Hyundai Exter First Unit Rolls Out: భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీ తన 'ఎక్స్‌టర్' (Exter) ఎస్‌యువిని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే గతంలో అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఈ కారుకి సంబంధించిన టీజర్స్, ఫోటోలు వంటివి కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా దేశీయ విఫణిలో విడుదలయ్యే ఎక్స్‌టర్ ఫస్ట్ యూనిట్ చెన్నైలోని కంపెనీ ప్లాంట్ విడుదలైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హ్యుందాయ్ 2023 జులై 10న ఇండియన్ మార్కెట్లో విడుదలచేయనున్న ఎక్స్‌టర్ ఫస్ట్ యూనిట్లు ఎట్టకేలకు వెల్లడించింది. ఇప్పటికే రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది, డెలివరీలు జులై చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారుకి బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రకటించింది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. కలర్ ఆప్షన్స్‌లో అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ ప్లస్ అబిస్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, కాస్మిక్ బ్లూ ప్లస్ అబిస్ బ్లాక్, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ టైటాన్ గ్రే, టామ్‌బాయ్ ఖాకీ, టామ్‌బాయ్ ఖాకీ ప్లస్ అబిస్ బ్లాక్ అనే మోనో టోన్ అండ్ డ్యూయెల్ టోన్ వున్నాయి.
డిజైన్ పరంగా హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్‌లు లభిస్తాయి. వెనుక వైపు వర్టికల్ టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. ఈ SUV 3,595 మిమీ పొడవు, 1,595 మిమీ వెడల్పు, 1,575 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది.
(ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?)
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ మొదలైనవి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబిడీ, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ ఎంకరేజ్ మొదలైనవి ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!)
హ్యుందాయ్ కొత్త ఎక్స్‌టర్ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 83 హెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్ + CNG ఇంజన్ ద్వారా కూడా శక్తిని పొందుతుంది. సిఎన్‌జీ ఇంజన్ తక్కువ అవుట్‌పుట్ గణాంకాలను కలిగి ఉంటుంది, కానీ మైలేజ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అధికారిక ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 6 నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment