venkat reddy
-
చిన్న బిడ్డను కూడా వదలరా.. ఛీ మీ బతుకులు చెడ
-
నమ్మించాడు.. నట్టేట ముంచాడు
రాయవరం: రియల్ ఎస్టేట్ వ్యాపారినంటూ ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు తీసుకున్నాడు.3 నెలలుగా డబ్బులు అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో బాధితులు పదే పదే అడగడం ప్రారంభించారు. చివరకు ఇల్లు విడిచి పరారవ్వడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామం పల్లపువీధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(దొరబాబు) గ్రామంలోని పల్లపు వీధిలో నివాసం ఉంటున్నాడు. స్థిరాస్థిని కలిగి ఉండడం.. మోతుబరి కుటుంబాలతో ఇరువురు కుమార్తెలకు వియ్యం అందడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పడంతో పలువురు అతని వద్ద డబ్బులు మదుపు చేశారు. పలువురు రూ.లక్షలను దొరబాబు వద్ద ఉంచారు. మాచవరం, సోమేశ్వరం గ్రామాలతో పాటుగా, అనపర్తి మండలం పులుగుర్త, రామకోట తదితర గ్రామాలకు చెందిన 45 మంది దొరబాబు వద్ద పొదుపు చేసిన సొమ్మును మదుపు చేశారు. ఈ విధంగా సుమారు రూ.4.5 కోట్ల వరకు మదుపు చేసినట్లు బాధితులు తెలిపారు. 3 నెలలుగా దాచుకున్న డబ్బులను తమ అవసరార్థం తిరిగి ఇవ్వాలని దొరబాబును కోరినప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు విషయాన్ని స్థానిక గ్రామ పెద్దల వద్దకు తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడం.. దొరబాబు ఇంటి వద్ద లేక పోవడంతో బాధితులంతా దొరబాబు ఇంటి ముందు ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. తాము దాచుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలంటూ బాధితులు కోరారు. -
Big Question: గేమ్ ఛేంజర్ మీద ఉన్న శ్రద్ధ.. తిరుమల మీద లేదు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా..
-
ఏపీలో మళ్లీ ల్యాండ్ సర్వే.. తప్పుడు కూతలు కూసిన ఆ ముగ్గురినీ అరెస్ట్ చేయాలి..
-
కుట్ర విఫలమైందని ఏడుపు.. వందల కోట్లు తీసుకుని, రిటర్న్ గిఫ్ట్..
-
అన్న నాశనాన్ని కోరుకున్న చెల్లి..
-
ఎవరికీ తెలియని నిజం.. 1997లో మొదటి పెళ్లి.. 2008లో విడాకులు.. కానీ.. 2004లో
-
ఎల్లో మీడియాకి కావలిసింది ఇలాంటివే... వెంకట్ రెడ్డి ఫైర్
-
జగన్ ను అరెస్ట్ చేయాలి.. జైలుకు పంపాలి ఇదే బాబు గ్యాంగ్ టార్గెట్..
-
మంగళగిరిలో టీడీపీ హత్యా రాజకీయాలు
-
క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేలా.. ‘ఆడుదాం ఆంధ్ర’
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకటరెడ్డి) అన్నారు. బుధవారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి విశాఖపట్నంలో మంగళవారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారన్నారు. కబడ్డీలో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు బాధ్యత అప్పగించారన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్‌లో భాగంగా ప్రో కబడ్డీ క్యాంప్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమన్, బాలకృష్ణారెడ్డిలను, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కోచింగ్ క్యాంపునకు సంధ్య, సతీష్‌లను అప్పగించారన్నారు. దానికి కట్టుబడి వారిని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రో కబడ్డీ తరహా ఆంధ్ర కబడ్డీ లీగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, వైజాగ్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ ని కూడా కాదన్నారు..!
-
3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/రామన్నపేట/తుంగతుర్తి: ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్ఎస్ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని, నకిరేకల్ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. వంద రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ః జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ‹Ùరెడ్డి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వంద రకాలుగా ద్రోహం చేస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంచి పనులు చేసిందన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో వస్తుంది ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాబోతుందని హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని, మనం పనికిరారంటూ పక్కన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తుంగతుర్తి సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ రూ.15కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటల, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో, నకిరేకల్‌లో, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపనలు ప్రారంబోత్సవాలు చేశారు. -
బైజూస్ పై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు గూబ పగిలేలా కౌంటర్ ఇచ్చిన కారుమూరి వెంకట రెడ్డి
-
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
ప్రముఖ న్యాయ కోవిదుడు సత్తి వెంకట్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది సత్తి వెంకట్‌రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. వెంకట్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం సా యంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. సత్తి వెంకట్‌రెడ్డి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కవిటం గ్రామం. అక్కడే 1926, ఫిబ్ర వరి 25న జన్మించారు. 1951లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కొంత కాలం పాటు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత 1956లో హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. 1992–94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సత్తి వెంకట్‌రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా సేవలు అందించారు. ఆయన పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన ముగ్గురు కుమారులు న్యాయవాదులే. వెంకట్‌రెడ్డి అల్లుడు సీవీ మోహన్‌రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా వ్యవహరించారు. సత్తి వెంకట్‌రెడ్డి మృతి పట్ల పలువురు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. -
వేడెక్కిన మునుగోడు రాజకీయం
-
రామకృష్ణది పరువు హత్య కాదు
భువనగిరి క్రైం/గజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణది పరువు హత్య కాదని, ఆస్తి తగాదాల హత్యగానే భావిస్తున్నట్లు భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. హత్య కేసులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏ1గా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశం, ఏ2గా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల యాదగిరి (బీబీనగర్ పీఎస్‌లో హోంగార్డు), ఏ3గా వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన దంతూరి రాములు, ఏ4గా మోత్కూర్‌కు చెందిన సయ్యద్ లతీఫ్, ఏ5గా సిద్దిపేట జిల్లా యెల్లారెడ్డి నగర్‌కు చెందిన గోలి దివ్య, ఏ6గా సిద్దిపేట జిల్లా ఇందిరా నగర్ కు చెందిన మహ్మద్ అప్సర్, ఏ7గా సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌కు చెందిన పొలసం మహేశ్, ఏ8గా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన మహ్మద్ సిద్దిఖీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తోట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాశ్‌లను ఏ9, ఏ10, ఏ11 నిందితులుగా పేర్కొన్నారు. సోమవారం సయ్యద్ లతీఫ్, గోలి దివ్య, మహ్మద్ అప్సర్, పొలసం మహేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీపీ చెప్పా రు. నిందితుల నుంచి ఓ బొమ్మ పిస్టల్, రెండు కొడవళ్లు, సుత్తి, రూ.లక్ష నగదు, ఇండికా కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. జమ్మపురం సర్పంచ్ అమృతరావును సాక్షిగా పేర్కొన్నారు. నిమ్మతోటలోకి తీసుకెళ్లి.. భూమిని చూపించడానికి జమ్మపురం సర్పంచ్ అమృతరావు ఈ నెల 15న రామకృష్ణను భువనగిరి పట్టణంలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లారు. అమృతరావుతో వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో భార్గవి 16న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమృతరావును పోలీసులు విచారించగా లతీఫ్ అతని అనుచరులు రామకృష్ణను గుండాల మండలం రామారంలోని నిమ్మతోటలోకి తీసుకెళ్లి తాడుతో కట్టి సుత్తి, బండ రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారని చెప్పినట్టు ఏసీపీ తెలిపారు. శవాన్ని గోనె సంచిలో కట్టి టాటాబోల్ట్ కారులో పెట్టి అమృతరావును కూడా ఎక్కించుకుని బయలుదేరారని, కిలోమీటరు దూరం వచ్చాక అతన్ని అక్కడే వదిలేశారని, ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు సిద్దిపేటకు వెళ్లినట్లు తెలిపారు. అమృతరావు సమాచారం మేరకు లతీఫ్, అతని భార్య దివ్య, మహేశ్, అప్సర్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు చెప్పారు. ఆస్తి కోసం మామను బెదిరించడంతో.. కొంతకాలం కిందట రామకృష్ణ ఉద్యోగం పోవడంతో మామ వెంకటేశంను ఆస్తిలో భాగం ఇవ్వాలని, లేకపోతే కోర్టులో కేసు వేస్తానని రామకృష్ణ బెదిరించాడని, దీన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశం రామకృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడని ఏసీపీ తెలిపారు.హోంగార్డు యాదగిరి ద్వారా రూ.10 లక్షలకు లతీఫ్‌తో సుపారీ మాట్లాడుకుని రూ.6 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారన్నారు. గుండాల మండలం రామారంలో దారుణంగా హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం గ్రామంలోని కొండపోచమ్మ దేవాలయం దగ్గరలోని గోతిలో పాతిపెట్టారన్నారు. విచారణలో ఈ విషయాన్ని పోలీసులకు లతీఫ్ తెలపగా వెంటనే అక్కడికెళ్లి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు. తల, మెడ భాగాల్లో తీవ్రగాయాలు రామకృష్ణ తలకు తీవ్ర గాయమైందని, మెడ చుట్టూ ఉరేసినట్టు స్పష్టమైన గాయం కనిపిస్తోందని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించారు. నుదుటిపై, తల వెనుకభాగంలో గాయాలున్నాయన్నారు. చెవులు, ముక్కులోంచి రక్తం వచ్చిందని.. వీపు వెనుక కూడా గాయాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మూత్రం పోసే నాళం వద్ద కూడా బలమైన గాయం కనిపించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి తీసుకెళ్లారు. 6 నెలల పసికందు, భార్గవికి అన్యాయం చేశారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
సీఎం జగన్ చల్లగా ఉండాలంటూ.. అమ్మవారికి మొక్కు..
అనపర్తి (తూర్పుగోదావరి): అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకోసారి నిర్వహించే సత్తెమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించారు. సావరానికి చెందిన కర్రి వెంకటరెడ్డి పుట్టుకతో అంధుడు. నిరాశ చీకట్లు అలముకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల పంట సచివాలయంలో ఇతనికి వెల్ఫేర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం వృద్ధుని వేషం వేసుకుని అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. సీఎం జగన్ చల్లగా ఉండాలని కోరుకుంటూ స్నేహితుడు తాడి గోపికృష్ణారెడ్డి(మహిళ వేషధారి)తో కలసి అమ్మవారికి “ముసలోడికి దసరా పండుగ’ వేషధారణలో మొక్కు తీర్చుకున్నాడు వెంకటరెడ్డి. బీ టెక్.. డిఫరెంట్ లుక్ : అఖండ వేషధారణలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్.వీర్రాఘవరెడ్డి అదుర్స్ : పండితుల వేషధారణలో గ్రామస్తులు తగ్గేదే లే : పుష్ప సినిమాలోని వేషధారణలో యువకులు చదవండి: (మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!) -
చిత్రపురిలో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కవాడిగూడ (హైదరాబాద్): చిత్రపురి భూ కబ్జాలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి పేద సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలను అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చే శారు. చిత్రపురి సొసైటీలో వందకోట్ల రూపాయల అవి నీతి జరిగిందని అధికారులు నివేదికలు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో పేద సినిమా కార్మికుల న్యాయపోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాలను కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటున్నారని అన్నారు. చిత్రపురి పేద సినీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుం దని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుత సొసైటీ పాలక మండలి సభ్యులు కార్మికుల సొంతింటి కలను నిర్వీర్యం చేస్తూ పేదల స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేటాయించి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నా రని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి సొసైటీలో జరిగే అవినీతి పై చర్యలు చేపట్టి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైందన్నారు. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సీఎం గా ఉన్నపుడే భారీ అక్రమ మైనింగ్
-
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని వెల్లడించారు. దానివల్ల రూ.230 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, 2014 నుంచి 2019 వరకు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ తెరలేపారని అన్నారు. ఆండ్రూస్ మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ అయిందని తెలిపారు. టీడీపీ నేతలతో ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా 2లక్షల టన్నుల మైనింగ్ చేసినట్టు నిర్ధారించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు రూ.12.5 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వేదాంత, విదేశాలకు సరఫరా చేయడంతో బాక్సైట్ తవ్వినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు డీఎంఎల్ విచారణ చేశామని తెలిపారు. ఇప్పుడు మైనింగ్ జరిగిన ప్రాంతంలో విచారిస్తున్నామని, డ్రోన్ ద్వారా సర్వే మొదలుపెట్టామని పేర్కొన్నారు. వందల కోట్లు అక్రమాలు జరిగాయని, వాటన్నింటి పైనా ఇప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ అధికారుల పాత్ర ఉన్నా సరే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చదవండి: లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్ -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి చేరుకున్నారు. అక్కడ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు అఖిలరెడ్డి, గౌతమ్‌రెడ్డిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్‌తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. -
ఇక నుంచి కమీషన్ 15 శాతమే
హైదరాబాద్: ఓటా, ఓయో ఆన్లైన్ బుకింగ్ సంస్థలకు ఇకనుంచి 15 శాతం కమీషన్‌ను మాత్రమే చెల్లిస్తామని, కాదంటే వచ్చేనెల 1 నుంచి దేశవ్యాప్తంగా హోటల్ ఆన్లైన్ బుకింగ్స్‌ను నిలిపివేస్తామని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ రెండు సంస్థలు తమ వ్యాపారాన్ని నిలువునా ముంచేసి రోడ్డున పడేలా చేశాయని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తమకు ఆన్లైన్ ద్వారా వ్యాపారాన్ని కల్పించి లాభపడేలా చేస్తామంటే బడ్జెట్ కేటగిరీ హోటల్స్ నిర్వాహకులమంతా ఈ సంస్థల్లో చేరామని తెలిపారు. ఇలా వ్యాపారాన్ని చూపించినందుకుగాను వారికి 10 నుంచి 18% కమీషన్ ఇచ్చామన్నారు. అయితే, ఈ కమీషన్ ఇప్పుడు 40 శాతానికి చేరు కుందని, దీంతో తాము భారీగా నష్టపోతున్నామన్నారు. దేశవ్యాప్తంగా హోటల్ యాజమాన్యాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. వీరి వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. 25 నుంచి గదులు ఇచ్చేది లేదు తమ డిమాండ్లకు ఆన్లైన్ బుకింగ్ సంస్థలకు ఒప్పుకోకుంటే ఈ నెల 25 నుంచి తమ హోటల్స్, లాడ్జీల్లో గదులు ఇచ్చేది లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హోటల్ రూమ్ వాస్తవ ధర రూ.1,500 ఉంటే వినియోగదారుల నుంచి రూ.2 వేలు వసూలు చేసి తమకు మాత్రం కేవలం రూ.700 ఇస్తున్నారన్నారు. రూమ్లపైనే కాకుండా ఫుడ్ వంటి వాటిపై కూడా తమ వద్ద డబ్బులు గుంజుతున్నారని వాపోయారు. రూ.వెయ్యిపైన వ్యాపారం జరిగితేనే పన్ను కట్టాలని, కానీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా తమకు రూ.600, 700 మాత్రమే వస్తోందని హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. ఆఫర్లు అంటూ చూపించే వెబ్సైట్లను ప్రజలు నమ్మవద్దని, నేరుగా వస్తే తక్కువ ధరల్లోనే రూమ్‌లను ఇస్తామని చెప్పారు. -
చెప్పినా..పట్టించుకోరా?
చిత్తూరు ఎడ్యుకేషన్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే సరిగా స్పందిం చడం లేదని జెడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య ధోరణిని వారు సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా 1, 7 కమిటీ సమావేశాలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, పుంగనూరు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా జిల్లా పరిషత్ ఆర్థిక పరిస్థితి అడుగుతున్నా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దీంతో పాలకమండలిని అనుమానించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ జెడ్పీటీసీలకు, వెంకటరెడ్డి యాదవ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పందించిన చైర్పర్సన్ ఆర్థిక పరిస్థితుల నివేదికలను సభ్యులకు అందజేయడంతో వారు శాంతించారు. వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ పుంగనూరు పాలెంపల్లి పంచాయతీ దగ్గరాజుచెరువుకు ఆయకట్టు అవసరముందని ఇరిగేషన్ అధికారులను కోరారు. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే స్థలం అన్యాక్రాంతమవుతోందన్నారు. జెడ్పీ బడ్జెట్లోని ఆస్తు ల సంరక్షణ నిధులను గోడ నిర్మాణానికి విడుదల చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని నాలుగు సంవత్సరాలుగా చెబుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దళితవాడల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులను ఎందుకు శుద్ధి చేయించడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సభ్యులు ప్రశ్నించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరా రు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం లేదని సభ్యులు మండిపడ్డారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఆస్తుల రిజిస్టర్లను అమలు చేయాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పూతలపట్టు హైవే, చిత్తూరు గాంధీ రోడ్డు నుంచి అరగొండ వరకు ఇష్టానుసారం స్పీడ్ బ్రేకర్లు వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతున్నా ప్రశ్నించరా.. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని పాలకమండలి సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని సభ్యులు ప్రశ్నించారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎన్నికైనప్పటి నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక ఉత్సవవిగ్రహాల్లా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సభ్యులందరూ ఐక్యంగా పోరాడాలని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ పిలుపునిచ్చారు. విద్యుత్ ఎస్ఈపై చైర్పర్సన్ ఆగ్రహం.. స్థాయీ సంఘ సమావేశాలకు హాజరుకాని విద్యుత్ శాఖ ఎస్ఈపై జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారమివ్వకుండా నిలిచిపోయిన ఇతర శాఖల జిల్లా అధికారులకు మెమోలు జారీచేయాలని ఆమె ఆదేశించారు. కారణం లేకుండా గ్రామాల్లో ఇష్టానుసారంగా కరెంట్ కోత విధిస్తున్నారని చైర్పర్సన్ మండిపడ్డారు. దొంగలున్నారని గ్రామాల వాసులు భయపడుతుంటే రాత్రుల్లో కరెంట్ కట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సంఘ సమావేశాల్లో కోరం లేక 3, 4, 6 వాయిదా పడ్డాయి. సమావేశాల్లో ఇన్చార్జి సీఈఓ రవికుమార్ నాయుడు, ఏఓలు ప్రభాకర్‌రెడ్డి, వెంకట రత్నం, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
తార్నాకలో ఏవీ హైమా!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌కు చెందిన ప్రముఖ డెవలపర్ అర్నవ్ విశిష్ట (ఏవీ) కన్స్ట్రక్షన్స్ తార్నాకలోని స్ట్రీట్ నంబర్–2లో ఏవీ హైమా రెసిడెన్సీ పేరిట లగ్జరీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. పూర్తి వివరాలు ఏవీ కన్స్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి జక్కా తెలిపారు. ♦ 3,700 గజాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం ఐదంతస్తుల్లో ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో 10 ఫ్లాట్లు.. మొత్తం 50 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 1,225 నుంచి 1,830 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. సెల్లార్+స్టిల్ట్ పార్కింగ్ కోసం కేటాయించాం. ♦ వసతుల విషయానికొస్తే.. పవర్ బ్యాకప్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్, ల్యాండ్‌స్కేపింగ్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, ఇంటర్‌కమ్ ఫెసిలిటీ, సోలార్ ఫెన్సింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింట్ పిట్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నాం. ♦ నిర్మాణ పనులు తొలి అంతస్తు శ్లాబ్ లెవల్లో ఉంది. వచ్చే ఏడాదికి నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటివరకు ఏవీ కన్స్ట్రక్షన్ నుంచి 4 వెంచర్లలో 1,000 ఓపెన్ ప్లాట్లు, 25 అపార్ట్మెంట్లలో 1,000కి పైగా ఫ్లాట్లను అభివృద్ధి చేశాం. వచ్చే ఏడాది కాలంలో 500 ఓపెన్ ప్లాట్లు, 100 ఫ్లాట్లను నిర్మించాలని లకి‡్ష్యంచాం. -
హౌ డేర్ యూ..!
ఒంగోలు టౌన్: ‘జిల్లాలోని సీపీడబ్ల్యూ స్కీమ్స్‌కు సంబంధించి 1000 కోట్ల రూపాయల పనులతో ప్రతిపాదనలు చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారపక్ష ఎమ్మెల్యేలనే పిలుస్తారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవరా? తమ నియోజకవర్గాలకు తెలియకుండా పనులు ఎలా చేస్తారు. ఎమ్మెల్యే హక్కులు, గౌరవం కాలరాసే అధికారం ఎవరిచ్చారు? ఈ విషయమై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం. ప్రివిలైజేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళతాం’ అని సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక టీటీడీసీ మీటింగ్ హాలులో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ (దిశ)లో ఈమేరకు స్పందించారు. సమావేశం జరుగుతున్న పోడియం వద్ద పలువురు ఎంపీపీలతో కలిసి కొద్దిసేపు బైఠాయించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తమకు తెలియకుండా నియోజకవర్గంలో పనులపై ఎలా ప్రతిపాదనలు చేస్తారని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులను నిలదీశారు. ఏ పనులకు ప్రతిపాదనలు చేశారో కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే అధికారులకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ మండిపడ్డారు. కనీసం తమ నియోజకవర్గంలో ఏమి ప్రతిపాదనలు పెట్టారో కూడా ఇంతవరకు చెప్పలేదని తెలిపారు. తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులకు తాము లేకుండా ఎవరి కోసం ప్రపోజల్స్ పెట్టారని నిలదీశారు. ఈ విషయమై రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవాలా? మార్కాపురం శాసన సభ్యుడు జంకె వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ తన నియోజకవర్గంలో అంగన్వాడీ భవన నిర్మాణాన్ని ప్రారంభించినా తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. మాజీ శాసనసభ్యునితో అంగన్వాడీ భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు. లోకల్ ఎమ్మెల్యేని పిలవాలన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారని మండిపడ్డారు. పొదిలిలో వికలాంగులకు ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలు తాను లేకుండా ఎలా ఇస్తారని.. మాజీ ఎమ్మెల్యేతో ఎలా ఇప్పిస్తారని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్నెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను పక్కన పెట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలి శాసనసభ్యులకు తెలియకుండా వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నెలరోజుల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారని.. ఈ విషయమై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి అధికారులను సస్పెండ్ చేసేవరకు ధర్నాకు కూర్చోవాలన్నారు. కొనకనమిట్ల ఎంపీపీ రామనారాయణరెడ్డి మాట్లాడుతూ మండలంలో జరిగే సమీక్ష సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదన్నారు. చినారికట్ల గ్రామ పంచాయతీ సమావేశం గత ఏడాది సెప్టెంబర్‌లో పంచాయతీ సమావేశం తేదీని ప్రకటించి, మరో తేదీలో సభ్యులు లేకుండా ఏకపక్షంగా తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏకపక్షంగా తీర్మానాలు చేస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి జోక్యం చేసుకుంటూ మార్కాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యునికి సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా పనులు ప్రారంభించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఐసీడీఎస్, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. -
‘కేసీఆర్‌కు వ్యవసాయంపై అవగాహన లేదు’
నల్లగొండ టూటౌన్: వ్యవసాయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఏ మాత్రం అవగాహన లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదముందని మండిపడ్డారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ఏదో చేసినట్టుగా గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్‌కు పోయే కాలం దగ్గరికొచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఒక మోసగాడి చేతిలో మోసపోయిందని, రాష్ట్రం ఏర్పడ్డ సంతోషం లేకుండా చేశారని అన్నారు. -
ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్‌దారుల సెల్ కన్వీనర్‌గా వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్‌దారుల సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నియామక పత్రాన్ని అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పేరి వెంకట్‌రెడ్డి పీఆర్టీయూ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్లు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా 9 ఏళ్లు పనిచేశారు. పదవీ విరమణ అనంతరం ఇటీవల బీజేపీలో చేరారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షన్‌దారుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. -
తాకట్టులో విద్యార్హత!
♦ ఫీజులు చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే.. ♦ మూడేళ్లు దాటినా బకాయిల ఊసెత్తని సర్కారు ♦ ఫీజులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటున్న కాలేజీలు ♦ చెల్లించలేక కాలేజీల్లోనే వదిలేసిన విద్యార్థులు ఉప్పల్‌కు చెందిన వెంకట్‌రెడ్డి.. ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 2013–14లో ఎంటెక్ పూర్తి చేశాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫీజు బకాయిలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కాలేజీ యాజమాన్యానికి అతని ఫీజు అందలేదు. దీంతో టెన్త్, ఇంటర్, బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లను ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని యాజమాన్యం తమ వద్దే ఉంచుకుంది. సర్టిఫికెట్లు అవసరమైతే బకాయిలకు సంబంధించి మొత్తాన్ని డీడీS రూపంలో ఇచ్చి తీసుకెళ్లవచ్చని, సర్టిఫికెట్లు వెనక్కు ఇస్తే డీడీ ఇస్తామని వెసులుబాటు కల్పించింది. పోటీ పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వూ్యలు తదితర సందర్భాల్లో వెంకట్‌రెడ్డి అప్పు చేసి కాలేజీలో డీడీలు సమర్పించి సర్టిఫికెట్లు పొందడం.. తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తెచ్చుకోవడం చేస్తున్నాడు. రాష్ట్ర విభజన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన పథకాలపై నెలకొన్న అయోమయం ఇప్పటికీ తీరలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిధుల కేటాయింపులు, విడుదల సక్రమంగా ఉన్నప్పటికీ.. విభజన సమయం లో నెలకొన్న బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తడం లేదు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం నానా అవస్థలు పడుతున్నా రు. 2013–14 విద్యా సంవత్సరంలో దాదాపు 1.18 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ.248.05 కోట్ల మేర ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. సాధారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన చెల్లింపులను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాతి ఏడాదిలో విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఆ ప్రకారం 2013–14కు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఉపకార వేతనాలు 2014–15లో ఇవ్వాలి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు విభాగాల విభజన ఆలస్యం కావడంతో ఆ ఏడాది నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఈ క్రమంలో వార్షిక సంవత్సరం చివర్లో బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినప్పటికీ పూర్తిస్థాయి నిధులు విడుదల కాలేదు. ఖజానా విభాగం వద్దే పలు బిల్లులు 2013–14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తెలంగాణ జిల్లాల నుంచి 14.31 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతను నిర్ధారించిన అధికారులు రూ. 2,296.20 కోట్లు అవసరమని లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో 2014–15 వార్షిక సంవత్సరం చివర్లో నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతన బిల్లులను సంక్షేమ అధికారులు పాస్ చేశారు. ఆయితే వీటిలో పలు బిల్లులు ఖజానా విభాగంలోనే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు నిధులు విడుదల కాకుండా బ్రేక్ పడింది. ఇలా మొత్తంగా రూ. 248.05 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ బకాయిలను విడుదల చేయాలని సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినప్పటికీ స్పందన మాత్రం శూన్యం. దీంతో ఆయా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధ్రువపత్రాలన్నీ కాలేజీల్లోనే.. రీయింబర్స్మెంట్ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాక సంబంధిత విద్యార్థుల ధ్రువపత్రాలు కాలేజీల్లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలను ఇస్తామని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి. దీంతో ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు తక్కువ మొత్తంలో ఫీజులుండటంతో చెల్లింపులు జరిపి సర్టిఫికెట్లు తీసుకోగలిగారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివిన విద్యార్థులు మాత్రం పెద్ద మొత్తంలో ఫీజులు బకాయి పడటంతో చాలామంది తమ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాల వద్దే వదిలేశారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగ దరఖాస్తు సమయంలో కాలేజీల్లో బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని డీడీ రూపంలో సమర్పించి వాటిని తాత్కాలిక పద్ధతిలో తెచ్చుకోవడం, తిరిగి కాలేజీలో సమర్పించి డీడీని వెనక్కు తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు డీడీ చార్జీల భారం మించిపోతోంది. ఇందులోనూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల అవసరాన్ని బట్టి ఫీజులను నిర్ధారించాయి. రెండుసార్లు డీడీలు ఇచ్చా.. ‘పీహెచ్డీ కౌన్సెలింగ్, అడ్మిషన్ సమయంలో రెండుసార్లు ఎంటెక్ సర్టిఫికెట్లు అవసరమైతే రూ.20 వేల మేరకు డీడీలు తీసి కాలేజీలో సమర్పించా. ప్రక్రియ ముగిశాక తిరిగి డీడీలను తీసుకున్నా’ అని ఓయూలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని సుష్మ ‘సాక్షి’తో అన్నారు. -
పారామెడికోస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ టౌన్: పారామెడికోస్ శిక్షణను గ్రామీణ వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం చిన వెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం పదో వార్షికోత్సవ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్యారోగ్యశాఖ పథకాలు విజయవంతం కావడంలో గ్రామీణ వైద్యులు అందిస్తున్న సహకారం మరవలేనిదర్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో సంఘం సభ్యత్వాలను పూర్తి చేసి సంఘాలన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తుందన్నారు. అంతకు ముందు సంఘం జిల్లా కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లాగౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ర్ట గౌరవ సలహాదారు బి.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు డిఎస్ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి శ్రీనివాసరాజు, కోశాధికారి జి.రాజశేఖర్‌రావు, ఉపాధ్యక్షుడు వనం యాదగిరిరావు, ప్ర చార కార్యదర్శి బ్రహ్మచారి, నర్సింహారెడ్డి, పి.వెంకటేశ్వర్లుగౌడ్, ఎ.కృష్ణారెడ్డి, ఎం.మధనాచారి, ఎ.యాదగిరి, నజీరుద్దిన్, పి.లలిత, కె.విజయేందర్‌రెడ్డి, మణికుమారి, వెంకటాచారి, ప్రభుదాస్, జహాంగీర్, వాసుదేవులు, చంద్రశేఖర్, కుతుబుద్దిన్, వీరన్న పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి(74) గురువారం తెల్లవారుజామున చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని తులసి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన దుగ్గిరాల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెంకటరెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
టీచర్లను అవమానించడమే
- పీఆర్టీయూ అధ్యక్షుడి సస్పెన్షన్‌పై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డిని సస్పెండ్ చేయడం టీచర్లను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. బడిబాట సమీక్షలో హెచ్ఎంలను దూషించిన మహబూబ్‌నగర్ కలెక్టర్ తీరును ప్రశ్నించినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని పేర్కొన్నాయి. పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా విలేకరుల సమావేశం పెట్టినంత మాత్రాన ఎలా సస్పెండ్ చేస్తారని పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి, కలెక్టర్ తీరుపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్ల పట్ల అవమానకరంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని టీపీటీఎఫ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీచర్లను బదిలీ చేసిన కలెక్టర్.. ఉపాధ్యాయ సంఘాల నేతలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెన్నయ్య, రవిశంకర్‌రెడ్డి, షౌకత్ అలీ తదితరులు ప్రశ్నించారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. -
బైక్ రేసింగ్‌లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
బైక్ రేసింగ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ఏకకాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి నేతృత్వంలో రెండు ప్లటూన్ల పోలీసు బలగాలు, 20 మంది పోలీసులు పది పికెట్లు ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుతో పాటు కేబీఆర్ పార్కు వరకు బైక్ రేసింగ్‌లపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు అదుపు తప్పిన వేగంతో దూసుకుపోతున్న 35 స్పోర్ట్స్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది యువకులపై కేసులు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులందరికీ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరంతా పబ్‌లలో, కాఫీ షాప్‌లలో మద్యం సేవించి బయటకు వచ్చి నిర్మానుష్యమైన రోడ్లమీద పందెం కాస్తూ బైక్‌లపై దూసుకుపోతున్నట్లు పోలీసులు తెలిపారు. -
వచ్చే వారంలో హైదరాబాద్‌కు కన్హయ్య
బీజేపీ కుట్రలను ఎదుర్కొనేందుకు సభలు: చాడ సాక్షి, హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఈ నెల 22న లేదా 24న హైదరాబాద్‌కు రానున్నారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన అనంతరం నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలకు దిగుతోందని విమర్శించారు. ఈ కుట్రలను ఎదుర్కొనేందుకు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు, దీనిలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో కన్హయ్య పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, జి.మల్లేష్లతో కలసి ఆయన విలేకరులకు తెలిపారు. రాష్ర్టంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మరో వెయ్యి గ్రామాలకు పార్టీని విస్తరించనున్నట్లు తెలియజేశారు. -
విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు దుర్మరణం
రెంటచింతల: గుంటూరు జిల్లా రెంట చింతల మండలం పాతపాల్వాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం బోరుకు విద్యుత్ వైర్లు బిగిస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. పాతపాల్వాయి గ్రామానికి చెందిన మందలపు శ్రీనివాసరెడ్డి(42), మందలపు వెంకటరెడ్డి(40) అనే రైతులు ఇద్దరూ అన్నదమ్ములు. వీరు కొత్తగా తవ్విన బోరుకు కరెంట్ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యుత్ వైరు లాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వైర్లు తగిలి షాక్ కొట్టడంతో అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కొర్రపాటి కాశి అనే మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108లో గుంటూరు ఆస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ భార్యా పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
బైక్-ఆటో ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానిక వైఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్స్‌పాల్ చంద్రశేఖర్ రెడ్డి మరో ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డితో కలిసి బైక్ పై సింహాద్రిపురం నుంచి పులివెందుల వెళ్తుండగా.. సబ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఇది గుర్తించిన స్థానికులు వారిని వెంట నే 108 సాయంతో ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
అనగనగా ఓ క్రైమ్ కథ
అనాథల్లా పెరుగుతున్న పిల్లల్లో కొంతమందికి సరైన మార్గనిర్దేశం లేక క్రిమినల్స్‌గా మారుతున్నారు. అలాంటి వారి జీవితాల చుట్టూ సాగుతూ, క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్య, శిల్ప ముఖ్యతారలుగా నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో డా. ఎ.వి.ఆర్ సుబ్రమణ్యం కీలక పాత్ర పోషించి, నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘కమర్షియల్ హంగులతో సాగే సందేశాత్మక చిత్రమిది. ఈ నెల 27న పాటలు, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఆర్.సన్నీ, సహ-నిర్మాత: తంగిరాల అపర్ణ. -
అక్రమ కేసులపై ప్రజా ఉద్యమం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మా సహనాన్ని, మంచితనాన్ని చేతగానితంగా భావించొద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసులను ఉసిగొల్పి అక్రమ కేసుల బనాయిస్తున్నారు. వీటికి ఎంతమాత్రం భయపడేది లేదు. అక్రమ కేసులపై ప్రజా ఉద్యమం చేపడతాం.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రకటించారు. కర్నూలులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత, మణిగాంధీ, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి తదితరులు మాట్లాడారు. భూమా నాగిరెడ్డి ఆరోగ్యంపై వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ను ఈ సందర్భంగా నేతలు మీడియాకు చూపించారు. ఇప్పటికే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగిందని.. బీపీ, షుగర్ వ్యాధులతో బాధ పడుతున్నారన్నారు. అయినప్పటికీ నిమ్స్‌కు తరలించేందుకు ఎస్కార్ట్‌ను ఇవ్వలేమని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విచారణ పేరుతో పోలీసు స్టేషన్లో కేబినెట్ ర్యాంకు కలిగిన పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే కూడా అయిన భూమా నాగిరెడ్డిని ఆరు గంటల పాటు ఉంచుకోవడం పోలీసుల వైఖరికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా సరైన సర్టిఫికెట్లు కూడా చూపకుండా జడ్జి ఎదుట తెల్లవారుజామున ప్రవేశపెట్టడాన్ని వారు తప్పుబట్టారు. టీడీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారు కొద్దిరోజుల క్రితం టీడీపీ సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులతో అణచివేయిస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వీరు గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలీసులతో అక్రమ కేసులను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే భూమా నాగిరెడ్డిపై అనేక కేసులు పెట్టారని, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రెడ్డిపైనా కేసులను నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. భయపడేవాళ్లు కర్నూలు జిల్లాలో రాజకీయాలు చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. అక్రమ కేసులపై ప్రజా ఉద్యమం చేపడతామని.. జాతీయ రహదారులను సైతం దిగ్బంధిస్తామని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వేధింపులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. భూమా నాగిరెడ్డికి ఏదైనా జరిగి... రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అందుకు కర్నూలు జిల్లా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా కులం పేరుతో దూషించినట్టు లేదన్నారు. ఒక ఎమ్మెల్యేను పోలీసులు చేయి పట్టుకు నెడితే.. డోంట్ టచ్ మీ అనడం సహజమని, ఎమ్మెల్యేతో ప్రవర్తించే ప్రొటోకాల్ ఇదేనా అని నిలదీశారు. నిజంగా కులం పేరుతో దూషిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంలో తప్పులేదని.. కేవలం వేధించేందుకు ఈ చట్టాన్ని ప్రయోగించడం మంచి పద్ధతి కాదన్నారు. ఉన్నతస్థాయిలోని అధికారులు ఈ విధంగా చేస్తే.. ఇక కిందనున్న పోలీసులు దొంగ కేసులను నమోదు చేయడం అలవాటుగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీతో ఉండకపోతే ఖబడ్డార్ అని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. -
దయ చూపరూ...
(సాక్షిప్రతినిధి, అనంతపురం) : ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపం వెరసి... రైతులకు శాపంగా మారింది. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా మూడేళ్లుగా ‘అనంత’కు కృష్ణా జలాలను తీసుకొస్తున్నా.. ఒక్క ఎకరాను కూడా తడపలేకపోతున్నారు. ఫలితంగా నీరంతా వృథా అవుతోంది. అందుకోసం ఖర్చు చేస్తున్న డబ్బు కూడా ‘నీటి’పాలవుతోంది. సాగు, తాగునీటి కష్టాలు రాయలసీమ వాసులకు తెలిసినట్లుగా రాష్ట్రంలో మరెవ్వరికీ తెలియవు. కరువు సీమలో ప్రతి నీటిబొట్టూ విలువైనదే. కాబట్టి ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. అందులోనూ హంద్రీ-నీవా ద్వారా ఎన్నో వ్యయప్రయాలకోర్చి కృష్ణా జలాలను జిల్లాకు తెస్తున్నారు. ఇందుకోసం ఖర్చు పెట్టే ప్రతిపైసా రైతులకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే.. గత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత టీడీపీ సర్కారుగానీ ఆ ప్రయత్నం చేయడం లేదు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేలా హంద్రీ-నీవా పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం పనులు మూడేళ్ల కిందటే 80 శాతం మేర పూర్తయ్యాయి. శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు సమృద్ధిగా చేరితే బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ-నీవా కాలువలోకి లిఫ్ట్ చేస్తారు. మూడేళ్లుగా మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకూ ఎనిమిది లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక టీఎంసీ నీరు ఎత్తిపోసేందుకు తొమ్మిది రోజులు పడుతుంది. ఇందుకు 2012-13లో రూ.8-10 కోట్ల కరెంటు బిల్లు వచ్చేది. ప్రస్తుతం రూ.12 కోట్లు వస్తోంది. గత ఖరీఫ్, రబీలో(2014-15)లో 16.9 టీఎంసీల నీరు జిల్లాకు వచ్చింది. అంటే ఈ నీటిని జిల్లాకు తీసుకొచ్చేందుకు కేవలం కరెంటు బిల్లుల రూపంలోనే దాదాపు రూ.204 కోట్లు ఖర్చయ్యాయి. నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం ఒక టీఎంసీ నీటిని పది వేల ఎకరాలకు అందించొచ్చు. అంటే 2014-15లో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుండేది. అదే డ్రిప్‌ను అనుసంధానం చేసివుంటే రెండు లక్షల ఎకరాలకు పైగానే ఆయకట్టు సాగులోకి వచ్చేది. అయితే.. ఒక్క ఎకరాకు కూడా ప్రభుత్వం నీరందించలేకపోయింది. నీటిని పూర్తిగా హెచ్చెల్సీ జలాల్లో కలిపి వినియోగించడం, చెరువులకు నింపామని ప్రకటనలు గుప్పించడం మినహా పూర్తిస్థాయి వినియోగంపై చిత్తశుద్ధి చూపలేదు. చిత్తశుద్ధి అవసరం.. మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకూ హంద్రీ-నీవా ప్రధాన కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే.. ఎక్కడా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ(ఉప, పిల్లకాలువలు)ను ఏర్పాటు చేయలేదు. ఇందుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే ఆరు నెలల్లో ప్రధాన కాలువతో పాటు రిజర్వాయర్ల నుంచి రైతుల పొలాలకు నీరు చేరేందుకు ఉప, పిల్ల కాలువలను నిర్మించొచ్చు. ఈ ఏడాది 20 టీఎంసీలకు తక్కువ లేకుండా కృష్ణా జలాలు జిల్లాకు చేరే అవకాశముంది. ఈ నీటిని రెండు లక్షల ఎకరాలకు అందించొచ్చు. ఇదే జరిగితే జిల్లాలో ఇప్పుడున్న ఆయకట్టు కాకుండా కొత్తగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. తద్వారా రైతులు బంగరుపంటలు పండించే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ. 221 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కరెంటు బిల్లులు రూ.204 కోట్లు, ఉద్యోగుల వేతనాలకు రూ.70 కోట్లు కలిపి.. మొత్తం రూ.274 కోట్లు అవసరం. అంటే కేటాయించిన నిధులు కాకుండా ప్రభుత్వమే రూ.53 కోట్లు బాకీ పడుతుంది. ఈ క్రమంలో జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కృష్ణా జలాలవినియోగానికి అనుకూలమైన పరిస్థితులను సీఎం చంద్రబాబుకు వివరించి రూ.200 కోట్లు విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముంది. అలాచేస్తే ‘అనంత’కు కొంతైనా మేలుచేసిన వారవుతారు. ‘చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో హంద్రీ-నీవాను గాలికొదిలేసి ‘అనంత’కు తీరని అన్యాయం చేశారు. కనీసం ఇప్పుడైనా చిన్నసాయంగా రూ.200 కోట్లు విడుదల చేసి జిల్లాను ఆదుకోవాల’ని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
సీపీఐ సారథిగా ‘చాడ’
కరీంనగర్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర తొలి కార్యదర్శిగా జిల్లాకు చెందిన చాడ వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. ఈనెల 7నుంచి 10వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో మంగళవారం రాష్ట్ర శాఖకు నూతన కార్యవర్గాన్ని, కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్ ఒకటిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నూతన కార్యదర్శులను అప్పటి రాష్ట్ర పార్టీ తాత్కాలిక కమిటీలను వేసి నియమించింది. తెలంగాణ రాష్ట్ర శాఖకు చాడ వెంకటరెడ్డిని తాత్కాలిక కార్యదర్శిగా జాతీయ సమితి నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు ఆనంతరం తొలిసారిగా ఖమ్మంలో నాలుగు రోజుల పాటు జరిగిన సీపీఐ మహాసభల్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్.రామయ్య, టి.లక్ష్మణ్, బి.అశోక్, కర్రె భిక్షపతి, కూన శోభరాణి, గూడెం లక్ష్మి, పి.కేదారి, ఎం.నారాయణ ఎన్నికయ్యారు. రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఎం.నారాయణ నియమితులయ్యారు. అంచలంచెలుగా ఎదిగిన చాడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన చాడ వెంకటరెడ్డి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని అంచలంచెలుగా ఎదిగారు. చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన చాడ వెంకటరెడ్డి మొదట ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అనంతరం గ్రామంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంలో స్వగ్రామంలో ది హాలిక్ శ్రమజీవి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యదర్శిగా ఎన్నికయ్యూరు. సొసైటీని అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలిచారు. 1981లో రేకొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987 నుంచి వరుసగా మూడుసార్లు చిగురుమామిడి మండ పరిషత్ అధ్యక్షుడిగా, ఒకసారి జెడ్పీటీసీగా రాజకీయ పదవులను అలంకరించారు. అదే సమయంలో హుస్నాబాద్ తాలుకా సీపీఐ కార్యదర్శిగా మూడుసార్లు, సీపీఐ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ సమితి సభ్యుడిగా కొనసాగుతూనే.. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. ఉమ్మడి రాష్ట్రంలో సీపీఐ శాసనసభా పక్షనేతగా అసెంబ్లీలో పార్టీ బాణిని బలంగా వినిపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీ ఆయనకు తగిన గుర్తింపునిచ్చి తెలంగాణ శాఖకు తాత్కాలిక కార్యదర్శిగా నియమించింది. చాడ తన మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో హుస్నాబాద్ ప్రాంతంలో సీపీఐ పార్టీ ప్రతిష్టత కోసం, వరదకాలువ నిర్మాణం కోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. పలువురి హర్షం.. చాడ వెంకట్‌రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పెండ్యాల అయిలయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొయ్యడ సృజన్‌కుమార్, సీపీఐ కరీంనగర్ సిటీ కార్యదర్శి పైడిపల్లి రాజు, నాయకులు సదాశివ, న్యాలపట్ల రాజు, మణికంఠరెడ్డి, సురేందర్‌రెడ్డి, గడిపె మల్లేష్, ఎలుగూరి రాంరెడ్డి, మాడిశెట్టి శ్రీధర్, మల్లారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్ : వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చందానగర్, లింగంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, మృతుడి సహోద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన కొండా వెంకట్‌రెడ్డి (30) గచ్చిబౌలిలోని డీఎస్టీ వరల్డ్ సాప్ట్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వివాహమైన అతడు ..భార్యతో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు చందానగర్ రైల్వేస్టేషన్ నుంచి లింగంపల్లి వైపు వెళుతున్న రైలుకు వెంకట్‌రెడ్డి ఎదురుగా వెళ్లటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. కాగా వెంకట్‌రెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, అందరితో కలిసి మెలిసి ఉండేవాడని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావటం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు. -
హైకోర్టు హౌసింగ్ స్కాంలో ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో అరెస్టులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు సహోద్యోగుల నుంచి రూ. 6.5 కోట్లను వసూలు చేశారనే ఆరోపణలపై సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్‌ను సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హైకోర్టు ఉద్యోగుల సొసైటీ సభ్యుల ఇళ్ల నిర్మాణం కోసం గచ్చిబౌలిలో ప్రభుత్వం 35 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ భూముల అభివృద్ధి పేరుతో సొసైటీ పాలకవర్గం అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ హరిణి రూ. 4.5 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. తన నివేదికలో 25 మందిని నిందితులుగా పేర్కొన్నారు. -
మేడిపల్లిలో ఏవీ ఇన్ఫో ప్రాజెక్ట్‌లు
అభివృద్ధి చెందిన ప్రాంతంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడం కాస్త డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అందుకే సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా.. ఆధునిక వసతులతో కూడిన పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ జే వెంకట్‌రెడ్డి చెప్పారు. మేడిపల్లి హైవే పక్కనే రెండున్నర ఎకరాల్లో ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ పేరుతో ఆధునిక బహుళ అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నాం. మొత్తం 210 ఫ్లాట్లు. అన్నీ 2, 3 పడక గదుల ఫ్లాట్లే. ధర రూ.32.5 లక్షల నుంచి రూ.48 లక్షల వరకున్నాయి. ఇప్పటికే 40 శాతం మేర ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక వసతులన్నీ కల్పిస్తున్నాం. పీ అండ్ టీ కాలనీలో 850 గజాల్లో ‘రాచురి అరణ్య’ అపార్ట్మెంట్నూ నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 20 ఫ్లాట్లు. 1,065 చ.అ. నుంచి 1,100 చ.అ. మధ్య ఫ్లాట్ విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.2,350గా చెబుతున్నాం. -
పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో విషాదం
పెద్దేముల్: త్వరలో పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. అప్పుల బాధ తాళలేక ఓ వృద్ధరైతు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన పెద్దేముల్ మం డలం లింగంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మండల వెంకట్‌రెడ్డి(70)తనకున్న రెండెకరాల 32 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు బందిరెడ్డి ఉన్నారు. గతంలో బందిరెడ్డి చనిపోవడంతో వెంకట్‌రెడ్డి తన చిన్న కూతురు చిన్న కుమార్తె మమతను చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాడు. ఆమె వివాహ బాధ్యతను కూడా తీసుకున్నాడు. కొన్నేళ్లుగా పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రైతు కోటపల్లి ఆంధ్రా బ్యాంకులో రూ. 40 వేలు, తెలిసిన వారి వద్ద మరికొంత డబ్బు మొత్తం రూ. 4 లక్షలు తీసుకున్నాడు. ఇటీవల తనకున్న పొలంలోంచి ఎకరం భూమిని రూ. 4 లక్షలకు అమ్మేశాడు. మమతకు ఇటీవల పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఘనంగా వివాహం చేద్దామని భావించాడు. పొలానికి సంబంధించిన డబ్బు సమయానికి అం దలేదు. సదరు డబ్బు వచ్చినా అప్పుల వారికి సరిపోతుందని, ఇక మనవరాలి పెళ్లి ఎలా చేద్దామని వెంకట్‌రెడ్డి వారం రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాత ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఉదయం మమత పొలానికి వెళ్లి చూడగా వెంకట్రె డ్డి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మమత ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో అమ్మమ్మ సావిత్రమ్ముకు కుప్పకూలిపోయింది. పోలీసులు వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషాదం.. మమత పెళ్లి మరో 25 రోజుల్లో జరగాల్సి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే వెంకట్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి మేళం మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగాల్సి వస్తుందనుకోలేదని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. -
అందమైన లోగిళ్లు
ఉప్పల్ బస్ డిపో ప్రాంతంలో ఏవీ ఇన్ఫో ప్రైడ్ సాక్షి, హైదరాబాద్: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మన్నికైన ఇంటిని అందుబాటు ధరల్లో అందజేసే ప్రాజెక్ట్‌లను ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆదరిస్తారంటున్నారు ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్‌రెడ్డి. అందుకే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటైన వరంగల్ హైవేలో ‘ఏవీ ఇన్ఫో ప్రైడ్’ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఆధునిక వసతులతో కూడిన ఫ్లాట్లను అందుబాటు ధరల్లో అందించడమే లక్ష్యంగా ఉప్పల్ బస్‌డిపో ప్రాంతంలో రెండున్నర ఎకరాల్లో ‘ఇన్ఫో ప్రైడ్’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 210 ఫ్లాట్లు. 1,100-1,800 చ.అ.ల్లో 2, 3 పడక గదుల ఫ్లాట్లొస్తాయి. చ.అ. రూ.2,550. పాజెక్ట్ నిర్మాణంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలన్నీ పాటిస్తున్నాం. నగరంలో ఉంటూ కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వీలుగా 60 శాతం స్థలాన్ని పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 18 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, బాంక్విట్ హాల్‌లతో పాటు విశాలమైన పార్కింగ్, ఇండోర్ గేమ్స్, బేబీ డేకేర్ సెంటర్ వంటి వసతులెన్నో కల్పిస్తున్నాం. 2015 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కొనుగోలుదారులకందిస్తాం. ఈ ప్రాజెక్ట్ సింగపూర్ టౌన్‌షిప్‌కు 6 కి.మీ. దూరంలో, ఉప్పల్ మెట్రోకు 4 కి.మీ. దూరంలో, వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న నందనవనం పార్క్‌కు అర కి.మీ. దూరంలోనే ఉండటంతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కొద్ది రోజు ల్లోనే 76 ఫ్లాట్లు విక్రయించగలిగాం. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
చౌటుప్పల్ : భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందోళ్లగూడెం గ్రామానికి చెందిన ఎన్నపల్లి వెంకట్‌రెడ్డి, వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన రజిని(31)లు 6సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాదికే రజినికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు క ట్నం తీసుకురమ్మని వేధించేవాడు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఇతడిపై రౌడీషీట్ నమోదై ఉంది. గతంలో ఓ హత్య కూడా చేశాడు. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, రజినిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. 2సంవత్సరాల క్రితం నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో కూడా ఇతడిపై కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి వెంకట్‌రెడ్డి రజినితో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన రజిని ఉదయం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన వెంకట్‌రెడ్డి, తల్లి సత్తమ్మలు వెంటనే చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రజిని మృతిచెం దినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో వెంకట్‌రెడ్డి,రజిని మృతదేహాన్ని అంబులెన్స్‌లో వేసి, తల్లి సత్తమ్మను ఎక్కించి ఇంటికి పంపించాడు. అతను అక్కడి నుంచే జారుకున్నాడు. తల్లి సత్తమ్మ ఇంటికి వచ్చి, మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచి, ఆమె కూడా పరారయ్యింది. గ్రామస్తులు రజిని తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో, వారు వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త వెంకట్‌రెడ్డి, అత్త సత్తమ్మలపై కేసునమోదు చేసినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు. కాగా, రజినికి 2సంవత్సరాల వయస్సు గల పాప ఉంది. -
సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
హన్మకొండ చౌరస్తా : ప్రజల సంక్షేమంపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆయన మంత్రి వర్గం ఇప్పటికీ జనాకర్షణ కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప.. సంక్షేమ పథకాల అమలు శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పంటలకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తన భూములే పోయాయంటూ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మార్కెట్ విలువకు నాలుగు రెట్ల నగదును అందజేయాలని డిమాండ్ చే శారు. రాష్ట్ర విభజనలో భాగంగా సీలేరు విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రలో కలిసిందని, అక్కడి నుంచి మనకు రావాల్సిన విద్యుత్‌పై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఐడీ విచారణ పేరుతో సుమారు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని, వాటిని మళ్లీ ప్రారంభించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రజలను గతంలో ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాలనడం సబబుకాదన్నారు. భూదందా, ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై నవంబర్ 4వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి టీ శ్రీనివాసరావు, మడత కాళీదాసు, మేకల రవి, టి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆ టీచర్లను తెలంగాణలోనే ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కలి పేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల టీచర్లను తెలంగాణలోనే ఉంచాలని పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ చేశారు. సచివాలయంలో వారు గురువారం కమలనాథన్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. అనంతరం వారు ఏపీ సీఎస్ కృష్ణారావును కూడా కలిశారు. -
‘అమితా’నందం!
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రేటర్ ైెహ దరాబాద్‌లో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు గురువారం బీజేపీ నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో సన్మాన, అభినందన సభ ఘనంగా జరిగింది. సభా వేదికైన సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ జనసంద్రమైంది. ‘భారత్ మాతాకీ జై... వందేమాతరం, జై తెలంగాణ’ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు సభా ప్రాంగణంలో హోరెత్తాయి. అమిత్ షాను సన్మానించేందుకు నాయకులు వరుస కట్టడంతో ఒక దశలో వేదికపై తొక్కిసలాట జరిగింది. సభ కు పెద్దసంఖ్యలో జనాలు తరలిరావడం పార్టీ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. సభా ప్రాంగణంలో కిక్కిరిసిన జనాన్ని చూసిన అమిత్ షా మొహంలో ఉత్సాహం తొణికిసలాడింది. తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆయన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నగరంలో మళ్లీ బీజేపీ పట్టు సాధిస్తుందన్న విశ్వాసం ఆయన మాటల్లో ప్రస్ఫుటమైంది. స్థానిక నాయకులు తమ ప్రసంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ ద్వంద్వ నీతిని తూర్పారబట్టుతూనే... ఎంఐఎం ఎత్తుగ డలను కీలకంగా ప్రస్తావించడం సభికుల ను ఆకట్టుకుంది. కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికల్లో పార్టీ విజయ కేతనం ఎగురవేసి అధికార పగ్గాలను చేపట్టాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు. నేతలు ప్రసంగిస్తున్నంత సేపు భారత్ మాతాకీ జై అన్న నినాదాలు మిన్నుముట్టాయి. బీజేపీని బలోపేతం చేద్దాం: డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తామని ముందుకొచ్చే నాయకులకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు ఆ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో గురువారం ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీనాయకత్వంలో ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నాయకులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కరతాళధ్వనుల మధ్య మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేతులమీదుగా పార్టీ కండువా క ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌నూ కమలం కండువాను కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎల్పీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు దిలీప్ కుమార్ ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, శంకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు అంకనపల్లి సుజాత, కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ సురేందర్, పీఆర్పీ స్టేట్ మాజీ సెక్రటరీ జి.లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శంకర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజేంద్రనగర్ అభ్యర్థి ఉండవల్లి ప్రమీల, శంషాబాద్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ శివరాం నాయక్, మాజీ కార్పొరేటర్ అమర్నాథ్, అఖిల భారత ఎల్ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ నాయకుడు షేక్ షాజహాన్ తదితరలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. -
తెలంగాణకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు
ఖలీల్‌వాడి : ‘విభజన’ తరువాత కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ద్రోహం చేస్తునే ఉన్నాడని తెలంగాణ సీపీఐ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శిం చారు. బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు 53.89 శాతం,సీమాంధ్రకు 46.11 శాతంగా వాటా నిర్ణయం జరిగిందన్నారు. వివాదాలకు ఆస్కారం లేకుండా విద్యుత్ విభజన చేశారని తెలిపారు. భౌగోళికంగా ఎక్క డి విద్యుత్ ప్రాజెక్టు ఆ రాష్ట్రానికి చెందడంతో పాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల ప్రకారం విద్యుత్తు లభ్యత ఇరు రాష్ట్రాలకు ఉంటుందన్నారు. విభజన చట్టం 2014 ప్రకారం విద్యుత్తు వినియోగాన్ని బట్టి విద్యుత్ విభజన జరగడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని అన్నారు. మిగతా విషయాలన్నీ జనాభా ఆధారంగా విభజించినప్పుడు విద్యుత్తు విభజన సైతం జనాభా ఆధారంగానే ఉండాలని ఏపీ సర్కార్ వాదిస్తోందన్నారు. కాని అలా జరిగితే మాత్రం తెలంగాణ ప్రాంతం మొత్తం విద్యుత్ కోతతో విలవిలలాడుతుందన్నారు. చంద్రబాబు వల్ల ఇప్పటికే తెలంగాణకు తీవ్ర అన్యాం జరిగిందని ఇక సహించేది లేదన్నారు. విద్యు త్తు ఉత్పత్తి విషయంలోనే మొదటి సారిగా ఏర్పాటు అయిన రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే తత్వం లేక పోతే రా నున్న రోజుల్లో ఈ తగాదాలు మరింత పెరగడానికి ఆస్కారం ఉందన్నారు. రాష్ట్రాలు బాగు పడకపోతే తెలంగాణ ప్రజల తరపున పార్టీ మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు కొత్త రుణాలను అందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను త్వరలో కలిసి దాని డిజైన్ మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సీపీఐను మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేసే విధంగా ఇకపై ముందుకు సాగుతామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పల్లె వెంకట్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, నాయకులు సుధాకర్ పాల్గొన్నారు. -
‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి
నల్లగొండ టుటౌన్ : రాష్ట్రంలోని 6 జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించి సస్యశామలం చేసేందుకు రూపొందించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మఖ్దూం భవన్లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలన్నారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి స్థానిక నాయకులు చొరవ చూపాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అనంతరం భువనగిరి సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలుపుతూ సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తీర్మానించారు. పార్టీ శాసన సభాపక్ష నాయకుడు రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు గులాం రసూల్, గోద శ్రీరాములు, వి.రత్నాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జి.పాండరి, కేవీఎల్, వై.దామోదర్‌రెడ్డి, ఎల్.శ్రవణ్‌కుమార్, పల్లా దేవేందర్‌రెడ్డి, చేడే చంద్రయ్య, బి.భూపాల్, సృజన తదితరులు పాల్గొన్నారు. -
బాలికపై వాచ్‌మన్ అత్యాచారయత్నం
కీసర, న్యూస్‌లైన్: ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి చాకచక్యంగా అతడి నుంచి తప్పించుకుంది. స్థానికులు నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం మండల పరిధిలోని రాంపల్లిలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు, ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం మండల పరిధిలోని రాంపల్లి గ్రామానికి వలస వచ్చారు. స్థానిక హరిజనవాడ సమీపంలోని ఓ సిమెంట్ ఇటుకల తయారీకేంద్రంలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(8) స్థానికంగా మూడో తరగతి చదువుతోంది. వేసవి సెలవులు ఉండడంతో బాలిక తమ్ముడితో కలిసి ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం బాలిక తల్లిదండ్రులు ఇటుకల ఆర్డర్ విషయమై సమీపంలోని మల్లాపూర్‌కు వెళ్లారు. రాంపల్లి సమీపంలోని ఓ వెంచర్లో వాచ్‌మన్‌గా పనిచేసే ఉత్తరప్రదేశ్వాసి విజయేంద్రమిశ్రా మద్యం మత్తులో గురువారం మధ్యాహ్నం ఇటుకల తయారీకేంద్రం వద్దకు వచ్చాడు. తమ్ముడితో కలిసి ఉన్న బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. విజయేంద్ర మిశ్రా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశాడు. భయాందోళనకు గురైన బాలిక అతడి నుంచి తప్పించుకొని గ్రామంలోకి పరుగులు తీసింది. అదే సమయంలో ఇటుకల తయారీకేంద్రానికి వస్తున్న బాలిక తల్లిదండ్రులు గమనించి ఏం జరిగిందని చిన్నారిని ఆరా తీశారు. ఏడుస్తూ బాలిక విషయం చెప్పింది. అక్కడి నుంచి పరారవుతున్న విజయేంద్ర మిశ్రాను బాలిక తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
పోషకాల లోగుట్టు!
నేలతల్లిని నమ్ముకొని బతికే రైతన్న.. తాను బతుకుతూ నలుగురి ఆకలి తీర్చుతాడు! కానీ, రసాయనిక ఎరువులు, పురుగుమందులు భూమాత జవజీవాలను పీల్చి పిప్పిచేస్తుంటే.. ఏం చేస్తాడు? తిరిగి ఆ నేలతల్లినే శరణు కోరతాడు..! చింతల వెంకటరెడ్డి(63) అదే చేశారు! శ్రీరామ నామంలోని మాధుర్యాన్ని.. కమ్మని ఎండిన మట్టి వాసనలో దర్శించారు. భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన మట్టి (లోపలి మట్టి లేదా సబ్సాయిల్)ని ఎరువులకు బదులుగా వాడే వినూత్న సాగు పద్ధతిని ఆవిష్కరించిన అసాధారణ రైతు శాస్త్రవేత్త ఆయన. ఎండిన మట్టిలో పోషకాలను పంటలకు ఎప్పటికప్పుడు ఉగ్గు పడుతూ.. ఔషధ గుణాలు పొదిగిన బంగారు పంటల్నే పండిస్తున్నారు. బహుళజాతి కంపెనీలు భారీ వ్యయంతో తయారుచేస్తున్న జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’కు దీటైన విటమిన్ ఏ, సీ ఉన్న బియ్యాన్ని పండిస్తూ.. రేచీకట్లను శాశ్వతంగా పారదోలే కాంతిరేఖలను ప్రసరింపజేస్తున్నారు! పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. 4 దశాబ్దాల సాగు అనుభవం ఉన్న వెంకటరెడ్డి సాధించిన విజయం అనితర సాధ్యమైనది. రసాయనాలు వాడకపోవడం, తక్కువ ఖర్చు, తక్కువ నీటి వినియోగం, భూసారాన్ని స్థిరంగా పెంపొందించుకోవడం ఈ పద్ధతి ప్రత్యేకత. అన్నీ తెలిసీ ఇన్నేళ్లూ మిన్నకున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం.. ఎట్టకేలకు పరిశోధనలకు సిద్ధమవుతుండడం ముదావహం. తన ఆవిష్కరణలు.. సాధక బాధకాల గురించి వెంకటరెడ్డి మాటల్లోనే.. అది 1980-85 మధ్యకాలం.. మోట బావుల కింద వ్యవసాయం జరుగుతున్న రోజులవి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లిలో మాకు ద్రాక్ష తోట ఉంది. బోర్లు, బిందు సేద్యం, క్రేన్లు లేవు. మోట బావి నుంచి ఇంజిన్లతో నీరు పారించేవారు. ఓ ఏడాది కరువు వల్ల వేసవికి ముందే బావి ఎండిపోయింది. మోట బావిలో పూడిక తీస్తూ.. లోతు తవ్వడం వల్ల ఊరే ఒండ్రు నీటిని ఎప్పటికప్పుడు తోడి ద్రాక్ష తోటకు పారించారు. పూడిక తీసిన నాలుగు నెలలపాటు అనేక దఫాలు తడులు పెట్టాం. ద్రాక్ష దిగుబడి రెట్టింపైంది. అంతకుముందు లేని తీపి, కరకరలాడే లక్షణం తోడై నాణ్యత అమాంతం పెరగడంతో ఆశ్చర్యపోయాం. ఎందువల్ల ఇట్లయిందో కొన్ని సంవత్సరాల తర్వాత గానీ అంతుబట్టలేదు. ఇది పన్నెండేళ్ల క్రితం ముచ్చట. నర్సరీ బెడ్లో పూల మొక్కల ఎదుగుదల నాసిగా ఉంది. వేరే చోట నుంచి తవ్వి తెచ్చిన మట్టిని వేస్తే మొక్కలు పెద్ద ఆకులతో భలే పెరిగాయి. భూమి లోపలి మట్టిలోని పోషకాల వల్లే ఈ మార్పు అని అర్థమైంది. అంతకుపూర్వం ద్రాక్ష దిగుబడి రెట్టింపవడానికీ ఇదే కారణమై ఉండొచ్చన్న ఆలోచన మెరిసింది!అప్పటి నుంచి ఎన్నో ప్రయోగాలు చేశాను.. చేస్తున్నాను. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడకుండా లోపలి మట్టిని తవ్వి ఎండబెట్టి ఎరువుగా వాడుతున్నాను. తొలుత వరి, గోధుమ, కూరగాయల పంటలు పండించి అధిక దిగుబడులు తీశాను. తర్వాత ద్రాక్షలోనూ అనుసరిస్తున్నాను. మట్టితోనే పదేళ్లుగా వరి, గోధుమ.. నాలుగేళ్లుగా ద్రాక్ష సాగు వరి, గోధుమల సాగుకు మట్టిని వాడితే ఇక రసాయనిక ఎరువులతోపాటు పురుగుమందులూ అవసరం లేదు. వరి (బీపీటీ 5204) పొలంలో 2003-2007 వరకు వరుసగా 5 పంటల దిగుబడులను వ్యవసాయ శాస్త్రవేత్తలు నమోదు చేశారు. హెక్టారు(రెండున్నర ఎకరాలకు) 10.8 టన్నుల (ఎకరానికి 4,320 కిలోల) ధాన్యం దిగుబడి వచ్చింది. గోధుమ (లోక్-1)పొలంలో 2004- 2009 మధ్యకాలంలో 6 పంటల దిగుబడులను శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. సగటున హెక్టారుకు 5.6 టన్నుల దిగుబడి వచ్చింది. వీటిలో ఏ, సీ విటమిన్లు అత్యధికంగా ఉండడం విశేషం. 2012-13లో హెక్టారుకు 73.22 టన్నుల ద్రాక్ష దిగుబడిని డా. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ద్రాక్ష పరిశోధన కేంద్రం నమోదు చేసింది. ద్రాక్షలో అధిక దిగుబడితోపాటు తీపి, పీచు పదార్థం, కరకరలాడే స్వభావం, నిల్వ సామర్థ్యం బ్రహ్మాండంగా ఉండడం విశేషం. 9 ఏళ్ల ద్రాక్ష తోట దిగుబడి రసాయనిక ఎరువులు వాడుతుండగా ఎకరానికి 15 టన్నులకు తగ్గింది. అదేతోటకు రసాయనిక ఎరువులు అసలు వాడకుండా ఎండబెట్టిన లోపలి మట్టిని వేస్తుండడంతో గత నాలుగేళ్లలో దిగుబడి 25-30 టన్నులకు పెరిగింది. ద్రాక్షకు వర్షాకాలంలో పాదుకు 4 కిలోల పశువుల పేడ వేస్తున్నాను. శిలీంద్రనాశినులు చల్లక తప్పడం లేదు. ఎకరానికి రూ.3 లక్షల నికరాదాయం వస్తోంది. పర్యావరణానికి మేలు, తక్కువ ఖర్చు, అధిక దిగుబడులు ఈ పద్ధతి విశిష్టతలు. పంటల మార్పిడి అవసరమూ ఉండదు. ఎండబెట్టిన పై మట్టికన్నా.. ఎండబెట్టిన లోపలి మట్టిని ఎక్కువ వాడితే పంటలకు చీడపీడల బెడద బాగా తగ్గుతుంది. మంచిని పంచాలి.. పెంచాలి..! మంచిని పంచాలి.. పెంచాలి అన్న పెద్దల మాటలే నాకు ఆదర్శం. పరిజ్ఞానాన్ని రైతులకు అందించా. పేటెంట్‌తో నిమిత్తం లేకుండా రైతులు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. మీరు మానవాళికి మేలు చేస్తున్నారంటూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ నన్ను అభినందించారు. అంతకన్నా నాకు కావాల్సిందేముంది? వైస్ ఛాన్సలర్లు, సీనియర్ శాస్త్రవేత్తలెందరో మా పొలాలను సందర్శించినా.. ఈ పద్థతిపై పరిశోధనలు చేపట్టనే లేదు. రైతులే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రైతుల బృందాలు కోరితే శిక్షణ ఇస్తా.. సంప్రదించాల్సిన చిరునామా: చింతల వెంకటరెడ్డి (98668 83336), 6-46/బి, ఓల్డు ఆల్వాల్, సికింద్రాబాద్ e-mail: cvreddyind@gmail.com - పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్, ఫొటోలు: వెంకట్, మోహన్ ఇది వాస్తవం.. ప్రయోజనకరం.. ఈ ఏడాదే పరిశోధనలు చేపడతాం! భూమి లోపలి మట్టిని తీసి ఎండబెట్టి వెంకటరెడ్డి గారు సంప్రదాయ విజ్ఞానంతో వరి, గోధుమ పంటలకు ఎరువుగా వాడుతున్నారు. ఇది కొత్త ఆవిష్కరణ. జాతి గర్వించదగిన విషయం. ఎండిన మట్టితోనే పంటలు పండించడం అనేది వాస్తవం.. ఉపయోగకరం. చెప్పడమే కాదు.. రికార్డు స్థాయి దిగుబడులు తీసి చూపిస్తున్నారు. ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో రైతుగా ఆయన పేటెంట్ పొందడం చాలా సంతోషకరం. వెంకటరెడ్డి గారు పండించిన గోధుమ, బియ్యంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంది. ద్రాక్ష తోట ఇంత ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎకరానికి 100 కిలోల నత్రజని కావాలి. భూమి నుంచి 20-30 కిలోలు అందుతుంది. కానీ, మిగతా నత్రజని ఇంకా ఎక్కడి నుంచో పంటకు అందుతోంది. భూమిలోపలి నుంచి తీసి వేసిన మట్టిలోని సూక్ష్మజీవుల ద్వారానే కావచ్చు. చెలక (ఎర్ర) నేలల్లో మంచి ఫలితాలొస్తున్నాయి. ఇసుక నేలల్లో ఇబ్బంది ఉండకపోవచ్చు. ఫ్లోరైడ్, సున్నం, ఉప్పదనం ఎక్కువగా ఉండే నేలలు, బంక ఎక్కువగా ఉండే నల్లరేగడుల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. దీనిపై ఈ ఏడాదే పరిశోధనలు ప్రారంభిస్తాం. ఒకటి, రెండేళ్లు సీరియస్‌గా ఇంక్యుబేషన్ స్టడీస్ చేసి, ఏ నేలల్లో ఎలాంటి ఫలితాలొస్తున్నాయో చూడాల్సి ఉంది. - డా.పద్మరాజు, వీసీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇవీ వెంకటరెడ్డి ఆవిష్కరణలు.. కందకం తవ్విన మట్టితో సాగు- 2004: 05-01-2006 - ప్రపంచ మేధోహక్కుల సంస్థ (వైపో) అనుమతి 03-12-2008 - 28 ఐరోపా దేశాల పేటెంట్ మంజూరు 10-03-2010 - భారత్ సహా 70 దేశాల్లో పేటెంట్లు మంజూరు ఏ,సీ విటమిన్లుండే ధాన్యం సాగు-2009 12-01-2011 - ఐరోపా దేశాల కూటమి పేటెంట్‌కు అనుమతి 19-09-2013 - వైపో అనుమతి మంజూరు (ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించి పేటెంట్లు పొందాల్సి ఉంది.) విమ్టా లాబ్స్ టెస్ట్ రిపోర్టులు (09-04-2008): బియ్యం (వంద గ్రా.): విటమిన్ ఏ - 1,242 ఇంటర్నేషనల్ యూనిట్లు (బియ్యంలో సాధారణంగా అసలుండదు), విటమిన్ సీ - 6 మైక్రోగ్రాములు గోధుమ (వంద గ్రా.): విటమిన్ ఏ - 1,370 ఇంటర్నేషనల్ యూనిట్లు విటమిన్ సీ - 6.10 మైక్రోగ్రాములు ఇక ‘గోల్డెన్ రైస్’ ఎందుకు? ఎండిన మట్టితో పండించిన బియ్యం, గోధుమల్లో ఆశ్చర్యకరమైన స్థాయిల్లో ఏ, సీ విటమిన్లున్నాయని విమ్టా ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఆ సంస్థలో సంబంధిత శాస్త్రవేత్తలను స్వయంగా కలిసి ఈ పరీక్షల ఫలితాలు కచ్చితమైనవేనని నిర్ధారిం చుకున్నాను. అప్పటి నుంచి నేను ఈ బియ్యం, గోధుమలనే తింటున్నా. వెంకటరెడ్డి గారి పొలంలో పనిచేసే కూలీ కుమార్తె రేచీకటి, కళ్లు పొడిబారడం, మచ్చలు రావడం తదితర సమస్యలతో బాధపడుతుండేది. రోజూ ఈ అన్నమే తిన్నది. 6-9 నెలల్లో కంటి బాధలన్నీ పూర్తిగా తగ్గడాన్ని గుర్తించాం. బాలల్లో రేచీకటి పోగొట్టేందుకు ఈ బియ్యం చాలు.. జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’ అవసరమే లేదు. విటమిన్ ఏ, సీలతోపాటు ఈ బియ్యంలో ఇంకా ఏ యే పోషకాలున్నదీ శాస్త్రవేత్తలు శోధించాలి. - ప్రొ. జి. నరేంద్రరెడ్డి, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అన్ని పంటలూ పండించొచ్చు..! రసాయనిక ఎరువుగా, వర్మీ కంపోస్టుగా ఎండు మట్టినే వేసుకుంటూ.. ఏ పోషక లోపమూ లేకుండా పంట పండించడం ప్రపంచంలోనే ప్రప్రథమం. ద్రాక్ష తోటకు సూక్ష్మపోషకాల లోపం లేదు. ఖరీదైన జన్యుమార్పిడి గోల్డెన్ రైస్‌లో కన్నా ఈ పద్ధతిలో పండించిన బియ్యంలో ఎక్కువ ఏ విటమిన్ ఉంది. నల్లగొండ జిల్లా గడ్డిపల్లి కేవీకేలో మేం వరి సాగు చేశాం. అంజిరెడ్డి అనే రైతు ఆరెకరాల ద్రాక్ష తోట సాగు చేస్తూ.. చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. ఏ ప్రాంత రైతులైనా సులభంగా అన్ని పంటల్లోనూ అనుసరించదగిన పద్ధతి ఇది. - డా. జి. సత్యనారాయణ (98662 55061), విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త, ద్రాక్ష పరిశోధన కేంద్రం(హైదరాబాద్) -
ఘోరం
దువ్వూరు, మండలపరిధిలోని క్రీస్తురాజపురం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరుకు వస్తున్న ఆటోను కర్నూలు వైపు వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. బుధవారం సాయత్రం 6.30 గంటలకు దువ్వూరు నుంచి మైదుకూరుకు బయలుదేరిన ఆటోను క్రీస్తురాజపురం వద్ద కర్నూలు వె ళుతున్న లారీ ఢీకొంది. ఈప్రమాదంలో చింతకుంట ఇమాంహుస్సేన్(చింతకుంట)గువ్వల మైసూరారెడ్డి,(నాగాయపల్లె)కమతం వెంకటరెడ్డి(గుడిపాడు)సన్నాయి.చంద్రశేఖర్(గుడిపాడు)సన్నాయినాగేంద్ర(గుడిపాడు)అక్కడిక్కక్కడే మృతి చెందారు. ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బోయ సుశీలమ్మ(గుడిపాడు)బెచ్చపాపయ్య (నాగాయపల్లె) మృతి చెందారు. ఇరగంరెడ్డి రాజేశ్వరి(గుడిపాడు)చింతకుంటమాబు(చింతకుంట)గోపిరెడ్డి హేమలత(గుడిపాడు)లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో చింతకుంట మాబు పరిస్థితి ఆందోళనాకరంగా ఉంది. ఆటోలో గుడిపాడుకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. చీకటి పడుతున్న సమయంలో ప్రమాదంలో జరగడంతో క్షతగాత్రులకు దిక్కు తోచలేదు. సంఘటనా ప్రాంతం బాధితుల రోదనలతో నిండిపోయింది. ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. 108 వాహనం ఆలస్యంగా రావడంతో తీవ్రగాయాలైన వారు ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. సంఘటనా స్థలికి డీఎస్సీ శివారెడ్డి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
బూచమ్మ బూచోడు మూవీ స్టిల్స్
-
నేడు బంద్
వరుస కరువు కాటకాలతో రతనాల సీమ రాళ్ల సీమగా మారిపోయింది. వలసలతో ఊళ్లు ఖాళీ అవుతుండగా.. బక్కచిక్కిన రైతన్నలు కూలీలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రగిల్చిన విభజన చిచ్చు జిల్లావాసుల నోట్లో మట్టి కొట్టనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు తెలుగు ప్రజలు రెండుగా చీలిపోయారు. ఇప్పుటికే కర్ణాటక నుంచి వాటా నీటి కోసం సిగపట్లు తప్పడం లేదు.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నీటి ఇక్కట్లు ఏ స్థాయిలో ఉంటాయోననే బెంగ ప్రజలకు కంటి మీద కునుకును దూరం చేస్తోంది. ఈ విషయంలో మొదటి నుంచి పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు పార్టీలు మద్దతివ్వకపోవడంతో ఏదైతే జరగకూడదనుకుని అందరూ భావించారో అది జరిగిపోయింది. నిరసనగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి కోరారు. -
అండగా నిలుద్దాం
కోడుమూరు టౌన్, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని కోరారు. పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎం.మణిగాంధీ అధ్యక్షతన పట్టణంలోని స్నేహ వినాయక కల్యాణ మంటపంలో శనివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజకు వ్యతిరేకంగా పోరాడుతున్నది జగన్ మాత్రమే నన్నారు. రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు తప్పవని, నిత్యం తాగు, సాగునీటి కోసం ప్రజలు కొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పిన గౌరు దీన్ని దృష్టిలో ఉంచుకునే జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. బడుగుల సంక్షేమమే జగనన్న ధ్యేయం: బుట్టా రేణుక బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. అణగారిన, వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో జగనన్న పనిచేస్తున్నారని, అందులో భాగంగానే వెనుకబడిన తరగతులకు చెందిన తనకు కర్నూలు ఎంపీ టికె ట్ ఇచ్చారని తెలిపారు. ‘నేను మీ ఆడపడుచును, మీరే నా బలం’ అంటూ ఆమె ఉద్వేగంగా ప్రసంగిస్తూ కార్యకర్తల్లో ఉతే ్తజాన్ని నింపారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకావాలన్నా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ స్వర్ణయుగం : మణిగాంధీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ సువర్ణ యుగం రాబోతోందని కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ అన్నారు. సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జగనన్నకు మనమంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామగ్రామాన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభ్యర్థుల గెలుపు కోసం అకుంఠిత దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే వారిని ఆదరించండి : కొత్తకోట.ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ‘ప్రజల కోసం పనిచేస్తున్న వారిని గెలిపించండి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎక్కడుంటారో కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాంటి వారిని కాకుండా ప్రజా సంక్షేమం నిరంతరం పరితపిస్తున్న జగన్‌ను అండగా నిలిచి ఆదరించండి’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి కోరారు. వచ్చే ఎన్నికలు కచ్చితంగా సమైఖ్యాంధ్రలోనే జరుగుతాయని, వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పార్టీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ అమడగుంట్ల క్రిష్ణారెడ్డి అన్నారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యూవీ రాజారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మరణంతోనే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీలు అణగారిపోయారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంచి రోజులు వస్తాయని తెలిపారు. వైఎస్సార్ అభివృద్ధి పాలనను జగన్ మరోసారి తెస్తారని ఆకాంక్షించారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బుట్టా నీలకంఠ, ఎదురూరు రాంభూపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు కేఈ రాంబాబు, లాయర్ ప్రభాకర్, బీవీ గోపాల్‌నాయుడు, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, భీమలింగన్నగౌడ్, ఎల్లప్ప, మస్తాన్, రామకృష్ణారెడ్డి, సర్వేశ్వరరెడ్డి, అయ్యపురెడ్డి, నంద్యాల శ్రీను, రాఘవేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ సరుకులు పక్కదారి పట్టొద్దు
వికారాబాద్, న్యూస్‌లైన్ : చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకట్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్నికలు తదితర అంశాలపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రేషన్ డీలర్లు సరుకులను బ్లాక్‌మార్కెట్ తరలిస్తున్నారన్న ఫిర్యాదులు తరచూ తన దృష్టికి వస్తున్నాయని, అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలను తనిఖీ చేస్తూ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కొందరు డీలర్లు బియ్యం, పంచదార, పామాయిల్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు. స్టాక్ పాయింట్లో అక్రమాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తనిఖీలకు అధికారులు ఉపక్రమించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని, తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జేసీ హెచ్చరించారు. వికారాబాద్‌లో వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరు, సిలిండర్ల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు సిద్ధం కండి.. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసి అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ సూచించారు. ఓటరు జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలన్నారు. వికారాబాద్‌లో సబ్ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల కొత్త భవనాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలిని జేసీ ఆదేశించారు. అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30 ఎకరాలు.. వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో ఆర్టీసీ ఏర్పాటు చేయదలచిన అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30ఎకరాల ప్రభుత్వ భూమిని త్వరలోనే అందజేయనున్నట్టు జేసీ ఎంవీరెడ్డి తెలిపారు. ఈ భూమిలో కొందరు ప్రైవేట్ పట్టాదారులకు 4.35 ఎకరాలు ఉన్నందున వారికి పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోనున్నట్టు వివరించారు. సమీక్ష సమావేశంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఎస్వో నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ప్రభుదాస్, భూ సర్వే అసిస్టెంట్ డెరైక్టర్ అనంతరెడ్డి, తహసీల్దార్లు గౌతంకుమార్, రాములు, డిప్యూటీ తహసీల్దార్ అమరలింగం గౌడ్, ఆర్ఐలు పాల్గొన్నారు. -
నిబంధనల అతిక్రమణ వల్లే ప్రమాదాలు
పరిగి, న్యూస్‌లైన్: వాహనదారులు నిబంధనలను అతిక్రమించడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ రాజకుమారి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం పరిగి బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీతోపాటు వివిధ వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజ రైన ఎస్పీ.. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డిలు ‘ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ సేఫ్టీ’పై ఆర్టీఏ అధికారులు రూపొందించిన ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ టూ వీలర్‌పై ముగ్గురు ప్రయాణం చేయకూడదని, చిన్న తప్పిదం వల్ల ప్రమాదం చోటుచేసుకుని ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. ద్వి, త్రి చక్ర వాహనాల వల్లే ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయన్నారు. జిల్లాలో గడిచిన ఏడాదిలో 363 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, అందులో 203 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. అం దులో 84 మంది ఆటో ప్రమాదాల్లో, 84 మంది టూ వీలర్ ప్రమాదాల్లో మృతి చెందారన్నారు. జిల్లాలో ఆర్టీసీకి సంబంధించి సైతం 20 కేసులు నమోదయ్యాయన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని అన్నారు. నిమిషానికో ప్రమాదం.. 90 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ) రమేష్ అన్నారు. దేశంలో నిమిషానికో ప్రమాదం, నాలుగు నిమిషాలకో మృతి ఉంటున్నాయన్నారు. ప్రమాదాల నియంత్రణ కోసం బీజాపూర్ రహదారిని ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి పరుస్తామన్నారు. రెండేళ్లలో ఇది పూర్తవుతుందని చెప్పా రు. రెండు నెలల్లో జిల్లాలో 265 ప్రైవే టు బస్సులు సీజ్ చేశామని చెప్పారు. దేశంలో రాష్ట్రం రెండో స్థానం.. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ అన్నారు. అతి వేగం ప్రమాదానికి దారి తీస్తోందని, చనిపోతున్న వా రిలో ఎక్కువ మంది యువకులే ఉంటున్నారని పేర్కొన్నారు. సెల్ మాట్లాడు తూ, మద్యం తీసుకున్నాక డ్రైవింగ్ చేయకూడదని చెప్పారు. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎంవీఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మోటార్ వెహికిల్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, ఆటో యూనియన్ అధ్యక్షుడు నగేష్, లారీ యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి వెంకటయ్య, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పోరు బిడ్డ.. మన దొడ్డా
చిలుకూరులో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య కాంస్య విగ్రహాన్ని ఆది వారం ఆవిష్కరించారు. నర్సయ్య పేదల పక్షాన నిలబడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. చిలుకూరు, న్యూస్‌లైన్: తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా నిలిచిన నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ తరఫున నిలిచి దొడ్డా నర్సయ్య పోరుబిడ్డగా నిలిచారని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. నాడు భూస్వామ్య, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నర్సయ్య 15 వ వర్ధంతి సందర్భంగా చిలుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎందరో కమ్యూనిస్టు నాయకులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదల పక్షాన నిల బడి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచాడని అన్నారు. అంతటి మహనీయుడిని ప్రతి కయ్యూనిస్టు ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి తరానికి దొడ్డా నర్సయ్య ఆదర్శప్రాయుడని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేటి వరకూ కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో బలంగా ఉన్నదంటే దొడ్డా నర్సయ్య లాంటి నేతల ఉద్యమ ఫలితమేనన్నా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి అనాడు ఎంతో స్ఫూర్తినిచ్చి పేదల కోసం పరితపించిన డీఎన్ (దొడ్డా నర్సయ్య), బీఎన్‌లు స్టెన్‌గన్ లాంటివారని అన్నారు. ముందుగా సీపీఐ జెండాను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సీపీఐ నల్లగొండ, కృష్ణా జిల్లాల కార్యదర్శులు మల్లేపల్లి ఆదిరెడ్డి, అక్కినేని వనజ, సీపీఎం జిల్లా కార్యదర్శి నం ద్యాల నరసింహారెడ్డి, సీపీఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి చలసాని రాఘవేందర్రావు, నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డా నారాయణరావు, వివి ద పార్టీల నాయకులు బద్దం బద్రారెడ్డి, గన్నా చంద్రశేఖర్, ఉప్పల కాంతారెడ్డి, నంద్యాల రామిరెడ్డి, రత్నాకర్‌రావు, పశ్య పద్మ, ముత్తవరపు పాండు రంగారావు, కేవీఎల్, పోటు ప్రసాద్, కొండా కోటయ్య, దొడ్డా పద్మా, పుట్టపాక శ్రీని వాస్ యాదవ్, మేకల శ్రీను, బెజవాడ వెంకటేశ్వర్లు, బజ్జూరి వెంకట్ రెడ్డి, వివిద పార్టీల నాయకులు చింతకుంట్లు లక్ష్మినారాయణరెడ్డి, వాడపల్లి వెంకటేశ్వర్లు, డేగబాబు, కందిబండ సత్యం, పాలకూరి బాబు, ధనుంజయనాయుడు, కంబాల శ్రీను పాల్గొన్నారు. తల్లి మరణవార్తతో వెనుదిరిగిన కె.నారాయణ దొడ్డా నర్సయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయ ణ మాతృమూర్తి మరణవార్తతో మార్గమధ్యం నుంచే వెనుదిరిగి వెళ్లిపోయా రు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన జిల్లాలోని నార్కట్‌పల్లి వద్దకు చేరుకోగానే తల్లి మరణవార్త తెలి సింది. దీంతో ఆయన హాజరు కాలేకపోయారు. -
జిల్లా అభివృద్ధికి అనంత వెంకటరెడ్డి కృషి అమోఘం
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధిలో దివంగత కాంగ్రెస్ నాయకుడు అనంత వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహమ్మదుల్లా, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ నారాయణ రెడ్డి తదితరులు ప్రభుత్వ ఆసుపత్రి కూడలిలోని అనంతవెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో అనంత వెంకటరెడ్డి పాత్రను ప్రశంసించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు నీరు తీసుకురావాలన్న ఆయన కల నేడు సాకారమైందన్నారు. ప్రస్తుతం జిల్లాకు పెద్ద ఎత్తున విడుదలవుతున్న నిధులు ఆయన కృషి ఫలితమేనన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ జిల్లాలో ముస్లింల అభివృద్ధికి అనంతవెంకటరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తమకు ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి మాసూలు శ్రీనివాసులు, ఐఎన్టీయూసీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎంవీరమణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను దోషిని చేస్తున్నారు అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన తర్వాతే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఇప్పుడా పార్టీలన్నీ మాట మారుస్తున్నాయని మంత్రి రఘువీరా రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపుతున్న ఆ పార్టీల కుట్రను కాంగ్రెస్ కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్ గుప్త అధ్యక్షతన నిర్వహించిన మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ ప్రత్యర్థులు ప్రజలను అయోమయానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తున్నారన్నారు. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం తెలపడమే కాకుండా, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ మెడపై కత్తి పెట్టాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపై చర్చ జరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగానే మాట్లాడాయన్నారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వగా, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, తెలంగాణ ప్రజలను తాము గౌరవిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను తప్పు పడుతున్నాయన్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: స్థానిక రాయలసీమ వ్యాయామ కళాశాలలో 59వ రాష్ట్ర స్థాయి అండర్-19 అథ్లెటిక్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతులు గడించాలన్నారు. ఆర్సీపీఈ ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజులు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. ముందుగా క్రీడా జెండాను ఎగురవేసి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా జూనియర్ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి, వ్యాయామ సంచాలకులు ఓబులరెడ్డి, జోనల్ స్థాయి పాఠశాలల కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ఆర్సీపీఈ విద్యార్థులు, అధ్యాపకులు ఈ పోటీలను పర్యవేక్షించారు. తొలి రోజు పరుగు పోటీలో 400 మీటర్లలో బాలుర విభాగంలో రమేష్ (ఖమ్మం), గోపాలకృష్ణ (ఖమ్మం), శ్రవణ్(వరంగల్), బాలికల విభాగంలో జ్యోతి (రంగారెడ్డి), భాగ్యలక్ష్మి (హైదరాబాద్), సుమాంజలి(ప్రకాశం), 300 మీటర్ల బాలుర పరుగు పోటీలో బి.తిరుపతి (వరంగల్), శ్రీనివాస్ (రంగారెడ్డి), నవీన్‌రెడ్డి(గుంటూరు), బాలికల విభాగంలో సుష్మిత (ఖమ్మం), వెంకటలక్ష్మి (వెస్ట్ గోదావరి), స్వాతి (వైఎస్ఆర్)లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. , 4ఁ100 బాలికల విభాగంలో హైదరాబాద్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ, వెస్ట్ గోదావరి తృతీయస్థానం నిలిచింది. -
ఫిర్యాదు చేయగానే ఎఫ్ఐఆర్ నమోదు
రామాయంపేట, న్యూస్‌లైన్ : ఇకపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందని నిజామాబాద్, మెదక్ జిల్లాల రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను తని ఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట సర్కిల్ పరిధిలో చేగుంట పోలీస్ స్టేషన్లో ఎ క్కువగా నే రాలకు సంబంధించిన కేసు లు ఉన్నాయని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున వాటిని నియంత్రించేందుకు పెట్రోలింగ్‌ను పెంచడం జరుగుతుందన్నారు. పోలీస్ క్వార్టర్స్‌ను నిర్మించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేంజ్ పరిధిలోని రెండు జిల్లాల్లో 60 శాతం కేసుల రికవరీ ఉందన్నారు. గ్రామాల్లో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా శాంతిభద్రతలపై అవగాహన కల్గి ఉండాలన్నారు. ఇప్పటివరకు రోడ్డుపై తనిఖీల్లో 4,993 మందికి జరిమానాలు విధించడం జరిగిందన్నారు. రామాయంపేటలో ప్రభుత్వ అనుమతి లేని ఫైనాన్స్‌లు, జీరో చిట్టీలు నడిపిస్తున్నారని విలేకరులు తెలుపగా అలాంటి వారు ఉంటే పేపర్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఫైనాన్స్‌లు, జీరో చిట్టీలు నడిపిస్తే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, ఎస్‌లు ప్రవీణ్ బాబు, ప్రశాంత్, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లూజ్ పత్తిపై అధికారుల నిఘా?
జమ్మికుంట, న్యూస్‌లైన్: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లోకి వస్తున్న లూజ్ పత్తిపై అధికారుల నిఘా మొదలైంది. లూజ్ పత్తికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. ఇదే పత్తిని గ్రామాల్లో వ్యాపారులు కొనుగోలు చేస్తూ మార్కెట్‌కు తరలిస్తున్నారనే అనుమానం అధికారుల్లో కలిగింది. దీంతో ఈవైపుగా అధికారులు దృష్టి సారించారు. సోమవారం పత్తి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 33 టాటా ఏసీల్లో 250 క్వింటాళ్ల లూజ్ పత్తిని తీసుకొచ్చారు. వచ్చిన పత్తిలో గరిష్టంగా రూ.4460, కనిష్టంగా రూ.4000 వరకు పలికింది. అయితే పాట అనంతరం మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ కార్యదర్శి విజయ్‌కుమార్, సిబ్బంది గౌస్ వాహనాల్లో వచ్చిన రైతుల వివరాలు సేకరించారు. అడ్తి కమిషన్ ఎంత తీసుకుంటున్నారని తెలుసుకున్నారు. కొందరు అడ్తి కమిషన్ వివరాలు చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పత్తి వాహనాలను పక్కకు పెట్టించారు. అడ్తిదారులు తమ రైతులేనని తెల్చడంతో విడిచిపెట్టారు. యంత్రాలకు ముద్రలు తప్పనిసరి మార్కెట్లో ఎలాక్ట్రానిక్ కాంటాలపై తూనికలు, కొలతల అధికారుల ముద్రలు తప్పనిసరిగా ఉండాలని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. నిబంధనలు పాటించని అడ్తీదారుల క్రయవిక్రయాలను కొద్ది సేపు నిలిపి వేశారు. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిపై సరుకులు ఉచితంగా తూకం వేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రూ. 2 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం
చందానగర్, న్యూస్‌లైన్: రెండు కోట్ల విలువ చేసే ఎఫిడ్రిన్ మత్తు పదార్థంతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు సంయుక్తంగా కేసును ఛేదించారు. చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ ఎస్వోటీ ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం చోటపల్లికి చెందిన బుబ్బా శ్రీనివాస్‌రెడ్డి చందానగర్ హుడా కాలనీలో ఉంటుండగా.. ఇతని సోదరుడు బుబ్బా వెంకట్‌రెడ్డి లింగంపల్లి నారాయణరెడ్డి కాలనీ శ్రీరాములు రెసిడెన్సీలో ఉంటున్నాడు. బొబ్బా శ్రీనివాస్‌రెడ్డి హుజూరానగర్లో బీఎస్సీ వరకు చదువుకున్నారు. 2000 సంవత్సరంలో నగరానికి వచ్చి జిన్నారం మండలం ఖాజీపల్లిలోని హెరెన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్లో కెమిస్ట్‌గా రెండేళ్లు పనిచేశాడు. అనంతరం నాచారంలోని హెర్మాస్ కెమికల్స్‌లో చేరాడు. ఆపై ఆర్టీసీ బస్సులో కాంట్రాక్టు పద్ధతిలో కండక్టర్‌గా, ఎల్బీనగర్లోని సాయి అడ్వాంటియమ్ ఫార్మా లిమిటెడ్‌లో ప్లాంట్ ఇన్చార్జిగా, బీదర్‌లోని బీఎస్ఎన్ ఫార్మా లిమిటెడ్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. కెమికల్ ప్రాసెసింగ్‌లో అనుభవం గడించిన శ్రీనివాస్‌రెడ్డి కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో శ్రీకర్ల్యాబ్స్ను ఏర్పాటు చేసి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఉపయోగపడే ఆనస్రేజోల్ అండ్ లిట్రేజోల్ డ్రగ్‌ను సొంతంగా తయారు చేశాడు. దానిని రెండేళ్లు మార్కెటింగ్ చేశాడు. తీవ్ర నష్టాలు చవిచూసిన శ్రీనివాస్‌రెడ్డికి సులభ పద్దతిలో డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. అరబిందో ఫార్మా లిమిటెడ్‌లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న తన సోదరుడు వెంకట్‌రెడ్డితో కలిసి జీడిమెట్లలోని ఆర్ఎస్ మాలిక్యూర్స్ను అద్దెకు తీసుకున్నారు. ఇద్దరికి ఫార్మాలో మంచి అనుభవం ఉండటంతో ముంబైకి చెందిన జావిద్ నుంచి ప్రొపైఫినన్, బ్రోమైన్, సోడియం బోరో హైడ్రైడ్‌ను దిగుమతి చేసుకొని ఆర్ఎస్ మాలిక్యూర్స్లో ప్రాసెసింగ్ ద్వారా ఎఫిడ్రిన్‌గా తయారు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం వీరు ఆర్ఎస్ మాలిక్యూర్స్ను అద్దెకు తీసుకొని 50 కిలోల మత్తు పదార్థాన్ని తయారు చేసి.. నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం రవికుంటపాడుకు చెందిన తిరుమల విజయ్‌కుమార్‌రెడ్డి (ఈయన సరూర్‌నగర్ మండలం మీర్‌పేట తిరుమలహిల్స్‌లో ఉంటున్నారు)కి అమ్మకానికి ప్రతిపాదించారు. గతంలో ఎర్రచందనం వ్యాపారంలో దెబ్బతిన్న విజయ్‌కుమార్‌రెడ్డి డ్రగ్ విక్రయించేందుకు తన సొంత గ్రామానికి చెంది చెన్నైలో స్థిరపడిన నవాజ్‌ఖాన్ అలియాస్ భాయ్‌ను సంప్రదించాడు. రెండు నెలల క్రితం 50కిలోల డ్రగ్‌ను నవాజ్ఖాన్ను ఇవ్వగా కిలోకు రూ.1.5లక్షల చొప్పున రూ.75లక్షలు ఇచ్చాడు. భాయ్ వీరి నుంచి డ్రగ్స్‌ను కొని మలేసియా, సింగపూర్, ఇతర దేశాలకు కిలో రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తుంటాడు. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో మరో 56 కిలోల డ్రగ్స్‌ను తయారు చేసి విక్రయించేందుకు గంగారం ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో వేగనార్ (ఏపీ 28డిబి 791)కారులో శనివారం ఉదయం 10గంటల సమయంలో వేచివున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, చందానగర్ పోలీసులు దాడిచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 2 కోట్ల విలువ చేసే 56 కిలోల డ్రగ్స్, రూ.7లక్షల నగదు, మూడు సెల్ఫోన్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్లు కె. చంద్రశేఖర్, బి. పుష్పన్‌కుమార్, బస్వారెడ్డి, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు జి. నాగరాజు, మహేశ్‌గౌడ్, శివ, రమేష్‌లతో పాటు చందానగర్ సీఐ వాసులను ఆయన అభినందించారు. న్యూ ఇయర్ వేడుకల కోసమేనా... కొత్త సంవత్సరం వేడుకల్లో విక్రయించడానికే ముఠా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తయారు చేసినట్లు అనుమానిస్తున్నారు. నగరంలోని పబ్స్, ప్రైవేట్ పార్టీలకు, రిసార్ట్స్‌లో 100, 50 గ్రామల ప్యాకెట్లను విక్రయించేందుకు ముఠా సభ్యులు వ్యూహం పన్నినట్లు సమాచారం. కాగా, ఈ డ్రగ్ మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పోలీసులు చెప్పారు. -
మాయ’లేడీ’కి ఆరు నెలల జైలు శిక్ష
మియాపూర్, న్యూస్‌లైన్: వాహనదారుడిని లిఫ్ట్ అడిగి.. కారుతో పాటు ఉడాయించిన ఓ మాయ‘లేడీ’కి కూకట్పల్లి 9 ఎంఎం కోర్టు న్యాయమూర్తి వి.సత్యనారాయణ ఆరు నెలలు జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కథనం ప్రకారం... హర్యానాకు చెందిన మమత రాణి అలియాస్ మేఘన నాలుగు నెలల క్రితం మాదాపూర్‌లో కారులో వెళ్తున్న జి.వెంకట్‌రెడ్డిని లిఫ్ట్ అడిగి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆయన ఓ హోటల్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మమత అతని కారు తీసుకొని ఉడాయించింది. కాగా, వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితురాలిని గత మే 20న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ వేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. నిందితురాలు మమతపై ఇలాంటివే మరో రెండు కేసులున్నాయి. నకిలీ పోలీసులకు 10 నెలల జైలు... పోలీసులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులకు కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది. వివరాలు.. ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన ప్రదీప్‌సింగ్, వెంకట్రాజ్ పోలీసులమని చెప్పుకుంటూ తిరుగుతూ వాహనాలను అపహరిస్తున్నారు. వీరిద్దరినీ కూకట్పల్లి పోలీసులు గత జనవరిలో అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి సత్యనారాయణ.. నిందితులకు 10 నెలల జైలుశిక్ష, రూ.50 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.