
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్ పార్క్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇన్నోవేషన్ (ఐఏఎస్‌పీ) ఉపాధ్యక్షురాలిగా దీపన్వితా చటోపాధ్యాయ ఎన్నకయ్యారు. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఐఏఎస్‌పీ 42వ ప్రపంచ సదస్సులో ఐకేపీ నాలెడ్జ్ పార్క్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపన్వితా చటోపాధ్యాయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
ఐఏఎస్‌పీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో రెండేళ్ల పదవీకాలానికి దీపన్వితా చటోపాధ్యాయ సేవలందిస్తారు. ఐఏఎస్‌పీ బోర్డులో 15 దేశాల నుండి 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రపంచ ఆవిష్కరణ వ్యూహాలను రూపొందించడానికి సంవత్సరానికి రెండుసార్లు ఐఏఎస్‌పీ బోర్డు సమావేశమవుతుంది.
భారత ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లో అగ్రగామిగా ఉన్న దీపన్విత హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్స్ రీసెర్చ్ పార్కును ఏర్పాటు చేశారు. బెంగళూరులో ప్రముఖ హార్డ్ వేర్ ఇంక్యుబేటర్ అయిన ఐకేపీ ఈడెన్ ను ప్రారంభించింది. ఆమె నాయకత్వంలో ఐకేపీ 1850కి పైగా ఇన్నోవేషన్ ప్రాజెక్టులు, స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది.