దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై పలు రాష్ట్రాల్లో వివాదం కొనసాగుతుంటే యూపీ మాజీ సీఎం కోడలు మూవీలోని ఓ పాటకు ఓ ఫంక్షన్‌ల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మూవీ పాటకు ఆమె ఎందుకు డ్యాన్స్ చేసిందంటూ కర్ణిసేన ప్రశ్నించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ అపర్ణా యాదవ్ సోదరుడి నిశ్చితార్థం లక్నోలో జరిగింది.