తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా బాగా వెనుకబడిన కుటుంబాలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకుని రావడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ‘తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ది పథకం’(టీఆర్‌జీఐపీ)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా బాగా వెనుకబడిన కుటుంబాలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకుని రావడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ‘తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ది పథకం’(టీఆర్‌జీఐపీ) అమలు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించారు.
శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తెలంగాణలోని 150 మండలాల్లో అతి నిరుపేదలకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.నిరక్ష్యరాస్యత, శిశు మరణాలు అరికట్టడం, బాలింతల మరణాలు, అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం వంటి కార్యక్రమాలు ఈ పథకంతో చేపడతారు. ఎస్సీ, ఎస్టీ రైతులు ఆధునిక వ్యవసాయం చేసే విధంగా వారికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయించారు.