డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజ!
ఆమెకే జై కొడుతున్న సొంత పార్టీ ప్రత్యర్థులు
వాషింగ్టన్: జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవ్వలేరు.
డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్‌లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు.
పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్‌కాల్స్ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్‌లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు.
పెలోసి, క్లింటన్‌ల మద్దతు
ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్‌కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్‌ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు.
గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్‌కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు.
మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్‌ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67), అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment