర్లు ఒక నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఆ సమాచారాన్ని ఫోన్ లోనే పొందొచ్చు. మిస్డ్ కాల్ ఇచ్చిన వారికి తిరిగి ఫోన్ వస్తుంది. ఆన్సర్ చేయగానే కేవలం 60 సెకన్లలో మేనిఫెస్టోలోని 16 ప్రధానాంశాలను వినిపిస్తారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ప్రచారం చేయలేరు కాబట్టి ఈ విధానం ఉపయోగపడుతుందని అంటున్నారు. -
ఎస్పీ పట్టు నిలిచేనా?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ముస్లింలు, ఓబీసీలు అధికంగా ఉన్న తెరాయ్, రహేల్ఖండ్ ప్రాంతాల్లోని 11 జిల్లాల్లో 67 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ముస్లింల అండతో 2012లో ఇక్కడ దాదాపు సగం(34) సీట్లు గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఈసారి కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది. బలమైన మైనారిటీ నేత, రాష్ట్ర మంత్రి ఆజం ఖాన్ ఈ ప్రాంతంలో ఎస్పీకి పెద్ద దిక్కు. ఎస్పీలో అంతర్గత చిచ్చు, గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ హవా నేపథ్యంలో ప్రస్తుతం ఎస్పీ ఊపు అంతగా కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ముస్లింల ఆధిక్యం.. ఉత్తరాఖండ్, నేపాల్ సరిహద్దు జిల్లాల ప్రాంతం తెరాయ్. మొఘలుల హయాంలో ఆఖరిదశలో అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన రుహెల్లా పఠాన్లు పాలించిన ప్రాంతం రహేల్ఖండ్. ఈ రెండు ప్రాంతాల్లో ముస్లింల జనాభా దాదాపు 36 శాతం. రాంపూర్ జిల్లాలో ఏకంగా 50 శాతం ముస్లింలే. టర్కులు, పఠాన్లు, సైఫీలు, అన్సారీలు.. ముస్లింలలో బలమైన వర్గాలు. ఓబీసీల్లో కుర్మీలు బలీయంగా ఉన్న ప్రాంతమిది. తర్వాతి స్థానం మౌర్య కులస్తులది. షహరన్ పూర్ జిల్లాలో రాజకీయంగా, సంఖ్యాపరంగా గుజ్జర్ల ఆధిక్యంలో ఉంది. ఎస్పీకి దన్ను గా నిలిచే యాదవ సామాజికవర్గం బదౌన్, సంబల్లు మినహా మిగతా 9 జిల్లాల్లో పెద్దగా లేదు. దీంతో ఆ పార్టీ ప్రధానంగా ముస్లిం ఓట్లపైనే ఆధారపడుతోంది. వీరిలో ఓట్లలో చీలిక వస్తే నష్టపోతామని భయపడుతోంది. బరిలో నిలిచిన ఎంఐఎం, ఇతర చిన్నాచితక ముస్లిం పార్టీల ప్రభావం అంతగా ఉండకపోవచ్చుగాని, వీరివల్ల జరిగే ఎంతోకొంత నష్టం మాత్రం ఎస్పీకే. తాజా ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 18 సీట్లు ఇచ్చిన ఎస్పీ... హస్తంతో తమ పొత్తుపై, అభివృద్ధికి పెద్దపీట వేసే యువ సీఎంగా అఖిలేశ్‌కు ఉన్న ఇమేజ్‌పై ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం ఎస్పీకి సవాల్‌గా మారింది. దళిత, మైనారిటీ వాదాన్ని వినిపించే బీఎస్పీకి ఈ ప్రాంతంలో ఏనాడూ 20 శాతానికి మించి ముస్లిం ఓట్లు పడలేదు. అయితే పలు జనరల్ స్థానాల్లో బీఎస్పీ తరఫున మాత్రమే ముస్లిం అభ్యర్థి ఉండటం, నియోజకవర్గాల వారీగా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని ముస్లింలు ఓటేస్తే ఆ పార్టీ లాభపడుతుంది. బీఎస్పీకి సహజంగా ఉండే దళిత ఓటు బ్యాంకూ ఉంటుంది. చిక్కుల్లో బీజేపీ.. బదౌన్, ఖేరి జిల్లాలో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను వీడి వచ్చిన వారికి టిక్కెట్లిచ్చిన బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతోంది. యాదవేతర ఓబీసీల్లో బలం కూడగట్టుకుంటున్న బీజేపీకి అగ్రవర్ణాల మద్దతు ఉంది. మతపరమైన ఓట్ల విభజనకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. హిందువుల, ఓబీసీల్లోని యాదవేతరుల ఓట్లను ఏకం చేయడం ద్వారా ఇక్కడ సీట్లను పెంచుకోవాలని (2012లో బీజేపీ పదిచోట్లే గెలిచింది) చూస్తోంది. ఎస్పీలో అంతర్గత కలహాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలు తమకు కలసి వస్తాయని భావిస్తోంది. ఇక్కడి రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే చెరుకు రైతుల బకాయిలను ఇప్పిస్తామని హామీ ఇస్తోంది. పోటీలో ఉన్న ప్రముఖులు ఆజంఖాన్ (మంత్రి– ఎస్పీ)– రాంపూర్, అబ్దుల్ అజం (ఆజంఖాన్ కుమారుడు, ఎస్పీ)– సువార్, జితిన్ ప్రసాద్ (మాజీ కేంద్రమంత్రి– కాంగ్రెస్)– తిల్హర్, మెహబూబ్ అలీ (మంత్రి– ఎస్పీ)– అమ్రోహా, సురేష్ కుమార్ ఖన్నా (బీజేఎల్పీ నాయకుడు)– షాహజాన్ పూర్. రెండో దశ పోలింగ్ అసెంబ్లీ నియోజకవర్గాలు 67 బరిలో ఉన్న అభ్యర్థులు 720 ఇందులో మహిళలు 39 మొత్తం ఓటర్లు 2.28 కోట్లు ఇందులో మహిళలు 1.04 కోట్లు పోలింగ్ కేంద్రాలు 14,771 పోలింగ్ బూత్‌లు 23,693 2012 ఎన్నికల్లో 67 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఎస్పీ 34 బీఎస్పీ 18 బీజేపీ 10 కాంగ్రెస్ 3 ఇతరులు 2 జిల్లాలు– అసెంబ్లీ స్థానాలు: షహరన్ పూర్–7, బిజ్నోర్–8, మొరాదాబాద్–6, సంబల్–4, రాంపూర్–5, బరేలీ–9, అమ్రోహా–4, ఫిలిబిత్–4, ఖేరి–8, షాహజాన్ పూర్–6, బదౌన్ –6. -
‘నేను అసలు ఏ పార్టీ పెట్టట్లేదు’
లక్నో: ‘కొత్త పార్టీ పెడతాను.. నువ్వు ముఖ్యమంత్రి ఎలా అవుతావో చూస్తాను’ అంటూ అనూహ్య కామెంట్లు చేసి సమసిపోయిందనుకున్న సమాజ్‌వాది పార్టీలోని అసమ్మతి ముసలానికి మరోసారి ఊపిరిలూదీన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ మాట మార్చారు. ఎట్టకేలకు తాను అసలు ఏ పార్టీ పెట్టడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం మీడియా ముందు స్పష్టం చేశారు. ఆ రోజు ఏవో కోపంతో మాటలు అని అర్ధం వచ్చినట్లుగా ఆయన బదులిచ్చారు. ఎప్పటికీ తన సోదరుడు ములాయంతోనే ఉండిపోతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితా తేది మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొడుకు చేసిన చర్యలపై తొలుత అలకబూనిన ములాయం ఆ వెంటనే అందులో నుంచి బయటకు రావడమే కాకుండా కాంగ్రెస్, ఎస్పీలు విజయం సాధిస్తాయని స్వయంగా ప్రకటించారు. తన సోదరుడు శివపాల్ ఏదో కోపంలో ఆ రోజు పార్టీ పెడతానని, అన్నాడేగానీ నిజానికి అలాంటిదేమీ లేదని చెప్పారు. దీనికి కొనసాగింపుగానే తాజాగా శివపాల్ కామెంట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధిత మరిన్ని వార్తలకై చదవండి పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా అఖిలేశ్‌కే సైకిల్ గుర్తు అఖిలేశ్ లిస్టులో బాబాయ్ సైకిల్‌కు రెండు చక్రాలం -
పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనగా మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సవాల్ విసిరారు. అఖిలేష్‌కు శివపాల్ స్వయానా బాబాయ్ అవుతారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎస్పీ జతకట్టడాన్ని శివపాల్ తప్పుపట్టారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన ములాయం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎతాహ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో శివపాల్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, యూపీలో కనీసం నాలుగు సీట్లు కూడా గెలవలేదు అని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ తరఫునే జస్వంత్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తానని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త పార్టీని స్థాపిస్తానని చెప్పారు. ములాయంను అఖిలేష్ అవమానించారని, కావాలనే తన వర్గీయులకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో ఎక్కువ మంది తనతోనే ఉన్నారని శివపాల్ చెప్పారు. యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 11 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మార్చి 11న ఓట్లను లెక్కిస్తారు. సమాజ్‌వాదీ పార్టీ.. అఖిలేష్, శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి అఖిలేష్ పోరాడుతున్నారు. సంబంధిత వార్తలు చదవండి అఖిలేశ్‌కే సైకిల్ గుర్తు అఖిలేశ్ లిస్టులో బాబాయ్ సైకిల్‌కు రెండు చక్రాలం -
ఉత్తరప్రదేశ్‌లో...
బీజేపీదే గెలుపు! టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 202 సీట్లు ౖకైవసం చేసుకోగలదని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వేలో తేలింది. ఎన్నికల్లో 34% ఓట్లు బీజేపీకి దక్కుతాయని సర్వే పేర్కొంది. ఇక, ఎస్పీ–కాంగ్రెస్ కూటమి కేవలం 147 సీట్లు గెలుచుకోగలదని, కూటమికి 31శాతం ఓట్లుపడతాయని సర్వే వెల్లడించింది. ముస్లిం ఓట్లపై ఆశలుపెట్టుకున్న మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కేవలం 47సీట్లు వస్తాయంది. బీఎస్పీకి 24శాతం ఓట్లు దక్కుతాయని పేర్కొంది. అజిత్‌సింగ్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌దళ్, ఇతర పార్టీలకు ఏడు సీట్లు దక్కుతాయని తెలిపింది. అత్యంత పాపులారిటీ ఉన్న సీఎంగా అఖిలేశ్ యాదవ్ తొలిస్థానంలో నిలిచారు. 39% మంది అఖిలేశ్‌కు మద్దతుపలికారు. 23% మంది మద్దతుతో మాయావతి రెండోస్థానం పొందారు. ఎస్పీ కూటమిదే! ది ఏబీఎన్–సీఎస్డీఎస్ సర్వే న్యూఢిల్లీ: యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ–కాంగ్రెస్ కూటమి 187–197 సీట్లు సాధించగలదని ది ఏబీఎన్ న్యూస్–సీఎస్డీఎస్–లోక్‌నీతి తాజా ఒపీనియన్ పోల్ ఫలితాల్లో తేలింది. ఈ కూటమికి 35శాతం ఓట్లుపడతాయంది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. కాబోయే సీఎం అర్హత ఉన్న వ్యక్తిగా 26% మద్దతుతో అఖిలేశ్ మందునిలిచారు. ఇక 118–128సీట్లు బీజేపీకి దక్కే వీలుందని సర్వే చెబుతోంది. నోట్ల రద్దు అంశం రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వెల్లడైంది. నోట్లరద్దు నిర్ణయానికి మద్దతు గత నెలరోజుల్లో 35శాతం నుంచి 41శాతానికి చేరింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 76–86సీట్లు రావచ్చు. బీజేపీకి మద్దతుపలికే 21శాతం మంది సంప్రదాయ ఓటర్లు సైతం ఈసారి ఎస్పీ–కాంగ్రెస్ కూటమికీ ఓట్లేసే వీలుంది. -
ఆ 10 చోట్ల కాంగ్రెస్ పోటీ
అమేథీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ (వరుసగా) లోక్‌సభ స్థానాల పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–కాంగ్రెస్‌ల మధ్య పొత్తు విషయంలో ఈ సీట్లే వివాదాస్పదం అయ్యాయి. చివరికి ఈ సీట్లను కాంగ్రెస్‌కే కేటాయిస్తామని ఎస్పీ హామీనిచ్చినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సంజయ్ సింగ్ తెలిపారు. -
చిన్నకోడలి వ్యూహాలు ఏంటి?
ఎన్నికలకు సమయం దగ్గర పడింది. వ్యూహ ప్రతివ్యూహాలతో కొమ్ములు తిరిగిన నాయకులంతా దూసుకెళ్తున్నారు. తలపండిన ఒక సీనియర్ మోస్ట్ నాయకురాలితో.. ఇప్పుడే తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న ములాయం చిన్నకోడలు తలపడుతున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రీటా బహుగుణ జోషితో ఢీకొంటున్న అపర్ణాయాదవ్ తన సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. పోటీ చేయమని తన మీద బాగా ఒత్తిడి వచ్చిందని, దాంతో టికెట్ ఇవ్వండి.. ఎక్కడైనా నెగ్గుతానని తమవాళ్లతో చెప్పినట్లు ఆమె ధీమాగా తెలిపారు. పెద్దకోడలు డింపుల్ యాదవ్ కొంతవరకు సురక్షితమైన స్థానాన్ని ఎంచుకోగా.. అపర్ణ మాత్రం అసలు సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఎంచుకున్నారు. తనకు అదే టికెట్ కావాలని ఆమె కోరగా.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న బావగారు అఖిలేష్ యాదవ్ కూడా అదే టికెట్‌ను ఆమెకు ఖరారు చేశారు. వారసత్వ రాజకీయాలు తప్పవా.. అని పలువురు మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా, దానికి దీటుగా సమాధానం ఇచ్చారు. లాయర్ల కొడుకులు లాయర్లయితే తప్పులేదు, డాక్టర్ల పిల్లలు మెడిసిన్ చదివితే తప్పులేదు గానీ నాయకుల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని అడిగారు. సమాజ్‌వాదీ కుటుంబ రాజకీయాల్లో భాగంగా ఆమె తన మామగారు ములాయం సింగ్ యాదవ్, చిన మామగారు శివపాల్ యాదవ్‌లకు గట్టి మద్దతుగా నిలిచారు. ఈ అంశంపై ప్రశ్నించినప్పుడు.. నేతాజీ తన రోల్ మోడల్ అని, బావగారు యూత్ ఐకాన్ అని, శివపాల్ చాచా పార్టీకి వెన్నెముక లాంటివారని ఆమె చెప్పారు. కుటుంబాన్ని ఏకం చేయడానికి కోడలిగా తాను చేయగలిగినంత చేశానని, ఇప్పుడు అంతా ఒక్కటయ్యారు కాబట్టి ఇక బాధలేదని అన్నారు. మాజీ జర్నలిస్టు కుమార్తె అయిన అపర్ణా యాదవ్.. లక్నోలో ఫేమస్ అయిన లారెటో కాన్వెంట్లో చదివి, తర్వాత ఇంగ్లీషు సాహిత్యంలో బీఏ ఆనర్స్ చేశారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాల్లో పీజీ చేశారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె.. తరచు స్టేజి మీద కూడా ప్రదర్శనలు వచ్చేవారు. ఐదేళ్ల క్రితం ములాయం చిన్నకొడుకు ప్రతీక్ యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. అతడికి రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోవడంతో అపర్ణను బరిలోకి దించాలని ములాయం రెండోభార్య సాధన పట్టుబట్టారు. దాంతో చిన్నకోడలు బరిలోకి దిగాల్సి వచ్చింది. -
నా కొడుకుపై అంత కోపాన్ని చూపగలనా!?
దాదాపు నెలరోజులపాటు జరిగిన కుటుంబ ఆధిపత్యపోరులో నెగ్గి పార్టీపై పూర్తి పట్టు సాధించిన యూపీ సీఎం, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్వరం మార్చారు. అందరూ తనవారేనంటూ దగ్గరికి తీసుకుంటున్నారు. ఒకప్పుడు బద్ధ శత్రువుగా పరిగణించిన అమర్‌సింగ్‌ను ఉద్దేశించి సైతం 'అంకుల్' అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఓ హిందీ చానెల్ నిర్వహించిన సదస్సులో మాట్లాడిన అఖిలేశ్ తన వర్గం, కుటుంబం అంతా ఒక్కటే అన్న సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు. తండ్రి ములాయం సింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఆయన సమాజ్‌వాదీ (సోషలిస్ట్). ఇంట్లో, బయటా ఒకేవిధంగా కోపాన్ని వ్యక్తం చేస్తారు' అని అన్నారు. కుటుంబ వివాదంలో తనకు కలిగిన భావోద్వేగాలను వ్యక్తంచేస్తూ.. 'నా కొడుకుపై నేనెప్పుడైనా ఈవిధంగా కోప్పడగలనా? అని అనుకున్నాను' అని పేర్కొన్నారు. ములాయం పలుసందర్భాల్లో బాహాటంగానే అఖిలేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బహిరంగంగా అఖిలేశ్ పాలనను ఆయన విమర్శించారు కూడా. ఇక, తనను ఎస్పీ నుంచి గెంటేశారని అమర్‌సింగ్ ఒకవైపు ఆవేదన చెందుతుండగా.. ఆయన మంచి వ్యక్తి అని, తమ కుటుంబాన్ని ఎంతోగానో ప్రేమిస్తారని అఖిలేశ్ సాంత్వనపూరిత వ్యాఖ్యలు చేశారు. -
బరిలో ములాయం రెండో కోడలు
లక్నో: యూపీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ చాలా పకడ్బందీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. యాదవ్ కుటుంబం నుంచి మరో అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. లక్నోలోని కంటోన్మెంట్ ప్రాంతం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై.. ములాయం రెండో కోడలు అపర్ణ యాదవ్ (అఖిలేశ్ చిన్నమ్మ కొడుకు ప్రతీక్ భార్య)ను పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రీటా బహుగుణ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కొంతకాలంగా ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో అపర్ణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూపీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రచారం మంగళవారం ప్రారంభించనున్నారు. సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి యాదవ్ ప్రచారం మొదలుకానుంది. కాగా, యూపీలో మూడో విడత ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారభం కానుంది. -
మీ ఓట్లు ఏమయ్యాయి.. పొత్తెందుకో తెలుసు: ఒవైసీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరిస్థితి ఫ్రెషర్ కుక్కర్లో ఉన్నట్లే ఉందని ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సమాజ్ వాది పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు ఫ్రెషర్ కుక్కర్లు ఇస్తామని వాగ్ధానం చేసిన నేపథ్యంలో దానిని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పీటీఐతో మాట్లాడిన సందర్భంగా సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీల పొత్తును ఎండగట్టారు. వారి తప్పిదాలను, బలహీనతలు కప్పి పుచ్చుకునేందుకు ఆ రెండు పార్టీలో ఓ చోటచేరాయని, అదంతా కూడా ఓ వివాదాల గుంపు అని ఆరోపించారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ఓట్లు ఏమయ్యాయని, ఆ బలహీనతను బయటపడకుండా చూసుకునేందుకే ఏకం అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేస్తుంటే అందులో 20మంది వరకు కూడా ఎస్పీకి చెందినవారే ఉన్నారని తెలిపారు. నిజంగా ముస్లిం ఓట్లర్లపట్ల ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి సానుభూతే ఉంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ముస్లిం కూడా ఎందుకు గెలిపించలేకపోయారని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీల అమలులో ఎస్పీ విఫలమైందని చెప్పారు. యూపీ ప్రజలకు 2012 ఎన్నికల మేనిఫెస్టో గుర్తుందని, 2013 ముజఫర్‌నగర్ దాడులు, ఆ సమయంలో చేసిన హామీలు గుర్తున్నాయని అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ తెస్తామని హామీ ఏమైందని, అఖిలేశ్ దీనిపై కనీసం కమిటీ వేశారా అని ప్రశ్నించారు. 2002లో నరేంద్రమోదీ ప్రభుత్వం సమయంలో జరిగిన గుజరాత్ అల్లర్లే ప్రజలు ఇప్పటి వరకు మర్చిపోలేదని, అలాంటిది 2013లో అఖిలేశ్ పరిపాలనలో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు మాత్రం ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు. దాడులు జరిగి మూడేళ్లయినా నిందితులపై చర్య తీసుకునే ఒక్క ఫైలు కూడా ఎందుకు ముందుకెళ్లలేదని నిలదీశారు. ముస్లింలకు వారు చేసింది ఏమీ లేదని ఇప్పటి వరకు ఒక్క ఉర్దూ పాఠశాలను కూడా వారు తెరిపించలేదని అన్నారు. ప్రధాని పనితీరుకు, అఖిలేశ్ పాలనకు కచ్చితంగా తగిన తీర్పునిస్తారని చెప్పారు. మోదీ, అఖిలేశ్ నినాదం ఒక్కటేనని అది కూడా అభివృద్ధి అని కాకపోతే అది మాత్రం ఎక్కడా కనిపించలేదని దుయ్యబట్టారు. -
నేను.. నాన్న.. మేనిఫెస్టో..
లక్నో: ‘కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది)’ నినాదంతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్.. భారీ ఉచిత హామీలు గుప్పించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఆదివాంర జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి అఖిలేశ్ తండ్రి ములాయంసింగ్ యాదవ్, చిన్నాన్న శివ్‌పాల్ యాదవ్ గైర్హాజరయ్యారు. దీంతో కొడుకుపై తండ్రి ఇంకా కోపంగానే ఉన్నారని, ములాయంను సంప్రదించకుండా అఖిలేశ్ మేనిఫెస్టో విడుదల చేశారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ చర్చకు ఫుల్స్టాప్ పెడుతూ, నేతాజీ తనవెంటే ఉన్నారనడానికి నిదర్శనంగా సీఎం అఖిలేశ్ యాదవ్ ఒక ఫొటోను పోస్ట్‌చేశారు. (ఎస్పీకి గట్టి షాక్!) ములాయం రెండు చేతుల్లో రెండు మేనిఫెస్టో కాపీలు పట్టుకుని ఉండగా, పక్కనే అఖిలేశ్, డింపుల్ యాదవ్‌లు, మరోవైపు మంత్రి ఆజం ఖాన్ నిల్చున్న ఫొటోను అఖిలేశ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తద్వారా తనకు తండ్రి ఆశీర్వాదాలున్నాయని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఫొటోకు మాత్రమే పోజిచ్చిన ములాయం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న అఖిలేశ్ అభ్యర్థనను మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. (ప్రెషర్ కుక్కర్లు.. స్మార్ట్ఫోన్లు!) ములాయం ప్రచారంలో పాల్గొనకపోవడం వల్ల ఎస్పీకి నష్టం వాటిల్లుతుందనే వాదన బలంగా వినిపించినప్పటికీ పెద్దాయన ససేమిరా అనడంతో.. అఖిలేశ్ ఈ తరహా ఫొటోలతో నష్టనివారణ చర్యలకు నడుంకట్టారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11 మొదటిదశ, మార్చి 4న ఆఖరిదశ పోలింగ్ ఉంటుంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 105 సీట్లు కేటాయించిన ఎస్పీ 298 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. -
ఎస్పీకి గట్టి షాక్! అబ్బే!! అదేం లేదు..
- నరేశ్ అగర్వాల్ బీజేపీలోకి వెళతారంటూ పుకార్లు - ఖండించిన ఎంపీ.. అఖిలేశ్తోనే ఉంటానని స్పష్టీకరణ లక్నో: ఎన్నికల వేళ సోషల్ మీడియా వేదికగా కొందరు విపరీత ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరడంతో గెలుపు అవకాశాలు పెగిగాయని సంబరపడిపోతున్న సమాజ్‌వాదీ పార్టీకి గట్టి షాక్ తగిలిందని, ఎస్పీ వ్యవస్థాప సభ్యుల్లో ఒకరు, ప్రస్తుత ఎంపీ నరేశ్ అగర్వాల్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సోమవారం ఉదయం నుంచి వార్తలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌తో ఎస్పీ ఎన్నికల పొత్తును నిరసిస్తూ అగర్వాల్ నేడో, రేపో బీజేపీలోకి చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో యూపీలో కలకలం చెలరేగింది. పార్టీ మారతారనే పుకార్లు వెలుగులోకివచ్చిన కొద్దిసేపటికే ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. "నేను బీజేపీలో చేరతాననే వార్తలు పూర్తిగా అబద్ధం. నాకా ఆలోచనలేనేలేదు. సమాజ్‌వాదీ పార్టీలోనే నా జీవితం కొనసాగుతుంది. అఖిలేశ్ నాయకత్వంలోనే పనిచేస్తా. బీజేపీని చిత్తుగా ఓడించడమే మా లక్ష్యం" అని నరేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తోన్న నరేశ్ అగర్వాల్.. ఎస్పీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత ఆప్తుడైన ఈ నేత.. మొన్నటి కుటుంబ పంచాయితీలో మాత్రం అఖిలేశ్ పక్షాన నిలబడ్డారు. (ఎస్పీ- కాంగ్రెస్ పొత్తు కుదిరింది..) ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్పైనా ఇలాంటి పుకార్లే గుప్పుమన్నాయి. విశ్వాస్ బీజేపీలో చేరతారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చజరిగింది. అయితే అలాంటిదేమీలేదని క్లారిటీ ఇచ్చిన విశ్వాస్.. తనపై విషప్రచారం జరుగుతున్నదని ఆరోపించారు. 'మోదీ టీడీపీలోకి చేరతారా?' అని ఎదురు ప్రశ్నించారు. సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తోన్న కాషాయ దళమే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నదని ప్రత్యర్థిపార్టీలు ఆరోపిస్తున్నాయి. -
ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది..
-
పొత్తు కుదిరింది..
► ఎస్పీ, కాంగ్రెస్ మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు ► 298 స్థానాల్లో ఎస్పీ, 105 సీట్లలో కాంగ్రెస్ పోటీ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య కొంతకాలంగా నడుస్తున్న సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగానూ 298 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ, మిగిలిన 105 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు నరేశ్‌ఉత్తమ్, యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ ఆదివారం లక్నోలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తాయని, ఈ ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జోక్యం చేసుకోవడంతో ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితా యూపీ ఎన్నికలకోసం బీజేపీ 155 మందితో తొలిజాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా 44 మందితో తొలి జాబితా విడుదల చేసింది. -
కాంగ్రెస్‌లో కొత్తనీరు.. ఆ క్రెడిట్ ఆమెదే..!
అఖిలేశ్, డింపుల్‌తో చర్చలు తుదివరకు ఉత్కంఠరేపుతూ తీవ్ర మంతనాల నడుమ ఉత్తరప్రదేశ్‌లో అధికార ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మ్యానిఫెస్టో ప్రకటన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలవరకు జరిగిన మంతనాలు, చర్చల అనంతరం ఈ పొత్తు కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొదట కాంగ్రెస్‌కు 99 సీట్లు ఇవ్వడానికి ఎస్పీ అంగీకరించగా.. హస్తం నేతల మొండిపట్టుతో 105 సీట్లు ఇవ్వడానికి ఒప్పుకొంది. దీంతో హస్తంతో పొత్తు ఖాయమని సీఎం అఖిలేశ్ కూడా విలేకరులకు వెల్లడించారు. అత్యంత నాటకీయంగా సాగిన ఈ పొత్తు వ్యవహారంలో పూర్తి క్రెడిట్ ప్రియాంకగాంధీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపడం గమనార్హం. పార్టీ సీనియర్ నేత, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ట్వీట్ చేస్తూ ప్రియాంకకు క్రెడిట్ ఇచ్చారు. ’(పొత్తు చర్చల కోసం) కాంగ్రెస్ పార్టీ చిన్నస్థాయి నేతలు మాత్రమే రంగంలోకి దిగారనడం తప్పు. అత్యున్నత స్థాయిలో యూపీ సీఎం, ప్రియాంకాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మధ్య చర్చలు జరిగాయి’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. పొత్తు చర్చల్లో ప్రియాంకగాంధీ అత్యంత చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అఖిలేశ్, ఆయన సతీమణి డింపుల్‌తో కూడా ఆమె చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, సీట్ల పంపకాల్లో రాజీ కుదరకపోవడంతో శనివారం పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో సోనియాగాంధీ రంగంలోకి దిగి జోక్యంతోనే పొత్తు ఖరారైందని ఎస్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబ వారసురాలు ప్రియాంకకు క్రెడిట్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్నికల్లో అంటీముట్టనట్టు ఉన్న ప్రియాంక రానున్న యూపీ ఎన్నికల్లో మరింత చురుగ్గా పాల్గొంటారేమోనన్న రీతిలో సంకేతాలు ఇస్తున్నారు. -
సోనియా జోక్యంతో కొలిక్కి వచ్చింది
-
ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తాం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు ప్రెషర్ కుకర్లను ఇస్తామని చెప్పారు. ఆదివారం లక్నోలో ఆయన ఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలేష్ భార్య, డింపుల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. యూపీలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా, మేనిఫెస్టోలో ప్రజాకర్షణ పథకాలను చేర్చారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే.. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా కోటిమంది పేద మహిళలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్ పంపిణీ బస్సుల్లో మహిళలకు ప్రయాణ టిక్కెట్లపై 50 శాతం రాయితీ సమాజ్‌వాదీ స్మార్ట్‌ఫోన్ యోజన పథకం పేరుతో పేదలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు ఉచితంగా ప్రెషర్ కుకర్లు చేనేత, హస్తకళల పరిశ్రమలను అభివృద్దికి కృషి లక్నో విమానాశ్రయంలో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు -
సోనియా జోక్యంతో కొలిక్కి వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 105 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఎస్పీ అంగీకరించింది. కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇరు పార్టీల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చెప్పారు. తమకు 110 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టగా, 100 స్థానాలు మాత్రమే ఇస్తామని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కుదరని సంగతి తెలిసిందే. చివరకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం జోక్యంతో 105 సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ అంగీకరించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అఖిలేష్‌తో చర్చలు జరిపారు. -
ములాయం హోదా, నేమ్ ప్లేట్ మారాయి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ హోదా మారింది. మొన్నటి వరకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరించిన ములాయం ఇకనుంచి గార్డియన్‌గా ఉంటారు. శనివారం రాత్రి లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆయన నేమ్ ప్లేట్‌ను మార్చారు. చాలా ఏళ్లుగా ఉన్న ‘ములాయం సింగ్ యాదవ్, జాతీయ అధ్యక్షుడు’ నేమ్ ప్లేట్ స్థానంలో, ‘ములాయం సింగ్ యాదవ్, గార్డియన్’ అనే నేమ్ ప్లేట్‌ను ఉంచారు. ములాయం కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గం.. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ములాయంను తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. ములాయం కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలు అనేక మలుపులు తిరుగుతూ, చివరకు అఖిలేష్ వర్గం పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ నేపథ్యంలో ములాయంను గార్డియన్‌గా పేర్కొంటూ పార్టీ ఆఫీసులో నేమ్ ప్లేట్ ఉంచారు. పార్టీలో ములాయంకు, అఖిలేష్‌కు సమాన హోదా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్‌కు ములాయం మార్గదర్శకుడిగా ఉంటారని తెలిపారు. -
‘ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు’లో కొత్త ట్విస్ట్
-
‘ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు’లో కొత్త ట్విస్ట్
లక్నో: పొత్తుల ద్వారాలు దాదాపు మూతపడే సమయానికి.. ’సమయం ఉంది మిత్రమా..’ అంటూ కోరుకున్న నేస్తానికి కబురు పంపాడు అఖిలేశ్ యాదవ్! ఉత్తరప్రదేశ్‌లో ఇక ఉండదేమో అనుకున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీల పొత్తుపై శనివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎస్పీ చీఫ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తాజాగా ఒక ప్రతిపాదనకు తలొగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అటు బీజేపీని, ఇటు బీఎస్పీని ఒక్కసారే చిత్తు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు తప్పదని గట్టిగా నమ్ముతోన్న అఖిలేశ్.. హస్తం గుర్తు పార్టీకి 99 స్థానాలు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అనేది రేపు(ఆదివారం) ఉదయం తేలుతుందని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇదే విషయంపై ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. 300 స్థానాలకు తగ్గకుండా పోటీచేయాలనేది తమ అభిమతమని అన్నారు. వీగిపోయిందనుకున్న పొత్తు.. ‘అఖిలేశ్ 99’ ఆఫర్‌తో తిరిగి జీవం పోసుకుందని అన్నారు. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో మొదటిదశ పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుంది. -
ములాయంకు మరో ఎదురుదెబ్బ
-
ములాయంకు మరో ఎదురుదెబ్బ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న మొన్నటివరకు తనకు కుడిభుజంగా భావించిన పార్టీ సీనియర్ నాయకుడు అంబికా చౌదరి పార్టీకి రాజీనామా చేసి.. బీఎస్పీలో చేరారు. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని, ఇక తనను తాను పూర్తిగా బహుజన సమాజ్ పార్టీకి అంకితం చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో తొలుత వెనకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అంబికా చౌదరి.. మరో ఎనిమిది మందితో పాటు ఉద్వాసనకు గురయ్యారు. ఈయన ఒకప్పుడు ములాయంకు సన్నిహితుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టమే అవుతుందని అంటున్నారు. -
అఖిలేశ్ లిస్టులో బాబాయ్
210 మందితో సమాజ్‌వాదీ తొలి జాబితా విడుదల ఎస్పీ–ఆర్ఎల్డీ పొత్తు చర్చలు విఫలం చిన్న పార్టీలతో కలిసి పోటీచేయాలని ఆర్ఎల్డీ నిర్ణయం లక్నో, సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీపై పట్టు కోసం తుది దాకా తలపడ్డ తండ్రీ కొడుకులు మళ్లీ ఒకటయ్యారు. ఎస్పీ అభ్యర్థుల జాబితాలో బాబాయ్ శివ్‌పాల్‌కు చోటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ములాయం– అఖిలేశ్‌ల మధ్య సయోధ్య కుదిరినట్లేనని భావిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ శుక్రవారం 210 మందితో జాబితా విడుదల చేయగా... జాబితాలో అఖిలేశ్ బద్ధ శత్రువు, ములాయం వర్గానికి చెందిన శివ్‌పాల్‌కు చోటుదక్కింది. శివ్‌పాల్‌కు జస్వంత్‌నగర్ స్థానాన్ని కేటాయించాలన్న ములాయం కోరికను కూడా అఖిలేశ్ పరిగణనలోకి తీసుకున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ కుమారుడు రాకేశ్ వర్మకు ములాయం కోరినట్లు రాంనగర్ సీటు కాకుండా కైసర్‌గంజ్ స్థానం కేటాయించారు. గత నెల్లో ములాయం విడుదల చేసిన జాబితాలో లేని చాలా పేర్లు అఖిలేశ్ జాబితాలో ఉండడం విశేషం. మొత్తం 210 మందిలో 59 మంది ముస్లింలకు ఎస్పీ టికెట్లిచ్చింది. కాంగ్రెస్‌కు 85 స్థానాల వరకూ ఇవ్వగలమని, పొత్తు కుదిరితే ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల్ని ఉపసంహరించుకుంటామని పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా వెల్లడించారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మాత్రమే పొత్తుకు అఖిలేశ్ సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ములాయం సూచన మేరకే ఆర్ఎల్డీతో పొత్తుకు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో జేడీయూ, ఇతర చిన్న పార్టీల్ని కలుపుకుని ముందుకెళ్లాలని ఆర్ఎల్డీ నిర్ణయించింది. -
పొత్తు కాంగ్రెస్‌తోనే..
ఆర్ఎల్డీతో ఉండదు: ఎస్పీ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడుతుం దన్న ఊహాగానాలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఫుల్స్టాప్ పెట్టింది. కాంగ్రెస్‌తోనే కలసి పోటీ చేస్తామని, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో తమకు ఎలాంటి పొత్తూ ఉండబోదని స్పష్టం చేసింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తోనే పొత్తు కుదుర్చుకున్నాం. ఆర్ఎల్డీతో ఎలాంటి అవగాహనా లేదు. ఆ పార్టీతో మేం అసలు చర్చించనే లేదు. మేం రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలకు 300కి పైగా సీట్లలో పోటీ చేస్తాం. మిగతా వాటిలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలుపు తుంది’అని తెలిపారు. పొత్తు, సీట్ల కేటా యింపునకు సంబంధించి ఎస్పీ అధినేత, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకులతో గురువారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చిం చారు. అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నందా వెల్లడించారు. తాము ఇవ్వజూపిన సీట్ల కన్నా ఆర్ఎల్డీ అదనంగా కోరిందని.. దాంతో ఆ పార్టీతో పొత్తును రద్దు చేసుకున్నట్లు ఎస్పీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎస్పీని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ అధినేత అఖిలేశ్.. శివ్‌పాల్ యాదవ్ బహిష్కరించిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. -
ఆ పార్టీతో పొత్తులేదని తేల్చేసిన ఎస్పీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో బీజేపీని ఎదుర్కోవాలని పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న సమాజ్‌వాద్ పార్టీ, తమలో రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)ని కలుపుకుంటుందనే వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. ఆర్ఎల్డీతో తాము ఎలాంటి పొత్తు కుదుర్చుకోమంటూ సమాజ్‌వాద్ పార్టీ గురువారం తేల్చేసింది. తాము కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుపెట్టుకుంటామని పేర్కొంది. '' ఎస్పీ కేవలం కాంగ్రెస్‌తోనే పొత్తుకు సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకోం. ఆర్ఎల్డీతో ఎలాంటి చర్చలు జరుపడం లేదు. మొత్తం 403 సీట్లలో 300 సీట్లలో ఎస్పీ పోటీ చేస్తాం. మిగతా 103 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది'' అని సమాజ్‌వాద్ పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్మయ్ నందా స్పష్టంచేశారు. పార్టీ సీనియర్ లీడర్లు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో ఆరుగంటల పాటు జరిపిన చర్చలానంతరం పొత్తులపై నిర్ణయాన్ని ప్రకటించారు. ఎస్పీ ఇస్తానన్న సీట్ల కంటే ఆర్ఎల్డీ ఎక్కువ సీట్లను కోరుతుందని అందుకే పొత్తు చర్చలు కుదరలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
బీఎస్పీ టు ఎస్పీ వయా బీజేపీ..!
లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో వలసలు జోరందుకున్నాయి. టిక్కెట్లు రానివారు, అసంతృప్త నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఈ జాబితాలో ఓబీసీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఆర్నెళ్ల క్రితం ఆ పార్టీ నుంచి మౌర్య బయటకు వచ్చారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తిగా ఉన్న మౌర్య.. ఈ పార్టీని కూడా వీడి అధికార ఎస్పీలో చేరుతారని తెలుస్తోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ప్రశింసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అఖిలేష్‌తో తాను టచ్‌లో ఉన్నట్టు మౌర్య చెప్పారు. ‘అఖిలేష్ యంగ్, డైనమిక్ నాయకుడు. ఎస్పీ పేరును, పార్టీ గుర్తు సైకిల్‌ను గెలుచుకున్నందుకు ఆయనకు అభినందనలు. మా మధ్య మంచి సంబంధాలున్నాయి. నాతో కలసి బీజేపీలో చేరిన ఓబీసీ నాయకులకు మొండిచేయి ఎదురైంది. నా వర్గానికి చెందిన నాయకులకు బీజేపీ టిక్కెట్లు కేటాయించలేదు’ అని మౌర్య అన్నారు. మౌర్య తన వర్గీయులకు 35 టిక్కెట్లు ఇవ్వాలని కోరగా, బీజేపీ ఐదుకు మించి ఇవ్వబోమని చెప్పినట్టు సమాచారం. మౌర్యకు ఇతర పార్టీల నుంచి పిలుపు వచ్చింది. అయితే ఆయన ఎస్పీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
అయిననూ పోటీచేసి తీరుతాను!
లక్నో: అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అంతర్గత కుటుంబపోరులో చతికిలపడి.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి భ్రష్టుడైన శివ్‌పాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీకి వెనుకాడటం లేదు. అన్న ములాయం కొడుకు అఖిలేశ్ యాదవ్‌తో పార్టీ ఆధిపత్యం విషయమై శివ్‌పాల్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ మెజారిటీ నేతలు, ఎమ్మెల్యేలు అఖిలేశ్ వైపు మొగ్గు చూపడంతో పార్టీ అధికారిక సైకిల్ గుర్తును అఖిలేశ్ వర్గానికి ఈసీ కేటాయించింది. దీంతో ఎస్పీని అధికారికంగా అఖిలేశ్ చేజిక్కించుకున్నట్టు అయింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ తో సయోధ్యకు సిద్ధపడిన ములాయం సింగ్ యాదవ్.. తన అనుయాయిలను ఎస్పీ తరఫున బరిలోకి దింపాలంటూ 38మంది సభ్యుల జాబితాను కొడుకుకు పంపించారు. ఈ జాబితాలో ములాయం సోదరుడు శివ్‌పాల్ పేరు కూడా ఉంది. ములాయంతో సఖ్యత కోరుతున్న అఖిలేశ్ ఈ జాబితాలోని పేర్లకు చాలావరకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల జరిగే యూపీ ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతానని 61 ఏళ్ల శివ్‌పాల్ యాదవ్ స్పష్టంచేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ఒకప్పటి తన ప్రత్యర్థి అయిన బాబాయ్ శివ్‌పాల్ కోరికను అఖిలేశ్ అనుమతిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ములాయం సింగ్ యాదవ్‌కు మరో షాక్!
-
మెట్టుదిగని ములాయం.. కొడుకుతో పంతం
సమాజ్‌వాదీ పార్టీని, పార్టీ గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకున్న తర్వాత యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన తండ్రి ఆశీస్సుల కోసం వెళ్లారు. తనకు తండ్రితో ఎప్పుడూ విభేదాలు లేవని, ఆయన మార్గదర్శకత్వం తమకు ఎంతగానో అవసరమని చెప్పారు. అలాగే ములాయం సింగ్ యాదవ్ కూడా తాను కొడుకు మీద పోటీ చేయడం కోసం కొత్తగా పార్టీ ఏమీ పెట్టేది లేదని స్పష్టం చేశారు. అయితే.. దానికి బదులుగా కొన్ని షరతులు పెట్టారు. తాను ఎంపిక చేసిన 38 మంది అభ్యర్థులకు పార్టీ జాబితాలో తప్పనిసరిగా టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ జాబితాలో అఖిలేష్ చిన్నాన్న శివపాల్ యాదవ్‌కు తొలుత స్థానం కల్పించలేదు గానీ, ఆయన బదులు ఆయన కొడుకు ఆదిత్య యాదవ్‌కు జస్వంతనగర్ టికెట్ ఇవ్వాలన్నారు. అప్పటితో అయిపోలేదు.. మంగళవారం సాయంత్రానికల్లా మళ్లీ ములాయం మాట మార్చారు. శివపాల్ యాదవ్ పేరును తన జాబితాలో మళ్లీ చేర్చారు. పార్టీ పెట్టినప్పటి నుంచి తనను అంటిపెట్టుకుని ఉండటమే కాక, ఎప్పటినుంచో తన బాధ్యతలను పంచుకుంటున్న అనుంగు సోదరుడు, కష్టాల్లో వెన్నంటి ఉన్న అనుజుడు శివపాల్‌కు టికెట్ ఇవ్వకపోతే ఎలాగంటూ పట్టుబట్టారు. తండ్రీ కొడుకుల మధ్య శాంతి ఒప్పందం దాదాపు కుదిరిపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ శివపాల్ యాదవ్‌ను తెరమీదకు తీసుకురావడంతో మరోసారి ముసలం మొదలైంది. దాదాపు నెల రోజుల క్రితం కూడా అభ్యర్థుల జాబితా వల్లే ములాయం - అఖిలేష్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అఖిలేష్ యాదవ్ ముందుగానే ఒక జాబితా సిద్ధం చేయగా, ములాయం మాత్రం తన తమ్ముడు శివపాల్‌తో కలిసి, మరో జాబితాను రూపొందించి, తమదే అసలైన అధికారిక జాబితా అని చెప్పారు. దాంతో అఖిలేష్ మండిపడ్డారు. తనకు మద్దతుగా నిలిచేవాళ్లు ఎందరు అనే విషయాన్ని తెలుసుకోడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం పెడితే, దాదాపు 85-90 శాతం మంది హాజరయ్యారు. ఇక పూర్తి ఆత్మవిశ్వాసంతో పార్టీ గుర్తు, పార్టీ ఆధిపత్యం తనవేనంటూ క్లెయిమ్ చేశారు. ఆ పోరాటంలో ఎన్నికల కమిషన్ వరకు వెళ్లి మరీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు మళ్లీ ములాయం పాత పాట పాడుతూ అఖిలేష్ నెత్తిమీద కుంపటి లాంటి శివపాల్ యాదవ్‌ను మరోసారి తీసుకురావడంతో ఇక సయోధ్య కుదిరే విషయం అనుమానంగానే కనిపిస్తోంది. శివపాల్, అమర్‌సింగ్‌లను పార్టీ నుంచి తప్పించాలని అఖిలేష్ చెబుతుంటే, శివపాల్‌కు టికెట్ ఇవ్వాలని ములాయం డిమాండ్ చేయడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దాదాపుగా చాలా వరకు పేర్లు రెండు జాబితాలలోను ఉన్నాయని, కొన్నింటి విషయంలోనే తేడాలున్నాయని అఖిలేష్ పైకి చెబుతున్నారు. ఆ 'కొన్ని' పేర్లలో శివపాల్ లాంటివి కూడా ముఖ్యమైనవి. ఎప్పటినుంచో తనకు విశ్వాసపాత్రులుగా ఉన్నవాళ్ల పేర్లను ములాయం తన జాబితాలో ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల మీద అవినీతి, ఇతర ఆరోపణలు ఉండటంతో వాళ్లను ఇప్పటికే అఖిలేష్ పక్కన పెట్టారు. ఇప్పుడు తండ్రితో తగువు పెట్టుకోవాలా, ఎలాగోలా నచ్చజెప్పి జాబితాను ఫైనల్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు. -
ములాయంకు మరో షాక్!
లండన్: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష హోదాను, సైకిల్ గుర్తును కోల్పోయి పీకల్లోతు బాధలోఉన్న ములాయం సింగ్ యాదవ్‌కు మరో షాక్! ఎవరికోసంమైతే కొడుకును సైతం వదులుకోవడానికి నేతాజీ సిద్ధపడ్డాడో.. ఆ ప్రియనేస్తం అమర్‌సింగ్ బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం! సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలకు అసలు కారకుడిగా, 'శకుని మామ'గా విమర్శలు ఎదుర్కొన్న అమర్ సింగ్.. ఎన్నికల గుర్తుపై ఈసీ నిర్ణయం వెలువడకముందే లండన్ వెళ్లిపోయారు. 'నేను ఎప్పటికీ నేతాజీ(ములాయం) మనిషినే'అని పలుమార్లు బల్లగుద్దిచెప్పిన అమర్‌సింగ్.. సడన్‌గా సైడ్ మార్చారు. మంగళవారం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ('సైకిల్'పై అఖిలేశ్ అనూహ్య నిర్ణయం) "ఈసీ తీర్పుకు ముందే ఒక విషయం స్పష్టంగా చెప్పా.. నేను ములాయంవైపుగానీ, అఖిలేశ్‌వైపుగానీ లేను! ప్రస్తుతం లండన్‌లో ఉన్నా! సమాజ్‌వాదీ పార్టీ నాపై వేటు వేసింది. దాన్ని నేను అంగీకరిస్తున్నా. అమిత్‌షాతో మంతనాలు జరిపానని అందరూ అంటున్నారు. వాస్తవాలు ఎలా ఉన్నా, నేను బీజేపీలో ఎప్పుడు చేరబోయేది అందరికీ చెప్పాకే చేరుతా" అని అమర్‌సింగ్ అన్నారు. (స్నేహం కోసం.. త్యాగానికి సిద్ధం!) అఖిలేశ్‌లపై తనకున్న ప్రేమ గొప్పదని, ఖల్నాయక్(విలన్) అన్నా, శకుని అన్నా భరించగలిగే ఓపిక తనకుందని అమర్‌సింగ్ పేర్కొన్నారు. 'ఏది ఏమైనా నేతాజీ(ములాయం) మాత్రం నన్ను విలన్‌గా చూడరు'అని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్నికల గుర్తును గెలుచుకున్నవాళ్లు చెడ్డవాళ్లనో, ఓడినవాళ్లు మంచివాళ్లనో అనలేం, ఆమేరకు జరిగిన ప్రయత్నాలు సఫలమైనట్లుగానీ, విఫలమైనట్లుగానీ అభివర్ణించలేమని అమర్‌సింగ్ అన్నారు. అమర్ ప్రస్తుతం ఎస్పీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. (ములాయం 'అమర'ప్రేమ రహస్యం) -
ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఆజాద్!
-
‘ఆయన మానాన్నే.. కానీ పోరు తప్పదు’
లక్నో: ‘ఆయన మా నాన్నే.. కానీ ఈ సమయంలో పోరాటం తప్పనిసరి. ఆనందం ఆవిరైపోతుందని కొన్ని విషయాలు ఆయన పక్కన పెట్టిన ప్రతి చోట ఎలాంటి విజయం లేకుండా పోయింది. అందుకే.. ఇప్పుడు పోరాటం తప్పదు’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమాజ్‌వాది పార్టీని, పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ సోమవారం అఖిలేశ్ యాదవ్ చేతుల్లో పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్లుగా ములాయం చేతిలో ఉన్న ఆ పార్టీ అనూహ్యంగా కొడుకు చేతుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఓ మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. ‘ఆయన(ములాయం) మా నాన్న.. ఎన్నికల కమిషన్ తీర్పు ఇవ్వగానే ఆయన వద్దకు వెళ్లి కలిశాను. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను’ అని చెప్పారు. -
ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఆజాద్!
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుకు ఇంకా సమయముందంటూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆచితూచి స్పందిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మౌనాన్ని వీడింది. యూపీలో ఎస్పీతో పొత్తు పెట్టుకోబోతున్నామని విస్పష్టంగా తెలిపింది. ఎస్పీలో కుటుంబ తగాదాకు తెరపడి.. అఖిలేశ్ వర్గానికి సైకిల్ గుర్తు కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రకటన చేసింది. ’రానున్న యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ పొత్తు పెట్టుకోనున్నాయి’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఈ పొత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో కాంగ్రెస్-ఎస్పీ కూటమి ఎన్నికలను ఎదుర్కొంటుందని, కూటమి నాయకుడైన అఖిలేశ్ సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే, ఈ కూటమిలో మరిన్ని చిన్న పార్టీలను చేర్చుకునే విషయమై ఆయన ఏమీ చెప్పలేకపోయారు. మహాకూటమి ఏర్పాటు గురించి మున్ముందు ఆలోచిస్తామని, ప్రస్తుతానికి కాంగ్రెస్-ఎస్పీ పొత్తు కుదిరిందని ఆయన అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షితను ప్రకటించినప్పటికీ.. సీఎం అభ్యర్థిగా తప్పుకొనేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
యూపీలో బీజేపీ ఎందుకు భయపడుతోంది!
గతకొన్ని నెలలుగా అధికార సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటకు.. అఖిలేశ్ యాదవ్ సైకిల్ గుర్తును కైవసం చేసుకోవడంతో తెరపడింది. పార్టీ అధినేత, తండ్రి ములాయం నుంచి చాకచక్యంగా పార్టీ గుర్తును సొంతం చేసుకున్న అఖిలేశ్ ఇప్పుడు మరో ఎన్నికల చతురతకు తెరలేపబోతున్నారు. అదే.. బిహార్ శైలిలో ఇటు కాంగ్రెస్ పార్టీతో, అటు ఆరెల్డీతో మహాకూటమికి తెరలేపడం. అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోబోతున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయని, ఇరు పార్టీల యువనేతలు రాహుల్, అఖిలేశ్ భేటీ అయి.. అధికారికంగా ప్రకటించడమే తరవాయి అని ఇరు పార్టీల వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. కాంగ్రెస్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆరెల్డీ పార్టీలకు పొత్తులో భాగంగా 120-125 సీట్లు కేటాయించే అవకాశముందని, మిగతా సీట్లలో ఎస్పీ పోటీచేస్తుందని సమాచారం. బిహార్ మహాకూటమి శైలిలో ఏర్పాటు అవుతున్న ఈ కూటమి బీజేపీకి తలనొప్పిగా మారింది. యూపీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. 2015 నవంబర్ లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో బద్ధ విరోధులైన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అప్పటివరకుమోదీ హవాతో విజయాల బాటలో ఉన్న బీజేపీకి ఈ మహాకూటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మోదీ అభివృద్ధి అజెండాను తోసిపుచ్చి మరీ లోకల్ హీరో నితీశ్ కు బిహార్ ప్రజలు జైకొట్టారు. బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుందా? బిహార్ తో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ లో కులసమీకరణాలు భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ ఎస్సీ, కాంగ్రెస్, ఆరెల్డీ కూటమి బీజేపీకి గట్టి పోటీనిచ్చే అవకాశముంది. ఇక ఎస్పీలో జరిగిన అంతర్గత కుటుంబపోరు.. అఖిలేశ్‌కు జనాదరణను పెంచింది. మరోవైపు అమేథి, రాయబరేలి, సుల్తాన్ పూర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉంది. ఈటా, కనౌజ్, మధ్య యూపీలో ములాయం ఏళ్లకిందట నెలకొల్పిన క్షేత్రస్థాయి ఓటర్ల బలం ఎస్పీకి కలిసిరానుంది. భీష్మ పితామహుడిగా ములాయం! కన్న కొడుకుతో జరిగిన కుటుంబపోరులో ఓడిపోయిన ములాయం భీష్మ పితామహుడిగా అవతరించే అవకాశముందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మహాభారతంలో భీష్ముడు భౌతికంగా కౌరవుల పక్షం నిలిచినా.. వారి ప్రత్యర్థులైన పాండవులు గెలువాలని కోరుకున్నాడు. ఇప్పడు ములాయం కూడా తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పక్షం నిలిచినా.. తన కొడుకు అఖిలేశ్ ఘనవిజయం సాధించాలని మానసికంగా కోరుకుంటున్నారని వారు అంటున్నారు. అఖిలేశ్ గెలుపు కోసం ఆయన ఏదైనా చేసే అవకాశముందని చెప్తున్నారు. ఇక బీజేపీకి యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం పెద్ద ప్రతికూలతగా మారింది. ఇప్పటికే సీఎం అఖిలేశ్ అభివృద్ధి అనుకూల నాయకుడిగా జనాల్లోకి చొచ్చుకెళ్లారు. బిహార్ లో బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ ముఖంతో ఎన్నికలకు వెళ్లి భంగపడింది. స్థానిక నేతలను పక్కనబెట్టడం కూడా దెబ్బతీసింది. ఇప్పడు యూపీలో కూడా బలమైన స్థానిక నేత లేకపోవడం మైనస్ పాయింట్ గా మారింది. కొన్ని కారణాల వల్ల వరుణ్ గాంధీని బీజేపీ పక్కనపెట్టేసింది. మరోవైపు బిహార్ తో పోల్చుకుంటే యూపీలో ప్రధాని మోదీ చాలా తక్కువ ఎన్నికల సభలలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుందా? మళ్లీ గెలుపు బాట పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
అఖిలేష్‌తో పొత్తుకు రెడీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను ఎన్నికల సంఘం కేటాయించిన మరుసటి రోజే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎస్పీతో పొత్తుకు వెనుకాడబోమని కాంగ్రెస్ పార్టీ నేత మీమ్ అఫ్జాల్ మంగళవారం ప్రకటించారు. ఎస్పీ మొత్తం అఖిలేష్ వెంట ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అఖిలేష్ కూడా సుముఖంగా ఉన్నారు. త్వరలో రాహుల్ గాంధీతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీ, రాష్ట్రీయ లోక్దళ్లతో కలసి మహాకూటమి ఏర్పాటు చేసేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. పొత్తు అవకాశముందని అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్ కూడా ధ్రువీకరించారు. ఫిబ్రవరి 11 నుంచి ఏడు విడతల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
పాపం పెద్దాయనకు దారేదీ?
కొడుకు మీద నిప్పులు చెరుగుతూ.. అవసరమైతే తాను స్వయంగా అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దిగుతానని, తన కుమారుడి మీద తానే పోటీ చేస్తానని ప్రకటించిన ములాయం సింగ్ యాదవ్ ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నిర్ణయం వెలువడగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కొడుకు, కోడలు తన ఇంటికి వచ్చి ఆశీర్వాదం కోరగానే వాళ్లకు ఆశీస్సులు ఇచ్చి, అభినందనలు కూడా తెలిపారు. కొడుకు తనతో ఒక్క నిమిషం కూడా మాట్లాడటం లేదని కొన్ని గంటల ముందే చిన్నబుచ్చుకున్న పెద్దాయన... ఆ తర్వాత భార్యతో సహా వచ్చిన కొడుకుతో సుదీర్ఘంగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న విషయం అయితే బయటకు రాలేదు గానీ, ఎన్నికల కమిషన్ నిర్ణయం వచ్చిన తర్వాత ములాయం సింగ్ కాస్త మెత్తబడ్డట్లే కనిపిస్తోంది. అంతకుముందు వరకు సమాజ్‌వాదీ పార్టీని గానీ, ఎన్నికల గుర్తును గానీ వదులుకునేది లేదని చెప్పినా, ఇప్పుడు అలాంటి అవకాశం ఏమీ లేకపోవడం, మరోవైపు తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా మంగళవారమే వెలువడుతుండటంతో తదుపరి కార్యాచరణ ఏం చేయాలో తెలియని డిఫెన్స్ పరిస్థితిలోకి ములాయం పడిపోయారు. ఎలాగైనా సైకిల్ గుర్తు తమకు వస్తుందన్న నమ్మకంతో ఉన్న పెద్దాయన.. ఇప్పుడు అది కాస్తా కొడుకు నేతృత్వంలోని వర్గానికి వెళ్లిపోవడంతో ఇక తన వద్ద మిగిలిన కొద్దిమంది నాయకులతో ఏం చేయాలోనని మల్లగుల్లాలు పడుతున్నారు. వరుసకు తమ్ముడయ్యే రాంగోపాల్ యాదవ్ (ప్రొఫెసర్ సాబ్) దగ్గరుండి మరీ కొడుక్కి సైకిల్ గుర్తును, పార్టీని వచ్చేలా చేయడంతో ఒకవైపు కారాలు మిరియాలు నూరుతున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ నాయకుడు అమర్‌సింగ్ తాను ఎన్నికలు అయిపోయే వరకు రాష్ట్రంలో కాదు కదా అసలు దేశంలోనే ఉండనని, లండన్ వెళ్లిపోతున్నానని చెప్పడం ఆయనను మరింత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు శివపాల్ యాదవ్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులెవరూ ములాయం దగ్గర లేరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో కూడా చాలామంది అఖిలేష్ వర్గానికి మద్దతుగా ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించారు. ఇప్పుడు పార్టీ గుర్తు, జెండా ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ సాధ్యం కాదు కాబట్టి మిగిలిన కొద్దిమంది కూడా అటువైపే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను స్థాపించిన పార్టీ చేజారిపోవడం, కొడుకు చేతుల్లోకి వెళ్లిపోవడం లాంటి పరిణామాలను ములాయం ఎలా జీర్ణించుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అఖిలేష్ వర్గం ఆఫర్ చేస్తున్న 'మార్గదర్శి' పోస్టును తీసుకోవడం ఒక్కటే ములాయం ముందున్న పెద్ద ఆప్షన్. అఖిలేష్ జోరు కాంగ్రెస్, ఆర్ఎల్డీ తదితర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటుచేయాలని అఖిలేష్ వర్గం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎటూ పార్టీ, గుర్తు కూడా తమకే వచ్చేశాయి కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో పావులు కదుపుతున్నారు. ఎలాగైనా మరోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆరితేరిన రాంగోపాల్ యాదవ్ అండదండలు ఉండటంతో అఖిలేష్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తాను ప్రశాంత కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తను పెట్టుకున్నా పెద్దగా ఫలితాలు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో అఖిలేష్‌తో కలిసి వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
నాన్నా నేనే గెలిచాను.. ఆశీర్వదించండి
లక్నో: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్టుగా ఉంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీరు. తండ్రి ములాయంపై తిరుగుబాటు చేశారు.. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించారు.. ఆయన స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టారు.. ఎన్నికల సంఘం వద్ద పోరాడి ఎస్పీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను దక్కించుకున్నారు.. ఈసీ తీపీ కబురు చెప్పగానే అఖిలేష్ వెంటనే తండ్రి ములాయం ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజకీయపరంగా తండ్రికి షాకులమీద షాకులిచ్చిన అఖిలేష్.. వ్యక్తిగతంగా తండ్రి ములాయంపై గౌరవం చాటుకున్నారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం.. అఖిలేష్ వర్గానికి ఎస్పీ పేరు, పార్టీ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అఖిలేష్ వర్గీయులు సంబరాలు చేసుకోగా, ములాయం వర్గం ఢీలాపడింది. ఈసీ ప్రకటన తెలియగానే అఖిలేష్ తన భార్య డింపుల్‌తో కలసి తన అధికార నివాసానికి సమీపంలోనే ములాయం ఇంటికి వెళ్లారు. ములాయం ఆశీర్వాదం తీసుకున్నారు. అఖిలేష్‌పై బహిరంగంగా విమర్శలు చేస్తున్న ములాయం.. ఇంటికొచ్చిన కొడుకు పట్ల ఎలా వ్యవహరించారో..? ఈసీ నిర్ణయం వెలువడగానే అఖిలేష్ నివాసం, పార్టీ కార్యాలయం వద్ద ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో ‘అఖిలేష్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు’ అన్న నేమ్ ప్లేట్‌ను తగిలించారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగేలా అఖిలేష్ వ్యూహరచన చేస్తున్నారు. కాగా తీరు మార్చుకోకుంటే అఖిలేష్‌పై పోటీ చేస్తానని, ఎన్నికల గుర్తు విషయంలో కోర్టును ఆశ్రయిస్తానని ములాయం ప్రకటించారు. -
భంగపడ్డ ములాయం.. ఇప్పుడేం చేస్తారు?
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఈసీ వేదికగా జరిగిన పోరాటంలో భంగపాటుకు గురైన ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడేం చేస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీ అధ్యక్షుడైన అఖిలేశ్‌కు సైకిల్ గుర్తు దక్కకుండా చివరి వరకూ పోరాడిన(!) ములాయం.. కొత్త పార్టీ పెట్టి కొడుకును ఢీకొంటారా? బీజేపీ అనుకూలుడిగా మారతారా? లేక అఖిలేశ్ అందించే సముచిత గౌరవాన్ని(పార్టీ మార్గదర్శి పదవిని) స్వీకరిస్తారా? అనే ప్రశ్నలు యూపీ ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి. ఈసీ నిర్ణయం వెలువడిన వెంటనే మహా కూటమిని ఏర్పాటుచేస్తామని అఖిలేశ్ యాదవ్ ప్రకటించింది. ఆ మేరకు చర్చలు మొదలైనట్లు రాంగోపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఇటు ములాయం వర్గం మాత్రం ఈసీ నిర్ణయంపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. (అఖిలేశ్‌కే సైకిల్ గుర్తు) ఈసీ నిర్ణయానికి ముందు, సోమవారం మధ్యాహ్నం కార్యకర్తలతో భేటీ అయిన ములాయం.. తన కుమారుడిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 'సీఎం అఖిలేశ్ ముస్లిం వ్యతిరేకి. ముస్లిం అధికారిని డీజీపీగా నియమించడానికి నిరాకరించాడు'అని బాంబు పేల్చారు. అంతేకాదు, ఎన్నికల్లో అఖిలేశ్‌కు పోటీగా నిలబడతానని ప్రకటనచేశారు. అంతర్గత కలహాలు మొదలైనతర్వాత అఖిలేశ్‌ను ఉద్దేశించి ములాయం ఇంత ఘాటుగా మాట్లాడటం ఇదే మొదటిసారి కావడంతో 'ముస్లిం వ్యతిరేకి' వ్యాఖ్యలు ప్రాధాన్యం అయ్యాయి. సైకిల్ గుర్తు తనకు దక్కదన్న సమాచారంతోనే ములాయం అఖిలేశ్‌ను టార్గెట్ చేశారని కొందరు మాట్లాడగా, ఇంకొందరు మాత్రం.. నేతాజీ వ్యూహాత్మకంగా అఖిలేశ్‌ను బలపరుస్తున్నారని, తన వ్యాఖ్యల ద్వారా ముస్లింల పట్ల నిబద్ధతను చాటుకునే అవకాశం అఖిలేశ్‌కు కల్పించారని అభిప్రాయపడ్డారు. (అఖిలేష్‌పై నేనే పోటీ చేస్తా: ములాయం) తమకు నేతాజీ మార్గనిర్దేశం ఎంతో అవసరమని మొదటి నుంచీ చెబుతోన్న అఖిలేశ్ వర్గం, సోమవారం నాటి ఈసీ నిర్ణయం తర్వాత కూడా అదే మాట చెప్పింది. కోలాహలం మధ్య పలు టీవీ చానళ్లు అడిగి ప్రశ్నలకు ఎస్పీ కార్యకర్తలంతా ఒకటే సమాధానం చెప్పారు.. 'నేతాజీ మా వెంటే ఉండాలి'అని! రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్‌ల స్పూర్తితో నాలుగు దశాబ్ధాల కిందట రాజకీయాల్లోకి ప్రవేశించిన ములాయం సింగ్ యాదవ్ తన సుదీర్ఘ అనుభవంలో ఎన్నో కీలక పదవులు, అంతకుమించి ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. కాగా, తాజా పరిస్థితిని ఎలా డీల్ చేస్తారో వేచి చూడాల్సిందే! -
అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో, ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో విభేదాలకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్‌కు పూర్తిగా దూరంగా ఉండనున్నారు. యూపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయన విదేశాల్లో ఉంటారు. చికిత్స కోసం త్వరలో లండన్‌కు వెళ్తున్నట్టు అమర్ సింగ్ చెప్పారు. మార్చి చివర్లో మళ్లీ స్వదేశానికి తిరిగి రానున్నారు. ‘నేను గతంలో లండన్‌లో చికిత్స చేయించుకున్నాను. పార్టీ నుంచి పిలుపు రావడంతో మధ్యలో వచ్చేశాను. చికిత్స పూర్తిగా చేయించుకోవడానికి ఇప్పుడు మళ్లీ లండన్ వెళ్తున్నాను. తర్వాత సింగపూర్‌కు వెళ్తాను. మార్చి చివర్లో తిరిగి వస్తాను’ అని అమర్ సింగ్ చెప్పారు. ఆ సమయానికి యూపీలో ఎన్నికలు పూర్తవుతాయి. యూపీలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ములాయం కుటుంబంలో విభేదాలకు అమర్ సింగే కారణమని ముఖ్యమంత్రి అఖిలేష్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక అఖిలేష్ వర్గం అమర్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. అఖిలేష్ వెంట పార్టీలో అత్యధికమంది నాయకులు ఉండగా.. ములాయం వెంట సోదరుడు శివపాల్, అమర్ సింగ్‌తో పాటు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పార్టీ గుర్తు సైకిల్ కోసం ఇరు వర్గాలు పోరాడుతున్నాయి. ఈసీని కలసి సైకిల్‌ను తమకే కేటాయించాలని విన్నవించారు. ములాయం వెంట అమర్ సింగ్ కూడా వెళ్లి ఈసీని కలిశారు. ఈ నేపథ్యంలో లండన్ వెళ్లాలని అమర్ సింగ్ చెప్పడం ఎస్పీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అఖిలేష్ డిమాండ్ మేరకు ములాయం తన సన్నిహితుడు అమర్ సింగ్‌ను కొన్నాళ్లు పక్కనపెట్టారా? లేక తానే దూరంగా ఉండాలని అమర్ భావిస్తున్నారా? ఈ రెండు కారణాలు గాక ఆయన చికిత్స కోసమే లండన్ వెళ్తున్నారా అన్నది ఎస్పీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ములాయంకు ఊహించని ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు ఏర్పడటం, కొడుకు అఖిలేష్ యాదవ్ దూరంకావడంతో దాదాపుగా ఒంటరై, పార్టీ గుర్తు సైకిల్ కోసం పోరాడుతున్న ములాయం సింగ్ యాదవ్‌కు ఊహించని ఆఫర్ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అఖిలేష్‌కు సైకిల్ గుర్తు కేటాయించినా లేదా దాన్ని ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేసినా.. తమ పార్టీ గుర్తును, జాతీయ అధ్యక్ష పదవిని ఇస్తామని ములాయంకు లోక్ దళ్ ఆఫర్ చేసింది. లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు సునీల్ సింగ్ ఆదివారం ఈ మేరకు ప్రకటించారు. లోక్ దళ్ పార్టీ గుర్తును, జాతీయ అధ్యక్ష పదవిని ములాయంకు ఆఫర్ చేస్తున్నానని, ఆయనతో కలసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని సునీల్ సింగ్ చెప్పారు. ములాయంను కలసి ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. సీబీఐ కేసు నుంచి తన కొడుకు, కుమార్తెను కాపాడుకునేందుకు రాంగోపాల్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని, ఆయన మాటలను నమ్మవద్దని, తండ్రి ములాయం మాట ప్రకారం నడుచుకోవాల్సిందిగా అఖిలేష్‌కు సూచించారు. అలాగే అఖిలేష్‌తో విభేదాలను పరిష్కరించుకోవాల్సిందిగా ములాయంను కోరారు. అఖిలేష్ వర్గంలో రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, 200 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వెంట సోదరుడు శివపాల్ యాదవ్, సన్నిహితుడు అమర్ సింగ్‌తో పాటు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇరు వర్గాలు ఈసీని కలసి పార్టీ గుర్తు సైకిల్‌ను కేటాయించాల్సిందిగా కోరాయి. ఈ నేపథ్యంలో సునీల్ సింగ్ ప్రకటన చేశారు. నాగలితో పొలం దున్నుతున్న రైతు.. లోక్ దళ్ గుర్తు. లోక్ దళ్‌కు ఈసీ గుర్తింపు ఉంది. 1980కి ముందు సోషలిస్ట్ నాయకుడు చరణ్ సింగ్ ఈ పార్టీని స్థాపించారు. ఇందులో ములాయం కూడా వ్యవస్థాపక సభ్యుడు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడంతో ఈ పార్టీకి ప్రజల్లో గుర్తింపు లేకుండా పోయింది. 2012లో ఈ పార్టీ 76 స్థానాల్లో పోటీ చేయగా, అన్ని చోట్లా ఓడిపోయింది. -
సొంత రాష్ట్రంలో విడిపోయినా బయట మాత్రం...
కుటుంబంలో చెలరేగిన గొడవల కారణంగా సొంత రాష్ట్రంలో వేరుకుంపట్లు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ.. ఇతర రాష్ట్రాలలో మాత్రం పార్టీ ఐకమత్యంగానే కనిపిస్తోంది. తండ్రి ములాయం సింగ్ యాదవ్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి.. సైకిల్ గుర్తు కోసం పోరాటం చేస్తున్న అఖిలేష్ యాదవ్ ఇతర రాష్ట్రాల్లో మాత్రం పార్టీని ఇంకా అంతగా పట్టించుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లో మాత్రం పార్టీ ఇంకా ఒక్కటిగానే.. అంటే ములాయం ఆధీనంలోనే ఉంది. ఉత్తరాఖండ్‌లో సమాజ్‌వాదీ పార్టీలో వర్గాలు ఏమీ లేవని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ సచ్చన్ తెలిపారు. అలాగే బిహార్‌లో కూడా తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని, అక్కడ ఒకటే పార్టీ ఉందని ఆ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ యాదవ్ చెప్పారు. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఒడిషా, మధ్యప్రదేశ్.. ఇలా పార్టీ ఉనికిలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ మినహా ఇంకెక్కడా పార్టీలో వర్గాలు లేవు. ఉత్తరాఖండ్‌లో ప్రత్యేకంగా వర్గాలు అంటూ లేకపోయినా.. కార్యకర్తలు మాత్రం తాము ఎటువైపు ఉండాలన్న అయోమయంలో కనిపిస్తున్నారు. యూపీ కంటే ముందే ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరుగుతాయని, ఇప్పటికే ఇక్కడ అభ్యర్థులెవరన్నది నిర్ణయించినా, ఇంకా ప్రకటించలేదని సచ్చన్ తెలిపారు. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను 50 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. -
తెగని తండ్రికొడుకుల పంచాయితీ
-
అధికార పార్టీతో కాంగ్రెస్ డీల్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులకు తెరలేవబోతున్నది. అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ మేరకు రెండు పార్టీలు సీట్ల పంపకాలపై డీల్ కుదుర్చుకునే దిశగా కదులుతున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో ముందుకుసాగాలని, ఇరుపార్టీలకు గట్టి పట్టున్న సీట్లపై పట్టువిడుపుల ధోరణి కొనసాగించాలని ఇప్పటివరకు తెరవెనుక జరిగిన పొత్తు చర్చల్లో రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వాములుగా యూపీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న రెండు పార్టీల అగ్రనేతలు - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్- ఇంకా భేటీ కానప్పటికీ పొత్తు కుదుర్చుకోవడానికి కావాల్సిన సన్నాహాలన్నీ పూర్తయ్యయాయని, ఈ పొత్తు చర్చలు చాలావరకు మధ్యవర్తుల ద్వారా, టెలిఫోన్ చర్చల ద్వారా జరిగాయని, సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఇప్పటికే ఇరుపార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం వచ్చిందని ఆ పార్టీ అగ్రస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్, ఎస్పీల మధ్యే పొత్తు చర్చ నడుస్తోందని, తమ కూటమిలో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆరెల్డీ)ను చేర్చుకునే విషయమై ఇంకా చర్చించలేదని, కానీ మున్ముందు మరిన్ని చిన్న పార్టీలను కూటమిలో కలుపుకొనే విషయమై చర్చిస్తామని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
అప్పుడు వాడి వయసు రెండేళ్లు
-
అప్పుడు వాడి వయసు రెండేళ్లు: ములాయం
ఒకవైపు ఈసారి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేష్ యాదవే ఉంటాడని ప్రకటించినా, పార్టీ మీద ఆధిపత్యాన్ని వదులుకోడానికి మాత్రం పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ ససేమిరా అంటున్నారు. తాను ఎమర్జెన్సీ సమయంలో పార్టీని స్థాపించానని, అప్పటికి అఖిలేష్ వయసు కేవలం రెండేళ్లేనని చెప్పారు. వివాదాల్లో పడొద్దని మాత్రమే తాను వైరివర్గానికి చెప్పానని, పార్టీ ఐకమత్యంగా ఉండాలన్నదే తన ధ్యేయమని లక్నోలో తన ఇంటి వద్ద గుమిగూడిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో పాటు సైకిల్ గుర్తు కూడా తనదేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం తానెంతగానో కష్టపడ్డానని, తమ్ముడు శివపాల్ యాదవ్ తనకు అండగా ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు కేవలం ఒక్క వ్యక్తితోనే తమకు ఇబ్బందులు వచ్చాయన్నారు. రాంగోపాల్ యాదవ్ ప్రతిపక్షాలతో చేతులు కలిపి, కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పార్టీ పేరును గానీ, గుర్తును గానీ ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదన్నారు. పార్టీని ఒక్కతాటిపై నడపాలన్నదే తన ఉద్దేశమని ములాయం అన్నారు. -
ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో వివాదం
-
తండ్రి ఇంటికి ‘మొండి’కొడుకు
-
తండ్రి ఇంటికి ‘మొండి’కొడుకు
లక్నో: ఒకవైపు అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్నా.. సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ నాటకం కొనసాగుతూనేఉంది..! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సోమవారం ఉదయం తండ్రి ములాయం సింగ్ ఇంటికి వెళ్లడంతో మరోఘట్టానికి తెరలేచింది. ఎన్నికల గుర్తుపై ఇరు వర్గాల పోరు, పోటాపోటీగా అభ్యర్థుల జాబితా విడుదల.. తదితర అంశాలపై తండ్రీకొడుకులు చర్చించినట్లు సమాచారం. నామినేషన్లకు గడువు తరుముకొస్తుండటంతో ఏదో ఒక ఫార్ములాపై రాజీ పడాలని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆ ఫార్ములా ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్! (మీ నాన్న చాలా మొండోడు!) సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తైన ‘సైకిల్’ కోసం ములాయం, అఖిలేశ్ వర్గాలు పలు దఫాలుగా ఎన్నికల సంఘాన్ని కలిశాయి. సోమవారం ఈసీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ములాయం.. విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో అంతా కలిసే ఉంటామని, కుటుంబంలో విభేదాల్లేవని స్పష్టీకరించారు. రాత్రి లక్నోలో నిర్వహించిన మరో సమావేశంలో ‘ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేశే’అని తేల్చిచెప్పారు. దీంతో నెలలుగా సాగుతోన్న నాటకానికి పెద్దాయనే తెరదించుతారనే సంకేతాలు వెలువడినట్లైంది. నేటి భేటీ అనంతరం రాజీ ఫార్ములాతోపాటు అభ్యర్థుల జాబితానూ ప్రకటించే అవకాశంఉంది. (ములాయం యూ టర్న్) -
వీడిన ఎస్పీ సంక్షోభం.. అఖిలేశే మళ్లీ సీఎం
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీలో సుడిగాలి అంతటి వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎస్పీ అధినేత ములాయం పట్టువీడారు. ఆ పార్టీలో సంక్షోభానికి తెరదించారు. తన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఆయన మరోసారి ముఖ్యమంత్రి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించడం జరుగుతుందని తొలుత చెప్పిన ములాయం తాజాగా ఆ విషయాన్ని ఇప్పుడే ప్రకటించేశారు. చదవండి..(అఖిలేష్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు) వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే మరోసారి కూడా తన కుమారుడు అఖిలేశ్ సీఎంగా బాధ్యతలు చేపడతారని అన్నారు. ఇక పార్టీలో చీలిక అనే ప్రశ్న లేదని, సమాజ్ వాది పార్టీ అంతా ఒక్కటేనని, ఎన్నికల ప్రచారంలో దూకుతామని ములాయం సింగ్ అన్నారు. ఎన్నికల్లో విజయం తామే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ములాయం, అఖిలేష్ వర్గాలు పోటాపోటీగా..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో సాగుతున్న ఆధిపత్య పోరు ఢిల్లీకి చేరింది. పార్టీ గుర్తు సైకిల్‌ను దక్కించుకునేందుకు ఇరు వర్గాలు పోటీపడుతున్నాయి. సోమవారం ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని కలసి సైకిల్ గుర్తును తమకు కేటాయించాల్సిందిగా కోరగా.. కాసేపటి తర్వాత ఆయనకు పోటీగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గం ఈసీని కలిసింది. అఖిలేష్ తరపున బాబాయ్, రాజ్యసభ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ఇతర నేతలు ఈసీని కలిశారు. సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని మరోసారి విన్నవించారు. అనంతరం రాంగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నేతలంతా తమతోనే ఉన్నారని, త్వరగా సమస్యను పరిష్కరించాలని ఈసీని కోరామని చెప్పారు. కాగా పార్టీ నుంచి బహిష్కరించిన విషయంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అఖిలేష్ వర్గం ఇంతకుముందు కూడా ఈసీని కలిసి పార్టీలో మెజార్టీ వర్గం నాయకులు, ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని, తమకే సైకిల్ గుర్తును కేటాయించాలని కోరారు. (చదవండి: అఖిలేష్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు) -
సోదరుడికి మరో షాకిచ్చిన ములాయం
న్యూఢిల్లీ: తన కొడుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను తప్పుదోవపట్టిస్తున్నాడని వరుసకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్‌పై ఆగ్రహంతో ఉన్న ములాయం సింగ్ యాదవ్ మరో షాకిచ్చారు. ఎంపీ రాంగోపాల్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీలో సభ్యుడు కాదని ప్రకటించిన ములాయం.. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాశారు. సమాజ్‌వాదీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న రాంగోపాల్‌ను తొలగించి, ఆయనపై అనర్హత వేటు వేటు వేయాలని ములాయం కోరారు. ములాయం రాసిన లేఖ అన్సారీకి అందింది. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లో విభేదాలు రావడంతో అఖిలేష్, రాంగోపాల్ ఓ వర్గంగా.. ములాయం, శివపాల్ మరో వర్గంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అఖిలేష్, రాంగోపాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ములాయం తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆదివారం ములాయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీ సభ్యుడు కారని ప్రకటించారు. -
అఖిలేష్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు
న్యూఢిల్లీ: తన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు, తనకు మధ్య ఎలాంటి వివాదం లేదని ములాయం సింగ్ యాదవ్ అన్నారు. కొందరు వ్యక్తులు అఖిలేష్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ములాయం సింగ్ తన సోదరుడు శివపాల్ యాదవ్, సన్నిహితుడు అమర్ సింగ్ తదితరులతో కలసి ఎన్నికల సంఘాన్ని కలిశారు. సమాజ్‌వాదీ పార్టీ గుర్తు సైకిల్‌ను తమకే కేటాయించాలని ఈసీని కోరారు. అనంతరం మీడియాతో ములాయం మాట్లాడుతూ.. పార్టీలో ఓ సమస్య ఉందని, దీని వెనుక ఓ వ్యక్తి ఉన్నాడంటూ సోదరుడు రాంగోపాల్ యాదవ్ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. పార్టీ గుర్తు సైకిల్ ఎవరికి దక్కుతుందనే విషయాన్ని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు. (ములాయం సింగ్ కీలక నిర్ణయం) ఎస్పీలో సాగుతున్న ఆధిపత్య పోరులో అఖిలేష్, ములాయం రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు ఈసీని కలసి తమకే సైకిల్ గుర్తును కేటాయించాలని విన్నవించాయి. అఖిలేష్ వర్గంలో బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వెంట శివపాల్, అమర్ సింగ్‌తో పాటు కొందరు మాత్రమే ఉన్నారు. ఎస్పీలో ఏర్పడ్డ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. (సైకిల్.. ఎవరికీ దక్కకుండా పోతుందా?) -
ములాయంకు గట్టి షాకిస్తాం: బీజేపీ
- నేతాజీ సొంత ఊరిలో పాగాకు తీవ్ర కసరత్తు ఇటావా: కొడుకు అఖిలేశ్ యాదవ్ హైజాక్ చేసిన పార్టీపై తిరిగి పట్టు సాధించేందు ములాయం సింగ్ యాదవ్ ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో ‘ములాయం సొంత ఊళ్లో సమాజ్‌వాదీ పార్టీని ఓడించాలని’ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటావా జిల్లాలోని నేతాజీ సొంత ఊరు సైఫై.. జశ్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే ఎవరోకాదు.. నేతాజీ పెద్ద తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్! 1967 నుంచి 1996దాకా పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ములాయం.. జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టడంతో ఆ సీటు తమ్ముడు శివపాల్‌కు దక్కింది. శివపాల్ వరుసగా నాలుగు సార్లు(1996 నుంచి నేటి వరకు) అక్కడి నుంచి గెలుపోందారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ సీన్ రివర్స్ అయింది. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా ముద్రపడ్డ మరో ఐదు జిల్లాల్లో బీజేపీ విజయపతాకం ఎగరేసింది. కాగా, నేతాజీ సొంత ఊరుండే మోయిన్పురిలో మాత్రం పరువు దక్కించుకోగలిగారు. తేజ్‌ప్రతాప్ సింగ్ యాదవ్(లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు) ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పోటాపోటీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అఖిలేశ్, ములాయం వర్గాలు.. జశ్వంత్‌నగర్ స్థానాన్ని మాత్రం ఖాళీగా వదిలేశాయి. దీంతో రెండు వర్గాల కార్యక్తలూ కాస్త తికమకపడ్డారు. శివపాల్ యాదవ్‌కు పోటీగా అభ్యర్థిని దించరాదన్న అఖిలేశ్ ఆదేశాల మేరకే జశ్వంత్‌నగర్ స్థానానికి పేరు ప్రకటించలేదని తెలిసింది. కాగా, గ్రామస్థాయిలో మాత్రం అఖిలేశ్ యాదవ్‌కు ఎల్లడలా మద్దత లభిస్తోంది. పెద్దా చిన్నా అందరూ అఖిలేశే సీఎం కావాలని నినదిస్తున్నారు. అదే సమయంలో వారంతా నేతాజీ(ములాయం)కి సముచిత గౌరవం దక్కాలని కోరుకుంటున్నారు. ఇలా నియోజకవర్గం అంతటా నెలకొన్న విరుద్ధ భావనలే తమ గెలుపును సుగమమం చేస్తాయని బీజేపీ ఆశగా ఎదురుచూస్తోంది. 2014లో ఇటావా స్థానంలో ఎస్పీని చిత్తుగా ఓడించిన బీజేపీ ఎంపీ అశోక్ కుమార్.. గడిచిన కొద్ది రోజులుగా జశ్వంత్ నగర్లోనే మకాంవేసి, ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ‘సార్వత్రిక ఎన్నికల మాదిరే 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రతాపం చూపుతుంది. ములాయం సొంత ఇలాకాలోనే ఈ సారి గట్టిషాకిస్తాం’ అని అశోక్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
'అఖిలేశ్.. నీకెందుకీ మొండిపట్టుదల?'
-
ఏదో ఒకరోజు ఆయన ప్రధాని అవుతారు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్యపోరు అనూహ్య మలుపులు తిరుగుతూ రక్తికట్టిస్తోంది. ఎస్పీ జాతీయ అధ్యక్షుడు తానేనని, అఖిలేష్ ముఖ్యమంత్రి మాత్రమేనని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించగా.. అఖిలేష్ పార్టీ కంటే గొప్పవాడని, ఏదో ఒకరోజు ప్రధాన మంత్రి అవుతారని, ఆయనకు ఆ సామర్థ్యం ఉందని రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమకు పార్టీ చిహ్నం సైకిల్ వచ్చినా, రాకపోయినా.. ఈ విషయం పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ములాయం మాట్లాడుతూ రాంగోపాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, పార్టీ సభ్యుడు కాదని చెప్పారు. ఆ తర్వాత రాంగోపాల్ స్పందించారు. అఖిలేష్‌తో కలసి తాము ధర్మయుద్ధం చేస్తున్నామని, తాను ఉన్నా లేకపోయినా ఏదో ఒకరోజు అఖిలేష్ ప్రధాని అవుతారని అన్నారు. అమర్ సింగ్, మరికొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న అమర్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఫోర్జరీ చేసేవాళ్లకు అందరూ అలాగే కనిపిస్తారని చురకలంటించారు. అన్ని ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించామని రాంగోపాల్ చెప్పారు. -
ములాయం సింగ్ కీలక నిర్ణయం
-
'అఖిలేశ్.. నీకెందుకీ మొండిపట్టుదల?'
లక్నో: అందరం కలిసి ఉండేందుకు తాము ఏం చేసేందుకైనా సిద్ధం అని సమాజ్ వాది పార్టీ నేత, ఎస్పీ కుటుంబంలో చిచ్చురేగడానికి కారణమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ అన్నారు. ఎస్పీ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉండాలని, అందుకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా, బలిదానానికైనా తాను సిద్దంగా ఉన్నానని పరోక్షంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను వేడుకుంటూ అమర్ సింగ్ చెప్పారు. దాదాపు చీలిపోయిన ఎస్పీ భవితవ్యం రేపు ఎన్నికల కమిషన్ ముందు తేలనున్న నేపథ్యంలో అమర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను, ములాయం సోదరుడు శివపాల్ మట్టిలాంటి వాళ్లం. మమ్మల్ని శిల్పాలుగా తీర్చిదిద్దింది ములాయం సింగ్ యాదవ్. మేమిద్దరం ఆయనకు రెండు భుజాలలాంటివాళ్లం. అలాంటి నామీద, సోదరుడు శివపాల్ యాదవ్ మీద విషం చిమ్మారు. మనిద్దరివీ అద్దాల మేడలే. నేనూ ఆలోచిస్తా.. నువ్వు కూడా ఆలోచించాలి. ఇలాంటి సమయంలో నీ చేతిలో ఆ రాళ్లెందుకు? ఎందుకీ మొండి పట్టుదల? అసలు నువ్వెందుకు అలిగావు? ఇంట్లోని నిప్పువల్లే ఇంటికి మంట అంటుకుంది. మేం కలిసే ఉండాలనుకుంటున్నాం. నేను చేతులు జోడించి వేడుకోవాలనుకుంటున్నా.. ఇంకేం తీసుకోవాలనుకుంటున్నావు? రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. శివపాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కుటుంబం విడిపోకూడదని, మనమంతా ఒక్కటిగానే ఉండేందుకు మేం అన్నిరకాల త్యాగాలు, బలిదానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను రాజీనామా చేయడానికి ప్రయత్నించాను. ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నాను. అన్నిరకాల బలిదానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను' అంటూ అఖిలేశ్‌కు మీడియా ద్వారా అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మరోపక్క, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కూడా స్పందిస్తూ 'ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేతాజీ పుణ్యమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన వెంటే ఉంటాను' అని అన్నారు. -
ములాయం సింగ్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదివారం ఉదయం పార్టీలో ఎలాంటి వివాదం లేదని చెప్పిన ములాయం సింగ్ యాదవ్.. సాయంత్రానికల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. మీడియా సమావేశంలో ములాయం మాట్లాడుతూ తానే ఎస్పీ జాతీయ అధ్యక్షుడినని ప్రకటించారు. పార్టీలో తానే సుప్రీం అని, తాను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలని స్పష్టం చేశారు. కుమారుడు అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి మాత్రమేనని, సోదరుడు శివపాల్ యాదవ్ యూపీ పార్టీ చీఫ్‌గా కొనసాగుతారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేష్ యాదవ్ వర్గం.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ములాయం నుంచి తొలగించి ఆయన స్థానంలో అఖిలేష్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అలాగే యూపీ పార్టీ చీఫ్ పదవి నుంచి శివపాల్‌ను తొలగించారు. ములాయం సన్నిహితుడు అమర్ సింగ్‌పై వేటు వేశారు. కాగా పార్టీలో ఎక్కువ మంది అఖిలేష్ పక్షాన నిలవగా, ములాయం వెంట చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇరు వర్గాలు ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ గుర్తు సైకిల్‌ను తమకే కేటాయించాలని విన్నవించారు. ఇరు వర్గాలు రాజీకోసం చర్చలు జరుపుతూనే ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. శనివారం జరగాల్సిన మీడియా సమావేశాన్ని ములాయం చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికల సంఘాన్ని కలుస్తామని చెప్పిన ములాయం.. ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలను ప్రకటించారు. అఖిలేష్, రాంగోపాల్‌లను పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఇటీవల ప్రకటించిన ములాయం తర్వాత సస్పెన్షన్‌ను తొలగించారు. తాజాగా రాంగోపాల్ ఒక్కరినే బహిష్కరించినట్టు ప్రకటించారు. -
అమర్ సింగ్‌కు జెడ్ కేటగిరి భద్రత
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ములాయం సింగ్ సన్నిహితుడు అమర్ సింగ్‌కు భద్రత పెంచారు. ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అమర్ సింగ్‌కు తక్షణం భద్రతను పెంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో తీవ్ర విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గంలో ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వర్గంలో సోదరుడు శివపాల్ యాదవ్, అమర్ సింగ్‌తో పాటు కొందరు మాత్రమే మిగిలారు. అమర్ సింగ్‌ను అఖిలేష్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2008లో అమర్ సింగ్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమర్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులకు భద్రత తగ్గించారు. ఇటీవల అమర్ సింగ్‌కు వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మళ్లీ భద్రత పెంచింది. -
బలప్రదర్శనకు దిగిన ములాయం!
-
బలప్రదర్శనకు దిగిన ములాయం!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల గుర్తు విషయమై ఇటు ములాయం, అటు అఖిలేశ్ వర్గాల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఎస్పీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు తనవైపే ఉన్నారని, కాబట్టి ఆ పార్టీ సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని అఖిలేశ్ వర్గం బలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అఖిలేశ్ బృందం శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి 'ఆధారాల'ను కూడా చూపెట్టింది. ఎట్టిపరిస్థితుల్లో సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని కోరింది. అయితే, ఎస్పీకి ప్రతీక అయిన సైకిల్ గుర్తును వదులుకోవడానికి ములాయం ఎంతమాత్రం సిద్ధపడటం లేదు. ఈ విషయంలో కొడుకు అఖిలేశ్‌తో అమీ-తుమీకి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం ఆదివారం ఉదయమే కొడుకు అఖిలేశ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ వెంటనే లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ములాయం మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ్ముడు శివ్‌పాల్‌తోపాటు తన వర్గం కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. అఖిలేశ్‌కు పోటీగా తన బలప్రదర్శన చాటుకోవడానికి ఈ భేటీని ములాయం వర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ములాయం, శివ్‌పాల్ ఢిల్లీకి తరలివెళ్లారు. పార్టీ గుర్తుపై ఈసీని కలిసి ఎట్టిపరిస్థితుల్లో తమ వర్గానికే దక్కేలా చూడాలని ములాయం వర్గం భావిస్తోంది. -
ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి లాభం
లక్నో: ‘సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ సంక్షేమానికి ఏం చేయగలదు?’ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు.ఎస్పీకి ఓటేసి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చొద్దని ప్రజలకు చెప్పాలని తన పార్టీ శ్రేణులను కోరారు. కాగా, బీఎస్పీ యూపీ ఎన్నికల కోసం 24 మంది ముస్లింలు సహా వందమందికిపైగా అభ్యర్థుల పేర్లతో మూడో జాబితా ప్రకటించింది. -
యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీ తనయుల మధ్య ఏర్పడిన తగువు త్వరగా తీరకపోతే పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందా? చీలిపోతే నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా ఏ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఎలా ఉంటాయి? ములాయం వర్గంతో అఖిలేష్ వర్గం విడిపోతే పార్టీలో మెజారిటీ వర్గం ఆయనవైపే ఉన్నా ఆయన పొత్తు కుదుర్చుకునే కూటమి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందా? 2012లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న ముందస్తు అంచనాలు దాదాపు అన్నీ నిజమయ్యాయి. అప్పుడు మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీచిన గాలులతో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరు అంచనా వేయగలిగారు. అయితే అఖండ విజయం సాధిస్తుందని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఈసారి కూడా ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ అవి తన మీద పడకుండా అఖిలేష్ తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నారు. తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్ లాంటి పెద్దల జోక్యం వల్ల తనకు స్వేచ్ఛ లేకపోయిందని అఖిలేష్ ప్రజలను నమ్మించగలిగారు. రాజకీయ సమీకరణలు ఏమిటి? ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కూడా తనకే పూర్తి స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో సొంత జాబితాను విడుదల చేసి తండ్రితో అఖిలేష్ తగువుకు దిగారు. ఇరువురి మధ్య సమీప భవిష్యత్తులో రాజీ కుదురుతుందా.. అన్న అంశంపై భవిష్యత్ రాజకీయ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి. పార్టీ నుంచి అఖిలేష్ చీలిపోతే ఆయన పార్టీతో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పొత్తు కడతాయి. అప్పుడు విజయావకాశాలు కొద్దిగా మెరుగుపడతాయి. పార్టీ విడిపోకపోతే కాంగ్రెస్‌తో పొత్తుకు ములాయం సింగ్ అంగీకరించరు. ఒకవేళ అంగీకరిస్తే సమాజ్‌వాదీ పార్టీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అది ఎంత ఎక్కువన్నది ఇప్పుడే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారన్న విషయం ఇప్పటికైతే అంతు చిక్కడం లేదు. సర్వేలు ఏం చెబుతున్నాయి? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 33 శాతం ఓట్లు వస్తాయని, సమాజ్‌వాదీ పార్టీకి 26 శాతం, బీఎస్పీకి 26 శాతం, కాంగ్రెస్‌కు ఆరుశాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే–ఆక్సిస్ ఇటీవల నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకుంటే సమాజ్‌వాదీ పార్టీ కొచ్చే ఓట్ల శాతం 32. అంటే, బీజేపీ కన్నా ఒక్క శాతం తక్కువ. లోక్‌నీతి–ఏబీపీ–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీకి 27 శాతం, ఎస్పీకి 30 శాతం, బీఎస్పీకి 22 శాతం, కాంగ్రెస్‌కు 8 శాతం ఓట్లు వస్తాయి. అంటే కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీకి 38 శాతం ఓట్లు వస్తాయి. ఇది బీజేపీ కన్నా 11 శాతం ఎక్కువ కనుక సమాజ్‌వాదీ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోకి రావాలంటే... ఎన్నికల తర్వాత బీఎస్పీతో పొత్తు పెట్టుకునే అవకాశం బీజేపీకి లేదు గానీ, అదే జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. నాటి ఎన్నికల్లో ఒక్క బీజేపీకే 42.63 శాతం ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి 22.30 శాతం ఓట్లు వచ్చాయి. నాడు కాంగ్రెస్‌కు, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని కలుపుకొంటే ఎస్పీ కూటమికి 30.74 శాతం ఓట్లు అవుతాయి. అంటే, అప్పటికీ బీజేపీ కన్నా 12 శాతం ఓట్లు తక్కువ. అప్పుడు మోదీకున్న ప్రతిష్ట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని చెప్పలేం. ఎంతో కొంత తక్కువే ఉంటుంది. అది ఎంత తక్కువన్నదే ప్రస్తుతం రాజకీయ పరిశీలకులకు కూడా అంతుచిక్కడం లేదు. బీజేపీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే మోదీ ప్రతిష్టను నమ్ముకునే ఎన్నికల్లోకి దిగుతోంది. బీఎస్పీతో పొత్తు కుదిరితే.... బిహార్ తరహా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీని యూపీలో సులువుగా ఓడించవచ్చు. ఆ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ పొత్తు కుదుర్చుకున్నట్లు యూపీలో ఎస్పీ, బీఎస్పీలు సంకీర్ణ ప్రభుత్వానికి సంసిద్ధం కావాలి. ముఖ్యమంత్రి పదవి వదులుకోడానికి అఖిలేష్ యాదవ్, మాయావతిలో ఎవరూ సిద్ధంగా ఉండరు. ఏదిఏమైనా సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయన్న అంశంపైనే రాజకీయ సమీకరణలు, విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
అఖిలేశ్‌ను పెంచింది ఈ ‘శకుని మామే’..!
- పార్టీలో పరిణామాలపై ఎంపీ అమర్ సింగ్ భావోద్వేగం లక్నో: ‘అఖిలేశ్ నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి నాకు తెలుసు. అతని చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం.. అన్నింటిలోనూ తోడ్పడ్డా. ‘నా’ అనుకున్నవాళ్లే మనల్ని ద్వేషిస్తే, మనల్ని వద్దనుకుంటే ఎంత బాధపడతామోకదా! ప్రస్తుతం నాదీ అలాంటి పరిస్థితే. అఖిలేశ్ నా గురించి మాట్లాడేవన్నీ వింటే నా గుండె బరువెక్కిపోతుంది..’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అమర్‌సింగ్. (సమయం లేదు మిత్రమా.. త్యాగం తప్పదు) పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీ నుంచి లక్నో వచ్చిన అమర్‌సింగ్.. ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ‘మరో మాట లేకుండా నన్ను పార్టీ నుంచి గెంటేయాలని అఖిలేశ్ డిమాండ్ చేయడం బాధాకరం. సొంతవాళ్లే మనని ద్వేషిస్తూ ఆ బాధ వర్ణనాతీతం. నిజానికి నాకున్నవి రెండే రెండు కోరికలు. ఒకటి పార్టీలో పెద్దాయనే(ములాయమే) సుప్రీంగా ఉండాలి. రెండు, అఖిలేశ్ రాజకీయాల్లో ఇంకా ఉన్నతస్థానానికి ఎదగాలి. ఇంతకు మించి నాకేదీ అక్కర్లేదు’ అని అమర్‌సింగ్ అన్నారు. (బాబాయ్ అబ్బాయ్ భేటీ) ఇదిలాఉంటే, ఢిల్లీ నుంచి తిరిగివస్తోన్న తండ్రి(ములాయం)కి లక్నో ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకుదామనుకున్న సీఎం అఖిలేశ్.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ములాయం వెంట అమర్‌సింగ్ కూడా ఉండటమే అందుకు కారణమని, ‘శకుని మామ వెంటుంటే మనమెలా వెళతాం?’అని అఖిలేశ్ వ్యాఖ్యానించినట్లు ఆయన అనునాయులు పేర్కొన్నారు. తండ్రి ప్రాపకంతో తనకు వ్యతిరేకంగా ఎత్తులువేస్తోన్న అమర్‌సింగ్‌ను అఖిలేశ్ ‘శకుని మామ’గా అభిర్ణించడం పార్టీలోని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. (టార్గెట్ 300: అఖిలేశ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?) -
నాన్న, బాబాయ్‌లకు ఊహించని షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. తండ్రి ములాయం సింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్‌లతో రాజీకోసం చర్చలు జరుపుతూనే.. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీని పూర్తిగా తన ఆధిపత్యంలోకి తీసుకోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అఖిలేష్ వర్గం.. ములాయం, శివపాల్‌లకు మరో ఊహించని షాక్ ఇచ్చింది. ఎస్పీకి చెందిన బ్యాంకు ఎకౌంట్లను స్తంభింపజేయాలని కోరుతూ అఖిలేష్ వర్గం బ్యాంకులను కోరినట్టు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వెల్లడించింది. ఎస్పీకి విరాళాల రూపంలో వచ్చిన డబ్బు 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్టు సమాచారం. ఎస్పీకి సంబంధించి ప్రస్తుతం శివపాల్ యాదవ్ సంతకంపై బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నాయి. ములాయం, శివపాల్లతో విభేదిస్తున్న అఖిలేష్ వర్గం.. ఎస్పీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంను, యూపీ పార్టీ శాఖ చీఫ్ పదవి నుంచి శివపాల్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. ఆయనకు మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్‌తో పాటు సీనియర్ నేతలు,ఎంపీలు, 200 మందికిపైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు. అఖిలేష్ వర్గం ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ గుర్తు సైకిల్‌ను తమకు కేటాయించాల్సిందిగా కోరింది. ఆధిపత్య పోరులో ములాయం దాదాపుగా ఒంటరి అయిపోయారు. ఆయన శిబిరంలో తమ్ముడు శివపాల్, సన్నిహితుడు అమర్ సింగ్, కొద్ది మంది నేతలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. -
ములాయం 'సైకిల్' అఖిలేశ్‌కేనా?
-
ములాయం 'సైకిల్' అఖిలేశ్‌కేనా?
లక్నో: సమాజ్‌వాది పార్టీ పూర్తిగా సీఎం అఖిలేశ్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఆ పార్టీ గుర్తు కూడా ఈసీ అఖిలేశ్ వర్గమే కొల్లగొట్టేలా కనిపిస్తోంది. సమాజ్ వాది పార్టీలో ఉన్న నేతలంతా కూడా అఖిలేశ్ వెనుకే క్యూ కట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమాజ్ వాది పార్టీ మొత్తం తమతోనే ఉందని అఖిలేశ్ వర్గంలోని కీలక నేత రాంగోపాల్ యాదవ్ మరోసారి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 229మంది ఎమ్మెల్యేల్లో 212మంది తమతోనే ఉన్నారని, అలాగే 68మంది ఎమ్మెల్సీల్లో 56మంది ఉన్నారని, ఇక 24 మంది ఎంపీల్లో 15మంది తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. వీరంతా కూడా తమకు మద్దతిస్తూ సంతకాలు చేశారని చెప్పారు. పార్టీ అధికారిక గుర్తుకు సంబంధించి ఈసీకి అందించాల్సిన అఫిడవిట్లో వీరంతా సంతకాలు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ గుర్తు అయినా సైకిల్ తమకే వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా ఈసీకి అఫిడవిట్ అందిస్తామని చెప్పారు. -
అఖిలేశ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన అఖిలేశ్ యాదవ్.. ఎన్నికల పొత్తులపై దృష్టిసారించారు. దూకుడుమీదున్న బీజేపీని, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలో దూసుకుపోతున్న బీఎస్పీని గట్టిగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం ఇతర ముఖ్యపార్టీలతో పొత్తు తప్పనిసరి అని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. గడిచిన కొద్ది రోజులుగా రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నట్లే.. అఖిలేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి వచ్చీరాగానే.. ఎస్పీ చీఫ్ హోదాలో అఖిలేశ్ ఢిల్లీకి పయనం అవుతారని, జనవరి 9న జరగబోయే భేటీలో పొత్తు ఖరారు కానుందని, ఆ వెంటనే ఇరు నేతలూ ప్రకటన విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌తోపాటు ఆర్ఎల్డీతోనూ ఎస్పీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ మేరకు పరిణామాలేవీ చోటుచేసుకోలేదు. ఇప్పటికి లభించిన సమాచారం ప్రకారం.. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 90 నుంచి 105 స్థానాల్లో పోటీ చేయనుంది. కొన్ని రోజుల కిందట అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకా గాంధీల మధ్య జరిగిన రహస్య భేటీలోనే పొత్తు ఖాయమైపోయిందని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనేది మాత్రం రాహుల్- అఖిలేశ్‌లు నిర్ణయించుకోనున్నారని తెలిసింది. టార్గెట్ 300 సంప్రదాయ దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు తప్పక ఉత్తమ ఫలితాన్నిస్తుందని మొదటి నుంచీ నమ్ముతోన్న అఖిలేశ్.. ఇప్పుడు తన వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తద్వారా బీఎస్పీని, బీజేపీని ఒకేసారి దెబ్బకొట్టొచ్చన్నది ఆయన వ్యూహం. కాంగ్రెస్‌తో జతకడితే కనీసం 300 స్థానాల్లో విజయం ఖాయమని అఖిలేశ్ నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూడ్ విడుదలైన నేపథ్యంలో ఎంత త్వరగా పొత్తులు ఖరారుచేసుకుని అభ్యర్థులను ప్రకటిస్తే అంతమంచిదని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, జనవరి 9న జరగబోయే రాహుల్- అఖిలేశ్ భేటీలో ప్రియాంకా గాంధీ కూడా పాల్గొంటారని తెలిసింది. (చదవండి: ములాయం-అఖిలేష్ వివాదంలో మరో ట్విస్ట్) మాయ ‘ముస్లిం’ మంత్రం అభ్యర్థులను ప్రకటించే విషయంలో మిగతా పార్టీల కంటే ముందంజలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) శుక్రవారం ఉదయం 100 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాతో కలిపి బీఎస్పీ ఇప్పటి వరకు 200 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా, మొత్తం 403 స్థానాలకుగానూ బీఎస్పీ ఈసారి ఏకంగా 97స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టనుంది. ముజఫర్‌నగర్ అల్లర్లు, అసహన పరిస్థితులు, దాద్రీ ఘటన.. తదితర సంఘటనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యక్తమైన వ్యతిరేకతను మాయావతి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారని, అందుకే పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. -
స్నేహం కోసం.. త్యాగానికి సిద్ధం!
- ప్రియనేస్తం ములాయం కోసం అమర్ సింగ్ కీలక నిర్ణయం! - అఖిలేశ్ డిమాండ్ మేరకు మూడు నెలలు పార్టీకి దూరంగా.. లక్నో: ఎవరి కోసమైతే తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేశ్‌లు తగువులాడుకుంటున్నారో.. ఆ అమర్‌సింగ్ చివరికి త్యాగానికి సిద్ధపడ్డట్టు తెలిసింది. ప్రియ స్నేహితుడి కొడుకు, తనను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీఎం అఖిలేశ్ డిమాంఢ్ మేరకు.. ఎంపీ అమర్ మూడు నెలలపాటు రాజకీయ సన్యాసం తీసుకొనబోతున్నారని సమాచారం. ఈ మూడు నెలలూ పార్టీకి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాధికారాలు అఖిలేశ్ తీసుకుంటారు. ఈ అంశం ప్రాతిపదికనే గురువారం రాత్రి నుంచి ములాయం, అఖిలేశ్‌ల నివాసాల్లో ఎడతెరిపిలేకుండా మంతనాలు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం అనూహ్యంగా బాబాయి శివపాల్ యాదవ్.. అఖిలేశ్ ఇంటికి వెళ్లారు. అటు ఎంపీ అమర్ సింగ్.. ములాయంతో భేటీ అయ్యారు. మరి కొద్ది గంటల్లోనే అమర్ త్యాగానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అంచనా. (ఆయన గుండెల్లో నేను లేని క్షణాన.. ) ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారం సాధించేలా మార్చి వరకు సర్వనిర్ణయాధికారాలూ తనకే కట్టబెట్టాలని సీఎం అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్‌ను కోరినట్లు.. అఖిలేశ్ వర్గీయుడైన మంత్రి రవిదాస్ మల్హోత్రా మీడియాకు చెప్పారు. నేతాజీ(ములాయం) కూడా ఇందుకు మొగ్గుచూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 214 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటికే పార్టీని స్వాధీనం చేసుకున్న అఖిలేశ్ యాదవ్.. తండ్రి ములాయంను పార్టీ ‘మార్గదర్శి’గా నియమించారు. పార్టీని తిరిగి కైవసం చేసుకోలేని స్థితిలో ములాయం.. కొడుకుకు జై కొట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అఖిలేశ్ వర్గంలోని అతివాదులు వ్యాఖ్యానించారు. (ములాయం 'అమర'ప్రేమ రహస్యం) అఖిలేశ్ డిమాండ్ ప్రకారం అమర్‌సింగ్, శివపాల్ యాదవ్‌లు వచ్చే మూడు నెలల పార్టీకి దూరంగా ఉండేలి. అభ్యర్థుల ఎంపిక సహా ఎలాంటి నిర్ణయాలలో జోక్యం చేసుకోకుదు. అయితే ఈ మాటను ములాయం చేతే చెప్పించాలని అఖిలేశ్ పట్టుపడుతున్నారు. సైకిల్ గుర్తు తమదేనంటూ ఎన్నికల కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లిన ములాయం.. కమిషన్‌ను కలవకుండానే లక్నోకు తిరుగుపయనం అయ్యారు. ఆ విధంగా సైకిల్ గుర్తు అఖిలేశ్‌కే దక్కేలా ములాయం వ్యవహరించారని తేలింది. (మా పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఆయనే!) -
‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు!
⇒ సమాజ్‌వాదీ పార్టీ ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి? ⇒ అఖిలేశ్‌కు పోటీగా చిన్న కోడలు అపర్ణను రంగంలోకి దించిన సాధన (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సమాజ్‌వాదీ పార్టీ ‘కుటుంబం’లో ముదిరిన ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి? పార్టీలో ఆధిపత్యం కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగుతున్న పోరాటంలో కోడళ్లు ఎటు ఉన్నారు? పార్టీని తండ్రి చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకోవ డానికి ప్రయత్నిస్తున్న పెద్ద కొడుకు అఖిలేశ్‌యాదవ్‌కు ఆయన భార్య డింపుల్ అండగా నిలిచారు. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ భార్య అపర్ణ.. ములాయం శిబిరంలో ఇంకా కచ్చితంగా చెప్పా లంటే శివ్‌పాల్ శిబిరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ప్రమాదాన్ని’ ముందే పసిగట్టిన డింపుల్.. అఖిలేశ్‌ను 2012లో ముఖ్యమంత్రిగా ప్రకటించే సమయంలోనే.. ములాయం రెండో భార్య, అఖిలేశ్ సవతి తల్లి అయిన సాధనాగుప్తా.. తన కుమారుడైన ప్రతీక్‌ను ములాయం వారసుడిగా ప్రతిష్టించాలని కోర ుకున్నారు. అయితే ప్రతీక్ రాజకీయాలను కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. దీంతో ప్రతీక్ భార్య, తన కోడలు అపర్ణను అఖిలేశ్‌కు పోటీగా దించాలని సాధనాగుప్తా నిర్ణయించారు. ఈ వ్యూహాన్ని పసి గట్టిన డింపుల్ తన భర్త అఖిలేశ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన తన తండ్రి ములాయంను రోజూ కలుస్తూ జాగ్రత్తలు తీసుకునేవారు. అయినా కూడా తండ్రి నివాసం నుంచి సాధనాగుప్తాతో పాటు తన బాబాయి శివ్‌పాల్‌లు ఇబ్బం దులు సృష్టించగలరని తేటతెల్లమయ్యాక అఖిలేశ్ తన నివాసాన్ని ఏకంగా ములాయం ఇంటి పక్కకే మార్చేశారు. శివపాల్ అపర్ణల శిబిరం వ్యూహాలను ప్రతిఘటిస్తూ వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందే దూకుడు.. ములాయం పెద్ద కోడలు డింపుల్ పెద్దగా మాట్లాడరు. చిన్నకోడలు అపర్ణ తీరు ఇందుకు విరుద్ధమైనది. రాజకీయాల్లోకి ప్రవేశించకముందే తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. తనను తాను ప్రతిష్టించుకోవడం ఎలాగో ఆమెకు బాగా తెలుసు. ములాయం దృష్టిని ఆకర్షించడానికి ఆమె 2014లో ప్రధాని మోదీని కీర్తించటం మొదలుపెట్టారు. అఖిలేశ్‌ను ఎదుర్కోవడానికి ములాయం కుటుంబం నుంచి ఒక వ్యక్తి కావాలని కోరుకుంటున్న శివ్‌పాల్.. అపర్ణ శక్తిసామర్థ్యాలను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అపర్ణ పోటీ చేస్తారని ఏడాది కిందటే ప్రకటించారు. ఇటీవల ములాయం ప్రకటిం చిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఆ సీటుకు అపర్ణ పేరును ఖరారు చేశారు. ములాయం జాబితాను కాదంటూ సీఎం అఖిలేశ్ ప్రకటించిన రెబెల్ అభ్యర్థుల జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి ఏ పేరునూ ప్రకటించలేదు. దీనినిబట్టి.. అక్కడ అపర్ణ పోటీకి అఖిలేశ్ కూడా వ్యూహాత్మకంగానే అయినా వ్యతిరేకం కాదన్నది అర్థమవుతోంది. కుటుంబ సభ్యుల మధ్య చెల రేగిన వివాదం ఆ పార్టీని ఇబ్బం దుల్లోకి నెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూ ల్ కూడా విడుదలైనందున ఈ సంక్షోభాన్ని సత్వర మే పరిష్కరించుకోకపోతే ఎన్నికల్లో ఎస్పీకి ఇబ్బం దులు తప్పవనేది పరిశీల కుల అంచనా. అపర్ణకు రాజ్‌నాథ్ ఆశీర్వాదం.. డింపుల్ సమాజ్‌వాదీ పార్టీకి సంప్రదాయమైన రాజకీయాల పరిధిలోనే ఉంటే.. అపర్ణ తరచుగా ఆ పరిధిని దాటిపోయారు. ములాయం అన్న మనవడు తేజ్పా ల్ వివాహం లాలుప్రసాద్ కుమార్తె రాజ్ లక్ష్మితో జరి గినపుడు తిలక్ వేడుకకు హాజరైన ప్రధాని మోదీతో అపర్ణ సెల్ఫీ తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ దేశంలో అసహనం పెరుగుతోందన్న వ్యాఖ్యలపై వివాదం రేగినపుడు కూడా ఆమె బీజేపీని సమర్థిస్తూ మాట్లాడటం ద్వారా.. ఎస్పీ సైద్ధాంతిక పరిధిని మళ్లీ అతిక్రమించారు. అంతేకాదు.. గత అక్టోబర్‌లో అపర్ణ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఆయన పాదాలను తాకి నమస్కరించారు. యూపీలో బీజేపీకి ఠాకూర్ ప్రతినిధి అయిన రాజ్‌నాథ్.. అసెంబ్లీ ఎన్నికల విషయంలో అపర్ణను ‘ఆశీర్వదించార’ని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. -
ఢిల్లీ వెళ్లిన పెద్దాయన!
తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. దాదాపు పాతికేళ్ల క్రితం పెట్టిన పార్టీని, అప్పుడు తీసుకున్న గుర్తును కాపాడుకోడానికి ములాయం సింగ్ యాదవ్ నానా పాట్లు పడుతున్నారు. తమ్ముడు శివపాల్ యాదవ్‌ను తీసుకుని ఆయన ఢిల్లీకి బయల్దేరారు. తమకు మద్దతిచ్చేవాళ్లు అందరి దగ్గర నుంచి అఫిడవిట్లు తీసుకుని.. వాటిని ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తానని చెబుతున్నారు. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు మాత్రం ప్రస్తుతానికి అఖిలేష్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. ములాయం మాత్రం తనకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే.. ఎంతమంది ఆయనకు మద్దతు చెబుతున్నారో మాత్రం ఇంతవరకు బయటపడలేదు. పార్టీ గుర్తు తమదేనని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలని అటు ములాయం, ఇటు అఖిలేష్ ఇద్దరికీ ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందుకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించింది. అయితే అంవతరకు ఆగడం ఎందుకని, ఇప్పటికే ములాయం ఢిల్లీ బయల్దేరగా.. అఖిలేష్ కూడా అఫిడవిట్లు సిద్ధం చేసుకుని శుక్రవారం నాడు హస్తిన టూర్ పెట్టుకున్నారు. నోటి మాటగా కాకుండా.. అఫిడవిట్ల రూపంలోనే ఎవరెవరికి ఎంతెంత మద్దతు ఉందో చూపించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన అనూహ్య పరిణామంలో.. ములాయం సింగ్ స్థానంలో జాతీయాధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఆయన వర్గం ఎన్నుకుంది. దాంతోపాటు శివపాల్ యాదవ్‌ను యూపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
సీఎం జోరు.. బాబాయ్ బేజారు!
సమాజ్‌వాదీ పార్టీ రాజకీయం మరింత వేడెక్కింది. అసలైన పార్టీ ఎవరిదో, సైకిల్ గుర్తు ఎవరికి వెళ్లాలో తేల్చుకోవాలని ఈసీ ఆదేశించడంతో.. ఎవరికి వాళ్లు తమ బలాబలాలు తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన వర్గీయులైన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు అందరి నుంచి తనకు మద్దతుగా అఫిడవిట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. సమాజ్‌వాదీ పార్టీకి యూపీ అసెంబ్లీలో మొత్తం 229 మంది ఎమ్మెల్యేలుండగా, వాళ్లలో 214 మంది అఖిలేష్ వెంటే ఉన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీలలో కూడా చాలామంది యువ నాయకుడికే మద్దతు చెబుతున్నారు. దాంతో సైకిల్ గుర్తు అఖిలేష్ వర్గానికే దక్కేలా ఉంది. ఆయన ఎన్నికల కమిషన్‌ను శుక్రవారం కలుస్తారని, ఈలోపలే మొత్తం అన్ని అఫిడవిట్లు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సాజన్ తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీలో వచ్చిన ఈ చీలిక ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలని తమ జాతీయాధ్యక్షుడు (అఖిలేష్) చెప్పారని సాజన్ అన్నారు. వాస్తవానికి పార్టీకి ఇప్పటివరకు జాతీయాధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. దాని గురించి ప్రశ్నించగా అఖిలేష్ రాజధర్మాన్ని పాటిస్తున్నారని, తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. ములాయం మద్దతు తమ్ముడికే ఉండటం.. ఎన్నికలు కూడా సమీపించడంతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. అసలైన సమాజ్‌వాదీ పార్టీ తమదేనంటూ ఎవరికి వారు చెబుతుండటంతో ఎన్నికల కమిషన్ కూడా బలాలు నిరూపించుకోవాలని ఆదేశించింది. -
యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ?
భిన్నమైన ఫలితాలను ప్రకటించిన ఓపినియన్ పోల్స్ బీజేపీకి ఇండియా టుడే సర్వే.. ఎస్పీకి ఏబీపీ న్యూస్ సర్వే మెజారిటీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు నిట్టనిలువునా చీలిపోయాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని పేర్కొంది. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్ డిసెంబర్లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. ఇక ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఎస్పీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్‌కు 13-9 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఇక పంజాబ్ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు. ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్ సర్వే మాత్రం కాంగ్రెస్-ఆప్ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలలో బీజేపీ 35-45 స్థానాలతో అధికారంలోకి రావొచ్చునని, అధికార కాంగ్రెస్‌కు 22-30 సీట్లు వస్తాయని పేర్కొంది. -
‘సైకిల్ గుర్తు రద్దు’పై ఈసీ స్పందన..