శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కి (శాట్‌కామ్) ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేయాలా లేక కేటాయించాలా అనే అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీనిపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. టెల్కోలతో సమానంగా శాటిలైట్ సంస్థలతో కూడా వ్యవహరించాలన్న టెలికం సంస్థల డిమాండ్‌పై స్పందిస్తూ వివిధ వర్గాలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్నట్లుగా ఈ స్పెక్ట్రంను కేటాయించాలంటూ అమెరికన్ దిగ్గజం స్టార్‌లింక్ కోరుతుండగా, దేశీ టెల్కోలు మాత్రం వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాన్నే దేశీయంగానూ అమలు చేస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రాయ్ నిర్దిష్ట రేటు సిఫార్సు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సింధియా నిర్ణయాన్ని స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment