వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పులో కాలేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లో నిలిచారు. ఆయన వ్యాఖ‍్యలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆదివారం అమెరికా అణుసబ్‌మెరైన్ యూఎస్ఎస్ డెలావేర్‌ను అధికారికంగా విధుల్లోకి ప్రవేశపెడుతున్న సమయంలో ఇచ్చిన స్పీచ్‌లో బైడెన్ తప్పుగా వ్యాఖ్యానించారు.
బైడెన్ ప్రసంగిస్తూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా గురించి ప్రస్తావించిన ఆయన.. మిషెల్‌ను మాజీ ఉపాధ్యక్షురాలు అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా మిషెల్ ఒబామా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైన పలు కార్యక్రమాలను ప్రస్తుతం ఉన్న ప్రథమ మహిళ ముందుగా తీసుకెళుతున్నారని ప్రశంసించారు.
అయితే, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాను ప్రథమ మహిళ అని పిలవాల్సి ఉండగా.. బైడెన్ తప్పుగా ఉపాధ్యక్షురాలు అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Does Biden think Michelle Obama was Vice President?
— Benny (@bennyjohnson) April 2, 2022
pic.twitter.com/SyzKLsu378
Comments
Please login to add a commentAdd a comment