
సాక్షి,ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ తన పాపులర్ కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా హ్యుందాయ్ తొలి ఈవెహికల్ కోనా ఎలక్ట్రిక్‌తో పాటు హ్యుందాయ్ ఐ20, ఆరా, ఐ10 నియోస్, లాంటి కొన్ని కార్ల కొనుగోలుపై లక్ష రూపాయల దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.1.2L NA పెట్రోల్, 1.2L Bi సీఎన్‌జీ 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాల్యూ ఫర్ మనీ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్)
హ్యుందాయ్ ఆరా
హోండా అమేజ్, టాటా టిగోర్ లాంటి కార్లకు గట్టిపోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఆరాపై రూ. 25,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!)
హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ ఐ20 మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్స్ కొనుగోళ్లపై రూ. 13 వేల వరకు నగదు రాయితీ, ఇతరప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంకా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 తగ్గింపు కూడా. హ్యుందాయ్ i20 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ , 1.2L NA పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం.
హ్యుందాయ్ కోనా EV
దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ తొలి ఈవీ కోనా ఇప్పుడు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇందులో ఎలాంటి ఎక్స్ఛేంజ్ డీల్స్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్‌లు అందుబాటులో లేవు.