గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి(74) గురువారం తెల్లవారుజామున చనిపోయారు.
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి(74) గురువారం తెల్లవారుజామున చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని తులసి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన దుగ్గిరాల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెంకటరెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.