
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో జత కట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు ‘డిజిటల్ సేఫ్టీ, ఆన్‌లైన్ వెల్‌బీయింగ్, అగ్‌మెంటెడ్ రియాలిటీ’ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ఆదివారం వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కనీసం 10 వేల మంది ఇందులో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment