రామాయంపేట, న్యూస్‌లైన్ : ఇకపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందని నిజామాబాద్, మెదక్ జిల్లాల రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను తని ఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట సర్కిల్ పరిధిలో చేగుంట పోలీస్ స్టేషన్‌లో ఎ క్కువగా నే రాలకు సంబంధించిన కేసు లు ఉన్నాయని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున వాటిని నియంత్రించేందుకు పెట్రోలింగ్‌ను పెంచడం జరుగుతుందన్నారు. పోలీస్ క్వార్టర్స్‌ను నిర్మించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేంజ్ పరిధిలోని రెండు జిల్లాల్లో 60 శాతం కేసుల రికవరీ ఉందన్నారు.
గ్రామాల్లో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా శాంతిభద్రతలపై అవగాహన కల్గి ఉండాలన్నారు. ఇప్పటివరకు రోడ్డుపై తనిఖీల్లో 4,993 మందికి జరిమానాలు విధించడం జరిగిందన్నారు. రామాయంపేటలో ప్రభుత్వ అనుమతి లేని ఫైనాన్స్‌లు, జీరో చిట్టీలు నడిపిస్తున్నారని విలేకరులు తెలుపగా అలాంటి వారు ఉంటే పేపర్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఫైనాన్స్‌లు, జీరో చిట్టీలు నడిపిస్తే వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, ఎస్‌లు ప్రవీణ్ బాబు, ప్రశాంత్, వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదు చేయగానే ఎఫ్‌ఐఆర్ నమోదు
Published Mon, Dec 23 2013 11:46 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement