సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కాలాన్ని విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) మెటీరియల్‌ను ఆన్‌లైన్ ద్వారా వినియోగించుకొవాలని ఎన్ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్) అనిల్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచే విద్యభ్యసిస్తూ పరీక్షల కోసం సిద్దమవ్వాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://sdmis.nios.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. (ట్రంప్ నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌ఓ స్పందన.. )
భారత ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ద్వారా అందిస్తున్న ఆన్‌లైన్ విద్యావిధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుదని పేర్కొన్నారు. ఇందుకు ఎంహెచ్‌ఆర్‌డీ ప్రారంభించిన జాతీయ ఆన్‌లైన్ విద్యా వేదిక ‘స్వయం’ (https://swayam.gov.in/) విద్యా కార్యక్రమాల వీడియో పాఠాల కోసం 32 DTH టీవీ ఛానళ్ల సముదాయం ‘స్వయం ప్రభ’ (SWAYAM PRABHA) ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఎన్‌ఐఓఎస్ అధ్యయన మెటిరీయల్‌తోపాటు వీడియో పాఠాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని.. కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సీబీఎస్‌సీ, ఎన్‌ఐఓఎస్ విద్యార్థులతోపాటు దేశంలోని అనేక మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆకాక్షించారు. ఎన్‌ఐఓస్ ఆన్‌లైన్ మెటీరియల్ నీట్, జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. (వైరలవుతున్న ఏపీ పోలీస్ అధికారిణి పాట! )
ఎన్‌ఐఓఎస్ సెకండరీ (10వ తరగతి) సీనియర్ సెకండరీ (12వ తరగతి)కి సంబంధించిన అన్ని ప్రధాన సబ్జెక్టుల ఆన్‌లైన్ మెటీరియల్ వీడియో పాఠాలు, ‘స్వయం’, స్వయం ప్రభ’లో ఎన్‌ఐఓఎస్ ఉచిత టీవీ ఛానల్: Channel No. 27 (PANINI) & Channel No. 28 (SHARDA) అలాగే యూట్యూబ్ ఛానల్‌లో పొందొచ్చు. ‘స్వయం’ పోర్టల్ (https://www.swayam.gov.in/NIOS) ద్వారా 18 సెకండరీ సబ్జెక్టులు, 19 సీనియర్ సెకండరీ సబ్జెక్టులు, 5 ఒకేషనల్ సబ్జెక్టులను అందిస్తుంది. స్వయం పోర్టల్‌లోని చర్చా వేదిక ద్వారా ఉపాద్యాయుల సహాయం పొందడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి https://www.swayam.gov.in/NIOS కోర్సుల్లో నమోదు (ఉచితం) చేసుకోవలసి ఉంటుంది. (ఆ అధికారులను తొలగించండి: గవర్నర్)
NIOS ద్వారా నడుపుతున్న ఉచిత టీవీ ఛానళ్లు Channel No. 27 (PANINI) ద్వారా సెకండరీ స్థాయి కోర్సులు Channel No. 28 (SHARDA) ద్వారా సీనియర్ సెకండరీ స్థాయి కోర్సులకు సంబంధించిన ప్రోగ్రామ్‌లను వివిధ DTH సర్వీస్ ప్రొవైడర్లు Airtel TV: Ch. No. 437 & 438, Videocon: Ch. No. 475 & 476, Tata Sky : Ch. No. 756, Dish TV : Ch. No. 946 & 947, DEN Network: Ch. No. 512 & 513.. వాటితోపాటు జియో టీవీ (SWAYAM PRABHA Ch. No. 27 & 28) లలో NIOS స్వయం ప్రభ ఛానెళ్లను వీక్షించవచ్చు.ఈ చానెళ్లను వీక్షిస్తున్నప్పుడు నిపుణులతో ప్రత్యక్షంగా సంభాషించి మీ సందేహాలను నివృతి చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment