NIOS
-
హ్యుందాయ్ భారీ ఆఫర్, ఆ కారుపై లక్ష దాకా డిస్కౌంట్
సాక్షి,ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ తన పాపులర్ కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా హ్యుందాయ్ తొలి ఈవెహికల్ కోనా ఎలక్ట్రిక్‌తో పాటు హ్యుందాయ్ ఐ20, ఆరా, ఐ10 నియోస్, లాంటి కొన్ని కార్ల కొనుగోలుపై లక్ష రూపాయల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.1.2L NA పెట్రోల్, 1.2L Bi సీఎన్జీ 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాల్యూ ఫర్ మనీ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) హ్యుందాయ్ ఆరా హోండా అమేజ్, టాటా టిగోర్ లాంటి కార్లకు గట్టిపోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఆరాపై రూ. 25,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) హ్యుందాయ్ ఐ20 హ్యుందాయ్ ఐ20 మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్స్ కొనుగోళ్లపై రూ. 13 వేల వరకు నగదు రాయితీ, ఇతరప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంకా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 తగ్గింపు కూడా. హ్యుందాయ్ i20 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ , 1.2L NA పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం. హ్యుందాయ్ కోనా EV దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ తొలి ఈవీ కోనా ఇప్పుడు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇందులో ఎలాంటి ఎక్స్ఛేంజ్ డీల్స్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు అందుబాటులో లేవు. -
‘వర్చువల్ స్కూల్’పై కేంద్రం, కేజ్రీవాల్ వాదులాట
న్యూఢిల్లీ: ‘వర్చువల్ స్కూల్’పై కేంద్రం, కేజ్రీవాల్ సర్కారు వాదనలకు దిగాయి. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్‌ను బుధవారం ప్రారంభించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా దీన్ని ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. 9వ తరగతికి ప్రవేశ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు లైవ్ క్లాసులకు హాజరుకావొచ్చని.. రికార్డు చేసిన పాఠాలు, స్టడీ మెటీరియల్ కూడా వారికి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకూ సాయం అందిస్తామని చెప్పారు. గతేడాదే ప్రారంభించాం కేజ్రీవాల్ ప్రకటనపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) స్పందించింది. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్‌ను గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఎన్ఐఓఎస్ తెలిపింది. ‘మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా 2021, ఆగస్ట్ 14న వర్చువల్ స్కూల్‌ని ఎన్ఐఓఎస్ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా దీన్ని ప్రారంభించిందని చదివి నేను ఆశ్చర్యపోయాను. దేశంలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో దీన్ని మేము ప్రారంభించాం. ప్రస్తుతం 3వ సెషన్ జరుగుతోంద’ని ఎన్ఐఓఎస్ చైర్పర్సన్ సరోజ్ శర్మ తెలిపారు. వర్చువల్ స్కూల్ నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వానికి తమ సహాయం కావాలంటే తప్పకుండా చేస్తామన్నారు. అకడమిక్ సపోర్టు అందిస్తున్నాం తమకు అనుబంధంగా ఉన్న 7000 అధ్యయన కేంద్రాలు ప్రస్తుతం విద్యార్థులకు అకడమిక్ సపోర్టును అందిస్తున్నాయని ఎన్ఐఓఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. 1500 అధ్యయన కేంద్రాల ద్వారా నైపుణ్య ఆధారిత వృత్తి విద్యా కోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ అధ్యయన కేంద్రాల ద్వారా లైవ్ ఇంటరాక్టివ్ తరగతులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 2.18 లక్షల అసైన్మెంట్లను అభ్యాసకులు అప్లోడ్ చేశారని తెలిపింది. ఇటీవల పూర్తయిన అకడమిక్ సెషన్లో 4.46 లక్షల అసైన్మెంట్లు, ట్యూటర్ మార్క్ అసైన్మెంట్(టీఎంఏ) అప్లోడ్ అయ్యాయి. సబ్జెక్ట్ నిపుణులచే మూల్యాంకనం చేసిన టీఎంఏ మార్కులు అభ్యాసకులకు వారి డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయని ఎన్ఐఓఎస్ వివరించింది. (క్లిక్: సిసోడియా అరెస్ట్ అయితే మరీ మంచిదన్న కేజ్రీవాల్) -
టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులను గందరగోళానికి గురిచేయవద్దంటూ వ్యాఖ్యానించింది. అయితే.. ఈ ఏడాది సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, ఎన్ఐఓఎస్ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇది పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్థుల్లో తప్పుడు ఆశలను కలిగించటమే కాకుండా గందరగోళాన్ని సృష్టిస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులను, అధికారులను వారి విధులను వారు నిర్వర్తించనివ్వాలని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో తప్పుడు భావనను, గందరగోళాన్ని కలిగిస్తాయని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. సీఐఎస్సీఈ కూడా బోర్డు పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనుండగా కొన్ని రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. Supreme Court dismisses a plea seeking cancellation of offline exams for Class X and XII to be conducted by all State Boards, CBSE, ICSE and National Institute of Open Schooling (NIOS). Supreme Court says these kinds of petitions are misleading and give false hope to students. pic.twitter.com/lCZvFKLlMX — ANI (@ANI) February 23, 2022 -
విద్యార్థులూ.. ‘లాక్డౌన్’లో ఇలా ప్రిపేర్ అవ్వండి!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలాన్ని విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) మెటీరియల్‌ను ఆన్లైన్ ద్వారా వినియోగించుకొవాలని ఎన్ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్) అనిల్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచే విద్యభ్యసిస్తూ పరీక్షల కోసం సిద్దమవ్వాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://sdmis.nios.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. (ట్రంప్ నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ స్పందన.. ) భారత ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) ద్వారా అందిస్తున్న ఆన్లైన్ విద్యావిధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుదని పేర్కొన్నారు. ఇందుకు ఎంహెచ్ఆర్డీ ప్రారంభించిన జాతీయ ఆన్లైన్ విద్యా వేదిక ‘స్వయం’ (https://swayam.gov.in/) విద్యా కార్యక్రమాల వీడియో పాఠాల కోసం 32 DTH టీవీ ఛానళ్ల సముదాయం ‘స్వయం ప్రభ’ (SWAYAM PRABHA) ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఎన్ఐఓఎస్ అధ్యయన మెటిరీయల్తోపాటు వీడియో పాఠాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని.. కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సీబీఎస్సీ, ఎన్ఐఓఎస్ విద్యార్థులతోపాటు దేశంలోని అనేక మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆకాక్షించారు. ఎన్‌ఐఓస్ ఆన్లైన్ మెటీరియల్ నీట్, జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. (వైరలవుతున్న ఏపీ పోలీస్ అధికారిణి పాట! ) ఎన్ఐఓఎస్ సెకండరీ (10వ తరగతి) సీనియర్ సెకండరీ (12వ తరగతి)కి సంబంధించిన అన్ని ప్రధాన సబ్జెక్టుల ఆన్లైన్ మెటీరియల్ వీడియో పాఠాలు, ‘స్వయం’, స్వయం ప్రభ’లో ఎన్ఐఓఎస్ ఉచిత టీవీ ఛానల్: Channel No. 27 (PANINI) & Channel No. 28 (SHARDA) అలాగే యూట్యూబ్ ఛానల్లో పొందొచ్చు. ‘స్వయం’ పోర్టల్ (https://www.swayam.gov.in/NIOS) ద్వారా 18 సెకండరీ సబ్జెక్టులు, 19 సీనియర్ సెకండరీ సబ్జెక్టులు, 5 ఒకేషనల్ సబ్జెక్టులను అందిస్తుంది. స్వయం పోర్టల్‌లోని చర్చా వేదిక ద్వారా ఉపాద్యాయుల సహాయం పొందడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి https://www.swayam.gov.in/NIOS కోర్సుల్లో నమోదు (ఉచితం) చేసుకోవలసి ఉంటుంది. (ఆ అధికారులను తొలగించండి: గవర్నర్) NIOS ద్వారా నడుపుతున్న ఉచిత టీవీ ఛానళ్లు Channel No. 27 (PANINI) ద్వారా సెకండరీ స్థాయి కోర్సులు Channel No. 28 (SHARDA) ద్వారా సీనియర్ సెకండరీ స్థాయి కోర్సులకు సంబంధించిన ప్రోగ్రామ్‌లను వివిధ DTH సర్వీస్ ప్రొవైడర్లు Airtel TV: Ch. No. 437 & 438, Videocon: Ch. No. 475 & 476, Tata Sky : Ch. No. 756, Dish TV : Ch. No. 946 & 947, DEN Network: Ch. No. 512 & 513.. వాటితోపాటు జియో టీవీ (SWAYAM PRABHA Ch. No. 27 & 28) లలో NIOS స్వయం ప్రభ ఛానెళ్లను వీక్షించవచ్చు.ఈ చానెళ్లను వీక్షిస్తున్నప్పుడు నిపుణులతో ప్రత్యక్షంగా సంభాషించి మీ సందేహాలను నివృతి చేసుకోవచ్చు. -
ఇంటర్ ఫెయిలైన వారికి ‘ఆన్ డిమాండ్ పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ‘ప్రత్యేక ఆన్ డిమాండ్ పరీక్ష’ను నిర్వహించనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ బోర్డు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అదనంగా ఈ పరీక్షలను రాసే వీలును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారిలో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అందులో 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా తాము మొదటిసారి తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఎన్ఐవోఎస్ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందులో విద్యార్థులు తాము ఉత్తీర్ణులైన 2 సబ్జెక్టుల మార్కులను బదిలీ చేసుకొని (ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్), 3 సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షల ఫలితాలను నెల రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులు పరీక్షలు రాసిన 3 సబ్జెక్టులు పాస్ అయ్యాక మొత్తం 5 సబ్జెక్టుల మార్కులతో మార్కుల షీట్ ఇస్తామని వివరించింది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తమ www.nios.ac.in, https://sdmis.nios.ac.in వెబ్సైట్లలో సందర్శించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లో విద్యార్థులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం 040–24752859, 24750712 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వివరించింది. -
ఏప్రిల్ 27 నుంచి దూరవిద్య డీఎడ్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సు మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు 3 రోజులు జరుగుతాయని ఎన్ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఫీజు చెల్లించినా స్టడీ సెంటర్లు కేటాయిం చని వారు, 75% హాజరు లేని వారు జిల్లా విద్యాశాఖ అధికారులను సం ప్రదించి వారికి కేటాయించిన స్టడీ సెంటర్లలో రిపోర్టు చేయాలన్నారు. -
పరీక్ష రాయకపోయినా.. పాస్!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పరీక్షలు రాయకపోయినా వందలాది మంది విద్యార్థులను తరగతులను పాస్ చేయించేశారు అధికారులు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్స్కూల్లో 10, 11 తరగతులకు ఈ మార్చి - ఏప్రిల్‌లో పరీక్షలు జరిగాయి. సుమారు 2 లక్షల మంది విద్యార్థుల పరీక్షలకు హాజరయ్యారు. అయితే రాత్లామ్, ఉమేరియా, సీషోర్ ప్రాంతాల్లోని సెంటర్లలో వందలాదిమంది పరీక్షలకు విద్యార్థులు హాజరు కాలేదు. అయితే వారిని కూడా పాస్ చేయించారు అధికారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అటానమస్ బాడీ అయినప్పటికీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. విద్యార్థులు హాజరుకాకపోయినా.. పాస్ చేసిన ఘటనపై పలు ఫిర్యాదులు హెచ్ఆర్డీకి రావడంతో విజిలెన్స్ బృందాలను అక్కడకు పంపి సమాచారాన్ని తెప్పించుకుంది. ఈ ఘటనపై స్పందించిన ఎన్ఐఓఎస్ ఛైర్మన్ చంద్ర ఎస్ శర్మ మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తమేనని చెప్పారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఎన్ఐఓఎస్, కేవీ మధ్య ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) అధ్యయన, పరీక్ష కేంద్రాలుగా ఇకపై కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) పని చేయనున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఎన్ఐఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ సీబీ శర్మ, కేవీ కమిషనర్ సంతోష్‌కుమార్ మల్ ఒప్పందం చేసుకున్నట్లు ఎన్ఐఓఎస్ హైదరాబాద్ రీజనల్ డెరైక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. దీంతో కేంద్రీయ విద్యాలయాల్లోని అధ్యయన కేంద్రాల్లో ఎన్ఐఓఎస్ శిక్షణ తరగతులు, బోధన, పరీక్షలు నిర్వహించుకునే వీలు కలిగిందన్నారు. -
ఇంటి నుంచే తెలుగులో పాఠాలు
గుంటూరు: ఇంటి నుంచే దృశ్య, శ్రవణ విధానంలో దూరవిద్యను అభ్యసించే సదుపాయం త్వరలోనే చేరువ కానుందని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ పార్వతి తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వర్చువల్ ఓపెన్ స్కూలింగ్ సదస్సుకు హాజరై వచ్చిన ఆమె మంగళవారం సాక్షి ప్రతినిధితో విశేషాలు పంచుకున్నారు. వివిధ పనుల్లో ఉన్నవారు తరగతులకు హాజరుకాలేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (ఎన్ఐఓఎస్) ఆన్లైన్లో పాఠాలను ఉంచి నెట్ ద్వారా చదువుకునే వీలు కల్పించాలని నిర్ణయించినట్టు పార్వతి తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో పాఠాలు పెట్టినప్పటికీ అవి ఆంగ్లంలో ఉండడం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీన్ని గుర్తించిన ఎన్ఐఓఎస్ ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తెలుగులో పాఠాలు చదువుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై చీటింగ్ ఆరోపణలు!
-
టీడీపీ ఎమ్మెల్యే బదులు పరీక్ష రాసిన మరో అభ్యర్థి!
(పోలవరపు వాసుదేవ) పెనమలూరుః పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ రాస్తున్న ఇంటర్ వన్ సిట్టింగ్ పరీక్ష వివాదస్పదంగా మారింది. ఆయన సింగపూర్‌లో ఉండగా మరో వ్యక్తి పరీక్షకు హాజరయ్యాడని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాలను విద్యార్థులు కొందరు మీడియాకు అందజేశారు. అయితే స్క్వాడ్,పరీక్షా కేంద్ర నిర్వాహకులు మాత్రం ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. స్థానికుల కథనం ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) ఇంటర్ వన్ సిట్టింగ్ పరీక్షకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గంగూరు మహిళా కాలేజీ ద్వారా ఫీజు చెల్లించారు. పోరంకిలోని తాతినేని గోపయ్య అకాడమీకి చెందిన ఎస్‌కెవీఎస్ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంను ఆయనకు కేటాయించారు. ఈ పరీక్షలు గత నెల 27న మొదలయ్యాయి. నవంబర్ పది వరకు జరుగుతాయి. కాగా ఇప్పటికి జరిగిన మూడు పరీక్షల్లో ఎమ్మెల్యే రెండు పరీక్షలకు హాజరైనట్లు ఉంది. ఒక పరీక్షకు గైర్హాజరయ్యారు. సోమవారం ఫిజిక్స్ పరీక్ష జరిగింది. అయితే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హాల్‌టిక్కెట్‌తో మరో వ్యక్తి పరీక్షకు హాజరయ్యాడని పలువురు మీడియాకు ఉప్పందించారు. వాస్తవానికి ఎమ్మెల్యే ఆదివారం సింగపూర్‌కు వెళ్లారు. మీడియా ప్రతినిధులు పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న స్క్వాడ్ ఎండి.రషీద్‌ను ఈ విషయమై ప్రశ్నించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. తాము ఎమ్మెల్యేకు కేటాయించిన గది (4/4) పరిశీలించాలని కోరగా స్క్వాడ్‌తో పాటు కాలేజీ యాజమాన్యం మీడియాను అనుమతించలేదు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పావు గంట తరువాత మీడియాను లోపలకు అనుమతించారు. పరీక్ష జరుగుతున్న గదిలోకి వెళ్లి చూడగా ఎమ్మెల్యేకు కేటాయించిన హాల్ టిక్కెట్- బి 1614301455 స్ధానంలో ఎవరూ కనిపించలేదు. అయితే పరీక్ష ప్రారంభమై అర గంటకు పైగా గడిచినా రికార్డులో అటెండెన్స్ చూపలేదు. ఈ విషయమై స్క్వాడ్‌ను విలేకరులు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. పరీక్ష రాస్తున్న విద్యార్థులు వివరాలు మీడియాకు చెప్పడానికి భయపడ్డారు. ఎమ్మెల్యే స్థానంలో మరో వ్యక్తి పరీక్ష రాయటానికి వచ్చి,హడావుడి జరగటంతో తప్పించారని నూతక్కి నాగేశ్వరరావు అనే విద్యార్థి నాయకుడు ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము పరీక్ష రాసిన వ్యక్తి ఫోటో తీశామని,అలాగే బోడె ప్రసాద్ సంతకం చేసిన ఆన్సర్ షీట్ (నెంబర్ 112782)ఫోటో తీసి మీడియాకు అందచేశారు. ఎమ్మెల్యే అధికార దుర్వినియోగంతో ఈ పని చేశారని,కష్టపడి చదివిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవ్వరూ పరీక్ష రాయలేదుః ఈ విషయమై పరీక్షకు స్క్వాడ్‌గా ఉన్న రషీద్‌ను వివరణ కోరగా, ఎమ్మెల్యే స్థానంలో ఎవరూ పరీక్ష రాయలేదని చెప్పారు. **