former MLA
-
ఆటో డ్రైవర్ చెంపదెబ్బ..కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యాజీ(68) మమ్లేదార్ బెలగావిలో ఖాడే బజార్‌లోని ఓ లాడ్జి బుక్ చేసుకున్నారు. లాడ్జికి కారులో వస్తుండగా అక్కడి ఇరుకైన రోడ్డులో చిన్న ప్రమాదం జరిగింది. సూర్యాజీ కారు ఓ ఆటోను చిన్నగా ఢీకొట్టింది. ఆటోకు పెద్ద నష్టమేమీ జరగకపోయినా ఆ ఆటో డ్రైవర్ సూర్యాజీతో గొడవకు దిగాడు.ఈ గొడవలో సూర్యాజీని ఆ ఆటో డ్రైవర్ చెంపపై కొట్టాడు. ఇది ఇక్కడితో ముగిసిన తర్వాత సూర్యాజీ లాడ్జికి చేరుకుని మెట్లు ఎక్కి తన గదిలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సూర్యాజీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సూర్యాజీ చనిపోవడానికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్‌తో గొడవతో పాటు సూర్యాజీ కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, సూర్యాజీ గోవాలోని పొండా నియోజకవర్గానికి 2012 నుంచి 2017 దాకా ఎమ్మెల్యేగా పనిచేయడం గమనార్హం. -
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో సీపీఐ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో టీడీపీ నుంచి రెండుసార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. ఇల్లందు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 టీఆర్ఎస్ నుంచి, 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. -
హ్యాండిచ్చిన బీజేపీ.. మీడియా ముందు మాజీ ఎమ్మెల్యే కంటతడి
మరో నెల రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు వేగం పెంచాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈలిస్ట్‌లో విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మినహాయించింది.దీంతో పార్టీ నుంచి ఆశించిన వారికి టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఇప్పటికే బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడం రంజిత్ సింగ్ చౌతాలా గురువారం తన మంత్రి పదవకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తనకు టికెట్ నిరాకరించడంతో మరో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్ కంటతడి పెట్టుకున్నారు. అయితే బివానీ జిల్లలోని తోషమ్ నియోజకవర్గం నుంచి శశి రంజన్ పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో కలత చెంది శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో నా పేరు వస్తుందని అనుకున్నాను. పార్టీ నా విలువను చూస్తుందని, నా నియోజకవర్గాన్ని చూస్తుందని అనుకున్నాను. నా పేరు పరిశీలనలో ఉందని నేను ప్రజలకు హామీ ఇచ్చాను. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నిస్సహా స్థితిలో ఉన్నాను.’ అంటూ కంటతపడి పెట్టుకున్నాడు. అయితే అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేను ఓదార్చేందుకు ప్రయత్నించినా ఆయన మాత్రం ఏడుస్తూనే ఉన్నారు.Shashi Ranjan Parmar, former BJP candidate from Tosham, broke down in tears after losing his ticket to Shruti Choudhry, Has called a meeting with his supporters on September 6 at Bhiwani. may contest as independent #HaryanaElections2024 #BJP #Tosham #ShashiRanjan #ShrutiChoudhry pic.twitter.com/VgQimmX4Of— Sushil Manav (@sushilmanav) September 5, 2024అయితే పార్టీ కార్యకర్తలకు, తనకు ఓటేసిన ప్రజలకు అండగా ఉండాలని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్పగా..‘నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. నన్ను ఎందుకు పార్టీ పట్టించుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు.కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12. నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 13న జరనుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. -
మణిపూర్‌లో బాంబు పేలుడు.. మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
ఇంపాల్: ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మణిపూర్‌లో బాంబు పేలుడు ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య మృతిచెందారు. మరోవైపు.. తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు, గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకరాం.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి సైకుల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్‌థాంగ్ హౌకిప్ ఇంటి పక్కనే బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో హౌకిప్ రెండో భార్య సపం చారుబాలా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, పేలుడు ఘటన సమయంలో హౌకిప్ కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. తాజాగా మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు ,గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ముగ్గురు గ్రామ వాలంటీర్లు శుక్రవారం మోల్నోమ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరణించారు. కాగా గత ఏడాది మే నుండి మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్ , పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జరిగిన జాతి హింసలో వందల సంఖ్యలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. -
బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు
బోధన్: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహైల్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి సోహైల్ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కి పంపించాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం చేసిన సోహెల్ నేరుగా ముంబకి వెళ్లిపోయాడు. అటునుంచి దుబాయ్ కి పారిపోయాడు. సోహెల్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ -
కుక్కలు కూడా వారి వెంట పడవు
సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు.. కుక్కలు కూడా వారి వెంట పడవు’అని శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై శాసనసభ ఆవరణలో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అసలు విషయాలు అధిష్టానం వరకు చేరకుండా మధ్యలోనే కొందరు ఆపేశారు. జోకుడు బ్యాచ్‌కు మా పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవాలు చెప్పేందుకు అధినేత అవకాశం ఇస్తే ఎవరైనా అసలు విషయం చెప్తారు. వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడుగాళ్లు లోపల ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మరిచిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి లాగితే.. వచ్చిన వారు నిజమైన బీఆర్ఎస్ లీడర్లను అణచివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీసారి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపో యారు. కొన్ని జిల్లాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో అసహనం పెరిగేలా చేశారు.. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్రణాళిక లేకపోతే ఎలా గెలుస్తాం. ఆత్మగౌరవం ఎక్కువగా ఉండే వరంగల్ లాంటి జిల్లాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. తెలంగాణవాదం, ఉద్యమం గురించి తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలా..పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమిని అక్కడి ఓటర్లు ఎప్పుడో నిర్ణయించారు. ఆయన జనాలకు చక్కిలిగింత పెట్టడం తప్ప ఎవరికీ రూపాయి సాయం చేయరు’అని రవీందర్రావు అన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మొదు చిట్‌చాట్ పేరిట తాను అనని మాటలను అన్నట్టు గా ప్రచారం జరుగుతోందని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ రవీందర్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏదైనా విషయం మాట్లాడాలని అనుకుంటే అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తానన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన అప్పజెప్పిన అనేక బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చినట్లు పేర్కొన్నారు. చిట్‌చాట్ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తక్కెళ్లపల్లి కోరారు. -
పిఠాపురం మున్సిపల్ ఆఫీసు వద్ద చెత్త వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం: టీడీపీ ‘కుళ్లు’ రాజకీయాలకు తెర లేపింది. నిరసన పేరుతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ మంగళవారం మురికి కాలువల్లోని మురికి, చెత్త తెచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద వేశారు. ఈ సంఘటన పట్టణ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. గడప గడపకూ మన ప్రభుత్వం కింద సచివాలయాలకు విడుదల చేసిన నిధులతో పట్టణంలోని మురికి కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. తక్షణమే కాలువలను గుర్తించాలన్నారు. నెల రోజులుగా మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పర్యటించి వర్షాలకు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి, కాలువలు మూసుకుపోయి సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించారు. ఆయా కాలువల అభివృద్ధికి పనులు చేపట్టారు. ఏ పని చేస్తూంటే దానిపై ఆందోళన ప్రభుత్వం ఏ మంచి పని చేసినా బురద జల్లి ఆందోళన చేయడం.. పని పూర్తి అవ్వగానే తమ వల్లేనంటూ గొప్పలు చెప్పుకోవడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇందులో భాగంగానే మురికి కాలువల అభివృద్ధి పనులు చేస్తూంటే.. మరోపక్క ఆ పార్టీ నాయకుడు వర్మ వార్డుల్లో తిరుగుతూ మురికి కాలువలు శుభ్రం చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రధాన కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకున్నా ఏమీ పట్టించుకోవడం లేదంటూ కాలువల మురికిని వాహనాలపై తెచ్చి స్వయంగా మున్సిపల్ కార్యాలయం ముందు వేశారు. ఎమ్మెల్యే దొరబాబుపై విమర్శలు గుప్పించారు. మండిపడిన కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు వర్మ తీరుపై మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యత గల నాయకుడు ఇలా మూర్ఖంగా మురికిని తెచ్చి కార్యాయం వద్ద వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెచ్చిన మురికితోనే వర్మ చిత్రపటానికి అభిషేకం చేశారు. వర్మపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని నినదించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ, వర్మకు పిచ్చి ముదిరి ఇలాంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో పట్టణ పారిశుధ్యాన్ని గాలికొదిలేశారన్నారు. మురికి తెచ్చి ఇక్కడ వేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వైఎస్సార్ సీపీ శ్రేణులకు సర్ది చెప్పి, ఆందోళన విరమింపజేశారు. 18 మందిపై కేసు మున్సిపల్ కార్యాలయంపై దౌర్జన్యంగా మురికి వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ సహా 18 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
భార్య హత్య కేసులో దోషిగా మాజీ ఎమ్మెల్యే
భువనేశ్వర్: భార్య హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేని దోషిగా స్థానిక కోర్టు నిర్ధారించింది. వివరాల్లోకి వెళ్తే.. 27 ఏళ్ల క్రితం గుణుపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో భార్య అనుమానస్పద మృతి కేసు విచారణలో హత్యగా తేలింది. ఈ కేసు విచారణ జరిపిన స్థానిక కోర్టు మాజీ ఎమ్మెల్యేనే ఈ కేసులో దోషిగా ప్రకటించింది. 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 15 పత్రాల ఆధారంగా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. శిక్ష వివరాలను మంగళవారం ప్రకటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని భార్య సగం కాలిన మృతదేహాన్ని 1995 సంవత్సరంలో స్థానిక ఖారవేళ నగర్లో ఎమ్మెల్యే నివాసం నుండి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి ఆమె గర్భవతి అని గుర్తించారు. తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా ధ్రువీకరించారు. గొమాంగో రాజకీయ ప్రస్థానం 1995లో గుణుపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనతాదళ్ టికెట్‌పై రామమూర్తి గొమాంగో ఎన్నికయ్యారు. అనంతరం 2000 సంవత్సరంలో బీజేపీలో చేరారు. 2000లో గుణుపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో మరలా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అతను తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి హేమా గొమాంగోపై 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2009లో బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ కూటమి విడిపోవడంతో బీజేపీ నుంచి దూరమయ్యారు. అయితే 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో గుణుపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేడీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి మరలా బీజేపీలో చేరారు. -
వైఎస్సార్సీపీలోకి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. కుమారుడితో కలిసి చేరిక
సాక్షి, అమరావతి: సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికీ సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్తెనపల్లి నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచీ యర్రం వెంకటేశ్వరరెడ్డి.. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితులన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఆయన్ను వాడుకుని వదిలేసిందని చెప్పారు. తనను ఓడించాలని కుట్ర పన్ని, కోడెల శివప్రసాద్, చంద్రబాబులతో కుమ్మక్కై అప్పటికప్పుడు నాదెండ్ల మనోహర్ ఆయనకు జనసేన బీఫాం ఇచ్చారన్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరరెడ్డిని జనసేన కార్యక్రమాలకు పిలవకపోగా, అభాసుపాలు చేశారని తెలిపారు. ‘మనోహర్, పవన్, చంద్రబాబులు విడిపోయినట్లు నటించి, మళ్లీ కలిశారు. ఇప్పుడు మళ్లీ బేరాసారాలు చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కోసమేనని ప్రజలు గమనించాలి. వెంకటేశ్వరరెడ్డి, సూరిబాబుల చేరికతో పల్నాడులో వైఎస్సార్సీపీకి మరింత బలాన్నిస్తుందన్నారు. వారికి సరైన గౌరవం, సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వీరి సేవలను అన్ని విధాలా వినియోగించుకుంటామన్నారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు లేదని చెప్పారు. తనకు ఎక్కడి నుంచీ పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతుగా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పేదల సంక్షేమాభివృద్ధి కోసం సీఎం పరితపిస్తుండటం చూసి, తాను వైఎస్సార్సీపీలో చేరానని పక్కాల సూరిబాబు తెలిపారు. చదవండి: త్వరలోనే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా: ముద్రగడ -
కష్టపడి చదివి ఇంటర్ పాసైన ఎమ్మెల్యేలు.. డిగ్రీ పూర్తి చేయడమే లక్ష్యం
లక్నో: చదువుకోవాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరు కష్టపడి చదివి ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఎలాగైనా పట్టుభద్రులం అవుతామని చెబుతున్నారు. బరేలి జిల్లా బిత్రి-చైన్పూర్ నుంచి 2017లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్ మిశ్రా. మంగళవారం ప్రకటించిన యూపీ ఇంటర్ ఫలితాల్లో ఈయన 500కు గానూ 263 మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల క్రితమే పదో తరగతి పాసయ్యారు. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి చేసి చదువుపై తనకున్న మక్కువ చాటుకున్నారు. డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు. అయితే మార్కులుపై తాను సంతృప్తిగా లేనని మరోసారి తన ఆన్సర్ షీట్స్‌ను మూల్యంకనం చేయిస్తానని మిశ్రా చెప్పడం గమనార్హం. హస్తీన్పూర్ నుంచి ఎస్పీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభూదయాల్ వాల్మీకి కూడా ఇంటర్లో పాసయ్యారు. సెకండ్ క్లాస్‌లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. చదవుకు వయసులో సంబంధం లేదని పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేడ్కరే తనకు స్ఫూర్తి అని, డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ఈయన 2002-2007 వరకు, 2012-2017వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. మూడు రోజులు సంతాప దినాలు.. -
యూపీ పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాపియా, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే యూపీ పోలీసులు తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాలో ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందినవారు. హత్య, బెదిరింపులు, భూ కబ్జాలు వంటి తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ లిస్టులో టాప్‌లో ఉన్న వారిలో డాన్ నుంచి పొలిటీషియన్‌గా మారిన ముఖ్తర్ అన్సారీ, విజయ్ మిశ్రా, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే హాజి యాకూబ్ ఖురేషి, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ హాజి ఇక్బాల్, మాజీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్, బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ ద్వివేది, సుధీర్ సింగ్, దిలీప్ విశ్రా ఉన్నారు. కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా నేర చరిత్ర ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న 66 మంది నేరగాళ్లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. వీరిపై ఉన్న కేసులు త్వరగా విచారణ పూర్తయ్యేలా చూసి కోర్టులో శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ 66 మందిలో అతీక్ అహ్మద్, అదిత్య రాణా ఇప్పటికే చనిపోయారని, 27 మంది జైలులో ఉన్నారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కొందరిపై రూ.లక్షకుపైగా రివార్డు కూడా ఉన్నట్లు వివరించారు. చదవండి: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట.. -
ఇదేం ఖర్మ నాకు ఎవరినో ఎమ్మెల్యేను చేయడానికి నేను తిరగాలా..!
గిద్దలూరు రూరల్: ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పశ్చిమ ప్రాంత పర్యటనలో మొదటి రోజు బుధవారం గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సభా ప్రాంగణం జనం లేక వెలవెలబోయింది. వాహనాలు పెట్టి, మద్యం, డబ్బు ఆశచూపి తరలించిన అరకొర జనం కూడా చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగం వినలేక మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రసంగం ఆరంభంలోనే అబద్ధాలతో మొదలుపెట్టారు. గిద్దలూరుకు తాను ఎన్నోసార్లు వచ్చానని చెప్పడంతో ప్రజలు విస్తుపోయారు. ముందుగా ఆదిమూర్తిపల్లె నుంచి గిద్దలూరు గాందీబొమ్మ సెంటర్, రాచర్లగేటు సెంటర్ల మీదుగా ఒంగోలు హైవే రోడ్డులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకున్నారు. రాచర్ల గేటు సెంటర్లో చంద్రబాబుకు గజమాల వేసేందుకు ఏర్పాటు చేయడంతో ఆ సెంటర్లో రైల్వే గేటు వేయడం వల్ల జనాలు ఎక్కువగా నిలిచి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సభా ప్రాంగణం ఆవరణలో విచ్చలవిడిగా మద్యం పోస్తూ మద్యం ప్రియులు అక్కడే ఉండేలా చేశారు. తక్కువ జనం వచ్చినా కూడా ఎక్కువ జనం కనపడేలా సభా ప్రాంగణ స్థలం చిన్నది ఎంచుకుని సభను అక్కడే ఏర్పాటు చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు మద్యం తాగుతూ విచ్చలవిడిగా ప్రవర్తించారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా మద్యం మత్తులోని కొందరు యువకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. పోలీసులు వారిని వారించి పక్కకు పంపించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా బైక్‌ల పై ప్రమాదకరంగా తిరుగుతుండటంతో పోలీసులు వారిని అదుపుచేయగా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటు హక్కు లేని చిన్నారుల చేతికి టీడీపీ జెండాలను ఇచ్చి మరీ వాహనాల పైకి ఎక్కించి ప్రచారం చేయించారు. సభలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సాయికల్పన దూరం గిద్దలూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీలో వర్గ పోరు బట్టబయలైంది. మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి తనకు తగిన మర్యాద ఇవ్వకపోగా చంద్రబాబు వస్తున్న విషయం ఒక్క రోజు ముందుగా సమాచారం అందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి బాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ‘‘ఇదేం ఖర్మ నాకు ఎవరినో ఎమ్మెల్యేను చేయడానికి నేను తిరగాలా’’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో నన్ను కరివేపాకులా వాడుకుని వదిలేస్తారా అంటు మండిపడుతున్నారు. దీంతో ఆమె వర్గీయులు సైతం చంద్రబాబు సభకు దూరంగానే ఉండిపోయారు. మరో వైపు నియోజకవర్గంలో అత్యధిక ఓటు శాతం కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందిన పెట్టెల నారాయణయాదవ్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటూ నియోజకవర్గంలో తిరుగుతూ ఇన్చార్జ్ అశోక్‌రెడ్డికి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే తాను తన వర్గీయులతో ఆదిమూర్తిపల్లె సమీపంలోనే చంద్రబాబును కలిశాడు. బీసీలకు న్యాయం చేయాలంటూ కోరినట్లు సమాచారం.\ -
డైనమిక్ లీడర్.. రామ్‌లు
కోరుట్ల/మెట్పల్లి: రాజకీయాల్లో ఆయనది అలుపెరగని పోరాటం.. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీపడని మనస్తత్వం.. మాస్, డైనమిక్ లీడర్‌గా ప్రజల్లో గు ర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు(82).. జిల్లా రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తిగా పేరు సంపాదించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతున్న ఆయన.. బుధవారం హైదరాబాద్ అ పోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సంపూర్ణ ఆ రోగ్యంగా ఉన్న ఆయన.. రెండేళ్ల క్రితం కరోనా బారి న పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నా.. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అప్పటినుంచి తరచూ ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలు తీసుకుంటున్నారు. కొద్దిరోజు ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కు టుంబ సభ్యులు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చే ర్పించారు. అక్కడ చిక్సిత పొందుతున్న గుండెపోటుకు గురై తనువు చాలించారు. ఆయన మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలముకున్నా యి. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయా రు. పార్థివదేహాన్ని మెట్‌పల్లిలోని ఆయన స్వగృహా నికి తీసుకొచ్చారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య జ్యోతిదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభం.. ► మెట్పల్లి మండలం వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన రామ్‌లు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య పట్టా పొందారు. ► ఓవైపు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసూ్తనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. ► 1968లో వెంకట్రావ్పేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ► 1978లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ► 1983లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి రెండోస్థానంలో నిలిచారు. ► 1985 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి చెన్నమనేని విద్యాసాగర్‌రావు చేతిలో కేవలం 372 ఓట్ల స్వల్వ తేడాతో ఓటమి చెందారు. ► 1989, 94, 99 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. ► 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ లభించకపోవడంతో జనతా పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ► ఆ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ► ఆ సమయంలో ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు. ► 2009లో పోటీకి దూరంగా ఉన్న ఆయన.. 2014లో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ► 2018లో పోటీకి దూరంగా ఉన్నారు. ► ఎన్నికల్లో అనేకమార్లు పరాజయం చవిచూసినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ కొమొరెడ్డి రామ్‌లు ఆదర్శంగా నిలిచారు. సతీమణి జ్యోతికి రాజకీయంగా ప్రోత్సాహం ► కుటుంబంలో రాజకీయంగా తన సతీమణి జ్యోతిదేవిని కూడా కొమొరెడ్డి రామ్‌లు ఎంతో ప్రోత్సహించారు. ► న్యాయ విద్య అభ్యసించిన జ్యోతిని 1998లో మెట్‌పల్లికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిపారు. ► ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ► అంతకుముందు జ్యోతి మెట్పల్లి ఎంపీపీగా ప్రజాసేవలో పాలుపంచుకున్నారు. ► కొమొరెడ్డి రామ్‌లు – జ్యోతి దంపతులకు ముగ్గురు కుమారులు. ► తమలాగే వారిని కూడా న్యాయవాదులుగా తీర్చిదిద్దారు. ► పెద్ద కుమారుడు కరంచంద్ను తమ రాజకీయ వారసునిగా వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలపాలని నిర్ణయించారు. ప్రత్యర్థులకు హడల్ రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక పార్టీవారిని మరోపార్టీ వారు విమర్శించడం సాధారణం. కానీ, కోరుట్ల నియోజకవర్గంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండడం గమనార్హం. రామ్లును విమర్శించడానికి ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎవరు కూడా సాహసించకపోవడం ఆయన విలక్షణమైన వ్యక్తిత్వానికి నిదర్శనమనే అభిప్రాయం ఉంది. రాజీపడని మనస్తత్వంతో నష్టాలు.. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఏనాడూ రాజీపడలేదు. దీంతో రాజకీయంగా చాలా నష్టపోయారనే అభిప్రాయం ఉంది. బీసీ నాయకుడిగా ఆదినుంచీ దొరల పాలనను వ్యతిరేకించే వారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదురైనా వెనుకంజ వేయలేదు. ఇదే ఆయనకు ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచి్చంది. పలువురి సంతాపం కొమొరెడ్డి రామ్‌లు మృతికి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మెట్పల్లి(ప్రస్తుత కోరుట్ల నియోజకవర్గం) మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొమిరెడ్డి రాములు 2004-2009లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు. కాగా మెట్పల్లి నియోజకవర్గం ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ స్థానంలో కలిసిపోయింది. కొమిరెడ్డి మృతిపట్ల స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సంతాపం తెలియజేశారు. -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్‌చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూదందాపై సర్కారు న్యాయపోరాటం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రంలో అన్నదాతలకు అడుగడుగునా చేయూతనిస్తూ వారికి అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చోట వారి పక్షాన న్యాయపోరాటం కూడా చేస్తోంది. దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని ‘పచ్చ’గద్దలు ఎగరేసుకు పోవడానికి చేస్తున్న కుట్రలను ఎదిరించి రైతులు రోడ్డెక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి బాసటగా నిలిచింది. ‘పచ్చ’నేత భూదందాలో అన్యాయమైపోతున్న రైతన్నల పక్షాన పోరాటానికి నడుం బిగించింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు సాగించిన ఈ భూబాగోతం కథాకమామిషు ఏమిటంటే.. యు.కొత్తపల్లి మండలం యండపల్లిలో రూ.50కోట్లు విలువచేసే 52 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోని చెరువు గర్భం ఉంది. సర్వే నంబరు 627–1, 2, 628–1, 2 పాత, కొత్త చెరువులలో ఇది సాగు భూమిగా ఉంది. వీటిని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆరు గ్రామాలకు చెందిన 300 మంది నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్నారు. 20 సెంట్ల నుంచి అర ఎకరం వరకు వీరికి ఉంది. 50 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్న రశీదులు కూడా ఉన్నాయి. తమ ఆడ పిల్లలకు ఆ భూములను కట్న కానుకలుగా ఇచ్చుకున్న రైతులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం.. ఇక్కడ ఎకరం రూ.కోటి పలుకుతుండడంతో గత ప్రభుత్వ హయాంలో సదరు టీడీపీ ప్రజాప్రతినిధి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ భూమిపై కన్నేశాడు. నిరుపేదలు సాగులో ఉన్న భూమిని అప్పనంగా కొట్టేయాలని ఆయన, అతని అనుచరులు స్కెచ్ వేశారు. అంతే.. 2016–17, 2018–19 మధ్య ఆయన రెవెన్యూ రికార్డులను తారుమారు చేయించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.50కోట్లు విలువచేసే 52 ఎకరాలకు హక్కుదారు అంటూ ఆర్విఎస్ రావు అనే వ్యక్తిని తెరమీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 2017–18లో అతని పేరుతో రికార్డులు సృష్టించారు. పాస్ పుస్తకాలు కూడా పుట్టించారు. రైతులకు తోడుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆందోళన ఇక ఈ నకిలీ రికార్డుల ఆధారంగా రైతులను ఖాళీ చేయించేందుకు ఆ మాజీ ప్రజాప్రతినిధి తెర వెనుక పెద్ద ప్రయత్నమే చేశారు. అంతేకాక.. రైతులకు పంట దక్కకుండా నేలపాలు చేశారు. అంతటితో ఆగక పెంచిన మొక్కలనూ నరికేశారు. ఇలా గత సెప్టెంబర్‌లో వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో రైతులు రోడ్డెక్కారు. వీరికి సంఘీభావంగా అక్కడ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అదే సమయంలో రెండో విడత ‘కాపు నేస్తం’ కార్యక్రమం కోసం కాకినాడ జిల్లా గొల్లప్రోలు వచ్చిన సీఎం వైఎస్ జగన్ దృష్టికి ఎమ్మెల్యే ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో రైతుల పక్షాన న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. దీంతో అధికారులు హైకోర్టులో కౌంటర్ చేశారు. రైతుల చేతికొచ్చేవరకు పోరాటం చేస్తాం ఎన్నో ఏళ్లుగా నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్న భూములను తిరిగి వారి చేతికి వచ్చేవరకు పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. – పెండెం దొరబాబు, ఎమ్మెల్యే, పిఠాపురం రైతుల పక్షాన కౌంటర్ వేశాం యండపల్లిలో 52 ఎకరాల భూ సమస్యను పరిశీలించాం. అందులో రైతుల పక్షాన జిల్లా యంత్రాంగం న్యాయ పోరాటం చేస్తోంది. హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశాం. – కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం మా తాతల కాలం నుంచి చెరువు భూమిని సాగుచేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. ప్రాణాలను అడ్డుపెట్టి అయినా భూమిని కాపాడుకుంటాం. – చింతపల్లి తాతిరెడ్డి, రైతు, కొత్త ఇసుకపల్లి ఒక్క రూపాయి నుంచి పన్ను కడుతున్నాం మేం సాగు చేసుకుంటున్న ఈ భూ మికి మా తాతలు రూపాయి దగ్గ ర్నుండి పన్ను చెల్లిస్తూ వస్తు న్నారు. ఇప్పుడు భూమి మాది కాదని చెబుతున్నారు. సీఎం జగన్ మమ్మల్ని ఆదుకోవాలి. – తమిలిశెట్టి సుబ్బారెడ్డి, రైతు కొత్త ఇసుకపల్లి -
వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
తాడేపల్లి: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వసంత్ కుమార్ ఆదివారం తెల్లవారు జామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం. ఆది నుంచి వసంత్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్‌కుమార్ విశాఖలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. చదవండి: లోకేష్ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్ -
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి కన్నుమూత
సాక్షి, నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (65) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జిల్లా కేంద్రంలోని స్వగృహంలో మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామానికి చెందిన రుద్రమదేవి అదే మండలం (ప్రస్తుతం మాడుగులపల్లి) చెర్వుపల్లి గ్రామానికి చెందిన గడ్డం రంగారెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా 1981లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా ఘనవిజయం సాధించారు. 18ఏళ్లకు ఎన్నికల్లో పోటీచేసి మొదటి ఓటును తనకే వేసుకున్న చరిత్ర రుద్రమదేవిది. రుద్రమదేవి 1981 నుంచి 99 వరకు కౌన్సిలర్‌గా, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు, కరెంట్, ఇతర అభివృద్ధి పనులు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో రుద్రమదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరినప్పటీ ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంలోనే ఆమె భర్త గడ్డం రంగారెడ్డి కొన్నాళ్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు. నివాళులర్పించిన జానా, కంచర్ల మాజీ ఎమ్మెల్యే రుద్రమదేవి మృతదేహానికి పట్టణంలోని రామగిరిలో ఆమె స్వగృహంలో మాజీమంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ, కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి ఆమె పార్ధివదేహంపై పూల మాలలు వేసి నివాళులరి్పంచారు. వారు రుద్రమదేవి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్, మార్కెట్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రాజకీయాల్లో తనదైన ముద్ర : ఎంపీ కోమటిరెడ్డి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనాధ్ రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జి వి. రాకేష్ రెడ్డి, ఎం.వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్ రెడ్డి, బి.నరేందర్ రెడ్డి, జి.నరేష్కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. చదవండి: (రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బహిష్కరణ!
లఖ్‌నవూ: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. రాంపుర్ సదర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే నవాబ్ కాజిమ్ అలి ఖాన్‌పై వేటు వేసినట్లు యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ తెలిపారు. ‘రాంపుర్ బైపోల్లో బీజేపీ అభ్యర్థికి మీరు మద్దతుగా నిలిచినట్లు క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా మిమ్మల్ని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నాం.’అని పేర్కొన్న లేఖను మాజీ ఎమ్మెల్యే నవాజ్ కాజిమ్ అలి ఖాన్‌కు పంపించారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్యామ్ కిషోర్ శుక్లా. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ శాసనసభ్యత్వం రద్దయిన క్రమంలో.. రాంపుర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప అనివార్యమైంది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాంపుర్ సదర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఖాన్.. ఓడిపోయారు. 2016లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీ చదవండి: పోలీసులకు ఎదురుపడిన క్రిమినల్స్.. సినిమాను తలపించిన సీన్..! -
Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్‌గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్ తలకు వెలకట్టింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్‌ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు. 1964 మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్ స్పష్టం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్)లో అయినా ఎమ్సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే... ఓంకార్ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్ 17న అమరులైన కామ్రేడ్ ఓంకార్‌కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం) – వనం సుధాకర్ ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (అక్టోబర్ 17న ఓంకార్ వర్ధంతి సందర్భంగా) -
Khammam: తొలి తరం కమ్యూనిస్టు నేత భూపతిరావు మృతి
సాక్షి, భద్రాచలం/ఖమ్మం: తొలి తరం కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే, భద్రాచలానికి చెందిన భీమపాక భూపతిరావు(91) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో కూడిన అనారోగ్యంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందిన ఆయనను ఇటీవల భద్రాచలం తీసుకొచ్చారు. కాగా, సోమవారం తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెందారు. భీమపాక నాగయ్య, పుల్లమ్మ కుమారుడైన భూపతిరావు.. రావి నారాయణరెడ్డి, దొడ్డా నర్సయ్య ఉపన్యాసాలకు ఆకర్షితులై తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ, రజాకార్లకు వ్యతిరేకంగా నాడు మధిర, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పట్టాలు తొలగించిన ఘటనల్లో ఆయన పాల్గొన్నారు. భద్రాచలం ఏజెన్సీలో బంజరు భూములు, ప్రభుత్వ భూములను పేదలకు ఇప్పించడంలో భూపతిరావు కీలకపాత్ర పోషించారు. అందుకు కృతజ్ఞతగా ప్రజలు ఆ కాలనీకి ఆయన పేరు పెట్టుకున్నారు. చదవండి: Hyderabad: రాజాసింగ్ అరెస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే భార్య 1983లో పాలేరు ఎమ్మెల్యేగా విజయం.. 1950లో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సీపీఐ సభ్యత్వం తీసుకుని డివిజన్ మొదలు రాష్ట్ర స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా సీపీఐ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌పై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా జీవితం గడిపిన ఆయన ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పార్టీకి ఇచ్చేశారు. పార్టీ ఇచ్చే వేతనంతో జీవితాన్ని సాగించారు. భూపతిరావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భూపతిరావు కుమారుడు నగేష్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల ఎంపికయ్యారు. -
‘ఆ మూక హత్యలు మావాళ్లు చేసినవే’
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్‌కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. -
ఎమ్మెల్యేగా విశేష సేవలు.. సెంటు భూమి, ఇల్లు కూడా లేని నేత
స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆయన భావాలు చీకటిలో చిరుదివ్వెలు. మనం ఏమి చేశామని కాకుండా.. మనకు ఏమి లాభం అని ఆలోచించే మనుషుల్లో, స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించి చిల్లిగవ్వ ఆశించని మహానుభావుడు. దేశం కోసం పక్కనపెడితే.. ఊరికి కాస్త మంచి చేసినా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితుల్లో.. ఆయన మిగుల్చుకుంది నాలుగు జతల బట్టలు మాత్రమే. భూమి ఇస్తామన్నా.. ఇల్లు తీసుకోమన్నా.. తృణప్రాయంగా తిరస్కరించిన ఆ దేశభక్తుడు ప్రజల గుండెల్లో తనపేరు చిరస్థాయిగా ఉంటే చాలని కోరుకోవడం చూస్తే ఎలాంటి వారైనా ‘సెల్యూట్’ చేయాల్సిందే. అచ్చ తెలుగు భారతీయత ఉట్టిపడే పంచె, లాల్చీ ధరించిన.. వయస్సు శత వసంతాలు దాటిన ఆయనతో స్వాతంత్య్రోద్యమ మాట కలిపితే.. ఆ పోరాట పటిమ తూటాలా పేలుతుంది.. ఆ వయస్సులోనూ, ప్రతి మాటలోనూ ‘రాజ’సం ఉట్టిపడుతుంది.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది.. భరతమాత ముద్దుబిడ్డగా ఆయన మనస్సు త్రివర్ణ శోభితమవుతోంది. పలమనేరు: ‘‘ప్రభుత్వం నుంచి ఏనాడు ఏమి ఆశించలేదు. ఇప్పుడు నాకు నాలుగు జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు అని స్వాతంత్య్ర సమరయోధులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న(టీసీ) రాజన్ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధులు, మృతి చెందిన వారి సతీమణులను సన్మానించే కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు బుధవారం నిర్వహించారు. పలమనేరుకు చెందిన టీసీ రాజన్, దివంగత రామ్మూర్తి సతీమణి జయలక్షుమమ్మకు మేళతాళాలమధ్య ఘనస్వాగతం పలికి వారి అనుభవాలను ఆలకించి ఘనంగా సన్మానించారు. నాటి పరిస్థితులు ఆయన మాటల్లోనే.. నా వయస్సు ఇప్పుడు 104 ఏళ్లు మరో రెండు నెలల్లో 105లో పడతాను. చెవులు సరిగా వినపడవు, కంటిచూపు తగ్గింది. జిల్లాలో బతికున్న ఫ్రీడం ఫైటర్లలో బహుశా నేనే మిగిలానేమో. దేశానికి స్వాతంత్య్రం కోసం నాడు ఎందరో వీరులు పడిన కష్టాలను నేటి సమాజానికి తెలిసేలా ప్రభుత్వం చేస్తున్న మంచి పని ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండేది. ఆపై కొన్ని పార్టీలొచ్చాయి. 1956లో రాజాజీ స్వతంత్ర పార్టీని స్థాపిస్తే అందులో రంగాను జాతీయ అధ్యక్షునిగా నియమించారు. నన్ను చిత్తూరు జిల్లా కార్యదర్శిని చేశారు. 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెనాలిలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రంగా ఓడిపోయారు. అనంతరం చిత్తూరు ఎంపీగా ఉన్న అనంతశయనం అయ్యంగార్ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గవర్నర్‌గా నియమించింది. దీంతో ఇక్కడి ఎంపీ స్థానానికి 1962లో ఎన్నిక వస్తే రంగాను స్వతంత్ర పార్టీ ఇక్కడ పోటీలో పెట్టింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథ రెడ్డిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయానికి నేను చేసిన కృషికి మెచ్చి, 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ పలమనేరు అభ్యర్థిగా నన్ను నిలబెట్టింది. ఈ ఎన్నికలో నేను 9వేల మెజారిటీతో గెలిచాను. గ్రామాల్లో తిరిగాను గెలిచిన తరువాత నెలకు 15 రోజులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొన్నా. ఆ సమస్యలను అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. రైతులు పండించిన బియ్యాన్ని రవాణా చేయకుండా బెల్ట్ ఏరియాగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఆరేడు చెక్ పోస్టులుండేవి. ఈ సమస్యను అసెంబ్లీలో చర్చించి దాన్ని రద్దు చేయించా. పాలార్ బేసిన్ స్కీమ్ మేరకు నదులపై చెక్‌డ్యామ్‌లు నిషేధం పెట్టారు. దీనిపై పోరాటం సాగించా. ఆ పోరాటం వల్లే రాష్ట్రంలో నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అన్ని గ్రామాల్లోనూ వెలుగులు నింపా. ఊరూరా పండగే జెండా పండగ వచ్చిందంటే ఊరు ముందు పచ్చతోరణాలను కట్టి జెండా ఎగురవేసే వాళ్లు. ఆ జెండా ఎగురవేయడం కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. జెండా ఎగురవేసి తరువాత నిర్వహించే సమావేశంలో గ్రామ పెద్దలు, స్వాతంత్య్రం కోసం పాటు పడిన వారు ప్రసంగిస్తుంటే వినేందుకు ఎగబడేవారు. అందరూ తెల్లటి దుస్తులను ధరించి కార్యక్రమానికి వచ్చేవారు. ఊరూరా జెండా పండుగ రోజు స్థానిక ప్రముఖులు, విద్యావేత్తలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు. శాకాహారిని నేను పక్కా శాకాహారిని. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు భోజనంలో తీసుకుంటా. నేను ఇంత ఆరోగ్యంగా ఉండానంటే మా వంశంలోని జీన్స్ కారణమే. మా అక్క 108 ఏళ్లు బతికింది. మా అన్నలు 98 ఏళ్లు బతికారు. ప్రత్యేకంగా నేను ఆహారమేమీ తీసుకోనూ. అయితే మితంగా తింటాను. ప్రస్తుతం బెంగళూరులోని పటేల్ లేఅవుట్, వర్తూర్‌లో కుమారుడి వద్ద ఉంటున్నాను. ఈ దేశమే నాది అయినప్పుడు ఇక ఇల్లెందుకు, పొలమెందుకు.. నేను దేశం కోసమే పుట్టాను. దేశం కోసమే పోరాడాను. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై మోజు పడలేదు. స్వాతంత్య్ర పోరాటంలో నన్ను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా వెనుకడుగు వేయలేదు. 55 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యేగా సేవలందించా. అప్పట్లో స్వాతంత్య్ర సంబరాన్ని ఊరూరా ప్రజలే స్వచ్ఛందంగా జెండా ఎగురవేసి దేశభాక్తిని చాటుకునేవారు. ఈ దేశం నా కోసం ఏం చేసిందని కాకుండా, నా దేశానికి నేనేం చేయగలనని మాత్రం ఆలోచించాను. ఈ జీవితంలో దేశం కోసం చేయాల్సిందంతా చేశాను. – టీసీ రాజన్, స్వాతంత్య్ర సమరయోధుడు జైల్లోనే పరిచయాలు టెలిగ్రాఫ్లైన్ల (ప్రభుత్వ ఆస్తుల)ను ధ్వంసం చేసిన అభియోగం కింద అప్పటి ఎస్పీ సుబ్బరాయన్ నన్ను మూడు నెలలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అదే జైల్లో ఉన్న టీకే నారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాచకొండ నరసింహులు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. మరింత దేశభక్తి పెరిగింది. అప్పట్లో నరసింహారెడ్డి, సీతారామయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నా. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వద్దనుకున్నా. తామ్రపత్రమూ వద్దనే చెప్పాను. మాజీ ఎమ్మెల్యేలకు పింఛను వద్దని వ్యతిరేకించాను. ప్రభుత్వం ఇచ్చే 15 ఎకరాల భూమి కూడా తీసుకోలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలమూ వద్దని చెప్పాను. ఉట్టి అన్నానికి ఉప్పుకూడా ఇచ్చేవారు కాదట గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిస్తే నా భర్త రామమూర్తి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు టెలిఫోన్ కమ్మీలను కత్తిరించిన కేసులో ఆయన్ను జైలులో పెట్టారు. ఆ సమయంలో ఒట్టి అన్నం మెతుకులు పెట్టారంట. అది తినేందుకు చప్పగా ఉంటుందట. కాస్త ఉప్పు ఇవ్వమని అడిగితే చాలా హింసించేవారని నా భర్త చెప్పేవారు. అలాంటి ఆంగ్లేయుల బానిస సంకెళ్లను తెంచి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులను స్మరించుకోవడం మన ధర్మం. - నాటి స్వాతంత్య్ర సమరయోధులు రామమూర్తి సతీమణి జయలక్షుమమ్మ -
మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి మృతి
సాక్షి, కోనసీమ జిల్లా : పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి (68) గురువారం తెల్లవారుజామున అమలాపురం ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్‌మన్‌గా పనిచేసిన నారాయణమూర్తి 1996లో జరిగిన నగరం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది 1999 వరకూ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమి చెందారు. 2014లో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొంది 2019 వరకు సేవలు అందించారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు రవికుమార్, నలుగురు కుమార్తెలున్నారు. పులపర్తి పార్థివదేహానికి పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళులు అర్పించారు. ముంగండ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (Chintamaneni Prabhakar: 60కి పైగా కేసులు.. రూటు మార్చిన చింతమనేని) -
బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! ఏకంగా 33 కేసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పెనమలూరు: వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలకు లెక్కేలేదు. సెటిల్మెంట్లు, దందాలు, అధికారులపై దాడులకు అంతూ పొంతూ లేదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడూ దూకుడు తగ్గలేదు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 33 కేసులు నమోదు చేయించుకొన్న ఘనుడు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రెండు రోజుల క్రితం పెనమలూరులో ఓ రేషన్ షాపు తనిఖీలకు వెళ్లిన డెప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓలపై హత్యాయత్నానికి పాల్పడి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మన బోడె కేసుల చిట్టా పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. సామాన్యుల నుంచి అధికారుల వరకు.. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. పోలీసు కేసుల్లో ఇరుక్కోవటం, అధికారులపై దౌర్జన్యం చేయడం ఆయనకు కొత్త కాదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు బోడెకు అండగా నిలుస్తున్నారు. బోడె ప్రసాద్ గత చరిత్రను ఒక్క సారి పరిశీలిస్తే.. టీడీపీ పాలనలో వెలుగు చూసిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో పార్టీ అధికారంలో ఉండటంతో ఆయనపై కాల్‌మనీ కేసులు నమోదు కాలేదు. చదవండి👉 తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ బోడె ప్రసాద్ సింగపూర్‌లో పర్యటనలో ఉండగా తనకు బదులు మరో వ్యక్తితో పోరంకిలో ఉన్నత విద్య పరీక్ష రాయించారన్న వివాదం కూడా ఉంది. అంతేకాదు గతంలో వణుకూరులో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలను అప్పటి విజయవాడ సబ్‌కలెక్టర్ మీషా సింగ్ అడ్డుకున్నారు. మట్టి తవ్విన పొక్లెయిన్‌ను స్వాధీనం చేయాలని మీషాసింగ్ ఆదేశించగా బోడె ప్రసాద్ దురుసుగా ప్రవర్తించి పొక్లెయిన్‌ను దాచేసి, సబ్‌కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఘటన సంచలనం కలిగించింది. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు. జగన్నాథపురంలో ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ బందరు రోడ్డు విస్తరణ బాధితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వలేదు. యనమలకుదురులో గ్రూప్ హౌస్‌లు ధ్వంసం వ్యవహారంలో కూడా బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించింది. చదవండి👉🏻 నకిలీ మందుల ఊసే ఉండకూడదు సమస్యలను నివేదించడానికి వచ్చిన ప్రజలను దూషిస్తున్న బోడె ప్రసాద్ (ఫైల్) కేసుల్లో ఘనాపాటి బోడె ప్రసాద్ దురుసు ప్రవర్తనతో ఇప్పటి వరకు 33 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా డెప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్‌కుమార్‌పై దాడి కేసులో ఆయన పారిపోయాడు. ఈ కేసులో తొమ్మిది మంది కటకటాల పాలై, బొడే ఒక్కరే పారిపోవడం వెనుక పోలీసుల మెతక వైఖరి ఉందన్న విమర్శలున్నాయి. ఓ పోలీసు అధికారి లోపాయికారీగా ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత పోలీస్‌స్టేషన్‌లో కూర్చొని బోడెను కేసు నుంచి తప్పించేందుకు చర్చలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. బోడె ఒక్కడే పారిపోడం దీనికి ఊతం ఇవ్వడంతోపాటు స్థానిక పోలీసు అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. తరచూ వివాదాల్లో నిలిచే ఆయనపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించకుండా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి👉 నారాయణ, లింగమనేని పిటిషన్లపై విచారణ వాయిదా -
ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం కబ్జా
బంజారాహిల్స్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎమ్మార్పీఎస్ ముసుగులో ఓ ప్లాట్‌ను కబ్జా చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య, ఆమె కుమార్తెను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఖమ్మం జిల్లా, సుజాత నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య(96) కరోనాతో గత ఏడాది మృతి చెందాడు. అంతకుముందే ఆయన తన ఆస్తులను మొదటి భార్య వరమ్మ, ఇద్దరు కుమార్తెలకు, రెండో భార్య రుక్మిణి, మూడో భార్య దాక్షాయణికి, ఆమె కుమార్తెకు వీలునామా రాశాడు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో బీఎస్ఆర్ గోల్డెన్ ఎన్‌క్లేవ్‌లో తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్‌లో డెవలప్మెంట్లో భాగంగా రెండు ఫ్లాట్లు రాగా అందులో ఒకటి మొదటి భార్య వరమ్మ కుమార్తెలు ఉషారాణి, మంగమ్మలకు, రెండో ఫ్లాట్‌ను రెండో భార్య రుక్మిణమ్మకు చెందేలా వీలునామా రాశారు. మూడో భార్య దాక్షాయణికి పలుచోట్ల ఆస్తులు రాశారు. ఆయన మృతి చెందిన తర్వాత ఏడాది వరకు ఇంట్లో ఉండటం మంచిది కాదని సిద్ధాంతి చెప్పడంతో ఉషారాణి, మంగమ్మతో పాటు ఆయన రెండో భార్య రుక్మిణమ్మ ఫ్లాట్లు ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళారు. ఇదే అదనుగా వాటిపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే మూడో భార్య కోనేరు దాక్షాయణి, ఆమె కుమార్తె ఉషారాణికి కేటాయించిన ఫ్లాట్‌కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. గత నెల 2న పథకం ప్రకారం ఎమ్మార్పీఎస్ అనుబంధం సంఘం రాష్ట్ర కార్యాలయం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి ఫ్లాట్ తాళాలు పగలగొట్టి అందులోకి ప్రవేశించారు. అదే రోజు ఫ్లాట్ యజమానురాలు ఉషారాణి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టి నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్‌ను కబ్జా చేసినట్లుగా గుర్తించి తల్లీ కూతుళ్లపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్‌సీఐ) -
లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా?
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): లాడ్జి విక్రయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ అండతో చెలరేగిపోతున్న రామయ్య తీరును చివరకు ఆయన సోదరులే తప్పుబడుతున్నారు. శనివారం ఈ వివాదం కాస్త తారస్థాయికి చేరుకుంది. వివరాలు.. మూడున్నర సంవత్సరాల క్రితం తన లాడ్జిని రూ.9.50 కోట్లకు కదిరికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య విక్రయించి అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే తమ వాటా కింద ఉన్న 60 శాతాన్ని శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య సోదరులు రిజిస్టర్ చేయించారు. చదవండి👉 అసలైన ఉన్మాది చంద్రబాబే.. అయితే జొన్నా రామయ్యకు చెందిన వాటాను రిజిస్ట్రేషన్ చేయించకుండా అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డిని తిప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాక లాడ్జిని సైతం అప్పగించకుండా ఆదాయాన్ని తానే తీసుకుంటున్నారు. ఇటీవల తన 40 శాతం వాటాలోని 20 శాతాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి జొన్నా రామయ్య విక్రయించారు. ఆ వాటాను కూడా శ్రీధర్‌రెడ్డి కొనుగోలు చేయడంతో దాదాపు 80 శాతం వాటా ఆయనకే చెల్లుబాటైంది. కుటుంబానికి చెడ్డపేరు రాకుండా.. రామయ్య తీరుతో కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సోదరులు శనివారం శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్డి వద్దకు చేరుకుని బండరాళ్లు వేసి రామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ అన్న రామయ్య కారణంగా జొన్నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకుని లాడ్జిని శ్రీధర్‌రెడ్డికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పట్టణ ప్రజలు సైతం రామయ్య తీరును తప్పుబట్టారు. కందికుంట తీరుపై ప్రజల అసహనం లాడ్జి వద్ద వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామయ్యకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేయడంతో కందికుంటపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
‘ప్రజాసంగ్రామ యాత్ర’ .. బీజేపీలోకి చల్లా వెంకట్రామ్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నేతల చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా జిల్లా ముఖ్యనేతలతోపాటు సంజయ్ తరఫు ప్రతినిధులు జరిపిన చర్చలకు వెంకట్రామ్రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారని చెబుతున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కుమార్తె కుమారుడు) వెంకట్రామ్కు ఆలంపూర్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచిపట్టు ఉంది. ఇప్పుడు ఆయన వనపర్తి నుంచి పోటీచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వెంకట్రామ్తోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరికొందరు నేతలు కూడా సంజయ్ పాదయాత్ర ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో లేదా మే 14న జరిగే ముగింపు సమావేశానికి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు సమాచారం. -
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి మృతి
సాక్షి, బాగేపల్లి/చిక్కబళ్లాపురం: ప్రజల కోసం నిరంతరం పోరుబాటలో నడిచిన పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీరామరెడ్డి (75) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. సీపీఎం పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఆయన మోకాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. బాగేపల్లిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జీవి శ్రీరామరెడ్డి పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి, నిడుమామిడి పీఠాధ్యక్షుడు వీరభద్ర చెన్నమల్ల మహా స్వామీజీ, మాజీ కేంద్ర మంత్రి. కే.హెచ్. మునియప్ప, ఎమ్మెల్యే రమేష్ కుమార్, కే.శ్రీనివాస్‌గౌడ,హెచ్.ఎన్.శివశంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.సంపంగి, డాక్టర్ ఎం.సి.సుధాకర్, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జీవీకి ఘన నివాళి అర్పించారు. చదవండి: (నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్) -
తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష
భువనేశ్వర్: బ్రజ్‌రాజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే అనుప్ సాయెకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. రెండేళ్ల క్రితం తల్లీ, బిడ్డలపై ఓ మోటార్ వాహనం ఎక్కించి, వారిని అత్యంత అమానుషంగా హతమార్చిన ఘటనలో ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు కాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మాజీ ఎమ్మెల్యేని దోషిగా పరిగణిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం. ఇదే కేసులో డ్రైవర్ వర్ధన్ టోప్నోని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించి, విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. 2000లో యువతి కల్పన దాస్‌కి బీహార్‌కి చెందిన సునీల్ శ్రీవాస్తవ్‌తోతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉండగా, అనివార్య కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కల్పన దాస్‌తో మాజీ ఎమ్మెల్యే అనుప్ సాయెతో అక్రమ సంబంధం ఏర్పడి, అది బలపడింది. కొన్నాళ్లకు ఆమె తనని పెళ్లి చేసుకుని, ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరడంతో తల్లీపిల్లలను చంపాలని అనుప్ సాయె భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంటానని, ఆమెని నమ్మించాడు. తల్లీబిడ్డలను తీసుకుని, హమిర్పూర్ అడవులకు వెళ్లాడు. అక్కడ వారిపై నుంచి ఓ వాహనం ఎక్కించి, దారుణంగా చంపేశారు. 2016 మే 7వ తేదీన ఈ ఘటనపై చక్రధర నగర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2020 ఫిబ్రవరి 12వ తేదీన మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్ -
యూపీ కాంగ్రెస్ లీడర్లు.. టీఎంసీలోకి
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ను పక్క రాష్ట్రాల్లోకి విస్తరించాలని చూస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కార్యాచరణను ముమ్మరం చేశారు. ప్రధానంగా యూపీలో పాగా వేయాలని చూస్తున్న టీఎంసీలోకి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు జాయిన్ అయ్యారు. యూపీకి చెందిన సోమవారం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలోకి చేరారు. వీరిలో రాజేష్‌పతి త్రిపాఠి, లలితేష్పతి త్రిపాఠిలు ఉన్నారు. యూపీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీగా రాజేష్‌పతి త్రిపాఠి పనిచేయగా, లలితేష్పతి త్రిపాఠి యూపీ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడిగాను, మాజీ శాసన సభ్యుడిగాను పనిచేశారు.ఈ సందర్భంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. టీఎంసీ పట్ల ప్రజలలో విశ్వసనీయత పెరిగిందని అన్నారు. టీఎంసీ విధానాల పట్ల ఆకర్శించబడి.. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరటానికి మక్కువ చూపిస్తున్నారని అన్నారు. ఇక టీఎంసీ తీర్థం పుచ్చుకున్న వారిద్దరూ మాట్లాడుతూ.. బీజేపీని అధికారంలోంచి దింపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే టీఎంసీలో చేరినట్లు తెలిపారు. చదవండి: రాయలసీమకు చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి అనిల్ -
‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు
లక్నో: తన కోడిని ఎవరో హత్య చేశారు.. వారిని కనిపెట్టండంటూ ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కోడికి పోస్టుమార్టం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ కేసును విన్న పోలీసులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీ మహారాజ్‌గంజ్ జిల్లా పిప్రకల్యాణ్ గ్రామానికి చెందిన దుఖీ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే. ఆయన కుమారుడు రాజ్‌కుమార్ భారతి. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి రాజ్‌కుమార్ పక్షుల ప్రేమికుడు. అతడు ఎన్నో పక్షులను పెంచి పోషిస్తున్నాడు. వాటిలో భాగంగా ఓ కోడిని కూడా పెంచుకుంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ కోడి అకస్మాత్తుగా మృతి చెందింది. కోడి మృతిపై అతడు అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని సింధూరియన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. కేసు పెట్టి దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కోడికి పోస్టుమార్టం చేయాలని విజ్ఞప్తి చేశాడు. వెంటనే కోడిని చంపిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. కేసు దాఖలు చేసిన అనంతరం రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడాడు. తాను పక్షుల ప్రేమికుడినని.. తన దగ్గర చిలుకలు, పావురాలు, కోళ్లు ఎన్నో ఉన్నాయని, వాటిని ప్రేమగా పెంచిపోషిస్తున్నట్లు తెలిపాడు. తనను గిట్టని వారు ఉద్దేశపూర్వకంగా కోడికి విషయం పెట్టి చంపేశారు అని ఆరోపించాడు. చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో? -
నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం
పలమనేరు (చిత్తూరు జిల్లా): కౌన్సిలర్ కాగానే మందీ మార్బలంతో హంగామా చేసే రాజకీయ నాయకులు మనకు నిత్యం ఎక్కడపడితే అక్కడ తారసపడుతుంటారు. కానీ, పాత తరానికి చెందిన కొందరు అతి సామాన్య జీవితం గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ కోవకు చెందిన వారే పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధులు ఠానేదార్ చిన్నరాజన్. ఈయన పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, రాయలపేటలో 1918 సెప్టెంబర్ 11న తండ్రి అన్నయ్యగౌడుకు ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఇతని భార్య బద్రాంభ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసి గతంలోనే మృతిచెందారు.( చదవండి: మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు) ఇతనికి నలుగురు సంతానం. 1967లో పలమనేరు ఎమ్మెల్యేగా స్వతంత్ర పార్టీ తరఫున గెలుపొందారు. ప్రజాసమస్యలపై శాసనసభలో మంచి వక్తగా పేరుంది. 1972లో ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వాలనే ప్రతిపాదనొస్తే సేవచేసే ఎమ్మెల్యేకెందుకయ్యా పింఛనంటూ తొలుత వ్యతిరేకించింది ఇతనే. ఈనెల 11న ఆ మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ 104వ పుట్టినరోజు సందర్భంగా ఆయన విశిష్టతలు ఈ తరం వారి కోసం.. ►పట్టణంలోని కొత్తపేటలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న ఆయనకు సెంటు భూమి లేదు. పైసా నిల్వలేదు. ఉండేందుకు సొంత గూడు కూడా లేదు. ►మాజీ ఎమ్మెల్యేల కోటాలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని వద్దంటూ నిరాకరించారు. ►స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో సొంత నియోజకవర్గంలో ఇవ్వజూపిన భూమిని కూడా వద్దన్నారు. ►ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల పెంపు, దురాక్రమణలో ఉన్న ఆవులపల్లి అడవిని ప్రభుత్వపరం చేయించారు. ►సివిల్ సప్లయిస్ బెల్టు ఏరియా రద్దు తదితరాలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఆలోజింపచేసిన ఘనత ఆయనకే దక్కింది. ►రాజకీయాలంటే కేవలం సేవేగాని సంపాదన కాదని.. నీతి, నిజాయితీలే ఆభరణాలనే సంకల్పంతో ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారు. చదవండి: Sai Dharam Tej: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ కెమెరా పుటేజీ వీడియో -
‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్: బెదిరింపులు కూడా వస్తున్నాయి!
సాక్షి, ఇల్లెందు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని దర్శకుడు పరమేశ్వర్ వెల్లడించారు. ఇటీవల కారు బోల్తా పడగా ప్రమాదం నుంచి బయటపడిన గుమ్మడి నర్సయ్యను ఆయన శుక్రవారం ఇల్లెందులో పరామర్శించారు. ఆ తర్వాత యూనిట్ సభ్యుడు కృష్ణతో కలిసి పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య చిత్రం పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అంతేకాదు బెదిరింపులు కూడా వస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా ఓ ప్రజానేత జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ సినిమా విడుదలయ్యాకైనా నేతల్లో కొంత మార్పు వస్తుందనే ఆశ ఉందని చెప్పారు. చదవండి: మాట్లాడుతున్న గుమ్మడి నర్సయ్య చిత్ర దర్శకుడు పరమేశ్వర్ (ఎడమ) -
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఐసిస్‌తో లింక్?
సాక్షి, బనశంకరి: సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ కుమారుడి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళూరులోని మస్తికట్టెలో ఉన్న బీఎం బాషా నివాసంపై బుధవారం ఎన్ఐఏ ఐజీపీ ఉమా నేతృత్వంలో 25 మంది బృందం దాడి చేసింది. స్థానిక పోలీసులతో కలిసి సోదాలతో పాటు విచారణ ప్రారంభించారు. బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, అతని ఇద్దరు కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. అతడి కుమార్తె కొన్నేళ్ల క్రితం కేరళ నుంచి అదృశ్యమైంది. ఆమె సిరియాలో ఐసిస్‌లో చేరినట్లు అనుమానాలున్నాయి. బాషా కుటుంబసభ్యులు ఐసిస్ నిర్వహించే యుట్యూట్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసినట్లు తెలి సింది. దీంతో ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. అంతేగాక జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న యువకులతో బాషా కుటుంబీకులు ఫోన్లో సంభా షించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉళ్లాల నియోజకవర్గంలో మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న బీఎం.ఇదినబ్బ పాత్రికేయుడు, స్వాతం త్య్ర సమరయోధుడు, కన్నడ సాహితీవేత్త, కన్నడ ఉద్యమకారునిగా పేరుగాంచారు. ఆయన 2009లో కన్నుమూశారు. ఆయన కుమారుడు బాషా ఉగ్రవాద ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. -
విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి అస్వస్థత
విజయవాడ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో అప్రమత్తమైన ఆయన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే రవికి పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
వైఎస్సార్సీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి థాచర్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్) ఫిలిప్ సి థాచర్ వైఎస్సార్సీపీలోకి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి.. ఆయన సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ మేరకు ఫిలిప్ సి. థోచర్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా ఉన్నారు. చదవండి: ఏపీ శాసన మండలిలో మారనున్న సమీకరణాలు సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తోట త్రిమూర్తులు -
మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కన్నుమూత
కొల్లిపర (తెనాలి): గుంటూరు జిల్లా దుగ్గిరాల మాజీ శాసనసభ్యుడు అవుతు రామిరెడ్డి (86) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా సోకిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన అల్లుడు గుదిబండి చిన్న వెంకటరెడ్డి తెలిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కొల్లిపరలోని రామిరెడ్డి కుటుంబసభ్యులను కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుగ్గిరాల, ఈమనిలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అవుతు రామిరెడ్డి 1967–72లో ఎమ్మెల్యేగా, 1981–86 కాలంలో ఈమని సమితి అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, అవుతు కృష్ణారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, జొన్నల శివారెడ్డి, కళ్లం వీరారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, ఈమని హరికోటిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. చదవండి: రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి -
మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు..
మధిర/ ఎర్రుపాలెం: కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చేకూరి కాశయ్య(85) హైదరాబాద్‌లో సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలను కొనియాడారు. నిబద్ధత గల నేతగా కీర్తి పొందిన ఈయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు. చేకూరి నర్సయ్య-భాగ్యమ్మ దంపతులకు 1936లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలో పూర్తిచేసి ఆ తర్వాత మధిర హైసూ్కల్లో 1951-1952లో హెచ్ఎస్సీ పూర్తిచేశారు. విద్యార్థి నాయకుడిగా, మంచి వక్తగా, బహుభాషా కోవిధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొత్తగూడెంలో స్థిరపడి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రభుత్వ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మధిర టీవీఎం పాఠశాల పూర్వవిద్యార్థి సంఘాన్ని 1979లో స్థాపించగా ఆయన వ్యవస్థాపక ప్రతినిధిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావుకు సన్నిహితుడిగానూ మెలిగారు. 1956లో హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. 1958–60లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1960లో కొత్తగూడెం పంచాయతీ సమితిలో విస్తరణాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 1964 మార్చిలో రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరిగి 1970లో కూడా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఇలా.. కొత్తగూడెం నియోజకవర్గంనుంచి 1972లో, 1978లో శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయాలకు పునాది మానవ సంబంధాలు, అనుబంధాలు అని చెబుతుండేవారు. 1978లో ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగంపై పోరాటం చేయడం, కమిషన్ చేయించడంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1978లో 80 వేలమంది సింగరేణి కార్మికులు 54 రోజులపాటు చేపట్టిన సమ్మె విజయం సాధించడంలో శాసన సభ్యుడిగా ఆయన పోరాట పటిమను, నిజాయితీని నిరూపించుకున్నారు. 1987లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా విజయం సాధించి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నివాళి.. ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్ ఆవరణలో ఉంచిన చేకూరి కాశయ్య భౌతికకాయాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు తదితరులు నివాళులరి్పంచారు. -
మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన స్వగ్రామం జూపాకలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 13 మంది మృతి అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? -
నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే సాంబయ్య కన్నుమూత
కరీంనగర్: నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కరీంనగర్ కశ్మీర్గడ్డలో ఉన్న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. సాంబయ్య 1985లో జనతా దళ్ నుంచి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఉప్పరి రవి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా పొన్నం ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఉప్పరి సాంబయ్య ఎమ్మెల్యేగా ఉన్నారని, విద్యార్థుల పలు సమస్యలను చెబితే వెంటనే స్పందించారని గుర్తుచేసుకున్నారు. సాంబయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. ఆయన మృతికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సంతాపం తెలిపారు. -
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే మృతి
జహీరాబాద్: జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న (82) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించారు. ఆయన 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.నర్సింహారెడ్డిపై 35 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాజకీయ ముఖచిత్రం.. బాగన్న జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 1984 నుంచి 1989 వరకు ఎంపీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాగా, 1994 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెసేతర పార్టీ తరఫున విజయం సాధించిన మొట్ట మొదటి వ్యక్తి బాగన్నే. 1999 ఎన్నికల్లో బాగన్న తిరిగి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఆయన స్థానంలో టీడీపీ జి.గుండప్పకు టికెట్ కేటాయించింది. 2004 ఎన్నికల్లో టీడీపీ తిరిగి బాగన్నకు టికెట్ కేటాయించింది. అప్పుడు బాగన్న ఓటమిని చవిచూశారు. 2008లో బీజేపీలో చేరి 2009 ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిచెందారు. అనంతరం అధికార టీఆర్ఎస్లో చేరారు. బాగన్న మరణంతో జహీరాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం బాగన్న అంత్యక్రియలు జహీరాబాద్‌లో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. బాగన్నకు ఇద్దరు కుమారులు గోపాల్, రాజశేఖర్, ఇద్దరు కుమార్తెలు పద్మమ్మ, అనూశమ్మ ఉన్నారు. సీఎం సంతాపం.. మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న మృతిపై సీఎం కె.చంద్రశేఖరరావు త్రీవ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సేవ కోసం జీవితం అంకితం చేసిన చెంగల్ బాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శ ప్రాయుడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అరెస్టు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు మండలం కామనూరులో వరదరాజులరెడ్డి తన సోదరులు, అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్‌ఫోన్ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. నామినేషన్ విత్డడ్రా చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో వరదరాజులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై వరద కుటుంబీకుల దౌర్జన్యం -
మాజీ ఎమ్మెల్యే దుగ్యాల మృతి
పాలకుర్తి/సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆయన మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి (ప్రస్తుతం రద్దయింది) ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2004లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న తరు ణంలో ఆయన చెన్నూరు (ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం) నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహకారంతో ఆయన నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు నీటి ప్రాజెక్టులను మంజూరు చేయించడంతో పాటు రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశారు. దుగ్యాల మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మేనేజ్మెంట్ దిగ్గజం ఆర్సీ శాస్త్రి కన్నుమూత లక్డీకాపూల్(హైదరాబాద్): మేనేజ్మెంట్ రంగంలో దిగ్గజంగా పేరొందిన డాక్టర్ రాళ్లబండి చంద్రశేఖర శాస్త్రి (78) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో ఆయన గత గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కమలాదేవి, కుమార్తె రత్నావళి, కుమారుడు సునీల్ ఉన్నారు. కార్పొరేట్ రంగంలో చక్కని వ్యూహకర్తగా శాస్త్రి ప్రసిద్ధి పొందారు. అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రగతిలో కీలక పాత్ర పోషించారు. తెలుగు కార్పొరేట్ రంగంలో శాస్త్రి పేరు తెలియని వారు లేరు. శాస్త్రి ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ.(సోషల్ వర్క్‌లో గోల్డ్ మెడల్) పూర్తి చేసుకున్న తర్వాత ఆలిండ్ మియాజాకీలో ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కొంతకాలం పని చేశారు. తర్వాత కార్పొరేట్ రంగంలోకి ప్రవేశించారు. అలా మొదలైన ఆయన కార్పొరేట్ ప్రస్థానం సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఐటీసీ, ఐఎల్టీడీ, వీఎస్టీ వంటి సంస్థల్లో హెచ్ఆర్ చీఫ్‌గా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, సత్యం కంప్యూటర్స్ మొదటి హెచ్ఆర్ డైరెక్టర్‌గా అనేక సమున్నత పదవుల్లో కొనసాగింది. అనేక మంది సీఈవోల మెంటార్‌గా పథ నిర్దేశం చేశారు. కార్పొరేట్ రంగంలో ధర్మాన్ని, ఆధ్యాత్మికతను, మానవతా విలువలను రంగరించి టీమ్ లీడర్స్‌కు ఆదర్శంగా నిలిచారు. నిరంతర జ్ఞానార్జనే ధ్యేయంగా ‘మేనేజ్ మెంట్ రంగం’లో ఎంఫిల్‌లో డిస్టింక్షన్ సాధించారు. రెండు డాక్టరేట్లు పొందారు. డాక్టర్ శాస్త్రి మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేకమంది ఆయన శిష్యులు, కార్పొరేట్ దిగ్గజాలు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ రాజీనామా
సాక్షి, గుంటూరు/విజయవాడ: క్రైస్తవ మతం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ శనివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు రాజీనామా పత్రాన్ని పంపారు. అనంతరం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మెడలో శిలువ వేసుకుని బైబిల్ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. చదవండి: (పేదలకు పథకాలందే వేళ ఎన్నికల కోడ్ తెస్తారా!) రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలకు క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. క్రైస్తవులను అవమానాలకు గురిచేస్తున్న టీడీపీ, చంద్రబాబు వైఖరి నచ్చక పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఫిలిప్ సి తోచర్ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. చదవండి: (పక్కా కార్యాచరణతో ముందుకు) -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ఖమ్మం: మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య (87) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన స్వగ్రామం కల్లూరు మండలం పోచారంలో తుదిశ్వాస విడిచారు. మధిర శాసనసభ స్థానానికి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి... మరో నెలలో గడువు ముగుస్తుందనగా రాజీనామా చేశారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు. వెంకట నరసయ్య మృతి పట్ల పలువురు సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, బెల్లంపల్లి: సీపీఐలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారం క్రితం శ్వా సకోస సమస్యలు ఏర్పడగా అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మల్లేష్‌కు తాజాగా కిడ్నీ సంబంధమైన సమస్యలు తోడైనట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నిమ్స్‌కు వెళ్లి మల్లేష్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చర్చించారు. మల్లేష్ ఆరోగ్య సమాచారాన్ని బెల్లంపల్లిలోని పార్టీ శ్రేణులకు చాడ ఫోన్‌చేసి చెప్పినట్లు సమాచారం. మల్లేష్ ఆరోగ్యంపై సీపీఐ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. -
బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి
లక్నో/హాథ్రస్: హత్యాచార నిందితులకు మద్దతుగా హాథ్రస్లో ఆదివారం బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్వీర్ సింగ్ పహిల్వాన్ నివాసంలో ఒక సమావేశం జరిగింది. నిందితులకు మద్ధతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారని రాజ్వీర్ సింగ్ కుమారుడు మన్వీర్ సింగ్ తెలిపారు. అగ్రకులాల వారే కాకుండా, సమాజం లోని అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి వచ్చారన్నారు. బాధిత కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేయాలని ఆ సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పలుమార్లు తమ స్టేట్మెంట్ను మార్చారని ఆరోపించారు. ఈ సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ‘సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం. వారి దర్యాప్తుపై మాకు విశ్వాసముంది’ అని మన్వీర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఇది. ఎలాంటి విచారణకైనా నిందితులు సిద్ధంగా ఉన్నారు. వారు తప్పు చేసి ఉంటే ఎప్పుడో పారిపోయేవారు. బాధిత కుటుంబమే ఎప్పటికప్పుడు మాట మారుస్తోంది. నార్కో టెస్ట్కో లేక సీబీఐ దర్యాప్తుకో వారు సిద్ధంగా లేరు’ అన్నారు. కొనసాగుతున్న సిట్ దర్యాప్తు హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేసిన మర్నాడు కూడా.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన దర్యాప్తు కొనసాగించింది. ఆదివారం సీనియర్ ఐపీఎస్ అధికారి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో సిట్ బాధితురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే, ఈ కేసు విషయంలో సమాచారం ఇవ్వాలనుకునే వారు తమ వద్దకు రావాలని గ్రామస్తులకు సూచించింది. -
కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ 2019లో నిర్వహించిన డ్రగ్ పార్టీపై విచారణ జరపాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఫిర్యాదు చేశారు. దీంతో కరన్‌తో పాటు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్ పార్టీ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించామని, ఆ వీడియో నిజమని తేలితే, విచారణ చేపట్టనున్నట్లు ఎన్సీబీ తెలిపింది. 2019, ఆగస్టు 1న ఈ డ్రగ్ పార్టీపై ఫిర్యాదు చేశానని, అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ముంబై పోలీసులు ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకొని ఉంటే, సుశాంత్ సింగ్ రాజ్పుత్ని రక్షించుకోగలిగేవారమని శిరోమణి అకాలీదళ్ నాయకులు సిర్సా తెలిపారు. ఆ రోజు జరిగిన డ్రగ్స్ పార్టీలో దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, జోయా అక్తర్ లాంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ చలన చిత్ర పరిశ్రమలో కరణ్ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడతారని, ఆయనపై అనేక మార్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు చేశారు. -
మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి
సాక్షి, వైఎస్సార్ కడప: మాజీ ఎమ్మెల్యే పాలకొలను నారాయణరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఆయన 1962లో మైదూకూరు నియోజకవర్గంలో స్వతంత్ర పార్టీ తరుపున ఎమ్మెల్యే గెలిచారు. ఆయన మృతికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణారావు, రాష్ట్ర మాజీ మహిళా అర్థిక ఛైర్ పర్సన్ క్రిష్ణమ్మ సంతాపం తెలిపారు. -
వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి
సాక్షి, కోనరావుపేట (వేములవాడ): సర్పంచ్ అయితేనే లక్షలు సంపాదించుకునే రోజులివి. ఎమ్మెల్యే అయితే తరాలు కూర్చొని తిన్నా.. తరగని ఆస్తి కూడబెట్టుకునే కాలమిది. అలాకాకుండా ప్రజాసేవే పరమావధిగా సాదాసీదా జీవనం సాగించిన ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు అనారోగ్యంతో మంచాన పడి.. చేతిలో చిల్లిగవ్వలేక.. వైద్యం అందక బుధవారం మృతిచెందాడు. చిన్నపాటి రేకులషెడ్డులో ఉంటూ ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్రెల్ల నర్సయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. 1957–62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాసేవకే అంకితమై ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. 15 ఏళ్ల కింద నర్సయ్య కన్నుమూయగా, ఆయన కుటుంబం కడుపేదరికంలో బతుకుతోంది. నర్సయ్య కొడుకు ఆనందం (48) గ్రామంలోనే సుతారిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతులున్నాయని వైద్యులు చెప్పడంతో రూ.3 లక్షలు అప్పుచేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. మరో రూ.లక్ష అవసరం కాగా, డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేదు. బుధవారం ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనిత, కొడుకులు లెనిన్, మధు ఉన్నారు. -
మాజీ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు
ఫరీదాబాద్ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారానికి సంబంధించి హర్యానాలోని ఫరీదాబాద్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ నాగర్ నివాసంపై బుధవారం ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. ఎమ్మెల్యే లలిత్ నాగర్ నివాసం సహా ఆయన సోదరుల నివాసాలతో పాటు దాదాపు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరీ ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలో కాంగ్రెస్ హయాంలో రాబర్ట్ వాద్రాకు కారు చౌకగా భూములు కట్టబెట్టారనే వ్యవహారంలో భాగంగా ఈ దాడులు సాగాయి. ఫతేపూర్ మాజీ సర్పంచ్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. కాగా తనను వేధించేందుకే తన నివాసంపై ఐటీ అధికారుల దాడులు జరిగాయని నాగర్ ఆరోపించారు. చదవండి : డాక్టర్లకు చెమటలు పట్టిస్తున్న ఐటీ దాడులు -
జంట హత్యల కేసులో.. మాజీ ఎమ్మెల్యే వ్యూహకర్త
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో వెలుగు చూసిన జంట హత్యల కేసులో అధికార పక్షం బిజూ జనతాదళ్ నాయకుడు, శాసన సభ మాజీ సభ్యుడు అనుప్ కుమార్ సాయి వ్యూహాత్మక హంతకుడిగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు పేర్కొన్నారు. ఆయనను రాయఘర్ కారాగారానికి తరలించారు. కల్పన దాస్ (32), ఆమె కుమార్తె ప్రభాతి దాస్ (14)లను పకడ్బందీ వ్యూహంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ మంజూరు చేసేందుకు రాయిఘర్ కోర్టు నిరాకరించింది. నిందితుడి ఆచూకీ గుర్తింపు, సాక్షాధారాల సేకరణ వగైరా అనుబంధ కార్యాచరణలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు అహర్నిశలు శ్రమించినట్లు రాయిఘర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ సింగ్ విలేకరులకు వివరించారు. తొలి భర్తతో విడాకులు పొందిన కల్పన దాస్ నిందితుడు అనుప్ కుమార్ సాయితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. క్రమంగా వైవాహిక బంధంగా మలుచుకునేందుకు ఆమె విఫలయత్నం చేసింది. వివాహానికి అంగీకరించని నిందితుడు అనుప్ కుమార్ ఆమె అడ్డు తొలగించుకునేందుకు వ్యూహ రచన ప్రారంభించాడు. వ్యూహం ప్రకారం తన డ్రైవర్ బర్మన్ టొప్పొ సహకారంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు హమీర్పూర్ అటవీ ప్రాంతంలో తల్లీకూతుళ్లను హతమార్చాడు. బలమైన ఇనుప కడ్డీతో తల్లీకూతుళ్లను చావగొట్టి హత్య చేశారు. అనంతరం కారుతో మృతదేహాల్ని తొక్కించి దుర్ఘటనగా చిత్రీకరించి మృతదేహాల్ని పాతిబెట్టినట్లు ఎస్పీ వివరించారు. 2016వ సంవత్సరం నుంచి నిందితుల ఆచూకీ కోసం ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 700 మందిని పోలీసులు ప్రశ్నించారు. మొదటి భర్త సునీల్ శ్రీవాస్తవ్‌తో విడాకులు తీసుకున్న కల్పనా దాస్, బీజేడీ నాయకుడు అనుప్ సాయితో కాపురం కొనసాగించారు. 2011వ సంవత్సరం నుంచి 2016వ సంవత్సరం వరకు భువనేశ్వర్‌లో మూడంతస్తుల భవనంలో కలిసి జీవించారు. క్రమంగా పెళ్లి చేసుకోవాలని కల్పన ఒత్తిడి తేవడంతో ఛత్తీస్‌గఢ్ ప్రాంతం దేవాలయంలో వివాహం చేసుకుంటానని అనుప్ కుమార్ నమ్మించి తల్లీబిడ్డలతో బయలుదేరి అటవీ ప్రాంతంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. చదవండి: క్షమాపణ కోరడం, కాళ్లు పట్టుకోవడం జరగదు: చిన్మయి డ్రైవర్ అరెస్టు మాజీ ఎంఎల్ఏ అనుప్ కుమార్ సాయి డ్రైవర్ బర్దన్ టొప్పొను పోలీసులు శనివారం రాత్రి ఆయన నివాసంలో అరెస్టు చేశారు. దాదాపు 18 గంటల నిరవధిక విచారణలో నిందిత మాజీ ఎంఎల్ఏ అనుప్ కుమార్ సాయి తన డ్రైవర్‌కు సంబంధించిన సమాచారం బహిరంగపరిచారు. ఈ సమాచారం ఆధారంగా డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు రాయఘర్ ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. కల్పన దాస్, ఆమె కుమార్తె ప్రభాతి దాస్‌ను హత్య చేయడంలో మాజీ ఎంఎల్ఏ అనుప్ కుమార్‌కు డ్రైవర్ బర్దన్ టొప్పొ పూర్తి సహకారం అందజేశాడని ఎస్పీ వివరించారు. -
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం
సాక్షి,ప్రతినిధి ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) (56) బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఒంటి గంట సమయంలో తీవ్రస్థాయిలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆర్‌ఆర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన్నట్లు నిర్ధారించారు. దివంగత సినీనటుడు ఎస్వీ రంగారావుకు స్వయానా మేనల్లుడైన బడేటి బుజ్జి 1995లో రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2000లోనూ గెలిచి వైస్ చైర్మన్‌గా పని చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. బడేటి బుజ్జి మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, మంత్రి కురసాల కన్నబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు నివాళులు అరి్పంచారు. -
మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి ఇకలేరు
వామపక్ష ఉద్యమ ధీరుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి అస్తమించారు. మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన నాటి రామన్నపేట నియోజకవర్గంనుంచి మూడు పర్యాయాలు (1985, 1989, 1994) శాసనసభ్యుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అమలు చేసిన క్రాంతిపథకం నుంచి అనేకమంది రైతులకు బోర్లు వేయించడంతో ఇక్కడి రైతులు ఆయనను నేటికీ గుర్తించుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించి ఆదర్శంగా నిలిచారు. శనివారం ఆయన స్వగ్రామం గుండాల మండలం సుద్దాలలో అంత్యక్రియలు జరగనున్నాయి. ధర్మభిక్షంతో యాదగిరిరెడ్డి (ఫైల్) సాక్షి, ఆలేరు(నల్గొండ) : నీతి, నిజాయితీకి పెట్టింది పేరైన, ఆదర్శ జీవితానికి నిలువుటద్దమైన, అలుపెరుగని పోరాటయోధుడు, రామన్నపేట మాజీ ఎమ్మెల్యే కామ్రెడ్ గుర్రం యాదగిరిరెడ్డి శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు లేని ఎర్ర సూర్యుడు అస్తమించాడు. ప్రజల కోసం నిరంతరం పని చేసి స్వచ్ఛందంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈయన రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో రాజకీయ ఉద్దండుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపై మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. కుటుంబ నేపథ్యం... సుద్దాల గ్రామంలో గుర్రం నర్సమ్మ, రాంరెడ్డి చివరి సంతానం యాదగిరిరెడ్డి. ఈయనకు అన్నతో పాటు ఐదుగురు అక్కలు ఉన్నారు. 05.02.1931న సుద్దాల గ్రామంలో జన్మించారు. రాత్రి బడిలో 5వ తరగతి వరకు భోగం యాదగిరి పంతులు వద్ద చదువుకున్నారు. గొర్రెల కాపరిగా, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిం చారు. గుతుప సంఘానికి 15 ఏళ్ల వయస్సులోనే పాలు అందిస్తూ దళంలోకి వెళ్లారు. ఆయనకు తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన మూడెకరాల భూమితో పాటు పాత పెంకుటింట్లోనే జీవనం సాగించారు. ఆయనకు భార్య యాదమ్మ (రామాంజమ్మ)తో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడైన గుర్రం రాజశేఖరరెడ్డి న్యాయవాదిగా, చిన్న కుమారుడు రాంమోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో విశాలాంధ్ర దిన పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తెను మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తికి వచ్చి పెళ్లి చేశాడు. కుటుంబసభ్యులతో యాదగిరిరెడ్డి (ఫైల్) చిన్న కుమార్తె హైదరాబాద్‌లో జీవనం సాగిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళంలో పని చేశారు. నిర్మలా కృష్ణమూర్తి, నల్ల నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి దళాల్లో పని చేసి దళ కమాండర్‌గా ఎదిగారు. సుద్దాల హన్మంతుతో పాటు నాయిని నర్సింహారెడ్డి, దూదిపాల చిన్న సత్తిరెడ్డి, కూరెళ్ల సంజీవరెడ్డితో కలిసి దళంలో పని చేశారు. పాటలు పాడటం, బుర్ర కథలు చెప్పడంలో ఈయన దిట్ట. మండలంలోని వివిధ గ్రామాలకు తన హయాంలో మెటల్ రోడ్లు వేయించిన ఘనత ఆయనకే దక్కింది. మాజీ ఎమ్మెల్యే మృతికి ఎంపీపీ తాండ్ర అమరావతి, జెడ్పీటీసీ కోలుకొండ లక్ష్మి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండీ. ఖలీల్‌తో పాటు అఖిలపక్ష నాయకులు అండెం సంజీవరెడ్డి, ద్యాప కృష్ణారెడ్డి, మందడి రామకృష్ణారెడ్డి, గార్లపాటి సోమిరెడ్డి, దాసరి మల్లేషం, నాగార్జున్‌రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, మరాటి బీరప్ప, గడ్డమీది పాండరి, కె.హరిశ్చంద్ర, ఆదిసాయిలు, మద్దెపురం రాజు, బండారు వెంకటేష్, బడక మల్లయ్యతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. యాదగిరిరెడ్డి మరణం తీరని లోటు సాక్షి, యాదాద్రి : రామన్నపేట నియోజకవర్గం నుంచి పలుమార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధితోపాటు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేసిన గుర్రం యాదగిరిరెడ్డి మరణం ఎంతో లోటు అని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచౌరి శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఐ నాయకుల నివాళి ఆలేరు : సీపీఐ సీనియర్ నాయకులు, తెలంగాణ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి మృతికి సీపీఐ జిల్లా, ఆలేరు మండల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, డివిజన్ కార్యదర్శి అయిలి సత్తయ్య, కొల్లూరు రాజయ్య దివంగత యాదగిరిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే సీసీఐ ఆలేరు మండల సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదగిరిరెడ్డి చిత్రపటం వద్ద సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చెక్క వెంకటేష్, మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, నాయకులు గొట్టిపాముల రాజు, పరుశురాములు, సోమలింగం, అంజయ్య తదితరులు నివాళులర్పించారు. సీపీఐ మహాసభల్లో పాల్గొన్న యాదగిరిరెడ్డి అజాత శత్రువు యాదగిరిరెడ్డి రామన్నపేట : వామపక్ష ఉద్యమ కెరటం, రామన్నపేట మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి నిరాండబరుడు, అజాతశత్రు వు. ఓటమెరుగని ధీరుడు. రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. గుర్రం యాదగిరిరెడ్డి 1985, 1989, 1994లో మూడు పర్యాయాలు రామన్నపేట అసెంబ్లీస్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. గెలిచిన మూడు సార్లు కూడా మాజీ మంత్రి, కాంగ్రెస్‌పార్టీ రాజకీయ ఉద్దండుడు, దివంగతనేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపైనే కావడం గమనార్హం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేశారు. గ్రామాలకు రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యంను కల్పించడంతోపాటు పాఠశాలల, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు విశేషమైన కృషిచేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అమలు చేసిన క్రాంతిపథకం నుంచి అనేకమంది రైతులకు ఇన్‌వెల్ బోర్లు వేయించడం ద్వారా వారిని ఆదుకున్నారు. యాదగిరిరెడ్డి మృతి బాధాకరం మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట : సీనియర్ కమ్యూనిస్టు నేత, మాజీ శాసనసభ్యుడు గుర్రం యాదగిరిరెడ్డి మృతి ఉమ్మ డి నల్లగొండ జిల్లా రాజకీయాలకు తీరనిలోటని, ఎంతో బాధాకరమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిరెడ్డి మరణించారన్న విషయం తెలుసుకున్న మంత్రి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా రాజకీయాల్లో ఆయన పాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని కొనియాడారు. -
భగవంతుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని క్షమించడు..
సాక్షి, సంగారెడ్డిః ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ధ్వజమెత్తారు. గురువారం జోగిపేటలో ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగారు తెలంగాణ చేస్తానంటూ కుటుంబ పాలనతో బంగారు కుటుంబం చేసుకున్నారంటూ’ ఎద్దేవా చేశారు. ఆనాడు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తే, నేడు ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారన్నారు. కన్నతండ్రిలా వ్యవహరించి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ పాలనకు అతి త్వరలో చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఆ భగవంతుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని క్షమించడని, అతి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాబుమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కన్నుమూత
సాక్షి, నల్గొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమ్మూర్తి యాదవ్ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1947 ఆక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. మొదటిసారిగా 1981 లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 1999 వరకు అప్పటి చలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారు. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు ఓటమి ఎరుగని మాజీ మంత్రి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తిగా రాంమ్మూర్తికి మంచి పేరు ఉంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రాంమూర్తి యాదవ్ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం తాపత్రయ పడ్డారు. -
టీడీపీ నేతల గ్రానైట్ దందా
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. మైనింగ్ మాఫియాకు సహకరించి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.వందల కోట్ల రాయల్టీని ఎగ్గొట్టి, జేబులు నింపుకున్నారు. డొల్ల కంపెనీలు, దొంగ వే బిల్లులు సృష్టించి ప్రకాశం జిల్లా నుంచి విలువైన గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. గ్రానైట్ దోపిడీ వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం బయటపడింది. రవాణా శాఖ, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్ అధికారుల భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఒక్కో లారీకి రూ.17 వేలు వసూలు ప్రకాశం జిల్లాలో దాదాపు 2,500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్క మార్టూరు ప్రాంతంలోనే 700 వరకు పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే మూడు సర్టిఫికెట్లు అవసరం. గ్రానైట్ కంపెనీకి చెందిన ఇన్వాయిస్, మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లు ఉండాలి. చెక్‌పోస్టుల్లో గానీ, తనిఖీ అధికారులు ఆపినప్పుడు గానీ ఇవి చూపించాల్సి ఉంటుంది. గ్రానైట్‌ను క్యూబిక్ మీటర్లలో సైజుల వారీగా తరలిస్తారు. సైజులను బట్టి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రతి రూ.లక్ష లావాదేవీకి 18 శాతం జీఎస్టీ (రూ.18,000) చెల్లించాలి. రిజిస్టర్ అయిన కంపెనీ పేరిట ఉన్న మైనింగ్ పర్మిట్, ఈ–వే బిల్లుల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మైనింగ్ మాఫియా సభ్యులు డొల్ల కంపెనీల పేరిట సృష్టించిన దొంగ ఈ–వే బిల్లులతో గ్రానైట్ లారీలను తరలించారు. దొంగ ఈ–వే బిల్లుల ముద్రణ, నకిలీ మైనింగ్ పర్మిట్ల వ్యవహారం మొత్తం బల్లికురవ కేంద్రంగా సాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అద్దంకి, మార్టూరు నుంచి గ్రానైట్‌ను సరిహద్దులు దాటించేందుకు ఒక్కో లారీ నుంచి రూ.17 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ప్రభుత్వ అధికారులకు, మిగిలిన రూ.12 వేలు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు వాటాలు ఇచ్చేవారు. అద్దంకి, మార్టూరు నుంచి వినుకొండ, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా పిడుగురాళ్ల, దాచేపల్లి, అక్కడినుంచి తెలంగాణకు గ్రానైట్‌ను అక్రమంగా తరలించేవారు. ఈ మార్గంలో ఎవరైనా అధికారులు ఆపితే వినుకొండకు చెందిన మైనింగ్ మాఫియా రంగప్రవేశం చేసి, వ్యవహారాన్ని చక్కబెట్టేది. ఈ అక్రమ రవాణాకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలిచి రూ.కోట్లు వెనకేసుకున్నారు. గ్రానైట్ దోపిడీ వ్యవహారాన్ని రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. 270 డొల్ల కంపెనీలు, 16వేల దొంగ వే బిల్లులు ప్రకాశం జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ లారీలను ఇటీవల పోలీసులు, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైనింగ్ మాఫియాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో అక్రమాల గుట్టు బయటపడింది. 270 డొల్ల కంపెనీలను సృష్టించి, 16,000 దొంగ వే బిల్లులతో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో ఐదు నెలల కాలంలోనే మొత్తం రూ.300 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. -
భారత్ ఆశ్రయం కోరుతున్న పాక్ మాజీ ఎమ్మెల్యే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారత్‌లో రాజకీయ ఆశ్రయం కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీటీఐ తరఫున ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్‌లోని బారికోట్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బల్దేవ్ కుమార్ పాక్‌లో మైనారిటీలకు రక్షణ లేదని ఆరోపించాడు. ఈ క్రమంలో భారత్‌లో తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం బల్దేవ్ మూడు నెలల వీసాపై భారతదేశంలో ఉన్నాడు. ఆగస్టు 12న ఆయన భారతదేశానికి వచ్చాడు. బల్దేవ్ ఇండియా రావడానికి ముందే తన భార్య, పిల్లలను లూధియానా ఖన్నాలోని వారి బంధువుల వద్దకు పంపాడు. ప్రస్తుతం పాక్‌లో మతపరమైన మైనారిటీలపై హింస పెరిగిపోయిందని.. అందువల్లే తన కుటుంబాన్ని పాక్ నుంచి ఇండియాకు పంపిచాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాక తాను తిరిగి పాక్ వెళ్లాలని కోరుకోవడం లేదన్నాడు బల్దేవ్. తన కుటుంబ భద్రత గురించి తాను భయపడతున్నానని.. అందుకే భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నానని బల్దేవ్ తెలిపాడు. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ మీద విమర్శల వర్షం కురిపించాడు బల్దేవ్. నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించాడు. పాక్‌లో హిందువులు, సిక్కులపై దారుణాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని కోరాడు. అంతేకాక భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన విన్నపాన్ని మన్నించి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. బల్దేవ్ కుమార్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లూధియానా ఖన్నాలోని సమ్రాలా మార్గ్ ప్రాంతంలో రెండు గదుల ఇంట్లో అద్దెకుంటున్నాడు. బల్దేవ్ కుమార్ 2007లో పంబాజ్ ఖన్నా ప్రాంతానికి చెందిన భావనను వివాహం చేసుకున్నాడు. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉంది. కాగా బల్దేవ్ ఇద్దరి పిల్లలు పాక్ పౌరసత్వం పొందారు. 2016 ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ ఎమ్మెల్యే సోరన్ సింగ్ హత్య కేసులో బల్దేవ్పై ఆరోపణలు ఉన్నాయి. -
ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్న చింతమనేని బాధితులు
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి గురైన బాధితులు చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గతంలో తమపై దాడులు చేసిన చింతమనేని ప్రభాకర్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ చింతమనేనిపై ఉన్న పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న చింతమనేని ఆచూకి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా ఎస్పీ నవదీప్‌సింగ్ కేసును సీరియస్‌గా తీసుకోవడంతో చింతమనేనికి సహకరించిన కొందరు పోలీస్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. -
గద్వాల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
జోగులాంబ : గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన 1999లో మొదటిసారి గద్వాల నియోజకవర్గంనుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 వరకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. ప్రముఖుల సంతాపం గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. అబ్కారీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు. -
మాజీ ఎమ్మెల్యే శారారాణి కన్నుమూత
పరకాల: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి (55) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాస గృహంలో సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రాగా.. ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస వదిలారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అసమ్మతి ఎమ్మెల్యేల్లో శారారాణి ఒకరు. ఆ తర్వాత టికెట్ లభించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా, శారారాణి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిసింది -
రైలులో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య
గాంధీనగర్ : గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. భుజ్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, అబుదాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన జయంతీలాల్ భానుషలీపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. గతంలో జయంతీలాల్ తనపై అకృత్యానికి పాల్పడ్డారంటూ సూరత్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే డబ్బు కోసమే తన భార్య ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిందంటూ ఆమె భర్త పేర్కొనడంతో ఈ కేసుపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా వ్యక్తిగత పగతోనే దుండగులు జయంతీలాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించిందని, ఈ నేపథ్యంలో జయంతీలాల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
నెలాఖరులోగా వైఎస్సార్ సీపీలోకి
ఒంగోలు: ఈనెలాఖరులోగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనునున్నట్లు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. అన్నా రాంబాబు శనివారం సాయంత్రం ఒంగోలులోని బాలినేని నివాసానికి చేరుకొని ఆయనతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం రాంబాబు బయట మీడియాతో మాట్లాడుతూ నెలాఖరులోగా గిద్దలూరులోని నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరతామన్నారు. ఆయన వెంట గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యనేతలు చెంగయ్య చౌదరి, నరసింహ నాయుడు, అక్కి పుల్లారెడ్డి, కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు మౌలాలి, మారం రెడ్డి రామనారాయణరెడ్డి, చదుల్ల వెంకట రమణారెడ్డి, కామూరి రమణారెడ్డి, షేక్ సుభాని తదితరులు ఉన్నారు. విలువలు లేని పార్టీలో ఉండలేనంటూ.. అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు శాసనసభ్యునిగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడం పట్ల అన్నా రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకునికి రాజకీయ విలువలు ముఖ్యమని, ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడికి సూచించారు. అయినా ముత్తుముల అశోక్‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో అన్నా రాంబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలువలు లేని పార్టీలో తాను కొనసాగలేనంటూ టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకొని శనివారం బాలినేనిని కలుసుకుని చర్చించారు. ఈ విషయం తెలిసి జిల్లావ్యాప్తంగా ఉన్న వైశ్య సామాజిక వర్గ ప్రతినిధులు ఫోన్లు చేసి అన్నా రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. -
నాటు వైద్యుడు కాదు.. మాజీ ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం రూరల్ : రోలు ముందు పెట్టుకుని.. చెట్ల ఆకులు, వేర్లు దంచుతూ మందులు తయారు చేస్తున్న ఈయన నాటువైద్యుడు కాదు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు. 1989, 1994లో రెండు పర్యాయాలు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారు. ఆస్తిపాస్తులు కూడబెట్టుకోకుండా ప్రజలే ఆస్తిగా బతికారు. 250 గజాల ఇళ్లు, సాధారణ కారు తప్ప ఆయనకు ఆస్తులు ఏమీ లేవు. మధుమేహం (డయాబెటిస్) బాధితుడు కావడంతో ఆయన స్వయంగా చెట్ల మందులు తయారు చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి పెన్షనే జీవనాధారం. ఆయనకు ఇద్దరు కుమారులు. వారు ప్రైవేట్‌గా చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. రాములు నిరాడంబర జీవితం నేటి తరం నేతలకు ఆదర్శప్రాయమే అని పలువురు పేర్కొంటున్నారు. -
ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇంకానా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దయి నెల రోజులు గడిచింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో ప్రచారపర్వం వేడెక్కింది. అయితే, శాసనసభ రద్దయిన రోజు నుంచే ఎమ్మెల్యేలు మాజీలుగా మారారు. కేవలం సీఎం, మంత్రులు మాత్రమే తమ శాఖలోని పనులను ఆపద్ధర్మంగా నిర్వర్తిస్తున్నారు. వీరు తమ వాహనాలపై వారి హోదాను తెలియజేసేలా స్టిక్కర్లు ఉంచుకోవచ్చు. కానీ, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ కార్లపై ఎమ్మెల్యే స్టిక్కర్లు తొలగించలేదు. ఇలాంటి వాహనాలు మారుమూల ప్రాంతాలు, నియోజకవర్గాల్లోనే కాకుండా సాక్షాత్తూ రాజధానిలోనే కనిపిస్తుండటం గమనార్హం. నగరంలో తరచుగా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇలాంటి వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ ఉనికిని చాటుకోవడానికే తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇలా స్టిక్కర్లను కొనసాగిస్తున్నారనే వాదనలున్నాయి. జిల్లాల్లో వీరికి ఒకటికి మించి వాహనాలుంటాయి. ఎమ్మెల్యే కాకుండా ఆయన అనుచరులు, పీఏలు ఇతరులు మిగిలిన వాహనాల్లో వివిధ పనులపై వెళ్తుంటారు. ఎన్నికల కోడ్ వెలువడిన కొత్తలో కొన్ని వాహనాలపై ఈ స్టిక్కర్లు తీశారు. మిగిలిన వాహనాలపై అలాగే కొనసాగిస్తున్నారు. వివిధ పనులపై తాజా మాజీలు నగరానికి, జిల్లా కేంద్రాలకు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంచుకునే ముందుకు సాగుతున్నారు. అధికార, ప్రతిపక్షమన్న తేడా లేకుండా దాదాపుగా అన్ని పార్టీల వారు ఇదే రీతిలో వ్యవహరిస్తుండటం గమనార్హం. అయితే ఇది ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. ఇటు ‘టోల్’.. అటు పోలీసులు వాస్తవానికి అసెంబ్లీ రద్దయిన వెంటనే ఎమ్మెల్యేలుగా వారికి రాజ్యాంగపరంగా వర్తించే సదుపాయాలు, మినహాయింపులు దూరమవుతాయి. ఇలాంటి సదుపాయాల్లో ఒకటే టోల్గేట్ రుసుము. కానీ, చాలా చోట్ల తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ స్టిక్కర్లు తీయకపోవడంతో టోల్గేట్ నిర్వాహకులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మరోవైపు పోలీసు అధికారులు తమ ముందే ఇలాంటి వాహనాలు వెళ్తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ వాహనాలు రాజధానిలోనూ యథేచ్ఛగా ఎమ్మెల్యే స్టిక్కర్లతో సంచరిస్తున్నాయి. -
మాజీ ఎమ్మెల్యే వాహనం అని చెప్పినా...
భద్రాచలం: భద్రాచలంలోని బస్టాండ్ సెంటర్లో నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతి, ట్రాఫిక్ ఎస్సై సంతోష్ మధ్య మంగళవారం రాత్రి మాటల యుద్ధం జరిగింది. ‘మాజీ ఎమ్మెల్యే వాహనం అని చెప్పినా గౌరవం ఇవ్వకపోతే ఎలా’ అని సత్యవతి ఫైర్ కాగా, ‘రూల్స్ పాటించకపోతే ఎంతటి వారికైనా జరిమానా వేస్తా’ అని ట్రాఫిక్ ఎస్సై సంతోష్ స్పష్టం చేశారు. ఇలా కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం సాగింది. అక్కడే ఉన్న మరో బీజేపీ నాయుకుడు నాగబాబు సైతం ఎస్సైతో వాదనకు దిగారు. వాహనాలు కావాలంటే తమను అడుగుతారని, ఇప్పుడు తమ వాహనాలకే జరిమానా వేస్తారా అని ఆయన ఎస్సైతో వాదన పడ్డారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ఎవరికైనా జరిమానా వేస్తానని, బీజేపీ నాయకులేమీ అతీతులు కారని ఎస్సై అన్నారు. తొలుత కుంజా సత్యవతి తన వాహనంలో బస్టాండ్ ఎదురుగా గల ఓ ఆస్పత్రికి వచ్చారు. రోడ్డుపైనే వాహనం నిలిపి లోనికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్సై సంతోష్ రోడ్డుపై వాహనాన్ని తీయాలని డ్రైవర్‌కు సూచించారు. అది మాజీ ఎమ్మెల్యే సత్యవతిదని డ్రైవర్ చెప్పినా.. వాహనాన్ని అక్కడ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ తీసుకెళ్లి, తిరిగి యూ టర్న్ తీయించి, బస్టాండ్ వైపు రోడ్డుపై ఆస్పత్రి ఎదుట పార్కింగ్ చేయించారు. విషయం తెలుసుకున్న సత్యవతి ట్రాఫిక్ ఎస్పైతో వాదనకు దిగారు. -
హామీలు లేవు బుజ్జగింపులే
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు, అసమ్మతులు మొదలయ్యాయి. జాబితా వెల్లడించి నెల రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటన తో టికెట్ ఆశించిన కొందరికి ఆశాభంగం కలిగింది. వీరిలో కొందరు ఏకంగా సొంతంగా ప్రచారం మొదలుపెట్టారు. మరికొందరు అభ్యర్థులను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని ఇంకొందరు పట్టుపడుతున్నారు. ఇలా టీఆర్ఎస్లో నెలకొన్న అసమ్మతి, అసంతృప్త నేతలను అను నయించే బాధ్యతలను సీఎం కేసీఆర్ పూర్తిగా మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్ ప్రతి రోజూ పలు నియోజకవర్గాల వారీగా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు సత్యవతి రాథోడ్ (డోర్నకల్), మాలోతు కవిత (మహబూబాబాద్), తక్కళ్లపల్లి రవీందర్రావు (పాలకుర్తి)లను కేటీఆర్ తన క్యాంపు కార్యాలయానికి పిలిచి వేర్వేరుగా మాట్లాడారు. అవకాశాల విషయంలో అన్యాయం జరిగిందని ముగ్గురు నేతలు కేటీఆర్‌కు వివరించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వపరంగా, పార్టీలో, నియోజకవర్గాల్లో తమ విషయంలో జరిగిన సంఘటనలను వివరించారు. గెలుపు అవకాశాలు ఉన్న వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. అన్ని విషయాలను సావధానంగా ఆలకించిన మంత్రి కేటీఆర్.. ‘మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. అనివార్య పరిస్థితుల్లోనే మీకు టికెట్ ఇవ్వలేకపోయాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు అనే విధానంతో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లలో మీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదనే విషయం వాస్తవమే. మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కేసీఆర్ గారితో మాట్లాడతా. రెండు రోజుల్లో మళ్లీ విషయం తెలియజేస్తా. అందుబాటులో ఉండండి. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలి’ అని కోరారు. కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్మేలు.. చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య నియోజకవర్గంలోని అసంతృప్త నేతలను తీసుకుని వచ్చి కేటీఆర్‌ను కలిశారు. అందరూ కలిసి పని చేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ వారికి సూచించారు. మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కేటీఆర్‌ను కలిశారు. మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడిన మట్టా దయానంద్ సైతం కేటీఆర్‌ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలి సి వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేకపో యామని, భవిష్యత్‌లో అవకాశాలుంటాయని దయా నంద్‌కు కేటీఆర్ సూచించారు. అవకాశాల విషయం లో స్పష్టమైన హామీ లేకపోవడంతో దయానంద్ అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో స్థానికత నినాదంతో ఆయన సొంతంగా ప్రచారం చేస్తున్నా రు. దీన్ని కొనసాగిస్తారా? టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మళ్లీ కలిసిన కడియం.. స్టేషన్ ఘన్‌పూర్‌లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని స్పష్టత ఇచ్చినా అక్కడి అసంతృప్తులు తొలిగే పరిస్థితి ఉండటం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి టి.రాజయ్యను మార్చడం కుదరదని కేటీఆర్ ఆ నియోజకవర్గ నేతలకు సోమవారం స్పష్టం చేశారు. అభ్యర్థిని మార్చకుంటే కుదరదని, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్టేషన్ ఘన్పూర్ అసంతృప్త నేతలు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సైతం కేటీఆర్‌ను కలిశారు. అనంతరం వరంగల్‌లోని అసంతృప్త నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటనను కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్ట్
-
వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే దేవుడి కూతురు మాధవి
-
మాజీ ఎమ్మెల్యే పొట్నూరు మృతి
గుర్ల విజయనగరం : మాజీ శాసనసభ్యుడు పొట్నూరు సూర్యనారాయణ(76) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో పది రోజుల కిందట చికిత్స నిమిత్తం చేరి బుధవారం మరణించారు. కడుపునొప్పి తీవ్రంగా రావడంతో బీపీ తగ్గి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య పొట్నూరు కనకమ్మ, కుమారుడు సన్యాసినాయుడు, కుమార్తెలు వరహలమ్మ, ఆదెమ్మ, జ్యోతి ఉన్నారు. వరహలమ్మ ఇటీవలె మరణించడంతో అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రముఖల నివాళి పొట్నూరు సూర్యనారాయణ పార్ధీవ దేహన్ని వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనువాసరావు, పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామి నాయుడు, కొండపల్లి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బోత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, భంజదేవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ శిరువురి వెంకటరమణరాజు, డీసీసీబీ వైస్ చైర్మన్ చనమల్లు వెంకటరమణతో పలు మండలాలకు చెందిన ఆయన అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియలలో పాల్గొన్న మజ్జి పొట్నూరు సూర్యనారాయణ అంత్యక్రియలకు వైఎస్సార్ సీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనువాసరావు పాల్గొని పూర్తయ్యే వరకు ఉన్నారు. అంత్యక్రియల్లో పొట్నూరు పార్ధీవ దేహం వెంట నడిచారు. శ్మశాన వాటికలోని పొట్నూరు పార్ధీవ దేహనికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఆనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు... పొట్నూరు సూర్యనారాయణ వ్యవసాయ కూలీ అయిన పొట్నూరు సన్యాసినాయుడు, ఆదెమ్మలకు 1942లో జన్మించాడు. అంచలంచెలుగా ఎదిగి 1962 గూడేం సోసైటీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అనంతరం పాలవలస గ్రామ సర్పంచ్‌గా 22 ఏళ్లు పాటు కొనసాగారు. 1989లో మొదటిసారిగా సతివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఆయనను పోటికి దించింది. ఆ ఎన్నికల్లో ప్రత్యర్ధి పెనుమత్స సాంబశివరాజు చేతిలో ఓడిపోయారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 1994లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. అనంతరం రాజకీయ సమీకరణాలు మారడంతో ఆయన బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
పట్లోళ్ల కన్నుమూత
జహీరాబాద్ మెదక్ : జహీరాబాద్ మాజీ శాసనసభ్యుడు పట్లోళ్ల నర్సింహారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. 1989 నుంచి 1994 వరకు ఆయన జహీరాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. 1971నుంచి 1976 వరకు మెదక్ జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఒక పర్యాయం జహీరాబాద్ సమితి ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఎమ్మెల్యే కాక ముందు జనతాపార్టీ తరపున ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేసి బాగారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థిపై గెలుపొందారు. నర్సింహారెడ్డి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య అంతా ఉర్దూలోనే కొనసాగింది. బీఎస్సీ, ఎల్ఎల్బీ చదివి జహీరాబాద్, సంగారెడ్డి కోర్టుల్లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. కోహీర్ మండలం పిచారాగడి ఆయన స్వగ్రామం. గ్రామం పక్కన ఉన్న గురుజువాడలో 4వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకోగా, 5నుంచి 7వ తరగతి వరకు కోహీర్‌లో, 8నుంచి ఉన్నతా భ్యాసం హైదరాబాద్‌లో కొనసాగించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1931లో వ్యవసాయ కుటుంబంలో లక్ష్మారెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించిన నర్సింహారెడ్డి జయప్రకాష్ నారాయణ్ పిలుపు మేరకు 1951లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1972లో మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసీ టీపీఎస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో ఓటమిపాలయ్యారు. 1978లో జనతాపార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బాగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1992 నుంచి 1994 వరకు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. 1994లో రూ.50 లక్షల వ్యయంతో బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్‌ను నిర్మింపజేసి అప్పట్లో సీఎంగా ఉన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో ప్రారంభింపజేశారు. నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హమాలీకాలనీ, రాంనగర్, ఫరీద్నగర్, కాంతారెడ్డి నగర్ కాలనీలను ఏర్పాటు చేయించి పేదలకు ఇళ్లు మంజూరు చేయించారు. 1994లో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆయనను రాష్ట్ర కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గా పని చేశారు. ప్రస్తుతం అదే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. సోమవారం సాయంత్రం నర్సింహారెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం జహీరాబాద్ పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ రోడ్డులో ఉన్న ఆయన స్వగృహంలో ఉంచారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన స్వగ్రామం పిచరాగడిలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. నర్సింహారెడ్డికి భార్య పార్వతమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలువురి సంతాపం మాజీ ఎమ్మెల్యే పి.నర్సింహారెడ్డి మృతిపై ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఉంచిన భౌతికకాయం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వై.నరోత్తం, సినీ నిర్మాత ఎం.శివకుమార్, మాజీ ఎమ్మెల్సీ టి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రిటైర్డ్ పించన్దారుల సంఘం నాయకులు జి.జనార్ధన్, నేత్రయ్యతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు నర్సింహారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. పిచరాగడిలో విషాదం మాజీ ఎమ్మెల్యే పి.నర్సింహారెడ్డి మరణంతో ఆయన స్వగ్రాయం పిచరాగడి గ్రామంలో విషాదం అలుముకుంది. నర్సింహారెడ్డి జ్ఞాపకాలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా కొనసాగిన రోజుల్లోనూ ఆయన తన వ్యవసాయ పొలాలకు పాత సైకిల్‌పైనే ప్రయాణించే వారని, సాదాసీదా జీవనాన్ని సాగించే వారన్నారు. ఆయన లేని లోటు గ్రామానికి తీరనిదన్నారు. -
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవు
-
గెలిపిస్తే.. మీ జీతగాళ్లలా పనిచేస్తాం
బషీరాబాద్(తాండూరు) : ‘మా కాందాని నుంచి ఇద్దరు మీ ఆశీర్వాదంతో మంత్రులయ్యారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మా కుటుంబ గొడవల కారణంగా పోయిన ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయాం. ఇప్పుడు మాకు బుద్దొచ్చింది.. మీరంతా ఒక్క అవకాశం ఇవ్వండి. రమేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ జీతగాళ్లలా పనిచేస్తాం..’’ అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావు ఆసక్తికర వాఖ్యలు చేశారు. బషీరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. శక్తియాప్ ద్వారా గ్రామాల్లో ఓటర్లకు సభ్యత్వం చేయించాలని సూచించారు. రాజకీయాలు గతంలో మాదిరిగా లేవని, అబద్దాలు చెప్పేవారిని, మోసం చేసేవారినే నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహరాజుల కుటుంబానికి మోసం చేయడం, బెదిరించడం తెలియవన్నారు. మా ఇద్దరు అన్నలు మాణిక్‌రావు, చంద్రశేఖర్‌లను గెలిపించి మంత్రులుగా ఎదగడంలో మీ పాత్ర మరువలేనిదని తెలిపారు. ఈ సారి అన్న కొడుకు రమేష్‌ను గెలిపించి రాజకీయాలకు ఉండాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. శక్తియాప్ ద్వారా ప్రతీ గ్రామంలో 60 శాతానికి పైగా సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు సూచించారు. వారం రోజుల్లో మళ్లీ గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. డబ్బు రాజకీయాలు ఎక్కువకాలం సాగవ్ అన్నిసార్లు డబ్బుతోనే రాజకీయాలను నడిపిస్తామంటే మూర్ఖత్వమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు చెంగోల్‌లో కాంగ్రెస్ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని, రెండు రోజుల్లో తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎంపీపీపై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెడితే.. తమ పార్టీ ఎంపీటీసీని కిగ్నాప్ చేసి దాచిపెట్టారని మండిపడ్డారు. ఇవన్నీ జిల్లా మంత్రి సూచనల మేరకే జరుగుతున్నాయని ఆరోపించారు. రేపటిలోగా ఎంపీటీసీని అప్పగించకపోతే టీఆర్ఎస్ నాయకులపై కిడ్నాప్ కేసు పెడుతామని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తాండూరులో టీఆర్ఎస్ పార్టీ రూ.30 కోట్లు ఖర్చు పెట్టినా.. గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ హరిగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజరత్నం, శివప్రసాద్, నరేష్ చౌహన్, ఉల్గప్ప, మంతట్టి సురేష్, రాములు, వీరారెడ్డి, జీవన్గీ నర్సిములు, మస్తాన్, మునీర్, రాజన్‌గౌడ్, కాశప్ప, సాయిలుగౌడ్, పవన్, జగన్నాథ్, ధన్సింగ్, రాజన్‌గౌడ్, పెంటప్ప, మాధవరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మోహన్, లక్ష్మన్, వడ్డే శీను, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనగామ మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి మృతి
జనగామ/పాలకుర్తి: జనగామ మాజీ ఎమ్మెల్యే కోడూరు వరదారెడ్డి(82) హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరదారెడ్డిని మెరుగైన వైద్య పరీక్షలను అందించేందుకు ఆస్పత్రిలో చేర్పించగా కన్నుమూశారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన వరదారెడ్డి చిన్న నాటి నుంచే ప్రజా సంబంధాలు కలిగి ఉంటూ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. 1958 నుంచి 1970 వరకు ఈరవెన్ను సర్పంచ్‌గా, 1970 నుంచి 1975 వరకు కొడకండ్ల సమితి అధ్యక్షుడిగా కొనసాగారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలో అప్పటికే మంచి పేరున్న వరదారెడ్డికి గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. 1978 నుంచి 1983 వరకు జనగామ ఎమ్మెల్యేగా పని చేశారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల మన్ననలు పొందారు. కరువుకు కేరాఫ్‌గా ఉన్న జనగామ ప్రాంతాన్ని మరో కోనసీమలా మార్చేందుకు వరదారెడ్డి పోచంపాడు ఎత్తిపోతల పథకం కోసం జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేశారు. ఆ సమయంలోనే 1984లో ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మడంలం నిడిగొండ గ్రామంలో బహిరంగసభ నిర్వహించి నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆహ్వానించారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోచంపాడు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని ఇందిర ప్రకటించడంతో ఆయన కృషి ఫలించినట్లయ్యింది. దీంతోపాటు రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర చాలా కీలకం. పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఆయన వీరోచిత గాథలను నేటికీ చెప్పుకుంటారు. తెలంగాణ ఏర్పాటుతోనే ప్రజల సమస్యలు తీరుతాయని భావించి 2001లో కేసిఆర్‌తో కలిసి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ స్థాపనకు కృషి చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ ఆవరణలో చేతి వేలు కోసుకుని ఉద్యమానికి ఊతమిచ్చారు. ఆ తర్వాత∙టీఆర్ఎస్ను వీడి రైతు నాయకుడిగానే ప్రజల పక్షాన గొంతు వినిపించారు. రైతు కుటుంబ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన కుటుంబానికి 200 ఎకరాల భూమి ఉండేది. కాలక్రమంలో 50 ఎకరాలకు మిగిలింది. ఇద్దరు కుమారులకు పంచి, 10 ఎకరాలు తీసుకుని సేద్యం చేశారు. వరదారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. జనగామ జిల్లా జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆయనకు స్వయాన అల్లుడు. వరదారెడ్డి మృతితో కుటుంబ సభ్యులతో పాలకుర్తి, ఈరవెన్ను గ్రామాలతోపాటు జిల్లా వాసులు విషాదంలో మునిగి పోయారు. గురువారం ఈరవెన్నులో వరదారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టీపీసీసీ, మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య..వరదారెడ్డి మృతదేహాన్ని యశో ద హాస్పిటల్లో సందర్శించి నివాళులర్పించారు. మరిచిపోలేని నేత: మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి రాజకీయాల్లో నిస్వార్థంగా సేవలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి సీపీఐ కార్యాలయంలో వరదారెడ్డి చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో జిల్లా సమితి సహాయ కార్యదర్శి బర్ల శ్రీరాములు, ఆకుల శ్రీనివాస్, సోమయ్య, జనార్దన్, సత్యం, వైకుంఠం, సుగుణమ్మ ఉన్నారు. అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తదితరులు సంతాపం తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, ఉండి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గానికి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1994 లో టిడిపి విప్ గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏఐసీసీ మెంబర్‌గా కొనసాగుతున్న అప్పలనాయుడు కాంగ్రెస్ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అప్పలనాయుడికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి సాంబశివరాజు, విజయనగరం కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదా రామారావు తదితరులు ఉన్నారు. బొబ్బిలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌజన్య కూడా ఇదే సమయంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. -
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం
మల్లాపూర్(కోరుట్ల): ప్రభుత్వ వైఫల్యాలలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు అన్నారు. మల్లాపూర్ మండలంలోని రేగుంటలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మాధవేని ఆదిరెడ్డి కుటుంబాన్ని శుక్రవార పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ అయిన లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్గరీని ఏర్పాటు చేయాలని కోరారు. చెరుకురైతులు, కార్మికులతో కలిసి ప్రభుత్వం దిగివచ్చే దాక పోరాడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కటుకం గంగారెడ్డి, అధికార ప్రతినిధి బోయిని హన్మాండ్లు, ఓబీసీ మండల కన్వీనర్ వంగ అశోక్‌యాదవ్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, మండలయూత్ అధ్యక్షుడు శశిగౌడ్, నాయకులు సాయికుమార్, పెనుకుల మల్లేశ్, ప్రవీణ్, వంశీ పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి కన్నుమూత
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి చౌదరి (95) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1924 మార్చి 24న జన్మించిన రావి శోభనాద్రి తొలుత వామపక్ష పార్టీల సానుభూతి పరుడుగా దివంగత పుట్టగుంట సుబ్బారావు అనుచరునిగా ఉండేవారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో టీడీపీలో చేరారు. 1983లో గుడివాడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేయగా ఆయన విజయానికి రావి కృషి చేశారు. 1985లో ఎన్టీర్ గుడివాడ ఎమ్మెల్యేగా రాజీనామా చేయటంతో గుడివాడలో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా రావి శోభనాద్రి చౌదరి పోటీ చేసి విజయం సాధించారు. 1985 నుంచి 89 వరకు, 1994 నుంచి 99 వరకు గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు.1999లో శోభనాద్రి రాజకీయాల నుంచి తప్పుకున్నారు.