World Bank
-
ఏటా 7.8 శాతం వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: భారత్ అధిక ఆదాయ దేశంగా 2047 నాటికి (అభివృద్ధి చెందిన దేశం) అవతరించాలంటే ఏటా 7.8 శాతం సగటు వృద్ధిని, వచ్చే 22 ఏళ్లపాటు సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందుకు గాను ఆర్థిక రంగ, భూమి, కార్మిక మార్కెట్‌కు సంబంధించి సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ 2000 నుంచి 2024 మధ్య కాలంలో వృద్ధిని సగటున 6.3 శాతానికి వేగవంతం చేసుకుందంటూ.. గత విజయాలు భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ‘‘2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పటి మాదిరే సాధారణ పనితీరుతో సాధ్యపడదు. తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి ఎనిమిది రెట్లు వృద్ధి చెందాలి. అందుకోసం వృద్ధి మరింత వేగాన్ని అందుకుని, వచ్చే రెండు దశాబ్దాల పాటు స్థిరంగా కొనసాగాలి. అలాగే, ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు సరిపోవు. సంస్కరణలను మరింత విస్తరించడంతోపాటు, వేగవంతం చేయాలి. అప్పుడే 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్ మారుతుంది’’అని ప్రపంచబ్యాంక్ నివేదిక సూచించింది. విధానపరమైన చర్యలు, పెట్టుబడులు పెంచడం, నిర్మాణాత్మక పరివర్తనతోపాటు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనపై భారత్ దృష్టి సారించాలని పేర్కొంది.చిలీ, కొరియా, పోలండ్ నిదర్శనాలు.. ‘‘చిలీ, కొరియా, పోలండ్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మరింతగా అనుసంధానం కావడం ద్వారా మధ్యస్థ ఆదాయం నుంచి అధిక ఆదాయ దేశాలుగా విజయవంతంగా మారాయి. వాటి నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్వాలి’’అని ప్రపంచబ్యాంక్ భారత్ డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే పేర్కొన్నారు. 2000 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు రెట్లు పెరిగిందని, జీడీపీలో తలసరి ఆదాయం సైతం మూడు రెట్లు అధికమైనట్టు ప్రపంచబ్యాంక్ నివేదిక గుర్తు చేసింది. ఇందుకు మిగిలిన ప్రపంచంతో పోల్చితే భారత్ వేగంగా వృద్ధి చెందినట్టు తెలిపింది. ఇది కఠిన పేదరికం గణనీయంగా తగ్గేందుకు, సేవలు, మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం చేసినట్టు వివరించింది. గత విజయాల మాదిరే భారత్ తన సంస్కరణలను వేగవంతం చేసి, భవిష్యత్తులో మరింత అధిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని కౌమే పేర్కొన్నారు.అధిక యువ జనాభా సౌలభ్యం నేపథ్యంలో మెరుగైన ఉపాధి అవకాశాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, కార్మిక శక్తిలో మహిళల ప్రతినిధ్యాన్ని 35.6 శాతం నుంచి 2047 నాటికి 50 శాతానికి పెంచడం అవసరమని ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన ఎమిలీయా స్కాక్, రంగీత్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ‘‘మౌలిక వసతులు మెరుగుపడాలి. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. కార్మిక మార్కెట్ నిబంధనలను క్రమబదీ్ధకరించాలి. నిబంధనల భారాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకతతోపాటు పోటీతత్వం పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ చర్యలతో భారత్ థాయిలాండ్, వియత్నాం, చైనాతో సమానంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటుంది’’అని ప్రంపచబ్యాంక్ నివేదిక సూచించింది. -
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025.. అర్హతలివే..
ప్రపంచ బ్యాంకు(World Bank)లో పనిచేస్తూ కెరియర్ను ప్రారంభించాలని చూస్తున్నారా? ఎకనామిక్స్, ఫైనాన్స్, హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇంజినీరింగ్, అర్బన్ ప్లానింగ్.. వంటి ఎన్నో రంగాల్లో అనుభవం పొందడానికి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు ‘ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025’ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.అర్హతలు ఇవే..ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2025కు అర్హత సాధించడానికి అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసుండాలి. లేదా ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో చేరాలి. ఇంగ్లిష్‌లో పట్టు ఉండాలి. కంప్యూటింగ్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, అరబిక్, పోర్చుగీస్, చైనీస్ వంటి అదనపు ల్యాంగ్వేజీలపై పట్టు ఉంటే ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.స్టైపెండ్, అలవెన్సులు, దరఖాస్తు ప్రక్రియఈ ప్రోగ్రామ్‌లో చేరిన ఇంటర్న్‌లకు గంటలవారీగా స్టైపెండ్, అలవెన్స్‌లు ఉంటాయి. ఇంటర్న్‌షిప్ మేనేజర్ విచక్షణ మేరకు అభ్యర్థులు ప్రయాణ ఖర్చుల కింద 3,000 డాలర్ల వరకు అలవెన్స్‌లు అందుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2025 ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ఆన్లైన్లో ప్రపంచ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రెజ్యూమె అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మార్కెట్ పతనానికి కారణం ఈ వ్యాఖ్యలేనా..?ఎంపిక విధానంఇంటర్న్షిప్లో చేరాలనుకునే అభ్యర్థులను వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి 2025 మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. 2025 ఏప్రిల్‌లో తుది ఎంపిక ఉంటుంది. 2025 మేలో ఇంటర్న్ గ్రూప్ ప్రారంభం అవుతుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి 2025 మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. -
వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2025–26, 2026–27) 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. దక్షిణాసియా వృద్ధికి సంబంధించి బహుళజాతి సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2025–26లో దక్షిణాసియా వృద్ధి అంంచనా 6.2 శాతంగా పేర్కొంది. సేవలు, తయారీ రంగాలు పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుంటాయని పేర్కొంది. 2024–25లో వృద్ధి రేటును 6.5 శాతంగా సంస్థ అంచనా వేసింది. -
అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదం
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్‌లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఇతర దేశాలు అనుసరిస్తే ప్రమాదంఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివరాల ప్రకారం.. ప్రపంచ దిగుమతులపై 10 శాతం సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోనుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.కుంటుపడనున్న వృద్ధిరేటుఅభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక ఎత్తిచూపింది. అధిక రుణ భారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికిగాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్వచ్చే 25 ఏళ్లు మరిన్ని సవాళ్లుపెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంబించాలని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ నొక్కి చెప్పారు. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సైతం ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితుల గురించి హెచ్చరించింది. -
పసిడి కాంతుల్లో సెంట్రల్ బ్యాంకులు
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్ రిజర్వ్ బ్యాంక్ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్‌గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి. → అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్‌లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్ బ్యాంకుల భావించాయి. → నవంబర్‌లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్ సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. → 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్ ఉంది. పోలాండ్ నేషనల్ బ్యాంకు నవంబర్‌లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. → ఉజ్బెకిస్తాన్ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి. → కజికిస్గాన్ నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి. → చైనా పీపుల్స్ బ్యాంక్ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్‌లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి. → జోర్డాన్ నవంబర్‌లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి. → టర్కీ నవంబర్‌లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు. → చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్‌లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి. → ఘనా నేషనల్ బ్యాంక్ నవంబర్‌లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.సింగపూర్ అమ్మకాలు.. కాగా, సింగపూర్ మానిటరీ అథారిటీ నవంబర్‌లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి. -
విద్యా రంగంలో ‘సాల్ట్’ అమలు భేష్
సాక్షి, అమరావతి : రాష్ట్ర విద్యా రంగంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు విజయవంతంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. విద్యా రంగంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అమలుకు ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టుకు 250 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో భాగంగా.. దీని పురోగతిపై తాజాగా మధ్యకాల సమీక్ష నిర్వహించి గణనీయమైన పురోగతి సాధించిందని బ్యాంకు వెల్లడించింది. 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం ముందంజలో ఉందని కిలారించింది.పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. ప్రాజెక్టు ముగింపు కాలపరిమితి డిసెంబరు 31, 2026 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి చేపట్టిన కార్యకలాపాలు చాలావరకు ట్రాక్‌లో ఉన్నాయని వెల్లడించింది. విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు వీలుగా డిజిటల్ లెర్నింగ్ అసెస్మెంట్ వ్యవస్థనూ విజయవంతంగా అమలుచేసిందని బ్యాంకు మెచ్చుకుంది.మొత్తమ్మీద ఏపీలో విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడుతున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఉదా.. గణితంలో 4వ తరగతి విద్యార్థుల ప్రావీణ్యం గత రెండేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని.. అలాగే, ప్రాథమిక, మా«ద్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు టీచ్ టూల్‌ను కూడా ఆవిష్కరించారని బ్యాంకు తెలిపింది. అంతేకాక.. రెండేళ్లలో బోధనా పద్ధతులు మెరుగుపరిచారని పేర్కొంది. జాతీయ విద్యా విధానం అమలులోనూ భేష్..ఇక జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం చాలాబాగా అభివృద్ధి చెందినట్లు ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. గ్రేడ్–3 ద్వారా పిల్లల పునాది అభ్యాసన కొనసాగుతోందని.. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఈ వాతావరణాన్ని, పనితీరును మెరుగుపరిచే చర్యల పురోగతి కూడా కొనసాగుతోందని తెలిపింది. మొత్తం మీద సాల్ట్ ప్రాజెక్టు అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది.తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్‌బ్యాక్‌కు, ఫిర్యాదులకు ఆన్లైన్ పోర్టల్‌ను కూడా అమల్లోకి తీసుకొచ్చారని, విద్యార్థుల లెర్నింగ్ లెవెల్స్, టీచర్లకు మెరుగ్గా పాఠ్యప్రణాళిక రూపకల్పన చేసినట్లు బ్యాంకు తెలిపింది. ప్రారంభ బాల్య విద్య, గ్రేడ్–1, 2 ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లకు ముందస్తు శిక్షణ ప్రారంభించారని కూడా పేర్కొంది.అంతేకాక.. విద్యార్థుల అభ్యాస సమస్యలను పరిష్కరించేందుకు అనుకూల చర్యలూ కొనసాగుతున్నాయని.. 700 రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే చర్యలూ తీసుకుంటున్నారని, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం మౌలిక సదుపాయాల కార్యకలాపాలను ఖరారుచేశారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి తల్లిదండ్రుల కమిటీలను మరింత పటిష్టం చేసిందని బ్యాంకు ప్రశంసించింది. -
అప్పులతోనే అమరావతి.. పెండింగ్ పనులకు 30వేల కోట్లు!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ అప్పులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది. -
నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉంటే నిరుపేదలు
నిరు పేదలు, మధ్య తరగతి ప్రజలు అంటే ఎవరు? నెలవారీ ఆదాయం ఎంతుంటే మధ్య తరగతి? మధ్య తరగతిలో ఎన్ని వర్గాలు? నిరు పేదల ఆదాయమెంత? వీటిపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచి్చంది. ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలను అధ్యయనం చేసే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)తో కలిసి ప్రపంచ బ్యాంక్ అధ్యయనం చేసింది. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వాల స్థిరమైన ఆర్థిక వృద్దిని ప్రోత్సహించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు ఓఈసీడీ 37 దేశాలతో కలిసి పనిచేస్తోంది.ప్రపంచ బ్యాంకు, ఓఈసీడీ కలిసి ప్రజల జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశాయి. మారుతున్న సామాజిక, ఆరి్థక స్థితిగతులను అనుసరించి జరిపిన ఈ అధ్యయనం నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే మెరుగుపడుతున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పెరిగినట్టు ప్రకటించింది. ఈ అధ్యయనంలో అల్పాదాయ, మధ్య తరగతి ప్రజల ఆరి్థక స్థితిగతులపై లోతైన పరిశీలన జరిపింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు వర్గాలుగా విభజించింది. ఇక నుంచి నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష లోపు ఆదాయం ఆర్జించే వారిని మధ్య తరగతిగా పరిగణించాలని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. రూ.లక్ష కు పైబడి ఆదాయం ఆర్జించే వారిని ఎగువ మధ్యతరగతి వర్గీయులుగా పరిగణించాలని పేర్కొంది. రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఆర్జించే వారిని దిగువ మధ్య తరగతిగా గుర్తించాలని ప్రకటించింది. ఇక రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న వారిని నిరుపేద వర్గానికి చెందిన వారిగా పరిగణించాలని పేర్కొంది. గతంలోకంటే మెరుగైన ఆర్థి క పరిస్థితిగతంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఉన్న వారిని మధ్య తరగతిగా, రూ.40 వేల నుంచి రూ.60 వేల లోపు ఉన్న వారిని ఎగువ మధ్యతరగతిగా, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు ఉన్న వారిని దిగువ మధ్యతరగతిగా పరిగణించేవారు. రూ.10 వేలకు తక్కువగా ఆర్జించే వారిని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలుగా గుర్తించే వారు. ప్రపంచ బ్యాంకు తాజా అధ్యయనం ప్రకారం అల్పాదాయ, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే కొంత మెరుగు పడినట్టు తేలింది. జాతీయ తలసరి ఆదాయాన్ని బట్టి అంచనా.. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 75 శాతం నుంచి 200 శాతం ఆదాయం ఆర్జిస్తున్న వారిని మధ్య తరగతి ప్రజలుగా, 200 శాతం కంటే ఎక్కువ ఆర్జించే వారిని ఉన్నత వర్గాలుగా, 75% కంటే తక్కువ ఆదాయం ఆర్జించే వారిని అల్పాదాయ వర్గాలుగా ప్రపంచ బ్యాంకు విభజించింది. 75 శాతం నుంచి 50 శాతం ఆదాయం పొందే వారిని నిరుపేదలే అయినప్పటికీ, తక్కువ ఆదాయం (నాన్–పూర్ లోయర్ ఇన్కమ్) ఆర్జించే వర్గాలుగా పేర్కొంది. 50 శాతంకంటే తక్కువ ఆర్జించే వారిని మాత్రం నిరుపేదలుగా అభివర్ణించాలని పేర్కొంది. అదే విధంగా స్థూల జాతీయ ఆదాయం సగటున రూ.97,192 (1145 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను తక్కువ ఆదాయ దేశాలుగా, రూ.3,82,917 (1146–4515 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను దిగువ మధ్య ఆదాయ దేశాలుగా, రూ.11,87,764 (4516–14వేల డాలర్లు) ఆర్జించే దేశాలను ఉన్నత మధ్య ఆదాయ దేశాలుగా అభివరి్ణంచింది. భారత దేశం దిగువ మధ్య ఆదాయ ఆర్జన కలిగిన దేశాల జాబితాలో ఉంది. -
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్‌ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్లో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టీన్ రైజర్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బన్ ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కె, డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే శనివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యా, వైద్య రంగాల్లో రేవంత్‌రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టీన్ రైజర్ ప్రశంసించారు. ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని మార్టిన్ రైజర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.‘ఏటీసీల్లో సిబ్బంది కొరతను అధిగమించాలి’రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో సిబ్బంది కొరతను అధిగమించాలని సీఎం ఎ.రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాల యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, మార్కెట్ అవసరాలకనుగుణంగా ఏటీసీల్లో సిలబస్ ఉండాలని, ఈ మేరకు సిలబస్ మార్పునకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీ.ఎస్ శాంతికుమారి, కారి్మక శాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ వద్దన్నది.. అయినా అమరావతే రాజధాని
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణసాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమరావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్ జోన్లో ఉందని, రాజధాని డిజైన్ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు. -
ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో.. ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు తీవ్ర నిరాశ..
-
భాగస్వామ్యానికి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు తాము సంసిద్ధమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఈ మేరకు పలు అంశాలపై ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో ప్రపంచ బ్యాంకుతో భాగస్వామ్యానికి సంబంధించి ఈ భేటీలో సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తదితర అంశాలపైనా వారు చర్చించారు.యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తాం: రేవంత్తమ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉందని.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై నిపుణుల బృందం ఏర్పాటు ఆలోచనను ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ అనుసరిస్తున్న సమతుల దృక్పథం సానుకూల ఫలితాలు ఇస్తుందని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. గతంలో భారత్‌లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేశారు.అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఇదే తొలిసారి!ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలసి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ తదితరాలపై సీఎం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారని.. ఈ ప్రాజెక్టులకు, భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమిస్తుందని అంటున్నాయి. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కొత్త ఆవిష్కరణల కోసం కార్నింగ్‌తో ఒప్పందంతెలంగాణలో నైపుణ్యాభివృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇన్ కార్పొరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు అడ్వాన్స్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ సంస్థ సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణతోపాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలోనూ సహకారం అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం స్థాపనపైనా చర్చ జరిగింది. 2025లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై కార్నింగ్ ప్రతినిధులు సంతకాలు చేశారు.జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్లతో ‘వివింట్’ విస్తరణవివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నేరుగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉన్న వివింట్ సంస్థ తాజాగా సీఎం రేవంత్‌తో చర్చల అనంతరం విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలకు సంబంధించి నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. -
భారత్ వృద్ధికి 3i స్ట్రాటజీ!.. వరల్డ్ బ్యాంక్ సూచన
భారత్, చైనా వంటి సుమారు 106 దేశాలు మధ్య ఆదాయ ఉచ్చు (మిడిల్ ఇన్కమ్ ట్రాప్)లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడులు, ఆవిష్కరణలతో పాటు.. కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3i (ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇన్ఫ్యూజన్) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ ఇలంగో కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రపంచ బ్యాంక్ తన 'వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024'లో.. స్వాతంత్య్ర శతాబ్దిగా ప్రస్తావించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పరివర్తన సాధించాలని ఆశిస్తున్నప్పటికీ.. అది కొంత క్లిష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది.ఇప్పటికి కూడా అనేక దేశాలు గత శతాబ్దానికి చెందిన ప్లేబుక్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడుతూ ఉన్నయని.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ పేర్కొన్నారు. ఇది మొదటి గేర్‌లోనే కారు నడుపుతూ వేగంగా ముందుకు వెళ్లాలనుకోవడంలాంటిదని అన్నారు.ఇది ఇలాగే కొనసాగితే.. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి ఇండియాకు 75 ఏళ్ళు, చైనాకు 10 సంవత్సరాలు, ఇండోనేషియా దాదాపు 70 సంవత్సరాలు పడుతుందని గిల్ అన్నారు. చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 1990 నుంచి కేవలం 34 దేశాలు మాత్రమే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు. -
రూ.10 లక్షల కోట్లు! స్వదేశానికి మనోళ్లు పంపించిన నిధులివి..
వాషింగ్టన్: ప్రవాస భారతీయులు స్వదేశం పట్ల అపారమైన అభిమానం చాటుతున్నారు. కష్టార్జితాన్ని తాముంటున్న చోటే దాచుకోకుండా, స్వదేశానికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. స్వదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాతృభూమికి నిధులు పంపించడంలో (రెమిటెన్స్‌లు) ప్రపంచదేశాల్లోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు.2023లో 120 బిలియన్ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్‌లను భారత్ అందుకున్నట్టు ప్రపంచబ్యాంక్ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన 66 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చిచూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత చైనాకు 50 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 39 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్‌కు 27 బిలియన్ డాలర్ల రెమెటెన్స్‌లు వెళ్లాయి.భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి. సీమాంతర చెల్లింపులకు దీర్హామ్–రూపీలను అనుమతించడంతో అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే రెమిటెన్స్‌లు పెరిగినట్టు ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఇక 2024 సంవత్సరంలో భారత్‌కు 3.7 శాతం అధికంగా 124 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు రావచ్చని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. 2025లో మరో 4 శాతం పెరిగి 129 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది.భారత్ తన యూపీఐని యూఏఈ, సింగపూర్‌తో అనుసంధానించేందుకు చేపడుతున్న చర్యలు వ్యయాలను తగ్గిస్తుందని, ఇది రెమిటెన్స్‌లను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపింది. వలసపోవడం, వారి ద్వారా స్వదేశానికి నిధుల తరలింపు అన్నది ఆర్థిక, మానవాభివృద్ధికి అత్యవసరమని ప్రపంచబ్యాంక్‌లో సామాజిక పరిరక్షణ విభాగం గ్లోబల్ డైరెక్టర్ ఇఫత్ షరీఫ్ పేర్కొన్నారు. -
సచివాలయాలతో సమున్నత సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్‌గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్‌లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు. విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.ఎస్డీజీ లక్ష్యాల సాధన..నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్‌లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు. అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్‌తో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు. వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్‌ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. -
విశాఖ పోర్టుకు అరుదైన ఘనత
విశాఖ సిటీ: విశాఖ పోర్టు అథారిటీ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీ(సీపీపీఐ)లో టాప్–20లో స్థానం సంపాదించింది. విశాఖ కంటైనర్ టెర్మినల్ అద్భుత ప్రతిభ కనబరిచి 18వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ పోర్టుల పనితీరును సీపీపీఐ పరిగణనలోకి తీసుకోగా.. ఇందులో విశాఖ పోర్టు సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ సూచీల ద్వారా వ్యాపారవేత్తలు పోర్టులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. పోర్టు సామర్థ్యం, నౌక టర్న్ అరౌండ్ సమయాలు ఎంతో ముఖ్యమైన ప్రమాణాలుగా నౌకల యజమానులు భావిస్తారు. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో క్రేన్లు గంటకు 27.5 కదలికలను నమోదు చేస్తుంటాయి. బెర్త్‌లో షిప్ నిలిపే సమయం 13 శాతంగా ఉంటోంది. అలాగే పోర్టులో టర్న్ రౌండ్‌కు 21.4 గంటల రికార్డు సమయం ద్వారా అత్యుత్తమ సూచీలను నెలకొల్పింది. 65కు పైగా కంటైనర్ లైన్లు కలిగి ఉంది.కంటైనర్ టెర్మినల్‌కు 8 నిరంతర సర్వీసులున్నాయి. ఈ అసాధారణ ఘనతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్టేక్ హోల్డర్లు, రైల్వేలు, కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అభినందించాయి. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు సాధించడానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ ఘనతను సాధించడంలో కీలకంగా పనిచేసిన సిబ్బందిని విశాఖ పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు అభినందించారు. పోర్టు సమర్థతను ఈ ఘనత చాటి చెప్పిందన్నారు.సరుకు రవాణాలో 4వ స్థానం2023–24వ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో మెరుగైన పనితీరును కనబరిచి దేశంలోని మేజర్ పోర్టులలో 4వ స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో 13.5 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తును ప్రశంసించింది. -
భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి ప్రపంచ బ్యాంకు భారీ ఊరట నిచ్చింది. దేశంలోని పట్టణ పేదలు , వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధిగా 1 బిలియన్ డాలర్లు సహాయాన్ని అందించనుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్రాజెక్టు అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. కోవిడ్-19, లాక్డౌన్ వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. సోషల్ సెక్యూరిటీ టెక్నాలజీ ప్యాకేజీ కింద భారత్‌లోని 400కు పైగా సామాజిక భద్రతాపథకాల అమలుకు ఈ వంద కోట్ల డాలర్లు ఉపయోగపడనున్నాయని బ్యాంకు పేర్కొంది. "గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ పేదల పట్ల సామాజిక భద్రతను తిరిగి సమతుల్యం చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమని ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ చాలా ముఖ్యమైనదని ప్రశంసించారు. కోవిడ్ -19 తరువాత దేశంలో జీవితం, జీవనోపాధి పరిస్థితుల్లో పెద్ద తేడా ఉండబోదని భావిస్తున్నాన్నారు. నగదు బదిలీ విధానం చాలా కీలకమైందని, దాని వల్ల జీవణ ప్రమాణాలు చాలా వేగంగా, సులువుగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరక్టర్ మైఖేల్ రుట్కోస్కీ తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో పేదలకు నగదు లభ్యత, ఆహార ప్రయోజనాలతో భదత్రను కల్పించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వరల్డ్ బ్యాంకు తెలిపింది. ప్రభుత్వ సహకారంతో ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేయడమే ప్రపంచ బ్యాంకు లక్ష్యం, తద్వారా ప్రజలు అనేక సామాజిక పథకాలను పొందటానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం ఉండదని ప్రపంచ బ్యాంకు సీనియర్ అధికారి భట్టాచార్య అన్నారు. (మూడ్ లేదు.. ఇక తెగతెంపులే ) కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్‌కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరో బిలియన్ డాలర్లు అందివ్వనుంది. అలాగే ఎంఎస్ఎంఈ ల కోసం మూడవ ప్యాకేజీ కూడా రానుందని భావిస్తున్నారు. సోషల్ ప్రొటక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్నసంగతి తెలిసిందే. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం) World Bank today announced a $1 billion support to accelerate India’s social assistance to the most vulnerable households across the country. With increased cash and food benefits, the program will ensure a safety net for the poorest during this crisis. 👉https://t.co/Ehenr5FhAz pic.twitter.com/yOJFwle8v0 — World Bank India (@WorldBankIndia) May 15, 2020 -
అదే ఫిక్స్ : వృద్ధి 5 శాతమే..
వాషింగ్టన్ : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికే పరిమితమవుతుందని ఆపై ఏడాది 5.8 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రుణాల జారీ మందగించడం, ప్రైవేట్ వినిమయం పడిపోవడం, ప్రాంతీయ సమస్యలతో వృద్ధి రేటు తగ్గుతుందని పేర్కొంది. బంగ్లదేశ్లో వృద్ధి రేటు 7 శాతానికి పైగా నమోదవుతుందని, పాకిస్తాన్లో మూడు శాతం వృద్ధి చోటుచేసుకుకోవచ్చని అంచనా వేసింది. టారిఫ్‌ల పెంపు ప్రభావం, అనిశ్చితి కొనసాగడం వంటి కారణాలతో అమెరికా వృద్ధి రేటు 1.8 శాతంతో మందగించవచ్చని స్పష్టం చేసింది. యూరప్‌లోనూ వృద్ధి రేటు 1 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు మందగిస్తున్న క్రమంలో పేదరిక నిర్మూలనకు అవసరమైన వ్యవస్ధాగత సంస్కరణలకు విధాన నిర్ణేతలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి సీలా పజర్బాసిగ్ అన్నారు. వ్యాపార వాతావరణం, చట్టాల పనితీరు, రుణ నిర్వహణ, ఉత్పాదకతలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. చదవండి : రిస్క్ కు వెరవడమే మందగమనానికి కారణం -
ప్రధాని మోదీతో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ భేటీ
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచ పోటీని ఎదుర్కోవాలంటే భూ వినియోగాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ అన్నారు. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నీటి సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర సవాళ్లను ప్రముఖంగా చర్చించారు. వృద్ధి రేటు పెరగాలంటే కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని మాల్పస్ సూచించారు. ఇటీవల ప్రకటించిన సులభతర వాణిజ్య నివేదికలో భారత్ మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మాల్పాస్ మాట్లాడుతూ... జిల్లా స్థాయిలో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు భూ సంస్కరణల అమలు, భూ వినియోగానికి సంబంధించిన డేటాను డిజిటలైజేషన్ చేయడం ద్వారా భూముల కొనుగోలు, అమ్మకాలు సులభతరం అవుతాయని అన్నారు. భారత్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులకు సంబంధించి.. 97 ప్రాజెక్టులు, 24బిలియలన్ డాలర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు నీతి అయోగ్ సమావేశంలో ఆస్తుల పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. కాగా, మూలధన మార్కెట్ల ప్రోత్సహకాన్ని గొప్ప సంస్కరణగా ఆయన అభివర్ణించారు. -
డబ్బు పంపిస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే!
వాషింగ్టన్ : విదేశాల్లో జీవనం సాగిస్తూ స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపే వలసదారుల్లో అత్యధికులు భారతీయులేనని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచంలో దేశాలతో పోల్చితే భారతదేశం నుంచే అత్యధికంగా వర్కర్లు విదేశాలకు వలసలు వెళ్లారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఆ లెక్క ప్రకారం దాదాపు 17 మిలియన్ల వర్కర్లు భారత్ నుంచి వెళ్లి వివిధ విదేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకర విషయమేమంటే, ఈ రకంగా విదేశాల్లో జీవనం కొనసాగిస్తూ దేశంలోని తమ తమ కుటుంబాలకు పంపిస్తున్న డబ్బు మొత్తం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటోందని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది సుమారు 79 బిలియన్ డాలర్ల మేరకు సంపద విదేశీ రెమిటెన్స్ రూపంలో భారత్‌కు చేరినట్టు పేర్కొంది. మిగతా ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. అదే విధంగా వలస వెళ్లి విదేశాల్లో జీవనోపాధి పొందుతున్న వారిలో కూడా అత్యధికులు భారతీయులేనని ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. వలసదారుల నుంచి విదేశీ రెమిటెన్స్ రూపంలో అత్యధిక జనాభా కలిగిన చైనా 67 బిలియన్ డాలర్లతో (10 మిలియన్ వలసదారులు) రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో భారతీయలు డబ్బు పంపిస్తున్నా.. అది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.7 శాతానికి మాత్రమే సమానంగా ఉందని వెల్లడించింది. వలసదారులు వారివారి దేశానికి పంపిస్తున్న డబ్బు చిన్న చిన్న దేశాలతో పోలిస్తే ఇది చాలా స్పల్పమని తేలింది. వలస, అభివృద్ధి పేరిట రూపొందించిన నివేదికలో దిగువ మధ్య తరగతి ఆదాయ దేశాలు 2018 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2017 లో ఈ దేశాలన్నీ కలిపి 483 బిలియన్ డాలర్లను విదేశీ చెల్లింపులుగా పొందగా, గతేడాది ఈ సంఖ్య 529 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా విదేశీ చెల్లింపులపై ప్రధానంగా ఆధారపడుతున్న దేశాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 2017 లో రెండున్నర బిలియన్ డాలర్లను ప్రవాసుల ద్వారా పొందిన కిర్గిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి సమానమని పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న నేపాల్ పౌరులు మాత్రం 6.9 బిలియన్ డాలర్ల (28 శాతం) తో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలలో కీలక పాత్ర పోషించారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. -
జీడీపీలో 7కు తగ్గిన భారత్ ర్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో బ్రిటన్, ఫ్రాన్స్‌ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (2.82 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (2.77 ట్రిలియన్ డాలర్లు) భారత్ కంటే ముందున్నాయి. 2024 నాటికి జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. 2017లో భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వల్ప తేడాతో బ్రిటన్ను కూడా దాటేసింది. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, బ్రిటన్ జీడీపీ 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ జీడీపీ 2.59 ట్రిలియన్ డాలర్లకే పరిమితం కాగా, తిరిగి 2018లో భారత్‌ను దాటి ఈ రెండు దేశాలు ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి( 5.8%) పడిపోవడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి కూడా జీడీపీ 6.8%కి క్షీణించింది. కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, జీడీపీ వృద్ధి నిదానించడం అంతర్జాతీయ జీడీపీ ర్యాంకుల్లో భారత్ కిందకు రావడానికి కారణాలుగా ఈఅండ్‌వై ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎగుమతులు తగ్గడం, డిమాండ్ పడిపోవడం వంటి పరిస్థితులను గుర్తు చేశారు. వృద్ధి తిరిగి గాడిన పడాలంటే ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
దొంగ లెక్కలు ఎలా ఉంటాయంటే..!
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ద్వారా కేంద్రానికి ఏటా వేలాది కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఉన్నతాధికారులు ఊకదంపుడుగా ఊదరకొట్టడం మనం వినే ఉంటాం. అంతెందుకు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏటా ప్రభుత్వానికి 77 వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని పదే పదే చెప్పడమే కాకుండా, ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రపంచ బ్యాంకు తన ‘2016 వార్షిక నివేదిక’లోనే ధ్రువీకరించిందని చెప్పారు. అంతేకాకుండా ఆధార్ కార్డుల రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో కూడా ఈ ‘ప్రపంచ బ్యాంకు లెక్కల’ను పేర్కొన్నారు. ఈ లెక్కలు నిజమేనా? ఆధార్ కార్డుల ద్వారా ఏటా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ మేరకు దుర్వినియోగాన్ని అరికట్ట గలిగారో, ఆర్థికంగా దాని విలువెంతో మన ఆర్థికవేత్తలకే ఇంతవరకు అంతు చిక్కడం లేదు. అలాంటప్పుడు ప్రపంచ బ్యాంకు అంత కచ్చితంగా ఎలా లెక్కకట్టింది? దానికి ఆ లెక్కలు ఎవరు చెప్పారు? ఈ సందేహం ఎవరికైనా వచ్చిందా? సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్ వెంకట నారాయణన్‌కు ముందుగా వచ్చింది. ఆయన భారత పొదుపు మీద ‘2016 ప్రపంచ బ్యాంకు నివేదిక’ను రూపొందించిన అధికారులకు ‘ఈ 77 వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఎలా లెక్కించారు?’ అంటూ 2017, సెప్టెంబర్‌లో ఈమెయిల్ ద్వారా ఓ లేఖ రాశారు. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 2018, ఫిబ్రవరి 9వ తేదీన ఆ ప్రశ్నకు మరిన్ని అనుబంధ ప్రశ్నలను జోడించి వెంకట నారాయణన్ మళ్లీ ఈ మెయిల్ పంపించారు. ఈసారి బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అయితే అందులో అధికారుల పేర్లను పేర్కొనలేదు. ‘ మొట్టమొదటి అంశం 11 బిలియన్ డాలర్లు (దాదాపు 77 వేల కోట్ల రూపాయలు) వాస్తవ లెక్క కాదు. అంత మిగిలే అవకాశం ఉందన్న అంచనా. రెండోది ఇది ప్రపంచ బ్యాంకు సిబ్బంది వేసిన అంచనా కాదు. విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు వేసిన అంచనా. మూడవది భారత ప్రభుత్వం 11 బిలియన్ డాలర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ప్రపంచ బ్యాంకు ఆకాంక్ష. నివేదిక పీఠికలో ఇది ఒక అంచనా అన్నది సూచించాం’ అని ప్రపంచ బ్యాంకు సమాధానం ఇచ్చింది. ఆ మరుసటి రోజే వెంకట నారాయణన్ మరో అనుబంధ పశ్నను పంపించారు. ప్రపంచ బ్యాంకు సీనియర్ అధికారులు.. ఆధార్ మంచి పథకం, దాని వల్ల కోట్లాది రూపాయలు మిగులుతున్నాయని ఎందుకు మాట్లాడుతున్నారన్నది ఆ ప్రశ్న. దానికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అందులో ‘ ఆధార్ లాంటి డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ప్రయోజనాల గురించి ప్రపంచ బ్యాంకు సీనియర్ అధికారులు మాట్లాడడం సహజమే. ఏ దేశంలోనైనా అభివృద్ధి ప్రక్రియ సమ్మిళితంగా, సమర్థంగా జరగాలి. అభినందించడమనేది లేకపోవడం వల్ల అది జరగడం లేదు. అభినందనల వల్ల జవాబుదారీ ప్రభుత్వమే కాకుండా సంస్థలు కూడా సానుకూలంగా స్పందిస్తాయన్నది మా విశ్వాసం’ అని పేర్కొంది. ఇది తమ దేశంలో గందరగోళానికి దారితీసిందని, 77 వేల కోట్ల ఆదా అన్నది వాస్తవం కాదని, అది ఒక అంచనా అంటూ ఓ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా వెంకట నారాయణన్ ఎన్నిసార్లు ప్రపంచ బ్యాంకు అధికారులను కోరినా ‘త్వరలో విడుదల చేస్తాం’ అన్న వ్యాక్యం తప్పిస్తే ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఆయన ఇటీవల కూడా ప్రపంచ బ్యాంకు అధికారులను సంప్రతించగా, ఢిల్లీలోని ప్రపంచ అధికారులను సంప్రతించాల్సిందిగా సూచించారట. ప్రస్తుతం ఆయన ఆ పనిలో ఉన్నారు. 77 వేల కోట్ల రూపాయలు కేవలం అంచనా అన్నది అలహాబాద్ ఐఐఎం అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త రీతికా ఖెరా 2016, జూలై 21వ తేదీన ఎన్డీటీవీ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో కూడా ఉంది. 77 వేల కోట్ల రూపాయల అంచనా కూడా తప్పేనని బెల్జియంలో పుట్టి ఢిల్లీలోని ‘ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్’ పీహెచ్డీ చేసి భారత్‌లోని పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తూ.. ప్రముఖ ఆర్థికవేత అమర్త్యసేన్‌కు సహా రచయితగా ఉంటున్న జాన్ డ్రెచ్ తేల్చారు. ఆధార్ కార్డు ప్రయోజనాలను పక్కన పెడితే ఆధార్ కార్డు లేకపోవడం వల్ల, వేలిముద్రలు గుర్తించని సాంకేతిక లోపం కారణంగా రేషన్ కార్డులు అందక మరణించిన వారు.. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 30 మంది. ఒక్క జార్ఖండ్‌లోనే 14 మంది మరణించగా, ఢిల్లీలో పదేళ్లలోపు ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించడం విషాదకరం. -
భారీగా పుంజుకున్న భారత ఆర్థిక వృద్ధి రేటు
-
‘సాగర్’పై ప్రపంచబ్యాంకు బృందం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఇక్కడ జలసౌధలో ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుతో బృందం సమావేశమైంది. సాగర్ చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయని సభ్యులు తెలిపారు. సాగునీటి పంపిణీ సమర్ధవంతంగా జరుగుతున్నట్లు తాము గమనించామని చెప్పారు. ఆధునీకరణ పనులు 98 శాతం పూర్తి అయ్యాయని, మిగతా పనులు జూలై నాటికి పూర్తి అవుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆధునీకరణ పనుల కారణంగా ప్రాజెక్టు ఆయకట్టు గ్యాప్ 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందన్నారు. రాష్ట్ర పరిధిలో సాగర్ కింద 6,40,814 ఎకరాల ఆయకట్టు ఉందని, ఇందులో నీరందని ఆయకట్టు 1.64 లక్షల ఎకరాల ఉందన్నారు. ప్రస్తుతం ఆ ఆయకట్టూ సాగులోకి వచ్చిందని తెలిపారు. ఆధునీకరణ పనులతో సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీరు చేరే సమయం 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గిందని చెప్పారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను మంత్రి హరీశ్ కోరారు.ఈ ప్రాజెక్ట్ గురించి తాము ఇప్పటికే తెలుసుకున్నామని, త్వరలోనే సందర్శిస్తామని తెలిపారు. -
ప్రజారోగ్యం కోసం ప్రపంచబ్యాంకు రుణం
-
2018లో భారత్ వృద్ధి 7.3 %
వాషింగ్టన్: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018లో 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. అటుపై రెండేళ్లలో వృద్ధి 7.5 శాతంగా ఉంటుందనీ విశ్లేషిస్తోంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే, భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ప్రపంచబ్యాంక్ ఈ సందర్భంగా కేంద్రం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించింది. 2018 గ్లోబల్ ఎకనమిక్స్ ప్రాస్పెక్టస్ పేరుతో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ 2017లో భారత్ వృద్ధి 6.7 శాతం అంచనా. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలుకు తొలిదశలో ఏర్పడుతున్న ఇబ్బందులు దీనికి ప్రధాన కారణాలు. ♦ వృద్ధి మందగమనంలో ఉన్న చైనాతో పోల్చి చూస్తే, భారత్‌లో వృద్ధి వేగం క్రమంగా పుంజుకుంటోంది. 2017లో భారత్‌కన్నా (6.7 శాతం) కొంచెం ఎక్కువగా ఉన్న చైనా వృద్ధి రేటు (6.8 శాతం), 2018లో 6.4 శాతానికి తగ్గే వీలుంది. అటుపై వచ్చే రెండేళ్లలో వృద్ధి 6.3 శాతం, 6.2 శాతానికి తగ్గవచ్చు ♦ వచ్చే పదేళ్లలో భారత్ వృద్ధి సగటున 7 శాతం ఉండచ్చు. కొన్ని ఇబ్బందులు తలెత్తినా, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుంది. ♦ ఉత్పాదనాపరంగా సానుకూల స్థితిలో ఉన్న భారత్, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారానికి తగిన కృషి చేస్తోంది. ఈ సవాలునూ అధిగమించగలిగితే, దేశంలో వృద్ధి మరింత ఊపందుకుంటుంది. మొండిబకాయిలతోపాటు ఉద్యోగ కల్పన, ప్రైవేటు పెట్టుబడుల పెంపు వంటి అంశాలూ కీలకమైనవి. ♦ ఇక దేశంలో మహిళా కార్మిక శక్తి కూడా మరింత పటిష్టమవ్వాల్సి ఉంది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా భారత్ ఈ విషయంలో వెనుకబడి ఉంది. ఆర్థికాభివృద్ధిలో మహిళా కార్మిక శక్తి ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. 2018–19లో వృద్ధి 7.3%: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్– 2019 మార్చి మధ్య) భారత్ వృద్ధి 7.3 శాతం నమోదవువుతుందని దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనావేసింది. గ్రామీణాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, పెరుగుతున్న వినియోగం దీనికి కారణాలుగా విశ్లేషించింది. రీక్యాప్ బాండ్లతో బ్యాంకులకు భరోసా: ఫిచ్ ఇదిలావుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టతకు కేంద్ర రీ–క్యాపిటలైజేషన్ ప్రణాళిక మంచి ఫలితాలను అందిస్తుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ– ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రుణ వృద్ధికీ ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. ఆదాయ వృద్ధి ఐదేళ్ల గరిష్టానికి...: క్రిసిల్ ఇక భారత కంపెనీల ఆదాయ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ కాలానికి కంపెనీల ఆదాయాలు 9 శాతానికి పైగా పెరుగుతాయని పేర్కొంది. అయితే లాభాల క్షీణత మాత్రం కొనసాగుతుందని వివరించింది. -
ఆరు నెలల తర్వాతే తేలుస్తాం
-
ఆరు నెలల తర్వాతే ‘అప్పు’ తేలుస్తాం!
సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చే అంశాన్ని ఆరు నెలల తర్వాతే తేలుస్తామని ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు స్పష్టం చేసింది. ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సహాయ పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని కోరింది. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరగదని, స్థానికుల జీవనోపాధికి విఘాతం కలగదని, ఆహార భద్రతకు ముప్పు రాదని తేలితే... ఆరు నెలల తర్వాత రుణం మంజూరు గురించి నిర్ణయం తీసుకుంటామంది. ఈ మేరకు ఈ నెల 12న ప్రపంచ బ్యాంకు కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వాటిని బ్యాంకు వెబ్సైట్లో ఉంచింది. గడువులోగా స్థానిక రైతులు, కూలీల అభ్యంతరాలకు సీఆర్డీఏ సమాధానం ఇచ్చే విధంగా బ్యాంకు నుంచి సహకారం అందిస్తామని, అప్పటికీ ఉపాధికి, పర్యావరణానికి, ఆహారభద్రతకు ముప్పు తొలగిపోలేదని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందితే.. తనిఖీ బృందం నివేదికలో పేర్కొన్న విధంగా అన్ని అంశాల్లో లోతైన దర్యాప్తునకు బ్యాంకు అనుమతి ఇస్తుందని యాజమాన్యం పేర్కొంది. ఈ హామీతో సంతృప్తి చెందినట్లు తనిఖీ బృందం వెల్లడించింది. లోతైన విచారణ జరగాలని తాము చేసిన సిఫార్సు అమలును ఆరు నెలలపాటు వాయిదా వేసుకుంటున్నామంది. 6 నెలల్లో యథాతథస్థితి కొనసాగితే.. రాజధా ని నిర్మాణం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని, స్థానికుల జీవనోపాధికి కలుగుతున్న విఘాతం తదితరాలపై విచారణకు బ్యాంకు యాజమాన్యం ఆదేశిస్తుందంది. తనిఖీ విభాగం నివేదికను ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకోవడంతో రుణం మంజూరు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది? -
భారత్‌వైపు ప్రపంచ దేశాల చూపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశంపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 90వ వార్షికోత్సవంలో వెంకయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచ బ్యాంకు సైతం ‘ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్’ అని కితాబిచ్చిందన్నారు. దేశ పురోభివృద్ధికి అవసరమైన సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అందులో భాగమేనన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును వెంకయ్య ప్రదానం చేశారు. పారిశ్రామికవేత్త వనితా దాట్లను సన్మానించారు. సంగీత ప్రపంచానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి సేవలు అజరామరంగా నిలిచిపోయాని వెంకయ్య కీర్తించారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. -
సింధు జలాలపై సందిగ్ధతే
వాషింగ్టన్: సింధు నదీజలాల ఒప్పందంపై భారత్–పాక్ మధ్య జరిగిన తాజా చర్చలు సత్ఫలితాలనివ్వలేదు. వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు కార్యాలయంలో భారత్, పాకిస్తాన్ మధ్య రాత్లే, కిషన్‌గంగ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రెండ్రోజులపాటు జరిగిన రెండో విడత చర్చలూ ఫలితం తేలకుండానే ముగిశాయి. చర్చల్లో సయోధ్య కుదిరేంతవరకు తమ ప్రయత్నం కొనసాగుతోందని ప్రపంచబ్యాంకు తెలిపింది. సింధు నదీ జలాల ఒప్పందానికి లోబడి కిషన్‌గంగ, రాత్లే జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అంశాలపై ఇరుదేశాల మధ్య కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. భారత్–పాక్ దేశాల మధ్య 9 ఏళ్లపాటు సుదీర్ఘమైన చర్చలు జరిగిన అనంతరం ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇరుదేశాల మధ్య వివాదాలు, భేదాభిప్రాయాలు తలెత్తినపుడు పరిష్కరించే విషయంలో ప్రపంచబ్యాంకు పాత్ర పరిమితంగానే ఉంటుంది. భారత్, పాక్‌లలో ఎవరైనా ఒకరు కోరితే తప్ప ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉండదు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ నేతృత్వంలో భారత బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఇందులో సింధు నదీ జలాల కమిషనర్, విదేశాంగ శాఖ, కేంద్ర జల సంఘం ప్రతినిధులున్నారు. ఆగస్టు ఒకటిన జరిగిన తొలి విడత చర్చలూ ఎటూతేలకుండానే ముగిశాయి. -
ప్రపంచబ్యాంక్ దృష్టికి ఏపీ రాజధాని అక్రమాలు
-
నోరు నొక్కేశారు
♦ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు ఎవరూ మాట్లాడొద్దు ♦ రాజధానికి భూములు ఇవ్వనివారికి మాట్లాడే హక్కే లేదు ♦ రైతులను బెదిరించిన టీడీపీ నేతలు ♦ నేలపాడు సదస్సులో మూగబోయిన రైతువాణి సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : అన్నదాతల నోరు నొక్కేశారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను అవమానించి పంపేశారు. రాజధానికి భూములివ్వని రైతులకు అసలు మాట్లాడే హక్కే లేదని హుకుం చేశారు. ఎవరైనా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే హెచ్చరించారు. ప్రపంచ బ్యాంకు తనిఖీ విభాగానికి చెందిన నలుగురు బృంద సభ్యులు తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో బుధవారం ఉదయం రాజధాని ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు తెలుగు తమ్ముళ్లు వేదిక ఎక్కి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు రైతులు ఎలా వ్యవహరించాలో పాఠాలు చెప్పారు. భూసమీకరణకు గానీ, రాజధాని నిర్మాణ విషయంలో గానీ వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర విషయాలు ఏ ఒక్కరూ ప్రస్తావించరాదన్నారు. ఎవరికైనా సమస్యలుంటే కలిసి చర్చించుకుందామని, రాజధాని నిర్మాణానికి అనుకూలంగా మాత్రమే మాట్లాడాలని ఆదేశించారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కొద్దిమంది రైతులు కూడా చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు. కూలీల ఆశ.. అడియాసే.. అధికార పార్టీకి చెందిన రైతుల ప్రతినిధులు ప్రపంచబ్యాంకు ముందు తమ వాదనలు వినిపించారు. రాజధాని ఏర్పాటుతో అనేక రకాలుగా లబ్ధి పొందామని చెప్పుకొచ్చారు. కొండవీటి వాగుతో ముంపు ఉన్న మాట వాస్తవమంటూనే 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా వారి నోట పలుమార్లు రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఇస్తున్న పరిహార భృతి ప్రస్తావనకు వచ్చింది. ఈ సదస్సులో తమ గోడును వెళ్లబోసుకునేందుకు దాదాపు అధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు హాజరయ్యారు. కొందరు ప్రభుత్వం ఇస్తున్న పరిహార భృతి సరిపోవడంలేదంటూ వినతిపత్రాలు తెచ్చారు. వీరెవరూ ప్రపంచబ్యాంకు బృందానికి వినతి పత్రాలు ఇవ్వకుండానే వెనుదిరిగారు. కేవలం ముగ్గురు నాయకులు మాట్లాడటంతోనే సమయం ముగియడం.. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిని కనీసం ఒక్కరిని కూడా వేదిక సమీపానికి కూడా రానివ్వకపోవడంతో రైతులు, కూలీలు తీవ్ర అసహనంతో వెనుదిరిగారు. ప్రపంచ బ్యాంక్ బృందం చర్చలు సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతి భూసమీకరణ విధానంపై రాజధాని రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం సీఆర్డీఏ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. మొత్తం రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజున సీఆర్డీఏ అధికారులతోపాటు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, నేలపాడు, ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి రైతులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఉదయం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు, ల్యాండ్‌పూలింగ్, మాస్టర్‌ప్లానింగ్, నిధుల సమీకరణ, సంస్థాగత స్వరూపం తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టులు చూపే సాంఘిక, పర్యావరణ ప్రభావాలపై కూడా బృంద సభ్యులు సునిశిత దృష్టి సారిస్తారు. పింఛన్ల ఎర నేలపాడులో జరిగిన సమావేశానికి రైతులు, కూలీలు, మహిళలను పెద్ద ఎత్తున తరలించడానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చివరకు బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగించారు. రాజధానిలో ఎవరికైతే ఇళ్లు కావాలో వారంతా సమావేశానికి రావాలని, పింఛన్లు కొనసాగాలంటే తప్పనిసరిగా హాజరవ్వాలని బెదిరించడంతో రాక తప్పలేదని సమావేశానికి వచ్చిన కొందరు రైతు కూలీలు, నిరుపేదలు చర్చించుకోవడం కనిపించింది. ఉద్ధండరాయునిపాలేనికి చెందిన పదుల సంఖ్యలో మహిళలను ఇలాగే తీసుకొచ్చారు. కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలకు.. కుట్టు మిషన్లు కావాలంటే సమావేశానికి వచ్చి తీరాల్సిందేనని చెప్పారు. అమరావతి అభివృద్ధికి సహకరించండి రాజధానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రతి రైతుకు, భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరేలా భూసమీకరణ విధానాన్ని అమలు చేశామని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు ఆర్థికంగా చేయూత అందించాలని ప్రపంచ బ్యాంకు బృందాన్ని కోరారు. నిధులు మంజూరుచేస్తే త్వరలోనే మా రాష్ట్రంలోనూ వాషింగ్టన్ వంటి నగరాన్ని నిర్మించుకుంటామన్నారు. – శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యే -
హైదరాబాద్–బీజాపూర్.. ఓ రోడ్డు కథ
► ప్రమాద రహిత రహదారిగా అభివృద్ధికి 2011లో నిర్ణయం ► ఉచితంగా రూ.59 కోట్లు ఇచ్చిన ప్రపంచ బ్యాంకు ► ఆరేళ్లుగా పడకేసిన పనులు ► ఇప్పుడదే రోడ్డుకు జాతీయ హోదా.. 450 కోట్లతో అంచనా ► మరి ఈ పనులు ఎప్పటికి చేస్తారనే సందేహాలు సాక్షి, హైదరాబాద్: ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సౌకర్యాలు తప్పనిసరి. అందులోనూ మంచి రోడ్లు ఉండాల్సిందే. మరి మంచి రోడ్డు అంటే ఏంటి..? కేవలం రోడ్డు నిర్మించడం మాత్రమేగాకుండా దానిని పూర్తిగా ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలి. ప్రమాదాలు జరిగినా వెంటనే పూర్తిస్థాయిలో అత్యవసర వైద్యం అందజేసే ఏర్పాట్లు ఉండాలి. ఇలాంటి నమూనా రహదారిని చూపుదామంటూ ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. 2011లో ‘హైదరాబాద్–బీజాపూర్’ రహదారిని ఎంపిక చేసి.. ఉచితంగా నిధులు కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఆరేళ్లయినా పనులు పూర్తికాలేదు. 2011 నుంచి సాగుతూనే.. తన వద్ద రుణాలు తీసుకున్న దేశాలు/రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు అప్పుడప్పుడు నజరానాలు ఇస్తుంటుంది. ఆ క్రమంలోనే 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాదరహిత రహదారుల అభివృద్ధి కోసం ఉచితంగా నిధులిచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఆంధ్రా ప్రాంతంలో రెండు రోడ్లను, తెలంగాణలో ఒక రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు ఉన్న రహదారిని ఎంపిక చేయగా.. ప్రపంచబ్యాంకు రూ.59 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో హైదరాబాద్ శివార్లలోని పోలీస్ అకాడమీ దగ్గరి నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు 126 కిలోమీటర్ల రహదారిని మెరుగుపర్చాలి. సరిహద్దు నుంచి బీజాపూర్ వరకు పనులను కర్ణాటక నిర్వహిస్తుంది. ఏం చేయాలి..? ఈ ప్రమాద రహిత రహదారుల్లో అకస్మాత్తు మలుపులు ఉండొద్దు, కూడళ్లు విశాలంగా ఉండాలి, అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించేందుకు లేజర్ గన్స్ ఏర్పాటు చేయాలి, హైవే పెట్రోలింగ్ వాహనాల పహారా ఉండాలి, ప్రమాదాలు జరిగితే వెంటనే అత్యవసర చికిత్స అందేలా ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి.. ఈ మేరకు హంగులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రహదారుల శాఖ, పోలీసు, వైద్య ఆరోగ్యం, రవాణా తదితర విభాగాల ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. మూడు పెద్ద కూడళ్లు, 21 మలుపులను గుర్తించినా.. కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. ఇక అవసరమైన ఎనిమిది హైవే పెట్రోలింగ్ వాహనాలు ఎలా సమకూర్చాలా అన్న తర్జనభర్జనలోనే పోలీసు శాఖ ఉండిపోయింది. రెండు అంబులెన్సులు, ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంతలో ఆరేళ్లు గడిచి.. గడువు పూర్తికావడంతో.. విజ్ఞప్తి చేసి మరింత సమయం పొందారు. అయినా పనులేవీ సరిగా జరగడం లేదు. అంబులెన్సులు కొంటే నిర్వహణ బాధ్యత ఎలాగో తేలక చివరకు 108కే అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆగిపోయారు. కొత్త ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి.. ఈ రోడ్డుతో సంబంధంలేని తాండూరు ఆసుపత్రిని వాడుకోవాలని నిర్ణయించారు. ఇక పోలీసుశాఖ రెండు చోట్ల ఔట్‌పోస్టు భవనాలు నిర్మించినా.. వాటిల్లో సిబ్బందిని, పరికరాలను ఏర్పాటు చేయలేదు. మొత్తంగా ‘ప్రమాద రహిత’ పనులు ప్రమాదంలో పడిపోయాయి. జాతీయ రహదారి సంగతేం చేస్తారో..? ఇటు ‘ప్రమాద రహిత రహదారి’ పనులు పూర్తికానే లేదు. ఈ ఏడాది మార్చిలో ఈ రోడ్డుకు జాతీయ రహదారి హోదా వచ్చింది. ఇది రూ.450 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రక్రియ అయితే ఇప్పటికీ మొదలుకాలేదు. దీనిని రెండు భాగాలుగా విభజించగా.. తొలి భాగానికి సంబంధించి కావాల్సిన భూమి ఎంతో కూడా తేల్చకపోవడం గమనార్హం. -
రూ.33,500 కోట్లు
రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు, కౌమార దశ ప్రసవాలకు అడ్డుకట్ట వేస్తే ఆదా అయ్యే మొత్తం - దేశంలో భారీగా తగ్గనున్న ఆరోగ్య సంబంధిత ఖర్చులు - ప్రపంచ బ్యాంకు, ఐసీఆర్‌డబ్ల్యూ సర్వేలో వెల్లడి దేశంలో రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు.. కౌమార దశలోనే ప్రసవాలకు అడ్డుకట్టవేస్తే.. ఆరోగ్యం దానికి సంబంధించిన ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చట. వీటిని నియంత్రిస్తే ఆదా అయ్యే మొత్తం రూ.33,500 కోట్లకు పైనేనట. ఈ మొత్తం 2017–18 కేంద్ర బడ్జెట్లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధుల(రూ.33,329 కోట్లు)తో సమానం. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్(ఐసీఆర్‌డబ్ల్యూ) తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బాల్య వివాహాలను.. కౌమార దశలోనే శిశు జననాలను నియంత్రించడం వల్ల రూ.1.14 లక్షల కోట్లు ఆదా అవుతాయని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇందులో భారత్ నుంచి ఆదా అయ్యే మొత్తం సుమారు రూ.65,000 కోట్లు(62 శాతం) అని పేర్కొంది. –సాక్షి, తెలంగాణ డెస్క్ బడ్జెట్‌పైనా తగ్గనున్న ఒత్తిడి బాల్య వివాహాలను, కౌమార దశ ప్రసవాలను అడ్డుకోగలిగితే.. జనాభా వృద్ధి రేటు తగ్గుతుందని, తద్వారా ప్రభుత్వ బడ్జెట్లపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషించింది. మొత్తంగా 106 దేశాల్లో బాల్య వివాహాలను తగ్గించడం వల్ల 2030 నాటికి ఏటా రూ.37 లక్షల కోట్లు ఆదా అవుతాయని వెల్లడించింది. 2015లో దేశంలో సుమారు 1.7 కోట్ల మంది చిన్నారులకు 10 నుంచి 19 ఏళ్ల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. వీరు 60 లక్షల మంది శిశువులకు జన్మనిచ్చారు. ప్రస్తుతం దేశంలో వివాహాలు జరుగుతున్న వారిలో ఇది 47 శాతం కావడం గమనార్హం. ఇలా చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లలో 76 శాతం లేదా 1.27 కోట్ల మంది బాలికలవే. 2016లో 15–19 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు చేసుకున్న సుమారు 2,80,000 మంది బాలికలు.. ఇప్పటికే నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2001తో పోలిస్తే ఇది 65 శాతం పెరిగింది. మెరుగైన చర్యతో సత్ఫలితాలు ఆర్థిక కారణాల వల్లే బాల్య వివాహాలు, కౌమార దశ ప్రసవాలు ఎక్కువ జరుగుతున్నాయని, వీటిని అధిగమించేందుకు భారత్‌తో పాటు ఇతర దేశాలు మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు–ఐసీఆర్‌డబ్ల్యూ సర్వే పేర్కొంది. బాల్య వివాహాలను, కౌమార దశ ప్రసవాలను అడ్డుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి మార్పూ ఉండదని, అయితే ఆ తర్వాత నుంచి పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, దీని వల్ల విద్యా రంగంలోనూ నిధులు ఆదా అవుతాయని వివరించింది. -
రైతుల వాదన నిజమే
రాజధాని అన్నదాతల వేదనతో ఏకీభవించిన ప్రపంచ బ్యాంకు - అందువల్లే తనిఖీ, విచారణకు ఆదేశిస్తున్నామని వెల్లడి - రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు పూలింగ్, సేకరణ చేస్తోంది.. - జీవనోపాధి, ఆహార భద్రతకు ముప్పు.. సామాజిక సర్వే లోపభూయిష్టం - 1,27,505 మంది ప్రభావితం.. 150 మంది అభిప్రాయాలే సేకరిస్తారా? - రెతుల విన్నపాలను లోతుగా అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం - వచ్చే నెల 13లోగా తనిఖీ, విచారణ పూర్తి చేయాలంటూ తలంటిన వైనం సాక్షి, అమరావతి : ‘అయ్యా.. అన్యాయం చేయమాకండయ్యా.. ఆ భూములమీదే ఆధారపడి బతుకుతున్నాం.. మూడు కార్లు పండే పచ్చటి పొలాలను లాగేసి మా కడుపు కొట్టొద్దు’ అని నవ్యావంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఎంతగా నెత్తీనోరు కొట్టుకున్నా స్పందించని రాష్ట్ర సర్కారు తీరును ప్రపంచ బ్యాంకు తప్పు పట్టింది. బలవంతంగా రైతుల నుంచి భూములు సేకరిస్తూ వారి జీవనోపాధికి భంగం కలిగిస్తున్నారని, తద్వారా పర్యావరణం, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎత్తి చూపింది. సామాజిక ఆర్థిక సర్వే అంతా లోపభూయిష్టంగా సాగిస్తూ.. కొంత మంది అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ చైర్మన్ గోంజలో కాస్ట్రోడెలా మాటా సంతకంతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. అన్ని అంశాలపై తనిఖీ, విచారణ పూర్తి చేసి, వచ్చే నెల 13వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు రుణం కోరిన నేపథ్యంలో రూ.3,334 కోట్లు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ ప్రాంతంతో సామాజిక స్థితిగతులు, పర్యావరణం తదితర అంశాలను ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకుంటుంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తోందని పెద్దఎత్తున రైతులు ఫిర్యాదు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను గమనించిన తనిఖీ ప్యానల్ ప్రభుత్వానికి తలంటింది. మాకే లోపభూయిష్టమైన సమాచారం ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని, పారదర్శకత పాటించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాచారాన్ని తాము విశ్వసించడం లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతుల ఆవేదనలో న్యాయం ఉందని తేల్చి చెప్పింది. రైతులకు జరుగుతున్న అన్యాయానికి ఆధారాలున్నాయని వెల్లడించింది. ఆకాశ రామన్నలు చెబితే విచారించడం లేదు.. రైతుల విన్నపాలపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే విచారణకు ఆదేశించామని ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ వెలువరించిన డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. ఆకాశ రామన్న లేదా పస లేని ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఆదేశించలేదని వివరించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేకపోవడంతోపాటు అమరావతి ప్రాజెక్టు తొలి దశలోనే ఉన్నందున రైతుల విన్నపాలపై విచారణ, తనిఖీలకు ఆదేశించలేదని పేర్కొంది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులు కోర్టు డాక్యుమెంట్లతో సహా మొత్తం 22 ఆధారాలు సమర్పిస్తూ.. న్యాయం చేయాల్సిందిగా తమకు విన్నవించుకున్నారని వెల్లడించింది. రైతులు లేవనెత్తిన అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే తనిఖీలు, విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ప్రపంచ బ్యాంకు ప్యానెల్ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఇంకా చెప్పారంటే... అభిప్రాయాలు చెప్పకుండా నిరోధించారు.. ‘రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) విధానం ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సహాయ, పునరావాసంపై ప్రభుత్వం తమను సంప్రదించలేదని వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని మా(ప్రపంచ బ్యాంకు) దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూములను లాగేసుకుంటోందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తగినంత పరిహారం చెల్లించడం లేదని, తాము జీవనోపాధి కోల్పోతామని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ భూములు కోల్పోతున్న వారికి అంతే మొత్తంలో మరోచోట భూములు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. సహాయ, పునరావాస ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకు అమలు చేయడం లేదని అంటున్నారు. రాజధాని ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారిపై ప్రభావ తీవ్రతను సరిగా అంచనా వేయడం లేదని బ్యాంకు దృష్టికి రైతులు తీసుకెళ్లారు. సామాజిక ఆర్థిక సర్వే లోపభూయిష్టంగా నిర్వహించారని, ఒక కన్సల్టెంట్ ద్వారా నిర్వహించిన సర్వేలో వాస్తవాలు ప్రతిబింబించలేదని రైతులు పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు వల్ల 1,27,505 మంది ప్రభావితం అవుతుంటే కేవలం 150 మందిని మాత్రమే సర్వేలో సంప్రదించారని, మరో ఐదు ఆన్లైన్ అభిప్రాయాలు మాత్రమే వచ్చాయని రైతులు పేర్కొన్నారు. సెక్యూరిటీని పెట్టి అభిప్రాయాలు చెప్పడానికి రాకుండా చాలా మందిని నిరోధించారని రైతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘనలను నిరోధించడంతో పాటు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకును కోరారు. గతంలో పలుసార్లు వినతులు చేసినప్పటికీ బ్యాంకు మేనేజ్మెంట్ వాటిపై చర్యలను తీసుకోవడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్‌పై అనేక అభ్యంతరాలు రైతుల వినతులపై ప్రపంచ బ్యాంకు ప్యానల్ గత నెల 24వ తేదీన ప్రపంచ బ్యాంకు మేనేజ్మెంట్తో సమావేశమై పలు అంశాలపై సమాచారం, వివరణ కోరింది. రైతులు ప్రస్తావించిన అంశాలు బ్యాంకు మేనేజ్మెంట్ దృష్టిలో ఉన్నాయని, అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్యానల్‌కు సమర్పించామన్నారు. సహాయ పునరావాస ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ఉప ప్రాజెక్టుల పరిధిలో మాత్రమే అమలయ్యే చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్ దృష్టికి తీసుకువచ్చింది. ప్రపంచ బ్యాంకు సాయం అందించే మొత్తం ప్రాజెక్టులో ప్రస్తుతం 30 శాతం మాత్రమే అంటే పది రహదారులకు సంబంధించి సహాయ పునరావాస కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ రహదారుల ప్రాజెక్టుకు 400 కుటుంబాలు ప్రభావితం అవుతాయని, కన్సల్టేషన్ సమావేశంలో కేవలం 150 మంది మాత్రమే పాల్గొన్నారని, ల్యాండ్ పూలింగ్‌పై అనేక అభ్యంతరాలు, అభిప్రాయాలు వచ్చాయని బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్‌కు వివరించింది. ల్యాండ్ పూలింగ్‌పై మూడవ పార్టీ అంచనా కొనసాగుతోందని, త్వరలోనే ఆ నివేదికను ప్యానల్‌కు సమర్పిస్తామని బ్యాంకు మేనేజ్మెంట్ పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తనిఖీ, విచారణకు ఆదేశించాము’ అని డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. -
ప్రపంచ బ్యాంకుతో కేంద్రం ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటలు విద్యుత్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నుంచి 240 మిలియన్ డాలర్లు, ఏఐఐబీ నుంచి 160 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ తరఫున ఆపరేషన్స్ మేనేజర్ హిషం అబ్డో, ఏఐఐబీ ఉపాధ్యక్షుడు డీజే పాండ్యన్ గురువారం సంబంధిత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం అమలు ఒప్పందంపై ఏపీ ప్రభుత్వ విద్యుత్ సలహాదారు కె.రంగనాథం, ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 570 మిలియన్ డాలర్లు కాగా, మిగిలిన వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.2%!
⇔ ప్రపంచబ్యాంక్ అంచనా ⇔ డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి బయటపడుతోందని విశ్లేషణ వాషింగ్టన్: భారత్ డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి బయటపడుతోందని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో అంచనావేసింది. 2016లో వృద్ధి 6.8 శాతంగా నమోదయితే, 2017లో 7.2 శాతానికి చేరుతుందని విశ్లేషించింది. 2017లో కూడా వృద్ధి 6.8 శాతంగానే ఉంటుందని జనవరిలో ప్రపంచబ్యాంక్ అంచనావేసింది. అయితే అప్పటి అంచనాను ఇప్పుడు 40 బేసిస్ పాయింట్లు పెంచడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాతుందని తాము భావిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ అధికారులు తెలిపారు. 2018లో 7.5 శాతం 2019లో 7.7 శాతం మేర భారత్ వృద్ధి నమోదవుతుందని తన తాజా ‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’లో ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది. అయితే ఈ అంచనాలను ఇంతక్రితం (జనవరి 2017)తో పోల్చితే వరుసగా 0.3 శాతం, 0.1 శాతం మేర తగ్గించడం గమనార్హం. ప్రైవేటు పెట్టుబడులు ఊహించినదానికన్నా తక్కువగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... ⇔ ఈ ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యత మెరుగుపడ్డం, ఎగుమతుల్లో వృద్ధి దీనికి ప్రధాన కారణాలు. ప్రభుత్వ వ్యయాలూ పెరుగుతున్నాయి. ⇔ దేశీయ డిమాండ్ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రభుత్వ విధాన సంస్కరణలు దీనికి ప్రధాన కారణం. ప్రత్యేకించి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు ప్రభుత్వ చొరవను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ⇔ రాష్ట్ర ఎన్నికల్లో కేంద్రంలోని పాలక పార్టీ గణనీయ విజయాలు, ప్రభుత్వ ఆర్థిక అజెండాను కొనసాగించడానికి దోహదపడతాయి. సరఫరాల అడ్డంకుల సమస్యలను అధిగమించడం, తగిన వాతావరణ పరిస్థితుల సృష్టి వంటి అంశాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడే వీలుంది. ⇔ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచబ్యాంక్ అభివృద్ధి విభాగ డైరెక్టర్ అహాన్ కోస్ తెలిపారు. -
అమెరికాతో బంధం మరింత బలోపేతం
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వాషింగ్టన్: గత కొన్ని దశాబ్దాలు భారత్– అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడంతో పాటు బలోపేతమయ్యాయని, ఇరు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ద్వైపాక్షిక సంబంధాలపై పెద్దగా ప్రభావం పడలేదని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఇచ్చిన విందులో జైట్లీ పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ట్రంప్ సర్కారుతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం ఎదురుచూస్తోందని జైట్లీ అన్నారు. భారత్–అమెరికాల మధ్య సంబంధాలకు ఇరు దేశాల్లోను మద్దతు ఉందని, అమెరికాలోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించడం భారత్‌కు లాభిస్తుందనే నమ్మకం వ్యక్తంచెప్పారు. ఆదివారం అమెరికా రెవెన్యూ మంత్రితో జైట్లీ భేటీ కానున్నారు. ఆశాజనకంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాలు అమెరికాలో పర్యటిస్తోన్న భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న జైట్లీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే జీ–20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలోను పాల్గొంటారు. గత మూడేళ్లతో పోల్చితే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశాలు ఈ ఏడాది ఆశాజనకంగా జరిగాయని జైట్లీ చెప్పారు. భారతదేశ వృద్ధి రేటుపై మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా సరే... గత మూడేళ్లలో ఏడు నుంచి 8 శాతం వృద్ధి రేటుతో భారత్ ముందుకు సాగిందని, ఇతర ఆర్థిక సూచీలు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. -
పల్లె ‘ప్రగతి’ ఇంతేనా?
- ప్రపంచ బ్యాంకు అసంతృప్తి - రూ.300 కోట్లకు రూ.21 కోట్ల కేటాయింపులా? - ప్రాజెక్ట్ లక్ష్యాలను చేరుకునేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని సీఎస్‌కు లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం నిధులు కేటాయించలేదని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద రైతు కుటుంబాల సంక్షేమానికి రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచ బ్యాంక్ సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతేడాది జనవరి 27న ప్రపంచ బ్యాంక్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగా హన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం లో పేర్కొన్న విధంగా ప్రాజెక్ట్ అమలు జరగ డం లేదని ప్రపంచ బ్యాంకు విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్(ఇండియా) జునైద్ కమల్ అహ్మద్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఘాటుగా లేఖ రాశారు. ‘‘ప్రాజెక్టును నిర్వహించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయలేదు. గతేడాది ఏప్రిల్ 18 నుం చి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్ర స్థాయిలో కీలకమైన ప్రాజెక్టు అధికారుల నియామకం చేపట్టలేదు. ఒప్పందంలో పేర్కొ న్న విధంగా మొత్తం రూ.642 కోట్ల అంచనా తో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.192 కోట్లు ఖర్చు చేయాలి. 2020 కల్లా ప్రాజెక్ట్ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ధేశించింది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతానికి మించి నిధులు విడుదల చేయలేదు’’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన సమస్య లను తమ బృందం వివిధ స్థాయిల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదని లేఖలో ప్రస్తావించింది. గతేడాది బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.10కోట్లు విడుదల చేయగా.. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.11 కోట్లు కేటాయించడం బాధాకరమని పేర్కొంది. రెండేళ్లలో రూ.300 కోట్లు ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టుకు, కేవలం రూ.21 కోట్లు కేటాయించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌కు ‘అసంతృప్తి’ రేటింగ్‌ను ఇవ్వాలని టాస్క్ టీమ్ నిర్ణయిం చిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు పెంచాలని, నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని సూచించారు. పల్లె ప్రగతి ప్రణాళిక ఇలా.. ఈ పథకం ద్వారా అయిదేళ్లలో 10,621 గ్రామాల్లోని 37.50 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనేది లక్ష్యం. ఇందులో జీవనోపాధులకు అత్యం త ప్రాధాన్యత కల్పించింది. ప్రధానంగా పలు రకాల పంటలు పండించే రైతులతోనే ఉత్పత్తి దారుల సంస్థ (ప్రొడ్యూసర్స్ గ్రూప్)లను ఏర్పాటు చేసి, వారి ఆదాయాన్ని 50శాతం పెంపొందేలా చర్యలు చేపటాలి. సాగు పద్ధతులపై అవగాహన కల్పన, ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధర పొందేలా సెర్ప్ శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలి. మానవాభివృద్ధిలో కీలకమైన ఆరోగ్యం, పౌష్టికాహార భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాలకు నాణ్యమైన విద్యను అందించాలనేది లక్ష్యం. నిధుల కొరత, తగిన సిబ్బంది లేకపోవడంతో ఇవేవీ ముందుకు సాగలేదు. -
వృద్ధి అవకాశాలపై చిన్న సంస్థల ధీమా
ఫేస్బుక్, ప్రపంచ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ : దేశీయంగా చిన్న సంస్థలు (ఎస్ఎంఈ) తమ వ్యాపారాల వృద్ధి అవకాశాలపై ధీమాగా ఉన్నాయి. అలాగే నియామకాలపరంగానూ ఆశావహంగా ఉన్నాయి. ఫేస్బుక్, ఓఈసీడీ, ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వ్యాపార సంస్థల్లో 48 శాతం ఎస్ఎంఈలు.. ప్రస్తుత పరిస్థితులపై, 62 శాతం సంస్థలు భవిష్యత్ అవకాశాలపైనా సానుకూలంగా స్పందించాయి. గత ఆర్నెల్లల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగిన సంస్థలు 28 శాతం కాగా.. వచ్చే ఆర్నెల్లలో సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్న ఎస్ఎంఈలు 56 శాతం ఉన్నాయి. చిన్న సంస్థలు.. డిజిటల్ ఇండియా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఎస్ఎంఈల కార్యకలాపాలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన వాటిపై అవగాహన కోసం ఇది తోడ్పడనుంది. -
వృద్ధి జోరుకు నోట్ల రద్దు బ్రేక్!
-
వృద్ధి జోరుకు నోట్ల రద్దు బ్రేక్!
2016–17లో వృద్ధి 7 శాతమే • అంచనాలు తగ్గించిన ప్రపంచబ్యాంక్ • నోట్ల రద్దు కారణమని విశ్లేషణ • క్రితం అంచనా 7.6 శాతం • భవిష్యత్తుపై ఆశావహ అభిప్రాయం వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి స్పీడ్‌కు రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తక్షణం బ్రేకులు వేస్తుందని ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్–మార్చి)లో వృద్ధి కేవలం 7 శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తన క్రితం 7.6 శాతం అంచనాలను కుదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) 7.1 శాతం అంచనాలకన్నా ప్రపంచబ్యాంక్ తాజా అంచనాలు తక్కువ కావడం గమనార్హం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి తగ్గినా... రానున్న సంవత్సరాల్లో మళ్లీ వృద్ధి 7.6 శాతం, 7.8 శాతానికి పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలే దీనికి కారణమనీ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక ధోరణులపై ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదల చేసింది. నవంబర్ 8వ తేదీన దేశంలో డీమోనిటైజేషన్ ప్రభావం, తదుపరి పరిణామాలను ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ముఖ్యాంశాలు చూస్తే... ⇔ పెద్ద నోట్ల రద్దు 2016లో వృద్ధిని మందగించేట్లు చేస్తుంది. చమురు ధరల అనిశ్చితి, వ్యవసాయ, తయారీ రంగాలు వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయి. 2016–17 చివరి త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత కొరవడనుందని తయారీ, మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌లు (పీఎంఐ) కూడా పేర్కొనడం గమనార్హం. ⇔ భారత్ వృద్ధి రేటు తగ్గినా... అది చైనాకన్నా ఎక్కువగానే ఉండడం వల్ల ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగనుంది. ⇔ దేశంలో సరఫరాల సమస్యల పరిష్కారానికి, ఉత్పాదకత మెరుగుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలు దోహదపడతాయని భావిస్తున్నాం. వచ్చే రెండేళ్లలో వృద్ధి పెరుగుదల అంచనాలకు ఇది ప్రధాన కారణం. ⇔ సమీపకాలంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డానికి, పెట్టుబడులు పెరగడానికి మౌలిక రంగంలో భారీ వ్యయాలు దోహదపడతాయి. ⇔ మేక్ ఇన్ ఇండియా ప్రచారం... భారత తయారీ రంగానికి దోహదపడుతుంది. దేశంలో నెలకొన్న డిమాండ్, ప్రభుత్వం తీసుకొస్తున్న నియంత్రణపరమైన సంస్కరణలు ఈ దిశలో ప్రయోజనాలకు దారితీస్తుంది. ⇔ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, వేతనాల పెంపు... వాస్తవ ఆదాయాలు, వినియోగం పెరగడానికి దోహదపడతాయి. తగిన వర్షపాతంతో పంట దిగుబడి పెరగడం ఆర్థిక వృద్ధికి దోహదపడే అంశం. ⇔ పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకింగ్ వద్ద ద్రవ్య లభ్యత పెరిగింది. ఇది కనిష్ట వడ్డీరేట్ల వ్యవస్థకు దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డానికి దోహదపడుతుంది. అయితే దేశం నగదు ఆధారితమైనందున, తక్షణం వ్యాపార అవరోధాలకు, కుటుంబ కొనుగోళ్లు తగ్గడానికి దారితీస్తుంది. ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నిజానికి భారత్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు మందగించాలి. పారిశ్రామిక వృద్ధి బాగోలేదు. ఎగుమతులూ పెరగలేదు. అయితే ప్రైవేటు, ప్రభుత్వ వ్యయాలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు లాభించింది. దిగువస్థాయి ఇంధన ధరలు, వేతనాలు, పెన్షన్ల పెరుగుదల, తగిన వర్షపాతం వంటి అంశాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయాలు పెంచాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగడం కూడా ఆర్థిక క్రియాశీలతకు దోహదపడింది. మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు ఎగశాయి. ⇔ గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడులు 21 శాతం పెరిగితే, ప్రైవేటు పెట్టుబడుల్లో అసలు వృద్ధిలేకపోగా 1.4 శాతం క్షీణించింది. ⇔ తయారీ రంగంసహా పలు విభాగాలకు సంబంధించి విదేశీ డిమాండ్ బలహీనత, కొత్త ప్రాజెక్టులకు ప్రోత్సాహం లేకపోవడం, విధానపరమైన అనిశ్చితి ప్రైవేటు పెట్టుబడుల మందగమనానికి కారణం. ఉదాహరణకు భూ సేకరణలకు సంబంధించి నష్టపరిహార చెల్లింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం తగిన విధంగా లేదు. ఇందుకు సంబంధించి చట్ట సవరణల విషయంలో జాప్యం జరుగుతోంది. ఇక ఇప్పటికే రుణ భారంతో ఉన్న మౌలిక రంగ కంపెనీలకు బ్యాంకింగ్ రుణాలు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా ఇక్కడ విద్యుత్, స్టీల్, సిమెంట్ వంటి రంగాలను ప్రస్తావించుకోవచ్చు. ⇔ దక్షిణ ఆసియా మొత్తంగా పెట్టుబడులు మందగిస్తున్నాయి. -
రాజధానిలో భూమి ఎత్తు పెంచాలి
లోతట్టు ప్రాంతం ఉందని ప్రభుత్వ నివేదిక సాక్షి, అమరావతి: నూతన రాజధాని లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు నివారణకు నిర్మాణ ప్రాంతాల్లో భూమి ఎత్తు పెంచాల్సి ఉందని సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం సామాజిక పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను సీఆర్డీఏ ప్రకటించింది. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముఖ్యంగా రవాణా కారిడార్, యుటిలిటి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు భూమి ఎత్తు (ప్లాట్‌ఫాం) పెంచాలని నివేదికలో స్పష్టం చేసింది. కృష్ణా కరకట్టలను మరింత పటిష్టం చేయడం ద్వారా వరద ముప్పు నివారించవచ్చని పేర్కొంది. కొండవీటివాగు వరద అంచనాలపై జలవనరులశాఖ అధ్యయనం చేస్తోందని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపింది. జలవనరులశాఖ నివేదిక వచ్చిన తరువాత చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. రాజధాని ప్రాంతంలో అత్యధికంగా సారవంతమైన వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమిని కోల్పోవడంతో ఉపాధి లేకుండా పోయిందని సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రజలు స్పష్టం చేశారని తెలిపింది. అసైన్డ్ భూములకు తగిన పరిహారం చెల్లించలేదని కూడా వెల్లడించింది. ప్రజారవాణా వ్యవస్థ లేదని, మంచి నీటి సౌకర్యం లేదని, విద్య, వైద్య సౌకర్యాలు లేవని పేర్కొంది. -
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన
అమరావతి: మండలంలోని జూపూడిలో గురువారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, అధికారులు పర్యటించి పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. వరల్డ్‌బ్యాంకు ప్రతినిధులు సాహితి, జాన్సన్, అభిషేక్ గుప్తా సయ్యద్, పాల్ ఆదాయ వనరులు, కుటుంబ పరిస్థితి, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. డీఆర్డీఏ పీడీ హబీబ్‌బాషా మాట్లాడుతూ వరల్డ్ బ్యాంకు సహకారంతో వెలుగు ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న 150 మండలాలను ఎంపిక చేశారన్నారు. అందులో భాగంగా జూపూడి గ్రామాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు ఈ గ్రామాలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. అనంతరం అమరావతి వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏరియా కో-అర్డినేటర్ సత్యసాయి, డీపీఎం గౌరీనాయుడు, కిరణ్‌కుమార్, శర్మ, ఏపీఎం సునీత పాల్గొన్నారు. -
అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 13,500 ఎకరాలకు వరద ముప్పు పొంచి ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వరద ముంపుపై మొదటి నుంచి పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేసినా ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు సర్కార్ కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు మాత్రం వరద ముప్పు ఉందని పరోక్షంగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. వరద ముంపు నిర్వహణ నిమిత్తం రూ.1096 కోట్లు అవసరమన్న ఎంపీ గల్లా జయదేవ్.. లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, వరదనీరు మళ్లింపునకు వందల కోట్లు ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు రుణాల కోసం కేంద్ర జలవనరులశాఖకు ఫైలు పంపిన టీడీపీ ఎంపీలు ఆమోదం తెలపాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. -
అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ
-
ఇబ్బందిలేని మదుపును కోరుకుంటున్నారా..
• సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ఎన్పీఎస్ వరకూ ఎన్నో మార్గాలు • అవసరార్థం డబ్బుకు ఢోకాలేదు • ఆందోళన అక్కర్లేదు భారతీయులు గొప్ప మదుపరులు. 2014లో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం– మన స్థూల దేశీయ పొదుపు రేటు 31.1 శాతం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారత్ ప్రజలు మదుపునకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మెజారిటీ ప్రజలు తమ డబ్బు భద్రతకు తొలి ప్రాముఖ్యత ఇస్తారు. ఎప్పుడు అవసరపడితే అప్పుడు డబ్బు చేతికి అందాలనీ కోరుకుంటారు. ఇది స్టాక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వంటి సాధనాల్లో సా ధ్యపడదు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా... ఇక్కడా మార్కెట్ ఒడిదుడుకులు పొంచి ఉంటాయి. ఎలాంటి ఒడిదుడుకు లూ లేకుండా... పొదుపు చేసిన డబ్బుకు పూర్తి భరోసాను ఇస్తూ... ప్రణాళికలకు అనుగుణంగా డబ్బు చేతికి అందాలనుకునే చిన్న మదుపుదారులకు పలు ‘ఆర్థిక సాధనాల’ గురించి తెలియజేయడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం. ముందుగా చేయాల్సింది...! ‘ఇబ్బంది లేని మదుపు’ దిశలో చిన్న మదుపుదారుగా మీరు తొలుత ప్రధానంగా మూడు సూత్రాలపై దృష్టి పెట్టాలి. వీటి ఆధారంగానే మీ ‘ఆర్థిక మదుపు ఇన్స్ట్రమెంట్’ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ వాటిని ఒక్కొక్కటిగా చూస్తే... ఆర్థిక లక్ష్యాలు... అసలు పొదుపునకు సంబంధించి మీ లక్ష్యాలు ఏమిటన్న అంశంపై తొలుత దృష్టి పెట్టాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ లేదా ఇళ్లు కొనడం ఇదేమీ కాకుండా పిల్లల చదువులు. ఇంకా చెప్పాలంటే కారు కొనడం... సెలవులకు ఏదైనా పర్యటన చేయడం... ఇలా మీ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. దీనిపైన ఒక స్పష్టతకు రావాలి. సమయ నిర్ణయం... ఆయా లక్ష్యాలకు అనుగుణంగా ఎంత సమయానికి మీ డబ్బు తిరిగి మీ చేతికి అందాలన్న అంశంపై అవగాహన ముఖ్యం. పన్ను అంశాల పరిశీలన ఇక మీ మదుపునకు సంబంధించి పన్ను అంశాలపైనా అవగాహన అవసరం. పన్ను భారాలు లేని ‘ఆర్థిక ఇన్స్ట్రమెంట్’ మీద దృష్టి ముఖ్యం. మీకు వచ్చే సంపదపై అధిక పన్ను పడే పరిస్థితుల్లో సంపద సృష్టి కష్టం. పన్నులు, ఈ అంశానికి సంబంధించి ప్రభావం దీర్ఘకాలం రిటర్న్స్‌పై ఎంతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక సాధనాలు ఇవీ... సేవింగ్స్ అకౌంట్: ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండడం... కచ్చితంగా 4 నుంచి 6 శాతం వరకూ వడ్డీరేటు ఇక్కడ లభిస్తున్న ప్రధాన అవకాశం. వడ్డీ 10,000 లోపు అయితే పన్ను మినహాయింపూ ఉంటుంది. స్వల్ప కాలానికి అంటే 1 నుంచి 6 నెలలకు ఈ బ్యాంకింగ్ ప్రొడక్ట్ అత్యుత్తమ సాధనం. స్థిర డిపాజిట్లు: మధ్య కాలానికి మంచిది. 9 నెలలు ఆపైన మదుపునకు ఇది మంచి సాధనం. 7 రోజుల నుంచి 7 సంవత్సరాలు (కొన్ని బ్యాంకులు ఆ పైన కూడా) నిర్దిష్ట వడ్డీరేట్లతో స్థిర డిపాజిట్లు మీ డబ్బుకు భరోసాను ఇస్తాయి. అయితే దీర్ఘకాలంలో చూస్తే ద్రవ్యోల్బణానికి విరుగుడు కాకపోవడం, పన్ను అంశాలు ఇక్కడ అవరోధాలు. ఎఫ్ఎంపీలు: ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. క్లోజ్డ్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు. డెట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్లలోకి మీ నిధులు వెళతాయి. స్థిర డిపాజిట్ల పరిమాణంలోనే రిటర్న్స్ ఉంటాయి. మూడేళ్ల కాల వ్యవధికి పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. పన్ను భారాలు ఉండవు. అయితే ఏఏఏ రేటెడ్ ఎఫ్ఎంపీలను ఎంచుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పదిహేళ్లను ప్రత్యేకించి రిటైర్మెంట్ ప్రణాళికలకు సంబంధించి ఈ ప్రొడక్ట్ ఎంతో ప్రయోజనకరం. రిటర్న్స్‌పై అసలు పన్ను భారం ఉండదు. ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమూ ఉంది. ప్రభుత్వ నిర్ణయానుసారం త్రైమాసికానికి రిటర్న్స్ రేటు మారే వీలుంది. ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పరిమితి ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్: ఇది కూడా ఒక చక్కటి రిటైర్మెంట్ ప్రణాళికే. భారత్ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. పొదుపును ప్రోత్సహిస్తూ... రిటైర్మెంట్పై యాన్యుటీ ప్రణాళికగా ఏకమొత్తం డబ్బు పొందడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తరహాలో నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఎటువంటి పరిమితీ లేదు. సిప్: మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక. ఈక్విటీల్లో క్రమానుగత పెట్టుబడులు ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ రాబడి బాగుంటుందని ఫలితాలు చెబుతున్నాయి. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ ప్రణాళికలకు ఈ ప్రొడక్ట్ ఎంతో దోహదపడుతుంది. ఈక్విటీలపై అవగాహన లేని వారు సిప్ ద్వారా ఆ ప్రయోజనం పొందవచ్చు. -
పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన ప్రపంచబ్యాంకు
673 కోట్ల రుణం ఇవ్వడానికి నిరాకరణ ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ సహజవాయువు (నాచురల్ గ్యాస్) ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన రూ. 630 కోట్ల (100 మిలియన్ డాలర్ల) రుణాన్ని నిరాకరించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు గ్యాస్ పంపిణీ కంపెనీ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కరాచీ, సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలలో సహజ వాయువు సరఫరాను మెరుగుపరిచేందుకు, గ్యాస్ పైప్ లైన్ వ్యవస్థలో వాణిజ్య,ఇతర లొసుగులను అధిగమించేందుకు సుయ్ సాదరన్ గ్యాస్ కంపెనీ (ఎస్ఎస్జీసీ) ఈ ప్రాజెక్టు తలపెట్టింది. అయితే, ఈ ప్రాజెక్టు చేపట్టడంలో విఫలం కావడం, అక్రమ గ్యాస్ లీకేజీలు అధికంగా కొనసాగుతూ విలువైన సహజ వనరు దుర్వినియోగమవుతుండటంతో ప్రపంచబ్యాంకు ఈ ప్రాజెక్టు ఇవ్వాలని ఉద్దేశించిన రుణాన్ని నిరాకరించాలని నిర్ణయించిందని డాన్ పత్రిక తెలిపింది. -
ఉత్పాదకతతోనే ఎగుమతుల వృద్ధి
భారత్‌కు ప్రపంచ బ్యాంక్ సూచన న్యూఢిల్లీ: దక్షిణాసియా ప్రాంతంలో ప్రధాన ఎగుమతుల దేశంగా అవతరించాలంటే.. భారత్ తప్పనిసరిగా తన ఉత్పాదకతను పెంపొందించుకోవాల్సి ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. దీనికి అనువుగా తగిన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం భారతీయ కంపెనీలు ఎగుమతుల పరంగా చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. దీంతోపాటు వీటికి ప్రపంచ దేశాల పోటీ కూడా ఒక సమస్యగా మరిందని తెలిపింది. ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ‘ఉత్పాదకతను పెంచుకుంటేనే పోటీలో నిలువగలం. ప్రపంచపు ఎగుమతుల హబ్‌గా దక్షిణాసియా ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలంటే భారత్ వంటి దేశాలు వాటి ఉత్పాదకతను ప్రతి ఏడాది రెండు శాతం పారుుంట్ల మేర పెంచుకుంటూ రావాలి’ అని వివరించింది.దక్షిణాసియా ప్రాంతంలోని ఆయా దేశాలు వ్యాపారానుకూల పరిస్థితులఏర్పాటుకు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, నూతన పాలసీ అమలుకు కృషి చేయాలని సూచించింది. దేశంలో ఉత్పాదకతను పెంచాలంటే వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ వారిని తయారీ, సేవల రంగం వైపు మరల్చాలని భారత్‌కు సూచించింది. టెక్నాలజీని పూర్తిస్థారుులో ఉపయోగించుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం వంటి వాటి ద్వారా భారతీయ కంపెనీలు వాటి ఉత్పాదకతను పెంచుకోవచ్చని తెలిపింది. కార్మికులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం, పట్టణాల అభివృద్ధి అంశాలపై దృష్టిసారిస్తే భారత్‌లో ఉత్పాదకత కచ్చితంగా పెరుగుతుందని పేర్కొంది. -
ఏ విలువలకీ విష సంస్కృతి?
రెండో మాట సంస్కరణల తదుపరి మొదలైన విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమకు ప్రోత్సాహం పేరిట పాశ్యాత్య విష సంస్కృతిని ప్రోత్సహించడం. ఏపీ ప్రభుత్వం దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వానించి బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోవడం ఇందులో భాగమే. గోవాకే పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ధతుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. భారతీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధకుల మనే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విశృంఖల విహారాన్ని నేడు మన దేశంలో వివిధ స్థాయిలలో కళ్లారా చూస్తున్నాం. రకరకాల మార్గాలలో ఇది ప్రదర్శితమ వుతోంది. 1991లో ప్రపంచబ్యాంకు-అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు జమిలిగా ‘‘నూతన సమాచార వ్యవస్థ’’ వెన్నుదన్నుగా ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లకు తెరఎత్తాయి. తద్వారా అమెరికా పతనమవుతున్న తమ సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థ ఆర్థిక చట్రాన్ని, కోల్పోతున్న మార్కెట్‌ను రక్షించుకునే ప్రయత్నంలో ‘ప్రపంచీకరణ’ మంత్రదండంతో వర్ధమాన దేశా లను తన సరుకులతో నింపదలచింది. పర్యవసానంగా భారత పాలకవర్గాలు (కాంగ్రెస్-బీజేపీ) ప్రపంచ బ్యాంకు ద్వారా అమలులోకి తెచ్చిన సంస్కర ణలలో భాగంగానే అన్నిరకాల అవలక్షణాలు ఆర్థికంగానే గాకుండా సాంస్కృ తికంగా కూడా మన దేశాన్ని ముప్పెరగొన్నాయి. వాటిలో భాగమే మన పాలకులు ఆ సంస్కరణలపై బేషరతుగా ముద్రవేయడం. ఆ ‘ముద్ర’ కాస్తా దేశం ఉసురు తీస్తోంది. యువతను పక్కదారులు పట్టించి చెడగొట్టే విష సంస్కృతిని వ్యాపింపజేయడంద్వారా, ప్రజావ్యతిరేక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను, సంస్కృతి, సంప్రదాయాలను వినాశనం వైపుగా మళ్లించి, తమకు శాశ్వత బానిసగా పడి ఉండే ఇండియాను తయారు చేయ డమే అమెరికా లక్ష్యం. సంస్కరణలవల్లే కుక్కమూతి పిందెల సంస్కృతి 1991లో ఈ ప్రక్రియను ప్రారంభించిన మన్మోహన్ సింగ్, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకన్నా వరల్డ్ బ్యాంకు ‘సంస్కరణల’ను దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా మూడేళ్లు ముందుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా, బీజేపీ నాయకునిగా. ప్రధాన మంత్రి హోదాలో వాజ్‌పేయి మరొక అడుగు ముందుకు వేసి సంస్కరణ లను పెద్ద ఎత్తున అమలులోకి తెచ్చే ప్రక్రియను ‘‘వెలిగిపోతున్న భారతం’’ అన్నారు. నాయకులు, వారి అనుయాయులంతా ఆర్థికంగా ‘వెలిగి’పోయా రుగానీ, దేశ సామాన్య ప్రజాబాహుళ్యం బతుకులు మాత్రం చీకట్లోకి జారు కున్నాయి. ఆనాటి నుంచి ఈనాటి దాకా సామాజికంగానే గాక సాంస్కృతి కంగా కూడా ఈ సంస్కరణలు బతుకు విలువల్ని నైతిక విలువలను దిగజా రుస్తూనే వచ్చాయి. ఈ సర్వవ్యాపిత పతన సంస్కృతిలో భాగంగానే సాంస్కృ తిక రంగంలోనూ కుక్కమూతి పిందెలు మొలకెత్తి ఎదిగిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణ దేశంలో పలు చోట్ల మహిళలు, విద్యార్థులు, వృత్తిదా రులు, కార్మిక, బలహీన వర్గాలపైన అనేక అత్యాచారాలు, దాడులూ పెరిగి పోతున్నాయి, హత్యల సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్ని బహిర్గతం చేసే పాత్రికేయులపైన, పత్రికలపైన, విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాలపైన, వాటి నాయకులపైన ప్రివెంటివ్ డిటెన్షన్, సెడిషన్ (రాజద్రోహ నేరం) చట్టాలను ప్రయోగించేందుకు పాలకులు సాహసిస్తు న్నారు. ఈ సంస్కరణల తదుపరి ఈ 20 ఏళ్లలోనే స్త్రీల మధ్యనే వివక్ష చూపే అందాల పోటీలు, బ్యూటీపార్లర్లు, క్యాట్వాక్లూ, ఆహార్యం, సౌందర్య పోషణ పేరిట వింత పోకడలూ చోటు చేసుకున్నాయి. సమానతా సూత్రం ప్రాతిపదికపై వనరుల పంపిణీ పద్ధతిలోగాక ప్రభుత్వాలు దుబారా పర్యటన లకు, మంత్రుల, ముఖ్యమంత్రుల విహార యాత్రలకూ మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతూ ప్రజల కనీస అవసరాలను తుంగలో తొక్కుతున్నారు. పర్యాటక వృద్ధి పేరిట విశృంఖలత ఈ విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమను ప్రోత్సహిం చడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి వనరులు సమకూర్చుకోవాలన్న యత్నం. స్థానిక, సంప్రదాయ కళల ద్వారా సంగీత, నృత్య విభావరులు పునాదిగా, దేశంలోని వివిధ స్థానిక సంస్కృతులకు ఆలవాలమైన జానపదుల కళారూపాల ద్వారా కూడా పర్యాటక రంగ ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చు. కానీ పాశ్చాత్య సంస్కృతి ద్వారా విష సంస్కృతిని పెంచి పోషించడం, స్థానిక యువత అభిరుచుల్ని పక్కదారులు పట్టించే ప్రయత్నాలు అభ్యంతరకరం. దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వా నించి, అందాల పోటీలు, హాలీవుడ్- బాలీవుడ్ తారల నృత్యాలు, వలంటైన్ (ప్రేమికుల) దినోత్సవాన్ని కలుపుకుంటూ ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 12 నుంచి 14 వరకూ ‘‘బీచ్ లవ్’’ ఉత్సవాలను నిర్వహించబోవడం ఇందులో భాగమే. అందుకే మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా స్వామిక శక్తులూ ఈ ‘బీచ్ లవ్’ ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి గోవాకే (బీజేపీ పాలన) పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ద తుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. నిత్యమూ భార తీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధిస్తున్నట్టు కన్పించే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి. ఆచరణలో రాజ్యాంగానికి, రాజ్యాంగంలోని ప్రాథమిక పౌర బాధ్యతల అధ్యాయంలో 51-ఎ (హెచ్) అధికరణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాల కులు పాలనకు అనర్హులవుతారు. సెక్యులర్ వ్యవస్థను రక్షించలేని వారు రాజ్యాంగ వ్యతిరేకులు. బ్యాంకు సంస్కరణలు అమలులోకి వచ్చిన తరువాత సమాజంలోని వివిధ సామాజిక వర్గాలపైన వాటి చెడు ప్రభావం ఎలా విస్తరిస్తూ వచ్చిందో, ముఖ్యంగా దేశ మహిళల జీవితాలపైన ఎలాంటి ప్రభావానికి దారిదీశాయో ‘బ్యాంక్-ఐఎంఎఫ్ సంస్కరణల కింద భారత మహిళల పనిపాటపైన ఎలాంటి ప్రభావం పడిందో’ ప్రసిద్ధ పరిశోధకురాలు రజనీ దేశాయ్ (1998 ఏప్రిల్ 24) వివరించారు. ఆమె ఇలా అన్నారు: ‘‘ఈ సంస్కరణలవల్ల పని చేసుకుంటూ దోపిడీకి గురైన శ్రామిక వర్గ మహిళలు అత్యధికులు. కేవలం ఆర్థిక కారణాలవల్ల ఆహారం, ఇతర నిత్యావసరాలు అందని పేద కుటుంబాలున్నాయి. ఈలోగా ప్రపంచబ్యాంకు ‘పొదుపు’ కార్య క్రమాలూ, ‘పథకాలు’ దూసుకు వచ్చిన ఫలితంగా ఆహార ధాన్యాల రేషన్ ధరలు బహిరంగ సంతలో రెట్టింపుకు పెరిగిపోయాయి. ఈ మహిళా కార్మికుల్లో ఐదింట నాలుగు వంతులు వ్యవసాయ కూలీలు లేదా పేద రైతులు. వీరంతా అసంఘటిత కార్మికులు. ఈ ఆర్థిక దోపిడీకి తోడుగా నూతన ‘ఆర్థిక సంస్కరణల’ పేరు చాటున మహిళలపైన సాంస్కృతికం గానూ, సామాజికంగానూ దాడులు ముమ్మరం అయ్యాయి. సంస్కరణలు ప్రారంభమైన తరువాత అందాల పోటీల పేరిట మహిళల మధ్య ఒక రకమైన ఉన్మాద వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారు. ఈ ‘అందాల పోటీలు’ ఆధారంగా తమ సౌందర్యోపకరణ సరుకుల్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి వీలు చిక్కింది. పట్టణాల్లోని మహిళల మనస్సులపైన, ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి యువతులపైన ఈ పోటీల ప్రభావం పడింది’’. దీంతో దేశ మంతటా బ్యూటీపార్లర్లు తామరతంపరగా వ్యాపించాయి. అందంగా ముఖాలు కనబడేలా చేసే ఫేసియల్ క్రీమ్స్ వచ్చాయి. అలా, మార్కెట్ ఎకా నమీ (సంత దోపిడీ) తత్వాన్నిబట్టి వ్యభిచార వృత్తిని కూడా ఒక ‘సేవా రంగం’గా పరిగణించే సంస్కృతిని పెంచేశారు. స్త్రీని విపణి సరకుగా మార్చే విష సంస్కృతి ఈ సంస్కరణల ప్రభావంతోనే కొన్ని దేశాల్లో విదేశీ మారక ద్రవ్య సంపాదన కోసం పర్యాటక పరిశ్రమలో భాగంగా ‘సెక్స్ టూరిజాన్ని’ ప్రవేశపెట్టారు. చివరికి పూర్వపు సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల్లో కూడా బ్యాంక్-ఐఎంఎఫ్‌ల సంస్థాగత మార్పుల పేరిట ఈ సెక్స్ టూరిజాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే ఇండియాలో కూడా అవే సంస్కరణల పేరిట టూరిజం ద్వారా ఆదాయం సంపాదించేందుకు ప్రభుత్వాలు సిద్ధం అయిన కొద్దీ ఈ విష సంస్కృతి ప్రబలిపోయే అవకాశాలూ పెరిగాయని కూడా రజనీ దేశాయ్ వివరించారు. అలాగే ప్రపంచీకరణ జపం ఫలితంగా సౌందర్య పోషకాల (కాస్మెటిక్స్) పరిశ్రమ కూడా దూసుకు వచ్చింది. ఇందుకు కార్పొరేట్లు ప్రచార, ప్రసార మాధ్యమాలైన మీడియాను విస్తారంగా వాడుకోవడం ప్రారంభించారు. ఫలితంగా ఈ పరిశ్రమ పదేళ్ల వ్యవధిలోనే (1991-2000) రూ.2,311 కోట్ల వ్యాపారం నుంచి రూ. 18,900 కోట్లకు పెరిగిపోయింది. ఇక ‘మిస్ ఇండియా’ పోటీలూ పెరిగిపోయాయి. ఈ జాడ్యం కళాశాలల నుంచి ‘గల్లీల’కూ పాకిపోతూ వచ్చింది. ఈ పోటీలు స్త్రీల మధ్య వ్యత్యాస భావనను పనిగట్టుకుని మరీ పెంచేసిందని మరచిపోరాదు. అందుకే ఆనాడు గురజాడ స్త్రీల కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసని అంటే, శ్రీశ్రీనే కాదు, ‘‘స్త్రీ స్త్రీ’’ని కూడా అన్నాడు. అలాగే ‘మనిషే బంగారమని’ వ్యత్యాస సంస్కృ తిని సాహిత్యపరంగా తుత్తునియలు చేసినవాడు మహాకవి రాబర్ట్ బర్న్స్. కానీ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లు దేశంలోనూ అంతర్జాతీయంగానూ ప్రవేశ పెట్టిన ఆంగ్లో-అమెరికన్ వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు మాత్రం ‘మహిళల్ని వ్యాపార వస్తువులు’గా పరిగణించే విష సంస్కృతికి తలుపులు తెరిచాయి. ఆ ఎంగిలిని మన పాలకులూ అభిమానించి, ఆదరించడం దుస్సహకారణమవు తోంది. బహుశా అందుకే వస్తుదాహ సంస్కృతిలో ఇంద్రజాల, మహేంద్ర జాల శక్తిని గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వత ప్రక్రియగా మార్చింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏపీకి 'ప్రపంచ బ్యాంక్' 1వ ర్యాంక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన తాజా ర్యాంకుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంధన పొదుపు అమలులో బాబు సర్కార్ అవలంభిస్తున్న చర్యలకుగానూ ఈ ర్యాంకు లభించింది. ఈ మేరకు ఏపీ ఇంధనపొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి సంబంధిత వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇంధనపొదుపు అమలులో ప్రపంచబ్యాంక్ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం లభించిదని, తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచబ్యాంక్ ఎగ్జికూటివ్ డెరైక్టర్ సుభాష్‌చంద్ర గార్గ్ ఇంధన పొదుపుపై వరల్డ్‌బ్యాంక్ రూపొందించినర్యాంకుల నివేదికను ప్రకటించారని, 650 మెగావాట్ల ఇంధన పొదుపు వల్ల రాష్ట్రంలో గడిచిన రెండేళ్ళలో 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయినట్టు గుర్తించారని, అందుకే ఏపీకి ఫస్ట్ ర్యాంక్ దక్కిందని ప్రకటనలో పేర్కొన్నారు. -
సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు
-
సరళ వ్యాపార సూచీలోభారత్కు 130వ స్థానం: ప్రపంచబ్యాంక్
వాష్టింగ్టన్: ఎటువంటి ఇబ్బందులూ లేకుండా దేశంలో వ్యాపార నిర్వహణ సరళత విషయంలో భారత్‌కు 130వ ర్యాంక్ లభించింది. గత ఏడాది ర్యాంకునే కొనసాగిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ వార్షిక నివేదిక తెలియజేసింది. అయితే గతంకంటే భారత్‌లో వ్యాపార నిర్వహణా పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్న నివేదిక, తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల చర్యలు, వృద్ధికి దోహదపడేవిగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటలైజేషన్, విద్యుత్ సరఫరా, తయారీ రంగానికి మద్దతు వంటి అంశాలకు సంబంధించి దేశం గడచిన రెండేళ్లలో వేగవంతమైన సంస్కరణల చర్యలను ప్రారంభించిందని పేర్కొంది. ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వం భారత్ వ్యాప్తంగా వ్యాపార నిర్వహణా పరిస్థితులు మార్చాల్సిన అవసరంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని వివరించింది. వ్యాపారం ప్రారంభం, అనుమతులు, విద్యుత్, ప్రోపర్టీ రిజిస్ట్రేషన్, రుణ సౌలభ్యం, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ, పన్ను చెల్లింపులు, విదేశీ వాణిజ్యం, సకాలంలో కాంట్రాక్టుల అమలు, దివాలా సమస్యల పరిష్కారం వంటి పది అంశాల ప్రాతిపదికన ప్రపంచబ్యాంక్ ర్యాంకింగ్ ఉంటుంది. కాగా ప్రపంచ బ్యాంక్ నివేదిక పట్ల కేంద్రం నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది ర్యాంక్ మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. -
భూసమీకరణపై ప్రపంచ బ్యాంకు విచారణ!
స్వతంత్రంగా ‘ఆస్కి’ ద్వారా వివరాలు సేకరిస్తున్న వైనం సాక్షి, అమరావతి: రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేస్తుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. అందుకు విరుద్ధంగా దాని తరఫున ఆస్కి(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి) అక్కడి గ్రామాల్లో విచారణ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. దీంతో విచారణ నిర్వహిస్తున్న వారిపై సీఆర్డీఏ అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా ఆస్కి బృందం ఆదివారం తమ రూటు మార్చుకుని ముందుగా నిర్ణయించిన గ్రామాలకు వెళ్లలేదు. ప్రపంచ బ్యాంకుకూ వాస్తవాలు తెలియకుండా ప్రభుత్వం మభ్య పెడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్ల రుణమివ్వాలని ఆరు నెలల కిందట సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై బ్యాంకు ప్రతినిధులు రెండుసార్లు విజయవాడకు వచ్చి సీఆర్డీఏ ఉన్నతాధికారులతో చర్చించి రుణమిచ్చేందుకు ప్రాథమికంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు తరఫున రెండురోజుల నుంచి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆస్కికి చెందిన ప్రొఫెసర్ రేష్మి నాయర్, డాక్టర్ లక్ష్మిలు రాజధాని గ్రామాల్లో తిరుగుతూ భూసమీకరణపై వివరాలు సేకరిస్తున్నారు. -
రెమిటెన్స్ లు తగ్గుతాయ్
ప్రపంచ బ్యాంక్ అంచనా వాషింగ్టన్: భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు ఈ ఏడాది తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. తక్కువ ముడిచమురు ధరలు సహా ఇండియాకు ఎక్కడి నుంచైతే రెమిటెన్స్ అధికంగా వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లోని బలహీనమైన ఆర్థిక వృద్ధే రెమిటెన్స్‌ల తగ్గుదలకు ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. ⇔ ఈ ఏడాది భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు 5 శాతం క్షీణతతో 65.5 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతాయి. ⇔ రెమిటెన్స్‌లు స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రపంచంలో రెమిటెన్స్‌లు స్వీకరణలో భారత్ టాప్‌లోనే కొనసాగుతుంది. ⇔ ఇండియా తర్వాతి స్థానంలో 65.2 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ల స్వీకరణతో చైనా రెండో స్థానంలో ఉంటుంది. ⇔ 20.3 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ల స్వీకరణతో పాకిస్తాన్ ఐదో స్థానంలో నిలువొచ్చు. ⇔ బంగ్లాదేశ్‌కు వచ్చే రెమిటెన్స్ల్లోనూ 3.5 శాతం క్షీణత నమోదు కావొచ్చు. ⇔ పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు వచ్చే రెమిటెన్స్‌లు వరుసగా 5.1 శాతం, 1.6 శాతం మేర పెరగొచ్చు. -
ఫార్ములాని మించి నిధులు ఇవ్వడానికి సిద్ధం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాషింగ్టన్: వినూత్నమైన ఆర్థిక సొల్యూషన్లను అందించడానికి ప్రపంచ బ్యాంక్ తన సభ్య దేశాలతో కలసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. భారత వృద్ధి సాధనలో సాధించిన ఎన్నో చెప్పుకోదగ్గ ఘన విజయాలకు ప్రపంచబ్యాంక్ తగిన తోడ్పాటునందించిందని ఆయన పేర్కొన్నారు. మూలధనం పెంపు కోసం అనుసరిస్తున్న డైనమిక్ ఫార్ములా(జీడీపీ ఆధారిత, అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని)కు మించి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌కు, ప్రపంచ బ్యాంక్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)ల వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన కెనడా నుంచి వాషింగ్టన్కు వచ్చారు. -
ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు
భారత్‌లో 69 శాతంగా ఉంటుంది: ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్: ఆటోమేషన్తో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇది చైనాలో 77 శాతంగా ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయ ఆర్థిక విధానాలను టెక్నాలజీ పూర్తిగా మార్చేస్తుందని పేర్కొంది. వృద్ధిని పెంచుకునేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించింది. అయితే, భవిష్యత్తు ఆర్థిక విధానాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమో ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొంది. ‘ప్రపంచాన్ని టెక్నాలజీ సమూలంగా మార్చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, సంప్రదాయ ఆర్థిక విధానమైన వ్యవసాయం, తక్కువ స్థాయిలో తయారీ రంగం నుంచి పూర్తి స్థాయి పారిశ్రామిక దేశంగా మారిపోవడం అన్నది అన్ని వర్ధమాన దేశాలకు సాధ్యమయ్యేది కాదు’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌కిన్ అన్నారు. వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో పేదరికంపై జరిగిన చర్చా కార్యక్రమం సందర్భంగా జిమ్‌కిన్ ఈ అంశాలను వెల్లడించారు. కిమ్ ఏం చెప్పారంటే... ప్రపంచ బ్యాంకు పరిశోధన ప్రకారం ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయించుకోవడం) వల్ల భారత్‌లో 69 శాతం, చైనాలో 77 శాతం, ఇథియోపియాలో 85 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉంది. ఇదే గనుక వాస్తవ రూపం దాలిస్తే ఈ దేశాలు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతాయి. ఈ దృష్ట్యా ఆర్థికాభివృద్ధికి అందుబాటులో ఉన్న మార్గాలను అర్థం చేసుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. యాంత్రీకరణ, టెక్నాలజీలు సంప్రదాయ పారిశ్రామిక తయారీని దెబ్బతీశాయి. దీంతో మాన్యువల్ ఉద్యోగాలపై ప్రభావం పడింది. దీనికి ఏ దేశం కూడా అతీతం కాదు. భారత్‌లో చైల్డ్ స్టంటింగ్ (చిన్నారుల్లో ఎదుగుదల లోపం) 38.7 శాతంగా ఉంది. వీరంతా భవిష్యత్తు తరానికి ప్రతీకలు. వారిలో 40 శాతం మంది ప్రపంచ డిజిటల్ ఆర్థిక రంగంలో పోటీ పడలేకున్నారు. పక్కనే ఉన్న చైనా మాత్రం చైల్డ్ స్టంటింగ్‌ను చాలా కనిష్ట స్థాయికి తగ్గించిందని కిమ్ పేర్కొన్నారు. -
భారత జీడీపీ ఇకముందు బలంగానే
• ఈ ఏడాది 7.6%.. వచ్చే ఏడాది 7.7% • ప్రపంచ బ్యాంకు అంచనా వాషింగ్టన్: భారత జీడీపీ ఇక ముందూ జోరుగానే ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2016లో 7.6 శాతం, 2017లో 7.7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగం పుంజుకోవడం, ఉద్యోగుల వేతన సవరణలు వినియోగానికి ఊతమిస్తాయని... ఎగుమతుల నుంచి సానుకూల తోడ్పాటుతో పాటు ప్రైవేటు పెట్టుబడులు మధ్య కాలానికి కోలుకోవడం వంటివి వృద్ధికి మద్దతునిస్తాయని తెలియజేసింది. ఈ మేరకు దక్షిణాసియా ఆర్థిక రంగంపై ప్రపంచ బ్యాంకు తాజాగా ద్వైవార్షిక నివేదికను విడుదల చేసింది. భారత్‌లో పేదరికాన్ని వేగంగా తగ్గించటం, అన్ని వర్గాలనూ వృద్ధిలో భాగస్వాముల్ని చేయడం వంటి అనేక సవాళ్లున్నాయని బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. దక్షిణాసియా ప్రాంతం ప్రపంచ అభివృద్ధి కేంద్రంగానే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. చైనా మందగమనం, ఉద్దీపనలపై అనిశ్చితి తదితర వెలుపలి ఒత్తిళ్లలను సైతం తట్టుకుని నిలబడిందని పేర్కొంది. స్వల్ప కాలంలో సమస్యలు స్వల్ప కాలంలో వృద్ధి రేటును మందగింపజేసే సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొనడం, కమోడిటీ ధరల ఒడిదుడుకులు, ప్రపంచ వాణిజ్యంపై బ్రెగ్జిట్ ప్రభావం, చైనా ఆర్థిక రంగం మరింత నిదానించడం వంటివి ఆర్థిక రంగం కోలుకోవడాన్ని మరింత ఆలస్యం చేస్తాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. రెండేళ్లు ఇదే స్థాయిలో: ఐఎంఎఫ్ భారత్ జీడీపీ విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరింత సానుకూలతను వ్యక్తం చేసింది. గత అంచనాలను పెంచింది. భారత జీడీపీ వృద్ధి వేగంగా పెరుగుతోందని, 2016, 2017 సంవత్సరాల్లో 7.6 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ ఈ ఏడాది జూలైలో ప్రకటించిన వృద్ధి రేటు అంచనాల కంటే తాజా అంచనాలు 0.2 బేసిస్ పాయింట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
పాకిస్థాన్ కుటిలత్వం
న్యూఢిల్లీ: భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా పాకిస్థాన్‌కు వంకర బుద్ధి మారడంలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను దోషిగా చూపాలని కుతంత్రాలు పన్నుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని జీలం నది బేసిన్లో భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగ జలవిద్యుత్ కేంద్రంపై అభ్యంతరాలు ఉన్నాయని, తమ అభ్యంతరాలు వినడానికి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు రుణదాత అయిన ప్రపంచ బ్యాంకును ఇటీవల కోరింది. సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా భారత్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. ఒప్పందం ప్రకారమే ఈ 360 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక విషయాలు ఉన్నందున వివాదాల పరిష్కారానికి తటస్థ నిపుణుడిని నియమించాలని ప్రపంచ బ్యాంకును కోరింది. ఇరు దేశాలు తమ తమ అభ్యంతరాలను, వివరాలను గతనెల 27న వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకుకు సమర్పించాయని భారత అధికార వర్గాలు తెలిపాయి. న్యాయనిపుణుడి కన్నా ఇంజనీరింగ్ నిపుణుడైతే విషయాలు బాగా అర్థం చేసుకోగలడని ఆ వర్గాలు తెలిపాయి. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రాజెక్టు డిజైన్ ఉందని పాకిస్తాన్ ఫిర్యాదు చేయగా.. భారత్ దానిని పూర్తిగా ఖండించింది. ఈ ప్రాజెక్టుపై 2010లో అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా పాక్ ఫిర్యాదు చేసింది. 2013లో భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కడానికి పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. పాక్ ఫిర్యాదు చేసినా పనులు ఆగవని భారత వర్గాలు తెలిపాయి. -
‘సింధు’ సంధికి గండి?
1960లో అమెరికాయే సింధు నదీజలాల పంపిణీ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు ద్వారా మధ్యవర్తిత్వం నెరపింది. అదే అమెరికా ఇప్పుడు భూభాగాలు, అంతర్జాతీయ జలాల సమస్యలను(సింధు జలాల పంపిణీ) మీరూ మీరూ పరిష్కరించుకోవాలని నంగనాచిలా కోరుతున్నది. ఇంకా కశ్మీర్ సమస్య మీద మధ్యవర్తిత్వాలు నిర్వహించి వివాదం చల్లారి పోకుండా కూడా జాగ్రత్త పడింది. ప్రధాని మోదీ నీరు, నెత్తురు కలసి ప్రవహించలేవని చెబుతున్నారు. కానీ ఉపఖండ వాసులంతా రక్తసంబంధీకులేనని మరచిపోరాదు. ‘పగ సాధింపు చర్యలు కట్టిపెడితే నిన్నటి శత్రువు నేడు మిత్రుడవుతాడు’ మహాత్మా గాంధీ ‘చూడబోతే ఇండియా, పాకిస్తాన్‌లు యుద్ధ మనస్తత్వంతో ముందుకు సాగుతున్నట్టుంది. ఈ సన్నద్ధత యుద్ధాన్ని ఎదుర్కొనడానికి జరిపే సన్నద్ధత అన్న భావంతో కాదు. అలా అని ఒకవేళ యుద్ధమే వస్తే సిద్ధంగా ఉన్నామన్న భావనతోనూ కాదు. కానీ నిజంగా మన రెండు దేశాలు యుద్ధాన్ని కోరుకుంటున్నాయా అన్నట్టుగా యుద్ధ మనస్తత్వం ఏదో ఆవహించినట్టు తోస్తోంది. ఈ సందర్భంగా రష్యన్ మహా రచయిత లియో టాల్‌స్టాయ్ మాటలని మనం రాజ్యాంగం పంచుకుంటోంది. ఆయన ప్రసిద్ధ రచన ‘యుద్ధము- శాంతి’. మన రాజ్యాంగంలోని యూనియన్ బాధ్యతలను నిర్దేశించే ‘ఎంట్రీ-15’ అనే అంశం ఉంది. దీనర్థం- కేవలం యూనియన్ ప్రభుత్వమే యుద్ధాన్ని ఎప్పుడు ప్రకటించాలో, శాంతిని తిరిగి ఎప్పుడు నెలకొల్పాలో నిర్ణయించే శక్తి అని’. గోపాలకృష్ణ గాంధీ (బెంగాల్ మాజీ గవర్నర్, చరిత్రకారుడు) ఈ హెచ్చరిక చేస్తూనే గోపాలకృష్ణ గాంధీ యూనియన్ జాబితాలో ‘యుద్ధము-శాంతి’ అనేది ఒక ఎంట్రీగా నమోదై ఉండవచ్చుగానీ; మనం మరొక యుద్ధాన్ని కూడా ఎదుర్కొనవలసిన అవసరం ఉందనీ- అదే యుద్ధ పిపాసకూ, యుద్ధాన్ని ప్రేరేపించే మనస్తత్వానికీ కూడా వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ యుద్ధ పిపాస వల్ల ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకే కాకుండా, చాలా ఇతర అంశాలకు గండిపడింది. ఉపఖండ విభజన ఫలితంగా వేర్వేరు దేశాలుగా అవతరించిన ఈ రెండు భూభాగాల మధ్య సాధారణ సంబంధాలకూ, వాణిజ్య సంబంధాలకూ ఆరు దశాబ్దాలుగా పడిన అగాధం పూడే అవకాశం రావడం లేదు. ఈ విష పరిణామం ఎక్కడికి దారితీసింది? సాగుకూ, తాగేందుకూ అందవలసిన నదీజలాల పంపిణీని స్తంభింప చేసే స్థితికి తీసుకువెళుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ ఎలా ఛిన్నాభిన్నమైందో భారత్, పాక్‌ల మధ్య కూడా సింధు నదీజలాల పంపిణీ వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఆంగ్లో- అమెరికన్ కుట్ర దేశ విభజన ఫలితం మన రెండు దేశాలకే కాదు, నిజానికి ఉపఖండానికే కాదు, ఆసియా ఖండానికే ప్రమాదకరంగా పరిణమించింది. ఈ పరిణామానికి కేంద్ర బిందువు కశ్మీర్ సమస్య అని అంతా గ్రహించాలి. సింధు నదీజలాల పంపిణీ మీద రెండు దేశాల మధ్య 1960లో కుదిరిన ఒప్పందాన్ని అమలు పరచడం ఉభయ దేశాల ప్రజా బాహుళ్యాల విశాల ప్రయోజనాలకు ఎంతో ప్రధానమని గుర్తించాలి. దేశాల మధ్య కుమ్ములాటలకు, ప్రాబల్యం కోసం ఏర్పడే స్పర్థలకు అతీతంగా ఈ అంశాన్ని గుర్తించాలి. కశ్మీర్ సమస్య రావణకాష్టంలా మండుతూ ఇప్పటికీ చల్లారకుండా ఉండడానికి దారితీసిన కారణాలలో ఒకటి- ఇరు దేశాల పాలకులను స్వతంత్రశక్తులుగా ఎదగకుండా, వారు తమ చేతులు దాటిపోకుండా నొక్కి ఉంచడంలో ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదశక్తుల ఎత్తుగడలు చాలావరకు సఫలం కావడమే. ఇంకా చెప్పాలంటే, విభజనకు బీజాలు వేయడం, తద్వారా భారత్, పాక్‌ల మీద తమ పట్టు సడలకుండా ఆంగ్లో-అమెరికన్లు పన్నిన వ్యూహ రచనలో భాగమే కశ్మీర్ సమస్య. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం అమెరికా పన్నిన వ్యూహంలో ‘గుర్తు తెలియని ఉగ్రవాదుల’ వేట (ఈ విషయం మీద ఈ రోజుకీ అమెరికాలో భిన్నస్వరాలు ఉన్నాయి)లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరంభించిన ఉద్యమంలో ఏ దేశం, ఏ పాలకుడు భాగస్వాములు కాకుండా మిగిలారో వారిని కూడా టైస్టులుగా పరిగణిస్తామని అమెరికా పరంపరగా ప్రకటనలు జారీ చేసింది. ఆ మిష మీదే అఫ్గానిస్తాన్, ఇరాక్‌ల మీద భీకరమైన మెరుపుదాడులు చేసి, లక్షల సంఖ్యలో సాధారణ ప్రజలను చంపిన వైనాన్ని ప్రపంచం వీక్షించింది. ఆ తరువాత ఆ రెండు దేశాలను అమెరికా తన స్థావరాలుగా మార్చుకుంది. మొదట సైనిక శిబిరాలతో నింపేసింది. వీటిని మొదట తొలగిస్తానని ముహూర్తం పెట్టి, తరువాత సాధ్యం కాదని మొండికేసింది. కాబట్టి కశ్మీర్లో అమెరికా అడుగుపెట్టడానికి కూతవేటు దూరమే మిగిలింది. అసలు కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి ఆవరణలోకి ఈడ్చుకువెళ్లినవాళ్లు భారత్-పాక్ నేతలే. అక్కడ నుంచి ఉపసంహరించుకోవడానికి రెండుదేశాలు జరిపిన యత్నాలు అత్యంత పేలవమైనవి. ఇవి జగమెరిగిన సత్యాలు. కానీ, సమితి పరిధి నుంచి ఫిర్యాదులు ఉపసంహరించుకునే దాకా భారత్, పాక్ సంబంధాలు కశ్మీర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్న సంగతి విస్మరించరాదు. ఇక మన రెండుదేశాల పాలనా వ్యవస్థలకు ఆయుధ వ్యాపారులుగా మారిన ఆంగ్లో-అమెరికన్లు, రష్యన్లు, చైనీయులు భారీ స్థాయిలో అటూ ఇటూ ఆయుధాలు అందిస్తూనే ఉంటారు. ఆసియా దేశాల మధ్య మైత్రీ సంబంధాలు చెడగొట్టే తీరులోనే ఆయుధ వ్యాపారులు వ్యవహరిస్తారు. మన బంగారం మంచిదైతే అన్న సామెత చందంగా నెపాన్ని ఎదుటివారి మీద నెట్టడం అసాధ్యం. విదేశీ పెట్టుబడులపైన, విదేశీ ఆయుధ సంపత్తిపైన ఆధారపడి ఉన్నంతకాలం ఈ బెడద తప్పదు. సింధు జలాల ఒప్పందం-నేపథ్యం 1960లో అమెరికాయే సింధు నదీజలాల పంపిణీ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు ద్వారా మధ్యవర్తిత్వం నెరపింది. అదే అమెరికా ఇప్పుడు భూభాగాలు, అంతర్జాతీయ జలాల సమస్యలను(సింధు జలాల పంపిణీ) మీరూ మీరూ పరిష్కరించుకోవాలని నంగనాచిలా కోరుతున్నది. ఈ అమెరికాయే కశ్మీర్ సమస్య మీద మధ్యవర్తిత్వాలు నిర్వహించి వివాదం చల్లారిపోకుండా నిన్న, నేడు కూడా జాగ్రత్త పడింది. ప్రథమ ప్రధాని నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఇరువురూ సామరస్య ధోరణితోనే నాడు సింధు నదీజాలాల పంపిణీ సంధి మీద సంతకాలు చేశారు. కానీ ఇరుదేశాల సరిహద్దులు శాశ్వత ప్రాతిపదికన ఖరారు కాకుండా ‘వాస్తవాధీన సరిహద్దు’గా మాత్రమే మిగిలి ఉన్నంతకాలం పరస్పర ఉల్లంఘనలూ, ఉద్రేకాలూ సమసిపోవని రుజువు చేస్తూ తాజాగా సింధు నదీజలాల పంపిణీ వ్యవస్థ మీద ఉద్రేకాలు, ఉగ్రవాదాలు ప్రబలుతున్నాయి. ఉభయత్రా పెరిగిన ఈ ఉద్రిక్తతలు ఉభయ దేశాల ప్రజలకూ, శాంతికీ కూడా విఘాతమే. కాబట్టి కశ్మీర్ సమస్య మూలంగా ఏర్పడిన అస్పష్ట సరిహద్దులు, తాత్కాలిక వాస్తవాధీన రేఖ చెరిగిపోయి సామరస్య పూర్వకంగా శాశ్వత పరిష్కారం కుదిరేదాకా 57 ఏళ్లుగా ఉన్న సింధు నదీజాలాల పంపిణీ ఒప్పందానికి పాలకులు తూట్లు పొడవడం సరికాదు. ప్రజలకు అన్యాయం చేయడం మంచిదికాదు. నీరూ, నెత్తురూ... బియాస్, సట్లెజ్, సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నదీజల వ్యవస్థను రెండు దేశాల మధ్య సహృద్భావం దృష్ట్యా పరస్పర ప్రయోజనాలు దెబ్బతినకుండా గరిష్ట స్థాయిలో వాడుకోవాలని ఒప్పందం ఆదేశించింది. ఏదో వియన్నా కన్వెన్షన్ 64వ అధికరణ ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ఏ దేశమైనా ఉపసంహరించుకోవచ్చునని, భట్టిప్రోలు పంచాయతీ లాంటి అవకాశం ఉందని చెప్పి ఉభయ దేశాల పాలకులు తలచరాదు. సింధు వ్యవస్థలో తూర్పున ఉన్న నదులను మనమూ, పశ్చిమాన ఉన్న నదీజలాల వ్యవస్థను పాకిస్తాన్ పూర్తిగా వినియోగించుకోవచ్చునని సింధు సంధి చెప్పింది. మనదేశం వాడుకోగలిగిన 20 శాతం వాటాను సాగు,తాగు, రవాణా, విద్యుదుత్పాదన ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆ వాటాలో మనం వినియోగించుకుంటున్నది నాలుగు శాతమే. రావి, బియాస్, సట్లెజ్ వాటి ఉపనదులు కలసి తూర్పు నదులుగానూ, సింధు, జీలం, చీనాబ్ వాటి ఉప నదులు కలిపి పశ్చిమ నదులుగానూ ఏర్పడగా 1960 నాటి ఒప్పందం కింద తూర్పు నదుల నీటి వనరులను మనం పూర్తిగా వాడుకోవచ్చు. సగటున ఏడాదికి ఈ తూర్పు నదులలో 3 కోట్ల, 30 లక్షల ఎకరా అడుగుల నీరు (అమెరికా కొలమానాల ప్రకారం 3,26,000 గ్యాలెన్ల నీటిని ఒక ఎకరా అడుగు నీరుగా లెక్కిస్తారు) ప్రవహిస్తుంది. పశ్చిమ నదులలో సగటున ఏడాదికి 13 కోట్ల 50 లక్షల ఎకరా అడుగుల జలరాశి ప్రవహిస్తూ ఉంటుంది. మన దేశంలో ఈ పశ్చిమ నదులలో నిల్వ ఉంచదగినంత జలరాశి లేదు. కాబట్టి పారే నీటిని ఆపలేకపోతున్నామని నిపుణుల అంచనా. ఇక నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి: మరుసాదర్ (చీనాబ్‌కు ఉపనది, కిస్త్నార్ జిల్లా), ఉదమ్‌పూర్‌లో జీలం నది మీద సవాల్కోట, చీనాబ్ మీద బుర్స్వార్ డ్యామ్‌లు, జల విద్యుదుత్పత్తి కోసం డ్యాములు. వీటిని మనం నిర్మించుకోగలిగితే నీటిని అవసరాలకు నిల్వ చేసుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ నదుల జలవిద్యుత్ ఉత్పాదన శక్తి 18,653 మెగావాట్లట. మనం జీలం నది మీద తుల్బుల్ బ్యారేజీ, కిషన్‌గంగ మీద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రయత్నిస్తే పాక్‌కు అభ్యంతరం. ఇలా చిన్న చిన్న విభేదాలు మినహా 56 ఏళ్లుగా సింధు నదీజలాల పంపిణీ సంధి ప్రకారం శాంతియుతంగా సాగుతూ ఉంటే ఇప్పుడు రాజకీయులు వేలుపెట్టి చెడగొట్టే కుట్రను ప్రజలు సహించరాదు. ప్రధాని నరేంద్రమోదీ ఒక పక్క భవిష్యత్తులో జరిగేవి నీటి యుద్ధాలే అంటూ, నీరు, నెత్తురు కలసి ప్రవహించలేవని కూడా చెబుతున్నారు. కానీ ఉపఖండ వాసులంతా రక్తసంబంధీకులేనని మరచిపోరాదు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రపంచబ్యాంకును ఆశ్రయించిన పాక్
-
ప్రపంచబ్యాంకును ఆశ్రయించిన పాక్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేస్తుందని కథనాలు వస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. ఎలాగోలా భారతదేశాన్ని ఈ ఒప్పందం రద్దు చేసుకోనివ్వకుండా చూడాలని కోరింది. పాకిస్థాన్ అటార్నీ జనరల్ అష్తర్ ఔసఫ్ అలీ నేతృత్వంలో కొందరు సీనియర్ అధికారులు కలిసి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అంతర్జాతీయ కోర్టుకు కూడా పాకిస్థాన్ వెళ్లినట్లు జియో న్యూస్ వెల్లడించినా.. దానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. నీలం, చీనాబ్ నదులపై భారతదేశం కడుతున్న కిషన్‌గంగ, రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ ఆగస్టు 19వ తేదీన ఒక లేఖ రాసింది. అంతర్జాతీయ కోర్టులో ప్రపంచ బ్యాంకుకు కూడా ప్రధాన పాత్ర ఉంది. ముగ్గురు జడ్జీలను ప్రపంచబ్యాంకు నియమించుకోవచ్చు. ప్రతి దేశం ఇద్దరు ఆర్బిట్రేటర్లను నియమించుకునే అవకాశం ఉంది. జడ్జీలను త్వరగా నియమిస్తే.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని త్వరగా ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రపంచ బ్యాంకు అధికారులకు పాక్ అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే.. తగిన సమయంలోనే తాము చేయాల్సిన పని చేస్తామని ప్రపంచబ్యాంకు చెప్పినట్లు సమాచారం. అయితే.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తుండటంతో.. సాధారణంగా జరగాల్సిన వ్యవహారాలన్నీ ఆలస్యం అవుతున్నాయని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సల్మాన్ హైదర్ చెప్పారు. ఉడీలో జరిగినది చాలా పెద్ద ద్రోహమని, కనీసం ఆ ఘటనను పాకిస్థాన్ ఖండించలేదని ఆయన అన్నారు. అలాంటిది మన కట్టడాలపై వాళ్లు ఇష్టం వచ్చినట్లు కోర్టుకు వెళ్లినంత మాత్రాన ప్రయోజనం ఉండదని చెప్పారు. -
జిమ్ యాంగ్ కిమ్ కే మళ్లీ పట్టం
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా జిమ్ యాంగ్ కిమ్(56) తిరిగి నియమితులయ్యారు. కిమ్ ను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బోర్డు తెలిపింది. కొరియన్ అమెరికన్ అయిన కిమ్ 2012 లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2017 జులైతో ముగియనుంది. తనను రెండోసారి ఎన్నకున్నందుకు కిమ్ ధన్యవాదాలు తెలిపారు. -
అమరావతికి రూ. 3,324 కోట్ల రుణం!
-
అమరావతికి రూ. 3,324 కోట్ల రుణం!
ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: అమరావతిలో 65 కిలోమీటర్ల మేర సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు ప్రపంచబ్యాంకు రూ. 3,324 కోట్ల రుణం మంజూరు చేయనుంది. ఈ మేరకు ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. మరో రూ. 1,425 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా సమకూర్చుకొని మొత్తం రూ. 4,749 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టనుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రపంచ బ్యాంకు నిధులను మంజూరు చేయనుంది. ప్రాజెక్టు కాలవ్యవధిని 2019గా నిర్ధారించారు. -
అమరావతికి వరల్డ్ బ్యాంకు అప్పు
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు రూ.3,324 కోట్ల రుణం మంజూరు చేయనుంది. అమరావతిలో రహదారులు, వరద నియంత్రణ, నేలపాడు గ్రామంలో వసతుల కోసం ప్రపంచబ్యాంకు రూ.3,324 కోట్ల రుణం ఇవ్వనుంది. ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. 65 కిలోమీటర్ల మేర సబ్-ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో కలిపి మొత్తం రూ.4,749 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.3,324 కోట్లను రుణంగా సమకూర్చుతుంది. మిగతా 1,425 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి నిధులను ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది. ప్రాజెక్టును 2019 కల్లా పూర్తిచేయాలని నిర్ధారించారు. ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఆమోదం కూడా తెలిపింది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను బడ్జెట్లో కేటాయించనున్నారు. అక్కడి నుంచి సీఆర్డీఏకు విడుదల చేస్తారు. సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ఖాతాలో ఆ నిధులను ఉంచుతుంది. ఆ ఖాతా నుంచి కన్సల్టెంట్లు, సిబ్బంది జీత భత్యాలకు అవసరమైన నిధులను విడుదల చేయనున్నారు. -
ఈ చిన్న లాజిక్ కూడా మరిచారా...బాబుగారూ
ప్రత్యేక హోదా వస్తే అప్పుల్లో 90 శాతం కేంద్రమే భరిస్తుంది ఇందులో రూ.26,253 కోట్లు విదేశీ సంస్థల నుంచి రుణం ప్రత్యేక హోదా ఇస్తే–ఇందులో 90 శాతం కేంద్రమే భరిస్తుంది అంటే 23,628.33 కోట్లు కేంద్రం భరిస్తుంది–రాష్ట్రం కేవలం రూ.2623.37 కోట్లే భరిస్తే చాలు రూ.11,525 కోట్లు రాష్ట్ర సర్కారు వాటా కేంద్రం వద్ద పెండింగ్‌లో 13 విదేశీ అప్పు ప్రాజెక్టులు హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం భారీ ఎత్తున విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 ప్రాజెక్టులను రూపొందించింది. ప్రపంచ బ్యాంకుతో పాటు జైకా, తదితర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 37,778.80 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇందులో విదేశీ సంస్థల నుంచి 26,253.71 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో ఈ అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం భరిస్తుంది. రాష్ట్ర సర్కారు పది శాతం భరిస్తే సరిపోతుంది. 26,253.71 కోట్ల రూపాయల అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం 23,628.33 కోట్ల రూపాయలు భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2623.37 కోట్లు భరిస్తే సరిపోతుంది. ఐదేళ్ల పాటు అమలయ్యే ఈ విదేశీ ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా వర్తింప చేస్తే రాష్ట్రంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తరువాత, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆధారంగాను, అలాగే వ్యయం చేసే సామర్ధ్యం ఆధారంగా ఆమోదం తెలుపుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వ్యయం చేసే సామర్ధ్యంతో పాటు తిరిగి రుణాలు చెల్లించే సామర్ధ్యాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకునే ఎంత వరకు ఏ ప్రాజెక్టులకు అనుమతించాలో నిర్ధారిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా చేపట్టేందుకు 13 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మొత్తం 13 ప్రాజెక్టుల వ్యయం రూ.37,778.80 కోట్లు కాగా ఇందులో విదేశీ సంస్థల రుణం రూ.26,253.71 కోట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భరించనున్న వాటాగా రూ.11,525.09 కోట్లుగా పేర్కొన్నారు. ఈ 13 ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయంలో 70 శాతం మేర విదేశీ సంస్థల నుంచి రుణంగా తీసుకుంటుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 30 శాతం భరించనుంది. -
‘ఈ–పోస్’ పనితీరును పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం
ఆగిరిపల్లి : మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో ఈ–పోస్ మిషన్ల పనితీరును ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గౌసియాబేగం, తహసీల్దార్ సీహెచ్ ఉమామహేశ్వరరావును పింఛన్ల పంపిణీ చేసే విధానం, ఎన్ఆర్ఈజీఎస్ అమలు జరుగుతున్న తీరు, రేషన్ పంపిణీ విధానం, ఎరువుల దుకాణాల్లో పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్రం సెంటర్లో గల ఎరువుల దుకాణంలో ఈ–పోస్ విధానం ద్వారా ఎరువుల పంపిణీని దుకాణదారుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు సునీతచోప్రా, వసుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారిణి బి.త్రివేణి, ఏపీవో రాజు, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డైరెక్టర్‌గా జునైద్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డైరెక్టరుగా జునైద్ అహ్మద్ నియమితులయ్యారు. ఒన్నో రుహల్ నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో అతని స్థానంలో అహ్మద్‌ను నియమించారు. అహ్మద్ బంగ్లాదేశ్ జాతీయుడు. అహ్మద్ సమర్థవంతంగా పనిచేయగలడని ప్రపంచ బ్యాంక్ గ్రూపు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని పేర్కొన్నారు. అహ్మద్ 1991లో ప్రపంచ బ్యాంకులో చేరారని, అనేక విభాగాల్లో ఆయన పనిచేశారని ఆయన వివరించారు -
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల అసంతృప్తి
* ఏపీఎండీపీ పథకం పనుల పరిశీలన * డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం గుంటూరు (నెహ్రూనగర్): ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీఎండీపీ (ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్లాన్) పథకం కింద గుంటూరు నగరంలో జరుగుతున్న పనులను ప్రపంప బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. ఉండవల్లి, నులకపేట, మంగళగిరి పంపుహౌస్, తక్కెళ్లపాడు, తక్కెళ్ళపాడు పంపింగ్ హౌస్, నేషనల్ హైవే, తక్కెళ్ళపాడు చెరువు, మానస సరోవరం ప్రాంతంలలో నాగార్జున కంపెనీ చేపట్టిన 42 ఎంఎల్డీ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను పరిశీలించారు. పనులు ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి వద్ద 1.5 కిలోమీటర్ల మేర ప్లాంట్ వరకు పైపులైను వేయుటకు స్థల సేకరణకు అడ్డంకులను త్వరితగతిన అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. నగరంలో 18 రిజర్వాయర్లు, 14 సంపుల నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని కూడా వేగవంతం చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లపై ఆగ్రహం.. అనంతరం పాతగుంటూరులో మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపట్టిన పైపులైను ఇంటర్ కనెక్షన్, ఇంటింటికి ట్యాపు కనెక్షన్ల పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ఈ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరగుతుండటంతో ఏపీఎండీపీ ప్రాజెక్టు డైరెక్టర్ రాంనారాయణరెడ్డి కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంజినీరింగ్ అ«ధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు టాస్క్‌ఫోర్స్ టీమ్ లీడర్ రఘుకేశవ, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ డాక్టర్ మోహన్, సీనియర్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ ఐ.యు.బి.రెడ్డి, నగరపాలకసంస్థ ఎస్ఈ గోపాలకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు
ఏలూరు (మెట్రో) : ప్రపంచ బ్యాంక్ నిధులతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకున్నామని విద్యుత్ పంపిణీ సంస్థ వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ రమేష్ ప్రసాద్ తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విధ్యుత్ పంపిణీ సంస్థ) ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్పు చేసి నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించామన్నారు. అంతే కాకుండా కొత్తలైన్లు ఏర్పాటు చేసి గృహ వినియోగానికి, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులందరూ ఉత్తమ పనితీరు చూపించి జిల్లాకు ఉన్నత పేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కొత్తగా జిల్లాలో సబ్‌స్టేçÙన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ కేవీసీహెచ్ పంతులు, డీఈటీ కె.రఘునాథ్‌బాబు, ఏడీ అంబేడ్కర్ పాల్గొన్నారు. -
అగ్రస్థానాలు కోల్పోయిన తెలంగాణ, ఏపీ
సులభ వాణిజ్యం ర్యాంకుల్లో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు సులభ వాణిజ్యం (ఈవోడీబీ)లో కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల విభాగం (డిప్) ఇచ్చే తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి మూడు, నాలుగో స్థానాలకు తగ్గాయి. తాత్కాలిక ర్యాంకుల్లో కొంతకాలంగా తెలంగాణ మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈవోడీబీపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన 340 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్రాలు డిప్‌కు తమ సమాధానాలు సమర్పించాయి. ఆ సమాధానాల్లో సవరణలకు ఆగస్టు 16వ తేదీ వరకు గడువు పొడిగించారు. తాజాగా గురువారం ప్రకటించిన తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ 61.45 స్కోరుతో మూడో స్థానంలో, ఏపీ 56.05 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాయి. 63.72 స్కోరుతో ఉత్తరాఖండ్ తొలిస్థానంలో, 62.94 స్కోరుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కసరత్తు పూర్తి చేసి తుది ర్యాంకులు ప్రకటించేందుకు డిప్ సన్నాహాలు చేస్తోంది. అప్పటి వరకు తాత్కాలిక ర్యాంకుల్లో తరచూ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. -
ఆర్థిక గండాన్ని అధిగమించిన భారత్
మన అవసరాలను, అవకాశాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లినంత కాలం అంతర్జాతీయంగా ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా మనపై పెద్దగా ప్రభావం చూపలేవు. ఎదుగుతున్న భారత్ సమర్థతను గుర్తించి సుపరిపాలనను అందించడమే ప్రస్తుత కర్తవ్యం. ప్రధాని మోదీ చేస్తున్నది కూడా అదే. బ్రెగ్జిట్.. ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేసిన ఈ అంతర్జాతీయ పరిణామం తాలూకు భయాలు, అనుమానాలు మనదేశాన్నీ ప్రభావితం చేశాయి. కానీ, మనదేశ మార్కెట్లు, ఆర్థిక రంగం అందరూ ఊహించినట్లుగా భారీ పతనాన్ని చవిచూడలేదు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సైతం మన దేశ పనితీరును ఈ సందర్భంగా అభినందించటం గమనార్హం. మరి ఆర్థిక విశ్లేషకుల అంచనాలన్నీ ఎందుకు తప్పయ్యాయి? ఆరు దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, నెహ్రూ కుటుంబం కానీ దేశాన్ని అభివృద్ధి చేయ లేకపోయింది. ప్రాచీన కాలం నుంచి మనకు అంత ర్లీనంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను మనం సరిగ్గా వాడు కోలేదు. మన సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని మన నైపుణ్యాలకు మెరుగులు దిద్ది ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను ఏనాడూ పట్టించు కోలేదు. కానీ, రెండేళ్లలో ప్రధాని మోదీ ఈ దిశగా చర్యలు చేపట్టిన ఫలితమే మన దేశానికి అంతర్జాతీయ ఆర్థిక పతనాల నుంచి లభిస్తున్న రక్షణ. మన దేశంలో సగం మందికి జీవనోపాధి వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. కానీ, వ్యవసాయంలో వృద్ధి మాత్రం ఆశించినంత లేదు. సాగు లాభసాటిగా మారితే, రైతులకు చేతినిండా డబ్బు అందితే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం సస్యశ్యామలం అవుతుంది. అందుకే నరేంద్ర మోదీ రైతుల ఆదాయాన్ని పెంచేం దుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి పొలానికీ నీరు ఇచ్చేందుకు ‘క్రిషి సించాయి యోజన’ ద్వారా జలా శయాల నిర్మాణం, ‘హర్ ఖేత్ కో పానీ’ నినాదంతో కాల్వల నిర్మాణం, నదుల అనుసంధానం చేపడుతు న్నారు. సంప్రదాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయా నికి నిధులిస్తున్నారు. మనదేశ ఆశాకిరణాలు యువతీయువకులే. ఆ ఆశాకిరణాల భవిష్యత్తు ఏంటి? మన దేశంలో బీఏ, బీకాంలకు ఇంకా విలువ ఉందా? పోనీ బీటెక్, ఎంటెక్ చేస్తే జాబ్ గ్యారంటీయా? మరి మన యువత దేశానికి ఎలాంటి భవిష్యత్తునిస్తారు? 20 ఏళ్లు కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవచ్చు. కానీ, 20 వారాలు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటే జీవనోపాధికి ఢోకా ఉండదు. కంప్యూటర్ కోర్సు, షార్ట్హ్యాండు నుండి వెల్డింగ్, ప్లంబింగ్ వరకు ఎలాంటి స్కిల్ అయినా కొన్ని నెలల్లోనే మెరుగులు దిద్దుకోవచ్చు. అందుకే మోదీ స్కిల్ డెవలప్ మెంట్‌కు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. రాబోయే ఏడేళ్లలో 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని 30 కోట్లమంది విద్యార్థులను భవిష్యత్ తారలుగా తీర్చిదిద్దేలా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెటాలని మోదీ భావిస్తున్నారు. మనదేశ జనాభా 126 కోట్లు. నగరాలు, పట్టణాలు 4 వేలు. మన దేశంలో పట్టణాలు, నగరాలు అవ్యవ స్థలకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. వాటిని చక్కదిద్దేం దుకు మోదీ నడుం బిగించారు. ఐదేళ్లలో వంద స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని ప్రారంభించటం, అమృత్, హెరిటేజ్ పథకాల ద్వారా 4 వేల పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టారు. దీని ద్వారా పట్టణాలకు రూ. లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మన దేశంలో కనీస మౌలిక సదుపాయాలైన... నివాసం, విద్యుత్, రోడ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేవు. మారిన జీవన విధానాల కారణంగా ఇంటర్నెట్, మొబైళ్లు, రవాణా సదుపాయాలు కూడా అందరికీ అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు, అన్ని గృహాలకూ నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రతి గ్రామానికీ రోడ్డు పథకాలను చేపట్టింది. డిజిటల్ ఇండియా పథకం ద్వారా ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తోంది. దేశంలో మరింత మెరుగైన జాతీయ రహదారుల్ని నిర్మిస్తోంది. రైల్వేలు ఇప్పుడు సరైన దిశలో పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్టుల్ని నిర్మించే సరికొత్త ఆలోచ నకు శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక రంగానికి కావాల్సినవి.. నిరంతర విద్యుత్, నాణ్యమైన కార్మికులు, సులభమైన నిబంధ నలు, అందుబాటులో ముడి వనరులు. మోదీ హయా ంలో మన దేశం విద్యుత్ మిగులు సాధించనుంది. కార్మిక సంస్కరణలు చేపట్టి అటు పరిశ్రమలకు, ఇటు కార్మికులకు మేలు చేస్తోంది. ఇక బొగ్గు, ఇనుము, గ్యాస్ వంటి వనరుల కేటాయింపుల్లో గత ప్రభుత్వాల అవినీతిని కడుగుతూ పారదర్శకంగా కేటాయింపులు చేస్తోంది. భారత్‌లో సునాయాసంగా వ్యాపారం చేసు కునే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోంది. కాబట్టే, మేకిన్ ఇండియా పథకంలో భాగంగా మన దేశానికి చైనాను మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. మన తలసరి ఆదాయం తక్కువ. ఖర్చు పెట్టగల స్తోమత తక్కువ. మన అవసరాలు ఎక్కువ. అవకాశాలు తక్కువ. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లినంత కాలం అంతర్జాతీయంగా ఎన్ని ఆర్థిక ఒడిదు డుకులు వచ్చినా మనపై పెద్దగా ప్రభావం చూపలేవు. దేశం ఎదగాలంటే శక్తి సామర్థ్యాలను గుర్తించి.. వాటికి మెరుగులు దిద్ది, వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, సమ ర్థవంతమైన పాలన అందిస్తూ ముందుకెళ్లాలి. మోదీ చేస్తోంది కూడా అదే. ఒక్క మాటలో చెప్పాలంటే గత రెండేళ్లలో నరేంద్ర మోదీ ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగానూ భారతదేశ ప్రతిష్టను ఇనుమ డింపజేశారు. పెట్టుబడిదారుల్లోను, పరిశ్రమల్లోనూ విశ్వాసం పెంచారు. వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త - పురిఘళ్ల రఘురామ్ ఈమెయిల్ : raghuram.bjp@gmail.com -
ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవే!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ - తెలంగాణ సమాచారాన్ని ఏపీ చోరీ చేసిందనడం హాస్యాస్పదం - గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానం, తెలంగాణది 13వ స్థానం - ఈసారి కూడా అధమ స్థానంలో నిలుస్తామనే కేటీఆర్ ఆరోపణలు సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింట్ బిజినెస్(ఈవోబీడీ) విధానంలో డీఐపీపీ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్), ప్రపంచ బ్యాంకు ర్యాంకు కోసం తమ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా చోరీ చేసిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కొట్టిపారేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది డీఐపీపీ ప్రకటించిన ర్యాంకుల్లో ఈవోబీడీలో గుజరాత్ 71.14 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, 70.12 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. 42.45 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ సర్కార్ సమాచారాన్ని రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చౌర్యం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఈ ఏడాదీ అధమ స్థానంలో నిలుస్తామనే భావనతోనే తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు ఇప్పటినుంచే సాకులు వెతుక్కుంటూ చంద్రబాబు సర్కార్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈవోబీడీ విధానంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం తెలంగాణ సర్కార్‌కు ఎలా తెలి సిందని ప్రశ్నించారు. కేవలం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేస్తేనే తమ ప్రభుత్వం కేంద్రానికి ఏ ప్రతిపాదనలు ఇచ్చిందన్నది తెలుస్తుందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు. ఆధార్, పాన్, మొబైల్ నెంబర్లు వంటి వివరాలతో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పోర్టల్ సమగ్రంగా ఉందని.. తొమ్మిది వేల లావాదేవీలు జరిపిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అసమగ్రంగా ఉన్న వారి పోర్టల్ ద్వారా ఒక్క లావాదేవీ కూడా జరపలేదన్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాల వ్యాజ్యాల రుసుం ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు(ఆర్వోసీ 850/ఎస్వో/2015)ను జారీ చేసిందని.. ఇది రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని... దాన్ని పట్టుకుని తమ రిఫెరెన్స్ నెంబరుతో చౌర్యం చేశారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్‌లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి తెలంగాణ సమాచారాన్ని చౌర్యం చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఇవేవీ పట్టకుండా కేంద్రానికి ఫిర్యాదు చేసి చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం హ్యాక్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించగా సూటిగా చెప్పకుండా సమాధానాన్ని దాటవేశారు. -
సోలార్కు బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ దాదాపు రూ.6,750 కోట్ల (1 బిలియన్ డాలర్లు) మేర సాయం అందించనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భూతాపానికి (గ్లోబల్ వార్మింగ్) దారితీసే ప్రమాదకర వాయువుల విడుదలను నియంత్రించే దిశగా సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్... సోలార్ ఎన ర్జీ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. దీనికి ప్రపంచ బ్యాంక్ బాసటగా నిలుస్తోంది. 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం దేశంలో 2022 నాటికి సోలార్ ఎనర్జీ ద్వారా లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని గోయల్ తెలిపారు. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ‘పునరుత్పాదక ఇంధన వనరులు, రూఫ్ సోలార్ ప్రాజెక్ట్స్ వంటి తదితర అంశాల గురించి చర్చించాం. ఆర్థిక సాయం కోసం పలు వినూత్న మార్గాలను అన్వేషించాం’ అని చెప్పారు. సోలార్ రూఫ్ టాప్ టెక్నాలజీ, సోలార్ పార్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, కొత్త సోలార్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆవిష్కరణ, ట్రాన్స్మిషన్ లైన్స్ స్థాపన వంటి తదితర వాటికి ప్రపంచ బ్యాంక్ నిధులను ఉపయోగిస్తామని వివరించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల సమీకరణకు వీలుగా భారత్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సోలార్ భాగస్వామ్య బృందం (ఐఎస్ఏ)తో ప్రపంచ బ్యాంకు ఒప్పందం చేసుకుంది. ఐఎస్ఏలో 121 దేశాలకు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు తన విభాగమైన ఐఎఫ్‌సీ ద్వారా భారత్‌లో పవన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు రుణ సహకారం అందిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 750 మెగావాట్ల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకూ నిధులందిస్తోంది. 2030కి సోలార్ విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని మూడింతలు చేయడం సహా భారత్ తన ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రపంచ బ్యాంకు చేయగలిగినంతా చేస్తుందని కిమ్ స్పష్టం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన బ్యాంకులు ఎన్డీబీ, ఏఐఐబీకు పుష్కల అవకాశాలు ఉన్నాయని, వీటితో పాతతరం సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని కిమ్ వ్యాఖ్యానించారు. ఇక భారత్ 2015-16 మధ్యకాలంలో ప్రపంచ బ్యాంక్ నుంచి 4.8 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది. -
సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల నిధులు
lన్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.భారత్ లో రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను ఫండింగ్ చేయనున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. పోషణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో భారత ప్రభుత్వ పథకాలకు మద్దతు అందించే చర్యల్లో భాగంగా ప్రపంచ బ్యాంక్ ప్రధానిని కలిసినట్టు పీఎంవో వర్గాలు ట్విట్ చేశాయి. ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి తో భేటీ అయిన కిమ్ ఫోటోను క ట్వీట్ చేశాయి. భారీ సౌర ఇంధన కార్యక్రమానికి 30 సోలార్ ప్రాజెక్టులకు ఒక బిలియన్ డాలర్ల (6వేల 750 కోట్లను) నిధులను ఇవ్వనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్ఎ)తో దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలొ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఐఎస్ఎ ఆర్థిక భాగస్వామిగా బహుపాక్షిక రుణ ఏజెన్సీ స్థాపిస్తుంది. క్లైమేట్ ఫ్రెండ్లీ భవిష్యత్తులో గ్లోబల్ ఉద్యమానికి ఇది దోహం చేస్తుందనే కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇండియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం న్యూ ఢిల్లీలోని స్కిల్ ఇండియా సెంటర్ ను సందర్శించారు. అనంతరం ఆ తర్వాత అంగన్ వాడి సెంటర్ కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటించినసంగతి తెలిసిందే. -
అమరావతి అభివృద్ధికి రూ.41,225 కోట్లు
హడ్కో, ప్రపంచ బ్యాంకుల నుంచి రుణానికి సీఆర్డీఏ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి నీలి-హరిత (బ్లూ-గ్రీన్ సిటీ) నగరంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి రూ.41,225.32 కోట్లు అవసరమని సీఆర్డీఏ ప్రాథమికంగా అంచనా వేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల స్థాయిని పెంచేందుకు రూ.2,537 కోట్ల వ్యయం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు రూ.25,520 కోట్ల బడ్జెట్ నిధులు అవసరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ప్రపంచ బ్యాంకు, హడ్కో నుంచి తీసుకున్న రుణాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను వ్యయం చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4,841 కోట్లు, హడ్కో నుంచి రూ.7,500 కోట్ల రుణం తీసుకోనున్నట్లు తెలిపింది. -
సంస్కరణలపై ‘రెగ్జిట్’ ప్రభావం పడదు
ప్రపంచబ్యాంక్ స్పష్టీకరణ * రేటింగ్ నిర్ణయాలు విధానాలపై తప్ప వ్యక్తులపై ఆధారపడి ఉండవని ఫిచ్ ప్రకటన న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ రెండవసారి ఈ బాధ్యతల్లో కొనసాగబోనని చేసిన ప్రకటన (రెగ్జిట్) ప్రభావం బ్యాంకింగ్ సంస్కరణలపై పడబోదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఆయా సంస్కరణలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ భారత్ వ్యవహారాల డెరైక్టర్ ఓనో రుయాల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వల వంటి భారత్ స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నట్లు కూడా తెలిపారు. కాగా రేటింగ్ సంస్థ- ఫిచ్ కూడా రెగ్జిట్పై ఒక కీలక ప్రకటన చేస్తూ... రేటింగ్ నిర్ణయాలు విధానాలపై ఆధారపడి ఉంటాయితప్ప, వ్యక్తులపై కాదని స్పష్టం చేసింది. రాజన్ పదవీ విరమణ ప్రభావం సావరిన్ రేటింగ్స్‌పై ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం, మొండిబకాయిల వంటి సమస్యల పరిష్కారానికి కేంద్రం, రాజన్ వారసుడు తగిన చర్యలను కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని ఫిచ్ ఆసియా-పసిఫిక్ సావరిన్స్ గ్రూప్ డెరైక్టర్ థామస్ రుక్మాకర్ పేర్కొన్నారు. రాజన్ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు చేసిన కీలకమైనవని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిచ్ భారత్ రేటింగ్ ‘బీబీబీ-’ జంక్ హోదాకు ఇది ఒక స్థాయి ఎక్కువ. ప్రైవేటు పెట్టుబడులు, డిమాండ్ కీలకం కాగా ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ క్రియాశీలకంగా ఉండడం ద్వారానే భారత్ 7.6 శాతం వృద్ధి రేటు మున్ముందు కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ తన తాజా ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది. ప్రతిష్టంభనలో ఉన్న రంగాల్లో వ్యవసాయం, గ్రామీణ గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు ఉన్నట్లు తెలిపింది. 2015-16 తరహాలో 2016-17లో కూడా భారత్ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు 7.7 శాతం, 7.8 శాతంగా అంచనా. -
ప్రపంచ సంస్థల్లో సమూల మార్పులు అవసరం: ప్రణబ్
ఆక్రా: ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి ప్రపంచ సంస్థల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నొక్కిచెప్పారు. కాలం చెల్లిన విధానాలను అనుసరిస్తున్న ఈ సంస్థలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేవన్నారు. ఘనా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సోమవారం ఘనా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్, సోషల్, ఎకనమిక్ రీసెర్చ్‌కు చెందిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. నేటి ప్రపంచ అవసరాలను రెండో ప్రపంచయుద్ధం ముగిసిన నేపథ్యంలో 1945లో ఏర్పాటు చేసిన ఐరాస తీర్చలేదని అన్నారు. ఐరాస ఏర్పాటైనప్పుడు కొన్ని దేశాలే సభ్యులుగా ఉన్నాయని, అయితే రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ఐరాసలో కీలకపాత్ర లేకుండా పోయిందన్నారు. ఘనా పర్యటన ముగించుకుని ప్రణబ్ ఐవరీ కోస్ట్ చేరుకున్నారు. -
దూసుకుపోతున్న తెలంగాణ
- పరిశ్రమలు, పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా రాష్ట్రం - ప్రపంచ బ్యాంకు ఈఓడీబీ తాజా ర్యాంకుల్లో రెండో స్థానం - గతేడాది రాష్ట్రానికి 13వ ర్యాంకు - మొదటిస్థానంలో కొనసాగుతున్న బిహార్ - గతేడాది రెండోర్యాంకు సాధించిన ఏపీ ప్రస్తుతం 19వ స్థానంలో - జూలైలో తుది ర్యాంకులు ప్రకటించనున్న ప్రపంచ బ్యాంకు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏటా ప్రకటిస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతేడాది 13వ ర్యాంక్‌ను దక్కించుకొన్న తెలంగాణ.. ఈ ఏడాది తాజా ర్యాంకింగ్‌లో 6.48 శాతం స్కోర్‌తో రెండో ర్యాంక్‌కు దూసుకుపోయింది. 8.53 శాతం స్కోర్‌తో ఒకటో ర్యాంక్‌లో కొనసాగుతున్న బిహార్‌కు గట్టి పోటీ ఇస్తోంది. తెలంగాణ తర్వాత 6.18 శాతం స్కోర్‌తో ఝార్ఖండ్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. మరోవైపు గతేడాది ర్యాంకింగ్‌లో 3వ ర్యాంక్ కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ 0 శాతం స్కోర్‌తో తాజా ర్యాంకింగ్‌లో ఏకంగా 19వ స్థానానికి పడిపోయింది. ఈ ర్యాంకులను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఈ నెల 30 వరకు రాష్ట్రాలకు అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పెట్టుబడులు, వ్యాపార సరళీకరణ కోసం ప్రవేశపెట్టిన సంస్కరణ లు, తీసుకుంటున్న చర్యలను కేంద్ర పరిశ్రమల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అన్ని రాష్ట్రాలు ఏరోజుకారోజు నివేదిస్తున్నాయి. రాష్ట్రాల నివేదికల ఆధారంగా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాల తాజా ర్యాంక్‌లను అప్డేట్ చేస్తోంది. ఏ రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో తన వెబ్సైట్ ద్వారా బహిర్గతపరుస్తోంది. తుది ర్యాంక్ ను మెరుగుపరుచుకోవడానికి అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెలలో ప్రపంచ బ్యాంక్ తుది ర్యాంక్‌లను అధికారికంగా ప్రకటించనుంది. తాజా ర్యాంకులతో పోల్చితే రాష్ట్రాల తుది ర్యాంకుల్లో మార్పులకు అవకాశం ఉందని కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెరుగైన ర్యాంకు కోసం భారీ కసరత్తు సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్-ఐపాస్’ పేరుతో కొత్త పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడులకు ఈ విధానం ద్వారా ఎర్రతివాచీ పరిచింది. అయినా గతేడాది జూలైలో ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకుల్లో తెలంగాణకు 13, పొరుగున ఉన్న ఏపీకి 2వ స్థానం వచ్చింది. దీంతో ఈ అంశా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ర్యాం కింగ్‌ను మెరుగుపరచుకోవడానికి గత 11 నెల లుగా భారీ కసరత్తు చేసింది. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ర్యాంకును మెరుగుపరుచుకోవాలంటే వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని పలు అంశా ల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి 340 పాయింట్లు సాధించాల్సి ఉంటుందని అంచనా వేసుకుంది. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పెట్టించారు. గతనెల 14 నాటికి పలు సంస్కరణలు ప్రవేశపెట్టి 289 పాయింట్లు సాధించి 87 శాతం పురోగతి సాధించింది. గడిచిన నెల రోజుల్లో పాయింట్ల సంఖ్య మరింత పెరగడంతో తాజా ర్యాం కింగ్‌లో రాష్ట్రం 2వ స్థానానికి చేరుకుంది. ఒక్క న్యాయశాఖ తప్ప.. న్యాయ శాఖ మినహాయిస్తే.. పురపాలక, ఆర్థిక, రెవెన్యూ, అటవీ, ఇంధన, కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖలు, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన పలు చర్యలు తీసుకోవడంతో మెరుగైన ర్యాంకు సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ‘ఈ-కోర్టుల’ విధానంతోపాటు న్యాయశాఖకు సంబంధించిన పలు అంశాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టే అంశం హైకోర్టు పరిధిలో ఉండడంతో ఈ అంశాల్లో ఆశించిన పురోగతి లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమై దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పురోగతి చర్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ ఒక ట్రెండు రోజుల్లో అన్ని శాఖల కార్యదర్శులతో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రపంచ బ్యాంక్ జూలైలో ప్రకటించనున్న తుది ర్యాంకుల కోసం ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఇతరులతో పోలిస్తే మెరుగే కానీ..
భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోత ♦ 0.2% తగ్గించిన ప్రపంచ బ్యాంక్ ♦ ఈ ఏడాది 7.6 శాతంగా అంచనా... ♦ ఎన్పీఏలతో కార్పొరేట్ రుణాలకు గండి ♦ రెండేళ్లుగా సరైన వర్షాలు లేకపోవటం కూడా ప్రతికూలమే ♦ తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: దేశ వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్ స్వల్పంగా కోత విధించింది. ఈ ఏడాది(2016)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండొచ్చని తాజాగా అంచనా వేసింది. ‘ప్రపంచ ఆర్థిక అంచనాలు’ పేరిట మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం చెప్పింది. వచ్చే రెండేళ్ల(2017, 18)కు వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 7.7 శాతానికి చేర్చింది. అయితే, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వృద్ధి పరుగులు తీస్తోందని... మొత్తంమీద 2016-17 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల కాలంలో భారత్ వృద్ధి రేటు 7.6-7.7 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. దేశీయ డిమాండ్ దన్ను... గతేడాది(2015-16)లో వృద్ధి 7.6 %కి(0.4% పెరుగుదల) పుంజుకోవడానికి ప్రధానంగా దేశీయ డిమాండ్ పెరగటమే కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. ‘‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనల సరళీకరణకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా వృద్ధికి ఆసరాగా నిలుస్తున్నాయి. 2014 అక్టోబర్‌లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచీ ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ చూస్తే ఎఫ్‌డీఐలు 37% వృద్ధి చెందాయి’’ అని నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ.. ♦ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌లో మందగమనం ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో తయారీ రంగం 9.3 శాతం పుంజుకుంది. ♦ ఇతర పెద్ద వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాపార సెంటిమెంట్ బలంగా ఉంది. ♦ స్టార్టప్ సంస్థల జోరు పెరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సేవలు, ఈ-కామర్స్‌లో కొత్తకొత్త స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి. ♦ ఆర్థిక పరమైన కార్యకలాపాల్లో వేగం పెరగడం ఉద్యోగాల సృష్టికి వీలుకల్పిస్తోంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో కొనసాగడం, వేతనాల్లో పెరుగుదలతో ప్రజల వాస్తవ ఆదాయాలు జోరందుకొని అర్బన్ వినిమయం ఎగబాకుతోంది. ♦ విద్యుదుత్పత్తి, రోడ్లు, రైల్వేలు, అర్బన్ ఇన్ఫ్రాలో ప్రభుత్వ వ్యయం పెరగడంతో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడటంతో పాటు సరఫరాపరమైన అడ్డుంకులు కూడా తొలగుతున్నాయి. ♦ వరుసగా రెండేళ్లు సరైన వర్షపాతం లేకపోవడంతో గ్రామీణ వినియమం తీవ్రంగా పడిపోవడం మాత్రం ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలాంశమే. ♦ 2015 నుంచి 5 సార్లు వడ్డీరేట్లలో కోత విధించినప్పటికీ కార్పొరేట్ రంగ రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు భారీగా పెరిగిపోవడం దీనికి కారణం. ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీ కోత... అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం, కమోడిటీ రేట్ల పతనం, అంతర్జాతీయ వాణిజ్యంలో బలహీనతల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పడింది. ఈ ఏడాది 2.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. జనవరిలో అంచనా వేసిన 2.9 శాతంతో పోలిస్తే అర శాతం తగ్గించడం గమనార్హం. ఇక చైనా వృద్ధి గతేడాది స్థాయిలోనే 6.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వృద్ధి మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ దేశాలన్నీ తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తీవ్ర పేదరికంలో ఉన్న ప్రజలకు బాసటగా నిలవాలని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
భారత్ ఇక.. మధ్య దిగువ ఆదాయ దేశం!
ఆర్థిక విశ్లేషణ వెసులుబాటుకు ప్రపంచబ్యాంక్ ‘ప్రత్యేక’ నిర్ణయం న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ ఇక భారత్‌ను ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గా ప్రస్తావించదు. భారత్‌నే కాకుండా అన్ని దేశాలనూ అభివృద్జిచెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించకుండా, వాటి ఆదాయాలకు అనుగుణంగా ప్రపంచ బ్యాంక్ వర్గీకరించింది. ఈ వర్గీకరణలో భారత్ ‘మధ్య-దిగువ ఆదాయ దేశాల’ జాబితాలో చేరింది. ‘‘ప్రత్యేక ఆర్థిక విశ్లేషణలకు వీలుగా మేము ప్రపంచ అభివృద్ధి ఇండికేటర్స్ రూపొందించాం. మధ్య ఆదాయ, మధ్య ఎగువ, దిగువ ఆదాయ, మధ్య-దిగువ ఆదాయ దేశాలన్నింటినీ కలిపి వర్థమాన దేశాలుగా పరిగణించరాదన్నది ఇండికేటర్స్ ఉద్దేశం. వర్థమాన దేశాలను గ్రూప్‌లుగా విడగొట్టాం. ఆర్థిక విశ్లేషణా ప్రక్రియ దిశలో ఈ నిర్ణయం జరిగింది. భారత్ ఆర్థిక వ్యవస్థను మధ్య-దిగువ ఆదాయ దేశంగా వర్గీకరించడం జరిగింది’’ అని వరల్డ్ బ్యాంక్ డేటా పరిశోధకుడు తారిక్ ఖోకర్ తెలిపారు. ఒక ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో ఇంకా ఆయన ఏమన్నారంటే... ♦ ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వర్థమాన ప్రపంచం’ అన్న పదాన్ని మేము మార్చేయడం లేదు. తాజా అంశం... ప్రత్యేక డేటా రూపొందించే క్రమంలో అనుసరించిన విధానం మాత్రమే. ఆర్థికంగా దేశాల పరిస్థితిని మరింత స్పష్టంగా విశ్లేషించాలన్నది మా సంకల్పం. ♦ {పపంచ బ్యాంక్ ఆర్థిక విశ్లేషణ నివేదికలను సంబంధించినంతవరకూ భారత్ ‘మధ్య-దిగువ ఆదాయ ఆర్థిక వ్యవస్థ’గా ఉంటుంది. అయితే సాధారణ వాడుకలో మాత్రం అభివృద్ధి చెందిన దేశంగానే పేర్కొనడం జరుగుతుంది. ♦ ‘వర్ధమాన ప్రపంచం’ అనే పదంపై అంతర్జాతీయంగా ఒక ఏకీకృత నిర్వచనం లేదు. వర్ధమాన దేశాలుగా పేర్కొంటున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఆదాయ అంశాల్లో తరచూ పెద్ద వ్యత్యాసం ఏర్పడుతోంది. ♦ తాజా వర్గీకరణ అనంతరం భారత్ సరసన పాకిస్తాన్, శ్రీలంకలు నిలిచాయి. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లు దిగువ ఆదాయ దేశాలుగా ఉన్నాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనాలు ఎగువ ఆదాయ దేశాలుగా ఉన్నాయి. రష్యా, సింగపూర్లు అధిక ఆదాయ దేశాల హోదాలకు వెళ్లగా... అమెరికా అత్యధిక ధనిక దేశంగా నిలిచింది. -
కరువు జిల్లాను ఆదుకోండి
► ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ► కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ► ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తాం : ఐప్యాడ్ ప్రతినిధి వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయని ప్రపంచ బ్యాంకు ద్వారా జిల్లాను ఆదుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. డ్రాఫ్ట్ ఐఎఫ్ఏడీ(ఐప్యాడ్) ప్రతినిధులను కోరారు. శనివారం రాత్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ప్రపంచ బ్యాంకు తరఫున వచ్చిన ఐప్యాడ్ ప్రతినిధులతో ఎంపీ సమావేశమై జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఇటలీకి చెందిన ఐప్యాడ్ ప్రతినిధులు అండ్రీనెప్యూడి ఐసాటూర్ , ఆ సంస్థ ఇండియా ప్రతినిధులు విన్సెం ట్ డార్లాంగ్, సన్‌ప్రీత్ కౌర్.. గురు, శుక్రవారాల్లో ఓర్వకల్లు, ఆళ్లగడ్డ, డోన్ మండలాల్లో కరువు పరిస్థితులను, ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు తరపున ఈ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. శనివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంది. ముందుగా జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌ను ఆయన ఛాంబర్లో కలిశా రు. కలెక్టర్ జిల్లాలోని కరువు పరిస్థితులను ఐప్యాడ్ ప్రతినిధులకు వివరించారు. అనంతరం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. జిల్లాలో వరుసగా కరువు వస్తుండటం వల్ల రైతు లు తీవ్రమైన కష్టాల్లో మునిగి తేలుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్లలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. జిల్లా మ్యాపు ద్వారా కరువు ప్రాంతాలను చూపించా రు. ప్రపంచ బ్యాంకు ద్వారా కరువు జిల్లాకు చేయూతనివ్వాలని సూచించా రు. డ్రాఫ్ట్ ఐప్యాడ్ టీమ్ లీడర్ అండ్రి నెఫ్యూడి మాట్లాడుతూ తొలి విడతలో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మరో టీమ్ జూన్ నెల 5వ తేదీన జిల్లాకు వచ్చి కరువు పరిస్థితులను మరోసారి పరిశీలి స్తుందని తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాాశం జిల్లాలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ గణపతి, ఏడీఏ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు. ఐప్యాడ్ ప్రతినిధులు జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం తిరిగి వెళ్లనున్నారు. -
క్లీన్ ఎనర్జీకి ప్రపంచ బ్యాంక్ రుణం
సోలార్ ప్రోగ్రామ్‌కు 625 మి. డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌లో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వపు గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌కు ప్రపంచ బ్యాంక్ సాయమందిస్తోంది. ఇందుకు సంబంధించి 625 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి ప్రపంచ బ్యాంకు బోర్డు అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో కనీసం 400 మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవోల్టిక్ ఏర్పాటు జరగనున్నది. ప్రపంచ బ్యాంక్ బోర్డు దీనితోపాటు 120 మిలియన్ డాలర్ల కో-ఫైనాన్సింగ్ లోన్‌కు, క్లైమెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు చెందిన క్లీన్ టెక్నాలజీ ఫండ్ నుంచి 5 మిలియన్ డాలర్ల గ్రాంట్‌కు కూడా ఆమోద ముద్ర వేసింది. -
ఇక ఇతర దేశాల్లోనూ 'ఆధార్'
వాషింగ్టన్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు అడ్డుకట్టవేయడమేకాక భారత పౌరులకు విశిష్ట గుర్తింపును కల్పించిన ఆధార్ కార్డు విధానాన్ని ఇతర దేశాల్లోనూ అమలుచేయాలని ఐఎంఎఫ్ (ప్రపంచ బ్యాంక్) భావిస్తోంది. ఈ మేరకు భారత్ లో ఆధార్ కార్జుల జారీలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను ప్రత్యేకంగా పిలిపించుకుని ప్రెజెంటేషన్లు వింటోంది. ఈ క్రమంలోనే యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐఏఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే గురువారం ప్రపంచం బ్యాంక్ అధికారులకు ఆధార్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో పౌరుడికి జారీ చేసేందుకు కనీసం ఒక అమెరికన్ డాలర్ ఖర్చు కూడా కాని ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు ఏవిధమైన ప్రయోజనాలు ఉంటాయో అజయ్ భూషణ్ ప్రపంచం బ్యాంక్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా భారత్ లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రపంచ బ్యాంక్ అధికారులు ప్రశంసించారు. 100 కోట్ల మంది వేలి ముద్రలు, ఐరిస్, చిరునామాలు సేకరించడం, అంతమందికీ విశిష్ట సంఖ్యను అందివ్వడానికి భారత ప్రభుత్వం అనేక శ్రమలకోర్చిందని, అయితే ఆధార్ జారీ అయిన తర్వాత పనుల్లో పారదర్శకత, నగదు రహిత లావాదేవీలు వంటి ప్రయోజనాలు అనుభవంలోకి వచ్చాయని యైఐఏఐ డీజే తెలియజెప్పారు. సమావేశం అనంతరం అయయ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ మొదట ఆఫ్రికన్ దేశాల్లో ఆధార్ కార్డు తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆ తర్వాత మిగతా దేశాలకు విస్తరింపజేయాలని ప్రపంచ బ్యాంక్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. -
ఉచిత విద్యుత్‌కు ఇలా కత్తెరేస్తున్నాం
ప్రపంచ బ్యాంకుకు నివేదించిన విద్యుత్ సంస్థలు సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌కు కత్తెరేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు ప్రపంచబ్యాంక్‌కు వివరించారు. ఈ ప్రక్రియలో ఇప్పటికే వేగం పెంచామని, త్వరలోనే లక్ష్యాలను చేరుకుంటామని కూడా పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ను ఎలా కట్టడి చేస్తున్నది వివరిస్తూ ఓ నివేదిక ఇచ్చారు. తమ పురోగతిని చూసి వీలైనంత త్వరగా రుణం మంజూరు చేయాలని ప్రాధేయపడ్డారు. ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు మణికురానా, అతుల్‌తో గురువారం ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ప్రాజెక్ట్స్ డెరైక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంధనశాఖ సలహా దారు రంగనాథం భేటీ అయ్యా రు. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం గతంలో వరల్డ్ బ్యాంక్ సుమారు రూ. 2,600 కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 2014 నుంచి ఈ రుణం మంజూరు కోసం ప్రపంచబ్యాంక్ సవాలక్ష షరతులు విధిస్తూ వస్తోంది. విద్యుత్ నష్టాలను తగ్గించాలని, ఉచిత విద్యుత్ పంపిణీని దశలవారీగా తగ్గించాలని ప్రపంచబ్యాంక్ షరతులు పెడుతోంది. 10 లక్షల స్మార్ట్ మీటర్లు మీటర్ రీడింగ్‌ను ఇళ్ల వద్దకు వెళ్లి తీసుకునే పద్ధతికి స్వస్తి చెబుతున్నామని, ఇందులో భాగంగా 10 లక్షల స్మార్ట్ మీటర్లు అమరుస్తామని ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు వివరించారు. దీనికి రుణం ఇవ్వాలని కోరారు. నెలకు 500 యూనిట్లు వాడే వినియోగదారులకు తొలుత ఈ విధానాన్ని వర్తింపజేయమని, తద్వారా వాణిజ్య విద్యుత్ ట్యాంపరింగ్‌ను అరికడతామని వివరించారు. అదే విధంగా సూపర్ వైజర్ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్ విధానాన్ని గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో అమలు చేస్తామని, దీనిద్వారా విద్యుత్ వాడకాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, వీటన్నింటికీ రుణం ఇవ్వాలని కోరారు. రూ. 2600 కోట్లు ప్రపంచబ్యాంక్ రుణంగా ఇస్తే, మిగిలిన రూ. 1050 కోట్లు తాము భరిస్తామని తెలిపారు. రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ షరతులన్నీ దాదాపు అంగీకరించేందుకు రాష్ట్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. రైతులకు ఉచిత విద్యుత్‌పై వేటు! ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే.. రాష్ట్రంలో 15.8 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. అత్యధిక విద్యుత్ సరఫరా పథకం (హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) అమలుకు ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రెండు కన్నా ఎక్కువ వ్యవసాయ మోటార్లు లేకుండా కట్టడి చేయడం ఈ పథకం ఉద్దేశం. దీంతో పాటు 50 వేల పంపుసెట్లను ఇంధన సామర్థ్యం ఉన్న వాటితో మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వీటికి మీటర్లు బిగించే యోచనలో ఉన్నారు. ఇదే జరిగితే ఉచిత విద్యుత్‌కు పరిమితి విధించే వీలుంది. -
మూడేళ్లలో రూ.15,000 కోట్లు కావాలి
♦ రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధులపై సీఆర్డీఏ అంచనాలు ♦ రూ.7,500 కోట్ల రుణమిచ్చేందుకు హడ్కో అంగీకారం సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి అభివృద్ధికి తొలిదశలో మూడేళ్లలో(2018 నాటికి) రూ.15 వేల కోట్లు అవసరమవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అంచనాలను రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లు మినహా మిగతా నిధుల్ని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా హడ్కో రూ.7,500 కోట్లను మూడేళ్ల వ్యవధిలో రుణంగా ఇచ్చేందుకు నిబంధనలతో అంగీకరించినట్లు సీఆర్డీఏ తెలిపింది. ఇందుకు సంబంధించి సీఆర్డీఏ-హడ్కో మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరిందని, రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపితే రుణం తీసుకుంటామని పేర్కొంది. అయితే ఈ రుణమిచ్చేందుకుగాను రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీగానీ లేదా మంజూరుచేసే రుణానికి 125 శాతం విలువగల సీఆర్డీఏ ఆస్తుల్ని తనఖా పెట్టాలనే నిబంధనను హడ్కో విధించింది. నీటిసరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యర్థాల నిర్వహణ, సిటీ రహదారులు, సాంఘిక మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకిచ్చే రుణానికి 10.15 శాతం వడ్డీ చెల్లించాలని హడ్కో స్పష్టం చేసింది. అలాగే రాజధానిలో పేదల గృహనిర్మాణాలకు మంజూరు చేసే రుణానికి 8.65 శాతం, ఎల్ఐజీ గృహనిర్మాణాలకు 9.15 శాతం, ప్రభుత్వ ఏజెన్సీల గృహాలకు మంజూరు చేసే రుణానికి 10.15 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని నిబంధన విధించింది. విద్యుత్ ప్రాజెక్టులకు మంజూరుచేసే రుణానికి 11.75 శాతం వడ్డీ చెల్లించాలని పేర్కొంది. రుణం తిరిగి చెల్లింపు కాలపరిమితి 20 సంవత్సరాలుగా తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఇతర విదేశీ ఆర్థిక సంస్థలకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలి ఇదిలా ఉండగా రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా సీఆర్డీఏ ప్రపంచబ్యాంక్‌తోపాటు జపాన్ అంతర్జాతీయ కో-ఆపరేషన్ ఏజెన్సీ, జాతీయ అభివృద్ధి బ్యాంకుల్నీ సంప్రదించింది. ప్రపంచబ్యాంక్ నుంచి రూ.6,500 కోట్ల రుణం తీసుకోవాలని ప్రతిపాదించింది. ఇందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ(ఎఫ్ఆర్బీఎం) నిబంధనలు అంగీకరించవని, అయినా ఇందుకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్డీఏ తెలిపింది. అలాగే ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, రిలయన్స్ తదితర 15 ఫండ్ మేనేజర్లతోనూ రుణంకోసం సంప్రదింపులు జరిపింది. అయితే ఇవి సీఆర్డీఏకు నేరుగా రుణమివ్వడానికి అంగీకరించలేదు. రాష్ర్ట అభివృద్ధి రుణం కింద రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీ ఇస్తేనే రుణం మంజూరు చేస్తామని స్పష్టం చేశాయి. అయితే ఇలా రాష్ట్రప్రభుత్వం రుణం తీసుకోవడానికీ ఎఫ్ఆర్బీఏం నిబంధనలు అంగీకరించబోవని సీఆర్డీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో రాజధాని తొలిదశ అభివృద్ధికి అవసరమైన నిధుల్ని హడ్కో నుంచి రుణంగా సమీకరించాలని నిర్ణయించినట్లు సీఆర్డీఏ రాష్ట్రప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. -
బిలియన్ డాలర్ల రుణమివ్వండి
ప్రపంచ బ్యాంకును కోరిన సీఆర్డీఏ సాక్షి, విజయవాడ బ్యూరో: అమరావతి నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.6,700 కోట్లు) రుణమివ్వాల్సిందిగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ప్రపంచ బ్యాంకును కోరింది. గతంలో ఈ మేరకు పంపిన ప్రతిపాదనపై ప్రాథమిక పరిశీలన నిమిత్తం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం మంగళవారం విజయవాడ వచ్చింది. తొలుత సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో, ఆ తర్వాత సీఎం కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌తో చర్చలు జరిపింది. రాజధానికి సంబంధించి సవివర నివేదికలను సాధ్యమైనంత త్వరగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఇవ్వాలని ఈ సందర్భంగా టక్కర్ సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకోనుంది. గురువారం సీఆర్డీఏ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై రుణానికి సంబంధించి చర్చలు జరపనుంది. రుణానికి సంబంధించి కొద్దిరోజుల క్రితమే సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించింది. రాజధానిలో వరద నియంత్రణ వ్యవస్థ, కాలువల వ్యవస్థ ఏర్పాటు, ఆర్టీరియల్-సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, సీవేజ్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థల ఏర్పాటుతోపాటు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని పేర్కొంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలోనూ ఉంది. ప్రపంచ బ్యాంకును బిలియన్ డాలర్ల రుణం కోరినప్పటికీ.. ఇందులో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చే అవకాశం ఉందని సీఆర్డీఏ వర్గాలు పేర్కొన్నాయి. -
పాక్ నుంచి భారత్‌కు 98 వేల కోట్లు
అక్కడి ఎన్నారైలు పంపిన సొమ్ము న్యూఢిల్లీ: వివిధ దేశాలనుంచి భారత్‌లోని బ్యాంకులకు నగదు బదిలీ చేస్తున్న దేశాల్లో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉందని ప్రపంచబ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. గత మూడేళ్లలో పాక్‌లోని భారతీయులు స్వదేశానికి రూ.98,796 కోట్లు పంపినట్లు పేర్కొంది. అయితే ఇది అంచనా మాత్రమేనని తెలిపింది. పాక్ నుంచి భారత్‌కు నగదు బదిలీ విషయంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉండటంతో పాటు పాక్‌లో పెద్దగా భారతీయులు నివసించనప్పటికీ ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలను ప్రపంచబ్యాంకు వెల్లడించడం గమనార్హం. ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన మైగ్రేషన్ అండ్ రెమిటెన్స్ ఫ్యాక్ట్ బుక్ 2016 ప్రకారం 2015లో ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో స్థిరపడిన ప్రజలు మాతృ దేశానికి పంపిన నగదు విషయంలో రూ.4 లక్షల 95 వేల కోట్లతో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. చైనా రూ.4 లక్షల 40 వేల కోట్లు, ఫిలిప్పీన్స్ రూ. 2 లక్షల 6 వేల కోట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్‌లోని ప్రవాస భారతీయులు 2015లో రూ.33,711 కోట్లు, 2014లో రూ.32,955 కోట్లు, 2013లో రూ.32,129 కోట్లు భారత్‌కు పంపినట్లు ప్రపంచబ్యాంక్ పేర్కొంది. దీనిపై ప్రపంచబ్యాంకు వలసలు, చెల్లింపుల విభాగం మేనేజర్ దిలీప్ రాథ్ మాట్లాడుతూ ఇది క చ్చితమైన నివేదిక కాదని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక చెల్లింపులకు సంబంధించి అంచనా మాత్రమేనని వివరించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2015లో యూఏఈలో నివసిస్తున్న భారతీయులు అత్యధికంగా రూ. 90 వేల కోట్లు మాతృదేశానికి పంపించారు. అమెరికానుంచి రూ. 79 వేల కోట్లు, సౌదీ అరేబియా నుంచి రూ. 75 వేల కోట్లు పంపించారు. -
నల్లాలకు ఆటోమేటిక్ మీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచబ్యాంకు సూచనల మేరకు గ్రేటర్ పరిధిలో ప్రతి నల్లాకు ఆటోమేటిక్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముందుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ పరిధిలో రూ.338 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకంలో ఈ మీటర్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. సర్కిల్ పరిధిలో సుమారు 25 వేల గృహవినియోగ నల్లాలకు వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం రూ.53 కోట్ల అంచనా వ్యయంతో ఆటోమేటిక్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సైతం ప్రపంచబ్యాంకు మంజూరు చేయనుంది. మీటర్ల ఏర్పాటుతోపాటు నీటి సరఫరాను ఆన్లైన్లో పక్కాగా పర్యవేక్షించేందుకు స్కాడా (సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనుంది. కాగా మల్కాజ్గిరి మంచినీటి సరఫరా పథకంతో ఈ ప్రాంత దాహార్తి తీరనుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి 262 కి.మీ మార్గంలో ప్రధాన పైపులైన్లు, మరో 376 కి.మీ మార్గంలో పంపిణీ పైపులైన్ల ద్వారా ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రిజర్వాయర్లు సైతం అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు వారం, పదిరోజులకోమారు నీటిసరఫరా జరుగుతోంది. ఈపథకం పూర్తితో కృష్ణా, గోదావరి జలాలను సర్కి ల్ వ్యాప్తంగా సరఫరా చేసే అవకాశం ఉంటుం దని, ఆటోమేటిక్ నీటిమీటర్ల ఏర్పాటుతో భవిష్యత్‌లో 24 గంటలపాటు నీటిసరఫరా చేసినప్పటికీ నీటి లెక్కలు పక్కాగా లెక్కగట్టడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. మీటర్ల ఎంపిక వినియోగదారులదే..! గ్రేటర్‌వ్యాప్తంగా ఆటోమేటిక్ మీటర్ల విధానాన్ని అమలు చేసేందుకు రూ.1600 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని ఎవరు భరిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాగా మహానగరంలో 8.65 లక్షల నల్లాలుండగా..ప్రస్తుతం సగం నల్లాలకే నీటి మీటర్లున్నాయి. దీంతో ప్రతి నల్లాకు నీటి మీటరు ఏర్పాటు చేసుకునే బాధ్యతను జలమండలి వినియోగదారులకే అప్పజెప్పింది. గతంలో యూరో ప్రమాణాల ప్రకారం ఎంపికచేసిన తొమ్మిది మీటర్ కంపెనీలకు చెందిన మీటర్లనే విధిగా కొనుగోలు చేయాలన్న షరతు విధించింది. వీటి ధరలు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉన్నాయి. దీంతో కొందరు వినియోగదారులు ఇటీవల కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్పందించింది. వినియోగదారులు తమ ఇష్టానుసారం మీటర్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండాలని వ్యాఖ్యానించింది. కాగా బహిరంగ మార్కెట్లో మెకానికల్ నీటిమీటర్లు రూ.500 నుంచి రూ.750కు మాత్రమే లభ్యమవుతున్నాయి. కోర్టు వ్యాఖ్యలతో జలమండలి అధికారులు వెసులుబాటు కల్పించక తప్పనిపరిస్థితి ఏర్పడినప్పటికీ ఈవిషయంలో తుదినిర్ణయం తీసుకోక పోవడం గమనార్హం. -
ప్రపంచ బ్యాంకు బృందానికి ఘన స్వాగతం
పూసపాటిరేగ: డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియూ కోస్టల్ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు కలెక్టర్ నాయక్ ఆధ్వర్యంలో పతివాడబర్రిపేట గ్రామస్తులు బుధవారం ఘన స్వాగతం పలికారు. మేళ,తాళాల నడుమ మత్స్యకారుల సంప్రదాయ పద్ధతిలో ప్రతినిధులను గ్రామంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నిధులు కోటీ పద్దెనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన తుపాను షెల్టర్‌తో పాటు పులిగెడ్డ, కోనయ్యపాలెంలో రూ. 3 కోట్లతో నిర్మించిన వంతెనలను పరిశీలించారు. తుపాను షెల్టర్ ఎలా ఉపయోగపడుతున్నదీ.. బ్యాంకుల నుంచి రుణాలు ఎలా మంజూరవుతున్నదీ మత్స్యకార మహిళా సంఘాల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పతివాడబర్రిపేటలో జరిగిన సభలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి ఎస్కె జైన్ మాట్లాడుతూ, రూ. 200 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తుపాను షెల్టర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తీరప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలు ఆర్థికంగా పటిష్టం కావాలన్నారు. టీమ్ లీడర్ సౌరబ్ ఘని మాట్లాడుతూ, మత్స్యకార గ్రామాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మత్స్యకార సంఘ నాయకులు బర్రి నూకరాజు, మైలపల్లి సింహాచలం, తదితరులు మాట్లాడుతూ, మత్స్యకారుల సమస్యలను సభ్యులకు తెలియజేశారు. అంతకుముందు బృంద సభ్యులు మత్స్యకార్లకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కార్యక్రమంలో రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ జేసీ శర్మ, డిజాస్టర్ మేనేజ్మెంట్ డెరైక్టర్ ధనుంజయరెడ్డి , పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ పి. సుబ్రహ్మణ్యశాస్త్రి, పీఆర్ ఎస్ఈ కె. వేణుగోపాల్, ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాదరావు, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినప్పన్న, ఎంపీడీఓ ఎంఎల్ నారాయణరావు, తహశీల్దార్ జి. జయదేవి, సర్పంచ్ ఎ. పైడిరామ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్‌తో ఏటా 6,700 కోట్లు ఆదా: ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: ఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)ఆదా అవుతాయని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఆధార్ డిజిటల్ గుర్తింపు కార్డ్ వల్ల అవినీతి తొలగి ఈ స్థాయిలో ప్రభుత్వానికి సొమ్ములు ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పారు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2016: డిజిటల్ డివిడెండ్స్ పేరుతో ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికను విడుదల చేస్తూ బసు ఈ విషయాలు వెల్లడించారు. -
గ్రేటర్‌కు రూ.52 వేల కోట్లు
బ్రిక్స్ బ్యాంక్‌కు రుణ ప్రతిపాదనలు ♦ కౌంటర్ మాగ్నెట్ సిటీలుగా 11 పట్టణాలు ♦ మూసీపై 42 కి.మీ. ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ ♦ ప్రతిపాదనలు సిద్ధం చేయండి: సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశాలు ♦ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ నదిపై ఈస్ట్ టు వెస్ట్ కారిడార్, నగరం చుట్టూరా ఉన్న 11 పట్టణాలను కౌంటర్ మాగ్నెట్ సిటీలుగా అభివృద్ధి చేసే వినూత్న ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటితోపాటు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, 40 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాగునీటి జలాశయాలకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. బహుళ ప్రయోజనకరంగా ఉండే ఈ ప్రాజెక్టులకు బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ. 52 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రుణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. వరల్డ్ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కొత్తగా నెలకొల్పిన న్యూ డెవలప్మెంట్ బ్రిక్స్ బ్యాంక్ ఏప్రిల్ నుంచి రుణ పంపిణీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ముందుగా అందిన ప్రతిపాదనలకు రుణాల్లో ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. అందుకే ప్రభుత్వం ముందు వరుసలో ఉండేందుకు సన్నద్ధమైంది. నెల రోజుల్లో ప్రతిపాదలను బ్యాంక్‌కు పంపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బ్రిక్స్ రుణం మొత్తం సిటీకే.. బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ.25 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం తొలుత అంచనాలు వేసింది. కానీ నగర పరిధిలో ప్రతిపాదనలో ఉన్న కొత్త ప్రాజెక్టులు, వాటికయ్యే అంచనా వ్యయాలను పరిశీలించి రూ.52 వేల కోట్ల సాయం కోరాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని రహదారులు, ఫ్లైఓ వర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి చేపట్టిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు, మూసీ నదీ సుందరీకరణ కు రూ.10 వేల కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు, తాగునీటి సమస్యకు పరిష్కారంగా శివార్లలో 40 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన రిజర్వాయర్లు, పైపులైన్లకు రూ.10 వేల కోట్లు కావాలని అధికారులు నివేదికలు సమర్పించారు. వీటిపై 3 వారాల్లో నివేదికలను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. బ్రిక్స్ నుంచి ఆశిస్తు న్న రుణాన్ని మొత్తం గ్రేటర్ ప్రాజెక్టులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రం లోని మిగతా కార్పొరేషన్లకు రూ.8 వేల కోట్లు రుణం కోరాలనే ప్రతిపాదనను విరమించుకుంది. అధునాతనంగా ప్రాజెక్టులు హైదరాబాద్‌ను విశ్వనగరాలకు పోటీగా నిలబెట్టేందుకు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగర పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు, నగరం చుట్టూ ఉన్న 11 పట్టణాలను ‘కౌంటర్ మాగ్నెట్ సిటీ డెవలప్మెంట్’ కిందకు తెచ్చే ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నగరం చుట్టూ ఉన్న సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, నాచారం, శంకర్పల్లి, మహేశ్వరం, షాద్‌నగర్, వికారాబాద్ పట్టణాలను ఇందులో చేర్చారు. ఈ పట్టణాలకు హైదరాబాద్‌కు మధ్య రాకపోకల సమయాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తే, సిటీలో పనిచేస్తున్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు ఈ పట్టణాల్లోనూ నివాసమేర్పరుచుకునే అవకాశాలు మెరుగుపడుతాయి. దీంతో గ్రేటర్ చుట్టూరా ఉన్న పట్టణాలు సైతం సిటీని తలదన్నేలా వృద్ధి చెందుతాయనేది ప్రభుత్వ వ్యూహం. అందుకే అధునాతన రహదారులు నిర్మిస్తారు. మరోవైపు మూసీ నదికి ఇరువైపులా ఆరు లేన్ల రహదారి నిర్మించాలని, మూసీ ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ పేరుతో కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. నార్సింగి నుంచి ఉప్పల్ వరకు దాదాపు 42 కి.మీ. రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోంది. -
వృద్ధిలో ఈ ఏడాది... చాంపియన్ ఇండియానే!
ప్రపంచ బ్యాంక్ నివేదిక * వృద్ధిరేటు అంచనా 7.8 శాతం * వృద్ధి వేగంలో భారత్ తర్వాత చైనా, అమెరికా ఐక్యరాజ్య సమితి: భారత్ 2016లో కూడా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి రేటును గత జూన్‌లో 7.9 శాతంగా అంచనావేయగా దానిని 7.8 శాతానికి తగ్గించింది. ఈ స్థాయి వృద్ధి రేటును కూడా భారత్మినహా ఏ దేశం సాధించలేదని పేర్కొంది. కాగా ప్రపంచం మొత్తంమీద వృద్ధి రేటును జూన్‌లో 3.3 శాతంగా అంచనావేయగా, దానిని తాజాగా 2.9 శాతానికి కుదించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... * భారత్ తరువాత వృద్ధి స్పీడ్‌లో చైనా ఉంది. 2016లో 6.7 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. 2017లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. వచ్చే రెండేళ్లలో ఈ రేటు వరుసగా 2.4 శాతం, 2.2 శాతంగా ఉంటుంది. * భారత్ 2017 వృద్ధి రేటు అంచనా 7.9 శాతం. సంస్కరణల వేగం నెమ్మదించినప్పటికీ ఈ స్థాయి వేగం నమోదవుతుంది. అయితే 2018 వృద్ధిరేటు అంచనాను సైతం 8 శాతం నుంచి 7.9 శాతానికి కుదించింది. ఇతర ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చిచూస్తే... భారత్ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకునే పరిస్థితి ఉంది. దేశీయ వాణిజ్యం పటిష్టమయ్యే సూచనలు ఉన్నాయి. తగిన పాలసీ నిర్ణయాల రూపకల్పన సామర్థ్యం ఉంది. * అయితే కొన్ని సవాళ్లూ ఉన్నాయి. ముఖ్యంగా సంస్కరణల విషయంలో ఈ సవాళ్లను ప్రస్తావించుకోవచ్చు. ఎగువ సభలో పాలకపార్టీకి మెజారిటీ లేకపోవడం- సంస్కరణల విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితిని సృష్టిస్తోంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఆయా అంశాల ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా పడుతోంది. భూ సంస్కరణలు నెమ్మదించడం పెట్టుబడుల జాప్యానికి సైతం దారితీస్తోంది. దేశంలో పారిశ్రామిక రంగం మందగమనాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. అయితే ప్రభుత్వ చొరవల కారణంగా పెట్టుబడుల ప్రక్రియ ముఖ్యంగా మౌలిక రంగంలో క్రమంగా పుంజుకుంటోంది. * దేశంలో మౌలిక రంగం పురోగతికి, పెట్టుబడుల వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా కఠిన ద్రవ్య విధానం ప్రభావం పడే అవకాశం ఉంది. * అంతర్జాతీయంగా ముడి చమురు ధరల దిగువస్థాయి ధోరణి భారత్ సంస్థలకు ఇంధన వ్యయాలను తగ్గిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశం ఇది. * కరెంట్ అకౌంట్‌లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రాక వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. -
నాలుగు ప్రాజెక్టులకు విదేశీ అప్పు
♦ రూ.9,050 కోట్లు తీసుకోవాలని నిర్ణయం ♦ రుణం ఇవ్వనున్న జైకా, ఏడీబీ, ప్రపంచ బ్యాంకు ♦ రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.4,390 కోట్లు సాక్షి, హైదరాబాద్: విదేశీ సంస్థల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగు ప్రాజెక్టులకు రూ.9,050 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యయం రూ.13,440 కోట్లు కాగా ఇందులో విదేశీ సంస్థలు రూ,9,050 కోట్లను సమకూర్చనున్నాయి. మిగతా రూ.4,390 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకోనుంది. ఈ నాలుగు ప్రాజెక్టుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి, ఆయా విదేశీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. రాష్ట్రంలో 21 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద 20 వేల హెక్టార్ల గ్యాప్ ఆయకట్టుకు, 485 చిన్ననీటి వనరుల కింద 12,800 హెక్టార్లకు సాగునీరు అందించేందుకు రూ.2,000 కోట్లతో రాష్ట్ర సమగ్ర వాటర్ మేనేజ్మెంట్ పేరిట ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం జపాన్ ఇంటర్నేషనల్ సహకార ఏజెన్సీ (జైకా) నుంచి రూ.1,700 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. కమ్యూనిటీ ఆధారిత వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,200 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ రుణంతో 1,200 చిన్న నీటి వనరుల కింద 1.20 లక్షల హెక్టార్లను సాగులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడీబీ) నుంచి రూ.3,750 కోట్ల రుణం తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగు పరిచేందుకు, విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2,400 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఈ నాలుగు ప్రాజెక్టులను ఐదేళ్ల కాలవ్యవధిలో అమలు చేయనున్నారు. -
ప్రపంచ బ్యాంకు సలహా‘భారం’రూ. 306 కోట్లు
సర్కారు సై అంటే ప్రజల చేతి ‘చమురు’ వదిలినట్లే ఫ్యూయల్ సెస్ పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు చేసిన ఓ ‘చిన్న’ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సై అంటే తెలంగాణ వాహనదారులపై గుట్టుచప్పుడు కాకుండా సాలీనా రూ.306 కోట్ల భారం పడుతుంది. ప్రసుత్తం ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వారం రోజుల కిందట ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నగరానికి వచ్చి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఆ ప్రతిపాదనపై నిర్ణయం కోసం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదే ‘ఫ్యూయల్ సెస్’ను పెంచే యోచన. ప్రస్తుతం లీటరు డీజిల్/పెట్రోలుపై రూ.1గా ఉన్న సెస్‌ను రూ.2కు పెంచాలనేదే ప్రపంచబ్యాంకు ‘సలహా’. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానికి బాటలు వేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ మెరుగ్గా ఉండాలని గుర్తించింది. ఇందుకు దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు పాత సింగిల్ రోడ్లను రెండు వరుసలకు విస్తరించటం, పాడైన రోడ్లను కొత్తగా మార్చటం, అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించటం లాంటివి ఉన్నాయి. ఇవేకాకుండా ప్రధాన రోడ్లను భారీ స్థాయిలో విస్తరించే ఆలోచనలో కూడా ఉంది. ఇది జరగాలంటే ప్రపంచ బ్యాంకు లాంటి విదేశీ సంస్థల నుంచి రుణం పొందాల్సి ఉంటుంది. అలా రుణం పొందాలంటే తెలంగాణకు ప్రత్యేకంగా ‘రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ తప్పనిసరి. దీన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించే క్రమంలో నగరానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కార్పొరేషన్ సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా ఉండాలని పేర్కొంది. ఎంత అప్పు కావాలంటే అంత ఇస్తామని, దాని వడ్డీ చెల్లించేందుకు వీలుగా ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవటం కూడా కార్పొరేషన్‌ను అవసరమనే కోణంలో చర్చ ప్రారంభించిన ప్రతినిధులు ఇందుకోసం మార్గాలను కూడా సూచించారు. ఆ కోవలో చెప్పిందే ఈ సెస్ బాగోతం. లీటరుకు రూపాయి వడ్డించే యోచన! ప్రస్తుతం లీటరు చమురుకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న సెస్‌లో మూడొంతులు కేంద్ర ప్రభుత్వానికే చేరుతున్నాయి. అలా కాకుండా దాన్ని రూ.2కు పెంచితే అదనంగా వసూలు చేసే రూపాయి వాటా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని, దాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదలాయించొచ్చని ఉచిత సలహా ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో వార్షికంగా 290 కోట్ల లీటర్ల డీజిల్ మరో 16 కోట్ల లీటర్ల పెట్రోలు అమ్ముడవుతోంది. అంటే 306 కోట్ల లీటర్ల చమురన్నమాట. దీనిపై రూపాయి చొప్పున సెస్ భారం పడనుంది. అంటే సాలీనా రూ.306 కోట్ల అదనపు భారం పడనుందన్నమాట. ఇది గుట్టుచప్పుడు కాకుండా జరిగే ప్రక్రియ. దాన్ని గుర్తించకుండానే వాహనదారులు ఆ మొత్తాన్ని జేబు నుంచి చెల్లించేస్తారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సై అంటే చమురు పోటు తప్పదన్నమాట. -
వాహనదారులపై రూ.306 కోట్ల పోటు?
♦ ప్రభుత్వ పరిశీలనలో ఫ్యూయల్ సెస్ పెంపు ప్రతిపాదన ♦ లీటర్‌కు రూపాయి మేర పెంచాలని ప్రపంచ బ్యాంకు సూచన ♦ ప్రతిపాదిత రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నిధుల కోసమే ♦ వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు పొందాలంటే ఈ కార్పొరేషన్ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు చేసిన ఓ ‘చిన్న’ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సై అంటే వాహనదారుల చేతి చమురు వదలనుంది. వారిపై సాలీనా రూ.306 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ప్రతిపాదిత ‘రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’కు నిధుల కోసం ప్రస్తుతం లీటర్ డీజిల్/పెట్రోల్ విక్రయాలపై రూ.1గా ఉన్న ఫ్యూయల్ సెస్‌ను రూ.2కు పెంచుకోవాలంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వానికి ఇటీవల సూచించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో పెట్టుబడుల కోసం తీవ్రం గా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానికి బాటలు వేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ మెరుగ్గా ఉండాలని గుర్తించింది. ఇందుకు దాదాపు రూ.10వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టిం ది. ఇందులో కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు పాత సింగిల్ రోడ్లను రెండు వరుసలకు విస్తరించటం, పాడైన రోడ్లకు మరమ్మతులు చేయడం, అవసరమై న చోట్ల వంతెనలు నిర్మించటం లాంటివి ఉన్నాయి. ఇవి కాకుండా ప్రధాన రోడ్లను భారీగా విస్తరించే ఆలోచనలో కూడా సర్కారు ఉంది. ఇది జరగాలంటే ప్రపంచ బ్యాంకు లాంటి విదేశీ సంస్థల నుంచి రుణం పొందాలి. ఇందుకు తెలంగాణకు ప్రత్యేకంగా ‘రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ తప్పనిసరి. దీన్ని ఏ ర్పాటు చేసుకోవాలని సూచించేందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులతో గత వారం సమావేశమైన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.. ప్రతిపాదిత కార్పొరేషన్ సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకునేలా ఉండాలని సూచించారు. ఎంత అప్పు కావాలంటే అంత ఇస్తామని, దాని వడ్డీ చెల్లించేందుకు వీలుగా ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవటం కూడా కార్పొరేషన్‌కు అవసరమనే కోణంలో చర్చ ప్రారంభించిన ప్రతినిధు లు ఇందుకు మార్గాలను కూడా సూచిస్తూ ఈ మేరకు ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం లీటరు చమురుకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న సెస్‌లో మూడొంతులు కేంద్ర ప్రభుత్వానికే చేరుతోంది. అలా కాకుండా దాన్ని రూ.2కు పెంచితే అదనంగా వసూలు చేసే రూపాయి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సలహా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో వార్షికంగా 290 కోట్ల లీటర్ల డీజిల్, 16 కోట్ల లీటర్ల పెట్రోల్ కలిపి 306 కోట్ల లీటర్ల చమురు అమ్ముడవుతోంది. దీనిపై రూపాయి చొప్పున అదనపు సెస్ విధిస్తే వాహనదారులపై సాలీనా రూ.306 కోట్ల అదనపు భారం పడుతుంది. -
గ్రామీణ సమ్మిళిత పథకాన్ని ప్ర్రారంభించిన సీఎం
-
‘పల్లెప్రగతి’పై తేలని పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ ముందుకు సాగేలా కన్పించడం లేదు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ ప్రాజెక్ట్ కింద గ్రామీణ పేదరిక నిర్మూలన ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు రూ.642 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో ప్రభుత్వం తన వాటా కింద రూ.192 కోట్లు ఖర్చు చేయనుండగా, మిగిలిన రూ.450 కోట్లను రుణంగా ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు గత మార్చి నెలలోనే అంగీకారం తెలిపింది. దీంతో తన వాటా నిధులతో ఏప్రిల్ 1న తెలంగాణ పల్లె ప్రగతి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది బడ్జెట్లో ఇందుకోసం రూ.30 కోట్లు కేటాయించింది. ప్రపంచబ్యాంక్ ఇచ్చే రుణానికి వార్షిక వడ్డీ రేటుపై కొనసాగుతున్న వివాదం నేటికీ కొలిక్కి రాకపోవడంతో పల్లెప్రగతి ప్రాజెక్ట్ కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రుణానికి చెల్లించాల్సిన వడ్డీరేటుపై ఉన్నతాధికారులు ప్రపంచబ్యాంకు ప్రతి నిధులతో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో 2.75% ఫిక్స్డ్ వడ్డీకి అంగీకరించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తాజాగా, తాము పొరపాటు పడ్డామని 3.75% చెల్లిస్తేనే రుణం ఇస్తామని ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. గతంలో వడ్డీరేటుపై ఒప్పందం జరిగినపుడు ఉన్న అప్పటి పీఆర్ ముఖ్య కార్యదర్శి ఇటీవల రెవెన్యూశాఖకు బదిలీ కావడం, ప్రస్తుత ముఖ్య కార్యదర్శి సెలవులో ఉండడంతో వడ్డీరేటును పునః సమీక్షించడంలో ఇబ్బంది ఏర్పడింది. అంతేకాకుండా వడ్డీరేటు ప్లోటింగ్లోనా, ఫిక్స్డ్గానా.. అనే అంశాన్ని ఖరారు చేయడంలోనూ ప్రభుత్వం తేల్చలేదు. వడ్డీరేటు ఖరారైతేగానీ రుణ కాంట్రాక్ట్‌పై ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుకాదని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ప్రాజెక్ట్ కొనసాగింపుపై సెర్ప్ అధికారుల్లోనూ డోలాయమాన పరిస్థితులు నెలకొన్నాయి. -
'ఇలాగే వదిలేస్తే 2030నాటికి పెనుప్రమాదం'
న్యూయార్క్: వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి ప్రపంచ బ్యాంకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ దేశాలు ఈ విషయంలో దృష్టి సారించకుంటే చాలామంది జీవితాలు పేదరికంలో నెట్టినట్లే అవుతుందని స్పష్టం చేసింది. 2030నాటికి ఇలాగే కొనసాగితే దాదాపు పది కోట్ల మంది పేదరికంలో కూరుకుపోవడం ఖాయం అని తీవ్రంగా హెచ్చరించింది. సముద్ర మట్టాలను, వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీత మార్పులను గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌ను ప్రపంచ దేశాలు పట్టించుకోవాలని, దీనిని రక్షించుకునేందుకు ఒక స్పష్టమైన ఒప్పందానికి వచ్చి దాని మేరకే నడుచుకోవాలని స్పష్టం చేసింది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులపై ప్రపంచ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది సెప్టెంబర్ లో లక్ష్యంగా పెట్టుకున్న 17 అంశాల్లో ప్రపంచ దేశాల్లో పేదరికం రూపుమాపడమనేది కీలక అంశం అని, గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే ఆ లక్ష్యం నెరవేరడం అస్సలు సాధ్యం కాదని, బడుగుల జీవితంపై అది తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా కొత్తగా పేదవాళ్లను సృష్టిస్తుంది. ఇది ఓ రకంగా 2030నాటికి ఇదొక ఉపద్రవంగా పరిణమించే అవకాశం ఉందని కూడా ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. -
భారత్‌లో వ్యాపార పవనాలు
బిజినెస్ అనుకూల దేశాల జాబితాలో 12 స్థానాలు జంప్, 130వ ర్యాంకు * మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణలో 8వ స్థానం * ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. భారత్ వంటి భారీ దేశం ఒక్కసారిగా 12 స్థానాలు దూసుకెళ్లడం చెప్పుకోతగ్గ విజయమేనని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్టు కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు ఇది సానుకూల సంకేతమన్నారు. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్‌కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిల్యాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా (84), పాకిస్తాన్ (138) ర్యాంకుల్లో ఉన్నాయి. కనీస పెట్టుబడి పరిమితి నిబంధనలను తొలగించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించడాన్ని భారత్ మరింత సులభతరం చేయడం సానుకూలాంశమని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. విద్యుత్ కనెక్షను అనుమతులు (70వ స్థానం), నిర్మాణ అనుమతులు (183వ స్థానం), ప్రాపర్టీ నమోదు (138వ ర్యాంకు) తదితర అంశాలు భారత ర్యాంకింగ్‌కు ప్రాతిపదికగా నిల్చాయి. ఇక వ్యాపారాల ప్రారంభానికి పట్టే సమయం విషయంలో భారత్ 164వ స్థానం నుంచి 155వ ర్యాంకుకు చేరడం చెప్పుకోతగ్గ మరో పరిణామం. భారత్‌లో వ్యాపారం ప్రారంభించాలంటే 12 పైగా ప్రక్రియలు పాటించాల్సి వస్తోంది. ఇందుకు 29 రోజులు పడుతోంది. నిర్మాణ అనుమతులు విషయంలో భారత ర్యాంకింగ్ స్వల్పంగా 184వ స్థానం నుంచి 183వ స్థానానికి పెరిగింది. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో మాత్రం 99వ ర్యాంకు నుంచి 70వ స్థానానికి ఎగబాకింది. అయితే, రుణ సదుపాయం లభ్యత, పన్నుల చెల్లింపుల విషయంలో మాత్రం దేశ ర్యాంకింగ్ తగ్గింది. మరోవైపు, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు పరిరక్షించడంలో భారత్ అంతర్జాతీయంగా 8వ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో అమెరికా (35), జర్మనీ (49), జపాన్ (36) వంటి పలు సంపన్న దేశాల కన్నా కూడా ముందు నిల్చింది. బ్రిక్స్ కూటమిలో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) భారత్ మెరుగ్గా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. జీఎస్టీ అమలు కీలకం.. భారత ర్యాంకింగ్ పెరగడానికి విద్యుత్ లభ్యత, కొత్త కంపెనీల చట్టం తదితర అంశాలు దోహదపడ్డాయని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా ప్రపంచ బ్యాంకు భారత విభాగం డెరైక్టరు ఒనో రుహల్ చెప్పారు. భారత్‌ను ఒకే పెద్ద మార్కెట్‌గా మార్చడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధాన సంస్కరణ అమలు కీలకమని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తెస్తే.. 2018 నాటికి ఆ ప్రభావాలు కనిపించడం మొదలు కాగలదని ఒనో రుహల్ పేర్కొన్నారు. అయితే, వ్యాపారాల విషయంలో భారత్ స్కోరు మెరుగుపడటానికి ఇదొక్కటే సరిపోదని, మరిన్ని సంస్కరణలు అవసరమవుతాయని వివరించారు. టాప్ 100లో చేరే సత్తా ఉంది.. నిర్దేశించుకున్న ఆర్థిక సంస్కరణలను భారత్ అమల్లోకి తెస్తే వచ్చే ఏడాది టాప్ 100 దేశాల జాబితాలో చేరడం కష్టమేమీ కాదని కౌశిక్ బసు చెప్పారు. ఇందుకోసం జీఎస్టీని అమలు చేయడం, బ్యూరోక్రసీపరమైన అడ్డంకులు తొలగించడం కీలకమన్నారు. సాధారణంగా ఇతర దేశాలు సంస్కరణలు చేపట్టిన తొలి ఏడాది స్వల్పంగా, ఆ తర్వాత రెండు.. మూడు సంవత్సరాల్లో గణనీయంగా ర్యాంకులు మెరుగుపర్చుకుంటాయని బసు చెప్పారు. కానీ, భారత్ తొలి ఏడాదిలోనే చెప్పుకోతగ్గ స్థాయిలో ర్యాంకు మెరుగుపర్చుకుందన్నారు. ర్యాంకు మరింత పెంచుకుంటాం: జైట్లీ ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఇచ్చిన తాజా ర్యాంకింగ్.. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం పూర్తిగా ప్రతిబింబించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో భారత్ స్థానం వచ్చే ఏడాది మరింతగా మెరుగుపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1 దాకా గణాంకాల ఆధారంగానే ప్రస్తుత ర్యాంకింగ్ ఉందని, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యల ప్రభావం వచ్చే ఏడాది కనిపించగలదని జైట్లీ చెప్పారు. ఆదాయ పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలాగే కంపెనీల చట్టంలోని సంక్లిష్టతలను తొలగించేందుకు కమిటీ కసరత్తు చేస్తోందని తెలిపారు. -
12 స్థానాలు ఎగబాకిన భారత్
వాషింగ్టన్ : వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 12 స్థానాలు ఎగబాకింది. 189 దేశాలకు గానూ భారత్ ప్రస్తుతం 130 స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. గతేడాది 140వ స్థానంలో ఉన్న భారత్ 12 స్థానాలు మెరుగు పరుచుకోవడం ఆ దేశానికి బాగా కలిసొస్తుందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు అన్నారు. ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్ 'బిజినెస్ 2016' నిమిత్తం జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ఫలితాలు భారత్‌లో వ్యాపార పెట్టుబడులకు అనుకూలంగా మారనున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఒకటైన భారత్‌లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహద పడుతుందని ప్రపంచ బ్యాంక్ అధికారి, గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూప్ డైరెక్టర్ లోపేజ్ కార్లోస్ పేర్కొన్నారు. ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్, డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ పొరుగు దేశాలైన చైనా 84, పాక్ 138 స్థానాల్లో ఉన్నాయి. గతేడాది నివేదికలో చైనా 90, పాక్ 128 స్థానాల్లో ఉన్న విషయం విదితమే. -
భగీరథ యత్నం..!
కోటి ఎకరాల ఆయకట్టు లక్ష్యం.. లక్ష కోట్ల ఖర్చు ఐదేళ్లలో ప్రాజెక్టుల పూర్తి.. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు నూతన జల విధానంతో సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం దసరా తర్వాత ప్రజలు, పార్టీల ముందుకు.. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం.. సుమారు రూ.లక్ష కోట్ల ఖర్చుతో కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడం.. నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూమికి సాగుయోగ్యత కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర జల విధానం ముస్తాబైంది. ఐదేళ్లలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటిచుక్కను ఆయకట్టుకు మళ్లించడం, అవసరాలకు తగినట్లుగా నిల్వ, వినియోగం చేసుకునేలా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. వరద ఉండే కొద్దిరోజుల్లోనే గరిష్ట స్థాయిలో నీటిని ఒడిసిపట్టుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో... కొత్త రాష్ట్రానికి జల విధానం అవసరమేమిటి, తక్షణం ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు, రీ ఇంజనీరింగ్ ఎందుకు అవసరమవుతోంది, కొత్త, పాత ప్రాజెక్టుల పూర్తికి విధించుకున్న లక్ష్యాలు, బడ్జెట్, సమస్యలపై అటు ప్రజలకు, ఇటు పార్టీలకు స్పష్టతనిచ్చేలా నివేదిక సిద్ధం చేసింది. ఈ జల విధానంలో పొందుపరిచిన విషయాలను ‘సాక్షి’ సేకరించింది. జల విధానం ఎందుకంటే? రాష్ట్రంలో గోదావరి పరీవాహకం 69 శాతం, కృష్ణా పరీవాహకం 68.5 శాతం ఉన్నా... ఉమ్మడి ఏపీలో ఇక్కడి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. తెలంగాణ బేసిన్ల నుంచి నీటిని కోస్తాంధ్రకు బదలాయించి అక్కడ రెండు పంటలకు నీళ్లిచ్చారు, తెలంగాణలో ఒక పంటకే నీరిచ్చా రు. 50 ఏళ్లలో చెరువుల కింద సాగు తగ్గింది. ప్రాజెక్టుల కిందా సాగు పెరగలేదు. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం పెరిగి.. నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. ఈ దృష్ట్యా గోదావరి, కృష్ణా నదుల్లోని 1,296 టీఎంసీల నికర, మిగులు జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు నూతన జల విధానాన్ని రూపొందించుకుంది. అసమాన నీటి పంపిణీ సమస్యను పరిష్కారించి.. తగిన ప్రణాళిక, నిర్వహణతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడమే ఈ విధాన ఆశయం. ఖర్చు తగ్గించేందుకే ఇప్పటికే నిర్మాణంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి, కొత్తవాటిని నిర్మిం చి.. మొత్తంగా 1.12 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వ్యయం తగ్గించడం, ఎత్తిపోతల ఖర్చు తగ్గించడం, సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటానికి రీ ఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇక భూగర్భ జలమట్టం పెంపునకు ఆధునిక సాంకేతిక పద్ధతులను తీసుకురావాలని, భూగర్భ జలాల పెంపునకు సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించడం, పూర్తయిన ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడం, వివిధ బేసిన్ల మధ్య నీటిని బదిలీ చేసి సమతుల్యత సాధించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా చేపట్టిన అంశాలు. నాలుగు ప్రాజెక్టులు కీలకం దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల, శ్రీరాంసాగర్ వరద కాలువ, ఇందిరా, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం పనులు చేపట్టినా ఇప్పటి వరకు లక్ష్యాలను చేరుకోలేదు. కంతనపల్లికి 50 టీఎంసీల మేర కేటాయింపులున్నా ఇంతవరకు నీటి వినియోగం జరగలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వరంగల్ జిల్లా ఏటూరునాగారం వద్ద నిర్మించదలిచిన 22.5 టీఎంసీల బ్యారేజీ నిర్మాణమే పూర్తి చేయలేదు. నిర్దేశిత 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే రెండు మూడు రిజర్వాయర్లు అవసరం. వాటిని ఎక్కడ చేపట్టాలన్నది తేలలేదు. గోదావరిపై దేవాదుల ప్రాజెక్టు ద్వారా 38.182 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నిర్ణీత నీటి కేటాయింపులకు, ఆయకట్టు లక్ష్యానికి పొంతన కుదరకపోవడం తో నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచారు. అయినా ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిపై గందరగోళం కొనసాగుతోంది. ఎందుకం టే దేవాదుల ఆయకట్టు మధ్యలో కొంత ఎస్సారెస్పీ వరద కాల్వ ఆయకట్టు ఉంది. తర్వాత మళ్లీ దేవాదుల ఆయకట్టు ఉంది. కొన్ని చోట్ల 2 ప్రాజెక్టులకు ఒకే ఆయకట్టు ఉంది. 160 టీఎంసీలు వినియోగించుకునే ప్రాణహిత-చేవెళ్ల బ్యారేజీని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర వ్యతిరేకించడంతో మేటిగడ్డకు మార్చారు. ఈ ప్రాజెక్టుకు ఏకంగా 16 రిజర్వాయర్లను 124 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు కసరత్తు పూర్తయింది. దుమ్ముగూడెం ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారడంతో కొత్తగా రోళ్లపాడు, బయ్యారం వద్ద బ్యారేజీలను నిర్మించి, ఖమ్మం జిల్లా అంతా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గోదావరిలో కోలాటం.. కృష్ణాలో జంజాటం గోదావరిలో రాష్ట్రానికి పుష్కలంగా నీటి కేటాయింపులున్నా... ప్రాజెక్టులు పూర్తికాక నీటిని వినియోగించుకోలేక పోతున్నాం. మరోవైపు కృష్ణాలో కేటాయింపులు లేక నీటి కోసం పోరాడుతున్నాం. 1956కు ముందటి హైదరాబాద్ రాష్ట్రానికి కృష్ణా బేసిన్లో 542.79 టీఎంసీల మేర కేటాయింపులు ఉండేవి. అందులో 175 టీఎంసీల మేర గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్నా ఉమ్మడి ఏపీలో అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఆ తర్వాత బచావ త్ ట్రిబ్యునల్ నీ టి కేటాయింపుల్లో ఎక్కువగా ఏపీకే లబ్ధి చేకూరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు ప్రస్తు తం 299 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. ఇందులో ఒక్క జూరాలకు మినహా కరువుపీడిత ప్రాంతాలకు, ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటి కేటాయింపులు లేవు. బచావత్ ప్రకారం ఆర్డీఎస్ కెనాల్‌కు 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా... ఏపీ, కర్ణాటకల తీరుతో అందడం లేదు. ప్రస్తుతం నీటిని తిరిగి కేటాయించాలంటూ కోర్టులు, ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోంది. ఇక గోదావరిలో లభ్యత జలాలు పుష్కలంగా ఉన్నా... ఎగువ రాష్ట్రాల తీరుతో దిగువకు నీరు రావడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర కట్టిన అనధికార ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్‌కు నీరు చేరడం లేదు. సింగూరు జలాలను పూర్తిగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకే మళ్లిస్తుండటంతో దిగువన నిజాంసాగర్‌కు నీటి విడుదల జరగడం లేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరాలతో జాప్యం జరుగుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి మిగులు జలాలను కృష్ణాకు తరలించాలని కేంద్రం భావిస్తోంది. కానీ నిజానికి గోదావరిలో ఎలాంటి మిగులు జలాలు లేవు. చేయాల్సింది మరెంతో.. భారీ, మధ్యతరహా సహా ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ రూ.1.30 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.41వేల కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.87 వేల కోట్ల వ్యయం చేయాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 60 లక్షల ఎకరాల మేర నీరివ్వాల్సి ఉండగా.. 6.87లక్షల ఎకరాల మేర మాత్రమే ఇచ్చారు. ఇక చిన్న నీటి వనరుల కింద 20 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉన్నా... సాగులో ఉన్నది కేవలం 10 లక్షల ఎకరాలే. ఇక్కడా పూర్తిస్థాయిలో ఆయకట్టును వృద్ధి చేయాల్సి ఉంది. ఇక ప్రాజెక్టులకు అదనంగా బ్యారేజీలు నిర్మిస్తే మరింత ఆయకట్టు పెరుగుతుంది. మొత్తంగా కోటి ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటుంది. మరోవైపు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు రెండు మూడేళ్లలోనే నీరివ్వాలని సంకల్పించారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. భారీగా విద్యుత్ వ్యయం.. రాష్ట్రంలో చేపడుతున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలు భారీగా ఉండనున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటితోపాటు కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు కలిపి దాదాపు 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరంకాగా.. దీనికోసం ఏటా రూ.10వేల కోట్ల మేర ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. 15 ఎత్తిపోతల పథకాలతో 370 టీఎంసీల నీటిని వినియోగించి.. 40.21లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 1.34లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 5,903 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇవి పూర్తయి విద్యుత్ వాడుకుంటే.. యూనిట్‌కు రూ.5.37 చొప్పున లెక్కించినా ఏటా రూ.7,640 కోట్ల మేర ఖర్చవుతుంది. ఇక ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతలకు కలిపి మరో 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. వీటికి మరో రూ.3వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ధర పెరిగితే ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎత్తిపోతలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తోంది. ‘లక్ష’ సాగు 61 నియోజకవర్గాల్లోనే.. రాష్ట్రంలో 2.76 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. సాగుకు అనువైన భూమి 1.67 కోట్ల ఎకరాలు. ప్రస్తుతం 46.99 లక్షల ఎకరాలు సాగులో ఉంది. హైదరాబాద్ మినహా 9 జిల్లాలోని 104 నియోజకవర్గాల్లో 61 నియోజకవర్గాల్లోనే లక్ష ఎకరాలకు పైగా సాగులో ఉంది. 75 వేల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నవి 11 నియోజకవర్గాలు, 50 వేల ఎకరాలకు పైగా ఉన్నవి 12 ఉన్నాయి. 20 నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాల కంటే తక్కువగా సాగులో ఉంది. అన్ని నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల సాగు జరిగేలా నూతన జల విధానం రూపొందింది. భూసేకరణే గుదిబండ నిర్మాణంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో రిజర్వాయర్, డ్యామ్‌లు, కాలువల పనులు ముగిసినప్పటికీ ఇతర శాఖల పరిధిలో తేల్చుకోవాల్సిన అంశాలు, భూసేకరణ పూర్తికాకపోవడం వంటివి ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితికి కారణమవుతున్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులు, ప్రధాన ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో భూసేకరణ అవసరమైన ప్రాజెక్టులు 36 వరకు ఉండగా... వాటిలో ఇప్పటివరకు 7 ప్రాజెక్టులకు మాత్రమే భూసేకరణ పూర్తిచేయగలిగారు. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి సేకరణ పెండింగ్‌లోనే ఉంది. మొత్తంగా 36 ప్రాజెక్టులను కలిపి 3,09,132 ఎకరాల మేర భూమి కావాలని గుర్తించగా.. ఇప్పటిదాకా 2,14,551 ఎకరాలు సేకరించారు. మరో 94,580 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కొత్తగా ఇచ్చిన జీవో 123తో సేకరణ మొదలుపెట్టినా ఆశించిన సమయంలోగా పూర్తిచేయడం కష్టమే. చిన్ననీటి వనరులపైనా దృష్టి రాష్ట్రంలో చిన్ననీటి వనరులకు కృష్ణా, గోదావరి నదుల నుంచి 262 (కృష్ణాలో 97, గోదావరిలో 165) టీఎంసీలను పూర్తిస్థాయిలో సద్వినియోగ పరుచుకొని చెరువుల కింద ప్రతి ఎకరాన్ని తడపడమే లక్ష్యంగా ప్రభుత్వం మిషన్ కాకతీయను రూపొందించుకుంది. గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేలా ముందుకు వెళ్లేలనేది ప్రభుత్వ ప్రణాళికలో భాగం. సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన 46,531 చిన్న నీటివనరుల కింద మొత్తంగా 20.09 లక్షల ఎకరాల ఆయకట్టును రూ.20 వేల కోట్లతో వృద్ధిలోకి తేవాలని.. ఏడాదికి 20శాతం చెరువుల (సుమారు 9వేలు) చొప్పున పునరుద్ధంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా తొలి ఏడాది రూ. 2వేల కోట్లతో 9,651 చెరువుల పనులను చేపట్టింది. ఇందులో 8 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇక చెరువుల కబ్జాలకు పాల్పడినా, చెరువులను దెబ్బతీసే చర్యలకు పాల్పడినా కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. నదుల అనుసంధానం.. దక్షిణాదిలోని మహానది-గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. గోదావరిలో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయని చెబుతూ రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు... అటునుంచి పెన్నా, కావేరీలకు తరలించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఇక్కడ లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనేది సరికాదని తెలంగాణ వాదిస్తోంది. గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), ఎల్లంపల్లి (60టీఎంసీలు), దేవాదుల (38 టీఎంసీలు), కంతనపల్లి (50టీఎంసీలు) సహా ఇతర ప్రాజెక్టుల నీటి అవసరాలను వివరిస్తూ దీన్ని అడ్డుకునే యత్నం చేస్తోంది. - సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి లక్ష్యాలపై వరల్డ్‌బ్యాంకుకు నివేదిక రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రా జెక్టులకు ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు అవసరమనే వివరాలను ప్రభుత్వం వరల్డ్‌బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. ప్రాధాన్యతా క్రమంలో ఏయే ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేసేదీ, వాటికి అవసరమై న నిధులు, వాటిని ఏరీతిన ఖర్చు చేయనున్నన్న అంశాలను పేర్కొంది. ఈ నివేదిక మేరకు... రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి రూ.1.03 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగిసేనాటికి (అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి) సుమారు రూ.55,931కోట్లు అవసరం. మిగతా రూ.47,120 కోట్లు తర్వాతి మూడేళ్లలో వెచ్చించాల్సి ఉంటుంది. వరల్డ్ బ్యాంకుకు చెప్పినట్లే ప్రభుత్వం ప్రాజెక్టులపై ఏటా రూ.25 వేలకోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. అంటే వచ్చే మూడేళ్లలోనే రూ.75వేల కోట్ల మేర కేటాయించే అవకాశముంది. వీటికి తోడు కేంద్రం నుంచి వచ్చే ఏఐబీపీ, ట్రిపుల్ఆర్ నిధులు, వివిధ బ్యాంకులు అందించే రుణాల లక్ష్యాలను ప్రభుత్వం జల విధానంలో వివరించనుంది. -
ఆశపెడుతున్న అంకెలు
గణాంకాలు వెల్లడించే అంశాలపై చాలామందికి నమ్మకం ఉండదు. కళ్లెదురుగా కనబడే వాస్తవాలకూ, అవి చెప్పే విషయాలకూ తరచు పొంతన కుదరకపోవడమే అందుకు కారణం. కనుకనే చాలా దేశాలు పేదరికంనుంచి బయటపడుతున్నాయని, పేదల సంఖ్య తగ్గుతున్నదని ఈమధ్య ప్రపంచబ్యాంకు చేసిన ప్రకటనను అందరూ సంశయంతో చూస్తున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇంత మంచి శుభవార్త ప్రపంచ బ్యాంకు నోటి వెంబడి వెలువడటం ఇదే మొదటిసారి. అసలు మానవాళి చరిత్రలోనే పేదరికాన్ని తగ్గించుకోవడం ఇది తొలిసారి అవుతుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ అంటున్నారు. ఇంతకూ ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనాలు ఏం చెబుతున్నాయి? ఈ ఏడాది ఆఖరుకల్లా ప్రపంచ జనాభాలో పేదలు పది శాతం కన్నా తక్కువ ఉండబోతున్నారని ఆ అంచనాలు అంటున్నాయి. 2012లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 90.2 కోట్లమంది (12.8 శాతం) నిరుపేదలుండగా, ఇప్పుడు వారి సంఖ్య 70.2 కోట్లమంది (9.6 శాతం)గా తేలిందని చెబుతోంది. చాలా దేశాల్లో ఆర్థికాభివృద్ధి జరగడమే ఇందుకు కారణమంటోంది. మన దేశం గురించి కూడా ఆ నివేదిక కొన్ని అంచనాలిచ్చింది. ప్రపంచంలో ఎక్కువమంది పేదలు భారత్‌లోనే ఉన్నారని ఆ నివేదిక చెబుతున్నా అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికం రేటు తక్కువగా ఉండేది భారత్‌లోనేనని వెల్లడించింది. అసలు పేదలంటే ఎవరు...పేదరికం అంటే ఏమిటన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సంతృప్తికరమైన జవాబులు లేవు. కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తలు సైతం ఆ విషయంలో తలో మాటా చెబుతున్నప్పుడు సామాన్య పౌరులు గందరగోళ పడటంలో ఆశ్చర్యం లేదు. యూపీఏ హయాంలో ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరించిన రంగరాజన్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక దేశంలో 36 కోట్ల 30 లక్షలమంది పేదలున్నారని అంచనా వేసింది. ఇది దేశ జనాభాలో 29.6 శాతం. ఆయన లెక్క ప్రకారం ప్రతి పదిమందిలోనూ ముగ్గురు పేదలు. ఇందుకు కొలమానంగా తీసుకున్న ప్రాతిపదికలు చిత్రంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 32 కన్నా తక్కువ, పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 47 కన్నా తక్కువ మొత్తంతో గడిపేవారిని అది పేదలుగా పరిగణించింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సొమ్ముతో బతకడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ప్రపంచబ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో పేదలు 12.4 శాతం మాత్రమే. కేవలం సంపాదనను మాత్రమే కాక ఇతరేత అంశాలను కూడా తీసుకోవడంవల్ల ఈ అంచనాలకొచ్చామని బ్యాంకు చెబుతోంది. వర్థమాన దేశాలకు అప్పులివ్వడం, అందుకు షరతులు విధించడం, ప్రభుత్వాల విధానాలను ప్రభావితం చేయడం మౌలికంగా ప్రపంచబ్యాంకు చేసే పనులు. దీంతోపాటు 1990 నుంచి ప్రపంచంలో పేదరికం ఎలా ఉన్నదో తెలుసుకునే బాధ్యతను కూడా అది నెత్తిన వేసుకుంది. రోజుకు 1.25 డాలర్ల సంపాదనను సూచీగా పెట్టుకుని అంతకంటే తక్కువ సంపాదించేవారిని గతంలో అది పేదలుగా లెక్కేసేది. 2005 నుంచీ ఈ పద్ధతినే పాటిస్తున్నది. ఈసారి దాన్ని సవరించుకుంది. 2011నాటి ధరలను పరిగణనలోకి తీసుకుని రోజుకు 1.90 డాలర్ల కన్నా తక్కువ సంపాదించేవారిని అది పేదలుగా లెక్కేసింది. వివిధ దేశాల్లోని జీవన వ్యయాన్ని, అక్కడి జీవన ప్రమాణాల్ని కూడా పరిగణించి తాము ఈ అంచనాలకొచ్చినట్టు చెప్పింది. ప్రపంచంలో 90 కోట్ల మంది పేదలున్నారని 2012లో ప్రపంచబ్యాంకు అంచనా వేయగా తాజా ప్రాతిపదికల ప్రకారం అది 70 కోట్లు మాత్రమే. అంటే మూడేళ్ల వ్యవధిలో 20 కోట్లమంది పేదరికంనుంచి బయటపడ్డారన్నమాట. అలాగే దక్షిణాసియాలో 2012లో 30.92 కోట్ల మంది నిరుపేదలుండగా ఈసారి అది 23.13 కోట్లకు చేరుకుంది. ఇలా మొత్తంగా చూస్తే పేదరికం గణనీయంగా తగ్గినా అది దక్షిణాసియాలో, ఆఫ్రికాలో ముమ్మరంగా ఉంది. గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్నదని చెబుతున్న అభివృద్ధిగానీ, పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రపంచ సంస్థల నేతృత్వంలో తీసుకుంటున్న చర్యలుగానీ ఆఫ్రికా ఖండంలోని నిరుపేద దేశాలను తాకలేదని ప్రపంచబ్యాంకు నివేదికను గమనిస్తే అర్థమవుతుంది. వాస్తవానికి 2030 కల్లా ప్రపంచంలో పేదరికం నిర్మూలన కావాలని, అది గరిష్టంగా 3 శాతంమించి ఉండరాదని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి లక్ష్యాల ప్రకటన చెబుతోంది. గత అనుభవాలన్నీ చూసి, ప్రస్తుత ప్రపంచబ్యాంకు నివేదికను గమనించాక ఇది ఎంతవరకూ సాధ్యమన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. గత దశాబ్దకాలంలో కొన్ని వర్థమాన దేశాలు అభివృద్ధి సాధించిన మాట వాస్తవమే అయినా అదే స్థితి రాగల కాలంలో కొనసాగుతుందని చెప్పలేం. అవి వచ్చే రెండు దశాబ్దాల్లోనూ అదే తరహా వృద్ధి రేటును సాధించిన పక్షంలో మాత్రమే ఐక్యరాజ్యసమితి చెప్పినట్టు పేదరికం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. పేదరికాన్ని రూపుమాపడంతో పాటు ఆకలిని పారదోలడం, వ్యాధులపై చేసే పోరులో పైచేయి సాధించడంవంటివి సమితి లక్ష్యాల్లో ఉన్నాయి. అవి సాధ్యం కావాలంటే ఏటా దాదాపు 5 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయి. ఇప్పుడున్న 9.6 శాతం పేదరికం రేటును 2020కల్లా 9 శాతానికి తగ్గించగలిగితే 2030 నాటికి పేదరికం నిర్మూలన అన్న లక్ష్యం నెరవేరుతుందని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు కిమ్ అంటున్నారు. అది కుదిరే పనేనా? పదిహేనేళ్లక్రితం పెట్టుకున్న సహస్రాబ్ది లక్ష్యాలను సాధించడంలో మనతో సహా ఎన్నో దేశాలు వెనకబడ్డాయి. ఆర్థికాభివృద్ధి ఉపాధి కల్పనలో ప్రతిబింబించి... విద్య, వైద్యం వంటి అంశాల్లో ప్రజల స్తోమత పెరిగినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమైందని ధైర్యంగా చెప్పగలుగుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ కృషి చేయనంతవరకూ ఎలాంటి గణాంకాలైనా ధైర్యాన్నివ్వలేవు. -
‘నీరాంచల్’కు కేబినెట్ ఓకే
ప్రపంచబ్యాంక్ సహకారంతో జాతీయ వాటర్ షెడ్ పథకం ♦ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ♦ యుద్ధ స్మారక నిర్మాణాలకు రూ. 500 కోట్లు న్యూఢిల్లీ: రైతులకు నీటిపారుదల సౌకర్యాలను పెంచే ఉద్దేశంతో రూ. 2,142.30 కోట్లతో జాతీయ వాటర్‌షెడ్ నిర్వహణ పథకం ‘నీరాంచల్’కు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఏఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 50% (రూ.1,071.15 కోట్లు) ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 50 శాతాన్ని ప్రపంచబ్యాంక్ రుణంగా అందించనుంది. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలోను, అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత రవాణా మంత్రి నితిన్ గడ్కారీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కృషి సంచయి యోజనలోని వాటర్‌షెడ్ లక్ష్యాలను సాధించడం, ప్రతీ పంటపొలానికీ సాగునీరు, సమర్థ జల నిర్వహణ ఈ ‘నీరాంచల్’ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. ‘వర్షాధార వ్యవసాయ నిర్వహణ పద్ధతులు, వాటర్ షెడ్ నిర్వహణలో వ్యవస్థీకృత మార్పులు, ఆయా పద్ధతులను మరింత సమర్థంగా అమలు చేయడం ఈ పథకం లక్ష్యమన్నారు. కేబినెట్ భేటీ ఇతర నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని దసరా పండుగ సందర్భంగా 2014-15 ఉత్పాదకత ఆధారిత బోనస్(పీఎల్బీ)గా ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో12.58 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు(ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్లను మినహాయించి).. ఒక్కొక్కరు సుమారు రూ. 8,975 మేరకు ప్రయోజనం పొందనున్నారు.ఖజానాపై రూ. 1,030.02 కోట్ల మేర భారం పడనుంది. గత మూడేళ్లు కూడా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పీఎల్బీనే ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టిన సర్కారు ఈ దిశగా మరో నిర్ణయం తీసుకుంది. కేంద్ర గ్రూప్ ఏ ఉద్యోగాల్లో భాగంగా కొత్తగా ‘ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్’ను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ‘మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్’ మంత్రిత్వ శాఖలో టెక్నికల్ కేడర్‌గా ఈ సర్వీస్ ఉంటుంది. జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ వార్ మ్యూజియం నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 500 కోట్లను కేటాయించారు. స్వాతంత్య్రానంతరం విధి నిర్వహణలో మరణించిన 22,500 మంది సైనికుల స్మారకార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో వాటిని నిర్మించాలన్న సైనిక దళాల డిమాండ్ చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఐదేళ్లలో ఈ నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్, వియత్నాంలతో పన్ను ఒప్పందాలను సవరించడానికి సంబంధించిన విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రొటోకాల్స్ డబుల్ టాక్సేషన్ నిరోధంతో పాటు పన్ను సమాచారాన్ని, బ్యాంక్ అకౌంట్ల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించినవి. -
అటు రుణం, ఇటు రణం
ప్రపంచ బ్యాంక్ సంస్కరణల ప్రభావంలో పడి సోషలిస్ట్ చైనా కూడా సంక్షోభానికి గురైంది. ఈ సంక్షోభంలో చైనా తన కరెన్సీ (యువాన్) విదేశీ మారకం విలువను తగ్గించుకోవలసి వచ్చింది. అయినా ఆ దేశం అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అమెరికన్ నిపుణుల అంచనా ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా తన వస్తూత్పత్తి ఎగుమతుల ద్వారా (అమెరికా సహా) భారీ స్థాయిలో నలుమూలలకు పాకిపోయిన ఫలితంగా చైనా విదేశీ మారకం ద్రవ్య నిల్వలు కేవలం మిలియన్లలో కాదు, సరాసరి ట్రిలియన్ డాలర్లలోనే పేరుకుపోయాయి. ‘విదేశీ రుణం ఒక రాచపుండు. ఆ రుణాన్ని రాబట్టడానికి వర్ధమాన, బడుగుదేశాల మీద సంపన్న రాజ్యాలు ప్రయోగించే కీలక ఆయుధమే వడ్డీ, చక్రవడ్డీ. ఈ ఆయుధం ఎలాంటిది? ఆటంబాబు కన్నా, లేజర్ ఆయుధం కన్నా ప్రమాదకరమైనది.’ - బ్రెజిల్ నేత లూయీ ఇగ్నాసియో సిల్వా (రుణ విమోచన కోసం యుద్ధం ప్రకటించిన హవానా దేశాలు 1985లో నిర్వహించిన మహాసభలో)రాజ్యాంగ నిర్దేశాలకూ, ప్రజా ప్రయోజనాలకూ చెల్లుచీటి ఇచ్చి, అడ్డ దారులలో అయినా అధికారంలో కొనసాగదలచిన పాలకపక్షాలన్నీ దేశాన్ని రుణాల నుంచి బయటపడవేయడానికి బదులు ప్రజా వ్యతిరేక సంస్కరణల ద్వారా ప్రజా బాహుళ్యాన్ని నిరంతరం రుణగ్రస్తులను చేస్తూనే ఉంటాయి. ఇది 108 దేశాల అనుభవం. ఇండియా సహా కొన్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు విపరీత వడ్డీలకు అప్పు ఇచ్చే సంస్థ (వరల్డ్ బ్యాంక్) ఒకటైతే, ఆ రుణం తీర్చలేని దేశానికి మరింత రుణం ఇవ్వజూపే సంస్థ (ఐఎంఎఫ్) మరొకటి. ఆ రెండింటి నుంచి బయటపడలేనపుడు దేశ ఆర్థిక వ్యవస్థా చట్రాన్నే మార్చే సంస్కరణలను పునర్ నిర్మాణం పేరిట రుద్దుతారు. కాగా ఈ రుణం మీద వచ్చే వడ్డీలు, చక్రవడ్డీలను అమెరికా ఇతర యూరప్ సంపన్నదేశాల ప్రభుత్వాలు పంచుకుంటాయి. బడ్జెట్లు మనవే కానీ... భారత పాలకపక్షాలు చివరకు దేశాన్ని ఏ దుస్థితికి నెట్టాయంటే- మన బడ్జెట్లను, లేదా మన ‘ప్రగతి దృశ్యాన్ని’ సామ్రాజ్యవాద దేశాధిపతులకు నివేదించుకుని, అవసరమైతే బడ్జెట్లను దిద్దించుకుని వారికి అనుకూలమైన సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించే వరకు వచ్చాం. ఈ పని పీవీ నరసింహారావు ప్రధానిగా, డాక్టర్ మన్మోహన్సింగ్ ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలో మొదట అమెరికాలో జరిగింది. తరువాత వాజపేయి ప్రధానిగా ఉండగా ఈ పద్ధతితో విదేశీ గుత్త పెట్టుబడులను ధారాళంగా ఆహ్వానించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు బీజేపీ-సంఘపరివార్ ఎన్డీయే సర్కార్ కింద ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హయాంలోనూ అదే మరో రూపంలో కొనసాగుతోంది. గతంలో ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్సింగ్ మన బడ్జెట్‌ను అమెరికా పట్టుకుపోయి ‘ఏ ప్రతిపాదనలైతే మీ పెట్టుబడులకు అనుకూలమో ఆ విధంగానే మార్పులూ చేర్పులూ’ చేయించారు. ఆ మార్పుల మేరకే అమెరికా కనుసన్నలలో నడిచే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్య్రవనిధి సంస్థలు రంగంలోకి దిగి 1991లో ప్రజా వ్యతిరేక సంస్కరణలకు తెరతీయించాయి. అరుణ్‌జైట్లీ కూడా మోదీ తరు వాత అమెరికా పర్యటనకు వెళ్లబోతున్న సందర్భంగా అక్కడి గుత్తపెట్టుబడి వర్గాల ప్రతినిధులకు భారత ప్రగతి గురించి నివేదించుకుంటారని వార్తలు (4-10-‘15) వెలువడ్డాయి. 2007-2008 నుంచి కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం లేదా సంక్షోభ దశ నుంచి అమెరికా, ఆ దేశం మీద ఆధార పడిన కొన్ని యూరప్ దేశాలు ఇంకా తేరుకోలేదు. పెపైచ్చు అంతర్జాతీయ వాణి జ్యంలోనూ డాలర్ విలువ పడిపోకుండా నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నాయి. నిరుద్యోగం కూడా పెరిగిపోతున్న దశ ఇది. ఈ సమయంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణల ప్రభావంలో పడి సోషలిస్ట్ చైనా కూడా సంక్షోభానికి గురైంది. ఈ సంక్షోభంలో చైనా తన కరెన్సీ (యువాన్) విదేశీ మారకం విలువను తగ్గించుకోవలసి వచ్చింది. అయినా ఆ దేశం అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అమెరికన్ నిపుణుల అంచనా ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా తన వస్తూత్పత్తి ఎగుమతుల ద్వారా (అమెరికా సహా) భారీ స్థాయిలో నలుమూలలకు పాకిపోయిన ఫలితంగా చైనా విదేశీ మారకం ద్రవ్య నిల్వలు కేవలం మిలియన్లలో కాదు, సరాసరి ట్రిలియన్ డాలర్లలోనే పేరుకుపోయాయి. అందువల్లనే నిమ్మకు నీరెత్తినట్టు కొనసాగుతోంది. ఏనాడూ సోషలిస్ట్ దేశాలు రూపాయి వాటా పెట్టి రేపటి కల్లా రూ. 10లు గుంజుకునే స్టాక్‌మార్కెట్ జూదానికి పాల్పడలేదు. అలాం టిది చైనాలో సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ పేరిట సంస్కరణలు ప్రవేశ పెట్టి, ప్రజలను కొత్త సంస్కృతికి అలవాటు చేసి ఈ సంక్షోభం తెచ్చుకుంది. వడ్డీరేట్లతో బురిడీ కాగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ మొన్నటి దాకా ఇండియా లాంటి దేశాలలో బహుళ జాతి కంపెనీలకు వ్యాపారాలు, పెట్టుబడి కేంద్రాలు చూసే పనిలో ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గితే అక్కడ నుంచి తరలుతున్న పెట్టుబ డులను ఆపి, ప్రయోజనం పొందాలని, ఇదే తన సంక్షోభానికి పరిష్కారమనీ అనుకుంది. కానీ పెట్టుబడి స్థాణువై ఉండిపోతే లాభాలు, సూపర్ లాభాలు రావు; దోపిడీకి వీలుండదు. కాబట్టి వడ్డీరేట్లు తగ్గించడానికి ఆలోచిస్తున్నానని అమెరికా మొదట ఎందుకు ప్రకటించింది! తాను వడ్డీరేటు తగ్గించుకుంటు న్నానన్న భ్రమలు కల్పిస్తున్నది- ఇండియా లాంటి దేశాలను మరింతగా సంక్షోభంలో నెట్టడానికే. ఆ బుట్టలో పడిపోయిన భారత్ పాలకవర్గాలు వడ్డీరేట్లను తగ్గించాలని రిజర్వుబ్యాంకుపై ఒత్తిడి చేశారు. వడ్డీరేట్లు తగ్గకుంటే పెట్టుబడులు రావని హెచ్చరించారు. ఇందువల్ల బడా పెట్టుబడిదారులు లాభపడతారు గానీ, చిన్న మొత్తాల పొదుపుదారులు నష్టపోతారు. ద్రవ్యో ల్బణం, పెరిగిన ధరలు ఇంకా తగ్గుముఖం పట్టనేలేదు. కనుక ఈ దశలో పరిశ్రమాధిపతులకు వడ్డీరేట్లు తగ్గించాలని బ్యాంకులను ఆదేశించలేననీ, అది అనర్థానికి దారితీస్తుందనీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పట్టు పట్టారు. ఇంతవరకు పెరిగిన వడ్డీరేట్ల వల్ల ప్రయోజనం పొందిన బ్యాంకులు ఆ ఫలితాలను వినియోగదారులకు పంపిణీ చేయలేదని కూడా ఉదారవాద బ్యూరోక్రాట్‌గా పేరొందిన రాజన్ చెప్పారు. అనేక ప్రయోజనకర విధా నాలను, పథకాలను తారుమారు చేస్తూ చివరికి పౌరుల సమాచార హక్కు చట్టాన్ని తారుమారు చేసేందుకు, పంటభూములను సహితం పరిశ్రమాభి వృద్ధి పేరిట దేశ, విదేశీ గుత్తపెట్టుబడిదారులకు మళ్లించడానికి చట్టాలను వక్రీకరించి, లొంగదీసే ప్రయత్నంలో నేటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకొక వైపు నుంచి ప్రణాళికా సంఘ వ్యవస్థకు చెదలు పట్టించి, ఫెడరల్ వ్యవస్థా స్వభావానికి ఎసరు పెట్టాలని చూస్తున్నారు. సెక్యులర్ వ్యవస్థకు చేటు తెచ్చే విధానాలు అనుసరిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రాజన్, కందకు లేని దురద కత్తికెందుకని సరిపెట్టుకుని, వడ్డీరేట్లు తగ్గించి చేతులు దులుపుకు న్నాడు. అయితే చైనా కూడా ఆర్థిక సంక్షోభానికి గురైనా, దాని జాతీయోత్ప త్తుల సగటు విలువతో మన ఉత్పత్తుల విలువను పోల్చుకోరాదనీ, మన జీడీపీ విలువను 11 శాతం నుంచి 6-5 శాతానికి దఫదఫాలుగా దిగజార్చు కుంటూ వచ్చిన వైనాన్ని మరువరాదనీ రాజన్ గుర్తుచేశారు. మోదీ అమెరికా పర్యటన గుత్తపెట్టుబడుల కోసం ప్రకటనలు గుప్పిస్తూ ఉండగానే ఇటు రాజన్ వ్యంగ్య ధోరణిలో ఇలా ప్రకటించారు: ‘మనందరికన్నా మోదీయే దూకుడులో ముందడుగులో ఉన్నారు. కానీ ఆయన పర్యటనలకు దీటుగా చేతలూ ఉండాలి. మోదీ విదేశీయాత్రల వల్ల ఇండియా పట్ల ప్రపంచ స్పం దన సానుకూలంగా ఉన్నట్టు తోస్తున్నది. విదేశీ పెట్టుబడులు గుప్పించడమే పరమావధిగా ఇండియాను మార్కెట్ చేయడానికి ప్రధాన మంత్రి చొరవ చూపుతున్నారు కానీ, అందుకు తగిన ఆచరణ క్రియలో కనపడాలి కదా!’ అన్నారు. ఇండియాను విదేశీ గుత్త పెట్టుబడులతో మార్కెట్ చేసుకునే క్రమాన్ని వివరిస్తే ఆర్థికమంత్రి జైట్లీ ‘ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటి కన్నా వేగవంతంగా ఇండియాయే అభివృద్ధి సాధిస్తున్న’దని చెప్పారు. అయితే ‘రాజకీయపరమైన అడ్డుగోడలు’ ఏమీలేకపోవడమే ఇందుకు కారణాల’నీ అన్నారు. అంటే బీజేపీ-పరివార్ కూటమి, కాంగ్రెస్ యూపీఏ కూటమి మధ్య అధికార పీఠం కోసం తప్ప మౌలికంగా పాలనా విధానాలలో చెప్పుకోదగిన భేదాలు లేవని జైట్లీ చెప్పకనే చెప్పినట్టయింది. రుణం పెట్టి రణం తెచ్చి... రోజులు గడిచినా తేలని అంశం ఒకటి ఉండిపోయింది. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం విజయవంతం కావడానికి ఏది అవసరం? నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎరువుగా వాడుకోండి, కానీ వస్తూత్పత్తిపైన, మార్కెటింగ్ పైన, వాటి ఎగుమతి వ్యాపార లావాదేవీల మీద భారతీయత మాత్రమే ముద్ర వేసుకోవాలి. కాని ఈ పేరుతో ‘వాస్కోడిగామాలై’ వచ్చి ఇండియాలో మళ్లీ కాలుమోపే విదేశీ గుత్తవర్గాలూ (మల్టీ నేషనల్స్), విదేశీ సామ్రాజ్య పాలకులూ ఈ నామమాత్రపు స్వాతంత్య్రాన్ని కూడా హరించి వేసేందుకు ప్రజలు అనుమతించరు. అందుకే ఇటీవల కాలంలో కొందరు ప్రజాస్వామ్య వాదులు, ప్రగతిశీల శక్తులు రెండో స్వాతంత్య్ర సమరం జరగాలని గుర్తు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల తరఫున ఆసియా, ఆఫ్రికాలో బ్యాంకు సంస్కరణలకు బాధ్యుడిగా నియమితుడైన ఉప సంచాలకుడు డాక్టర్ డేలీ సన్ బుదూ పదవీ విరమణ చేస్తూ బ్యాంక్ ఎండీకి రాసిన బహిరంగలేఖలోని అంశాలను పరిశీలించండి! ‘ఈ దేశాలలో మనం అమలు జరిపించిన సంస్కరణల వల్ల నా చేతులు రక్తసిక్తమైనాయి. నా చేతులను కడుక్కోవడానికి ప్రపంచ దేశాలలోని సబ్బులన్నీ తెచ్చి రుద్దినా, ఆ పాపం మాత్రం తొలగదు. నాకీ అధికారం వద్దు సెలవు’. ‘రుణం పెట్టి రణం తెచ్చి, జనం ధనం ఇంధనమై చరణ కరాబంధనమై’ అని డాలర్ వికృతరూపాన్ని శ్రీశ్రీ ఎప్పుడో అక్షరబద్ధం చేశాడు. (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతుంది
2017-18 నాటికి 8 శాతం వృద్ధి రేటు సాధిస్తుంది భారత్‌పై ప్రపంచ బ్యాంకు అంచనాలు వాషింగ్టన్: వేగంగా అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకుల పరిస్థితుల నుంచి భారత్ గట్టెక్కగలదని, ఎగుమతులు బలహీనంగా ఉన్నా 7.5 శాతం వృద్ధి రేటు సాధించగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశాల్లో ఒకటైన భారత్.. 2017-18 నాటికి 8 శాతం మేర వృద్ధి చెందగలదని పేర్కొంది. చైనా వృద్ధి క్రమంగా మందగిస్తున్న దరిమిలా.. భారీ వర్ధమాన మార్కెట్లలో భారత్ దీర్ఘకాలం పాటు అగ్రస్థానంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని దక్షిణాసియా ఆర్థిక పరిస్థితులపై నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. పారిశ్రామికోత్పత్తి మెరుగుపడుతుండటం, పెట్టుబడుల పునరుద్ధరణ తదితర అంశాల కారణంగా భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మెరుగుపడగలవని వివరించింది. అయితే, దేశీయంగా కొన్ని కీలక సంస్కరణల అమల్లో జాప్యం, వాణిజ్యపరంగా బలహీన పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వేతనాల పెరుగుదల మందగించడం తదితర పరిణామాలతో వృద్ధికి కొంత రిస్కులు పొంచి ఉన్నాయని తెలిపింది. ఏం చేయాలంటే.. పెండింగ్‌లో ఉన్న ఇన్ఫ్రా ప్రాజెక్టులకు మోక్షం లభించేలా.. ఆర్థికంగా ఊతం లభించే చర్యలు తీసుకోవడం అవసరమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అలాగే ప్రైవేట్ పెట్టుబడులకు అడ్డంకులను తొలగించాల్సి ఉంటుందని వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తున్నందున.. ప్రభుత్వపరమైన పెట్టుబడులు పెరగగలవని, ప్రైవేట్ పెట్టుబడుల రాకకు ఇది తోడ్పడగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక, ముడి చమురు ధరలు తగ్గిన ప్రయోజనాలు కూడా భారత్‌కు లభించగలవని పేర్కొంది. ఇలాంటి పరిణామాలతో .. 2017/18 నాటికి వృద్ధి రేటు 8 శాతానికి అందుకోగలదని వివరించింది. 2014-15లో 7.3 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2015-16లో 7.5 శాతానికి పెరగగలదని తెలిపింది. చైనా మందగమనంతో... ఆసియా దేశాలకు దెబ్బ: ఐఎంఎఫ్ వాషింగ్టన్: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎకానమీ అయిన చైనాలో మందగమనం ప్రభావం దాని పొరుగుదేశాలతో పాటు ఆసియాలోని ఇతర దేశాలపై కూడా ప్రతికూలంగా ఉండగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. చైనా వృద్ధి ఒక్క శాతం మేర మందగిస్తే.. ఆ ప్రభావం కారణంగా ఇతర ఆసియా దేశాల వృద్ధి 0.3% మేర తగ్గుతుందని అంచనా వేసింది. ఈ ప్రతికూల ప్రభావాల పరిమాణం రాను రాను మరింతగా పెరగొచ్చని ఐఎంఎఫ్ తన బ్లాగ్‌లో పేర్కొంది. అంతర్జాతీయంగా ఒడిదుడుకుల పరిస్థితుల నుంచి భారత్ గట్టెక్కగలదని, చైనాలో మందగమనం కారణంగా వర్ధమాన మార్కెట్లలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా అగ్రస్థానంలో నిలవగలదని ప్రపంచ బ్యాంకు పేర్కొన్న నేపథ్యంలో ఐఎంఎఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాలో మందగమన ప్రభావంతో కమోడిటీల ధరలు పడిపోవడం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం తత్ఫలితంగా ఆసియా దేశాలపై ఒత్తిళ్లు ఎక్కువవడం జరుగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. కాబట్టి ఆయా దేశాలు ఏ పరిణామాన్నైనా ఎదుర్కొనేందుకు సదా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దాదాపు 35 ఏళ్ల పాటు అసాధారణ వేగంతో వృద్ధి చెందిన చైనా.. ప్రస్తుతం ఎగుమతి ఆధారిత దేశం స్థాయి నుంచి దేశీయంగా వినియోగాన్ని పెంచుకొనే దేశంగా రూపాంతరం చెందుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇది సక్రమంగా జరిగితే ఈ ప్రాంతంలో మళ్లీ ఆర్థిక సామర్థ్యం మెరుగుపడగలదని తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం చైనా వృద్ధి ప్రధానంగా పెట్టుబడులు, రుణాలపైనే ఆధారపడిందని ఐఎంఎఫ్ పేర్కొంది. రియల్టీ, బలహీన కార్పొరేట్ సంస్థలను.. ప్రభుత్వ రంగ సంస్థలను పరిపుష్టం చేయడంపైనే దృష్టి సారించడం జరిగిందని, అయితే ఈ చర్యల వల్ల రిస్కులు కూడా తలెత్తాయని తెలిపింది. కానీ ఈ రిస్కులు ఇప్పటికీ అదుపు చేసే స్థాయిలోనే ఉన్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. -
పట్టణీకరణ సమస్యల నివారణకు సంస్కరణలు
- ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇంద్రావతి న్యూఢిల్లీ: భారత పట్టణీకరణ గందరగోళంగా, అయోమయంగా ఉందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. పట్టణీకరణ అందించే ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి తగిన సంస్కరణలు చేపట్టాల్సి ఉందని ఈ నివేదిక సూచించింది. పట్టణీకరణ విషయమై ప్రపంచబ్యాంక్ రూపొందించిన ఈ నివేదిక వివరాలను ప్రపంచ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముల్యాణి ఇంద్రావతి వెల్లడించారు. పట్టణీకరణ సంస్కరణల విషయంలో భారత్, కొన్ని దక్షిణాసియా దేశాలు కొంత పురోగతిని సాధించాయని పేర్కొన్నారు. పట్టణీకరణ అందించే అవకాశాలను ఆయా దేశాలు మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటే, వాటి ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయని వివరించారు. పట్టణాల్లో ప్రజలు పెరగడం వల్ల ప్రాథమిక సర్వీసులు, మౌలిక, భూ, హౌసింగ్, పర్యావరణ సంబంధిత ఒత్తిడులు కూడా బాగా పెరుగుతున్నాయని, వీటిని పరిష్కరించడం కొంత కష్టసాధ్యమేనని తెలిపారు. నగరాల అనుసంధానత, సౌకర్యాల కల్పన, ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులను తట్టుకునేలా నగరాలను పటిష్టం చేయాల్సి ఉందని సూచించారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నివేదిక వివరాలను ఆమె వెల్లడించారు. పట్టణీకరణ భారత్‌లో మందగించిందని ఆమె పేర్కొన్నారు. -
ప్రపంచబ్యాంకుకు ఏపీ తాకట్టు
- సీఎం చంద్రబాబు విధానాలపై సీపీఎం మండిపాటు హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు సీఇవోనని గతంలోనే ప్రకటించుకున్న చంద్రబాబు ఇప్పుడు కార్పొరేట్ సంస్థల ఏజెంటుగా మారారని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి మరోసారి 'బ్యాంకు' పాలనకు తెరలేపారని సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ మండిపడింది. 'వివిధ రాష్ట్రాల వ్యాపార సంబంధ సంస్కరణల మదింపు' పేరిట ఈనెల 14న ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో- వ్యాపారానికి ఏపీ రెండో అనువైన రాష్ట్రమంటూ కితాబివ్వడమే అందుకు సాక్ష్యమని పేర్కొంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నివేదికను తయారు చేసిన మేక్ ఇన్ ఇండియా, ప్రపంచ బ్యాంకు, కేపీఎంజీ, సీఐఐ, ఫిక్కీ లాంటి సంస్థలన్నీ ప్రపంచ బ్యాంకు కనుసన్నలలో నడిచేవని, అవసరానికి మించి భూమిని సేకరించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వ్యాపారావకాశాలకు పెద్ద పీట వేయాలని ప్రపంచ బ్యాంకు ఆదేశిస్తే చంద్రబాబు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధాని మొదలు బోగాపురం, భావనపాడు, మచిలీపట్నం పోర్టు వరకు ప్రతి దానికీ అవసరానికి మించే భూమి సేకరిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా రైతుల్ని సమీకరించి చంద్రబాబు నాయుడు ఆట కట్టించడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉందని చెబుతున్న 7,64,280 ఎకరాలు కాక మరో 8 లక్షల ఎకరాల్ని సేకరించి కార్పొరేట్లకు అప్పగించేందుకే బాబు భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలోని 36 సెజ్‌లలో 9 లక్షల ఎకరాల భూమి ఉందని, దాన్ని ఉపయోగించుకోవడానికి రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారని మండిపడ్డారు. -
ప్రపంచబ్యాంకు ర్యాంకులపై విస్మయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చిన ర్యాంకులపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామంటూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పలు దేశాల్లో చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బృందం ఒకవైపు చైనాలో పర్యటిస్తున్న తరుణంలో వెలువడ్డ ఈ ర్యాంకులు సర్వత్రా చర్చనీయంగా మారాయి. పెట్టుబడులకు దేశంలోనే అత్యంత అనువైన ప్రాంతంగా తెలంగాణలో పుష్కలమైన అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా దేశంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు ప్రపంచ బ్యాంకు 13వ ర్యాంకు ఇవ్వడం తెలిసిందే. దీనికితోడు ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంకు లభించడంతో ప్రభుత్వ వర్గాలు ఇరుకునపడ్డాయి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణముండటమేగాక పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులున్నాయని ప్రభుత్వం ధీమాతో ఉంది. అలాంటిది ఏపీ కంటే చాలా తక్కువ ర్యాంకు దక్కడంతో ప్రభుత్వ వర్గాలు విస్తుపోయాయి. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకులపై సామాన్య ప్రజలు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘‘ఏ ప్రాతిపదికన ఈ ర్యాంకులిచ్చారో కూడా తెలియదు. ఈ ర్యాంకులను మేం పట్టించుకోం. మా పని మేం చేసుకుంటూ పోతాం. మా పనితీరే మా ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తుంది’’ అని మంగళవారం ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచబ్యాంకు ర్యాంకులకు మాటలతో బదులివ్వాల్సిన పని లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ‘‘మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు, వాటి ద్వారా జరిగే అభివృద్ధే సరైన సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు ర్యాంకులకు ఏయే ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడం లేదు. గుజరాత్ తర్వాత దేశంలో వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం తెలంగాణే. అభివృద్ధి చెందిన నగరాల్లో దేశంలో ముంబై తర్వాత హైదరాబాదే ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు అనుకూలంగా ఉండేందుకు కల్పిం చిన మౌలిక సదుపాయాలన్నీ ప్రజలకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. -
రూ.1.51 లక్షల కోట్లు అప్పు కావాలి
-
రూ.1.51 లక్షల కోట్లు అప్పు కావాలి
⇒ ఏడు కొత్త పథకాలకు రూ.1.50 లక్షల కోట్లు కావాలి ⇒ అందులో వీలైనంత మేర రుణం అందించండి ⇒ ప్రపంచ బ్యాంకు సాయం కోరిన తెలంగాణ సర్కారు ⇒ సీఎస్, ఉన్నతాధికారులతో వరల్డ్ బ్యాంక్ బృందంభేటీ ⇒ అన్ని పథకాలకు రుణం ఇవ్వలేమన్న బ్యాంకు ⇒ నిబంధనలకు లోబడి ఉన్న ప్రాజెక్టులకు రుణమిస్తామని వెల్లడి ⇒ బ్యాంకు రుణంతో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష ⇒ వాటర్ గ్రిడ్‌కు ప్రశంసలు హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న భారీ పథకాలకు సుమారు రూ.1.50 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు నివేదించింది. అందులో కొంత ఆర్థిక సాయం అందించాలని కోరింది. వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ ఒన్నో రూల్ సారథ్యంలో 15 మంది ప్రతినిధుల బృందం గురువారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమైంది. కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రాజ్‌కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు. సచివాలయంలో రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో.. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులకు కావాల్సిన రుణాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన ఏడు పథకాలకు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందాన్ని కోరింది. ప్రధానంగా మిషన్ కాకతీయ, తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్, ఈ-పంచాయతీలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, ప్రభుత్వ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చటం, యాదాద్రి ప్లాంట్‌కు విద్యుత్తు లైన్లు, సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులకు రుణం అందించాలని ప్రతిపాదించింది. పరిశీలన తర్వాతే.. అన్ని పథకాలకు రుణం ఇచ్చే పరిస్థితి లేదని ప్రపంచ బ్యాంకు బృందం తేల్చి చెప్పింది. కొత్త పథకాలకు సంబంధించి విడివిడిగా ప్రతిపాదనలు పంపించాలని.. తమ కన్సల్టెన్సీ నిపుణులు వాటిని పరిశీలించాక, ఏయే ప్రాజెక్టులకు నిధులిచ్చే అవకాశముందో పరిశీలిస్తామని వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు లోబడి ఉన్న ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించే వీలుందని పేర్కొంది. పాత ప్రాజెక్టులకు తగిన సాయం ప్రస్తుతం మున్సిపల్ డెవలప్మెంట్, రోడ్డు సెక్టార్, సామూహిక చెరువుల అభివృద్ధి పథకం, ఆర్‌డబ్ల్యుఎస్- శానిటేషన్, తాగునీటి పథకాలు, తెలంగాణ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు (తెలంగాణ పల్లె ప్రగతి) కార్యక్రమాలు ప్రపంచ బ్యాంకు సాయంతో అమల్లో ఉన్నాయి. ఎప్పట్లోగా ఈ పథకాలు పూర్తవుతాయి.. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయన్న అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు కావాల్సినంత సహకారం అందిస్తామని వరల్డ్ బ్యాంక్ హామీ ఇచ్చింది. మిగులు నిధులుంటే వీటికి వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. బ్రిక్స్, ఏఐఐబీ రుణం పొందవచ్చు ఆరు దేశాలకు చెందిన బ్రిక్స్ బ్యాంక్, చైనాకు చెందిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ల నుంచి రాష్ట్రాలు రుణాలు పొందే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ రాజ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అన్నింటికీ ప్రపంచ బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. వీటిని సైతం ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ బ్యాంకులు ఇటీవలే కొత్తగా వెలిశాయి. రుణం కావాలనుకునే రాష్ట్రాలు వీటిని ఆశ్రయించే వీలుందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. సంబంధిత ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసి పంపించాలని సూచించింది. తెలంగాణ ఆర్థిక శాఖ ఇప్పటికే ఈ లేఖను అన్ని విభాగాలకు పంపించింది. వాటర్ గ్రిడ్‌పై ఆసక్తి.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకునేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు బాగుందని ప్రశంసించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టిందని సీఎస్ రాజీవ్ శర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో విశ్లేషించారు. రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందించే వాటర్ గ్రిడ్‌కు రూ.40 వేల కోట్లు అంచనా వ్యయమవుతుందన్నారు. హడ్కో రూ.20 వేల కోట్ల రుణం ఇస్తోందని, మరో రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. మిషన్ కాకతీయతో ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యం ఉందని, దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.80 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. నల్లగొండ జిల్లా దామరచెర్లలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంటు విద్యుత్తు లైన్లకు, సౌర విద్యుత్తు ఉత్పత్తికి రూ.5 వేల కోట్లు కావాలని కోరారు. గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చడం, ప్రభుత్వ హాస్టళ్లను రెసిడెన్షియళ్లుగా తీర్చిదిద్దేందుకు నిధులు కోరారు. హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తే ఆయిల్ సీడ్స్, ధాన్యాల రవాణా పెరుగుతుందని, వ్యవసాయాధారిత పరిశ్రమలు వెలుస్తాయని విశ్లేషించారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నందున హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకు నిధులు కావాలని ప్రతిపాదించారు. పథకాలు.. అవసరాలు -ఇరిగేషన్ రూ.80,000 కోట్లు -తెలంగాణ వాటర్‌గ్రిడ్ రూ.20,000 కోట్లు -హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై రూ.14,000 కోట్లు -యాదాద్రి ప్లాంట్‌కు విద్యుత్తు లైన్లు, సౌర విద్యుత్తు రూ.5,000 కోట్ల్లు -రెసిడెన్షియల్ స్కూళ్లు, ఈ పంచాయతీలు, -హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ రూ.30,000 కోట్లు (అంచనా). -
షరతులు వర్తిస్తాయా.. ?
-
విద్యుత్ రంగంలోకి ‘ఎంటర్ ది వరల్డ్ బ్యాంక్’ షరతులు వర్తిస్తాయా.. ?
ఫసియుద్దీన్ హైదరాబాద్ : ప్రపంచబ్యాంకు, విద్యుత్ రంగం అనే రెండు పదాలను జంటగా వినాల్సి వస్తే తెలుగు ప్రజలకు ఆటోమేటిగ్గా షాక్ తగులుతుంది. విద్యుత్ సంస్కరణల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడం, ఆ బ్యాంకు షరతులను అమలుచేసి ప్రజా కంటక పాలకుడిగా ముద్రపడిపోవడం ఇంకా మన జ్ఞాపకాల్లోంచి జారిపోలేదు. ఇన్నాళ్లకు మళ్లీ తెలంగాణ విద్యుత్ రంగం వాకిట్లోకి ప్రపంచ బ్యాంకు వచ్చి నిలబడింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రపంచ బ్యాంకు అధికారులు చర్చలు జరుపబోతున్నారనేది విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి థర్మల్ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్ల నిర్మాణం కోసం రూ.4 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా సమకూర్చుకోవడం ప్రభుత్వ తొలి లక్ష్యం. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న డిస్కంలను లాభాల బాటలో పడవేసేందుకు కూడా రెండో దశలో రుణం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం అనగానే కన్సల్టెన్సీలు, వాటి కర్రపెత్తనం ఉండి తీరుతుంది. మరి అలాంటివేమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వానికి మినహాయింపులు ఉంటాయా? లేక షరా మామూలుగానే ప్రపంచ బ్యాంకు షరతులు వర్తిస్తాయా..? వేచి చూడాలి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పలుమార్లు ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం... అధికారికంగా చర్చలు జరిపేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్ర అధికారులు గురువారం ప్రపంచ బ్యాంకు బృందంతో సమావేశమై రుణ ఒప్పందంపై చర్చలు జరపనున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ‘యాదాద్రి’ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని టీజెన్‌కో చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. తదుపరి దశల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు హయాంలో తప్పితే ఆ తర్వాత విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు రుణం స్వీకరించిన దాఖలాలు లేవు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ, వినియోగదారులకు సబ్సిడీలు నిలిపేయాలన్న ఆంక్షలతో నాడు ప్రపంచ బ్యాంకు చంద్రబాబు సర్కారుపై పెత్తనం సాగించింది. అలాంటిది తాజాగా టీఆర్ఎస్ సర్కారు.. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వరల్డ్ బ్యాంకు ఝలక్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ పునర్నిర్మాణ పథకం పేరుతో 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి బిలియన్ డాలర్లు (అప్పటి లెక్కన సుమారు రూ.4,200 కోట్లు) రుణాన్ని సమీకరించింది. ఈ రుణాన్ని నాలుగు దశల్లో చెల్లించాలని, ప్రతి దశలో నియమ నిబంధనలన్నీ పాటించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు రూపొందించిన ఆంక్షల ఒప్పందంపై బాబు సర్కారు సంతకాలు చేసింది. ఆ ఒప్పందం తొలిదశలో భాగంగానే ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు 3 ముక్కలై జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా ఏర్పడ్డాయి. రెండోదశలో విద్యుత్ చార్జీలు భారీగా పెంచేసి, ఆ తర్వాత డిస్కంలను ప్రైవేటీకరించాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రభుత్వం పావులు కదిపింది. 2000 జూలై లో భారీగా విద్యుత్ చార్జీలను పెంచేసింది. సగటున 15 శాతం చార్జీలు పెరిగినప్పటికీ గృహాలపై 100 శాతం, రైతులపై 50 శాతం అదనపు భారం పడింది. ఆ తర్వాత డిస్కంల ప్రైవేటీకరణ జరపాలన్న షరతు అమలుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నించింది. అయితే విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ... 2000 ఆగస్టు 28న కాంగ్రెస్, వామపక్షాలు చలో హైదరాబాద్ పేరుతో లక్షల మందితో ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనకారులపై బషీర్‌బాగ్ వద్ద పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతిచెందారు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఈ ఘటనతో బాబు సర్కారు డిస్కంల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గింది. దాంతోపాటు ఒరిస్సాలో డిస్కంల ప్రైవేటీకరణ విఫలం కావడంతో వేచి చూడాలని నిర్ణయించింది. ఈ సమయంలో ప్రపంచ బ్యాంకు ఆంక్షలకు వ్యతిరేకంగా నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఉద్యమాలు మొదలయ్యా యి. రైతులకు ఉచిత విద్యుత్ నినాదంతో వైఎస్ 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న డిస్కంల ప్రైవేటీకరణ ఒప్పందాన్ని అమలు చేయడానికి వైఎస్సార్ నిరాకరించారు. స్వదేశీ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వాలేవీ విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు రుణానికి సాహసించలేదు. అలాంటిది ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆర్ఈసీ, పీఎఫ్సీ లాంటి సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నా.. ప్రపంచ బ్యాంకు రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విపరిణామాలు ఎన్నో.. ఆర్ఈసీ, పీఎఫ్‌సీల రుణాల ఖర్చులపై విద్యుత్ సంస్థలకు స్వేచ్ఛ ఉంటుంది. అదే ప్రపంచ బ్యాంకు ఎన్నో ఆంక్షలు పెడుతుంది. ఆ బ్యాంకు కన్సల్టెన్సీల పర్యవేక్షణలో ప్రాజెక్టు అమలు చేయాలి. అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న సంస్థలకు అనుకూలంగా ఈ కన్సల్టెన్సీలు బిడ్ డాక్యుమెంట్లో నిబంధనలను చొప్పిస్తాయి. దేశీయ కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా చేస్తాయి. ఈ రుణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీ, కౌంటర్ గ్యారెంటీలు ఇవ్వాలి. ప్రపంచ బ్యాంకు వడ్డీలు తక్కువ అని ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటాయి. కానీ విద్యుత్ సంస్థలపై వడ్డీల భారం తడిసి మోపెడు కానుంది. ఈ రుణం ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి రాష్ట్రానికి, ఆ తర్వాత విద్యుత్ సంస్థలకు చేరుతుంది. అంతేగాకుండా రుణం డాలర్లలో ఇచ్చే నేపథ్యంలో.. మారకపు విలువలో హెచ్చుతగ్గుల భారం విద్యుత్ సంస్థలపై పడుతుంది. రూ.5 కోట్లకు మించి విద్యుత్ సంస్థలు చేసే ఖర్చును విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నియంత్రిస్తుంది. కానీ ప్రపంచ బ్యాంకు విషయంలో ఈఆర్సీదీ ప్రేక్షక పాత్రే. ప్రపంచ బ్యాంకు సూపర్ రెగ్యులేటరీ కమిషన్‌గా అజమాయిషీ చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది. -
లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్
♦ 7 శాతం వృద్ధి రేటుతో ♦ 2050 నాటికి సాధ్యమే ♦ ప్రపంచబ్యాంక్ అంచనా న్యూయార్క్ : వచ్చే 30-35 సంవత్సరాల పాటు ఏటా ఏడు శాతం వృద్ధి రేటు కొనసాగించగలిగితే 2050 నాటికి లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ప్రపంచ బ్యాంకు ఈడీ సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. ప్రస్తుతం 2,000 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 40,000 డాలర్లకు చేరగలదని తద్వారా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు ప్రజలు కూడా సంపన్నులు కాగలరని ఆయన వివరించారు. ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గర్గ్ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఏకంగా 35 సంవత్సరాల పాటు ఏడు శాతం వృద్ధి రేటును నిలకడగా కొనసాగించగలగడం చాలా కష్టంతో కూడుకున్నదని, ఇందుకోసం ఎకానమీ నిర్వహణ తీరును భారీగా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయాన్ని సమూలంగా సంస్కరించుకోవాలని, సర్వీసులు, తయారీ రంగాలతో పాటు హెల్త్‌కేర్, టూరిజం మొదలైన వాటికి ఊతమివ్వాలని గర్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత జనాభాలో 55 శాతం మంది ఇప్పటికే సర్వీసుల రంగంలో ఉన్నారని, దీన్ని 80-85 శాతానికి పెంచుకోవాలని గర్గ్ తెలిపారు. కానీ వ్యవసాయం నుంచి ప్రజలను తయారీ, సర్వీసుల రంగాల వైపు మళ్లించడం పెద్ద సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా కొత్త అంశంలో నైపుణ్యం పొందిన పది-ఇరవై లక్షల మంది సుశిక్షితులను ప్రపంచానికి అందించేలా భార త్ ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. -
ఇండియాకు గ్రీస్ పాఠాలు
పాలనా వ్యవస్థకు రాజకీయవేత్తలకన్నా ‘టెక్నోక్రాట్స్‘ (కేవల సాంకేతిక నిపుణులు) మాత్రమే నాయక స్థానాల్లో ఉండాలని రచయిత నైస్‌బిత్ సూచించాడు! దేశంలో ప్రణాళికా సంఘాన్ని చాప చుట్టి, ‘నీతి-ఆయోగ్’ అనే దిశాదశా లేని సంస్థను ఏర్పాటు చేయటం బహుశా ఆ ఆలోచనల్లో భాగమే. 1980కి ముందు, తరవాత పలుమార్లు రూపాయి పతనం కావడానికి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంస్కరణలే (1991) కారణమన్నది బహిరంగ రహస్యం! ‘స్వతంత్ర దేశాలను రుణాలతో బంధించే శక్తిమంతమైన అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్. నిరంకుశా ధికార వర్గానికి ప్రాతినిధ్య సంస్థలు. వీటిలో ప్రధాన వాటాదారులు- అమె రికా, బ్రిటన్, జపాన్ వంటి సంపన్నదేశాల ప్రభుత్వాలు. ఇవి పెట్టుబడిదారీ వ్యవస్థకు లోబడి పనిచేసే ద్రవ్య నియంత్రణ సంస్థలు. బలవంతుల ఆర్థిక, ద్రవ్య ప్రయోజనాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి. ఇవి, మార్కెట్ శక్తులను/ మార్కెట్లను తారుమారు చేయడం ద్వారా దేశాల జాతీయార్థిక వ్యవస్థలను శాసిస్తూ వాటిపైన పెత్తనం చలాయిస్తూ ఉంటాయి. ఇదే అసలు ప్రమాదం.’ - ప్రొఫెసర్ మైఖేల్ చౌసుదోవస్కీ (‘నూతన ఆర్థిక సంస్కరణలు-ప్రపంచవ్యాప్త దారిద్య్రీకరణ’, 1997, నుంచి) ఈ ఆచార్యుడి అంచనా ఎంత వాస్తవికమైనదో 1980లలో 100 దేశా లలో ప్రవేశ పెట్టించడంతో ప్రారంభమైన ప్రపంచ రుణ సంస్థల ప్రజా వ్యతి రేక ‘సంస్కరణల’ ఫలితాలు వాటిని అనుభవించిన దేశాలకే తెలుసు. ప్రపం చ డాలర్ సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌లకు పోటీగా అవతరించిన యూరోపియన్ యూనియన్ ‘యూరో’ కరెన్సీ వ్యవస్థలో సభ్యురాలైన గ్రీస్ దేశప్రజలు నేడు పడుతున్న కటిక ఆర్థిక బాధలు కూడా అలాంటి ఫలితాలకు తాజా నిదర్శనాలే. మరోమాటలో చెప్పాలంటే రెండురకాల దోపిడీ వ్యవస్థల మధ్య చిక్కుకున్న యూరప్ దేశా లలో స్పెయిన్, ఇటలీలతో పాటు గ్రీస్; ఆఫ్రికా ఖండంలో ఒకనాటి ధాన్యా గారాలైన ఇథియోపియా, మొరాకో వంటి మరికొన్ని దేశాలూ ఉన్నాయి. కానీ ఈ దేశాలన్నింటినీ మించి రుణాల తీర్మానం విషయంలో గ్రీస్ మీదనే ప్రపంచీకరణ సంస్థలు ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టాయి? గ్రీస్ మీద ద్రవ్య నిధి సంస్థల గుర్రు? 2008 నుంచి 2014 దాకా అంతర్జాతీయ రుణ సంస్థల చెప్పుచేతలలో ఉన్న పాలకవర్గాల హయాంలోనే గ్రీస్ రుణబాధలు మొదలైనాయి. ఇటీవల (ఆరు మాసాల నాడు) అక్కడి పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్థి అలెగ్జీ సిప్రాస్ గెలుపొంది ప్రధాని కావడంతో ప్రపంచ రుణ సంస్థలలో గుర్రు మొదలైంది. గ్రీస్‌ను ఆర్థిక పరాధీన స్థితి నుంచి విముక్తం చేసేందుకు వామ పక్ష ప్రభుత్వం సిప్రాస్ నాయకత్వంలో స్వతంత్ర పంథాలో ముందుకు కొన సాగింది. ఇక్కట్లలో ఉన్న సామాన్య ప్రజానీకాన్ని రక్షించేందుకు నిర్దిష్టమైన కొన్ని సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసింది. ప్రకటించిన సంక్షేమ పథ కాలు పెన్షనర్లకు, పేద రైతులకు, కార్మిక వర్గానికి అనుకూలమైనవి కావడం తో ఇప్పటికిప్పుడు పాత రుణాలు తీరుస్తావా చస్తావా అని పెట్టుబడి రుణ సంస్థలు పట్టుపట్టాయి. కానీ సిప్రాస్ ప్రభుత్వం, ‘వెనుతిరిగేది లేదనీ, రుణా లను రీషెడ్యూల్ చేసుకోవాలనీ’ ఎదురు ఆదేశించింది. ప్రభుత్వ ప్రతిపాద నల మీద నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరిపిస్తామని ప్రక టించి ముందుకు వెళ్లింది. జూలై 5వ తేదీన గ్రీస్ ప్రజలకు సిప్రాస్ ప్రకటిం చిన ‘సంక్షేమ పథకాలను ఉపసంహరించుకుని రుణాలు చుప్తాగా చెల్లించా ల’న్న రుణ సంస్థలకు 60.4 శాతం ఓటుతో ప్రజలు చెంపదెబ్బ కొట్టారు. నిజానికి చెల్లించవలసిన రుణాలలో 1.7 బిలియన్ డాలర్ల బ కాయిలను గ్రీస్ ముందే తీర్చింది. గ్రీస్‌లో అధికారంలో ఉన్నది వామపక్షమైనందున ‘మిగ తాది కూడా ఇప్పటికిప్పుడే చెల్లించాలని ఐఎంఎఫ్ పట్టుపట్టింది’. జర్మనీ కను సన్నలలో మెలగుతున్న యూరోపియన్ యూనియన్ నుంచి గ్రీస్ జారి పోయి, యూరోపియన్ సమాఖ్యకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న జంకు ఉంది. ఇలాంటి బెదురు జర్మన్ లిబరల్ అవకాశవాద అధినేత మెర్కెల్‌కు కూడా లేకపోలేదు. అయినా, యూరోపియన్ ఆర్థిక సంస్థ, ఇతర సంస్థలు గ్రీస్ ప్రభుత్వాన్ని అదిరింపులకూ బెదిరింపులకూ గురిచేస్తూనే వచ్చాయి. అయినా ‘ప్రజాభిప్రాయ సేకరణ’ యూరప్ సమాఖ్యకూ, యూరో కరెన్సీ వ్యవస్థకూ వ్యతిరేకంగా చేపట్టినది కాదని సిప్రాస్ హుందాగా వివరణ ఇచ్చాడు. అలాంటి ప్రజాభిప్రాయం ద్వారా సంప్రదింపులకు సానుకూలమైన వాతావరణాన్ని తిరిగి సృష్టించడమే తన లక్ష్యమని చెప్పాడు. కానీ భవిష్యత్తు అంధకారబంధురమేనని పెన్షనర్లనూ, నిరుద్యోగ యువతనూ, కార్మిక వర్గాన్నీ రుణదాతలు భయపెట్టారు. దీనికి విరుగుడుగా ‘పొదుపు పేరుతో దేశ ప్రజాబాహుళ్యాన్ని మాడ్చలేననీ, కనీస సంక్షేమ పథకాలు అమలు చేయ క తప్పదనీ’ సిప్రాస్ కీలెరిగి వాత పెట్టాడు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పాలనావ్యవస్థకు స్థిరత్వం కలిగించే యత్నంలో ఘనమైన మెజారిటీని సాధిం చి, ‘ఇదిగో ప్రజాతీర్పు. ఇప్పుడు రుణాల రీషెడ్యూల్కు, సవ్యమైన ప్రతిపాద నలతో ముందుకు రావొచ్చు!’ అని రుణదాతలకు సిప్రాస్ సవాలు విసిరాడు. ఒక వర్గం మీడియా కూడా బెదిరింపుల ద్వారా సిప్రాస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామి అయింది. ఇది పచ్చి నిజం! అందుకే గ్రీస్ పాలక పక్షం ‘సిరిజా’ తరఫున లండన్‌లో సాధికార ప్రతినిధిగా ఉన్న ప్రసిద్ధ మహిళ మెరానీ ప్రింటాలిస్, ‘గత ఐదు రోజులుగా గ్రీస్‌పై జరిగిన దాడి ఒక విధంగా ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రోత్సహించడమే. గ్రీస్పైన నియంతృత్వాన్ని రుద్దబోవడమే. ఏ రూపంలోనూ ద్రవ్య సహాయం అందకుండా చేయడమే. ప్రజల్ని భీతావహుల్ని చేయడమే’ (హిందూ: 6 జూలై, 2015) అని ప్రకటిం చారు. నిజానికి, ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడుల ఏలుబడిలో ఉన్న ప్రపంచ రుణ సంస్థలు 100కి పైగా దేశాల్లో 1980ల నుంచీ అనుసరిస్తున్న రుణ విధానాలూ, ఒత్తిళ్లూ, స్థానిక ప్రభుత్వాలను కూల్చుతూ వచ్చిన పద్ధ తులే ఇవని మరచిపోరాదు. రుణ భారత్‌కు అనుభవం కావాలి? గ్రీస్ తాజా అనుభవంతోనైనా లక్షల కోట్ల రూపాయల రుణాల ఊబిలో ఈదులాడుతున్న భారత ప్రభుత్వాలూ, పెట్టుబడిదారీ వర్గాలకు దాదాపు ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకపక్షాలూ గుణపాఠాలు నేర్వాలి. పెట్టు బడిదారీ సంస్థలకు చెందిన రచయితల్లో ఒకరైన నైస్‌బిత్ పాలనా వ్యవస్థకు రాజకీయవేత్తలకన్నా ‘టెక్నోక్రాట్స్‘ (కేవల సాంకేతిక నిపుణులు) మాత్రమే నాయక స్థానాల్లో ఉండాలని సూచించాడు! దేశంలో ప్రణాళికా సంఘాన్ని చాప చుట్టి, ‘నీతి-ఆయోగ్’ అనే దిశాదశా లేని సంస్థను ఏర్పాటు చేయటం బహుశా ఆ ఆలోచనల్లో భాగమే. 1980కి ముందు, తరవాత పలుమార్లు రూపాయి పతనం కావడానికి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంస్కరణలే (1991) కారణ మన్నది బహిరంగ రహస్యం! ఈ సంస్థల నుంచి దేశానికి రూ.23 వేల కోట్లతో ప్రారంభమైన రుణభారం నేటికి రూ.12 లక్షల కోట్లకు పెరిగినట్టు అంచనా! అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం ‘మాంద్యం’ దశను దాటి 1930ల నాటి ప్రపపంచ ఆర్థిక సంక్షోభదిశగా మరోసారి ప్రయాణిస్తోం దని అందువల్ల భారత ప్రభుత్వ విధానాలు, ఆచరణా అందుకు ప్రతికూ లంగా ఉండి, ద్రవ్యోల్బణాన్ని, వడ్డీ రేట్లను నియంత్రించుకోవాలని కొలది రోజుల నాడు రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన హెచ్చరి కను పాలకపక్ష నేతలు ఎగతాళి చేయడానికి ప్రయత్నించారు. రాజన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేసిన ప్రసంగాన్ని సవరించడానికి విశ్వ ప్రయ త్నం జరిగింది. రాజన్ హెచ్చరికల ప్రాధాన్యాన్ని గ్రీస్ అనుభవం తరువాత బాధ్యతగల భారత ఆర్థికవేత్తలూ, నిపుణులూ గుర్తించి ధ్రువపరుస్తూండటం గమనించదగిన పరిణామం. సామ్రాజ్య పూరిత యాత్ర కొనసాగింపు ఇండియాలో (గ్రీస్‌లో కూడా) ప్రస్తుతం ప్రపంచ రుణ సంస్థల లక్ష్యం - క్రమంగా టెక్నోక్రాట్స్ కనుసన్నల్లో ‘స్మార్ట్ ఫోన్లు’ ‘స్మార్ట్ టవున్స్’ స్మార్ట్ బిల్డింగుల పేరిట అంతటినీ ‘స్మార్ట్’ బాటలో నడిపించడమే. దేశంలోని పబ్లిక్ రంగ బ్యాంకుల్ని క్రమంగా పూర్తిగా ప్రైవేటీకరించేందుకు, స్వదేశ, విదేశ గుత్త సంస్థలకు (ఎంఎన్సీ) దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే అధికారాలు దఖలు పరి చేందుకు ఒక నమూనా సిద్ధమైనట్టు నిపుణుల అభిప్రాయం. జాతీయ స్థాయిలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది రోజుల ముందే అరవింద సుబ్రహ్మణ్యం ఈ నమూనాను ప్రతిపాదిం చినట్టు కొందరు భావిస్తున్నారు! ఆ ‘నమూనా’- ‘మేక్ ఇన్ ఇండియా’ కాదు కదా? ఇక్కడే, వలస వ్యవస్థలకు బాటలు పడినప్పుడు మొదలైన సామ్రాజ్య కాంక్షా పూరిత యాత్రలు ఇంకా ఎలా కొనసాగుతున్నాయో ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం: ‘ప్రపంచ రుణసంస్థలు పెట్టు బడుల వ్యాప్తి కోసం తలపెట్టిన సంస్కరణలు సంపన్న పెట్టుబడిదారీ దేశాల సరుకులను బడుగు వర్ధమాన దేశాల మార్కెట్లపైన రుద్దడానికి ఉద్దేశించినవే. ఫలితం- వేతనాలు, జీవన ప్రమాణాలు, సంక్షేమ పథకాలు దారుణంగా పడి పోవడం. ఈ పరిణామం వంద దేశాలలో పేదలకు పిడుగుపాటైంది.’ గ్రీస్‌లో జరిగింది ఇదే. నేడు మన దేశంలో జరుగుతున్నదీ, ప్రభావిత దేశాలలో భవిష్యత్తులో జరగబోయేదీ అదే. (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
భారత్‌లో వృద్ధి రయ్య్ రయ్య్
ప్రపంచ బ్యాంక్ ‘గ్రోత్ చార్ట్’లో అగ్రస్థానం ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికను విడుదల చేసిన కౌశిక్ బసు వాషింగ్టన్: ప్రపంచంలోని ఆర్థిక దిగ్గజ దేశాలకు సంబంధించి ప్రపంచబ్యాంక్ ‘గ్రోత్ చార్ట్’లో భారత్‌కు మొట్టమొదటిసారి అగ్రస్థానం లభించింది. చైనాను పక్కకుతోసి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. 2015 వృద్ధి వేగంలో చైనాను అధిగమించి దేశం 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందన్న అంచనాలు దీనికి కారణం. చైనా భారత్‌కన్నా తక్కువగా 7.1 శాతమే వృద్ధి సాధిస్తుందన్నది ప్రపంచబ్యాంక్ అంచనా. ఈ మేరకు తాజా ప్రపంచ ఆర్థిక అంచనాల (జీఈపీ) నివేదికను ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకనమిక్ అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ బసు విడుదల చేశారు. ముఖ్యాంశాలు... ♦ 2015లో అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు అంచనా 4.4 శాతం. 2016లో ఈ రేటు 5.2 శాతానికి పెరుగుతుంది. 2017లో 5.4 శాతానికి చేరే అవకాశం ఉంది. ♦ భారత్ విషయానికి వస్తే- చమురు ప్రధాన దిగుమతి దేశంగా ఆ కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశం. అలాగే కేంద్రం తీసుకుంటున్న సంస్కరణలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. 2015లో 7.5% వృద్ధి బాటన నిలబెట్టే వీలుంది. ♦ అంతర్జాతీయ ఆర్థిక రంగం వృద్ధి ఇప్పటివరకూ అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడి ఉండేది. అయితే ఈ పరిస్థితి ‘నెమ్మదిగా’ మారడం ఖాయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధి చెందుతున్న దేశాలే ‘ఇంజన్లు’గా మారతాయి. ♦ ప్రధానంగా భారత్ రికవరీపై ఆధారపడి దక్షిణ ఆసియాలో వృద్ధి రేటు 2015లో 7.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఆదాయ దేశాల్లో డిమాండ్ క్రమంగా పటిష్టం అవుతుండడం కూడా దీనికి కారణం. ♦ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగువ స్థాయిలో ఉండడం దక్షిణ ఆసియా మొత్తానికి లాభిస్తున్న అంశం. అతిగా అంచనాలు..? చైనా మేధావివర్గం అభిప్రాయం ఇరు దేశాలను పోల్చి చూడటం తగదని వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు దూసుకుపోతోందంటూ ఇప్పుడే గొప్పగా అంచనాలు వేయడం తొందరపాటేనని చైనా మేధావివర్గాలు అభిప్రాయడుతున్నాయి. భారత్ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నాయి. షాంఘై ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో దక్షిణాసియా పరిణామాల అధ్యయన విభాగం డెరైక్టర్ ఝావో గాంచెంగ్.. ఒక పత్రికలో రాసిన వ్యాసంలో ఈ అభిప్రాయాలు వ్యక్తపర్చారు. వృద్ధి రేటులో చైనాను భారత్ మించిపోతుందంటూ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎకానమీని మందగమనం నుంచి గట్టెక్కించేసినట్లేనని భారత్ నమ్ముతోంది. అందుకే ఆ దేశం అంచనాలు సాధారణంగానే ఆశావహంగా ఉంటాయి. భారత్ మాత్రమే కాకుండా అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి’ అని గాంచెంగ్ తెలిపారు. అయితే ఈ గణాంకాలను నిర్ధారించుకోవడం కష్టసాధ్యమైనందున.. ఇవన్నీ అతిగా వేసుకుంటున్న అంచనాలే అయ్యుండవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతిసారి భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలను పోల్చి చూసుకోవడం అర్థరహితమని, రెండింటికీ మధ్య అసలు పోలికే ఉండదని గాంచెంగ్ వ్యాఖ్యానించారు. కానీ ఒకవేళ భారత్ వృద్ధి రేటు గానీ చైనా స్థాయిని అందుకుందంటే.. అది కచ్చితంగా ఉన్న దానికన్నా ఎక్కువ చేసి చూపించడమే అవుతుందని పేర్కొన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్‌లో ఆర్థిక గణాంకాలను హైలైట్ చేస్తుంటారని తెలిపారు. భారత్‌లో ఏదైనా జరగొచ్చు.. భారత్‌కి అనుకూలతలు ఉన్నప్పటికీ.. భారీ స్థాయిలో సమస్యలూ ఉన్నాయని గాంచెంగ్ వివరించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని లెక్కించే విధానాన్ని కొత్తగా మార్చడమన్నది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరిగిందా లేక దేశీయ ప్రమాణాలను బట్టి జరిగిందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదని వివరించారు. అయితే, భారత్‌లో ఏదైనా జరగొచ్చని, కాబట్టే దేశ ఎకానమీ గురించి ఇప్పుడే అతిగా ఊహించుకోవడం తొందరపాటే అవుతుందని గాంచెంగ్ పేర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే భారత జీడీపీని లెక్కించే విధానాన్ని, దాంతో పాటే దేశ ఆర్థిక స్వరూపాన్నీ సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. క్యూ1లో పటిష్ట వృద్ధి: ఓఈసీడీ న్యూఢిల్లీ: భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుందని ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, అమెరికా, జర్మనీ, కెనడాలు సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలో భారత్ ఆర్థిక వ్యవస్థ క్యూ1లో మంచి పనితీరు కనబరచిందని సంస్థ తెలిపింది. జీ-20 దేశాల్లో జీడీపీ వృద్ధి మొత్తంగా జనవరి-మార్చిలో స్వల్పంగా 0.7 శాతం క్షీణించింది. 2014 డిసెంబర్ క్వార్టర్లలో 0.8 శాతం వృద్ధి జరిగింది. కెనడా (0.1 శాతం), అమెరికా(0.2 శాతం), బ్రెజిల్ (0.2 శాతం) ఆర్థిక వ్యవస్థల వృద్ధి ఏడాది మొదటి మూడు నెలల్లో క్షీణించాయి. ఈ ఏడాది వృద్ధి7.9%: సిటీ న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.9% ఉంటుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ సిటీగ్రూప్ అంచనావేస్తోంది. 2016-17లో ఈ రేటు ఏకంగా 8.1 శాతమని అంచనా వేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాపరమైన సంస్కరణలు, కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని సడలించడం వంటి అంశాలు దీనికి కారణమని తన తాజా నివేదికలో పేర్కొంది. పెట్టుబడులు పెరగడం, వినియోగం మెరుగుదల వంటి అంశాలు సైతం వృద్ధి స్పీడ్‌కు దోహదం చేస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెపో రేటును ఆర్బీఐ మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వర్షాభావంతో జాగ్రత్త!: అయితే భారత్ వ్యవస్థకు తక్షణం పొంచి ఉన్న సవాలు వర్షాభావం అని వివరించింది. దీనివల్ల శీతాకాల పంటల్లో దాదాపు 10 శాతం నష్టం జరగడానికి అవకాశం ఉందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఇది ఒక పెద్ద సవాలని పేర్కొంది. -
‘గుజరాత్’ సేద్యం.. పెద్దల భోజ్యం
రెండోమాట ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్‌కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది. నరేంద్ర మోదీ పదే పదే ప్రచారం చేసుకున్న ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ లో బడుగు బలహీన వర్గాలకు చోటుండదు. అది బహుజనులతో కూడిన సమాజాన్ని చీల్చే ‘అభివృద్ధి’ నమూనా. కీలక రంగాలలో కేంద్రీకరించాల్సిన అభివృద్ధిని మోదీ ‘గుజరాత్ నమూనా’ నిర్వీర్యం చేస్తుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలూ, వివిధ సర్వేలూ, సాధికార గణాంకాలే ఇందుకు సాక్ష్యం. అతుల్ సూద్, కల యర్సన్: ప్రసిద్ధ విశ్లేషకులు (13-6-2014) గుజరాత్ అభివృద్ధి నమూనా వందిమాగధ ఆశ్రీత పెట్టుబడిదారీ వర్గా న్ని పెంచే నమూనా. కొద్దిమంది చేతులలో సంపద కేంద్రీకరణకు దోహదం చేసే నమూనా. గుజరాత్లో పరిశ్రమాభివృద్ధి జరగలేదని నేనడం లేదు. కాని, రూ.30,000 కోట్ల వెచ్చించిన నూనెశుద్ధి కర్మాగారం, కేవలం 400 మం దికి ఉపాధి కల్పిస్తే ఒరిగేదెంత? ఈ అభివృద్ధి నమూనా వల్ల సామాజిక న్యాయం లేదా సమానత్వం సిద్ధించడం కల్ల. క్రిస్తీ ఫెర్నాండెజ్ (మోదీ సీఎంగా పనిచేసిన కాలంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి) 20-5-2015న చేసిన వ్యాఖ్య ఎన్నికల ప్రణాళికల పేరుతో రాజకీయ పక్షాలు చేసే బాసలన్నీ ఆచర ణలో నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఇది ప్రజల అనుభవం. అబ ద్ధాల అంకయ్యలకు అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న సామెత ఇలా వచ్చిందే. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి ఒక సంవత్సరం గడిచిన సందర్భం ఇది. సినిమా వందరోజులు ఆడితే చాలునని కొందరు దర్శక నిర్మాతలు ఈ రోజులలో కోరుకుంటూ ఆత్మతృప్తి పొందుతున్నట్టే, బీజేపీ నాయకులు కూడా ఏడాది పాలనకే ఆత్మ సంతృప్తి చెందవలసిన ఆవశ్యకత వచ్చింది. అయితే వారి ఆత్మతృప్తిని మనం కాదనలేం. ఆ హక్కు మనకు లేదు. అప్పటిదాకా ఏలిన పార్టీల నిర్వాకంతో విసిగి వేసారిపోవడం వల్ల కావచ్చు. వాగ్ధాటితో నేతలు తమను నమ్మించడం వల్ల కావచ్చు. ప్రజలు దింపుడు కల్లం ఆశతో ఓట్లు వేస్తున్నారు. మోసపోతున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇదంతా నిరూపితమవుతున్న దశలో మనం ఉన్నాం. యూపీఏ, ఎన్డీయే పాలక వ్యవస్థలు ఆ దశలో భాగాలే. వాటి మధ్య ఆచరణలో వ్యత్యా సాలు తక్కువ. యూపీఏ హయాంలోనూ ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక విధానాలు యథేచ్ఛగా అమలైనాయి. అటల్ బిహారీ వాజపేయి కాలం నుంచి, నేటి పరివార్ కూటమి ఏలుబడి వరకు జరిగినదీ, జరుగుతున్నదీ అదే. దేశ విదే శీ గుత్త పెట్టుబడులకు అనుకూలంగా వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు అమలు జరుగుతూనే వచ్చాయి. 1894 నాటి భూసేకరణ చట్టానికి యూపీఏ సవరణ తెచ్చింది. ఆహార భద్రతకు ఆధారంగా ఉన్న పంట భూములను తాకకుండా, ప్రభుత్వ భూములను పరిశ్రమాభివృద్ధికి వినియోగించేటట్టు జాగ్రత్తలు తీసుకోవడం ఆ సవరణ ఉద్దేశం. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్‌కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది. గుజరాత్ నమూనా ఇంతకీ గ్రామీణ గుజరాత్లో ఈ అభివృద్ధి నమూనా కింద ఎలాంటి సాగు జరుగుతున్నదో గమనించడానికి రెండు ఉదాహరణలు చాలు. ఈ రెండు ఉదాహరణలు (ఫొటోలు చూస్తే తెలుస్తుంది) మోదీ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలోనిది ఒకటి కాగా, రెండవది చివరి మూడేళ్ల కాలానికి చెందినది. మొదటిది: అహ్మదాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని కాయ్‌లా అనే గ్రామంలో పత్తి విత్తనాలు చల్లుకోవ డానికి ఒక గుజరాత్ కుటుంబం తన సభ్యులతోనే కాడి పట్టించవలసి వచ్చింది. ఆధునిక యంత్రాలకు నోచుకోకపోవడమే కాదు, కనీసం ఎడ్లతో కూడా కాకుండా వారే (2011) దుక్కి దున్నుకోవలసివచ్చింది. హిందూ గ్రూప్‌నకు చెందిన ‘ఫ్రంట్‌లైన్’ ఏప్రిల్ 14, 2014లో ఈ ఫొటోను ప్రచు రించింది. మోదీ చెబుతున్న అభివృద్ధి నమూనాలో చోటు లేని గ్రామీణ రైతు కుటుంబాలు దానికి బయటే ఉండిపోయిన సంగతిని ఈ ఫొటో చెబుతోంది. రెండవ ఫొటో.. అహ్మదాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని లక్తార్ తాలూ కాలోని వాద్లా గ్రామానికి చెందిన చిత్రం(ఫ్రంట్‌లైన్, 13-6-2014). ఆధు నిక యంత్రాలు కాని, ఎద్దులు కాని లేకుండా పురాతన నాగలితోనే రైతు కుటుంబం పొలం దున్నుకుంటోంది. మోదీ దేశాన్ని నమ్మిస్తూ వస్తున్న గుజరాత్ అభివృద్ధి నమూనాకు ఇవి సాక్ష్యాలా? లేక వక్రభాష్యాలా? భూసేకరణ చట్టంలో యూపీఏ తీసుకువచ్చిన సవరణ మీద మోదీ ప్రతిపాదించిన సవరణ దగ్గరకు మళ్లీ ఒక్కసారి వద్దాం. 2013 చట్టం ప్రకారం భూములను సేకరించడానికి నూటికి 70 నుంచి 80 మంది రైతుల స్వచ్ఛంద అనుమతి అవసరం. ఆ సేకరణ మూలంగా సామాజిక జీవనం మీద పడే ప్రభావాన్ని గురించి సర్వే జరగాలి. జనాభిప్రాయం తెలుసుకోవాలి. సరిగ్గా ఈ నిబంధననే నిరాకరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్‌ను ఒకటికి రెండుసార్లు ప్రవేశపెట్టింది. కాబట్టి ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గానీ, రైతాంగ వ్యతిరేక సవరణ లను గానీ ఉపసంహరించుకోవడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా ఇంకా వెలుగుచూడని ఈ ఆర్డినెన్స్/బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చి రైతుల మీద సవారీ చేయడం మొదలుపెట్టారు. రాణ్ ఆఫ్ కచ్ రైతుల అనుభవం 1965 నాటి ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో ఇక్కడ స్థిరపడిన 5,000 మంది పంజాబీ, హరియాణా రైతుల శ్రమ కూడా 2010లో, అంటే మోదీ హయాం లోనే దగా పడింది. ఈ అంశం మీద సుప్రీం కోర్టులో ఒక వ్యాజ్యం నడు స్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఆ యుద్ధం సమయంలో ఆ రైతులు గుజ రాత్‌కు వలస వచ్చి రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో స్థిరపడవలసి వచ్చింది. యుద్ధంతో నిర్వాసితులైన ఆ రైతులనూ, మిగిలిన సైనికులనూ ఆ సరి హద్దులో స్థిరపడవలసిందిగా నాటి ప్రధాని సాక్షాత్తు లాల్ బహదూర్ శాస్త్రి కోరారు. అప్పటికి అదంతా ఊసర క్షేత్రం. పైగా పొరుగునే ఉన్న పాకిస్తాన్ చొరబాట్లకు అది ఆలవాలం. బండరాళ్ల నేల. ఆ రైతులే ట్రాక్టర్లతో, పశువుల సాయంతో నేలను సరి చేసుకున్నారు. 400 అడుగులు వెడితే గాని నీరు రాదు. వర్షాలు కురిసే ప్రాంతం కాదు. అలాంటి నేల మీద పత్తి, వేరుశెనగ, గోధుమ, మామిడి, ఖర్జూరం వంటి పంటలు పండించే సరికి వారి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇంత కష్టపడినా, వచ్చి 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వారు స్థిర నివాసం ఏర్పరుచుకున్న నిర్వాసితులుగానే పరిగణనలో ఉన్నారు. వారే అభివృద్ధి చేసుకున్న భూమి మీద వారు రుణం పొందలేరు. అమ్మలేరు. కాలక్రమంలో వారి ఉనికికే ఎసరు పెడుతూ గుజరాత్ ప్రభుత్వం రాణ్ ఆఫ్ కచ్ రైతులు ఖాళీ చేయాలని కచ్ జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. 2010లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నట్టు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంలో వారు మోదీని కలుసుకోవడానికి యత్నించి కూడా విఫలమ య్యారు. ‘మేమంతా భారతీయ రైతులమే. గుజరాత్లో బతుకుతూ ఇక్కడి వారి కోసం భూములు సాగుచేస్తున్నాం. మమ్మల్ని వెళ్లిపొమ్మంటే, మాతో భూమిని వెంటబెట్టుకుని పోలేం.’ అని చెప్పినా ఎవరూ కరగలేదు. ఈ వివాదం గుజరాత్ హైకోర్టుకు వెళ్లింది. ముగ్గురు న్యాయమూర్తులు ఐదురోజులు రైతుల గోడు విన్నారు. తరువాత,‘కచ్‌లో రైతులకు మాత్రమే సొంత భూమి ఉండాలి’ అని తీర్పు చెప్పారు. కానీ గుజరాతీ రైతులకే భూములు ఉండాలని అని చెప్పలేదు. ‘వారు పంజాబీ రైతులు అయితే వారికి కచ్ భూముల మీద హక్కు ఉంది అని కూడా స్పష్టం చేసింది. రైతులే కేసు గెలిచారు. కానీ భూమి దక్కలేదు. మోదీ ప్రభుత్వం ఈ కేసును సుప్రీం కోర్టుకు (2012, జూలై 9) లాగింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఈ రోజుకీ రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రజా స్వామ్యం ఒక మేడిపండు. (వ్యాసకర్త మొబైల్: 9848318414) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
హుద్‌హుద్ సాయం రూ.2350 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో హుద్‌హుద్ తుపాను పునర్నిర్మాణ పనుల కోసం వరల్డ్ బ్యాంకు రూ.2,350 కోట్ల ఆర్థిక సహాయం చేయనుందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ధనుంజయరెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ర్టం పంపిన ప్రతిపాదనలను కేంద్రం వరల్డ్ బ్యాంకుకు పంపిందన్నారు. -
భారత్-అమెరికా బంధం మరింత పటిష్టం
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వాషింగ్టన్: భారత్- అమెరికా సంబంధాలు గతంకన్నా ఇప్పుడు మరింత బలోపేతం అయినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పలు రంగాల్లో రెండు దేశాలూ సన్నిహిత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయన్నారు. కేవలం ప్రభుత్వం-ప్రభుత్వ స్థాయి సంబంధాలతోనే ఆగిపోకుండా... ప్రజలు సైతం ఈ బంధం పట్ల హర్షం, ఆమోదం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆర్థికమంత్రి ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా భారత దౌత్య కార్యాలయంలో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒబామా ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతోపాటు, ఇరు దేశాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... * ఇక్కడకు వచ్చిన అమెరికా ప్రభుత్వ సీనియర్లను చూస్తుంటే... రెండు దేశాల సంబంధాలు ఏ స్థాయిలో బలపడ్డాయో అర్థం అవుతుంది. * పలు రంగాల్లో పురోభివృద్ధి ఉంది. దేశం ఒక గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తోంది. * భారీ సంస్కరణల అమలుతో పలు ప్రాజెక్టుల్లో పురోగతికి కేంద్రం చొరవలు తీసుకుంటోంది. ముఖ్యంగా మౌలిక రంగం వృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. * భారత్‌కు 10 శాతం వృద్ధి సాధించే సత్తా ఉంది. దేశంలో పెరుగుతున్న అవసరాలను నెరవేర్చుకోడానికి కూడా ఈ స్థాయి వృద్ధి సాధన అవసరం. * వాషింగ్టన్లో పర్యటన సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలపై జరిగిన ఒక ప్రత్యేక సుదీర్ఘ సదస్సులో కూడా జైట్లీ పాల్గొన్నారు. -
భారీ పథకాలకు రుణాలివ్వండి
ప్రపంచబ్యాంకును కోరిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొన్నింటిలో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొత్త విద్యుత్తు ప్లాంట్లపై తమ ఆసక్తిని కనబరిచింది. అందుకు అవసరమైన నిధుల సమీకరణకు తమ సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మతో ప్రపంచ బ్యాంకు అధికారి అంకుర్‌శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ప్లానింగ్ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలు... ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎస్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ఆర్థిక వనరులు పరిపుష్టంగా ఉన్నాయని.. అందుకే 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ మిగులు రాష్ట్రంగా గుర్తించిందని తెలిపారు. కానీ.. కొత్త రాష్ట్రం కావటంతో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు నిధుల సర్దుబాటు అవసరాన్ని అంశాల వారీగా విశ్లేషించారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, విద్యుత్తు ప్లాంట్లతో సిద్ధించే భవిష్యత్తు ప్రయోజనాలు.. ఆర్థిక లాభనష్టాలను చర్చించారు. ప్రపంచబ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టులకు ఆర్థికంగా సాయం అందించాలని అధికారులు కోరారు. ఈ చర్చల సందర్భంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి ప్రపంచబ్యాంకు నుంచి రుణసాయం కోరినట్లు అధికారులు వివరించారు. కాగా, రాష్ట్రంలోని గిరిజనులు, ఇతర అట్టడుగువర్గాల అభ్యున్నతికి వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ బృందం త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఉట్నూరు, నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయనుంది. -
జోరుగానే భారత్ వృద్ధి
ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ నివేదికలు కనిష్ట చమురు ధరలు, సానుకూల డిమాండ్ పెట్టుబడుల్లో పెరుగుదల 2015-16లో వృద్ధి 7.5 శాతంగా అంచనా... వాషింగ్టన్: భారత్ ఆర్థికాభివృద్ధి పటిష్టంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థలు తమ వేర్వేరు నివేదికల్లో పేర్కొన్నాయి. తక్కువ స్థాయిలో కొనసాగుతున్న చమురు ధరలు, దేశంలో నెలకొన్న మంచి డిమాండ్ పరిస్థితులు, పెట్టుబడుల పెరుగుదల ధోరణి వంటి అంశాలు భారత్ పటిష్ట వృద్ధికి సహకరిస్తున్న అంశాలని ప్రపంచబ్యాంక్ విశ్లేషించింది. దక్షిణ ఆసియా ఆర్థిక వ్యవస్థపై ఆరు నెలలకు ఒకసారి విడుదల చేసే నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ అంశాలను తెలిపింది. ఇక వృద్ధి స్పీడ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే చైనాను భారత్ అధిగమిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అటు ప్రపంచబ్యాంక్, ఇటు ఐఎంఎఫ్ రెండూ ఈ ఏడాది (2015-16) వృద్ధి రేటు 7.5 శాతమని అంచనావేశాయి. ప్రపంచబ్యాంక్ నివేదికలో ముఖ్యాంశాలు... 2017-18 నాటికి దేశం 8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును సాధిస్తుంది. 2015-2016 : 2017-2018 ఆర్థిక సంవత్సరాల మధ్య పెట్టుబడుల్లో వృద్ధి రేటు భారీగా 12 శాతంగా ఉండొచ్చు. పటిష్ట ఆర్థిక వృద్ధికి దోహదపడే అంశం ఇది. దేశాభివృద్ధి ఇప్పటి వరకూ వినియోగ ఆధారితంగా ఉంది. ఇకపై దీనిని పెట్టుబడుల ఆధారితంగా రూపొందించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో చైనా తన వృద్ధిని పెట్టుబడుల ప్రాతిపదిక నుంచి వినియోగ ఆధారితం వైపునకు తీసుకెళ్తోంది. దక్షిణాసియా వృద్ధి రేటు 2015లో 7 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2017 నాటికి ఇది 7.6 శాతానికి వృద్ధి చెందే అవకాశం. భారత్ వృద్ధి పరుగు మొత్తం ఈ ప్రాంతానికి లాభిస్తున్న అంశం. సంస్కరణలు, మెరుగుపడిన ఇన్వెస్టర్ సెంటిమెంట్ భారత్ ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశాల్లో కొన్ని. భారత్ వృద్ధి పరుగు: ఐఎంఎఫ్ 7.5 శాతం రేటుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే చైనా వృద్ధి రేటును భారత్ అధిగమించే అవకాశం ఉంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ పొందనుంది. ఇంతక్రితం జనవరిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును ఐఎంఎఫ్ 6.3గా పేర్కొంది. ఈ రేటును 7.5 శాతానికి పెంచడానికి ఇటీవల కేంద్రం తీసుకున్న విధాన సంస్కరణలు, పెట్టుబడుల్లో వృద్ధి ధోరణి, తక్కువ స్థాయిలో చమురు ధరలు కారణం. 2014లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. 2015లో ఇది 7.5 శాతానికి చేరుతుంది. 2014లో చైనా వృద్ధి రేటు 7.4 శాతంకాగా, 2015లో ఈ రేటు 6.8 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2016లో ఇది మరింతగా తగ్గి 6.3 శాతానికి చేరుతుంది. రెమిటెన్సుల్లో మనమే టాప్ విదేశాల్లో నివసిస్తున్న వారు స్వదేశంలోని తన వారికి పంపే నిధులకు సంబంధించిన ‘రెమిటెన్సెస్’ విషయంలో భారత్ తన ఆధిక్యతను కొనసాగిస్తోందని ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌసిక్ బసు తెలిపారు. భారత్ నుంచి వెళ్లి... వివిధ దేశాల్లో పనిచేస్తున్న వారు స్వదేశానికి 2014లో 70 బిలియన్ డాలర్లను పంపినట్లు ఆయన తెలిపారు. చైనా విషయంలో ఈ మొత్తం 64 బిలియన్ డాలర్లు. 2015లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్లే రెమిటెన్సుల విలువ దాదాపు 440 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలి పారు. 2014తో పోల్చితే ఇది 0.9% అధికం. ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్సుల విలువ 2015లో 0.4% వృద్ధితో 586 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెమిటెన్సులు పంపుతున్న దేశాల తొలి 5 స్థానాల్లో అమెరికా, సౌదీ , జర్మనీ, రష్యా, యూఏఈలు ఉన్నాయి. పుచ్చుకుంటున్న దేశాల్లో తొలి ఐదు స్థానాల్లో భారత్, చైనా, ఫిలిప్పైన్స్, మెక్సికో, నైజీరియాలు ఉన్నాయి. ఇంతటి భారీ స్థాయిలో నిధుల ప్రవాహం ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే అంశమని కౌశిక్ బసు అన్నారు. -
బ్రిక్స్.. ప్రపంచ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయం కాదు
బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ నిపుణులు విశ్వనాధన్ విశాఖపట్నం: బ్రిక్స్ దేశాలు ఏర్పాటుచేయనున్న బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లకు ప్రత్యామ్నాయం కాదని, ఆదృష్టితో చూడకూడదని బ్రిక్స్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిపుణుడు, మాజీ రాయబారి హెచ్.హెచ్.ఎస్ విశ్వనాధన్ తెలిపారు. బ్రిక్స్ నూతన ఆర్ధిక అంతర్జాతీయ సదస్సును గీతం వర్సిటీలో సోమవారం నిర్వహించారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, ఛైనా, సౌత్ ఆఫ్రికా దేశాల (బ్రిక్స్ దేశాలు) నుంచి ప్రతినిధులు పాల్గొని ఆయా దేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య సంబంధాల మెరుగు పడటానికి బ్రిక్స్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విశ్వనాధన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల ప్రమేయం లేకుండా బ్రిక్స్ భవిష్యత్తులో ప్రపంచ ఆర్ధిక శక్తిగా ఎదగలేదన్నారు. భారత మాజీ రాయబారి అమిత్ గుప్తా మాట్లాడుతూ వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై బ్రిక్స్ ప్రపంచంలో ఇతర దేశాలకు మార్గదర్శకం వహించాలన్నారు. దక్షిణాఫ్రికా హైకమిషన్ కార్యాలయం కార్యదర్శి శ్రీధరన్ ఎస్.పిళ్లై, చైనా రాయబారి కార్యాలయం డిప్యూటీ మినిస్టర్ కౌన్సిల ర్ జెన్ నియో మాట్లాడుతూ బ్రిక్స్ కూటమి టైజం, పైరసీ, ఆరోగ్య రంగం తదిర సామాజిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. గీతం అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్ మూర్తి మాట్లాడుతూ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్నారు. -
చిన్న సంస్థలకు ప్రపంచ బ్యాంకు రుణం
న్యూఢిల్లీ: దేశీ తయారీ, సేవల రంగంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) 500 మిలియన్ డాలర్ల రుణం అందించే ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు ఆమోదముద్ర వేసింది. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి), ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు కింద ఎస్ఎంఈలకు వివిధ దశల్లో కావాల్సిన నిధులు లభిస్తాయి. ఎస్ఎంఈలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించగలవని, అయితే ఇందుకోసం వాటికి నిధులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ (భారత్) ఓనో రుహల్ తెలిపారు. అలాంటి అడ్డంకులు అధిగమించి పూర్తి సామర్ధ్యంతో చిన్న సంస్థలు పనిచేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడగలదన్నారు. దేశీ పరిశ్రమల్లో 80 శాతం పైగా చిన్న తరహా సంస్థలే ఉన్నాయి. ఇవి 8 వేల పైచిలుకు వివిధ ఉత్పత్తులు తయారు చేస్తూ సుమారు 6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మొత్తం తయారీ రంగ ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా ఎస్ఎంఈలదే ఉంటోంది. కానీ, అవసరానికి నిధులు అందుబాటులో లేకపోతుండటం ఎస్ఎంఈలకు ప్రధాన సమస్యగా ఉంటున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ తాజా రుణం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇయం వార్తా శ్రూయంతాం....
ప్రపంచం ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’ తొలిసారిగా లిబ్బే లేన్ అనే ఫిమేల్ బిషప్‌ను నియమించింది. సంప్రదాయవాదులు మాత్రం ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాను ‘గే’ అని తెలియడంతో యాజమాన్యం తనను ఉద్యోగం నుంచి తీసివేసిందని, ఇది అన్యాయమైన నిర్ణయమని చైనాలోని నన్షాన్ జిల్లా కోర్టులో కేసు ఒకటి దాఖలైంది. ఇలాంటి కేసు కోర్టులో దాఖలు కావడం ఇదే తొలిసారి. మలేషియా ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను ‘సైబర్ కాలిపేట్’ అనే గ్రూపు హ్యాక్ చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి పెద్ద టమోటాను పండించి సంచలనం సృష్టించారు. ఈ టమోటో సాధారణ టమోటాల కంటే 12 రెట్లు పెద్దదిగా ఉంటుంది.తూర్పు ఏషియాలో దాదాపు 20 కోట్ల మంది ప్రజలు పల్లెల నుంచి పట్నాలకు వలస వెళ్లినట్లు ‘వరల్డ్ బ్యాంకు’ రిపోర్ట్ చెబుతుంది. -
చైనా వెనక్కి.. భారత్ ముందుకు!
వాషింగ్టన్: ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో మళ్లీ భారత్ చైనాతో పోటాపోటీగా దూసుకెళ్లనుంది. అంతేకాదు 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు స్వల్పంగా చైనాను అధిగమించి 7 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ తాజాగా నివేదిక అంచనా వేసింది. ఇదే ఏడాది చైనా వృద్ధి రేటు 6.9 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. ‘ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం-అంచనాలు’ పేరుతో ఈ నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ప్రధానంగా మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల భారీ పతనం, తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు వంటివి భారత్ ఆర్థిక వ్యవస్థకు చోదకంగా నిలవనున్నాయని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిండెంట్ కౌశిక్ బసు పేర్కొన్నారు. ‘చైనా వృద్ధి పటిష్టంగానే కొనసాగనుంది. 2015-16లో 7 శాతంగా ఉండొచ్చు. అయితే, 2016-17లో మాత్రం కాస్త తగ్గి 6.9 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్ ఈ రెండు ఏడాదిల్లోనూ వరుసగా 7% చొప్పున వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇటీవలి కాలంలో భారత్.. చైనాతో పోటీగా వృద్ధిని సాధించడం ఇదే తొలిసారి కానుంది కూడా’ అని బసు చెప్పారు. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... గతేడాది(2014) భారత్ వృద్ధి 5.6%గా ప్రపంచ బ్యాంక్ లెక్కగట్టింది. ప్రస్తుత 2015 సంవత్సరంలో ఇది 6.4% ఉండొచ్చని అంచనా వేసింది. చైనా విషయానికొస్తే.. 2014లో 7.4% వృద్ధి చెందగా.. 2015లో 7.1% ఉంటుందని అంచనా. దక్షిణాసియా దేశాల మొత్తం వృద్ధిరేటు 2013 ఏడాదిలో పదేళ్ల కనిష్టానికి(4.9 శాతం) పడిపోగా.. 2014లో 5.5 శాతానికి పుంజుకుంది. ప్రధానంగా, ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండటం దీనికి దోహదం చేసింది. భారత్‌లో సంస్కరణల జోరుతో సరఫరాపరమైన అడ్డంకులు తొలగనున్నాయి. దీంతో 2017లో దక్షిణాసియా వృద్ధి రేటు 6.8%కి పుంజుకోవచ్చు. సంస్కరణల విషయంలో వెనక్కితగ్గితే.. వృద్ధి రికవరీ మళ్లీ పడిపోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 3 శాతం... పలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు గతంతో పోలిస్తే కాస్త మందగించిన నేపథ్యంలో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు రికవరీ వేగం పుంజుకోవడం లేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 2014లో గ్లోబల్ జీడీపీ వృద్ధి 2.6% ఉండగా.. ఈ ఏడాది(2015)లో ఇది 3%కి పెరగవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. 2016లో 3.3%, 2017లో 3.2% చొప్పున వృద్ధికి ఆస్కారం ఉందని పేర్కొంది. ఐరాస భారత్ వృద్ధి అంచనా 6.4 శాతం... భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2015) 6.4% వృద్ధి చెందొచ్చని ఐక్యరా జ్యసమితి(ఐరాస) నివేదిక అంచనావేసింది. 2014లో వృద్ధి రేటు 5.5%గా పేర్కొంది. ఆసియా, పసిఫిక్ దేశాల్లో సర్వే ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. మోదీ సర్కారు అమలు చేస్తున్న సంస్కరణలు, విధానపరమైన చర్యలతో వ్యాపార రంగం, వినియోగదారుల్లో విశ్వాసం పెరిగిందని అభిప్రాయపడింది. -
భారత్‌కు ఉజ్వల భవిష్యత్: జిమ్ యాంగ్ కిమ్
గుజరాత్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రపంచ బ్యాంకు చైర్మన్ జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది భారత్ 6.5 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని అంచనా వేశామని చెప్పారు. దేశ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. సౌరవిద్యుత్తు ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. -
సోలార్ పార్క్ ఆదిలాబాద్‌కు?
పాలమూరులో భూసేకరణకు అవాంతరాలే కారణం ఆదిలాబాద్‌లో టీఎస్ఐఐసీస్థలాల అన్వేషణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏర్పాటు చేయనున్న భారీ సోలార్ పార్కుకు ప్రత్యామ్నాయ స్థలాల అన్వేషణ మొదలైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు మండలంలో తలపెట్టిన ఈ పార్కుకు భూసేకరణ అవరోధంగా మారడమే ఇందుకు కారణం. పార్కు నిర్మాణానికి కావాల్సిన భూములను తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సేకరించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ)కు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ దీనిపై టీఎస్ఐఐసీ ఇప్పటికీ దృష్టి సారించలేదు. పార్కు నిర్మాణానికి గట్టు మండలంలో సేకరించ తలపెట్టిన 5702 ఎకరాలు ఆలూరు, రాయిపల్లి, బుచ్చినెర్ల, కేటీ దొడ్డి గ్రామాల పరిధిలో ఉన్నా యి. వాటిలో 391 ఎకరాల అసైన్డ్, 415 ఎకరాల పట్టా భూములు కూడా ఉన్నాయి. టీఎస్ఐఐసీ మాత్రం ఈ విషయాన్ని కనీసం రాష్ట్ర ఇంధన శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి, ప్లాంటు నిర్మాణానికి ముందుకొచ్చిన ఎన్టీపీసీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల అధికారులతో భేటీ అయినప్పుడు ఈ విషయం బయటపడింది. పార్కుకు కావాల్సిన భూముల బదిలీ ఇంకా జరగలేదని తెలిసి ఇంధన శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఆ నాలుగు గ్రామాల పరిధిలోని అసైన్డ్, పట్టా భూముల సేకరణ జాప్యమయ్యేలా ఉండటంతో పార్కు నిర్మాణానికి మరోచోట స్థలాలను గుర్తించాలని టీఎస్ఐఐసీని ఆదేశించారు. దాంతో ఆదిలాబాద్ స్థలాల వేటలో పడ్డ టీఎస్ఐఐసీ, ఒకేచోట 5000 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యమయ్యే పరిస్థితి జిల్లాలో ఎక్కడా లేదని గుర్తించింది. దాంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేసి, పలు ప్రాంతాల్లో ప్లాంట్లు నెలకొల్పేందుకు కంపెనీలను ఆహ్వానించాలని భావిస్తోంది. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాలు ఒకేచోట ఉన్న ప్రాంతాలను ఇందుకు ఎంచుకుంది. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్‌కు ఐదెకరాలు అవసరం. ఈ లెక్కన ఇంద్రవెల్లి మండలంలోని వెయ్యెకరాల్లో మొదటగా ఎన్టీపీసీ సారథ్యంలో 200 మెగావాట్ల సోలార్ ప్లాం ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సింగరేణి ప్లాంట్‌కు నేడు సీఎం సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రాన్ని సందర్శించేం దుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక్కడి జైపూర్ సమీపంలో 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రాన్ని సింగరేణి నిర్మిస్తోంది. వచ్చే ఏడాది నుంచి విద్యుదుత్పత్తి మొదలవుతుం ది. దీని సామర్థ్యాన్ని 1,800 మెగావాట్లకు పెంచాలని ఇటీవలి బోర్డు సమావేశంలో సింగరేణి సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సోలార్ పార్కుకు అనువైన స్థలాలను కూడా పర్యటన సందర్భంగా సీఎం పరిశీలించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. -
తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరు భేష్
సాక్షి, విశాఖపట్నం: కనివినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించిన హుద్‌హుద్ తుఫాన్‌ను ఎదుర్కొన్న తీరుపై హ్యాండ్‌బుక్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ తరుణ్‌బజాజ్ సూచించారు. ఎదుర్కొన్న తీరు అభినందనీయమన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో 220 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచాయని, 400 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని ఆయన సూచించారు. బజాజ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు అధికారుల బృందం గురువారం జిల్లాలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ బృందంలో బజాజ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు అపర్ణ బాటియా, ఒన్నో రుహి, సౌరబ్ దాని, దీపక్ సింగ్, ఎం.తేరిసా ఖో, ఆండ్రూ జెఫ్రీస్, పుష్కర్ శ్రీవాత్సవ, అనీల్ మొత్వానిలకు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వాగతం పలికారు. తొలుత ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను తిలకించి టెర్మినల్‌కు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ఉత్తరాంధ్రలో తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించి కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. తుఫాన్ నష్టాలపై బృందం సభ్యులకు కలెక్టర్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆర్కే బీచ్‌లోని జీవీఎంసీ-యూఎల్బీ రోడ్, రాజీవ్ స్మృతి భవన్, ఎపీఐఐసీలోని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింహపురి కాలనీలోని దెబ్బతిన్న అర్బన్ హౌసెస్, జీవీఎంసీ స్వర్ణభారతి ఆడిటోరియాన్ని పరిశీలించారు. సర్క్యూట్‌హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. సాయంత్రం మునగపాక మండలం వాడ్రాపల్లిలో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఉదయం జరిగిన సమీక్ష సమావేశంలో బజాజ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చిత్తశుద్ధి అవసరమన్నారు. జీవీఎంసీకి జరిగిన నష్టాన్ని ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని ఏపీ ఈపీసీడీఎల్ సీఎండీ శేషగిరిబాబులు వివరించారు. ఈ సమావేశంలో అటవీశాఖ చీఫ్ క న్జర్వేటర్ భరత్‌కుమార్, సోషల్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ కె. సూర్యనారాయణ, ఏజేసీ డి.వి.రెడ్డి, డీఎఫ్‌వో రామ్మోహనరావు, డీఆర్వో నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ లీలావతి, ఉద్యానవన శాఖ ఏడీ ప్రభాకరరావు, తుఫాన్ హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రామచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తోట ప్రభావకరావు పాల్గొన్నారు. -
చిన్న సంస్థల కోసం ప్రపంచ బ్యాంకుతో భారత్ జట్టు
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) తమ ఉత్పాదకతను పెంచుకోవడంలో తోడ్పడే దిశగా ప్రపంచ బ్యాంకుతో భారత్ 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధులతో టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ (టీసీఎస్‌పీ)కి సంబంధించి ఒప్పం దంపై ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం సోమవారం సంతకాలు చేశాయి. టీసీఎస్‌పీ కింద కొత్తగా 15 టెక్నాలజీ కేంద్రాలను (టీసీ) ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న 18 టీసీలను ఆధునీకరించడం తదితర పనులు చేపడతారు. ఇందుకు మొత్తం రూ. 2,200 కోట్లు (దాదాపు 400 మిలియన్ డాలర్లు) వ్యయం కానుండగా సగభాగం (200 మిలియన్ డాలర్లు) ప్రపంచ బ్యాంకు రుణ రూపంలో అందిస్తోంది. టెక్నాలజీ, వ్యాపారపరమైన సలహాలు ఇవ్వడం ద్వారా చిన్న సంస్థల ఉత్పాదకతను పెంచడంలో తోడ్పాటు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. -
విశాఖ పునర్నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్
ప్రపంచబ్యాంకు, ఏడీబీ నుంచి నిధులకు ప్రయత్నం: ఏపీ సీఎం చంద్రబాబు * ఆస్తి నష్టం అంచనాలకు మించి ఉంది * అందరి సహకారంతోనే ఉత్తరాంధ్రను సాధారణ స్థితికి తెచ్చాం * విద్యుత్తు సంస్థలకు నష్టం రూ.1,400 కోట్లుదాకా ఉంది * అంకితభావంతో పనిచేసిన విశాఖ కలెక్టర్, ఉద్యోగులకు అభినందనలు సాక్షి, హైదరాబాద్/విశాఖ రూరల్: హుదూద్ తుపాను ధాటికి పూర్తిగా దెబ్బతిన్న విశాఖ నగర పునర్నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ల నుంచి నిధులు తెచ్చేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామ ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖను సుందరవనంగా, ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా తయారు చేస్తామని తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అనంతరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా అంచనాలకు అందనివిధంగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఆయువు పట్టు లాంటి ఆర్థిక నగరం కుదేలైందని, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన స్మార్ట్ సిటీ ఇబ్బందుల్లో ఉందని అన్నారు. తుపాను ఓ నగరాన్ని అల్లకల్లోలం చేసిన సంఘటన ఇటీవలి కాలంలో ఎక్క డా లేదన్నారు. 30 లక్షలమంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. త్వరలో తాను ప్రధాని మోదీని కలిసి నగర పునర్నిర్మాణంపై చర్చిస్తానన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నీతికి మారుపేరని, నిజాయితీ వీరి వారసత్వంలోనే ఉందని కితాబిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఆరు రోజులపాటు తాను విశాఖలోనే ఉండి ప్రజ లకు ఇబ్బందులు లేకుండా ఎన్ని చేయాలో అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తన బాధ్య త నెరవేర్చానని, సంతోషంగా ఉందని చెప్పారు. మళ్లీ మంగళవారం రాత్రికి విశాఖ వస్తానని, రెండు రోజులిక్కడే ఉండి పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దుతానని అన్నారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, పశ్చి మబెంగాల్ రాష్ట్రాలతోపాటు అధికార యం త్రాంగం, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తుపాను నష్టం నుంచి ఉత్తరాంధ్ర తేరుకునేలా చేయగలిగామని చెప్పారు. తుపాను వచ్చిన రెండోరోజే ప్రధాని మోదీ విశాఖకొచ్చి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వరంగానికే భారీ నష్టం తుపాను నష్టం ప్రభుత్వ రంగంలోనే భారీగా ఉందన్నారు. ఒక్క విద్యుత్తు శాఖ నష్టమే రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఉందని తెలిపారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. 30 వేల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని, వేలాది ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలాయని, వందలాది సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎన్టీపీసీలో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 10 లక్షల సర్వీసు కనెక్షన్లు ఇవ్వగా, ఇంకా 13 లక్షల కనెక్షన్లను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు విద్యుత్ సరఫరా చేస్తామని, 22వ తేదీ నాటికి మండల కేంద్రాల్లో, 25వ తేదీకి జిల్లా మొత్తంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ రాని ప్రాంతాలు, ఏజెన్సీలో 5 లీటర్ల కిరోసిన్ ఇస్తామన్నారు.పరిశ్రమల పునరుద్ధరణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు. పచ్చదనానికి ప్రణాళిక విశాఖలో పచ్చదనం పరిరక్షణకు హార్టీకల్చర్ నిపుణులతో ప్రణాళిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. సోమవారం నుంచి చెట్లను ప్రూనింగ్ చేస్తామని చెప్పారు. అందమైన ల్యాండ్ స్కేపింగ్, తుపాన్లను తట్టుకొనేలా చెట్లను వేయడానికి ముంబై నుంచి కన్సల్టెంట్లు వచ్చారని అన్నారు. విశాఖ జిల్లాలో 13 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తామని చెప్పారు. ముకేష్ అంబానీ రూ.11 కోట్ల విరాళం తుపాను బాధితుల సహాయార్థం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రూ.11 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. 23న కాగడాల ర్యాలీ తుపాను చేసిన గాయాన్ని మరచిపోయేందు కు, విశాఖవాసుల్లో ఆత్మవిశ్వాసం నింపేం దుకు ఈ నెల 23న ఆర్కే బీచ్‌లో ‘తుపాను ను జయిద్దాం’ నినాదంతో కాగడాల ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక విశాఖ పునరుద్ధరణకు కృషి చేసిన ఇతర రాష్ట్రాల అధికారులు, సిబ్బందితో భారీ అభినందన సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇతర జిల్లాలవారికి విందు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌ను ఆదేశించారు. సహాయక పనుల్లో కష్టపడిన వారిని గుర్తించి అవార్డులిచ్చి సత్కరిస్తామన్నారు. -
బౌద్ధ్ద పర్యాటకానికి చేయూత
ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం చంద్రబాబు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ పర్యాటకం అభివృద్ధికి సాయం చేసేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏడు మిషన్లకు సంబంధించి సేవారంగంలో కీలకమైన పర్యాటక రంగంపై ముఖ్యమం త్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సమీక్షించారు. బౌద్ధ పర్యాటకం, దేవాలయ పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బౌద్ధ్ద పర్యాటకం అభివృద్ధికి ప్రపంచబ్యాంకు చేయూతనిస్తుందని చెప్పారు. పర్యాటకులు ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో పాటు ఎక్కువ సమయం గడిపేలా అదనపు ఆకర్షణలు కల్పించటంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్లలో మాదిరిగా అత్యున్నత ప్రమాణాలతో ట్రావెల్, టూరిజం విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. గర్భిణులకు స్మార్ట్ కార్డులివ్వండి: గర్భిణులకు ప్రభుత్వమిచ్చే సాయం అందేం దుకు వీలుగా.. రాష్ట్రంలో గుర్తించిన 9 లక్షల మంది గర్భిణులకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో సంక్షేమ రంగంపై శనివారం అధికారులతో సమీక్ష జరిపారు. పోలవరం ఖర్చులు తిరిగి ఇవ్వండి.. సీఎం లేఖ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణంపై చేసిన వ్యయాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5,200 కోట్లు వ్యయం చేసిందని, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా బాబు లేఖలో కోరారు. అంతకుముందే ప్రాజెక్టుపై చేసిన ఖర్చును ఇవ్వాల్సిందిగా జలవనరుల మంత్రిత్వ శాఖతో సమావేశం సందర్భంగా సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కోరారు. ఇందుకు ఆ శాఖ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సీఎం లేఖ రాశారు. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు చేపట్టిన సంగతి విదితమే. -
ప్రకృతి విపత్తుల నివారణకు కొత్త ప్రాజెక్టు
ఏలూరు (సెంట్రల్) : రాష్ట్రంలో రూ.1,200 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో నూతన ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెల్లడించారు. స్థానిక జిల్లా పరి షత్ అతిథి గృహంలో గురువారం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ప్రకృతి విపత్తుల నివారణ పథకం కింద రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు వెచ్చించడానికి ప్రపంచబ్యాంకు సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు. గత ఏడాది పై-లీన్ తుపాను, భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న నిర్మాణాల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రూ.1,200 కోట్లమేర ఆర్థిక సాయం చేయనుందని, ఈ పనులకు తగు అంచనాలు రూపొందించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఈ పథ కం కింద జిల్లాలోని తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, తుపానుల వల్ల దెబ్బతిన్న గ్రామాల్లోని ప్రధాన రహదారులను పునరుద్ధరించేందుకు రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీమన్నారాయణ, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆర్థిక సంఘం నిధులు తెచ్చేందుకు కృషి ఏలూరు : 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.16 కోట్ల నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి చెప్పారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగే 14వ ఆర్థిక సంఘ సమావేశానికి తనను ఆహ్వానించారని తెలిపారు. మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి మన జిల్లాకు మొదటి దఫాగా రూ.6.60 కోట్లు మంజూరయ్యూయని చెప్పారు. ఈ నిధులు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతున్నాయని, రోడ్లు, డ్రెరుున్లు తదితర పనుల కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి ఇచ్చే నిధులను పెంచాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరతామని జెడ్పీ చైర్మన్ చెప్పారు. ఆర్ అండ్ బీ, పంచా యతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా జిల్లాకు వివిధ పనుల నిమిత్తం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని అడుగుతామన్నారు. -
భారత్‌లో ఇన్ఫ్రా అభివృద్ధికి ప్రపంచబ్యాంక్ సహకారం
న్యూఢిల్లీ: భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇందులోభాగంగా వచ్చే ఐదేళ్లలో బాండ్ల జారీ ద్వారా(రూపాయి కరెన్సీలో) 2.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1,500 కోట్లు)ను సమీకరించనున్నట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ జిన్-యాంగ్ కయ్ వెల్లడించారు. ప్రైవేటు రంగానికి రుణాలను అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ఐఎఫ్సీని నెలకొల్పింది. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసే కంపెనీలకు నిధుల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఐఎఫ్‌సీ వినియోగించనుంది. కాగా, ఐఎఫ్‌సీ చేపట్టనున్న ఈ బాండ్ల ఇష్యూ భారత్‌లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అదేవిధంగా దీర్ఘకాలిక బాండ్ మార్కెట్ అభివృద్ధికి కొత్త ఉత్తేజం తీసుకురానుందని ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ వ్యాఖ్యానించారు. ఇతర సంస్థలు కూడా ఈ మార్గాన్ని అనుసరించేందుకు వీలవుతుందన్నారు. భారత్, ఐఎఫ్‌సీల మధ్య ఈ బాండ్ల జారీ ప్రోగ్రామ్ మరో కీలక మైలురాయిగా నిలవనుందని మాయారామ్ అభిప్రాయపడ్డారు. మౌలిక రంగానికి నిధులందించేందుకు వీలుగా బ్యాంకులు దీర్ఘకాలిక బాండ్లు చేసేందుకు ఇటీవలే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనుమతించిన విషయాన్ని మాయారామ్ గుర్తు చేశారు. ఈ చర్యల ద్వారా ఇన్ఫ్రా ప్రాజెక్టులు వేగం పుంజుకోవడమేకాకుండా.. ప్రైవేటు రంగంలో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తాము జారీ చేసే బాండ్లను విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని కయ్ వెల్లడించారు. -
పనులు కావాలంటే పన్నులు వేయండి
నిధుల కోసం మేం ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లాలా? విజయవాడ కార్పొరేషన్ దివాళా తీసింది సిబ్బంది ఉద్యోగ ధర్మం పాటించాలి పౌర సన్మాన సభలో కేంద్రమంత్రి వెంకయ్య సాక్షి, విజయవాడ : నగరపాలక సంస్థ దివాళా తీసిందని, సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని సాక్షాత్తు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కార్పొరేషన్ రూ.246 కోట్ల అప్పుల్లో ఉండడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని చెప్పారు. అందుకే పన్నులు పెంచి వచ్చే ఆదాయంతో పనులు చేయాలని సూచించారు. శనివారం స్థానిక తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వెంకయ్యకు పౌర సన్మానం జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ 2002 నుంచి ఇప్పటివరకు నగరంలో పన్నులు పెంచలేదని గుర్తుచేశారు. స్థానికంగా ఆదాయ వనరులు సమకూర్చుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు కావాల్సిన నిధులు ఎవరొచ్చి ఇస్తారని అడిగారు. నిధులివ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిమితులు ఉన్నాయన్నారు. కార్పొరేషన్లు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్దకెళితే.. రాష్ట్రం కేంద్రం వద్దకు వస్తే.. మరి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లాలా?అని ప్రశ్నించారు. పన్నులు రివైజ్ చేయండి.. జీఐఎస్ గ్రాఫిక్కు నగరం మ్యాప్‌ను అనుసంధానం చేయడం ద్వారా నగరంలోని ఏ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంది, దానికి ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోవచ్చని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రతి ఇంటి యజమాని సెల్ఫ్ ఎసెస్ వేసుకుని కార్పొరేషన్‌కు పన్నులు చెల్లించాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని జీఐఎస్‌కు అనుసంధానం చేయడం ద్వారా రూ.765 కోట్లు వచ్చే పన్ను రూ.1035 కోట్లకు పెరిగిందన్నారు. పన్నులు చెల్లించని వారిపై ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, వారు తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి వెనుకాడరాదన్నారు. నగరానికి 30 కి.మీ. లోపు జరిగే నిర్మాణాలపై దృష్టి సారించాలని చెప్పారు. నగరపాలక సంస్థకు ఏవైనా ఇబ్బందులుంటే ఢిల్లీ వస్తే అక్కడ చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని వివరించారు. పుర్వవైభవం తీసుకురండి.. విజయవాడకు పూర్వవైభవం తీసుకురావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండేదని, సాహిత్య రంగం, పత్రికా రంగానికి విజయవాడ పుట్టినిల్లని, స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ ఉండేవారని చెప్పారు. మధ్యలో కొన్ని రోజులు ఘర్షణలు జరిగినా తిరిగి ఇప్పుడు కలిసి పనిచేసి సాంస్కృతిక, సాహిత్య రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, గోకరాజు గంగరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమ, మేయర్ కోనేరు శ్రీధర్, కలెక్టర్ రఘునందన్‌రావు, కమిషనర్ హరికిరణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వెంకయ్య ఇచ్చిన హామీలు దుర్గగుడి వద్ద ఫ్లైవోవర్ నిర్మాణం రూ.60 కోట్లతో కొండపల్లి అభివృద్ధి అంతర్జాతీయ స్థాయికి గన్నవరం విమానాశ్రయం విజయవాడ-గుంటూరు-తెనాలి నగరాల మధ్య మెట్రో రైలు ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ.10 కోట్ల కేటాయింపు. త్వరలోనే సమగ్ర నివేదిక రెడీ. గన్నవరం వద్ద ఉన్న బ్రహ్మయ్యలింగయ్య చెరువును హుస్సేన్‌సాగర్ తరహాలో అభివృద్ధి చేయడానికి పరిశీలన. రవీంద్రభారతి తరహాలో తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దుతాం. నగరానికి వెలుపల గుంటూరు జిల్లా కాజ నుంచి పెదఆవుటపల్లి వరకు అవుటర్ రింగ్‌రోడ్డు, తూర్పు వైపున మరో రింగ్‌రోడ్డు నిర్మాణం. నగరంలోనిమురికివాడల్లో నివసించే పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం. -
పేదలకు ‘ఆరోగ్య శ్రీ’రామరక్ష
-
పేదలకు ‘ఆరోగ్య శ్రీ’రామరక్ష
* ప్రపంచ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడి * వైఎస్సార్ తెచ్చిన పథకం ఆదుకుందన్న ప్రజలు ‘రాష్ట్రంలో(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) వేలాది పేద కుటుంబాలను పలకరించాం. ఒకసారి కాదు.. రెండు మూడు దఫాలుగా వివిధ గ్రామాలు, పట్టణాల్లో పేదలను కలిశాం. ఎవరిని అడిగినా ఆరోగ్యశ్రీ పథకం గురించి అనర్గళంగా చెప్పారు. 80 శాతం మంది తమకు ఈ పథకం వర్తించిందని తెలిపారు. అంతెందుకూ నాటి పాలక పార్టీ(కాంగ్రెస్)ని మళ్లీ అధికారంలోకి తేవటానికి ఇది ఎంతో ఉపయోగపడిందని మా అభిప్రాయం’ - వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకంపై ప్రపంచబ్యాంక్ అధ్యయనంలో వెల్లడైన సత్యాలివి. సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రపంచబ్యాంకు అధ్యయనం జరిపి తాజాగా రూపొందించిన నివేదిక జనాభిప్రాయాన్ని తేటతెల్లం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో ప్రీతిపాత్రమైన ప్రపంచబ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా అధ్యయనం చేసి వాస్తవాలను నిర్ధారించింది. మూడు దఫాలుగా వేలాది కుటుంబాల వద్దకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజల అభిప్రాయాలను కోరింది. ఇందులో 80 శాతానికి పైగా కుటుంబాలు ముక్తకంఠంతో ఒకే మాట చెప్పాయి. ఆరోగ్యశ్రీ కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లమని, ఈ పథకం ద్వారానే కోలుకోగలిగామని తెలిపారు. వివిధ జిల్లాలో 8,600 కుటుంబాల ను సర్వే చేయగా 71 శాతం మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందామని చెప్పారు. చాలామంది 108 అంబులెన్సుకు ఫోన్ చేసి అదే వాహనంలో ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్నామని తెలిపారు. కొం దరు కాల్‌సెంటర్ ద్వారా వివరాలు తెలుసుకున్నామని, ఇది చాలా ఉపయోగపడిందని చెప్పా రు. తమకు మందులు, రవాణా చార్జీలు కూడా చెల్లించేవారని 2010కి ముందు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు గుర్తు చేసుకున్నారు. హెల్త్ క్యాంపుల్లో రోగ నిర్ధారణ అనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు పేద ప్రజలు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇంటికి వెళ్లాక తమను పలకరిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంతకంతో వచ్చిన లేఖ అంతులేని సంతోషం కలిగించినట్లు అత్యధికులు తెలిపారు. పేదలను విపత్తు నుంచి కాపాడింది ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డుల జారీని బట్టి చూస్తే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. వీరిలో చాలామంది క్లిష్టమైన జబ్బు బారిన పడితే నయం చేయించు కోలేని పరిస్థితిలో ఉన్నారు. పేద కుటుంబాలను సర్వనాశం చేయగల జబ్బుల (కెటస్ట్రోపిక్ ఇల్నెస్ డిసీజెస్) నుంచి ఆరోగ్యశ్రీ పథకం కాపాడింది’ అని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ పథకం అనతి కాలంలో ఇంత వేగంగా ప్రజల్లోకి వెళ్లడం అరుదుగా జరుగుతుందని నివేదికలో వెల్లడించారు. ఆరోగ్యశ్రీపై ప్రపంచబ్యాంకు నివేదికలో మరికొన్ని అంశాలు... * మొత్తం 86 శాతం మంది పేదవారిలో 71 శాతం మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. * కోట్లాదిమంది జనాభా ఉన్న రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కిందకు 938 జబ్బులను తెచ్చి సేవలందించడం విశేషం. * హెల్త్‌క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలతో పేదలకు పథకాన్ని వేగంగా పరిచయం చేశారు. * రోగులను ఇన్పేషెంట్లుగా చేర్చుకునే ప్రక్రియలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పకడ్బందీగా వ్యవహరించింది. కేవలం 12 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే పద్ధతిని ఆ ట్రస్టు అమలు చేసింది. * మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రోగులకు ఆరోగ్యశ్రీ అందుబాటులోకి వచ్చాక వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. * ఆరోగ్యశ్రీ పథకానికి 108 అంబులెన్సు సర్వీసులు ఎంతో దోహదపడ్డాయి. 104 (సంచార వైద్యశాల), కాల్‌సెంటర్ కూడా ఉపయోగపడింది. * చాలా రాష్ట్రాల్లో 50 శాతం వైద్య ఖర్చులు వసూలు చేస్తున్నారు. కానీ ఈ పథకం కింద వందశాతం భారం ప్రభుత్వమే భరించింది. * ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమల్లోకి వచ్చాక చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఆసక్తి కనబరిచాయి. * ఆరోగ్యశ్రీ పథకం ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది. -
రూ. 645 కోట్లతో అభివృద్ధి
ప్రపంచ బ్యాంకు నిధులతో పనులు బందరు మండలంలో తుపాను షెల్టరు పరిశీలన టీమ్‌లీడర్ అలోక్పట్నాయక్ చిలకలపూడి (మచిలీపట్నం) : ప్రపంచ బ్యాంకు ద్వారా రూ. 645 కోట్లతో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రపంచ బ్యాంకు బృందం టీమ్‌లీడర్ అలోక్ పట్నాయక్ తెలియజేశారు. ప్రపంచ బ్యాంకు నిధులతో పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు బుధవారం బృందం మచిలీపట్నం వచ్చింది. అనంతరం బందరు మండలంలోని మాలకాయలంక, తాళ్లపాలెంలో తుపాను షెల్టర్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో మాట్లాడారు. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఎన్సీఈఆర్పీ) ద్వారా రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలో రూ. 645 కోట్లతో 559 అభివృద్ధి పనులను చేపడుతున్నామని చెప్పారు. వీటిలో 138 తుపాను షెల్టర్లు, 265 రహదారులు, 23 వంతెనలు, రెండు కరకట్ట నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు బృందం గత నాలుగు రోజులుగా పురోగతిలో ఉన్న పనులను పరిశీలించిందని, వీటిలో కొన్ని పనులు రెండు, మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసేకునే అవకాశం ఉందన్నారు. మిగిలిన పనులన్నీ 2015 మార్చి నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేశామన్నారు. ప్రజాసంక్షేమం కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ఈ పనులను ఆయా గ్రామాల ప్రజలు చొరవ తీసుకుని నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని సూచించారు. పనుల్లో నాణ్యత కొరవడితే గ్రామస్తులు పర్యవేక్షణాధికారులకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో భోజన విరామం అనంతరం ప్రపంచ బ్యాంకు ద్వారా చేపడుతున్న పనులపై బృందం సభ్యులు చర్చించుకున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ డెప్యూటీ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎస్ఎస్ జైన్, ఎంబ్యాంక్మెంట్ వరల్డ్ ఎక్స్పర్ట్ ప్రాబ్లిట్ జోల్డర్, ఇంజనీర్ ఎక్స్పర్ట్ డీపీ మహాపాత్ర, ఎన్డీఎంఏ సెక్టర్ ఎక్స్పర్ట్ కెఎ. సింగ్ , అధికారులు పాల్గొన్నారు. -
ప్రపంచబ్యాంకు, జేబీఐసీలతో మళ్లీ ఒప్పందాలు!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పథకాల అమలు కోసం ప్రపంచ బ్యాంకు, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జేబీఐసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాలను తిరిగి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట ఒప్పందాలు ఉన్నందున, ఆ నిధులన్నీ ఆ రాష్ట్రానికి వెళ్తాయని, అందువల్ల రుణ ఒప్పందాలను రెండు నెలల్లోగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సోమవారం తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. -
ప్రపంచ బ్యాంక్‌తో ‘కొత్త జీవితం’
సాక్షి, చెన్నై: కాంచీపురం జిల్లా పడప్పై గ్రామంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం బుధవారం పర్యటించింది. అక్కడి గ్రామీణ ప్రజల స్థితిగతులు, జీవనాధారం, ప్రభుత్వ సహకారం గురించి ఈ బృందం ఆరా తీసింది. కొత్త జీవితం పథకం లబ్ధిదారులతో ముచ్చటించింది.పేద, వెనుకబడిన, గిరిజనుల్లో ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రపంచ బ్యాంకు నిధుల్ని కేటాయిస్తోంది. పుదు వాల్వు(కొత్తజీవితం)నినాదంతో ప్రత్యేక పథకాన్ని ప్రపంచ బ్యాంక్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 32 జిల్లాల్లో వెనుకబడిన 120 మండలాల్లో 4,174 గ్రామాల్లో రూ.1670 కోట్లతో ఈ పథకం దిగ్విజయవంతంగా అమలవుతోంది. కాంచీపురం జిల్లా పడప్పైలోనూ ఈ పథకం లబ్ధిదారులెందరో ఉన్నారు. ఇక్క ట్రామ్ విదేశీ సంస్థ నేతృత్వంలో ఓ గార్మెంట్స్‌ను నెలకొల్పి యువతకు కొత్త జీవితాన్ని అందించారు. రాష్ట్ర పర్యటన నిమిత్తం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ నేతృత్వంలో ఇక్కడికి వచ్చిన ప్రతినిధుల బృందం బుధవారం పడప్పైలో పర్యటించింది. పడప్పైలో భేష్: ప్రజా సంఘాలు, గ్రామ సమాఖ్యలు, స్వయంసహాయక బృందాల్లోని పేద వారికి తమ బ్యాంకు అందిస్తున్న సేవల్ని పడప్పైలో ప్రపంచ బ్యాంక్ బృందం పరిశీలించింది. ఇక్కడి మహిళ జీవితాల్లో వచ్చిన మార్పు లు, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, జీవనోపాధి, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు గురించి ఆరాతీశారు. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్న జిమ్ యోంగ్ కిమ్ అభినందనలు తెలియజేశారు. ప్రపంచ బ్యాంక్ వెబ్ సైట్లో పొందు పరచిన అంశాలు, ఆర్థిక బలోపేతానికి సలహాలు తెలుసుకోవాలని, వాటి ద్వారా మరింత ప్రగతి పథకంలో సాగాలని పిలుపు నిచ్చారు. యువతకు అభినందన : అనంతరం అక్కడి ట్రామో విదేశీ సంస్థకు చెందిన గార్మెంట్స్‌ను పరిశీలించారు. అక్కడ కొత్త జీవితం పథకం ద్వారా ఉపాధి, శిక్షణ పొందుతున్న యువతను కలుసుకున్నారు. వారి జీవిత వివరాల్ని, స్థితి గతుల్ని ఆరా తీసినానంతరం ఆ పథకం ద్వారా ఏ మేరకు లబ్ధి చేకూరిందో తెలుసుకున్నారు. ఈ సంస్థలో 1200 మందిలో 674 మంది కొత్త జీవితం పథకం కింద ఉద్యోగాల్లోకి వచ్చినట్టు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఓలోరుల్డ్, సెర్ ఐటీవీఎస్, శోభా, సిలిక్ తదితరులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉదయ చంద్రన్, మైదిల్ రాజేంద్రన్, తదితరులు పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతికి రూ. 450 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా బాగా వెనుకబడిన కుటుంబాలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకుని రావడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ‘తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ది పథకం’(టీఆర్జీఐపీ) అమలు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తెలంగాణలోని 150 మండలాల్లో అతి నిరుపేదలకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.నిరక్ష్యరాస్యత, శిశు మరణాలు అరికట్టడం, బాలింతల మరణాలు, అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం వంటి కార్యక్రమాలు ఈ పథకంతో చేపడతారు. ఎస్సీ, ఎస్టీ రైతులు ఆధునిక వ్యవసాయం చేసే విధంగా వారికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయించారు. -
రుణమాఫీ సాఫీగా సాగేనా?
విశ్లేషణ ఏబీకే ప్రసాద్ రెండు రాష్ట్రాల పాలక నాయకులంతా చేతులు కాలిన తర్వాత ఇప్పుడు ఆకుల్ని పట్టుకుని వేలాడే పనిలో పడ్డారు! ఇరు ప్రాంతాల్లోనూ ముఖ్యమంత్రి పదవుల కోసం తెలుగుజాతిని విభజించడానికి గజ్జెకట్టిన దాని ఫలితాన్ని నేడు ఉభయ రాష్ట్రాల ప్రజలూ ప్రత్యక్షంగా అనుభవించాల్సి రావడం- విభజనానంతరం ఏ ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోలేకపోవడమే నిదర్శనం. అందులో భాగమే బేషరతుగా రైతులకు చెందిన అన్ని రకాల రుణాలనూ ‘మాఫీ’ చేస్తామని ఎన్నికలలో పార్టీలు తమతమ మేనిఫెస్టోలలోనూ, నాయకులు తమ ప్రసంగాలలోనూ హామీపడ్డారు! పైగా ఏ పద్దు కింద ఎన్ని రుణాలున్నాయి, వాటి విలువెంత, రైతాంగంలోని ఏ కేటగిరీ కింద (వ్యవసాయ కార్మికులు సహా) ఎన్ని కోట్ల రూపాయలు ఈ రుణాల కింద విస్తరించి ఉన్నాయి.... ఇత్యాది లెక్కలతో చిఠా ఆవర్జాలతో నిమిత్తం లేకుండా గద్దెనెక్కాలన్న తాపత్రయంలో ఈ హామీలు కురిపిం చారు. అంటే పాలనానుభవం లేని పాలకులు, తొమ్మిదేళ్లపాటు పరిపాలన వెలగబెట్టిన పాలకులూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైనా, అప్పుసొప్పులపైనా, రుణాల పంపిణీపైనా, ప్రజల సొ మ్ము ఎటునుంచి వచ్చి ఎటు పోతోందో కూడా ఉజ్జాయింపుగానైనా అంచనా లేకుండా వ్యవహరించబట్టే రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్ర’గా మారుస్తానని ప్రగల్భాలు పలికి రుణాంధ్రప్రదేశ్‌గా మార్చికూర్చున్నారు! అవగాహనారాహిత్యం ‘దృష్టికోణం’లో టీడీపీ పాలకుల్లో ఆనాడూ మార్పులేదు, ఈనాడూ లేదు. వారికి తెలిసిన మార్గం ఒక్కటే. ప్రజావ్యతిరేక సంస్కరణలకు మూలవిరాట్టయిన ప్రపంచ బ్యాంకు నుంచి అయినకాడికి రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపించడమే! అంతేగాదు, రాష్ట్రంలో రైతుల రుణాలు మొత్తం ఎన్ని ఉన్నాయో కమిటీలు చెప్పేదాకా పాలకులకు తెలియకపోవటం మరొక విశేషం. అలాగే సహకార బ్యాంకుల నుంచి, వాణిజ్య బ్యాంకుల నుంచి పంట రక్షణ కోసం, వ్యవసాయమే ఆధారంగా బతుకులీడుస్తున్న సన్నకారు, చిన్నస్థాయి మధ్యతరగతి రైతాంగం ఎంతెంత రుణం తీసుకున్నారో కూడా వారికి అవగాహన లేదు. అంతేకాకుండా ఈ రుణ పంపిణీలో పాల్గొన్న బ్యాంకులు కేవలం రైతాంగానికి ఇచ్చిన రుణాలెన్ని...సెమీ అర్బన్‌లో ఉండేవారికి, పట్టణాలు, నగరాలలోని వారికి బ్యాంకుల నుంచి ముడుతున్న రుణాలు ఎంతెంత? అన్న విషయమై కూడా ఈ పాలకులకు అవగాహన లేదు. కనుకనే శ్లేష్మంలో పడ్డ ఈగలా తీర్చలేని ఈ హామీల నుంచి బయటపడలేక కమిటీలపై కమిటీలను వేసుకుని, రైతాంగానికి ఏమేరకు ఆచరణలో ‘టోపీ’లు తొడగాలా అని చూస్తున్నారు. ఈ వరసలో వచ్చిందే ‘నాబార్డ్’ సంస్థ మాజీ చైర్మన్ పీ కోటయ్య కమిటీ నియామకం. కాలహరణానికి ఎత్తుగడ తొమ్మిది మంది సభ్యులున్న ఈ కమిటీలో రుణాల మాఫీపై ఒక ఏకవాక్యత లేదు. ఎందుకని? పాలకుడు అసలెంతవరకు రైతులకు రుణమాఫీ చేయగలడో కమిటీకి చెప్పడు! అది చెపితేగానీ ఏ మేరకు ఏ బాపతు రుణాన్ని సర్దుబాటు చేయగలదో కమిటీ చెప్పడానికి సిద్ధపడ్డం లేదు. పైగా కమిటీ సభ్యుల్లోనూ ఈ సంకటస్థితిపైన స్పష్టత లేదు. కాగా, సమస్యను అధ్యయనం చేయడానికి ‘మరికొంత’ సమయం కావాలని కమిటీ కోరుతోంది. అంటే ఆ సమయం టీడీపీ పాలకుడు ‘ఊపిరి’ పీల్చుకోడానికి అవసరమైన ‘కాలహరణమే’గానీ మరొకటి కాదు! ఈలోగా రుణమాఫీ పథకాలకు, రుణమాఫీకి తాము వ్యతిరేకమని, దేశ, రాష్ట్ర ఆర్థిక స్థితికి రుణమాఫీ విధానం చేటు అని రిజర్వు బ్యాంకు ఒకవైపునుంచీ.... ఆ మార్గంలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కూడా ప్రకటించాయి. రెండు ప్రాంతాలలోని కొత్త ప్రభుత్వాలనూ అవి హెచ్చరించాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ని రకాల వ్యవసాయ రుణాలు, పంట రుణాలు, డ్వాక్రా మహిళా సంఘాల రుణాల మొత్తం రూ.87,612 కోట్లుగా తేలింది. ప్రభుత్వాలుగా బ్యాంకులకు మీరు చెల్లిస్తామని మాకు రాతపూర్వకంగా హామీపడితే మాకు అభ్యంతరం లేదని ఆర్బీఐ ఒక చురక కూడా వేసిందని మరచిపోరాదు. ఎందుకంటే అక్కడ ‘అల్లం’ లేకుండా కోటయ్య కమిటీ కూడా చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఎంతగా కోటయ్య ‘మనవాడ’నుకున్నా గతంలో నాబార్డ్ చైర్మన్‌గా ఉన్నప్పుడు సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు తగ్గించడానికే ససేమిరా అన్న విషయం గమనార్హం. 1991లో ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత 2001, డిసెంబర్ 31 నుంచి 2002, డిసెంబర్ 31 మధ్య రాష్ట్రాల సహకార బ్యాంకుల అధికారిక గణాంకాల ప్రకారం గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్, మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకులకు జమపడిన డిపాజిట్లు, బ్యాంకులిచ్చిన రుణాల వృద్ధిరేటు గమనిస్తే గ్రామీణ ప్రాంతాలకూ, పట్టణ-నగర ప్రాంతాలకూ మధ్య నమోదైన వ్యత్యాసం బట్టబయలవుతుంది. బ్యాంకింగ్ రంగం 2001-2012 మధ్యకాలంలో అధికారికంగా ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా పట్టణ-నగర ప్రాంతాల అవసరాలకు అధికంగా ప్రాధాన్యమివ్వసాగాయి. దీని ఫలితం ఏమైంది? గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం, వ్యవసాయాధారిత వృత్తులు, చేతివృత్తుల వారి అవసరాలకు తగిన పరపతి అందక ఈ వర్గాలు భారీ ఎత్తున నష్టాలకు గురికావల్సి వచ్చింది. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ ప్రవేశం వల్ల సులభతరం కావల్సిన రుణ సౌకర్యం, ప్రాధాన్యతలను తారుమారు చేసికూర్చుం ది! జనాభా ప్రాతిపదికగా చూస్తే, అఖిల భారతస్థాయిలో 2006-2010 మధ్య కమర్షియల్ బ్యాంకులు గ్రామీణ, సెమీ అర్బన్, నగరాలలో పంపిణీ చేసిన రుణాలు వడ్డీతో సహా తిరిగి బ్యాంకులకు రావలసిన మొత్తం రుణాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. 2006లో గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ, మెట్రో నగరాలలో వ్యవసాయ రుణాల బకాయిల మొత్తం రూ.1,72,683 కోట్లు ఉండగా, 2010 నాటికి ఇది రూ.3,90,297 కోట్లకు పెరిగింది. పరపతిలో నగరాలకే ప్రాధాన్యం బ్యాంకింగ్ వ్యవస్థలో గ్రామీణ ఆర్థిక రంగాన్ని భాగస్వామ్యం చేయకుండా వచ్చే 20 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 9-10% అభివృద్ధి అసాధ్యమన్నది నిపుణుల అంచ నా. చివరికి 2030 నాటికి కూడా అధిక శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తారని, వీరు ఇకముందు కూడా వ్యవసాయంపైనే ఆధారపడతారని అంచనా. అందువల్ల దేశ జనాభా పోషణకు, బతుకుబాటకు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం అనివార్యమని, దానికి తగిన విధంగా వెన్నుదన్నుగా మౌలిక పరపతి సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని బ్యాంకింగ్, వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. నేడు దేశ జనాభాలో కేవలం ఆరు శాతం ఉన్న ఆరు మెట్రో నగరాలు(ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) బ్యాంకింగ్ వ్యాపారంలో మెట్టువాటా అనుభవిస్తున్నాయి. మొత్తం డిపాజిట్లలో ఈ ఆరు మెట్రోల వాటా 2001 డిసెంబర్1 నాటికి 30% కాగా ఆ వాటా కాస్తా 2012 నాటికి 42%కు ఎదిగిపోయింది. కాగా దేశంలోని మొత్తం 53మెట్రో కేంద్రాల్లో 2001 లో అనుభవించిన రుణసౌకర్యం మొత్తం రుణాలలో 60%. 2012 డిసెంబర్ నాటికి ఇది 65%కు పెరిగింది. అంటే ఈ 53 మెట్రోలకు 2001-2012 మధ్యకాలంలో అందిన పరపతి సౌకర్యం 920% పెరిగిందని నిపుణులు నిర్ధారించారు. ఇక సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ బ్యాంకింగ్ పరిశ్రమ పరపతి వనరుల కల్పనలో గ్రామాలను, సెమీ అర్బన్ జనాభాను మాడబెట్టి అర్బన్, మెట్రో నగరాలలోని కార్పొరేట్లకు దోచిపెడుతోందని తేలింది! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి
వాషింగ్టన్: బీజేపీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు సుముఖంగా ఉండడం, పాలనలో పారదర్శకతను తెచ్చే యత్నాలు చేస్తుండడంతో భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. ఇండియా గతేడాది 4.7 శాతం వృద్ధి సాధించింది. ‘భారత్ గత రెండేళ్లలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడంతో వృద్ధి రేటు ఐదు శాతం దిగువకు పడిపోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఇది 8 శాతానికిపైగా ఉంది. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వచ్చే ఏడాది 6.3 శాతం, 2016లో 6.6 శాతం వృద్ధి రేటును భారత్ సాధించే అవకాశం ఉంది..’ అని ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త ఆండ్రూ బర్న్స్ మీడియాకు తెలిపారు. ప్రపంచ ఆర్థిక తీరుతెన్నులపై ప్రపంచ బ్యాంకు నివేదికను రూపొందించిన బృందానికి ఈయన సారథి. వర్ధమాన దేశాల అంచనాల తగ్గింపు ఆర్థికాభివృద్ధి విషయంలో వర్ధమాన దేశాలకు ఈ ఏడాది నిరాశ ఎదురవుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. వర్ధమాన దేశాలు ఈ సంవత్సరం 5.3% పురోగతి సాధిస్తాయని గత జనవరిలో వేసిన అంచనాను బ్యాంక్ ప్రస్తుతం 4.8%కి కుదించింది. ఈ దేశాలు వచ్చే ఏడాది 5.4%, 2016లో 5.5% వృద్ధి సాధించవచ్చని తెలిపింది. చైనా ప్రభుత్వ యత్నాలు సఫలమైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.6% విస్తరిస్తుందని అంచనా వేసింది. ఆసియా దేశాల్లో వృద్ధి రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయని పేర్కొంది. పేదరికాన్ని రూపుమాపాలంటే నిర్మాణాత్మక సంస్కరణలను వేగంగా అమలుచేసి విస్తృత ఆర్థిక పురోగతిని సాధించాల్సి ఉందని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు. నివేదికలోని ముఖ్యాంశాలు: - ఈ ఏడాది గడిచేకొద్దీ ప్రపంచ ఆర్థిక పురోగతి జోరందుకుంటుంది. గ్లోబల్ ఎకానమీ ఈ ఏడాది 2.8%, వచ్చే ఏడాది 3.4%, 2016లో 3.5 శాతం వృద్ధిచెందుతుంది. - ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక పురోగతిలో 50 శాతానికిపైగా వాటా అధికాదాయ దేశాలదే ఉంటుంది. గతేడాది ఇది 40 శాతం కంటే తక్కువ స్థాయిలో ఉంది. - అనేక దేశాల ఆర్థిక ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడింది. - చైనా, రష్యాలను మినహాయిస్తే ముఖ్యంగా భారత్, ఇండోనేసియాల్లో వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లు గణనీయ పురోగతి సాధించాయి. వృద్ధి అంచనాలను పెంచిన డీబీఎస్ బ్యాంక్ ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) భారత్ ఆర్థికాభివృద్ధి అంచనాలను డీబీఎస్ బ్యాంక్ పెంచింది. ఇప్పటివరకూ ఈ వృద్ధి రేటు అంచనా 6.1 శాతంకాగా, దీనిని 6.5 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ బుధవారం తెలిపింది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణలు అమల్లోకి వస్తాయన్న ఊహాగానాలు అంచనాలు పెంచడానికి కారణమని సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటు 5.5 శాతమని డీబీఎస్ బ్యాంక్ అంచనావేస్తోంది. -
బాబొస్తే బతకలేం...
ప్రపంచబ్యాంకు అడుగులకు మడుగులొత్తుతూ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమయమవడం ఖాయమని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏలాగైనా గద్దెనెక్కాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నాడని, ఆయన పాలనలో పడిన అష్టకష్టాలు ఈనాటికీ మరచి పోలేకపోతున్నామని భయకంపితులవుతున్నారు. తొమ్మిదేళ్లు ఏడిపించాడు చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులు బతికే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రైతులు ఆయనకు ఎప్పటికీ ఓటు వేయరు. తొమ్మిదేళ్ల పాలనలో రైతుల్ని ఏడ్పించని రోజు లేదు. ప్రతినిత్యం రైతుల్ని దొంగలుగా చిత్రీకరించాడు. సాగునీరు ఇవ్వలేదు. రైతులకన్నా ప్రపంచ బ్యాంకు అధికారులే మిన్నఅనుకున్నాడు. ఇప్పుడేమో సింగపూర్ తెస్తానంటున్నాడు. అంటే మళ్లీ వ్యవసాయాన్ని పూర్తిగా మూసేస్తాడనే అర్థం. వ్యవసాయం వల్ల అంతా నష్టమేనని చెప్పేవాడు. సాగునీరు కావాలని అడిగితే తుంపర్ల వ్యవసాయం చేయమని సలహా ఇచ్చేవాడు. ఆనాటి పాలన రైతులు ఇంకా మర్చిపోలేదు. - పూనూరు బుద్దారెడ్డి, రైతు , జనార్ధనపురం రైతుల్ని పోలీసులతో కొట్టించాడు కాలువలకు నీటిమీటర్లు పెట్టొద్దన్నందుకు రైతుల్ని పోలీసులతో కొట్టించాడు. విత్తనాలను సాంప్రదాయ బద్ధంగా కాకుండా డంకెల్ ప్రతిపాదనలకు తలొగ్గి మోన్శాంటో విత్తనాలు మాత్రమే వాడాలని చెప్పాడు. విత్తనోత్పత్తిలో మోనోపలీ విధానం తెచ్చిన ఘనుడు. అదేమని అడిగితే ప్రపంచం వైపు చూడండి అని సలహా ఇచ్చేవాడు. ఆయన తొమ్మిదేళ్ల పాలన రైతులకు మరపురాని గుర్తులుగానే ఉన్నాయి. - పెద్దిబోయిన గరటయ్య, నందివాడ, ఇంకా రైతులు మర్చిపోలేదు చంద్రబాబు రైతువ్యతిరేక పాలనను రైతులింకా మర్చిపోలేదు. రైతులంటేనే గిట్టని చంద్రబాబు నేడు అధికారం కోసం రైతులకు స్వర్గం చూపిస్తానని చెబుతున్నాడు. ఆయన అధికారం కోసం రైతులపై ప్రేమ కురిపిస్తున్నాడు. ఆయన కపట నాటకాలు జనం మర్చిపోలేదు. ప్రపంచ బ్యాంకు జీతగాడని ఆనాడే కమ్యూనిస్టులు చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే రైతులు ఉరేసుకున్నట్లేనని ప్రతి ఒక్కరూ అంటున్నారు. - వై. దుర్గారావు, నందివాడ. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేవారు కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో రైతులకు అన్నీ ఇబ్బందులే. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే సంవత్సరానికి కూడా వచ్చేది కాదు. దీనికి తోడు విద్యుత్ బిల్లులు కట్టకపోతే ఫీజులు సైతం పీక్కుని వెళ్లేవారు. కళ్ల ముందు పంటలు ఏండిపోతున్నాయని కాళ్లా వేళ్లా పడి బతిమిలాడినా ఏవరూ పట్టించుకునే వారు కాదు. మళ్లీ అటువంటి చంద్రబాబు పాలన భవిష్యత్‌లో రైతులె వరూ చూడకూడదు. -మెండ్యాల దుర్గారావు,రైతు,వెలగలేరు అవన్నీ చీకటి రోజులు బాబు పాలనలో రైతులకన్నీ చీకటి రోజులే. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ సరఫరా ఏప్పుడూ సక్రమంగా ఉండేది కాదు. కానీ బిల్లులు మాత్రం కట్టలేని విధంగా వచ్చేవి.ఒక వైపు గిట్టుబాటు కాని పంట ధర. మరో వైపు పట్టించుకోని ప్రభుత్వం వెరసి రైతులు అప్పుల ఊబిలోకి చేరి ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం చంద్రబాబు దండగ అంటే.. కాదు పండగని మహానేత వైఎస్ రైతుల కోసం అనేక సంక్షమ పథకాలు అమలు చేసి నిరూపించాడు. -తమటం వెంకట్రామయ్య,రైతు,గుర్రాజుపాలెం సర్పంచి మహానేత వల్లే పింఛన్ నాకు 78 ఏళ్లు. నరసింగపాలెంలో నివసిస్తున్నా. చంద్రబాబు ఉన్నప్పుడు రూ.75 పింఛను వచ్చేది. తమ సొమ్మేదో ఇస్తున్నట్లు పాలకులు భావించేవారు. రాజశేఖరరెడ్డి వచ్చాక పింఛన్ మొత్తాన్ని రూ.200కు పెంచారు. ఈ ముసలి వయసులో మందుల ఖర్చుకు ఆ సొమ్ము అక్కరకొస్తోంది. - చింతగుంట దావీదు, నరసింగపాలెం (ఆగిరిపల్లి) -
ఈ ఏడాది 5.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఈ ఏడాది 5.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. భారీ పెట్టుబడుల ప్రాజెక్టులు పురోగతి సాధిస్తుండడం, రూపాయి మారకం విలువ మరింత పోటాపోటీగా మారడంతో ఇండియా మెరుగైన వృద్ధి సాధిస్తుందని బుధవారం విడుదల చేసిన నివేదికలో బ్యాంక్ తెలిపింది. భారత్ ఈ ఏడాది 5.4 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) మంగళవారం పేర్కొన్న సంగతి విదితమే. ఈ అంచనాల నేపథ్యంలోనే సెన్సెక్స్‌లో ర్యాలీ నెలకొని సుమారు 360 పాయింట్లు పెరిగి 22,702 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. గత ఆగస్టులో డాలరుతో రూ.68.65గా ఉన్న రూపాయి మారకం విలువ ప్రస్తుతం 60 స్థాయిలో కొనసాగుతోంది. కాగా, దక్షిణాసియాలో ప్రస్తుతం 5.2%గా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు వచ్చే ఏడాది 5.8 %నికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది: ఐఎంఎఫ్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక స్థిరత్వం గత ఆరునెలల్లో బాగా మెరుగుపడిందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. అయితే, ఇదే కాలంలో వర్థమాన దేశాల్లో స్థిరత్వం క్షీణించిందని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ‘ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కామని ఇప్పుడే చెప్పలేం. ప్రపంచంలో ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోంది. యూరప్ దేశాల్లో మార్కెట్ విశ్వాసం గణనీయంగా పెరిగింది...’ అని ఐఎంఎఫ్ ఆర్థిక సలహాదారు వియల్స్ వాషింగ్టన్లో తెలిపారు. -
వచ్చే ఏడాది 6% పైనే.. : ప్రపంచ బ్యాంకు
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2014-15) 6% పైగానే నమోదవుతుందన్న అంచనాలను ప్రపంచబ్యాంక్ వెలువరించింది. 2016-17లో ఈ రేటు 7.1%కి పెరుగుతుందని విశ్లేషించింది. ‘ప్రపంచ ఆర్థికాభివృద్ధి అవకాశాలు’ శీర్షికతో బుధవారం విడుదలైన తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్ ఈ అంచనాలను ప్రకటించింది. భారత్ వృద్ధికి ప్రపంచ డిమాండ్‌లో రికవరీ, దేశీయంగా పెట్టుబడుల మెరుగుదల దోహదపడతాయని వివరించింది. కాగా చైనా 2014లో కూడా వృద్ధి 7.7%గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థికవృద్ధి 3.4 శాతం కాగా ప్రపంచం మొత్తంగా జీడీపీ వృద్ధి 2013లో 2.4 శాతంకాగా ఇది 2014లో 3.2 శాతానికి పెరగవచ్చని వివరించింది. 2015, 2016ల్లో ఈ రేట్లు 3.4 శాతం, 3.5 శాతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి ఊపందుకోవడం వల్ల ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత తిరిగి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ కిమ్ అన్నారు. -
‘కలుగొట్ల’...ఎప్పట్లా..!
ముఫ్పైఏళ్లుగా తపిస్తుంటే ఏర్పాటైన పథకం. పనులు పూర్తయితే ఇంకేం నీటి కష్టాలు తీరినట్లే అనుకున్నారు అలంపూర్ చౌరస్తా వాసులు. కాంట్రాక్టర్ మాత్రం పైపు లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. దీనితో నీటికి పాత పాటే. అదీ ఇబ్బందుల మధ్యే. ఇప్పుడు కలుషిత జలాలే గత్యంతరం. ఈ అవస్థలు తీర్చే మార్గం కోసం నిరీక్షిస్తున్నారు. నీటి పరీక్షకు తట్టుకోలేక పోతున్నారు. అలంపూర్, న్యూస్‌లైన్ : ఎన్నో విన్నపాల ఫలితంగా రూపుదిద్దుకున్న కలుగొట్ల తాగునీటి పథకం పూర్తయినా ఇళ్లకు కనెక్షన్లు ఇ వ్వకపోవడంతో అసలు ఉద్దేశం ఆమడ దూ రంలోనే ఉండి పోయింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పనులైతే పూర్తి చేశారు. కానీ కొత్త పైప్లైన్లకు కనెక్షన్ ఇచ్చి దాని ద్వార నీటిని సరఫ రా చేయాల్సిన బాద్యతలను విస్మరించారు. దీంతో ఎప్పటిలాగే అలంపూర్ చౌరస్తా ప్రజలు, ప్రయాణీకులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటి వరకు సరఫరా అవుతున్న నల్లా ద్వార నీళ్లు తెచ్చుకుందామని ఆశించినా పైప్‌లైన్ లీకేజితో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచింది. నిర్వహణ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో చివరకు పుల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్పందించి లీకేజిలకుకక మరమ్మత్తులు చేపట్టడంతో స్థానికులకు ఊరట లభించింది. కానీ కలుషిత నీటి బాధలు మాత్రం ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రూ. 6.50 లక్షలతో అదనపు పైప్‌లైన్ నియోజకవర్గ కేంద్ర బిందువుగా జాతీయరహదారి అడ్డాగా ఉన్న అలంపూర్ చౌరస్తాకు కలుగొట్ల తాగునీటి పథకం నుంచి తాగునీ టిని అందిస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం నాలుగు రోడ్ల కూడలిలో ఒక్క వైపు మాత్ర నల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో మిగిలిన కాలనీలకు నీటి సరఫరా లేక నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మిగిలిన రోడ్లలోని కాలనీలకు తాగునీటిని అందించడానికి అనువుగా వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.6.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు రోడ్ల కూడలిలోని కాలనీలకు నీటి సరఫరా నిమిత్తం 428 మీటర్ల పైప్‌లైన్ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న పాత పైప్‌లైన్ నుంచి కనెక్షన్ ఇస్తే మిగిలిన కాలనీలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్ సాకులను చూపుతూ కనెక్షన్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. అటకెక్కిన బోరు మోటారు ప్రతిపాదన : అలంపూర్ చౌరస్తాలో పథకం నుంచి నీటి సరఫరా నిలిచిన సమయాల్లో ప్రత్యేక నిధులతో ప్రత్యాయ్నాంగా బోరు మోటారు వేయాల్సి ఉంది. ఇక్కడ ఫోరైడ్ నీళ్లు పడుతాయని బోరు వేసే ప్రతిపాదనను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే వేసవిలో స్థానికులకు తాగునీటి కష్టాలు తప్పవని అందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చౌరస్తాకు సమీపంలోనే ఎక్కడో ఒక చోట బోరు మోటారు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే నీటి కోసం చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపును పరిశీలించిన జేఈ గత కొంత కాలంగా కలుషిత నీరు సరఫరా అవుతోందని, కొత్త పెప్లైన్కు కనెక్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆర్‌డబ్లుఎస్ జేఈ కృష్ణయ్య మంగళవారం అలంపూర్ చౌరస్తాలో చేసిన పైప్‌లైన్ పనులను పరిశీలించారు. సంపులో కలుషితమైన నీటి గురించి స్థానికులు వివరించారు. సంపు భూమికి సమాంతరంగా ఉండంతో కప్పలు, ఇతర జంతువుల కళేబరాలు, పురుగులు అందులో పడి నీరు కలుషిత మవుతున్నట్లు వెల్లడించారు. పాత పైప్‌లైన్ లీకేజిల కారణంగా గత ఐదు రోజులుగా నీళ్లు బందయినా నిర్వాహకులు పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి నిరంతరంగా నీటి సరఫరా చేయాలని కోరారు. -
ప్రపంచ బ్యాంకు నిధులతో అంగన్వాడీల అభివృద్ధి
ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు బొబ్బిలి, న్యూస్‌లైన్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టరు శ్రీనివాసరావు తెలిపారు. బొబ్బిలి లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది నుంచి ఏడేళ్ల పాటు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల వివరాలను ఆన్లైన్ లో పొందుపరచడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపా రు. దేశంలోని 10 జిల్లాలను అంగ న్వాడీల పటిష్టత, పౌష్టికాహారం పథకం కింద ఎంపిక చేస్తే అందులో..రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లానే ఎంపిక చేశారని పేర్కొన్నారు. పట్టణాల్లోని కేంద్రాలకు నిబంధనల మేర అద్దెలు పెంచామన్నారు. అన్ని కేంద్రాలకూ రెండు నెలల్లో గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నారు. జిల్లాలో 48 కార్యకర్తలు, 64 ఆయాలు, 147 మినీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి రెండు వారాల్లో నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పారు. కార్యకర్తలు, ఆయాలకు బదిలీలు ఉండవని స్పష్టం చేశారు. జనవరి ఒకటి నుంచి సాలూరు రూరల్, నెల్లిమర్ల, ఎస్.కోట మండలాల్లో ఇందిరమ్మ అమృతహస్తం కింద సంపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 250 భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో పీఓ సుశీల ఉన్నారు. -
‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్’పై 11ఏళ్ల నిషేధం: కావూరి సాంబశివరావు
కావూరి సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ప్రపంచ బ్యాంకు నిబంధనల ఉల్లంఘనే కారణమని వెల్లడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్(పీసీఎల్)’ సంస్థను ప్రపంచబ్యాంక్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. మోసం, అవినీతి పూరిత పద్ధతులకు వ్యతిరేకంగా బ్యాంకు రూపొందించిన నిబంధనలను (ఫ్రాడ్ అండ్ కరప్షన్ పాలసీ) ఉల్లంఘించడంవల్ల ఆ సంస్థను ఈనెల 26 నుంచి కనీసం 11 ఏళ్ల పాటు నిషేధిస్తున్నామని ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పీసీఎల్ నియంత్రిస్తున్న అన్ని సంస్థలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాము ఆర్థికసాయం చేసే ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ‘ప్రొక్యూర్మెంట్ గైడ్‌లైన్స్’ను ప్రపంచబ్యాంకు రూపొందిస్తుందని, ఆయా ప్రాజెక్ట్‌ల్లో భాగస్వాములైన కంపెనీలు ఆ నిబంధనలను పాటించాలని.. వాటిని ఉల్లంఘించడంవల్ల హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంక్ పేర్కొంది. అయితే, నిషేధం వర్తించే పీసీఎల్ సోదర సంస్థలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టుల వివరాలను బ్యాంక్ వెల్లడించలేదు. అలాగే పీసీఎల్ ఉల్లంఘించిన నిబంధనల వివరాలను కూడా తెలపలేదు. దాంతోపాటు ఆ సంస్థ ప్రమోటర్లు, ఉన్నతాధికారుల పేర్లను కూడా ప్రపంచబ్యాంక్ పేర్కొనలేదు. పీసీఎల్ వెబ్సైట్లో మాత్రం ఆ సంస్థను ప్రస్తుత కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు 1966లో స్థాపించారని ఉంది. అది 1982లో ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ప్రస్తుతం ఆ సంస్థకు ముళ్లపూడి శ్రీవాణి మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పీసీఎల్ విద్యుత్, నీటిపారుదల, రైల్వే, రవాణ, గృహనిర్మాణం, పారిశ్రామిక రంగాల్లోని మౌలిక వసతుల కల్పనలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. కాగా, నిషేధం విషయంపై స్పందన కోరేందుకు చేసిన ప్రయత్నాలకు పీసీఎల్ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కావూరి సాంబశివరావుకు, ఆయన కార్యాలయానికి చేసిన ఫోన్లకు, మెసేజ్‌లకు కూడా జవాబు రాలేదు. ప్రపంచబ్యాంక్ నిషేధానికి గతంలో గురైన వాటిలో సత్యం, విప్రో, వీడియోకాన్, ఎల్ అండ్ టీ.. తదితర కంపెనీలున్నాయి.