అపర్ణా యాదవ్ సంస్థకు 86% ‘నిధులు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గో సంరక్షణకు కేటాయించిన నిధుల్లో 86 శాతం డబ్బులు అపర్ణ యాదవ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఖాతాలోకి చేరాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ప్రభుత్వం తాజాగా ఈ వివరాలు వెల్ల డించింది.
నాటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు తమ్ముడు ప్రతీక్ యాదవ్ భార్యనే అపర్ణ. గో సంరక్షణకు కేటాయించిన నిధుల వివరాలు తెలపాలంటూ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ భార్య నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. 2012 నుంచి 2017 మధ్య యూపీ ప్రభుత్వం మొత్తం రూ.9.66 కోట్లను గో సంరక్షణకు కేటాయించగా, అందులో రూ.8.35 కోట్లను అపర్ణ నడిపే జీవ్ ఆశ్రయ అనే సంస్థకు కేటాయించింది.