గుంటూరు : గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటేశ్వర్లు కూతురు పద్మావతి(52) మృతి చెందగా.. ఆమె భర్త దేవేందర్‌నాథ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా పొన్నూరు మండలంలో బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి పొన్నూరు వస్తున్న పద్మావతి కారు బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు సమీపంలో రేపల్లె నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
దీంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో పద్మావతి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(పొన్నూరు)