vice president
-
టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది -
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కు అస్వస్థత
-
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources— ANI (@ANI) March 9, 2025 -
అక్రమ వలసదార్లను ఎప్పుడు తరిమేస్తారు?
ఛత్రపతి శంభాజీ నగర్: దేశంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదార్లు జోక్యం చేసుకుంటున్నారని, నిర్ణయాత్మక శక్తులుగా మారుతున్నారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికా నుంచి అక్రమ వలసదార్లను అక్కడి ప్రభుత్వం బలవంతంగా బయటకు పంపిస్తోందని పరోక్షంగా ప్రస్తావించారు. మన దేశంలో అలాంటి ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలంటూ ప్రజలంతా ప్రశ్నించాలని సూచించారు. శనివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడా యూనివర్సిటీ 65వ స్నాతకోత్సవంలో జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగించారు. అక్రమ వలసదార్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మన దేశంలో నివసించే హక్కు లేని కోట్లాది మంది ఇక్కడే చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. ఇక్కడే బతుకుతున్నారు. మన వనరులపై కన్నేశారు. వాటి కోసం డిమాండ్ చేస్తున్నారు. మన విద్య, ఆరోగ్యం, గృహం.. ఇలా అన్నింటిపైనా వారి దృష్టి పడింది. వారు మరింత ముందుకెళ్తున్నారు. మన ఎన్నికల ప్రక్రియలో సైతం జోక్యం చేసుకుంటున్నారు. అక్రమ వలసదార్ల సమస్యపై అందరికీ అవగాహన కలి్పంచాలి. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలి’’అని పేర్కొన్నారు. జాతీయవాదమే మన మతమని ఉద్ఘాటించారు. జాతీయవాదానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశంలో బలవంతపు మత మారి్పళ్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధన్‌ఖడ్ ఆరోపించారు. నచి్చన మతాన్ని స్వీకరించే హక్కు పౌరులందరికీ ఉందని చెప్పారు. అయితే, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి మతం మార్చడం దారుణమని విమర్శించారు. మత మారి్పళ్ల ద్వారా భారతదేశ జనాభా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి, దేశంపై ఆధిపత్యం చెలాయించడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కొన్ని దేశాల్లో మతమారి్పళ్ల వల్ల మెజార్టీ సమూహాలు మైనారీ్టలుగా మారిపోయాయని గుర్తుచేశారు. దేశం అభివృద్ధి చెందాంటే సామాజిక సామరస్యం అవసరమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి మన రాజ్యాంగాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి, పూర్తిగా అర్థం చేసుకోవాలని జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్యాంగం మనకు ఎంతగా అర్థమైతే మనం జాతీయవాదం వైపు అంతగా మొగ్గుచూపుతామని తెలిపారు. మనకు జాతీయవాదమే అతిపెద్దగా మతంగా భావించాలన్నారు. కొందరు దుషు్టలు విదేశాల నుంచి వస్తున్న నిధులతో మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
నియామకాల్లో సీజేఐ ప్రమేయమా?
భోపాల్: సీబీఐ డైరెక్టర్ వంటి ఉన్నతస్థాయి కార్యనిర్వాహక పదవుల నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామి కావడం ఏ మేరకు సబబని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు. ‘‘చట్టప్రకారమే అయినా సరే, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ప్రక్రియలో సీజేఐ ఎలా పాల్గొంటారు? నాటి పాలకులు న్యాయతీర్పు తాలూకు ఒత్తిడికి లొంగడంతో ఈ నిబంధన పుట్టుకొచ్చింది. దీనికి చట్టపరంగా హేతుబద్ధత ఉందా?’’ అని ప్రశ్నించారు. శుక్రవారం భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కార్యనిర్వాహక కార్యకలాపాలు న్యాయవ్యవస్థ నిర్ణయాలు, తీర్పుల ద్వారా జరగడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి నిబంధనలను పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. పాలనపరమైన వ్యవహారాల్లో శాసన, న్యాయవ్యవస్థల జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. కోర్టులకున్న న్యాయసమీక్ష అధికారం సముచితమే అయినా రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రం అంతిమంగా పార్లమెంటుదేనని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా పలు అంశాలపై న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా ఆయన పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘న్యాయవ్యవస్థ తీర్పుల రూపంలో ప్రజల ముందుకు రావాలే తప్ప ఇతరేతర వ్యక్తీకరణలకు పూనుకోవడం ఆ వ్యవస్థ గౌరవాన్నే భంగపరుస్తుంది. సామాజికాంశాలపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం ప్రపంచంలో మరెక్కడా జరగదు’’ అన్నారు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సాకుతో అధికారపు అతిశయం ప్రదర్శించరాదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. -
ఆశల ఊసుల నడుమ... ఏఐ శిఖరాగ్రం
పారిస్: 100కు పైగా దేశాల అధినేతలు, అగ్రనేతలు. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సారథులు. అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు. కృత్రిమ మేధ రంగానికి సంబంధించిన మేధావులు. నిపుణులు. సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మొదలైన రెండు రోజుల ఏఐ శిఖరాగ్ర సదస్సు వీరందరినీ ఒక్కచోట చేర్చింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరుగుతున్న తొలి అధికారిక సదస్సు కావడం విశేషం. నానాటికీ అనూహ్యంగా మారిపోతున్న ఏఐ రంగంలో అపార అవకాశాలను ఒడిసిపట్టుకోవడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సదస్సులో లోతుగా మథనం జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మానవాళి చరిత్రలోనే అత్యంత అరుదైందిగా చెప్పదగ్గ శాస్త్ర, సాంకేతిక విప్లవం ఏఐ రూపంలో మన కళ్లముందు కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఈ అవకాశాన్ని ఫ్రాన్స్, యూరప్ రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం మరింత మెరుగ్గా జీవించేందుకు, ఎంతగానో నేర్చుకునేందుకు, మరింత సమర్థంగా పని చేసేందుకు, మొత్తంగా గొప్పగా జీవించేందుకు అపారమైన అవకాశాలను ఏఐ అందుబాటులోకి తెస్తోంది’’అని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన 40 ఏళ్ల వాన్స్ అగ్ర రాజ్యానికి తొలిసారిగా ఓ అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. ఉపాధ్యక్షునిగా ఆయనకిదే తొలి విదేశీ పర్యటన కూడా. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన తొలిసారి భేటీ అవనున్నారు. అందులో భాగంగా మంగళవారం మాక్రాన్‌తో విందు భేటీలో పాల్గొంటారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా కల్లోలంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృక్కోణాన్ని మాక్రాన్‌కు వివరించడంతో పాటు ఆయన సందేశాన్ని కూడా వాన్స్ అందజేస్తారని చెబుతున్నారు. తెలుగు మూలాలున్న వాన్స్ సతీమణి ఉష కూడా తన ముగ్గురు పిల్లలతో సహా ఈ అధికారిక పర్యటనలో పాల్గొంటుండటం విశేషం. చైనా తరఫున ఉప ప్రధాని జాంగ్ జువోకింగ్ ఏఐ సదస్సులో పాల్గొంటున్నారు.మోదీ సహ ఆతిథ్యంఅంతర్జాతీయ ఏఐ రంగం అంతిమంగా అమెరికా, చైనా మధ్య బలప్రదర్శనకు వేదికగా మారకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఐటీతో పాటు అన్నిరకాల టెక్నాలజీల్లోనూ గ్లోబల్ పవర్‌గా వెలుగొందుతున్న భారత్ ఏఐలోనూ కచి్చతంగా అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసి తీరాలని ప్రధాని మోదీ ఇటీవల పదేపదే చెబుతున్నారు. అందులో భాగంగా టెక్ దిగ్గజాలతో మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు పారిస్ ఏఐ శిఖరాగ్రం సదవకాశమని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు మాక్రాన్‌తో పాటు మోదీ సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండటం విశేషం. మంగళవారం సదస్సునుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఏఐ వృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంపై భారత ఆలోచనలను దేశాధినేతలు, టెక్, ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు తదితరులతో ఆయన వివరంగా పంచుకోనున్నారు. అనంతరం ఆయా కంపెనీల సీఈఓలతో విడిగా ముఖాముఖి భేటీ కానున్నారు.తెరపైకి ‘కరెంట్ ఏఐ’ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి టెక్, ఏఐ దిగ్గజాల సీఈఓలు, అత్యున్నతాధికారులు సదస్సులో పాల్గొంటున్నారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సంస్కృతి తదితర రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను మరింత ప్రభావవంతంగా మార్చడం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా ‘కరెంట్ ఏఐ’పేరిట ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పారిస్ శిఖరాగ్రం ఏఐకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ కోసం జరుగుతున్న తొట్ట తొలి ప్రయత్నమని మొజిల్లా పబ్లిక్ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ లిండా గ్రిపిన్ అన్నారు. ఏఐ అభివృద్ధి ప్రస్థానంలో దీన్ని నిర్ణాయక క్షణంగా అభివరి్ణంచారు. ‘‘ఏఐపై గుత్తాధిపత్యం రూపంలో కీలక సాంకేతిక పరిజ్ఞానంపై అజమాయిషీ కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు. మానవాళి ప్రయోజనాలను తీర్చడమే ఏకైక ప్రాతిపదికగా ఏఐ ఫలాలు ప్రపంచమంతటికీ అందాలి’’అని యురేíÙయా గ్రూప్ సీనియర్ జియోటెక్నాలజీ అనలిస్టు నిక్ రెయినర్స్ అభిప్రాయపడ్డారు. పారిస్ శిఖరాగ్రాన్ని ఆ దిశగా భారీ ముందడుగుగా అభివర్ణించారు. శిఖరాగ్రం వేదికగా ఏఐ రంగంలో యూరప్‌లో భారీ పెట్టుబడి ప్రకటనలు వెలువడుతాయని అక్కడి దేశాలు ఆశిస్తున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఏఐ రంగంలో ఫ్రాన్స్ ఏకంగా 113 బిలియన్ డాలర్ల మేరకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రకటించనున్నట్టు మాక్రాన్ స్పష్టం చేశారు. -
యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి ధన్కర్
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు చేశారని యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పరిస్థితులు సద్దుమణిగాయని, దీనిని చూస్తుంటే యూపీ సర్కారు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదో ఇట్టే గ్రహించవచ్చని అన్నారు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మెచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి(Vice President) అన్నారు. ఈ భూమిపై ఎక్కడా ఇంతటి భారీ కార్యక్రమం జరిగివుండదు. కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ధన్కర్ పేర్కొన్నారు.మహా కుంభమేళాలో లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించారని, యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్(Maha Kumbh)కు వచ్చిన వారి సంఖ్య అమెరికా జనాభాకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారని ఆయన అన్నారు. తాను కుంభ్ స్నానం కోసం నీటిలోకి దిగిన క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అని ధన్కర్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం మరొకటి లేదని, అంకితభావం, సామర్థ్యం, సంస్కృతి పరిజ్ఞానం, దేశానికి సేవ చేసే స్ఫూర్తి ఇక్కడ ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. -
పార్లమెంట్ లో ఉపరాష్ట్రపతి ప్రసంగం
-
లష్కరే నేత అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్–దవా ఉపాధ్యక్షుడు హఫీజ్ అబ్దుల్ రహ్మాన్(76) మక్కి లాహోర్‌లో చనిపోయాడు. మధుమేహం ముదిరిపోవడంతో కొంతకాలంగా అతడు లాహోర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, శుక్రవారం వేకువజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడని జమాత్ ఉద్–దవా తెలిపింది. ఉగ్ర నిధుల కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇతడికి 2020లో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2023లో ఇతడిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో, మక్కి ఆస్తుల సీజ్‌తోపాటు ప్రయాణ, ఆయుధ నిషేధం అమల్లో ఉంది. అప్పటి నుంచి మక్కి బహిరంగంగా కనిపించడం మానేశాడు. అప్పట్నుంచి, జమాత్ ఉద్ దవా పేరుతో విరాళాలు సేకరించడం, కొత్త వాళ్లను చేర్చుకోవడం ప్రారంభించాడు. 2008 డిసెంబర్ 26న సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా ముంబైలోకి ప్రవేశించిన ముష్కరులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. వీరి కాల్పుల్లో 100 మందికిపైగా చనిపోవడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉంటున్న హఫీజ్ సయీద్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఏప్రిల్‌లో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. -
గూగుల్ ఇండియా మేనేజర్‌గా ప్రీతి
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నూతన కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియమితులయ్యారు. గూగుల్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా ఇటీవల పదోన్నతి పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఆమె చేరారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలను వినియోగదారులందరికీ అందించడం, ఆవిష్కరణలను పెంపొందించేందుకు వ్యూహాన్ని రూపొందించడంలో ప్రీతి కీలకపాత్ర పోషిస్తారని గూగుల్ సోమవారం ప్రకటించింది. ‘జీ–టెక్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన ప్రీతి ఇప్పుడు గూగుల్ ఇండియా విక్రయాలు, కార్యకలాపాల వ్యవహారాలకు నేతృత్వం వహిస్తారు. ‘ఇది భారత్ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కంపెనీ నిబద్ధతను పెంచుతుంది’ అని తెలిపింది. గూగుల్‌కు ముందు ఆమె నాట్‌వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ బ్యాంక్‌లలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు. భారత్‌లోని విభిన్న మార్కెట్లలో వ్యాపార వ్యూహం, ఉత్పత్తి నిర్వహణ, కార్యాచరణ వంటి అంశాలలో నైపుణ్యం సాధించారు. -
ధన్‌ఖడ్‌పై ‘అవిశ్వాసం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న ధన్‌ఖడ్‌ను రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పాయి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆమ్ ఆద్మీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభ చరిత్రలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం గట్టిగా పోరాడుతామన్న సందేశం ఇవ్వడానికే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. ఆయన అన్ని పరిధులు అతిక్రమించారని, అందుకే నోటీసు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యనాయకులపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నా ధన్‌ఖఢ్ పట్టించుకోలేదని విమర్శించారు.ఈ మేరకు జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ధన్‌ఖఢ్ విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. సభను ఆయన నడిపిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ప్రతిపక్షాలపై ఆయన వివక్ష చూపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. ధన్‌ఖఢ్ కేవలం ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యసభ చైర్మన్‌గా నిజాయతీగా పనిచేయడం లేదని తప్పుపపట్టారు. ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తప్పించడానికి అవసరమైన బలం తమకు లేదని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు సాగరికా ఘోష్ చెప్పారు. అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే పోరాడుతున్నారని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తేలి్చచెప్పారు. ధన్‌ఖడ్‌ను చూసి గర్వపడుతున్నాం: రిజిజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించడానికి విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం చాలా విచారకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ధన్‌ఖడ్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు. ఆయన చాలా హూందాగా, పక్షపాతానికి తావులేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఎంతమాత్రం లేదని, రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉందని రిజిజు గుర్తుచేశారు. లోక్‌సభలో మూడుసార్లు నోటీసులు లోక్‌సభలో స్పీకర్‌ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1954 డిసెంబర్ 18న అప్పటి స్పీకర్ జి.వి.మౌలాంకర్, 1966 నవంబర్ 24న హుకం సింగ్, 1987 ఏప్రిల్ 15న బలరాం జక్కడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. మౌలాంకర్, బలరాం జక్కడ్‌పై తీర్మానాలు వీగిపోయాయి. హుకుం సింగ్‌పై ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. ఓటింగ్‌లో పాల్గొనడానికి 50 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు సముఖత వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం. ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది సభ్యులు అంగీకరించాలి. -
అధ్యక్షుడినే చంపేయిస్తా
మనీలా: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌లో రెండు శక్తివంత రాజకీయ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గిరాజుకుంటోంది. ఈ కుటుంబాల మధ్య పాత వైరం మరోసారి బట్టబయలైంది. తన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్ మార్కోస్ జూనియర్‌ను చంపేస్తానని ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టే బహిరంగ ప్రకటన చేసి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించారు. సారా డ్యుటెర్టే తండ్రి రోడ్రిగో డ్యుటెర్టేకు, ఫెర్డినాడ్ తండ్రి మార్కోస్ సీనియర్‌కు మధ్య చాన్నాళ్ల క్రితం బద్దశత్రుత్వం ఉన్న విషయం తెల్సిందే. ఫెర్డినాడ్ జూనియర్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా రాజీనామాచేసినప్పటికీ సారా ఇంకా దేశ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవలికాలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులకు అస్సలు పొసగట్లేదు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సారా ఆన్లైన్లో మీడియాసమావేశంలో మాట్లాడారు. ‘‘నా యోగక్షేమాల గురించి ఎవరికీ ఎలాంటి భయాలు అక్కర్లేదు. అయితే మీకో విషయం చెప్తా. ఇటీవల నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడా. నా ప్రాణాలను హాని ఉండి, నన్ను ఎవరైనా చంపేస్తే వెంటనే దేశాధ్యక్షుడు ఫెర్డినాడ్, ఆయన భార్య లిజా అరనేటా, పార్లమెంట్లో ప్రతినిధుల సభ స్పీకర్ మారి్టన్ రోమాల్డేజ్ను చంపేసెయ్. ప్రాణాలు పోయాయని నిర్ధారించుకునేదాకా దాడిచెయ్ అని చెప్పా. అందుకే తను సరేనన్నాడు. ఇది సరదాకి చెప్పట్లేను. ఇది జోక్ కానేకాదు’’అని సారా చెప్పారు. అధ్యక్షుడిని అంతం చేయాలని కాంట్రాక్ట్ కిల్లర్‌తో మాట్లాడినట్లు స్వయంగా ఉపాధ్యక్షురాలే ప్రకటన చేయడంతో అధ్యక్షుడి కమ్యూనికేషన్స్ కార్యాలయం అప్రమత్తమైంది. ‘‘అధ్యక్షుని ప్రాణాలకు ఇంతటి హాని పొంచి ఉందని తెలిశాక భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం. రక్షణ బాధ్యతలను అధ్యక్షుడి రక్షణ దళాలకు అప్పజెప్తున్నాం. సారా వ్యాఖ్యలపై తగు చర్యలకు సిద్ధమవుతున్నాం’’అని కార్యనిర్వాహక కార్యదర్శి లూకాస్ బెర్సామిన్ చెప్పారు. 2022 మేలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మార్కోస్, ఉపాధ్యక్షురాలిగా సారా పోటీచేసి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు, తదితర అంతర్జాతీయ, దేశీయ అంశాల్లో ఇద్దరు నేతల మధ్య ఇటీవలికాలంలో తీవ్ర బేధాభిప్రాయాలొచ్చాయి. ఈమధ్య ఓసారి అధ్యక్షుడి తలను నరుకుతున్నట్లు ఆలోచనలొస్తున్నాయని సారా వ్యాఖ్యానించారు. ‘‘అధ్యక్షుడు అవినీతిలో కూరుకుపోయారు. పరిపాలించే సత్తా లేదు. అబద్ధాలకోరు. మా కుటుంబాన్ని రాజకీయంగా బలహీనపరచాలని కుట్ర పన్నుతున్నారు’’అని సారా ఆరోపించారు. సారా తండ్రి రోడ్రిగో డ్యుటెర్టో ఫిలిప్పీన్స్‌లో కరడుగట్టిన రాజకీయనేతగా పేరొందారు. దేశంలో మాదకద్రవ్యాల ముఠాలపై ఉక్కుపాదం మోపారు. దావో సిటీ మేయర్‌గా, ఆతర్వాత దేశాధ్యక్షుడిగా తన పరిపాలనాకాలంలో ‘డెత్ స్క్వాడ్’పేరిట వేలాది మంది డ్రగ్స్‌ముఠా సభ్యులను అంతమొందించారు. ఆనాడు దేశాధ్యక్షుడిగా ఉంటూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. సారా ప్రకటనపై దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ రోమియో బ్రేవ్నర్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘లక్షన్నరకుపైబడిన దేశ సైనికులు ఎల్లప్పుడూ పక్షపాతరహితంగా పనిచేస్తారు. ప్రజాస్వామ్యయుత రాజ్యాంగబద్ధ సంస్థలు, పౌరవ్యవస్థల ఆదేశాలను శిరసావహిస్తారు’’అని అన్నారు. -
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు! (ఫొటోలు)
-
ఇండోనేసియా అధ్యక్షుడిగా సుబియాంతో
జకార్తా: ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబొవో సుబియాంతో(73) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో సుబియాంతో తోపాటు ఉపాధ్యక్షుడిగా గిబ్రాన్ రకబుమింగ్ రకా(37) ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షుడు విడొడొ కుమారుడైన రకా సుకార్తా మేయర్‌గా సైతం పనిచేశారు. ప్రమాణ స్వీకారం ఓపెన్ టాప్ వ్యాన్‌లో వచ్చిన సుబియాంతోకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పార్లమెంట్ భవనం, అధ్యక్ష భవనం రహదారి కిక్కిరిసింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. సుబియాంతో ఖురాన్ సాక్షిగా ప్రమాణం చేశారు. -
#USELections2024 : కమలా హారీస్ అరుదైన ఫొటోలు
-
టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూత
తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి (54) 11 సెప్టెంబర్ 2024 న తమ సొంత నివాసం లో తీవ్ర గుండెపోటు కు గురై స్థానిక ఎంగ్ టెంగ్ ఫాంగ్ జనరల్ హాస్పిటల్ లో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానిక మిత్రులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సొసైటీ సభ్యులు ఈ బాధా సమయం లో నరేందర్ గారు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సరిహద్దులు దాటి సింగపూరుకొచ్చి, తెలుగోల్లకు తోబుట్టువై, సాగరతీరంలో స్వాతి చినుకువై, సంస్కృతి సంప్రదాయానికి నిలువుటద్దమై, తంగేడుపువ్వుల జాడ చెప్పి, బతుకమ్మకు వన్నె తెచ్చి, పోత రాజుల పౌరుషం పులి రాజుల గాంభీర్యం మాకు పరిచయం చేసి, బోనం అంటే నరేంద్రుడు బతుకమ్మకు పెద్దకొడుకు అంటూ నరేందర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. టీసీఎస్‌ఎస్‌కు అందించిన సేవలు చాలా గొప్పవంటు ఆయనకు జోహార్లు అర్పించారు. వందల సంఖ్యలో మిత్రులు సందర్శనకు వచ్చి ఆశ్రు నివాళి అర్పించారు. మృదు స్వభావి, ఎప్పుడు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారనీ, సింగపూర్ లో ఉన్న తెలుగు వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ దుఃఖ సమయంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియాకు తరలించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా గోనె నరేందర్ సమీప బంధువు ఓరిగంటి శేఖర్ రెడ్డి గారు వారి వెంట ఇండియాకు తోడు వెళ్లారు.వెల్గటూర్ గ్రామం, కొత్తపేట్ మండలం, జగిత్యాల జిల్లా కు చెందిన గోనె నరేందర్ గారు గత 25 సంవత్సరాల క్రితం సింగపూర్‌కి వచ్చారు. ప్రస్తుతం కుటుంబంతో సహా శాశ్వత నివాస హోదాలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు , కుమారుడు. ఉన్నారు. -
రాహుల్ రాజ్యాంగ వ్యతిరేకి: ధన్‌ఖడ్
ముంబై : రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మండిపడ్డారు. ఆయనది రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వమని విమర్శించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు రాజ్యాంగ స్వరూపం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యాంగంపై అందరికీ అవగాహన అత్యవసరం’’ అని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. ‘‘రాజ్యాంగమున్నది డాంబికంగా ప్రదర్శించడానికి కాదు. దాన్ని గౌరవించాలి. అధ్యయనం చేయాలి. అర్థం చేసుకోవాలి. బాధ్యత కలిగిన, తెలివున్న, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ వ్యక్తీ ఇలా ప్రవర్తించరు’’ అంటూ రాహుల్‌పై నిప్పులు చెరిగారు. ఇటువంటి దుస్సాహాలను తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘రాజ్యాంగ పదవిలో వ్యక్తి రిజర్వేషన్లను ఎత్తేయాలని విదేశీ గడ్డపై మాట్లాడటం రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి బహుశా ఆయనకు వారసత్వంగా అబ్బింది’’ అంటూ దుయ్యబట్టారు. రిజర్వేషన్లున్నది సమాజానికి మూలస్తంభాల్లాంటి సామాజిక వర్గాలకు చేయూతనిచ్చేందుకేనని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. -
మా తాత భారత స్వతంత్ర పోరాట యోధుడు: కమలా హ్యారిస్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన చిన్ననాటి భారత పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భాతరదేశ వారసత్వాన్ని ప్రతిబింబించే ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 10న) సందర్పంగా అమ్మమ్మ తాతయ్యలు పీవీ గోపాలన్-రాజమ్మలతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. భారత్ వెళ్లినప్పుడల్లా తాత తనను మార్నింగ్ వాక్కు తీసుకెళ్లేవారని తెలిపారు. అలాగే భారత స్వతంత్ర పోరాటంలో తాత పాత్రను వివరించారు. సమానత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం గురించి తాత మాట్లాడేవారని అన్నారు. ఆయన భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అని సోషల్ మీడియా ఎక్స్ రాశారు. అలాగే తన అమ్మమ్మ సహకారాన్ని కూడా హైలెట్ చేస్తు రాశారు. ఆమె మహిళకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించేలా భారతదేశం అంతటా ప్రయాణించేదని అన్నారు. అందువల్లే తనకు ప్రజాసేవ పట్ల నిబద్ధతగా ఉండటం, మంచి భవిష్యత్తు కోసం పోరాడటం వంటివి వారసత్వంగా వచ్చాయని అంటోంది. ఇలా హారిస్ తాను తన అమ్మమ్మ తాతయ్యల నుంచి సామాజికి విలువలు గురించి ఎలా నేర్చుకున్నానో చెప్పుకొచ్చారు. తరువాత తరాలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా కీలకం అంటూ స్ఫూర్తిని కలిగించే తాతాయ్య అమ్మమ్మలందరికీ జాతీయ గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది ఆమె కుటుంబ వారసత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం మీ తాత బ్రిటిష్ ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీస్‌లో ఉన్నప్పుడూ ఆ ప్రభుత్వాన్నే వ్యతిరేకించేలా తన సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడగలరని ప్రశ్నించారు. అంతేగాక ఆ సర్వీస్ స్వాత్రంత్య్రం అనంతరమే సెక్రటేరియట్ సర్వీస్‌గా మారిందని విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాదు క్షమించండి మిమ్మల్ని నమ్మలేం. ఇది కేవలం భారత సంతతి వ్యక్తులను బుట్టలో వేసుకునే రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శలు చేశారు.(చదవండి: శ్రావణ బెండకాయల గురించి విన్నారా..? గణేషోత్సవంలో..!) -
ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో ఎన్నికల వేళ బీజేపీ అగ్రనాయకత్వంపై నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం గాందర్బల్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఒమర్ మాట్లాడారు. ‘‘ ఢిల్లీలో ఉన్న నేతలకు నేనంటే ద్వేషం. ఎన్నికల్లో ఓడించి నా నోరు మూయించాలని చూస్తున్నారు. పని గట్టుకుని స్వతంత్య అభ్యర్థులను నాపై పోటీకి నిలుపుతున్నారు. నన్ను ఓడించి చట్టసభల్లో నా గొంతు వినపడకుండా చేయాలని కుట్ర పన్నారు. ఢిల్లీ నేతలపై నేను పోరాడుతున్నది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. జమ్మూకశ్మీర్ పౌరుల కోసం. నేనేం మాట్లాడిన ప్రజల గొంతుక వినిపిస్తా’’ అని ఒమర్ అన్నారు. -
US ELECTION: టిమ్వాల్జ్కు తప్పిన ప్రమాదం
మిల్వాకీ: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్వాల్జ్కు ప్రమాదం తప్పింది. సోమవారం(సెప్టెంబర్2) మిల్వాకీలో లేబర్ డే కార్యక్రమానికి వెళ్తుండగా టిమ్వాల్జ్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాల్జ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వాహనశ్రేణిలో ఉన్న పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు.తమ వాహనాలను కాన్వాయ్‌లో వెనుక వచ్చే వాహనాలు బలంగా ఢీకొన్నాయని మీడియా సిబ్బంది తెలిపారు. ప్రమాదం అనంతరం టిమ్వాల్జ్తో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిమ్వాల్జ్ ప్రస్తుతం మిన్నెసోటా గవర్నర్‌గా ఉన్నారు. -
టెస్లా వైస్ ప్రెసిడెంట్ రాజీనామా.. కారణం ఇదే
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారతీయ సంతతికి చెందిన ''శ్రీలా వెంకటరత్నం'' రాజీనామా చేశారు. సుమారు 11 సంవత్సరాలు టెస్లా కంపెనీలో అనేక కీలక బాధ్యతలు చేపట్టిన ఈమె ఉద్యోగానికి రాజీనామా చేశారు.శ్రీలా వెంకటరత్నం టెస్లాలో ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్‌గా తన ఉద్యోగం ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. అయితే తన కుటుంబం, స్నేహితులతో కాలం గడపటానికి ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.టెస్లాలో ఆమె ప్రారంభ రోజుల నుంచి ప్రాజెక్ట్‌లను మ్యాపింగ్ చేస్తూ కంపెనీ ఉన్నతికి తోడ్పడింది. మేము కలిసి ఇంత సాధించినందుకు గర్విస్తుంన్నాను అంటూ వెల్లడించింది. తానూ కంపెనీలో చేరిన తరువాత సంస్థ 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందని, ఇది తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.శ్రీలా వెంకటరత్నం లింక్డ్ఇన్ పోస్ట్‌కు, టెస్లా మాజీ సీఎఫ్ఓ జేసన్ వీలర్ స్పందిస్తూ.. మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రీలా.. కంపెనీలో అద్భుతమైన విజయాలను సాధించినందుకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. -
Vice President Jagdeep Dhankhar: పరస్పర సహకారం మరింతగా పెరగాలి
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ఆకాంక్షించారు. ఇండియా–ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ–ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ (డీఎఫ్‌టీపీ) స్కీముతో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోందని ధన్కడ్ చెప్పారు. అలాగే, కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలు, అంతరిక్ష రంగంలాంటి విషయాల్లో భారత్‌తో ఆఫ్రికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చన్నారు. సీఐఐ ఇండియా–ఆఫ్రికా బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్కడ్ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారత్ 12.37 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. 85 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలవగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్, ఆఫ్రికా కలిసి పని చేయొచ్చని ధన్కడ్ చెప్పారు. -
''అతడు గెలిచాడు.. నేను విడాకులు తీసుకున్నాను''
ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీలోని ఉన్నతోద్యోగులు మంచి నడవడిక కలిగినవారైతే.. ఇతర ఉద్యోగులు కూడా వారిని అనుసరించవచ్చు. కానీ ఉన్నతోద్యోగులు చెడ్డవారైతే? పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని రిటైర్డ్ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ 'ఏతాన్ ఎవాన్స్' వెల్లడించారు.అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కంపెనీ సీఈఓ తన భార్యను ప్రలోభపెట్టాడని, దీంతో వారిరువురు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని 'ఏతాన్ ఎవాన్స్' (Ethan Evans) పేర్కొన్నారు. ఈ విషయంలో అతడు గెలిచాడు, నేను విడాకులు తీసుకున్నానని అన్నారు. పని విషయంలో సీఈఓను వ్యతిరేకించిన కారణంగా.. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే నెపంతో తన భార్యను ప్రలోభపెట్టారని లింక్డ్ఇన్లో వెల్లడించారు.అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెజాన్ కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఆ సమయంలోనే ఉద్యోగం వదిలేసి ఉంటే చాలా బాగుండేదని ఆయన అన్నారు. అంతే కాకుండా కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు.ఏతాన్ ఎవాన్స్ టిప్స్➡మీరు పనిచేసే కంపెనీలో మేనేజర్ మంచి వారైతే.. వారి నుంచి మంచి విషయాలను నేర్చుకోండి. ➡పాములను గుర్తించండి (చెడ్డవారిని గుర్తించండి).➡సంస్థలో ఉన్నతోద్యోగులు చెడ్డవారని తెలిసినప్పటికీ.. మీ పని మాత్రం అద్భుతంగా ఉండేలా చూసుకోండి.➡చెడ్డవారిని నేరుగా ఎదుర్కోవద్దు.➡చెడ్డవారిని ఎదుర్కోవడానికి మీరు కూడా పాములా మారకండి. -
విస్మరిస్తే చంపెయ్యాలి: ధన్‌ఖడ్
జైపూర్: దేశం కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని చంపేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను పరమోన్నతంగా భావించని వారు వెల్లడించే అభిప్రాయం దేశ వ్యతిరేకంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ముందుకు సాగాలంటే ఇటువంటి వారిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అయినా వారు జాతి అభివృద్ధికి హానికరమైన తమ చర్యలను కొనసాగిస్తున్న పక్షంలో చంపేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రజాస్వామ్యమనే పుష్పగుచ్ఛంలో పరిమళాలన్న ఉపరాష్ట్రపతి.. వ్యక్తిగత, రాజకీయ లాభం కంటే జాతి ప్రయోజనాలను మిన్నగా చూసుకునే వారికే ఇది వర్తిస్తుందన్నారు. మన గుర్తింపు భారతీయత, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదన్నారు. ఆదివారం జైపూర్‌లో అవయవదాతలతో ఏర్పాటైన సమావేశంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మాట్లాడారు. -
USA Presidential Elections 2024: అమెరికాకు అర్హుడైన ఉపాధ్యక్షుడు
ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కమలా హారిస్ ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం పెన్సిల్వేనియాలో భారీ ప్రచార సభలో మాట్లాడారు. తన ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్‌ను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును వివరించారు. ఆయన కేవలం గవర్నర్ మాత్రమే కాదు, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. అమెరికా ప్రగతి కోసం, ప్రజల సౌభాగ్యం కోసం తాము కలిసి పని చేయబోతున్నామని వెల్లడించారు. అమెరికాకు అన్నివిధాలా అర్హుడైన ఉపాధ్యక్షుడు టిమ్ వాల్జ్ అని ప్రశంసించారు. కమలా హారిస్ మాట్లాడిన అనంతరం టిమ్ వాల్జ్ ప్రసంగం ప్రారంభించారు. జనం చప్పట్లు, కేకలతో హర్షామోదాలు వ్యక్తం చేశారు. మనకు మరో 91 రోజులపాటు సమయం మాత్రమే ఉందని, ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్రాంతంగా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మరణించిన తర్వాతే మనకు నిద్ర అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏబీసీ న్యూస్ సర్వేలో ఆసక్తికరమైన అంశం బయటపడింది. వాల్జ్ ఎవరో తమకు ఇప్పటిదాకా పెద్దగా తెలియదని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ఉపాధ్యక్ష అభ్యరి్థగా పేరు ఖరారైన తర్వాతే ఆయనెవరో తెలిసిందని అన్నారు. -
USA Presidential Elections 2024: ఆ రికార్డుపై కమలా హారిస్ కన్ను
వారం పది రోజుల కిందటి దాకా ఏకపక్షంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసును కమలా హారిస్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యరి్థగా అధ్యక్షుడు బైడెన్ ఉన్నంతకాలం ఆయనపై అన్ని విషయాల్లోనూ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడామె ముచ్చెమటలే పట్టిస్తున్నారు! బైడెన్ తప్పుకున్నాక తాజా సర్వేలన్నింటిలోనూ హారిస్ దూసుకుపోతున్నారు. కొన్నింటిలోనైతే ట్రంప్‌ను దాటేశారు కూడా. ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యరి్థత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకుంటారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు. 150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్ 1836లో ఉపాధ్యక్షుడు మారి్టన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్లు్య.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా గతంలో బరాక్ ఒబా మా హయాంలో ఉపాధ్యక్షునిగా చేశారు! కానీ 2016లో ఒబామా తర్వాత డెమొక్రాట్ల తరఫున బైడెన్‌కు కాకుండా హిల్లరీ క్లింటన్‌కు అధ్యక్ష అభ్యరి్థత్వం దక్కింది. అయితే ఆమె ట్రంప్ చేతిలో ఓటమి చవి చూశారు. 2020లో ట్రంప్‌ను హోరాహోరీ పోరులో బైడెన్ ఓడించడం, అధ్యక్షుడు కావ డం తెలిసిందే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు.నేరుగా పదోన్నతి నలుగురికే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా 49 మంది ఉపాధ్యక్షులుగా పని చేశారు. వారిలో పదిహేను మంది ఆ తర్వాత కాలంలో అధ్యక్షులు కూడా అయ్యారు. అయితే ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే ఎన్నికల బరిలో నెగ్గి అధ్యక్షులు అయింది మాత్రం కేవలం నలుగురే. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఆయన 1789 నుంచి1796 దాకా దేశ తొలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 1796లో ఆ పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో ఓటమి చవిచూసిన థామస్ జెఫర్సన్ అప్పటి నియమాల ప్రకారం ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ఎందుకంటే అప్పట్లో ఉపాధ్యక్ష అభ్యర్థి అంటూ విడిగా ఉండేవారు కాదు. అధ్యక్ష రేసులో రెండో స్థానంలో నిలిచిన నేతే ఉపాధ్యక్షుడు అయ్యేవారు. తర్వాత నాలుగేళ్లకు జెఫర్సన్ ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఓడించింది ఎవరినో తెలుసా? నాటి అధ్యక్షుడు ఆడమ్స్‌నే! ఒక్కోపార్టీ నుంచి ఆ రెండు పదవులకూ విడిగా అభ్యర్థులు నిలబడటం పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్లలో మొదలైంది. → అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మారి్టన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్లు్య.బు‹Ù. → ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్. → గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. → ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. ళీ హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! → థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. → జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్ హారిస్
వాషింగ్టన్: జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవ్వలేరు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్‌లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు. పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్‌కాల్స్ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్‌లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు. పెలోసి, క్లింటన్ల మద్దతు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్‌కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్‌ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్‌కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67), అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
‘వాన్స్’ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి: వివేక్‌రామస్వామి
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వైస్‌ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ ఎంపికపై భారత సంతతి బిలియనీర్ వివేక్‌రామస్వామి స్పందించారు. ‘నా స్నేహితుడు వాన్స్‌ను చూసి నేను గర్వపడుతున్నా. అతను నా ఫ్రెండే కాదు. క్లాస్మేట్. లాస్కూల్‌లో చదవుకునేపుడు మేమిద్దరం చాలా ఎంజాయ్ చేశాం. వాన్స్ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అతడి గెలుపు కోసం, దేశం బాగు కోసం నేను ఎదురు చూస్తున్నా’అని వివేక్‌రామస్వామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్‌రామస్వామి ప్రైమరీల దశలోనే తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ పోటీ పడుతున్నారు. ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌ను తాజాగా ఎంపిక చేసుకున్నారు. -
మళ్లీ తడబడ్డ బైడెన్.. ట్రంప్‌కు వైస్ ప్రెసిడెంట్ పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ వెనుకబడ్డ విషయం తెలిసిందే. దీంతో సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ మొదలైంది. ఈ క్రమంలో బైడెన్ తాజాగా మరోసారి తన వృద్ధాప్యాన్ని చాటుకున్నారు. వాషింగ్టన్లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ పెద్ద పొరపాటే మాట్లాడారు. ఈసారి ఏకంగా వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారిస్, ప్రత్యర్థి ట్రంప్ పేరును కలిపేశారు.వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని అన్నారు ‘వైస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు అధ్యక్ష పదవి చేపట్టే అన్ని అర్హతలున్నాయి. అందుకే నేను ఆమెను వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశాను’అని కమలాహ్యారిస్ గురించి చెబుతూ ఆమె పేరుకు బదులు ట్రంప్ పేరు పలికారు.దీంతో బైడెన్ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. రిపబ్లికన్లు ఈ విషయమై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. బైడెన్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోవాలన్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. -
విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ దుర్మరణం
బ్లాంటైర్: ఆఫ్రికా దేశం మలావీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ షిలిమాతోపాటు మరో 9 మంది దుర్మరణం పాలయ్యారు. దేశ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించినట్లు మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం వెల్లడించారు.ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని అన్నారు. ఉపాధ్యక్షుడు షిలిమా సహా మొత్తం 10 మంది సోమవారం ఉదయం సైనిక విమానంలో మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలోని మజుజు సిటీకి బయలుదేరారు. ముజుజులో ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో వెనక్కి వెళ్లాలని విమానం పైలట్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమాచారం ఇచ్చారు. 45 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. -
మలావీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ విషాదాంతం.. ఉపాధ్యక్షుడి దుర్మరణం
లిలాంగ్వే: మలావీ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్‌తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు చికంగావా అడవుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. -
మలావీ ఉపాధ్యక్షుడి ఎయిర్‌క్రాఫ్ట్ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదం ఘటన మరువక ముందే.. మరొ విమానం మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని సావులోస్ విమానం సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఇతర దేశాల సహాయం కోరుతున్నారాయన. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు వెళ్లింది. సరిహద్దు దేశంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో.. ఇంకా తుది వెలువడాల్సి ఉంది. -
రాహుల్ గాంధీపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..
న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో తీసిన ఓ ఫోటోకు రాహుల్ గాంధీ ఇచ్చిన పోజు, వేషధారణపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్ వ్యక్తమవుతోంది. కొత్తగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిగిన ఫొటోను ఉప రాష్ట్రపతి అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్‌తోపాటు సోనియాగాంధీ కుటుంబ సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్ హౌస్‌లో తీసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాహుల్ గాంధీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అధికారిక ఫొటోకు ఆయన ఇచ్చిన పోజు నిర్లక్ష్యంగా ఉందని, వేషధారణ హుందాగా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొంత మంది రాహుల్ గాంధీకి కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఉప రాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ హ్యాండ్లర్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకుని పోస్ట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. Hon'ble Vice-President of India and Chairman, Rajya Sabha, with Smt. Sonia Gandhi ji and her family during the oath-taking ceremony for elected Members of Rajya Sabha in Parliament House today. @RahulGandhi @priyankagandhi pic.twitter.com/9LdktgtoCE — Vice President of India (@VPIndia) April 4, 2024 -
‘ఈశా’ శివరాత్రి వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
ఈ నెల 8న మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోగల ‘ఈశా’ ఫౌండేషన్ రాబోయే మహశివరాత్రి వేడుకలను ఆదియోగి విగ్రహం ముందు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మెగా వేడుక మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు సద్గురు యూట్యూబ్ ఛానల్లో, ప్రధాన మీడియా నెట్‌వర్క్‌లలో ప్రసారం కానుంది. ఆరోజు అర్ధరాత్రి, బ్రహ్మ ముహూర్త సమయంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘సద్గురు’ జగ్గీవాసుదేవ్ భక్తులను శివుని ధ్యానంలో లీనమయ్యేలా చేయనున్నారు. కాగా గతంలో జరిగిన ‘ఈశా’ మహాశివరాత్రి వేడుకల లైవ్ స్ట్రీమింగ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023లో ‘ఈశా’లో జరిగిన మహాశివరాత్రి వేడుకలను 14 కోట్ల మంది వీక్షించారు. -
పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా మరియం
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు, పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు అయిన మరియం నవాజ్(50) చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్‌కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 327 సీట్లుండగా ముఖ్యమంత్రి అభ్యర్థికి 187 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఇటీవలి ఎన్నికల్లో పీఎంఎల్–ఎన్ 137 సీట్లు గెలుచుకోగా, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 113 సీట్లు, ఇతర స్వతంత్రులు 20 సీట్లు సాధించారు. వీరిలో స్వతంత్రులు పీఎంఎల్–ఎన్‌కు మద్దతు పలికారు. శనివారం సీఎం ఎన్నికకు జరిగిన ఓటింగ్‌లో మరియంకు 220 ఓట్లు పడ్డాయి. పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. -
అతనికి ఉపాధ్యక్ష పదవి ఆఫర్ చేయలేదు: ట్రంప్ క్యాంపు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ పోరు ప్రస్తుతం జరుగుతోంది. రిపబ్లికన్ ప్రైమరీల్లో దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీల్లో ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్నారు. త్వరలో జరగనున్న సౌత్ కరోలినా ప్రైమరీలోనూ ఆయనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నారు. అయితే తాజాగా తనతో పాటు ఈ ఎన్నికల్లో రన్నింగ్ మేట్‌గా ఉండాల్సిందిగా రాబర్జ్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ కోరినట్లుగా వచ్చిన వార్తలపై కెన్నెడీ స్పందించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్ష పదవకి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ తనను అడినట్లు కెన్నెడీ ధృవీకరించారు. ఈ ఆఫర్‌తో తాను పొంగిపోయానని అని కెన్నెడీ పేర్కొన్నారు. అయితే తనకు ట్రంప్ రన్నింగ్మేట్గా ఉండేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. Although Trump denies it, RFK Jr says Team Trump did reach out to him to see if he would be Trump’s running mate, and he turned it down. pic.twitter.com/oUhqUD8eJH — Ron Filipkowski (@RonFilipkowski) January 29, 2024 ట్రంప్ సీనియర్ అడ్వైజర్ క్రిస్ లాసివిటా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ట్రంప్ క్యాంపు నుంచి ఎవరూ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సంప్రదించలేదని తెలిపారు. ఆయనను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ అడిగారని కెన్నెడీ చెప్పడం వంద శాతం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ సోదరుడు.. అమెరికా మాజీ అటార్నీ జనరల్ అయిన రాబర్ట్ కెనెడీ(అమెరికా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడ్డారు) తనయుడే ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్. This is 100% FAKE NEWS - NO ONE from the Trump Campaign ever approached RFK jr (or ever will) - one of the most LIBERAL and radical environmentalists in the country. For all the fake news- update your stories. https://t.co/HYBJLqSux0 — Chris LaCivita (@LaCivitaC) January 28, 2024 ఇదీచదవండి.. సైనీ హత్యను ఖండించిన భారత్ -
TCS: టీసీఎస్‌లో మరో పరిణామం.. వైదొలిగిన ఎస్వీపీ
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీనానాథ్ ఖోల్కర్ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ అనుబంధ విభాగాలకు గ్లోబల్ హెడ్‌గా ఉన్న ఆయన 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సంస్థను విడిచిపెట్టారు. ఖోల్కర్ స్థానంలో రాజీవ్ రాయ్‌ను టీసీఎస్ నియమించింది. దీనానాథ్ ఖోల్కర్ 1996లో టీసీఎస్‌లో డేటా వేర్‌హౌసింగ్, డేటా మైనింగ్ గ్రూప్‌ను ప్రారంభించారు. తర్వాత అది బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీస్‌గా మారింది. తన సుదీర్ఘ అనుభవంలో ఆయన టీసీఎస్ ఈసర్వ్ సీఈవో, ఎండీగా, బీఎఫ్ఎస్ఐ బీపీవో హెడ్‌గా ఎదిగారు. 2017-22 కాలంలో అనలిటిక్స్, ఇన్సైట్స్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. “నా కెరీర్లో పరిశ్రమలోని అద్భుతమైన నాయకులు, నిపుణులతో, అలాగే టీసీఎస్‌లో మా భాగస్వాములు, మా కస్టమర్లు, అనేక మంది సభ్యులతో కలిసి పని చేయడం నా అదృష్టం. నేను పనిచేసిన ప్రతి బృందం ప్రత్యేకమైనది. అనేక గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది” అని దీనానాథ్ ఖోల్కర్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
YSRCP: మూడు అనుబంధ విభాగాలకు సహాధ్యక్షుల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అనుబంధ విభాగాలను మరింత విస్తృతం చేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో YSRCP మూడు అనుబంధ విభాగాలకు రాష్ట్ర సహాధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సేవాదళ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా డా.కట్టి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సహాధ్యక్షులుగా బసిరెడ్డి సిద్ధారెడ్డి నియమితులయ్యారు. సిద్ధారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన సిద్ధారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనపై నమ్మకముంచి తనకు కీలకమైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ ప్రచార బాధ్యతలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని సిద్ధారెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆర్. ధనుంజయ్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బసిరెడ్డి సిద్ధారెడ్డి, YSRCP రాష్ట్ర ప్రచారకమిటీ సహాధ్యక్షులు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, YSRCP పంచాయతీ రాజ్ విభాగం సహాధ్యక్షులు కట్టి వెంకటేశ్వర్లు, YSRCP సేవాదళ్ విభాగం సహాధ్యక్షులు ఇదీ చదవండి: జగన్ పదునైన ప్రశ్నలు.. ఇంకేం ఇద్దరూ గప్‌చుప్! -
‘వెయ్యి సార్లు చేస్తా.. జైల్లో వేసిన వెనకాడ’
కోల్‌కతా: అనుకరించడం ఓ కళ అని, అనుకరించడాన్ని తాను అలాగే కొనసాగిస్తూ ఉంటానని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బేనర్జీ అన్నారు. అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలవురు ప్రతిపక్ష ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్‌పై విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన తెలిపాయి. నిరసనలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యంగ్యంగా అనుకరించిన తెలిసిందే. ఈ వ్యవహారంపై మరోసారి ఎంపీ కల్యాణ్ బేనర్జీ స్పందింస్తూ.. మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరించారు. తాను ఇలాగే అనుకరించడం కొనసాగిస్తానని అన్నారు. అది ఒక కళారూపమని తెలిపారు. అవరమైతే వెయ్యిసార్లు అయినా ఇలానే అనుకరిస్తానని పేర్కొన్నారు. తన భావాలను వ్యక్తం చేయడానికి అన్ని రకాలుగా ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో జైలులో వేసినా తాను వెనకడుగు వెయనని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రాధాన్యత లేని ఈ విషయాన్ని ధన్‌ఖడ్ పెద్దది చేస్తున్నాడని విమర్శించారు. చదవండి: వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ కల్యాణ్ బెనర్జీ చేసిన అనుకరణ తనను ఎంతగానో బాధించిందని, ఇలా చేయడం తనను, తన కులాన్ని అవమానించడమేనని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు ధన్‌ఖడ్‌ను అనుకరించినందుకు అదే రోజు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కేసు నమోదైంది. అభిషేక్ గౌతమ్ అనే ఓ న్యాయవాది ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. कल्याण बनर्जी ने फिर की जगदीप धनखड़ की मिमिक्री ◆ संसदीय क्षेत्र श्रीरामपुर में एक सभा के आयोजन के दौरान की मिमिक्री ◆ कहा-"उपराष्ट्रपति धनखड़ अपने पद की संवैधानिक गरिमा को नष्ट कर रहे" TMC MP Kalyan Banerjee | #JagdeepDhankar #KalyanBanerjee pic.twitter.com/fkl79gxiUu — News24 (@news24tvchannel) December 24, 2023 -
గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల ప్రధాని మోదీకి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. 1995లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ సభాపతి, లోక్‌సభలో విపక్షనేత, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అహింసాయుత పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రహీతలకు రూ. కోటి నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
గూగుల్‌తో పోటీ: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. సీవీపీగా అపర్ణ చెన్నప్రగడ
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్ మహిళ అపర్ణ చెన్నప్రగడ (Aparna Chennapragada) నియమితులయ్యారు. టెక్ పరిశ్రమలో విశేష అనుభవమున్న ఆమెకు కీలకమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ విభాగం బాధ్యతలు అప్పగించారు. ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన అపర్ణకు ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. గూగుల్‌లో సుమారు 12 ఏళ్లు పనిచేశారు. స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్‌హుడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన ఆమె మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ డిజైనర్లో జెనరేటివ్ ఏఐ ప్రయత్నాలకు నాయకత్వం వహించనున్నారు. (TCS Headcount Drops: టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..) లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అపర్ణ చెన్నప్రగడ ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో టీటెక్ చేశారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని, మిట్ నుంచి మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ మాస్టర్స్ డిగ్రీని పొందారు. ప్రముఖ ఈబే (eBay) సంస్థలో కన్స్యూమర్ షాపింగ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ఏఆర్, విజువల్ సెర్చ్ ప్రోడక్ట్‌లకు లీడ్‌గా, బోర్డు మెంబర్‌గా కూడా అపర్ణ పనిచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అపర్ణకు కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా యూఎస్ చెందిన బిజినెస్ పబ్లికేషన్ ‘ఇన్ఫర్మేషన్’ నివేదించింది. అపర్ణ నియామకానికి ముందు మరో భారతీయ-అమెరికన్ రోహిణి శ్రీవత్స సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియాలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. పునీత్ చందోక్ ఆగస్టులో భారతదేశం, దక్షిణాసియాకు మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. -
జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలా కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే దానివలన దేశప్రగతికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును భారత్ అని మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు. ప్రయోజనకరమే.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తరచుగా ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని, ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై ఖర్చు భారం తగ్గుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్, లా కమిషన్, పార్లమెంట్ ష్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సిఫారసుల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం మంచిదని అన్నారు. 1971 వరకు దేశంలో ఒకే ఎన్నికలు ఉండేవని తర్వాతి కాలంలో వివిధ కారణాల వలన ఈ ప్రక్రియకు తెరపడిందన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి.. ప్రజాస్వామ్యంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. కానీ చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు సాగాలని అన్నారు. చట్టసభ్యులు పార్టీలను ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిరనలు తీసుకోలేవని తెలిపారు. ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై అందులో తప్పేమీ లేదని ఆ పేరు ఎప్పటినుంచో వాడకంలోనే ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం -
మహేంద్రగిరి జల ప్రవేశం
ముంబై: భారత నావికాదళం సామర్థ్యాన్ని మరింత పెంచే మహేంద్రగిరి యుద్ధనౌక శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. మహేంద్రగిరిని ప్రారంభించడం మన నావికాదళ చరిత్రలో కీలక మైలురాయిగా ధన్‌ఖడ్ సందర్భంగా అభివర్ణించారు. భారత సముద్ర నావికాశక్తికి రాయబారిగా మహా సముద్ర జలాల్లో త్రివర్ణపతాకాన్ని మహేంద్రగిరి సగర్వంగా రెపరెపలాడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) మహేంద్రగిరిని తయారు చేసింది. ప్రాజెక్ట్ 17ఏ సిరీస్‌లో ఇది ఏడోదని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతికి, ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, సముద్ర జలాల్లో మన ప్రయోజనాలను రక్షించుకునేందుకు నావికాదళాన్ని ఆధునీకరణ చేయడం ఎంతో అవసరమన్నారు. హిందూమహా సము ద్ర ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయాలు, భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ అవసరం ఎంతో ఉందని చెప్పారు. మహేంద్రగిరిలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయంగా తయారైనవే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. -
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్‌ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్‌గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ -
US Presidential ElectionIns 2024: ట్రంప్‌తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం
Cognizant appoints six women svps: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కార్యనిర్వాహక బృం దంలో ఏకంగా ఆరుగురు మహిళల్ని ఎంపిక చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవుల్లో మహిళలకు చోటు దక్కడం లేదడం లేదన్న ఆందోళన క్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థానాల్లో ఆరుగురు మహిళలను నియమించినట్లు జూలై 19న తెలిపింది. (న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ) వీరిలో కొందరికి పదోన్నతి లభించగా, మరికొందరిగా కొత్తగా నియమించుకుంది.తద్వారా బలమైన, విభిన్నమైన సంస్థను నిర్మించడం కొనసాగిస్తోందనే ప్రశంసలు వెల్లు వెత్తాయి. 2023లో జనవరిలో కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ నియామకం తరువాత జరిగిన ఈ పరిణామం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. మూడు కీలకమైన ఆవశ్యకాలపై దృష్టి సారించడంతో పాటు, నాయకత్వ స్థానాలతో సహా కాగ్నిజెంట్, విభిన్న ప్రతిభను పెంచడం తన ముఖ్య ప్రాధాన్యతలలో ఒకటి సీఈవో ప్రకటించారు ఈ సందర్భాన్ని సమిష్టిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమని పేర్కొన్న రవికుమార్. వైవిధ్యాన్ని ప్రోత్సహించడం సిస్టమేటిగ్గా ఉండాలి. మహిళా నిపుణులను రిక్రూట్ చేయడం, అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం, నిమగ్నం చేయడం, నిలుపుకోవడం వంటి వాటితో తాము మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) శైలజా జోస్యుల కీలక స్థానాల్లో ఆరుగురు మహిళలు ♦ హైదరాబాద్‌లోని కంపెనీ సెంటర్ హెడ్ శైలజా జోస్యుల ఎస్వీపీగా ప్రమోషన్ లభించింది. 2018లో కాగ్నిజెంట్‌లో చేరిన శైలజా ఇప్పుడు ఉత్తర అమెరికాలోని వాణిజ్య మార్కెట్లతో పాటు గ్లోబల్ డెలివరీ కోసం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) పరిశ్రమకు SVP, ఇంట్యూటివ్ ఆపరేషన్స్ & ఆటోమేషన్ (IOA)గా ఉన్నారు. చెన్నై తర్వాత 56,000 మంది అసోసియేట్లతో కాగ్నిజెంట్‌కు హైదరాబాద్ రెండో అతిపెద్ద డెలివరీ కేంద్రం. ♦ 2021లో కాగ్నిజెంట్‌లో చేరిన ఎలిసా డి రోకా-సెర్రా, SVP, EMEA జనరల్ కౌన్సెల్ అండ్ కాంట్రాక్ట్ లైఫ్‌సైకిల్ రిస్క్ మేనేజ్మెంట్ (CLRM)గా పదోన్నతి పొందారు. ♦ 2020లో కాగ్నిజెంట్‌లో చేరిన థియా హేడెన్ ఇప్పుడు ఎస్వీపీ. గ్లోబల్ మార్కెటింగ్. కాగ్నిజెంట్ బ్రాండ్, డిజైన్ , సృజనాత్మక సేవలు, సోషల్ మీడియా, ఆలోచనా నాయకత్వం , రీసెర్చ్కుహేడెన్ బృందం బాధ్యత వహిస్తుంది. ♦ ప్యాట్రిసియా (ట్రిష్) హంటర్-డెన్నెహీ ఎస్వీపీ (హెల్త్‌కేర్ ప్రొవైడర్/పేయర్ బిజినెస్ యూనిట్)గా పదోన్నతి పొందారు. హెల్త్‌కేర్ డెలివరీతో సహా అమెరికాలో ఆరోగ్య సంరక్షణ మొత్తం నిర్వహణకు ఆమె టీంమద్దతు ఇస్తుంది. ట్రైజెట్టో కొనుగోలులో భాగంగా ట్రిష్ 2015లో కాగ్నిజెంట్‌లో చేరారు. ♦ 2020లో కాగ్నిజెంట్‌కు రిజైన్ చేసిన అర్చన రమణకుమార్ జూలై 5న SVP, ఇండస్ట్రీ సొల్యూషన్స్ గ్రూప్ (ISG)గా తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు. ♦ సాండ్రా నటార్డోనాటో జూలై 17న కాగ్నిజెంట్‌లో పార్టనర్షిప్ అండ్ అలయన్స్ ఎస్వీపీగా చేరారు. కాగ్నిజెంట్‌కు ముందు, నటార్డొనాటో గార్ట్నర్తో 15 సంవత్సరాలు సీనియర్ ఈక్విటీ విశ్లేషకురాలిగా గా వివిధ వృత్తిపరమైన సేవల సంస్థలతో 11 సంవత్సరాల అనుభవం ఉంది. -
అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి?
వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి తప్పులో కాలేశారు. బాల్టిమోర్ లోని కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం పొల్యూషన్(కాలుష్యం) తగ్గించుకుంటే భావితరాలు బాగుంటాయని చెప్పడానికి బదులు మనం పాపులేషన్(జనాభా) తగ్గించుకుంటే బాగుంటుందని నోరు జారారు. ఈ ప్రసంగం తాలూకు వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో కమలా హారిస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీ వారు నిర్వహించిన వాతావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(58) ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే కార్యక్రమం పట్ల కొంచెమైనా అవగాహన లేకుండా హాజరైన ఆమె వైట్ హౌస్ వర్గాలు ఇచ్చిన స్క్రిప్తును యధాతధంగా చదివేశారు. వారిచ్చిన స్క్రిప్టులో మొదట పాపులేషన్ అని రాసి దాన్ని సరిచేస్తూ పక్కన బ్రాకెట్లో మళ్ళీ పొల్యూషన్ అని రాశారు. అయినా కూడా కమలా హారిస్ ప్రసంగ ప్రవాహంలో పొల్యూషన్ కి బదులు పాపులేషన్ అని చదివి కొత్త తలనొప్పని తెచ్చుకున్నారు. ప్రసంగం ఆమె మాటల్లో.. ఎలెక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తూ స్వచ్ఛమైన ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి "జనాభాను తగ్గిస్తే" భావితరాలు స్వచ్ఛమైన వాయువును పీల్చుకుంటారని, పారిశుద్ధ్యమైన మంచినీరు తాగుతారని అన్నారు. ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి జనాభాను తగ్గించడమేమిటని అక్కడివారు చాలాసేపు జుట్టు పీక్కున్నారు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత గానీ వారికి అర్ధం కాలేదు.. కమలా హారిస్ పొరపాటుగా చదివారని.. ఆమె ఉద్దేశ్యం తగ్గించాల్సింది జనాభాని కాదు కాలుష్యాన్నని. తరవాత వైట్ హౌస్ వర్గాలు ఆమె ప్రసంగానికి సంబంధించిన కాపీని ప్రెస్ కు రిలీజ్ చేశారు. అందులో పాపులేషన్ పదాన్ని కొట్టేసి పొల్యూషన్ అని స్పష్టంగా రాశారు. అలవాటులో పొరపాటుగా ఆమె అదే చదివేశారు. ఇంకేముంది విమర్శకులు వారి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. అసలు పుట్టేవాళ్లే తక్కువగా ఉంటే.. జనాభా తగ్గించమంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా అప్పుడప్పుడూ అర్ధజ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. విషయపరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పదేపదే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె ఓ సారి కార్మికుల యూనియన్, పౌర హక్కుల నాయకుల సభలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) గురించి ప్రస్తావిస్తూ ఏఐ అంటే అది రెండక్షరాలు, యాంత్రిక సాయంతో అభ్యసించేదని అర్ధం అని చెప్పి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
Monika Shergill: క్వీన్ ఆఫ్ కంటెంట్
స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో సక్సెస్ అంటే సాధారణ విషయం కాదు. ఏ నిమిషానికి ఏ ట్రెండ్ వస్తుందో తెలియదు. అక్కడి ట్రెండ్ ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. సక్సెస్‌కు సవాలక్ష కారణాలు ఉంటాయి. అయితే అవేమీ చీకట్లో దాక్కున్నవి కావు. వెదుక్కుంటూ వెళితే ముందుకు వచ్చి పలకరిస్తాయి. మోనిక చేసిన పని అలా వెదుక్కుంటూ వెళ్లడమే! ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన మోనిక షేర్గిల్ ‘వైస్ ప్రెసిడెంట్, కంటెంట్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా’ స్థాయికి చేరుకోవడం అదృష్టం కాదు...తాను పడిన కష్టం. ఆ కష్టమే మోనిక షేర్గిల్ను ‘హై అండ్ మైటీ–50 పవర్పీపుల్’ జాబితాలో చేర్చింది.... నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్పీడ్ అందుకొని వ్యూ అవర్స్, రెవెన్యూ పెంచుకొని ప్రపంచస్థాయిలో సక్సెస్ సాధించింది. ‘దీనికి కారణం?’ అనే ప్రశ్నకు ఏకైక జవాబు నలభై తొమ్మిది సంవత్సరాల మోనిక షేర్గిల్. మోనిక చొరవ వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ప్రపంచానికి, ప్రతిభావంతులకు మధ్య ‘నెట్‌ఫ్లిక్స్’ను వారధిగా మలచడంలో మోనిక ఘన విజయం సాధించింది. నెట్‌ఫ్లిక్స్ కోసం కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో మోనిక అనుసరించే ప్రమాణాల విషయానికి వస్తే...క్రైమ్ షోలలోని సంచలన ధోరణి కనిపించదు. సబ్జెక్ట్‌లో ఉండే బలమే ప్రధాన ప్రమాణం అవుతుంది. దీనికి ఉదాహరణ ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్... ది ఎలిఫెంట్ విష్పరర్స్. ‘‘ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో ఎప్పుడూ రిస్క్ పొంచి ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచిని కచ్చితంగా పసిగట్టడం కష్టమే. కరోనా కల్లోల సమయం ప్రేక్షకుల ఆలోచనధోరణిలో మార్పు తీసుకువచ్చింది. కంటెంట్ విషయంలో తమ భాష, ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కంటెంట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఏది నిజం? ఏది కల్పన?’ అనే విషయంలో వారికి స్పష్టత ఉంది. వ్యాపార విజయం అనేది వారికి సంబంధం లేని విషయం. వారి దృష్టి మొత్తం కథ పైనే ఉంటుంది’’ అంటున్న మోనిక విజయాల గురించి ఆనందించడమే కాదు నిరాశపరిచిన కంటెంట్ విషయంలో సమీక్ష చేసుకోవడంలో ముందుంటుంది. రొమాంటిక్ హిందీ–కామెడీ ఫిల్మ్ ‘మీనాక్షి సుందరేశ్వర్’ నిరాశపరిచింది. దీనికి కారణం సరిౖయెన నటీనటులను ఎంపిక చేసుకోకపోవడం. కథ సరిగ్గా ఉండగానే సరిపోదు కాస్టింగ్ కూడా సరిగ్గా ఉండాలని, ఎక్కడా రాజీపడకూదనే గుణపాఠాన్ని ఆ చిత్రం నుంచి నేర్చుకుంది మోనిక. పోస్ట్–పాండమిక్ ఆడియెన్స్ ఇంటర్నేషనల్ స్టోరీలను ఇష్టపడుతున్నారు. జర్మన్ షో ‘డార్క్’ మనదేశంలో హిట్ కావడం దీనికి నిదర్శనం. ఆ సమయంలో... ‘వేరే దేశం కథలు మన దగ్గర విజయం సాధించినప్పుడు, మన దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన కథలు మరొక ప్రాంతంలో ఎందుకు విజయం సాధించవు’ అంటూ ఆలోచన చేసింది మోనిక. తాను నమ్మింది ‘కాంతార’ హిందీ వెర్షన్ విజయంతో నిజం అయింది. సక్సెస్ ముఖ్యమే కాని వేలం వెర్రి జోలికి వెళ్లదు మోనిక. ‘కొరియన్ భాషలో గ్లోబల్ బ్రేక్ఔట్ షోలు ఉన్నాయి. అలా మనం కూడా సాధించాలి అనుకున్నంత మాత్రాన అది సాధ్యపడదు. ఆ షోలో ఉన్న వినూత్నమైన ఐడియా, దాని చుట్టూ ముడిపడి ఉన్న ఎన్నో అంశాలు గ్లోబల్ బ్రేక్‌ఔట్‌కు కారణం కావచ్చు. మనదైన ఆలోచన చేసి విజయం సాధించాలిగానీ ఫలాన షోలాగా ఉండాలి అని ప్రయత్నిస్తే విజయం మాట ఎలా ఉన్నా నిరాశ మాత్రమే మిగులుతుంది. ర్యాట్రేస్ ఇష్టపడను. ఆ రేసులో పడితే ఆయాసమే మిగులుతుంది తప్ప ఆలోచన మిగలదు’ అంటోంది మోనిక. కొంతకాలం క్రితం ట్రెండ్స్‌కు నిర్దిష్టమైన టైమ్ అంటూ ఉండేది. అర్థం చేసుకోవడానికైనా, అందిపుచ్చుకోవడానికైనా అది బాగా సరిపోయేది. కాని ఇప్పటి పరిస్థితి వేరు. ట్రెండ్స్ వేగంగా మారుతున్నాయి. ఒక దేశంలో ట్రెండ్‌గా ఉన్నది ఇక్కడ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు....ఇలాంటివి ఎన్నో దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతుంది మోనిక షేర్గిల్. అందుకే ఆమె పేరు ముందు ‘క్వీన్ ఆఫ్ కంటెంట్’ అనే విజయధ్వజం రెపరెపలాడుతోంది. -
చిన్ననాటి గురువు ఇంటికి వెళ్లిన ఉపరాష్ట్రపతి
కన్నూర్(కేరళ): ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సోమవారం కేరళలో కన్నూర్ జిల్లాలోని పన్నియన్నూర్ గ్రామానికి వెళ్లారు. చిత్తోఢ్‌గఢ్ సైనిక్ స్కూల్లో తన గురువైన రత్న నాయర్‌ను కలుసుకున్నారు. అత్యున్నత స్థాయిలో తమ ఇంటికి వచ్చిన శిష్యుడిని చూసిన ఆమె పొంగిపోయారు. ఇంతకు మించిన గురుదక్షిణ ఇంకేముంటుందంటూ ఆనందించారు. వారిద్దరూ నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుంటూ గడిపారు. -
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్‌ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
పార్లమెంటే అత్యుత్తమం: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంటే అత్యుత్తమమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగం మన పార్లమెంట్‌లోనే పురుడు పోసుకుందని గుర్తుచేశారు. రాజ్యాంగ రచనలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ తదితరాల పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. ప్రజల తీర్పును పార్లమెంట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి పార్లమెంటేనని వివరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు జీవిత చరిత్ర గ్రంథాన్ని జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం పార్లమెంట్ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు విదేశాలకు వెళ్లి మన దేశంపై విషం చిమ్ముతున్నారని, మన ప్రజాస్వామ్యంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధన్‌ఖడ్ విమర్శించారు! అలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇటీవల బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పార్లమెంటులో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పేరు ప్రస్తావించకుండా ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా!
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారి తొలగింపు కథనాలు, కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో లింక్డ్ఇన్ వంటి సామాజిక వేదికలు నిండిపోయాయి. కొంతమంది ఇప్పటికే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోగా మరికొందరు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూ, మంచి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే మంచి నైపుణ్యాలు కావాలి. ఇంటర్వ్యూల్లో చూసేది ఇదే.. ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ క్లైర్ హ్యూస్ జాన్సన్ టాప్ సీక్రెట్ చెప్పారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో రిక్రూటర్లు అభ్యర్థులలో ఆశించే టాప్ స్కిల్ ఏంటో ఆమె బయటపెట్టారంటూ సీఎన్‌బీసీ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఓ వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అభ్యర్థుల్లో రిక్రూటర్లు చూసే అత్యుత్తమ నైపుణ్యం స్వీయ అవగాహన (సెల్ఫ్ అవేర్నెస్). ఇదీ చదవండి: గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే! క్లైర్.. గూగుల్‌లో తన పదేళ్ల సుదీర్ఘ అనుభవంలో ఉద్యోగ ఇంటర్వ్యూలో అభ్యర్థులు స్వీయ-అవగాహన ఎంత మేరకు కలిగి ఉన్నారో చేసేవారు. దాని ఆధారంగానే ఉద్యోగానికి ఎంపిక చేసేవారు. వారంలో 40 గంటలు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించడానికే ఆమె వెచ్చించేవారు. ఈ సమయంలో తాను అభ్యర్థులలో అన్నింటికంటే ముందు చూసే ఒక నైపుణ్యం స్వీయ-అవగాహన అని ఆమె పేర్కొన్నారు. పని అనుభవం, ఇతర నైపుణ్యాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, వాటిని నిదానంగా తెలుసుకోవచ్చన్నారు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! క్లైర్ మాటల ప్రకారం.. ఇలా స్వీయ అవగాహన కలిగి ఉన్న వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపుతారు. చేయాల్సిన పని గురించి నిజాయితీగా ఉంటారు. సహోద్యోగులు, ఉన్నతోద్యోగులతో మెరుగైన సంబంధం కలిగి ఉంటారు. స్వీయ-అవగాహన అనేది ఒక 'అరుదైన' లక్షణం. ఓ పరిశోధన ప్రకారం.. 95 శాతం మంది అభ్యర్థులు తమకు స్వీయ-అవగాహన ఉందని భావిస్తారు. కానీ వాస్తవానికి 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. -
టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన
మధురవాడ (భీమిలి) : తెలుగుదేశం పార్టీలోని కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడని, ఆ విషయాన్ని పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోడి అరుణ వెల్లడించారు. విశాఖలోని మధురవాడకు చెందిన తాను పదేళ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నానన్నారు. బీసీ మహిళా నాయకురాలినైన తనకే ఈ పరిస్థితి ఎదురైందని, టీడీపీలో మహిళలకే కాదు.. మహిళా నాయకురాళ్లకు కూడా రక్షణ కరువైందని పేర్కొన్నారు. మంగళవారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో చురుగ్గా ఉంటున్న తనను కర్నూలుకు చెందిన నేత ఏడాది నుంచి లైంగికంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. ఆ నేత లైంగిక వేధింపులు తాళలేక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు మరికొందరు ముఖ్య నాయకులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. పైగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, ఇతర నేతలు తనను వేధిస్తున్న వ్యక్తికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో ఈ నేతల వైఖరితో మనస్తాపం చెంది రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం అరుణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అరుణ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందున ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించినట్టు టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా గగన్ నారంగ్
భారత స్టార్ షూటర్.. ఒలింపిక్ అథ్లెట్ గగన్ నారంగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా గగన్ నారంగ్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్‌ను ద్రువీకరించారు. ఇక గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. -
Sandhya Devanathan: మెటా పవర్
‘బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటో తెలుసా? రిస్క్ చేయకపోవడమే’ అంటాడు మెటా సీయీవో మార్క్ జుకర్ బర్గ్. మెటాలో భాగమైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు ప్రస్తుతం రకరకాల సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితులలో రానున్న జనవరిలో ‘మెటా ఇండియా’ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది సంధ్యా దేవనాథన్. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వరకు ఎన్నో ప్రసిద్ధ విద్యాలయాల్లో చదువుకున్న సంధ్య నిత్య విద్యార్థి. అదే ఆమె నైపుణ్యం. నాయకత్వ బలం... ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ ‘మెటా’ సంధ్యా దేవనాథన్‌ను ‘మెటా ఇండియా’ వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రాయూనివర్శిటీ(ఏయూ, విశాఖపట్టణం)లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన సంధ్య దిల్లీ యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో ‘లీడర్షిప్’ కోర్స్ చేసింది. సిటీబ్యాంక్‌లో ఉద్యోగం చేసిన సంధ్య ఆ తరువాత స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో చేరి మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ప్రొడక్ట్స్) స్థాయికి ఎదిగింది. జనవరి 2016లో మెటాలో చేరిన సంధ్య ఆగస్ట్‌లో మెటా మేనేజింగ్ డైరెక్టర్(సింగపూర్), మెటా బిజినెస్ హెడ్ (వియత్నాం)గా పనిచేసింది. మెటాకు సంబంధించి ఆగ్నేయాసియా ఇ–కామర్స్ వ్యవహారాలను పర్యవేక్షించింది. మెటా ప్రకటనకు ముందు వరకు ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి గేమింగ్–వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది సంధ్య. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం సాధారణ విషయం ఏమీ కాదు. ఇంతకీ సంధ్య బలం ఏమిటి? వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే నైపుణ్యం, సమర్థవంతులైన ఉద్యోగులతో బృందాన్ని ఏర్పాటు చేసుకొని అత్యున్నత ఫలితాలు రాబట్టడం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ‘ఇది నా బలం’ అని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. మీడియాలో పెద్దగా ఇంటర్య్వూలు కూడా కనిపించవు. అయితే ఆమె ట్రాక్ రికార్డ్ ఆమె బలం ఏమిటో చెప్పకనే చెబుతుంది. పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్, నేషనల్ లైబ్రరీ బోర్డ్(సింగపూర్), సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్శిటీ, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ (సింగపూర్), ఉమెన్స్ ఫోరమ్ ఫర్ ది ఎకా నమీ అండ్ సొసైటీ... మొదలైన వాటిలో బోర్డ్ మెంబర్‌గా పనిచేసిన సంధ్యకు స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు అంటే ఆసక్తి. మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే మెటా ఉమెన్స్, ఏపీఏసీలో ఎగ్జిక్యూటివ్ స్పాన్సరర్‌గా విధులు నిర్వహించింది. డిటిటల్ రంగంపై మన ఆసక్తిని గమనించిన మెటా తన టాప్ ప్రాడక్ట్స్‌ను ఇండియాలోనే లాంచ్ చేసింది. మన దేశంలోని లీడింగ్ బ్రాండ్స్, క్రియేటర్స్, అడ్వర్టైజర్లతో కంపెనీకి ఉండే స్ట్రాటిజిక్ రిలేషన్‌ను బలోపేతం చేయడానికి బలమైన వ్యక్తి కోసం వెదికింది మెటా. తమ భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చే శక్తి సామర్థ్యాలు సంధ్యలో ఉన్నాయి అనే బలమైన నమ్మకంతో పెద్ద బాధ్యతను అప్పగించి ఘన స్వాగతం పలికింది. లీడర్షిప్ పాఠాలలో నొక్కి వక్కాణించి చెప్పే మాట... ‘లీడర్షిప్, లెర్నింగ్ అనేవి వేరు వేరు ధ్రువాలు కాదు. ఒకదానిపై ఒకటి అనివార్యంగా ఆధారపడతాయి’ సిటీబ్యాంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేసినా, మెటా లాంటి సంస్థలో బాస్‌గా కీలక విధులు నిర్వహించినా నేర్చుకోవడాన్ని మాత్రం సంధ్య ఎప్పుడూ ఆపలేదు. వ్యక్తులు మొదలు సామాజిక పరిస్థితుల వరకు ఎన్నో విషయాలు నేర్చుకొని తనను తాను తీర్చిదిద్దుకుంది. ప్రసిద్ధ విద్యాలయాల్లో ఆమె నేర్చుకున్న పాఠాలు ఎన్నో సందర్భాలలో తనకు దారి చూపాయి. ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు రకరకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వాటిని అధిగమించి ఆదాయాన్ని పెంచడం చిన్న విషయమేమీ కాదు. బ్యాంకింగ్, పేమెంట్స్, టెక్నాలజీ రంగాలలోఅంతర్జాతీయ స్థాయిలో 22 సంవత్సరాల అనుభవం ఉన్న సంధ్యా దేవనాథన్‌కు సవాళ్లు కొత్త కాదు. విజయాలు సాధించడమూ కొత్త కాదు. బెస్టాఫ్ లక్ సంధ్య గారూ! -
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సభ జరగలేదు : ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు
-
భారతీయ సంస్కృతి.. ప్రపంచానికి దిశానిర్దేశం: వెంకయ్య నాయుడు
ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికీ సంస్కృతే ఒరవడి అని, ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికకి దిశానిర్దేశం చేయగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దసరా దీపావళి పండుగలు సందర్భంగా సింగపూర్ తెలుగు వారందరితో కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను సంతరింప చేస్తూ భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై సింగపూర్ తెలుగు ప్రజలకు, నిర్వాహక బృందానికి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత రెండేళ్ళ కాలంలో సంగీత, నృత్య, సాహిత్య, ఆధ్యాత్మిక, నాటక, సంప్రదాయ కళారంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు, ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. మన భాషా సంస్కృతులను పరిరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సంస్థలు ఒకే వేదిక మీదకు రావాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కోశాధికారి వామరాజు సత్యమూర్తి హాజరయ్యారు. సింగపూర్ గాయని గాయకులచే సంప్రదాయక భక్తి గీతాలు, సాయి తేజస్వి, అభినయ నృత్యాలయ వారి నృత్య ప్రదర్శనలు, తేటతెలుగు పద్యాలాపన ప్రేక్షకులందరినీ అలరించాయి. శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "తమ సంస్థ 2020లో ప్రారంభమై గత రెండు సంవత్సరాలుగా సుమారు 40 కి పైగా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంస్థల సమన్వయంతో నిర్వహించిందన్నారు. తమ ద్వితీయ వార్షికోత్సవం వేడుకలను వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరుపుకోవాలని జూలై నుంచి ఎదురు చూస్తున్నామని ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని" ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గం రాధిక మంగిపూడి, రామాంజనేయులు చామిరాజు, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కలసి వెంకయ్య నాయుడుని అభిమానపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంస్థ సభ్యులు హాజరై శ్రీ సాంస్కృతిక కళాసారథిని అభినందించారు. -
హ్యాపీ బర్త్‌డే మోదీజీ
న్యూఢిల్లీ/షోపూర్: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్ని వర్గాల నుంచీ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ నిర్మాణం కోసం మోదీ అవిశ్రాంతంగా పని చేస్తున్నారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ అభినందించారు. కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పుట్టిన రోజులాగే శనివారం కూడా ప్రధాని పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. మధ్యప్రదేశ్‌లోని షోపూర్లో మహిళా స్వయం సహాయక బృందాలతో మాట్లాడారు. ‘‘లక్షలాది మంది మాతృమూర్తుల ఆశీర్వాదం నాకు కొండతం స్ఫూర్తి. సాధారణంగా పుట్టినరోజున అమ్మను కలిసి దీవెనలు తీసుకుంటా. కానీ ఈసారి ఇంతమంది తల్లులు నన్ను దీవించడం చూసి నా తల్లి పరవశించి ఉంటారు’’ అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజుల రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ‘‘ఇప్పటికే 1,00,506 మందికి పైగా రక్తదానం చేశారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు’’ అన్నారు. -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్
అగర్తలా: దేశవ్యాప్తంగా పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ఉద్ధండులు తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, గుర్తింపు తెచ్చుకుని ఉన్నఫలానా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా త్రిపురలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. టీఎంసీకి ఆ పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) త్రిపుర యూనిట్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంసీ రాష్ట్ర ఇన్ఛార్జ్కు అందించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో.. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా సుబల్ భౌమిక్‌ని తొలగించిన కొద్ది రోజులకే ఇలా.. బాసిత్ ఖాన్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, సుబల్ భౌమిక్‌ను పార్టీ అత్యున్నత స్థానం నుంచి తొలగించడంపై పార్టీ అధిష్టానం ఎటువంటి కారణం చెప్పకుండానే బాధత్యల నుంచి తొలగించింది. మరోవైపు.. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా.. టీఎంసీకి, మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. The vice-president of the #Tripura unit of TMC, Abdul Basit Khan, resigned from the party. (@RittickMondal)https://t.co/rYeBLZiYWp — IndiaToday (@IndiaToday) August 28, 2022 -
పార్లమెంటులో లాయర్లు తగ్గుతున్నారు
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్దీప్ ధన్‌ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్‌ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్‌ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు. ‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్‌ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్‌ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్‌ఖడ్‌ను ఆయన సన్మానించారు. న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్‌ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు. ధన్‌ఖడ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ -
Azadi ka Amrit Mahotsav: వీరుల త్యాగ ఫలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో సమర యోధులు సర్వస్వాన్ని ధారపోశారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొనియాడారు. వారి అమూల్య త్యాగాలను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృతోత్సవ్ సరైన సందర్భమన్నారు. వారి స్ఫూర్తి గాథలను యువ తరానికి వినిపించి వారిలో దేశభక్తి, సేవా భావం, త్యాగ గుణం వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్య్ర సిద్ధికి ఎంతగా పోరాడాల్సి వచ్చిందో ఎన్నడూ మరవకూడదన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ధన్‌ఖడ్ ఆదివారం ప్రజలకు సందేశమిచ్చారు. ‘‘క్రూరమైన బ్రిటిష్ వలస నుంచి దేశాన్ని విముక్తం చేసిన వీరుల ధైర్య సాహసాలు, త్యాగాలను పంద్రాగస్టు సందర్భంగా మరోసారి గుర్తు తెచ్చుకుని వారికి ఘనంగా నివాళులర్పిద్దాం. నేటి భారతం అంతులేని శక్తి సామర్థ్యాలను కళకళలాడుతోంది. సర్వతోముఖ వృద్ధి పథంలో వడివడిగా పరుగులు పెడుతోంది. జాతి విలువలను, రాజక్యాంగ విలువలను సమున్నతంగా నిలిపేందుకు మరోసారి ప్రతినబూనుదాం. దేశ నిర్మాణ క్రతువుకు పునరకింతం అవుదాం’’ అంటూ పిలుపునిచ్చారు. -
బిహార్ సీఎం పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ పై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీగా పదివి చేపట్టక మునుపు తాను బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిస్తున్న సమయంలో జేడీయు నాయకులు తన వద్దకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారని అన్నారు. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లితే మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ అదే జేడీయే నాయకులు ఒక పథకంతో తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే నితీష్ కుమార్ తనకు ఆ ఉద్దేశం లేదని కొట్టిపారేశారు. కేవలం తాను బీజేపీ వ్యూహం నుంచి తన పార్టీని రక్షించుకునే నిమిత్తం ఇలా చేశానని చెప్పుకొచ్చారు. పైగా తాను గత నెలన్నర కాలం నుంచి మీడియాకి దూరంగా ఉన్నానని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ నితీష్ ఈ రోజు బీజేపీ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. బిహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని చూసి నమ్మి ఓటు వేస్తే ఇలా వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. తాను ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో ఉన్న కొత్త బిహార్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపే ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. అయినా నితీష్ కుమార్ మహారాష్ట్రలా బిహార్ అవుతుందని భయపడ్డానని చెబుతున్నారు. కానీ బీజేపీ ఏమీ శివసేనను విభజించడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అంతేకాదు లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆర్జేడియూని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఐతే ఈ విషయమే జేడీయూ లేదా ఆర్జేడియూ ఇంకా స్పందించలేదు. (చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి) -
వెంకయ్య నాయుడికి రాజ్యసభలో వీడ్కోలు.. ఇది ఉద్వేగభరితమైన క్షణం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు.. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని మోదీ పేర్కొన్నారు. ఆయన వాక్చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. చదవండి: యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్డోజర్.. -
పార్లమెంటు సమావేశాలు ముందుగానే నిరవధిక వాయిదా?
సాక్షి,న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలో వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు వీడ్కోలు ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం పార్లమెంటు సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొహర్రం , రక్షాబంధన్ సెలవుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం సెషన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం, మధ్యాహ్నం తర్వాత రెండు బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సభను ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉంది. కానీ సెలవుల వల్ల ముందే ముగించే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ? -
రాష్ట్రపతిలా కాదు.. ఉపరాష్ట్రపతి జీతమెంతో తెలుసా?
ఢిల్లీ: మన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాజ్యాంగబద్దంగా భారతదేశ రెండో అత్యున్నత పదవి.. ఉపరాష్ట్రపతి. అయితే రాష్ట్రపతిలా ఆమోద ముద్రలు, ఇతర నిర్ణయాలకు పరిమితం కాలేదు ఉపరాష్ట్రపతి. పార్లమెంట్లో రాజ్యసభ బాధ్యతలను పూర్తిగా చూసుకునే చైర్మన్ హోదా ఉంటుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి జీత భత్యాలు, భారత ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, పెన్షన్, ఇతర సదుపాయాలు.. ఎలా ఉంటాయో తెలుసా?.. ► ఉపరాష్ట్రపతికి శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫీసర్స్ యాక్ట్ 1953 ప్రకారం.. జీతభత్యాలను చెల్లిస్తారు. ఎందుకంటే.. రాజ్యసభకు ఆ వ్యక్తి చైర్మన్(ఎక్స్ అఫీషియో)గా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే స్పీకర్‌లాగే ఉపరాష్ట్రపతికి జీతం, ఇతర బెనిఫిట్లు అందుతాయి. ► ఉపరాష్ట్రపతి జీతం.. అక్షరాల నాలుగు లక్షల రూపాయలు. ఇవి కాకుండా రకరకాల అలవెన్స్‌లు అందుతాయి. 2018 వరకు 1లక్ష25వేల రూపాయలుగా ఉండేది. ఆ దఫా బడ్జెట్లో మార్పుల మేరకు జీతం పెరిగింది. ► డెయిలీ అలవెన్స్, ఉచిత వసతి, మెడికల్ కేర్, ట్రావెల్, ఇతరత్రాలు అందుతాయి. పదవి నుంచి దిగిపోయాక.. సగం జీతం పెన్షన్‌గానూ అందుతుంది. ► ఉపరాష్ట్రపతికి భద్రతా, సిబ్బంది వాళ్ల వ్యక్తిగతం. అధికారిక కార్యక్రమాల సమయంలో మాత్రం సంబంధిత కేంద్ర, ఆయా రాష్ట్రాల తరపున సిబ్బంది భద్రత కల్పిస్తారు. ► రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి.. రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహిస్తారు. ఆ సమయంలో రాష్ట్రపతికి అందే జీతం, ఇతర బెనిఫిట్స్ ఉపరాష్ట్రపతికి అందుతాయి. అంతేకాదు రాష్ట్రపతి అందుకునే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ ► రిటైర్మెంట్ తర్వాత.. పెన్షన్‌తో పాటు మరికొన్ని బెనిఫిట్స్ మాజీ ఉపరాష్ట్రపతులకు ఉంటాయి. ► ఉపరాష్ట్రపతి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. ఉపరాష్ట్రపతిగా ఓ వ్యక్తిని ఎన్నిసార్లైనా ఎన్నుకోవచ్చు. ► ఒకవేళ ఉపరాష్ట్రపతి లేని టైంలో రాజ్యసభ వ్యవహారాలను డిప్యూటీ చైర్మన్ చూసుకుంటారు. ► రాష్ట్రపతి పదవిలో ఉన్న ఓ వ్యక్తి మరణిస్తే.. ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలను చేపడతారు. అయితే అది ఆరునెలల వరకే. అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా అన్నమాట. ఆలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ► 35 ఏళ్ల వయసు ఉండాలి. లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్న వారు అనర్హులు. భారతీయ పౌరసత్వం ఉన్న ఎవరైనా సరే ఉపరాష్ట్రపతి పోటీకి అర్హులు. అయితే రాజకీయ పార్టీల ప్రాబల్యంతో.. పార్లమెంట్ అంతర్గత వ్యవహారంగానే మారింది ఉపరాష్ట్రపతి ఎన్నిక. ► 1962 నుంచి న్యూఢిల్లీలోని నెంబర్ 6, మౌలానా ఆజాద్ రోడ్‌లోని అధికారిక నివాసాన్ని ఉపరాష్ట్రపతి కోసం ఉపయోగిస్తోంది భారత ప్రభుత్వం. ఆరున్నర ఎకరాల్లో ఉంటుంది ఉపరాష్ట్రపతి భవన్ కాంపౌండ్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ గనుక పూర్తైతే.. అందులో ఉపరాష్ట్రపతికి శాశ్వత భవనం కేటాయించాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ► భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యుల ఓట్లు.. విజేతను నిర్ణయిస్తాయి. ఎన్నికల సంఘం సీక్రెట్ బాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తుంది. ► ఐదేళ్ల పదవీకాలం. రాజ్యసభ పూర్తి మెజారిటీతో ఆమోదించిన తీర్మానం, సాధారణ మెజారిటీతో లోక్‌సభ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చని భారత రాజ్యాంగం పేర్కొంది. రాజ్యసభకు అర్హత ప్రమాణాలను నెరవేర్చనందుకు మరియు ఎన్నికల అవకతవకలకు పాల్పడినందుకు ఉపరాష్ట్రపతిని సుప్రీంకోర్టు కూడా తొలగించవచ్చు . ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా? -
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు
Live Updates: ►ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు ►జగదీప్ ధన్కర్కు 528 ఓట్లు ►మార్గెరెట్ అల్వాకు 182 ఓట్లు ► చెల్లని ఓట్లు 15 ►పోలైన ఓట్లు 725 ► 92.9 శాతం పోలింగ్ ►ఉప రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 725 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభలో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ► ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ► పార్లమెంట్ హౌస్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 93శాతం పోలింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. Discharged my absolute privilege as well as constitutional responsibility. Voted in the #VicePresidentialElection in the Parliament House. pic.twitter.com/exlafU8nYs— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరామ్ రమేశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓటేశారు. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ ఎంపీ హేమమాలిని, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. BJP MP Hema Malini casts her vote for the Vice Presidential election, at the Parliament in Delhi. pic.twitter.com/4wQyDFL5My— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/NKV8JZhRvD— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి, బీజేపీ ఎంపీ రవికిషన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Delhi | AAP MPs Harbhajan Singh and Sanjay Singh, DMK MP Kanimozhi and BJP MP Ravi Kishan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/SPs5bcSEl7— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union ministers Nitin Gadkari and Dharmendra Pradhan cast votes for the Vice Presidential election at Parliament pic.twitter.com/Z5irlDxbWm— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మెఘ్వాల్, వీ మురళీధరన్ ఓటు వేశారు. Delhi | Union Ministers Gajendra Singh Shekhawat, Arjun Ram Meghwal and V Muraleedharan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/2roDcox6yi— ANI (@ANI) August 6, 2022 ► కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union Home Minister Amit Shah casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/eH75fIzcRe— ANI (@ANI) August 6, 2022 ► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్‌పై వచ్చి ఓటు వేశారు. Delhi | Former Prime Minister and Congress MP Dr Manmohan Singh arrives at the Parliament to cast his vote for the Vice Presidential election. pic.twitter.com/OK0GsY5npL— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/cJWlgGHea7— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ► ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది. 80 ఏళ్ల వయసున్న మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు . రాజస్థాన్ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్దీప్ రాజస్థాన్‌కు చెందిన జాట్ నాయకుడు. ► మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. ► జేడీయూ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. ► టీఎంసీకి లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యుల బలం ఉండడం, విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యతతో జగ్దీప్ విజయం దాదాపుగా ఖరారైపోయింది. ► తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది. ► నామినేటెడ్ సభ్యులకి కూడా ఓటు హక్కుంది. ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది. ► పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నేతమార్గరెట్ ఆల్వా పోటీ పడుతున్నారు. పార్లమెంటు హౌస్‌లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్లులెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. -
ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు అల్వాకు ఓటు వేస్తారని తెలిపారు. కాగా, మార్గరెట్ అల్వా.. సాయంత్రం కేకే నివాసంలో టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. కేకే, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావులు పార్టీ ఎంపీలను అల్వాకు పరిచయం చేశారు. తనకు మద్దతు తెలిపినందుకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా కేకే నివాసంలోనే గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆమె ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీలు దామోదర్ రావు, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, రాములు, పసునూరి దయాకర్‌లు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, మతం పేరిట సమాజాన్ని విభజిస్తున్నారని భేటీ అనంతరం కేకే మీడియాతో అన్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు తాము అల్వాకు మద్దతిస్తున్నామని తెలిపారు. -
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. -
స్వార్థ రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు జాతి ప్రయోజనాలే పరమావధిగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకుంది. కానీ అందుకు గాంధేయ మార్గాన్నే అనుసరించాలి. నేనెల్లప్పుడూ ఎంపీలతో కూడిన పెద్ద కుటుంబంలో సభ్యుడిననే భావించుకున్నాను. కుటుంబంలోలానే పార్లమెంట్‌లోనూ విభేదాలు తలెత్తుతుంటాయి. ఒక్కో పార్టీకి ఒక్కో అభిప్రాయముండొచ్చు. జాతి ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి’’ అన్నారు. రాష్ట్రపతిగా సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ‘‘విధి నిర్వహణలో నాకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు, ఎంపీలకు కృతజ్ఞతలు. పార్లమెంట్ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి ఘన సంప్రదాయాలను కొనసాగించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా కృతజ్ఞతలు’’ అన్నారు. రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి తుది ప్రసంగం చేయనున్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మోదీ, ఓం బిర్లా, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. వెంకయ్య వీడ్కోలు విందు రాష్ట్రపతికి వెంకయ్య తన నివాసంలో వీడ్కోలు విందు ఇచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన కోవింద్ దంపతులను వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. విందులో తెలుగు వంటకాలు వడ్డించారు. విందు ఇచ్చారు. రాష్ట్రపతిగా కోవింద్‌హుందాగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్య కొనియాడారు. కోవింద్ జీవితం ఆదర్శనీయమైందని, ఆయన ఆలోచనలు, ప్రసంగాల నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని అన్నారు. న్యాయవాది నుంచి రాష్ట్రపతి దాకా... దేశ 14వ రాష్ట్రపతిగా ఐదేళ్లపాటు సేవలందించిన రామ్‌నాథ్ కోవింద్ సాధారణ న్యాయవాదిగా జీవితం ఆరంభించారు. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో పార్లమెంట్ సభ్యుడిగా, గవర్నర్‌గా సేవలందించి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. 2017 జూలై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరౌంఖ్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్–ఆన్–రికార్డుగా ఎంపికయ్యారు. 1980 నుంచి 1993 దాకా సుప్రీంకోర్టులో కేంద్రం తరఫు న్యాయవాదిగా పనిచేశారు. అణగారిన వర్గాలకు, ప్రధానంగా మహిళలు, పేదలకు ఉచితంగా న్యాయ సేవలందించారు. బీజేపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1994 నుంచి 2006 దాకా రెండుసార్లు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో బిహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. బిహార్ విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017లో అధికార ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా ఘన విజయం సాధించారు. కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి అయిన రెండో దళితుడు కోవింద్. పుస్తక పఠనమంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. సామాజిక సాధికారతకు విద్యే ఆయుధమని చెబుతుంటారు. దివ్యాంగులు, అనాథలకు సమాజంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచిస్తుంటారు. రాష్ట్రపతి హోదాలో కోవింద్ 33 దేశాల్లో పర్యటించారు. సైనిక దళాల సుప్రీం కమాండర్‌గా 2018 మేలో సియాచిన్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రమైన కుమార్ పోస్టును కూడా ఆయన సందర్శించారు. -
ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ముర్ము తాత్కాలిక నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకయ్య నాయుడు 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, మత నాయకులు, బ్రహ్మ కుమారీస్ నిర్వాహకులు కూడా ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముర్ము నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. -
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్
సాక్షి, ఢిల్లీ: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఊహించని పేరును ప్రకటించారు. జగదీప్ ధన్కర్(71)ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జగదీప్ ధన్కర్ పేరును ఖరారు చేస్తూ అధికారికంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాసేపటి కిందట ప్రకటన చేశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవికాలం ఆగష్టు 10వ తేదీతో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. నామినేషన్ల ఫైలింగ్‌కు తుది గడువు జులై 19వ తేదీ. NDA's candidate for the post of Vice President of India to be Jagdeep Dhankhar: BJP chief JP Nadda pic.twitter.com/RYIeIP7Nug — ANI (@ANI) July 16, 2022 ఇదీ చదవండి: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
నేనెవర్నీ ఆహ్వానించ లేదు.. కలుసుకోను లేదు! : హమీద్ అన్సారీ
న్యూఢిల్లీ: ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్తానీ జర్నలిస్టును యూపీఏ హయాంలో హమీద్ అన్సారీ తనను భారత్‌కు ఆహ్వానించారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఐతే ఆ ఆరోపణలన్నింటిని హమీద్ అన్సారీ తోసి పుచ్చారు. ఈ మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్‌కు వచ్చానని, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు పాకిస్తానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా హమీద్ అన్సారీని ప్రశ్నించడంతో ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..."నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి తరుపున విదేశీ అతిథులకు ఆహ్వానాలు ప్రభుత్వ సలహా మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పంపబడుతుంది. నేనెవర్నీ రీసివ్ చేసుకోలేదు, ఆహ్వానించ లేదు. తాను రాయబారిగా ఉన్న సమయాల్లో ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాను. ఇరాన్ రాయబారిగా నేను చేసిన పని గురించి అప్పటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయమై భారత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది." అని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడూ జాతీయ ప్రయోజనాలకు రాజీ పడ్డారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఖండించారు. తాను టెహ్రాన్‌లో పనిచేసిన తర్వాత యూఎన్ఎస్సీకి భారత శాశ్వత ప్రతినిధిగా సేవలందించానని, తనకు భారత్‌లోనూ, విదేశాల్లోనూ గుర్తింపు ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: నేను గెలవలేదు!... నా డబ్బులు వెనక్కిచ్చేయండి!...ప్రజలకు బెదిరింపులు) -
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిల్చునే అవకాశాలు ఉన్నట్లు చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. చివరిసారిగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొనగా.. మంత్రిగా నఖ్వీ సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లిన నఖ్వీ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మైనార్టీ నేతగా నఖ్వీకి ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఉపరాష్ట్రపతి రేసులో నిలపాలని బీజేపీ యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యసభ వ్యవహారాలపై నఖ్వీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకు వచ్చింది. అయితే బీజేపీ తరపున దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అమరీందర్‌సింగ్?
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా త్వరలోనే బీజేపీలో విలీనమవుతుందని చెబుతున్నాయి. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం లండన్‌లో ఉన్న అమరీందర్ రెండు వారాల్లో తిరిగి వచ్చాక ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయంటున్నారు. అమరీందర్ కార్యాలయం కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. వచ్చే వారంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్‌ను ప్రకటించాక.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే బాధ్యతను ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ తీసుకుంటారని సమాచారం. పటియాలా ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి పోలింగ్ ఆగస్ట్ 6వ తేదీన, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. 5న నోటిఫికేషన్ రానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది. -
ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారని తెలిపారు. రాజ్యసభ ఎక్స్–అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో కలిపి 788 మంది సభ్యులున్నారని ఈసీ వెల్లడించింది. వీరిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు కాగా, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు జూలై 5న నోటిఫికేషన్ జారీ చేస్తారు. జూలై 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్లు పరిశీలిస్తారు. జూలై 22 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికను కేవలం పార్లమెంట్ ప్రాంగణంలోనే నిర్వహిస్తారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే అభ్యర్థి సునాయాసంగా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు 115 నామినేషన్లు ఈ నెల 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటిదాకా 115 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 28 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసిందని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ప్రధాన అభ్యర్థులతోపాటు పలువురు సామాన్యులు కూడా నామినేషన్లు వేశారు. -
ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: భారత 14వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి జూలై 5న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్లను జూలై 19వరకు తేదీ వరకు స్వీకరిస్తారు. జూలై 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూలై 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా నిర్ణయించారు. -
కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్
బొగొటా: దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్ 7న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆఫ్రో–కొలంబియన్ అయిన ఫ్రాన్సియా మార్కెజ్(40) చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన మార్కెజ్ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు . తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్మెంటల్ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పోల్ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు. కానీ, పార్టీలోని మిగతా సీనియర్ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు. -
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిరాయింపుల చట్టంలో సవరణలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
బెంగళూరు: పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అవి మూకుమ్మడి ఫిరాయింపులకు దోహదం చేస్తున్నాయన్నారు. చట్టంలో సవరణలు తేవాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పార్టీ మారదలిచిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలన్నారు. ఫిరాయింపుల కేసులపై నిర్ణయాన్ని స్పీకర్లు, చైర్పర్సన్లు, న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం వెలువరించేందుకు కాలపరిమితి ఉండాలన్నారు. స్థానిక సంస్థలను బలో పేతం చేయాల్సిన అవసరముందన్నారు. మీడియా పాత్ర కీలకం దేశంలోని పెనుమార్పుల్లో మీడియా పాత్ర నిర్ణయాత్మకమని వెంకయ్య అన్నారు. కనిపించని వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. తన పదవీకాలం మూడు నెలల్లో ముగుస్తుందని, మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఖాళీగా మాత్రం ఉండనని, ఏదో వ్యాపకాన్ని చేపడతానని తెలిపారు. -
హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం నగరానికి రానున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 29లోని తన నివాసం నుంచి బోయిన్‌పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ (ఎన్ఐఈపీఐడీ)కు వెళతారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, శ్రీనగర్ టీ జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్, పంజగుట్ట ఫ్లై ఓవర్, మోనప్ప జంక్షన్, సీఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవర్, బేగంపేట ఫ్లై ఓవర్, పీఎన్టీ ఫ్లై ఓవర్, రసూల్‌పురా జంక్షన్, సీటీఓ ఫ్లై ఓవర్, ప్లాజా జంక్షన్, కార్ఖానా హనుమాన్ టెంపుల్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్, ఎన్ఐఈపీఐడీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగిసిన అనంతరం.. తిరిగి అదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ఎంచుకోవాలని ఆయన సూచించారు. చదవండి: బోయిగూడ అగ్నిప్రమాదం.. గాయపడిన ప్రేమ్ మృతి -
కాశీలో శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం సేవలు మరువలేనివి
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాశీ విశ్వనాథుడుని దర్శించుకున్నారు. అంతుకు ముందు శుక్రవారం సాయంత్రం ఆయన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి కాశీ పర్యటన సందర్భంగా శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం తరఫున ఆశ్రమం చైర్మన్ పీవీఆర్ శర్మ , ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వీవీ సుందర శాస్త్రి, పీవీ రఘువీర్, వీవీఎస్‌పీ గణేష్ గౌరవపూర్వకంగా కలిశారు. ఆశ్రమం అభివృధి గురించిన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్ర పతి మాట్లాడుతూ గతంలో ఈ ఆశ్రమానికి వచ్చినట్టు చెప్పారు. ఎన్న ఏళ్లుగా ఈ ఆశ్రమం తెలుగు వారికి కాశీలో అనేక రకాల సేవలు అందిస్తోందని కొనియాడారు. ఆశ్రమం తరఫున ఉపరాష్ట్రపతిని సన్మానించారు. -
ఆధ్యాత్మిక దివ్యధామం అయోధ్య
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మాణం భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవా నికి, శ్రీరాముని జీవితం బోధించిన మానవీయ విలువల పట్ల మన నిబద్ధతకు ప్రతీక అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయో ధ్య పర్యటన భారతీయ ఆధ్యాత్మిక మూలాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ఏకకాలంలో దర్శింపజేస్తుందని అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ఉదయం లక్నో నుంచి ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు రామమందిర నిర్మాణ స్థలాన్ని, రామ్‌లల్లా మందిరాన్ని సందర్శించుకున్నారు. అనంతరం హనుమాన్ గఢి లో, తర్వాత సరయు నదీతీరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారణాసి చేరుకుని, దశాశ్వమేథ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొన్నారు. శనివారం విశ్వనాథుని దర్శించుకోనున్నారు. -
ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఓ కళ నేర్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్ : ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరగడంతో పాటు ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఏదైనా ఓ కళను నేర్పించి వారిలో సృజనాత్మకతకు బాటలు వేయొచ్చన్నారు. తద్వారా బాల్యం నుంచే చిన్నారుల్లో కళలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయత భావన అలవడుతాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం నిర్వహించిన సంగీత, నాటక అకాడమీ అవార్డులు, లలితకళ అకాడమీ ఫెలోషిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. 2018 నుంచి 2021 వరకు మూడేళ్లకు అవార్డులు ఒకేసారి అందజేశారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. బ్రిటీషర్ల అరాచకాన్ని ఎదిరించే ప్రయత్నంలో కళలు, సాంస్కృతిక రూపాలు ప్రభావవంతమైన రాజకీయ ఆయుధాలుగా ఉపయోగపడ్డాయన్నారు. అలాంటి భారతీయ కళ, సాంస్కృతిక రూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మల్లాదికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు(కర్ణాటక సంగీతం), ఎస్.కాశీం, ఎస్.బాబు(నాదస్వరం), పసుమర్తి రామలింగశాస్త్రి (కూచిపూడి), కోట సచ్చిదానందశాస్త్రి(హరికథ)లు అవార్డులు అందుకున్నారు. 62వ జాతీయ ప్రదర్శన అవార్డుల్లో భాగంగా శిల్పకళల విభాగంలో జగన్మోహన్ పెనుగంటికి ఉపరాష్ట్రపతి అవార్డును అందజేశారు. కాగా, విజయవాడకు చెందిన మల్లాది సూరిబాబు తన తండ్రి శ్రీరామమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. వేలాది కచేరీలు నిర్వహించారు. నారాయణ తీర్థులు, రామదాసు, సదాశివబ్రహ్మేంద్రులు, అన్నమయ్య కీర్తనలకు స్వర రచన చేశారు. విజయవాడ ఆకాశవాణిలో సుదీర్ఘకాలం పనిచేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంగీత, నాటక అకాడమీ, లలితకళ అకాడమీ అధ్యక్షురాలు ఉమ నందూరి తదితరులు పాల్గొన్నారు. -
మిచెల్ ఒబామాపై జో బైడెన్ కామెంట్స్.. ఖంగుతిన్న అమెరికన్లు..!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పులో కాలేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆదివారం అమెరికా అణుసబ్మెరైన్ యూఎస్ఎస్ డెలావేర్ను అధికారికంగా విధుల్లోకి ప్రవేశపెడుతున్న సమయంలో ఇచ్చిన స్పీచ్‌లో బైడెన్ తప్పుగా వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రసంగిస్తూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా గురించి ప్రస్తావించిన ఆయన.. మిషెల్‌ను మాజీ ఉపాధ్యక్షురాలు అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా మిషెల్ ఒబామా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైన పలు కార్యక్రమాలను ప్రస్తుతం ఉన్న ప్రథమ మహిళ ముందుగా తీసుకెళుతున్నారని ప్రశంసించారు. అయితే, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాను ప్రథమ మహిళ అని పిలవాల్సి ఉండగా.. బైడెన్ తప్పుగా ఉపాధ్యక్షురాలు అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Does Biden think Michelle Obama was Vice President? pic.twitter.com/SyzKLsu378 — Benny (@bennyjohnson) April 2, 2022 -
సామీ! అది మాస్క్ లేక గడ్డమా... సభలో చమత్కరించిన వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: ఒక్కోసారి రాజకీయ నాయకులు రాజకీయం పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఛలోక్తులు విసురుకోవడం సహజం. నిజానికి ఆ సెటైర్లు భలే నవ్వుతెప్పించే విధంగానే ఉంటాయి. అవతలి ప్రతిపక్షం నాయకులు కూడా స్పోర్టీవ్‌గానే తీసుకుని రివర్స్ పంచ్‌లు వేస్తుంటారు కూడా. అచ్చం అలాంటి సంఘటన రాజ్యసభలోలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రాజ్యసభలో జరుగుతున్న సమావేశంలో బీజేపీ ఎంపీ సురేష్ గోపీ వంతు రాగానే ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నారు. ఆయన మళయాళం నటుడు కూడా. అయితే ఆయన సమావేశంలో లేచి నిలబడి తన గురించి చెబుతుండగా ఇంతలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ప్రసంగంలో జోక్యం చేసుకున్నారు. ‘‘సార్ ఏంటిది? గడ్డమా? లేక మాస్క్? నాకు అర్థకావడం లేదు అంటూ వెంకయ్య చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగి నవ్వులు విరిశాయి. అయితే ఎంపీ సురేష్ ఇది గడ్డమే తన తదుపరి సినిమా కోసం ఇలా పెంచానని వివరణ ఇచ్చారు. తర్వాత ఆయన ప్రసంగం కొనసాగించమని వెంకయ్యనాయుడు అన్నారు. A lighter moment in the Rajya Sabha pic.twitter.com/lQH5g0wO4U — Mohamed Imranullah S (@imranhindu) March 27, 2022 (చదవండి: మూడేళ్లుగా సేకరిచిన రూపాయి నాణేలతో డ్రీమ్ బైక్...) -
మహారాష్ట్ర తలవంచదు
ముంబై: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలంటూ కొందరు వ్యక్తులు దాదాపు నెల రోజుల క్రితం తనను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. అలాగే ట్విట్టర్లో శివసేన గుర్తు పులి ఫొటోను పోస్టు చేశారు. జుఖేంగే నహీ.. జై మహారాష్ట్ర (మహారాష్ట్ర తలవంచదు) అని ట్వీట్ చేశారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పూర్తికాలం.. ఐదేళ్లూ అధికారంలోకి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంవీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత శివసేన నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యులపై వేధింపులను అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ విన్నవించారు. ఉపరాష్ట్రపతికి తాను రాసిన లేఖ ఒక ట్రైలర్ మాత్రమేనని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ క్రిమినల్ సిండికేట్‌ను ముందుండి నడిపిస్తున్న ఈడీ అధికారులు బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు. మనీ ల్యాండరింగ్ పేరిట వేధింపులు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద నాతో పాటు మరో ఇద్దరు మహారాష్ట్ర మంత్రులను జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ జైలుకు పంపితే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వారు భావించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం 2003 జనవరి 17న అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, అంతకంటే ముందు జరిగిన డబ్బు లావాదేవీలు కూడా మనీ ల్యాండరింగే అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వేధింపులకు దిగుతున్నాయని ఆరోపించారు. 2012–13లో తనకు, తన కుటుంబ సభ్యులకు భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లిలో అలంకరణ పనులు చేసిన వారిని సైతం వెంటాడుతోందని, నేను వారికి రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటన చేయాలని భయపెడుతోందని దుయ్యబట్టారు. తనకు సంబం« దించిన ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు 28 మందిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించాయన్నారు. ఈడీ కనుసన్నల్లో అక్రమాలు స్వేచ్ఛగా భావాలను వెల్లడించే హక్కు తనకుందని, ఆ హక్కుపై దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నానని సంజయ్ రౌత్ చెప్పారు. సిండికేట్, బ్లాక్‌మెయిలింగ్, మనీ ల్యాండరింగ్ వంటి అక్రమ వ్యవహారాలు ఈడీ కనుసన్నల్లో సాగుతున్నాయని ఆరోపించారు. తనను జైలుకు పంపిస్తే వెళ్తానని, తన తర్వాత బీజేపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, బీజేపీ నేతలే ఎన్నో పాపాలు చేశారని అన్నారు. తాము భయపడతామని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు సాయం అడిగారని ప్రశ్నించగా... దానిపై త్వరలో మాట్లాడతానని సంజయ్ రౌత్ బదులిచ్చారు. అది ఢిల్లీ, ముంబైకి చెందిన నాయకుల ఉమ్మడి కుట్ర అని పేర్కొన్నారు. గత ఏడాది ఉప ఎన్నికలో దాద్రా నగర్ హవాలీ ఎంపీ సీటును శివసేన గెలుచుకుందని, అప్పటి నుంచి తమ పార్టీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మహారాష్ట్రలో బీజేపీదే అధికారం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 10న ఫలితాలు బహిర్గతమైన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావడం తథ్యమని జోస్యం చెప్పారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. -
కీలక పోస్టులోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ ! బ్రిటానియాకు గుడ్‌బై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేసిన ఊర్జిత్ పటేల్‌కి కీలక పదవి దక్కింది. ఊర్జిత్ పటేల్‌ను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఏఐఐబీ వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఉంది. వైస్ ప్రెసిడెంట్ షియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఊర్జిత్ పటేల్ ఈ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో బ్రిటానియా కంపెనీలో ఉన్న పదవులకు ఆయన శనివారం రాజీనామా సమర్పించారు. రిజర్వ్ బ్యాంక్‌కి 24వ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ సేవలు అందించారు. ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో పొసగపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన బ్రిటానియా సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ కమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. గత నెలలోనే ఊర్జిత్ను వైస్ ప్రెసిడెంట్ నియామక నిర్ణయాన్ని ఏఊఊబీ వెల్లడించింది. గత రెండు వారాలుగా ఈ విషయంపై మౌనంగా ఉన్న ఊర్జిత్ పటేల్.. చివరకు బ్రిటానియాకు తగు సమయం కేటాయించలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. చదవండి: ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..! -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
ఐఎన్ఎస్ ప్రెసిడెంట్‌గా మోహిత్ జైన్
సాక్షి, న్యూఢిల్లీ: ది ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ప్రెసిడెంట్‌గా ఎకనమిక్ టైమ్స్‌కు చెందిన మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ‘సాక్షి’ దినపత్రిక అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన సొసైటీ 82వ వార్షిక సాధారణ సమావేశంలో 2021–22 సంవత్సరానికి ఐఎన్ఎస్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన ‘హెల్త్ అండ్ యాంటిసెప్టిక్’కు చెందిన ఎల్.ఆదిమూలం నుంచి మోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. రాకేష్ శర్మ (ఆజ్ సమాజ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా, తన్మయ్ మహేశ్వరి (అమర్ ఉజాలా)ని గౌరవ కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సొసైటీ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ తెలిపారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నికైన 41 మందిలో ‘అన్నదాత’.. ఐ. వెంకట్ ఉన్నారు. -
ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ల్యూటెన్స్ ప్రాంతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉపరాష్ట్రపతి భవన నిర్మాణానికి సంబంధించిన స్థలంపై అభ్యంతరాలను లేవనెత్తుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇందిరాగేట్కు మధ్య మూడు కిలోమీటర్ల పొడవునా కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల పైచిలుకు వ్యయంతో సెంట్రల్ విస్టా పునర్వ్యవస్టీకరణ ప్రాజెక్టును చేపట్టడం తెల్సిందే. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్, ఉపరాష్ట్రపతి నివాసం, పీఎంఓ, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తారు. రిక్రియేషనల్ కార్యాకలాపాలకు, పచ్చదనానికి ఉపయోగించాల్సిన ప్లాట్‌ను ఉపరాష్ట్రపతి నివాస భవన నిర్మాణానికి ప్రతిపాదించారని, భూవినియోగమార్పిడి నిబంధనలకు ఇది విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. విమర్శించడం తేలికని, కానీ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలని, సంబంధితవర్గాలు ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ ప్రతిపాదిత స్థలంపై సరైన వివరణ ఇచ్చాయని... ఇక ఇందులో కల్పించుకోవడానికి ఏమీ లేదంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రూ. 206 కోట్లతో నిర్మాణం ఉప రాష్ట్రపతి కొత్త నివాస భవనం, అధికారిక కార్యాలయ సముదాయ నిర్మాణానికి రూ. 206 కోట్ల వ్యయం కానుంది. జార్ఖండ్‌లోని బొకారో కేంద్రంగా పనిచేస్తున్న కమలాదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ ఈ నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకుంది. కేంద్ర ప్రజాపనుల విభాగం రూ. 214 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా... మొత్తం ఐదు సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో కమాలాదిత్య కంపెనీ 3.52 లెస్తో కోట్ చేసి నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. పనులు వచ్చేనెలలో ప్రారంభమై 10 నెలల్లో పూర్తికానున్నాయి. -
కొద్దిసేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్ శివారులోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్‌కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్ వైట్‌హౌస్ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి. 2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్ చెనీకి బదిలీ చేశారు. -
గుండెపోటుతో మాజీ ఉపాధ్యక్షుడి మృతి
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రాయచూరు నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నేత దొడ్డమల్లేశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం వాకింగ్ వెళ్లే సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రెండుసార్లు నగరసభ సభ్యుడిగా, బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల నగరసభ అధ్యక్షుడు వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
పత్రికల్లో పాతతరం విలువలు రావాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, నెల్లూరు: ‘ ప్రస్తుతం రాజకీయాలు చూస్తే రోతపుడుతున్నాయి. అలాగే పత్రికల్లోనూ విలువలు దిగజారిపోయి సంచలనాల కోసం ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నాయి. అన్ని పత్రికలు చదివితే కానీ వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. పత్రికల్లో పాతతరం విలువలు రావాలి’ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగిన లాయర్ వారపత్రిక 40 వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు. రాను రాను పత్రికల విలువల్లో మార్పు వస్తోందని ఇది కొందరికే వర్తించే అంశమే అయినా ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని సూచించారు. పాలిటిక్స్, జర్నలి జం, మెడిసిన్ ఈ మూడు వ్యాపార ధోరణిలోకి పోకూడదని.. కానీ ఆ మూడు వ్యాపార దోరణీలోనే ఉన్నాయన్నారు. పాత్రికేయ రంగంలో నార్ల వెంకటేశ్వరరావు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. నెల్లూరులో పులిబొంగరాల న్నా... శెట్టెమ్మ దోశెలన్నా.. ట్రంకురోడ్డులో తెలిసిన వారితో తిరగాలన్నా.. తనకెంతో ఇష్టమని ఈ పదవుల వల్ల అక్కడికి వెళ్లి తినలేని పరిస్థితి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా సమయంలో అశువులు బాసిన జర్నలిస్టుల స్మృతికి నివాళులు అర్పించారు. డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శాంతా బయోటెక్ ఎండీ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కొల్లి శ్రీనాథ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. స్వప్నకు తుంగా అవార్డు తుంగా రాజగోపాల్‌రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిఏటా ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ జర్నలిస్టు స్వప్నను ఎంపిక చేసి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇచ్చారు. వీఆర్ కళాశాల పూర్వ అధ్యాపకుడు రామచంద్రరావును సన్మానించారు. పుస్తకావిష్కరణ.. లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా ప్రభాత్‌రెడ్డి (ప్రభు) రచించిన ‘‘విజయపథంలో నెల్లూరీయులు’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. -
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గవర్నర్ ఘనస్వాగతం
సాక్షి,కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కి ఉపరాష్ట్రపతి బయలుదేరారు. కాగా నేటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జేసీ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పొరపాటు కూడా లేకుండా రెవెన్యూ, జీవీఎంసీ ఆధికారులు సమన్వయంతో విధులను నిర్వహించాలన్నారు. విధులను నిర్వహించే వారందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. ఉపరాష్ట్రపతి మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడే జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పాల్గొంటారన్నారు. పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జరిగే 61వ నేషన్ డిఫెన్స్ కాలేజ్ కోర్స్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 3,4,5 తేదీల్లో నగరంలోని వివిధ కార్యక్రమంలో పాల్గొని 6వ తేదీ సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పాట్నా వెళతారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాస మూర్తి, ఆర్డీవో పెంచల కిషోర్, డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 100వ ప్రచురణను ఆవిష్కరించిన భారత ఉపరాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతి గౌ.ముప్పవరపు వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని సోమవారం లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో ఆయన అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. 2020 అక్టోబర్‌లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి- సింగపూర్, తెలుగు మల్లి - ఆస్ట్రేలియా, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య - యునైటెడ్ కి౦గ్ డమ్, దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక - జొహానెస్ బర్గ్ వారు సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను “సభావిశేష సంచిక” పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సాహితీ సదస్సును, పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ బాలుకి అంకితం చేయడం పట్ల అభినందనలు వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, 27 ఏళ్ళుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం తాను ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నామని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానం భాషాభివృద్ధికి అనుకూలంగా ఎన్నో నూతన అవకాశాలను అందిస్తోందన్న ఉపరాష్ట్రపతి, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకోగలమని తెలిపారు. భాషను మరచిపోయిన నాడు, మన సంస్కృతి కూడా దూరమౌతుందన్న ఆయన, మన ప్రాచీన సాహిత్యాన్ని యువతకు చేరువ చేయాలని సూచించారు. తెలుగులో ఉన్న అనంతమైన సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను తెలుగు భాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలన్న ఉపరాష్ట్రపతి, మన పదసంపదను సైతం ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నారు. నిద్ర లేచింది మొదలు మనం వినియోగించే ఎన్నో పదాల్లో ఆంగ్లం కలసిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని తెలిపారు. అంతర్జాల వేదికగా సాహిత్య, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలను ఈ సందర్భంగా అభినందించిన ఆయన, ఈ పుస్తక సంపాదకులైన వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడికి, రచయితలకు, ప్రచురణకర్తలకు పేరు పేరునా అభినందనలు తెలిపారు. గతాన్ని నెమరువేసుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ తెలుగు భాష భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తున్న ఈ తరుణంలో తెలుగు భాష, సాహిత్యాల పట్ల అపారమైన ఆసక్తి, అనురక్తి ఉన్న గౌ. ఉపరాష్ట్రపతి చేతులమీదుగా తమ 100వ పుస్తకావిష్కరణ జరగడం తమ అదృష్టంగా భావిస్తూ, 1995 లో ప్రారంభ అయిన తమ పుస్తక ప్రచురణల పురోగతిని వంగూరి ఫౌండేషన ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు తమ స్వాగతోపన్యాసం లో క్లుప్తంగా వివరించారు. ఈ పుస్తకం తమ 100వ ప్రచురణగాను, వంగూరి ఫౌండేషన్ గత 27 ఏళ్ళగా సాధించిన ప్రగతిని, సాహిత్య ప్రస్థానాన్ని పదిలపరిచిన వీడియో ప్రసారాన్ని గౌ. ఉపరాష్ట్ఱపతి ఎంతో ఆసక్తితో వీక్షించి, ప్రశంసించారు. ఈ అవిష్కరణ మహోత్సవాన్ని రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా నిర్వహించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), శాయి రాచకొండ లతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు. ఈ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత జూమ్ వేదిక లో జరిగిన “సభా విశేష సంచిక” డయాస్పోరా తెలుగు కథానికి -15, వెనుతిరగని వెన్నెల (డా.కె.గీత) “వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?( డా. చాగంటి కృష్ణకుమారి) గ్రంధాల పరిచయం, 7వ ప్రపంచ సాహితీ సదస్సు జ్ఞాపకాల రవళి కార్యక్రమం రెండు గంటలకి పైగా అంతర్జాలం లో విజయవంతంగా జరిగింది. ఈ వేదికలో ఆ సదస్సు ప్రధాన నిర్వాహకులు, పాల్గొన్న కొందరు వక్తలు, వేదిక నిర్వాహకులు మొదలైన వారు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. -
స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!
గతంలో జొమాటో తన డెలివరీ విమెన్‌కు సంవత్సరంలో 10 రోజుల బహిష్టు సెలవు ప్రకటించింది. ఆ సెలవులకు జీతం స్పష్టత లేదు. కాని స్విగ్గీ తన డెలివరీ విమెన్‌కు ప్రతి నెల రెండు రోజుల వేతన సెలవు ప్రకటించింది. అసంఘటిత రంగాలలో ఎందరో స్త్రీలు డెయిలీ వేజెస్ మీద పని చేస్తున్నారు. వారికి బహిష్టు సమయంలో రెండు రోజుల వేతన సెలవు ఎందుకు ఇవ్వకూడదు? స్విగ్గీ చేసిన ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంట్లో పనిమనిషిని అందరూ పెట్టుకుంటారు. రోజుకు రెండుపూట్ల రమ్మంటారు కొందరు. ఒకపూట చాలంటారు కొందరు. రోజూ పని చేయిస్తారు కొందరు. ఆదివారం రానక్కర్లేదు అంటారు మరికొందరు. పనిమనిషి అప్పుడప్పుడు పనికి రాదు. పోనీలే అని మొత్తం జీతం ఇస్తారు కొందరు. రాని రోజులకు జీతం కట్ చేస్తారు ఇంకొందరు. రాని రోజులకే జీతం కట్ చేసేవాళ్లు ఆమె బహిష్టు సమయంలో నలతగా అనిపించో, నొప్పిగా అనిపించో, చిరాగ్గా ఉండో, నీరసం వల్లో పనికి రానంటే జీతం ఇస్తారా? కాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ఏ ఆఫీస్‌లో అయినా పని చేస్తూ ఉంటే బహిష్టు సమయంలో సెలవు పెట్టుకుంటే ఆమె జీతం ఆమెకు వస్తుంది. కాని పనిమనిషికి రాదు. ఇది సబబా? పని మనిషి వరకూ అక్కర్లేదు. ఫ్యాక్టరీల్లో డెయిలీ లేబర్ ఉంటారు. భవన నిర్మాణరంగంలో స్త్రీలు ఉంటారు. బట్టల షోరూముల్లో, మాల్స్‌లో పని చేసే స్త్రీలు ఉంటారు. వీరందరికీ వారానికి సగం రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారున్నారు. ఇక నెలలో ఏ రోజు రాకపోయినా ఆ రోజు జీతం కట్. వీరందరూ బహిష్టు సమయంలో కష్టమయ్యి సెలవు పెడితే ఆ రెండుమూడు రోజుల పాటు డబ్బు నష్టపోవాల్సిందే. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? కాని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ రెండు రోజుల క్రితం అందరి చూపు ఆకర్షించింది. దాదాపు 45 నగరాల్లో 45,000 హోటళ్ల నుంచి నెలకు 20 లక్షల ఆహార ఆర్డర్లు సరఫరా చేసే ఈ సంస్థకు దాదాపు లక్షన్నర మంది ఫుడ్ డెలివరీ పార్టనర్స్ (బాయ్స్/గర్ల్స్) ఉన్నారు. వారిలో 1000 మంది ఫుడ్ డెలివరీ విమెన్ ఉన్నారు. ఈ సంఖ్యను 2000కు పెంచాలని స్విగ్గీ అనుకుంది కాని కరోనా వల్ల ఆ భర్తీ మందగించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తన ఫుడ్ డెలివరీ విమెన్‌కు నెలలో రెండు రోజుల వేతన సెలవును ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆ రెండురోజులు వాళ్లు రెగ్యులర్‌గా కనిష్టంగా రోజువారీ ఎంత కమీషన్ పొందుతారో అంత కమీషన్ వారికి ఇస్తారు. ‘నాకు పిరియెడ్స్. రెండు రోజులు సెలవు కావాలి’ అని మా డెలివరీ విమెన్ అడిగితే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా వెంటనే మంజూరు చేసే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అని స్విగ్గీ వైస్‌ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) మిహిర్ షా ప్రకటించారు. ఆ రెండు రోజులకు జీతం కూడా ఇస్తాం అని ఆయన తెలియచేశారు. 2014లో బెంగళూరులో ఆరు మంది డెలివరీ బాయ్స్‌తో మొదలైన స్విగ్గీ అనతికాలంలో మహా సంస్థగా అవతరించింది. 2016లో పూణెలో మొదటి డెలివరీ ఉమన్ ఉద్యోగంలో చేరితే 2019లో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో డెలివరీ పార్టనర్స్‌గా చేరడం మొదలెట్టి ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికిపైగా మారింది. ‘మా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. వారు దాని ద్వారా ఎమర్జన్సీ నంబర్‌కు కాల్ చేసే వీలు ఉంది. వారికి తక్షణం సహాయం కావాలంటే అందుతుంది. మేము వారి కోసం శుభ్రమైన టాయిలెట్లు కల్పిస్తున్నాము. షెల్ పెట్రోల్ బంకులతో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాటు వల్ల మా డెలివరీ విమెన్ ఆ బంకుల్లోని టాయిలెట్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ, ట్రావెల్ రంగాల్లో కేవలం బహిష్టు సమస్య వల్ల స్త్రీలు రాకుండా ఉండకూడదు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఆ రోజులకు వేతన సెలవు ఇవ్వాలి’ అని స్విగ్గీ ప్రతినిధి ఒకరు అన్నారు. స్విగ్గీలో పని చేస్తున్న మహిళల్లో దాదాపు 90 శాతం మంది 45 ఏళ్ల లోపువారే. వీరిలో జీవితంలో తొలి సంపాదన స్విగ్గీతో మొదలెట్టిన వారు 24 శాతం మంది ఉన్నారు. తమకు వీలున్న టైమ్‌లోనే పని చేసే అవకాశం ఉండటంతో చేరుతున్నారు. చాలామంది తమ సంపాదన ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది యువతులు చదువుకోవడానికి. ‘మహిళా డెలివరీ పార్టనర్స్‌కు వాహనాలు లేకపోతే వారి కోసం మా సంస్థ ఎలక్ట్రిక్ సైకిల్/బైక్‌లను అద్దెకు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం’ అని కూడా స్విగ్గీ సంస్థ ప్రతినిధి అన్నారు. ప్రస్తుతం నగరాల్లో ఫుడ్ డెలివరీ సిబ్బంది తమ పెట్రోల్ ఖర్చులు పోను 20 వేల నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? -
పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం
సాక్షి, న్యూఢిల్లీ: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందని ఆయన వెల్లడించారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అభినందించారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు. 2015–20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్నారు. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని, తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. -
నదుల పరిరక్షణ సమిష్టి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: నదులను పరిరక్షించుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనానికి శక్తిమంతమైన జాతీయ ప్రచార ఆవశ్యకతకు పిలుపునిచ్చారు. ఎనిమిది రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు ‘ఫరెవర్ గువాహటి’సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్ బుక్) విడుదల చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరుగుదలతో నదులు, నీటి వనరులు కలుషితం అవుతున్నాయన్నారు. ఆధునికీకరణ అన్వేషణలో అత్యాశతో మనిషి సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ప్రాధాన్యం ముందు తరాలు తెలుసుకోవాలంటే జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అనంతరం ఫేస్బుక్ వేదిక ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి... బ్రహ్మపుత్ర నదిని సందర్శించిన మరుపురాన్ని అనుభవాలను వివరించారు. బ్రహ్మపుత్ర సహజ నదీ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ని చేసిందని, అద్భుతమైన నదీతీర ఉద్యానవనం సంతోషాన్ని, మరచిపోలేని జ్ఞాపకాలను పంచిందని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి అందిస్తున్న బ్రహ్మపుత్ర ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతుల్లో భాగమని వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతరం, అస్సాం రాష్ట్ర కేన్సర్ ఇన్స్టిట్యూట్లో పీఈటీ–ఎంఆర్ఐ యంత్రాన్ని ప్రారంభించారు.అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంలో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్టిబ్యూటెడ్ కేన్సర్ కేర్ మోడల్‌ను అభినందించారు. -
చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు. చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ వర్చువల్ వేదికగా నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్‌లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిక్షణా శిబిరంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రణబ్ విశేష సేవలు: మోదీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రథమ స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఖలీదా జియా వర్చువల్‌గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్‌ను కొనియాడారు. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్‌లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ తన ఉపన్యాసంలో.. ప్రణబ్‌తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. -
పరిశోధనలను ముమ్మరం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఎదురు కాబోయే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. కోవిడ్ –19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డి.ఐ.పి.ఏ.ఎస్) శాస్త్రవేత్తల సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు. సోమవారం డి.ఐ.పి.ఏ.ఎస్.కు చెందిన దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డి.ఐ.పి.ఏ.ఎస్., ఇతర డీఆర్డీఓ ల్యాబ్‌లను వెంకయ్య అభినందించారు. అంతేగాక ఎ లాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవం తంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం డీఆర్డీఓ ల్యాబ్స్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన వివిధ ఉత్పత్తులు, పరికరాల గురించి డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
తెలుగును పరిరక్షించుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర్తి పంతులుకు ఇచ్చే నిజమైన నివాళి అన్న ఆయన, తెలుగు భాష పరిరక్షణ కోసం 16 సూత్రాలను ప్రతిపాదించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్చువల్ వేదికగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నిర్వహించిన ‘తెలుగు భవిష్యత్తు – మన బాధ్యత’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాషను సమున్నతంగా తీర్చిదిద్దడమే గిడుగు వారికిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. తెలుగు భాషను కాపాడుకోవాలనే సత్సంకల్పంతో తెలుగు వారంతా ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్న ఆయన, ఈ కార్యక్రమ ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించిన ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థాపక అధ్యక్షుడు విక్రమ్ పెట్లూరి, వీధి అరుగు సంస్థాపక అధ్యక్షుడు వెంకట్ తరిగోపుల సహా వివిధ దేశాల భాషావేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
హంపీ అద్భుతం
సాక్షి, బళ్లారి: ఘనమైన సాంస్కృతిక వారసత్వాలకు నిలయమైన భారతదేశపు గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబసమేతంగా చారిత్రక హంపీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా యువతలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆకాంక్షించారు. హంపీలో విజయనగర సామ్రాజ్య గత వైభవపు ఆనవాళ్లు, నాటి శిల్పకళాశైలి ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాయన్నారు. బహమనీ సుల్తానులు విజయనగర వైభవాన్ని నేలమట్టం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, హంపీ శిథిలాలు సైతం నాటి చరిత్రను మనకు తెలియజేస్తున్నాయని తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయగిరి నియోజకవర్గం సైతం రాయలవారి సామ్రాజ్యంలో ఒకనాడు భాగంగా ఉండేదని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో హంపీని సందర్శించానని తెలిపారు. ప్రజా సంక్షేమానికి రాయలు శ్రమించారని, సంస్కృతిని, కళలను ప్రోత్సాహించారని, ఆయన లాంటి ఆదర్శవంతమైన రాజులు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తారని తెలిపారు. హంపీ వంటి చారిత్రక ప్రదేశాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. -
అఫ్గాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిని నేనే.. తనను తానే ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు
కాబుల్: అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేసాక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఉపాధ్యక్షడు అమ్రుల్లా సలేహ్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిన సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను దేశంలోనే ఉన్నానని, త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు వారందరిని కలుస్తానని ట్విటర్లో పేర్కొన్నారు. Clarity: As per d constitution of Afg, in absence, escape, resignation or death of the President the FVP becomes the caretaker President. I am currently inside my country & am the legitimate care taker President. Am reaching out to all leaders to secure their support & consensus. — Amrullah Saleh (@AmrullahSaleh2) August 17, 2021 చదవండి: అల్లకల్లోల అఫ్గాన్: సరిహద్దుల్లో 295 కి.మీ గోడ నిర్మిస్తున్న టర్కీ -
ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండు కళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రతిపక్షాలు తనకు రెండు కళ్లని రాజ్యసభ ౖచైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇరుపక్షాలు సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయన్నారు. రాజ్యసభలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వెంకయ్య అభిప్రాయాలతో ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల పరస్పర మొండి వైఖరితో ఉభయ సభలూ వాయిదాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెగసస్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలుపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పాటు నిరసన ప్రదర్శనలతో ఉభయ సభల్ని స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కళ్లతోనే సరైన దృష్టి కుదురుతుందని, ఇరుపక్షాలను తాను సమానంగా గౌరవిస్తాననని వెంకయ్య చెప్పినట్లు ప్రకటన తెలిపింది. చట్టసభలు చర్చలకోసం ఉద్దేశించినవని గుర్తు చేశారు. బయట చేసుకోవాల్సిన రాజకీయ పోరాటాలను సభలో చేయాలనుకోవడం సరికాదని ఆయన హితవు చెప్పారు. రభస ఘటనలపై పరిశీలన ఇటీవలి సమావేశాల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించి సభా గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన విషయంలో చర్యలు తీసుకోవడంపై లోతుగా పరిశీలిస్తున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారని ప్రకటన తెలిపింది. బుధవారం సమావేశాల్లో విపక్ష సభ్యులు, పార్లమెంట్ సెక్యూరిటీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే! గురువారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో కూడా పార్లమెంట్లో ఘటనలపైనే చర్చించారని తెలిసింది. -
సభ్యుల తీరుపై వెంకయ్య కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సభలో సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిద్రలేని రాత్రి గడిపినట్టు పేర్కొన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ముందురోజు మంగళవారం సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ప్రకటన చేశారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా, సభలో సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు కూర్చునే టేబుల్ ఉండే చోటును గర్భగుడిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రదేశం పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘నిన్న ఈ పవిత్రతను నాశనం చేశారు. కొంతమంది సభ్యులు టేబుల్ మీద కూర్చున్నారు. మరికొందరు టేబుల్ పైకి ఎక్కారు. నా ఆవేదనను తెలియజేయడానికి, ఈ చర్యను ఖండించడానికి నాకు మాటలు లేవు..’ అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన సంఘటన వల్ల తాను నిద్ర లేని రాత్రి గడిపానని చెబుతూ చైర్మన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలు’ అంశం చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రత్యేకించి గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న వారికి సువర్ణావకాశం లభించిందని, కానీ చర్చ జరపకుండా సభ్యులు అంతరాయం సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. -
కలిసి కట్టుగా టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలి: ఉప రాష్ట్రపతి
సాక్షి, ఢిల్లీ: పౌరులకు సరైన సమయంలో నాణ్యమైన సేవలు అందించడంపై మరింత దృష్టిపెట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.ఆయన సోమవారం ‘యాక్సలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నరమెంట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. 2024 నాటికి 20కోట్ల మందికి కుళాయిల ద్వారా తాగునీరందించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకోవడం అభినందనీయమన్నారు. యువతకు సరైన నైపుణ్యాన్ని అందిస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారిని సంసిద్ధులను చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ పథకం కోట్లాది మంది చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, మహిళలకు గౌరవాన్ని కల్పించిందని తెలిపారు. దేశాభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి పరిశ్రమలోనైపుణ్యాభివృద్ధికేంద్రాన్ని తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020)ను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సాధించిన ప్రగతిని వివరిస్తూ.. 28 మంది ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులు, విషయ నిపుణులు రాసిన 25 వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరచడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పుస్తక సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు శ్రీ కేజే అల్ఫోన్స్‌ను, పుస్తక ప్రచురణకర్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర మంత్రులు శ్రీ వి.మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్, ఈ పుస్తకంలో వ్యాసాలు రాసిన రచయితలు పాల్గొన్నారు. -
హక్కులే కాదు... బాధ్యతలూ గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సంఘ సేవకుడు చమన్‌లాల్ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి చమన్‌లాల్ అండగా నిలిచారన్నారు. చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రులు దేవ్‌సింగ్ చౌహాన్, రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో 22.60% సమయం సద్వినియోగం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో మూడోవారం 8 బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో ఎగువ సభలో సద్వినియోగమైన సమయం(ప్రొడక్టివిటీ) 24.2 శాతానికి పెరిగింది. ఇది మొదటి వారంలో 32.20 శాతం, రెండో వారంలో కేవలం 13.70 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు రాజ్యసభ పరిశోధక విభాగం గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా మొత్తం మూడు వారాల్లో సద్వినియోగమైన సమయం 22.60 శాతంగా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగసస్ స్పైవేర్‌తోపాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మొదటిరోజు నుంచే ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెడుతూనే ఉంది. గతవారం 17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు వివిధ బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లులపై మొత్తం 3.25 గంటలపాటు చర్చలు జరిగాయి. -
వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి అవకాశాలు
శంషాబాద్: వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యువత నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున్‌రావు స్వాగతం పలికారు. ఫౌండేషన్‌లో వివిధ కోర్సుల శిక్షణ తీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. టైలరింగ్ శిక్షణ తీసుకుని అక్కడే పనిచేస్తున్న మహిళలతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం బాగుందని కితాబిచ్చారు. తర్వాత జీఎంఆర్, చిన్మయ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో వెంకయ్యనాయుడు మొక్కను నాటారు. -
ఆన్లైన్ చదువులు ప్రత్యామ్నాయం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా, వారిలో సృజనాత్మకత, పరిశోధనాసక్తిని పెంపొందించేదిగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదని అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్, ఆన్లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ.. అందరికీ ఆమోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యను అందించడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో మరింత క్రమశిక్షణను పెంపొందించుకునేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రామీణ, పట్టణ అంతరాలను తగ్గించుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో విద్యాబోధన అందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అటవీ సంపద విధ్వంసం, కాలుష్యం తదితర అంశాలతో ఏర్పడ్డ సవాళ్లు, సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి ఒక్కటే సరైన మార్గమని అన్నారు. ఈ దిశలో విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. అంతే గా క వేదాలు, ఉపనిషత్తుల ఘనమైన వారసత్వాన్ని వాటిలోని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా, విజ్ఞాన కేంద్రంగా నిలబెట్టాల్సిన సరైన తరుణమిదేనని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
కమలా హ్యారిస్ స్ఫూర్తితో పుస్తకం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నిక కావడంతోపాటు అమెరికాలో భారత సంతతి ప్రజలు సంఖ్యాపరంగా తక్కువే అయినా, పలుకుబడి కలిగిన వర్గంగా ఎదిగిన తీరుపై ఒక పుస్తకం వెలువరించేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు, దౌత్యాధికారులు, వ్యాపారవేత్తలు, పలుకుబడి కలిగిన ప్రముఖుల బృందం ఇందుకోసం ముందుకు వచ్చింది.‘అమెరికాకు వచ్చి స్థిరపడిన మొదటి రెండుతరాల వారి ఆశలు, ఆశయాలకు కమలా హ్యారిస్ ప్రతీక. దేశ ఉపాధ్యక్షురాలి స్థాయికి కమల ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఆమె పడిన కష్టం, ఎదురైన ఆటంకాలు, ఆమె విజయానికి భారత సంతతి ప్రజలు చేసిన కృషి వంటివి ఈ పుస్తకంలో ఉంటాయి’ అని ఈ పుస్తక రచయితల్లో ఒకరు, ప్రముఖ అమెరికన్– ఇండియన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఎంఆర్ రంగస్వామి వెల్లడించారు. ‘కమలా హ్యారిస్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్’ అనే ఈ పుస్తకంలో అమెరికాలో భారత సంతతి ప్రజలు స్వయం కృషితో ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు.40 లక్షల వరకు భారతీయ అమెరికన్లుండగా, అందులో 18 లక్షల మంది అర్హులైన ఓటర్లున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయురాలు, మొట్టమొదటి దక్షిణాసియా సంతతి అమెరికన్‌గా కమలా హ్యారిస్(56) చరిత్ర సృష్టించారు. ఆమె తండ్రి జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్, తల్లి చెన్నైకు చెందిన శ్యామలా గోపాలన్. -
కరోనా కట్టడికి పంచ సూత్ర ప్రణాళిక – ఉపరాష్ట్రపతి సూచన
హైదరాబాద్: కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతీ ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనగలమని ఆయన పేర్కొన్నారు. కరోనాపై వస్తున్న అపోహలు, పుకార్లను విశ్వసించడం ద్వారా ఆందోళనే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితలు రాసిన కథలతో వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో వచ్చిన ‘కొత్త (కరోనా) కథలు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ప్రవాసులకు అభినంధనలు అమెరికాలో నివసిస్తున్నప్పటికీ అమ్మభాషను మరచిపోకుండా మాతృభూమితో మమేకమవుతూ ఈ కొత్త కథలు పుస్తకంలో తెలుగు కథలతో ఆకట్టుకున్న ప్రవాసాంధ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించి, వాటిని అక్షరబద్ధం చేసి ముందుతరాలను ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిమీదా ఉందన్నారు. ఈ సందర్బంగా మాతృభాషలను కాపాడుకునేందుకు వెంకయ్యనాయుడు కొన్ని సూచనలు చేశారు. మాతృభాషలను కాపాడుకునేందుకు ఉపరాష్ట్రపతి ప్రతిపాదించిన పంచసూత్ర ప్రణాళిక - మాతృభాషలో ప్రాథమిక విద్య అందేలా చూడటం. - పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం. - న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలోనే సాగడం - ఉన్నతవిద్య, సాంకేతిక విద్యల్లో స్వదేశీ భాషల వినియోగం క్రమంగా పెంచడం - ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో, తమ కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత కరోనా పోరులో కరోనా విషయంలో ప్రారంభంలో ఆందోళనకు గురయినా వెంటనే తేరుకుని ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో ఈ మహమ్మారితో పోరాటం చేయడంలో భారత్ ముందు వరుసలో ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మన శాస్త్రవేత్తలు, పరిశోధనకారుల కృషితో టీకాను తయారు చేసి మన ప్రజలకే కాకుండా, విదేశాలకు సైతం అందించారని చెప్పారు. ప్రజల్లో టీకాలపై ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. కరోనా కట్టడికి సూచనలు - కోవిడ్ ఎదుర్కొనే దిశలో శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అవసరమన్నారు. దీని కోసం వ్యాయామం, నడక, యోగ లాంటివి చేయాలన్నారు. - ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందాలన్నారు. - వ్యర్థమైన జంక్‌ఫుడ్ మీద గాక సంతులన, పోషకాహారం మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. - ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం, మాస్కులు , చేతులు శుభ్రం చేసుకోవడం టీకా తీసుకోవడం వంటిని తప్పనిసరిగా చేయాలన్నారు. - ప్రకృతిని ప్రేమించాలని ఏసీ గదుల్లో కాకుండా.. వీలైనంత ఎక్కువగా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నివాళి కరోనా కొత్తకథల్లో భాగస్వాములైన రచయితలందరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు. కొత్త అనుభవాలనుంచి పుట్టిన కథలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు అంకితమివవ్వడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బాలసుబ్రమణ్యం జీవితం తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. మరోసారి బాలుకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన కాళీపట్నం రామారావు, పోరంకి దక్షిణామూర్తిలకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. వర్చువల్‌గా వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఇందులో అమెరికాకు చెందిన గుండె వైద్య నిపుణులు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు, ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్, భువనచంద్ర, అమెరికా నుండి వంగూరి ఫౌండేషన్ అధినేత డాక్టర్ చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ కిషోర్ బాబు కేశాని, మరియు గానకోకిల శారద ఆకునూరి , సింగపూర్ నుండి "శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షలు" రత్న కుమార్ కవుటూరు, రాధికా మంగిపూడి, సిడ్నీ నుంచి విజయ గొల్లపూడి, లండన్ నుంచి నవతా తిరునగరి, ఒమన్ నుంచి డాక్టర్ రామలక్ష్మి తాడేపల్లి, కెనడా నుండి సరోజ కొమరవోలు, చెన్నై నుండి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సీఎంకే రెడ్డి, హైదరాబాద్ నుండి జేవీ పబ్లికేషన్ జ్యోతి వాల్లభోజు మరియు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన రచయితలు ఉన్నారు. సింగపూర్ నుండి రాధాకృష్ణ సాంకేతిక సహకారం అందించారు. -
ఏపీ: ఐఎల్ఈజీ వైస్ ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి సమీర్‌శర్మ
సాక్షి, విజయవాడ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈజీ) వైస్ ఛైర్మన్, మెంబర్ సెక్రటరీగా సమీర్‌శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్‌శర్మ ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. -
భారత ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాల పాత్ర కీలకం: వెంకయ్యనాయుడు
సాక్షి, విశాఖపట్నం: నౌకాయాన రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన విశాఖ పోర్ట్ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతికి ప్రజెంటేషన్ ద్వారా పోర్టు పురోగతి వివరాలను విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్ వెల్లడించారు. విశాఖ ట్రస్టు విస్తరణ ప్రణాళికలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాల పాత్ర కీలకమన్నారు. దేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్మాల’ కార్యక్రమం చేపట్టిందన్నారు. 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. సాగరమాల ద్వారా రూ.3.57లక్షల కోట్ల మౌలికవసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్రావు, డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సి.వి.వో ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది..
యాభై ఆరేళ్ల కమలా హ్యారిస్ ఎక్కడ?! 2009 బ్యాచ్ స్వయం భాటియా ఎక్కడ?! ‘బట్.. నేను, తను ఒక్కటే. మా ఇద్దరి పేర్లలో పవర్ ఉంది. మా ఇద్దరిలో కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడీ పన్నెండేళ్ల వయసులో ఒక ఇండియన్ గా యూఎస్ లో నేను ఎలా ఉన్నానో, తన టీన్స్ ఆరంభంలో కమల అలానే ఉన్నారు‘ అంటోంది ఈ ‘స్వయం’భువు! ఇంతకీ అమ్మగారు ఏం చేస్తుంటారు? ఏదైనా చేస్తుండే వయసా ఇది! చేసి పెడుతుంటే, తిని పెడుతుండే ఏజ్ కదా! కానీ స్వయం భాటియా అలా లేదు. షి ఈజ్ ఏన్ యాక్ట్రెస్. సింగర్, డాన్సర్, మోడల్, డ్రమ్మర్.. ఇంకా చాలా! వైస్–ప్రెసిడెంట్ అనే ఆ పోస్టును తీసి పక్కన పెడితే.. నిజమే, నేనూ తానూ అనేంత ఉంది ‘స్వే’కి. అకస్మాత్తుగా ఈ పిడుగు ఎక్కడ నుంచి పడింది?! ఈ చిన్నారిని చూశారుగా! పేరు స్వే భాటియా. వయసు పన్నెండేళ్లు. ఆ వయసుకు ఎంత పేరొచ్చినా స్వే భాటియా అనే పేరు తర్వాతనే. కానీ తను ‘మైటీ డక్స్ యాక్ట్రెస్’ అనే పేరుతో యూ ఎస్‌లో పాపులర్. న్యూయార్క్ సిటీలో ఉంటుంది. చదువు చదువే. టాలెంట్ టాలెంటే! నటనొక్కటే టాలెంట్ అనుకునేరు. సింగర్, డ్యాన్సర్, మోడల్, డ్రమ్మర్, ఇంకా.. కమెడియన్. అంత టైమ్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం. తను మాత్రం వేరేలా అంటుంది.. ‘బోర్ కొడుతోంది మమ్మీ.. టైమ్ గడవడం లేదు’ అని! టైమ్ కంటే వేగం అయి ఉండాలి. అంత వేగామా.. అని ఇప్పటికప్పుడు మీరు స్వేని చూడాలనుకుంటే హెచ్.బి.వో.లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్లాక్ కామెడీ సెటైరికల్ డ్రామా సీరీస్.. ‘సక్సెషన్’ కోసం టీవీ ఆన్ చేయొచ్చు. అందులో సోఫీ రాయ్‌గా మీకు కనిపించబోయేది స్వే భాటియానే! లేకుంటే మార్చి 26న ప్రారంభమయ్యే ‘డిస్నీ ప్లస్’ సీక్వెల్ సీరీస్ ‘ది మైటీ డక్స్ : గేమ్ ఛేంజర్’ కోసం ఎదురు చూడొచ్చు. మైటీ డక్స్ విడుదలకు ముందే స్వే.. మైటీ డక్స్ యాక్ట్రెస్ అయిందంటే చూడండి. సరే, ఇప్పటి వరకు ఇదంతా స్వే (అసలు పేరు ‘స్వయం’) గురించి మనం చెప్పుకున్నది. ఇక్కడి నుంచి స్వే తన గురించి తను చెప్పుకోబోతున్నది! అయితే స్వే ఊరికే తనేమిటో చెప్పుకోవడం లేదు. కమలా హ్యారిస్‌తో తనని కంపేర్ చేసుకుంటోంది. లేదంటే కమలా హ్యారిన్ని తనతో కంపేర్ చేస్తోంది! ఇలాగని తను తన బ్లాగ్‌లో రాసుకుంది. డ్రమ్మర్‌గా, నటిగా, మోడల్‌గా స్వే (స్వయం) ‘‘ఐ యామ్ స్వే. పుట్టినప్పుడు స్వయం రంజీత్ భాటియా నేను. ఈ మధ్యే నేను నా పేరులో ఉన్న పవర్‌ని గమనించాను. ‘స్వ’ అంటే ‘నా’ అని. ‘స్వయం’ అంటే ‘నేను’ అని. నేను పుట్టకముందే అమ్మానాన్న అబ్బాయి పుడితే పెట్టాలని ‘స్వీయ’ అనే అర్థంలో ‘స్వయం’ అనే సంస్కృత నామాన్ని ఎంపిక చేసి పెట్టుకున్నారు. నేను పుట్టాక అదే పేరు ఉంచేశారు’’ అని స్వే తన బ్లాగులో రాసుకుంది. అయితే ఇదేమీ విషయం కాదు. తన పేరులో ఉన్న పవరే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరులోనూ ఉందని తను గమనించిందట. అంతే కాదు, తామిద్దరికీ పోలికలు ఉన్నాయని కూడా! కమలానికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నట్లే కమలా హ్యారిస్ ప్రయాణానికీ ఉంటుందని అనిపించి ఆమె గురించి తెలుసుకున్నా. భారతీయ సంతతి అమెరికన్ టీనేజర్‌గా కమల అమెరికాలో ‘ఏకాకి’ అయిన సందర్భాలు.. నేను ఇప్పుడు ఏకాకి అవుతున్న సందర్భాలను గుర్తు చేస్తున్నాయి. ఆ వయసులో ఒక బ్లాక్ పర్సన్‌గా, ఒక ఇండియన్‌గా, ఒక మహిళగా తన గదిలో కమల ఒంటరిగా గడపడం.. ఇప్పుడు నా ఒంటరితనాన్ని గుర్తుకు తెస్తోంది. నేను టీన్స్‌లోకి వస్తున్నాను. పదమూడు రాబోతోంది. నాకూ నా గదిలో ఒంటరి ఇండియన్ని అనిపిస్తుంటుంది. బ్యాలే క్లాస్‌లో, హిప్ హాప్ డ్యాన్స్ కచ్చేరీల్లో, బ్రాడ్వే ఆడిషన్లలో నేనొక్కదాన్నే అన్నట్లు ఉంటుంది. గత ఏడాది కమల పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే ఆమెతో నన్ను పోల్చుకున్నాను. ఆమె అడుగు కదిలినప్పుడు నా అడుగు కదలినట్లు, క్యాపెయిన్ను ఆపినప్పుడు నా అడుగు ఆగినట్లు ఊహించుకున్నాను. ఒకవేళ ఆమె ఇక్కడే ఆగిపోతే.. నేనూ ఆగిపోతానా అనే ఆలోచన కూడా నాకు ఆనాడు వచ్చింది. కానీ ఆమె గెలిచారు. నాలో గెలుపు ఆలోచనలు కలిగించారు. ఒక ఇండియన్ అమెరికన్ ఇంత ఘన విజయం సాధించారు కనుక నేనూ సాధిస్తాను అనుకున్నాను’’ అని స్వే తన బ్లాగ్‌లో రాసింది. ఇదంతా స్వే మామూలుగా రాసుకున్నదే కానీ ఆమె ఇలా రాయడానికి ఇప్పుడు అనుకోని ప్రాధాన్యం లభిస్తోంది. ముఖ్యంగా కమలా హ్యారిస్‌తో ‘నేనూ తనూ’ అని పోల్చుకోవడం! యాక్టర్స్ ఈక్విటీ అసోసియేషన్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్ సంస్థలతో స్వేకి కాంట్రాక్టులు ఉన్నాయి. అసలు మూడేళ్ల వయసు నుంచే స్వే సంగీత, సృజనాత్మక రంగాలలోకి వచ్చేసింది. కీబోర్డ్, క్లాసికల్ పియానో, బాస్ గిటార్, డ్రమ్.. ఆమె వేళ్లు చెప్పినట్లు రాగాలు పోతాయి. దరువులు వేస్తాయి. స్వే డ్యాన్స్ చేస్తే ఫ్లోర్ పరవశించిపోవలసిందే! అంత లయబద్ధంగా చేస్తుంది. ‘‘తను ప్రధానంగా నటి. డాన్స్, సంగీతం.. తనకు అనుబంధ ఆసక్తులు’’ అంటారు స్వే తల్లిదండ్రులు రంజీత్, ధర్మాంగి. చివరికి స్వే ఒక స్వతంత్ర భావాలున్న మహిళగా ఎదిగి, రాజకీయాల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. కమలతో తనను కంపేర్ చేసుకుంటోందంటే.. కమల అడుగు జాడల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉందనేగా! -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
-
చిన్నారికి ఉపరాష్ట్రపతి అభినందనలు
జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అల్పన అనే విద్యార్థినిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. అందమైన చేతిరాతతో ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అల్పన రాసిన సందేశం ఉపరాష్ట్రపతిని చేరింది. స్పందించిన ఆయన ‘చక్కని చేవ్రాలుతో మంచి మాటలు, మనసును మరింత హత్తుకుంటాయని, సద్గుణాలు, మానవత్వం గురించి అల్పన తెలుగులో ఎంతో ముచ్చటగా రాసిందని, చిన్న వయస్సులోనే ఇంత చక్కని చేతిరాతను అలవాటు చేసుకున్న ఆ చిన్నారికి అభినందనలు’అని ట్వీట్ చేశారు. దీంతో చిన్నారికి చక్కటి చేతి రాతను నేర్పించిన పైసా సత్యంతో పాటు చిన్నారి అల్పనను పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. చదవండి: మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్‌తో మార్కెటింగ్ -
స్వర్ణభారతి ట్రస్ట్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
-
తెలుగు వ్యక్తికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి
సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (ఎంపీసీసీ) ఉపాధ్యక్ష పదవి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకి చెందిన తెలుగువ్యక్తిని వరించింది. ఎంపీసీసీ అధ్యక్షునితోపాటు ఆరుగురు కార్య«ధ్యక్షులు, 10 మంది ఉపా««ధ్యక్షులను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. వీరిలో మరాఠ్వాడాలో ప్రస్తుతం ఏకైక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన జాల్నా ఎమ్మెల్యే కైలాస్ గోరింట్యాల్ ఉన్నారు. కైలాస్ పూర్వికులు జీవనోపాధికోసం మహారాష్ట్రకు వలసవచ్చారు. కైలాస్ తండ్రి కిషన్ రావ్ కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. కైలాస్ మేనమామ బీజేపీ తరఫున ప్రజాక్షేత్రంలో ఉండడంతో కైలాస్ చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తిపెరిగింది. కాలేజీ రోజుల నుంచి రాజకీయా ల్లో క్రియాశీలంగా ఉన్నారు. 1986లో మరాఠ్వాడా యూనివర్సిటీ సెనెటర్‌గా గెలుపొందిన ఆయన 1991లో జాల్నా కౌన్సిలర్‌గా, 1992లో కౌన్సిల్ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత కైలాస్‌ను కాంగ్రెస్ అధిష్టానం 1999లో జాల్నా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2009లో కాంగ్రెస్ టిక్కెట్‌పై 20 వేల మెజార్టీతో శివసేన అభ్యర్థి అంబేకర్ భాస్కర్‌పై గెలిచారు. 2014లో ఓడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జాల్నా నియోజకవర్గం నుంచి గెలిచారు. జాల్నా నియోజకవర్గంలో ఆయన అనేక అభివద్ది పనులు చేశారు. వీటిలో ప్రధానంగా విద్యుత్ సబ్‌స్టేషన్, ఎంఐడీసీలో రూ.120 కోట్లతో విత్తనాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేశారు. దీంతో అనేక మంది యువతకు ఉపాధి కల్పించా రు. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో కైలాస్ కుటుంబీకులు తెలుగు పాఠశాల స్థాపనకు కృషి చేశారు. కాలక్రమేణా తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్ వైపుకు మొగ్గుచూపడంతో తెలుగు పాఠశాలలను మూసేయాల్సి వచ్చింది. -
దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు : మోదీ
ఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ భారత ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జై హింద్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. కోవిడ్-19 నేపథ్యంలో ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు నిర్వహించారు. देशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद! Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind! — Narendra Modi (@narendramodi) January 26, 2021 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు దేశ ప్రజలందకి శుభాకాంక్షలు తెలిపారు. 'సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా.. రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు ప్రతి ఒక్కరం ప్రతిన బూనుదాం' అని ట్వీట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా.. రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు ప్రతి ఒక్కరం ప్రతిన బూనుదాం. #RepublicDayIndia #RepublicDay #RepublicDay2021 pic.twitter.com/QWscb77x8t — Vice President of India (@VPSecretariat) January 26, 2021 -
అమ్మ మాట బంగారు బాట
వాషింగ్టన్: అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన వేళ భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ మరోసారి తన తల్లిని తలచుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె తన పట్ల ఉంచిన నమ్మకమే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. భారత్‌కు చెందిన శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూనే పౌర హక్కుల ఉద్యమకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమలా హ్యారిస్‌పై తన తల్లి ప్రభావం చాలా ఎక్కువ. ఇండియన్ అమెరికన్ న్యాయ, రాజకీయ యాక్షన్ కమిటీ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షురాలు కమల మరోసారి తన తల్లి చెప్పిన మాటల్ని అందరితోనూ పంచుకున్నారు. ‘ఎంతో మంది అమెరికన్ల కథే నా కథ కూడా. నా తల్లి శ్యామలా గోపాలన్ భారత్ నుంచి వచ్చారు. నన్ను నా చెల్లి మాయని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశారు. మనమే మొదటి వాళ్లం కావొచ్చు. కానీ మనం ఎప్పటికీ ఆఖరి వాళ్లం కాదని మా అమ్మ తరచూ చెబుతూ ఉండేవారు’’ అని కమల గుర్తు చేసుకున్నారు. మహిళా శక్తికి వందనం కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారానికి ముందు ట్విట్టర్లో ఉంచిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. తనకంటే ముందు ఈ గడ్డపై అడుగుపెట్టిన వారికి నివాళులర్పిస్తూ ఈ వీడియో చేశారు. ‘నా కంటే మా అమ్మ మొదట ఇక్కడికి వచ్చింది. మా అమ్మ శ్యామలా గోపాలన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా నా హృదయంలో శాశ్వతంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మా అమ్మ అమెరికాకి వచ్చినప్పుడు తన కుమార్తె ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించి ఉండదు. కానీ అమెరికాలో మహిళకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమెకు గట్టి నమ్మకం. ఆ నమ్మకమనే బాటలోనే నడిచి నేను ఇంతవరకు వచ్చాను. అందుకే అమ్మ మాటల్ని ప్రతీ క్షణం తలచుకుంటూనే ఉంటాను’’ అని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కోసం పోరాటాలు, త్యాగాలు చేసే మహిళల్ని చాలాసార్లు ఈ దేశం గుర్తించకపోవచ్చు. కానీ కొన్నిసార్లు వారే ఈ దేశానికి వెన్నెముకగా ఉంటారని రుజువు అవుతూనే ఉందని కమల వ్యాఖ్యానించారు. -
బైడెన్‌కు కాంగ్రెస్ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్ ఎన్నికకు గురువారం అధికారికంగా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. క్యాపిటల్ బిల్డింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల అసాధారణ హింసాత్మక విధ్వంసం అనంతరం.. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్ నేతల ఎన్నికను నిర్ధారించాయి. పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలపై రిపబ్లికన్ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రతినిధుల సభ, సెనెట్ తోసిపుచ్చాయి. బైడెన్, కమల 306 ఎలక్టోరల్ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి పెన్స్ 232 ఎలక్టోరల్ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. 78 ఏళ్ల బైడెన్ జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ హిల్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో ఒక మహిళ సహా నలుగురు చనిపోయారు. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ మహిళ మరణించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆందో ళనకారులను చెదరగొట్టిన తరువాత సమావేశాలు మళ్లీ కొనసాగాయి. గురువారం తెల్లవారు జాము వరకు సాగిన సమావేశంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లను, కౌంటింగ్‌ను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరిజోనా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 93–6 ఓట్లతో, ప్రతినిధుల సభ 303–121 ఓట్లతో తోసిపుచ్చాయి. పెన్సిల్వేనియా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ సభ్యుల అభ్యంతరాలను సెనెట్ 92–7 ఓట్లతో, ప్రతినిధుల సభ 282–138 ఓట్లతో తోసిపుచ్చాయి. భారత సంతతి ఎంపీలు రో ఖన్నా అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్ కూడా ఆయా అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటమి ఒప్పుకున్న ట్రంప్ బైడెన్, కమల ఎన్నికకు కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించిన అనంతరం.. డొనాల్డ్ ట్రంప్ ఒక అధికారిక ప్రకటనలో ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించనప్పటికీ.. జనవరి 20న అధికార మార్పిడి సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. అత్యద్భుతమైన తన తొలి టర్మ్ అధ్యక్ష పాలనకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోలైన వాటిలో న్యాయమైన ఓట్లనే లెక్కించాలన్న డిమాండ్‌పై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఫలితాలపై కుట్రపూరిత వాదనలను పోస్ట్ చేస్తుండటంతో ట్రంప్ అకౌంట్లను ఫేస్బుక్ 24 గంటల పాటు, ట్విటర్ 12 గంటల పాటు నిలిపివేశాయి. మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగం సహా మూడు ట్వీట్లను బ్లాక్ చేసింది. ప్రమాణస్వీకారం చేసేంత వరకు ట్రంప్‌ను బ్లాక్ చేయాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ట్రంప్ ఫేస్‌బుక్‌ను వాడేందుకు అనుమతించడం ప్రమాదకరమని సంస్థ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ అన్నారు. ట్రంప్ అకౌంట్‌ను 2వారాలు బ్లాక్ చేస్తున్నామని స్పష్టం చేశారు. -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!
వాషింగ్టన్: అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిౖకైన కమల హ్యారిస్ పనిచేయాలనుకుంటున్నారని ఆయన బృందం వెల్లడించింది. కోవిడ్–19 నియంత్రణ, మళ్లీ అభివృద్ధి పట్టాల పైకి ఆర్థిక రంగం, వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల అంతం, వాతావరణ మార్పు సమస్యకు పరిష్కారం.. ఇవే బైడెన్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించింది. అధికార మార్పిడి విధుల్లో ఉన్న బైడెన్ బృందం ఈ విషయాన్ని తమ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సమగ్ర వ్యూహంతో ఈ లక్ష్యాలను సాధించాలని బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రజారోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించడం తక్షణ విధిగా బైడెన్ భావిస్తున్నారని పేర్కొంది. వైరస్ వల్ల కుదేలైన కుటుంబాలను, చిన్న వ్యాపారాలను, బాధితులను, కోవిడ్–19పై పోరాడుతున్న యోధులను పరిరక్షించడానికి ప్రాథాన్యం ఇస్తున్నట్లు వివరించింది. కరోనా నియంత్రణ తరువాత.. మంచి వేతనాలు లభించే లక్షలాది ఉద్యోగాల కల్పన బైడెన్ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని తెలిపింది. అత్యుత్తమ అమెరికాను నిర్మించే దిశగా దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు అవసరమైన అన్ని హక్కులు, సదుపాయాలను కల్పించాలని సంకల్పించినట్లు వెల్లడించింది. ఒకవైపు కరోనాను నియంత్రిస్తూనే, మరోవైపు, ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం జరిగేలా, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వ్యవస్థీకృత జాతి వివక్ష, ఆర్థిక అసమానతల తొలగింపు బైడెన్ ప్రభుత్వ మూడో లక్ష్యమని వివరించింది. అమెరికా సమాజంలో భాగమైన బ్లాక్స్, బ్రౌన్స్ సంక్షేమం, వారి అభివృద్ధి కేంద్రంగా ఆర్థిక వృద్ధి సాగాలనేది నూతన ప్రభుత్వ ఆలోచన అని పేర్కొంది. దేశంలోని అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే విషయంలో అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేసింది. బైడెన్‌కు ఇప్పుడే ‘విషెస్’ చెప్పం! మాస్కో/బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడేవరకు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపకూడదని రష్యా, చైనా నిర్ణయించాయి. అమెరికా చట్టాలు, నిబంధనల ప్రకారం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు స్పష్టమైన తరువాతే తాము స్పందిస్తామని తెలిపాయి. ఎన్నికలపై తలెత్తిన న్యాయ వివాదాలు పరిష్కారమై, ఫలితాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాతే బైడెన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందిస్తారని సోమవారం రష్యా ప్రకటించింది. బైడెన్ విజయం అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలపని దేశాల్లో చైనా, రష్యాతోపాటు బ్రెజిల్, టర్కీ, మెక్సికో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ఎన్నిక కావడంపై చైనా అధికారికంగా స్పందించలేదు ఈ విషయంలో అంతర్జాతీయ సంప్రదాయాలను పాటిస్తామంది. అక్కడి మీడియా మాత్రం వారి ఎన్నికను నిర్ధారిస్తూ పలు విశ్లేషణాత్మక కథనాలను ప్రచురించింది. -
ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికవడాన్ని భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడగలదని ఆకాంక్షించాయి. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల బంధాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటి ఉమ్మడి ఎజెండా అమలుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ తెలిపారు. ‘బైడెన్–కమలా సారథ్యంలో భారత్–అమెరికా ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడగలవు. అధునాతన శాస్త్రీయ పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, వ్యూహాత్మక రంగాల్లో వ్యాపార వర్గాల మధ్య సహకారం పెరగగలదు‘ అని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య పటిష్టమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని .. ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ చెప్పారు. నాయకత్వం అంటే విధానాలతో పాటు వ్యక్తిత్వం కూడా అన్న పాఠాన్ని అమెరికా ఎన్నికలు తెలియజేశాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2019లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 150 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పరస్పర ఆర్థిక సహకారంతో దీన్ని 500 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. స్వాగతించిన ఐటీ పరిశ్రమ..: జో బైడెన్ ఎన్నికపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హర్షం వ్యక్తం చేసింది. ‘స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి చర్యల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భార త టెక్నాలజీ రంగం కీలక తోడ్పాటు అందిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాల్లో అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై నాస్కామ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది‘ అని పేర్కొంది. ‘ఇది చారిత్రకమైన రోజు. అవరోధాలన్నీ తొలగిపోవడం హర్షించతగ్గ పరిణామం. ఏకత్వానికి, సమిష్టి తత్వానికి ఇది గెలుపు‘ అని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది‘ అని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్ణానీ ట్వీట్ చేశారు. -
అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!
వాషింగ్టన్: అదో అరుదైన దృశ్యం.. చరిత్ర సృష్టించిన అపురూపమైన సందర్భం. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి నల్లజాతీయురాలు, తొలి ప్రవాస భారతీయురాలు ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హ్యారిస్ జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు వెన్నెల కాంతులతో పోటీ పడే తెల్ల రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. మహిళా హక్కుల కోసం ఉద్యమించడమే తన లక్ష్యమని చెప్పడానికే ఆ రంగు దుస్తులు వేసుకున్నారు. అమెరికాలో 1913లో ఏర్పాటైన రాజకీయ సంస్థ ది నేషనల్ వుమెన్ పార్టీ తెలుపు, వంగపండు, బంగారం రంగుల్ని మహిళా ఉద్యమానికి ప్రతీకగా ఎంచుకుంది. అందులో తెలుపురంగు స్వచ్ఛతకి ప్రతిబింబంగా నిలుస్తుంది. అలా తెల్లరంగులో రాజహంసలా ఈ దేశానికి తాను తొలి మహిళా అధ్యక్షురాలిని అని, కానీ తాను చివరి మహిళని కాదు అంటూ ఉద్వేగ భరిత ప్రసంగాన్ని చేశారు. స్ఫూర్తిని నింపే వీడియో అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఇటీవల తన మేనకోడలిని ఒళ్లో కూర్చోబెట్టుకొని ముచ్చటించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నాలుగేళ్ల చిన్నారి అమరా అజాగు తనకు అమెరికాకు అధ్యక్షురాలు కావాలని చెప్పింది. దానికి కమల నువ్వు కూడా అధ్యక్షురాలివి కావొచ్చని అయితే దానికి చాలా కష్టపడాలని, 35 సంవత్సరాలు నిండాలని చెప్పి ఆ చిన్నారిలో స్ఫూర్తిని నింపారు. అదే స్ఫూర్తిని కమల తనలో తాను చాలా ఏళ్లుగా నింపుకుంటూ వస్తున్నారు. ఆ కష్టపడే తత్వం, తల్లి చెప్పిన మాటల్ని జీవితంలో తుచ తప్పకుండా ఆచరించడం, అంతులేని ఆత్మవిశ్వాసం ఆమెని ఉపాధ్యక్ష పీఠానికి దగ్గర చేశాయి. నల్ల జాతీయురాలినని చెప్పడానికి గర్వపడతా కమల తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి సంరక్షణలోనే పెరిగారు. ఆమె గుణాలు పుణికిపుచ్చుకొని జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, అద్భుతమైన నాయకత్వ లక్షణాల్ని సొంతం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని నల్లజాతివారిగానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే నన్ను, మా చెల్లెల్ని ఆత్మవిశ్వాసంతో పెంచారు. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిని సొంత పిల్లల్లా పెంచారు. సమర్థవంతమైన నాయకురాలు న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని డిస్ట్రిక్ట్ అటార్నీగా. రాష్ట్ర అటార్నీ జనరల్‌గా తన సత్తా చాటారు. అద్భుతమైన వాక్పటిమతో మంచి లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2016లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున సెనేట్‌కి ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత అమెరికాకి అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తో పోటీ పడి గత ఏడాది చివర్లో రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడెన్‌కు మద్దతుగా నిలిచి ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. ఒక సెనేటర్‌గా ఆమెలో నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి ఎప్పుడో తెలిశాయి. ఇంటెలిజెన్స్, జ్యుడీషియరీ విభాగాల్లో మంచి పట్టున్న ఆమెకు మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం ఉంది. నా ఫోన్ రింగ్ ఆగలేదు అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై కమలా హ్యారిస్ చరిత్ర తిరగరాయడంతో భారత్‌లోని ఆమె స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీలో ఉంటున్న ఆమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ కమల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కమల విజయం సాధించిన దగ్గర్నుంచి తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని ఆయన చెప్పారు. తొలి మహిళనే కానీ... మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి. నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను. ఎందుకంటే ఈ ఎన్నికలను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారులకు వారి ముందున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. – కమలా హ్యారీస్ -
చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: చాలామంది భారతీయుల ఎదురు చూపులు ఫలించాయి. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంటే కమలా హ్యారిస్ కొత్త చరిత్ర సృష్టించినట్లే. ఆమె ఇంతకుముందే ఎన్నో ఘనతలు సాధించారు. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ► కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఒక్లాండ్‌లో జన్మించారు. ► ఆమె తల్లి తమిళనాడులోని సంప్రదా య కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు. ► వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు. ► యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. ► అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. ► కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్ర టిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. -
అమెరికా: బైడెన్‌కే పట్టాభిషేకం
వాషింగ్టన్: అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్(77)నే చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డుసృష్టించనున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్ కాలేజీలోని 538ఓట్లకుగాను మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ ఖాతాలో జమయ్యాయి. జార్జియా(16,) నార్త్ కరోలినా(15) అలాస్కా(3) వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదు. దీంతో బైడెనే తదుపరి అధ్యక్షుడని సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి. ‘జోసెఫ్ ఆర్.బైడెన్ జూనియర్ అమెరికా 46వ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. దేశంలో సాధారణ రాజకీయ పరిస్థితులను నెలకొల్పుతాననీ, ఆరోగ్యం, ఆరి్థక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ఐక్యతను సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ హయాంలో వైట్ హౌస్‌లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి ఆయన ముగింపు పలికారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు జో బైడెన్ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అందుకోసం మనం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు అందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గోల్ఫ్ క్లబ్‌కు ట్రంప్ ఇప్పటి వరకు ఎన్నికల్లో అక్రమాలంటూ పలు ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కథ ముగిసిట్లేనని భావిస్తున్నారు. శనివారం ట్రంప్..వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లిపోయారు. ఈ ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడత ఎన్నిక కాలేని మూడో అధ్యక్షుడిగా ఆయన చరిత్రకెక్కారు. గడిచిన 25 ఏళ్లలో 1992లో జార్జి హెచ్. బుష్ తర్వాత ఇలా పరాజయం మూటగట్టుకున్న ఏకైక అధ్యక్షుడు కూడా ట్రంప్‌నే. బోసిపోయిన వైట్‌హౌస్ ఎన్నికల ఫలితాల ప్రభావం అధ్యక్షభవనంపై పడింది. సాధారణంగా అక్కడ కనిపించే హడావుడి ఒక్కసారిగా మాయమైంది. శ్వేతసౌధం లాన్లలో మాత్రమే కొద్దిపాటి మీడియా సిబ్బంది కనిపించారు. బైడెన్ మద్దతు దారులు రాజధాని వాషింగ్టన్‌తోపాటు, న్యూయార్క్, షికాగో, అట్లాంటా తదితర ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, కెనడా ప్రధానమంత్రి ట్రూడో తదితరులు బైడెన్, కమలాహ్యారిస్లను అభినందించారు. ఎన్నికల్లో అక్రమాలంటూ మరోసారి ట్రంప్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శనివారం మరోసారి ట్రంప్ ఆరోపణలు చేశారు. ‘పెన్సిల్వేనియా లాంటి చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి మా పరిశీలకులను రానివ్వలేదు. లోపల ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీల్లేకుండా చేశారు. జరక్కూడనివి జరిగిపోయాయి. చట్టబద్ధమైన పారదర్శకత కనిపించలేదు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. అక్కడ ఏం జరిగిందో తెలియదు’అని పేర్కొన్నారు. వాస్తవానికి భారీ మెజారిటీతో మేమే ఈ ఎన్నికల్లో గెలిచాం అంటూ ప్రకటించుకున్నారు. ‘అధ్యక్ష పదవి తనదే నంటూ జోబైడెన్ చెప్పుకోవడం తప్పు. అలా నేను కూడా చెప్పుకోగలను. ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో వేసిన పిటిషన్లపై ఇప్పుడిప్పుడే ప్రొసీడింగ్ మొదలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్రమంగా వేల సంఖ్యలో ఓట్లను స్వీకరించారన్నారు. ట్రంప్ ట్వీట్లను ట్విట్టర్ సంస్థ ఫ్లాగ్ చేసి చూపింది. వాషింగ్టన్లో వైట్‌హౌస్ వద్ద సంబరాలు -
దూసుకుపోవడమే.. అనుమతి అడగొద్దు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష రేసులో దూసుకుపోతున్న, కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ (55) మహిళ సాధికారితపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సాధించాలనుకున్నపుడు, ఇతరుల మాటలను పట్టించుకోకుండా..గమ్యంవైపు సాగిపోవాలని సూచించారు. ఇన్స్టాగ్రామ్ యూజర్లతో ముచ్చటించిన ఆమెను మహిళలకు ఏం సలహా ఇస్తారని ప్రశ్నించినపుడు ఈ సూచన చేశారు. (హోరాహోరీ పోరులో ‘పెద్దన్న’ ఎవరో?!) ‘మీరు ఏదైనా సాధించాలని ప్రయత్నించినపుడు, ప్రతికూలంగా వచ్చే సలహాలను, నిరుత్సాహ పరిచేమాటలను పట్టించుకోకండి.. నాయకత్వ స్థానంలో ఉండాలని భావిస్తే.. దూసుకు పోవడమే.. దానికి ఎవరినీ అనుమతి అడగవలసిన అవసరం లేదు’ అని కమలా హ్యారిస్ సలహా ఇచ్చారు. తన కెరియర్లో కూడా అది నీ పనికాదు, ఇది సమయం కాదు లాంటి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయనీ, కానీ అవన్నీ తాను పట్టించుకోలేదన్నారు. అలాంటి వాటికి నో చెప్పడమే తన అల్పాహారమని, అదే తన బలమని చెప్పుకొచ్చారు. తన అభిమాన భారతీయ వంటకాలు ఏమిటని ప్రశ్నించినపుడు దక్షిణ భారతదేశానికి సంబంధించి మంచి సాంబారు ఇడ్లీ ఇష్టమని ఆమె చెప్పారు. అదే నార్త్ ఇండియన్ అయితే టిక్కా ఇష్టమని చెప్పారు. ప్రచారంలో తన మానసిక ఆరోగ్యం కోసం ప్రతీరోజు ఉదయం వ్యాయామం చేస్తూ.. పిల్లలతో సమయాన్ని గడుపుతానన్నారు. అలాగే వంట చేయడాన్ని కూడా ఇష్టపడతానన్నారు. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉద్యోగాలు కల్పన తదితర అంశాలపైకూడా ఆమె సమాధానాలిచ్చారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించినట్లయితే ఉపాధ్యక్ష పదవిని అలంకరించే తొలి మహిళగా, తొలి శ్వేత జాతీయేతర మహిళగా కమలా హారిస్ నూతన అధ్యాయం లిఖించే అవకాశం ఉంది. రేపు (నవంబర్ 3 న) జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్(77), ఉపాధ్యక్ష పదవికి హ్యారిస్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. You asked, I answered. pic.twitter.com/KQgSxB58Ch — Kamala Harris (@KamalaHarris) November 2, 2020 -
ఉపాధ్యక్షురాలిగా అంజూ జార్జ్
గురుగ్రామ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)లో ఆదిల్ సుమరివాలా తన పట్టు నిలుపుకున్నారు. మళ్లీ తనే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీజార్జ్ సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఏఎఫ్ఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గత కార్యవర్గంలో ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది. రెండు రోజుల పాటు జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమరివాలా వరుసగా మూడో సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2012, 2016లలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇద్దరు... కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ సంఘంనుంచి ఇద్దరికి చోటు దక్కింది. సంయుక్త కార్యదర్శిగా ఏవీ రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎ.హైమ ఎంపికయ్యారు. -
టీఆర్ఎస్కు ఝలక్!
సాక్షి, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించగా, ఆయన ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనంటూ స్పష్టం చేశారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యులంతా తమ పార్టీలోనే ఉన్నారంటూ చెప్పుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ పెద్దలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు రామకృష్ణ బోర్డు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పత్రికా ముఖంగా వెల్లడించారు. అయినప్పటికీ సదరు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి బదులుగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి తోడు సోమ వారం బోర్డు కార్యాలయంలో తన అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. తోటి సభ్యులతో పొసగకనే..: రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన తనను టీఆర్ఎస్ పెద్దలు ఆదరించి, ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారని రామకృష్ణ అన్నారు. అయితే తోటి బోర్డు సభ్యుల్లో కొందరితో పొసగని కారణంగానే తాను టీఆర్ఎస్కు దూరం కావాల్సి వస్తోందని రాజీనామా ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే సాయన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఒకవేళ అధిష్టానం నుంచి బుజ్జగింపులు వచ్చినా తన నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నారు. వార్డు పరిధిలోని కార్యకర్తలు, తన అభిమానులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అవిశ్వాసం తప్పకపోవచ్చు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, మిగిలిన ఏడుగురు టీఆర్ఎస్ బోర్డు సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యాక, నేరుగా బోర్డు అధ్యక్షుడు అభిజిత్ చంద్రను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని ఇంతకాలం రామకృష్ణకు మద్దతుదారులుగా నిలిచిన బోర్డు సభ్యులు సైతం పేర్కొంటూ ఉండటం గమనార్హం. -
దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది
సాక్షి, న్యూఢిల్లీ : ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివద్ధికి పునాది పడుతుందని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో..‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆన్లైన్ వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21 శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు) -
చిన్నారుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివృద్ధికి పునాది పండుతుందన్న ఆయన, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉప రాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో.. ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పౌష్టికాహార లోపం ఓ సవాల్‌గా మారిందని, దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు. సరైన పోషకాహారం అందకపోవడం ద్వారా చిన్నారుల శారీరక, మేధో వికాసానికి ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో పౌష్టికాహార సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయన్న ఉప రాష్ట్రపతి.. ఈ మహత్కార్యంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సహా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.భారతదేశ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే దేశ భవిష్యత్ అయిన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఇందుకోసం వ్యూహాత్మక, సమష్టి కార్యాచరణ అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నారులకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టడమే గాక, ఆనందంగా, ఉల్లాసంగా ఉండేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం కూడా వారి సర్వతోముఖాభివృద్ధికి కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇందుకోసం చిన్నారులకు మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమైన, విలువైన సమయమన్న ఉప రాష్ట్రపతి.. ఈ సమయంలో వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ సామాజిక, విద్యావిషయక అవసరాలను తీర్చాల్సిన అవసరాన్ని విస్మరించరాదన్నారు. బాల్యంలోనే ఆరోగ్యకరమైన జీవితాన్ని, నాణ్యమైన విద్యను అందుకున్న చిన్నారులు బలమైన పునాదిని వేసుకుని.. భవిష్యత్తులో సమాజాభివృద్ధిలో తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఆయన పేర్కొన్నారు.పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌష్టికాహార సమస్య నిర్మూలనకు జరుగుతున్న సమగ్ర శిశు సంరక్షణ పథకం (ఐసీడీఎస్) ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు సూచించిన లక్ష్యాల దిశగా భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని మహాత్మాగాంధీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కలలుగన్న అంత్యోదయ నినాదాన్ని సాకారం చేయడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. విస్తృత అధ్యయనంతో ఈ పుస్తకాన్ని రూపొందించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ క్రచెస్ సంస్థ చైర్పర్సన్ అమృతాజైన్, సహ వ్యవస్థాపకురాలు దేవికా సింగ్, కార్యనిర్వాహక నిర్దేశకురాలు సుమిత్ర మిశ్రా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సంజయ్ కౌల్, డాక్టర్ అనురాధా రాజీవన్.. టేలర్ అండ్ ఫ్రాన్సిస్ గ్రూప్ (ప్రచురణ సంస్థ) డైరెక్టర్ డాక్టర్ శశాంక్ సిన్హా, ద హిందూ పత్రిక మాజీ ప్రధాన సంపాదకుడు రామ్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
‘ఆంధ్రకేసరి’ నైతిక నిష్ట చిరస్మరణీయం..
సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. న్యాయకోవిదుడిగా, పత్రికా సంపాదకుడిగా ప్రకాశం పంతులు స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపిన తీరు, ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలే గాక ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన నైతిక నిష్ట చిరస్మరణీయం అని ఆయన ట్విటర్లో ప్రస్తుతించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తుపాకీ గొట్టానికి గుండెను అడ్డుపెట్టి ప్రజలందరి హృదయాల్లో ‘ఆంధ్రకేసరి’గా నిలిచిపోయిన ఆయన జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. -
ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ నామినేట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పార్టీ నామినేట్ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సులో బుధవారం ఆమె అ«భ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ వైఫల్యాల కారణంగా అమెరికా ప్రజలు తమ జీవితాల్నే పణంగా పెట్టారన్నారు. తాను భారత్, జమైకా వలసదారుల బిడ్డగా చెప్పుకున్నారు. అమ్మ పై నుంచి చూస్తూ ఉంటుంది తల్లి శ్యామలా గోపాలన్ చెప్పిన మాటల్నే ఆమె మళ్లీ తలచుకున్నారు. ‘‘ఇతరులకు సేవ చేస్తే మన జీవితానికి పరమార్థం వచ్చినట్టవుతుంది. ఇప్పుడు నాకు ఆ సేవ చేసే అవకాశం దక్కబోతోంది. ఇలాంటి సమయంలో అమ్మ నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. కానీ పై నుంచి అమ్మ అంతా చూస్తూ ఉంటుందని నాకు తెలుసు’’అని అన్నారు. ‘‘అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా మీరు చేసిన నామినేషన్‌ను నేను ఆమోదిస్తున్నాను. బహుశా నేను ఈ స్థాయికి ఎదుగుతానని మా అమ్మ ఊహించి ఉండదు’’అని చెప్పారు. ‘‘నల్లజాతి మూలాలు, భారతీయ వారసత్వం కలిగినందుకు గర్వపడేలా అమ్మ పెంచారు ’’అని కమల చెప్పారు. -
ఏర్పాట్లు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కావలసిన ఏర్పాట్లను మాత్రం లోక్‌సభ స్పీకర్, నేను పర్యవేక్షిస్తున్నాం’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సమావేశాల నాటికి పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మహమ్మారి సమయంలో కూడా పార్లమెంటు సమావేశాలను విధిగా నిర్వహించాల్సిందే. ఏవైనా మార్పులు తేవాలనుకున్నా.. ఒకసారి సమావేశమై మార్పులు తేవొచ్చు. సమావేశాలు నిర్వహిస్తే కనీసం 3 వేల మంది సిబ్బంది పార్లమెంటు ప్రాంగణంలో ఉంటారు. అందువల్ల భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఆంక్షలు అమలుచేయాల్సి వస్తుంది. వర్చువల్ సమావేశాలు నిర్వహించాలంటూ సలహాలు వస్తున్నాయి. వర్చువల్‌కి, నేరుగా మాట్లాడడానికి చాలా తేడా ఉంది..’అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని తెలుగు పాత్రికేయులతో ఆయన ఆన్లైన్లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. కరోనా విషయంలో మీడియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని, వార్తల్లో అతిశయోక్తులు వద్దని సూచించారు. -
కమలా హ్యారిస్‌పై నోరు పారేసుకున్న ట్రంప్
వాషింగ్టన్: నోటి దురుసుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అర్హతను ప్రశ్నించడమే కాక.. జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఆమె ఒక నల్లజాతి మహిళ. తల్లిదండ్రలు ఇక్కడకు వలస వచ్చారు. నేను విన్నది ఏంటంటే ఆమె ఇక్కడ జన్మించలేదు. అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికిరాదు. వైట్‌హౌస్ అవసరాలను తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు’ అంటూ జాత్యంకార వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అర్హత లేదన్నారు. ట్రంప్ తన వ్యాఖ్యలతో ఆన్లైన్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్‌కు ఆజ్యం పోసినట్లయ్యింది అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతోనే ట్రంప్ రాజకీయాల్లో ఎదిగారని విమర్శిస్తున్నారు. (బైడెన్ తెలివైన నిర్ణయం) అయితే ట్రంప్ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి కమలా హ్యారిస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు నెటిజనులు. ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారని.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. ఆమె వివరాలను పరిశీలించిన న్యాయవాదులు కూడా దీని గురించి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. ఈ క్రమంలో లయోలా లా స్కూల్ ప్రొఫెసర్ జెస్సికా లెవిన్సన్ ‘చాలు ఆపండి, ముగించండి. అది ఏదైనా సరే.. నిజాయతీగా ఉండండి. ఇక్కడ రంగు, తల్లిదండ్రులు గురించిన వ్యాఖ్యలు అనవసరం. పైగా ఇవి పూర్తిగా జాత్యంహకార వ్యాఖ్యలు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జో బిడెన్ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ తన అక్కసును వెల్లగక్కడం గమనార్హం. (ట్రంప్ అధ్యక్ష పదవికి తగడు) గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి కూడా ట్రంప్ ఇలానే ప్రచారం చేశారు. ఆయన కెన్యాలో జన్మించారని.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి అర్హత లేదని ట్రంప్ ఆరోపించారు. దాంతో ఒబామా తాను హవాయిలో జన్మించినట్లు చూపిస్తూ తన జనన ధృవీకరణ పత్రాన్ని విడుదల చేశారు. అయినా కూడా ట్రంప్ అది ఫేక్ సర్టిఫికెట్ అంటూ రాద్దాంతం చేశారు. ఆ తర్వాత 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దీని గురించి ట్రంప్‌ను ప్రశ్నిస్తే.. అది ఎప్పుడో అయిపోయిందని.. ఒబామా ఇక్కడే జన్మించాడని వ్యాఖ్యనించడం విశేషం. తాజాగా కమలా హ్యారిస్ విషయంలో కూడా ట్రంప్ తప్పుడు ప్రచారానికి ప్రయత్నిస్తున్నారు. -
అమెరికాలో ‘కమల’ వికాసం
జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, వాదనా పటిమతో ప్రత్యర్థుల్ని తికమకపెట్టే సామర్థ్యం, అద్భుతమైన నాయకత్వ లక్షణం.. ఇవే కమలా హ్యారిస్ రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల తీరకపోయినా, ఎప్పటికైనా అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో నిండిపోయింది. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర తిరగరాయడానికి బాటలు కూడా వేస్తోంది. భారత సంతతి మహిళకు గొప్ప గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం తలుపు తట్టింది. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్‌ను తన లెఫ్ట్‌నెంట్‌గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని, పాలనా తీరును, వలస విధానాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక వ్యూహాత్మకంగా మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయంతో బైడెన్ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక అత్యుత్తమం అని మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా.. మేమిద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నాం అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు, నల్లజాతీయులు, ప్రవాస భారతీయుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగంగానే కమలా హ్యారిస్ ఎంపిక జరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మంగళవారం నాడు కమలా హ్యారిస్‌ను ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తూ డెమొక్రాట్ సహచరులందరికీ మెసేజ్‌లు పంపించారు. ఒక నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేసి బైడెన్ చరిత్ర సృషించారు. 55 ఏళ్ల కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాధ్యక్ష పదవికి మొట్టమొదటి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా. మొదటి ఆసియా అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. భారతీయ– జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం బైడెన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. భయం లేని పోరాటయోధురాలు: బైడెన్ కమలా హ్యారిస్‌ను భయం బెరుకు లేని పోరాటయోధురాలిగా, దేశంలో అత్యద్భుతమైన ప్రజాసేవకురాలిగా బైడెన్ అభివర్ణించారు. ‘‘కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశాను. ఎన్నికల ప్రక్రియలో ఆమె నాకు అత్యుత్తమ భాగస్వామి. మేమిద్దరం కలిసి ట్రంప్‌ని ఓడించబోతున్నాం. హ్యారిస్‌కు పార్టీ సహచరు లందరూ ఘనంగా స్వాగతం పలకండి’’అని తన సందేశంలో బైడెన్∙పేర్కొన్నారు. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు దక్కిన అత్యంత గౌరవం అని కమలా హ్యారిస్ అన్నారు. ఒబామా సలహా మేరకే ! కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడానికి జో బైడెన్ పార్టీలో అందరితోనూ విస్తృతంగా సంప్రదించారు. ఉపాధ్యక్ష పదవికి మహిళనే ఎంపిక చేస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరికొందరు పార్టీ ప్రతినిధులతో కూడిన బోర్డు కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయాలని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమల అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేశానికి ఇవాళ ఎంతో శుభ దినం. ఒక సెనేటర్‌గా కమలా హ్యారిస్ నాకు చాలా కాలంగా తెలుసు. మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆమె జీవితాన్నే ధారపోస్తున్నారు. కమలా హ్యారిస్‌ను గెలిపించుకుందాం‘‘అని ట్వీట్ చేశారు. కాగా, కమలా హ్యారిస్ ఎంపికపై అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక సెనేటర్‌గా హ్యారిస్ అత్యంత భయంకరమైన వ్యక్తి అని తీవ్రంగా విమర్శించారు. కమలా ఎంపికకి కారణాలివే ! అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను అందులోనూ నల్లజాతీయురాలిని, ప్రవాస భారతీయురాలిని ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఆఫ్రికన్ అమెరికన్లు, ఎన్నారైలు, ఏ పార్టీకి చెందని తటస్థుల ఓట్లు కొల్లగొట్టాలంటే హ్యారిసే సరైన ఎంపికన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కమలా దేవి హ్యారిస్ మాటలు తూటాల్లా పేలతాయి. ఒక అటార్నీ జనరల్‌గా, ప్రజాప్రతినిధిగా ఆమె వాదనా పటిమకి ప్రత్యర్థి ఎంతటివాడైనా చిత్తయిపోవాల్సిందే. జాతి వివక్ష పోరాటాల్లో, వలసదారులకి అండగా నిలవడంలో కమలా హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. అన్నింటికి మించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సమర్థంగా ఢీ కొనే సత్తా కలిగిన నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ వైఫల్యాలను, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా లైంగిక వివాదాల్లో చిక్కుకున్న బ్రెట్ని నియమించిన సమయంలోనూ కమలా హ్యారిస్ కాంగ్రెస్ సమావేశాల్లో తన వాక్పటిమతో అందరినీ ఆకర్షించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రిలిమినరీ స్థాయి ఎన్నికల్లో కమలా పోటీ పడినప్పుడు ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయి. బైడెన్ వయసు 77 ఏళ్లు కావడంతో చురుగ్గా ఉంటూ, ప్రగతిశీల భావాలు కలిగిన వారినే ఎంపిక చేయాలని ఆయన భావించారు. ఇవన్నీ కమలకి కలిసొచ్చాయి. వారి ఓట్లే కీలకం అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లు 13శాతం ఉన్నాయి. ఒకే పార్టీకి మద్దతుగా నిలవని రాష్ట్రాల్లో వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అధ్యక్ష ప్రిలిమినరీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు జో బైడెన్‌కే మద్దతు పలికారు. అప్పట్నుంచి నల్లజాతికి చెందిన వారినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా పోలీసు అధికారి దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల్లో హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. ఇక కమలా దేవికున్న భారతీయ మూలాలు కూడా ఆమెను ఎంపిక చేయడానికి కారణమే. ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఒక అంచనా. పెన్సిల్వేనియాలో 2 లక్షలు, మిషిగావ్లో లక్షా 25 వేల ఎన్నారై ఓట్లు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకం. 2016లో 77% మంది ఇండియన్ అమెరికన్లు డెమోక్రట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి ఓటు వేశారని అంచనాలున్నాయి. ఇవన్నీ కమలా రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పాయి. అమ్మ చెప్పిన మాట ‘ఊరకే కూర్చొని ఫిర్యాదులు చేయడం మానెయ్. ఏదో ఒకటి చేయడం ప్రారంభించు’’. తల్లి శ్యామల గోపాలన్ ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఇప్పటికీ తు.చ. తప్పకుండా పాటిస్తోంది డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్. అవే ఆమెను ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి. ప్రతీ రోజూ ఆ మాటలే గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉంటానని కమల గర్వంగా చెప్పుకుంటారు. ఆమె తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. ఆరు దశాబ్దాల క్రితమే శ్యామల అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే డేవిడ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కమల, మాయ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. దీంతో ఆమె బాల్యమంతా హిందూ తల్లి సంరక్షణలోనే గడిచింది. అందుకే భారతీయ తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు. నల్లజాతీయుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని బ్లాక్ గర్ల్స్‌గానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్మవిశ్వాసంతో పెంచింది. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ వీరితోనే ఉంటారు. ఎలా, కోల్ అనే ఆ ఇద్దరు పిల్లల ప్రేమ తనకెంతో శక్తినిస్తుందని కమల చెప్తారు. నేను అమెరికన్నే కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్లో జన్మించారు. బెర్కెలేలో పెరిగారు. కెనడాలో పాఠశాల విద్యనభ్యసించారు. వాషింగ్టన్ హోవార్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, కాలిఫోర్నియా వర్సిటీలో లా చదివారు. శానిఫ్రాన్సిస్కోలో పెద్ద ప్రాసిక్యూటర్‌గా ఎదిగారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్‌గా ఆమె ప్రదర్శించిన వాక్పటిమ రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సెనేట్‌లో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళ ఆమె. ఇద్దరు వలసదారులకు పుట్టినప్పటికీ తనని తాను అమెరికన్గానే హ్యారిస్ చెప్పుకుంటారు. అధ్యక్షురాలు కావాలని కలలు సెనేటర్‌గా పేరు తెచ్చుకున్న కమలా అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తోనే పోటీపడ్డారు. తనవాదనా పటిమతో బైడెన్‌ను ఇరుకున పెట్టారు. ఆయన్ను జాతి విద్వేషిఅంటూ తిట్టిపోశారు. కానీ బైడెన్ ధాటికి నిలబడలేక రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడె గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈసారి ఉపాధ్యక్షురాలిగా కమలా నెగ్గితే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మూడో మహిళ కమల. ఇడ్లీ సాంబార్ అంటే ప్రాణం కమలాకు భారతీయ రుచులు అంటే అమితమైన ఇష్టం. ఇడ్లీ సాంబారు ఇష్టంగా లాగించేస్తారు. చిన్నతనంలో పప్పు, బంగాళదుంపల వేపుడు, పెరుగన్నం తింటూనే ఆమె పెరిగారు. తల్లితో కలిసి తరచూ చెన్నైకి వస్తూ ఉండేవారు. తాత పీవీ గోపాలన్ ప్రభావం తనపై ఉందని బయోగ్రఫీలో హ్యారిస్ రాసుకున్నారు. తల్లి శ్యామలతో కమల (ఫైల్) -
‘న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 3 కోట్లకు పైగానే’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు పెరిగిపోతున్న అపరిష్కృత (పెండింగ్) కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, కోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండటం విచారకరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల (ఆంధ్రయూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లో తీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. తద్వారా సామాన్యులకు న్యాయప్రక్రియ చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందని చెప్పారు. ఈ విషయంపై న్యాయవాదులతోపాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. (ఆ రెండు యాప్‌లు ప్లే స్టోర్ నుంచి మాయం! ) దీంతోపాటు క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని గుర్తుచేశారు. చట్టాల రూపకల్పన కూడా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, స్పష్టంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల ప్రయివేటు (వ్యక్తిగత) ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. దీని వల్ల న్యాయస్థానాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుందన్నారు. సమాజంలోని పేద, అణగారినవర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ టి.రజని, జస్టిస్ బట్టు దేవానంద్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి సహా పలువురు న్యాయకోవిదులు, న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు పాల్గొన్నారు. (‘ముంబై మానవత్వం కోల్పోయింది’) -
రక్షాబంధన్ ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే...
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధాన్ ప్రాముఖ్యతను, ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలను ఆయన వివరించారు. దీంతో పాటు భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో రక్షాంబంధన్‌కు సంబంధించి ఒక పోస్ట్‌ను పెట్టారు. ‘అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకైన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ రోజు నేడు. తోబుట్టువులు ఏడాదంతా ఎదురుచూసే ఈ రోజు.. వారిమధ్య బంధాన్ని మరింత పరిపుష్టం చేసే ప్రత్యేకమైన పండుగ రోజు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబవిలువలను ప్రతిబింబించే పండుగ రాఖీపౌర్ణమి. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు, ప్రాచీన జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించటంతోపాటు, కుటుంబసభ్యులకు ఒక సామాజిక భద్రతను కలిగించే గొప్ప ఉత్సవం. ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం, బాధ్యతలను కలగలుపుకుని జరుపుకునే పండుగ ఇది. తరతరాలుగా ఈ కుటుంబ విలువలను కాపాడుకుంటూ, సామాజిక ఆచారాలు, పండుగలు, జానపద కళలు, పురాణేతి హాసాలు, పవిత్ర మత గ్రంథాల ద్వారా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు కొత్త తరానికి వీటిని అందిచడం జరుగుతోంది. అమరకావ్యమైన రామాయణంలో తన తండ్రిమాటను గౌరవిస్తూ రాజ్యాధికారాన్ని భరతుడికి అప్పగించి అరణ్యవాసానికి బయలుదేరడం, అటు భరతుడు కూడా అన్నపై ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవంతో ఆయన పాదుకాలతో రాజ్యాన్ని నడిపించడం వంటివి భారతదేశంలోని కుటుంబవిలువలకు ఓ ఉదాహరణ మాత్రమే. సతీ అనసూయ, సీతాదేవికి కుటుంబసభ్యులు, పెద్దలతో బాధ్యతగా మసలుకోవలసిన ప్రాముఖ్యతను వివరించడం రామాయణ మహాకావ్యంలోని మరో ముఖ్యమైన ఘట్టం. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి తమ ప్రేమానురాగాలను, బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉత్సాహవంతంగా జరుపుకోవడమే మన పండుగల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. తన వారితో తన ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవడం కన్నా మరింత గొప్పది ఏముంటుంది? భారతదేశంలో మానవ సంబంధాలకు, కుటుంబ విలువలకు గౌరవమిస్తూ జరుపుకునే పండగలు కోకొల్లలు. భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే వటసావిత్రీ పౌర్ణమి, కర్వాచౌత్ (ఉత్తరభారతంలో), తమ సంతానం శ్రేయస్సుకోసం తల్లులు పూజలు చేసే అహోయ్ అష్టమి, మన అజ్ఞాన తిమిరాలను తొలగించే గురువులను గౌరవించుకునే గురుపౌర్ణమి ఇలా ఎన్నో పండుగలు బంధాలను మరింత పరిపుష్టం చేసేవే. రక్షాబంధన్ కూడా అలాంటిదే. ‘రక్ష’ అంటే సోదరులు, సోదరీమణుల బంధాన్ని పరిరక్షించేదని అర్థం. సోదరులపై చెడు ప్రభావం పడకుండా రక్షను (రాఖీ) సోదరీమణులు సోదరుల చేతికి కడతారు. దీనికి ప్రతిగా, సోదరికి ఎలాంటి ఆపద వచ్చినా కాపాడతానని సోదరుడు ప్రమాణం చేస్తాడు. అందుకే మన దగ్గర రాఖీ కడుతున్నప్పుడు ‘నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరమూ కలిసి మన దేశానికి రక్ష’ అని పరస్పరం చెప్పుకుంటారు. అదీ రక్షా బంధనంలో ఉన్న గొప్పదనం. అందుకే ఈ పండుగంటే అందరికీ చాలా ఇష్టం. ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై భిన్న సందర్భాలను పెద్దలు మనకు చెబుతారు. అందులో ఒకటి, పాండవుల ధర్మపత్ని అయిన ద్రౌపది ఒకసారి తన సోదరుడైన శ్రీ కృష్ణుడికి గాయమైనప్పుడు. తన చీర కొంగును చించి కృష్ణుడికి రక్తస్రావం కాకుండా కడుతుంది. దీంతో ఎప్పుడూ సోదరిని, ఈ బంధాన్ని కాపాడుకుకంటానని శ్రీ కృష్ణుడు ప్రమాణం చేస్తాడు. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలోపేతమైందని, అప్పటినుంచి రక్షాబంధనం మన సంప్రదాయంలో భాగమైందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ పండగను, ఈ ఏడాది ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవితాల్లో పెనుమార్పులు వచ్చిన ఈ సందర్భంలో.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలను జరుపుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. నిస్సందేహంగా ఇది చాలా క్లిష్టమైన సమయం. కానీ మన వారిని కాపాడుకుంటూ.. వైరస్ తరిమికొట్టేందుకు మనం కుటుంబాలు, బంధువులతో కలిసి ఒకచోట చేరి పండగలు జరుపుకోవడాన్ని నివారించాలి. ఇలా చేయడం వల్ల మనవారిని బాధపెట్టినవారమవుతాం. కానీ, కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో ఇంతకుమించిన ప్రత్యామ్నాయమేదీ లేదు. భారతీయ సంప్రదాయాల ప్రకారం ఏడాది పొడగునా చాలా పండగలు జరుపుకుంటాం. కానీ ప్రతీ పండుగ వెనకున్న చారిత్రక నేపథ్యం, పురాణాల్లోని సందర్భం, పండుగ ప్రాశస్త్యం మొదలైన వాటిని యువతరానికి నేర్పించాలి. అప్పుడే వారికి ఈ పండుగల వెనుక ఉన్న నైతిక విలువలు, సమాజంలో వ్యవహరించాల్సిన తీరు మొదలైన అంశాలపై స్పష్టత వస్తుంది. మన పండుగలు మన ఘనమైన వారసత్వానికి ప్రతీకలు. భిన్న సంస్కృతులు భిన్న సామాజిక పరిస్థితులను కలుపుతూ, అందరినీ ఐకమత్యంగా ఉంచే సాధనాలు. కరోనా మహమ్మారి కారణంగా మన పండగలను మునుపటిలా ఘనంగా జరుపుకోలేకపోయినా మనలో ఉత్సాహం, పట్టుదల ఏమాత్రం సడలకుండా ఐకమత్యంతో వైరస్‌ను ఓడిద్దాం. అప్పటి వరకు మనమంతా ప్రభుత్వం సూచించినట్లుగా కరోనాను కట్టడి చేసే నిబంధనలన పాటిద్దాం. ముక్కు, నోటికి మాస్క్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటిద్దాం’ అని వెంకయ్య పేర్కొన్నారు. చదవండి: నేనైతే గిఫ్ట్ కోసం కట్టను.. -
వైస్ ప్రెసిండెంట్ అభ్యర్ధిగా కమలా హారిస్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో తలపడనున్న డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్‌ను బరిలో దింపుతారని, ఆమె అభ్యర్థిత్వం ఖారారైందని ఊహాగానాలు వెలువడ్డాయి. బిడెన్ చేతిలో ఉన్న నోట్‌పై కమలా హారిస్ అని రాసిఉండటంతో వైస్ ప్రెసిడెంట్‌గా ఆమె వైపు బిడెన్ మొగ్గుచూపారని భావిస్తున్నారు. బిడెన్ అధ్యక్ష పదవికి ఎంపికైతే అప్పటికి ఆయన 78వ ఏట అడుగుపెట్టనుండటంతో రెండోసారి ఆ పదవికి పోటీపడబోనని వైస్ ప్రెసిడెంట్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉంటారని బిడెన్ సంకేతాలు పంపారు. రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి తలపడుతున్న బిడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా మహిళను ఎంచుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. సెనేట్‌లో కమలా హారిస్ కనబరిచిన సామర్థ్యంతో పాటు ప్రస్తుతం అమెరికాను ఊపేస్తున్న బ్లాక్ లైవ్స్ అంశం కూడా భారత్, జమైకా మూలాలు కలిగిఉండటం కూడా హారిస్‌కు కలిసివచ్చింది. ఎలిజబెత్ వారెన్, సుసాన్ రైస్ వంటి నేతలు పోటీపడుతున్న ఈ పదవికి హారిస్ ఎంపిక పూర్తయిందని బిడెన్ నోట్ ద్వారా వెల్లడైంది. కాగా వైస్ ప్రెసిడెంట్ ఎంపికపై ఆగస్ట్ మొదటి వారంలో తన నిర్ణయం వెల్లడిస్తానని బిడెన్ ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన చేతిలో ఉన్న నోట్‌పై కమలా హారిస్ పేరు రాసిఉండటంతో ఆ సస్సెన్స్‌కు తెరపడింది. ఆమె పేరు కింద హారిస్కున్న అనుకూలతలనూ నోట్లో రాసుకున్నారు. చదవండి : విచారణ కమిటీ ముందుకు టెక్ దిగ్గజాలు ‘ఆమె కల్మషం లేని నేత..ప్రచారంలో ఆసరాగా నిలుస్తారు..ఆమెపై అమెరికన్లలో అపార గౌరవం ఉంది’ అంటూ ఆ నోట్లో రాసి ఉండటం గమనార్హం. అయితే ఆ నోట్లో ఇతర వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధుల గురించి కూడా ఆయన రాసుకున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు కమలా హారిస్ ఎంపిక మంచి నిర్ణయమని ఏకంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్‌గా జో బిడెన్ ఎంపిక చేసుకున్నారనే కథనం వెల్లడించిన పొలిటికో వెబ్సైట్ ఇది పొరుపాటున సైట్లో ప్రచురితమైందని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన టెక్స్ట్‌ను సదరు వెబ్సైట్ వెనువెంటనే తొలగించింది.కాగా, ఈ ఏడాడి నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
అప్పుడే తల్లి భాషను రక్షించుకోగలం : ఉపరాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్ : విద్యారంగంతోపాటు పరిపాలన, న్యాయ, పరిశోధన తదితర రంగాల్లో మాతృభాష వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం, కొత్త పదాల సృష్టి జరిగినపుడే తల్లిభాషను పరిరక్షించుకోగలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ఇతివృత్తంతో జరిగిన వెబినార్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన సంస్కృతి-సంప్రదాయాలకు మన అస్తిత్వానికి మాతృభాషే పట్టుకొమ్మ. మాతృభాషతోపాటు ఇతర భాషలు ఎన్నయినా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి కూడా. ఎన్ని భాషలు ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ మంచిది. అందులో తప్పేమీ లేదు. కానీ.. ఆంగ్లభాషలో విద్యాభ్యాసం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం సరికాదు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వేల ఫలితాలను గమనిస్తే ఈ విషయం మనకు బాగా అవగతమవుతుంది’అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.‘అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’అన్న కాళోజీ నారాయణరావుగారి మాటను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. 2017 వరకు నోబెల్ బహుమతి (శాంతి బహుమతి మినహా) పొందినవారిలో 90 శాతానికి పైగా మాతృభాషలో విద్యనభ్యసించే దేశాల వారేనని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వివిధ దేశాల ఆవిష్కరణల సామర్థ్యాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించి ఏటా నివేదిక ఇచ్చే ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్’, ‘బ్లూమ్‌బర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్’ జాబితాల్లోనూ ఉన్నతస్థానాల్లో ఉన్న దేశాల్లో 90 శాతానికి పైగా మాతృభాష మాధ్యమం ద్వారానే చదువుకుంటాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా మాతృభాషకు వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. పాత పదాలను పునర్వినియోగంలోకి తీసుకురావడంతోపాటు కొత్త పదాలను సృష్టించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇందుకోసం కాశీనాథుని నాగేశ్వరరావు.. నైట్రోజన్‌ను నత్రజని అని, ఆక్సీజన్‌ను ప్రాణవాయువని, ఫొటో సింథసిస్‌ను కిరణజన్య సంయోగక్రియ అనే అద్భుతమైన పదాలను సృష్టించి తెలుగు ప్రజలకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగాల ద్వారానే భాషతోపాటు పత్రికల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం కచ్చితంగా మాతృభాషలోనే జరగడం, ఉన్నత విద్యలో తెలుగు తప్పనిసరిగా ఒక విషయంగా ఉండటం వల్ల విద్యార్థుల్లో మాతృభాషపై ఆసక్తిని, వివిధ విషయాల గ్రహణశక్తిని పెంపొందింపజేయవచ్చన్నారు. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విజ్ఞానశాస్త్రాన్ని (సైన్స్) మాతృభాషలో బోధించడం వల్ల చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుందని చెప్పిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న మేల్‌స్వామి అన్నాదురై కూడా.. తన మాతృభాష తమిళంలో ఇంటర్మీడియట్ వరకు చదివినందునే.. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అంశాలపైన లోతైన అవగాహన పెంచుకోవడం సాధ్యమైందన్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు.. ‘జ్ఞాన సముపార్జనకు మాతృభాష ఎంతటి గొప్ప మాధ్యమమో’వివరిస్తాయన్నారు. భావాన్ని వ్యక్తపరిచేందుకు భాష అవసరమని.. అందులోనూ మాతృభాషలోనైతే భావాన్ని మరింత స్పష్టంగా వ్యక్తపరచగలమన్నారు. వివిధ దేశాధినేతలు మన దేశానికి వచ్చినపుడు.. ఆంగ్ల భాషలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ వారి మాతృభాషలోనే సంభాషిస్తారని.. పక్కనున్న అనువాదకులు దీన్ని అనువాదం చేస్తారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా విదేశాల్లోనూ హిందీలోనే సంభాషిస్తారని.. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన నేతల్లో ఒకరిగా నిలిచారని ప్రస్తావించారు. మాతృభాషకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవానికి ఇది నిదర్శనమన్నారు. ‘జ్ఞానసముపార్జన మాధ్యమం: మాతృభాష’ఇతివృత్తంతో అంతర్జాతీయ అంతర్జాల వెబినార్ నిర్వహించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ, తెలుగు అకాడమీలను ఉపరాష్ట్రపతి అభినందించారు. భాషాభివృద్ధికి, కొత్త పదాల సృష్టికి వర్సిటీలు వేదికగా నిలిచి మిగిలిన వారిని ప్రోత్సహించాలని సూచించారు. ‘మాతృభాషకు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును సమన్వయం చేస్తూ.. మనల్ని విశ్వవ్యాప్తంగా నడిపించిన, నడిపిస్తున్న మాతృభాష తీరుతెన్నులను క్రోడీకరిస్తూ ప్రపంచప్రఖ్యాతి వహించగలిగిన పదసంపద, వ్యాకరణాంశాలు, వాక్యవిన్యాసం, ప్రత్యేక పదజాలం పుష్కలంగా సమృద్ధిగా ఉన్న రోజున మాతృభాషలు సాంకేతికతకు, విజ్ఞానానికి మరింత దగ్గరవుతాయి. రోజురోజుకు అంతరిస్తున్న పదాలను వెతికి పట్టుకుని సంభాషణల్లో, వ్యాసంగంలో, పాఠ్య గ్రంథాల్లలో వాటిని చేర్చి భాషను జాగృతపరచండి. ప్రతి పదం వెనుక మన సంస్కృతి ఉంటుంది. దాన్ని గుర్తించేలా విద్యార్థుల్ని తయారుచేయండి’అని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పొదిలి అప్పారావు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, విశ్వవిద్యాలయ తెలుగు విభాగం అధిపతి ఆచార్య అరుణ కుమారి, శాంతా బయోటెక్ ఫార్మా కంపెనీ చైర్మన్, తెలుగు భాషాభిమాని కేఎల్ వరప్రసాద్ రెడ్డి, తెలుగు అకాడమీ డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, ఈ సదస్సు నిర్వాహకురాలు ఆచార్య డి.విజయలక్ష్మితోపాటు విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆచార్యులు, విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న భాషాకోవిదులు, విషయ నిపుణులు, భాషాభిమానులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణలను ప్రోత్సహిద్దాం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ యువతలో, ఐటీ నిపుణుల్లో నిబిడీ కృతమై ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించేం దుకు అవసరమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలని, తద్వారా ‘ఆత్మనిర్భర భారత్’లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎలిమెంట్స్’యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. -
అమెరికా అధ్యక్షుడి రేసులో జో బిడెన్
వాషింగ్టన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్(77) నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ తరపున అభ్యర్థి ఎంపిక కోసం శుక్రవారం రాత్రి డెమొక్రటిక్ డెలిగేట్లు సమావేశమయ్యారు. మొత్తం 3,979 మంది ప్రతినిధులకుగాను 1,991 మంది జో బిడెన్ అభ్యర్థిత్వానికే మద్దతు పలికారు. సగం కంటే ఎక్కువ మంది బిడెన్ వైపు మొగ్గు చూపడంతో అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడం ఇక లాంఛనమే. జో బిడెన్ 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా హయాంలో అమెరికా 47వ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. అమెరికా–భారత్ మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి ఒకరకంగా బిడెన్ మంత్రాంగమే కారణమని పరిశీలకులు చెబుతుంటారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనడం దాదాపు ఖాయమైనట్లే. ఈ సందర్భంగా జో బిడెన్ మాట్లాడుతూ... అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం సంక్లిష్టమైన పరిస్థితి నెలకొందని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమర్థవంతమైన, ప్రజలను ఐక్యంగా ఉంచే నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందని వ్యాఖ్యానించారు. ‘ప్రజలందరికీ మేలు చేసే ఆర్థిక వ్యవస్థ కావాలి. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సమాన న్యాయం కావాలి. మన బాధలు తీర్చే అధ్యక్షుడు కావాలి’ అని బిడెన్ పేర్కొన్నారు. -
నీటి కొరతపై అధ్యయనం చేయండి: ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సోమవారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కార్యదర్శి శ్రీ యూపీ సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తో ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన సమావేశంలో ఉదయగిరి ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కరువుపీడిత ప్రాంతమైన ఉదయగిరికి తాగు, సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. లాక్ డౌన్ సమయంలో.. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా (1978లో) ఎన్నికైన ఉదయగిరి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వారు.. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితులను ఉపరాష్ట్రపతికి ఏకరువుపెట్టారు. భూగర్భ జలాలు అడుగంటడంతో చెరువులు, బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. వరుసగా ఏడో ఏడాదీ సరిగ్గా వర్షాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది నుంచైనా లేదా.. సోమశిల ప్రాజెక్టు నుంచైనా తమకు నీటిని ఇప్పించాలని వారు ఉపరాష్ట్రపతిని కోరారు. ఈ నేపథ్యంలో జరిగిన సోమవారం నాటి సమావేశంలో.. ఉదయగిరికి నీటిని అందించేందుకు సాంకేతిక సంభావ్యత (టెక్నికల్ ఫీజిబిలిటీ), సవివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంశాలపై చర్చించాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, నీతి ఆయోగ్ అధికారుల బృందం ఉదయగిరిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడితే వాస్తవ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసేందుకు వీలవుతుందన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, వీలుచూసుకుని ఉదయగిరిలో పర్యటిస్తామని, అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి.. సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. పర్యటన అనంతరం తదుపరి వివరాలతో మరోసారి కలుస్తామని ఉపరాష్ట్రపతికి విన్నవించారు. ఈ కార్యక్రమలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారావు కూడా పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయి స్థితిని బట్టి పార్లమెంట్
న్యూఢిల్లీ:తదుపరి పార్లమెంట్ సమావేశాలు ఎప్పటినుంచి నిర్వహించాలన్న దానిపై క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మిషన్ కనెక్టు’ కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పలువురు రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలతో సత్ఫలితాలు వస్తే షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను జూన్ 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు నిర్వమించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు జరగాల్సి ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23న ముగించిన సంగతి తెలిసిందే. -
ఇరాన్ ఉపాధ్యక్షురాలికి సోకిన కరోనా
కరోనా వైరస్(కోవిడ్-19) ఇరాన్‌ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు కరోనా సోకడంతో ఇరాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. రిపోర్టులు శనివారం వచ్చే అవకాశం ఉందని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. చదవండి: అన్ని వైరస్ల కన్నా ప్రాణాంతకం ఇదే.. ఎబ్తేకర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమెకు కోవిడ్-19 సోకిందనే వార్త బయటికి రావడానికి ఒకరోజు ముందు ఆమె ప్రభుత్వ కేబినెట్ మీటింగ్‌లో పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్‌లో దేశాధ్యక్షుడు హసన్ రౌహానీకి చాలా దగ్గరగా ఆమె కూర్చున్నారు. దీంతో రౌహానీ ఆరోగ్యంపై కూడా ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు ఇరాన్లో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం కరోనా సోకిన వారి సంఖ్య 245కు చేరుకుందని, వీరిలో 106 మంది ఒక్క రోజులోనే కరోనా వైరస్ బారిన పడినట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. చదవండి: ఎట్టకేలకు భారత్ చేరుకున్న జ్యోతి -
పీసీసీ ఉపాధ్యక్షుడిగా శ్రీపతి ప్రకాశం
సాక్షి, ఒంగోలు: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ )ఉపాధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది శ్రీపతి ప్రకాశంను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా పీసీసీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని శ్రీపతి ప్రకాశంకు పంపించారు. శ్రీపతి ప్రకాశం టంగుటూరు మండలం కాకుటూరువారి పాలెం ఆయన జన్మస్థలం. విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి కాలేజీ, ఒంగోలులో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఒంగోలులోని ఇందిరా ప్రయదర్శిని లా కాలేజీలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. అనంతరం న్యాయవాద వృత్తి కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోనై 1978లో యూత్ కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పారీ్టలో పలు పదవులు అలంకరించారు. స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్‌గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆలిండియా టెలియం అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా, ఆలిండియా కోర్ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా సోలార్ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా టెక్స్టైల్స్ బోర్డు మెంబర్‌గా వివిధ పదవులు అలంకరించారు. 2015లో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడిగా పదవిని చేపట్టి నేటికీ కొనసాగుతున్నారు. 2019లో కొండపి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. శ్రీపతి ప్రకాశంకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ 42ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినందుకు గుర్తుగా తనకు ఈ అవకాశాన్ని అందించారని శ్రీపతి ప్రకాశం ఉధ్ఘాటించారు. పారీ్టనే నమ్ముకుని నాలుగు దశాబ్దాలుగా సేవలు చేశానని ఆయన పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి పారీ్టకి చేసిన సేవలకు గుర్తుగా పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, తమ నేత రాహుల్ గాందీకి, పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానా«థ్‌కు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఈదా కొనసాగింపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(పీసీసీ) రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈదా సుధాకరరెడ్డిని తిరిగి రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఆవకాశం కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 2017 ఫిబ్రవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈదా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ) సాకె శైలజనాథ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. -
‘మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’
న్యూఢిల్లీ: తెలంగాణ గంగ మూసీ నదిని పరిరక్షించాలని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో భూగర్భ జాలాలు కలుషితమవుతున్నాయని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ నీటితో పండిన పంటలు తినడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. మూసీ నీరు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయని.. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఉపరాష్ట్రపతిని వెంకయ్యనాయుడిని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు జిరో ఆవర్‌లో లెవనెత్తినా కేంద్రం స్పందించలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారి చేయాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశామన్నారు. ట్రిట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, విరివిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసీని పరిరక్షించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి: ఉప రాష్ట్రపతి
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రా ల్లో క్రీడల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు. ప్రైవేటు రంగాన్ని కూడా క్రీడాభివృద్ధిలో భాగస్వాములు చేయాలని సూచించారు. మంగళవారం ఉప రాష్ట్రపతి ఆయన నివాసంలో క్రీడా మంత్రి కిరణ్ రిజిజు , ఆ శాఖ కార్యదర్శి రాధే శ్యాం జులానియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వివిధ క్రీడా ప్రాంగణాల నిర్మాణ దశల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొగళ్లపాలెంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్, విశాఖపట్టణంలోని కొమ్మడి మిని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా క్రీడాప్రాధికార కేంద్ర మైదానంలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుతోపాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో క్రీడావసతులు తదితర అంశాలపై ఉప రాష్ట్రపతి ఆరా తీశారు. గచ్చిబౌలి స్టేడియాన్ని సద్వినియోగపర్చుకోండి.. మంత్రి సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇండోర్ స్టేడియంలతో పాటు, ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామని.. అయితే నిధుల వినియోగ వివరాలు (యూసీలు) రావడం ఆలస్యం కావడంతో తదుపరి పనుల్లో జాప్యం అవుతున్నాయని వెల్లడించారు. యూసీలను తెప్పించుకుని..వీలైనంత త్వరగా మిగిలిన పనులను పూర్తి చేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం మధ్యలో ఏపీ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కూడా ఉప రాష్ట్రపతి చర్చించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక వసతులున్నాయని.. అక్కడ జాతీయస్థాయి క్రీడలు నిర్వహించి సద్వినియోగపరుచుకోవాలని ఆయన సూచించారు. కేంద్రాన్ని అభినందించిన ఉప రాష్ట్రపతి దేశంలో క్రీడా రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలను ఉప రాష్ట్రపతి అభినందించారు. మానవ వనరుల అభివృద్ధి, పెట్రోలియం సహా పలు శాఖలు.. దేశంలో క్రీడాభివృద్ధి కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు తమవంతు సహకారం అందించేలా చర్చలు జరపాలని కూడా ఆయన సూచించారు. యూనివర్సిటీలు, కాలేజీలు కూడా క్రీడలను ప్రోత్సహించాలని..ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.