ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల అసంతృప్తి
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల అసంతృప్తి
Published Sat, Sep 3 2016 5:55 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
* ఏపీఎండీపీ పథకం పనుల పరిశీలన
* డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం
గుంటూరు (నెహ్రూనగర్): ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీఎండీపీ (ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్లాన్) పథకం కింద గుంటూరు నగరంలో జరుగుతున్న పనులను ప్రపంప బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. ఉండవల్లి, నులకపేట, మంగళగిరి పంపుహౌస్, తక్కెళ్లపాడు, తక్కెళ్ళపాడు పంపింగ్ హౌస్, నేషనల్ హైవే, తక్కెళ్ళపాడు చెరువు, మానస సరోవరం ప్రాంతంలలో నాగార్జున కంపెనీ చేపట్టిన 42 ఎంఎల్‌డీ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను పరిశీలించారు. పనులు ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి వద్ద 1.5 కిలోమీటర్ల మేర ప్లాంట్ వరకు పైపులైను వేయుటకు స్థల సేకరణకు అడ్డంకులను త్వరితగతిన అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. నగరంలో 18 రిజర్వాయర్లు, 14 సంపుల నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని కూడా వేగవంతం చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాంట్రాక్టర్లపై ఆగ్రహం..
అనంతరం పాతగుంటూరులో మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపట్టిన పైపులైను ఇంటర్ కనెక్షన్, ఇంటింటికి ట్యాపు కనెక్షన్ల పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ఈ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరగుతుండటంతో ఏపీఎండీపీ ప్రాజెక్టు డైరెక్టర్ రాంనారాయణరెడ్డి కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంజినీరింగ్ అ«ధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు టాస్క్‌ఫోర్స్ టీమ్ లీడర్ రఘుకేశవ, ఇంజినీరింగ్ కన్సల్‌టెంట్ డాక్టర్ మోహన్, సీనియర్ సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ ఐ.యు.బి.రెడ్డి, నగరపాలకసంస్థ ఎస్‌ఈ గోపాలకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement