padmavati
-
Pavithra B Naik: హల్దీ ఫంక్షన్లో సీరియల్ నటి జోరు (ఫోటోలు)
-
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు. -
చదువు శక్తినిస్తుంది
‘ఈ రోజులను చూస్తుంటే మా రోజుల్లోనే అమ్మాయిలకు తగినంత స్వేచ్చ,అనుకున్నవి సాధించే ధైర్యం, సమాజాన్ని అర్ధం చేసుకునే పరిణతిని పొందారు’ అనిపిస్తుంటుంది అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కమలా మీనన్. తిరుపతి పద్మావతి మహిళా కళాశాల మూడవ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన కమలా మీనన్ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉంటున్నారు. భర్త డగ్లస్ ఎమ్ కాక్రన్ జ్ఞాపకాలతో పాటు, 86 ఏళ్ల జీవితంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు తనను ఎలా నిలబెట్టాయో వివరించారు. ‘‘చదువు అమ్మాయిలను శక్తిమంతులను చేస్తుంది. ఈ విషయాన్ని ఆ రోజుల్లోనే మా అమ్మ గుర్తించారు..’ అంటూ గతకాలపు విషయాలను మన ముందుంచారు. చదువు వేసిన మార్గం.. ‘‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవారు.అమ్మానాన్నలకు ఎనిమిది మంది సంతానం. అక్కతోపాటు ఆరుగురు అన్నలు నాకు. ఆడ, మగ అనే వివక్ష ఏ మాత్రం లేదు. అందరికీ మంచి చదువులు చదువుకునే అవకాశం ఇచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఆనర్స్ పూర్తయ్యాక బెంగుళూరు మౌంట్ కార్మెల్ కాలేజీలో లెక్చరర్‌గా ఐదేళ్లు పని చేశాను. ఆ ఎక్స్‌పీరియెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పుడు చదువుకునే అమ్మాయిల శాతం కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మార్పు కోసం తిరిగి మద్రాస్‌కు వచ్చేశాను. తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో పొలిటికల్ విభాగంలో టెంపరరీ జాబ్ గురించి పేపర్లో ప్రకటన చూసి, అప్లై చేసి, సెలక్ట్ అయ్యాను. ఆరు నెలల తర్వాత పర్మినెంట్ అయ్యింది. సవాళ్లను తట్టుకుని ఎదుగుతూ.. జీవితంలో సవాళ్లు, బాధలు ఎక్కడి నుంచైనా ఎదురు కావచ్చు. నన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటన నుంచి కోలుకోవడానికి సమయం పట్టింది. మా అక్క ఢిల్లీలో ఉండేవారు. జబ్బు పడి అక్క, నాన్న ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. ఈ సంఘటన నన్ను బాగా కదిలించాయి. ఆ టైమ్‌లో డా.రాజేశ్వరి మూర్తి కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉండేవారు. ఆవిడ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినప్పుడు సెలక్షన్ కమిటీ నన్ను ఇన్ఛార్జిగా ఎంపిక చేసింది. నా మైండ్ కూడా ఛేంజ్ కావాలనుకొని, 1975లో ఆ బాధ్యత తీసుకున్నాను. ఇంటర్వ్యూ ద్వారా టెంపరరీ జాబ్ వచ్చింది. తర్వాత పర్మినెంట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా అవకాశం వచ్చింది. నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లిన మరో సీనియర్ మహిళా లెక్చరర్ తిరిగి వచ్చారు. అప్పుడు మేనేజ్మెంట్ సీనియర్ కాబట్టి ఆవిడను నా ప్లేస్‌లో రీ ప్లేస్ చేశారు. అప్పటికే నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది, ఆ తర్వాత మరొకరికి ఇచ్చింది. దీంతో నా పొజిషన్ కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేను గెలిచాను. అలా యూనివర్శిటీకి 3వ మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత 1993లో రిటైర్ అయ్యేవరకు ప్రిన్సిపల్‌గా చేశాను. 1997 వరకు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వర్క్ చేశాను. లెక్చరర్‌గా ఎంతో మంది విద్యార్థులను చూశాను. ఎంతోమంది విద్యార్థులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికీ కలిసేవారు, ఫోన్లు చేసి మాట్లాడేవారున్నారు. ఆత్మీయులుగా మారినవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, మొదటి తరం అమ్మాయిలే అక్కడంతా. వారిలో భవిష్యత్తుని చక్కగా మార్చుకోవాలనే పరిణతి బాగా కనిపించేది. వారి భవిష్యత్తుకు ప్రత్యేక క్లాసులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేర్చాం. లెక్చరర్లు ఎంతో సపోర్ట్‌గా నిలిచేవారు. నాటి ఆ విద్యార్థుల్లో నేడు ఎంతోమంది పెద్ద పెద్ద పొజిషన్లలో, దేశ విదేశాల్లో ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన మలుపు 1979–80లో నాటి మద్రాస్‌లో సౌత్ ఇండియా అమెరికా రాయబార కార్యాలయానికి డగ్లస్ ఎమ్ కాక్రన్ కాన్సులేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలేజీ సెమినార్ సందర్భంగా మద్రాస్ నుంచి తిరుపతికి సెమినార్‌కు వచ్చారు. అక్కడ డిస్కషన్స్ అన్నీ పూర్తయి, వెళ్లిపోయారు. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ పొలిటికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. చెన్నైలోని అమెరికన్ ఎంబసీ ఎదుట నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్‌గా ఉండమని రాసిన నోట్ తిరిగి మమ్మల్ని కలిపింది. ఆ తర్వాత జరిగిన డిస్కషన్స్ మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చాయి. 1985లో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా శ్రీమతి డగ్లస్ ఎమ్ కాక్రన్ అయ్యాను. జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాను అనిపించేది. మా అమ్మను ఆమె సొంత కొడుకుల కన్నా డగ్లస్ గొప్పగా చూసుకున్నారు. ఇన్నేళ్ల మా జీవనంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇటీవల డగ్లస్ అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యారు. అయితేనేం.... ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయి. అవే నన్ను శక్తిమంతురాలిని చేస్తున్నాయి. విశ్రాంత జీవనంలో.. రిటైర్ అయినా కొన్ని విదేశీ కంపెనీలు, సూపర్మార్కెట్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేవారు డగ్లస్. నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో ఇద్దరమూ ఆలోచించుకున్నాం. అందుకు, సికింద్రాబాద్‌లోని బోయినపల్లి మాకు అనువైనదిగా అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేసే వారి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక చోట చేర్చి చదువులు చెప్పేవాళ్లం. కాలనీలోని చదువుకున్న మహిళల చేత ట్యూషన్స్ చెప్పించేవాళ్లం. వారి పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేవాళ్లం. అలా, ఆ పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మానాన్నల పెంపకంలోనూ, చదువులోనూ, సమాజంలో మనకు లభించే స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ స్వేచ్ఛను మనకు అనుకూలంగా మలచుకోవాలి. అదే మనల్ని శక్తిమంతులుగా నిలుపుతుంది అది ఏ దేశమైనా అని నేనూ కాక్రన్ అనుకునేవాళ్లం’’ అంటూ నేటి తరంలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ తెలియజేశారు’’ కమలా మీనన్. – నిర్మలారెడ్డి -
అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!
అంతర్జాతీయ సంబంధాల కేంద్రం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,తిరుపతి వారు తానా పూర్వాధ్యక్షులు డా ప్రసాద్ తోటకూర గారితో విద్యార్థినుల ముఖాముఖి కార్యక్రమాన్ని సావేరి సెమినార్ హాల్ లో 2023 సెప్టెంబర్ 4న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య దేపూరు భారతిగారు విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ తానా సంస్థ ముఖ్య లక్ష్యాన్ని, వారు నిర్వహిస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీత, నృత్య విభాగం వాళ్ళు అధునాతన డిప్లొమా కోర్సులను నడుపుతున్నారని తెలియజేశారు. పదుల సంఖ్యల్లో నుంచి వందల సంఖ్యల్లోకి అడ్మిషన్లు పెరిగాయని తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణను డా ప్రసాద్ తోటకూర గారి ముందుంచారు. గౌరవ అతిథి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య నల్లనాగుల రజినీగారు మాట్లాడుతూ అమెరికా నుంచి డా ప్రసాద్ గారు మన విశ్వవిద్యాలయానికి రావడం సంతోషదాయకం అన్నారు. కార్యనిర్వాహకులు అంతర్జాతీయ సంబంధాల కేంద్రం డీన్ ఆచార్య పి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని, కోర్సులు ప్రారంభంకావడానికి నాంది పలికిన వారు పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా తోటకూర ప్రసాద్ గారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డా ప్రసాద్ తోటకూర గారు మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాలో ఉండే ఉద్యోగ అవకాశాల్ని, అక్కడి జీవన విధానాన్ని వివరించారు. అమెరికా గురించి చాలామంది విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలుగు భాషకు అక్కడున్న స్థాయిని, స్థానాన్ని తానా సంస్థ ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. సత్య నాదెండ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రనూయి కార్పోరేట్ దిగ్గజాలుగా ఎదిగిన ప్రస్తానాన్ని, పారిశ్రామిక దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటివారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో కలిసి తానా ప్రపంచ సాహిత్య వేదిక "సిరివెన్నెల సీతారామశాస్త్రి" గారు సృష్టించిన సాహిత్యం మొత్తాన్ని ఆరు సంపుటాల్లో ముద్రించిన గ్రంథాలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రంథాలయనికి ప్రసాద్ గారు బహూకరించారు. ఈ కార్యక్రమానికి డా. హిమబిందు ఆహ్వానం పలుకగా, డా. యువశ్రీ వందన సమర్పణ చేశారు. డా శిరీష ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ సంబంధాల కేంద్రం ఆచార్యులు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థినులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం డా ప్రసాద్ తోటకూర గారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 2016వ సంవత్సరంలో కానుకగా బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆచార్యదేపూరు భారతి గారు, ఆచార్య వీరమాచినేని దుర్గాభవాని గారు, డా ప్రసాద్ తోటకూర గారు, ఆచార్య పి విజయలక్ష్మి గారు పుష్పాంజలి ఘటించారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
మాపై దుష్ప్రచారం కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత పనే
సాక్షి, హైదరాబాద్: తాము కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నామంటూ వస్తున్న కథనాలను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌లో పనిచేయడం, ప్రజలకు సేవ చేయ డాన్ని తాము గర్వంగా భావిస్తామని, అయితే పార్టీలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడే తమపై దుష్ప్రచారం చేస్తున్నా రని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తమకు పిల్లలు కూడా లేరని, తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశామన్న ఉత్తమ్ దంపతులు తమకు ఎలాంటి వ్యాపారాలు, కాంట్రాక్టులు, భూలావాదేవీలు లేవని చెప్పారు. ప్రజాజీవితంలో తప్ప వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌ను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రకటనలో ఏముందంటే...: ‘నేను కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు వస్తున్న కథనాలు అసత్యాలు. ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకు, పార్టీలో నా స్థానాన్ని తగ్గించేందుకు పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఒక నాయకుడే ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నాడు. కాంగ్రెస్‌కు 30 ఏళ్లుగా సేవ చేస్తున్నందుకు గర్వపడుతున్నా. నా సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వందల ఓట్ల తేడాతో ఓడినప్పటికీ కోదాడలోనే నివాసముంటూ అక్కడి ప్రజలకు సేవలందిస్తున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కానీ, రెండేళ్ల నుంచి మమ్మల్ని టార్గెట్ చేసి పరువు నష్టం కలిగించే కథనాలు రావడం తీవ్రంగా బాధిస్తోంది. పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాల పట్ల నాకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఎక్కడా ఈ విషయాలను పంచుకోలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా రాజ్‌భవన్‌లో, తెలంగాణ ఏర్పాటు విషయంలో చిదంబరం నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తప్ప నేనెప్పుడూ సీఎం కేసీఆర్‌ను కలవలేదు. ఎప్పుడూ మాట్లాడలేదు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ విమాన పైలట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయడం గర్వంగా భావిస్తాను. రాష్ట్రపతి భవన్‌లోనూ సీనియర్ ఆఫీసర్‌గా వెంకట్రామన్, శంకర్‌దయాళ్‌శర్మ వద్ద పనిచేశాను. ఉన్నత స్థాయి ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజాసేవ కోసం కాంగ్రెస్‌లో చేరాను. కాంగ్రెస్ నాయకుడికి సన్నిహితంగా ఉండే రెండు యూట్యూబ్ చానళ్లు, కొన్ని మీడియా సంస్థలు నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయి’ అని ఉత్తమ్‌తోపాటు ఆయన సతీమణి పద్మావతి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
దివ్యమైన ప్రతిభ
సత్యభామ.. శ్రీ కృష్ణుడు.. వేంకటేశ్వరుడు.. పద్మావతి.. దివ్యమైన పాత్రలన్నింటినీ ఆమె ఆహార్యంతో అందంగా రూపుకడుతుంది.వైకల్యం ఆమె అభిలాషను అడ్డుకోలేకపో యింది. అడుగు కదపలేదు అనుకున్నవారి అంచనాలను ఆవలకు నెట్టి పట్టుదలతో అవరోధాల మెట్లను అధిరోహించింది. రంగస్థల నటిగా గుర్తింపుతో పాటు స్వరమాధురిగానూ పేరొందింది. కళారంగంలో రాణిస్తూనే దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సేవా పెన్నిధిగానూ ప్రశంసలు అందుకుంటోంది.ఆమెప్రతిభకు గుర్తింపుగా మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారం వరించింది.ఖమ్మం జిల్లావాసి అయిన డాక్టర్ పొట్టబత్తిని పద్మావతి కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని మునుగనూరులో ఉంటున్నారు డాక్టర్ పద్మావతి. ఆమెకు ఏడాది వయస్సులో పో లియో సోకడంతో రెండు కాళ్ళు చచ్చుబడి పో యాయి. తన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు ఆమె భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యేవారు. అయితే పద్మావతి ఐదేళ్ల వయస్సులో సెయింట్ మేరీస్ పో లియో పునరావాసం పర్యవేక్షకురాలు ఆస్ట్రేలియాకు చెందిన క్లారా హీటన్ కు పరిచయం అయ్యారు. క్లారా దత్తత తీసుకోవడంతో పద్మావతి జీవితం కొత్త మలుపు తిరిగింది. క్లారా పర్యవేక్షణలో పద్మావతికి పలు మార్లు శస్త్ర చికిత్స జరిగింది. పాదాలు, నడుము.. భాగాలు శస్త్ర చికిత్సతో సరి చేశారు. అప్పటి వరకు మంచానికే పరిమితమైన ఆమె క్యాలిపర్సు, కర్రలు సహాయంతో క్రమంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. కాలు కదల్చలేని స్థితిలో మంచం మీద ఉండి చదువులో ప్రతిభ కనబరుస్తూ ఎదిగిన తీరు పద్మావతి మాటల్లో మన కళ్ల ముందు కదలాడుతుంది. సేవాభిలాష గానం, నాటక రంగంలో ఉన్న ఆసక్తితో పద్మావతి క్యాలిపర్సు సహాయంతోనే ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. సత్యభామ, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరుడు తదితర పాత్రలను సమర్ధంగా పో షించి దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో అవార్డులను పొందారు. వేగేశ్న ఫౌండేషన్ ద్వారా సంగీతంలో శిక్షణపొందడంతో పాటు, డిగ్రీ పూర్తి చేసి, ఆ సంస్థలోనే సంగీత ఉపాధ్యాయురాలుగా దివ్యాంగులకు శిక్షణ ఇస్తున్నారు. దివ్యాంగులకు సాయపడాలనే సంకల్పంతో మునుగనూరులో పద్మావతి ఇ న్ స్టిట్యూట్ ఫర్ ద (డిజ్) ఏబుల్డ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు కంప్యూటర్, నృత్యం, సంగీతం, టైలరింగ్.. వంటి వృత్తి విద్యా కోర్స్‌లలో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తున్నారు. ప్రశంసలు.. పురస్కారాలు పద్మావతి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఓ వైపు కళలు, మరోవైపు సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా, నంది అవార్డు జ్యూరీ కమిటీ మెంబర్‌గా సేవలందించిన పద్మావతి 2017లో రాష్ట్ర ప్రభుత్వం రోల్ మోడల్ అవార్డును అందుకున్నారు.. కళాకారిణిగా ప్రతిభ చూపినందుకు 2009లో రాష్ట్రపతి అవార్డు లభించింది. వైకల్యంతో బాధపడుతున్నా పలు రంగాలలో రాణించినందుకు గాను 2011లో రాష్ట్రపతి చేతులు మీదుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు ఆమె. దివ్యాంగులకు చేస్తున్న సేవను గుర్తించి 2022లో రాష్ట్రపతి సర్వశ్రేష్ట దివ్యాంగ న్ అవార్డుతో సత్కరించారు. దివ్యాంగులకు సేవచేయాలనే సదాశయంతో నడుపుతున్న ఇన్స్టిట్యూట్కు చేయూతనందిస్తే మరిన్నో ప్రయోజన కరమైన పనులను చేయగలననే ఆశాభావాన్ని పద్మావతి వ్యక్తపరుస్తు న్నారు. తన గమనమే ప్రశ్నార్ధకం అవుతుందనుకున్నవారి మాటలను పక్కనపెట్టి, పట్టదలతో ప్రయత్నించి, గెలుస్తున్న ఆమె జీవితం ఎందరికో ఆదర్శమవుతుంది. – శ్రీరాం యాదయ్య, హయత్‌నగర్, హైదరాబాద్, సాక్షి -
పసికందును లాలించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: శ్రీ పద్మావతి చిల్డ్రన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఓ పసికందును చేతిల్లోకి తీసుకుని ఆప్యాయంగా లాలించారు. చదవండి: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు.. అనంతరం టాటా ట్రస్ట్ సహకారంతో శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సీఎం ప్రారంభించారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో 92 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించింది. ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ అలిపిరి వద్ద 25 ఎకరాలు ఇచ్చింది. ఆస్పత్రి ప్రారంభంతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు. -
సింగపూర్ విద్యార్ధులకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నృత్య కోర్సులు
శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం (మహిళా విశ్వవిద్యాలయం) విద్య సంగీతం అకాడమీ (సింగపూర్) లు సంయుక్తంగా సింగపూర్ విద్యార్ధులకు నృత్య కోర్సులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైస్ ఛాన్సలర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ) అధ్యక్షతన, ఎస్పీఎంవీవీ అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన యూనివర్సిటీ అధికారులు, సింగపూర్‌లోని తెలుగు, భారతీయ సంగీత ప్రియులు రాగవిహారి పేరుతో విద్యార్థుల ప్రదర్శనల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భారత్, సింగపూర్ సంగీత ఔత్సాహికులు యూట్యూబ్, సోషల్ మీడియాలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జమున దువ్వూరు మాట్లాడుతూ..మహిళా యూనివర్సిటీ తరుపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ..ఎస్పీ ఎంవీవీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ డాక్టర్ పి విజయలక్ష్మి, ఎస్పీఎం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ ద్వారం వీజేలక్ష్మి ఈ కొలాబరేషన్ ప్రత్యేకమైన సింగపూర్ శైలిలో జరుగుతోందని, దీన్ని వ్యాప్తి చేసేందుకు విద్యా సంగీతం అకాడమీకి వారి సహకారం పూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో విద్యా సంగీతం అకాడమీ (వీఎస్ఏ) వ్యవస్థాపకురాలు, శ్రీమతి కాపవరపు విద్యాధరి మాట్లాడుతూ, “పలు సంగీత నృత్య కార్యక్రమాలను అందించడానికి సుప్రసిద్ధ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీ ఎంవీవీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సంగీతం (గాత్రం / వాయిద్యం) మరియు నృత్యం (కూచిపూడి / భరతనాట్యం) అలాగే అన్నమయ్య కీర్తనలు మరియు వాగ్గేయకార వైభవం కోసం సర్టిఫికేట్ కోర్సులు కూడా ఈ ఒప్పందం ద్వారా సింగపూర్ లో పిల్లలకు అందిస్తాము. సింగపూర్‌లో మన సంస్కృతిని ప్రచారం చేసేందుకు వీఎస్ఏ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు. ఎస్ఫీ ఎంవీవీ అధికారులు వారి మద్దతు, సౌలభ్యం మరియు అనేక నెలలపాటు పని చేయడం ద్వారా దీనికి రూపకల్పన చేసినందుకు నేను వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, చిరకాల సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రెసిడెంట్ రత్నకుమార్ కవుటూరు ఎస్పీ ఎం వీవీ , వీఎస్ఏ బృందాల ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ సహకారాన్ని "సింగపూర్‌లోని ఎన్ఆర్ఐ విద్యార్థులు సంగీతం నేర్చుకునేందుకు, ఎస్పీ ఎంవీవీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి గుర్తింపు పొందేందుకు ఒక గొప్ప అవకాశం" అని అభివర్ణించారు. మన సంస్కృతి, సంగీతం యొక్క ప్రభావాలను యోగాతో పోల్చుతూ, సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతేశ్వర్ రెడ్డి కురిచేటి ఈ సహకారాన్ని సంగీతాన్ని ఇష్టపడే పిల్లలందరూ ఆదరించడానికి ఒక ముఖ్యమైన, సంతోషకరమని పేర్కొన్నారు.భారతదేశం నుండి ప్రముఖ వక్త, రంగస్వామి కృష్ణన్ ఇలాంటి సహకారాలు మన దైనందిన జీవితంలో పెరగాలని, సంస్కృతిని వ్యక్తపరచాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బు వి పాలకుర్తి కూడా నిర్వాహకుల కృషిని అభినందించారు. విద్యా సంగీతం అకాడమీ విద్యార్థుల ప్రకటనలు, సందేశాలు, ప్రదర్శనలతో ఒక ప్రత్యేకమైన మిక్స్‌గా జరిగిన ఈ రెండు గంటల కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీక్షకులచే ప్రశంసించబడింది. సింగపూర్‌లోని విద్యార్థుల కోసం ఎన్రోల్మెంట్లు తెరిచామని వీఎస్ఏ టీం ధృవీకరించింది. కోర్సు వివరాల,రిజిస్ట్రేషన్ల కోసం ఆసక్తిగల అభ్యర్థులు vidyasangeetam.academy ద్వారా సంప్రదించాలని వీఎస్ఏ ప్రతినిధి విద్యాధరి పేర్కొన్నారు. -
కాన్పుల వేల్పు.. మదురై తొలి మహిళా డాక్టర్ పద్మావతి
వేల మందికి ఆరోగ్యవంతమైన పుట్టినరోజులను ప్రసాదించిన మదురై కార్పొరేషన్ తొలి మహిళా డాక్టర్ పద్మావతి నేడు తన నూరవ యేటను పూర్తి చేసుకుంటున్నారు. ఆడపిల్లేంటి, మెడిసిన్ చదవడమేంటి అనే ఆ కాలపు అభ్యంతరాలను ఎదుర్కొని, ప్రభుత్వ డాక్టర్ అయి, ప్రసూతి మరణాలను తగ్గించడానికి గర్భిణుల ఇళ్లకే డాక్టర్లు వెళ్లి డెలివరీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్మావతి. మెడికల్ ఆఫీసర్ గా కూడా మహిళల ఆరోగ్యం కోసం వైద్యచికిత్సల వ్యవస్థలో ఇంకా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఈ ఆబ్స్టెట్రీషియన్ వృత్తిగత, వ్యక్తిగత జీవిత విశేషాలివి. గత ఎనిమిదేళ్లుగా కీళ్లవాతం, గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ డాక్టర్ పద్మావతిని అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తున్నాయి కానీ.. నూరేళ్లన్నది ఆమెను ఏమాత్రం నిరుత్సాహ పరిచే వయసు కాదు. ఏప్రిల్ 27న ఆమె 100వ పుట్టిన రోజును జరిపేందుకు ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆ ఇంటి వేడుక మాత్రమే కాదు. మదురై కార్పోరేషన్‌లోని ప్రతి ఇంటికి సంతోషాన్నిచ్చే సందర్భం. డాక్టర్ పద్మావతి ఆబ్స్టెట్రీషియన్. నార్మల్ డెలివరీలు చేయడంలో నిపుణురాలు. మదురై తొలి మహిళా డాక్టర్! తమిళనాడులోని మదురై 1950 లో మున్సిపాలిటీ అయింది. 1971లో కార్పోరేషన్ అయింది. 1949లో ఆమె మదురైలోని ‘గవర్నమెంట్ ఎర్స్కైన్ హాస్పిటల్’లో హౌస్ సర్జన్‌గా చేరారు. మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసీ చేయగానే అక్కడ ఉద్యోగం వచ్చేసింది. అయితే పద్మావతి ఏనాడూ అదొక ఉద్యోగంలా చేయలేదు. యజ్ఞంలా నిర్వహించారు. సుఖ సాధారణ ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యమే ఆ యజ్ఞఫలాలు. ఆమె చేరేటప్పటికే అక్కడ ఆమె తండ్రి సీనియర్ సివిల్ సర్జన్. ఆయన ఎంత గొప్ప వైద్యుడైనా గానీ, కూతుర్ని మెడిసిన్ చదివించడమే గొప్పతనంగా ఆనాడు ఆయన గుర్తింపు పొందారు! పద్మావతి ఆస్టిన్ కారును తనే డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి రావడం కూడా అప్పట్లో పెద్ద విశేషం అయింది. తండ్రి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో కదా అన్నారంతా. పెద్ద కుమారుడు గురుసుందర్ పెళ్లిలో పద్మావతి (కుడి చివర) యూఎస్‌లో కొందరు, చెన్నైలో కొందరుగా ఉన్న ముగ్గురు కొడుకులు, కూతురు, వాళ్ల జీవిత భాగస్వాములు, ఎనిమిది మంది మనవలు, నలుగురు మునిమనవలు పద్మావతి నూరవ పుట్టిన రోజు వేడుకలు చేయాలని ఉత్సాహ పడుతున్నారు. అయితే అందుకు ఆమె ఒప్పకోవడం లేదు.‘‘ఒక కేట్ కట్ చేయించి ఆ వీడియోను అందరికీ పంపిస్తే సరిపోతుంది’’ అని నిరంతరం తననే కనిపెట్టుకుని ఉండే పెద్ద కొడుకు డాక్టర్ గురుసుందర్కు ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేశారు. కరోనా గురించే ఆమె ఆందోళన. 1921 ఏప్రిల్ ఇరవై ఏడున ఆమె పుట్టగానే ఆమె తండ్రి డాక్టర్ ఆర్. సుందరరాజన్ ఆమెను కారణ జన్మురాలు అనేశారు! తొలి బిడ్డ ఆమె. ఆపై అప్పటికప్పుడు చిన్న పాట కూడా రాశారు. ఆ పాటలో ఆమె పేరు ముని ప్రేమ. పద్మావతి తల్లి మునియమ్మాళ్ పేరు మీద ముని అని ముద్దుగా పిలుచుకున్నారు.‘‘పెరిగి పెద్దయి స్త్రీల ఆరోగ్యానికి సంరక్షకురాలివి కావాలి’’ అని దీవించారు. ఆయన దీవెనలు ఫలించాయి. వేల పురుళ్లు పోశారు పద్మావతి. ఆసుపత్రికి రాలేని గర్భిణులు ఉంటే వారి కోసం ఆసుపత్రి సిబ్బందినే వారి ఇళ్లకు పంపించారు. ప్రభుత్వ డాక్టర్ అయి ఉండి కూడా కాన్పు చేయడానికి తనకై తను ఇళ్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1900 లలో మహిళలు ఎలా ఉండేవారో తెలిసే కూతుర్ని డాక్టర్ని చేశారు పద్మావతి తండ్రి. బాధ పడనన్నా పడతాం కానీ, మగ డాక్టరుకు మాత్రం చెప్పుకోము అన్నట్లుండేవారు. అప్పటికి ఆయన మదురైలో పేరున్న ‘లైసెన్స్›్డ మెడికల్ ప్రాక్టీషనర్’. తొమ్మిది మంది సంతానంలో పద్మావతితో పాటు ఐదుగురు ఆడపిల్లల్నీ ఆయన డాక్టర్లను చేశారు. మిగతా పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కూడా వైద్య వృత్తినే ఎంచుకున్నారు. ∙∙ పద్మావతి ఇంట్లో పెద్ద పిల్ల. ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు చూడాలి.. ‘‘మన ఇంటా ఒంటా ఉందా.. ఆడపిల్ల చదువుకోవడం’’ అని బంధువులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఆమె పుస్తకాల సంచిని భుజంపై నుంచి లాగేసి విసిరికొట్టేసేవారు. తండ్రి వెంటనే ఆమెకు కొత్త పుస్తకాల సెట్ కొని తెచ్చేవారు. ఆయనొక్కరే పద్మావతికి మద్దతు. అలాగే పదిహేనేళ్లు దాటితే ఆడపిల్లలకు పెళ్లి చేసేయాలనే సంప్రదాయం బలంగా ఉండేది. దాన్ని కూడా కూతుర్ని వైద్యురాలిని చేయడం కోసం పక్కన పెట్టేశారాయన. ముదురైలోని అమెరికన్ కాలేజ్ లో ఇంటర్లో చేర్చారు! తర్వాత మెడిసిన్. గవర్నమెంట్ డాక్టర్ అయిన కొన్నాళ్లకే మదురైలోని ‘మున్సిపల్ మెటర్నిటీ హోమ్స్’ అన్నిటికీ పద్మావతి సూరింటిండెంట్ అయ్యారు. ప్రసవాలు సురక్షితంగా జరగడమూ మొదలైంది. ‘‘ఆమె చేతుల్లో పడితే చాలు’’ అనేంతగా మదురై అంతటా ఆమె పేరు తెలిసింది. 1969 లో ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పోలెండ్‌లో జరిగిన గర్భిణి, శిశు ఆరోగ్య వైద్య శిక్షణా సదస్సులకు హాజరయ్యారు. ఆ శిక్షణకు భారతదేశం నుంచి ఎంపికైన ముగ్గురు డాక్టర్లలో పద్మావతి ఒకరు. ఆమె సూచనలపై భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత కొన్ని మాతా శిశు సంరక్షణ విధానాలను అమలు పరిచింది. పద్మావతి పెళ్లి ఆమె 30వ యేట జరిగింది. భర్త రామస్వామి స్కూల్ హెడ్మాస్టర్. కొన్నాళ్లకే భర్త సహకారంతో మదురై పెరుమాళ్ కోయిల్ వీధిలో పది పడకల ఆసుపత్రి నిర్మించుకున్నారు. అదే వారి నివాసం కూడా. పద్మాలయ హెల్త్ క్లినిక్ అని ఆ వైద్య నివాసానికి పేరు పెట్టుకున్నారు. సిజేరియన్ సరంజామా లేని ప్రసూతి ఆసుపత్రి మదురై మొత్తంలో అదొక్కటే! కొడుకు, కూతురు చేత కూడా ఆమె ఒక ఆసుపత్రి పెట్టించారు. కొడుకు జనరల్ సర్జన్. కోడలు గైనకాలజిస్ట్. ‘‘మా అత్తగారు తన 90 వ యేట వరకూ కూడా నన్ను గైడ్ చేస్తూ వచ్చారు’’ అని కోడలు సుందరి చెబుతుంటారు. అంత ఉత్సాహం, అంత శక్తి ఆమెలో ఉండేవని. కోడలిగా ఆమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే చెప్పారట పద్మావతి.. ‘ఆడమనిషి యజమానిగా ఉండే ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది’ అని. ఈ నూరేళ్ల వయసులోనూ పద్మావతి ఉదయాన్నే లేస్తారు. పూజ చేస్తారు. భక్తి గీతాలు పాడతారు. వార్తా పత్రికలు చదువుతారు. టీవీ చూస్తారు. ఫిజియో థెరపీ చేస్తారు. వేళకు భోంచేస్తారు. కరోనా వెళ్లిపోతే, వీల్ ఛెయిర్లో కాస్త బయటి తిరగాలని ఆమె ఆశపడుతున్నారు. -
శత చిత్ర పద్మం
శత చిత్ర పద్మం అంటే... వంద చిత్రాల్లో నటించారని కాదు. శత వసంతాలు పూర్తి చేసుకున్నారామె. ఊరికే వందేళ్లు నిండితే కూడా ఇంత పెద్ద సెలబ్రేషన్ ఉండేది కాదేమో! ఆమెలో ఒక చిత్రకారిణి ఉన్నారు. ఒక వ్యాపారవేత్త ఉన్నారు. అంతకు మించి జీవితానికి సుపథం వేయగలిగిన గొప్ప తాత్వికవేత్త ఉన్నారు. చీర మీద చెట్టు పద్మావతి నాయర్ (పద్మమ్) 1920లో కేరళ రాష్ట్రం, త్రిశూర్‌లో పుట్టారు. ఈ నెలతో వందేళ్లు నిండాయి. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తారు. టీ తాగడం, న్యూస్ పేపర్ చదవడం పూర్తయిన తర్వాత తన స్నానపానాదులు, ఉపాహారం ముగించుకుని పదిన్నరకు ఉద్యోగానికి వెళ్లినంత కచ్చితంగా రోజూ తన డెస్క్‌కు చేరుతారు. ఒంటి గంట వరకు తన ప్రపంచంలో మునిగిపోతారామె. ఆమె ప్రపంచంలో చిలుకలుంటాయి, చెట్టు కొమ్మ మీద వాలిన జంట పక్షులుంటాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకుని విహరిస్తున్న కొంగలుంటాయి. పురి విప్పిన నెమళ్లుంటాయి. రేకులు విచ్చుకున్న పువ్వులుంటాయి. ఇవన్నీ చీర మీద రంగుల బొమ్మలుగా ఉండవచ్చు, వాల్ హ్యాంగింగ్స్గానూ ఉండవచ్చు. రోజూ పెయింటింగ్ కోసం మూడు గంటల సమయాన్ని కేటాయిస్తారామె. వందేళ్ల వయసులో చేతి వేళ్లు పట్టు దొరకడం కష్టమే. బ్రష్‌ను కదలకుండా పట్టుకుని డిజైన్‌కు తగినట్లు స్ట్రోక్స్ ఇవ్వడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అదే మాట అన్నప్పుడు ఆమె నవ్వుతూ ‘‘నేను పెయింటింగ్స్ మొదలు పెట్టిందే అరవై దాటిన తర్వాత. అప్పటి నుంచి రోజూ వేస్తూనే ఉన్నాను. అలా వేస్తూ ఉండడమే వేళ్లకు శక్తి. అయితే టస్సర్ మీద పెయింటింగ్ చేయడం కొంచెం కష్టమే’’ అన్నారు. పెయింటింగ్ చేసిన చీరకు ఆమె పదకొండు వేల రూపాయలు చార్జ్ చేస్తారు. పద్మమ్ బామ్మ వేసిన పెయింటింగ్ దుపట్టా మూడు వేలు. ‘‘నేనింత వరకు నా ఖర్చులకు పిల్లల దగ్గర చేయి చాచలేదు. నేను మనుమలు, మనుమరాళ్ల పుట్టిన రోజులకు నా డబ్బుతోనే బహుమతులిస్తాను కూడా’’ అంటారామె ఒకింత గర్వంగా. ఎవరికి వారే ఆధారం పద్మావతి నాయర్ బాల్యం కేరళలోని త్రిశూర్ జిల్లాలోని వడకంచెర్రిలోనే గడిచింది. పదిమందిలో తొమ్మిదో సంతానం. ఫోర్డ్ మోటార్స్ ఉద్యోగి కేకే నాయర్‌ను పెళ్లి చేసుకుని 1945లో ముంబయికి వెళ్లారామె. వారికి ఐదుగురు పిల్లలు. ఆ పిల్లలందరి దుస్తులూ తానే మెషీన్ మీద కుట్టేవారు. ఆడపిల్లల దుస్తుల మీద ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ కూడా చేసేవారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యేటప్పటికి అరవై దాటాయి. అప్పటి వరకు హాబీగా చేసిన పెయింటింగ్ కోసం పూర్తి సమయం కేటాయించారామె. తన సొంత సంపాదన మొదలు పెట్టింది కూడా అప్పుడే. మూడు దశాబ్దాలుగా విజయవంతంగా సాగుతోంది ఆమె పెయింటింగ్ కుటీర పరిశ్రమ. వందేళ్ల వయసులో కూడా డబ్బు సంపాదిస్తున్నాను. అవును, ఎందుకు సంపాదించకూడదు? అని ప్రశ్నిస్తారు పద్మమ్. ఆడపిల్లలనే కాదు ఎవరూ మరొకరి మీద ఆధారపడకూడదు. తమ మీద తాము ఆధారపడి జీవించాలి... అని ఆమె పేరెంటింగ్ ఫిలాసఫీ చెప్పారు. పద్మమ్కి ఏడుగురు మనుమలు– మనుమరాళ్లు, నలుగురు ముని మనుమళ్లు–మనుమరాళ్లు. ఆమెకు రోజూ ఒంటి గంట వరకు పెయింటింగ్స్‌తో గడిచిపోతుంది. మధ్యాహ్నం కొంత విశ్రాంతి. సాయత్రం కొంత సేపు టీవీ చూసిన తర్వాత మనుమలు– మనుమరాళ్ల నుంచి వచ్చిన వాట్సప్ మెసేజ్‌లు చూసుకోవడం, వాటికి బదులివ్వడం ఆమె వ్యాపకం. పిల్లల సెలవు రోజుల్లో వాళ్లకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాల్లో విస్తరించిన బంధువులందరినీ సోషల్ మీడియా వేదికగా పలకరిస్తుంది. స్నేహితులకు ఈ మెయిల్స్ చేస్తుంది. జీవితంలో ఏమున్నాయి? ఏమి లేవు? అని బేరీజు వేసుకుంటూ ఉంటే సంతోషాల కంటే కష్టనష్టాల తక్కెడ బరువెక్కుతుంది. ‘నా జీవితంలో నేనున్నాను’ అనుకుంటే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అదే ఆయుష్షును పెంచే ఔషధం. ఆనందంగా జీవించడానికి సాధనం. – మంజీర -
షాక్ తిన్న కాంగ్రెస్..
-
కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ రెపరెపలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే 20వేలకు పైచిలుకు మెజారిటీతో గులాబీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా పాతడంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్లో సంబరాలు జరుగుతున్నాయి. హుజూర్‌నగర్‌లో గులాబీ శ్రేణులు గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సాహల్లో మునిగితేలారు. తీవ్ర ఉత్కంఠను రేపిన హుజూర్.. హుజూర్నగర్ ఉప ఎన్నికను రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్.. తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్రనేతలు పెద్దసంఖ్యలో మోహరించి.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్నగర్ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది. అయితే, ఈసారి హుజూర్ నగర్ ప్రజలు గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. మూడుసార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి, టీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రచారం ఫలించినట్టు ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టమవుతోంది. ఇక్కడ అంచనాలకు మించి కారు జోరుగా దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి డిపాజిట్ దక్కని పరిస్థితి కనిపిస్తోంది. అటు, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఉనికి కోసం హుజూర్‌నగర్‌లో పోటీచేసినా ఘోరమైన భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. టీపీసీసీ చీఫ్ నియోజకవర్గం అయిన హుజూర్నగర్ పూర్తిస్థాయిలో టీఆర్ఎస్కు పట్టం కట్టినట్టు కనిపిస్తోంది. హస్తం పార్టీకి గట్టి పట్టున్న మండలాల్లోనూ గులాబీకి ఆధిక్యం దక్కడం ఇక్కడ టీఆర్ఎస్ జోరును చాటుతోంది. బెట్టింగ్‌రాయుళ్ల జోరు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరిగాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పందాలు కాశారు. వేయి నుంచి లక్షల రూపాయల వరకు పందాలు సాగాయి. ఎగ్జిట్‌పోల్ ఫలితాలతోపాటు పోలింగ్ సరళిలోనూ టీఆర్ఎస్కు సానుకూలత ఉండటంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా పందాలు కాసిన వారికి భారీ ఆఫర్లు ఊరించాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితోపాటు ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీల మీద కూడా బెట్టింగులు నడిచాయి. ముఖ్యంగా టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైనే పెద్ద ఎత్తున పందాలు సాగాయి. టీఆర్ఎస్ గెలుస్తుందని 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే 75 రూపాయలే ఇస్తామని, టీఆర్ఎస్కు 10వేల మెజార్టీ వస్తుందంటే రూపాయికి రూపాయిన్నర, 20వేల మెజార్టీ వస్తుందని పందెం కాస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామనే స్థాయిలో బుకీలు, స్థానిక బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్లు ఇచ్చినట్టు తెలిసింది. ఈక్రమంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బెట్టింగ్చేసిన వాళ్లు పెద్ద ఎత్తున నష్టపోయినట్టు సమాచారం అందుతోంది. ఇక, టీఆర్ఎస్ గెలుపు, మెజారిటీలపై బెట్టింగ్ కాసినవాళ్లు లాభపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల్లోనూ బెట్టింగులు సాగాయి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ హుజూర్నగర్ ఫలితంపై పందాలు జోరుగా సాగాయి. -
అందుబాటులో లేని కల్కి భగవాన్..
సాక్షి, తిరుపతి : కల్కి భగవాన్ ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. కల్కి భగవాన్ ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. కాగా దాడులు సమయంలో కల్కి భగవాన్, ఆయన సతీమణి పద్మావతి కానీ అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం, బీ ఎన్. కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్ నిర్వహాకుడు లోకేష్ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇక కల్కి ఆశ్రమాల్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. కాగా గతంలో కూడా కల్కి భగవాన్ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి వారిని మత్తులో ఉండేలా చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయ్ కుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ తొలినాళ్లలో ఎల్ఐసీలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. అది కాస్తా దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయ్ కుమార్ 1989లో చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. స్పెషల్ దర్శనానికి రూ.25వేలు ఆ తర్వాత తన ఆశ్రమ కార్యాకలాపాలను ఏపీతో పాటు తమిళనాడుకు విస్తరించారు. కల్కి భగవాన్ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్నారైలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ఇక ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు చెల్లించుకోవాల్సిందే. ఇక కల్కి భగవాన్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయనతో పాటు కల్కి కుమారుడు కృష్ణాజీ కూడా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదుతో 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే 2008లో చిత్తూరు జిల్లాలోని కల్కి ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో అయిదుగురు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొద్దిరోజులు ఆశ్రమం మూతపడింది. చదవండి: ‘కల్కి భగవాన్’ పై ఐటీ దాడులు -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-
తెలుగింటి పద్మావతి
తెలుగువారింట గోరంత దీపమై, పున్నాగగా పరిమళించి బంగారు గాజులు ధరించిన పద్మావతి అసలు పేరు అంజనా శ్రీనివాస్. సీరియల్ నటిగా తెలుగువారి మనసులను ఆకట్టుకుంటున్న పద్మావతి ఉరఫ్ అంజన సాక్షితో పంచుకున్న ముచ్చట్లు. అమ్మనాన్నలకు ముగ్గురు ఆడపిల్లలం. ఇంట్లో నేనే పెద్ద కూతురిని. మా అమ్మవాళ్ల నాన్నగారు నాటకాలు వేసేవారట. అలాగే నాకు సాంస్కృతిక వ్యవహారాలపై ఇష్టం ఏర్పడి ఉంటుందని అమ్మానాన్నా అంటుంటారు. పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఒక తెలిసిన మేకప్‌మేన్ సీరియల్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అక్కడ నూట ఇరవైమందిలో నేను సెలక్ట్ అయ్యాను. అలా కన్నడలో ‘కృష్ణా రుక్మిణి’ సీరియల్లో నటించాను. తమిళంలో కూడా ఓ సీరియల్ చేస్తున్నాను. తెలుగులో గోరంతదీపం, పున్నాగ తర్వాత ఇప్పుడు బంగారు గాజులు సీరియల్లో నటిస్తున్నాను. చెల్లెళ్లకు అన్నలా! నాన్న శ్రీనివాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ రాధ హౌజ్‌వైఫ్. మేం ముగ్గురు ఆడపిల్లలమే అని అమ్మనాన్న ఎప్పుడూ భయపడలేదు. అలాగే మా ఇష్టాలకు ఆంక్షలు ఎప్పుడూ పెట్టలేదు. ఏది నచ్చితే అది చేయమన్నారు. అయితే, ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందులు పడకూడదని, ఫ్యామిలీకీ ఇబ్బంది రాకూడదని చెబుతారు. నన్నయితే చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిలాగే పెంచారు. అందుకే మా చెల్లెళ్లకు అన్నలా ఉంటాను. కాని, మా సిస్టర్సే నాకన్నా మెచ్యూర్డ్. నేనే వాళ్లతో బాగా అల్లరి చేస్తాను. ఒక్కోసారి వాళ్లకే చెల్లెలిగా మారిపోతాను. నాకేదైనా అడ్వైజ్ అవసరమైతే వాళ్లే చెబుతారు. ఇంటికి పెద్ద కొడుకులా! నేనీ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు అమ్మ నాతోపాటు షూటింగ్స్‌కి వచ్చేవారు. ఇప్పుడు వద్దని చెప్పాను. నా పనులు నేను చూసుకోగల ధైర్యం వచ్చింది, నువ్వు చెల్లెళ్లను చూసుకో’ అని చెప్పాను. ఇంకా మంచి మంచి సీరియల్స్ చేస్తూ నా ప్రొఫెషన్లో ఎదగాలని ఉంది. ఫ్యూచర్లో కూడా అమ్మానాన్నలని బాగా చూసుకోవాలి. పెళ్లయినా వాళ్లని వదిలి ఉండలేను. ‘అమ్మనాన్నలతో నేను ఉంటాను, నేను ఉంటాను’ అంటూ ముగ్గురం అక్కచెల్లెళ్లం గొడవ పడుతుంటాం. డ్యాన్స్ అంటే పిచ్చి నే చేసిన సీరియల్స్ అన్నీ చాలా నేచురల్‌గా, భిన్నమైన పాత్రలు రావడం బాగా నచ్చింది. ఈ ఫీల్డ్కి రాకముందు మొదట్లో మా అమ్మతో అనేదాన్ని‘ ఇలాంటి సీరియల్స్ ఎలా చూస్తున్నావ్?’ అని. కానీ, అలా అనే నేను కూడా సీరియల్స్ చూసేదాన్ని. సీరియల్లో తర్వాత కథ ఏమవుతుందనే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి వల్లే ఇలా ఈ ఇండస్ట్రీకి వచ్చాననిపిస్తుంది. డ్యాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఏ కాస్త ఖాళీ దొరికినా స్ప్రింగ్‌లా ఊగిపోతుంటాను. వరించిన పాత్రలు నేను ఈ ఇండస్ట్రీకి రాకముందు ఏమేం అనుకున్నానో అలాంటి పాత్రలన్నీ ఇప్పుడు సీరియల్స్‌లో చేస్తున్నాను. తమిళ్ ‘శివగామి’ సీరియల్లో ఐపిఎస్ ఆఫీసర్‌గా చేస్తున్నాను. ఈ సీరియల్ ఒప్పుకోవడానికి ముందు కొంచెం భయపడ్డాను. హీరోయిన్ అనగానే ఏడ్వాలి.. అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ, ఇందులో ధైర్యవంతురాలిగా ఉంటుంది నా పాత్ర. తండ్రిని చంపిన వారిని శిక్షించాలని అనుకుంటుంది. అలాగని పగ పెంచుకోదు. న్యాయపరంగా ఉంటుంది. నిజంగా పోలీస్ జాబ్‌లో ఉన్న అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారు అని ఆ పాత్ర చేస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది. బంగారు గాజులు సీరియల్ పాత్ర సింగింగ్ బేస్డ్గా ఉంటుంది. చదువుకునే రోజుల్లో మంచి సింగర్‌ని కావాలని సింగింగ్ క్లాసులకు కూడా వెళ్లాను. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా ఆ ముచ్చట తీరుతోంది. ఈ సీరియల్లో పద్మావతిగా నా పాత్ర చాలా సంప్రదాయ బద్ధంగా, తల్లీ–కూతురు మధ్య ఉండే బంధం గొప్పగా ఉంటుంది. అల్లరిపిల్లగా కూడా కనిపిస్తుంది. గోరంత దీపంలోనూ నా పాత్ర పేరు పద్మావతే. ఈ పేరు సెంట్‌మెంట్‌గా వర్కవుట్ అయిందన్నారు యూనిట్. ఇప్పుడు నా అసలు పేరు మర్చిపోయి యూనిట్లో అంతా పద్దు అని, బాపు బొమ్మ అని పిలుస్తుంటారు. – నిర్మలారెడ్డి -
మంచి మాట వింటే మంచి సమాజం వస్తుంది
‘మాతృదేవోభవ అని తల్లిని పూజించిన భారతదేశంలో ఆడపిల్ల నేడు ఎందుకు ఆక్రోశిస్తోంది? యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః... అని నమ్మిన నేల మీద ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది ఎందుకు? సమాజం ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతోంది. యువత ప్రాధాన్యాలు మారిపోతున్నాయి. తల్లిదండ్రుల దారిలో డబ్బునే చూస్తున్నారు పిల్లలు. డాలర్ల రేసులో పడి మోరల్స్ మర్చిపోతున్నారు. సిలబస్‌లో మోరల్ ఎడ్యుకేషన్ కోసం పేజీలు ఉండటం లేదు. మనిషికి దైవభక్తి ఉన్నా, పాపభీతి ఉన్నా నాడు నిర్భయ ఘటన నిన్న ఆసిఫా ఘాతుకమూ జరిగేది కాదు. పాప మార్గాన్ని నిరోధించే దైవభక్తిపగలు– ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, మమత–సమత పెంచడానికే’ అంటారు దేవిరెడ్డి పద్మావతి.సమాజంలో నైతిక విలువలను నిలబెట్టడం ఒక తక్షణ అవసరం అని నమ్ముతున్నారు ఆమె. అందుకు అన్నమయ్యను ఒక సాధనంగా చేసుకున్నారు. ‘ఈ సమాజాన్ని తిరిగి సంస్కారవంతం చేయడం కష్టం కాదు. ప్రయత్నించాలి అంతే’ అని విశ్వాసం వ్యక్తం చేస్తారామె. తిరుపతిలో ఆమె చేస్తున్న ప్రయత్నమే ఈ కథనం. అన్నమయ్య దారిలో... ‘పొరుగువాడిని ప్రేమించలేని జీవితం జీవితమే కాదు. ఆకలి బాధ పేదవాడికైనా సంపన్నుడికైనా ఒకటే. సమాజంలో పాతుకుపోతున్న పేద–ధనిక, కులమతాల అడ్డుగోడల్ని కూలగొట్టాలి. అన్నమయ్య చెప్పిన సమ సమాజాన్ని స్థాపించాలి. అందుకే నేను కోరుకుంటున్న సమాజ నిర్మాణానికి అన్నమయ్య సంకీర్తనలతోనే దారులు వేస్తున్నాను’ అంటారు దేవిరెడ్డి పద్మావతి. ‘లైవ్ తిరుపతి డాట్‌కామ్’ పేరుతో ఆధ్యాత్మిక వెబ్సైట్ నిర్వహిస్తున్నారామె. రోజుకో మంచిమాట చెబుతూ, రోజుకో అన్నమాచార్య కీర్తనను పరిచయం చేస్తుంటారు. భగవద్గీత శ్లోకాలను సామాన్యులకు అర్థమయ్యే తేలిక పదాలతో వివరిస్తారు. జనం బాటలోనే మంచిమాట ‘జనం మనదారిలోకి రావాలని కోరుకోకూడదు, మనమే జనం దారిలో వెళ్లి చెప్పదలుచుకున్న మంచి మాట చెప్పాలి. వాళ్ల చెవికెక్కేటట్లు చెప్పాలంటే వాళ్లను నచ్చిన మాధ్యమంలోనే వాళ్లను చేరాలి. చదువులేని రోజుల్లో జనానికి మంచి చెడులను హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, తోలుబొమ్మలాటలతో చెప్పేవాళ్లు. అప్పుడవే ప్రసారమాధ్యమాలు. ఇప్పుడు నూటికి అరవై మంది చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. క్లాస్ బుక్కులను కూడా ఫేస్‌బుక్కులోనే చదవాలన్నంతగా విస్తరించింది సోషల్ మీడియా. డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న భర్త ‘టీ ఇస్తావా’ అని భార్యను వాట్సాప్‌లో అడగాల్సిన స్థితి. సమాజంలో సమన్వయం తప్పుతోన్న మానవసంబంధాలను క్రమబద్ధం చేయడానికి కూడా వాట్సాప్, ఫేస్‌బుక్‌లే మంచి మార్గాలనుకున్నాను’ అంటారు పద్మావతి. జరిగే పనేనా! ‘మంచిచెడుల గురించి చెప్పేవాళ్లు చెబుతుంటారు, వినాలనుకున్నవాళ్లు వింటుంటారు. వినగానే మనిషిలో గూడుకట్టుకుని ఉండే కరడుగట్టిన కర్కశత్వం సమూలంగా తుడిచిపెట్టుకుపోవడం జరిగేపనేనా? జరగవచ్చు, జరగకపోవచ్చు. రెండింటికీ చాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ. అయితే నా నమ్మకం ఒక్కటే... మనిషిలో స్వతహాగా మానవత్వం ఉంటుంది. దానిని జాగృతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సత్వరజతమోగుణాలను అదుపు చేసుకోలేకపోయినప్పుడు అవి మానవత్వం మీద దాడి చేస్తాయి. వాటిని అదుపు చేసుకోవాలనే క్రమశిక్షణ ఎవరో ఒకరు నేర్పాలి. పిల్లలకు స్కూలుకి టైమ్‌కి వెళ్లడం, హోమ్‌వర్క్ చేయడం, పెద్దలను గౌరవించడం నేర్పించినట్లే ఇది కూడా. ట్రాఫిక్‌రూల్స్‌ని పాటించడం నేర్పించినట్లే, సివిక్సెన్స్ నేర్పించినట్లే ధార్మిక క్రమశిక్షణను కూడా నేర్పించాలి. ట్రాఫిక్ రూల్ పాటించకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుందని బుద్ధి మనిషిని హెచ్చరిస్తుంది. అలాగే తాత్కాలిక వ్యామోహంలోనో, క్షణికావేశంలోనో నేరాలకు పాల్పడేటప్పుడు కూడా ఇది పాపం, దేవుడు ఒప్పుకోడు అనే భక్తి గుర్తొస్తుంది. భక్తిగా కాకపోయినా దేవుడు ఏదో ఒక రూపంలో శిక్షిస్తాడు అనే భయం అయినా గుర్తొస్తుంది. విన్నది, కన్నది మెదడులో నిక్షిప్తమవుతుంది. అవసరం వచ్చినప్పుడు విచక్షణ దానిని వెలికి తీస్తుంది. అందుకే మంచిమాటటను పలుమార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను’ అంటారు పద్మావతి. ఆ సేవ కోసమే తన జీవితం అంటోందామె. దేవుడు కోరిన సమాజం కోసం నేను వేంకటేశ్వరస్వామి భక్తురాలిని. ఆ స్వామి తాను చెప్పదలుచుకున్న మంచిమాటలను అన్నమయ్య చేత చెప్పించుకున్నాడని నమ్ముతాను. ఆ స్వామి కోరుకున్న సమాజం అన్నమయ్య పదాల్లో కనిపిస్తుంది. అలాంటి సమాజం తిరిగి రావాలన్నదే నా కోరిక. నేను అన్నమయ్యలాగా సంకీర్తనలు రాయలేను. ఆ సంకీర్తనాచార్యుడు చెప్పిన మంచిని మంది దగ్గరకు చేర్చడమే నా పని. ఈ పనిని చక్కగా చేస్తే దైవభక్తి, పాపభీతి నిండిన ధార్మిక సమాజం రూపొందుతుంది. అప్పుడు నేరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. – దేవిరెడ్డి పద్మావతి, సి.ఇ.ఓ, లైవ్ తిరుపతి వెబ్సైట్ – వాకా మంజులారెడ్డి -
విజయానికి గొడుగు పట్టింది
ఉద్యోగం చేస్తే ఒకరు చెప్పినట్టుగా చేయాలి.స్వయం ఉపాధి అయితే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. చదవిన చదువుకు ప్రయత్నం తోడైతే ఏమవుతుందో పద్మావతిని చూస్తే అర్థమవుతుంది. ఆమె ఇప్పుడు పుట్టగొడుగుల రైతు. ఇంటి వద్దే ఉంటూ మంచి సంపాదన పొందుతున్న గృహిణి. యూట్యూబ్ చూడటం ఆమెకు లాభించింది.ఒక వీడియో ఆమెను ఆకర్షించింది. హైదరాబాద్ నగరంలోని నాగోలు లక్ష్మీనరసింహ స్వామి కాలనీ(రోడ్ నెం:9) నివాసి ద్రోణంరాజు పద్మావతి జీవశాస్త్రంలో పట్టభద్రురాలు. స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లాలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి నగరానికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ దశలో మరో ఉద్యోగం వెతుక్కోవడం కన్నా స్వయం ఉపాధి కోసం సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించారు. ఆ సమయంలోనే పుట్టగొడుగుల పెంపకంపై యూట్యూబ్‌లో తారసపడిన వీడియో ఆమెను ఆకర్షించింది. మనమెందుకు పుట్టగొడుగులు పెంచకూడదు అనిపించింది. జీవశాస్త్రంలో లోతైన అవగాహన కలిగిన పద్మావతికి తర్వాత ఏం చేయాలో పెద్దగా చెప్పాల్సిన పని లేకపోయింది. 40 రోజులకు తొలి దిగుబడి తన ఇంటి వద్ద 300 చదరపు అడుగులలో రేకుల షెడ్డు నిర్మించి 3 నెలల క్రితం పుట్టగొడుగుల పెంపకాన్ని పద్మావతి ప్రారంభించారు. 4 ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేసి 350 బెడ్స్‌లో పుట్టగొడుగులు పెంచుతున్నారు. వాట్సప్, ఫోన్ ద్వారా ఈ రంగంలో నిష్ణాతులైన వారి దగ్గర సందేహాలను తీర్చుకుంటూ పుట్టగొడుగుల దిగుబడి మొదలెట్టారు. బెడ్ తయారు చేసి విత్తనం (స్పాన్) వేసిన 40 రోజులకు పుట్టగొడుగు చేతికి వస్తుంది. నెలన్నర కాలం పాటు ఆ బెడ్స్ నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుందని ఆమె అన్నారు. రోజుకు 5–10 కిలోల మిల్కీ పుట్టగొడుగులను విక్రయిస్తున్నానన్నారు. టోకుగా కిలో రూ. 200కు, రిటైల్‌గా రూ. 300 వరకు ధర పలుకుతున్నదని, లాభసాటిగా ఉందన్నారు. పుట్టగొడుగులలో చాలా రకాలు ఉన్నాయని అంటూ.. మిల్కీ పుట్టగొడుగులు హైదరాబాద్ వాతావరణంలో బాగా పెరుగుతున్నాయన్నారు. తొలి సీజన్లో గడించిన అనుభవంతో పుట్టగొడుగుల సాగును త్వరలో మరో రెండు గదులకు విస్తరింపజేయనున్నట్లు తెలిపారు. ‘చాలా చేయాలని ఉంది. బ్యాంకులు లోన్ ఇస్తే బాగుండు’ అన్నారామె. అతి జాగ్రత్త పాటించాలి వరిగడ్డిని ఉడకబెట్టి బెడ్ తయారు చేయడం దగ్గర నుంచి, కొద్దిరోజుల పాటు చీకటి గదిలో నిల్వచేయడం, కలుషితం కాకుండా చూసుకోవడం, గాలిలో తేమ, గది ఉష్ణోగ్రత వంటివన్నీ జాగ్రత్తగా చేయడం ద్వారా పుట్టగొడుగుల పెంపకాన్ని నేర్చుకోగలిగానని ఆమె తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగి మాదిరిగా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని అంటూ.. అప్పుడే చక్కని దిగుబడి పొందగలుగుతామని పద్మావతి అన్నారు. సాధారణంగా మార్చి–నవంబర్ మధ్య కాలం పుట్టగొడుగుల సాగుకు అనువైన కాలమని.. అయితే, తాను చలికాలంలో ప్రారంభించడం వల్ల గది ఉష్ణోగ్రత, గాలిలో తేమ సరిచూసుకోవడానికి యంత్రాలను సమకూర్చుకోవలసి వచ్చిందని ఆమె అన్నారు. తొలి దశలో మౌలిక సదుపాయాలకు కొంత పెట్టుబడి అవసరమవుతుందని, తదనంతరం అంత పెద్దగా ఖర్చు ఉండదని ఆమె తెలిపారు. – చిత్రం సైదులు, సాక్షి, నాగోలు, హైదరాబాద్ రసాయనాలు వాడటం లేదు ఎటువంటి రసాయన ఎరువులు కలపకుండా ఆరోగ్యకరమైన మిల్కీ పుట్టగొడుగులను పెంచుతున్నాను. పుట్టగొడుగులు వారానికి రెండు సార్లు తినొచ్చు. శరీరంలోని చెడు కొవ్వు కరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. విటమిన్ బీ, సీ తోపాటు కాల్షియం, మినరల్స్ అందుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పోతాయి. ప్రస్తుతం నగరంలో వీటికి మంచి డిమాండ్ ఉంది. అడిగిన వారికి ఊరగాయ కూడా పెట్టి ఇస్తున్నా. – ద్రోణంరాజు పద్మావతి (94907 55366), లక్ష్మీనరసింహస్వామి కాలనీ, నాగోలు, హైదరాబాద్ -
పద్మావతి 2
ఆశ్చర్యపోకండి! ‘ఆమీ’ అనే మలయాళీ సినిమా ఇది! దీన్ని బ్యాన్ చెయ్యాలని కేరళలో ఇప్పుడు ప్రదర్శనలు జరుగుతున్నాయి. కేరళ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది. ‘పద్మావతి’ స్టోరీ, ‘ఆమీ’ స్టోరీ వేర్వేరు. అయినప్పటికీ, పద్మావతికి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో, అన్ని అడ్డంకులూ ‘ఆమీ’కీ ఎదురవుతున్నాయి. ఇస్లాం మతం స్వీకరించిన కమలాసురయ్య (కమలాదాస్) అనే కేరళ రచయిత్రి బయోగ్రఫీ ‘ఆమీ’. 75 ఏళ్ల వయసులో 2009లో ఆమె మరణించారు. కేరళలో ‘లవ్ జిహాద్’ ధోరణి మొదలైందే కమలాదాస్ వల్ల కాబట్టి, ఇప్పుడు ఆమె జీవిత చరిత్రపై వస్తున్న సినిమాను విడుదల కాకుండా సెన్సార్ బోర్డును ఆదేశించాలని కేరళ సంప్రదాయవాదులు కోరుతున్నారు. మతాంతర వివాహాలకు ఈ సినిమా ప్రేరణ కలిగించి, సమాజాన్ని దారి తప్పించే ప్రమాదం ఉందని వారి ఆందోళన. పిటిషన్ వేసింది కె.పి.రామచంద్రన్ అనే లాయర్. కమలాదాస్ బయోగ్రఫీ ఇప్పటికే ‘లవ్ క్వీన్ ఆఫ్ మలబార్’ అనే పుస్తకంగా కూడా తర్జుమా అయింది. దాన్నుంచి కొన్ని ముఖ్యమైన భాగాలను తీసుకుని దర్శకులు కమల్ ‘ఆమీ’ని చిత్రీకరించారు. పుస్తకం రాసింది కెనడా రచయిత్రి మెర్రీలీ వైస్బోర్డ్. కమల తను స్వీకరించిన మతంపై తర్వాత్తర్వాత విశ్వాసం కోల్పోయిందని మెర్రీలీ ఆ పుస్తకంలో రాసినట్లు కూడా రామచంద్రన్ తన పిటిషన్లో ప్రస్తావించారు. -
ఆ నాలుగు రాష్ట్రాల్లో పద్మావత్ విడుదల కాలేదు
-
పద్మావత్ ప్రభంజనం సృష్టిస్తుంది
-
‘పద్మావత్’కే సుప్రీం మద్దతు ; రాష్ట్రాలకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ సినిమాకు అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి మద్దలు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను నిలిపేయాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు మంగళవారం కొట్టివేశారు. దీంతో జనవరి 25న ‘పద్మావత్’ యధావిధిగా విడుదలకానుంది. రాష్ట్రాలదే బాధ్యత : పద్మావత్ ప్రదర్శించలేమంటూ పిటిషన్ వేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘శాంతిభద్రత పరిరక్షణ రాష్ట్రాల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడం సరికాదు. జనవరి 25న సినిమా విడుదలవుతుందన్న గత ఆదేశాల్లో మార్పుల్లేవు’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వెనక్కి తగ్గిన కర్ణిసేన? : అత్యున్నత న్యాయస్థానంలో పద్మావత్‌కు అనుకూలంగా తీర్పులు వస్తుండటంతో ఇరకాటంలోపడ్డ కర్ణిసేన పునరాలోచనలోపడ్డట్లు సమాచారం. సినిమాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు నేతృత్వం వహిస్తోన్న కర్ణిసేనకు పద్మావత్ దర్శకుడు భన్సాలీ సైతం ప్రత్యేక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘ముందు మీరంతా సినిమా చూడండి. ఆ తర్వాత మీ ఇష్టం..’ అని భన్సాలీ కోరారు. సోమవారం కూడా ఉధృతంగా సాగిన ఆందోళనలు.. మంగళవారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడాన్ని బట్టిచూస్తే భన్సాలీ లేఖకు సానుకూలఫలితం వచ్చినట్లేనని సినీవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆందోళన విరమించే విశయమై కర్ణిసేన ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. రక్షణ కల్పిస్తాం : ముంబై, హరియాణా పోలీసులు ‘పద్మావత్’ విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించబోయే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని ముంబై పోలీసు శాఖ ప్రకటించింది. అటు హరియాణా ప్రభుత్వం కూడా సినిమా హాళ్ల వద్ద పహారాకు హామీ ఇచ్చింది. థియేటర్ యాజమాన్యాలు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని పోలీసులు పేర్కొన్నారు. -
దేశంలో కనీవినీ ఎరుగని నిరసన
జైపూర్/అహ్మదాబాద్ : దేశ చరిత్రలోనే ఊహించని మలుపు. ఒక సినిమాకు వ్యతిరేకంగా ఏకంగా 2వేల మంది మహిళలు ఆత్మార్పణకు సిద్ధమైన అరుదైన ఘట్టం. ‘‘మా మాట కాదని సినిమాను ప్రదర్శిస్తే థియేటర్ల ముందు చితిపేర్చుకుని ఆ మంటల్లో దూకి చస్తాం..’’ అని రాజ్‌పుత్ మహిళలు శపథంపూనారు. మహిళలకు తోడు పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనల్లో పాలుపంచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ‘పద్మావత్’ విడుదలకానున్న నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరో ఐదు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మాహుతికి పేర్లు నమోదు చేసుకున్న 2వేల మంది మహిళలు : రాజ్‌పుత్ కులానికి చెందిన రాణి పద్మావతిది గొప్ప చరిత్ర అని, సినిమాలతో ఆమె పరువును మంటగలుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆ కులానికి చెందిన మహిళలు నినదించారు. ఆదివారం రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 3వేల మంది రాజ్‌పుత్ మహిళలు పాల్గొన్నారు. సినిమాను ప్రవర్శిస్తే తామంతా మంటల్లోకి దూకి ఆత్మార్పణ(జౌహార్) చేసుకుంటామని జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం ఇచ్చారు. జౌహార్‌కు సిద్ధమంటూ ఇప్పటికే 2వేల మంది మహిళలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ జాబితాను కూడా కలెక్టర్‌కు అందించారు. బస్సులు బంద్.. మంత్రి అనూహ్య వ్యఖ్యలు : గుజరాత్లో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హెహసానా రీజియన్‌లో కొద్ది గంటలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనేఉన్నాయి. పలుచోట్ల గుజరాత్ ఆర్టీసీకి చెందిన బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పరిస్థితులపై మంత్రి భూపేంద్రసింహ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటివి చాలా సహజం’ అని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడంపైనే తాము దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 25న దేశవ్యాప్త ఆందోళన : పద్మావత్ సినిమాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న కర్ణిసేన.. సినిమా విడుదలయ్యేరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ‘‘ఇప్పటికే థియేటర్ యాజామాన్యాలతో మాట్లాడాం. పద్మావతిని ప్రదర్శించొద్దన్న మా డిమాండ్‌కు చాలా మంది ఒప్పుకున్నారు. ఒకవేళ ఎవరైనా సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత. పద్మావతి విడుదలయ్యే జనవరి 25న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’’ శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన అధికార ప్రతినిధి విజేంద్ర సింగ్ మీడియాతో అన్నారు. -
భయం మంచిది కాదు
నందితాదాస్ విలక్షణమైన నటి, దర్శకురాలు. పది భాషల్లో 40 సినిమాల్లో నటించారు. దీపామెహ్‌తా తీసిన ‘ఫైర్’ (1996) చిత్రంలో యాక్ట్ చేసినందుకు ఎన్నో మాటలు పడ్డారు. భారతీయ సంస్కృతిని మంటకలిపేసిందని సంప్రదాయవాదులు ఆమెను దూషించారు. హోమోసెక్సువల్ రిలేషన్స్‌ని అందులో చూపారు. అదీ కోపం. అయితే ‘‘అప్పుడే నయం. ఇప్పటి మనుషుల్లో ఆ మాత్రం సహనమైనా లేకుండా పోయింది’’ అని ఇటీవల ముంబై ఐ.ఐ.టి.లో జరిగిన ‘సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ అండ్ సెక్సువాలిటీ’ సదస్సులో నందిత అన్నారు. ఆమె మాటలు నిజమేననిపిస్తోంది.. ఇప్పటికింకా చల్లారని ‘పద్మావతి’ వివాదాన్ని చూస్తుంటే. ‘‘ఎందుకనో మనుషుల్లో భయం పెరిగిపోయింది. మౌనంగా ఉండిపోతున్నారు. మనసులో ఉన్నది చెప్పడమే నేరమౌతున్న రోజులు వచ్చిపడ్డాయి. పడుతుందో లేదో తెలియని దెబ్బ నుంచి ముందే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నందిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ భయం సమాజానికి మంచిది కాదు’’ అన్నారు. నిజమే. భయం నాగరిక లక్షణం కూడా కాదు. -
పద్మావత్‌కు తొలగని కష్టాలు
-
‘పద్మావత్’ రిలీజ్ డేట్..!
ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన బాలీవుడ్ సినిమా పద్మావతి. చారిత్రక కథగా తెరకెక్కిన ఈ సినిమాలో మహారాణి పద్మావతి పాత్రను అభ్యంతరకరంగా చూపించారని కర్ణిసేన సభ్యులు ఆరోపిస్తున్నారు. షూటింగ్ సమయంలో దాడి దిగిన కర్ణిసేన రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా క్లియరెన్స్ రాకపోవటంతో డిసెంబర్ 1న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల సెన్సార్ బోర్డ్ సినిమాకు కొన్ని మార్పులతో సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేసేందుకు అంగీకరించింది. చిత్రయూనిట్ కూడా సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసేందుకు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టైటిల్ ను పద్మావత్ గా మార్చాలన్న సూచనకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టుగా సమాచారం. దీంతో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్టుగానే భావిస్తున్నారు. ఈ రోజు పద్మావతిగా నటించిన దీపికా పదుకొణే పుట్టిన రోజు కావటంతో సినిమా రిలీజ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పద్మావత్ సినిమాను ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట.