Human Resources Development Department
-
ఫేస్‌బుక్‌తో జతకట్టిన సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో జత కట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు ‘డిజిటల్ సేఫ్టీ, ఆన్లైన్ వెల్బీయింగ్, అగ్మెంటెడ్ రియాలిటీ’ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ఆదివారం వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కనీసం 10 వేల మంది ఇందులో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. -
విద్యార్థులూ.. ‘లాక్డౌన్’లో ఇలా ప్రిపేర్ అవ్వండి!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలాన్ని విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) మెటీరియల్‌ను ఆన్లైన్ ద్వారా వినియోగించుకొవాలని ఎన్ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్) అనిల్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచే విద్యభ్యసిస్తూ పరీక్షల కోసం సిద్దమవ్వాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://sdmis.nios.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. (ట్రంప్ నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ స్పందన.. ) భారత ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) ద్వారా అందిస్తున్న ఆన్లైన్ విద్యావిధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుదని పేర్కొన్నారు. ఇందుకు ఎంహెచ్ఆర్డీ ప్రారంభించిన జాతీయ ఆన్లైన్ విద్యా వేదిక ‘స్వయం’ (https://swayam.gov.in/) విద్యా కార్యక్రమాల వీడియో పాఠాల కోసం 32 DTH టీవీ ఛానళ్ల సముదాయం ‘స్వయం ప్రభ’ (SWAYAM PRABHA) ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఎన్ఐఓఎస్ అధ్యయన మెటిరీయల్తోపాటు వీడియో పాఠాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని.. కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సీబీఎస్సీ, ఎన్ఐఓఎస్ విద్యార్థులతోపాటు దేశంలోని అనేక మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆకాక్షించారు. ఎన్‌ఐఓస్ ఆన్లైన్ మెటీరియల్ నీట్, జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. (వైరలవుతున్న ఏపీ పోలీస్ అధికారిణి పాట! ) ఎన్ఐఓఎస్ సెకండరీ (10వ తరగతి) సీనియర్ సెకండరీ (12వ తరగతి)కి సంబంధించిన అన్ని ప్రధాన సబ్జెక్టుల ఆన్లైన్ మెటీరియల్ వీడియో పాఠాలు, ‘స్వయం’, స్వయం ప్రభ’లో ఎన్ఐఓఎస్ ఉచిత టీవీ ఛానల్: Channel No. 27 (PANINI) & Channel No. 28 (SHARDA) అలాగే యూట్యూబ్ ఛానల్లో పొందొచ్చు. ‘స్వయం’ పోర్టల్ (https://www.swayam.gov.in/NIOS) ద్వారా 18 సెకండరీ సబ్జెక్టులు, 19 సీనియర్ సెకండరీ సబ్జెక్టులు, 5 ఒకేషనల్ సబ్జెక్టులను అందిస్తుంది. స్వయం పోర్టల్‌లోని చర్చా వేదిక ద్వారా ఉపాద్యాయుల సహాయం పొందడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి https://www.swayam.gov.in/NIOS కోర్సుల్లో నమోదు (ఉచితం) చేసుకోవలసి ఉంటుంది. (ఆ అధికారులను తొలగించండి: గవర్నర్) NIOS ద్వారా నడుపుతున్న ఉచిత టీవీ ఛానళ్లు Channel No. 27 (PANINI) ద్వారా సెకండరీ స్థాయి కోర్సులు Channel No. 28 (SHARDA) ద్వారా సీనియర్ సెకండరీ స్థాయి కోర్సులకు సంబంధించిన ప్రోగ్రామ్‌లను వివిధ DTH సర్వీస్ ప్రొవైడర్లు Airtel TV: Ch. No. 437 & 438, Videocon: Ch. No. 475 & 476, Tata Sky : Ch. No. 756, Dish TV : Ch. No. 946 & 947, DEN Network: Ch. No. 512 & 513.. వాటితోపాటు జియో టీవీ (SWAYAM PRABHA Ch. No. 27 & 28) లలో NIOS స్వయం ప్రభ ఛానెళ్లను వీక్షించవచ్చు.ఈ చానెళ్లను వీక్షిస్తున్నప్పుడు నిపుణులతో ప్రత్యక్షంగా సంభాషించి మీ సందేహాలను నివృతి చేసుకోవచ్చు. -
జేఈఈ మెయిన్ మారింది!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సంస్కరణలు తీసు కొచ్చింది. నిఫుణుల కమిటీ సిఫారసుల మేరకు స్కీం అండ్ సిలబస్‌లో భారీ మార్పులు చేసింది. పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సంఖ్యతోపాటు ప్రశ్నల విధానాన్ని కూడా మార్చేసింది. ఈ మేరకు మార్పు చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష కొత్త విధానాన్ని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో అందుబా టులో ఉంచింది. ఆబ్జెక్టివ్ విధానమే కాకుండా డిస్క్రిప్టివ్ విధానాన్ని కూడా తీసుకురావాలని భావించిన ఎంహెచ్ఆర్డీ.. ఈ మేరకు గతంలోనే నిఫుణల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే డిస్క్రిప్టివ్ విధానం కాకుండా సంఖ్యా సమాధాన (న్యూమరికల్ వాల్యూ) సంబంధిత ప్రశ్నలను జేఈఈ మెయిన్ పరీక్షల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఈ విధానం ఉండగా, ఇపుడు మెయిన్‌లోనూ ప్రవేశపెట్టింది. 75 ప్రశ్నలు.. 300 మార్కులు.. జేఈఈ మెయిన్‌లో ఇప్పటివరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 చొప్పున మొత్తం 90 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుండేవి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 360 మార్కుల కు ప్రశ్నపత్రం ఉండేది. నెగిటివ్ మార్కుల విధానం ఉండేది. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేసేవారు. కొత్త విధానంలో ప్రతి ప్రశ్నకు 4 మార్కులే ఇవ్వనున్నప్పటికీ, ప్రశ్నల సంఖ్యను 75కి కుదిం చారు. ప్రతి సబ్జెక్టు నుంచి గతంలో 30 ప్రశ్నలు ఉండగా..వాటిని 25కి తగ్గించారు. ఆ 25 ప్రశ్నల్లోనూ ఆబ్జెక్టివ్ విధానంలో 20 ప్రశ్నలు.. సంఖ్యా సమాధాన పద్ధతిలో మరో 5 ప్రశ్నలు ఇచ్చేలా రూపకల్పన చేశారు. మొత్తమ్మీద 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 15 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. న్యూమరికల్ వాల్యూ కింద ఇచ్చే 15 ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ విధానం ఉండదు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ , బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ప్రవేశ పరీక్షల్లోనూ న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఇచ్చేలా ఎంహెచ్ఆర్డీ మార్పులు చేసింది. బీఆర్క్‌లో ప్రవేశాలకు 77 ప్రశ్నలతో 400 మార్కులకు, బీప్లానింగ్‌లో ప్రవేశాలకు 100 ప్రశ్నలతో 400 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. బాలికలకు సగం ఫీజే.. జనరల్, జనరల్– ఈడ బ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీలే య ర్ బాలురకు ఫీజును రూ.650గా బాలికలకు రూ.325గా నిర్ణయిం చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు రూ.325గా ఫీజు ఖరారు చేశారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, పేటీఎం ద్వారా చెల్లించ వచ్చు. ఇవీ పరీక్ష కేంద్రాలు.. తెలంగాణలో: హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. అరగంట ముందు రావాల్సిందే.. జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ మైంది. ఈనెల 30లోగా ఆన్లైన్లో (jeemain. nta.nic.in) దరఖాస్తు చేసుకునేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 1వరకు ఫీజు చెల్లించ వచ్చు. దరఖాస్తుల్లో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు అక్టో బర్ 11 నుంచి 17 వరకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటి విడత పరీక్షలను 2020 జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్య ఆన్లైన్లో నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 2 విడతలుగా పరీక్షలు ఉంటాయి. మొదటి షిప్ట్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటలలోపే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. న్యూమరికల్ ప్రశ్నలే కీలకం మొదటి 20 ప్రశ్నలతో ఇబ్బంది లేదు. న్యూమరికల్ వాల్యూ విధానంలో అడిగే ఐదు ప్రశ్నలతోనే ఇబ్బంది. అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం సులభమే. ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం కొంత ఊరట. విద్యార్థి పర్ఫెక్షన్ను పరీక్షిం చేలా ఈ ప్రశ్నలుంటాయి. ప్రతి సబ్జెక్టులో 5 చొప్పున 15 ప్రశ్న లకు 60 మార్కులు కాబట్టి అవి చాలా కీలకం. మెయిన్ పాత పేపర్లతోపాటు గత అడ్వాన్స్డ్ పరీక్షలో ఇచ్చిన న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు చూసుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది. – ఉమాశంకర్, ఐఐటీ నిపుణుడు -
ఇంజనీరింగ్ 75,000, లా పట్టా 2,00,000
ముంబై: కాలేజీకి వెళ్లే అవసరం లేదు..పరీక్షలు రాయాల్సిన పని అంతకన్నా లేదు.. రూ.75వేలు పెడితే ఇంజినీరింగ్ డిగ్రీ, రూ.2 లక్షలు మనవి కావనుకుంటే లా డిగ్రీ చేతికి అందుతుంది. ఒక్క 45 రోజులు ఓపిక పడితే ఏకంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు చేతికి వచ్చేస్తాయి. న్యూస్18 రహస్య ఆపరేషన్‌లో ఈ చీకటి దందా వెలుగు చూసింది. 2016లో పూర్తి చేసినట్లుగా బీఏ డిగ్రీ పట్టా ఇచ్చేందుకు న్యూస్18 మీడియా వ్యక్తులతో నవీ ముంబైలోని కోపర్ఖైరానీ ప్రాంతానికి చెందిన కీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన ఏజెంట్ స్వప్నిల్ గైక్వాడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డిగ్రీని యూజీసీ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రముఖ వర్సిటీలు యశ్వంత్రావ్ చవాన్ యూనివర్సిటీ నుంచి గానీ సోలాపూర్ యూనివర్సిటీ నుంచి గానీ ఇస్తానన్నాడు. ఇందుకు 45 రోజుల సమయం పడుతుందని, 30 రోజుల తర్వాత డిగ్రీపట్టా జిరాక్స్ ప్రతులు, మరో 15 రోజుల తర్వాత ఒరిజినల్ పత్రాలను అందజేసేందుకు అంగీకరించాడు. ‘వర్సిటీకి గానీ, క్లాసులకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగానే సంబంధిత పత్రాల్లో ఉంటుంది. వర్సిటీ రికార్డుల్లో కూడా ఇవి జత పరిచి ఉంటా యి. ఇవి ఎక్కడా తనిఖీల్లో పట్టుబడేం దుకు అవకాశం లేదు’ అని అతడు భరోసా ఇచ్చాడు. ఇంజినీరింగ్, ఎల్ఎల్బీతోపాటు వివిధ వర్సిటీల్లో పీహెచ్డీ చేసినట్లుగా కూడా సర్టిఫికెట్లు ఇస్తాం కానీ, ఫీజులు వేర్వేరుగా ఉంటాయన్నాడు. మూడేళ్ల ఇంజినీరింగ్ పట్టాకైతే రూ.75 వేలు, ఇందులో సగం ముందుగా, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చాక మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. పీహెచ్డీ డిగ్రీలైతే ఆంధ్రా వర్సిటీ నుంచి ఇస్తామని చెప్పాడు. థీసిస్, సినాప్సిస్ కూడా అందజేస్తానన్నాడు. యూపీలోని ఓ వర్సిటీ నుంచి పొందినట్లుగా ఉండే లా డిగ్రీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని గైక్వాడ్ చెప్పాడు. వర్సిటీల సంఖ్య పెరగడంతో తమ మార్కెట్ కూడా పెరిగిందని గైక్వాడ్ అన్నాడు. ప్రతి వర్సిటీకి టార్గెట్లున్నాయి. వాటి లక్ష్యం నెరవేరేందుకు మాలాంటి వారిని అవి ఆశ్రయిస్తున్నాయి. వర్సిటీలకు అడ్మిషన్లు కావాలి, మాకేమో డబ్బులు కావాలి’ అని తెలిపాడు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పోఖ్రియాల్ ప్రకటించారు. -
త్వరలో ‘జాతీయ మదర్సా బోర్డు’
న్యూఢిల్లీ: దేశంలోని మదర్సాలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు వీలుగా జాతీయ మదర్సా బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మైనారిటీ విద్య జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఎంఈ) వెల్లడించింది. ఇందుకోసం ముందుగా గుర్తింపు లేకుండా పెద్ద సంఖ్యలో నడుస్తున్న మదర్సాల వివరాలను సేకరించనున్నట్లు తెలిపింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీ ఇటీవల సమావేశమై పలు ప్రతిపాదనలు రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లో మదర్సా బోర్డులు ఏర్పాటు చేయాలంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల కార్యకర్తలు, హెచ్చార్డీ అధికారులు సభ్యులుగా ఉంటారు. -
ఐఐటీల్లో పెరగనున్న సీట్లు
- వచ్చే విద్యాసంవత్సరంలో 1,500 వరకు పెరిగే అవకాశం - మొత్తంగా ఐఐటీల్లో 11 వేలకు చేరనున్న సీట్ల సంఖ్య సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఐఐటీల్లో సీట్లు పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని ఐఐటీలు 550 వరకు సీట్ల పెంపునకు నిర్ణయం తీసుకోగా, మిగతా ఐఐటీలు కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తద్వారా దేశ వ్యాప్తంగా 1,500 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. పెరిగిన సీట్లను వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీల జాయింట్ అడ్మిషన్ బోర్డు కసరత్తు చేస్తోంది. దేశంలోని ఐఐటీల్లో 9,660 సీట్లు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9,587 సీట్లు భర్తీ అయ్యాయి. 73 సీట్లు మిగిలిపోయాయి. మిగిలిపోయిన సీట్లు దాదాపు పెద్దగా డిమాండ్ లేని కొన్ని కోర్సులకు సంబంధించినవేనని అధికారులు చెబుతున్నారు. తాజాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచేందుకు ఐఐటీలు చర్యలు చేపట్టాయి. 2017–18 విద్యా సంవత్సరంలో ఐఐటీ హైదరాబాద్‌లో 40 సీట్లు, మండీలో 50, పట్నాలో 25, రోపార్‌లో 105, జమ్ము ఐఐటీలో 30 సీట్ల చొప్పున పెంచేందుకు గతంలోనే అవి చర్యలు చేపట్టాయి. మరోవైపు ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువాహటి, ఖరగ్‌పూర్, కాన్పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీలు వచ్చే విద్యా సంవత్సరంలో సీట్లను పెంచబోమని గత ఏడాది స్పష్టం చేసినా, తాజాగా పెంపు దిశగా కసరత్తు చేస్తున్నాయి. అయితే మానవవనరుల అభివృద్ధి శాఖ సీట్ల పెంపుపై గత ఏడాదే ఆదేశాలు జారీ చేసినందున తాజాగా అవి కూడా పెంపుపై కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బాంబే ఐఐటీ నాలుగేళ్ల బీటెక్ కోర్సులో 30 సీట్లు, ఎంటెక్‌లో మరి కొన్ని సీట్లు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. లక్షకు చేరనున్న విద్యార్థులు.. వచ్చే మూడేళ్లలో అంటే 2020 నాటికి ఐఐటీల్లో ప్రస్తుతం ఉన్న 72 వేల విద్యార్థుల సంఖ్యను లక్షకు పెంచాలని మానవవనరుల అభివృద్ధి శాఖ గత ఏడాదే ఆదేశాలు జారీ చేసింది. ఏటా 10 వేల చొప్పున (బీటెక్‌లో 4 వేల సీట్లు, ఎంటెక్‌లో 6 వేలు) సీట్లను పెంచాలని పేర్కొంది. సీట్ల పెంపుపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయ డంతో మిగతా ఐఐటీలూ పెంపుపై దృష్టి పెట్టాయి. మొత్తంగా వచ్చే విద్యా ఏడాదిలో ఐఐటీల్లో సీట్లు 11 వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
రెండు వారాల్లోగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు వేతనాలు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల వేతనాలను రెండు వారాల్లోగా మంజూరు చేస్తామని సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మానవ వనరుల అభివృద్ధి శాఖ తరుఫున మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో 6230 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పని చేస్తున్నారని వీరికి ఇప్పటి వరకు రూ. 6.33 కోట్ల వేతనాలు మంజూరు చేయగా మిగిలిన రూ. 14.82 కోట్లు విడుదల చేయాలన్న ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపామన్నారు. విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచే ప్రతిపాదన ఉందా అని వైఎస్సార్సీపీ సభ్యుడు మేకా శేషుబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూఇప్పట్లో పెంచే ఆలోచన లేదన్నారు. తాగునీటి సరఫరాలో భారీ అవినీతి.. మామూలేనన్న మంత్రి యనమల తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా చేస్తున్న నీటి సరఫరాలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకోవడం వల్ల.. ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు తప్ప ప్రజలకు ప్రయోజనం కలగడం లేదని వీటిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం ఇస్తూ అందుకు చర్యలు తీసుకుంటామనే హామీ ఇవ్వకుండా.. అన్ని చోట్లా అవినీతి ఉన్నట్లే సరఫరాలో కూడా అవినీతి జరుగుతోందన్నారు. 541 డాక్టర్ పోస్టుల భర్తీ: కామినేని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 541 డాక్టర్ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ రాష్ట్రంలో 149 పీహెచ్‌సీల నిర్మాణానికి 13వ ఆర్థిక సంఘం నుంచి రూ. 129.76 కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు 89 పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి చేశామన్నారు.