delegates
-
USA Presidential Elections 2024: 99 శాతం డెలిగేట్ల మద్దతు కమలకే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసే దిశగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. కీలక ముందడుగు వేశారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల వర్చువల్ రోల్‌కాల్ ఓట్లు కోరే అర్హత సాధించారు. బరిలో ఆమె ఒక్కరే మిగలడంతో.. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థగా కమలా హారిస్ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థత్వాన్ని ఖాయం చేసుకునేందుకు కమలా హారిస్ నామినేషన్‌కు 3,923 మంది డెలిగేట్లు (99 శాతం) మద్దతు పలికారు. -
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్ హారిస్
వాషింగ్టన్: జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవ్వలేరు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్‌లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు. పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్‌కాల్స్ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్‌లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు. పెలోసి, క్లింటన్ల మద్దతు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్‌కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్‌ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్‌కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67), అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
పైలట్ ప్రాజెక్టును విశాఖపట్నంలో చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం
-
ఇండియా జాయ్‌తో డిజిటల్ ఎంటర్టైన్మెంట్కు ఊతం
సాక్షి, హైదరాబాద్: యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, డిజిటల్ వినోదం రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రానికి ‘ఇండియా జాయ్–2019’వేడుక మరింత ఊతమిస్తుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. డిజిటల్ మీడియా, వినోదం రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు సంస్థలు పాల్గొనే ఈ వేడుక నిర్వహణకు సంబంధించి ఇండియా జాయ్ ప్రతినిధులు సోమవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వెయ్యికిపైగా అంతర్జాతీయ బృందాలు హాజరవుతున్నాయని తెలిపారు. డిజిటల్ వినోదానికి సంబంధించిన 9 అంశాలపై సదస్సులు జరుగుతా యన్నారు. భారత మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీలకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో గేమింగ్, వినోదం తదితర రంగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇమేజ్ టవర్స్’కు ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టర్నర్ ఇంటర్నేషనల్, వయాకామ్ 18, సోనీ పిక్చర్స్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్, షెమారూ వంటి ప్రముఖ సంస్థలు ఈ వేడుకలో పాల్గొంటాయి. కేటీఆర్‌ను కలసిన వారిలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇండియా జాయ్ ప్రతినిధి రాజీవ్ చిలక తదితరులు ఉన్నారు. -
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల అసంతృప్తి
* ఏపీఎండీపీ పథకం పనుల పరిశీలన * డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం గుంటూరు (నెహ్రూనగర్): ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీఎండీపీ (ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్లాన్) పథకం కింద గుంటూరు నగరంలో జరుగుతున్న పనులను ప్రపంప బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. ఉండవల్లి, నులకపేట, మంగళగిరి పంపుహౌస్, తక్కెళ్లపాడు, తక్కెళ్ళపాడు పంపింగ్ హౌస్, నేషనల్ హైవే, తక్కెళ్ళపాడు చెరువు, మానస సరోవరం ప్రాంతంలలో నాగార్జున కంపెనీ చేపట్టిన 42 ఎంఎల్డీ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను పరిశీలించారు. పనులు ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి వద్ద 1.5 కిలోమీటర్ల మేర ప్లాంట్ వరకు పైపులైను వేయుటకు స్థల సేకరణకు అడ్డంకులను త్వరితగతిన అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. నగరంలో 18 రిజర్వాయర్లు, 14 సంపుల నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని కూడా వేగవంతం చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లపై ఆగ్రహం.. అనంతరం పాతగుంటూరులో మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపట్టిన పైపులైను ఇంటర్ కనెక్షన్, ఇంటింటికి ట్యాపు కనెక్షన్ల పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ఈ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరగుతుండటంతో ఏపీఎండీపీ ప్రాజెక్టు డైరెక్టర్ రాంనారాయణరెడ్డి కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంజినీరింగ్ అ«ధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు టాస్క్‌ఫోర్స్ టీమ్ లీడర్ రఘుకేశవ, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ డాక్టర్ మోహన్, సీనియర్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ ఐ.యు.బి.రెడ్డి, నగరపాలకసంస్థ ఎస్ఈ గోపాలకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీయూ ను సందర్శించిన చికాగో బృందం
తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్): నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ప్రెసిడెంట్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి సోమవారం సందర్శించారు. టీయూ వీసీ పార్ధసారధితో సమావేశమైన వారు అనంతరం, యూనివర్సిటీలో కలియ తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.