Aparna Yadav
-
బీజేపీ గెలవాలని కోరుకుంటున్న ములాయం!
లక్నో: ములాయం సింగ్ యాదవ్ చిన్న అపర్ణా యాదవ్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ములాయం ఆశీస్సులు తీసుకున్న ఫొటోను శుక్రవారం ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ‘బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మా నాన్న/నేతాజీ ఆశీస్సులు తీసుకున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. దీనిపై ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘అంటే దీనర్థం నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) కూడా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నార’ని వ్యాఖ్యానించారు. బీజేపీకి ధన్యవాదాలు: అఖిలేశ్ అపర్ణా యాదవ్.. గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘వారసత్వ భారాన్ని తగ్గించినందుకు బీజేపీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆమెను బీజేపీకి వెళ్లకుండా వారించేందుకు తన తండ్రి ములాయం సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరడం గమనార్హం. भारतीय जनता पार्टी की सदस्यता लेने के पश्चात लखनऊ आने पर पिताजी/नेताजी से आशीर्वाद लिया। pic.twitter.com/AZrQvKW55U — Aparna Bisht Yadav (@aparnabisht7) January 21, 2022 టిక్కెట్ దక్కదని తెలిసి.. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడి పోటీ చేయాలని భావించిన అపర్ణా యాదవ్.. సమాజ్‌వాదీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఈసారి టిక్కెట్ ఇచ్చేందుకు అఖిలేశ్ సుముఖంగా లేకపోవడంతో తన దారి తను చూసుకున్నారు. మరి కంటోన్మెంట్ సీటును బీజేపీ ఆమెకు ఇస్తుందా, లేదా అనేది వేచిచూడాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణ తన కుమారుడికి ఈ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. -
బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన అఖిలేష్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పలువురు నేతలు ఇప్పటికే పార్టీలు మారడంతో అధికార ప్రతిక్షాల మధ్య పోరు హోరాహారీగా జరగనుందని రాజకీయవర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోదరుడి భార్య అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన అపర్ణ యాదవ్ అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. అపర్ణ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని అపర్ణ యాదవ్ ఇతరపార్టీలో కూడా వ్యాప్తి చేయాలనుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. తప్పకుండా సమాజ్‌వాదీ పార్టీ భావాజాలం బీజేపీకి చేరుతుందని తెలిపారు. ఆమె పార్టీ మారకుండా ఉండాలని ప్రయత్నించామని, కానీ సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కాగా, అపర్ణ యాదవ్ 2017లో ఎస్పీ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అపర్ణ యాదవ్.. బీజేపీ నేత రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక మరోవైపు అపర్ణయాదవ్ చేరిక బీజేపీ ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. -
అఖిలేష్‌కు దిమ్మతిరిగే షాక్.. బీజేపీలోకి ములాయం చిన్న కోడలు
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతకొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ ములాయంసింగ్ యాదవ్ సవతి కుమారుడు (రెండో భార్య సాధనా సింగ్‌కు మొదటి వివాహం ద్వారా జన్మించారు) ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న అపర్ణా యాదవ్‌కు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌లు సభ్యత్వం అందించారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఓబీసీ వర్గాల్లో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ములాయం చిన్న కోడలు కాషాయ కండువా కప్పుకోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. చదవండి: రసవత్తరంగా యూపీ ఎన్నికల సమరం.. అసెంబ్లీ బరిలో అఖిలేష్ నియోజకవర్గమే సమస్య... 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన అపర్ణా యాదవ్, ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎస్పీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఈసారి అపర్ణా యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు అఖిలేశ్ సిద్ధంగా లేరు. ఈ స్థానం నుంచి ఎస్పీ యువనేత సౌమ్యభట్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. లక్నోలో విద్యా సంస్థను నడుపుతూ, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన సౌమ్య, అఖిలేశ్‌తో పాటు ఆయన భార్య డింపుల్ యాదవ్‌కు సన్నిహితురాలు. ఈ పరిస్థితుల్లోనే అపర్ణా యాదవ్ సమాజ్‌వాదీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దేశాన్ని ఆరాధించేందుకే తాను ఎస్పీ నుంచి బయటకు వచ్చానని, తన శక్తి మేరకు పార్టీ కోసం చేయగలిగినదంతా చేస్తానని అపర్ణా యాదవ్ పేర్కొన్నారు.మరోవైపు లక్నో కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ మహిళా నేత రీటా బహుగుణ ఈసారి బీజేపీ టికెట్ తన కుమారుడిని బరిలోకి దింపాలని ఆశిస్తున్నారు. చదవండి: తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్ -
బీజేపీ రివర్స్ పంచ్! ఎస్పీ చీఫ్ సోదరుడి భార్య అపర్ణకు బీజేపీ గాలం?
ముగ్గురు ఓబీసీ మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేల (ఇందులో ఇద్దరు బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్–ఎస్’కు చెందిన వారు)ను చేర్చుకొని ఊపుమీదున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. అఖిలేశ్ సవతి సోదరుడైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్‌కు కండువా కప్పేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అపర్ణ కొంతకాలంగా మోదీ ప్రభుత్వ విధానాలకు బాహటంగా మద్దతు పలుకుతున్నారు. ఆమెతో బీజేపీ టచ్‌లో ఉంది. ఇరుపక్షాల మధ్య అపర్ణ పార్టీ ఫిరాయింపుపై చర్చలు జరుగుతున్నాయని... ఇప్పుడవి ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి, సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఫిబ్రవరి– మార్చిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ సీటునే అడుగుతున్నట్లు వినికిడి. అయితే సీనియర్ రీటా బహుగుణను కదపడం ఇష్టం లేని బీజేపీ ములాయం సింగ్ కోడలిని మరో చోటు నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. కుంభస్థలాన్ని కొట్టాలని... బీజేపీ నుంచి ఎస్పీకి ఇటీవలి వలసలతో కమలదళం లోలోపల రగిలిపోతోంది. పెద్ద ఎత్తున ప్రతిదాడి చేయకపోతే బీజేపీ చేష్టలుగిడి చూస్తోందనే అభిప్రాయం బలపడుతుంది. అందుకే అపర్ణా యాదవ్‌కు గాలం వేసింది. తమ్ముడి భార్యను ఆపలేకపోతే... అఖిలేశ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో తనతో విబేధించి వేరుకుంపటి పెట్టుకున్న బాబాయ్ శివపాల్ యాదవ్ (ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ– లోహియా)తో అఖిలేశ్ ఇటీవలే సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే అన్నట్లుగా బీజేపీ వ్యతిరేకంగా చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుపోతున్నారు. ఇప్పుడు బీజేపీ అపర్ణను లాగేస్తే... మళ్లీ ఇంటిపోరు మొదలైనట్లే. ‘మా జోలికొస్తే ఊరుకుంటామా? మీ ఇంటికొస్తాం.. నట్టింటికొస్తాం’ అన్నట్లుగా బీజేపీ ప్రతిదాడికి దిగింది. ములాయంసింగ్ ఇంట్లో చిచ్చు పెట్టడం ద్వారా ఎస్పీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టవచ్చేనేది కమలనాథుల వ్యూహం. ములాయంసింగ్ రెండో భార్య సాధనా గుప్తాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ప్రతీక్ యాదవ్. – నేషనల్ డెస్క్, సాక్షి -
అయోధ్యకు మాజీ సీఎం కోడలు విరాళం
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరిగిన మందిరాన్ని 1500 కోట్లతో నిర్మించాలని ఆలయ ట్రస్ట్ భావిస్తోంది. రానున్న మూడేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీనికి అనుగుణంగానే డిజైన్‌ను సైతం సిద్ధంచేశారు. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ కూడా భాగస్వామ్యం కావాలని దేశ వ్యాప్తంగా హిందువులు, ఇతర వర్గాలు పరితమిస్తున్నారు. దీని కోసం తమ వంతుగా పెద్ద ఎత్తున విరాళాలను అందిస్తున్నారు. సామాన్యుడి నుంచి బడా వ్యాపారుల వరకు అందరూ విరాళాలు ఇస్తున్నారు. నిధుల సమీకరణపై ఓవైపు కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ.. వందలకోట్ల రూపాయాలు ట్రస్టుకు విరాళంగా అందుతున్నాయి. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుంటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు. ట్రస్టు సభ్యులు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1511 కోట్ల రూపాయాలు అందాయి. ఫిబ్రవరి 27 వరకే నిధుల సేకరణ కార్యక్రమం జరుగనుంది. దీంతో విరాళాలు అందించేందుకు సామాన్యులు మొదలు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు రామాలయం కోసం తమ వంతుగా భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయ్ సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణయాదవ్ అయోధ్య మందిరానికి విరాళం అందించారు. తన వ్యక్తిగతంగా 11 లక్షల రూపాయాలను అందిస్తున్నట్లు శనివారం తెలిపారు. ఈ మేరకు తన నివాసానికి వచ్చిన రామభక్తులు, ప్రచారక్ సభ్యులకు చెక్‌ను అందించారు. తన కుటుంబ సభ్యుల తరఫున తాను విరాళం ఇవ్వలేదని, కేవలం తన వ్యక్తిగతమని అపర్ణ స్పష్టం చేశారు. కాగా యూపీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అపర్ణ యాదవ్ విరాళం ఇవ్వడం యూపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున ఆమె పోటీచేశారు. -
ములాయం వ్యాఖ్యల వెనుక కారణముంది!
లక్నో: నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని పార్లమెంటులో ఎస్పీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పేర్కొనడం దేశ రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న తరుణంలో, మోదీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించేందుకు మహాకూటమిగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ.. సాక్షాత్తూ లోక్‌సభలో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ములాయం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు రుసరుసలాడుతుండగా.. ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ మాత్రం ములాయం వ్యాఖ్యలను సమర్థించారు. ‘ఆయన వ్యాఖ్యల వెనుక కారణం ఉండి ఉంటుంది. ప్రతిపక్షం, అధికార పక్షం అన్న తేడా లేకుండా ఆయన ప్రతి ఒక్కరికీ ఆశీర్వాదాలు అందజేశారు. పెద్దవారు దీవెనలు ఇవ్వడం పరిపాటే. ఆశీర్వాదాలు ఇచ్చినంత మాత్రాన ఎన్నికలు గెలిచినట్టు కాదు. అందుకు ఎంతో శ్రమ కావాలి. ఆయన శుభాశీస్సులు అందరి వెంట ఉంటాయి’ అని అపర్ణ పేర్కొన్నారు. -
ట్రిపుల్ తలాఖ్‌కు అపర్ణ ప్రశంసలు
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ ట్రిపుల్ తలాఖ్ చట్టంపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన అపర్ణ.. ట్రిపుల్ తలాఖ్ బిల్లు మహిళల హక్కులను కాపాడుతుందని అన్నారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ట్రిపుల్ తలాఖ్ ద్వారా పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌కు చిన్నమార్పులతో సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా మద్దుతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
వైరల్ వీడియో: మాజీ సీఎం కోడలు అదిరేటి స్టెప్పులు..
సాక్షి, లక్నో: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై పలు రాష్ట్రాల్లో వివాదం కొనసాగుతుంటే యూపీ మాజీ సీఎం కోడలు మూవీలోని ఓ పాటకు ఓ ఫంక్షన్ల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మూవీ పాటకు ఆమె ఎందుకు డ్యాన్స్ చేసిందంటూ కర్ణిసేన ప్రశ్నించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ అపర్ణా యాదవ్ సోదరుడి నిశ్చితార్థం లక్నోలో జరిగింది. ఆ వేడుకలో అపర్ణా యాదవ్ మస్త్ మస్త్ స్టెప్పులేసి అదర గొట్టేశారు. వివాదాస్పద పద్మావతి మూవీలోని ఘుమర్ పాటకు ఆమె చక్కటి డ్యాన్స్ చేశారు. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. అపర్ణ స్టెప్పులకు ఫంక్షన్‌కు హాజరైనవారంతా ఫిదా ఐపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరఫున లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి అపర్ణా యాదవ్ ఓటమి పాలయ్యారు. రాణి పద్మావతికి సంబంధించిన కొన్ని సీన్లు తొలగించాలన్న రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన.. దర్శకుడు భన్సాలీ చరిత్రను వక్రీకరించాడంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా కొన్ని రాష్ట్రాల్లో పద్మావతి మూవీపై ఆంక్షలు విధించారు. ఇదివరకే పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు పద్మావతి మూవీపై నిషేధం విధించగా.. ఈ చిత్రాన్ని బిహార్‌లోనూ ప్రదర్శించొద్దని సీఎం నితీశ్ కుమార్ నిన్న (మంగళవారం) అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. -
మాజీ సీఎం కోడలు అదిరేటి స్టెప్పులు..
-
అపర్ణా యాదవ్ సంస్థకు 86% ‘నిధులు’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గో సంరక్షణకు కేటాయించిన నిధుల్లో 86 శాతం డబ్బులు అపర్ణ యాదవ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఖాతాలోకి చేరాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ప్రభుత్వం తాజాగా ఈ వివరాలు వెల్ల డించింది. నాటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు తమ్ముడు ప్రతీక్ యాదవ్ భార్యనే అపర్ణ. గో సంరక్షణకు కేటాయించిన నిధుల వివరాలు తెలపాలంటూ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ భార్య నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. 2012 నుంచి 2017 మధ్య యూపీ ప్రభుత్వం మొత్తం రూ.9.66 కోట్లను గో సంరక్షణకు కేటాయించగా, అందులో రూ.8.35 కోట్లను అపర్ణ నడిపే జీవ్ ఆశ్రయ అనే సంస్థకు కేటాయించింది. -
'బావగారూ... మాట నిలబెట్టుకోండి'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్ష బాధ్యతలు ములాయం సింగ్ కు అప్పగించాలని అఖిలేశ్ యాదవ్ ను ఆయన మరదలు అపర్ణ యాదవ్ కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. ములాయంను పదవీత్యుడిని చేయడం తనను కలచివేసిందని వెల్లడించారు. ఈగో సమస్యల వల్లే ఎన్నికల్లో తాను ఓడిపోయానని చెప్పారు. 'అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తిరిగి అప్పగిస్తానని అఖిలేశ్ జనవరిలో చెప్పారు. తాను మాటమీద నిలబడే వ్యక్తినని అఖిలేశ్ చెబుతుంటారు. ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకుంటారని భావిస్తున్నాను. నేతాజీ బతికున్నంత వరకు మా ఇంట్లో ఆయన మాటే ఫైనల్. ఎన్నికలకు ముందు ఆయనను పరాభవానికి గురిచేయడం నన్ను కలచివేసింది. ఆయన కూడా చాలా బాధ పడ్డారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. కుటుంబమంతా కలిసివుండాలని కోరుకుంటున్నాను. మా పార్టీ ఎప్పుడు గెలవని లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేశాను. మేము నియమించిన బృందం ఈగో సమస్యలతో సమన్వయంతో పనిచేయలేదు. ఈ విషయాన్ని నేతాజీ, అఖిలేశ్ దృష్టికి తీసుకెళ్లినా వారేమీ చేయలేకపోయార'ని అపర్ణ యాదవ్ వివరించారు. -
ముఖ్యమంత్రితో బాబాయ్ మంతనాలు
లక్నో : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది నానుడి. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, రాజకీయ సమీకరణలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ సింగ్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం హాట్ టాఫిక్‌గా మారింది. సుమారు అరగంటపాటు వీరిద్దరి మధ్య భేటీ కొనసాగింది. . ముఖ్యమంత్రి నివాసంలో జశ్వంత్‌నగర్ ఎమ్మెల్యే అయిన శివపాల్‌యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారని సీఎం కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమే అని చెబుతున్నా, శివపాల్ ...సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం కొత్త చర్చలకు దారితీసింది. ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణ యాదవ్ పలుమార్లు యోగి ఆదిత్యనాథ్‌తో కలిసిన విషయం తెలిసిందే. త్వరలో అపర్ణయాదవ్ కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు జోరందుకున్నాయి. మరోవైపు శివపాల్ కూడా సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ములాయం కుటుంబసభ్యులు కమలానికి చేరువ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ.. అబ్బాయ్ అఖిలేష్, బాబాయ్ శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావలనుకున్న అఖిలేష్‌కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఎస్పీ ఓటమితో ములాయంతో పాటు శివపాల్ కూడా అఖిలేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడిన విషయం తెలిసిందే. -
బీజేపీలోకి ములాయం కోడలు?
లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అపర్ణ నేతృత్వంలోని ఎన్జీవో నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. బీజేపీలో చేరే అవకాశముందా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు చెబుతా అని అపర్ణ సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నారు. బీజేపీలో చేరికను ఆమె ఖండించకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం పోటీ చేసిన అపర్ణ.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. ఈ నెల 24న తన భర్త ప్రతీక్ యాదవ్ తో పాటు సీఎం యోగిని కలిసి 20 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిసినట్టు అపర్ణ అప్పుడు చెప్పారు. ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఆమె బీజేపీలోకి వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. -
యూపీ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. వీరు ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు. తాజాగా ముగిసిన యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీతో ములాయం, అఖిలేశ్ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో ప్రతీక్, అపర్ణ దంపతుల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. -
సీఎం అవుదామని.. ఓటమి అంచుల్లో!
ఉత్తరప్రదేశ్‌లోని యాదవ్ కుటుంబంలో చెలరేగిన చిచ్చులో.. పార్టీ ఆధిపత్యం ములాయం వర్గానికి వచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా అవ్వాలని భావించిన ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఘోరంగా దెబ్బతిన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా టికెట్ ఇవ్వండి, పోటీచేసి గెలుస్తానని ధీమాగా చెప్పిన అపర్ణ.. లక్నో కంటోన్మెంటు నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలు రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రీటా బహుగుణకు 52,856 ఓట్లు రాగా, అపర్ణాయాదవ్‌కు 25,925 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి యోగేష్ దీక్షిత్ 13,194 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. దాదాపు 27వేల ఓట్లతో వెనకబడిన అపర్ణ.. అంత తేడాను అధిగమించి ముందుకు రావడం దాదాపు అసాధ్యం. ములాయం, సాధనాగుప్తా తనయుడైన ప్రతీక్ సతీమణి అపర్ణ. ఎస్పీకి యువ వారసురాలిగా తానే తెరపైకి రావాలని ఆమె కలలు కన్నారు. పార్టీ తరఫున భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా ఆమెలో ఉండేది. కొన్ని నెలల కిందట అఖిలేశ్, శివ్‌పాల్ మధ్య గొడవ హోరాహోరీగా సాగుతుండగా పార్టీ ప్రజాప్రతినిధి అయిన ఉదయ్‌వీర్ సింగ్ లేఖ రాస్తూ.. ములాయం రెండో భార్య కుటుంబమే సీఎం అఖిలేశ్‌ను టార్గెట్ చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. పాలిటిక్స్‌లో పీజీ చేసిన అపర్ణ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాల కోర్సు కూడా చేశారు. అపర్ణ మంచి గాయని. నిజానికి ప్రతీక్ యాదవ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఆయన తల్లి సాధన కోరిక. కానీ ప్రతీక్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండి.. వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. దాంతో సవతి కొడుకు అఖిలేష్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో కోడలు అపర్ణను సాధన ప్రోత్సహించారు. తత్ఫలితంగానే అపర్ణా యాదవ్ ముందుకు వచ్చారు. వివాదాలతో సావాసం బావగారు తనకు టికెట్ ఇస్తే ఎక్కడైనా గెలుస్తానని చెప్పిన అపర్ణా యాదవ్‌కు ఆమె కోరుకున్న లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచే అవకాశం కల్పించారు. అయితే, ఎన్నికలకు కొద్ది ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషి ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆమెను ఢీకొంటానని చెప్పిన అపర్ణ.. ముందునుంచి వివాదాలతో సావాసం చేశారు. లక్నోలో ఓ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీ దిగడాన్ని ఆమె సమర్థించుకున్నారు. ఇందులో తప్పేముందని, మోదీ అందరికీ ప్రధాని అని, తన మామ ములాయం కూడా ఆయనతో ఫొటోలు దిగారని చెప్పారు. -
‘ఆ ఇద్దరి’కే పరిమితమైన ములాయం
లక్నో: గత అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ ఈసారి నామమాత్రపు ప్రచారానికే పరిమితం అయ్యారు. ఆయన కేవలం ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేశారు. 2012 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, 300 ర్యాలీల్లో పాల్గొన్న ములాయం ఈసారి తన సోదరుడు శివపాల్ యాదవ్, చిన్న కోడలు అపర్ణ యాదవ్ తరఫున మాత్రమే క్యాంపెయినింగ్ చేశారు. కాగా కాంగ్రెస్‌తో పొత్తు పట్ల అసంతృప్తిగా ఉన్న ఆయన తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ తరఫున కూడా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో సోదరుడు శివ్‌పాల్‌యాదవ్ పోటీ చేస్తున్న జశ్వంత్‌నగర్ నియోజకవర్గంతో పాటు చిన్న కోడలు అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్న లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రమే ఆయన ప్రచారం చేశారు. కాగా యూపీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా పెద్దాయన కేవలం సమాజ్‌వాదీ తరఫున మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌లో ఇప్పటివరకూ ఐదు దశలు పూర్తికాగా, మరో రెండు దశల పోలింగ్ ఈ నెల 4, 8వ తేదీల్లో జరగనున్నాయి. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
తోటికోడలి కోసం ప్రచారం
అపర్ణకు బాసటగా డింపుల్ లక్నో: యూపీ సీఎం అఖిలేశ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ లక్నోలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బుధవారం తోటికోడలు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ స్థానం నుంచి ములాయం రెండో భార్య కుమారుడైన ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన డింపుల్.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, లక్నో మెట్రో ప్రాజెక్టును డింపుల్ ప్రస్తావించినపుడు ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి బరిలో ఉన్నారు. కుటుంబంలో ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇద్దరు కోడళ్లు ఒకే వేదికపైకి రావటం విశేషం. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కూడా చిన్న కోడలి తరపున బుధవారం కంటోన్మెంట్లో ప్రచారం చేశారు. బీజేపీవి విద్వేష రాజకీయాలు:రాహుల్ బారాబంకి: బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని జైద్పూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తనూజ్ పూనియా తరఫున ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ విద్వేషం ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ప్రజల మధ్య సామరస్యం పెంచడానికి పాటుపడుతోందనే సందేశాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ మాటలు మాత్రమే చెబుతారని పనులు చేయరని ఎద్దేవా చేశారు. యూపీ అభివృద్దికి కాంగ్రెస్–ఎస్పీ కూటమి మాత్రమే పనిచేస్తుందని అన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ మాట నిజం కాలేదని, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును నవంబర్ 8న చిత్తుకాగితాలు చేశారని చురకలంటించారు. -
ఒకే వేదికపై ములాయం కోడళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ నిరూపించారు. ఎన్నికల ప్రచారంలో డింపుల్, అపర్ణ ఇద్దరూ కలసి ఒకే వేదికను పంచుకున్నారు. తోడికోడలు అపర్ణకు మద్దతుగా డింపుల్ ప్రచారం నిర్వహించారు. బుధవారం లక్నో కంటోన్మెంట్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో డింపుల్, అపర్ణ పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా డింపుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. అపర్ణకు ఓట్లు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఆమె ఎంచుకున్నారు. ఇక ములాయం పెద్ద కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ లోక్ సభ సభ్యురాలు. ఆమె కనౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బుధవారం ములాయం కోడళ్లు ఇద్దరూ లక్నోలో ప్రచారం చేశారు. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరయినా డింపుల్, తాను చాలా సన్నిహితంగా ఉంటామని అపర్ణ చెప్పారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ వెలుగులోకి వచ్చారు. ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణకు, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ములాయం కుటుంబంలో ఆధిపత్య పోరు, ఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కినా.. ఎన్నికలు వచ్చేసరికి తమ మధ్య విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగా ఉన్నామని ములాయం కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
'బావ, నేతాజీది ఒకే తీరు.. శైలి'
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నా.. ప్రచారంలో మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ జరగనున్న తన నియోజకవర్గం లక్నో కంటోన్మెంట్ లో యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తో కలిసి మంగళవారం ఓ బహిరంగసభలో అపర్ణ పాల్గొన్నారు. నేతాజీ ములాయం, వరుసకు బావ అయిన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఒకేతీరుగా వ్యవహరిస్తారని.. ఆ ఇద్దరిరి ఒకే స్వభావమని.. అభివృద్ధే వారి లక్ష్యమని కొనియాడారు. తమ పార్టీ ఇక్కడ రూ.40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిందని, మరోసారి ఎస్పీని గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని అపర్ణ తెలిపారు. నియోజకవర్గంలో ఆమె ఎక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ సభలలో 'ఫ్యూచర్ మినిస్టర్' అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 'నేను తొలుత ఇక్కడి ఆడపడుచును.. ఆ తర్వాతే కోడలుగా వచ్చాను' అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వరుసకు సోదరి అయిన ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ తాను చాలా సన్నిహితంగా ఉంటామని, ఇద్దరి వ్యక్తిత్వాలు వేరని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను సంతోషంగా షేర్ చేసుకునేంతగా తమ మధ్య చనువు ఉందని ఓ విలేకరి ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చారు. శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణ, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషీపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉండటం అపర్ణకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అపర్ణకు బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఈ స్థానంపై ఉంది. -
నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?
సమాజ్‌వాద్ పార్టీలో ప్రస్తుతం తండ్రికొడుకులు బాగానే ఉన్నప్పటికీ, గత కొన్ని రోజుల క్రితం వరకు తండ్రి ములాయం, పెద్ద కొడుకు అఖిలేష్ మధ్య రాజుకున్న వివాదం అంతాఇంతా కాదు. సైకిల్ గుర్తు కోసం ఆ ఇద్దరి పోరు ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్‌లో కలవరం సృష్టించింది. అదే సమయంలో ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ లంబోర్గిని కార్లో లక్నో రోడ్లపై చక్కర్లు కొట్టడం పేపర్లలో హెడ్‌లైన్స్‌గా నిలిచింది. ఇది కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఆ లంబోర్గిని హురాకాన్ కారును రుణం తీసుకుని మరీ కొనుకున్నానని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పారు. రాజకీయాలంటే పెద్దగా ఇష్టంలేని ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్, జిమ్స్ వంటి బిజినెస్‌లను కలిగి ఉన్నారు. ఈ కారుకు సంబంధించిన అన్ని పేపర్లు తన దగ్గరున్నాయని, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్టు ప్రతీక్ తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా దీనిపై ఎందుకంత రాద్ధాంతమని ప్రశ్నించారు. ఒకవేళ ఈ రూ.5 కోట్లను ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టుంటే ఎవరూ ఏమి అనేవారు కాదుకదా? అని ప్రశ్నించారు. సమాజ్ వాద్ పార్టీలో చిచ్చు రేగడానికి ఓ వంతు కారణమైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఈ సారి ఎన్నికల్లో లక్నో నుంచి పోటీకి దిగబోతున్నారు. తన భార్య అపర్ణ యాదవ్ కచ్చితంగా గెలుస్తారని ప్రతీక్ ధీమా వ్యక్తంచేశారు. తను పోటీకి దిగబోతున్న ప్రాంతంలో అపర్ణ చాలా చేశారని ప్రతీక్ తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో 250 సీట్ల నుంచి 300 సీట్ల వరకు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని, ఒకవేళ ఆ ఇష్టమే ఉంటే ఎప్పుడో రాజకీయాల్లోకి ప్రవేశించే వాడినని చెప్పారు. ఎక్కువగా తన బిజినెస్‌ల వైపే దృష్టిసారిస్తానని ప్రతీక్ పునరుద్ఘాటించారు. -
బాంబు పేల్చిన ములాయం కోడలు
లక్నో: ఉత్తరప్రదేశ్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని బాంబు పేల్చారు. వెనుబడిన జాబితాలోని యాదవ కులానికి చెందినప్పటికీ తన కూతురికి రిజర్వేషన్ అవసరం లేదని ఒక వెబ్ సైటుకు ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పారు. ‘మేము బాగా కలిగిన కుటుంబానికి చెందినవాళ్లం. అలాంటప్పుడు కులాల ప్రతిపాదికన రిజర్వేష్లన్లు ఎందుకు తీసుకోవాల’ని ఆమె ప్రశ్నించారు. అపర్ణ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఓబీసీలు, నిమ్నకులాలపై నిజంగా సమాజ్ వాదీ పార్టీకి ప్రేమ ఉంటే ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. అపర్ణ యాదవ్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదవ కులంలో ఎంతో మంది వెనుకబడినవారు ఉన్నారని తెలిపారు. కాగా, తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన అపర్ణ యాదవ్.. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. -
ములాయం చిన్న కోడలి సంపదెంతో తెలుసా!?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన సంగతి తెలిసిందే. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆమె మూడో దఫా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. సోమవారం ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. తనకు, తన భర్త ప్రతీక్ యాదవ్‌కు మొత్తం రూ. 22.95 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తమ ఆస్తుల్లో రూ. 5.23 కోట్లు విలువచేసే అత్యంత ఖరీదైన లాంబోర్గినీ వాహనం కూడా ఉందని వెల్లడించారు. ఇది తన భర్త పేరిట ఉందని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనం లేదని పేర్కొన్నారు. తనకు రూ. 1.88 కోట్ల విలువచేసే నగలు ఉన్నాయని తెలిపారు. ఇక తన భర్త ప్రతీక్ రూ. 4.5 కోట్ల రుణాన్ని గోమతినగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ ఇండియా శాఖ నుంచి తీసుకున్నారని పేర్కొన్నారు. తన పేరిట ఎలాంటి పెట్టుబడులు, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు లేవని, కానీ తన భర్త రూ. 7.96 లక్షల విలువచేసే బీమా పాలసీలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి దంపతులిరువురు ఆదాయపన్ను చెల్లించినట్టు తెలిపారు. ఎస్పీలో తలెత్తిన ములాయం అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకొని ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. ఆమె ఈసారి బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఇక్కడి పోటీపైనే నెలకొని ఉంది. -
మోదీతో సెల్ఫీ దిగితే తప్పేంటి: ములాయం కోడలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణా యాదవ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. లక్నో కంటోన్మెంట్ నుంచి ఎస్పీ తరపున బరిలోకి దిగిన అపర్ణ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలసి ప్రజల వద్దకు వెళ్లిన ఆమె రాజకీయ అనుభవమున్న నాయకురాలిగా అందర్నీ పలకరిస్తూ ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ.. ములాయం కుటుంబమంతా కలసిమెలసి ఉందని చెప్పారు. తాను చిన్న మామయ్య శివపాల్ యాదవ్ వర్గంలో ఉన్నట్టు వచ్చిన వార్తలు నిరాధారమని, తామంతా ఒక్కటేనని, ఆయన పార్టీకి వెన్నెముక లాంటివారని అన్నారు. లక్నోలో ఓ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవల సెల్ఫీ దిగడాన్ని ఆమె సమర్థించుకున్నారు. ఇందులో తప్పేముందని, మోదీ అందరికీ ప్రధాని అని, తన మామ ములాయం కూడా ఆయనతో ఫొటోలు దిగారని చెప్పారు. ములాయం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉండగా, కొడలు డింపుల్ యాదవ్ పార్లమెంట్ సభ్యురాలు. కాగా ములాయం రెండో కొడుకు ప్రతీక్ యాదవ్‌కు రాజకీయాలపై ఆసక్తిలేదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నారు. ప్రతీక్ భార్య అపర్ణకు రాజకీయాలంటే ఆసక్తి. దీంతో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తన భర్త వ్యాపారవేత్తని, రాజకీయాలపై ఆసక్తిలేదని అపర్ణ చెప్పారు. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ జోషీపై అపర్ణ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఒక్కసారి కూడా గెలవని లక్నో కంటోన్మెంట్ నుంచి బలమైన ప్రత్యర్థితో పోటీపడుతున్న అపర్ణ.. సవాల్‌గా తీసుకుని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. -
చిన్నకోడలి వ్యూహాలు ఏంటి?
ఎన్నికలకు సమయం దగ్గర పడింది. వ్యూహ ప్రతివ్యూహాలతో కొమ్ములు తిరిగిన నాయకులంతా దూసుకెళ్తున్నారు. తలపండిన ఒక సీనియర్ మోస్ట్ నాయకురాలితో.. ఇప్పుడే తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న ములాయం చిన్నకోడలు తలపడుతున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రీటా బహుగుణ జోషితో ఢీకొంటున్న అపర్ణాయాదవ్ తన సొంత వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. పోటీ చేయమని తన మీద బాగా ఒత్తిడి వచ్చిందని, దాంతో టికెట్ ఇవ్వండి.. ఎక్కడైనా నెగ్గుతానని తమవాళ్లతో చెప్పినట్లు ఆమె ధీమాగా తెలిపారు. పెద్దకోడలు డింపుల్ యాదవ్ కొంతవరకు సురక్షితమైన స్థానాన్ని ఎంచుకోగా.. అపర్ణ మాత్రం అసలు సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఎంచుకున్నారు. తనకు అదే టికెట్ కావాలని ఆమె కోరగా.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న బావగారు అఖిలేష్ యాదవ్ కూడా అదే టికెట్‌ను ఆమెకు ఖరారు చేశారు. వారసత్వ రాజకీయాలు తప్పవా.. అని పలువురు మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా, దానికి దీటుగా సమాధానం ఇచ్చారు. లాయర్ల కొడుకులు లాయర్లయితే తప్పులేదు, డాక్టర్ల పిల్లలు మెడిసిన్ చదివితే తప్పులేదు గానీ నాయకుల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని అడిగారు. సమాజ్‌వాదీ కుటుంబ రాజకీయాల్లో భాగంగా ఆమె తన మామగారు ములాయం సింగ్ యాదవ్, చిన మామగారు శివపాల్ యాదవ్‌లకు గట్టి మద్దతుగా నిలిచారు. ఈ అంశంపై ప్రశ్నించినప్పుడు.. నేతాజీ తన రోల్ మోడల్ అని, బావగారు యూత్ ఐకాన్ అని, శివపాల్ చాచా పార్టీకి వెన్నెముక లాంటివారని ఆమె చెప్పారు. కుటుంబాన్ని ఏకం చేయడానికి కోడలిగా తాను చేయగలిగినంత చేశానని, ఇప్పుడు అంతా ఒక్కటయ్యారు కాబట్టి ఇక బాధలేదని అన్నారు. మాజీ జర్నలిస్టు కుమార్తె అయిన అపర్ణా యాదవ్.. లక్నోలో ఫేమస్ అయిన లారెటో కాన్వెంట్లో చదివి, తర్వాత ఇంగ్లీషు సాహిత్యంలో బీఏ ఆనర్స్ చేశారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాల్లో పీజీ చేశారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె.. తరచు స్టేజి మీద కూడా ప్రదర్శనలు వచ్చేవారు. ఐదేళ్ల క్రితం ములాయం చిన్నకొడుకు ప్రతీక్ యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. అతడికి రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోవడంతో అపర్ణను బరిలోకి దించాలని ములాయం రెండోభార్య సాధన పట్టుబట్టారు. దాంతో చిన్నకోడలు బరిలోకి దిగాల్సి వచ్చింది. -
బరిలో ములాయం రెండో కోడలు
-
బరిలో ములాయం రెండో కోడలు
లక్నో: యూపీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ చాలా పకడ్బందీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. యాదవ్ కుటుంబం నుంచి మరో అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. లక్నోలోని కంటోన్మెంట్ ప్రాంతం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై.. ములాయం రెండో కోడలు అపర్ణ యాదవ్ (అఖిలేశ్ చిన్నమ్మ కొడుకు ప్రతీక్ భార్య)ను పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రీటా బహుగుణ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కొంతకాలంగా ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో అపర్ణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూపీ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రచారం మంగళవారం ప్రారంభించనున్నారు. సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి యాదవ్ ప్రచారం మొదలుకానుంది. కాగా, యూపీలో మూడో విడత ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారభం కానుంది. -
మరదలికి టికెట్ ఓకే!
సమాజ్‌వాదీ పార్టీలో ఇప్పటివరకు నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణా యాదవ్‌కు టికెట్ దక్కింది. అది కూడా ఆమె ఎప్పటినుంచో ఆశిస్తున్న లక్నో కంటోన్మెంట్ టికెట్నే ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. దాంతో అక్కడ ఆమె.. కాంగ్రెస్ నుంచి ఈమధ్యే బీజేపీలో చేరిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషిని ఢీకొనబోతున్నారు. అపర్ణకు టికెట్ ఇస్తున్న విషయాన్ని సోమవారం మధ్యాహ్నం అఖిలేష్ ప్రకటించారు. ఇప్పటివరకు అసలు ఆ స్థానంలో బోణీ కొట్టని సమాజ్‌వాదీకి.. ఇప్పుడైనా అవకాశం దక్కుతుందేమోనని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన అపర్ణా యాదవ్.. దాదాపు ఏడాది నుంచి లక్నో కంటోన్మెంట్ స్థానంలో తిరుగుతూ, అక్కడ పట్టు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
అపర్ణ బరిలోకి దిగితే.. ఇక అంతే!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వాతావరణం ఇప్పుడు పూర్తిస్థాయిలో వేడెక్కింది. లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్న విషయం అక్కడ ఆసక్తికరంగా మారింది. బీజేపీ తరఫున ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషి పేరును ఇప్పటికే ప్రకటించారు. ఆమె గత ఎన్నికల్లో అక్కడినుంచి పోటీ చేసి గెలిచారు. సమాజ్‌వాదీ మాత్రం ఇంకా అక్కడ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. తన రెండో కోడలు అపర్ణా యాదవ్ అయితే బాగుంటుందన్నది ములాయం భావన. అయితే.. అసలు తన మరదలు అపర్ణను బరిలోకి అఖిలేష్ దిగనిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ములాయం మాత్రం ఈ స్థానంలో అపర్ణా యాదవ్ దిగుతారని దాదాపు ఏడాది క్రితమే చెప్పారు. అప్పటినుంచి ఆమె నియోజకవర్గంలో కూడా బాగా తిరుగుతున్నారు. ఇప్పటివరకు అక్కడ సమాజ్‌వాదీ ఒక్కసారి కూడా నెగ్గలేదు. అయితే.. ఇప్పుడు సమాజ్‌వాదీలో రెండు వర్గాల మధ్య పోరు గట్టిగా ఉండటంతో అఖిలేష్ పూర్తిగా అభ్యర్థుల ఎంపికను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చాలామంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు. కానీ లక్నో కంటోన్మెంటుకు మాత్రం ఎవరినీ ఇంకా చెప్పలేదు. వాస్తవానికి అపర్ణాయాదవ్ ముందునుంచి తన పిన మామగారు శివపాల్ యాదవ్ శిబిరంలోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్క శివపాల్ తప్ప ఆయన వర్గానికి ఎన్నికల్లో ప్రాతినిధ్యం కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో రీటా బహుగుణపై పోటీకి అపర్ణ దిగుతారా, ఆమెకు అఖిలేష్ అవకాశం ఇస్తారా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ అపర్ణ బరిలోకి దిగితే మాత్రం ఆమెకు చాలా గట్టి పోటీ తప్పదు. ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్‌కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమవతీ నందన్ బహుగుణకు సొంత కూతురే రీటా బహుగుణ. ఆమె కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు యూపీ రాష్ట్ర చీఫ్‌గా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. ఈసారి సమాజ్‌వాదీ - కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా, రీటా బహుగుణ మాత్రం బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ధీమాలో అపర్ణ ములాయం చిన్నకోడలు అపర్ణా యాదవ్ మాత్రం తనకు టికెట్ వస్తుందని పూర్తి ధీమాలో ఉన్నారు. తన విజయం, పార్టీ విజయం కోసం ఇక్కడ తాను గట్టిగా పనిచేస్తానని, రీటా బహుగుణకు పోటీ ఇస్తానని ఆమె లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో చెప్పారు. పాలిటిక్స్‌లో పీజీ చేసిన అపర్ణ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాల కోర్సు కూడా చేశారు. అపర్ణ మంచి గాయని కూడా. ములాయం రెండో భార్య సాధన కుమారుడైన ప్రతీక్ యాదవ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. -
మెగా పోరు: బరిలో అఖిలేశ్ మరదలు!
లక్నో: ఇప్పుడు అందరి దృష్టి లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంపైనే నెలకొని ఉంది. ఈ నియోజకవర్గంలో తన మరదలు అపర్ణ యాదవ్‌ను అఖిలేశ్ బరిలోకి దింపితే.. యూపీ ఎన్నికల్లోనే అత్యంత ఆసక్తికరమైన పోరు ఇక్కడ జరిగే అవకాశముంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి కాషాయ కండువా కప్పుకొన్న సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషీని బీజేపీ ఇక్కడ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అపర్ణ యాదవ్‌ను ఎస్పీ ఇక్కడ బరిలోకి దింపితే రసవత్తరమైన పోరు ఖాయగా కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ ఈ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ ఈ టికెట్‌ను అపర్ణకే కేటాయించాలని అఖిలేశ్‌ను ములాయం కోరుతున్నారు. ములాయం రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ. దాదాపు ఏడాది కిందటే లక్నో కంటోన్మెంట్ సీటును అపర్ణకు ములాయం కేటాయించారు. ఈ స్థానంలో ఎస్పీ ఎప్పుడూ గెలువలేదు. అయినా, ఇక్కడ బలమైన అభ్యర్థి రీటాను ఎదుర్కొనేందుకు అపర్ణ గతకొంతకాలంగా శ్రమిస్తున్నారు. జోరుగా నియోజకవర్గంలో తిరుగుతూ పట్టు పెంచుకుంటున్నారు. అయితే, ఇటీవల ఎస్పీలో రాజుకున్న కుటుంబపోరు అపర్ణకు ప్రతికూలంగా మారింది. తండ్రితో తలెత్తిన ఈ కుటుంబపోరులో ఆధిపత్యం సాధించిన అఖిలేశ్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న తెలిసిందే. ఈ పోరులో తన ప్రత్యర్థి అయిన బాబాయ్ శివ్‌పాల్ యాదవ్‌ను కరికరించి.. ఆయనకు ఎస్పీ సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. శివ్‌పాల్ వర్గం వ్యక్తిగా ముద్రపడి.. ఎస్పీలో కుటుంబపోరుకు కారణమైనట్టు భావిస్తున్న అపర్ణ యాదవ్‌కు అఖిలేశ్ ఈ సీటు కేటాయిస్తారా లేదా అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. తండ్రి అభీష్టాన్ని మన్నించి ఇక్కడ అపర్ణకు టికెట్ కేటాయిస్తే.. ఇక్కడ అపర్ణ-రీటా మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. -
ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్నకోడలేనా?
-
ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్న కోడలేనా?
లక్నో: తండ్రి ములాయంసింగ్ యాదవ్‌కు పోటీగా అఖిలేశ్ యాదవ్ 235 మంది రెబల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అఖిలేశ్ ప్రకటించిన ఈ జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి మాత్రం ఆయన అభ్యర్థిని ప్రకటించకుండా వదిలేశారు. అందుకు కారణం అక్కడి నుంచి ములాయం రెండో కోడలు అపర్ణ పోటీ చేస్తుండటమే. ఆమెకు ఈ స్థానాన్ని ములాయం దాదాపు ఏడాది కిందటే ఖరారు చేశారు. 26 ఏళ్ల అపర్ణ శివ్‌పాల్ వర్గం వ్యక్తి. యూపీ సీఎం అఖిలేశ్, ఆయన బాబాయ్, ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఆధిపత్య గొడవ పరాకాష్టకు చేరి సమాజ్‌వాదీ పార్టీ నిట్టనిలువునా చీలిన సంగతి తెలిసిందే. ఈ వర్గపోరులో పార్టీ అధినేత ములాయం కొడుకును కాదని తమ్ముడు శివ్‌పాల్‌కు మద్దతు పలికారు. ఇలా ములాయం తమ్ముడిని వేనకేసుకురావడానికి ఆయన రెండో భార్య సాధనాగుప్తే కారణమని అఖిలేశ్ వర్గం ఆరోపిస్తోంది. సవతి తల్లి సాధనాగుప్తా అఖిలేశ్‌కు వ్యతిరేకంగా ములాయంను ఎగుదోస్తున్నారని ఆ వర్గం పేర్కొంటున్నది. ఈ ఆధిపత్య తగదా మరింత ముదరడానికి కారణం అపర్ణ యాదవ్ రాజకీయ ఆకాంక్షలే కారణమని వినిపిస్తోంది. ములాయం, సాధనాగుప్తా తనయుడైన ప్రతీక్ సతీమణి అపర్ణ. ఎస్పీకి యువ వారసురాలిగా తానే తెరపైకి రావాలని ఆమె కలలు కంటున్నారు. అంతేకాకుండా పార్టీ తరఫున భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా ఆమెలో ఉందని అంటున్నారు. కొన్ని నెలల కిందట అఖిలేశ్, శివ్‌పాల్ గొడవ హోరాహోరీగా సాగుతుండగా పార్టీ ప్రజాప్రతినిధి అయిన ఉదయ్‌వీర్ సింగ్ లేఖ రాస్తూ.. ములాయం రెండో భార్య కుటుంబమే సీఎం అఖిలేశ్‌ను టార్గెట్ చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. డింపుల్.. అపర్ణ! అపర్ణ యాదవ్ పోటీచేయబోతున్న లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ప్రస్తుతం రీటా బహుగుణ జోషీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానంలో ఎస్పీ ఎప్పుడూ గెలువను లేదు. ఏదైనా సులువుగా గెలిచే స్థానంలో తనకు సీటు అపర్ణ ఇవ్వాలని కోరినా.. అది కుదరలేదు. దీంతో ఈ స్థానంలో గెలిచేందుకు అపర్ణ ఇప్పటినుంచే ప్రచారంలో చెమటోడుస్తున్నారు. మరోవైపు అఖిలేశ్ భార్య డింపుల్ సులువుగా ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ సవతి సోదరుడు 28 ఏళ్ల ప్రతీక్ మాత్రం ఫిటినెస్ బిజినెస్‌లో కొనసాగుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ప్రస్తుత సంక్షోభంలో ఆయన పాత్ర కూడా ఉందని అఖిలేశ్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తానికి అఖిలేశ్‌ను పార్టీ నుంచి గెంటేయడానికి పరిస్థితులు దారితీశాయంటే అది ములాయం రెండో భార్య సాధన, ఆయన రెండో కోడలు అపర్ణ వల్లేనని ఆయన వర్గం అంటోంది. కోసమెరుపు ఏమిటంటే.. ఎస్పీ నాయకురాలిగా ఎదగాలనుకుంటున్న అపర్ణ ప్రధాని నరేంద్రమోదీ అభిమాని. 2015లో ములాయం మనవడి పెళ్లి సందర్భంగా అపర్ణ, ప్రతీక్ కలిసి మోదీతో దిగిన సెల్ఫీ అప్పట్లో హల్చల్ చేసింది. -
రాజకీయాల్లోకి మరో వారసురాలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ ఇంట్లో నుంచి మరో వారసురాలు రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్నారు. ములయాం చిన్న కోడలు అపర్ణా యాదవ్ వచ్చే ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అపర్ణకు పార్టీ టికెట్ కేటాయించినట్టు ఎస్పీ అధికార ప్రతినిధి, ఆ రాష్ట్ర మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ వెల్లడించారు. సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అపర్ణ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ అయిన అరవింద్ సింగ్ బిస్త్ ఉత్తరప్రదేశ్ సమాచార కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ములయాం కుటుంబం నుంచి పలువురు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ములయాం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి కాగా, పెద్ద కోడలు డింపుల్ యాదవ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక ములయాం దగ్గరి బంధువులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. -
మామ లాలింపు.. కోడలి తాలింపు..
‘మగాళ్లు మగాళ్లే... కుర్రాళ్లు తప్పులు చేస్తారు... అంతమాత్రాన ఉరితీసేస్తారా..?’ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ రేపిస్టులను వెనకేసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కోడలు అపర్ణా యాదవ్ మాత్రం ఈ అంశంలో మామగారితో విభేదిస్తూ, భిన్నస్వరం వినిపిస్తున్నారు. అత్యాచారాల కేసుల్లో నిందితుల నేరం రుజువైతే, వారిని ఉరితీయాల్సిందేనని, మహిళగా తన అభిప్రాయం ఇదేనని ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే, మరణ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, తన మామగారి మాటలు వక్రీకరణకు గురయ్యాయని ఆమె ముక్తాయించడం కొసమెరుపు.