Anil Kumar
-
Anil Kumar Kaile: ఒక్క బస్తాకైనా మద్దతు ధర ఇచ్చారా?
-
శాట్‌కామ్ స్పెక్ట్రంపై చర్చిస్తున్నాం: ట్రాయ్ చైర్మన్
శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కి (శాట్‌కామ్) ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేయాలా లేక కేటాయించాలా అనే అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీనిపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. టెల్కోలతో సమానంగా శాటిలైట్ సంస్థలతో కూడా వ్యవహరించాలన్న టెలికం సంస్థల డిమాండ్‌పై స్పందిస్తూ వివిధ వర్గాలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్నట్లుగా ఈ స్పెక్ట్రంను కేటాయించాలంటూ అమెరికన్ దిగ్గజం స్టార్‌లింక్ కోరుతుండగా, దేశీ టెల్కోలు మాత్రం వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాన్నే దేశీయంగానూ అమలు చేస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రాయ్ నిర్దిష్ట రేటు సిఫార్సు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సింధియా నిర్ణయాన్ని స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రశంసించారు. -
రెడ్ బుక్ రాజ్యాంగం.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
-
విగ్రహాలపై అక్కసు
సాక్షి నెట్వర్క్ : ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల విధ్వంసకర ప్రవర్తన కొనసాగుతోంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.రెండేళ్ల కిందట అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సూచన మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కనగాల హరిబాబు పార్టీ మండల పార్టీ నాయకులతో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకోవాలని కోరారు.మండలంలోని కపిలేశ్వరపురం, వీరంకిలాకు, పమిడిముక్కల, ఐనపూరు గ్రామాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, దాడులను అరికట్టాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్ పార్టీ నాయకులతో కలిసి స్టేషన్లో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యుడు గుర్విందపల్లి వంశీ, కోఆప్షన్ సభ్యుడు దియానత్అలీ, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోట మణిరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కినేని సతీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై గునపాలతో దాడికాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామ సచివాలయంపై ఉన్న దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రాలను సోమవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గునపాలతో పగులకొట్టి తొలగించారు. గత ఏడాది ఈ సచివాలయం నిర్మించి, ఇరువైపులా వైఎస్సార్, జగన్, కన్నబాబు ముఖ చిత్రాలను సిమెంట్‌తో చెక్కించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందారు.ఈ నేపథ్యంలో కూరాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయంపై ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల చిత్రాలను, గ్రామంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా తొలగించారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో అభివృద్ధి శిలాఫలకాలను సోమవారం టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 20 రోజుల కిందట కురిసిన వర్షాలకు గతంలో టీడీపీ నేతలు అభివృద్ధి పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం కింద పడిపోయింది. అయితే ఇది వైఎస్సార్సీపీ వర్గీయుల పని అని టీడీపీ నేతలు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకం, రహదారి పక్కనున్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.వీటిపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను సోమవారం టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబునాయుడు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామి ఉన్న ఫ్లెక్సీలను రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై అంటించి కవ్వింపు చర్యలకు దిగారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీని చింతలపట్టెడలో నూతనంగా నిర్మించిన సెంగుంధ మొదలియార్ కమ్యూనిటీ హాలు వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.సోమవారం ఉదయం మండపం వద్ద శిలాఫలకం ధ్వంసం కావడాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ పి.జి.నీలమేఘం, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.ఆర్.వి.అయ్యప్పన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సీఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు నగరిలో లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కురువల్లిలో సోమవారం టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనాల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ జయరామ్‌రెడ్డి తెలిపారు. -
ఓటమిపై పామర్రు ఎమ్మెల్యే రియాక్షన్
-
షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా గుర్రాలచింతలపల్లెకు వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను స్థానికులు అడ్డుకున్నారు. అనిల్‌కుమార్ స్నేహితుడినంటూ కొండలరావు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండిపడ్డారు. మైనింగ్ వాహనాలు బాడుగకు తీసుకొని.. దాదాపు రూ.4 కోట్ల వరకు బకాయి పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బుల గురించి కొండలరావును ప్రశ్నిస్తే ‘ఇది షర్మిల కంపెనీ’ అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. వెంటనే తమ బకాయి డబ్బులివ్వాలని నిలదీశారు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం చాబలి గ్రామంలో బెనిటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట 163 ఎకరాల్లో ఐరన్ ఓర్ లీజు లభించింది.వేణుగోపాల్ డైరెక్టర్‌గా ఉన్న ఆ కంపెనీ 203, ఆదిత్య ఎలెట్, బి.ఎస్.మక్తా, సోమాజిగూడ, హైదరాబాద్ అడ్రస్‌లో ఉంది. ఏపీఆర్ 2278 నంబర్‌తో మంజూరైన లీజు గడువు 2024 నవంబర్ 9వ తేదీ వరకు ఉంది. ఈ ఐరన్ ఓర్ గనుల్లో పదేళ్లుగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను స్థానికంగా కొండలరావు అనే వ్యక్తి చూసేవాడు. అతను షర్మిల భర్త అనిల్‌కుమార్‌కు స్నేహితుడిగా చెప్పుకుంటూ.. స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇక్కడి వారి నుంచి టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు తీసుకొని మొదట్లో నెలవారీ బాడుగలు సక్రమంగా చెల్లించేవాడు. ఆ తర్వాత బకాయిలు పెండింగ్ పెడుతూ వచ్చాడు. అవి కోట్లాది రూపాయలకు చేరుకోవడంతో స్థానికులు డబ్బుల గురించి కొండలరావును అడగడం మొదలుపెట్టారు. అతను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల క్రితం మాచునూరు గ్రామస్తులు కంపెనీ ప్రాంగణంలో ధర్నా చేశారు. అప్పట్లో సగం డబ్బులు చెల్లించి.. మిగిలినవి తర్వాత ఇస్తానని చెప్పాడు. అనంతరం ఆ డబ్బుల గురించి నిలదీయగా.. ‘షర్మిల కంపెనీ ఇది. తమాషా చేస్తున్నారా.. డబ్బులిస్తాం. వెయిట్ చేయండి’ అంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి కొండలరావు కంపెనీ వైపు రావడమే మానేశాడు. ట్రాన్స్పోర్ట్, టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు.. ఇలా బాడుగకు ఇచ్చిన అందరివీ కలిపి దాదాపు రూ.4 కోట్లకు పైబడి ఎగ్గొట్టినట్లు బాధితులు వాపోయారు. మాకు న్యాయం చేయండి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి న షర్మిలను బాధితులు గౌరీశంకర్రెడ్డి, మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఆమె స్పందిస్తూ.. తనకు ఆ కంపెనీతో సంబంధం లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షర్మిల, అనిల్ పేర్లు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఆగాంబెనిటా మైన్స్‌లో టిప్పర్లు, బుల్డోజర్లు, ట్యాంకర్లు బాడుగకు పెట్టుకొని బకాయిలివ్వలేదు. 6 నెలలుగా కొండలరావు ఇక్కడికి రావడం లేదు. వైఎస్ కుటుంబానికి విధేయులమైన మేము షర్మిల, అనిల్ వల్లే ఇంతకాలం కొండలరావు ఏం చెప్పినా భరించాం. అదే విషయాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్లాం. నా ఒక్కడికే రూ.6.5 లక్షలు చెల్లించాల్సి ఉంది.మహేశ్వరరెడ్డితో కలిపి రూ.11 లక్షలు ఇవ్వాలి. మాచునూరు, ఆర్వేటిపల్లె చాబలి, రాజంపేట, ఇతర ట్రాన్సుపోర్టర్లు అందరికీ బకాయి పెట్టారు. దాదాపు రూ.4 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. షర్మిల, అనిల్ పేర్లు చెప్పి బెదిరించారు. లేదంటే మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకొని బకాయిలు రాబట్టుకునేవాళ్లం. – గౌరీశంకర్రెడ్డి, గుర్రాలచింతలపల్లె -
మెదక్ లోక్‌సభ స్థానంపై వీడని సస్పెన్స్..!
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, బీఆర్ఎస్లు రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బుధవారం బీజేపీ మెదక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్‌ను ప్రకటించాయి. పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అధికారికంగా గాలి పేరును ప్రకటించారు. ఎంపీ టికెట్‌ను పలువురు ఆశించినప్పటికీ అధిష్టానం అనిల్‌కుమార్ వైపే మొగ్గుచూపింది. లోక్‌సభ పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే కారణంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్‌ను ప్రకటించిన వెంటనే గాలి అనిల్‌కుమార్.. పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. అయితే.. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కు అవకాశం కల్పించింది. ముందుగా ఊహించినట్లుగానే పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించిన 2 వ జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. అధిష్టానం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు రఘునందన్ సాక్షి కి తెలిపారు. అలాగే మెదక్ ఎంపీ స్థానానికి గాను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి.. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. తొలుత ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరు వినిపించినా పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు టికెట్ ఆశిస్తున్నారు. కాగా, గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్‌ను నిర్మల కలిసి తనకు టిక్కెట్ ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు! -
హైదరాబాద్ కూకట్ పల్లి లో సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్ ప్రారంభం
-
అనిల్ లా ప్రతి ఎమ్మెల్యే ఉంటే... సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
అనిల్‌కుమార్‌కు ఘన స్వాగతం! వందలాది కార్లతో ప్రవేశం..
పల్నాడు: వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్ యాదవ్‌కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుధవారం నెల్లూరు నుంచి వందలాది కార్లతో ర్యాలీగా తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గానికి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన ఆయనకు కోటప్పకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం పలికారు. త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెట్లూరివారిపాలెం గ్రామం చేరుకున్న వారికి ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. వందలాది మంది మహిళలు, నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. కారు దిగి కార్యకర్తలకు కరచాలనం చేశారు. గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత వైఎస్సార్, గ్రామ నాయకుడు దివంగత కటికినేని వెంకటరమణ సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి అడుగడుగునా ప్రజల నీరాజనాల మధ్య వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు కార్లు, ద్విచక్రవాహనాల ర్యాలీతో తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట పట్టణానికి చేరుకున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్‌నాయుడు పాల్గొన్నారు. ఇవి చదవండి: జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్‌రెడ్డి -
షర్మిల పై నిప్పులు చెరిగిన బోరుగడ్డ అనిల్
-
అన్న చెల్లిని విడదీశారు..షర్మిల భర్తపై కొమ్మినేని కామెంట్స్
-
'విశ్వంభర' వీడియోకి సూపర్ రెస్పాన్స్.. దీన్ని డిజైన్ చేసిందెవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీకి 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి సందర్భంగా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా.. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ దగ్గర నుంచి విజువల్స్ వరకు అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అలానే వీడియోలోని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న ఈ వీడియోని ఎవరు డిజైన్ చేశారో తెలుసా? (ఇదీ చదవండి: గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?) 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియోరి డిజైన్ చేసింది అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్‌గా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో పలు సినిమాలకు పనిచేశాడు. ప్రభాస్ 'సాహో'తో పాటు 'రాధేశ్యామ్'కి కూడా అనిల్ పనిచేశారు. రాధేశ్యామ్ సినిమాలోని నీ రాతలే పాటకు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ అనిల్ చేశాడు. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీయబోతున్నారు. ఈ ప్రాజెక్టుతో అనిల్.. దర్శకుడు కాబోతున్నాడు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. 'విశ్వంభర' కాన్సెప్ట్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన అనిల్.. మరి దర్శకుడిగా ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్‌కుమార్, నాయకుడు పి.రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు -
ఇలాంటి వెధవ వేషాలు వేస్తే బొక్కలో వేస్తాం: అనిల్ కుమార్
-
భువనగిరి మున్సిపాలిటీలో కుంభం అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం
-
అంతర్రాష్ట్ర ‘సైబర్’ ముఠా గుట్టురట్టు
అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇలా వెలుగులోకి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఐదుగురు అరెస్టు .. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్‌రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్‌పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం. వివిధ రూపాల్లో మోసాలు.. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్‌లకు అధిక కమీషన్లు, ఆన్లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) పోర్టల్‌లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్‌లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు. అప్రమత్తంగా ఉండాలి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం -
యాదాద్రి భువనగిరి లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం
-
‘బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ బస్సు యాత్రలో భాగంగా బహిరంగ సభలో జరిగింది. ఈ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ అండగా నిలవాలన్నారు. తిరుపతి సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. పెత్తందారులకు, పేదవారికి జరిగే యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాలని కోరుతున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలగన్న సమాజాన్ని సీఎం జగన్ అందించారు. ఆయన ఆశయాలను నిరవేరుస్తూ అభినవ అంబేద్కర్‌లా ఉన్నారు. నిరంతర శ్రామికుడిలా ఉన్న సీఎం జగన్‌కి అండగా నిలవాలి. నేడు చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్ తీసుకొన్నారు. వినూత్న పథకాలు.. విద్య వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియంను తీసుకువచ్చారు. సీఎం జగన్ నిర్ణయాలను పెత్తందారులు వక్రీకరిస్తున్నారు. టీడీపీ తోక పార్టీలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తూ దాడులు చేయిస్తున్నారు. 2024 ఎన్నికల యుద్ధంలో మరోసారి సీఎం జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల కోసం సీఎం జగన్ నేరుగా వేల కోట్లు రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. 8,288 మంది దళిత బిడ్డలు తిరుపతిలో ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు పొందుతున్నారు. దళితులకు 10 లక్షల గృహాలు మంజూరయ్యాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తున్నాము. ఇవన్నీ సీఎం జగన్ చొరవతో జరుగుతున్నాయి. దమ్మున నాయకుడు సీఎం జగన్.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 2010లో తిరుపతికి వచ్చాను. భూమన కరుణాకర్ రెడ్డి మాకు శక్తిని ఇచ్చారు. అసెంబ్లీలో అచ్చమైన తెలుగులో మాట్లాడేది కరుణాకర్ రెడ్డి మాత్రమే. నేడు అభినయ్ రెడ్డి.. తండ్రిని మించిన తనయుడిగా మారిపోయాడు. 2024లో అభినయ్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక వారి వెనుక బీసీలు నడిచారు. కానీ, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి వచ్చాక బీసీలు అందరు కాంగ్రెస్ వైపునకు వచ్చారు. 2019లో సీఎం జగన్ బీసీ సమావేశం అనంతరం బీసీలందరూ ముఖ్యమంత్రి జగన్ వెంట నడిచారు. మేమంతా సీఎం జగన్ వెంటే.. పార్టీలో, పదవులలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు, నేడు నెరవేర్చారు సీఎం జగన్. ఐదు మంది డిప్యూటీ సీఎంలను చేసిన గణత సీఎం వైఎస్ జగన్‌దే. కార్పోరేషన్, మార్కెట్ కమిటీలలో 60 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికి అయినా స్టేజ్ ఎక్కి నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా?. అలా, సీఎం జగన్ మాత్రమే చెబుతారు. ఆయన ఒక్కడికి మాత్రమే ఆ దమ్ము ఉంది. మా ధైర్యం సీఎం జగన్. 2024లో మరోసారి సింహంలా సింగిల్‌గా వస్తాడు.. 175/175 స్థానాల్లో విజయం సాధిస్తాడు. శ్రీకాకుళం, రాయలసీమ, కోస్తాలో సభలు మొదలైతే ఓ జాతరలా యాత్ర జరుగుతోంది. మరోవైపు టీడీపీ యాత్ర జనాలు లేక వెలవెలపోతోంది. మేమందరం సీఎం జగన్‌కు అండగా ఉంటాము. అభియనయ్ రెడ్డిని తిరుపతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. తిరుపతి సాక్షిగా సీఎం జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారు. 175 స్థానాల్లో గెలుపు మనదే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. తిరుపతిలో 75 సంవత్సరంలో జరగని అభివృద్ధి నేడు చేసి చూపిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, వారి తనయుడు అభినయ్ రెడ్డి. కాబోయే ఎమ్మెల్యే అభినయ్ రెడ్డికి అల్ ది బెస్ట్. యువతకు సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం ఇస్తారు. నిజమైన బడుగు, బలహీన వర్గాలకి మేలుచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే. పేదవాడి తలరాత మారాలంటే 2024 ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లాడు. కానీ దానికి పచ్చపత్రికలు వంత పడుతున్నాయి. నేడు తిరుపతిలో వైఎస్సార్సీపీ సభకు భారీగా జనాలు వచ్చారు. 175 స్థానాల్లో ఎవరు పోటీ చేసినా సీఎం జగన్ పోటీలో ఉన్నట్టు భావించి అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరుతున్నాను. అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం.. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు అణగారిన వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకునేవారు. కాన్నీ, సీఎం జగన్ అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అట్టడుగున ఉన్న వారిని క్రియాశీలక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. తిరుపతి కార్పొరేషన్లో 23 సీట్లు 46శాతం బీసీలకు ఇచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళలకు మేయర్ అవకాశం ఇచ్చింది మా పార్టీనే. రాష్ట్రంలో పెత్తందార్లకు చంద్రబాబు అండగా నిలుస్తుంటే సామాన్య పేద వర్గాల ప్రజల పక్షాన సీఎం జగన్ అండగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 80 వేల ఓట్లు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని గెలిపిస్తే, ఈరోజు 2 లక్షలు మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. తిరుపతి నగరంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు అభివృద్ధి చేశాం. మరో 12 మాస్టర్ ప్లాన్ రోడ్లు రానున్న రెండేళ్లలో అభివృద్ధి చేస్తున్నాం. వినాయక సాగర్ అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కింది. రాజకీయాలంటే వ్యాపారం కాదు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సీఎం జగన్ నెరవేస్తున్నారు. పైరవీలతో వచ్చిన వ్యక్తి కాదు.. ఫైటర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి సీఎం జగన్. రాజకీయాలంటే వ్యాపారం కాదు, నిచ్చెన కాదు, ప్రజలకు సేవ చేయాలనే తపన. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధితో 38 వేల ఎకరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్‌ది. 40 ఏళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి తిరుపతిలో చేసి చూపించాం. తిరుపతి అభివృద్ధి కోసం మా పోరాటం, ప్రజలకు మేలు చేయడంలో ఎక్కడా రాజీపడేది లేదు. అర్హత ఉంటే నా బిడ్డ అభినయ్‌ను గెలిపించండి, కాదు అంటే ఓడించండి. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్‌గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్‌కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
అధికారి ధిక్కారం..టెండర్ ‘అప్రూవ్’ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ అధికారుల్లో అలసత్వం, ధిక్కారం పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కూడా కొందరు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని రైస్‌మిల్లుల వద్ద లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసేందుకు ఈనెల 21న గ్లోబల్ ఈ– టెండర్ ప్రకటన విడుదల చేసింది. 22వ తేదీ నుంచి ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వానించారు. సెపె్టంబర్ 5వ తేదీని బిడ్డింగ్‌కు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే టెండర్ ప్రకటన విడుదల చేసినప్పటికీ, వేలానికి సంబంధించిన నిబంధనలేవీ ఆన్లైన్లో పెట్టలేదు. ఈఎంఐ, డిపాజిట్లు, అర్హతలు, ఇతర వేలం నిబంధనలేవీ ఆన్లైన్లో పొందుపరచలేదు. దీంతో బుధవారం సాయంత్రంలోగా టెండర్ వివరాలను అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ ఎండీ అనిల్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే పౌరసరఫరాల సంస్థలో టెండర్లకు సంబంధించి ఆన్లైన్ డిజిటల్ కీ మార్కెటింగ్ సెక్షన్ జీఎం వద్ద ఒకటి, పీడీఎస్ డీజీఎం వద్ద మరొకటి ఉంటుంది. ఈ మేరకు కమిషనర్ ఇద్దరు అధికారులకు స్వయంగా ఫోన్ చేసి, గ్లోబల్ టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్, అప్రూవ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ సెక్షన్ జీఎం తన వద్ద ఉన్న డిజిటల్ కీతో అప్లోడ్ చేశారు. కానీ పీడీఎస్ డీజీఎంగా ఉన్న అధికారి, అప్లోడ్ అయిన వివరాలను తన వద్ద ఉన్న కీతో అప్రూవ్ చేయాల్సి ఉండగా, లాగిన్ కావడానికి కూడా ఒప్పుకోలేదని సమాచారం. స్వయంగా సంస్థ ఎండీ ఫోన్ చేసి డిజిటల్ కీతో టెండర్ ప్రక్రియను అప్రూవ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ అధికారి ససేమిరా అన్నట్లు సమాచారం. డిజిటల్ కీ ఇవ్వడానికి కూడా నిరాకరించిన ఆ అధికారి బుధవారం రాత్రి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దాంతో బుధవారం రూ. వేల కోట్ల విలువైన టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్ చేయలేకపోయారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల సంస్థ అధికారులు.. పీడీఎస్ డీజీఎం పేరుపై ఉన్న డిజిటల్ కీ స్థానంలో మరో కీని రూపొందించి వివరాలను అప్లోడ్ చేశారు. బదిలీ చేశారనే కోపంతో..? పీడీఎస్ డీజీఎంగా ఉన్న ఆ అధికారిని ఇటీవలే హెడ్ ఆఫీస్ నుంచి వికారాబాద్‌కు బదిలీ చేశారు. అయితే అక్కడ జాయిన్ కాకుండా తిరిగి యథాస్థానంలో కొనసాగేందుకు పైరవీ చేసుకున్నా, ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి సంబంధించిన టెండర్ విధి విధానాలను అప్రూవ్ చేసే విషయంలో మొండిగా వ్యవహరించడం సంస్థలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పల్లెటూరి జంక్షన్.. విలేజ్ డ్రామా
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన విలేజ్ డ్రామా ‘సూర్యాపేట జంక్షన్’. నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో అనిల్ కుమార్ కత్ర గోడ, ఎన్. శ్రీనివాసరావు నిర్మించారు. ఈ చిత్రంలోని ‘చెంగు చెంగుమంటూ జింక పిల్లలాగా..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను నిర్మాత సి. కల్యాణ్ రిలీజ్ చేశారు. రోషన్ సాలూరి స్వరకల్పనలో ఎస్. సాయిచరణ్, సోరస్ పాడిన ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందించారు. ‘‘వ్యవస్థను సరిదిద్దే బాధ్యత యువతపై ఉంటుంది. కొత్త తరం ఓటర్లు చూడాల్సిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు హరి గౌర మరో స్వరకర్త. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్‌లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
బాలింతల్లో రక్తహీనతకు చెక్
సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆస్పత్రులకు ఇంజెక్షన్ల సరఫరా రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్‌బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు. దుష్ప్రభావాలు ఉండవు.. క్లినికల్ ట్రయల్స్‌లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు. మార్గదర్శకాలు జారీ చేశాం రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వెయిల్స్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ -
మా కార్యకర్తకు ఫోన్ చేసి నువ్వెంట్ర పీకేది...అనిల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్స్