poverty
-
P-4 ప్రోగామ్ పై భువనేశ్వరి కి చెల్లుబోయిన సూటి ప్రశ్న
-
ఉచితాలతో పేదరికం పోదు
ముంబై: ఉచిత పథకాలతో కాకుండా ఉద్యోగాల కల్పనతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్న వ్యాపారాలను సృష్టించి, ఉద్యోగాలు కల్పిస్తే పేదరికం ఇట్టే మాయమైపోగలదని ఆయన చెప్పారు. టైకాన్ ముంబై 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మూర్తి ఈ విషయాలు తెలిపారు. ఎంట్రప్రెన్యూర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘మీలో ప్రతి ఒక్కరు వందలు, వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలరనడంలో నాకెలాంటి సందేహం లేదు. పేదరిక సమస్యను ఆ విధంగానే పరిష్కరించగలం. ప్రపంచంలో ఏ దేశమూ ఉచితాలివ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించిన దాఖలాల్లేవు’ అని తెలిపారు. కొన్ని ఉచితాలు ఇచ్చినా వాటికి బదులుగా నిర్దిష్ట ప్రయోజనాలను రాబట్టే విధంగా అవి ఉండాలని పేర్కొన్నారు. ఉదాహరణకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తే, ఓ ఆరు నెలలు పోయాక ఆ ఇళ్లలోని పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటున్నారా, పిల్లలపై తల్లిదండ్రుల ఆసక్తి మరింత పెరిగిందాలాంటి అంశాలపై ప్రభుత్వం ఓ సర్వేలాంటిది చేయడం ద్వారా సదరు పథకం ప్రయోజనాలను మదింపు చేయొచ్చని మూర్తి చెప్పారు. మరోవైపు, రాజకీయాలు లేదా గవర్నెన్స్ గురించి తనకు పెద్దగా తెలియదని, కేవలం విధానాలపరంగా తీసుకోతగిన చర్యలను మాత్రమే సూచించానని ఆయన వివరణ ఇచ్చారు. -
YS Jagan: జగన్‌దే జనరంజక పాలన
-
చాక్లెట్లు దొంగలించిందని చంపేశారు !
రావల్పిండి: పాకిస్తాన్లో పేదరికం కారణంగా చిన్నతనంలోనే బాలకార్మికులుగా ఇంటిపని చేసే చిన్నారుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలికను ఆ ఇంటి యాజమానులు చితకబాదడంతో గాయాలపాలై ఆ అమ్మాయి చనిపోయిన ఘటన ఆగ్నేయ పాకిస్తాన్లో గత బుధవారం సాయంత్రం జరిగింది. రావల్పిండిలో నమోదైన ఈ కేసులో యజమాని రషీద్ షఫీఖ్, ఆయన భార్య సనా, వాళ్ల ఖురాన్ బోధకుడినీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బాలిక కాళ్లు, చేతులు, చీలమండ పలు చోట్ల విరిగినట్లు పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో తేలింది. సమగ్ర నివేదిక ఇంకా రావాల్సి ఉంది. బాలిక ఇఖ్రా పనిచేస్తున్న యజమాని దంపతులకు 8 మంది సంతానం. వాళ్ల బాగోగులు, ఇంటి పనులు చూసుకునేందుకు రెండేళ్ల క్రితం వాళ్లింట్లో ఇఖ్రా పనికి కుదిరింది. జీతంగా నెలకు దాదాపు రూ.2,430 ఇచ్చేవారు. చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇఖ్రాను దారుణంగా హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రగాయమైనట్లు సంబంధిత వీడియోల్లో తెలుస్తోంది. అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చారని, కట్టేసి కొట్టారని, చపాతీలు చేసే కర్రతో కొట్టడంతో పుర్రె పగిలిందని వార్తలొచ్చాయి. బాలిక మరణవార్త తెల్సి దేశవ్యాప్తంగా వేలాది మంది బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇఖ్రాకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. తన బిడ్డ మరణాన్ని 45 ఏళ్ల రైతు సనా ఉల్లాహ్ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా కుమార్తె ఆరోగ్యం బాలేదని పోలీసులు ఫోన్‌చేసి ఆస్పత్రికి రమ్మన్నారు. వచ్చి చూస్తే ఆస్పత్రి బెడ్‌పై ఇఖ్రా చలనంలేకుండా పడి ఉంది. కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. నాకున్న అప్పు తీర్చుకునేందుకు గతిలేక ఇఖ్రాను పనికి పంపించాను’’అంటూ తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తండ్రి అప్పులు తీర్చేందుకు, ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఇఖ్రా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనులకు వెళ్లడం మొదలెట్టింది. పేదరికంలో మగ్గిపోతున్న బాలకార్మికుల కుటుంబాలు ఇలాంటి సందర్భాల్లో న్యాయం కోసం తుదికంటా పోరాటం చేయడం పాకిస్తాన్లో చాలా అరుదు. నిందితులను దేవుడే క్షమిస్తాడని మనసును రాయి చేసుకుని ఆ దోషులు నష్టపరిహారంగా ఇచ్చే ఏంతో కొంత మొత్తాలను తీసుకుని కోర్టుల బయటే రాజీ కుదుర్చుకోవడం పాకిస్తాన్లో పరిపాటిగా మారింది. ఇఖ్రా కేసు సైతం చివరకు ఇలాంటి ‘పరిష్కారం’దిశలో పయనిస్తుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో 33,00,000 మంది బాలకార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇంటిపనుల్లో నిమగ్నమైన మొత్తం 85 లక్షల మంది కార్మికుల్లో అత్యధిక శాతం మంది మహిళలు, బాలికలేనని అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ) పేర్కొంది. -
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
సాక్షి, హైదరాబాద్: ఏడు ప్రశ్నలతో పేదరిక స్థాయి నిర్ధారణ.. దాని ఆధారంగా ర్యాంకుల కేటాయింపు.. ఆ ర్యాంకులను బట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి స్థూలంగా చేపట్టిన ప్రక్రియ ఇది. ఏడాది క్రితం ప్రజా పాలన కింద అందిన 80.63 లక్షల దరఖాస్తుల నుంచి గ్రామాలవారీగా అర్హుల జాబితాను మొబైల్యాప్ ద్వారా సిద్ధం చేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే గ్రామ సభల్లో ఈ జాబితాపై చర్చించి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుపేదల నిర్ధారణకు ఏడు ప్రశ్నలుఅసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. దరఖాస్తులను మాన్యువల్‌గా కాకుండా మొబైల్ యాప్ ద్వారా జల్లెడ పట్టి ప్రాథమిక జాబితాలు సిద్ధం చేసింది. ఈ యాప్‌లో ఏడు రకాల ప్రశ్నలను నిక్షిప్తం చేశారు. దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందులోని వివరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను సరిచూసి యాప్‌లో పొందుపరిచారు. అందరికంటే పేదలు, ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉన్నవారి వివరాలను ప్రాధాన్యత క్రమంలో సిద్ధం చేశారు. గ్రామాలవారీగా అర్హులు.. వారిలో ముందు వరుసలో ఉన్నవారిని గుర్తించి ఓ జాబితాను రూపొందించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95 శాతం పూర్తయింది. మరో ఐదారు రోజుల్లో మొత్తం పూర్తి చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పేదరిక స్థాయి ఆధారంగా ర్యాంకులు..పేదల్లో నిరుపేదలు, ఇంటి అవసరం ఎక్కువగా ఉండి.. దానిని సమకూర్చుకునే స్తోమత లేనివారి జాబితాను ప్రాధాన్యతా క్రమంలో రూపొందించారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఆధారంగా యాప్‌లో కొన్ని ర్యాంకులు కేటాయించారు. తొలుత ఏడు ప్రశ్నలకు సమాధానాలు సేకరించటం ద్వారా పేదరికాన్ని నిర్ధారిస్తారు. సొంత ఇల్లు ఉందా లేదా? ఉంటే దాని పైకప్పు ఎలాంటిది? ఇంటి విస్తీర్ణం, కుటుంబ ఆదాయం, వృత్తి, ఆదాయ మార్గం లాంటి వివరాలతో కుటుంబ స్థాయిని ధ్రువీకరిస్తారు. ఈ ప్రశ్నలతోపాటు ఆధార్ కార్డు ఆధారంగా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి, గతంలో ప్రభుత్వ పథకంలో ఇల్లు పొందిందీ లేనిదీ.. తదితర వివరాలు సేకరిస్తారు. ఇంటి పన్ను, ఆదాయ పన్ను చెల్లింపు, కారు లాంటి పెద్ద వాహనం ఉందీ లేనిదీ, బ్యాంకు రుణాల వంటివాటిని గుర్తిస్తారు. పట్టాదారు పాసుపుస్తకం ఉంటే భూమి వివరాలను కూడా సేకరిస్తారు. ఇలా 360 డిగ్రీల కోణంలో వివరాల సేకరణ ఉంటుంది. నిరుపేద వితంతువు, సంపాదన మార్గం లేనివారు, దివ్యాంగులు, సఫాయి కర్మచారీలు, పనికి ఆహార పథకం కూలీలు, వ్యవసాయ కూలీలు, సాధారణ కూలీలకు ర్యాంకులు కేటాయించటం ద్వారా పేదల్లో నిరుపేదలకు ఎక్కువ ర్యాంకు ఇస్తారు.21 నుంచి గ్రామ సభలు..యాప్ ద్వారా రూపొందించిన జాబితాను అధికారులు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు. కలెక్టర్లు వాటిని సరిచూసుకుని ప్రాధాన్యతా క్రమంలో అర్హుల జాబితాను రూపొందించి జిల్లా ఇన్చార్జి మంత్రికి అందిస్తారు. గ్రామాలవారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి గ్రామ సభలో ప్రదర్శనకు ఉంచుతారు. ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే గ్రామ సభల్లో ఆ జాబితాపై చర్చిస్తారు. అందులో వచ్చే అభ్యంతరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి తుది జాబితాను ఖరారు చేసి గ్రామ సభ ఆమోదం తీసుకుంటారు. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి.. జాబితాలోని వారికి ఇళ్లను మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. పునాదుల ప్రక్రియ పూర్తయ్యాక తొలివిడత రూ.లక్షను విడుదల చేస్తారు.పరిశీలించే అంశాలు..360 డిగ్రీల వెరిఫికేషన్ఇంటి పన్ను, ఆదాయపన్ను కడుతున్న వారు.. కారు ఉన్నవారు. ఆధార్ ద్వారా..పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా భూమి వివరాలుపేదరిక ర్యాంకువితంతువు, సింగిల్ చైల్డ్, దివ్యాంగులు,సఫాయి కర్మచారీ, పనికి ఆహారపథకం కూలీలు,వ్యవసాయ కూలీలు. -
భారత్‌లో తగ్గిన పేదరికం
న్యూఢిల్లీ: భారత్‌లో గ్రామీణ, పట్టణ పేదరికం గణనీయంగా పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. 2011–12 ఆర్థిక సంవత్సరంలో 25.7 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం 2023–24లో 4.86 శాతానికి దిగివచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇక ఇదే సమయంలో పట్టణ పేదరికం కూడా 13.7 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. వార్షికంగా చూస్తే, 2022–23లో 7.2 శాతంగా గ్రామీణ పేదరికం ఉంటే, పట్టణ పేదరికం 4.6 శాతంగా ఉంది. అంటే వార్షికంగా గ్రామీణ పేదరికం తగ్గితే (7.2 శాతం నుంచి 4.86 శాతానికి), పట్టణ పేదరికం స్వల్పంగా (4.06 శాతం నుంచి 4.09 శాతం) పెరిగింది. ఇక భారత్‌లో పేదరికం రేట్లు ఇప్పుడు 4–4.5 శాతం పరిధిలో ఉండవచ్చని సర్వే భావించింది. ప్రభుత్వ కార్యక్రమాల దన్ను పేదరికం తగ్గడానికి ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. నేరుగా లబ్ధిదారులకు నిధుల బదిలీ (డీబీటీ), గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలను ఆ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది. వినియోగం, వ్యయాలపై ఎస్బీఐ సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → ప్రభుత్వ పథకాల మద్దతుతో దిగువ ఆదాయ వర్గాల వ్యయాల్లో 5% వరకూ పెరుగుదల కనిపించింది. → ఆహార ధరల స్థిరత్వం వల్ల ఖర్చులు తగ్గాయి. → గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో గ్రామీణ–పట్టణ ఆదాయ వ్యత్యాసాలు తగ్గాయి. 2023 ఆగస్టు–2024 జూలై మధ్య గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. → ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రాలు జాతీయ సగటు (31%) కంటే అధిక పొదులపు రేటును నమెదుచేసుకున్నాయి. → ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో తక్కువ సేవింగ్స్ రేటు కనిపించింది. అధిక సంఖ్యలో ఆ రాష్ట్రాల నుంచి వలసలు దీనికి కారణం కావచ్చు. → పట్టణ పేదరికం మరింత తగ్గుతుందని విశ్వసిస్తున్నాము. -
Thota Jyothi Rani: పేదరికం దేశాన్ని వదలని రుగ్మత
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే. దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం. ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి. ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్‌లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది. ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. – ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చదువుకు ఊపిరి.. అమ్మ ఒడి
మదనపల్లె సిటీ: ఆర్థిక పరిస్థితి కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థీ చదువుకు దూరం కారాదు. పనికి పంపే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బడికి పంపాలి. అందుకే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. నాడు–నేడు పథకంలో ఓ పక్కన స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ది చేస్తూనే, బడిబయట పిల్లలు కూడా బడిలో చేరేలా అమ్మ ఒడి పథకాన్ని పైసా అవినీతికి అస్కారం లేకుండా అమలు చేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యావిప్లవం. విద్యారంగం సంస్కరణల్లో భాగంగా సీఎం వై.ఎస్.జగనమోహన్‌రెడ్డి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని దేశమంతా ప్రశంసించింది. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ విద్య అందితే, రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా అవసరమైన ప్రతి చర్యనూ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమైన వారంతా అమ్మ ఒడి ఉందనే ధీమాతో బడిబాట పడుతున్నారు. ఇందుకు 2019 నుంచి 2023 వరకు ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యే ప్రామాణికం.అర్హతే ప్రామాణికంవిద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించాలనే ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నప్పటికీ అమ్మఒడి మంజూరు చేస్తున్నారు. పథకం పారదర్శకంగా అమలు చేసే క్రమంలో సచివాలయం స్థాయిలో లబ్ధిదారుల బయోమెట్రిక్ ఆథంటికేషన్ (ఈకైవెసీ)తో ఆధార్‌కార్డు అనుసంధానించిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేస్తున్నారు. మధ్యవర్తుల బెడద, పైసా అవినీతి లేకుండా, నేరుగా లబ్దిదారులకు డబ్బులు అందుతున్నాయి.ఒక్కో విద్యార్థికి రూ.60 వేలు లబ్ధిఏటా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్జులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రతి విద్యార్థికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొత్తంగా రూ.60 వేలు లబ్ధి చేకూరుతుంది. ముందస్తు షెడ్యూలు మేరకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.15 వేలు ఈ వేసవి సెలవుల అనంతరం బడి తెరిచిన మొదటి రోజునే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏటా క్రమం తప్పకుండా అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థులకు సీఎం జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.విద్యాకానుకతో ధీమాజగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ యాజమాన్యాల పరిఽధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్‌బ్యాగ్, నోట్ పుస్తకాలు,షూస్, సాక్స్, మూడు జతల యూనిఫాం( కుట్టుకూలీతో సహా) ఇలా తొమ్మిది రకాల వస్తువులను ఇస్తున్నారు. ఒక్కో కిట్ విలువ రూ.1,964.నా పేరు భువనేశ్వరి. నా భర్త హరి హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు దేవాన్ష్ మూడో తరగతి చదువుతున్నాడు. పాప ఇంటి వద్ద ఉంది. బాబుకు అమ్మ ఒడి కింద రూ.15 వేలు వచ్చింది. పాఠశాలలో బాబుకు జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు,యూనిఫాం ఇచ్చారు. సీఎం జగన్మోహన్రెడ్డి పుణ్యామని బాబును బాగా చదివిస్తున్నాం. నా పేరు కె.పల్లవి. మాది సామాన్య కుటుంబం. ఇద్దరు పిల్లలు. పెద్ద పాప భావన 8వ తరగతి, చిన్నపాప ప్రేరణ 5వ తరగతి చదువుతున్నారు. వారిని ప్రైవేటు బడుల్లో చదివించే స్థోమత లేదు.ఇద్దరిని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నా. గతంలో పుస్తకాలు,బ్యాగులకు రూ.8 వేల వరకు ఖర్చు వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి కింద రూ.15 వేలు వస్తున్నాయి. దీంతో పాటు జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు,యూనిఫాం అన్ని ఉచితంగా ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ బడిలో మంచి బోధన ఉంది. పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకున్నందున మాకు చాలా సంతోషంగా ఉంది.అమ్మ ఒడి వల్లే మా పాప చదువుమాది పేద కుటుంబం. నాకు ఇద్దకు పిల్లలు. పిల్లలను చదవించుకోవాలంటే కష్టంగా ఉండేది. పాఠశాల తెరిచే రోజుకు బట్టలు, పుస్తకాలు కొనాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. జగనన్న సీఎం అయిన వెంటనే మా బిడ్డ సనకు అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి. స్థానిక ఉర్దూ మున్సిపల్ పాఠశాలలో చదువుతోంది. పాఠశాలలో జగనన్న విద్యాకానుక కింద పుస్తకాలు, దుస్తులు ఇచ్చారు. సీఎంకు రుణపడిఉంటాం.– షహరాభాను, బాపనకాలువ, మదనపల్లెజగనన్న మేలు మరువలేంనా పేరు శిరిషా, నా భర్త వెంకటరమణారెడ్డి. ఓ బేకరీ షాపులో పని చేస్తున్నాడు. నాకు జ్ఞానప్రకాష్, రోహిత్‌కుమార్ ఇద్దరు పిల్లలు. పిల్లలను చదివించాలంటే కష్టంగా ఉండేది. పుస్తకాలు, యూనిఫాం కొనాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. జగనన్న సీఎం అయ్యాక మా బిడ్డకు అమ్మ ఒడి కింద డబ్బు వస్తున్నాయి. జగనన్న మేలు మరవలేము.– శిరిషా, బీటీ కాలేజీ రోడ్డు, మదనపల్లె -
పేదరికం కనుమరుగవుతోంది
న్యూఢిల్లీ: దేశంలో పేదరికం మటుమాయం అవుతోందని ప్రధాని మోదీ చెప్పారు. గత పదేళ్లలో తలసరి గృహ వినియోగ వ్యయం రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు తార్కాణమన్నారు. ఆదివారం న్యూస్9 గ్లోబల్ సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘తలసరి వినియోగ పెరుగుదల పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా సర్వేలో తేలింది. ప్రజలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమంపై మేమిచ్చిన ప్రాధాన్యమే ఇందుకు కారణం. గ్రామీణ భారతాన్ని దృష్టి పెట్టుకుని పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం. మహిళల సాధికారత సాధించాం. అపారమైన ఉపాధి అవకాశాలు కలి్పంచాం. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా పెంచాం. పాలనతో పాటు దృక్కోణం తదితరాలన్నింట్లోనూ అపారమైన మార్పు తీసుకొచ్చాం’’ అని వివరించారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను కావాలనే కరువు పరిస్థితుల్లో మగ్గేలా చేశాయంటూ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కరువు, సంతుïÙ్టకరణ రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. సంతృప్త పాలనే మా ధ్యేయం. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం’’ అని వివరించారు. గత పదేళ్లలో ప్రపంచ వేదికపై భారత్ విశ్వసనీయత ఎంతగానో పెరిగిందన్నారు. సమున్నత శిఖరాలకు సామర్థ్యం: కొన్నేళ్లుగా తమ ప్రభుత్వ పనితీరుకు ఆరి్టకల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటివి గీటురాయిగా నిలిచాయని మోదీ చెప్పారు. ‘‘గత పాలకులకు భారతీయుల సామర్థ్యంపై కనీస నమ్మకం కూడా లేదు. వారిని తక్కువగా అంచనా వేశారు’’ అంటూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. అప్పుడెప్పుడో 1960లు, 80ల్లో వారు మొదలు పెట్టిన పలు పథకాలను 2014లో తాము అధికారంలోకి వచ్చాక పూర్తి చేయాల్సి వచి్చందన్నారు. ‘‘మా పాలనలో దేశవ్యాప్తంగా సగటున రోజుకు రెండు కొత్త కాలేజీలు, వారానికో కొత్త యూనివర్సిటీ వచ్చాయి. అసాధ్యమంటూ ఏదీ లేదన్న విశ్వాసం ఇప్పుడు దేశ ప్రజల్లో తొణికిసలాడుతోంది’’ అని మోదీ అన్నారు. చెప్పారు. మూడో టర్ము పాలనలో దేశ సామర్థ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లో పేదరికం తగ్గుతోంది: నీతి అయోగ్ రిపోర్ట్!
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు ఫలవంతమయ్యాయి. భారత్‌లో శుభ పరిణామాం మొదలవుతోందన్న కొత్త ఆశలను అందిచింది నీతి అయోగ్ సర్వే. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో పేదరికం ఎంత మేర తగ్గిందో సవివరంగా పేర్కొంది. దీన్ని గృహ వినియోగం సర్వేని ఆధారంగా చేసుకుని అంచనా వేసింది. నీతి అయోగ్ సర్వే ఏం చెప్పిందంటే.. భారతదేశంలో పేదరికం ఐదు మేర తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజ గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని దీన్ని అంచనావేసినట్లు తెలిపారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ప్రకారం..గ్రామీణ , పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ 2.5 పెరుగుదల కనిపించింది. పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5% మేర పెరిగి రూ. 3,510కి చేరుకుంది. అయితే గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42% పెరుగుదలలో రూ. 2,008కి చేరుకుంది. ఈ డేటాల ఆధరాంగా దేశంలో పేదరికం 5% లేదా అంతకంటే తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది. ఆహార వ్యయం పరంగా గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50% కంటే తక్కువ ఆహారం కేటాయించినట్లు సర్వే తెలిపింది. అలాగే పట్టణ గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91% నుంచి 2022-23 నాటికి 71% తగ్గిందని సర్వే పేర్కొంది. అయితే ఆహారంలో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, పాలు, పండ్ల వినయోగం పెరుగుతోందని వెల్లడించింది. ఈ సర్వే ఒక వైవిధ్యమైన సమతుల్య వినియోగ సూచన ఇచ్చిందిన నీతి అయోగ్ సీఈవో బీవీర్ సుబ్రహ్మణ్య అన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలను హైలెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పలు పథకాలు పతాక స్థాయిలో విజయవంతమయ్యాయని దీన్ని బట్టి చెప్పొచ్చు. అలాగే ఈ సర్వే ఒకరకంగాపేదరికం, లేమీ వంటివి దాదాపు అదృశ్యమవుతాయని చెబుతోంది. ఇది నిజంగా శుభపరిణామాం కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల తట్టుకుని మరీ ఇలా చక్కటి పురోగతి దిశగా అడుగులు వేయండ విశేషం. (చదవండి: బోర్డ్ ఎగ్జామ్ కూడా రాయలేదు..కానీ ఏకంగా రూ. 41 కోట్లు..!) -
ఇటు అభివృద్ధి .. అటు పేదరికం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఒక రాష్ట్రం అభివృద్ధికి.. ఒక నగరం. కొన్ని పట్టణాలు, పలు గ్రామాలే కొలబద్ద కాదు. ఏ మూలకు వెళ్లినా కాస్త అటుఇటుగానైనా అభివృద్ధి, ఒకే జీవన విధానం, సమాన అవకాశాలు ఉండాలి. అలా ఉండేలా చూడటం ప్రభుత్వాల విధి. కానీ గణనీయమైన అభివృద్ధి, అపార అవకాశాలు ఉన్న నగరాలు, గ్రామాలు ఒక వైపు.. అసలు తినేందుకు పౌష్టికాహారం, నడిచేందుకు రోడ్డు, ఉండేందుకు ఇళ్లులేని పేద ప్రాంతాలు మరోవైపు ఉంటే ప్రగతి గతి సరిగా లేదనే చెప్పాలి. తెలంగాణలో ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఇటీవల నీతిఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచి–2023.. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదరికం 7.3 శాతం తగ్గిందని వెల్లడించింది. 2015–16లో రాష్ట్రంలో 13.18 శాతం పేదలుండగా 2019 –21కి వచ్చే సరికి 5.88 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అయితే కొమురంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం జాతీయ సగటు (14.96 శాతం)కు మించి పేదరికం నమోదు అవటం గమనించాల్సిన అంశం. గడిచిన పదేళ్ల క్రితమే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పైమూడు జిల్లాల్లో అసమగ్ర అభివృద్ధి, సంక్షేమం ఉందని తేలినా.. అక్కడ ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ అమలు చేయని కారణంగా ఇంకా ఆయా జిల్లాలు అత్యధిక పేద జిల్లాలుగానే కొనసాగుతున్నాయి. ఇక్కడ అన్నీ సమస్యలే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ఆధారంగా నీతిఆయోగ్ బాలికా శిశు, బాలింతల ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, విద్యుత్, మంచినీరు, సొంత ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ తదితర పన్నెండు అంశాలను తీసుకుని తెలంగాణలోని పేదల లెక్కలు తీసింది. అందులో అత్యధికం తినేందుకు పౌష్టికాహారం, ఉండేందుకు సరైన ఇంటి వసతి లేని వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తేలింది. అలాగే అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు, వసతులు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎక్కువగా ఉండటం శోచనీయం. ఆరు కిలోమీటర్లు నడిస్తేనే.. కొమురంభీం జిల్లా తిర్యాణి మండలం భీమ్రెల్ల గ్రామానికి వెళ్లే దారి ఇది. మండల కేంద్రం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే భీమ్రెల్లకు వెళ్లాలంటే ముల్కలమంద పంచాయతీ పరిధిలోని తోయరేటి వరకు వాహనంలో వెళ్లాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు నడిస్తేనే గానీ గ్రామానికి చేరుకోలేం. ఈ గూడెంలో 50 మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. బండరాళ్ల దారిలో కాలినడక! ఇది కొమురంభీం జిల్లా కెరమెరి మండలం లైన్‌పటార్ గ్రామానికి వెళ్లే రోడ్డు. ఈ గ్రామంలో 113 మంది జనాభా ఉన్నారు. దారి మొత్తం బండరాళ్లతో అధ్వానంగా ఉంది. దారి మధ్యలో రెండు ఒర్రెలు కూడా ఉండటంతో వర్షాకాలంలో ఆదివాసీల అవస్థలు వర్ణనాతీతం. పిల్లలు, పెద్దలు ఎవరైనా.. ఇలా ఇబ్బందులు పడాల్సిందే. అక్షరాస్యతలో అధ్వానం.. గట్టు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అక్షరాస్యతలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. మండలంలో 36 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. మండలంలో 60 పాఠశాలలు ఉన్నాయి. కానీ సరైన వసతులు లేవు. టీచర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపించేస్తున్నారు. ఆడపిల్లలను చదివించేందుకు పెద్దగా శ్రద్ధ చూపరు. సీడ్ పత్తి సీజన్ (పత్తి మొగ్గ గిల్లేందుకు చిన్నపిల్లలు అవసరం. దీంతో సీజన్లో ఎక్కువగా చిన్నపిల్లలను రైతులు పనుల్లో పెట్టుకుంటారు. పిల్లలు బడికి వెళ్లకపోవడానికి ఇదో ప్రధాన కారణం. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా స్పందన అంతంత మాత్రమే. ఈ కారణంగా గట్టు మండలం పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రత్యేక కార్యాచరణ అవసరం పేదరికం, వెనుకబాటుపై ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్నా.. వెనుకబడిన ప్రాంతాలు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు లేవు వెనుకబాటు, అసమానతల వల్లే తెలంగాణ నినాదం పుట్టింది. ఈ రెండింటినీ లేకుండా చేయటం కోసమే తెలంగాణ ఏర్పడింది. కానీ గడిచిన పదేళ్లలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ప్రణాళికలు, రాజకీయ నిర్దేశనం లేకపోవటం వల్లే అభివృద్ధిలో అసమానతలు నెలకొన్నాయి. – గాదె ఇన్నయ్య, సామాజిక విశ్లేషకుడు -
పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: తలసరి ఆదాయం పెరిగి పేదరికం తగ్గిన దశలో శక్తినిచ్చే ఆహార వినియోగం పెరగటం ప్రపంచదేశాల్లో సర్వసాధారణం కాగా, భారత్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్ రమేశ్ చంద్ అన్నారు. 2012కు ముందు 30 ఏళ్లలో తలసరి ఆదాయం పెరిగి, పేదరికం తగ్గినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం మాత్రం తగ్గిందన్నారు. పేదరికాన్ని తగ్గించినంత సులువుగా శక్తినిచ్చే ఆహార వినియోగాన్ని పెంపొందించలేకపోవటం అనే విచిత్ర పరిస్థితి మన దేశంలో నెలకొన్నదన్నారు. ప్రపంచ దేశాల పోకడకు భిన్నమైన ఈ ఆహార వినియోగ ధోరణికి మూలకారణాన్ని శోధించాలన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడి జాతీయ పోషకాహార సంస్థలో ఆయన డా. గోపాలన్ స్మారకోపన్యాసం చేశారు. ఆహార లభ్యత గత 50 ఏళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం తగ్గటం వెనుక మర్మాన్ని మన పౌష్టికాహార నిపుణులు శోధించాల్సిన అవసరం ఉందని డా. రమేశ్ చంద్ తెలిపారు. 1980 నుంచి 2012 నాటికి భారత్‌లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి శాతం 38 నుంచి 16కి తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)చెబుతున్నదన్నారు. అయితే, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) గణాంకాల ప్రకారం మాత్రం వీరి శాతం 2012 నాటికి 77%గా ఉందన్నారు. ఎన్.ఐ.ఎన్. విశ్లేషణ నమూనాను ఎఫ్.ఎ.ఓ. నమూనాతో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంతో పోల్చితే ప్రజలకు యాంత్రీకరణ పెరిగి, శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. కాబట్టి, ప్రొటీన్లు, ఐరన్ వంటి పోషకాలు తీసుకోవటం పెరిగినా శక్తినిచ్చే ఆహార ధాన్యాల వినియోగం తగ్గి ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలోని ఆహారం తక్కువగా తినటం ఆరోగ్యదాయకం అన్న భావన కారణంగానే కేలరీల వినియోగం తగ్గిందని ఫ్రెంచ్ ఆంత్రపాలజిస్ట్ ఫ్రెడరిక్ లెండి విశ్లేషించారని, ఈ కోణంలో పరిశోధనలు చేయాలని డా. రమేశ్ చంద్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఆహార ధాన్యాలు మనుషులతో పాటు పశువులకు మేపుతున్నామా? లేకపోతే ఆహారధాన్యాలు ఏమవుతున్నాయన్నది అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. తక్కువ పరిమాణంలో ఆహార వినియోగం జరుగుతున్నందున పోషకాల సాంద్రత ఎక్కువగా ఉన్న ఆహారోత్పత్తి చేపట్టాలి. స్థానిక / సంప్రదాయ ఆహారాన్ని వినియోగించే దిశగా ప్రోత్సహించాలన్నారు. చిరుధాన్యాలను మధ్య, ఉన్నతి తరగతి ప్రజలు మరింతగా తింటున్నారని, అంటూ చిరుధాన్యాలకు మరింత ధర చెల్లిస్తే సాగుతో పాటు లభ్యత పెరుగుతుందని డా. రమేశ్ చంద్ అన్నారు. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా గత పదేళ్ల నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాల సేకరణ ఫలితాలు వెలువడాల్సి ఉందన్నారు. 2012 తర్వాత ప్రజల ఆదాయం బాగా పెరిగిందని అంటూ.. ఈ గణాంకాల్లో ఎంత మార్పు కనిపిస్తుందో వేచిచూడాలన్నారు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: సహకార ‘భారత్ ఆర్గానిక్స్’! -
పేదరికమొకటే కులమన్నపుడు.. ఓబీసీనని ఎలా చెప్పుకుంటారు?
జగదల్పూర్: దేశంలో పేదరికం ఒక్కటే కులమన్న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తాను ఇతర వెనుకబడిన వర్గానికి (ఓబీసీ) చెందిన వాడినని ఎలా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. చత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో శనివారం రాహుల్ ఎన్నికల సభలో ప్రసంగించారు. గిరిజనులను ‘ఆదివాసీ’లకు బదులుగా వనవాసీలని సంబోధిస్తూ బీజేపీ వారిని అవమానిస్తోందని అన్నారు. ‘బీజేపీ నాయకులు ఆదివాసీలను వనవాసీలు అనే పేరుతో పిలుస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఈ వనవాసీ పదాన్ని పరిచయం చేశాయి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నాయకుడు గిరిజన యువకుడిపై మూత్రం పోశాడు. దీన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఇదీ బీజేపీ ఆలోచనాధోరణి. అడవుల్లో జంతువుల్లా మిమ్మల్ని వారు చూస్తారు’ అని రాహుల్ పేర్కొన్నారు. ఆదివాసీలే దేశానికి అసలు సిసలైన యజమానులు. అందుకే బీజేపీ ఈ పదాన్ని వాడదు. ఆదివాసీలని సం¿ోదిస్తే... మీ భూమి, నీళ్లు, అడవులను మీకు ఇచ్చేయాల్సి వస్తుందని బీజేపీ భయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. -
పేదరికం తగ్గుతోంది!
దేశంలో గత ఐదేళ్లలో రెండేళ్లు కరోనా మహమ్మారి ఇబ్బందిపెట్టినా పేదరికం తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ, విద్యా, వైద్య పథకాల ఫలితమేనని చెప్పవచ్చు. నీతి ఆయోగ్ నివేదిక –2023ను పరిశీలించినప్పుడు దేశంలో పేదరికం పరిస్థితి ఇటీవలి సంవత్సరాల్లో (2015–16, 2019–21) ఎలా ఉందో స్పష్టమవుతోంది. సుస్థిరాభివృద్ది లక్ష్యాలు (ఎస్డీజీ)... సామాజిక–ఆర్థిక, సామాజిక శ్రేయస్సు కొరకు ‘ఎవరినీ వదిలి పెట్టకూడదు’ అనే దృష్టితో నిర్దేశించబడ్డాయి. అంటే ఆదాయంతో ముడిపడిన పేదరికమే కాకుండా, మిగతా అన్ని వసతు లనూ పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేసి దాని నిర్మూలించడం కూడా ఒక లక్ష్యమన్నమాట. అనేక కోణాలను పరిగణన లోకి తీసుకుని పేదరికాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, అవసరమైన వసతులు... అంటే నీరు, పారిశుద్ధ్యం, పోష కాహారం, శిశు, ప్రసూతి మరణాలు, పాఠశాల హాజరు, ఇతర ప్రాథమిక గృహ సౌకర్యాలు పొందడం వంటి వాటినన్నిటినీ పేదరికాన్ని నిర్వచించడంలో పరిగణించాలి. ఇటువంటి పేదరిక అంచనా కోసం నిర్దేశించిన 12 సూచికలలో పదింటిని, ప్రపంచ స్థాయిలో పేదరికాన్ని అంచనా వేయడానికి చేర్చినవి కాగా మిగిలిన రెండు సూచికలు: ప్రసూతి ఆరోగ్యం, బ్యాంక్ ఖాతాలు దేశంలో పేదరికాన్ని అంచనావేయడానికి అదనంగా చేర్చబడ్డాయి. ఇటువంటి అనేక కోణాల ఆధారంగా నిర్ధారించిన పేదరికం (ఎంపీఐ) జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులలో ఎలా ఉందో నీతి ఆయోగ్ తాజా నివేదిక తెలియజేస్తోంది. దేశ స్థాయిలో పేదరికం బాగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. 2015–16లో మన జనాభాలో 25 శాతం పేదలు ఉండగా, 2019–21 నాటికి 15 శాతానికి పేదరికం తగ్గింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని వేసిన అంచనా దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని సూచిస్తోంది. సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలు 2030 కంటే ముందుగానే, భారతదేశం సాధించవచ్చని ఇది చెబుతోంది. మొత్తం 12 సూచి కలు అభివృద్ధిని చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేగంగా తగ్గుముఖం పట్టింది. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 8.65 శాతం నుండి 5.27 శాతానికి పేదరికం తగ్గింది. 28 రాష్ట్రాలలో, పది రాష్ట్రాలు 2019–21లో దేశ సగటు 14.96 శాతం కంటే ఎక్కువ శాతం పేదరికాన్ని నమోదు చేశాయి. దేశంలో అత్యల్పంగా కేరళలో ఒక శాతం కంటే తక్కువ మంది పేదలుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో పేదల శాతం దేశ సగటు కంటే చాలా తక్కువగా ఉంది.2019–21లో దేశ సగటు పేదరిక స్థాయి కంటే, తెలుగు రాష్ట్రాల్లో, పైన చెప్పిన విధంగా అంచనా వేసిన పేదల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది 2015–16 లో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 12 నుండి 13 శాతం ఉండగా, 2019–21 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో 6 శాతానికి తగ్గింది. పేదరిక అంచనాలో ఉపయోగించిన సూచికలలో, పిల్లల–కౌమార మరణాలు, పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల హాజరు, విద్యుత్ సౌకర్యం, ఆస్తులు కలిగి ఉండటం వంటివి రెండు తెలుగు రాష్ట్రాలలో సమాన శాతంలో ఉన్నాయి. 2023 ఏడాదిలో విడుదల అయిన నీతి ఆయోగ్ నివేదిక, కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా, సామాజికంగా అతలా కుతలం అయిన కాలాన్ని అనగా 2019–21ను ప్రతిబింబిస్తోంది. పేదరిక నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు బహుసూచికలతో పొందు పరచిన పేదరిక శాతాన్ని తగ్గించడంలో బాగా సహాయ పడ్డాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్ఆర్ అమ్మ ఒడి’, ‘వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన’, ‘వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’, గృహనిర్మాణ పథకం; తెలంగాణలో ‘ఆరోగ్య లక్ష్మి’, గృహనిర్మాణ పథకం, ‘కేసీఆర్ కిట్’ ‘మిషన్ భగీరథ’ పథకాలు పేదరిక శాతాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడ్డాయి. అదనంగా, రెండు రాష్ట్రాలలో, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయడం కూడా పాఠశాల హాజరు, తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహద పడుతున్నాయి. ఈ పథకాల పూర్తి ప్రభావం తదుపరి నీతి ఆయోగ్ నివేదికలో ఎక్కువగా ప్రస్ఫుటం గావచ్చు. ఈ పథకాల ప్రభావంతో, తెలుగు రాష్ట్రాలలో, పేదరిక నిర్మూలన గణనీయంగా తగ్గవచ్చు. డా‘‘ పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త ఆర్థిక అంశాల నిపుణుడు ఈ–మెయిల్: prudhvikar@cess.ac.in -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్‌లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్‌లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
Telangana: నిలబెట్టిన సం‘క్షేమం’!
ఉచిత విద్యుత్, పంటల సాగుకు పెట్టుబడి సాయం, ఇంకా గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, రేషన్ పెంపు, ఆసరా పింఛన్లు, మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు వంటివి తెలంగాణ ఆర్థిక, సామాజిక చిత్రాన్ని మార్చుతున్నాయి. పౌష్టికాహారం, అక్షరాస్యత, లింగ సమానత్వం, ఉపాధి హామీ తదితర అంశాల్లో పురోగతితోపాటు పేదరికం తగ్గిపోతోంది. ఈ మేరకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘బహుముఖ పేదరిక సూచిక 2019–21’లో తెలంగాణ జాతీయ సగటును మించి సత్ఫలితాలు సాధించినట్టు తెలిపింది. పేదలకు పౌష్టికాహారం మొదలుకుని బ్యాంకు ఖాతాల వరకు మొత్తం పన్నెండు అంశాలను పరిశీలించిన నీతి ఆయోగ్.. తెలంగాణలో నిరుపేదల సంఖ్య 5.88శాతానికి తగ్గినట్టు తేల్చింది. -సాక్షి ప్రత్యేక ప్రతినిధి సంక్షేమ పథకాలే ఔషధంగా.. ఉచితాలు అనుచితం అభివృద్ధి నిరోధమంటూ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలే ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి తోడ్పడుతున్నాయని జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా నీతి ఆయోగ్ వెలువరించిన పేదరిక సూచిక తేల్చింది. సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో దారిద్య్ర రేఖను అధిగమిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 2015–2016లో 13.18శాతంగా ఉన్న నిరుపేదల సంఖ్య.. మూడేళ్లలోనే 5.88 శాతానికి తగ్గింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 2015–16లో 11.77శాతంగా ఉన్న పేదరికం 6.06 శాతానికి తగ్గింది. పట్టణాల కంటే గ్రామాల్లో పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక తేల్చింది. తెలంగాణలో ప్రçÜ్తుతం గ్రామాల్లో 7.51 శాతం, పట్టణాలు–నగరాల్లో 2.73శాతం పేదలు ఉన్నట్టు పేర్కొంది. పోషకాహారమే సమస్య దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పోషకాహారమే పెద్ద సమస్యగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల రక్తహీనత, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటివి కొనసాగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణలో 2015–16లో 9.78 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడగా.. 2019–21 నాటికి ఇది 4.91 శాతానికి తగ్గింది. ఇళ్లులేని వారిశాతం 2015–16లో 8.07 శాతంగా ఉండగా.. 2019–21 నాటికి 3.17 శాతానికి తగ్గింది. కుమురంభీం, గద్వాలలో ఎక్కువ పేదరికం రాష్ట్రంలో జాతీయ సగటును మించి కుమురం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పేదరిక శాతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలు ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయని.. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాల్లో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందని సామాజిక పరిశీలకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల ని.. పలు ప్రత్యేక పథకాల అమలు తక్షణ అవసరమని సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ వి.సత్తిరెడ్డి అభిప్రాయపడ్డారు. సంక్షేమం.. ఉత్పాదక శక్తికి ఊతం తెలంగాణలో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీరు, విద్యుత్, పక్కా గృహాల విషయంలో చాలా మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు ఉత్పాదక శక్తికి ఊతం ఇస్తున్నాయి. నిరుపేదలు తమ కాళ్లపై తాము నిలబడే వరకు సంక్షేమ పథకాలు అమలు చేయటం, వాటిని అదే స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే సామాజిక మార్పు సాధ్యం. – డాక్టర్ రేవతి, సెస్ సంస్థ డైరెక్టర్ సామాజిక మార్పునకు కారణమవే.. అనేక వైరుధ్యాలున్న తెలంగాణ సమాజంలో ఇప్పుడు అమలవు తున్న సంక్షేమ పథకాలతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సంపద వివిధ రూపంలో ప్రజలకు చేరుతోంది. దాంతో నిరుపేదలు సైతం సంపద సృష్టించే స్థాయికి చేరుతుండటం శుభ పరిణామం. – డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
అగ్రరాజ్యం సహా ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో మరణాలు
ప్రపంచంలో గుండె జబ్బులు, కేన్సర్, పొగతాగడం, మెదడు మందగించడం, మధుమేహం మనుషుల మరణాలకు కారణమౌతున్నట్టే పేదరికం కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో చావులకు దారితీస్తోంది. అనేక ఇతర అంశాల వల్ల జనం చనిపోతున్నారనే విషయంపై అమెరికాలో పరిశోధనలు ఇది వరకే జరిగాయి. అలాగే దారిద్య్రం ఈ అత్యంత ధనిక దేశంలో ఎంత మందిని కబళిస్తోందనే అంశంపై కాలిఫోర్నియా యూనివర్సిటీ–రివర్సైడ్ ప్రొఫెసర్ డేవిడ్ బ్రాడీ నేతృత్వంలో తాజాగా పరిశోధన చేశారు. అమెరికాలో దారిద్య్రం చాలా తక్కువ. డెబ్బయి ఎనభై ఏళ్ల క్రితమే సంపన్నదేశంగా అవతరించింది. అయినా, ఇంకా ఇక్కడి ప్రభుత్వం పేదరికాన్ని ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించదు. పొగతాగడానికి మరణాలకు సంబంధం ఉందని గ్రహించనట్టుగా, దారిద్య్రానికి చావుకు కూడా సంబంధం ఉందనే అంశంపై ఇప్పుడిప్పుడే సర్కార్లకు అవగాహన కలుగుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏడాదికి 4,80,000 మంది అమెరికన్లు పొగ తాగడం వల్ల కన్నుమూస్తున్నారు. ఊబకాయంతో 2,80,000 మంది, మితిమీరిన స్థాయిలో మాదకద్రవ్యాలు సేవించి 1,06,000 మంది మరణిస్తున్నారు. ఈ గణాంకాలన్నీ 2021కి సంబంధిచినవి. అమెరికా ప్రజలను వారి ఆయుష్షు నిండకుండానే చంపేస్తున్న కారణాలపై చేస్తున్న తాజా పరిశోధనల వల్ల జనం ప్రాణాలు కాపాడే ప్రచారోద్యమాలకు మేలు జరుగుతోంది. ప్రజారోగ్యంపై అమెరికన్లలో జాగరూకత పెంచడానికి అవి ఉపకరిస్తున్నాయి. అమెరికాలో పేదరికం పూర్తిగా అంతరించలేదనే వాస్తవం సభ్య ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రాడీ నాయకత్వంలో ఓహాయో స్టేట్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ప్రొ.హూయీ జెంగ్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్ డామ్ ప్రొఫెసర్ ఉల్రిచ్ కోహ్లర్ బృందం అమెరికాలో పేదరికం మరణాలు, పర్యవసానాలపై అధ్యయనం చేసింది. గుండె జబ్బులు, కేన్సర్, స్మోకింగ్ తర్వాత జనం ప్రాణాలు తీసే నాలుగో పెద్ద కారణం పేదరికమని ఈ బృందం సర్వేలో తేలింది. తక్కువ ఆదాయాలున్న ప్రజలను పీడించే దారిద్య్రం కారణంగా ఏటా అమెరికాలో 1,83,000 మంది చనిపోతున్నారు. వరుసగా పదేళ్లు దారిద్య్రం బారిన పడడం వల్ల ఏటా 2,95,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దేశంలో పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజారోగ్య సమస్యలు తీవ్రం కావడం, వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి దారిద్య్ర మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా సెన్సస్ బ్యూరో అనుబంధ నివేదిక లెక్కల ప్రకారం 2021లో దాదాపు 26 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తంమీద ఇన్నాళ్లకు దేశంలో లక్షలాది ప్రజల ప్రాణాలు ఆయువు నిండకుండానే పోవడానికి కారణమైన పేదరికంపై అమెరికా పాలకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇండియాలోనూ ప్రజల ప్రాణాలు తీస్తున్న దారిద్య్రం భారతదేశంలో కూడా ప్రజలు ఆయుష్షు తీరకుండానే బయటి కారణాల వల్ల ఎలా, ఎంత మంది మరణిస్తున్నారో ఎప్పటి నుంచో అధ్యయనం చేస్తున్నాయి. ప్రత్యేకించి దారిద్య్రం ప్రత్యక్ష ప్రభావం వల్ల ఎంత మంది కన్నుమూస్తున్నారో పరిశోధనలు చేసే ఆనవాయితీ దేశంలో లేదు. పేదరికం వల్ల ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? తగినంత ఆదాయం లేకపోవడంతో ఎంత మంది ఏఏ జబ్బులతో చనిపోతున్నారు? పేదరికం పోషహాకార లోపానికి ఎంత వరకు దారితీస్తోంది? దాని వల్ల ఎంత మంది దేశ ప్రజలు కన్నుమూస్తున్నారు? వంటి అంశాలపై ప్రభుత్వానికి అవగాహన ఉంది. కాని, విడిగా పేదరికం ప్రత్యక్షంగా ఎంత మంది ప్రజల చావుకు కారణమౌతోందని విషయం పరిశోధనాంశంగా మారలేదు. ఇండియాలో పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా దేశంలో దారిద్య్ర రేఖ దిగువ నుంచి కోట్లాది మంది ప్రజలు పైకి వస్తున్నారు. ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టించడం ద్వారా పేదల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. అమెరికా తరహాలో భారత విశ్వవిద్యాలయాలు కూడా ప్రత్యకించి పేదరికం–మరణాలు అనే అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు మరింత విజయవంతమౌతాయి. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఏపీ విద్యా విధానాలు భేష్
సాక్షి, అమరావతి : అందరికీ విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన కోసం నవరత్నాలు, నాడు – నేడు, సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎకనావిుక్, సోషల్ కౌన్సిల్ అంతర్జాతీయ అధ్యక్షురాలు లచ్చెజర స్టోవ్ ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితి లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయమైన న్యూయార్క్‌లో ఆర్థిక, సామాజిక మండలి నేతృత్వంలో సుస్థిరాభివృద్ధి పై జూలై 17న జనరల్ అసెంబ్లీ హాలులో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు – నేడు, విద్యారంగంలో పధకాలకు సంబంధించి ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జగనన్న విద్యాకానుక కిట్లు, విద్యా దీవెన, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యార్ధులకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాల పోస్టర్లను ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్మార్ట్ బోర్డ్స్, బైజూస్ ట్యాబ్స్ నమూనాలను ప్రదర్శించారు. ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, వివిధ పథకాల ద్వారా విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్న తీరు, డిజిటల్ బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి వివరించారు. నాడు – నేడు స్టాల్‌ని సందర్శించిన ఎకనావిుక్ సోషల్ కౌన్సిల్ ప్రపంచ అధ్యక్షురాలు లచ్చెజర స్టోవ్ ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు టోఫెల్ ట్రైనింగ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, బైలింగ్యువల్ డిక్షనరీలు, గోరుముద్ద, ఆణిముత్యాల పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేద విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని షకిన్ కుమార్ ఆమెకు వివరించారు. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ఏపీ స్టాల్‌పై పలు దేశాల ఆసక్తి టాంజానియా ఆర్థిక శాఖా మంత్రి నటూ వాంబా ఏపీ స్టాల్‌ను సందర్శించి విద్యాభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికా పర్మినెంట్ అబ్జర్వర్ మిషన్ టూ యునైటెడ్ నేషన్స్ ప్రొఫెసర్ ఒట్టో ఫీజిన్ బ్లాట్, అమెరికన్ డిపొ్లమాటిక్ అకాడమి రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ప్రెసిడెంట్ బిల్ గ్రాహమ్ తదితరులు ఏపీ విద్యా విధానాలను తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో సునీత చిట్టూమూరి తదితరులు పాల్గొన్నారు. -
పేదరికంపై భారత్ విజయం!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్ పేదరికంపై విజయం సాధించడంలో ముందంజలో ఉందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. భారత్‌లో 2005/2006 నుంచి 2019/2021 దాకా.. 15 సంవత్సరాల్లో ఏకంగా 41.4 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి గ్లోబల్ మల్టిడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది. గత 15 ఏళ్లలో పేదరికాన్ని అంతం చేయడంలో భారత్ సహా 25 దేశాలు మెరుగైన ఫలితాలు సాధించాయని పేర్కొంది. ఈ జాబితాలో కాంబోడియా, చైనా, కాంగో, హోండూరస్, ఇండోనేసియా, మొరాకో, సెర్బియా, వియత్నాం తదితర దేశాలు ఉన్నాయని తెలియజేసింది. ఇండియాలో 2005/2006లో 55.1 శాతం మంది పేదలు ఉండగా, 2019/2021 నాటికి వారి సంఖ్య 16.4 శాతానికి తగ్గిపోయిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. దేశంలో 15 సంవత్సరాల క్రితం 64.5 కోట్ల మంది పేదలు ఉండగా, 2019/2021లో 23 కోట్ల మంది ఉన్నట్లు తేలిందని వివరించింది. ఇదే సమయంలో సరైన పౌష్టికాహారం అందుబాటులోని ప్రజల సంఖ్య 44.3 శాతం నుంచి 11.8 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించింది. శిశు మరణాలు 4.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గిపోయాయని పేర్కొంది. పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేని వారి సంఖ్య 50.4 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గిందని తెలియజేసింది. ఎక్కువ మందికి తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడంలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందని కొనియాడింది. -
మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది
న్యూఢిల్లీ: గత వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పెరుగుతున్న ధరలను అదుపు చేశామని దురహంకారపూరిత వాదనలు చేస్తూనే తీవ్రమైన ద్రవ్యోల్బణం ద్వారా ప్రజలు సంపాదించిందంతా దోచుకుంటోందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో పేదరికం అంచున జీవిస్తున్న ప్రజల జీవితాలను మోదీ ప్రభుత్వం ఏమాత్రం మార్చలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రతి వస్తువుపైనా జీఎస్టీ భారం పడుతోందని, సామాన్యుడి జీవితం కష్టతరంగా మారిందన్నారు. కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు మాత్రం తాము ఘనకార్యాలు సాధించామంటూ ప్రచారం మొదలుపెడతారంటూ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ‘మోదీ ప్రభుత్వం వాస్తవంగా సాధించినవి ఇవే..2014 నుంచి వాస్తవ ఆదాయాల్లో వృద్ధిరేటు– వ్యవసాయ కార్మికులకు: 0.8%, వ్యవసాయేతర కార్మికులకు: 0.2%, నిర్మాణ కార్మికులకు:–0.02%మాత్రమే. అయినప్పటికీ, 2014 నుంచి నిత్యావసర వస్తువుల ధరలు– ఎల్పీజీ:169%, పెట్రోల్:57%, డీజిల్:78%, ఆవనూనె:58%, గోధుమపిండి:56%, పాలు:51% పెరిగాయి’’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అసంఘటిత రంగంలో వాస్తవ వేతనాల పెరుగుదల దాదాపు నిలిచిపోయిందంటూ వచ్చిన కథనాన్ని కూడా జైరాం రమేశ్ షేర్ చేశారు. అన్ని రంగాల ఆదాయాల్లో స్తబ్ధత నెలకొనగా గౌతమ్ ఆదానీ సంపద మాత్రం 2014 నుంచి 1,225% పెరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మే 26వ తేదీతో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివరికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొనసాగిస్తున్నారు. పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్పని పథకాలను సైతం అమలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంగా నాలుగేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగమించి మరీ పథకాలు అమలు చేసి విశ్వసనీయతకు మారు పేరుగా పాలన సాగుతోంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్నికలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. నాలుగేళ్ల పాలనతో ఇంటింటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనే విషయాన్ని ఎమ్మెల్యేలు స్వయంగా వివరించడమే కాకుండా.. ప్రింట్ చేసిన పుస్తకాలను వారికి ఇచ్చి, ఆ మేలు జరిగిందా లేదా అని ధైర్యంగా అడిగి ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినందునే ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నారు. మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు స్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లారు. తద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రూ.3.02 లక్షల కోట్లు సాయం గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాల కోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా 7.90 కోట్ల ప్రయోజనాలకు రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 2.57 కోట్ల ప్రయోజనాల కింద రూ.91 వేల కోట్లు వ్యయం చేశారు. సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాల వారు ఇన్నాళ్లు వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు. ఆఖరుకు దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కూడా గత ప్రభుత్వంలో నోచుకోలేదు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. దేశానికే బ్యాక్ బోన్ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వారికి తగిన వాటా ఇచ్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే కావడం గమనార్హం. ఆయా వర్గాలకు లబ్ధి ఇలా ♦ నాలుగేళ్లలో నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా బీసీలకు రూ.1,48,597 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.99,681 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.48,916 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఎస్సీలకు రూ.53,929 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.34,963 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.18,966 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎస్టీలకు రూ.15,114 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.10,395 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.4,719 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మైనారిటీలకు రూ.18,960 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.11,948 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.7,012 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా కాపులకు రూ.26,634 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.20,550 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.6,084 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇతరులకు రూ.38,871 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.33,531 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.5340 కోట్లు వ్యయం చేశారు. -
2030 నాటికి పేదరిక నిర్మూలన సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్ : భారతదేశంలో పేదరికం గత 32 ఏళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. 1991 వేసవిలో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశంలో సంపద సృష్టికి మాత్రమేగాక దారిద్య్ర నిర్మూలనకు దారితీశాయి. ఇండియాలో 2005-2006 సంవత్సరం 2019-2021 ఏడాది మధ్య దాదాపు 41 కోట్ల 50 లక్షల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంకా ఈ కాలంలో దారిద్య్రం 55శాతం నుంచి కేవలం 16 శాతానికి తగ్గిపోయిందని కూడా గ్లోబల్ బహువిధ దారిద్య్ర సూచిక-2022 (ఎంపీఐ) గత అక్టోబర్‌లో వెల్లడించింది. పేదరికాన్ని ఇలా తగ్గించగలిగినా ప్రపంచంలో అత్యధిక పేద ప్రజలు 2020లో (22 కోట్ల 89 లక్షలు) ఇండియాలోనే ఉన్నారని ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ), ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ దారిద్య్రం, మానవాభివృద్ధి ఇనిషియేటివ్ (ఓఫీ) విడుదల చేపిన ఈ ఎంపీఐ నివేదిక తెలిపింది. పై గణాంక వివరాల్లో కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఎంత ఉందో చెప్పకపోయినప్పటికీ మొత్తంమీద కొవిడ్ రాక ముందున్న 15 ఏళ్లలో ఇండియాలో పేదరికం గణనీయంగా తగ్గిపోవడం ఓ వాస్తవం. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పేదల సంఖ్యను సగానికి తగ్గించాలని 2010లో సమావేశమైన యూఎన్డీపీ, ఓఫీ ప్రతినిధులు నిర్ణయించారు. పదిహేనేళ్లలో దాదాపు 42 కోట్ల మంది దారిద్య్రం నుంచి విముక్తి పొందినా...ఇంకా ఇండియాలో ఇంకా దాదాపు 30 కోట్ల మంది పేదలు ఉంటారని అంచనా. వారిలో 90శాతం (20.5 కోట్లు) గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రోజుకు సగటున 1.9 డాలర్ల ఆదాయంతో ఆరోగ్యంగా జీవించే వ్యక్తిని దారిద్య్రం నుంచి బయటపడిన మనిషిగా పరిగణిస్తారు. కేవలం ఆర్థిక పరిస్థితి మాత్రమేగాక చదువు, ఆరోగ్యం వంటి అంశాలను కూడా కలిపి ప్రజలు పేదలా, కాదా అని నిర్ధారించే పద్ధతి ఇప్పుడు అమలులోకి వచ్చింది. తూర్పు రాష్ట్రాల్లో పేదరికం నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం కావాలట దేశంలోని తూర్పు ప్రాంతం వైరుధ్యాల పుట్ట. అత్యంత సంపన్న ప్రకృతి వనరులున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన లోహాలు, ఖనిజాలు అందించే గనులు ఇతర వనరులున్న ఈ ప్రాంతం ప్రగతిపథంలో నడవాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం చొరవ, ప్రోత్సాహకాలు సరిపోవు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు లేదా దారిద్య్రం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించడానికి రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడ తూర్పు ప్రాంతం అంటే..బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు. అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు, గనులు ఉన్న ఈ రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోతున్నారు. సహజ వనురులున్న సొంత రాష్ట్రాల్లో పనులు లేక ఇతర రాష్ట్రాలకు పోయి ప్రమాదకర ఉద్యోగాలు సైతం వారు చేస్తున్నారు. నీతి ఆయోగ్ బహువిధ పేదరిక సూచిక (ఎంపీఐ) ప్రకారం బిహార్ లో 51.91శాతం, ఝార్ఖండ్ లో 42.16శాతం ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఈ ఐదు తూర్పు రాష్ట్రాల్లోని సహజ వనరుల ఆధారంగా అక్కడ పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయంలో గణనీయ స్థాయిలో దిగుబడులు సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అత్యంత విలువైన గనులున్న ఝార్ఖండ్, అటవీ ప్రాంతాలున్న ఛత్తీస్ గఢ్, గతంలో పారిశ్రామికంగా ఓ వెలుగు వెలిగిన పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో పేదరికం పూర్తిగా నిర్మూలించి అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధిక దారిద్య్రాన్ని తొలగించే చర్యలు, ఆర్థిక అభివృద్ధికి రూపొందించే పథకాలు ఏకకాలంలో అమలు చేస్తే తూర్పు ప్రాంతం దేశ ప్రగతికి కీలకపాత్ర దోహదం చేస్తుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
చైనా తన గొప్ప కోసం ఎంతకు తెగించిందంటే..ఆఖరికి ఆన్లైన్ వీడియోలు సైతం..
ప్రతి దేశంలోనూ ఎంతో కొంత మేర పేదరికం కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల రీత్యా లేదా వాతావరణం లేదా మౌలిక వనరుల దృష్ట్యా పేదరికంలో ఉండటం జరుగుతుంది. కానీ చైనా తమ దేశంలో ఆ స్థితే తలెత్తదు అన్నట్టుగా వ్యవహిరిస్తుంది. అందుకు సంబంధించి చిన్న విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ క్రమంలో వాటికి సంబంధించిన ఆన్లైన్ వీడియోలను కూడా తొలగించి.. బ్యాన్ చేస్తోందని చెబుతోంది. అందుకు ఉదహారణగా చైనాలోని కొన్ని ఆన్లైన్ వీడియోల గురించి కూడా వెల్లడించింది న్యూయార్క్ టైమ్స్. ఆయా వీడియోల్లో ఓ మహిళ ఇటీవలే తాను పదవీ విరణమ పొందానని, తన జీతం 100 యువాన్లని చెప్పింది. ఈ సొమ్ముతో ఎంత కిరాణ సామాగ్రిని కొనగోలు చేయవచ్చో చెప్పండి అని వాపోయింది. మరోక యువ గాయకుడు ఉద్యోగావకాశాల గురించి సోషల్ మీడియా వేదికగా నిరాసక్తతను వ్యక్తం చేశాడు. అలాగే ఒక వలస కార్మికుడు కరోనా సమయంలో తన కుటుంబాన్ని పోషించడానికి ఎలా కష్టపడ్డాడో వివరించాడు. దీంతో అతను విస్తృతమైన నెటిజన్ల సానుభూతిని పొందాడు. అంతే.. చైనా ఆయా వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను మరుక్షణమే నిలిపేసింది. పైగా సదరు కార్మికుడు ఇంటికి ఎవరూ అప్రోచ్ కాకుండా ఉండేలా అధికారులు ఇంటి వద్దే మోహరించి ఉన్నారు. ఆఖరికి జర్నలిస్టులను కూడా రాకుండా అడ్డుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వీడియోలను, ఆర్థికపరిస్తితికి సంబంధించిన ఇలాంటి వీడియోలు లేదా పోస్టులు ప్రచురించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించింది చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించిన విచారకరమైన వీడియోలను కూడా నిషేధిస్తుంది. చైనాకు సంబంధించినంత వరకు సానుకూల విషయాలనే ఉంచడానికే ప్రయారిటీ ఇస్తుంది. కేవలం చైనా కమ్యానిస్ట్ పార్టీ గత నాలుగు దశాబ్దాలుగా ఎంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందనే దాని గురించే గొప్పగా చెప్పుకుంటుంది. కానీ మావో జెడాంగో హయాంలో మొత్తం దేశాన్ని ఎలా కడు పేదరికంలో నెట్టిందో ప్రస్తావించడానికి నిరాకరిస్తుంది చైనా. నిజానికి చైనా చాలా సరిపడని సామాజికి భద్రతా వలయంలో చిక్కుకుంది. చైనా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పటికీ.. అక్కడి ప్రజలు చాలా మంది దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. అక్కడి ప్రజలు చాలా దయనీయమై పేదరికంలో బతుకుతున్నారు. ఒక పక్క దేశ ఆర్థిక పరిస్థితులు మసకబారుతుండటంతో ప్రజలు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం పేద ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి చర్చించడాన్ని నిషేధించడమే గాక ప్రభుత్వం దృష్టిలో ఆ విషయమే ఒక నిషిద్ధ అంశంగా మారింది. ఎంతలా అంటే.. చైనా దేశంలోని అతి పెద్ద వార్తా పోర్టల్ క్యూక్యూ డాట్ కామ్‌లో.. చైనీస్ పదం పిన్‌కున్(పేదరికం)ని సర్చ్ చేస్తే.. అమెరికా వంటి దేశాల్లో మరణాలు సంభవించడానికి నాల్గవ ప్రధాన కారణం పేదరికం అని చూపిస్తే, చైనాలోని పేదరికం సంబంధించిన వార్తలే అరుదుగా కనిపించడం గమనార్హం. చైనా తమ దేశంలోని పేదరికిం గురించి బయటపడకుండా ఉండేలా వాటికి సంబంధించిన ఆన్లైన్ వీడియోలన్నింటిని నిషేధించింది. దీంతో చైనాలో చాలామందికి తమ దేశంలో పేదరికిం ఎంత ప్రబలంగా ఉందో తెలియదు. కాగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాత్రం 2021లో పేదరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక సమగ్ర విజయం సాధించాం అని ప్రకటించడం గమనార్హం. (చదవండి: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి) -
కారు చీకటి బతుకులు.. అంతరం అలాగే!
చెలిమ నీళ్లే ఇంకా.. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గోవెన పరిధిలో ఐదు గూడేలకు విద్యుత్ వెలుగే లేదు. ఇందులో నాయకపుగూడ, కుర్సీ గూడాల పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ మిషన్ భగీరథ కోసం నిర్మించిన వాటర్ ట్యాంకులు అలంకారప్రాయమే. దీంతో నాయకపుగూడ గిరిజనులకు వాగులోని చెలిమ నీళ్లే గొంతు తడుపుతున్నాయి. గోవెన పరిధిలోని ఐదు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఐటీడీఏ ఎప్పుడో ఏర్పాటు చేసిన సోలారు లైట్లు ఆరేళ్ల క్రితమే పనిచేయకుండా పోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు సోలారు వీధి లైట్లు మాత్రం వెలుగుతున్నాయి. కారు చీకటి బతుకులు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామానికి చేరాలంటే ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లాలి. సరైన దారే లేని అలాంటి ఊరికి కరెంటు కూడా లేదు. పెంబిమండల కేంద్రం నుంచి 25 కి.మీ. దూరంలో ఉండే ఈ పల్లెలో 35 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఇంకా పెద్దరాగిదుబ్బ, సోముగూడ, కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్ గ్రామాలవీ చీకటి బతుకులే. శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి : వెనుకబాటుపైనే తిరుగుబాటు చేసి పుట్టిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు వస్తాయన్న నినాదమూ తెలంగాణదే. అయితే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లవుతున్నా.. రాష్ట్రంలో ఇంకా 13.74% పేదలు ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జాతీయ సగటు (25.01%)ను మించి పేదరికం ఉందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచిక (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్–2021) వెల్లడించడం గమనార్హం. విద్య, వైద్యం, విద్యుత్ ప్రాతిపదికగా.. విద్య, వైద్యం, పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్లు, సొంత ఆస్తులు, బ్యాంక్ ఖాతా తదితర పన్నెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. దేశ జనాభాలో 25.01% పేదలుండగా, తెలంగాణలో ఇది 13.74%గా ఉంది. అయితే ఆదిలాబాద్ (27.43%), మహబూబ్‌నగర్ (26.11%) జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరీ నిరాశాజనకంగా ఉంది. ఆయా జిల్లాల్లో 25% మందికి ఇప్పటికీ విద్య, వైద్యం, పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందటం లేదని నివేదిక తేల్చింది. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం, రాజకీయ అవసరం, ప్రాబల్యం ఉంటేనే నిధుల వరద పారుతున్న వైనం.. వెనుకబడిన ప్రాంతాల్లో మరోసారి అసహనానికి కారణం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించటం, రాజకీయ సిఫారసులు, అవసరాలు లేని ప్రత్యేక కార్యాచరణ అమలుతోనే సమ అభివృద్ధి సాధ్యమని ప్రొఫెసర్ సి.నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రాధాన్యం ఏదీ? తెలంగాణ వచ్చినా కూడా పాలమూరు వెతలు తీరటం లేదు. మా జిల్లాలో సహజ వనరుల దోపిడీ పెరిగింది. వలసలు ఇంకా ఆగనే లేదు. గుంపు వలసల స్థానే వ్యక్తిగత వలసలు కొనసాగుతున్నాయి. జీవన ప్రమాణాలు పెంచే ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో పాలమూరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే కొనసాగితే పాలమూరు పేదల జిల్లాగానే మిగిలిపోతుంది. –ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ప్రణాళికా బద్ధమైన కేటాయింపులు ఉండాలి సంక్షేమ రాజ్యం ప్రధాన సూత్రం..అందరికీ సమన్యాయం. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించి దాని ని నిరీ్ణత కాలంలో అమలు చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రణాళిక – కేటాయింపులు–సమీక్షలు అంత అర్థ్ధవంతంగా లేవు.అందుకే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దేశ సగటును మించి పేదరికం నమోదైంది. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ పేదలే లేని కొట్టాయం కేరళలోని కొట్టాయం జిల్లాలో పేదలే లేరు. ఎర్నాకులం జిల్లాలో 0.1%, కోజికోడ్‌లో 0.26% ఉన్నారు. దేశంలోనే పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ (0.71) నిలిచింది. ఇక అత్యధిక పేదరికం బిహార్‌లో (51.91%) ఉంది. దేశంలో అత్యధిక పేదరికం యూపీలోని శ్రావస్తి జిల్లాలో (74.38%) నమోదైంది. బహరైచ్‌లో 71.81%, మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌లో 71.31% పేదరికం ఉంది. మా జీవితాలకు వెలుగెప్పుడో..! అడవిలో మూడు కిలోమీటర్లు నడిస్తేనే.. బయటి ప్రపంచానికి మేమంటూ ఉన్నామని తెలుస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నరు కరెంటు వస్తదని. కానీ రాలే.. సోలారు లైట్లు పెడుతున్నా.. అవి కొన్నిరోజులే వెలుగుతున్నయి. మా పిల్లల జీవితాల్లోనైనా వెలుగు వస్తుందో లేదో..! – ఆత్రం శ్రీరాములు, ఠిమిద్దెచింత, నిర్మల్ బడి లేక..కూలీకి.. అమ్మా నాయిన ముంబైకి వలస వెళ్లిండ్రు. నేను మా తండా బడిలోనే 5వ తరగతి వరకుచదివిన. 6వ తరగతి చదవాలంటే రోజూ 14 కి.మీ వెళ్లిరావాలి. రోడ్డు బాగా లేదు, ప్రయాణ సౌకర్యం కూడా లేదు. దీంతో రోజూ నడుచుకుంటూ వెళ్లలేక గత ఏడాది బడి మానేసిన. ఇప్పుడు మా అవ్వ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు కూలీ పనులకెళ్తున్న. మా అమ్మా నాయిన లాగే తండాలో 95 కుటుంబాలు ముంబైకి వలస వెళ్లాయి. నాలా చానామంది నడుచుకుంటూ బడికి వెళ్లలేక కూలీ పని చేస్తుండ్రు. – సోనమ్మ, పాతతండా, నారాయణపేట జిల్లా -
Pakistan: భారత్ పట్ల వ్యతిరేకతే కొంప ముంచిందా?
దాయాది దేశం పాకిస్తాన్లో స్వాతంత్య్రానంతరం రాజ్యం, పాలనా వ్యవస్థా, ప్రజాస్వామ్య స్ఫూర్తీ నిర్వీర్యం అవుతూ వచ్చాయి. భారత్ వ్యతిరేక విధానమే అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికీ, వచ్చిన ప్రభుత్వం స్థిరంగా నిలబడక పోవటానికీ ప్రాతిపదికగా ఉంది. అందుకే భారత్‌లో మత, ప్రాంతీయ విద్వేషాలను రగిలిస్తోంది. ఉగ్రవాదుల్ని తయారుచేసి సరిహద్దులు దాటిస్తోంది. భారత్‌పై మూడుసార్లు యుద్ధం చేసింది. అవకాశం దొరికిన ప్రతిసారీ భారత్‌ను ఛిన్నాభిన్నం చేయాలనేది దాని ప్రధాన ధ్యేయం. ఇందుకోసం పెంచిపోషించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారు. పాక్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దురవస్థకు నేపథ్యం ఇదే. పొరుగు దేశాన్ని అస్థిర పరచడంలో ఉన్న శ్రద్ధ సొంత ప్రజల బాగోగులపై లేకపోవడంతో చివరికి పాక్ మును పెన్నడూ లేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. ప్రకృతి శక్తులు ఈ స్థితిని మరింత దిగజారుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ బియ్యం, గోధుమలు, వంటగ్యాస్ వంటి కనీస అవసరాల కోసం ప్రజలు అర్రులు చాచాల్సి వస్తోంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే... గ్యాస్ సిలిండర్ ధర అప్పుడు రూ. 2,373 ఉండగా, ఇప్పుడు రూ. 2,680కి చేరింది. పెసర పప్పు కిలో రూ. 172 ఉండగా నేడు రూ. 260గా ఉంది. అలాగే కేజీ చికెన్ రూ. 203 ఉండగా, ఈ ఏడాది రూ. 366కు పెరిగింది. 20 కిలోల గోధుమ పిండి ధర రూ.1,112 ఉండగా, ఈ ఏడాదికి రూ.1,812కు చేరింది. పరిస్థితి తీవ్రతకు ఈ ధరవరలు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు 4.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరడంతో మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఆ దేశం ఆర్థిక సహాయం కోసం యూఏఈ, సౌదీ అరేబియా లాంటి దేశాల వైపు చూస్తోంది. పాకిస్తాన్లో 2010 నుంచి 2020 వరకు ఎకనామిక్ గ్రోత్ కేవలం 1.5 శాతం మాత్రంగానే ఉంది. ద్రవ్యోల్బణం రేటు 28.7 శాతంగా ఉంది. అప్పులు కూడా పుట్టడం లేదు. తమది చెప్పుకోవడానికి అణ్వస్త్ర దేశమైనా అప్పుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాపోయారు. గత 70 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ స్వయంగా పెంచి పోషించిన ‘తెహ్రీక్ ఇ తాలిబాన్’ పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పిగా మారింది. తాలిబన్లు పాకిస్తాన్‌కు అత్యంత కీలక ప్రాంతాలైన ఖైబర్ఫక్తున్ఖ్వా, బెలూచిస్తాన్, పంజాబ్ లాంటి ప్రదేశాల్లో.. సైన్యం, పోలీ స్లు టార్గెట్‌గా పనిచేస్తూ అనేక ఉగ్రవాద సంస్థలను తమలో కలుపుకొని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ చెప్పవలసిన మరో అంశం ఏంటంటే పాకిస్తాన్‌లోని ‘బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ని తాలిబన్లు తమ సంస్థలో విలీనం చేసుకున్నట్లు కూడా పాకిస్తాన్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ యువకులనూ తాలిబన్లు సైన్యంలో చేర్చుకుంటూ, ఆయుధ శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ తాలిబన్ల మీద పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే ఎదుర్కోలేని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అఫ్ఘానిస్తాన్‌ను వదిలి వెళ్లేటప్పుడు నాటో దళాలు సుమారు 22,000 వాహనాలు, 64,000 మిషన్‌గన్స్‌ను అక్కడే వదిలి వెళ్లాయి. ఎమ్ 16, ఏకే 47 రకానికి చెందిన ఆయుధాలు సుమారుగా మూడు లక్షలకు పైగా అక్కడ ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ఇంత ఆధునికమైన ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన తాలిబన్ల మీద పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా విజయం సాధించగలదు? తినడానికి తిండి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబన్లను ఎదిరించగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గణాంకాల ప్రకారం పాక్‌లో కేవలం 68 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తిచేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వీటితో పాటుగా ప్రపంచంలోనే అతి తక్కువగా అక్షరాస్యత కలిగిన దేశాల్లో ఒకటిగా తయారయింది. అక్కడ 34.8 శాతం యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న భారత్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకోవటమే పాకిస్తాన్‌కు మంచిదని రక్షణ నిపుణులు పాక్‌కు సలహా ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందనీ, అక్కడి మీడియా కూడా ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని పాకిస్తాన్ దినపత్రిక ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కీర్తించింది. అమెరికా, రష్యాలు కూడా భారత్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర కాలం నుంచి కశ్మీర్ పాకిస్తాన్‌దే అంటూ నానాయాగీ చేసిన పాకిస్తాన్... కశ్మీర్ అంశంపైన సామరస్య పూర్వకంగా ఒక నిర్ణయానికి రావాలనీ, తద్వారా రెండు దేశాలూ అభివృద్ధి సాధిస్తాయనీ పాక్ కొత్త హితవచనం అందుకుంది. భారత్‌తో మూడు యుద్ధాల్లో తలపడటం వల్ల కష్టాలూ, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. మూడు యుద్ధాలతో ఇప్పుడు తాము పాఠాలు నేర్చుకున్నాం అంటున్నారు పాక్ నాయకులు. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామనీ, కశ్మీర్ వంటి సమస్యలపై భారత ప్రధాని మోదీతో నిజాయతీగా చర్చలు జరపాలనీ పాక్ ప్రధాని పిలుపునిచ్చారు. నిజంగా ఈ పిలుపు సాకారమైతే కేవలం పాక్ మాత్రమే కాదు... ఇండియా కూడా లాభపడుతుంది. (క్లిక్ చేయండి: హేతువాదమే మౌఢ్యానికి విరుగుడు) - డాక్టర్ ఎ. కుమార స్వామి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్ -
పతనం అంచున పాక్
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్ సర్కార్ ఉంది. గోధుమల లారీని వెంబడించి.. ! పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది. పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్ లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది. ►పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి. ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. ►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి. ►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్ 830 కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది. ►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు. ►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది. ► స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది. భారతే దిక్కా ..? పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది. కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్పార్–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూస్ మేకర్: జీవితం ఆమెతో ఫుట్‌బాల్ ఆడింది
మొన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మన పురుషుల టీం కనిపించిందా? పురుషుల టీమ్‌ను తయారు చేసుకోలేని మనం స్త్రీల టీమ్‌ను మాత్రం ఏం పట్టించుకుంటాం? అసలు ఫుట్‌బాల్ ఆడే అమ్మాయిలకు మన దేశంలో ఏం మర్యాద, ప్రోత్సాహం ఉన్నాయి? కోల్కటా ఫుట్‌బాల్ క్రీడాకారిణి పౌలమి అధికారి ఒకప్పుడు దేశ జట్టులో ఆడింది. ఇప్పుడు? జరుగుబాటు కోసం జొమాటో డెలివరి గర్ల్‌గా పని చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఈమె జీవిత అవస్థ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో ఆవేదన వ్యక్తం అవుతోంది. జొమాటో అని రాసి ఉన్న ఎర్రటి టీ షర్ట్ తొడుక్కుని కోల్కటాలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న 24 ఏళ్ల పౌలమి అధికారి ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి అని ఎవరూ ఊహించరు. గత కొంతకాలంగా ఇల్లు గడవడానికి పౌలమి ఫుడ్ డెలివరీ చేస్తోంది. కోల్కటాకే చెందిన సంజుక్త చౌధురి అని ట్విటర్ యూజర్ పౌలమి గురించి చిన్న వీడియో తీసి ట్విటర్లో ఉంచడంతో గత రెండు మూడు రోజుల్లోనే చాలా రెస్పాన్స్‌లు వచ్చాయి. విస్తృతంగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక ఫుట్‌బాల్ క్రీడాకారిణి నిస్సహాయ స్థితిలో ఉండటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అబ్బాయి అనుకునేవారు కోల్‌కటాలోని బెహలా ప్రాంతంలో నివసించే పౌలమి బాల్యంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటే మేనత్త పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచే పౌలమి ఫుట్‌బాల్ ఆడేది. అయితే అబ్బాయిలాగా కనిపించే పౌలమిని చూసి అందరూ అబ్బాయి అనుకుని ఆడించేవారు. ‘ఆ తర్వాత నేను అమ్మాయి అని తెలిశాక ఆటలో రానివ్వలేదు. అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడితే వారికి ఏ మర్యాద లేదు. నేను ఫుట్‌బాల్ మానేసి కొన్నాళ్లు హాకీ ఆడాను. అయితే మా ప్రాంతంలోని అనిత సర్కార్ అనే ఫుట్‌బాల్ కోచ్ నన్ను చూసి ఫుట్‌బాల్‌లో ట్రయినింగ్ ఇచ్చింది. నేను మంచి ప్లేయర్‌ని అయ్యాను’ అంటుంది పౌలమి. పదిహేను ఏళ్లు వచ్చేసరికే పౌలమి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయ్యింది. దేశం తరఫున అండర్ 16 జట్టుకు ఎంపికయ్యి 2013లో జరిగిన అండర్ 16 ఛాంపియన్షిప్ కోసం శ్రీలంక వెళ్లి ఆడింది. అయితే ఆ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకోవడం కష్టమైంది. ఇంటివాళ్లుగాని, క్రీడా సంస్థలుగాని సరైన వైద్యం, ఫిట్నెస్ ట్రయినింగ్ ఇప్పించకపోవడంతో వెనుకబడింది. మళ్లీ కోలుకుని 2016లో జరిగిన స్ట్రీట్ ‘హోమ్‌లెస్ ఫుట్‌బాల్ వరల్డ్‌కప్’ కోసం దేశం తరఫున గ్లాస్గో వెళ్లి ఆడింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఫుట్‌బాల్ అసోసియేషన్ నుంచి ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. వెంటాడిన పేదరికం 2017లో తండ్రి చేస్తున్న డ్రైవర్ ఉద్యోగం పోయింది. ఇంకో చెల్లెలు, తను తప్ప సంపాదనకు ఎవరూ లేరు. 2019 నాటికి బతకడం దుర్భరమైంది. ‘అప్పుడే నేను జొమాటోలో చేరారు. ఆ రోజుల్లో రోజుకు 500 సంపాదించేదాన్ని. లాక్డౌన్ ఎత్తేశాక చాలామంది ఈ ఉద్యోగంలోకి వచ్చారు. ఆర్డర్లు తక్కువ. పైగా నాకు సైకిల్ తప్ప బండి లేదు. దాంతో దగ్గరి ఆర్డర్లే తీసుకుంటాను. అందువల్ల రోజుకు 400 వస్తాయి. ఒక్కో ఆర్డర్ మీద 20 లేదా 30 రూపాయలు వస్తాయి. ఒక్కోసారి రోజుకు 300 రూపాయలకు మించి రావు. నాకు వేరే దారి లేదు... ఈ పని తప్ప’ అంది పౌలమి. రోజుకు 12 గంటలు పని చేస్తూ కూడా ఒక్కోసారి ఫుట్‌బాల్‌ను సాధన చేస్తుంటుంది పౌలమి. బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నదిగాని అది కూడా నత్తనడకన సాగుతున్నది. వెల్లువెత్తిన స్పందన పౌలమి కథనానికి స్పందన వెల్లువెత్తింది. దేశంలో ఫుట్‌బాల్ క్రీడాకారుల స్థితి ఆ మాటకొస్తే ఏ కొద్ది మందో తప్ప అందరు క్రీడాకారుల స్థితి ఇలాగే ఉందనే స్పందన వచ్చింది. ఫుట్‌బాల్ ఆటను ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నా పురుషులలోగాని, స్త్రీలలోగాని ప్రపంచ దేశాలతో తలపడే మెరుగైన టీమ్‌లు తయారు కావడం లేదనే విమర్శలు వచ్చాయి. ‘నాకు ఇప్పుడు కుదురైన ఉద్యోగం, ప్రాక్టీసు చేయడానికి మంచి స్పైక్స్ కావాలి’ అంటున్న పౌలమిలాంటి వారిని ఆ స్థితిలో ఉంచడం విషాదం. ఇప్పుడు వచ్చిన స్పందనతో ఆమెకు ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. -
అద్దె ఇంట్లో ఉంటున్నాం.. సాయం చేయండి: స్టార్ హీరో కొడుకు
అలనాటి హీరో కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు వందల సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాంతారావు దిగ్గజ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. తమకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కాంతారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన కుమారులు ఈ సందర్భంగా తమ దీనస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ సినిమాలు తీశారు. దీనివల్ల మేం ఆర్థికంగా చాలా నష్టపోయాం. నాన్న క్యాన్సర్ బారినపడినప్పుడు కూడా చికిత్స కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఒకప్పుడు మద్రాసులో బంగ్లాలో ఉన్న మేము ఇప్పుడు సిటీకి దూరంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాం. పరిశ్రమ నుంచి మాకెలాంటి సాయం అందలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి మాకు ఓ ఇల్లు కేటాయించి సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ కోరారు. -
బంగారమంత ఆశ: ఒక్క రేణువు చిక్కినా.. ఆ రోజుకు బువ్వ దొరికినట్లే..
యుగాలు మారుతున్నా...కొందరి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. అందుకు వీరి జీవితాలే నిదర్శనం.. ఒంగోలు గాంధీరోడ్డులోని బంగారం దుకాణాల వల్ల, వాటి పక్కన ఉండే మురుగు కాల్వల్లో బంగారు రేణువులు దొరుకుతాయేమోననే ఆశతో మురుగునీటిని, మట్టిని జల్లెడ పడతారు. ఒక్క రేణువు చిక్కినా.. ఆ రోజుకు బువ్వ దొరికినట్లే.. -ఫొటోలు: ఎం ప్రసాద్, సాక్షి -
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్‌లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్‌గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
4 సెకన్లకో ఆకలి చావు..
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధతో తనువు చాలిస్తున్నారని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్(ఎన్జీవోలు) పేర్కొన్నాయి. రోజుకు 19,700 మంది వంతున ప్రతి సెకనుకు నలుగురు చొప్పున ఆకలితో చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నాయి. 2019తో పోలిస్తే ఆకలి చావులు రెట్టింపయ్యాయని తెలిపాయి. 75 దేశాలకు చెందిన ఆక్స్‌ఫామ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 ఎన్జీవోలు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ దేశాల నేతల నుద్దేశించి లేఖ రాశాయి. ‘‘21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వబోమంటూ ప్రపంచ నేతలు ప్రతినబూనినప్పటికీ సొమాలియాలో మరోసారి తీవ్ర కరువు తాండవిస్తోంది. 45 దేశాల్లోని మరో 5 కోట్ల మంది ప్రజలు కరువుకు చేరువులో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో తెలిపాయి. ‘కేవలం ఒక దేశం లేదా ఖండానికి సంబంధించింది కాదు. మొత్తం మానవాళికే జరుగుతున్న అన్యాయమిది’’ అని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్త ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. ‘‘21వ శతాబ్దంలో కూడా కరువు గురించి మాట్లాడుకోవాల్సి రావడం దారుణం. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణమే ఆహారంతోపాటు దీర్ఘకాలం పాటు వారికి సాయం కొనసాగించడంలో ఏమాత్రం ఆలస్యం తగదు’’ అని పేర్కొన్నాయి. -
International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అక్షరాస్యతలో ఇంక వెనుకబడే ఉన్నాం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో 100% అక్షరాస్యత సుదూర స్వప్నంగా మారింది. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి యూనెస్కో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి బడిలో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం కరోనా లాక్డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30% విద్యార్థులు తిరిగి స్కూళ్లలో చేరలేదని చెబుతోంది. సాధించిన పురోగతి ఇదీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించాం. ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా సవాళ్లు విసురుతోంది. 1961లో కేవలం 15.4% మంది మహిళా జనాభా అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్అవుట్ల నివారించడంలో భారత్ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి. ఎదురవుతున్న సవాళ్లు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లేమి, లింగ, కుల వివక్ష, సదుపాయాల లేమి, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం వంటివన్నీ భారత్‌లో అనుకున్న స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోతున్నాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండటం లేదు. పూట గడవని ఉండే కుటుంబాలు పిల్లల్ని పలక బలపం బదులు పలుగు పార పట్టిస్తున్నారు. దేశంలో ఏకంగా కోటి మంది చిన్నారులు బడికి వెళ్లడానికి బదులుగా బాలకార్మికులుగా మారారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 87.7% ఉంటే గ్రామీణ భారతంలో 73.5% ఉన్నట్టుగా నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకే అక్షరజ్ఞానం లేకపోవడంతో వారికి చదువు ప్రాధాన్యం గురించి తెలియక పిల్లల్ని బడికి పంపించడం లేదు. అమ్మాయిల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి బాల్య వివాహాలు, పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలింది. ఇప్పటికీ దేశంలో 40% పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేదు. జీడీపీలో 6% విద్యా రంగానికి ఖర్చు చేస్తేనే అక్షరాస్యత రేటు పెరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటే 3% కూడా పెట్టడం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Sakshi Cartoon: 10 కోట్లకు చేరిన ప్రపంచ శరణార్థులు
10 కోట్లకు చేరిన ప్రపంచ శరణార్థులు -
ఈ దశాబ్దం భారత్‌దే
న్యూఢిల్లీ: ప్రస్తుత దశాబ్దం (2030 వరకు) భారత్‌కు ఆశావహం అని, ఎన్నో అవకాశాలు రానున్నాయని టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి వచ్చేలా చూడాలన్నారు. సీఐఐ నిర్వహించిన వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో 70% ప్రపంచ వృద్ధి అంతా వర్ధమాన దేశాల నుంచే ఉంటుందని చంద్రశేఖరన్ అంచనా వేశారు. అందులోనూ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని, భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమ్మిళిత వృద్ధి..: ‘‘మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. కానీ, ఈ వృద్ధి ఫలాలు అందరూ అనుభవించే విధంగా ఉండాలి. ధనిక, పేదల మధ్య అంతరం పెరగకుండా చూడాలి. నా వరకు ఇదే మూల సూత్రం’’అని చంద్రశేఖరన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీస నాణ్యమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలన్నారు. రానున్న పదేళ్లలో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే భారత్ ప్రపంచ జీడీపీలో 3% నుంచి 7%కి చేరింది. ఈ అభివృద్ధి వల్ల గత పదేళ్లలోనే 27 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. మనం కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించాం. 2022లోనే ఇప్పటి వరకు చూస్తే ప్రతీ వారం ఒక యూనికార్న్ ఏర్పడింది. అయినా, మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. అది మహిళలకు ఉపాధి కల్పించే విషయంలోనూ. ఇప్పటికీ ఎంతో మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా సదుపాయాలను అందుకోలేకున్నారు’’అని చంద్రశేఖరన్ తెలిపారు. సమస్యలను పరిష్కరించుకోవాలి.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘5 లక్షల కోట్ల డాలర్లు, 8 లక్షల కోట్ల డాలర్లకు భవిష్యత్తులో చేరుకుంటాం. తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, ఇది సమ్మిళితంగా ఉండాలి’’ అని తెలిపారు. ఈ దశాబ్దం భారత్‌దేనని మరోసారి గుర్తు చేస్తూ ఈ క్రమంలో సమస్యలు, సవాళ్లను పరిష్కరించుకున్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయాన్ని ఎన్.చంద్రశేఖరన్ గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఇది 27 శాతం నుంచి 23 శాతానికి దిగివచ్చినట్టు చెప్పారు. అయితే, కొత్త నైపుణ్య నమూనా కారణంగా ఇది మారుతుందన్నారు. ఇంటి నుంచే పని విధానం ఇప్పుడప్పుడే పోదంటూ, అది శాశ్వతంగానూ కొనసాగదన్నారు. -
లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది
భారతదేశంలో సగం జనాభాకు వంట గ్యాస్ అందుబాటులో లేదు. అదే స్థాయిలో పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. పక్కా ఇండ్లు, పౌష్టికాహారం, వైద్యం సరేసరి. ఎంతోమందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యమే లేని పరిస్థితి. అయినా దేశంలో పేదరికమే లేదని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం – పేదరికాన్ని రకరకాల పద్ధతుల్లో నిర్వచించి గందరగోళం సృష్టించడం! గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 4,200 రూపాయలు లభిస్తే ఆ కుటుంబం పేదరికంలో లేనట్టు లెక్క! అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 5,140 వస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టు! ఇలా పేదరికాన్ని మరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ఆందోళనకరం. ‘‘పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నించడం దాతృత్వం కాదు. అది అసలైన న్యాయం. ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగం. అంత మాత్రమే కాదు. ఇది గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కు’’. దక్షిణాఫ్రికా విముక్తి పోరాట నాయకుడు, మానవ హక్కుల ప్రతీక నెల్సన్ మండేలా గుండెల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. భారతదేశంలో పేదరికాన్ని నిజంగా నిర్మూలించకుండా, ఒక రకంగా దానిని మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల సామా జిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉన్నట్టు నమ్మించడానికి కొత్త కొత్త ప్రాతిపదికలను రూపొందిస్తున్నారు. పేదరికాన్ని రకరకాల పద్ధతుల్లో నిర్వచించి గందరగోళం సృష్టిస్తున్నారు. కనిపిస్తున్న పేదరికాన్ని మరుగుపరచడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోన్న పరిస్థితి అత్యంత ఆందోళనకరం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, ఇటీవల ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో పేదరికం తగ్గినదంటూ తేల్చి చెప్పారు. సుతీర్థరాయ్, రాయ్ వాండర్ వైడ్ అనే ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఆ నివేదికను రూపొందించారు. ఈ నెలలోనే ఆ నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. 2011 నుంచి 2015 వరకు 3.4 శాతం పేదరికం తగ్గిందనీ, 2011లో 22.5 శాతం ఉండగా, అది 2015లో 19.1 శాతానికి తగ్గిందనీ ఆ నివేదిక బయటపెట్టింది. అంతే కాకుండా 2015 నుంచి 2019 వరకు ఎన్నడూలేని విధంగా 19.1 శాతం నుంచి పది శాతానికి పడిపోయింది. ఈ నాలుగేళ్ళలో ఏం జరిగిందో అర్థం కాదు. లెక్కల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. ఇది గ్రామీణ పేదరికం సంగతి. పట్టణ పేదరికం కూడా 2011లో 14.2 శాతం ఉండగా, 2015 వరకు అది 12.9 శాతానికి తగ్గింది. అదే విధంగా 2015 నుంచి 2019 వరకు 12.9 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది. పేదరికాన్ని వారి రోజువారీ వినిమయ ఖర్చును లెక్కపెట్టడం ద్వారా అంచనా వేయడం ఒక పద్ధతి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ధారించడానికి రోజూ ఒక మనిషి 35 రూపాయల ఖర్చుకన్నా తక్కువ వినియోగం చేస్తే, అతడు పేదవాడిగా నిర్ధారించబడతాడని నిపుణులు, ప్రభుత్వాలు నిర్ణయించాయి. పట్టణ ప్రాంతాల్లో దానిని 42 రూపాయలుగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకు 140 రూపాయల ఆదాయం ఉంటే చాలు, పట్టణాల్లో నలుగురికి కలిపి 168 రూపాయలుంటే చాలు. దీన్ని వినిమయ ఖర్చు సూచిక అంటారు. 2015 నుంచి 2019 వరకు పేదరికం తగ్గిందని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది: పెన్షన్లు, రైతు బంధుతో పాటు, ఇతర పథకాల పేరున డబ్బును నేరుగా ప్రజలకు అందించడం వలన, ప్రతి పేద కుటుంబానికి కనీసం 2,500 నుంచి 3,500 రూపాయల వరకు నగదు అందుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 4,200 రూపాయలు లభిస్తే ఆ కుటుంబం పేదరి కంలో లేనట్టు లెక్క. పట్టణ ప్రాంతంలో నెలకు 5,140 రూపాయలు ఆదాయం ఉంటే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టు ప్రభుత్వం నిర్ధారిస్తుంది. రెండో విషయం: ప్రభుత్వాలు 2011లో సామాజిక ఆర్థిక కులగణన(ఎస్ఈసీసీ) నిర్వహించి అందులో పేదరికాన్ని గుర్తించడా నికి ఏడు అంశాలను పరిశీలించారు. ఆ ఏడింటిలో మట్టిగోడల ఇల్లు మాత్రమే ఉండాలి. ఆ ఇంటిలో 15 సంవత్సరాల నుంచి 59 వయస్సు ఉన్న మగవాళ్ళు ఉండకూడదు. ఆ ఇంటి యజమాని మహిళ అయి వుండాలి. ఆ ఇంటిలో దివ్యాంగులే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఇళ్ళల్లో ఇరవై ఐదేళ్లు పైబడిన వారెవరూ కూడా అక్షరాస్యులై ఉండకూడదు. భూమి లేని వారై ఉండాలి. అయితే ప్రధానంగా కూలీ మీద ఆధారపడి ఉండాలి. ఇవి సూచికలు. ఇటువంటి వాళ్ళనే పేదరికంలో ఉన్నట్టు గుర్తిస్తారు. ఇవి చదివిన వారెవరికైనా ఒకటి అర్థం అవుతుంది. ఈ దేశంలో పేదరికం లేదని! అందుకే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు ఇటువంటి నిర్ధారణకు రాగలిగాయి. ఈ విధంగా ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని తిరుగుతున్నాయి. అయితే మరొక అంశం ఉన్నది. అది కూడా ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన సర్వే. ఆ సర్వే ప్రకారం భారత దేశంలో 25 శాతం మంది పేదరికంలో ఉన్నట్టు తేలింది. ఆ సంస్థ కేవలం అన్నం, కారం, నీళ్ళపప్పుతో తింటూ ఉంటే సరిపోదనీ, పేదరికం కేవలం తిండికి మాత్రమే పరిమితమై లేదనీ, పేదరికం బహుముఖీనమైనదనీ ప్రక టించి, 2021లో ఒక రిపోర్టును విడుదల చేసింది. అయితే ఈ నివేదిక గురించి అధికార పక్షం ఇప్పటి వరకు నోరెత్తలేదు. కానీ పాక్షికమైన విషయాన్ని అది కూడా కృత్రిమమైన ఆసరా, భరోసాలను లెక్కవేసి, ఇది గొప్పతనంగా చెప్పుకుంటున్నారు. ప్రపంచబ్యాంకు నివేదిక వచ్చి, రెండు రోజులే అయ్యింది. ఇప్పటికే ఇది తమ ప్రభుత్వ గొప్పత నమని చాటింపు మొదలుపెట్టారు. కానీ తమ ప్రభుత్వమే స్థాపించిన నీతి ఆయోగ్ వెలువరించిన పేదరికం నిజాలను కూడా ఒకసారి పరిశీలిస్తే విజ్ఞతగా ఉంటుంది. దీనిని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ) అంటారు. ఈ సర్వేలో పన్నెండు అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. అందులో పౌష్టికాహారం, శిశు, బాలల మరణాలు, శిశు సంరక్షణ, పాఠశాలలకు వెళ్ళే వయస్సు, స్కూల్‌కు హాజరయ్యే రోజుల వివ రాలు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, గృహ వసతి, ఆస్తులు, ఇంట్లో వస్తువులు, బ్యాంక్ ఎకౌంట్ వివరాలు, వీటన్నింటినీ పరిశీలించి పేదరికాన్ని నిర్ణయించారు. వీటి ఆధారంగానే నీతి ఆయోగ్ భారతదేశంలో నూటికి 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని తన ప్రాథమిక సర్వేలో తేల్చింది. దేశం మొత్తం మీద 25 శాతమైతే, అది గ్రామీణ ప్రాంతంలో 32.75 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 8.81 శాతంగా తేల్చారు. బహుముఖ పేదరికంలో బిహార్ 51.91 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు: జార్ఖండ్ 42.16 శాతం, ఉత్తరప్రదేశ్ 37.79 శాతం, మధ్యప్రదేశ్ 30.65 శాతం, మేఘాలయ 32.67 శాతం. తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు: గోవా 3.76 శాతం, సిక్కిం 3.82 శాతం, తమిళనాడు 4.89 శాతం, పంజాబ్ 5.59 శాతం, హిమాచల్ ప్రదేశ్ 7.62 శాతం. దేశంలో సగానికి పైగా జనాభాకు వంట గ్యాస్ అందుబాటులో లేదు. అదే స్థాయిలో పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. 45.6 శాతం మందికి మంచి పక్కా ఇల్లు లేదు. 37.6 శాతం జనాభాకు పౌష్టికాహారం అందడం లేదు. 22.6 శాతం మంది తల్లులకు వైద్యం అందుబాటులో లేదు. 12.2 శాతం జనాభాకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యమే లేని పరిస్థితి ఉంది. ఇట్లా ప్రతి నలుగురిలో ఒకరు జీవితంలోని ప్రధాన మైన రంగాల్లో లోటును ఎదుర్కొంటున్నారు. తమ జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయాలతో కాకుండా, ప్రభుత్వాలు తాత్కాలికంగా ఇచ్చే పెన్షన్ల ఆధారంగా ప్రజలను పేదరికం లిస్టులో నుంచి తీసి వేయడంలో కుట్ర దాగుంది. పేదరికం నుంచి బయటపడాలంటే జీవనోపాధుల ద్వారా లభించే ఆదాయం, దానితో వివిధ అంశాల్లో కనీస వసతులను, సౌకర్యాలను లెక్కవేయాలి. అంతేకానీ, అర్థసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం విజ్ఞత అనిపించుకోదు. నెల్సన్ మండేలా చెప్పినట్టు, పేదరికం నుంచి బయటపడడానికి ప్రభుత్వాలు చేస్తున్న మాయాతెరలను తొలగించు కొని, జీవించే హక్కు కోసం, అది కూడా గౌరవప్రదమైన జీవితం కోసం పేదలే చైతన్య వంతమైన కార్యాచరణను రూపొందించు కోవాలి. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా! ఇదే ఇప్పుడు మనందరికీ మేల్కొల్పు కావాలి. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
నోట్ల రద్దుతో అలా..భారత్‌పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పేదరికం 2011–2019 మధ్య 12.3 శాతం మేర తగ్గినట్టు ప్రపంచబ్యాంకు తన చర్చా పత్రంలో తెలిపింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2011 నేషనల్ శాంపిల్‌సర్వే (ఎన్ఎస్ఎస్) తర్వాత భారత్ గృహ వినియోగానికి సంబంధించిన సర్వే వివరాలను ఇంత వరకు వెల్లంచలేదు. దీనికితోడు పేదరికం, అసమానతలకు సంబంధించి గత పదేళ్లలో అధికారికంగా ఎటువంటి గణాంకాలను ప్రకటించలేదు’’అని ఈ చర్చా పత్రం రూపొందించడంలో భాగమైన ఆర్థికవేత్త సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్‌డెర్ వీడ్ తెలిపారు. కరోనా సంక్షోభం తలెత్తిన 2020లో భారత్‌లో తీవ్ర పేదరికం రేటు 0.8 శాతానికి పరిమితం అయిందని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇందుకు సాయపడినట్టు లోగడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రూపొందించిన చర్చా పత్రం కూడా ప్రకటించడం గమనార్హం. ‘‘భారత్‌లో 2011–2019 మధ్య తీవ్ర పేదరికం 12.3 శాతం తగ్గింది. 2004–2011 మధ్య కాలంలో ఉన్న రేటుతో పోలిస్తే ఎంతో మెరుగుపడింది’’ అని ప్రపంచబ్యాంకు చర్చా పత్రం వివరించింది. 2016లో డీమోనిటైజేషన్ సమయంలో పట్టణాల్లో పేదరికం 2 శాతం పెరిగిందని.. ఆ తర్వాత గణనీయంగా క్షీణించినట్టు తెలిపింది. 2019లో వృద్ధి కుంటు పడడంతో గ్రామీణ పేదరికం 0.10 శాతం మేర పెరిగినట్టు పేర్కొంది. వినియోగంలో అసమానతలు పెరిగాయనడానికి ఎటువంటి ఆధారాల్లేవని ఆర్థికవేత్తలు ఈ చర్చా పత్రంలో స్పష్టం చేశారు. చిన్న రైతులకు ఆదాయం 10 శాతం మేర పెరిగినట్టు తెలిపారు. చదవండి: చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..ఇది మన పరిస్థితి..! -
Sakshi Cartoon: భారత్‌లో పేదరికం తగ్గింది
భారత్‌లో పేదరికం తగ్గింది: ప్రపంచ బ్యాంకు -
భళా: భారత్‌లో పేదరికం తగ్గుతోంది, 'పీఎంజీకేఏవై' పై ప్రశంసల వర్షం!
న్యూఢిల్లీ: పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్ పేపర్లో పేర్కొంది. ‘మహమ్మారి, పేదరికం, అసమానత: భారతదేశం నుంచి పాఠాలు’ అనే అంశంపై ఈ వర్కింగ్ పేపర్ రూపొందింది. 2004–05 నుంచి మహమ్మారి సవాళ్లు విసిరిన 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలపై ఈ పత్రం అధ్యయనం చేసింది. సుర్జిత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్, అరవింద్ విర్మానీలు రూపొందించిన ఈ వర్కింగ్ పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►2019లో కరోనా ముందు సంవత్సరంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద ఉంది. 2020 మహమ్మారి సంవత్సరంలోనూ అది తక్కువ స్థాయిలోనే కొనసాగాలా చూడ్డంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కీలకపాత్ర పోషించింది. ►మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యా లను ఉచితంగా అందిస్తోంది. సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ ఈ పథకాన్ని పొడిగించడం సానుకూల పరిణామం. ► 2019–20 మహమ్మారికి ముందు సంవత్సరంలో భారతదేశంలో పేదరికం 14.8 శాతంగా ఉంటే, తీవ్ర పేదరికం శాతం 0.8 శాతంగా ఉంది. ►ఏదు దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా 2020 మహమ్మారి సమయంలో పేదరికం (రోజుకు 1.9 డాలర్లకన్నా తక్కువ ఆర్జన) తీవ్రంగా పెరిగింది. ► మహమ్మారి సమయంలో భారత్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల వల్ల పేదరికం తీవ్రత కట్టడిలో ఉంది. 2013లో ఆహార భద్రతా చట్టం (ఎఫ్ఎస్ఏ) అమలులోకి వచ్చినప్పటి నుండి ఆహార సబ్సిడీలు పేదరికాన్ని స్థిరంగా తగ్గించాయి. ప్రయోజనాలు అసలైన లబ్దిదారులకు చేరడం ఆధార్ ద్వారా సాధ్యపడుతోంది. లబ్దిదారునికి సబ్బిడీ పథకాలు చేరేలా తీసుకువచ్చిన చర్యలు, చొరవలు పేదరికం తగ్గడంలో మంచి ప్రభావాన్ని పోషించాయి. ►గిని కోఎఫీషియంట్ విధానం ద్వారా మదింపుచేసే గణాంకాల ప్రకారం, గత నలభై సంవత్సరాలలో ‘‘వాస్తవిక అసమానత’’ కనిష్ట స్థాయికి చేరుకుంది. 1993–94లో అసమానతల నివారణా సూచీ 0.284 వద్ద ఉంటే, 2020–21లో 0.292కి చేరుకుంది. ఆహార సబ్సిడీల వల్ల మూడు సంవత్సరాలుగా తీవ్ర పేదరికం 1 శాతం కంటే తక్కువగా (లేదా సమానంగా) ఉంది. ►ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత 2020లో మొదటిసారి జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆహార రేషన్‌ను ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోంది. ►తీవ్ర పేదరిక సమస్య వాస్తవంగా భారత్‌లో పోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రాతిపదికైన ఆర్జన ఇకపై 1.9 డాలర్ల నుంచి 3.2 డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా భారత్ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ అధికారికంగా దేశంలో దారిద్య్రరేఖ ప్రాతిపదికలను మార్చాలి. ►దేశంలో మహమ్మారి వల్ల తలెత్తిన తీవ్ర పేదరిక సమస్య ఆహార సబ్సిడీ విస్తరణ కార్యక్రమం వల్ల దాదాపు 50 శాతం మేర సమసిపోయింది. -
కొంప మునిగినా.. కొందరికి లాభమే
దేశంలో ఎటువంటి పరిస్థితి తలెత్తినా అది ధనికుల సంపదనూ, బీదల సంఖ్యనూ మరింత పెంచేదిగా ఉండటం గమనార్హం. ‘కోవిడ్–19’ సమయంలో ఒకవైపున లక్షలు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్న కాలంలో కూడా కోట్లకు పడగలెత్తుతూ వచ్చిన సంపన్నుల వైనం-దొంగ చేతికి తాళం అందించినట్టయింది. సకాలంలో సరైన మందులు వాడక పోవడంవల్ల మరణించిన వారికన్నా.. సామాజిక వ్యవస్థల్లో అసమానతల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువని గణాంకాలు వెల్లడిస్తుండటం మరొక చేదు వాస్తవం. ధనికుల సంపదపై పన్నులు తగ్గించడం వల్ల వారికి లాభం కలుగగా, సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం పెరిగింది. ఒక్క 2020లోనే ఇందువల్ల అత్యంత దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య 4.6 కోట్లు. రాజు (పాలకుడు) నోటినుంచి వచ్చిందీ; న్యాయస్థానాలు, న్యాయమూర్తుల లేదా మేజిస్ట్రేట్ల నుంచీ వెలువడే తీర్పులన్నీ ధర్మాలు కావనీ, హాస్యాస్ప దాలుగా ఉంటాయనీ నిరూపిస్తూ లోకరీతిని పొల్లుపోకుండా వివరించిన మేటి కథల్లో ఒకటి-సుప్రసిద్ధ కథకుడు పతంజలి చెప్పిన ‘పిలక తిరుగుడు పువ్వు’! ఒక గ్రామంలో కులాల వారీగా ప్రజలు రెండు ముఠాలుగా చీలిపోయి భూమి గుండ్రంగా ఉందని ఒక వర్గం; కాదు, భూమి బల్లపరుపుగా ఉందని మరో వర్గం భావించడంతో బయలుదేరిన కక్షల కారణంగా గొడవలు జరిగాయి. పోలీసులు రెండు వర్గాల వారినీ పిలక పట్టుకుని తీసుకొచ్చి దొమ్మీ నేరంమీద, హింసాకాండ రెచ్చగొడుతున్నారన్న ఆరోపణ మీద కేసును మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారు. న్యాయమూర్తి కేసును కొత్త తరహాలో విచారించడం మొదలుపెడతారు. ఎలా? జీవితమే నమ్మకాలకూ, ఆచరణకూ పొంతన లేకుండా ఉంది కాబట్టి, జీవితమే బల్లపరుపుగా ఉంది కనుక ఫలానా ఊళ్లో ఇలాంటి తగవు తలెత్తిందని భావించిన న్యాయమూర్తి.. నిజానికి భూమి గుండ్రంగా ఉంటే జీవితం ఇలా ఉండదనీ, అందుకే భూమి బల్లపరుపుగా ఉందనీ తీర్పు చెప్పి రెండు పక్షాల కక్షిదారుల్ని విడుదల చేసేశారు! మా రాజులు, మా పాలకులు ఏమిటంటే కోర్టువారు కూడా అదే రైటన్నప్పుడు (భూమి గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉందని).. కోర్టును మాత్రం పాలకుడు ఎందుకు గౌరవించాలని అడుగుతారు. ఏతావాతా పాలకుడికి సమర్థనగా కోర్టు ‘చట్టబద్ధంగా ఏర్పడిన భారత గణతంత్ర వ్యవస్థను కుట్రపూరితంగా కూల్చివేయడానికి కుత్సిత బుద్ధితో ప్రతిపక్షం (ముద్దాయిలు) పన్నిన పన్నాగం’ అని తీర్పు చెప్పడం... నేటి ‘పిలక తిరుగుడు పువ్వులు’గా మారిన కొందరి పాలకుల నడవడికగా కనిపిస్తుంది. స్వార్థ ప్రయోజనాలు అలా దూసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల తతంగం ద్వారా దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ లేని 80 మంది పార్లమెంటు సభ్యులతో దేశ పాలనను చేతిలో పెట్టుకుని దేశాన్ని ఉత్తర-దక్షిణ భారతాలుగా చీల్చి ఏలుబడి సాగించుకుంటున్నారన్న అపవాదును యూపీ ఆధారంగా పాలకులు మూటగట్టుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన భారత రాజ్యాంగ ప్రధాన నిర్ణేత అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఉత్తర-దక్షిణ భారతాల పేరిట చీలుబాటలకు అడ్డుకట్ట వేయడానికే దక్షిణ భారత ప్రత్యేక రాజధానికి బీజావాపనం చేశారని గుర్తించాలి. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా జరుగుతున్న ఈ ‘బహుళార్థ సాధక’ రాజకీయ కుట్రలకు, వక్ర రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష అని మరచిపోరాదు. అంతకన్నా ఘోరమైన, అనూహ్యమైన పరిణామం-జాతీయ స్థాయి గొప్ప సంస్థగా పేరుమోసిన ఒకనాటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కి సారథ్యం వహిస్తూ వచ్చిన చిత్రా రామకృష్ణ ఉన్న ట్టుండి బీజేపీకి సన్నిహితుడైన ఒక యోగి పన్నిన వ్యూహంలో చిక్కుకోవడం. అతగాడు చెప్పినట్టు నిర్ణయాలు తీసుకునే మైకంలో చిక్కుబడిపోయి తన వ్యక్తిత్వాన్ని మంటగలుపుకున్నదంటే-పాలక వర్గాల్లోని ‘గాడ్‌మెన్’ల ముసుగుల్లో స్వార్థ రాజకీయ పాలకుల ప్రయోజనాల్ని కాపాడుతూండటం వల్లనే ఇలాంటి విషమ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో హర్షద్ మెహతా లాంటి ‘నడమంత్రపు సిరి’ రాయుళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు తలపెట్టిన పూడ్చలేని హానికర పరిణామాలకు మరొక ఉదాహరణే చిత్రా రామకృష్ణ పతనం. మరింత పేదరికంలోకి.. ఇదే సమయంలో ప్రపంచ దేశాల్ని కల్లోల పరుస్తోన్న ‘కోవిడ్-19’ అంటువ్యాధి సమయంలో ఒకవైపున లక్షలు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్న కాలంలో కూడా కోట్లకు పడగలెత్తుతూ వచ్చిన సంపన్నుల వైనం-దొంగ చేతికి తాళం అందించినట్టయింది. కోవిడ్-19 వైరస్ వల్ల సకాలంలో సరైన మందులు వాడక పోవడంవల్ల మరణించిన వారికన్నా... సామాజిక వ్యవస్థల్లో అసమానతల వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యంత సంపన్న వర్గాలపై విధించే పన్నులను తగ్గించడంవల్ల ఆ పన్నుల భారాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజల భుజస్కంధాలపైన మోపడం వల్ల విషమ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్క 2020లోనే ఇందువల్ల అత్యంత దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య 4.6 కోట్లని తేలింది. ప్రపంచంలో కొత్తగా పెరిగిన పేదల సంఖ్యలో వీరే సగంమంది ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అంతేగాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఫలితంగా... ఒక వైపున పేదలు, పేదరికం పరిధిలోకి జారడానికి దగ్గరలో ఉన్న నిరుపేదల సంఖ్య ఆర్థికంగా అత్యంత సంపన్న వర్గాలకు అనుకూలంగా దేశ ఆర్థిక వ్యవస్థను మలచడం వల్లనే పెరిగిపోతోందని ‘ఆక్స్‌ఫామ్’ సాధికార సంస్థ వెల్లడించింది. చివరికి పచ్చి హిందూ తత్వవాది, ఆరెస్సెస్ అధ్యక్షుడైన మోహన్ భగవత్ ‘ఒక వైపున ఆర్థిక ప్రగతి కనిపిస్తున్నా, ప్రపంచ ఆర్థిక సంపదపైన పెత్తనం మాత్రం కొలది మందిది మాత్రమే’ కొనసాగు తోందని స్పష్టం చేశారు. ఇది మరీ విచిత్రమైన పరిణామం-దేశంలో అసాధారణంగా పెరిగిపోతున్న కొలదిమంది అత్యంత సంపన్నుల ఆస్తిపాస్తులను తైపారు వేసి చూస్తే-కొందరు మాత్రమే అగ్ర స్థానంలో ఉండటమేగాక, భారతదేశ సంపదపై ‘ఉగ్రరూపం’లో భల్లూకపు పట్టు సంపాదించారు. ఈ విషమ పరిణామాన్ని మన తరంలో మనం ఇప్పుడు దర్శిస్తున్నాం గానీ... సరళీకరణ, ప్రైవేటీ కరణ, ప్రపంచీకరణ పేర్ల చాటున ప్రపంచబ్యాంకు రుద్దే సంస్కరణల ప్రభావం ప్రజా బాహుళ్యంపైన ఎలా ఉంటుందో.. తొలుత ఆడమ్ స్మిత్ రాసిన ‘జాతుల సంపద’ అనే ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక శాస్త్ర అనర్ఘరత్నం తర్వాత, అంత గొప్పదిగా పేరుగాంచిన డాక్టర్ డేవిడ్ కార్టన్ రాసిన ‘కార్పొరేట్ రంగం ప్రపంచాన్ని ఏలబోతున్న వేళ’ (వెన్ కార్పొరేషన్స్ రూల్ ది వరల్డ్) అన్న గ్రంథం మరిన్ని సత్యాలను కళ్లకు కట్టి చూపింది. కార్టన్ కనీసం 15 ఏళ్ల నాడే ప్రపంచ దేశాలను ఇలా హెచ్చరించాడు: శ్రీమంతుల కోసమేనా? ‘స్వల్పాదాయ వనరులున్న దేశాలలో శరవేగాన ప్రవేశపెట్టే ఆర్థిక ప్రగతి పథకాల వల్ల వచ్చే ఫలితం-శ్రీమంతులకు పనికివచ్చే ఆధు నిక ఎయిర్‌పోర్టులు, టెలివిజన్లు, భారీ ఎక్స్‌ప్రెస్ రహదార్లు, ఫ్లైఓవర్లు; సంపన్న వర్గాల అవసరాలు తీర్చిపెట్టే అత్యాధునిక ఎలెక్ట్రానిక్స్ వస్తువులతో నిండిన ఎయిర్ కండీషన్డ్ షాపింగ్ కేంద్రాలు, ఫ్యాషన్ లేబుల్స్ వగైరా. ఇందువల్ల అసంఖ్యాక ప్రజాబాహుళ్యం జీవన పరిస్థితులు మెరుగుపడవు. ఈ రకమైన ఆర్థిక ప్రగతి ఎగుమతుల్ని పెంచే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటుంది. తద్వారా సంపన్న వర్గాలు కోరుకునే వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడం దాని లక్ష్యం. కాగా, ఈ తరహా అభివృద్ధి మూలంగా పేదల భూములన్నింటినీ కేవలం ఎగుమతుల్ని పెంచే వాణిజ్య పంటలకు మళ్లించేస్తారు. ఈ భూముల్ని సాగు చేసుకుంటూ వచ్చిన పాతకాపులందరూ బతుకుతెరువు కోసం, చాలీ చాలని కూలికి పట్టణ మురికివాడల్లో కుదురుకుని ఎగుమతులకు ఉద్దేశించిన వస్తూత్పత్తిలో పాల్గొనాల్సి వస్తుంది. తద్వారా కుటుం బాలు విచ్ఛిన్నమవుతాయి. సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే స్థితికి చేరుతుంది. హింస, దౌర్జన్యాలు సమాజంలో సర్వసామాన్య మైపోతాయి!’’ పదిహేను ఏళ్లనాడు డాక్టర్ కార్టన్ చేసిన ముందస్తు హెచ్చరిక నేటి మన దుస్థితికి చెరపలేని నిలువుటద్దం! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పదికొచ్చే సరికే ఫుల్స్టాప్..
సాక్షి, హైదరాబాద్: విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో మాదిరి పిల్లలను స్కూల్‌కే పంపని పరిస్థితులు లేకున్నా... కొద్దిపాటి చదువుతోనే బడి మాన్పించే స్థితిగతులు మాత్రం తెలంగాణలోకనిపిస్తున్నాయి. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక సంగ్రహణ (తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ట్స్ అబ్స్ట్రాక్ట్) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సా హం.. అన్ని వర్గాల్లో పెరిగిన అవగాహన, బడుల సంఖ్య పెరగడం వల్ల 6–10 వయసు పిల్లలను ప్రతి ఒక్కరూ పాఠశాలకు పంపుతున్నారు. ఆఖరుకు జనాభా లెక్కల్లో లేని వారు (వలసదారులు, సంచార తెగలు) కూడా ప్రాథమిక బడుల్లో చేరుస్తున్నారు. రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 27,78,000 మంది 6–10 వయసు్కలుంటే, 1–5 తరగతుల్లో చేరే విద్యార్థులు 31,10,154 మంది ఉన్నారు. కానీ 9, 10 తరగతులకొచ్చే సరికి కేవలం 10,92,039 మందే ఉంటున్నారు. ఇంటర్లో విద్యార్థుల సంఖ్య 4.32 లక్షలే ఉంటోంది. టెన్త్‌కొచ్చే సరికి డ్రాపౌట్స్ (స్కూల్ మానేసేవారు) 12.29 శాతం ఉంటోంది. జయశంకర్ జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్ (హైసూ్కల్ స్థాయిలో 29.49%) ఉంటున్నారు. చదువు మధ్యలో మానేసే వారు ఎక్కువగా మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. -
‘పేదరికానికి మీ మాజీ అధ్యక్షుడే గతంలో కొత్త నిర్వచన ఇచ్చారు’
న్యూఢిల్లీ: పేదరికం ఓ మనోభావన అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా చెణుకులు విసిరారు. కేంద్ర బడ్జెట్ 2022–23పై చర్చకు శుక్రవారం రాజ్యసభలో సమాధానమిస్తూ, పేదరిక నిర్మూలనకు బడ్జెట్ ఏ మాత్రం దోహదపడేలా లేదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. ‘‘పేదరికానికి మీ మాజీ అధ్యక్షుడే గతంలో కొత్త నిర్వచనమిచ్చాడు. తిండి, డబ్బు, వస్తువులు లేకపోవడం పేదరికం కాదని, అదో మానసిక భావన మాత్రమేనని అన్నాడు. ఆత్మవిశ్వాసముంటే దాన్ని అధిగమించవచ్చన్నాడు. ఆయనెవరో మీకందరికీ తెలుసు. మీరు నిర్మూలించాలంటున్నది ఆ మానసిక పేదరికాన్నేనా?’’ అని ప్రశ్నించారు. ఇది పేదలను హేళన చేయడమేనన్న శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పేదలను హేళన చేసిన వ్యక్తి తాలూకు పార్టీతో శివసేన జట్టు కట్టిందన్నారు. ‘‘నేనెవరి పేరూ చెప్పలేదు. అయినా ఆ నేతను కాపాడేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే, వానాకాలంలో కప్పల బెకబెకలు వినపడగానే అవెక్కడున్నదీ అందరికీ తెలిసిపోతుందన్న తమిళ సామెత గుర్తొస్తోంది’’ అంటూ నిర్మల ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచీ భారత్ రాహుకాలంలో ఉందన్న కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కామెంట్లపైనా నిర్మల వాగ్బాణాలు సంధించారు. ‘‘నిజమైన రాహుకాలం ఏమిటో తెలుసా? సొంత పార్టీ ప్రధాని తెచ్చిన ఆర్డినెన్సును మీడియా సాక్షిగా మీ నేత (రాహుల్) చించేసిన కాలం. మీతో సహా 23 మంది కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకత్వ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టిన కాలం. సీనియర్లంతా ఆ పార్టీని వీడుతున్నారే, ఆ కాలం. ఆ పార్టీ కేవలం 44 ఎంపీ సీట్లకు పడిపోయిన కాలం’’ అంటూ తిప్పికొట్టారు. -
పారిశ్రామిక ఉత్పత్తి... నాలుగో నెలా నిరాశే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా నాల్గవ నెల 2021 డిసెంబర్‌లోనూ పేలవంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 0.4 శాతంగా నమోదయినట్లు (2020 ఇదే నెలతో పోల్చి) జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండంకెల్లో వృద్ధి నమోదయ్యింది. అటు తర్వాత క్రమంగా బలహీనపడింది. 2020 లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం క్రమంగా తొలగిపోతూ రావడం కూడా దీనికి కారణం. సెప్టెంబర్‌లో 4.4 శాతం, అక్టోబర్‌లో 4 శాతం, నవంబర్‌లో 1.3 శాతం (తొలి 1.4 శాతానికి దిగువముఖంగా సవరణ) వృద్ధి రేట్లు నమోదయ్యాయి. కొన్ని కీలక రంగాల పనితీరును పరిశీలిస్తే.. ► మైనింగ్ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. ► విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం పెరిగింది. ► పెట్టుబడులు, భారీ యంత్రసామాగ్రి కొనుగోళ్లను ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ విభాగం కూడా 2021 డిసెంబర్లో క్షీణతలోనే ఉంది. క్షీణరేటు 4.6 శాతంగా నమోదయ్యింది. 2020 ఇదే నెలల్లో ఈ విభాగంలో 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ► రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా 2.7 శాతం క్షీణతను నమోదయ్యింది. 2020 డిసెంబర్లో ఈ విభాగంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు సంబంధించి విభాగంలో ఉత్పత్తి కూడా 0.6 శాతం క్షీణతలోనే ఉంది. 2020 డిసెంబర్లో ఈ విభాగం 1.9 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. తొమ్మిది నెలల్లో ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 15.2 శాతం. లో బేస్ దీనికి ప్రధాన కారణం. 2020 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 13.3 శాతం క్షీణత నమోదయ్యింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... -
‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి'
ఈ జిందగీలో ఎన్నో హృదయవిదారక సంఘటనలు, మనసును మెలితిప్పే ఉదంతాలు రోజూ ఎన్నెన్నో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదరికం, హింస ప్రస్తుత సమాజంలో తారాస్థాయికి చేరుతుంది. పేదరికమే హింసకు కారణమౌతుందనేది అనేకమంది వాదన. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే లోపాల కారణంగా కొన్ని సందర్భాల్లో వారే నేరస్తులౌతున్నారు. ఐతే ప్రస్తుతం కొన్ని రకాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పిల్లలకు సహాయం చేయడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అటువంటి ఓ బాలుడికి సంబంధించిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బాలుడి కథ వింటే మీ కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి. వయొలిన్ వాయిస్తున్న ఇద్దరుముగ్గరు పిల్లలు కనిపించే ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే... వీరిలో ఏడుస్తూ కనిపిస్తున్న పిల్లవాడు బ్రెజిల్‌కు చెందిన వాడు. మృతిచెందిన తమ టీచర్ అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తున్నాడు. అవ్నీష్ షరన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విటర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఏడుస్తూ వయొలిన్ వాయిస్తున్న బాలుడి ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు అతని కన్నీళ్లకు కారణం కూడా తెలుపుతూ.. నేర జీవితం నుంచి బయటకు తెచ్చిన గురువు అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తూ ఏడుస్తున్న బ్రెజిలియన్ బాలుడు (డీగో ఫ్రాజో టర్కటో) అనే క్యప్షన్‌తో షేర్ చేశాడు. ఈ ఫొటోలో మానవత్వం ప్రపంచంలోనే గట్టిగొంతుకతో మాట్లాడుతోందని కూడా రాశాడు. ఐతే అనతికాలంలో ఈ బాలుడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాల్లో వైరలయ్యింది. అనేక మంది తమ ఉన్నతమైన అభిప్రాయాలను తెలుపుతూ ఈ ఫొటోకు కామెంట్ల రూపంలో పంపుతున్నారు కూడా. వాళ్లలో ఒకరు ‘మరణించిన తన ఉపాధ్యాయుడి అంత్యక్రియల్లో బ్రెజిల్ చైల్డ్‌కు చెందిన ఈ చిత్రం మన జీవితాల్లో అత్యంత భావోద్వేగ చిత్రాల్లో ఒకట'ని అభివర్ణించారు. మరొకరేమో ‘నిజానికి ఈ భూప్రపంచంలో కేవలం టీచర్లు మాత్రమే మానవత్వాన్ని కాపాడే సామర్ధ్యం కలిగినవారని, తన హృదయం పూర్తిగా బద్ధలైనట్లు అతని కళ్లు చెబుతున్నాయ'ని ఇంకొకరు కామెంట్ చేశారు. చదవండి: ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం! This photo was taken of a Brazilian boy (Diego Frazzo Turkato),playing the violin at the funeral of his teacher who rescued him from the environment of poverty and crime in which he lived. In this image,humanity speaks with the strongest voice in the world. Pic: Marcos Tristao pic.twitter.com/MkWUd5DcBE — Awanish Sharan (@AwanishSharan) December 19, 2021 -
గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. ఆదరించిన చైల్డ్ లైన్
సాక్షి, అమరావతి: ఆమె పేరు బండారు దుర్గ. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. కట్టుకున్న భర్త కాదని వదిలి వెళ్లిపోయాడు. పేదరికంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల కడుపు నింపాల్సిన పరిస్థితి. ఇక కొడుకులను చదివించడం తలకు మించిన భారమే అయ్యింది.. ఆపై కరోనా దెబ్బకు పరిస్థితి మరింత దిగజారింది. పూట గడవక ఐదో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు అజయ్‌ని చదువు మాన్పించి గొర్రెల కాపరిగా పెట్టింది. ఏడాదికి రూ.30 వేలు తీసుకునే ఒప్పందంతో గొర్రెల యజమానికి అప్పగించింది. తల్లి కష్టాలను చూడలేక.. తల్లి కష్టాలను చూడలేని ఆ చిన్నారి పన్నెండేళ్ల వయసులో అయిష్టంగానే గొర్రెల కాపలాకు వెళ్లాడు. ఒప్పందం ప్రకారం రాత్రి వేళ కంటిమీద కునుకులేకుండా వాటికి కాపలాగా ఉండేవాడు. ఎప్పుడైనా కునుకు తీస్తే యజమాని కర్రలతో కొట్టే దెబ్బలను భరిస్తూ వచ్చాడు. ఊహ తెలియని వయసులో పాములు, పుట్టల మధ్య పగలూ, రాత్రి భయం భయంగా గడిపేవాడు. చదువుకు దూరమైపోతున్నానని తనలో తానే బాధపడేవాడు. చదువు కోవాలనే ఆరాటం.. చిన్నప్పట్నుంచి చదువు కోసం తపించే అజయ్.. తన తల్లి కోసం అన్నిటినీ భరించాడు. కానీ ఆ కష్టాలను, యజమాని కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇటీవల అక్కడ నుంచి రహస్యంగా పారి పోయి వచ్చేశాడు. మంగళగిరి రోడ్డెక్కి ఆటోలో విజయవాడ వచ్చి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. ఆదరించిన చైల్డ్ లైన్.. ఆకలితో అలమటిస్తున్న అజయ్‌ని చూసి రైల్వేస్టేషన్‌లోని చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు చేరదీశారు. అజయ్ పూర్వాపరాలు ఆరా తీశారు. అప్పట్నుంచి తమ సంరక్షణలోనే ఉంచుకున్నారు. ఏదైనా మంచి స్కూలులో చేర్పించి అజయ్ విద్యా బోధన కొనసాగించే ప్రయత్నాల్లో వీరు ఉన్నారు. దేశ సేవ చేస్తా.. చదుకోవడమంటే నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు. అయిష్టంగానే అమ్మ చెప్పినట్టు గొర్రెల కాపరిగా వెళ్లా. అక్కడ భయం భయంగా గడిపాను. కాపరిగా ఉంటే ఇక నా పరిస్థితి ఇంతే అనుకున్నాను. ఎలాగైనా అక్కడ నుంచి బయట పడి చదువుకోవాలన్న ఆశతో అమ్మకు కూడా చెప్పకుండా పారిపోయి విజయవాడ వచ్చేశా. ఇంటికి వెళ్తే మళ్లీ గొర్రెల యజమానికి అప్పగిస్తారని, ఇక చదువుకోలేనని భయంగా ఉంది. ఇక్కడ చైల్డ్‌లైన్‌లో బాగా చూసుకుంటున్నారు. బడిలో చేర్పించి చదివిస్తామంటున్నారు. నాక్కావల్సింది అదే. బాగా చదువుకుని ఆర్మీలో చేరతా. దేశ సేవ చేస్తా. – బండారు అజయ్ అజయ్‌ను బడికి పంపుతాం.. అజయ్ తల్లిని పిలిపించాం. ఆమె బిడ్డ తమ సంరక్షణలో ఉన్నాడని చెప్పాం. వీలైనప్పుడల్లా కొడుకును చూసి వెళ్తోంది. అజయ్ చదువుకోవడానికే తప్ప తిరిగి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అజయ్ కోరిక మేరకు చదువు కొనసాగిస్తాం. భవానీపురంలో ఉన్న ఎస్కేసీవీ చిల్డ్రన్ ట్రస్ట్ నడుపుతున్న స్కూల్లో చేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. నిబంధనల ప్రకారం అజయ్ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాం. – అరవ రమేష్, జిల్లా కోఆర్డినేటర్, చైల్డ్‌లైన్, విజయవాడ -
ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు..
రవి చూడని బ్రిటీష్ పాలన గురించి విని ఉంటారు.. కానీ నేటికీ అక్కడి నిరంకుశ పాలనలో అభివృద్ధికి, టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నారీ దేశ ప్రజలు. అక్కడ పర్యటించాలన్నా, కనీసం మనసును కదిలించిన ఫొటోలు తీసుకోవలన్నా అడుగడుగునా ఆంక్షలే. ఇలాంటి వాటిని కూడా నిషేధిస్తారా అనే అనుమానం కలుగుతుంది ఇది చదివితే. ఎరిక్ లాఫోర్గ్ ఈ ఫొటోలు తీసినప్పుడు అసలూహించి ఉండడు. కేవలం ఆ ఫొటోలు మూలంగా ఆ దేశం నుంచి శాశ్వతంగా భహిష్కరించబడతాడని. మర్మదేశంగా పేర్కొనే నార్త్ కొరియాకు సంబంధించిన ఫొటోలే అవి. అక్కడి అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ వీటిని తీవ్రంగా వ్యతిరేకించాడట. కిమ్ అనుమతి లేకుండా ఆ దేశానికి సంబంధించి చిన్న చీపురుపుల్ల కూడా ప్రపంచాన్ని చూడదు. అటువంటి అక్కడి పేదరికాన్ని, ప్రజల దుర్భర జీవనాన్ని గురించి ఫొటోలు తీస్తే ఊరుకుంటాడా! అయినప్పటికీ ఆ ఫొటోలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ మాటల్లోనే.. 2008 నుంచి ఆరు సార్లు ఉత్తర కొరియాను సందర్శించాను. వాళ్లు నా దగ్గరి ఫొటోలు డిలీట్ చేయమన్నప్పుడు, వాటిని సేవ్ చేసి, డిలీట్ చేశాను. థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా!! పోషకాహారలోపంతో బాధపడే ఈ విధమైప పిల్లల ఫొటోలు తీయడం ఉత్తర కొరియాలో నిషేధం. అంతేకాదు పేదరికాన్ని తెలియజేసే ఏ విధమైన ఫొటోలు తీయకూడదు. రాళ్లపై నిద్రపోతున్న ఇతని ఫొటోను కూడా డిలీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ ఫొటోలో అతను మృతి చెందినట్టు కనిపిస్తున్నాడు. ఈ ఫొటో తీస్తున్నప్పుడు కరెంట్ పోయింది. దీన్ని కూడా డిలీట్ చేయమన్నారు. పైగా అమెరికా ఆంక్షల వల్లనే కరెంట్ కోతలని చెప్పారు. పనులకు వెళ్లడానికి గంటల తరబడి సైకిళ్లను తొక్కేవారి ఫొటోలు తీయడం కూడా నిషేధమే. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. నార్త్ కొరియాలో ప్రతీచోట కనిపించే సైనికులకు సంబంధించిన ఫొటోలు అస్సలు తీయకూడదు. మరీ ముఖ్యంగా ఆగిపోయిన బస్సులను తోసే సమయంలో అస్సలు తీయకూడదు. క్రమశిక్షణలేని పిల్లల ఫొటోలు కూడా తీయకూడదు. పేదరికంలో మగ్గుతున్నవారి జీవనవిధానాన్ని ఫొటోల్లో బంధించడం అక్కడి చట్టం ప్రకారం నేరం. వాక్ వే సరిహద్దులను రిపేర్ చేస్తున్న మహిళలు, పిల్లలకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు తీయడం కూడా చట్టవిరుద్ధమే. నాయకుల చిత్రాల ముందు నవ్వుతున్నవారి ఫొటోలు తీయడం అగౌరవంగా భావిస్తారు. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! సైనికులు కనిపించకుండా జంతువుల ఫొటోలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఇది పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే ప్రతీచోట పోగయ్యే ప్రజలకన్నా సైనికులే 99 శాతం ఉంటారు. తినటానికి గడ్డిని సమకూర్చుకునే నార్త్ కొరియన్ ఫొటోలు తీయకూడదు. ఇది కూడా చట్ట విరుద్ధమే. ప్యోంగ్యాంగ్ రోడ్లపై అరుదుగా కార్లు కనిపిస్తాయి. కార్లు ఓ వైపు వెళ్తున్నారోడ్డు మధ్యలో పిల్లలు ఆడుకుంటారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీయకూడదు. సాంగ్డౌన్లో ఎస్కలేటర్‌ను చూసి భయపడుతున్న పిల్లలు వీళ్లు. ఈ దేశ ప్రజల్లో చాలా మందికి అది ఏమిటో కూడా తెలియదు. మరమ్మత్తులు అవసరమైన ఈ పాత బిల్డింగ్, ఆహారం కోసం చేపలు పట్టే వ్యక్తి, కాలుష్యంతో నిండిన నదిలో స్నానం చేసే వ్యక్తి, గుండీలు ఊడిన వ్యక్తి ఫొటోలు, విశ్రాంతి తీసుకునే సైనికులు, నిరాశ్రయులైన వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, మురికి దుస్తులతో ఉన్న వ్యక్తుల ఫొటోలు తీయడం అక్కడి చట్టం ప్రకారం నేరం. చాలా మటుకు నార్త్ కొరియా దేశంలో పేరదికమే కనిపిస్తుంది. ఇతర ప్రపంచదేశాలు తమను తక్కువచేసి చూస్తారనే భయం, ఆంధోళన అక్కడి నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తోంది. నిరంకుశ పాలన పరాకాష్టకు చేరితే ఉత్తర కొరియాలా ఉంటుందనడానికి ఈ ఫొటోలపై ఉన్న నిషేధమే నిదర్శనం. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
పేదరికంతో అల్లాడిపోతున్న తల్లి ..మూడు రోజుల పసికందుని..
ముంబై: పేదరికంతో అల్లాడిపోతున్న ఓ తల్లి తన పసికందును రూ 1.78 లక్షలకు అమ్ముకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో మహిళకి సహకరించిన మరో నలుగురితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం... షిర్డీ పట్టణానికి చెందిన 32 ఏళ్ల మహిళ పేదరికంతో బతుకు భారంగా జీవనాన్ని కొనసాగిస్తోంది.ఈ క్రమంలో ఆమె సెప్టెంబరులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఓ పక్క తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా, ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకునే స్థోమత కూడా తనకు లేదని బాధపడుతూ చివరికి ఆ పాపని అమ్మలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అహ్మద్‌నగర్, థానేలో ఒకరు పొరుగున ఉన్న ముంబైలోని ములుండ్‌కు చెందిన ముగ్గురు మహిళలు పాప విక్రయానికి ఆ మహిళకు సహకరించారు. ఆ వ్యక్తికి ఎలాంటి చట్టబద్ధమైన లాంఛనాలు పూర్తిచేయకుండానే వారు రూ 1.78 లక్షలకు శిశువను విక్రయించారు. ఈ విషయమై సమాచారం అందడంతో వ్యక్తి ఇంటిపై దాడులు చేపట్టగా శిశువు కనిపించాడు. దీంతో నేరానికి పాల్పడిన పసిబిడ్డ తల్లి సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. చదవండి: భార్య కేసు పెట్టడంతో భర్త ఆత్మహత్య -
అలుపెరగని అగ్గిబరాటా
వెనుకబడిన దళిత కుటుంబం. కటిక పేదరికం. తోబుట్టువుల్లో ఐదో నంబర్ తనది. సౌకర్యవంతమైన ఇల్లులేదు, కడుపునిండా తినేందుకు లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులనూ ఎదుర్కొని నేడు వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడమేగాక, దళిత మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. మరోపక్క తన రచనలతో దళిత మహిళలను జాగృతపరుస్తున్నారు అనితా భారతి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఉదాహరణగానూ, పేదరికంలోనూ నిజాయితీగా కష్టపడితే పైకి ఎదగవచ్చని నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు అనిత. అది 1965.. ఢిల్లీలోని సీలమ్‌పూర్‌లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది అనితా భారతి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అనితకేమో బాగా చదువుకోవాలని కోరిక. తామెలాగూ చదువుకోలేదు. కనీసం పిల్లలనైనా చదివించాలన్న ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. స్కూలుకు వెళ్లడానికి యూనిఫాం గానీ చెప్పులు గానీ లేవు సరికదా... రాసుకునేందుకు పుస్తకాలు కూడా ఉండేవికావు. అయినా అలాగే స్కూలుకు వెళ్లి తనకున్న ఒక నోట్ బుక్లోనే పెన్సిల్‌తో పాఠాలు రాసుకుని అది పూర్తయిన తరువాత ఎరేజర్‌తో తుడిపేసి మళ్లీ కొత్త పాఠాలను రాసుకునేది. పాతబట్టలతో బ్యాగ్ కుట్టుకుని ఎంతో మప్పితంగా స్కూలుకు వెళ్లేది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూనే .. స్కూలు అయ్యాక ఇంటికొచ్చి ఎన్వలప్‌ల తయారీలో తల్లికి సాయపడేది. పనిపూర్తయ్యాక కొవ్వొత్తి వెలుతురులో చదివి తరగతిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేది. అయితే అనితా వీటన్నింటిని శ్రమపడి అధిగమించినప్పటికీ, చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల చేసే కుల దూషణలు తనని తీవ్రంగా బాధించేవి. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కులవివక్ష ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో సమాజం, జీవితం పట్ల అవగాహన ఏర్పడిన అనిత అలాంటి వాటిని పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టి, పన్నెండో తరగతి పూర్తిచేసింది. అప్పులు... పోరాటాలు ఇంటరీ్మడియట్ తరువాత అప్పులు చేసి కాలేజీ చదువులు పూర్తిచేసింది. తొలుత బీఏ హిందీ హానర్స్‌లో చేరింది. తరువాత బిఈడీ చేసింది. అయితే కుల వివక్షని అధిగమించడానికి కాలేజీ యూనియన్లలో చురుకుగా పాల్గొనేది. ఇందులో భాగంగా దళిత విద్యార్థులందరితో కలిసి ‘ముక్తి’ సంస్థను స్థాపించి దళిత విద్యార్థుల హక్కులను కాపాడడానికి ప్రయతి్నంచేది. అంతేగాక ఒక స్కూలును ఏర్పాటు చేసి మురికివాడల్లోని దాదాపు వందమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. మరోపక్క ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ పూర్తి చేసింది. 1992లో గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. దీంతో టీచర్‌గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేపట్టేది. అనిత మెరుగైన పనితీరుకు గుర్తింపుగా రాధా కృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇందిరా గాంధీ అవార్డు, ఢిల్లీ స్టేట్ టీచర్ అవార్డు, సావిత్రబాయి ఫూలే అవార్డు ఆమెను వరించాయి. భర్తతో కలిసి... ఉద్యోగం వచి్చన ఏడాదిలో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ప్రోత్సాహంతో ‘కదమ్’ దళిత సెంటర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దళిత మహిళల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక దళిత్ రైటర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ దళితులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అంతేగాక దళిత మహిళల సమస్యలపై పోరాడే థియేటర్ గ్రూపు ‘అలటిపు’లో కూడా భాగస్వామిగా మారి, ఈ గ్రూపులోని మహిళలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు. దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేగాక వారి హక్కులపై అవగాహన కలి్పంచేందుకు 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయడం ప్రారభించింది. 2012లో హిందీలో ‘కాంటెంపరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్స్ రెసిస్టెన్స్’ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్–10 పుస్తకాలలో ఒకటిగా నిలవడం విశేషం. ఎక్కువమంది బుక్‌ను ఇష్టపడడంతో మరింత ఉత్సాహంతో పుస్తకాలు రాయడం, దళిత మహిళలు, బాలికలు, అమ్మాయిలపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రస్తుతం రూప్‌నగర్ నంబర్ వన్ స్కూల్‌కు వైస్ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తూ నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. -
పేదరికంపై అలుపెరగని పోరాటం చేస్తున్న దివ్యాంగుడు
-
మందులు కొనుగోలు చేయలేని దీనస్థితి.. ప్రాణం తీసిన పేదరికం
నార్నూర్: జ్వరం వస్తే వైద్య పరీక్షలు చేయించుకునేంత కూడా ఆర్థిక స్థోమతలేని నిరుపేద గిరిజన కుటుంబం వారిది. వారం రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతున్నా మందులు కొనుగోలు చేయలేని దీనస్థితిలో ఇంటి ఇల్లాలిని కోల్పోయిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాడిహత్నర్ గ్రామ పంచాయతీ పరిధి ముక్తాపూర్ కొలాంగూడ గ్రామంలోని కొలాం గిరిజన తెగకు చెందిన మహిళ ఆత్రం ధర్మిబాయి(37) జ్వరంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమె వారం రోజులగా టైఫాయిడ్‌తో బాధ పడుతోంది. రెండు రోజుల క్రితం జ్వరం తీవ్రత పెరగడంతో వివిధ రకాల టెస్టులు చేయాలని తాడిహత్నర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు సూచించాడు. కాని నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక ఎలాంటి పరీక్షలు చేయించలేదు. చివరికి మందులు కూడా కొనుగోలు చేయకుండా ఇంటికి తిరిగొచ్చారు. మరునాడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్దామని కుటుంబ సభ్యులు భావించినా భారీ వర్షం కారణంగా సాధ్యపడలేదు. పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలికి భర్త నాగోరావు, ఇద్దరు కతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
వజ్రాల కోసం ఎగబడ్డ జనం.. తలలు పట్టుకున్న అధికారులు
అది దక్షిణాఫ్రికా తీరం వెంట ఉండే ఓ చిన్న ఊరు. వారం క్రితం వరకు ఆ ఊరి గురించి.. పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఓ పశువుల కాపరి ప్రకటన తర్వాత ఆ ఊరి పేరు ప్రపంచం మొత్తం తెలిసింది. దేశం నలమూలల నుంచి అక్కడికి ‘క్యూ’ కడుతున్నారు. ఎందుకోసం అనుకుంటున్నారు వజ్రాల వేట కోసం.. ప్రిటోరియా: క్వాహ్లాతి.. సౌతాఫ్రికాలో ఓ చిన్న కుగ్రామం. ఆ ఊరి శివారులో ఉన్న భూముల్లో వారం క్రితం ఓ గొర్రెల కాపరికి మెరిసే రాళ్లు దొరికాయి. అవి వజ్రాలేనని ప్రచారం మొదలుకావడంతో జనాలు ఎగబడి మరీ అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. పదులు.. వందలు.. వేల మంది అక్కడికి చేరుకున్నారు. తమ దారిద్య్రాన్ని తరిమికొట్టేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో రంగు రంగుల రాళ్లు వాళ్లకు దొరుకుతున్నాయి. అధికారులకు కరోనా భయం కాగా, తవ్వకాల్ని కట్టడి చేయడంలో అక్కడి అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది ఒకేసారి తవ్వకాలు చేపడుతుండడంతో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వాళ్లలో పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. ‘మీకు చేతులెత్తి మొక్కుతాం. తవ్వకాలు ఆపండి. మాకు సహకరించండి. ఆశతో ప్రాణల మీదకు తెచ్చుకోవద్దు’ అని మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆశచావని ప్రజలు కరోనా ఎఫెక్ట్‌తో దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం అయ్యింది. లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. ఈ తరుణంలో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు ప్రజలు. అయితే వారం గడుస్తున్నా అవి వజ్రాలేనా? అనేది తేల్చడంలో జియాలజిస్టులు విఫలమయ్యారు. అయినప్పటికీ ఆశ చావని ప్రజలు.. వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. -
బాల భారతం.. బలహీనం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. ఫలితంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. బాల భారతం బలహీనంగా మారుతోంది. దేశంలో గత ఏడాది నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనే ఉన్నారని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 3,98,359 మంది, బిహార్‌లో 2,79,427 మంది బాధిత బాలలు ఉన్నారు. లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేకపోవడం గమనార్హం. అనారోగ్య ముప్పు అధికం ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘దేశంలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగ సమస్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలయ్యింది. ఫలితంగా ఆకలి రక్కసి కాటేస్తోంది. ఆకలి ఉన్నచోట పోషకాహార సమస్య కచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి’’అని హెచ్ఏక్యూ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఇనాక్షీ గంగూలీ సూచించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. 2020 నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్లో 45,749, ఛత్తీస్‌గఢ్‌లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్‌లో 12,059, ఆంధ్రప్రదేశ్‌లో 11,210, తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్‌లో 5,732 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడీ కేంద్రాలదే కీలక బాధ్యత అని ఇనాక్షీ గంగూలీ చెప్పారు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. -
హ్యూమన్ మిరాకిల్ ఇది: జిన్‌పింగ్
బీజింగ్: దేశంలో పేదరికాన్ని నిర్మూలించి అద్భుతం చేసి చూపించామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. అతి తక్కువ కాల వ్యవధిలోనే కోట్లాది మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక తార్కాణంగా నిలిచామంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పేదరిక నిర్మూలనకై కృషి చేసిన గ్రామీణాధికారులను జిన్‌పింగ్ సత్కరించారు. మెడల్స్ ప్రదానం చేసి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయం. హ్యూమన్ మిరాకిల్(మానవుడు సృష్టించిన అద్భుతం). తక్కువ సమయంలోనే ఎన్నో కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం’’అని పేర్కొన్నారు. అయితే దేశంలో జరుగుతున్న పరిణామాలకు, అధ్యక్షుడు చెబుతున్న మాటలకు పొంతనే లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదరిక నిర్మూలనకై చేపడుతున్న కార్యక్రమాల్లో అవినీతి పెచ్చుమీరుతున్నా, రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పాలకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సుస్థిరావృద్ధి లక్ష్యాల్లో భాగంగా రోజూ వారీ కనీస ఆదాయాన్ని 2.30 డాలర్లకు పైగా పెంచడానికై కృషి చేస్తున్నట్లు చైనా గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1970ల నాటి నుంచి డ్రాగన్ దేశం, కడు పేదరికంలో మగ్గుతున్న 800 మిలియన్ మంది ప్రజలకు పైగా విముక్తి కల్పించినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. చదవండి: భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట -
2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది
ఐక్యరాజ్యసమితి: కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల 2030 నాటికి అదనంగా మరో 20.7 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి పడిపోతారని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో మహిళల సంఖ్య 10.2 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లు దాటిపోతుందని ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) నివేదికలో తెలిపింది. కోవిడ్ వివిధ దేశాలపై చూపిస్తున్న ప్రభావం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దెబ్బ తీస్తున్న విధానం వంటివి వచ్చే దశాబ్ద కాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఆ అ«ధ్యయనం అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో 4.4 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు వెళతారని గతంలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. తాజాగా యూఎన్డీపీ అన్ని కోణాల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషణ చేసి అదనంగా 20.7 కోట్ల మంది పేదరికంలోకి వెళతారని, కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మరో పదేళ్లు ఉంటుందని యూఎన్డీపీ అధ్యయనం అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత రంగాల్లో పెట్టుబడుల్ని పెంచితే 14.6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురావచ్చునని తెలిపింది. -
ప్రపంచానికి శనిలా పట్టుకుంది!
ఒక్కసారి పట్టుకుంటే ఏళ్ల పాటు వదలదని ఏలినాటి శనికి పేరు.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కూడా ఇంతే! ఏడాది కాలంలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి.. భవిష్యత్తులోనూ మానవాళికి అనేక రకాలుగా సమస్యగానే మిగిలిపోనుంది. ఆయు ప్రమాణాలను తగ్గించడం మాత్రమే కాదు.. కోట్ల మందిని పేదరికం కోరల్లోకి తోసేయనుంది! సాక్షి, హైదరాబాద్: రోగమొచ్చింది.. మందేసుకున్నాం.. తగ్గింది.. హమ్మయ్య.. ఇక ఏ చింతా లేదు! ఇప్పటివరకు ఏదైనా అనారోగ్యమొస్తే మనం ఆలోచించిన తీరిది.. కానీ కోవిడ్ విషయంలో ఈ ఆలోచన పూర్తిగా మారి పోతోందని అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారిలో కొంతమంది దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవలి కాలంలో నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ కారణంగా వచ్చే జబ్బుల ప్రభావం కొంతకాలం ఉంటుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కరోనా విషయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని.. కానీ కొన్ని కేసుల్లో దాని ప్రభావం మెదడు, గుండెలపై కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌లతో పోలిస్తే కరోనాలో తెలియని మిస్టరీలు చాలా ఉన్నాయి. (ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం) రోగ నిరోధక శక్తి తగ్గుదల, దీర్ఘకాలం పాటు నిస్సత్తువ, తలనొప్పితో పాటు గుండె, శ్వాస సమస్యలు కొనసాగుతాయి..’అని మేయో క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ పోలాండ్ అన్నారు. కోవిడ్ వ్యాధి కణస్థాయిలో జరిపే విధ్వంసం ఇందుకు కారణమవు తుందన్నది ఆయన అంచనా.. వీటితోపాటు కొంతమంది కండ రాలు, దగ్గు వంటి లక్షణాలూ కనపరచవచ్చు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి గుండె ఎక్స్‌రేలను పరిశీలించినప్పుడు కండరాలు దెబ్బతిన్నట్లు తెలిసిందని, ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లోనూ నష్టం ఎక్కువగా ఉందని మేయో క్లినిక్ జరిపిన పరిశోధనల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాకుండా.. రక్తంలో చిన్నసైజు ముద్దల్లాంటివి ఏర్పడతాయని, పెద్దసైజు వాటితో గుండెజబ్బులు వస్తే చిన్నవాటితో గుండెకు వెళ్లే చిన్న చిన్న ధమనులు మూసుకుపోతాయని చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో మాత్రమే కనిపిస్తుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.. (కరోనా: ఒకే ఇంట్లో ఐదురోజుల్లో ముగ్గురి మరణం) ఆయుః ప్రమాణాల తగ్గుదల వైద్య సదుపాయాలు పెరగటం, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయు ప్రమాణాలు పెరిగాయి. అయితే కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిన శ్రమ మొత్తం నీరు కారిపోనుంది. ఆయు ప్రమాణాలు భారీగా తగ్గనున్నాయని దాదాపు మూడు దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాకపోతే ఇది ఆయా దేశాల్లో వ్యాధి తీవ్రత, ప్రస్తుత ఆయు ప్రమాణం తదితర అంశాలపై ఆధారపడి ఉండనుంది. పీఎల్ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ బారిన పడ్డ వారు పది శాతం వరకు ఉంటే.. అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కొత్తగా పుట్టబోయే వారి ఆయుష్షు ఏడాది వరకూ తగ్గనుంది. షాంఘై యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్ (ఆస్ట్రియా), యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూకే) శాస్త్రవేత్తల ఈ అధ్యయనం ప్రకారం వ్యాధి తీవ్రత ఎక్కువున్న చోట్ల ఆయుష్షు 3 నుంచి 8 ఏళ్ల వరకు తగ్గవచ్చు. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది రెండు నుంచి ఏడేళ్లు.. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉండవచ్చు. (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) పెరగనున్న పేదరికం... ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్లుగా తగ్గుతున్న పేదల సంఖ్య కోవిడ్ కారణంగా ఇకపై పెరగనుంది. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది 8.8 నుంచి 11.5 కోట్ల మంది మళ్లీ కఠిన దారిద్య్రం బారిన పడనుండగా.. ఈ సంఖ్య వచ్చే ఏడాది చివరికల్లా 15 కోట్లకు పెరుగుతుంది. రోజుకు 2 డాలర్లు లేదా రూ.150 కంటే తక్కువ ఆర్జించే వారిని పేదలుగా గుర్తించి ప్రపంచబ్యాంకు ఈ అధ్యయనం నిర్వహించింది. కోవిడ్ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పేదల జనాభా 7.9 శాతంగా ఉండేదని, ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు అది 9.1 నుంచి 9.4 శాతం వరకు పెరగనుందని ఈ అధ్యయనం వివరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఆర్థిక వ్యూహాలతో ముందు కెళ్లాల్సి వస్తుందని తెలిపింది. ఇలా పేదరికం బారిన పడే వారిలో ఎక్కువ మంది ఇప్పటికే పేదరికం ఎక్కువున్న దేశాల్లోనే ఉండటం గమనార్హం. మధ్య ఆదాయ దేశాల్లోనూ గుర్తించదగ్గ స్థాయిలో ప్రజలు పేదలుగా మారతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. యుద్ధాల వంటి సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న దేశాల్లో కోవిడ్ గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మారిందని తెలిపింది. ఈ పరిణామం వల్ల 2030 నాటికి పేదల జనాభాను 7 శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని ప్రపంచబ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఇబ్బంది ఏర్పడనుంది. -
కోవిడ్ పేదలు వంద కోట్లు
న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం బారిన పడతారని, అందులోనూ దక్షిణాసియాలో భారీ స్థాయిలో పేదలుగా మిగులుతారని ఓ సర్వేలో తేలింది. కింగ్స్ లండన్ కాలేజీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ కలసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వే నివేదిక తాజాగా వెల్లడైంది. 100 కోట్ల మంది కలసి రోజుకు 50 కోట్ల డాలర్ల రాబడి కోల్పోతున్నారని నివేదిక పేర్కొంది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే దిగజారవచ్చని తెలిపింది. దక్షిణాసియాలో భారీగా పేదలు పెరగనున్నారని పేర్కొంది. భారత్, సబ్ సహారన్ ఆఫ్రికాలోనే పేదరికం 30 శాతం వరకూ ఉంటుందని నివేదిక వెల్లడించింది. తూర్పు ఆసియా, పసిఫిక్, చైనాలు కలిపి 41 శాతం పేదలకు ఆవాసాలుగా మారనున్నాయంది. అల్పాదాయ దేశాలైన నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇండోనేíసియాలు కలిపి 18 శాతం పేదరికాన్ని చవి చూస్తాయని అంచనా వేసింది. డీఆర్ కాంగో, టాంజానియా, పాకిస్తాన్, కెన్యా, ఉగాండా, ఫిలిప్పీన్స్ దేశాలు 11–12 శాతం పేదలకు కేంద్రాలుగా ఉంటాయని తెలిపింది. అత్యంత నిరుపేదలు ఉండే దేశాల్లో ఇథియోపియా, భారత్, నైజీరియా దేశాలు టాప్ 10లో ఉంటాయంది. -
కోవిడ్-19 ఎఫెక్ట్ : మరో 4.9 కోట్ల మంది పేదరికంలోకి..
న్యూయార్క్ : కోవిడ్-19 సంక్షోభంతో ఈ ఏడాది అదనంగా మరో 4.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఆహార భద్రతపై పెనుప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అంతర్జాతీయ ఆహార భద్రత కోసం అన్ని దేశాలు సత్వరమే పూనుకోవాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్ పిలుపుఇచ్చారు. సభ్య దేశాలు తక్షణమే చర్యలు చేపట్టని పక్షంలో అంతర్జాతీయ ఆహార అత్యవసర పరిస్థితి ఏర్పడి కోట్లాది పిల్లలు, వయోజనులపై దీర్ఘకాలం ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రపంచ జనాభా 780 కోట్ల మందికి పైగా ప్రజల ఆకలి తీర్చేందుకు సరిపడా తగినంత ఆహారం ప్రపంచం వద్ద ఉందని, అయినా ఇప్పుడు 82 కోట్ల మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని గుటెరస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది చిన్నారులకు ఆహారం అందుబాటులో లేదని, ఐదుగురు పిల్లల్లో ఒకరు క్షుద్భాద అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన ఆహార వ్యవస్ధలు విఫలం కాగా, కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చిందని ఆహార భద్రతపై ఐక్యరాజ్యసమితి విధానంపై గుటెరస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల్లో తగినన్ని ఆహార నిల్వలున్నా ఆహార సరఫరా వ్యవస్ధల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. వైరస్ మహమ్మారి నిరోధానికి ప్రపంచ దేశాలు కార్యాచరణకు పూనుకోవాలని అన్నారు. ఆహార భద్రత కొరవడిన దేశాలకు ఆహారం అందుబాటులోకి తీసుకువచ్చేలా దేశాలు చొరవచూపాలని కోరారు. చిన్నారులకు పోషకాహారం అందుబాటులో ఉంచాలని అన్నారు. చదవండి : కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం -
ఉపాధి పెంచే పెట్టుబడులు రావాలి
ఆర్థికంగా పురోగమించడంతో గడిచిన 20 ఏళ్లలో 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని... కరోనా వైరస్ కారణంగా ఎందరో పేదలు, వలస కార్మికులు మళ్లీ దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదం కనిపిస్తోందని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ పరిస్థితిని నివారించే అవకాశం ఉందన్నారు. ‘‘కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచదేశాలు తమ తయారీ వ్యవస్థల కోసం చైనా వెలుపలికి చూస్తున్నాయి. దీన్ని భారత్ అందిపుచ్చుకోవాలి’’ అని చెప్పారు. ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధితో ఆర్థికాంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారాయన. ఆ వివరాలివీ... ► కోవిడ్‌తో తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి బ్రేకులు పడొచ్చనే అంచనాలున్నాయి. అలా బయటకు వచ్చే సంస్థలు ఇండియావైపు చూసే అవకాశం ఉందా? కరోనా మహమ్మారితో మన ఆర్థికవ్యవస్థ కూడా బాగా దెబ్బతినేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నా... ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థ మనకు లేదు. ధనికులు ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు కానీ రోజు కూలీలు చాలామంది ఎంతో దుర్భర స్థితిని ఎదుర్కొంటారు. వచ్చే రెండేళ్లలో భారీ పెట్టుబడులు గానీ రాకపోతే పెద్ద ఎత్తున జనం దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదముంది. చైనాపై ఇతర దేశాలకు నమ్మకం తగ్గుతోంది. అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన జపాన్... తమ కంపెనీలు చైనా నుంచి బయటకు వస్తే ప్రోత్సాహకాలిస్తోంది. ఇక అమెరికా ఇంతకన్నా ఎక్కువే చేయొచ్చు. అప్పుడు చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంతైనా ఇక్కడకు తరలిస్తే మనకు కలిసొస్తుంది. మన దేశానికి భౌగోళికంగా ఎన్నో అనుకూలతలున్నాయి. ఆయా దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ల పెట్టుబడులు ఇక్కడ సురక్షితమనే భావన కలిగించటం ముఖ్యం. ► చైనా వదిలి రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? చైనాలో 300కు పైగా విదేశీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో కొన్నయినా బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తాయి. అదే జరిగితే దాదాపు 150 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోతాయి. వాటిలో కొంతయినా వచ్చే రెండేళ్లలో ఇక్కడికి వస్తే ఉపాధి గురించి ఆందోళన ఉండదు. కాకపోతే దీనికోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థల నుంచి గట్టి ప్రయత్నాలు జరగాలి. అధికార పరమైన అడ్డంకులు లేకుండా, భూమి, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు.. అన్ని రకాల ఆమోదాలను ఒకే వేదికపై అందించే ఏర్పాట్లుండాలి. ► రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాలంటారా? రాష్ట్రాలు ఇలాంటి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా చట్టపరమైన మార్పులు తేవాలి. పరిశ్రమలన్నీ ఒకే చోట కాకుండా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తరించాలి. దేశంలో వచ్చే పదేళ్లలో 20 కోట్ల మంది ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అదే జరిగితే నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అందుకే వ్యాపారాలు నగరాల్లోనే కేంద్రీకృతం కాకూడదు. మన న్యాయవ్యవస్థలో జాప్యం ఎక్కువ కనుక భారీగా పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాజ్యాల నుంచి కనీసం ఐదేళ్ల వరకైనా రక్షణ కల్పించాలి. ► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరైనదేనా? వలస కార్మికులు, పేదలకు ఇంకా ఏం చేయాలి? రాజకీయ ఉద్యమాలతోనో, మిలిటరీ బలంతోనో దేశం అభివృద్ధి చెందదని అర్థం చేసుకోవాలి. వ్యాపారాభివృద్ధితోనే ఇది సాధ్యం. దురదృష్టవశాత్తు దేశంలో సోషలిస్టు భావాలున్న శక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు ఏ ఆర్థిక సాయం చేసినా... ‘ధనికులు మరింత ధనికులు అవుతున్నారు’ అంటూ వీళ్ళు మాట్లాడతారు. డబ్బులివ్వడం ద్వారా పేదవారిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకురాలేం. సరైన పరిశ్రమలతోనే ఇది సాధ్యం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కావాలి. అందరికీ గౌరవప్రదమైన జీవన భృతి దొరికేది అప్పుడే. (సాక్షి, బిజినెస్ ప్రతినిధి) -
ఇది పేదరికానికి సూచిక!
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ వస్తువులను వాడటంలో వినియోగదారుల డిమాండ్‌కు సంబంధించి జాతీయ గణాంక సంస్థ (ఎన్ఎస్ఓ) ఓ సర్వేను విడుదల చేసింది. సర్వే ప్రకారం గత నలబై ఏళ్లుగా ఎన్నడు లేని విధంగా గ్రామీణ డిమాండ్ పడిపోయిందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం (2011-12) ప్రతి నెలలో 1,501రూపాయలు ఖర్చు చేసేవారని, కానీ ప్రస్తుతం (2017-2018) సర్వే ప్రకారం 3.7శాతానికి తగ్గి 1,446 రూపాయలు ఖర్చు చేస్తున్నారని నివేదిక తెలిపింది. ఈ నివేదికలు రూపొందించడానికి (2009-10)ను ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపిసిఇ) (2011-12)లో 13శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మరోవైపు గ్రామాల్లో వినియోగదారుల వ్యయం 2018సంవత్సరంలో 8.8శాతం తగ్గగా.. నగరాల్లో 2శాతం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ మార్కెట్ డిమాండ్ తగ్గడమనేది దేశంలో పెరుగుతున్న పేదరికానికి సూచిక అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పేదరిక పాట్లు.. నిరక్షరాస్య చీకట్లు
పేదరికం వారి బతుకుల్ని నాగరిక సమాజానికి దూరం చేసింది. బుక్కెడు బువ్వ పెట్టే నేల తల్లిని నమ్ముకుంటే.. వాన చినుకు రాలక బతుకులు ‘సుగ్గి’(వలస) పాలయ్యాయి. బతికేందుకు దారిలేని దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న వారికి తమ జీవితాల్ని అక్షరం మారుస్తుందన్న నమ్మకం లేకపోయింది. దాంతో చదువుకూ దూరమయ్యారు. భూస్వాములు దోపిడి, పాలకుల అలసత్వంతో అలముకున్న పేదరికం, నిరక్షరాస్యత ఆ పేద జీవితాల్లో మరింత చీకటి నింపింది. అందుకే మూఢనమ్మకాలు, కట్టుబాట్లే జీవితంగా మార్చుకుని వెనుకబాటుతనానికి అలవాటుపడిపోయారు. మగపిల్లాడు పుడితే సమాజంలో గౌరవంగా చూస్తారనే అమాయకత్వంతో అబ్బాయి కోసం ఎంతమంది ఆడపిల్లల్నైనా కనేలా ఒత్తిడి చేస్తారు. పురిట్లోనే ఎందరో తల్లీబిడ్డలు ప్రాణాలు పోతున్నా.. కట్టుబాట్ల ప్రసవాలతో ఆడవాళ్లను ఆస్పత్రి గడప తొక్కనీయరు. మగబిడ్డ కోసం ఎంత మంది ఆడపిల్లల్నైనా పుట్టించుకునే కుటుంబాలు... అప్పటికీ అబ్బాయి పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమయ్యే మగవాళ్లు.. పిల్లల్ని బడికి పంపడం కంటే కూలికి తీసుకెళ్లడమే వాళ్లకు తెలిసిన నాగరికత. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగూరు, ఆలూరు ప్రాంత పల్లెల్లో దుర్భర పరిస్థితులకు కారణాలు అన్వేషించేందుకు ‘సాక్షి’ బృందం ఆ గ్రామాల్లో పర్యటించింది. మొగిలి రవివర్మ, సాక్షి, కర్నూలు: ఆదోని డివిజన్లోని ఈ పల్లెల దుస్థితిపై మా బృందం అనేక మందిని ప్రశ్నించగా.. ‘కౌతాళం మండలంలోని గోతులదొడ్డి, రౌదూరు గ్రామాలతో పాటు మరికొన్ని ఫ్యాక్షన్ పల్లెల్లో పొట్టేలు మాంసం, మద్యం ఇస్తే హత్యలకు తెగించేవారున్నారు. ఇదంతా పేదరికం వల్ల వచ్చిన దుస్థితి’ అని చెప్పుకొచ్చారు. ఆదోని డివిజన్లోని ఎక్కువ శాతం పల్లెల్లో ఊరినిండా పేదరికం. చేద్దామంటే చేతినిండా పనుండదు. బతకాలంటే వలస పోవాల్సిందే. వర్షాధార పంటలు పండక చుట్టుముట్టిన పేదరికం. వారి బతుకులు ఇంత దారుణంగా ఉండడానికి నిరక్షరాస్యత మరో ప్రధాన కారణం. ఆదోని డివిజన్లోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని నియోజకవర్గాలలోని పల్లెల్లో పర్యటించినప్పుడు.. ఇప్పటికీ ఇలాంటి పల్లెలు ఉన్నాయా! అనిపిస్తుంది. ఉండేందుకు సరైన ఇళ్లు లేవు. పారిశుద్ధ్యంపై అసలు అవగాహన లేదు. కర్ణాటక సరిహద్దులో ఈ గ్రామాలు విసిరేసినట్లుంటాయి. పేదరికంతో చిన్నాభిన్నం ఈ ప్రాంతంలో జనాభా ఎక్కువ! భూమి తక్కువ. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండల జనాభా (2011 ప్రకారం) 69,275 మంది. మండలంలోని వ్యవసాయభూమి 45వేల ఎకరాలు మాత్రమే! ఈ ప్రాంతంలో వ్యవసాయమంటే వర్షాధారమే. సాగునీటి వనరులు అతి తక్కువ! వర్షం వస్తే వేరుశనగ సాగు చేస్తారు. లేదంటే ఆ ఏడాది పంటల్లేక, కూలీ పనులు దొరక్క వలస పోవాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. ఒక్కోసారి పదేళ్లలో 7–8 ఏళ్లు వర్షమే ఉండదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరు, సేలం, గుంటూరుకు వలస పోతారు. ఇప్పటికీ పూరిగుడిసెలు, ప్లాస్టిక్ కవర్లు, నాలుగు రాతి బండల మధ్య ఇళ్లుగా జీవిస్తున్న కుటుంబాలు ప్రతీ పల్లెలో పదుల సంఖ్యలో కన్పిస్తాయి. దొరల పెత్తనంతో దుర్భరం ఇక్కడ దొరల పెత్తనం ఎక్కువ! 30 ఏళ్ల క్రితం వరకూ ఈ పల్లెలన్నీ వారి కనుసన్నల్లోనే నడిచాయి. అన్ని రకాల అరాచకాలు, ఆకృత్యాల వల్ల వీరి బతుకులు మరింత దుర్భరంగా మారాయి. ప్రజలు అక్షరం నేరిస్తే అక్రమాలపై తిరుగుబాటు చేస్తారనే దుర్మార్గపు ఆలోచనలతో టీచర్లను బడికి వెళ్లకుండా అడ్డుకునేవారు. టీచర్లు దొరల ఇంటికెళ్లి సంతకం చేసి, వారి ఇంట్లో సాయంత్రం వరకూ ఉండి వెళ్లిపోవాలి. దీంతో ‘అక్షర వెలుగులు’ ఆ పల్లెల్ని సోకలేదు. ఈ ప్రాంతంలో దేశ ఆర్మీకి మందుగుండు సామగ్రి, తుపాకులు, ట్యాంకర్లు తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్రం గతంలో ప్రకటించింది. ఉపాధి దొరికితే ప్రజలు ఆర్థికంగా బలపడతారని, దాంతో తమ ఆధిపత్యం పోతుందనే దుర్భుద్దితో ఆ ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఇలా ఎన్నో కారణాలతో ఈ ప్రాంతం చాన్నాళ్లు పేదరికం, నిరక్షరాస్యతతో మగ్గిపోయింది. కోసిగి మండలంలో అక్షరాస్యత కేవలం 28.4 శాతమే. నిరక్షరాస్యతలో దేశంలో మూడోస్థానంలో ఉంది. 40 శాతం కంటే తక్కువ ఉన్న మండలాలు కర్నూలు జిల్లాలో 10 వరకూ ఉన్నాయి. చిన్నారులకు శాపం.. మేనరిక వివాహాలు ఆదోని డివిజన్ ప్రాంతంలోని పిల్లల్లో అంగవైకల్యం ఎక్కువగా ఉండడం మేం చూశాం. దానిపై అధికారుల్ని ఆరాతీస్తే.. ఆ కుటుంబాల్లో మేనరిక వివాహాలు ఎక్కువ కావడంతో పిల్లల్లో దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఒకే ఇంట్లో నాలుగైదు తరాలుగా మేనరిక వివాహాలు చేసుకున్నవారూ ఉన్నారు. మేనరికం వల్ల పిల్లల్లో దుష్పరిణామాలు వస్తాయన్న అవగాహన కూడా వారికి లేదు. తరాలు మారుతున్నా కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు వీరిని సామాజికంగా, ఆర్థికంగా ముందడుగు వేయకుండా చేశాయి. అందుకు ఒక ఉదాహరణ మూడేళ్ల చిన్నారి ఉష.. కోసిగి మండలం జుమ్మాలదిన్నెలో అమల ప్రవల్లిక కూతురు ఉషా(3)కు లివర్వాపు వ్యాధి సోకింది. కర్నూలులో చూపిస్తే నయం కాలేదు. చివరకు నంద్యాలలో చూపించారు. మూడేళ్ల పాప కేవలం 8కిలోల బరువు మాత్రమే ఉంది. ఇటీవల 1.5 కిలోలు పెరిగింది. ఎందుకని ఆరా తీస్తే మేనరిక వివాహం. అమల తల్లిది మేనరికమే. మగపిల్లల కోసం రెండో పెళ్లికి సిద్ధం కోసిగి, కౌతాళం, మంత్రాలయం మండలాల్లో ఆర్డీటీ(రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు) స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మగపిల్లాడి కోసం దాదాపు 10 మంది ఆడపిల్లల వరకూ కనే కుటుంబాలు, ఆడపిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్న మగవాళ్లున్న కుటుంబాలు 454 వరకూ ఉన్నట్లు తేల్చారు. ‘మగపిల్లాడు పుడితే వంశం నిలుస్తుంది. కొడుకుంటే సమాజంలో గౌరవం’ అని మూఢనమ్మకం కట్టుబాటుగా అమలవుతోంది. అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని ఆస్పత్రుల్లో చూపించాలనే కనీస అవగాహన కూడా వారికి లేదు. జబ్బు చేస్తే ఆస్పత్రులకు ఎందుకు వెళ్లడం లేదని కొన్ని కుటుంబాల్ని మేం ప్రశి్నంచగా.. ‘ఆస్పత్రికి వెళ్లం.. అది మా కట్టబాటు’ అన్న సమాధానం వచ్చింది. అబ్బాయిలు బడికి.. అమ్మాయిలు కూలికి మగబిడ్డను బడికి పంపిస్తారు. ఆడపిల్లలైతే కూలికి తీసుకెళ్తారు. ఇదేంటని కొందరి తల్లులను ఆరా తీస్తే ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా! కూలికి పోతే నూటేబై వత్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అని చెప్పుకొచ్చారు. కొందరు ఆడపిల్లలు ఇంటివద్దే వారి చెల్లెళ్లకు కాపలా ఉంటారు. కోసిగి, వాడి రైలులో రేనిగాయలు అమ్ముతున్న బాలిక ఒకరికోసం ఒకరు ఇంటివద్దే.. జుమ్మాలదిన్నెకు చెందిన శ్రీదేవికి ఐదుగురు ఆడపిల్లలు. మగపిల్లవాడి కోసం ఐదుగురు ఆడపిల్లల వరకూ వేచిచూశారు. వారిలో ఒక్కరూ బడికి వెళ్లడం లేదు. ఎందుకని మా బృందం ప్రశ్నిస్తే.. ‘ రెండో అమ్మాయి కోసం పెద్దపాప నాగవేణిని ఇంటివద్దనే ఉంచాం. మూడో పాప కోసం రెండో అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టి పెద్దమ్మాయిని మాతో తీసుకెళ్లేవాళ్లం. అలా ఒకరి కోసం మరొకరిని ఇంటి వద్దే ఉంచాం. దీంతో ఎవరూ బడికెళ్లలేదు.’ అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. ఆర్థికంగా చేయూతనివ్వాలి ఈ ప్రాంతంలో పేదరికం వల్ల పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక అమ్మాయిల విషయంలో పూర్తి వివక్ష కొనసాగుతోంది. ఆర్థికంగా చేయూత అందితే అప్పుడు చదువుకోవాలన్న ఆసక్తి పెరగడంతో పాటు ఆడపిల్లలపై వివక్ష తగ్గుతుంది. ఈ విషయంలో అందరూ నడుం బిగించి ఆ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడిబాట’ వంటి వాటితో కొంత ప్రయోజనం ఉండవచ్చు. – లక్ష్మణ్ రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆదోని డివిజన్‌ను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించాలి రాష్ట్రంలోనే ఆదోని విద్యాపరంగా వెనుకంజలోఉంది. ఇప్పటికీ పాత భావాలే చలామణిలో ఉన్నాయి. మూఢనమ్మకాలు ఎక్కువ. ఆడపిల్లలంటే చిన్నచూపు. ఆధునిక వైద్యంపై విశ్వాసం లేదు. ఇక్కడ భారీ ఎత్తున చైతన్యం, ఆడ, మగ ఒక్కటే అనే ఉద్యమం తీసుకురావాలి. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మూఢనమ్మకాల నిర్మూలనకు చైతన్యం కలిగించాలి. ఆ ప్రాంతాన్ని స్పెషల్జోన్గా పరిగణించి చర్యలు తీసుకోవాలి. – గేయానంద్, జనవిజ్ఞాన వేదిక -
సంక్షేమరాజ్య భావనకు నోబెల్ పట్టం
ప్రపంచ పేదరిక సమస్యను పరిష్కరించే మార్గాలను అన్వేషించడంలో వినూత్న పద్ధతుల్లో ఆలోచించిన ముగ్గురు ఆర్థిక చింతనాపరులకు ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించడం ముదావహం. ప్రపంచ పేదరిక సమస్య తాలూకు ప్రశ్నలను మరింత సరళమైన, నిర్దిష్టమైన రూపంలోకి వడకట్టి, తద్వారా పరిష్కారాన్ని సూచించే కృషిని చేశారనేది వారికి వస్తున్న ప్రశంస. భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రభుత్వాలు, తమ పరిమిత వనరులను చీకట్లో రాయి విసిరినట్లు గుడ్డిగా తమకు తోచిన విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కాకుండా, ఆ నిధులను కచ్చితమైన ఫలితాలను ఇచ్చే పద్ధతుల పైన వాడవచ్చు అని వీరి భావన. నిత్య జీవితంలో విద్య, వైద్యం వంటి రంగాల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం మనం అంతకుముందర ఆలోచించి ఉండని పరిష్కారాలను వారు ముందుకు తెచ్చారు. 2019 సంవత్సరానికి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ముగ్గురు ఆచార్యులు కలిసి గెలుచుకున్నారు. వారిలో భారత సంతతి అమెరికా జాతీయు డైన అభిజిత్ బెనర్జీ, ఆయన సహచరి ఎస్తర్ డఫ్లో, హార్వర్డ్ విశ్వ విద్యాలయ ఆచార్యుడు మైకెల్ క్రెమర్‌లు ఉన్నారు. అమర్త్యసేన్ తరువాత ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న రెండవ భారతీయునిగా అభిజిత్ నిలిచారు. అయితే ప్రపంచ పేదరిక సమస్య పరిష్కారానికి అభిజిత్ సూచించిన పరిష్కారాలు మాత్రమే సరైన ఫలితాలను ఇస్తాయని భావించపనిలేదు. ఆర్థిక అసమానత్వంపై విస్తృత పరిశోధనలు చేసిన ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్ పికెట్టీ సూచిం చిన పరిష్కార మార్గాలు కూడా జోడిస్తే వ్యవస్థాగత మౌలిక మార్పు లకు దోహదపడతాయి. అర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఈ ముగ్గురి పరిశోధనలూ ప్రధానంగా ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని నోబెల్ అకాడమీ పేర్కొంది. ప్రపంచ పేదరిక సమస్యను అర్థం చేసుకుని, పరిష్కరించేందుకు గాను వీరు ఆ సమస్య తాలూకు ప్రశ్నలను మరింత సరళమైన, నిర్దిష్టమైన రూపంలోకి వడకట్టి, తద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని సూచించే కృషిని చేశారనేది వారికి వస్తున్న ప్రశంస. అలాగే పేదరి కానికి సంబంధించి ఈ సరళీకరించిన, నిర్దిష్ట ప్రశ్నలకు ప్రయోగా త్మక పద్ధతిలో పరిష్కారాలు కనుగొనేందుకు వీరు ప్రయత్నించారు. ఈ పరిశోధనల కోసం తమ విశ్వవిద్యాలయం ఎమ్.ఐ.టి లో వీరు ‘పేదరిక (పరిష్కార) కార్యాచరణ ప్రయోగశాల’ను ఒకదానిని 2000 సంవత్సరం ప్రాంతంలో ఏర్పరిచారు. ఈ పరిశోధనలో వీరు తాము ఎంచుకున్న ఒక పేదరిక అంశానికి లేదా సమస్యకు పరిష్కార పద్ధతిని రెండు బృందాల ద్వారా పరీక్షించేవారు. వాటిలో ఒక బృందంపై ఈ పరిష్కార పద్ధతిని అమలు జరిపేవారు. రెండవ బృందాన్ని ఈ పద్ధతి నుంచి మినహాయించే వారు. అంటే ఇది ఒక రకంగా ఫార్మా రంగంలోని క్లినికల్ ట్రయిల్స్ ప్రయోగ పద్ధతి వంటిది. తద్వారా వారు ఒక నిర్దిష్ట పేదరిక సమస్యకు తాము సూచి స్తోన్న పరిష్కార పద్ధతి సామర్థ్యాన్నీ పరీక్షించేవారు. ఈ విధంగా కనుగొన్న పరిష్కారం ద్వారా నిధుల కొరత అధి కంగా ఉన్న భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రభు త్వాలు, తమ పరిమిత వనరులను చీకట్లో రాయి విసిరినట్లు గుడ్డిగా తమకు తోచిన విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కాకుండా, ఆ నిధులను కచ్చితమైన ఫలితాలను ఇచ్చే పద్ధ తులపైన వాడవచ్చు అనేది ఈ ఆర్థికవేత్తల వాదన. ఈ విధంగా, ఎమ్.ఐ.టి.లోని ప్రయోగశాలలో అభిజిత్, ఎస్తర్లు జరిపిన పరిశోధ నలూ, ఈ పరిశోధనా పద్ధతిని మైకెల్ క్రెమర్, కెన్యా దేశంలోని పాఠ శాలలలో పరీక్షించడం ద్వారానూ కనుగొన్న పేదరిక నిర్మూలన పద్ధతులు కొన్నింటిని పరిశీలిద్దాం. ఈ ప్రయోగ పద్ధతులను వారు ప్రధానంగా విద్య, వైద్య రంగా లలో కేంద్రీకరించారు. విద్యారంగంలో ఈ పద్ధతులను అనుసరిం చడం ద్వారా భారత్, ఆఫ్రికాలలో 60 లక్షలమంది పిల్లలకు మెరుగైన విద్య ద్వారా ప్రయోజనం చేకూరిందనేది ఒక అంచనా. కాగా, వీరి సూత్రీకరణల ప్రకారంగా పాఠశాలల విద్యార్థులకు మరిన్ని పాఠ్య పుస్తకాలూ, ఉచిత భోజనాలను అందించడం కంటే, చదువులో వెను కబడిన విద్యార్థులకు నిర్దిష్టంగా అదనపు ట్యూషన్ వంటి సాయం అందించడం ద్వారా, మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయి. అలాగే, పిల్లలకు వారి కడుపులోని నులిపురుగులను నిర్మూలించే ఔషదాన్ని ఇవ్వడం అనే అతి చిన్న చర్య ద్వారా వారి ఆరోగ్యంలో మెరుగుదలా, వారి పాఠశాల హాజరును మెరుగుపరచడం సాధ్యం అయ్యాయని వారు చెబుతారు. ఇక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు బోధిం చాల్సిన విద్యార్థుల సంఖ్య, ఒక పరిమితిని మించితే దాని వలన విద్యా బోధన నాణ్యత పడిపోతుందనేది మనం నేటి వరకు నమ్ము తోన్న అంశం. కాగా, ఇది పూర్తిగా సరైనది కాకపోవచ్చుననీ, ఈ విధంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించే యత్నం కంటే, విద్యార్థులకు మంచి గ్రేడ్లు వచ్చేలా బోధించగలిగితేనే, ఆ ఉపా ధ్యాయునికి బోధనా కాంట్రాక్ట్‌ను పాఠశాల పొడిగించే విధానం మంచిదనేది ఈ నోబెల్ పరిశోధకుల తర్కం. స్థూలంగా, ‘‘పరిమిత’’ వనరులు వున్న భారత్ వంటి దేశాలకు పేదరిక నిర్మూలనకుగాను ఈ లక్షి్యత పరిష్కార చర్యలు మంచి దనేది ఈ ఆర్థికవేత్తల తర్కం. కాగా, నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశా లలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఆదేశిత పొదుపు చర్యలు అమలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ చర్యలలో భాగంగా వివిధ ప్రభుత్వాలు తమ తమ దేశాల విదేశీ అప్పులను తీర్చగలిగేటందుకు గాను తమ దేశాలలోని సామాన్య ప్రజలకు కల్పించే సంక్షేమ పథ కాలపై కోతలు పెడుతున్నాయి. అలాగే, వ్యయాల తగ్గింపులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను కుదించడం, కొత్తగా ఉద్యో గులను భర్తీ చేయకపోవడం, ఉద్యోగుల పింఛను సదుపాయం వంటి వాటిని కుదించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇటువంటి చర్యలకు పెట్టిన పేరే ‘‘సంస్కరణలు’’. కాగా, ఈ సంస్కరణలలో ఆయా దేశాల కార్పొరేట్లకూ, ధన వంతులకూ ఇచ్చే రాయితీలను పెంచుతూ పోవడం కూడా అంతర్భా గమే. ఉదాహరణకు, మన దేశంలో కూడా కార్పొరేట్లపై విధించే పన్నును తగ్గించడం... మరోవైపు, ద్రవ్య లోటును తగ్గించుకొనే పేరిట వంట గ్యాస్ సబ్సిడీ, కిరోసిన్ సబ్సిడీ, పంపిణీ వ్యవస్థ సబ్సి డీలు వంటి వాటిపై కోతలు వేస్తూ పోవడం వంటివన్నీ తెలిసినవే. ఇటువంటి విధానాల పలితంగా నేడు మన దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొని వుంది. ఈ విషయాన్ని అభిజిత్ కూడా అనేక దఫాలు ప్రస్తావించారు. అలాగే గత వారం అమెరికాలోని బ్రౌన్ విశ్వ విద్యాలయంలో తాను చేసిన ఓ.పి జిందాల్ ఉపన్యాసంలో, భారత దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ స్థితికి సూచించిన పరిష్కారాలలో ముఖ్యమైనవి ప్రజల చేతిలోకి డబ్బు చేరేలా చూడటం, జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెంచడం, రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వడం వంటివన్నీ ఉన్నాయి. కాగా, ఈ పరిష్కారాలు అన్నీ ప్రస్తుతం అమలు జరుగుతోన్న పొదుపు చర్యలకు భిన్నంగా, ప్రభు త్వం మరింతగా వ్యయాలు పెంచడంతో కూడినవి. అయితే అభిజిత్‌తోపాటు ఈ ఏడాది ఆర్థికరంగంలో నోబెల్ గ్రహీతలకు ఆ బహుమతిని తెచ్చిపెట్టింది, నేడాయన భారత ఆర్థిక వ్యవస్థలోని మాంద్య స్థితి పరిష్కారానికి సూచించిన పై స్థూల ఆర్థిక పరిష్కారాలు కాదు. అభిజిత్, ఆయన సహచరులు తమ దృష్టిని ప్రధానంగా ఆర్థిక రంగం తాలూకు.. అందులోనూ ముఖ్యంగా విద్య, వైద్యరంగాలలోని సూక్ష్మ అంశాలపై కేంద్రీకరించారు. అత్యంత కేంద్ర స్థాయిలో తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకునే సమస్యలూ, వారి రోజువారీ పాఠశాల హాజరు, విద్యార్థుల విద్యార్జనపై వారి ఆరోగ్య ప్రభావం వంటి ప్రజల జీవితాల తాలూకు నిర్దిష్ట, అత్యంత సూక్ష్మ అంశాలపై వారు తమ పరిశోధనలను కేంద్రీకరించారు. తద్వారా, నిత్య జీవితంలో విద్య, వైద్యం వంటి రంగాల్లో తలెత్తు తున్న సమస్యలను పరిష్కరించేందుకుగాను మనం అంతకుముందు ఎన్నడూ ఆలోచించి ఉండని పరిష్కారాలను వారు ముందుకు తెచ్చారు. కాగా, ప్రభుత్వాల ఆర్థిక విధానాలూ, అవి ఆర్థిక వ్యవస్థ యాజ మాన్యంలో అనుసరించే భిన్నమార్గాలు అనేవి అభిజిత్ ఆయన సహ చరుల దృష్టిని కేంద్రీకరించిన సూక్ష్మస్థాయి అంశాలను ప్రభావితం చేసేవిగా ఉండగలవు. ఉదాహరణకు ప్రభుత్వ విధానాలు మారి, కార్పొరేట్లకు, ధనికులకు పన్నురాయితీలూ సబ్సిడీలు ఇవ్వడం కాకుండా వారిపై మరింతగా పన్నులు విధించడం వంటిది చేయ గలిగితే ప్రభుత్వ ఖజానాకు అదనపు నిధులు సమకూరుతాయి. ఆ స్థితిలో, నిధుల కొరత పరిస్థితుల్లో ఆమలు జరప వీలైనవిగా అభిజిత్, ఆయన సహచరులు చెప్పిన సూక్ష్మస్థాయి విధానాలకే ప్రభు త్వాలు పరిమితం కానవసరం ఉండదు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యానికి, అభిజిత్ సూచించిన పైన పేర్కొన్న పరిష్కార మార్గాల అమలుకు కావల్సిన వనరులు ప్రభుత్వం వద్ద ఉంటాయి. కాబట్టి అభిజిత్‌కు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టిన విద్యా, వైద్య రంగా లలోని ప్రభావవంతమైన సూక్ష్మస్థాయి కార్యాచరణతోపాటుగా ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రపంచంలోని ఆర్థిక అసమానతలపై విస్తృత పరిశోధనలు చేసిన థామస్ పికెట్టీ వంటి వారు సూచించిన, వ్యవస్థా గతంగానే మౌలిక మార్పులను తెచ్చే విధానాలు కూడా నేటి తక్షణ అవసరం.. ఆగత్యం కూడా..!! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ మొబైల్ : 98661 79615 -
ఆకలి భారతం
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి తీవ్రత పెరిగింది. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం అట్టడుగు స్థానానికి చేరువలో ఉన్న ట్టు అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. 2019 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 117 ప్రపంచ దేశాల్లో మన దేశం 102వ స్థానానికి దిగజారిందని వెల్లడించింది. మనకన్నా పేదరికంలో ఉన్న, అత్యంత వెనుకబడి ఉన్న దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకన్నా మనదేశం వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మన్ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా తయారుచేసిన ఈ నివేదిక భారత్‌లో ఆకలి తీవ్రమైందని హెచ్చరించింది. దేశంలోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు ఎత్తుకు తగ్గ బరువు లేరని, ఇతర దేశాలకంటే అతి తక్కువ బరువుతో ఉన్నారంది. 2008–12 మధ్య బరువు తక్కువ ఉన్న పిల్లల శాతం దేశంలో 16.5 శాతం ఉండగా, 2014–18కి మధ్య 20.8 శాతానికి దిగజారింది. 2030 కల్లా ఆకలిని జయించేవైపు దేశం కృషి చేస్తోందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2000 సంవత్సరంలో మొత్తం 113 దేశాల్లో భారత్ 83 స్థానంలో ఉండగా, 2018లో మొత్తం 119 దేశాల జాబితాలో 103 స్థానంలో ఉంది. నాలుగు అంశాల ఆధారంగా రేటింగ్... గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కేటగిరీలో మన దేశం 30.3 స్కోరుతో ఉంది. ఈ స్కోరుని నాలుగు సూచీలపై ఆధారపడి నిర్ణయిస్తారు. పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉండడం, వయసుకి తగ్గ ఎత్తు ఎదగకపోవడం, శిశు మరణాలు. నివేదిక ముఖ్యాంశాలు ► దేశంలో కేవలం 6 నుంచి 23 నెలల మధ్య వయసున్న వారిలో 9.6 శాతం మందికి మాత్రమే ‘కనీస ఆహార అవసరాలు’తీరుతున్నాయి. ► భారత్‌లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన జరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందనీ, దానివల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయంది. ► బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ సహా మొత్తం 17 దేశాలు ఈ సూచీలో 5 కన్నా తక్కువ ర్యాంకుతో ఉన్నత స్థానంలో ఉన్నాయి. ► నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే, తీవ్రమైన వాతావరణ మార్పులతో సతమతమౌతోన్న యెమన్, జిబౌటి దేశాలు సైతం భారత్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. ► పొరుగు దేశాలైన నేపాల్(73), శ్రీలంక(66), బంగ్లాదేశ్(88), మయన్మార్(69), పాకిస్తాన్ (94) స్థానంలో ఉండి ఆకలి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. ► చివరకు చైనా (25) సైతం భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉంది. -
ఆకలి సూచీలో ఆఖరునే..
న్యూఢిల్లీ : అభివృద్ధిలో మున్ముందుకు సాగుతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ఇంకా నేలచూపులు చూస్తూనే ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 117 దేశాలకు గాను భారత్ 102వ స్ధానంలో చిట్టచివరి దేశాల సరసన చేరింది. ఆకలి కేకలతో అలమటిస్తున్న 45 దేశాల్లో భారత్ ఒకటని ఈ నివేదిక తేల్చింది. ఈ సూచీలో భారత్ ర్యాంకింగ్ క్రమంగా దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా ర్యాంకింగ్‌తో దక్షిణాసియాలో పాకిస్తాన్ (94), బంగ్లాదేశ్ (88), శ్రీలంక (66)ల కన్నా భారత్ వెనుకబడింది. 2014లో హంగర్ ఇండెక్స్‌లో 77 దేశాల్లో భారత్ 55వ స్దానంలో నిలిచింది. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భారత్‌తో పోలిస్తే దక్షిణాసియాలో నేపాల్, బంగ్లాదేశ్‌లు మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. క్షుద్బాధను సమర్ధంగా తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఈ సూచీని రూపొందిస్తారు. ఆకలి సమస్య తీవ్రంగా పట్టిపీడిస్తున్న 45 దేశాల్లో భారత్ ఒకటని వెల్త్హంగర్లైఫ్ అండ్ కన్సన్ వర్డ్ల్వైడ్ సంస్థ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఆరు నుంచి 23 నెలల చిన్నారుల్లో కేవలం 9.6 శాతం మందికే సరైన మోతాదులో ఆహారం అందుతోందని పేర్కొంది. 2015-16లో 90 శాతం గృహాలకు మెరుగైన తాగు నీరు లభించినా, 39 శాతం మంది గృహస్తులకు పారిశుద్ధ్య సదుపాయాలు లేవని నివేదిక వెల్లడించింది. మరోవైపు భారత్‌లో ఇంకా బహిరంగ మల విసర్జన ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొంది. -
పేదరికంపై పోరుకు పురస్కారం
అత్యంత సంక్లిష్టమైన అంశంగా, ఓ పట్టాన కొరుకుడుపడని విషయంగా దేన్నయినా చెప్పదల్చు కున్నప్పుడు దాన్ని రాకెట్ సైన్స్‌తో పోలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ పేదరిక నిర్మూలన అంశం ఇప్పుడు రాకెట్ సైన్స్‌లాగే తయారైంది. ఆర్థికాభివృద్ధిని సాధించే సమాజాలు సైతం సంక్షోభాల్లో చిక్కుకోవడం, పేదరికం మటుమాయం కాకపోవడం, బలమైన ఆర్థిక వ్యవస్థ లనుకున్నవి బీటలువారుతుండటం, బడా సంస్థలు సైతం నేలమట్టం కావడం... ఇవన్నీ సంపన్న దేశాలు మొదలుకొని సాధారణ దేశాల వరకూ అన్నిటినీ కలవరపరుస్తున్నాయి. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు... ఏం చేస్తే నిలబడుతుందో తోచదు. ముఖ్యంగా పేదవర్గాలవారిని ఏ మార్గంలో ఆదుకుంటే వారి బతుకులు మెరుగుపడతాయో, వారంతటవారు నిలదొక్కుకోగలు గుతారో అర్థంకాదు. అనేక దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై వినూత్న కోణంలో పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు అభిజిత్ వినాయక్ బెనర్జీ, ఆయన జీవన సహచరి ఎస్తర్ డఫ్లో, మరో శాస్త్రవేత్త మైకేల్ క్రెమెర్‌లకు సోమవారం నోబెల్ పురస్కారం లభించింది. అభిజిత్ బెంగాల్‌కు చెందినవారు. డఫ్లో ఫ్రాన్స్ దేశస్తురాలు, క్రెమెర్ అమె రికాకు చెందినవారు. భిన్నరంగాల్లో అద్వితీయమైన కృషిచేసేవారికి నోబెల్ కమిటీ అందజేసే పురస్కారాలకు అర్ధం, పరమార్థం ఉంటాయి. ఆ పురస్కారాల ద్వారా వారి కృషిని ప్రపంచ దేశా లన్నీ గుర్తించేలా చేయడం, ఆ పరిశోధనల నుంచి లబ్ధి పొందేందుకు ఆ దేశాలను ప్రోత్సహించడం ఆ పురస్కారాల లక్ష్యం. శాస్త్ర విజ్ఞానం, వైద్యం తదితర రంగాల మాటెలా ఉన్నా... ఆర్థిక రంగంలో జరిగే పరిశోధనలపైనా, వాటి ఫలితాలపైనా ఏ దేశమూ పెద్దగా దృష్టి పెడుతున్న దాఖలా లేదు. అయితే అభిజిత్ బెనర్జీ త్రయం భిన్నమైనది. అభిజిత్ సాగిస్తున్న పరిశోధనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ఆసక్తి కలిగింది. విద్యారంగంలో తాము తీసుకొచ్చిన మార్పులకు అభిజిత్ మార్గదర్శకమే కారణమని కేజ్రీవాల్ ప్రకటించగా, గత సార్వత్రిక ఎన్నికల్లో తాము ప్రకటించిన కనీస ఆదాయ పథకం ఆయన సలహాతో రూపొందిం చిందేనని రాహుల్ చెప్పారు. ముంబై, వడోదరా వంటిచోట్ల స్వచ్ఛంద సంస్థలు ఈ విధానాలను అనుసరించి మెరుగైన ఫలితాలు సాధించాయి. పేదరిక నిర్మూలన కోసం రెండున్నర దశాబ్దాలుగా బెనర్జీ, డఫ్లో, క్రెమెర్‌లు పరిశోధనలు సాగి స్తున్నారు. శాస్త్రీయ పరిశోధనల్లో ఖచ్చితత్వాన్ని సాధించడానికి అనుసరించే ప్రక్రియలనే ఆర్థిక శాస్త్రానికి అనువర్తింపజేసి ఈ ముగ్గురూ క్షేత్ర స్థాయిలో సాగించిన పరిశోధనలు మంచి ఫలితా లనిచ్చాయి. ఒక ప్రాంతాన్నో, ఒక గ్రామాన్నో, లేక కొంతమంది పౌరుల్నో నమూనాలుగా తీసుకుని పరిశోధించడం కాక... తక్కువమందిని నమూనాగా తీసుకుని వారిని రెండు చిన్న చిన్న బృందా లుగా విడగొట్టి ఆ బృందాలకు వేర్వేరు విధానాలను అనుసరించి ఫలితాలెలా వస్తున్నాయో వీరు పరిశోధించారు. ఇది ఒకరకంగా ఔషధ ప్రయోగంలో అనుసరించే విధానం. ఒక బృందానికి పూర్తిగా ఔషధాన్ని అందించడం, మరో బృందానికి ఉత్తుత్తి ఔషధాన్ని అందించడం ఆ విధానంలోని కీల కాంశం. ఔషధాన్ని నిజంగా తీసుకున్నవారూ, తీసుకున్నామని అనుకున్నవారూ తమకెలా ఉన్నదని చెబుతారో తెలుసుకుని వాటి ప్రాతిపదికన ఒక అవగాహనకు రావడం, ఔషధ ప్రభావాన్ని అంచనా వేయడం ఆ విధానం లక్ష్యం. చిన్న చిన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని క్షేత్ర స్థాయిలో వీరు సాగించిన అధ్యయనాలు అద్భుతమైన ఫలితాలను వెలువరించాయి. నిర్దిష్టమైన కాలంలో, నిర్దిష్టమైన ప్రాంతంలో జరిపే ప్రయోగాలు మెరుగైన ఫలితాలిచ్చినా... వాటిని సార్వత్రికంగా అమలు చేసినప్పుడు భిన్నమైన ఫలితాలు వెలువడుతుంటాయని ఆర్థిక రంగ అధ్యయనాలపై తరచు ఫిర్యాదులొస్తుంటాయి. అందువల్లే వీరు వినూత్న విధానాలు అనుసరించారు. టీచర్–పిల్లల నిష్పత్తి తక్కువుండేలా చూసి పిల్లలపై అధిక శ్రద్ధ ఉండేలా చూడటం, అలాగే ఆ టీచర్లను శాశ్వత ప్రాతిపదికన కొందరిని, స్వల్పకాలిక కాంట్రాక్టుపై మరికొందరిని తీసుకుని వారి బోధనా విధానం ఫలితాలెలా ఉన్నాయో చూడటం, చదువులో వెనకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అదనంగా సమయం కేటాయించడం, శారీరకంగా బలహీనంగా ఉంటున్న పిల్లలకు పోషకాహారాన్ని అందించి వారు చదువులో మెరుగుపడుతున్న విధానాన్ని గమనించడం వంటివి ఇందులో ఉన్నాయి. అతి సాధారణమైన అంశాలుగా కనబడే ఇటువంటివన్నీ అభివృద్ధి తీరునే మార్చివేశాయని నోబెల్ కమిటీ ప్రశంసించిందంటే ఈ ముగ్గురి ప్రతిభాపాటవాల్నీ అంచనా వేయొచ్చు. వీరి పరిశోధనలన్నీ ఎప్పటినుంచో అమలవుతున్నవేనని కొందరు నిపుణులు కొట్టిపారేశారు. కానీ అంతిమంగా ఇవి అత్యంత ప్రభావవంతమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవనీ తేలింది. అభిజిత్‌కు నోబెల్ రావడంలోని ఇతర కోణాలను కూడా చూడాలి. ఆయన చిన్నప్పుడు బాగా చదివే విద్యార్థే తప్ప, ప్రథమశ్రేణికి చెందినవాడు కాదు. చదువుతోపాటు ఆటపాటలు, సినిమాలు వగైరాలపై ఆసక్తి. ఢిల్లీ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో చదువుతున్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని 12 రోజులు తీహార్ జైల్లో ఉన్నవాడు. విద్యార్థికి చదువు మినహా మిగిలినవన్నీ అస్పృశ్యమని, జీవితంలో ఎదుగుదలకు ఆటంకమని భావించేవారంతా అభిజిత్ నేపథ్యాన్ని గమ నించక తప్పదు. నిజానికి తన చుట్టూ నివసించేవారి జీవితాలను చిన్నప్పటినుంచీ గమనిస్తుండటం వల్లే, వారితో సన్నిహితంగా మెలగడం వల్లే వారి బతుకులను మెరుగుపరచడానికి తోడ్పడే అసా ధారణమైన విధానాలను అభిజిత్ కనుక్కోగలిగాడు. అమలవుతున్న విధానాలను అనుసరిస్తూ పోవడం కాక... వాటిని ప్రశ్నించడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే మరింత ఉన్న తమైన విధానాలు రూపుదిద్దుకుంటాయని నిరూపించాడు. -
దారిద్య్రం నుంచి విముక్తి చెందారు
ఢిల్లీ: భారత్‌లో దశాబ్ద కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ఐక్యరాజ్య సమితి రూపొందించిన బహుపార్శ్వపు పేదరిక సూచిక (మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ – ఎంపీఐ) వెల్లడించింది. యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ), ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కలసి రూపొందించిన ఈ సూచిక తాలూకూ నివేదిక ప్రకారం – మన దేశం వేగంగా పేదరికాన్ని తగ్గించగలుగుతోంది. జార్ఖండ్ వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో పదేళ్ల(2005–6, 2015–16)కాలంలో పేదరికం 46.5 శాతం మేరకు తగ్గింది. ఇండియా, ఇథియోపియా, పెరూ దేశాలు పేదరికాన్ని తగ్గించడంలో చెప్పుకోదగిన రీతిలో ముందున్నాయి. 101 దేశాల సూచికలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో 31 స్వల్పాదాయ దేశాలు, 68 మధ్యాదాయ దేశాలు. ఆయా దేశాల్లో 130 కోట్ల మంది బహుముఖ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పేదరికాన్ని, అది ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలనేది ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది. నివేదిక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 200 కోట్ల జనాభా గల 10 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, కంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతి, నైజీరియా, పాకిస్తాన్, పెరు, వియత్నాం) దశాబ్ది కాలంలో ఈ లక్ష్య సాధన దిశగా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయని వెల్లడించింది. పై పది దేశాల్లో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలు మరింత పేదరికం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఆరోగ్యశ్రీలక్ష్మి
‘ఎలా ఉన్నావ్..’ అని అడుగుతాం ఆత్మీయులు ఎదురైతే. శ్రీలక్షి అడగరు... చూస్తారు. ఎలా ఉన్నారో ఆమెకు తెలిసిపోతుంది! డాక్టర్లు స్టెతస్కోప్ పెట్టి కనిపెడతారు. డాక్టరు కాని శ్రీలక్ష్మి మనసు పెట్టి గ్రహిస్తారు. అభాగ్యులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తారు. అందుకే ఆమెకు శ్రీలక్ష్మి కాదు... ఆరోగ్యశ్రీలక్ష్మి అన్నదే తగిన పేరు. దాసరి శ్రీలక్ష్మీరెడ్డి పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో. పెళ్లితో ఖమ్మం జిల్లా కోడలయ్యారామె. పిల్లల చదువు కోసం 1997లో హైదరాబాద్‌కి రావడం ఆమె జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు ఆమె సాధారణమైన గృహిణి, రుద్రాక్షపల్లిలోని పెద్ద భూస్వామి కుటుంబం కోడలు. ఇదే ఆమె గుర్తింపు. భర్త, ముగ్గురు పిల్లలతో ఇల్లే ప్రపంచంగా గడిచిపోయింది. కుటుంబం హైదరాబాద్ రావడంతో ఆమెలో ఉన్న సోషల్ వర్కర్ బయటికొచ్చింది. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ఆమెను సమాజం కోసం పనిచేసేలా తీర్చిదిద్దింది. సామాజిక కార్యకర్తగా మలిచింది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని నమ్ముతారామె. అనారోగ్యాలు మనిషి ఆర్థిక పరిస్థితులను చూసి ఆగిపోవు. డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరని... జబ్బులు దరిచేరకుండా ఉండవు. అందుకే ఆరోగ్యం అందించడానికి ఎక్కువగా కృషి చేశారు శ్రీలక్ష్మి. అన్ని అనారోగ్యాల కంటే కంటి చూపు దెబ్బతినడం నిజంగా శాపమే. అందుకే దృష్టిలోపం ఉన్న పేదవాళ్లకు మెరుగైన కంటి చికిత్సను అందించడం మొదలుపెట్టారు. అలా దోమల్‌గూడలోని సాధూరామ్ కంటి ఆసుపత్రి సేవను నిరుపేద కాలనీలకు చేర్చడానికి వారధి అయ్యారు శ్రీలక్ష్మి. డాక్టర్ల సహకారంతో వారాంతాల్లో కాలనీల్లో హెల్త్‌క్యాంపులు పెట్టించారు. పేషెంట్ మందులు, కళ్లద్దాలకు అయ్యే ఖర్చును ఇప్పటికీ ఆమే పెట్టుకుంటున్నారు. ఆపరేషన్ అవసరమైన వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యం చేయించే వరకు ఆ పేషెంట్ బాధ్యత ఆమెదే. కాలనీలో మెడికల్ క్యాంపులో ఉచితంగా సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్లు సంతోషంగా అంగీకరించేవారు, కానీ కాలనీవాసులను వైద్య పరీక్షకు తీసుకురావడమే పెద్ద సవాల్‌గా ఉండేదని అన్నారు శ్రీలక్ష్మి. నా గుర్తింపు నేనే ‘‘నన్ను నేను... ఫలానా ఇంటి ఆడపడుచుని, ఫలానా ఇంటి కోడలిని, ఫలానా లాయర్ భార్యని అని, కలెక్టర్ తల్లి, డాక్టర్ తల్లి... అని పరిచయం చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. అలాగని ఆ గుర్తింపుల దగ్గరే ఆగిపోకూడదని కూడా అనుకున్నాను. నా గుర్తింపును నేనే అవాలని నా కోరిక. అందుకు రామకృష్ణ మఠం నాకు ఒక మార్గాన్ని చూపించింది. ఆ దారిలో నాకు చేతనైనంతగా సహాయం చేస్తున్నాను. దోమల్‌గూడ, మహబూబ్‌నగర్, కొడంగల్, కోస్గి, రావులపల్లి, కరీంనగర్‌లలో సర్వీస్ చేశాను. నేను కనిపించగానే ‘లక్ష్మక్కా!’ అని నోరారా పిలిచి వాళ్ల బాధలు చెప్పుకుంటారు. మొదట్లో వైద్య శిబిరాలకే పరిమితమయ్యాను. కానీ కాలనీల్లో తిరుగుతున్నప్పుడు వాళ్లు ఎదుర్కొనే అనేక సామాజిక సమస్యలు కూడా తెలిశాయి. అందుకోసమే నేను నడుపుతున్న ‘శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’ ఆఫీస్‌లో న్యాయసలహా విభాగం కూడా ఏర్పాటు చేశాను. ‘మహిళా సమస్యలు, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు– చైతన్యం’ కూడా నా సర్వీస్‌లో భాగమయ్యాయి. ఖైదీలకు వైద్యం అల్పాదాయ వర్గాల కాలనీల్లో పని చేయడం ఒక ఎత్తయితే చంచల్‌గూడ జైలు ఖైదీలకు వైద్య సహాయం చేయడం మరో ఎత్తు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వైద్యపరీక్షలు చేయించడానికి జైలు అధికారులు అనుమతిచ్చారు. డాక్టర్ల బృందంతో జైల్లో పరీక్షలు నిర్వహించాం. అయితే సమస్య అంతా... వాళ్లకు ఆపరేషన్లు చేయించడం దగ్గర మొదలైంది. అప్పటి వరకు పేదవాళ్లకు సాధూరామ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించేదాన్ని. ఖైదీలను బయటి హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదు, ప్రభుత్వ వైద్యశాలలోనే చేయించాలని తెలిసింది. ఖైదీలకు కంటి ఆపరేషన్లు చేయడానికి సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆసుపత్రి వైద్య అధికారులు తేదీలు ఖరారు చేశారు. అయితే వాళ్లను జైలు నుంచి బయటికి పంపించడానికి నిబంధనలు చాలా పటిష్టంగా ఉంటాయి. హోమ్ మంత్రిని కలిసి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ‘ఆపరేషన్ తర్వాత జైలుకి తరలించే వరకు బాధ్యత వహిస్తానని, ఆ ఖైదీల్లో ఎవరైనా పారిపోతే నాదే పూచీకత్తు’ అని రాసి సంతకం చేసిన తర్వాత పంపించారు. ఖైదీలకు వైద్యం కోసం ఇంత రిస్క్ చేశానని తెలిసి ‘ముందు వెనుక ఆలోచించకుండా చేస్తూ పోవడమేనా’ అని మావాళ్లు కోప్పడ్డారు. మనమే దారి చూపించాలి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత దాదాపుగా కొత్త ప్రపంచాన్ని చూశాననే చెప్పాలి. ‘ట్రైనింగ్’ అనే ప్రకటన కనిపిస్తే చాలు.. వెళ్లిపోయేదాన్ని. ఫినాయిల్, సోప్ ఆయిల్, ఇతర క్లీనింగ్ మెటీరియల్ తయారీతోపాటు బ్యూటీషియన్ కోర్సు, చిప్స్ తయారీ, క్యాండిల్ మేకింగ్, కంప్యూటర్ కోర్సు కూడా చేశాను. నేను నేర్చుకున్నవన్నీ పేద మహిళలకు నేర్పిస్తున్నాను. భర్త తాగుడుకు బానిసయ్యి, పిల్లలను పోషించలేక ఆత్మహత్యకు పాల్పడే వాళ్లను చూసినప్పుడు మనసు పిండేసినట్లయ్యేది. ‘మనిషిలో జీవనోత్సాహం ఉండాలి. మరణం దేనికీ సమాధానం కాదు’... ఈ మాట చెప్పడానికే ‘వై వియ్ డై... హౌ వియ్ లివ్’ అని కౌన్సెలింగ్ కూడా మొదలు పెట్టాను. అయితే... చనిపోవాలనుకునే వాళ్లకు బతుకు మీద ఆశ కలిగించడంతో మన బాధ్యత తీరిపోదు, వాళ్లకు బతకడానికి ఒక దారి చూపించగలిగితేనే ఒక జీవితాన్ని కాపాడిన వాళ్లమవుతాం. నిజానికి బతకడానికి దారి తెలిస్తే ఎవరూ చనిపోవాలనుకోరు కూడా. అందుకే ఆ మహిళలకు నేను నేర్చుకున్న స్కిల్స్‌లో శిక్షణ ఇస్తున్నాను. కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయించడంతోపాటు, ఆ మహిళలు తయారు చేసిన ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిని మార్కెట్ చేయడానికి హాస్పిటళ్లతో మాట్లాడడం కూడా నేనే. నా భర్త స్నేహితుల్లో చాలామంది డాక్టర్లు ఉండడం నాకు బాగా ఉపయోగపడింది. మహిళా ఖైదీలకు కూడా కుటీర పరిశ్రమ నిర్వహణకు అవసమైన స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాను. కార్పెంటరీ, స్వెటర్ అల్లకంలో కూడా శిక్షణ ఇప్పించాం. ఐఏఎస్ ఆఫీసర్ రామలక్ష్మిగారి సహాయంతో ఆ మహిళా ఖైదీలకు లోన్లు ఇప్పించాను. సమాజం కోసం చేసిన ప్రతి పనిలోనూ నేను ఆనందాన్ని ఆస్వాదించాను. అయితే బెగ్గర్స్ రీహాబిలిటేషన్ చేసేటప్పుడు ఒక్కోసారి సహనానికి పరీక్షగా ఉండేది. వాళ్లకు హోమ్‌లో షెల్టర్ ఇచ్చి తిండి, దుస్తులు ఇస్తుంటే... వాళ్లు మాత్రం గంజాయి ఇప్పించమని ఒకరు, సిగరెట్ లేకపోతే ఉండలేమని కొందరు సతాయించేవాళ్లు. నా కూతురు చెప్పిన మాట సోషల్ లైఫ్‌లో ఎదురయ్యే అనేకానేక పురస్కారాలు, తిరస్కారాల గురించి మా అమ్మాయి ఒకటే మాట చెప్తుండేది. ‘ఎవరైనా సరే... తమకు ప్రత్యేకంగా గుర్తింపు రావాలని కోరుకుంటే చాలదు. ఆ వ్యక్తి ఆ గౌరవానికి తగిన వ్యక్తి అని ఎదుటి వాళ్లకు అనిపించాలి. అదే అసలైన గుర్తింపు’ అని, డిజర్వ్కీ డిజైర్కీ మధ్య తేడా తెలుసుకోవాలని చెప్తుంటుంది. నేను పెంచిన పాపాయి.. ఇంత పరిణతితో మాట్లాడుతుంటే నా పెంపకంలో ఇంతటి సంస్కారంతో పెరిగిందా లేక తను నేర్చుకున్న మంచి భావాలతో తనే నన్ను తీర్చిదిద్దుతోందా అనిపిస్తుంటుంది. మనం వేదిక మీద ఒక పురస్కారాన్ని అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు మనసులో ‘‘అవును, ఈమె చాలా సేవ చేసింది. ఫలానా చోట ఫలానా సర్వీస్ చేయడం మాకు తెలుసు’’ అనుకోవాలి. అదే అసలైన గౌరవం. అవార్డులు అందుకుంటున్నప్పుడు నాకు మా అమ్మాయి చెప్పిన మాట గుర్తుకు వస్తుండేది. ప్రతి పురస్కారమూ ఎంతో కొంత సంతోషాన్నిచ్చి తీరుతుంది. ఆ జ్ఞాపికను చూసినప్పుడు దాని వెనుక ఉన్న నా శ్రమ గుర్తుకు వస్తుంటుంది. అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది మాత్రం వైఎస్ఆర్ చేతుల మీద పురస్కారం అందుకోవడమే. అది కూడా ఎంత కాకతాళీయంగా జరిగిందంటే... రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాల ప్రదానం జరుగుతోంది. నన్ను ఉత్తమ సోషల్ వర్క్ అవార్డుకు ఎంపిక చేశారు. నేను వెళ్లడం కొంచెం ఆలస్యమైంది. వైఎస్ఆర్ గారు రావడం కూడా ఆలస్యం కావడంతో కార్యక్రమం సమయానికి జరగాలనే ఉద్దేశంతో మంత్రుల చేతుల మీదుగా మొదలు పెట్టమని చెప్పార్ట వైఎస్ఆర్. నేను అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళ్లేటప్పటికి ఆయన కూడా వచ్చేశారు. ఆయనంటే నాకు పిచ్చి అభిమానం. ఆయన చేతుల మీద అవార్డు అందుకునే అదృష్టం ఉండడంతోనే నేను కార్యక్రమానికి ఆలస్యమైనట్లున్నాను. ఆయన నన్ను చూసి ‘ఇక్కడ కూడా ఉన్నావా. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా పిచ్చితల్లీ’ అని నవ్వారు. అంతకు ముందు నేను చాలాసార్లు భర్త చేతిలో మోసపోయిన అమ్మాయిలకు న్యాయం చేయమని ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. వైఎస్ఆర్ ఆ మహిళలతో మాట్లాడి ‘కేసు డీల్ చేయమని సబితమ్మకు రాస్తున్నాను. వీళ్లను సబితమ్మ దగ్గరకు తీసుకెళ్లు’ అని పంపించేవారు. అందుకే ఆయన నన్ను అవార్డుల వేదిక మీద చూడగానే ఆ మాటన్నారు. అప్పుడు నేను ‘నాకు స్ఫూర్తి మీరే, మీరు చేసినంత చేయలేను, కానీ నేను చేయగలిగినంత చేస్తాను’ అని చెప్పాను. అప్పుడు తీసిన ఈ ఫొటో చూసుకుంటే ఆయన మాటలు ఇప్పుడు వింటున్నట్లే ఉంటుంది’’ అంటూ వైఎస్ఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఫొటో చూపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు శ్రీలక్ష్మి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: కె. రమేశ్ బాబు అత్తగారి వర్ధంతికి పేదవారుండే కాలనీల్లో చీరల పంపిణీ, మామగారి పేరు మీద ఆయన వర్ధంతి రోజున సొంతూరు రుద్రాక్షపల్లిలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం శ్రీలక్ష్మికి ఇష్టమైన వ్యాపకాలు. ‘‘ఇన్నేళ్లుగా నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే నాలో పని చేయాలనే తపన ఉండడం, ఇంత ఖర్చు ఎందుకు అనకుండా మా వారు డబ్బివ్వడమే’’ నంటారామె నవ్వుతూ. పెద్ద కొబ్బరి బోండాలు పండించినందుకు హార్టికల్చర్ శాఖ నుంచి ఉత్తమ వ్యవసాయదారుల అవార్డు భర్తతో కలిసి అందుకున్నారు శ్రీలక్ష్మి. వర్మీ కంపోస్టు తయారీ, వేస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో సర్వీస్‌కి రాష్ట్రపతి అవార్డు, రామకృష్ణమఠం ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ (గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఫొటోలు, మధ్యలో వైఎస్ఆర్ ఫొటోతో వేసిన థీమ్ ముగ్గు) అందుకోవడం శ్రీలక్ష్మికి అమూల్యమైన సందర్భాలు. -
పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చాక పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన కనీస ఆదాయ హామీ పథకం దేశంలోని పేదరిక స్థాయిలో సమూల మార్పు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీనే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కేసీఆర్‌కు జాతకాల పిచ్చి అని మోదీ, సర్జికల్ స్ట్రైక్స్ బూటకమంటూ కేసీఆర్‌లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటివరకు అన్ని విషయాల్లో బీజేపీకి మద్దతిచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీని ఎందుకు విమర్శిస్తోందని ఆయన ప్రశ్నించారు. -
పేదరికానికి కాంగ్రెస్సే కారణం
సాక్షి, బెంగళూరు: దేశంలోని పేదరికానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరోపించారు. 1971లో గరిభీ హఠావో అని దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపునిచ్చారని, మళ్లీ ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీ కూడా అదే రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. దేశంలోని పేదరికానికి ఎప్పటికీ కారణం కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. కర్ణాటకలోని ఉడుపిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ టీ–షర్ట్లు అమ్ముతూ, యాప్ ద్వారా ప్రచారం చేస్తే తప్పేమిటి’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి విరుద్ధంగా కాంగ్రెస్ మహా కూటమిని స్థాపించారని, అసలు ఎన్డీఏకు, ఆ కూటమికి పోలికే లేదని ఆమె వ్యాఖ్యానించారు. దొంగ దొంగ అని పిలవడానికి మీ వద్ద ఉన్న సాక్ష్యాలు ఏంటని కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. ఉడుపి–చిక్కమగళూరు లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజేను గెలిపించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. -
పేదరికంపై సర్జికల్ స్ట్రైక్
జైపూర్/పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) అనేది పేదరికంపై సర్జికల్ దాడి చేయడమేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పథకం రూపకల్పన కోసం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను సంప్రదించామని వెల్లడించారు. 21వ శతాబ్దంలో ప్రజలెవరూ పేదలుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌లోని సూరత్‌గఢ్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 14 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టారు.. న్యుంతమ్ ఆయ్ యోజన(న్యాయ్) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ‘ఇది బిగ్ బ్యాంగ్. బాంబు పేలేందుకు సిద్ధంగా ఉంది. ఇది పేదరికంపై కాంగ్రెస్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్. యూపీఏ ప్రభుత్వం గతంలో 14 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయగా, బీజేపీ వారందర్ని మళ్లీ పేదరికంలోకి నెట్టింది’ అని వెల్లడించారు. దేశప్రజలకు చౌకీదార్(కాపలాదారు)గా ఉంటానన్న మోదీ.. అనిల్ అంబానీ వంటివారికి చౌకీదార్‌గా మారారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్యతరగతి వ్యాపారులు వ్యాపారం చేయడం మానేసి జీఎస్టీ దరఖాస్తులు నింపుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. న్యాయ్ పథకాన్ని మాస్టర్ స్ట్రోక్‌గా బీజేపీ రెబెల్ నేత శతృఘ్న సిన్హా అభివర్ణించారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని సిన్హా గుర్తుచేశారు. మరోవైపు న్యాయ్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఢిల్లీ కాంగ్రెస్ విభాగం ఆయ్ పే చర్చా(ఆదాయంపై చర్చ) అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించింది. -
పేదరికమే ఓ భస్మాసుర హస్తం
తల తాకట్టు పెట్టుకోవడమంటే ఇదేనేమో! ఆ తలకే విలువ లేకపోతే? ఆ తల పేదరికంలో మునిగి ఉంటే? ఆ తల మీద పేదరికమే భస్మాసుర హస్తమైతే? సంతలో మనిషికి విలువ లేనప్పుడు ఏం అమ్ముకోవాలి? తనను నమ్మిన ప్రేమనే తాకట్టు పెట్టుకోవాలి.పేదరికాన్ని మించిన భస్మాసుర హస్తం ఉంటుందా! రాజస్తాన్‌లోని మారుమూల పల్లెటూరు. మట్టి గోడలు.. ఎర్రమన్ను నేల.. రెల్లు గడ్డి పైకప్పు.. పేదరికం ఆక్రమించుకున్న ఆ గుడిసెలో ఓ మూల సర్దుకొని ఉంటుంటాడు ధాను. తన ఇద్దరు పిల్లలు, వితంతు చెల్లెలితో కలిసి. ధానుకి భార్య ఉండదు. చనిపోతుంది. కొడుకు టీపు. పదేళ్లుంటాయి. ఏడేళ్ల కూతురు గున్ని. ఆ పిల్లల మంచీ చెడూ బాధ్యత వితంతు చెల్లెలిది. వీళ్లతో పాటు ఇంకో కుటుంబ సభ్యుడూ ఉంటాడు. భస్మాసుర్. వాడంటే ధానూ కొడుక్కి ప్రాణం. తండ్రి దగ్గర లేని చనువు భస్మాసుర్ దగ్గర ఉంటుంది. తన కష్టం, సుఖం, స్నేహితులు.. అల్లరి అంతా భస్మాసుర్తో చెప్పుకుంటుంటాడు టీపు. దొర.. దొంగ ఇంటి అవసరాల కోసం ధాను భూస్వామి దగ్గర అప్పు తీసుకుంటాడు. చెప్పిన టైమ్‌కి అప్పు తీర్చడు. భూస్వామి కంట పడకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఊరు నిద్రపోయాక ఇంటికొస్తాడు. ఊరు నిద్రలేవక ముందే బయటకు వెళ్లిపోతుంటాడు. బలాదూర్‌గా తిరుగుతుంటాడు కాబట్టి.. ఊళ్లో ఏది పోయినా.. అది ధాను పనే అంటూ అతనిని దొంగగా చిత్రీకరిస్తారు. ఇంకా అప్పు చెల్లించలేదని ధాను మీద దొంగతనం మోపి పోలీసులకు పట్టిస్తాడు భూస్వామి. పూచీకత్తు మీద ఆ తెల్లవారి ఇంటికి వస్తాడు ధాను. చేతిలో పైసా ఉండదు. అప్పు తీర్చాలి. చెల్లెలితో గోడు వెళ్లబోసుకుంటాడు. అన్నకు సలహా ఇవ్వడానిక్కూడా ఆమెకు దారీతెన్నూ కనిపించదు. ఇంట్లో విలువైన వస్తువులున్నా తాకట్టు పెట్టొచ్చు. తన ఒంటిమీద వీసం బంగారం ఉన్నా.. అమ్మి ఎంతోకొంత సహాయ పడొచ్చు. భర్త ఆత్మహత్య చేసుకుంటే వచ్చి అన్న ఇంట్లో ఉంటోంది. తనదే ఒకరి మీద ఆధారపడ్డ బతుకు. అండగా ఎలా నిలబడగలదు? కుమిలిపోతుంటుంది. అటు ధానుకీ ఏమీ తోచదు. దిక్కులు చూస్తున్న అతనికి ఇంటి ముందున్న భస్మాసుర్ కనిపిస్తాడు. ‘‘భస్మాసుర్‌ను అమ్మేద్దాం’’ అంటాడు. విస్తుపోతుంది అతని చెల్లెలు. ‘‘టీపు ఒప్పుకుంటాడా?’’ ఆమె సందేహం. ‘‘తప్పదు.. ఒప్పించాలి’’ అవసరం అతనిది. భస్మాసుర్.. టీపు మాటే వింటాడు కాబట్టి తెల్లవారి టీపుని వెంట బెట్టుకుని మరీ పట్నానికి వెళ్లాలనుకుంటాడు ధాను. ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ధాను కూతురు గున్నీ అక్కడే ఉంటుంది. ఫ్రెండ్స్‌తో ఆడుకుని దీపాలు పెట్టాక ఇల్లు చేరిన కొడుకుతో చెప్తాడు ధాను.. ‘‘ఉదయాన్నే పట్నం బయలుదేరుతున్నాం. త్వరగా పడుకో’’ అని. అనుబంధం పెంచిన దారి ఇంకా సూర్యుడు రాకముందే పట్నానికి బయలుదేరుతారు ధాను, టీపు.. భస్మాసుర్‌ను తీసుకొని. మేనత్త చపాతీలు చేసి మూట కట్టిస్తుంది. తల్లి కట్టుకున్న చీరల చిరుగు ముక్కలతో తయారుచేసుకున్న జెండా కర్రను వెంట పెట్టుకుంటాడు టీపు. అమ్మ జ్ఞాపకంగా. ఎప్పుడో తన ఫ్రెండ్ ఇచ్చిన నల్ల కళ్లద్దాలను కూడా. టాటా చెప్పడానికి అత్తతో పాటు బయటకు వచ్చిన చెల్లి.. టీపుకి సైగ చేస్తుంది.. ‘‘భస్మాసుర్ని అమ్మేస్తున్నాడు నాన్న’’ అంటూ. ఒక్కసారిగా దిగులు టీపూలో. అన్న బాధ గున్నీకి అర్థమవుతుంది. మౌనంగా తండ్రిని అనుసరిస్తాడు టీపు. మొహంలో భావాలేవీ బయటపడనివ్వకుండా. కాలి నడకన ప్రయాణం. అసలు కథంతా ఇక్కడే. మధ్యాహ్నం వేళ.. తెచ్చుకున్న తిండి తింటారు. భస్మాసుర్కి కొసరి కొసరి తినిపిస్తుంటాడు టీపు. వాడలా భస్మాసుర్‌ను ముద్దు చేయడం.. గోముగా హత్తుకోవడం.. అన్నీ చూస్తుంటాడు ధాను. భోజనం అయ్యాక మళ్లీ నడక మొదలుపెడ్తారు. మధ్య మధ్యలో కొడుకు కర్రకున్న చీరల చిరుగులను ఆప్యాయంగా తడుముకోవడమూ గమనిస్తుంటాడు తండ్రి. అంతా కొత్తగా అనిపిస్తుంటుంది ధానూకి. అసలు కొడుకును ఎప్పుడూ అంత దగ్గరగా.. అంత పరిశీలనగా చూడలేదు అతను. వాడితో అదే మొదటి పరిచయంగా తోస్తుంది. చీకటి పడ్తుంది. ఓ చోట సేద తీరుతారు. తెల్లవారుతుంది. మళ్లీ నడక. అలసట.. ధానులో ఓపికను చంపేస్తుంది. కోపాన్ని పుట్టిస్తుంది. కొడుకును కొడ్తాడు. వాడు భస్మాసుర్‌ను పట్టుకొని ఏడుస్తాడు. భస్మాసుర్ కళ్లతోనే వాడిని ఓదారుస్తాడు. కోపం తగ్గాక పశ్చాత్తాప్పడ్తాడు ధాను. కొడుకును దగ్గరకు తీసుకుంటాడు. భయంగా.. బెరుకుగానే ఉంటాడు టీపు. ఆకలివేళ అవుతుంది. కిందటి రోజు తెచ్చుకున్న భోజనం ఎండవేడికి పాడైపోతుంది. ఖాళీ కడుపుతోనే నడకసాగిస్తారు. దాహంతో నోరు పిడచకట్టుకు పోతుంటుంది. గొంతు తడుపుకోవడానికి చుక్క నీరుండదు. ఉసూరుమంటూ ఓ నీడకు చేరుతారు. ప్రేమగా కొడుకు తలను నిమురుతాడు ధాను. శ్రమ తెలియనివ్వకుండా తన చిన్నప్పటి సంగతులను కొడుకుతో పంచుకుంటాడు. తన అల్లరి.. తండ్రి చీవాట్లు.. చేసిన బోధ.. అన్నీ కొడుకుతో చెప్తాడు. వాడు ఆసక్తిగా వింటాడు. ఈసారి కొడుక్కి తండ్రి కొత్తగా కనపడటం మొదలుపెడ్తాడు. అప్పటిదాకా వాడి మెదడులో కోపిష్టి.. దొంగ.. సోమరిపోతుగా ఉన్న తండ్రి ఇమేజ్ మెల్లగా కరగడం మొదలౌతుంది. ఆశ కూడా మొలకెత్తుతుంది.. తండ్రి మనసు మారి భస్మాసుర్‌ను అమ్మబోడేమోనని. మొత్తానికి తండ్రీ కొడుకులు అపార్థాలు తొలగించుకుంటూ.. అసలైన అనుబంధాన్ని ఆస్వాదిస్తూ.. కొత్త ఊహలకు రెక్కలు తొడుగుతూ పట్నానికి చేరుకుంటారు. పట్నంలో ప్రతి మలుపునూ.. ప్రతి దారినీ వింతగా చూస్తున్న కొడుకు సంబరం.. తండ్రికి ముచ్చటగా ఉంటుంది. బజారుకు తీసుకెళ్తాడు. దుకాణాలు.. మిఠాయీలు.. రంగుల రాట్నం.. ఒంటెల బండీ.. పిల్లల ఆటలు.. అన్నీ టీపుకు ఉత్సాహాన్నిస్తుంటాయి. కుతూహలాన్ని కలుగజేస్తుంటాయి. కొడుకు కోసం తినడానికి ఏదైనా తేవాలనుకుంటాడు ధాను. టీపుని ఓ అరుగు మీద కూర్చోబెట్టి ఓ దుకాణానికి వెళ్తాడు. అక్కడున్న చాక్లెట్ డబ్బా చూపిస్తూ నాలుగు చాక్లెట్లు ఇవ్వమంటాడు. డబ్బులివ్వమంటాడు దుకాణదారు. ‘‘పల్లె నుంచి వచ్చాం.. డబ్బుల్లేవు. నా పిల్లాడు ఆకలిగా ఉన్నాడు.. దయచేసి ఇవ్వండి’’ అని బతిమాలుతాడు ధాను. చీదరించుకుంటాడు యజమాని. అటూ ఇటూ చూసి.. డబ్బాలోని చాక్లెట్లు తీసుకొని పరిగెడ్తాడు ధాను. అతని వెంట పడ్తాడు యజమాని. ధానూని పట్టుకోబోతుంటే అతని చేతిలో ఉన్నవి కిందపడ్తాయి.. చాక్లేట్లు కావు చాక్లేట్ రాపర్స్ అవి. వెనక్కి తిరిగి వెళ్లిపోతాడు దుకాణదారు. వీడ్కోలు భస్మాసుర్‌ను అమ్మేస్తాడు ధాను. వచ్చిన డబ్బులోంచి కొంత తీసి కొడుక్కి షూ కొంటాడు. లాడ్జ్‌కి తీసుకెళ్తాడు. ‘‘స్నానం చేసి రెడీ అయ్యి.. షూ వేసుకో.. బయటకు వెళ్దాం’’అని షూ ఇస్తాడు. వాటిని చూసి వాడి కళ్లలో మెరుపు. ఆత్రంగా వేసుకుంటాడు. మంచి హోటల్‌కి తీసుకెళ్లి వాడికి ఇష్టమైనవి తినిపిస్తాడు తండ్రి. కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని భస్మాసుర్‌ను గుర్తు చేసుకుంటూ ‘‘మన కుటుంబపు పెద్దలా ఆదుకున్నాడు. మనల్ని తండ్రిలా చూసుకున్నాడు కదా..’’ అంటాడు కొడుకుతో. కళ్లనిండా బాధతో అవునన్నట్టుగా తలూపుతాడు టీపు. ‘‘నిన్నూ వాళ్లు బాగా చూసుకుంటారు. నీకే లోటూ రానివ్వరు’’ చెప్తాడు ధాను! అంటే.. భస్మాసుర్‌ను అమ్మేసినట్టుగా తననూ ఎవరింట్లోనో పెడ్తున్నాడన్నమాట. తండ్రి పరిస్థితి అర్థమవుతుంది టీపుకి. దీనంగానే వీడ్కోలు పలికి ట్రాలీలో తన కొత్త చిరునామాకు బయలుదేరుతాడు టీపు. కొడుకు వదిలేసిన చీర చెరుగుల కర్ర ఊతంతో ఊరి దారి పడ్తాడు ధాను. పేదరికాన్ని జయించే శక్తి ఈ సినిమాలో భస్మాసుర్.. పెంపుడు గాడిద. పేదరికంలో మనుషులు దరి చేరరు. జంతువులే మచ్చికవుతాయి. ఆ చెలిమే పేదరికాన్ని జయించే శక్తినిస్తుంది. మనుషుల్లో ఆ స్థయిర్యం నింపడం కోసం త్యాగానికీ సిద్ధపడ్తాయి. ఇదే భస్మాసుర్ కథ. దానివల్లే ఆ కుటుంబం నిలబడుతుంది. తండ్రి కొడుక్కి, కొడుకు తండ్రికీ అర్థమవుతాడు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలువురి ప్రశంసలూ అందుకుంది భస్మాసుర్. – సరస్వతి రమ -
ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాటం
పట్టణంలో పెరిగి పెళ్లి చేసుకుని పల్లెటూరికి వచ్చిన ఓ అమ్మాయి.. భర్తతో పోట్లాడి, అత్తింటి వారిని ఒప్పించి ఇంట్లో టాయిలెట్ కట్టిన ఉదంతాలు నాలుగేళ్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. అత్తింటితోపాటు ఊరిని చైతన్యవంతం చేసిన యువతుల ధీరత్వాన్ని దేశం అభినందిస్తూనే ఉంది. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపున ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని ఆకుమళ్ల గ్రామం. పాలనా యంత్రాంగం మొద్దునిద్రకు ఒక నిదర్శనం ఆ గ్రామంలోని ఈ ఉదంతం. ఆకుమళ్ల గ్రామంలో మునీరా, షాహీనా అనే తోడి కోడళ్లిద్దరు నాలుగున్నరేళ్లుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. వాళ్ల పోరాటం స్వచ్ఛ్భారత్ పోరాటం. ఒకవైపు అధికారంతో బరువెక్కిన ప్రభుత్వపాలనా యంత్రాంగం, మరో వైపు ఇద్దరు పేద మహిళలు. తక్కెడకు న్యాయం చెప్పాలనే ఉంటుంది. న్యాయబద్ధంగా మహిళల వైపు మొగ్గాలనే ఉంటుంది. అయితే అధికార బరువు తక్కెడను శాసిస్తోందిక్కడ.మొదట మునీరా ప్రయత్నించింది. ఆ తర్వాత తోడికోడలు షాహీనా కూడా ఆమెకు తోడయింది. ఆ తోడికోడళ్లిద్దరూ నాలుగన్నరేళ్లుగా గ్రామకమిటీ ముందుకొచ్చి అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే... మునీరా, షాహీనాలు ఇప్పటికీ ఊరు నిద్రలేవక ముందే చీకట్లో అరకిలోమీటరు దూరాన ఉన్న తుప్పల్లోకి వెళ్లి రావాలి, లేకపోతే చీకటి పడిన తర్వాత వెళ్లాలి. ‘ఇండివిడ్యువల్ సానిటరీ లెట్రిన్’ల కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తున్నా వీళ్ల ఇంటిని అందులో భాగం చేయడానికి ముందుకు రావడంలేదు పాలనా పగ్గాలను చేతిలో పెట్టుకున్న గ్రామ కమిటీ. ప్రభుత్వానికి పట్టలేదు ‘‘మా పుట్టిల్లు చాగలమర్రి మండల కేంద్రం. మా ఇంట్లో టాయిలెట్ ఉంది. పెళ్లయిన తర్వాత అత్తగారింటికి ఆకుమళ్లకు వచ్చాను. అప్పటి నుంచి నా భర్తతో, అత్తతో చెప్తూనే ఉన్నాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ పథకంలో సబ్సిడీ వస్తుంది, కట్టుకుందాం అని చెప్తూ వచ్చారు. ఇంతలో మా మరిదికి పెళ్లయింది. తోడికోడలు షాహీనాది కడప. ఆమె పుట్టింట్లోనూ టాయిలెట్ ఉంది. తను కూడా ఇక్కడి పరిస్థితికి అలవాటు పడటానికి చాలా ఇబ్బంది పడింది. ఇద్దరమూ గ్రామదర్శిని, గ్రామవికాస్, జన్మభూమి సమావేశాలకు వెళ్లి అర్జీలిస్తూనే ఉన్నాం. మా గోడు పట్టించుకున్న వాళ్లే లేరు’’ అంది మునీరా. చంటి బిడ్డ లేచే లోపే ‘‘నాకు 2013 ఫిబ్రవరిలో పెళ్లయింది. ఇక్కడ ఇలా ఉంటుందని పెళ్లి చేసుకుని వచ్చే వరకు తెలియదు. బయటకు వెళ్లడానికి ఎంత బిడియంగా ఉండేదో చెప్పలేను. ఇంటి నుంచి అరకిలోమీటరు దూరం వెళ్లడం మామూలు రోజుల్లో ఎలాగో గడిచిపోయేది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు నరకం చూశాను. వేవిళ్ల సమయంలో అయితే దారిలోనే కళ్లు తిరిగి పడిపోతాననిపించేది. గర్భిణిగా ఉన్నప్పుడు ఒకసారి మందులు నా ఒంటికి పడక విరేచనాలయ్యాయి. ఇక్కడ ఉండలేక పుట్టింటికి వెళ్లిపోవాలనిపించింది. అట్లాగే ఇద్దరు పిల్లలు పుట్టారు. పాపకు మూడో నెల. ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ (ట్యూబెక్టమీ) చేయించుకున్నాను. ఈమధ్యే అత్తగారింటికి వచ్చాను. చంటిబిడ్డకు పాలిచ్చి నిద్రపుచ్చి, తను నిద్రలేచేలోపు వెళ్లి రావాలి. పచ్చి ఒంటితో అంతదూరం నడిచి వెళ్లాలని గుర్తుకు వస్తేనే భయమేస్తోంది’’ అని చెప్తున్నప్పుడు షాహీనా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. పుట్టెడు పేదరికం వృద్ధ దంపతులు, వాళ్ల కొడుకులిద్దరు, ఇద్దరు కోడళ్లు, నలుగురు చిన్న పిల్లలు మొత్తం పదిమంది ఉన్నారా ఇంట్లో. అందరికీ ఆధార్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులున్నాయి. రేషన్ కార్డులో పేర్లూ ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ మించిన పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా ఇంట్లో. అయినా కనీస అవసరాలకు ప్రభుత్వం స్నేహ హస్తం ఇవ్వడం లేదా ఇంటికి. వాళ్ల అవసరాన్ని తీర్చడానికి స్వచ్ఛ్భారత్ అనే జాతీయ స్థాయి పథకం ఉంది. ఆ పథకానికి పుష్కలంగా నిధులున్నాయి. అయినా సరే... విదిలించడానికి చెయ్యి రాని పాలకులుంటే మునీరాలు, షాహీనాలకు పోరాటం తప్పదు. ‘మా పోరాటానికి మద్దతివ్వండి ప్లీజ్’ అని వీళ్లిద్దరూ ధైర్యంగా ముందుకు వచ్చారు. ‘ఆ అవసరాన్ని మంది ముందు చెప్పుకునేదెలా’ అని బిడియపడుతూ వీరిలా కుమిలిపోతున్న యువతులెందరున్నారో? పదిమందికి ఒకటే గూడు ‘‘చిన్న ఇంట్లో పదిమందిమి బతుకుతున్నాం. మా అత్తమామలు ముసలివాళ్లు. చలికాలం బయట పడుకుంటే వాళ్ల ఆరోగ్యం బాగుండదు. వాళ్లను లోపల పడుకోమంటే ‘వయసులో ఉన్న ఆడపిల్లలు మీరు బయటపడుకోకూడదు’ అని మా అత్తమామలు మమ్మల్ని గదిలో పడుకోమని వాళ్లు బయటపడుకునేవాళ్లు. ఇల్లు శాంక్షన్ చేస్తే మా మరిది వాళ్లు కట్టుకుంటారని కూడా ఎన్నిసార్లో అడిగాం. ఇల్లు ఇవ్వకపోతే పోయారు. కనీసం మరుగుదొడ్డి కూడా ఇవ్వలేదు’’ కలెక్టర్ చెప్పినా పని కాలేదు మాకు ఒక్క టాయిలెట్ శాంక్షన్ చేయండి కట్టుకుంటాం.. అని నాలుగున్నరేళ్లుగా గ్రామస్థాయి అధికారులు, నాయకుల నుంచి ఎంఆర్వో, ఎండీవో... అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాం. నాలుగు నెలల కిందట అనుకుంటాను... బనగానపల్లికి కలెక్టర్ వచ్చారు. అప్పుడు ఆ సభకు వెళ్లి మా గోడు వెళ్లబోసుకున్నాం. అప్పుడు నేను నిండు గర్భిణిని. నా కన్నీళ్లు చూసి కలెక్టర్ కదిలిపోయారు. నాకు ధైర్యం చెప్పి, ‘ఇలా ఎందుకు జరిగిందని’ అధికారులను మందలించారు. వెంటనే శాంక్షన్ చేయించి కట్టించమని ఆదేశించారు కూడా. ఆ తర్వాత మా బావగారు ఎన్నోసార్లు ఎంపీడీవో ఆఫీస్‌కెళ్లి కలెక్టర్ గారి ఆదేశాన్ని గుర్తు చేసి మరుగుదొడ్డి శాంక్షన్ చేయమని బతిమిలాడారు. ‘మీరు శాంక్షన్ చేసిన వెంటనే కట్టుకుంటాం, ఆపరేషన్ చేయించుకున్న అమ్మాయి పుట్టింటి నుంచి వచ్చేలోపు మరుగుదొడ్డి కట్టుకునే ఏర్పాటు చేయండి’ అని వాళ్లను ప్రాధేయపడ్డారాయన. అయినా కూడా శాంక్షన్ చేయలేదు. -
నేనో ఆర్థికవేత్తను
సాక్షి, అమరావతి: ‘నేనో ఆర్థిక శాస్త్రవేత్తను.. ఆర్థిక శాస్త్ర విద్యార్థిని.. పేదరికం లేకుండా సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం శాసనసభలో ‘సామాజిక సాధికారత, సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి’పై నిర్వహించిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. సమాజానికి పేదరికం శాపం వంటిదని అన్నారు. దేశంలో 19 91లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక.. ప్రపంచీకరణతో కులవృత్తులు, చేతివృత్తులు దెబ్బతిన్నాయన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల్లో పేదలు ఉన్నట్లు అగ్రవర్ణాల్లోనూ ఉన్నారన్నారు. లీడర్‌ను కాబట్టే.. జనాభా పెంచాలని కోరుతున్నా.. 2014 ఎన్నికలకు ముందు తాను చేసిన పాదయాత్రలో ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వాలని.. జనాభాను పెంచాలని పిలుపునిస్తే అందరూ అవహేళన చేశారని సీఎం అన్నారు. చైనా, జపాన్‌లో జనాభా తగ్గడం వల్ల వృద్ధులు అధికమైపోయార న్నారు. 1995 నుంచి 2004 వరకు తాను చేపట్టిన చర్యలతో జనాభా గణనీయంగా తగ్గిందన్నారు. కానీ ఇది సమాజానికి మంచిది కాదని, జనాభా పెరగాల్సి ఉందని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తానీ పిలుపునిస్తున్నానని చెప్పారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.. ఆహార భద్రత చేకూర్చడంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని సీఎం చెప్పారు. విద్యా భద్రత చేకూర్చడం వల్ల పేదరికం తగ్గుతుందన్నారు. నిరుద్యోగులకు మార్చి నుంచి దీన్ని రెండువేలకు పెంచుతున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలకిచ్చే చెక్కులకు బ్యాంకర్లు డబ్బులివ్వకపోతే.. తిరుగుబాటు చేసైనా డబ్బులు తీసుకోవాలన్నారు.వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యిందని చెప్పారు. 23 ప్రాజె క్టులు పూర్తి చేశామన్నారు. జూన్‌నాటికి గ్రావిటీద్వారా పోలవరం నుంచి నీటినందిస్తామన్నారు. -
సిందూరపు కొండల్లో చదువుల మందారం!
కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఒకప్పటి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు ఐదుసార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన అసామాన్య ప్రజానేత గుమ్మడి నర్సయ్య తనయ గుమ్మడి అనురాధ. కటిక పేదరికం, ఏ మాత్రం సహకరించని ఆర్థిక ఇబ్బందుల వల్ల లక్ష్యాలు మసకబారినా తన ధ్యేయం నుంచి మాత్రం ఆమె పక్కకు జరగలేదు. తనదైన పంథాలో సమాజం రుణం తీర్చుకోవాలనే ఆమె సంకల్పమూ గురి తప్పలేదు. తీవ్ర ప్రతికూలతల మధ్యే కొలిమిలో కాలిన ఇనుములా ఉక్కు సంకల్పంతో విద్యాసుగంధాలు వెదజల్లే కుసుమమై తొలి కోయ న్యాయ విద్య ఆచార్యురాలిగా తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర లిఖించారు. తండ్రి పేరు ప్రతిష్టలకు దీటైన వారసురాలిగా ఇల్లెందులో గుర్తింపు పొందారు. గిరిజన హక్కులపై పీహెచ్డీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం టేకులగూడెం గ్రామంలో అనురాధ ఒకటీ రెండు తరగతులు చదివారు. మూడో తరగతి నుండి ఇంటర్ వరకు సుదిమళ్లలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేశారు. ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ (హెచ్‌ఇపీ గ్రూప్) పూర్తి చేశారు. తర్వాత ఓయూ క్యాంపస్‌లో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేసి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పర్యవేక్షణలో ‘ట్రైబల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ తెలంగాణా స్పెషల్ రెఫరెన్స్ టు ఖమ్మం’ అన్న అంశంపై 2017 మార్చిలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎస్టీ బ్యాక్లాగ్ అధ్యాపక ఉద్యోగ నియామకాల్లో ఆమెకు న్యాయశాఖలో ఉస్మానియా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అదే ఏడాది జూన్‌లో ఉద్యోగం వచ్చింది. ఉస్మానియా చరిత్రలో ఒక గిరిజనమహిళ, అదీ కోయ తెగకు చెందిన మహిళ న్యాయశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడం ఇదే ప్రథమం. విద్యా సమస్యలపై పోరాటం అనురాధకు అన్న, అక్క ఉన్నారు. అన్న గ్రామంలోనే వ్యవసాయం చేస్తారు. అక్క ఊరికి దగ్గర్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి గుమ్మడి నర్సయ్య తన చిన్నతనం నుండే ఎన్నో ఒడిదుడుకులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. (సీపీఐ ఎమ్ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ప్రజల్లో మమేకమై పనిచేశారు. అందువల్లనే ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇంట్లో ఉండటం చాలా అరుదు కావడం వల్ల అనురాధ అమ్మ అమ్మక్క కుటుంబ భారాన్ని మోశారు. వ్యవసాయం చేస్తూ, అన్నీ తానై పిల్లలను చదివించారు. ప్రయోజకులను చేశారు. అనురాధ చదువుకునే రోజుల్లో న్యూ డెమోక్రసీ పార్టీకి అనుబంధంగా ఉన్న పీడీఎస్‌యూ విద్యార్థి సంఘంలో ఉన్నారు. విద్యా అంశాలపై పోరాడి, డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని చేసిన పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణా పోరాట సమయంలోనే నిరాహార దీక్షలు చేపట్టారు. నాన్న చెప్పిన మాట ‘‘మా నాన్న ఏనాడూ మమ్మల్ని ఎమ్మెల్యే బిడ్డలమన్న భావంతో పెంచలేదు. సాధారణ మధ్యతరగతి వాళ్ల మాదిరిగానే పెంచారు. నేను చదివే స్కూల్లో కూడా నన్ను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చూడలేదు. అందరి పిల్లలతోపాటే చూసేవారు. ‘పోరాడుతూ చదవాలి, చదువుతూ పోరాడాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాటలు నిజంగా నాకు బలాన్ని ఇచ్చాయి.’’ అని చెప్పారు అనురాధ. ఈ పోరాట నేపథ్యం కారణంగానే కెరీర్లో ఆమెకు అవరోధాలు అడ్డంకులు ఎదురయ్యాయి. ‘‘వాళ్ల నాన్న నక్సలైట్. నక్సలైట్ కూతురికి ఏ ప్రభుత్వ ఉద్యోగమూ ఇవ్వకూడదు. నక్సలైట్ కూతురు అనే ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఉంది’’ అని నాకు ఉద్యోగం రాకుండా యూనివర్శిటీలో కొందరు ప్రచారం చేశారు. అయితే తోటి అధ్యాపకులు, స్నేహితులు నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. నాకు ఉద్యోగం వచ్చేలా సహకారం అందించారు. నాకున్న మెరిట్‌ను బట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ని అయ్యాను’’ అని చెప్పారు అనురాధ. అమ్మాయిలు చదవాలి.. ఎదగాలి మారుమూల గిరిజన పల్లెల్లో గిరిజన అమ్మాయిలను ఎక్కువ చదువులు (ఉన్నత చదువులు) చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటంలేదు. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఆర్ధిక స్ధోమత లేనప్పుడు పై చదువులకు ఏం పంపుతామని నిస్సహాయత వ్యక్తపరుస్తున్నారు. అమ్మాయిలను చదివిస్తేనే ఉన్నత శిఖరాలను అవరోహిస్తారు. తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయితో సమానంగా చూడాలి. ఎప్పటికైనా పరాయి ఇంటికి వెళ్ల వలసిన అమ్మాయి, మనకే అన్నం ముద్ద పెట్టదు అనే ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో అమ్మాయిలే తల్లిదండ్రులను చూస్తున్నారు. అమ్మాయిలను తక్కువ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అబ్బాయిలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడం లాంటివి మానుకోవాలి. పైలట్ అవుతానంటే వద్దనీ, సైన్యలో చేరతానంటే కాదనీ అమ్మాయిలను తల్లిదండ్రులు అడ్డుకోకూడదు. వారికి ఏరంగంలో ఆసక్తి ఉందో అదే రంగంలో ఉంచాలి. అప్పుడే వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. ప్రభుత్వాలు కూడా విద్య ఆవశ్యకత పట్ల గిరిజనుల్లో అవగాహన పెంచాలి. నా రిసెర్చ్ కూడా గిరిజనుల విద్యాభివృద్ధి పైనే. -
పేదరికంలో ఉన్నా.. ఆదుకోండి
సాక్షి, చెన్నై: ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మదురైకి చెందిన చిన్నపిళ్లై(67) కటిక పేదరికంలో కాలం వెళ్లదీస్తున్నారు. రెండున్నర దశాబ్దాలకు పైగా గ్రామీణ మహిళాభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ తమిళనాట కోరలు చాచిన కంతు వడ్డీకి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. కళంజియం పేరిట సంస్థను స్థాపించి మహిళల్ని ఏకంచేసి బాల్య వివాహాల్ని అడ్డుకుంటున్నారు. పద్మశ్రీకి ఎంపికైన సందర్భంగా మీడియా పలకరించగా.. తాను పేదరికంలో ఉన్నానని, ప్రభుత్వం అందించే వితంతు పింఛను రూ.వెయ్యితో కాలం నెట్టుకు వస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.తనకు స్త్రీ శక్తి పురస్కారం అందజేసిన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి తనకు పాదాభివందనం చేశారని ఆమె గుర్తు చేశారు. అ‘సామాన్యుల’కు గుర్తింపు న్యూఢిల్లీ: సమాజ సేవ చేస్తున్న పలువురు సామాన్యులను ఈ ఏడాది పద్మ అవార్డులు వరించాయి. అందులో టీ విక్రేత, రూపాయికే పేదలకు వైద్యం అందిస్తున్న డాక్టర్ దంపతులు, దళితుల కోసం పాఠశాలను నెలకొల్పిన రిటైర్డ్ ఐపీఎస్ తదితరులున్నారు. ఒడిశాలో 100 ఎకరాలను సాగుచేసేందుకు ఒంటరిగా 3 కి.మీ మేర కాలువ తవ్విన గ్రామస్తుడు, మథురలో వేయికి పైగా ముసలి, జబ్బుపడిన ఆవుల బాగోగులు చూస్తున్న జర్మన్ పౌరురాలు కూడా తమ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను గెలుచుకున్నారు. కటక్‌కు చెందిన దేవరపల్లి ప్రకాశరావు టీ అమ్మడం ద్వారా వచ్చిన లాభాలతో మురికివాడల్లో నివసిస్తున్న పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావిత మేల్ఘాట్ జిల్లాలో స్మిత, రవీంద్ర కోల్హె అవే వైద్య దంపతులు స్థానిక గిరిజనులకు మూడేళ్లుగా కేవలం రూ.1, రూ.2 కే వైద్యం అందిస్తున్నారు. ఇక బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జ్యోతికుమార్ సిన్హా మహాదళిత్ ముసాహర్ కులానికి చెందిన విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమ పాఠశాలను స్థాపించారు. రెసిడెన్షియల్ వసతి కూడా ఉన్న ఈ పాఠశాలలో 1 నుంచి 12 తరగతుల వరకు 320 మంది విద్యార్థులు చేరారు. ‘కెనాల్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’గా పేరొందిన దైతారి నాయక్..పర్వతాల నుంచి నీటిని పొలాలకు పారించేందుకు బైత్రాని గ్రామంలో ఒక్కడే సుమారు నాలుగేళ్లు శ్రమించి మూడు కి.మీ పొడవైన కాలువను తవ్వి నీటి ఎద్దడి తీర్చారు. ‘గౌ మాతాకీ ఆశ్రయదాత్రి’గా పేరొందిన జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్ మథురలో 1200 గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. పద్మశ్రీకి ఎంపికైన.. అస్సాంకు చెందిన ఇంజినీరింగ్ డ్రాపౌట్ ఉద్ధవ్ కుమార్ భరాలి దానిమ్మ గింజలు తీసే, వెల్లుల్లి పొట్టు తొలిచే యంత్రాలను తయారుచేశారు. -
పేదరికం, నిరుద్యోగం పెంచారు
నిర్మల్: ఏళ్లపాటు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు పేదరికం, నిరుద్యోగాన్ని మరింత పెంచాయని, బహుజనుల అభివృద్ధి విస్మరించాయని బీఎస్పీ జాతీ య అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ను ఆయా పార్టీలు విస్మరించాయని విమర్శించారు. తప్పుడు ఆర్థిక విధానాలతో పేదరికం, నిరుద్యోగం పెరిగిందన్నారు. సామాన్యుడిని ఇబ్బంది పెట్టేలా డీజిల్, పెట్రోల్ ధరలను పెంచారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు అవినీతి పెరుగుతోందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని 2014 ముందు ఎన్నికల్లో నరేంద్రమోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా కుటుంబానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలోనూ ధన బలంతోనే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుజను ల బాగోగులను పట్టించుకోవడంలో విఫ లమయ్యాయని ధ్వజమెత్తారు. ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఘనత తమదేనన్నారు. మైనార్టీల స్థితిగతులపై సచార్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బడుగు, బలహీన, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలకూ రిజర్వేషన్లు పెంచేందుకు బీఎస్పీ పోరాడుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నాలుగుసార్లు గెలుపొందిన బీఎస్పీ ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’సూత్రంతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీ ఒంటరిగా పోరాటం చేస్తుం దని చెప్పారు. ఈసారి తమకు రాష్ట్ర ప్రజ లు అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సభకు చుట్టూ పక్కల అన్ని నియోజకవర్గాల నుంచి బీఎస్పీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఆత్మ హననం
అమృత్సర్ నుంచి మధ్యాహ్నం రెండింటికి బయలుదేరిన ప్రత్యేక రైలు ఎనిమిది గంటల తర్వాత ముఘల్‌పురా చేరుకుంది. దారిలో చాలామంది చనిపోయారు, ఎందరో గాయపడ్డారు, ఇంకొంతమంది ఎటో చెల్లాచెదురయ్యారు. పొద్దున పదింటికి క్యాంపులోని చల్లటి నేల మీద సిరాజుద్దీన్ కళ్లు తెరిచేప్పటికి నలువైపులా పోటెత్తుతున్న సముద్రంలా మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు కనబడేసరికి అతడి ఆలోచనాశక్తి మరింత మందగించింది. అతడు అలాగే చీకటిగావున్న ఆకాశం వంక చూస్తూవున్నాడు. అంతటి కల్లోలం కూడా వినబడనంతగా వృద్ధుడైన సిరాజుద్దీన్ చెవులు మూసుకుపోయినై. ఎవరైనా చూస్తే అతడు దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిలువెల్లా స్తబ్ధత అతడిని ఆవరించింది. అతడి అస్తిత్వం మొత్తం శూన్యంలో వేలాడుతోంది.దట్టంగా ఉన్న ఆకాశం వైపే చూస్తున్న సిరాజుద్దీన్ చూపు సూర్యుడిని ఢీకొట్టడంతో ఆ తీవ్రమైన కాంతికి అతడి నరనరమూ కదలడంతో మేల్కొన్నాడు. అతడి మస్తిష్కంలో దృశ్య పరంపర కదలాడింది– దోపిడి, మంటలు, తొక్కిసలాట, స్టేషన్, బుల్లెట్లు, రాత్రి, సకీనా... సిరాజుద్దీన్ ఒక్కసారిగా లేచి నిలబడి నలుదిశల్లోని జనప్రవాహాన్ని పిచ్చివాడిలా తేరిపారా చూశాడు. మూడు గంటల పాటు ‘సకీనా, సకీనా’ అంటూ క్యాంపు మొత్తం గాలించినా అతడి ఒక్కగానొక్క కౌమార కూతురి జాడ దొరకలేదు. ఆ ప్రదేశమంతటా చెవులు చిల్లులుపడేలా శబ్దాలు. ఒకరు, వాళ్ల పిల్లాడి కోసం వెతుకుతున్నారు, మరొకరు భార్య కోసం, ఇంకొకరు కుమార్తె కోసం. సిరాజుద్దీన్ అలసిపోయి ఒకచోట కూలబడి, సకీనా ఎప్పుడు, ఎలా తనతో విడిపడిందో గుర్తు చేసుకోవడం కోసం మెదడు మీద ఒత్తిడి పెట్టాడు. కానీ అతడి ప్రతి ఆలోచనా చివరకు పేగులు బయటికొచ్చేట్టుగా నరకబడిన భార్య శవం దగ్గర అంతం కాసాగింది.సకీనా వాళ్లమ్మ చచ్చిపోయింది. ఆమె సిరాజుద్దీన్ కళ్లముందే తుదిశ్వాస విడిచింది. కానీ సకీనా ఎక్కడ? ఆమె చనిపోతూ, ‘నన్ను వదిలెయ్, త్వరగా సకీనాను తీసుకొని ఇక్కణ్నుంచి పారిపో’ అని చెప్పింది.సకీనా అతడి వెంటే ఉండింది. ఇద్దరూ చెప్పుల్లేని కాళ్లతో పరుగెత్తారు. ఆమె దుపట్టా కింద పడిపోయింది. అతడు ఆగి దాన్ని తీసుకోబోతుంటే, ‘అబ్బాజీ, వదిలెయ్’ అని సకీనా అరిచింది. అప్పటికే అతడు దాన్ని తీసేసుకున్నాడు. దాని గురించే ఆలోచిస్తూ తన ఉబ్బెత్తుగా ఉన్న కోటు జేబువైపు చూపు సారించాడు. జేబులో చేయి పెట్టి అందులోంచి ఒక బట్టను బయటికి తీశాడు. అది సకీనా దుపట్టా. కానీ సకీనా ఎక్కడుంది? సిరాజుద్దీన్ ఎంత ఆలోచించినా ఫలితం లేకపోయింది. సకీనాను వెంటబెట్టుకొని అతడు స్టేషన్ దాకా వచ్చాడా? ఆమె తన వెంటే రైల్లో ప్రయాణించిందా? దారిలో అల్లరిమూకలు బండిని ఆపించి లోపలికి జొరబడినప్పుడు తాను స్పృహలోనే ఉన్నాడా? అప్పుడుగానీ వాళ్లు ఆమెను ఎత్తుకెళ్లారా?సిరాజుద్దీన్ లోపల ప్రశ్నల మీద ప్రశ్నలు, కానీ ఏ ఒక్కదానికీ జవాబు లేదు. అతడు సానుభూతి కోరుకున్నాడు, కానీ తన చుట్టుపక్కల ఉన్నవాళ్లందరికీ అదే కావాలి. అతడికి ఏడవాలనిపించింది, కానీ కళ్లు సహకరించలేదు. కన్నీళ్లు ఎప్పుడు ఇంకిపోయినాయో!ఆరు రోజుల తర్వాత, కొంచెం కోలుకున్నాక, సిరాజుద్దీన్ తనకు సాయపడటానికి సిద్ధంగా ఉన్న మనుషులను కలుసుకున్నాడు. మొత్తం ఎనమండుగురు యువకులు. వాళ్ల చేతుల్లో లాఠీలు, ఆయుధాలు ఉన్నాయి. సిరాజుద్దీన్ వాళ్లకు శుభవచనాలు పలికి, సకీనా రూపురేఖలు వివరించాడు. ‘ఆమెది ఎర్రటి రంగు, అందంగా ఉంటుంది... నాలాగా కాదు, వాళ్లమ్మను పోలింది... పదిహేడేళ్లు వస్తాయి... కళ్లు పెద్దవి... నల్లటి వెంట్రుకలు, కుడి చెంప మీద పెద్ద పుట్టుమచ్చ. ఆమె నా ఒక్కగానొక్క బిడ్డ. దయచేసి వెతికిపెట్టండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’. స్వచ్ఛంద సేవకులైన ఆ నవయువకులు ఆవేశంతో, ‘ఒకవేళ మీ కూతురుగానీ బతికివుంటే కొద్ది రోజుల్లోనే మీ దగ్గర ఉంటుం’దని వృద్ధుడైన సిరాజుద్దీన్‌కు అభయం ఇచ్చారు. ఎనిమిదిమంది యువకులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రాణాలకు తెగించి వాళ్లు అమృత్సర్ వెళ్లారు. ఎంతోమంది ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలను కాపాడి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కానీ పదిరోజులైనా సకీనా జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు.ఒకరోజు ఇదే పనిమీద వాళ్లు లారీలో అమృత్సర్ వెళ్తుండగా ఛహ్‌రరా దగ్గర రోడ్డు మీద ఒకమ్మాయి భారంగా నడుస్తూ కనబడింది. లారీ శబ్దం వినగానే అమ్మాయి భీతిల్లి పరుగెత్తడం మొదలుపెట్టింది. స్వచ్ఛంద సేవకులు బండిని ఆపించి ఆమె వెంటబడి పరుగెత్తారు. ఒక పొలంలో ఆమెను దొరికించుకున్నారు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. కుడిచెంప మీద పెద్ద పుట్టుమచ్చ. ఒక యువకుడు ఆమెను భయపడొద్దని చెప్పి, ‘నీ పేరు సకీనానా?’ అని అడిగాడు.ఆమె ముఖం పాలిపోయింది. ఏమీ మాట్లాడలేదు. కానీ యువకులు నమ్మకం కలిగించాక ఆమె భయంపోయింది. సిరాజుద్దీన్ కూతురు ఈమేనని వాళ్లకు అర్థమైంది. ఆ యువకులందరూ ఆమెకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించారు. ఆమెకు తినబెట్టారు, తాగడానికి పాలు ఇచ్చారు, ఆమె లారీలోకి ఎక్కడానికి సాయం చేశారు. దుపట్టా లేని కారణంగా ఆమె ఇబ్బందిగా తన ఛాతీని చేతులతో కప్పుకోవడానికి విఫలయత్నం చేస్తుండటం చూసిన ఒక యువకుడు తన కోటు విప్పి ఇచ్చాడు.సకీనా గురించిన వార్త ఏమీ తెలియకుండానే సిరాజుద్దీన్ చాలా రోజులు గడిపాడు. బిడ్డను జాడ తీయడానికి క్యాంపుల చుట్టూ, అధికారుల చుట్టూ నిష్ఫలంగా తిరుగుతూనే ఉన్నాడు. నీ కూతురు గనక బతికివుంటే కొద్ది రోజుల్లోనే వెతికి తెస్తామని అభయమిచ్చిన స్వచ్ఛంద సేవకుల క్షేమం కోసం అతడు రాత్రుళ్లు దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు.ఒకరోజు ఆ స్వచ్ఛంద సేవకులను అతడు క్యాంపు దగ్గర చూశాడు. వాళ్లు లారీలో కూర్చునివున్నారు. లారీ అంతలో కదులుతుండటంతో సిరాజుద్దీన్ పరుగెత్తి, ‘‘నాయనా, సకీనా కనబడిందా?’’ అని అడిగాడు.‘‘మేము కనిపెడతాం, కనిపెడతాం’’ అని ముక్తకంఠంతో వాళ్లు జవాబిచ్చారు. లారీ వెళ్లిపోయింది.తన హృదయ భారం తొలగించిన ఆ యువకుల విజయం కోసం సిరాజుద్దీన్ మళ్లీ ప్రార్థించాడు. ఆ సాయంత్రం అతడు కూర్చున్న చోటుకు దగ్గరే ఏదో గడబిడ వినబడింది. నలుగురు మనుషులు ఏదో మోసుకుని వస్తున్నారు. వాకబు చేస్తే ఎవరో అమ్మాయి రైలు పట్టాల దగ్గర స్పృహ లేకుండా పడివుంటే మోసుకొస్తున్నారని తెలిసింది. సిరాజుద్దీన్ వాళ్లనే అనుసరించాడు. ఆసుపత్రి సిబ్బందికి ఆమెను అప్పగించి వాళ్లు మరలిపోయారు. కొద్దిసేపు అతడు అక్కడే ఆసుపత్రి బయట ఉన్న గుంజకు ఆనుకొని నిలబడ్డాడు. నెమ్మదిగా లోపలికి నడిచాడు. గదిలో ఎవరూ లేరు. ఆ శవాన్ని పడుకోబెట్టిన స్ట్రెచర్ తప్ప ఇంకేమీ కనబడలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ సిరాజుద్దీన్ శవం వైపే నడిచాడు. గదిలోకి ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగు వచ్చింది. చనిపోయిన అమ్మాయి తెల్లటి ముఖం మీద తళుక్కుమన్న పుట్టుమచ్చను చూడగానే ‘‘సకీనా’’ అని అరిచాడు సిరాజుద్దీన్.లైటు వేసిన డాక్టర్ ‘‘ఏమైంది?’’ అని ప్రశ్నించాడు. ‘‘నే... సర్, నేను ఆమె బాపు’’ సిరాజుద్దీన్ గొంతులోంచి మాటలు గరగరా వచ్చాయి. మృతదేహపు నాడీని పరీక్షిస్తూనే, సిరాజుద్దీన్‌కు కిటికీని చూపిస్తూ, ‘‘తెరువు’’ అన్నాడు డాక్టర్.స్ట్రెచర్ మీద ఉన్న శవం భయంతో కంపించింది, నిర్జీవమైన చేతులతోనే బొందులు విప్పి షల్వార్‌ను కిందకు జార్చింది. ‘బతికేవుంది, నా బిడ్డ బతికేవుంది!’’ అంటూ ముసలి సిరాజుద్దీన్ ఆనందంతో కేకలు వేశాడు. డాక్టర్ ఒళ్లు ఆపాదమస్తకం చెమటతో చల్లబడింది. సాదత్ హసన్ మంటో సాదత్ హసన్ మంటో (1912–55) ఉర్దూ కథ ‘ఖోల్దో’ ఇది. 20వ శతాబ్దపు అత్యుత్తమ ఉర్దూ రచయితల్లో ఒకడిగా పేరొందిన మంటో అవిభాజ్య భారత్‌లో జన్మించి, తన 42వ యేట పాకిస్తాన్లో మరణించాడు. దేశవిభజన సమయంలో జరిగిన మానవ హననం ప్రపంచ చరిత్రలోనే అత్యంత పాపపంకిళమైన ఘట్టం. ఆ నేపథ్యంలోనేగాక, చీకటి జీవితాలను గురించి తీవ్రమైన స్వరంతో కథలు రాశాడు మంటో. ఏ మతాన్నీ వెనకేసుకు రాకపోవడం ఈ కథలోని గొప్పదనం. అనువాదం సాహిత్యం డెస్క్. నందితాదాస్ దర్శకత్వంలో ‘మంటో’ బయోపిక్ ఇటీవలే విడుదలైంది. -
పేదరికంపై పోరులో భారత్ భేష్: ట్రంప్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. కోట్లాది మందిని పేదరికం కోరల నుంచి రక్షించిందంటూ ప్రశంసించారు. ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రపంచనేతలనుద్దేశించి మంగళవారం ట్రంప్ 35 నిమిషాలపాటు మాట్లాడారు. ముందు తరాల వారికి ఎలాంటి ప్రపంచాన్ని ఇవ్వబోతున్నాం, ఎలాంటి దేశాల వారసత్వాన్ని వారు అందుకోబోతున్నారన్నదే అసలైన ప్రశ్న అని చెప్పారు. ‘విభిన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులతో నిండిన ఈ సభా మందిరం వారి విభిన్నమైన కలలతో నిండి ఉంది. ఇక్కడ నిజంగా ఏదో ఉంది. ఇది నిజంగా చాలా గొప్ప చరిత్ర’ అని అన్నారు. ‘భారత్ స్వేచ్ఛా సమాజంలో 100 కోట్ల మందికిపైగా ప్రజలున్నారు. అక్కడి ప్రభుత్వం కోట్లాదిమంది ప్రజలను పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి విజయవంతంగా తీసుకురాగలిగింది’ అని ప్రశంసించారు. -
రెండేళ్లు సోదరుడి నిర్బంధంలో...
న్యూఢిల్లీ: రెండేళ్లుగా సోదరిని టెర్రస్‌పై బంధించి, తినడానికి నాలుగు రోజులకో బ్రెడ్ మాత్రమే ఇచ్చిన సోదరుడి ఘాతుకం ఇది. మలమూత్రాల మధ్యే జీవచ్ఛవంలా గడిపిన 52 ఏళ్ల మహిళను ఢిల్లీ మహిళా కమిషన్ మంగళవారం కాపాడింది. సరిగా తిండిపెట్టక పోవడంతో బాధితురాలు శారీకంగా కృషించిపోయి ఎముకల గూడులా మారింది. కనీస వైద్య, పారిశుధ్య వసతులు లేకుండా ఇన్నాళ్లు దుర్భర జీవితం గడిపిన ఆమె మనుషులను గుర్తుపట్టే స్థితిలో లేదు. బాధితురాలి మరో సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు అక్కడికి వెళ్లి ఆమెకు విముక్తి కలిగించారు. ప్రస్తుతం ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఆమెను నిర్బంధించిన సోదరుడిపై కేసు నమోదైంది. -
ఓటమినీ గెలిపించండి
లైఫ్‌లో పాస్ అవుతాం. ఫెయిల్ అవుతాం. అసలంటూ ఏదో ఒకటి అవడం ‘గెలుపు’. ఫైట్ చేశాం కదా. అందుకే అది గెలుపు. ఫైటింగ్లో ఓడామని ఫీల్ అయితే.. అసలు ఓటమి కన్నా ఫీల్ అవడం ఇంకా పెద్ద ఓటమి అవుతుంది. అందుకే ఓటమినీ గెలిపించాలి. శ్రావ్య అదే పని చేస్తున్నారు. పల్లెల్లో పర్యటించి.. పరిస్థితుల్ని ఎదిరించి జీవించడమే గెలుపు అని చెబుతున్నారు. రెండుసార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్‌లో పోయాయి. అయినా శ్రావ్య నిరాశ పడలేదు. అంతే ఉత్సాహంగా మూడో ఎటెంప్ట్‌కి రెడీ అయింది. ప్రిపరేషన్ మొదలుపెడుతున్న సమయంలో తెలిసింది అంతకుముందు జరిగిన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని ఒక అమ్మాయి, అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నట్టు! అబ్బాయి తెలుగువాడే. శ్రావ్యకు తెలిసిన వ్యక్తే. అతనిది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే. పైసా పైసా కూడబెట్టి కొడుకును చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆ అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం రెండుసార్లు ఐఏఎస్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయానే అని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రావ్య వాళ్ల ఫ్రెండ్స్ అంతా కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. శ్రావ్య వెళ్లలేదు. ఫ్రెండ్స్ నిష్టూరమాడారు. ఎందుకు ఆలోచించరు? ‘‘ఎందుకు రావాలి? ఆ అబ్బాయిది ఎంత పిరికితనం? ఐఏఎస్ రాకపోతే లైఫ్ లేదా? ఇంజనీరింగ్ చదివినవాడు ఐఏఎస్ రాకపోతే ఇంకేదీ చేయలేడా? అతని తల్లిదండ్రులు కొడుకు ఐఏఎస్సే కావాలనే ఆశతో ఉన్నా... ఆ ప్రయత్నం ఫెయిల్ అయితే ఇంకోటి సాధించి తన తల్లిదండ్రుల ఆలోచననూ మార్చాలి. జీవితంలో అనుకున్నవన్నీ జరగవనీ, అయినా అధైర్య పడకుండా అనుకోనివి ఎంత సక్సెస్‌గా అఛీవ్ చేయగలుగుతామో చూపించాలి. ఇన్స్పైర్ చేయాలి. అదీ చదువు నేర్పిన ఓర్పు, విచక్షణ! అంతేకాని నిరాశతో సూసైడ్ చేసుకోవడం కాదు. అరే చేతికొచ్చిన కొడుకు పోయాడు.. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల గతేంటి? సింగిల్ మినిట్ అయినా వాళ్ల గురించి ఆలోచించాడా అతను? ఆలోచిస్తే ఇలా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అందుకే నేను కండోలెన్స్ మీటింగ్‌కి రాలేదు’’ అని తెగేసి చెప్పింది శ్రావ్య. ముప్పై రోజుల్లో అరవై గ్రామాలు ఫ్రెండ్స్‌తో చెప్పడమే కాదు తన ఆలోచనా తీరునూ మార్చుకుంది అప్పటి నుంచే శ్రావ్య. ఇప్పుడు తన ముందున్నది ఐఏఎస్ కాదు... అంతకుమించిన లక్ష్యం! సమాజం కోసం ఏమన్నా చేయాలి... ఏం చేయాలి? పరిశోధన ప్రారంభించింది. ప్రతి జిల్లాలో 60 గ్రామాల చొప్పున తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించింది. జూలై 1న ప్రయాణం మొదలుపెట్టిన ఈ ప్రయాణం జూలై 31కి పూర్తయింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలెన్నో తెలుసుకుంది. అంతకుమించిన అనుభవం గడించింది. శ్రావ్య పూర్తిపేరు మందడి శ్రావ్యారెడ్డి. తల్లిదండ్రులు.. మందడి చంద్రశేఖర్‌రెడ్డి, కాంట్రాక్టర్. తల్లి నీరజారెడ్డి, అడ్వకేట్. శ్రావ్యకు ఓ చెల్లెలు.. శ్రీహారెడ్డి, ఏమ్‌బీఏ గోల్డ్‌మెడలిస్ట్. శ్రావ్య విద్యాభ్యాసం.. స్కూలింగ్.. సెయింట్ ఆన్స్, శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్, నల్లమల్లారెడ్డి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. జన్మభూమి నా దేశం..! శ్రావ్య ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే బెల్జియం దేశానికి సంబంధించిన ఓ సంస్థ నిర్వహించిన జనరల్ నాలెడ్జ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్‌లో నెగ్గింది. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ ఆ సంస్థ తమ ఖర్చుతో బెల్జియంలో శ్రావ్య చదువుకునే చాన్స్‌నూ ఇచ్చింది. అంతేకాదు చదువు తర్వాత ఉద్యోగావకాశాన్నీ ఇస్తామంది. కానీ శ్రావ్య ‘నో’ అంది.‘ తెలియనితనంతో కాదు.. తెలిసిన పరిణతితోనే’ అలా అన్నానని అంటుంది ఆమె. ‘‘ఒక్కసారి వాళ్ల ఆఫర్‌కు ఓకే అన్నామంటే జీవితాంతం ఆ దేశానికి ఊడిగం చేయాలి. అదేదో నా దేశానికే చేసుకోవచ్చు కదా! అనే అభిప్రాయంతో రిజెక్ట్ చేశాను’’ అని చెప్తుంది. ఆ దృఢ నిశ్చయానికి ఆమె తల్లిదండ్రులూ సంబరపడ్డారట కాని అయ్యో అంత అద్భుతమైన అవకాశాన్ని వద్దనుకుంటోందే అని బాధపడలేదట.. ప్రెషర్ పెట్టలేదట. స్కూల్ ప్రిన్సిపాలే ఒకటికిరెండు సార్లు ‘‘వెళితే స్కూల్ పేరు కూడా ఎలివేట్ అవుతుంది కదా’’ అని ప్రస్తావించారట. అయినా శ్రావ్య ‘నో’ అనే మాటమీదే ఉంది. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నదాని మీద నిలబడ్డం చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అది ఆమె వ్యక్తిత్వం. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా. బాధ్యత తీసుకున్న లీడర్ స్కూలింగ్ అప్పటి నుంచే క్లాస్ లీడర్‌గా ఉంది శ్రావ్య. ఇంజనీరింగ్ వరకూ ఆ లీడర్షిప్ కంటిన్యూ అయింది. ఏ టాస్క్ ఇచ్చినా సమర్థవంతంగా పూర్తిచేసేది. ప్రశ్నించే తత్వం ఉండేది. ఇంజనీరింగ్ అయిపోయాక అందరిలాగే కార్పొరేట్ జాబ్ గూగుల్‌లో చేరింది. కాని ఎక్కడో అసంతృప్తి. ఏదో చేయాలనే చివరకు ఇదా చేస్తోంది అని తనను తానే విమర్శించుకుంది. విశ్లేషించుకుంది. ఐఏఎస్ సాధిస్తే చాలామందికి ఉపయోగపడొచ్చు కదా అని సివిల్స్‌కి సిద్ధమైంది. అదిగో అప్పుడే పైన చెప్పిన సంఘటన (ఇద్దరి ఆత్మహత్య) జరిగి.. మొత్తం తన దిశనే మార్చుకుంది. ‘‘మాతో పాటు సివిల్స్‌కి ప్రిపేర్ అయిన ఆ ఇద్దరి ఆత్మహత్య నన్ను చాలా ఆలోచించేలా చేసింది. మన దగ్గర కంప్లయినింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఏం చేయలేకపోయినా తప్పు సమాజం మీద, దేశం మీదకు నెట్టేస్తాం. బా«ధ్యత తీసుకోవడానికి మాత్రం ముందుకు రాం. అలాంటప్పుడు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? రెస్పాన్సిబుల్ సిటిజన్స్‌గా మనమేం చేస్తున్నాం? హావ్ టు బ్రింగ్ దట్ చేంజ్ అనుకున్నా. ముందుగా కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేశా’’ అంటూ తన ప్రయాణ ప్రారంభాన్ని చెప్పింది శ్రావ్య. వన్ ఉమన్ ఆర్మీ పనిచేసిన ఎన్జీవోలు, అటెండ్ అయిన సెమినార్లు శ్రావ్యకు చాలా విషయాలే నేర్పాయి. ముఖ్యంగా మన దగ్గర స్త్రీల పరిస్థితి గురించి! రేప్ జరిగినా అమ్మాయిదే తప్పు, భర్త చనిపోతే శుభానికి పనికిరాదు మహిళ, మొగుడు విడాకులిచ్చినా అవమానం మోసేది స్త్రీయే.. ప్రతి తప్పును ఆడవాళ్లే మోయాలి ఎందుకు? ఈ అనుభవమే శ్రావ్య ‘‘వియ్ అండ్ షి’’ అనే సంస్థను పెట్టి తెలంగాణ జిల్లాలను చుట్టేలా చేసింది. ప్రతి ఊరూ వెళ్తున్నా కొద్దీ.. తెలియని కోణాలు, ఊహించని పరిస్థితులు ఆమె కళ్ల ముందు! ఇంకా ఆగని బాల్యవివాహాలు, బాల వితంతువులు.. చదువు, ఉపాధి లేకుండా.. బానిస బతుకులు ఈడుస్తూ.. ఆమె కడుపు తరుక్కు పోయింది. కొంతమందికి అయితే ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియదు. పెన్షన్ ఆగిపోయిన వాళ్లు, పక్కా ఇళ్లు లేని వాళ్లు ఉన్నారు. జోగినీ వృత్తికి దూరమైనా ఇంకా అవమానాలపాలవుతున్న మహిళలు, ‘‘మీకెంతమంది నాన్నలురా’’ అని ఎగతాళికి గురవుతున్న వాళ్ల పిల్లలు, వరకట్న బాధితులు.. ఇలాంటి దాదాపు 73 కేస్‌లను ఐడెంటిఫై చేసింది. తక్షణమే సాయం కావల్సిన వాళ్లకు తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఆ సహాయం అందేలా చూసింది. మిగిలిన వాళ్ల వివరాలు రాసుకుంది. కదలండి.. కదలి రండి శ్రావ్య ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్లను మామూలు మనుషులుగా చేసే ప్రయత్నంలో ఉంది. తర్వాత వాళ్ల నైపుణ్యం, అభిరుచులకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతుందట. వాటికి కావల్సినవి సమకూర్చుకుంటోంది. తన సంస్థకు సంబంధించిన ఆఫీస్‌ను ప్రారంభించింది. వన్ ఉమన్ ఆర్మీగా సాగుతున్న ఈ జర్నీకి ఆమె ఎవరినుంచీ ఆర్థిక సహకారం ఆశించట్లేదు. వలంటీర్స్నూ ఆహ్వానించట్లేదు. ఒంటరి స్త్రీలకు మెరుగైన జీవితం ఇవ్వడానికి ఒంటరిగానే పోరాడుతోంది శ్రావ్య. కాకపోతే ఎవరైనా వలంటరీగా సర్వీసెస్ ఇస్తామని ముందుకు వస్తున్నవాళ్లకు ఒకటే చెప్తోంది.. ‘‘మీరున్న చోటే.. మీకు వీలైనప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేయండి.. మీకు తోచిన పని చేయండి’’ అని. యువతలోని చాలామంది ఆ స్ఫూర్తిని పంచుకుంటున్నారు. శ్రావ్య ఇప్పుడు లా కూడా చదువుతోంది. లాయర్ అయి పేదరికంలో ఉన్న మహిళలకు న్యాయసహాయం కూడా చేయాలని ఆమె ఉద్దేశం. అలాగే అవగాహన కూడా కల్పించే పనిలో ఉంది ఆమె. సర్పంచ్‌లు అడ్డుకునేవారు! ‘‘చిన్న చిన్న వానచినుకులే సముద్రాన్ని నింపుతాయి. అలా నేను వేసిన అడుగు కూడా చిన్న వాన చినుకులాంటిదే. తెలంగాణ టూర్‌కి నేనే ఫైనాన్స్ చేసుకున్నా. జాబ్ చేస్తున్నప్పటి నా సేవింగ్స్, నాకున్న కొంచెం జ్యూయెలరీ, మా నాన్న ఇచ్చిన ఎమౌంట్ అన్నీ కలిసి రెండు లక్షలు అయ్యాయి. వాటితోనే రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. కొన్ని చోట్ల ఊళ్లోకి అడుగు పెట్టనివ్వకుండా సర్పంచ్‌లు అడ్డుకున్నారు. వాళ్లను కన్విన్స్ చేశా.. వినలేదు కొంతమంది. నేనూ అంతే మెండిగా ఊరి పొలిమేరలో కూర్చున్నా కానీ వెనకడుగు వేయలేదు. వాళ్లకు విసుగొచ్చి సరే వెళ్లండి అని ఊళ్లోకి పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ సర్వే జరగని ఊళ్లకు కూడా వెళ్లా. నన్ను చూసి వాళ్లెంత సంతోషపడ్డారో.. వాళ్ల బాధలన్నీ ఏకరువు పెట్టారు. సర్వే కోసం ఎవరైనా వస్తే.. సర్పంచ్‌లు డబ్బులిచ్చేసి ఊళ్లోకి రానివ్వకుండా పంపించేస్తారని తెలిసి షాక్ అయ్యా. ఇలాంటి నిజాలెన్నో తెలిశాయి. వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్‌లో పిల్లల పక్కనే పడుకున్నా. వాళ్ల సమస్యలన్నీ షేర్ చేసుకున్నారు. శ్మశానంలోనే ఇళ్లున్న బ్యాదరి వాళ్ల దగ్గరా ఉన్నా. ఒళ్లు గగుర్పొడిచే లైఫ్ వాళ్లది. వాళ్లకు పెన్షన్ లేదు.. పక్కా ఇల్లు ఉండదు. సోషల్బాయ్కాట్! తలచుకుంటే ఇప్పటికీ మనసు మెలేసినట్టవుతుంది. ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా ఈ స్థితిలో ఉన్నాం. బాగవ్వాలి. ప్రస్తుతం మా చెల్లెలు నాకు చాలా హెల్ప్ చేస్తోంది. ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా పేరెంట్స్ సపోర్ట్ గురించైతే చెప్పనవసరం లేదు’’ అంటోంది శ్రావ్యారెడ్డి. – సరస్వతి రమ -
పేదరికం తగ్గుతోంది..!
భారత్‌కు ఓ శుభవార్త. అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశంగా భారత్∙పేరిట ఉన్న రికార్డ్‌ను తాజాగా నైజీరియా అధిగమించింది. అంతేకాదు... మనదేశంలో ప్రతీ నిమిషానికి 44 మంది దుర్భర దారిద్య్రం నుంచి బయటపడుతున్నారు. అదే నైజీరియాలో నిమిషానికి ఆరుగురు పేదలు పెరుగుతున్నారు. ‘ ఈ ఏడాది మే చివరకల్లా నైజీరియాలో 8.7 కోట్ల మంది కడు పేదరికంలో మగ్గుతున్నారు. అదే భారత్‌లో 7.3 కోట్ల మంది పేదలున్నారు. నైజీరియాలో దారిద్య్రం పెరుగుతుండగా, భారత్‌లో తగ్గుతోంది’ అని వరల్డ్ పావర్టీ క్లాక్ నివేదిక స్పష్టం చేసింది. రోజుకు రూ.130.25 (1.9 డాలర్లు) కంటే తక్కువలో జీవనాన్ని సాగిస్తుంటే అది దుర్భర దారిద్య్రం కిందకు వస్తుందని ఖరారు చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 188 దేశాల్లో దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న ప్రజలు. వారి జీవితాలతో ముడిపడిన అంశాల ఆధారంగా ఆయా దేశాల్లోని పేదరికం తీరుతెన్నులను అంచనా వేశారు. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల దుర్భర దారిద్య్రం ఆఫ్రికా ఖండంలోనే ఉందని ఇందులో తేలింది. ప్రస్తుతమున్న పరిస్థితులే అక్కడ కొనసాగితే 2030 కల్లా ప్రపంచంలోని పదింట తొమ్మిదో వంతు అతి పేదరికం ఆ ఖండంలోనే ఉంటుందని హెచ్చరించింది. ఈ రిపోర్ట్‌లోని అంశాలు...క్లుప్తంగా .. 2030 కల్లా భారత్ దుర్భర దారిద్య్రాన్ని పూర్తిగా రూపుమాపే అవకాశాలున్నాయి 2020 సంవత్సరానికి భారత్‌లో 3 శాతం కంటే తక్కువే పేదలుంటారు దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఫిలిప్పిన్స్, చైనా, పాకిస్తాన్లలో తలసరి ఆదాయ రేటు వృద్ధి చెందడం ఇందుకు ఉపయోగపడుతోంది. పేదరికం నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు భారత్,చైనా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆర్థికవేత్తల మాట అదే... 1991లో భారత్‌లో మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలు పేదరికాన్ని తగ్గించడంతో పాటు దేశ పురోభివృద్ధికి దోహదపడిందని చెప్పడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ ఎన్ ఆర్ బానుమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం స్థిరమైన ఆర్థిక లక్ష్యాల సాధన అనేది ఓ సవాల్. ఇది 2030 కల్లా కడు పేదరికాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు దోహదపడుతుంది, అయితే మిగిలిన 12 ఏళ్ల పాటు 7–8 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని చెప్పారు. -
2030 నాటికి భారత్‌కు విముక్తి!
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి త్వరగా పేదరికం నుంచి విముక్తి పొందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ప్రతి నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయటపతున్నారని సర్వే ఒకటి వెల్లడించినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. పేదరికం పెరుగుతున్న దేశాలలో నైజీరియా మొదటి స్థానంలో నిలిచిందని, అక్కడ నిమిషానికి ఆరుగురు పేదరికం బారిన పడుతున్నారని బ్రూకింగ్స్ నిర్వహించి అధ్యయంలో తేలిందని తెలిపింది. ‘ఫ్యూచర్ డెవలప్మెంట్’ పేరుతో ఈ సర్వే నిర్వహించినట్టు బ్రూకింగ్స్ సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది. సర్వే ప్రకారం.. మే నెల చివరి నాటికి ఇండియాలో 7.3 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారు. కాగా నైజీరియాలో 8.7 కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు. అయితే ఇండియాలో ప్రతి నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయటపడుతుండగా, నైజీరియాలో మాత్రం భిన్నంగా ప్రతి నిమిషానికి ఆరు మంది పేదరికం బారిన పడుతున్నారని అని సర్వే పేర్కొంది. 2022 నాటికి ఇండియాలో పేదరికం 3 శాతానికి తగ్గుతుందని, 2030 నాటికి పేదరికం పూర్తిగా తొలగిపోతుందని సర్వే నివేదిక వెల్లడించింది. -
పేదరికం మీద సవాలు
జీవన కాలమ్ పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క– మహావృక్షమై నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. భూమిని చీల్చుకుని వెలుగుని చూపుతుంది. సద్గురువులు శివానంద మూర్తిగారు ‘‘పేదరికం అంటే విదేశాలలో కేవలం దరిద్రం అన్నారు. కానీ ఒక్క భారతదేశంలో పేదరికం సంపద, వైభవం. ఒకే ఒక్క ఉదాహరణ: భగవాన్ రమణ మహర్షి. కౌపీనం కేవలం పశువుకీ మనిషి సంస్కారానికీ చెలియలికట్ట. అదే, అంతే కౌపీనం ఆవశ్యకత’’. మన దేశంలో కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని చట్టం వలలోంచి జారిపోయినవారు– లలిత్‌మోదీలు, విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు, నేహుల్ చోక్సీ– మరెందరో ఉన్నారు. తెల్లారి లేస్తే ఈ పనులు చేసే మంత్రులు, వారి తనయులు, రిజిస్ట్రార్లు, ఇంజనీర్లు, దేవుని ఆస్తులు పరిరక్షించాల్సిన అతి ‘నీచ’ అధికారులు– వీరిని సాధించలేదని సాధించే మేధావులూ, పార్టీలూ ఉన్నాయి. ఈ సంస్కృతిలో ఏనుగు తలల దేవుళ్లు, గుర్రపు తలల దేవుళ్లు, సింహపు తలల దేవుళ్లు, సగం మగా సగం ఆడా దేవుళ్లూ చాలామంది ఉన్నారు. వీటిని నెత్తిన పెట్టుకుని కిసుక్కున నవ్వుకునే తెలివైన మేధావులూ ఉన్నారు. అది వారి అదృష్టం. వారివల్ల ఈ జాతికి నష్టం లేదు. అలనాడూ ఈ ప్రబుద్ధులు ఉన్నారు. ‘నేనే దేవుణ్ణి’ అన్న నేటి తరం నాయకుల ప్రాక్సీలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వారి మెజారిటీ పెరిగింది. పెరిగినప్పుడల్లా ‘నేనున్నాన’ని దేవుడు వస్తాడని కథ. ఇది పుక్కిట పురాణం కావచ్చు. మనమూ కాస్సేపు నవ్వుకుందాం. కాలడి (కేరళ)లో ఓ చిన్న కుర్రాడు శంకరుడు. పుట్టుకతోనే ‘విద్య’ని దర్శించుకున్న– మన చీభాషలో ‘ప్రాడిజీ’. శాస్త్రాల ప్రకారం– ప్రజ్ఞ కలవానికి మూడవ యేటనే ఉపనయనం చేయవచ్చు. తండ్రి చేయాలని సంకల్పించారు. కానీ కాలం చేశాడు. ఐదవయేట గురువు విద్యారణ్యులు గాయత్రిని ఉపదేశించారు. ఏడవ యేట ఉంఛవృత్తికి బయలుదేరాడు. ఓ ఇంటిముందు నిలిచాడు జోలెతో. ఆ పేదరాలికి తినడానికి తిండిలేని స్థితి. కానీ ఏదో వటువుకి ఇవ్వాలనే తపన. ఇల్లంతా వెదికింది. ఓ మూల సగం కుళ్లిన ఉసిరికాయ దొరికింది. కంటతడితోనే, సిగ్గుగానే, నిస్సహాయంగా శంకరుని జోలెలోనే ఉంచింది. ఇక్కడ ఇద్దరు పేదలు. పేదరికాన్ని స్వచ్ఛందంగా వరించిన ప్రతిభామూర్తి. అటుపక్క నిస్సహాయమైన పేదరాలు. ఇదీ భారతీయ ‘పేదరికానికి’ బంగారు ఉదాహరణ. అటు పేదరాలు నిస్సహాయతతో చలించిపోయింది. ఇటు ఓ ‘ప్రజ్ఞా బిందువు’ ప్రజ్ఞాసింధువైపోయాడు. ఏడేళ్ల వటువు నోటివెంట ఆర్ద్రత అమృతమైంది. ‘కనకధారా స్తోత్రం’ వర్షించింది. ‘‘అమ్మా, ఈ తల్లి ఎన్ని జన్మల్లోనో ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ జన్మలో ‘ఇవ్వాలన్న’ ఒక్క సంస్కారాన్ని మిగుల్చుకున్నందుకు ఆమెని కరుణించు’’ అన్లేదు శంకరులు. కోరికలే లేని మహా పురుషుడాయన. కేవలం ఈ మాటలే అన్నారు: ‘‘బంగారువంటి నీ కరచరణాలతో, పద్మాలవంటి నీ నేత్ర ద్వయంతో కరుణించు తల్లీ. నా హృదయమంతా పేదరికంతో భయకంపిత మౌతోంది. నీ సమక్షంలో నేను శరణాగతిని కోరుకుంటున్నాను. ప్రతి దినం నన్ను దాటి నీ కరుణా కటాక్షాలను ప్రసరించు’’. ఈ ఏడేళ్ల మహా పురుషుడు తనని కాదు– తనని దాటి అనునిత్య పేదరికాన్ని అనుభవించే కోటానుకోట్ల దీనులని కరుణించ మంటున్నారు. వెనువెంటనే మరొక తల్లి ఆర్ద్రమై కనకధారను వర్షించింది. నాకు తెలుసు– కొందరు మిత్రులు కిసుక్కుమంటున్నారు. ఈ జాతి కొన్ని యుగాలుగా వారినీ ఉద్ధరిస్తోంది. పరమ స్త్రీ లోలుడు అజామీలుడిని తరింపజేసింది. పరమ జారుడు నిగమ శర్మ తరిం చాడు. ఇలాంటి కథలెన్నో ఉన్నాయి. ఏ చిన్న సత్కార్యమైనా ఒక జీవితకాలపు పాపానికి ప్రాయశ్చిత్తం కాగలదని– దారి తప్పిన వారిని చేరదీసి అక్కున చేర్చుకునే అరుదైన సంస్కృతీ వైభవమిది. ఈ దేశంలో భక్తికి కాదు పెద్ద పీట. తపస్సుకి కాదు. గెడ్డాలకి కాదు. రుద్రాక్షలకి కాదు. విభూతికి కాదు. మీరు క్షమిస్తే వేంకటేశ్వర స్వామికి కాదు. బాబాకి కాదు. మాతకి కాదు. పీతకి కాదు. సంస్కారానికి పెద్ద పీట. ఇష్టం లేకపోతే గుడికి వెళ్లకు. గోపురాలు కట్టించకు. భజనలు చేయకు. బంగారు పాదుకలు వేంకటేశ్వరస్వామికిచ్చి ఇంగ్లండులో మాయమవకు. పక్కవాడికి నిలవున్న ఉసిరికాయని ఇవ్వాలన్న మనసుని పెంచుకో. కళ్లు లేని గుడ్డివాడిని రోడ్డు దాటించు. పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క–మహా వృక్షమయి నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. కొన్నాళ్లకి భూమిని చీల్చుకుని వెలుగుని నీకు చూపుతుంది. పెరిగి నువ్వు బతికినన్నాళ్లూ నిన్ను పోషిస్తుంది. తరతరాలూ నీ వారసులకి పెద్ద దిక్కవుతుంది. ‘మా తాత చేసిన పుణ్యం’ అని నువ్వు చచ్చిపోయినా నీ మంచితనానికి సదా ‘చెమ్మ’ని ఇస్తూనే ఉంటుంది. ‘వీడెవడయ్యా దేవుడు!’ అని ఇప్పుడే అతడిని అటకెక్కించెయ్. చెడిపోయిన ఉసిరికాయని ఇచ్చే మనస్సుని పెంచుకో. అమ్మ వచ్చి నీ తలుపు తడుతుంది. - గొల్లపూడి మారుతీరావు -
మూడు ముళ్ల బాల్యం
రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది బాల్య వివాహ బాధితుల దుస్థితి ఇదీ. ఆడపిల్లను బాధ్యత, బరువుగా భావిస్తున్న తల్లిదండ్రులు.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా పాఠశాల చదువుకూడా పూర్తికాకుండానే అమ్మాయిలకు పెళ్లి చేసేస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నారు. పెళ్లి, సంసారం, జీవితమంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే బంధాల బాధ్యతల్లో బందీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్ల మందికి బాల్య వివాహాలు జరగగా.. అందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నట్లు ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో గత మూడేళ్లలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.7 శాతం మందికి బాల్య వివాహం జరిగినట్లు తేలింది. ఎంవీ ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారం సేకరించింది. బాల్య వివాహాలు చేసుకున్నవారిలో 46 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. వారి ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. నిర్బంధ పరిస్థితులు బాల్య వివాహం జరిగిన అమ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బరువు బాధ్యతలతో ఓ వైపు.. ఆరోగ్య సమస్యలతో మరోవైపు కొట్టుమిట్టాడుతున్నారు. తమ ఆరోగ్య సమస్యల గురించి భర్తకు చెప్పుకోలేని నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కూలీ పనో, ఏదైనా ఉద్యోగమో చేసి సంపాదించడానికి తోడు కుటుంబంలోని అందరికీ పనులు చేసి పెట్టడం, చాకిరీ చేయడం తప్పడం లేదు. దేనికి నిరాకరించినా భర్త, అత్తమామల దాడులకు గురికావాల్సి వస్తోంది. కొందరైతే కుటుంబ సభ్యుల నుంచే లైంగిక దాడులకూ గురవుతున్నారు. ఈ బాధలన్నీ పడలేక చాలా మంది ఆత్యహత్యాప్రయత్నాలు కూడా చేసినట్లు సర్వేలో వెల్లడైంది. పాలమూరు టాప్.. కరీంనగర్ లాస్ట్ బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల బాల్య వివాహాలు జరిగితే.. మహబూబ్‌నగర్‌లోనే 26.2 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నల్లగొండ (21.5 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్ (21 శాతం), వరంగల్ (18 శాతం), ఆదిలాబాద్ (17.8 శాతం), నిజామాబాద్(16.3 శాతం), కరీంనగర్ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్టు ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది. ఆమె పేరు రమ్య.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ బస్తీలో ఉండే ఆమెకు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. సంసారం అంటే ఏమిటో పూర్తిగా తెలియని స్థితి. పెళ్లయిన తొలిరాత్రే తీవ్ర నరకాన్ని అనుభవించింది. భర్త రోజు కూలీ. రోజూ మద్యం తాగి రావడం, వంట సరిగ్గా చేయలేదనో, డబ్బులు అడుగుతోందనో కొట్టడం, వేధించడం.. పెళ్లయిన ఈ రెండేళ్లలోనే రెండు కాన్పులు. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో తొలికాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం సరిగా లేక చనిపోయింది. రెండో కాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు. భర్త, అత్తమామలు పట్టించుకోరు. ఏం చేయాలో తెలియని ఆవేదనలో కొట్టుమిట్టాడుతోంది.. ఆమె పేరు పరమేశ్వరి.. వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు. 14 ఏళ్లకే మేనబావతో పెళ్లి చేసేశారు. కొద్దిరోజులకే గర్భం దాల్చింది. చిన్న వయసు, సరైన పోషకాహారం లేక శిశువు సరిగా ఎదగలేదు. పుట్టగానే చనిపోయింది. మరోసారి కూడా ఇలాగే జరిగింది. కొద్దినెలలకే మూడోసారి గర్భం దాల్చింది. ఈ సారి కడుపులో బిడ్డ సరిగా పెరగడం లేదని, ఇన్ఫెక్షన్ సోకిందని గర్భసంచి తీసేశారు. ఇక పిల్లలు పుట్టరనే ఆగ్రహంతో పరమేశ్వరిని భర్త, అత్తమామలు హింసించడం మొదలుపెట్టారు. రెండేళ్ల నుంచి నరకయాతన పడుతోంది.. – సాక్షి, హైదరాబాద్ బాల్య వివాహంతో ఎంతో యాతన - బాల్య వివాహం జరిగిన బాలికల్లో 67 శాతం మంది తమ సమస్యలను భర్తకు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. - 90% మంది బాధితులకు అనారోగ్య సమయంలో ఎలాంటి సహాయం అందడం లేదు. - 73% మంది భర్తలు నిత్యం మద్యం తాగడం, దాడికి పాల్పడడం చేస్తున్నారు. మిగతావారిలోనూ చాలా మంది తరచూ మద్యం తాగుతున్నారు. - 91% మంది భర్తలు రాత్రి 12 గంటల తర్వాత ఇంటికి వస్తున్నట్లు సర్వేలో తెలిసింది. - 85% బాధిత మైనర్లు పుట్టింటికి వెళ్లడానికి కూడా సరిగా అవకాశం ఉండడం లేదని సర్వేలో వెల్లడించారు. - 89% మంది బాధితులు కూలి పని చేయాల్సి వస్తోంది. భర్త చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. - 71% మంది అత్తమామల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. - 78% మంది బాధిత అమ్మాయిలు గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. - 15% మంది మానసికంగా కుంగిపోయారు. 37% మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. - అసలు ఏ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడవలేదు. - బాల్య వివాహ బాధితుల్లో 59% మంది పెళ్లికి ముందు దినసరి కూలీలుగా పనిచేసినవారేనని.. పెళ్లి తర్వాత కూడా 41% మంది కూలిపనికి వెళుతున్నారని సర్వేలో తేలింది. అంతా 8, 10 తరగతి లోపే.. బాల్య వివాహాలు జరిగినవారిలో చాలా మంది 13 నుంచి 15 ఏళ్లలోపు వారే. 8వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న సమయంలోనే బలవంతంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత చదువుకునే అవకాశం కేవలం 3% మందికే లభించింది. బాల్య వివాహాలు జరిగినవారిలో 83% మంది భర్తతో కలసి ఉండగా.. 11% మంది వేరుగా ఉంటున్నారు. 4% మంది విడాకులు తీసుకున్నారు. 2 శాతం మంది వితంతువులున్నారు. ఆడపిల్లను కంటే వేధింపులు జరిగిందే బాల్య వివాహం. ఆపై ఆడపిల్ల పుట్టిందంటే ఇక వేధింపులే. బాల్య వివాహాలు జరిగిన అమ్మాయిల్లో 62 శాతం మంది తొలికాన్పులో ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇలాంటి అమ్మాయిల్లో 74 శాతం మంది అత్తమామల అసంతృప్తి, వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే విధంగా 50 శాతం మంది భర్తలు వేధింపులకు దిగుతున్నారు. ప్రసవించి నాలుగైదు నెలలు కాకుండానే కూలి పనులకు పంపిస్తున్నారు. సంపాదించిన డబ్బును కూడా భర్త, అత్తమామలే తీసుకుంటున్నారు. డబ్బులు అడిగితే దాడులు సైతం ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉంది. అధికశాతం బీసీలే.. బాల్య వివాహాలు జరిగిన వారిలో అత్యధికం వెనుకబడిన తరగతుల వారే. బాల్య వివాహాల్లో 43 శాతం బీసీ కులాలకు చెందినవారుకాగా.. 36 శాతం షెడ్యూల్ కులాలు, 15 శాతం గిరిజన తెగలకు చెందిన వారున్నట్టు సర్వేలో వెల్లడైంది. చట్టాలున్నా చట్టుబండలే..! బాల్య వివాహాల నియంత్రణకు 2006లో కఠిన చట్టం తీసుకువచ్చారు. దానికితోడు జువైనల్ జస్టిస్ చట్టం, బాలల లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక చట్టాలున్నా బాల్య వివాహాలు మాత్రం పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. రోజురోజుకూ ఆధునికత, టెక్నాలజీ, విద్యాభివృద్ధి పెరుగుతున్నా ఇప్పటికీ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. పేదరికం, నిరక్షరాస్యతే కారణం కడు పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కుటుంబాల్లో 79 శాతం కుటుంబాల ఏడాది సంపాదన రూ.50 వేలలోపే ఉంటోంది. 16 శాతం కుటుంబాల్లో రూ.51 వేల నుంచి రూ.75 వేల ఆదాయం ఉంటోంది. కేవలం 5 శాతం కుటుంబాలు మాత్రమే రూ.లక్షకుపైగా వార్షికాదాయం ఉన్నవారు. ఇక తల్లిదండ్రుల్లో పెద్దగా చదువుకున్న వాళ్లు లేకపోవడం సైతం బాల్య వివాహాలకు కారణమవుతోంది. ఇలాంటి వివాహాలు జరుగుతున్న కుటుంబాల్లో 91 శాతం మంది తల్లిదండ్రులు నిరక్షరాస్యులే. ఆరు శాతం మంది 5వ తరగతి వరకు, మూడు శాతం మంది ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. -
విచారణ ఖైదీల పరిస్థితి బాధాకరం
న్యూఢిల్లీ: విచారణ ఖైదీలకు (అండర్ ట్రయల్) బెయిల్ వచ్చినా పేదరికం కారణంగా బాండ్/పూచీకత్తు సమర్పించలేక తీహార్ జైలులోనే కొట్టుమిట్టాడుతున్నారని, ఇదీ చాలా బాధాకరమైన అంశమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారికి ఊరట కలిగించేలా ట్రయల్ కోర్టులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. ఎంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలైనా ఎటువంటి పరిస్థితుల్లోనూ వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. లా కమిషన్ కూడా విచారణ ఖైదీల విషయంలో రిస్క్ అస్సెస్మెంట్ చేసి.. బెయిల్ షరతులను పూర్తి చేయలేక జైలులోనే మగ్గుతున్న వారిని విడుదల చేయాలని సూచించిందని పేర్కొంది. ఇలాంటి కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని, బెయిల్ వచ్చినా విచారణ ఖైదీ ఎందుకు విడుదల కాలేదనే విషయంపై సమీక్షించి బెయిల్ షరతులను మార్చాలంది. వారి కోసం చట్టం! న్యూఢిల్లీ: చేయని తప్పునకు శిక్ష అనుభవించిన బాధితులకు పరిహారం ఇచ్చేలా మన దేశంలో చట్టం ఉందా?.. ఢిల్లీ హైకోర్టు సూచన మేరకు ఈ విషయమై లా కమిషన్ పరిశీలన మొదలుపెట్టింది. చేయని తప్పునకు శిక్ష అనుభవించిన, తీవ్రంగా విచారించబడిన బాధితులకు పరిహారం ఇచ్చేందుకు చట్టపరమైన పరిష్కారాలు లేకపోవడంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధితులకు ధనం, ఇతర పరిహారం ఇచ్చేందుకు అమెరికాలో 32 రాష్ట్రాల్లో చట్టాలున్నా యని నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎస్ బాజ్‌పాయ్ నివేదికను ప్రస్తావించింది. -
అమెరికాలో పేదలపై వివక్ష
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తేలింది. పేదరికంలో మగ్గుతున్న 4.1 కోట్ల మందికి ఆ దేశంలోని అపార సంపద, ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ విధానాలు ఏ విధంగానూ సాయపడటం లేదని వెల్లడైంది. త్వరలో అమల్లోకి రానున్న పన్ను సంస్కరణల చట్టంతో అమెరికా సమాజంలో ఇప్పటికే పెరిగిన ధనిక–పేద తారతమ్యాలు మరింత ఎక్కువ అవుతాయని నివేదికలో ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫిలిప్ ఆల్స్టన్ హెచ్చరించారు. అమెరికాలోని పేదరికం, మానవ హక్కుల అమలును పరిశీలించేందుకు ఆల్స్టన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంతటి శక్తివంతమైన దేశమైనా మానవహక్కుల చట్టాల పరిధిలోనే పనిచేయాల్సిందేనన్న సందేశాన్నిచ్చేలా ఈ కమిటీ పర్యటన సాగింది. అమెరికాలోని సామాజిక, ఆర్థిక అసమానతలు, ఇళ్లూ వాకిలి లేని వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్ణవివక్ష, పరిశ్రమల్లో ఉద్యోగాల తగ్గుదల వంటి అంశాలపై ఆల్స్టన్ దృష్టి సారించారు. కాలిఫోర్నియా, అలబామా, జార్జియా, పశ్చిమ వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, అమెరికా పాలనలో ఉన్న ప్యూర్టోరికోల్లో పర్యటించి పేదలు, నిరాశ్రయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి దుర్భర జీవితాల్ని పరిశీలించి ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. అమెరికన్ల పౌర, రాజకీయ హక్కులపై పేదరికం ప్రభావాన్ని ఇందులో ప్రస్తావించారు. అమెరికా ప్రజలకు వైద్య సంరక్షణ హక్కు, సొంతిల్లు, ఆహారం వంటి ప్రాథమిక సామాజిక, ఆర్థికహక్కులు కొరవడుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. సంపన్నులు, పేదల మధ్య అంతరం ‘అసమానతలు, పేదరికంపై అమెరికా ప్రభుత్వ విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో తాజా పన్నుల విధానం ప్రజల సంపద, ఆదాయ వ్యత్యాసాల్ని మరింత పెంచుతుంది. ఒక శాతం సంపన్నులు, పేదరికంలో ఉన్న అమెరికన్ల మధ్య అంతరం మరింత పెరుగుతుంది. సంక్షేమరంగంపై విధించే కోతలు సామాజిక భద్రతను మరింత హరిస్తాయి. చైనా, సౌదీ అరేబియా, రష్యా, యూకే, ఇండియా, ఫ్రాన్స్, జపాన్ల మొత్తం రక్షణ రంగం వ్యయం కంటే అమెరికా అధికంగా ఖర్చు చేస్తోంది. 2013లో శిశు మరణాలు అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలోనే అత్యధికం. మిగతా ఐరోపా దేశాలతో పోల్చితే అసమానతల స్థాయి ఎంతో ఎక్కువగా ఉంది. ప్రజలందరికీ మంచి నీరు, పారిశుద్ధ్యం అందుబాటులో ఉన్న దేశాల్లో అమెరికా ఇంకా 36వ ర్యాంక్‌లోనే ఉంది. తుర్కెమినిస్తాన్, ఎల్ సాల్వడార్, క్యూబా, థాయ్‌లాండ్, రష్యాల్లోని జైళ్లలో కంటే అమెరికా జైళ్లలోనే ఖైదీల సంఖ్య ఎక్కువ. ఓఈసీడీ(ఆర్థికంగా అభివృద్ధి చెందిన 35 దేశాల కూటమి) దేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ శాతం యువత దారిద్య్రంలో ఉన్నారు. కెనడా, యూకే, ఐర్లాండ్, స్వీడన్, నార్వేలతో పోల్చితే అమెరికా పిల్లల్లో పేదరికం ఎక్కువ’ అని నివేదికలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
దేశంలో తగ్గుతున్న పేదరికం
సాక్షి, హైదరాబాద్: దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహా దారు డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణియన్ అన్నారు. దేశంలో కొనసాగుతున్న సుస్థిరాభివృధ్ధి దశల వారీగా పేదరికాన్ని తగిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం మానవ వనరుల అభివృధ్ధి కేంద్రంలో జరిగిన ‘దేశ పురోగతి విధానం, భవిష్యత్తు’అన్న అంశంపై జరిగిన సద స్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై సుబ్రహ్మణియన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న దారిద్య్రం
-
‘నిఖా’ర్సయిన దగా!
పేదరికం ఎక్కడుంటుందో కష్టాలక్కడ ఉంటాయి. అలాంటిచోట ఆడ, మగ వివక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. పేదరికం ఉన్నచోట మహిళలు, బాలికల స్థితి మగవాళ్లతో పోలిస్తే అత్యంత దుర్భరంగా, దయనీయంగా ఉంటుంది. నిరుపేద కుటుంబాలకు సంప్రదాయం పేరుతో, నిఖా పేరుతో వలవేసి ఆ ఇళ్లలోని ఆడపిల్ల లకు మెరుగైన జీవితాన్నిస్తామని అబద్ధాలు చెప్పి వివాహం చేసుకున్నట్టు నటించి వారి బతుకుల్ని నాశనం చేస్తున్న అరబ్ షేక్‌లు, వారి తరఫున గద్దల్లా వాలే దళా రీలు హైదరాబాద్‌లోని పాత బస్తీలో మరోసారి పట్టుబడ్డారు. బుధవారం పోలీసులు వెల్లడించిన వివరాలు అత్యంత దిగ్భ్రాంతికరమైనవి. ముంబైకి చెందిన ఒక ప్రధాన ఖాజీ సహా ఈ వ్యవహారంలో 20మందిని వారు అరెస్టు చేశారు. ఈ పెళ్లిళ్ల వెనక భారీ నెట్వర్క్ ఉన్నదని గుర్తించారు. ఆ ప్రధాన ఖాజీ ఇప్పటికే వేల సంఖ్యలో ఇలాంటి దొంగ పెళ్లిళ్లు జరిపించాడని, వాటికి వివాహ ధ్రువీకరణ పత్రా లిచ్చి గల్ఫ్ దేశాలకు పంపించాడని తేలింది. పాత బస్తీ ఇలాంటి దురన్యాయాలకు చాన్నాళ్లక్రితమే ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతి నెలా అక్కడ 20 నుంచి 30 కాంట్రాక్టు పెళ్లిళ్లవుతాయని ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ పెళ్లిళ్ల ద్వారా ఏటా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అప్పులపాలైన కుటుంబాలు... తీవ్ర అనారోగ్యంతో కుములుతూ చికిత్స చేయించుకునే స్థోమత లేని కుటుంబాలు... అర్ధాకలితో అలమటిస్తూ కనీసం తమ పిల్లయినా సుఖపడు తుందన్న ఆలోచన ఉన్న కుటుంబాలు దళారులు చెప్పే మాటలకు లొంగి పోతున్నాయి. తమ పిల్లల జీవితాలను అగాధాల్లోకి నెడుతున్నామని గుర్తించలేక పోతున్నాయి. నిఖాలతో పేరిట సాగుతున్న ఈ తంతు అత్యంత దుర్మార్గమైనది. ఇందుకు సహకరించే ఖాజీలు ఫోన్లో సైతం పెళ్లిళ్లు జరిపించేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అరబ్ దేశాల నుంచి వచ్చే వృద్ధ షేక్‌లు మైనర్ బాలికలతో పెళ్లి తంతు ముగించుకుని ఒకటి రెండు నెలలు కాపురం పేరిట వారితో కాలక్షేపం చేసి తలాఖ్ చెప్పి వెళ్లిపోవడం లేదా తప్పుడు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆ దేశాలకు తీసుకుపోయి వారిని కట్టుబానిసల్లా చూడటం రివాజుగా మారింది. దుబాయ్, ఒమన్, సూడాన్, బహ్రెయిన్, నైజీరియా తదితర దేశాల నుంచి వచ్చే వృద్ధ షేక్‌లు భారీగా కమిషన్ ఇస్తామని దళారులకు ఆశ చూపి వారి ద్వారా ఈ మైనర్ బాలికలను రప్పించుకుంటున్నారు. ఒక పెద్ద మాఫియా నెట్ వర్క్ కనుసన్నల్లో ఇదంతా జరుగుతున్నది కాబట్టి బయటకు పొక్కేవి చాలా తక్కువం టున్నారు. పాతబస్తీలో వెల్లడవుతున్న ఘటనలు వింటుంటే అసలు మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామన్న సందేహం తలెత్తుతుంది. నిరుడు ఆత్మ హత్య చేసుకున్న ఒక బాలిక ఉదంతం ఈ కాంట్రాక్టు పెళ్లిళ్ల తీరును వెల్లడించింది. ఒక్కొక్కరితో నెల నుంచి అయిదు నెలలు గడిపేలా ఒప్పందాలు కుదిర్చి 17 కాంట్రాక్టు వివాహాల్లో ఆమెను ఇరికిస్తే జీవితంపై విరక్తి చెంది బాలిక ఆత్మహత్య చేసుకుంది. పదహారేళ్ల బాలికను 68 ఏళ్ల వృద్ధుడికిచ్చి కట్టబెట్టి ఒమన్ పంపిస్తే అక్కడ నిత్యం ఎదురవుతున్న చిత్రహింసలకు తాళలేక గత నెల తల్లికి ఫోన్ చేసి మొరపెట్టుకుంది. భార్యగా తీసుకెళ్లి వెట్టి చాకిరీ చేయించుకోవడం, వ్యభిచార గృహాలకు అమ్మేయడంలాంటి ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. ఈ దొంగ పెళ్లిళ్లకు బలైనవారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉన్నదంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. ఒక్కో పెళ్లికి దాదాపు రు. 20 లక్షల వరకూ చేతులు మారుతుండగా బాలిక కుటుంబానికి మిగిలేది వేల రూపాయలకు మించడం లేదు. అమృతా అహ్లువాలియా అనే ఎయిర్‌హోస్టెస్ ఒకరు 1991లో విమానంలో ప్రయా ణిస్తున్న ఒక బాలిక ఆగకుండా రోదిస్తుండటాన్ని గమనించి ముంబైలో దిగగానే పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించిన ఘటనలో తొలిసారి ఈ దొంగ పెళ్లిళ్ల వ్యవ హారం ప్రముఖంగా బయటికొచ్చింది. ఆనాటినుంచీ పోలీసులు అడపా దడపా దాడులు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నా ఈ దుర్మార్గం అంతకంతకూ పెరుగు తున్నదే తప్ప తగ్గడం లేదు. ఇదిప్పుడు కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా పాకింది. ఇలాంటి ఉదంతాలను కేవలం పెళ్లిళ్ల కోణంలో చూసి కేసులు పెట్టడంలోనే సమస్యంతా ఉంది. ఈ వ్యవహారాన్ని మోసపు పెళ్లిగా మాత్రమే గుర్తించి... ఖాజీలిస్తున్న వివాహ ధ్రువీకరణ పత్రాలనూ, వాటి ఆధారంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఇచ్చే నిఖా ధ్రువపత్రాలనూ పరిశీలించడానికి, వాటిల్లోని నిజానిజాలను తేల్చడానికి సమయం వృథా చేయకుండా మైనర్ బాలికలను అపహరించి తరలిస్తున్నట్టు పరిగణించాలి. అందుకు కారకులైనవారిని, వారికి సహకరిస్తున్న వారిని కిడ్నాపర్లుగా గుర్తించి కేసులు నమోదు చేయాలి. అలాగైతేనే నిందితులకు యావజ్జీవ శిక్ష వరకూ పడే అవకాశం ఉంటుంది. అది జరగాలంటే పకడ్బందీ ఆధారాలు సమర్పించి న్యాయస్థానాల్లో కేసుల సత్వర విచారణకు సహకరించాలి. అప్పుడు ఈ మాదిరి నేరాలకు పాల్పడేవారిలో భయం ఏర్పడుతుంది. ఇప్పుడను సరిస్తున్న విధానాలవల్ల ఎవరిపైనా సరైన చర్య తీసుకోలేకపోతున్నారు. నిందితులు సులభంగా బెయిల్ సంపాదించి బయటికొస్తున్నారు. తమ నేరాలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పెళ్లిళ్ల తంతుకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ఆలోచనతో కూడా ఉందంటున్నారు. ఐపీసీలోని కఠిన సెక్షన్లు వర్తించేలా అందులోని నిబంధనలుండాలి. పాత బస్తీలోని కొన్ని ప్రాంతాలు దుర్భర దారిద్య్రానికి మారుపేరుగా ఉన్నాయి. అక్కడ 40 శాతం కుటుంబాలు పేద రికంలో మగ్గుతున్నాయని చెబుతున్నారు. ఉపాధి అవకాశాలను పెంచడం, మెరు గైన విద్యా సదుపాయాలు కల్పించడం, ఆడపిల్లలను చదివించే కుటుంబాలకు ఆసరా కల్పించడం వగైరా చర్యలు కూడా అవసరం. అలాగే మత పెద్దల సహ కారాన్ని కూడా తీసుకోవాలి. ఇవన్నీ సమగ్రంగా అమలు చేసినప్పుడే దీన్ని శాశ్వ తంగా రూపుమాడానికి అవకాశం ఉంటుంది. -
పేదరికమే కట్టేసింది!
బతుకుఛిద్రం అవును, వాళ్లిద్దరినీ పేదరికమే కట్టేసింది. ప్రపంచంలో అన్నింటికంటే క్రూరమైనది ఏదంటే.. అది పేదరికమే. పేదరికం అంత క్రూరంగా ఉంటుందా? రాజస్థాన్‌లోని ఉమేశ్, జీవాలను చూస్తే అవునని చెప్పక తప్పదు. ఉమేశ్‌కి ఎనిమిదేళ్లు. రాజస్థాన్‌లోని కోల్యారి గ్రామం. గడచిన ఐదేళ్లుగా అతడు జీవిస్తున్నది పశువుల పాకలోనే, ఆవుల పక్కనే. మరో కుర్రాడు జీవాకి పదకొండేళ్లు. ఉదయ్‌పూర్‌కి దగ్గర్లోని బయాడి గ్రామం. అతడిని చెట్టుకి కట్టేసి పొలంలో పని చేసుకుంటాడు అతడి తండ్రి హుర్మారామ్. ఈ పిల్లలిద్దరికీ మతిస్థిమితం లేదు. ఎప్పుడు స్తబ్దుగా ఉంటారో, ఎప్పుడు మితిమీరిన ఉత్సాహంతో పరుగులు తీస్తారో ఊహించడం కష్టమే. అలాంటి పిల్లలను ఇరవై నాలుగ్గంటలూ కనిపెట్టుకుని ఉండడం ఒక మనిషికి సాధ్యమయ్యే పని కాదు. ఇంట్లో వాళ్లు వంతుల వారీగా పంచుకుంటే తప్ప సాధ్యం కానేకాదు. కన్న బిడ్డలను కడుపులో పెట్టుకుని సాకాలని ఎవరికుండదు? ఇలాంటి బిడ్డలనైతే మరీ ఎక్కువగా చూసుకోవాలి. మరి ఇలా కనిపెట్టుకుని చూడడానికి అమ్మానాన్న ఉంటేనే కదా! ఉమేశ్ తండ్రి భగవతి లాల్, తల్లి మనుదేవి హెచ్ఐవితో పోయారు. నానమ్మ, తాతే దిక్కు. వాళ్లకు వయసైపోయింది. అయితే ఆ కట్టేసేదేదో ఇంట్లోనే ఒక పక్కన కట్టేస్తే... ఇంట్లోనే ఆడుకుంటూ, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాడు కదా అంటే... నిజమే. కానీ ఉమేశ్‌కి ఒకటి, రెండు అవసరాలకు బయటకు వెళ్లడమూ తెలియదు. ఇంట్లోనే చేస్తే శుభ్రం చేసే ఓపిక ఆ ముసలివాళ్లకు లేదు. అందుకే ఉమేశ్ ఆవు పక్కన మరో గుంజకు బంధీ అయ్యాడు. ఆవు చేసినట్లే అక్కడే అన్నీ చేస్తున్నాడు. కట్టు విప్పితే పరుగులు పెట్టి పారిపోతాడని, అతడిని పట్టుకుని రావడం తన వల్ల అయ్యే పని కాదని, అందుకే కట్టేయక తప్పడం లేదంటోంది 75 ఏళ్ల నానమ్మ పీపీ బాయ్. ఉమేశ్ పుట్టడం బాగానే పుట్టాడని, మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడని, తల్లిదండ్రులు మరణించిన తర్వాత అతడిలో విపరీత ప్రవర్తన మొదలైందంటోందామె. వైద్యం చేయించాలంటే డబ్బులేదని కన్నీళ్ల పర్యంతమైంది పీపీబాయ్. జీవాకి పోలియోతోపాటు బుద్ధిమాంద్యం కూడ. ఎక్కడ వదిలితే ఎటు వెళ్లిపోతాడో తెలియదు. ఎక్కడ నుంచి జారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడో ఊహించలేం. గతంలో జరిగాయి కూడా. అందుకే చెట్టుకి కట్టేసి పొలం పనులు చేసుకుంటున్నాననంటాడు హుర్మారామ్. ఆ రాష్ట్ర చైల్డ్వెల్ఫేర్ కమిటీ ప్రతినిధుల జోక్యంతో ఉమేశ్, జీవాలు ఇటీవల విడుదలయ్యారు. అధికారులు వాళ్లను రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ఇలాంటి పిల్లలను కట్టేయడం నేరమని వారిని మందలించారు అధికారులు. వారి మేధోపరిణతికి తగ్గట్లుగా వ్యవహరిస్తూ అన్ని విషయాలనూ తెలియచెప్పాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. నిజానికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది ఆ పేద తండ్రికి, నానమ్మకు కాదు. దేశంలో ఇంకా పోలియోను తరిమి కొట్టలేని పాలకులకు, హెచ్ఐవి బాధితుల పిల్లలకు సరైన పునరావాసం కల్పించలేని ప్రభుత్వానికి. -
ఇల్లు కట్టించిన ఫేస్బుక్ మిత్రులు..
ఆనందంలో నిరుపేద పుష్ప కుటుంబీకులు బెల్లంపల్లి (మంచిర్యాల): పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి ఫేస్బుక్ స్నేహితులు గూడు కల్పించారు. రూ.లక్షా ఆరు వేల రూపాయలతో ఇంటిని నిర్మించారు. ఆదివారం గృహ ప్రవేశం చేయనున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన లక్కపట్ల పుష్పది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పుష్పకు ఇద్దరు చెల్లెళ్లు. వారి వివాహ బాధ్యతలను స్వీకరించిన పుష్ప పెళ్లి చేసుకోలేదు. ఓ చెల్లెలికి పెళ్లి చేయడంతో ఆమె ఓ కూతురు రమ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత చెల్లెలు భర్త అకాల మరణం చెందాడు. రమ్య పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో పుష్ప ఆమెను దత్తత తీసుకుంది. వీరి దుస్థితిని గమనించిన బెల్లంపల్లి మైహార్ట్ బీట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుదర్శన్, కల్పన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రమేశ్ ఈ నెల 1న పుష్ప దీనస్థితిని ఫేస్బుక్లో పోస్ట్ చేసి మిత్రుల సహకారం అర్థించగా.. రూ.1.06 లక్షలు జమయ్యాయి. వీటితో పుష్పకు ఇల్లు నిర్మించారు. -
పేదింటికి అవమానపు ముద్ర
పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే. ఆవశ్యక ఆర్థిక వనరులు కొరవడితే ఎవరైనాగానీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది లేదా వచ్చే కొద్దిపాటి రాబడికి అల్పస్థాయి జీవన ప్రమాణాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మానవాభివృద్ధి సూచికను కొలిచే మూడు కొలబద్ధలలో ఒకటి, ఆదాయం. డబ్బు లేకపోయాక మిగతా రెండిటిని... ఆరోగ్యాన్ని, పాఠశాలల్లో నేర్చుకోగల జ్ఞానాన్ని పొందడం కష్టమౌతుంది. కాబట్టి పేదరికాన్ని అతి పెద్ద అసౌకర్యమని చెప్పుకోవచ్చు. కానీ అది దాన్ని తక్కువ చేసి చెప్పడం అవుతుంది. పేదలను ప్రభుత్వం కేవలం ఒక గణాంకంగా చూడటం ద్వారా వారికి సంబంధిం చిన మానవాంశను నిర్మూలించి, పుండుకు కారం రాసినట్టుగా అవమానిస్తుంటే.. అంతకంటే హీనమైనదిగా మారుతుంది. ‘పేద’ పేటెంటు కాదగిందే కావచ్చుగానీ, పేదలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం పేదలు తమ ఇంటి ముందు గోడలపై ప్రజా పంపిణీ వ్యవస్థ సహా వారు వేటికి అర్హులో సూచించే నోటీసులను రాయించుకునేలా చేసి అవమానించే చర్యలు చేపట్టింది. ఇది పూర్తిగా మతిలేని పని. దీంతో పేదలను వేలెత్తి చూపి, ఆదాయాల రీత్యాగాక, వారికి ఇంకా సొంతంగా మిగిలిన వాటిని కూడా హరించి వేయడం జరుగుతుంది. అందులో వారి వల్ల సమాజానికి ఉన్న ఉపయోగం ఒకటి. పేదలుగా గుర్తించేవారి ఆదాయ స్థాయి ఏమిటో గ్రామమంతటికీ తెలిసిందే. అయినా వారి ఇంటి గోడలపై దాన్ని రాయడం వెనుక ఉన్న ఉద్దేశం రికార్డులను నమోదు చేయడం కాదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీకి రేషన్ పొందేవారికి ఇప్పటికే రేషన్ కార్డులున్నాయి. వారి స్థానం ఏమిటో గుమాస్తాలు రిజిస్టర్లలో జాగ్రత్తగా నమోదు చేసి ఉంటారు. పరిపాలనాపరమైన ఈ పూర్తి వెర్రిబాగులతనానికి రాజస్థాన్ ప్రభుత్వం ఇంతవరకు సమంజసమైన వివరణను ఇవ్వలేదు. పేదలను సర్వే చేయడానికి వచ్చే ఇన్స్పెక్టర్ల దృష్టిని ఆకర్షించడం కోసం వారు తమ గోడలకు ఈ రంగు ముద్రలను వేయించుకోవాలనేట్టయితే.. అంతిమంగా అది అత్యాధునికమైన ఈ పంపిణీ వ్యవస్థలోని అధికారగణం నిజాయితీ గురించి చాలానే చెబుతుంది.ఇప్పటికే పీకల లోతు పేదరికంలో మునిగి ఉన్న పేదలు తమ ఇంటి గోడలకు ఈ రంగులు, రాతలు వేయించుకోగలరని ఆశించడం మరో మతిమాలిన పని. ఒకవేళ ప్రభుత్వమే అందుకు ఆర్థిక వనరులను సమకూరుస్తుండి ఉంటే, ఏదో ఒక స్థాయిలో డబ్బు చేసుకునే రాకెట్ ఏదో నడుస్తుండి ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇంటి గోడలపై పచ్చ రంగు మాసికలను వేసే ఈ కార్యక్రమాన్ని... బహుశా పైలట్ ప్రాజెక్టుగా కామోసు భిల్వారా జిల్లాలోని పేదల ఇళ్లకు పరిమితం చేశారు. దీనికి ముందే, ప్రభుత్వాధికారులకు సర్వసాధారణంగా మారిన ఈ తోలు మందపుతనం మధ్యప్రదేశ్‌లో కనిపించింది. పేదరికం నేరమన్నట్టుగా పేదలు ముద్రలు వేసుకోవడం అవసరమైంది. ఇలాంటి మూర్థత్వానికి హేతువు ఏమిటో మాత్రం అంతుబట్టడం లేదు. గొప్ప సంపన్నులను బహిరంగంగా వారి ఆదాయపు పన్ను రిటర్నులను బహిరంగపరచాలని కోరితే, అది వారి ప్రైవసీపై దాడి అంటూ తక్షణమే గగ్గోలు పుడుతుంది. బ్యాంకులకు భారీ మొత్తాల్లో ప్రజాధనాన్ని బకాయిపడ్డ వారి సమాచారాన్ని బహిర్గతం చేయడం బ్యాంకు పరపతి క్రమాలను దెబ్బ తీస్తుందని రిజర్వ్ బ్యాంకు, సుప్రీం కోర్టుకు చెప్పింది. మొండి బకాయిదార్లయిన కార్పొరేట్ల పేర్లను వెల్లడించి, వారిని అవమానించడానికి అది తిరస్కరించింది. కార్పొరేట్లు అంతరాత్మగలిగిన మానవులు కారు. అయినా అవి ఎగవేతదార్లుగా సుప్రీంకోర్టు ముందు గుర్తింపును పొందడాన్ని ప్రజా వ్యవహారాలకు సంబంధించిన సమస్యగా భావించి పట్టించుకున్నాయి. కానీ రాజస్థాన్లోగానీ, మరెక్కడైనాగానీ పేదలు మనుషులు కాబట్టి, వారికి మనసులు ఉంటాయి. ఈ అంశాన్నే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పేదలైన కారణంగానే పేదలను అంత మొరటు పద్ధతిలో చులకన చేయవచ్చు అన్నట్టుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ప్రతి బడ్జెట్లోనూ కేటాయింపులను చేస్తుండటమే గాక, క్రమం తప్పకుండా కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తున్నాయి. కాబట్టి పేదలు ఎన్నడో లేకుండా పోయి ఉండాల్సింది. కానీ అవేవీ పని చేయకపోవడం వల్లనే పేదలు ఇంకా పేదలుగా మిగిలారు. పేదరిక రేఖ స్థాయిగా సూచించిన ఆదాయానికి మించి ఒక్క రూపాయి సంపాదించినా గణాంక రీత్యా అలాంటి వారు పేదరికం నుంచి బయటపడిపోయినట్టే. కాబట్టే పేదల జనాభా కుచించుకుపోతోంది. అందువలన పేదరిక నిర్మూలనా కార్యక్రమాల రూపకల్పన, అమలుతో ముడిపడి ఉన్న వారంతా... కేంద్ర మంత్రుల నుంచి, గ్రామ పెద్దల వరకు తమ వైఫల్యాన్ని సూచించేలా తమ ఇళ్లకు ఆరెంజ్ రంగు వేయిం చుకోవాల్సిన సమయం బహుశా ఇదే కాదా? పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పేదరిక నిర్మూలనలో బ్యాంకుల పాత్ర కీలకం
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు(అగ్రికల్చర్): పేదరిక నిర్మూలనలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ చెప్పారు. స్వయం సహాయ సంఘాలకు, వృత్తి పనివారికి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. శనివారం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కెనరా బ్యాంకులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాంకు ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబసభ్యులకు ప్రధానమంత్రి సురక్ష యోజన కింద రూ. 2 లక్షల విలువ చేసే చెక్‌లను అందచేశారు. స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కెనరాబ్యాంకు అసిస్టెంటు జనరల్ మేనేజర్ తిరపతయ్య, నంద్యాల చెక్‌పోస్టు బ్రాంచి మేనేజర్ లక్ష్మీనరసయ్య వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పేదరికాన్ని జయించాలి
పర్వతగిరి(వర్ధన్నపేట): పేదరికాన్ని అనుభవిస్తూ కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు చదువుతో పేదరికాన్ని జయించాలని కడియం కావ్య అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు తాగునీటి సౌకర్యం కోసం గురువారం కావ్య ఫ్రిజ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థినీల సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలన్నారు. వందేమాతరం షౌండేషన్ వ్యవస్థపకుడు రవీందర్రావు మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎంఎన్ఎస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులు కార్పొరేట్ స్థాయిని మించి గణితం చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ నజీర్ మాట్లాడారు. అనంతరం విద్యార్థినులు కావ్యకు బహుమతులు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ కక్కెర్ల శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నవోదయ శిక్షణ కేంద్రానికి రూ.40వేలు సాయం
తాడూరు: మండల పరిధిలోని మేడిపూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత నవోదయ శిక్షణ కేంద్రానికి గురువారం పాలెంకు చెందిన మనసాని రమేష్ రూ. 40వేలు, తండ్రిలేని అభయశ్రీకి రూ.2వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈసందర్భంగా ఎంఈఓ టి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దాతలు విద్యార్థుల ఎదుగుదల కోసం చదువులో రాణించాలనే ఉద్ధేశ్యంతో చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే లక్ష్యంతో సహాయ, సహకారాలు అందించేందుకు ముందుకొచ్చే దాతలు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆవోపా తరఫున రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఆవోపా జిల్లా అధ్యక్షుడు పోల శ్రీధర్, కోశాధికారి రవి, కుమ్మెర జీహెచ్ఎం గుడిపల్లి నిరంజన్, ఆయా ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు భద్రన్న, ఎస్వీరాజు, కట్టా శ్రీనివాస్‌రెడ్డి, నవోదయ శిక్షకులు రాములుగౌడ్, కార్తీక్, మధు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఆలయాల సంపదతో.. పేదరికం హుష్‌కాకి!
ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేయడంతో నల్లధన సంపన్నుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నల్లధనాన్ని సక్రమధనంగా మార్చేందుకు పలువురు ధనికులు నానా తంటాలు పడుతుండగా.. మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా గుళ్లు, గోపురాలకు భారీగా ముడుపులు సమర్పించుకుంటున్నారు. పెద్దనోట్లు రద్దు తర్వాత దేశంలోని ఆలయాలన్నింటికీ పాతకరెన్సీరూపంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏ దేవుడి హుండీ చూసినా పాతకరెన్సీ కట్టలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్-10 ఆలయాల సంపద జాతికి అందజేస్తే.. దేశంలో పేదరిక సమస్యే ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని టాప్-10 ఆలయాలు.. వాటి సంపద వివరాలు ఇవి. పద్మనాభస్వామి ఆలయం - కేరళ దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇది. అనంతపద్మనాభుడి వద్ద ఎంతలేదన్న 20బిలియన్ డాలర్ల (రూ. Rs 13.60 లక్షల కోట్ల) సంపద ఉంటుందని అంచనా. తిరుమల తిరుపతి దేవస్థానం - ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకన్నకు ఏటా రూ. 650 కోట్లు విరాళాలరూపంలో అందుతున్నాయి. లడ్డూల అమ్మకం ద్వారానే ఏటా రూ. 75 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దేశంలో అత్యంత సంపన్నమైన రెండో దేవాలయంగా టీటీడీ విరాజిల్లుతోంది. షిర్డీ సాయిబాబా - మహారాష్ట్ర దేశంలో అత్యంత సంపన్నమైన మూడో ఆలయం షిరిడీ సాయినాథుడిదే. సాయిబాబా ఆలయం వద్ద రూ. 32 కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు రూ. 6 లక్షల విలువైన నాణెలు ఉన్నాయి. విరాళాల రూపంలో ఆలయానికి ఏటా రూ. 360 కోట్లు అందుతున్నాయి. వైష్ణోదేవి ఆలయం- జమ్మూ దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో వైష్ణోదేవి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఏటా రూ. 500 కోట్లమేర విరాళాల రూపంలో అందుతున్నాయి. సిద్ధి వినాయక ఆలయం-ముంబై బాలీవుడ్ సెలబ్రిటీలు నిత్యం దర్శించుకునే ఈ ఆలయానికి ఏటా రూ. 48 కోట్ల నుంచి రూ. 125 కోట్ల వరకు విరాళాలు అందుతున్నాయి. స్వర్ణ దేవాలయం- అమృత్సర్ బంగారుతాపడంతో చేయించిన ఆలయం ఇది. ఇందులో కొలువైన సిక్కుల పవిత్ర పుస్తకమైన గురు గ్రంథ్ సాహిబ్‌లో వజ్రాలు, విలువైన మణులు పొదిగిఉన్నాయి. మీనాక్షి ఆలయం- మధురై ఈ ఆలయాన్ని ఏటా 30వేలమంది దర్శించుకుంటారు. ఏడాదికి రూ. ఆరు కోట్ల ఆదాయం ఈ ఆలయానికి వస్తున్నది. జగన్నాథ ఆలయం-పూరి ఈ ఆలయం పూర్తి విలువ ఎంత ఉంటుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఆలయంలో 130 కిలోల బంగారం, 220 కిలోల వెండి ఉందని చెప్తారు. జగన్నాథ రథయాత్రకు పేరొందిన పూరి ఆలయానికి గతంలో ఓ యూరప్ భక్తుడు రూ. 1.72 కోట్ల విరాళం అందజేశాడు. కాశీ విశ్వనాథ ఆలయం- వారణాసి ఈ ఆలయానికి మూడు గుమ్మటాలు ఉండగా, అందులో రెండు బంగారుతాపడంతో చేయించినవి. ఈ ఆలయానికి ఏటా విరాళాల రూపంలో రూ. 4 నుంచి 5 కోట్ల ఆదాయం వస్తుంది. సోమ్‌నాథ్ ఆలయం- గుజరాత్ గుజరాత్‌లోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇది. ఈ ఆలయానికి ఏటా రూ. 33 కోట్ల ఆదాయం వస్తుంది. -
అధికారుల సమన్వయంతోనే పేదరిక నిర్మూలన
– జస్టిస్ రమేష్ రంగనాథన్ కర్నూలు(లీగల్): ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని కె.ఎస్.వ్యాస్ ఆడిటోరియంలో పేదరిక నిర్మూలనపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ఫలాలు పేదలకు అందాలంటే అధికారులు చిత్తశుద్ధితో పని చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి లజపతిరాయ్ మాట్లాడుతూ ప్రస్తుత పథకాలను వేగవంతం చేసినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయ న్యాయ శాఖ ఆచార్యులు ఎస్.శేషయ్య మాట్లాడుతూ దేశంలోని ఆర్థికవేత్తలకు నిర్లక్షరాస్యుల సంఖ్యపై నిర్దిష్టమైన సమాచారం లేదన్నారు. అట్టడుగు కులాల్లోని పేదలను కొందరు తక్కువ చేసి మాట్లాడటం వారి అభివద్ధికి నిరోధకంగా మారుతుందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కనీస సౌకర్యాల లేమితో దాదాపు 200 మంది వడదెబ్బతో మరణించారని గుర్తు చేశారు. నల్యా విశ్వవిద్యాలయం సహాయ కులపతి సునీల్‌కుమార్ మాట్లాడుతూ భూమి హక్కు పేదరిక నిర్మూలనలో ప్రాధన పాత్ర పోషిస్తుందన్నారు. నిరుపేదలకు కొద్దోగొప్పో భూమి పంచితే కాస్తయినా పేదరికం తొలుగుతుందన్నారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎన్.శేషగిరిరావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.రామాంజనేయులు, సెర్ఫ్ పీడీ టి.మురళీధర్‌రావు తదితరులు వారి పరిధిలోని పథకాల అమలు తీరును వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సభ్యుడు రాంబాబు, జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, జిల్లా అదనపు న్యాయమూర్తులు ఎస్.ప్రేమావతి, వి.వి.శేషుబాబు, రఘురాం, కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగే పేదరికం సంపదకే సవాల్
సమకాలీనం గ్రామీణార్థిక వ్యవస్థ ఛిద్రమవడం, అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయరంగం కుదేలవడం పేదరికాన్ని మరింత పెంచింది. విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వాల అశ్రద్ధ పేద, అల్పాదాయ వర్గాల్ని దారుణంగా కుంగదీస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం, ఒక వ్యవ సాయ కుటుంబం వార్షిక వ్యయ–రాబడి వ్యత్యాసాల వల్ల సగటున 4 శాతం మంది ఏటా కొత్తగా పేదరికంలోకి జారుతున్నారు. అనుకోకుండా వచ్చే విద్య, వైద్య ఖర్చుల కారణంగా సగటున మరో 3 శాతం మంది ఏటా బలవంతంగా దారిద్య్రరేఖ కిందకు పడిపోతున్నారు. ప్రపంచంలో ఏడో సంపన్న దేశవాసిని నేను. భూమి మీదున్న దాదాపు రెండువందల దేశాల్లో ఇంత గొప్ప స్థానంలో ఉండటం గర్వించదగ్గ విష యమే! ఇది నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే! నాణెపు మరోవైపు చూడ టానికి సాహసం కావాలి. కొంచెం ధైర్యమూ కూడగట్టుకోవాలి. ఇంతటి వైరుధ్యం ప్రపంచంలో మరే దేశానికీ ఉండదేమో! ఎప్పుడో స్వతంత్రం వచ్చిన కొత్తలో సరదాకి చెప్పుకున్న వ్యంగ్యోక్తి నేటికీ నూటికి నూరుపాళ్లు నిజం. వైరుధ్యాన్ని నిరూపించే ప్రపంచ నివేదికల్లోని కఠిన వాస్తవాల్ని మన మంతా జీర్ణించుకోవాల్సిందే! అదేంటంటే, ప్రపంచంలో ఏడో సంపన్న దేశ మైనా అత్యధిక నిరుపేదలున్న దేశం కూడా మనదే! వేళ్లపైన లెక్కించదగ్గ సంఖ్యలో సంపన్నులు, ముప్పయ్ కోట్లకు పైబడి నిరుపేదలు కలగలిసి సహ జీవనం చేస్తున్న ‘భిన్నత్వంలో ఏకత్వం’ మనది. అపార సహజవనరులు, గొప్ప సంస్కృతీ వారసత్వ సంపదల వల్ల భారతదేశానికున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా అప్పట్లో మేధావులు దీన్నొక గొప్ప దేశంగా అభివర్ణించేవారు. ఆ క్రమంలోనే ‘నిరుపేదలు నివసించే సంపన్నదేశమ’ని సరదా వ్యాఖ్యా వినిపించేది. వారి సరదా సంగతేమో గానీ, నేటికీ మన పేదరికం సమస్య గట్టె క్కలేదు. మహా మేధావులు రూపుదిద్దిన రాజ్యాంగం నీడలో పలు పంచవర్ష ప్రణాళికలు, గరీబీ హఠావో నినాదాలు, అందర్నీ కలుపుకుపోయే (ఇంక్‌లు సివ్) అభివృద్ధి నమూనాలు.... వెరసి, మెడలో బోర్డు కట్టుకున్న ‘సంక్షేమ రాజ్యం’ ఏడు దశాబ్దాలు గడుస్తున్నా లక్ష్యానికింకా ఆమడ దూరంలోనే ఉంది. పేదరికం పెనుశాపమై నాలుగోవంతు జనాభాను నలిపేస్తోంది. మరో వైపు సంపద మాత్రం పోగవుతూనే ఉంది. అది అవకాశాల్ని అందిపుచ్చు కున్న, అధికారానికి అతి సమీపంగా ఉన్న కొద్దిమంది వద్ద మాత్రమే జమవు తోంది. అందుకే, మనకిప్పుడు ఏడో స్థానం దక్కింది. ఒక దశ చేరాక సంపద సృష్టి కన్నా సంపద పంపిణీ ముఖ్యమై కూర్చుంటుందన్న కమ్యూనిస్టు మేధావి కారల్ మార్క్స్ మాటలు వర్తించేది ఇక్కడే! అది సవ్యంగా జరగక పోవడం వల్లే ఈ అసాధారణ అసమానతలు. అనారోగ్యకరమైన ఆర్థిక అంత రాలు. భారమైన బతుకులీడ్చే బహుజనుల్లో నిత్య అశాంతికి కారణాలు. నిత్యం రగిలే కుంపటే! ‘న్యూ వల్డ్ వెల్’్త సంస్థ ప్రపంచంలో పది సంపన్న దేశాల జాబితాని మొన్న మంగళవారం విడుదల చేసింది. అమెరికా అగ్రస్థానంలో ఉంటే చైనా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు వరుసగా దాని వెనుకున్నాయి. 5,600 బిలి యన్ అమెరికా డాలర్ల (అంటే 372.5 లక్షల కోట్ల రూపాయల) సంపదతో భారత్ ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కెనెడా, ఆస్ట్రేలియా, ఇటలీ ఉన్నాయి. ఒక దేశంలోని అందరి వ్యక్తిగత ఆస్తుల మొత్తం విలువను పరి గణనలోకి తీసుకొని ఈ సంపద లెక్కిస్తారు. అందులో ప్రతి వ్యక్తి స్థిర–చరాస్తి నగదు, ఈక్విటీ, ఇతర వ్యాపార ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకుం టారు. అప్పులు తదితర బాకీల భారాన్ని మినహాయించిన మీదటే సంపద లెక్కగడతారు. ప్రభుత్వ నిధుల లెక్కల్ని ఈ గణింపులోకి తీసుకోరు. భారత్ పెద్ద జనాభా వల్ల ఇది సాధ్యమైందని నివేదికలో పేర్కొన్నారు. అతి తక్కువ, 2.2 కోట్ల జనాభాతో ఆస్ట్రేలియా తొమ్మిదో స్థానం గడించడం గొప్పనీ పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇటలీలతో పాటు గత పదిహేనేళ్లలో సంపద పరంగా భారతదేశం బాగా బలపడిందనీ నివేదిక పేర్కొంది. అయితే, ఈ సంపద వృద్ధి మన దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమానతలపై ఓ పెద్ద వెక్కిరింపు అని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే, స్థూల వార్షికా దాయం లెక్కల్లో గణిస్తే సగటు భారతీయుడు నిరుపేద. అలా చూసినపుడు ప్రపంచ దేశాల్లో మనం 120 స్థానంలో ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. మొదటి పది దేశాలకు ఇదెంతో దూరం. దేశంలో నాలుగో వంతు జనాభా, అంటే 30 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువన రోజూ సగటున తొంబై రూపాయలు (1.25 అమెరికా డాలర్) కూడా గడించలేని పేదరికంలో అలమటిస్తున్నారు. ఈ రాబడితో ఇంటిల్లిపాదికీ పూట గడవడమే కష్టం. 80 కోట్ల మంది దినసరి ఆదాయం 150 రూపాయల (2 యుఎస్డీ) లోపేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సంపద పంపిణీ అసమగ్రంగా ఉంటోంది. ఒక వైపు పేదరికం పెరుగుతుంటే మరో వైపు సుసంపన్నులు పెరుగుతున్నారు. మధ్యేరకం సంపన్నుల్లోనూ వృద్ధి లేదు. ముఖేష్ అంబానీ, దిలీప్ సంఘ్వీ, అజీమ్ ప్రేమ్‌జీ, శివ్ నాడార్, సైరస్ పుణావాలా, లక్ష్మిమిత్తల్, ఉదయ్ కోటక్, కుమారమంగళం బిర్లా, సునీల్ మిత్తల్, దేశ్‌బంధు గుప్తాలు అత్యంత సంపన్నులుగా తొలి పది స్థానాల్లో ఉన్నారు. ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు వంద మంది బిలియనీర్లున్నారు. కానీ, మిలియనీర్లను పెద్దగా పెరగనీయడం లేదన్న విమర్శ ఉంది. దేశంలో వంద కోట్ల (బిలియనీర్) ఆస్తిపరుడొకరికి సగటున ఎంత మంది మూడేసి కోట్ల (30 మిలియన్ల) ఆస్తిపరులున్నారన్న నిష్పత్తి (యుహెచ్ఎన్ఐస్) లెక్కలు చూస్తే భారత్‌లో అసమానతలు ఇట్టే తెలుస్తాయి. అలా ఒక బిలియనీర్‌కు 29 మంది మాత్రమే మూడు కోట్లకు మించిన సంపదగల వారున్నట్టు సగటు నిష్పత్తి గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిష్పత్తి జపాన్ (1:609), బ్రెజిల్ (1:129), దక్షిణాఫ్రికా (1:119)లలో అధికంగా ఉంది. ప్రపంచ సగటు కూడా 1:100 నిష్పత్తిగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే, మన దేశంలోని మొత్తం జనాభాలో 10 శాతం మంది చేతుల్లోనే 76.3 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. మరీ ముఖ్యంగా 1 శాతం జనాభా చేతిలోనే 53 శాతం సంపద పోగై ఉండటం ప్రపంచాన్నే విస్మయపరుస్తోంది. అంటే, 99 శాతం జనాభా చేతిలో సగం సంపద కూడా లేదు. ఇంతటి ఆర్థిక అసమానతలే సామాజిక అశాంతికి కారణం. అంతరాలే భవిష్యత్ సవాల్ అగ్రగామి దేశాల సంపద గర్వంగా ఉన్నా ఆరు అంశాల్లో పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగానే బాగోలేవని న్యూవల్డ్వెల్త్ సంస్థ పేర్కొంది. భరోసాలేని మహి ళల రక్షణ, పెరుగుతున్న సామాజిక భద్రత (పెన్షన్) భారం, ప్రజారోగ్య కల్పన వ్యయం, మందగించిన స్థూలాదాయ వృద్ధి, మత–జాతి పరమైన హింస పెచ్చరిల్లడం, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు కలతకు గురిచేసేవేనని పేర్కొంది. ప్రపంచ పేదరికమంతా అయిదే దేశాల్లో కేంద్రీకృతమైందని 2014 ప్రపంచబ్యాంకు ‘పేదల స్థితిగతుల నివేదిక’ వెల్లడించింది. అవి భారత్, చైనా, నైజీరియా, బంగ్లాదేశ్, కాంగో దేశాలుగా పేర్కొంది. మన దేశంలో పరిస్థితులు మెరుగుపడక పోగా మరింత దయనీయంగా మారుతున్నాయి. పేదరిక నిర్మూలనకు చేపట్టే చర్యలు ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వటం లేదు. ‘‘ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల దేశవాసులందరికీ మేలు జరుగు తుందన్న కొని ప్రతిపాదనల్ని నేను విశ్వసించాను, కానీ, అవి కొన్ని స్థాయి ల్లోని వారికి మాత్రమే ప్రయోజనం కలిగించాయని, అత్యధికులకు ఆశించిన స్థాయి మేళ్లు కలిగించలేదని వాస్తవంలో గ్రహించాను’’ అని స్వయానా దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసం ఇస్తూ చెమర్చిన కళ్లతో పశ్చాత్తాపపడ్డారు. ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల కొన్ని పెట్టుబడులు వచ్చి సంపద వృద్ధి జరిగినా పంపిణీ అస్తవ్యస్తమైంది. అది మరింత అసమానతలకు దారితీస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఆ అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. గ్రామీణార్థిక వ్యవస్థ ఛిద్రమవడం, ముఖ్యంగా అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయ రంగం కుదే లవడం పేదరికాన్ని మరింత పెంచింది. విద్య, వైద్యం వంటి రంగాల్లో వరుస ప్రభుత్వాల అశ్రద్ధ పేద, అల్పాదాయ వర్గాల్ని దారుణంగా కుంగదీస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం, ఒక వ్యవసాయ కుటుంబం వార్షిక వ్యయ–రాబడి వ్యత్యాసాల వల్ల సగటున 4 శాతం మంది ఏటా కొత్తగా పేదరికంలోకి జారుతున్నారు. అనుకోకుండా వచ్చే విద్య, వైద్య ఖర్చుల కారణంగా సగటున మరో 3 శాతం మంది ఏటా బలవంతంగా దారిద్య్రరేఖ కిందకు పడిపోతున్నారు. సగటు బతుకుల గతి మారదా? ఏడో సంపన్న దేశంగా ఉన్న మనం మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)లో 188 దేశాల్లో 130వ స్థానంలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్య క్రమం (యుఎన్‌డీపీ)లో భాగంగా గత డిసెంబరులో ఇచ్చిన ప్రపంచ మానవా భివృద్ది నివేదికే ఈ విషయం వెల్లడించింది. మనిషి సగటు జీవితకాలం, విద్య–వైద్య సదుపాయాలు, తెలివితేటలు–జీవన ప్రమాణాలు, మాతా–శిశు ఆరోగ్యస్థాయి, స్థూల జాతీయాదాయం, పిల్లలు బడికెళ్లటం–మానటం వంటి అంశాల ఆధారంగా ఈ స్థాయిని నిర్ణయిస్తారు. హెచ్‌డీఐ స్థాయి మెరుగ వాలంటే విద్య, వైద్యం, కనీస పౌర సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున పెట్టుబడులుండాలి. పేదలు, అల్పాదాయ వర్గాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దేశంలో నాలుగోవంతు జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉండగా వారిలోనూ అత్యంత దయనీయ స్థితిలో జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న వారిదీ పెద్ద సంఖ్యే! వారికంటూ ఆస్తులు లేకపోవడం, పెట్టుబడి లేకపోవడం, ఉపాధి అవకాశాలే కనిపించకపోవడం వంటివి వారి జీవన ప్రమాణాల్ని శాసిస్తున్నట్టు, అణచి ఉంచుతున్నట్టు యుఎన్‌డీపీ నివేదిక తెలిపింది. పేదల్లో 45 శాతం మంది నిరక్షరాస్యులని, మరో 25 శాతం మంది ప్రాథమిక స్థాయిలోనే చదువు నిలిపివేసిన వారని ఓ తాజా అధ్యయన నివేదిక చెబుతోంది. 6 శాతం మందికే తాగునీటి సదు పాయం ఉంది. పౌష్టికాహార లోపం, పరిసరాల అపరిశుభ్రత వారి ఆయు ష్షును తగ్గిస్తోంది. జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలసవెళుతున్నా... జీవితాలు పెద్దగా మెరుగవడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా మారుమూల గిరిజన గ్రామంలో నెలకు సగటున మూడు వేల రూపా యలు ఖర్చయ్యే కుటుంబం వలస వెళ్లిన హైదరాబాద్ వంటి ప్రాంతంలో దాదాపు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే, వలసల తర్వాత రాబడి మూడింతలు పెరిగినా, ఇదివరకటి తరహాలోనే బతు కుతారు తప్ప జీవనప్రమాణాలేమీ మెరుగుపడవు. ఇక పట్టణ ప్రాంతాలది మరో వేదన. సంపద, ఉపాధి అవకాశాలు అక్కడ కొంచెం మెరుగ్గా ఉన్నా... ఆర్థిక అంతరాలు మరింత దారుణం. వలసల పుణ్యమా అని అతి వేగంగా విస్తరిస్తున్న 100 ప్రపంచ నగరాల్లో 25 మన దేశంలోనే ఉన్నాయి. దేశంలోని దాదాపు పావు శాతం జనాభా నివసించే మన 19 నగరాలు దాదాపు మురికి వాడలేనని ప్రపంచస్థాయి నివేదిక చెబుతోంది. 35 ఏళ్ల కింద ప్రముఖ దర్శకుడు బాలచందర్ తీసిన ఆకలిరాజ్యంలో ఆత్రేయ ఒక పాట రాశారు. ‘...మన తల్లి అన్నపూర్ణ... మన అన్న దానకర్ణ... మన భూమి వేదభూమిరా తమ్ముడూ! మన కీర్తి మంచుకొండరా...!’ అని. సంపదొకవైపు పేదరికమొక వైపు పోగవుతున్న పరిస్థితికి అద్దం పట్టే మరో పంక్తి కూడా ఉంది. ‘... బంగారు పంట మనది, మున్నేరు గంగ మనది, ఎలుగెత్తి చాటుదామురా.... ఇంట్లో ఈగల్ని తోలుదామురా....’ అని. నేటి పేదల పరిస్థితి అలాగే ఉంది. ఈమెయిల్: dileepreddy@sakshi.com -దిలీప్ రెడ్డి -
విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యం
ఏయూక్యాంపస్: విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం ఏయూ సోషల్‌వర్క్ విభాగంలో కష్ణాపుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ‘పేదరికంపై గెలుపు’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన ముందుగా మన కుటుంబం, గ్రామం నుంచి ఆరంభం కావాల్సి ఉందన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేయాలన్నారు.రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ మాట్లాడుతూ నేడు పేదరికాన్ని కొంత వరకు అధిగమించడం జరిగిందన్నారు. స్వచ్చంద సంస్థలు ఈ ప్రక్రియలో చురుకైన భూమిక పోషిస్తున్నాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సమర్ధ నాయకత్వంతో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరికంపై విజయం సాధించడానికి మరింత పనిచేయాల్సి ఉందన్నారు. ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల మధ్య అభివద్ధిలో అసమానతలు ఉన్నాయన్నారు. నేటికీ విజనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగించి సమాన ప్రగతి సాధించడం ఎంతో అవసరమన్నారు. దీనిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాల్సి ఉందన్నారు. సోషల్‌వర్క్ విభాగాధిపతి ఆచార్య పి.అర్జున్మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, నీరు, ప్రాధమిక మౌళిక సదుపాయాలను కల్పించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి బాటలు వేయడం సాధ్యపడుతుందన్నారు. సోషల్‌వర్క్ విభాగ ఆచార్యులు ఎస్.వి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని అధిగమించి అభివద్ది చెందే విధానాన్ని ఉదాహరణలతో వివరించారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య కె.విశ్వేస్వరరావు మాట్లాడుతూ స్వచ్చంద సంస్థలు భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యపడుతోందన్నారు. కార్యక్రమంలో 15 స్వచ్ఛంద సంస్థల నిర్మాహకులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్దంసఖ్యలో పాల్గొన్నారు. -
ఆహారభద్రతతో పేదరికంపై గెలుపు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దేశంలో ఆహారభద్రత కల్పించబడడంతో పేదరికంపై గెలుపు సాధించగలిగామని జాయింట్ కలెక్టర్–2 సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కృష్ణాపుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్నచర్చల్లో భాగంగా శుక్ర వారం పేదరికంపై గెలుపు అనే అం శంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతా ల్లో వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులపై ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చేతి పని వృత్తుల వారల జీవనం ఆశించిన మేరకు లేదని అభిప్రాయపడ్డారు. సగటు ఆదాయం రూ.లక్షా 70వేలు ఉండగా విశాఖపట్టణం జిల్లా మొదటిస్థానంలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 19.2శాతం యువతీయువకులు ఉన్నారని తెలిపారు. వీరికి వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యానవన పంటలు, కోళ్లపెంపకం, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. డ్వామాపీడీ హరిత, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మట్టిలో మాణిక్యం
ఎన్నో షీల్డులు సాధించినా.. ప్రోత్సాహం సున్నా! కూలి చేస్తున్న జాతీయ స్థాయి యోగా క్రీడాకారుడు మెదక్ రూరల్: క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు గ్రామీణ క్రీడాకారుల పట్ల చిన్నచూపే చూస్తున్నాయి. ఎంతో ప్రతిభ గల క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు, ప్రోత్సాహం లేక అట్టడుగునే ఉండిపోతున్నారు. ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణలేక కూలీనాలి చేసుకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్నారు. అలాంటి ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన యోగా క్రీడాకారుడు అబ్రబోయిన మల్లేశం. మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి అబ్రబోయిన మల్లమ్మ-లింగయ్య దంపతులకు నలుగురు సంతానం. వారిలో చిన్నవాడైన మల్లేశం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి, అక్కడే యోగాపై శిక్షణ పొందాడు. పాఠశాల స్థాయి నుంచే స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో పతకాలు సాధించాడు. పతకాలు సాధించిన మల్లేశంను చూసి చప్పట్లు కొట్టేవారే కానీ ప్రతిభను ప్రోత్సహించిన వారే లేరు. మరిచిపోయారు. పేదకుటుంబంలో పుట్టిన మల్లేశం అర్థాకలితో అలమటిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. ప్రస్తుతం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివిన మల్లేశం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆరు నెలల క్రితం తండ్రి మరణించగా, అన్నలిద్దరూ బతుకు దెరువుకోసం పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లారు. దీంతో మల్లేశం గ్రామంలోని చిన్నపాటి పూరి గుడిసెలో తల్లితోపాటు ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూలీనాలి చేసుకుంటూ తల్లికి తోడుగా ఉంటున్నాడు. రెండుసార్లు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతులు సాధించగా, రాష్ట్రస్థాయి యోగాలో పదిసార్లు పాల్గొనగా 4సార్లు పతకాలు చేజిక్కించుకున్నాడు. 2006లో ఢిల్లీ, 2008లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు, సర్టిఫికెట్లు సాధించాడు. ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాను నేర్చుకున్న యోగా ప్రతిభను చూపేందుకు అధికారులను పలుమార్లు వేడుకున్నాడు. దీంతో అతనికి ఐదు నిమిషాలపాటు అవకాశం ఇవ్వడంతో వందలాది మంది జనాలు, ఆర్డీఓస్థాయి అధికారులు, వేలాది మంది విద్యార్థులు మల్లేశం ప్రతిభను చూసి ఎప్పటిలాగే చప్పట్లతో సరిపెట్టారు. తన ప్రతిభను చూసైనా తనను ప్రోత్సాహించాలంటూ మల్లేశం పదే పదే వేడుకుంటున్నాడు. ఇంతటి ప్రతిభ గల మల్లేశం పూరిగుడిసెలో కనీసం కరెంట్ వెలుగుకు కూడా నోచుకోకుండా దుర్భర జీవితం గడుపుతున్నాడు. ఇలాంటి మట్టిలోని మాణిక్యాలను మన ప్రభుత్వం గుర్తిస్తే ప్రపంచస్థాయి క్రీడల్లో మనదేశ పేరుప్రతిష్టలను నిలబెడతారని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి: మల్లేశం ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే అంతర్జాతీయస్థాయిలో రాణిస్తా. నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ఎలాంటి ఆదరణలేదు. నాన్న ఆకాల మరణంతో డిగ్రీకూడా చదవలేని దుస్థితిలో ఉన్నా. నాకు చిన్ననాటి నుండి యోగా అంటే ప్రాణం. అధికారులు, పాలకులు నాకు ప్రోత్సాహం అందిస్తే కఠోరమైన సాధనచేసి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తా.. -
ప్రపంచవ్యాప్తంగా పిల్లలను ఆదుకోండి: యూనిసెఫ్
ముంబై : పేదరికం, నిరక్షరాస్యత , లక్షలాది పిల్లలను బలి తీసుకుంటున్నాయని యూనిసెఫ్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 2030 కల్లా 69 లక్షల మంది పిల్లలు 5 ఏళ్ల లోపు చనిపోతారని, 1.67 కోట్ల మంది పిల్లలు పేదరికంతో బాధపడతారని తెలిపింది. అలాగే 7.5 కోట్ల బాల్యవివాహాలు జరుగుతాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఈ సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చింది. దీన్ని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ముంబైలో విడుదల చేశారు. ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు పిల్లల అవసరాలను తీర్చడానికి ప్రయత్నించడం లేదని, పేదరికం నుంచి వారిని బయటపడేసి, వారిని పాఠశాలకు వెళ్లేలా చూడాలని యూనిసెఫ్ కోరింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.24 కోట్ల మంది పిల్లలు ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను అభ్యసించడం లేదని నివేదిక పేర్కొంది. -
ప్రేమకు అనారోగ్యం!
నాటి ప్రేమికుల అనురాగాన్ని దూరం చేస్తున్న కిడ్నీ వ్యాధి శాపంగా మారిన పేదరికం ప్రేమ అజరామరం.. ఎలాంటి వివక్ష చూపని స్నేహ బంధం యువతీయువకుల్ని ఒక్కటిగా చేసే ఆనంద గీతం శ్రీహరి.. లక్ష్మిలది ఈనాటి ప్రేమ కాదు అది 1999 ఎ లవ్ స్టోరీ వారి ప్రేమ సక్సెస్.. కాపురం కూడా! రోజా పువ్వుల్లాంటి ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ వృద్ధాప్యం వరకు ఈ జంట ప్రేమ పచ్చని చెట్టులా కళకళలాడేలా లేదు లక్ష్మిని రెండు కిడ్నీలూ మోసం చేశారుు గొప్ప ప్రేమికుడు తోడుగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు వైద్యం చేరుుంచనంటున్నారుు...! ⇒ అప్పుడే తెల్లారింది. సూర్యుడు ఇంకా కోపం తెచ్చుకోకపోవడంతో వాతావరణం వేడెక్కలేదు. కందుకూరులోని ఆర్టీసీ బాస్టాండ్ జనాల గొడవకు చెవులు మూసుకుంది. భిక్షగాళ్లు చేతులు చాపుతుంటే ప్రయూణికులు చిరాకు పడుతున్నారు. ఇంతలో హైదరాబాద్ బస్ సర్వీసు బస్టాండుకు చేరుకుంది. అందులో నుంచి ఓ యువకుడు చిన్న బ్యాగుతో దిగాడు. అతను.. చుట్టాల ఇంటికో.. శుభకార్యానికో రాలేదు. పొట్ట చేత పట్టుకుని బతుకుపై ఆశతో దిగాడు. ⇒ పట్టణంలోని తూర్పువడ్డెపాలెంకు చేరుకున్నాడు.. బేల్దారి పని ఏమైనా దొరుకుతుందో అని. బాగా దాహం వేసింది. ఓ ఇంటి దగ్గరకు వెళ్లాడు. ‘కొంచెం నీళ్లు ఉంటే ఇవ్వండయ్యూ’ అన్నాడు. లోపల నుంచి పదహారేళ్ల అమ్మారుు వచ్చి చేతికి గ్లాసు అందించింది. తొలి చూపులోనే ప్రేమ పుట్టింది. అతనికి పని దొరికింది. అమ్మారుు.. అబ్బారుు మాటామాటా కలిసింది. కొద్దిరోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ⇒ ఇది పదిహేడేళ్ల క్రితం జరిగిన ఘటన. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం.. తోషం గ్రామవాసి కామిరి శ్రీహరి, పట్టణానికి చెందిన కామెరి లక్ష్మి ప్రేమకు పెద్దగా ఆటంకాలు ఏర్పడలేదు. ఇద్దరూ ఒక్కటయ్యూరు. హైదరాబాద్‌తో పాటు ఎక్కడ పని దొరికినా ఇద్దరూ కలిసి బేల్దారి పనులు చేసుకుంటూ అన్యోన్యంగా గడిపేవారు. వారి కాపురానికి ఫలితంగా ఇద్దరు సంతానం కలిగారు. ఉప్పుచెరువులో కాపురం పెట్టారు. ⇒ జీవితం సాఫీగా సాగిపోదు కదా! చక్కగా ఉన్న వారి కాపురంలో కిడ్నీ వ్యాధి వచ్చిపడింది. మూడేళ్ల క్రితం లక్ష్మి (35)కి అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. నెమ్ము చేరిందని డాక్టర్లు చెప్పడంతో మందులు వాడటంతో ఆరోగ్యం కుదుటపడింది. కానీ గత డిసెంబర్లో అనారోగ్యం పాలవడంతో పరీక్షలు చేయించుకున్నారు. నెల్లూరు వైద్యులు కిడ్నీ వ్యాధిగా తేల్చారు. అనంతరం ఒంగోలు రిమ్స్‌లో చూపించుకోగా గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా రెండు కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు. డయాలసిస్ చేయాలని తెలిపారు. అప్పటికే భార్య వైద్యం కోసం రూ. 2 లక్షలను శ్రీహరి ఖర్చు చేశాడు. ఇవి కాక మరో రూ. 70వేల వరకు అప్పులపాలయ్యాడు. ఇటీవల తన భార్య మరింతగా బాధ పడుతుండటంతో కందుకూరులో చూపించగా.. 5వేల రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. అతని వద్ద డబ్బు లేకపోవడంతో స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చారు. ‘ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. దేవుని పై భారం వేసి గడుపుతున్నాం. ప్రాణం ఉన్నంతవరకే మేమేమైనా చేయగలం’ అని దుఃఖించాడు. ⇒ చిన్నారులకు అమ్మా.. నాన్నకంటే గొప్పవారు ఎవరుంటారు. వారు ఏదైనా తెస్తే తింటారు. లేదా పస్తులుంటారు. ఇప్పుడు ఆ దంపతుల పిల్లలు అంజలి, సాయికృష్ణ ఇదే పరిస్థితిలో ఉన్నారు. మూడు పూట్లా కంచంలో అన్నం ఎందుకు రాదో తెలియదు. వాళ్ల అమ్మ మంచం ఎందుకు దిగదో తెలియదు. కోలుకోవాలంటే ఏం చేయూలో అర్థం కాదు. 8వ తరగతి చదువుతున్న కూతురు ఇంటి వద్దే ఉండి తల్లిని చూసుకుంటోంది. సాయికృష్ణ కూడా 8వ తరగతే చదువుతున్నాడు. కుమారుని పరిస్థితీ అలాగే ఉంది. ⇒ ఈ కుటుంబానికి తెల్ల కార్డు ఉంది. కానీ పొట్ట చేత పట్టుకుని ఊర్లు తిరుగుతుండటంతో నిలువునా కార్డు తొలగించారు. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవలు శ్రీహరి కుటుంబానికి అందడంలేదు. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఒక్క అధికారి కూడా పట్టించుకోవడంలేదు. వీరి బాధను చూసిన ఒంగోలులోని ఓ కిడ్నీ సెంటర్ డాక్టర్.. లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు. ‘దీనిని ముఖ్యమంత్రి కార్యాలయూనికి తీసుకు వెళ్లి ఆరోగ్య కార్డు తెచ్చుకోండి. దీనివల్ల కొంత మేలు జరగవచ్చు’ అని చెప్పారు. ‘రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. నా సంపాదన నా భార్య బిళ్లలకు ఇవ్వాలా.. పిల్లల కూటికి ఇవ్వాలా. మా లాంటి వారిని ముఖ్యమంత్రి పలకరిస్తారా’ అని ఇంటి యజమాని వాపోయూడు. సాయం చేయదల్చిన దాతలు శ్రీహరి ఫోన్ నంబర్ 9550447964ను సంప్రదించవచ్చు. - కందుకూరు -
సన్నకారు సాగుకి పెద్ద గండం
విశ్లేషణ వాతావరణ మార్పుల ముప్పు ఉన్న అగ్రశ్రేణి 20 దేశాల్లో మన దేశం ఒకటి. గత నాలుగు దశాబ్దాలలో మన ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫలితంగా వరదలు, దుర్భిక్షాలు, తుపానులు ఎక్కువయ్యాయి. అధిక సంఖ్యలోని సన్నకారు రైతుల కుటుంబ ఆదాయాలు పడిపోయి పేదరికంలో కూరుకుపోయాయి. వాతావరణ మార్పులు భూసారంపైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సన్నకారు రైతులు వ్యవసాయం చేయలేని వారుగా దిగజారిపోతూనే ఉన్నారు. బుందేల్‌ఖండ్‌లో భారత సన్నకారు వ్యవసాయం కల కరిగిపోయింది. చంబల్ బందిపోట్లవల్ల, ఝాన్సీరాణి వల్ల ప్రసిద్ధిచెందిన ఈ మెట్ట ప్రాంతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అది వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతం. అది గత దశాబ్దిలో 2003– 2010 మధ్య, 2012–14 మధ్య దుర్భిక్షాలకు గురైంది, 2011లో వరదలకు దెబ్బతింది. ఖరీఫ్‌లో వివిధ మెట్ట పంటలను కలగలిపి వేయడం నుంచి, ఖరీఫ్‌లో శనగ, ఆవాలు వంటి వాణిజ్య పంటలను వేయడం వరకు ఆ ప్రాంత రైతులు సకల ప్రయత్నాలూ చేశారు. బోరు బావులు, ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలపైనా, విత్తనాలు, ఎరువులపైనా వారు భారీగా మదు పులు పెట్టారు. గత రెండు శీతాకాలాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు పంటలను నాశనం చేశాయి (శనగ దిగుబడి దాదాపు తుడిచిపెట్టుకుపోగా, కంది పంట మొత్తంగానే పోయింది). ఇది, రైతు ఆత్మహత్యలకు (2003 నుంచి 3,500 మంది), భారీ వలసలకు దారితీసింది. పంటల బీమా సదుపాయాన్ని కల్పించడానికి బదులుగా గోదాములను నిర్మించే పనులు చేపట్టడం వల్ల రైతులకు ఎలాంటి ఉపశమనం కలగలేదు సరికదా, కాంట్రా క్టర్లకు మేలు జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు నష్టపరిహారమైనా (ఒక్కో మరణానికి రూ. 7 లక్షలు) ఇస్తుందని బాధిత కుటుంబాలు ఆశిం చాయి. పరిహారానికి బదులు గోధుమ మోపులు ఇచ్చారు. చిక్కి శల్యమైన పశువులు ఈడిగిల పడి ఉండగా... ఏ దిక్కూలేని రైతులు ఏ దేవుడైనా కరుణించకపోతాడా అని పై చూపులు చూస్తూనే ఉన్నారు. రైతుకు ‘వాతావరణం’ కాటు వాతావరణ మార్పులకు గురయ్యే దేశాల సూచీలో మన దేశం అగ్రశ్రేణి 20లో ఒకటి. గత నాలుగు దశాబ్దాల్లో మన భూఉపరితల ఉష్ణోగ్రతలు సగటున 0.30lసెంటీగ్రేడ్ మేర పెరిగాయి. ఫలితంగా వరదలు, దుర్భిక్షాలు, తుపానులు ఎక్కువయ్యాయి. దేశంలోని అధిక భూకమతాలు ఒక హెక్టారు కంటే తక్కువవి. ఆ సన్నకారు రైతుల కుటుంబ ఆదాయం తీవ్రంగా పడిపో యింది. కరవు పరిస్థితుల్లో ఆ కుటుంబాలు పేదరికంలోకి కూరుకుపో యాయి. వాతావరణ మార్పులు భూసారంపైన కూడా ప్రతికూల ప్రభా వాన్ని చూపుతాయి. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటం కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా విడుదల కావడానికి, సహజ నత్రజని లభ్యత తగ్గడానికి దారి తీస్తుంది. దీన్ని తట్టుకోవడానికి రసాయనిక ఎరువుల వాడకం పెరుగు తుంది. ఇది దీర్ఘకాలంలో భూసారాన్ని క్షీణించిపోయేలా చేస్తుంది. మరింత భూసార క్షయానికీ, ఎడారిగా మారడానికి దారితీస్తుంది. రైతు ఆత్మ హత్యలు, గిడసబారిన గ్రామీణ ఆదాయాలు, ప్రజా ప్రయోజనాల పేరిట భూ సేకరణ జరపడం కలసి వాతావరణ మార్పుల ఉపశమనం అనే భావ ననే రాజకీయం చేసేశాయి. సన్నకారు రైతులు వ్యవసాయానికి పనికిరాని వారుగా దిగజారిపోతూనే ఉన్నారు. మన వ్యవసాయం మరింత ఎక్కువగా వర్షాధారమైనదిగా మారి పోతూనే ఉంది. మొత్తం పంట వేసిన భూమిలో అధిక భాగంలో వర్షాధార వ్యవసాయమే సాగుతోంది. అదే మన జాతీయ ఆహార ఉత్పత్తిలో గణనీయ మైన భాగాన్ని అందిస్తోంది (వరిలో 55%, కాయధాన్యాల్లో 90%, అన్ని తృణధాన్యాల్లో 91%). ప్రాంతీయంగా అమలులో ఉండే పంటల విధానాలు వాతావరణ పరిస్థితులలో ఒక ప్రత్యేకమైన తేడాలుంటాయనే ప్రమేయంపై ఆధారపడి ఉంటాయి. అందువల్లనే అధిక వర్షాలు సుదీర్ఘంగా కొనసాగడం, సుదీర్ఘంగా వర్షాలు లేకపోవడం వంటి పరిస్థితులను మన పంటల విధా నాలు తట్టుకోలేకపోతున్నాయి. కోతలకు ముందటి వారంలోని అకాల వర్షాల కారణంగా 2013లో గోధుమ, శనగ, పెసర, ఆవ పంటలు భారీ ఎత్తున దెబ్బతినిపోయాయి. ప్రభుత్వం వరద రక్షణ చర్యల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నా స్వాతంత్య్రానంతర కాలంలో మన దేశంలో వరదల తాకిడికి గురయ్యే ప్రాంతం రెట్టింపుకు పెరిగింది. 2050 నాటికి వేసవి వర్షపాతం 70% తగ్గుతుందని ఐసీఐర్ఐఈఆర్ అంచనా. ఇది, క్షామ పీడిత గ్రామీణ భారతం ఆర్థిక దుస్థితికి, సామాజిక అన్యాయానికి సజీవ దర్ప ణంగా నిలుస్తుంది. లెక్కలేనన్ని ప్రభుత్వ పథకాలు ఈ నిరాశామయ పరిస్థితిని ఎన్నడూ నిజంగా మార్చింది లేదు. గండం గట్టెక్కేదెలా? 2011 నాటికి ఖరీఫ్‌లో ఉష్ణోగ్రతల పెరుగుదల (0.7నిఇ 3.3నిఇ) వల్ల వర్షపాతంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా రబీ గోధుమ 22%, వరి 15% మేరకు దిగుబడి క్షీణిస్తుండవచ్చని అంచనా. ఇక జొన్న, వేరుశనగ, శనగ దిగుబడులు తీవ్రంగా క్షీణిస్తాయి. ఫలితంగా ఆకలితో అలమటిస్తున్నవారు అత్యధికంగా ఉన్న మన దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుంది. అల్ప వ్యవసాయ ఉత్పాదకత కీలక ప్రతిబం ధకంగా ఉంటోంది. మనం హెక్టారుకు 2,929 కేజీల వరిని ఉత్పత్తి చేస్తుండగా, చైనా అంతకు రెట్టింపు ఉత్పత్తి చేస్తోంది (స్వామినాథన్ కమిటీ ఆన్ ఫార్మర్స్, 2006). ఇక ఇతర పంటల విషయంలోనూ అల్ప ఉత్పాదకత కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. గ్రామీణ వ్యయ ప్రణాళిక... వ్యవసాయరంగ మౌలిక సదుపా యాలపైన, ప్రత్యేకించి నీటిపారుదల, వర్షపు నీటి పరి రక్షణ, భూసార పరీక్షా కేంద్రాల జాతీయ స్థాయి నిర్మాణం వ్యవస్థపైన దృష్టిని కేంద్రీకరించడం అవసరం. నీటి సంరక్షణ చర్యలు (సూక్ష్మ నీటిపారుదల, వాటర్‌షెడ్ మేనేజ్మెంట్, బీమా కవరేజి) క్షామంలో సంభ వించగల నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించగలుగుతాయి. దుర్భిక్షాన్ని ఎదు ర్కొనే వ్యూహాలను గ్రామీణ స్థాయికి విస్తరింపజేయాలి. ఉదాహరణకు, గ్రామీణ ఉపాధి హామీ పనుల కింద ప్రతి గ్రామానికి ఒక కుంటని నిర్మింప జేయాలి. మన వ్యవసాయ విధానం వ్యవస్థాపరంగానే సాగుబడిని వాతావరణ మార్పుల దుష్ప్రభావానికి గురయ్యేలా చేసింది. మన వ్యవసాయ సేకరణ విధానం ఉత్పాదక ప్రభావాన్ని కలిగించేదిగా ఉండాలి. నీటి లభ్యత వినియోగ సామర్థ్యం సాపేక్షికంగా ఎక్కువగా ఉన్న (వాటర్ ఫుట్ ప్రింట్) ఉత్తరప్రదేశ్‌లో గోధుమ సేకరణ మధ్యప్రదేశ్‌లో (సగం కంటే తక్కువ సమర్థతతో) కంటే తక్కువగా నమోదైంది. జాతీయ రైతు కమిషన్ తరచూ సూచిస్తున్నట్లు సంరక్షిత సాగును, మెట్ట సాగును ప్రోత్సహించాలి. ప్రతి గ్రామానికి వర్షపాతం, వాతావరణాలకు సంబంధించిన, వివిధ రుతు వులలో వచ్చే చీడపీడల గురించి ముందస్తు హెచ్చరికలను అందించాలి. జీవ వైవిధ్యపూరితమైన అడవుల పెంపకం ప్రాంతీయ స్థాయి వాతావరణ పరిస్థి తులలో మార్పుతేవడానికి, భూసారం కొట్టుకుపోవడాన్ని అరికట్టడానికి తోడ్పడుతుంది. మన వ్యవసాయ పరిశోధన మెట్ట సాగు దిశగా, క్షామాన్ని తట్టుకునే విత్తనాల తయారీ దిశగా దృష్టిని కేంద్రీకరించేలా చేస్తే ఉత్పత్తిలో కలిగే నష్టాన్ని దాదాపు మూడింట ఒకటో వంతుకు తగ్గించవచ్చు. నాట్లు వేసే తేదీలను మార్చడం వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. గోధుమను ముందుగా నాటడంపై చేసిన పరిశో« దనలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి. అసలు దున్నకుండా ఉండటం, లేజర్ ఆధారంగా చదును చేయడం నీరు, భూ వనరుల పరిరక్షణకు తోడ్పడ తాయి. మెట్ట పరిస్థితులకు తగిన జన్యు రకాలను ఉపయోగించుకుని వివిధ ప్రాంతాల వాతావరణ మండలాలకు అనుగుణమైన పంటల ప్రణాళికలను రూపొందించాలి. సన్నకారు సాగుకు కావాలి ఆసరా వాతావరణ మార్పుల బాధితులైన సన్నకారు రైతాంగానికి ఉపశమనం కలగాలంటే వారికి బీమా, పరపతి సదుపాయాలు అవసరం. వ్యవస్థాగత పరపతిని సన్నకారు రైతులందరికీ విస్తరింపజేయాలి. రైతు కమిషన్ సూచించినట్టు అన్ని పంటలకు బీమాను విస్తరించడంతోపాటూ ప్రభుత్వ మద్దతుతో వడ్డీ రేటును నామమాత్రపు స్థాయికి తగ్గించాలి. దుర్భిక్షం తాకిడికి, వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన ప్రాంతాలలో రుణ వాయిదా విధానాన్ని ప్రకటించి, సాగుబడి ఆదాయాల పునరుద్ధరణ జరిగే వరకు వడ్డీని మాఫీ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర పంటల, పశువుల, కుటుంబ ఆరోగ్య బీమా ప్యాకేజీని ప్రారంభించాలి. వరుసగా వస్తున్న ప్రకృతి విపత్తుల నుంచి ఉపశమనాన్ని కలిగిచేందుకు గానూ వ్యవసాయ పరపతి నష్టభయ నిధిని ఏర్పాటు చేయాలి. వాతావరణ మార్పులు మొత్తంగా ఆహార గొలుసును, ఆహార భద్రతను ప్రభావితం చేస్తాయి. పశుపోషణను సన్నకారు రైతులకు ప్రత్యా మ్నాయ ఉపాధి అని తరుచుగా పేర్కొంటారు. కానీ పంట విస్తీర్ణం తగ్గడం వల్ల మేతకు కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత జనాభా పెరుగు తుండటంతో వివిధ పంటలు ఆవశ్యకమవుతున్న పరిస్థితులలో దిగుబడులు క్షీణించిపోవడం ఆందోళనకరం. ఆహార పంటలపై పెట్టు బడులు పెట్ట డంతో పాటూ నీటిపారుదలకు, మౌలిక సదుపాయాలకు, గ్రామీణ సంస్థ లకు మద్దతును అందించాలి. అది, వాతావరణ మార్పుల ఫలితంగా సంభ వించే ఆహార అభద్రతను అధిగమించానికి, మన ఆహార ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. వాతావరణ మార్పులను తట్టుకునే మార్పులను తేవడం, ఉపశమన చర్యలను చేప ట్టడం ద్వారానే మనం ఈ సవాలును ఎదుర్కొనగలం. వ్యాసకర్త కేంద్రమంత్రి మనేకా గాంధీ కుమారుడు, బీజేపీ నేత: వరుణ్ గాంధీ ఈమెయిల్ : fvg001@gmail.com -
కరువు పెళ్లిళ్లకు కరువు లేదు
ఉన్న ఊళ్లో పెళ్లయినా ఊరివాళ్లందరూ వేరే ఊళ్ల నుంచి రావాల్సిందే. కరువుకు ఎవరు ఎక్కడ వలసకెళ్లారో మరి. సేద్యం సరిగా లేదు... ఇంటికి మగదిక్కు లేదు... ఎదుగుతున్న ఆడపిల్లకు రక్షణ లేదు... అన్నింటికీ విరుగుడు పెళ్లి. మెతుకు సీమగా వాసికెక్కిన మెదక్ జిల్లాలో ఈ రెండేళ్ల కాలంలో దాదాపు 1000 బాల్య వివాహాలు జరిగాయని అంచనా. కొన్ని అధికారుల ప్రమేయంతో ఆగిపోయాయి. ఆగిన పెళ్లిళ్లను పలకరిస్తే జరిగిన పెళ్లిళ్ల కారణాలు కూడా తెలుస్తాయి. విద్య, ఉపాధి కల్పించి వలస నిరోధం చేసి తగిన చైతన్యం కల్పించడమే దీనికి విరుగుడుగా అర్థమవుతుంది. కట్నానికి బదులుగా చెల్లెలు... కరువుకు తోడు పరిస్థితులు కూడా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. అల్లాదుర్గం- ముస్లాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు మంజూల, మల్లేశం దంపతుల పెద్దమ్మయి పుట్టుకతోనే వికలాంగురాలు. కుడి చేయి, ఎడమ కాలు పని చేయవు. ఆ అమ్మాయి తరువాత మరో అమ్మాయి ఉంది. మల్లేశం పంటలు పండక పోవడంతో సంగారెడ్డిలో కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వికలాంగురాలైన కూతురు వివాహానికి వరుడెవరూ ముందుకు రావడం లేదని ‘పెద్దమ్మాయిని చేసుకుంటే చిన్నమ్మాయిని కూడా ఇస్తాం’ అనే ఆఫర్‌తో ఒప్పించారు. ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్లే. చిన్నమ్మాయి 10వ తరగతి పాస్ అయింది. అక్క పెళ్లికి కట్నంగా తనను ఇచ్చారని పెళ్లి రోజు వరకూ తెలియని ఆ అమ్మాయి పెళ్లినాడు ‘నన్ను వదిలేయండి అమ్మా... నేను చదువుకుంటాను’ అని ఎంత వేడుకున్నా ఆ మాటలు బంధువుల్ని, తల్లిదండ్రులను కదిలించలేకపోయాయి. అదృష్టం కొద్ది అధికారులు వచ్చి పెళ్లిని నిలవరించారు. అమ్మ బాధలు ఇప్పు కూతురికి .... ధరావత్ అరుణది టేక్మాల్ మండలం చెరువు ముందరి తండా. 12 ఏళ్ల వయసులో తండ్రి గోపాల్ అనే అబ్బాయిని తీసుకొచ్చి ‘వీడు నీ మొగడు బిడ్డా.. సంసారం చేసుకో’ అని పెళ్లి చేశాడు. ఏడాది గడవక ముందే తల్లి అయ్యింది. ఆమే చిన్న పిల్ల. ఇప్పుడు మెడకు ఇద్దరు పిల్లలు. ఓ రోజు పొలానికి నీళ్లు పారబెట్టేందుకు వెళ్ళిన భర్త గోపాల్ కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయాడు. ఇప్పుడు పనులు చేసేందుకు మగ తోడు లేదు. మగదిక్కు కోసం అన్న కొడుకునే తనకు అల్లుడు చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఆ ప్రయత్నాన్ని అధికారుల ఆపేశారు. కాని ఆమె ప్రయత్నం ఆపేలా లేదు. భర్త చనిపోతాడని... కాస్తి బాలవ్వది రాజక్క పేట. ఆమె భర్త చంద్రయ్యకు గుండెనొప్పి ఉంది. భర్త చనిపోయేలోపే కూతురి పెళ్లి చేయాలని ప్రయత్నించింది. పెండ్లీడు వయసుకు మూడు నెలలు తక్కువగా ఉందని అధికారులొచ్చి ఆపేశారు. బిడ్డ పెళ్లికి రూ.3 లక్షల అప్పు చేసింది. ఇప్పుడు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతోంది. అల్లుడి కోసం ఆరాటం... బాగయ్యది డాకూర్ గ్రామం. చెల్లెలి కొడుకును 8 ఏళ్ల వయసు నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అతణ్ణే అల్లుణ్ణి చేసుకుంటానని చెల్లెలికి మాట ఇచ్చాడు. అయితే కూతురు ఇంకా తగిన వయసుకు రాలేదని ఆలస్యం చేస్తుంటే కుర్రాడు అలిగి సొంత ఊరుకు పారిపోతున్నాడు. పెళ్లికి తొందర పడుతున్న కుర్రాడి కోసం పెళ్లి చేద్దామనుకుంటే అధికారులు సంగతి తెలిసి ఆపేశారు. బాగయ్య మాత్రం ఈ సమస్యకు సమాధానం తెలీక సతమతమవుతున్నాడు. మా చెల్లెండ్లకు కూడా... తూప్రాన్ మండలం తాతపాపన్పల్లికి చెందిన ఎక్కాల్దేవ్ శ్రీనివాస్‌యాదవ్, కోమురమ్మ దంపతులు గత నెలలో కూతురి పెళ్లి చేద్దామనుకుంటే బాల్య వివాహమని పోలీసులు ఆపేశారు. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కొడుకులు. మేకలు, గొర్రెలే బతుకు దెరువు. జీవాలను అమ్ముకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ‘మా పెద్దపిల్లకు మంచి సంబంధమొచ్చింది. ఇంటికి వచ్చిన సంబంధం కాదనలేకపోయాం. నా ముగ్గురు చెల్లెండ్ల పెండ్లిళ్లు 12 ఏళ్లు ఉన్నప్పుడే చేశాము. వారు పిల్లలు కనలేదా సంసారం చేసుకోవడంలేదా. పీటల మీద పెళ్లిని ఆపేశారు. చుట్టాల ముందు, కులం ముందు పరువు పోయింది. వండిన అన్నమంతా గుమ్మరించాం. అధికారులు ఇలా చేయడం ఏమైన మంచిగుందా?’ అని అతడు ప్రశ్నించాడు. - వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, మెదక్ పేదరికంతోనే... పేదరికం, ఆచార వ్యవహారాలు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. భవిష్యత్తు మీద అవగాహం లేని కుటుంబాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాల్య వివాహ చట్టాల మీద ప్రజలకు అవగాహన లేకపోవటం మరో కారణం. ప్రభుత్వ శాఖలు అన్ని సమన్వయంతో ముందుకు పోతే బాల్య వివాహాలను నిర్మూలించవచ్చు. - యాస్మిన్ బాషా, ఇంఛార్జి పీడీ, ఐసీడీఎస్ ఆడపిల్ల పట్ల వివక్షే కారణం పురుషాధిక్య సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షే బాల్య వివాహాలకు కారణం. ఎంత సేపటికి అబ్బాయి కంటే అమ్మాయి తక్కువగా ఉండాలనే ఆలోచన. అమ్మాయి చదివితే అంత కంటే ఎక్కువ చదివిన అబ్బాయిని వెతకాలి అబ్బాయి తాహతుకు తగినట్టుగా కట్న కానుకలు ఇవ్వాలనేది ఈ కాలపు తల్లిదండ్రుల్లో బలంగా ఉంది. ఈ ఆలోచనా ధోరణి మారాలి. లైంగిక విద్యను, బాల్య వివాహ చట్టాలను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చాలి. - శివకుమారి, బాలల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షురాలు మంచి సంబంధమని పెండ్లి నిశ్చయించాం పర్వతం లక్ష్మిది దుబ్బాక. బయటకు వెళ్లి కాయకష్టం చేసే కుటుంబం. కూతురు కాకుండా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న కొడుకు ఉన్నాడు. వాణ్ణి చూసుకోవడానికి ఇంట్లో కూతురిని వదిలి పనికి వెళ్లాల్సి వస్తోంది. కూతురి భద్రత కోసం కూతురి వయసు పట్టించుకోకుండా బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుందామె. కూతురు మాత్రం నాకు చదువు కోవాలని ఉంది అంటోంది. ప్రతి రోజూ పాఠశాలకెళ్లి మధ్యాహ్న భోజనం చేసొస్తోంది. -
విధివంచితులు..!
► పేదరికానికి పెద్ద కష్టాలు ► కుప్పకూలుతున్న చిన్నారులు ► సహాయం కోసం ఎదురుచూపు సాక్షి, సిటీబ్యూరో: అసలే నిరుపేదలు, ఆపై విధి వారిపై చిన్నచూపు చూసింది. లక్షమందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఆరుదైన కండరాల క్షీణత(మస్కులర్ డిస్క్రోపి)తో వారిని మంచానికి, కుర్చీకి కట్టిపడేసింది. వారిని కాపాడుకునేందుకు ఆ నిరుపేదల దళిత తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి.. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా వేణువంక మండల పోతిరెడ్డిపల్లికి చెందిన నందిపాట సమ్మయ్య- కరుణ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. వారికి ఉన్న 20 కుంటల పొలాన్ని సాగు చేస్తూ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివించేవాడు. వీరిలో పెద్దబ్బాయి ప్రణయ్(16), ఏడవ తరగతి, చిన్నబ్బాయి వినయ్(13) ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరు కుమారులు స్కూల్‌కు వెళ్లి వస్తుంటే చూసి ఆ దంపతులు మురిపోయేవారు. అయితే 11 ఏళ్ల వయసులో వారు ఇద్దరూ నడుస్తూ నడుస్తూనే కుప్పకులిపోతుండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వారిని హన్మకొండ, హైదరాబాద్ నిమ్స్, మహారాష్ట్రలో వైద్యం చేయించారు. అందుకుగాను తమ పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా జబ్బు నయం కాకపోవడంతో జమ్మికుంటకు వలసవచ్చి కూలీ పనిచేస్తూ పైసలు పొగవ్వగానే ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారు. దీంతో ఉన్న ఉపాధి కూడా పోవడంతో అదే గ్రామంలో టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఎంద రు వైద్యులను సంప్రదించినా ఈ వ్యాధికి మందు లేద ని, అంతవరకు పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వాలని సూచించడంతో బిడ్డల కడుపు నింపేందుకు ఆ అన్నదాత అందరి వద్ద చేయి చాస్తున్నాడు. పూట గడవడం లేదు... డాక్టర్లు జబ్బు నాయం కాదు. మందులు లేవు. జీవి తాంతం ఇంతే. రోజు ఇద్దరికి పండ్లు- ఫలాలు అంది వ్వు. అప్పుడైనా కొంతవరకు నయమౌతుందేమో చూ ద్దాం అని చెప్పారని పిల్లల తండ్రి సమ్మయ్య అన్నారు.టీ అమ్మి కుటుంబాన్ని పోషించే తనకు వారికి వైద్యం చేయించేందుకు చిల్లి గవ్వలేదని వాపోయాడు. మానవతా హృదయులు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన బిడ్డలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సహాయం చేయాలనుకున్న వారు 9704964049 సెల్ ఫోన్ నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
చిన్న ప్రాణానికి పెద్ద కష్టం
* రక్తపు వాంతులతో అవస్థలు పడుతున్న చిన్నారి * శస్త్ర చికిత్సకు రూ. 40 లక్షలు అవసరం * దాతల కోసం ఎదురుచూపు శృంగవరపుకోట : చిన్న ప్రాణానికి పెద్ద కష్టం వచ్చింది... ఆడుకోవాల్సిన వయసులో అమ్మ తప్ప మరో ప్రపంచం ఎరుగని దుస్థితి ఆ చిన్నారిది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు చిన్నారి ప్రాణం కాపాడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రెండున్నరేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. తన చిన్నారికి ప్రాణభిక్ష పెట్టమని ఆ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..ఎస్.కోట పట్టణంలోని మొండివీధిలో ఆదిమూలం గణేష్, రామలక్ష్మి నివసిస్తున్నారు. గణేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 2012లో వీరికి కొడుకు (లోకేష్) పుట్టాడు. అయితే 12 రోజులకే చిన్నారి అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మొదట్లో స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించడంతో చిన్నారి ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ ఏడాది తర్వాత లోకేష్‌కు రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయి. ఎడతెరపి లేకుండా వాంతులు కావడంతో చిన్నారిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. చివరగా విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా లోకేష్ పోర్టల్ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. శస్త్రచికిత్సకు రూ. లక్షలు కావాలి.. ప్రస్తుతం లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ కేజీహెచ్‌లో వైద్యం అందిస్తున్నా శస్త్రచికిత్సకు సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పేద కుటుంబానికి చెందిన తమకు ఇంత పెద్ద మొత్తం సమకూర్చడం సాధ్యం కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కొడుక్కి ఇప్పటికీ మాట రాదని. ఆకలి అని కూడా చెప్పడని, ఎప్పుడు వాంతులు చేసుకుంటాడో తెలియదని.. వాడి కష్టం చూసి ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని తల్లి రామలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. దాతలు స్పందించి తనకుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటోంది. సహాయం చేయూల్సిన దాతలు 94926 21912, 73860 41986 నంబర్లను సంప్రదించాలని కోరారు. అరుదైన సమస్య కాలేయానికి వెళ్లే రక్తనాళాలు హైపర్‌టెన్షన్‌కు గురవడాన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. దీంతో కాలేయానికి వెళ్లాల్సిన రక్తం వాంతుల రూపంలో, లేదా విరేచనం రూపంగానో బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. - డా. ఆర్.త్రినాథరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎస్.కోట. -
'పేదరికంపై నివేదిక ఇస్తాం'
న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాత పేదరికంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియ అన్నారు. నీటి కొరతకు సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం దేశ వ్యాప్త పేదరిక నిర్మూలనపై నీతి ఆయోగ్ దక్షిణాధి రాష్ట్రాల సమావేశం జరిగింది. దీనికి పనగారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధిలాంటి అంశాలపై చర్చ జరిగింది. -
'పేదరికమంటే మరణ శిక్షే'!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ సాండర్స్ ఎవరూ ఊహించని అంశంపై మాట్లాడి ఆలోచింపజేశారు. ఇప్పటి వరకు అధ్యక్ష రేసులో ఉన్న నాయకులంతా టెక్నాలజీ, సాఫ్ట్ వేర్, ఆదాయం, మంచి వసతులు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై మాట్లాడితే ఈయన మాత్రం పేదరికంపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. అసలు ఉపన్యాసమే పేదరికం అనే అంశంతో ప్రారంభించారు. వార్మోనంట్ ప్రాంతానికి సెనేటర్‌గా ఉన్న బెర్నీ న్యూయార్క్‌లోని బింగామ్టాన్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పేదరికం అంశాన్ని నొక్కి చెప్పారు. మధ్యతరగతి వర్గం, వారి అవసరాలకు సంబంధించి ఏ కొంచెం కూడా స్పృషించని ఆయన పేదరికంపైనే విస్తృతంగా మాట్లాడారు. ఒకప్పుడు పేదరికాన్ని సవాలుగా తీసుకొని నాటి అధ్యక్షుడు ప్రాంక్లిన్ రూజ్ వెల్డ్ ఏ విధంగా కృషి చేశారో తాను అలాగే కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల కాలంలో పేదరికంపై ఎన్నో అధ్యయనాలు బయటకు వచ్చాయని, వీటిల్లో పేదల ఆయుష్షు ఎంతో దారుణంగా తగ్గిపోయిందని చెప్పారు. ధనవంతుల జీవితకాల రేటుతో పేదల జీవితకాల రేటును పోలిస్తే చాలా బాధేస్తుందని అన్నారు. ఇతర మాటల్లో చెప్పాలంటే ఇది ఒక రకంగా వారికి ఒక మరణ శిక్ష అని నొక్కి చెప్పారు. పేదరిక భౌతిక రూపం అనే పదాన్ని ఆయన ఉపయోగిస్తూ.. దీని అర్ధాన్ని చెబుతూ దీని భారిన పడిన వారికి పొద్దున్నే లేచి తన బిడ్డలను ఎలా సంరక్షించుకోవాలో, పెంచి పెద్ద చేసుకోవాలో అనే ఆలోచన ఉంటుందని, వారికి ఏదైనా అయితే ఆస్పత్రి ఎలా తీసుకెళ్లగలం అని ఆలోచిస్తారని అలా ఆలోచించి ఆ వ్యాకులతతో బలహీనంగా తయారవుతారని చెప్పారు. అందుకే వారి జీవిత ప్రమాణస్థాయి పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎవరో చేస్తే బాగుపడదాం అనుకోవద్దు
* మీకు బాధ్యత ఉండాలి.. కష్టపడి పనిచేయాలి * శాశ్వతంగా పేదవారిగా ఉండకూడదు * 'దిశ-నిర్దేశ' సదస్సులో ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచన సాక్షి ప్రతినిధి, తిరుపతి: 'మీరు ఎవరో చేసిపెడితే బాగుపడదామనుకుంటున్నారు. శాశ్వతంగా పేదోళ్లుగా ఉండకూడదు. ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండాలి. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. రాజకీయ పార్టీలు ఏదో చేస్తాయని అనుకోవద్దు. మీకు బాధ్యత ఉండాలి. కష్టపడి పనిచేయాలి. అది మన నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలి. మీలో చైతన్యం రావాలి. మీ గ్రామంలో ఎలాంటి వనరులు ఉన్నాయి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అనేది మీ ఇంట్లో చర్చించుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది' అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో గురువారం 'దిశ - నిర్దేశ' సదస్సులో ఆయన మాట్లాడారు. ఏ ప్రయోగమైనా కుప్పం నుంచే.. రాష్ట్రంలో ఏ ప్రయోగమైనా కుప్పం నుంచే ప్రారంభిస్తున్నామని, ఇక్కడ విజయవంతమయ్యాక రాష్ట్రంలో అమలు చేయడం ఆనవాయితీగా వస్తోందని బాబు తెలిపారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తామన్నారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దామాషా పద్ధతిలో కృష్ణా జలాలు కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో సమానంగా పంచుకోవాలని చంద్రబాబు అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణ కు 290 టీఎంసీలు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి రూ.171.16 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భూముల స్వాధీనానికి నిరసనగా.. కుప్పం నియోజకవర్గంలో వివూనాశ్రయుం ఏర్పాటుకు రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఓ వుహిళ కిరోసిన్ క్యాన్‌తో బాబు పాల్గొన్న సభా ప్రాంగణానికి చేరుకుంది. విషయుం తెలుసుకున్న పోలీసులు సదరు వుహిళను వుండల సచివాలయుంలోని ఒక గదిలో బంధించారు. సదస్సు ముగిసిన అనంతరం విడిచిపెట్టారు. -
పట్టణీకరణ-పరిణామాలు
స్వాతంత్య్రానంతరం భారత్ ప్రధానంగా పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక వెనుకబాటుతనం వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించే భారత్‌లో ప్రైవేటు రంగం అభివృద్ధి చెందింది. దీని ఫలితంగా దేశంలో పట్టణీకరణ వేగవంతమైంది. 1901 జనాభా లెక్కల ప్రకారం భారత్ మొత్తం జనాభాలో పట్టణ జనాభా 11.4 శాతంగా ఉంది. ఇది 2001 నాటికి 28.53 శాతానికి, 2011 నాటికి 31.6 శాతానికి పెరిగింది. స్వాతంత్య్రానంతరం దేశ స్థూలజాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా క్రమంగా తగ్గగా పారిశ్రామిక, సేవారంగాల వాటా క్రమేణా పెరుగుతూ వెళ్లింది. 1941 తర్వాత నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో వృద్ధి అధికమైంది. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తద్వారా భారత్‌లో ఆర్థికవృద్ధి పెరగటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. పబ్లిక్ రంగంలో వృద్ధి కారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా, రోడ్లు, వాటర్ సప్లై, విద్యుత్ వంటి అవస్థాపన సౌకర్యాలు మెరుగయ్యాయి. ప్రపంచబ్యాంకు-పట్టణీకరణ ఆర్థికవృద్ధి ప్రక్రియలో పట్టణీకరణ భాగమని ప్రపంచబ్యాంకు పేర్కొంది. భారత ఆర్థికవ్యవస్థలో పట్టణ ప్రాంతాల భాగస్వామ్యం విస్మరించలేనిది. భారత్ ఆర్థిక ఉత్పత్తిలో నగరాల వాటాను 2/3గా ప్రపంచబ్యాంకు పేర్కొంది. పెరుగుతున్న జనాభాకు ఆశ్రయం కల్పించటం, నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించటం వంటి అంశాల్లో భారత్‌లోని నగరాల పాత్రను ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో పట్టణ జనాభా 377 మిలియన్ల (2011లో) నుంచి 590 మిలియన్లకు చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. ఆర్థిక అవసరాల కారణంగా భారత్‌లోని గ్రామీణ జనాభా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దీంతో భారత్‌లోని పట్టణాలు, నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయని ప్రపంచబ్యాంకు పేర్కొంది. 2050 నాటికి భారత్‌తో పాటు చైనా, ఇండోనేసియా, నైజీరియా, అమెరికాలలో పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. ప్రపంచ పట్టణ జనాభా ఒక అంచనా ప్రకారం 2011-50 మధ్యకాలంలో ప్రపంచ పట్టణ జనాభా 3.6 బిలియన్ల నుంచి 6.3 బిలియన్లకు పెరగనుంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. 2020 నాటికి ఆసియాలో సగం జనాభా, 2035 మధ్యనాటికి ఆఫ్రికాలో సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం 2011-30 మధ్యకాలంలో ప్రపంచ పట్టణ జనాభాలో 1.4 బిలియన్ల పెరుగుదల ఉండనుంది. ఈ మొత్తంలో చైనా వాటా 279 మిలియన్లు కాగా భారత్ వాటా 218 మిలియన్లుగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా పెరుగుదలలో భారత్ వాటా 15.5 శాతానికి పైగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి 2012లో తెలిపింది. పట్టణ జనాభా పెరుగుదలకు ముఖ్యకారణాలు 1. పట్టణ ప్రాంత జనాభాలో సహజ పెరుగుదల 2. గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా తిరిగి వర్గీకరించటం 3. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు నికర వలసలు ఉపాధి రహిత వృద్ధి భారత్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు అధికంగా నమోదవుతుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు ఉపాధి రహిత వృద్ధిని చవిచూశాయి. గత దశాబ్దకాలంలో స్థూలదేశీయోత్పత్తి సగటు వార్షిక వృద్ధి 5 శాతానికి పైగా నమోదైంది. అదే సమయంలో ఉపాధివృద్ధిలో పెరుగుదల స్వల్పంగా ఉంది. 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో వ్యవసాయరంగంలో 23.3 మిలియన్లు, తయారీ రంగంలో 4.02 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయారు. ఇతర రంగాల్లో కొత్తగా 1.74 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 1999-2000, 2009-2010 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో (గ్రామీణ మహిళలు మినహా) నిరుద్యోగిత రేటులో స్వల్ప తగ్గుదల నమోదైంది. అల్ప ఉద్యోగిత రేటు పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. భారత్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగిత రేటు శ్రామిక మార్కెట్ స్థితి, ఉపాధి అవకాశాలను కచ్చితంగా స్పష్టపరచటం లేదు. 2011లో ఎన్ఎస్ఎస్వో నిర్వహించిన సర్వే ప్రకారం పురుషులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.9 శాతం, మహిళలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.5 శాతం మంది అదనపు పని కోసం ఆసక్తి ప్రద ర్శించారు. ఈ సర్వేలో శ్రామికుల్లో అనేక మంది ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా తగినంత ప్రతిఫలం లభించటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. 2005-06లో భారత ప్రభుత్వం ప్రారంభించిన జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ రెన్యువల్ మిషన్ కింద కేంద్రీకృత ప్రణాళికలో భాగంగా మూడంచెల వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీంతో గ్రామీణ పట్టణ సంబంధాలు మెరుగయ్యాయి. పట్టణ జనాభా భారత్‌లోని మొత్తం పట్టణ జనాభాలో 2011 లెక్కల ప్రకారం మహారాష్ట్రకు 13.5 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 11.8 శాతం, తమిళనాడుకు 9.3 శాతం వాటా ఉంది. 2011లో పట్టణ ప్రాంతాల్లో 377 మిలియన్ల మంది నివసించగా, ఒక మిలియన్ జనాభాకు పైగా ఉన్న నగరాల్లో 43 శాతం మంది నివసిస్తున్నారు. 2001లో మిలియన్ జనాభా గల నగరాలు సంఖ్య 35 ఉండగా, 2011 నాటికి 53కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్, కేరళల్లో చెరో 7 నగరాలు, మహారాష్ట్రలో ఆరు నగరాలు ఉన్నాయి. 53 పట్టణ పరిధి కలిగిన ప్రాంతాల్లో మూడు అతిపెద్ద మెగాసిటీలు (పది మిలియన్లకు పైగా జనాభా గల ప్రాంతాలు)గా గ్రేటర్ ముంబై (18.4 మిలియన్లు), ఢిల్లీ (16.3 మిలియన్లు), కోల్‌కతా (14.1 మిలియన్లు)లు నిలిచాయి. జనాభా పరంగా చెన్నై 8.7 మిలియన్లు, బెంగళూరు 8.5 మిలియన్లు కలిగి ఉన్నాయి. పది మిలియన్ జనాభాపైగా గల నగరాల్లో జనాభివృద్ధి, 2001-2011 మధ్యకాలంలో తగ్గింది. గ్రేటర్ ముంబై పట్టణ పరిధి జనాభివృద్ధి 1991-2001 మధ్య 30.47 శాతం కాగా, 2001-2011 మధ్య 12.05 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి సంబంధించి ఢిల్లీ పట్టణ పరిధి జనాభివృద్ధి 52.24 శాతం నుంచి 26.69 శాతానికి తగ్గింది. కోల్‌కతాలో 19.60 శాతం నుంచి 6.87 శాతానికి తగ్గింది. పట్టణీకరణ పెరగటానికి కారణాలు పట్టణీకరణ భారతీయ సమాజంలో సాధారణ లక్షణంగా కనిపిస్తుంది. పరిశ్రమల సంఖ్యలో వృద్ధి కారణంగా నగరాల సంఖ్య పెరిగింది. పారిశ్రామికీకరణ ఫలితంగా ప్రజలు ఉపాధి కోసం పారిశ్రామిక ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఫలితంగా పట్టణాలు, నగరాల సంఖ్య పెరుగుతోంది. పారిశ్రామికీకరణ ఉపాధి అవకాశాలను విస్తృతపరిచింది. దీంతో పట్టణ జనాభా పెరుగుతూ వెళ్తోంది. సామాజిక అంశాలైన విద్య, ఆరోగ్య సౌకర్యాల అందుబాటు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల లభ్యత కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.గ్రామీణ ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడాలి. భారత వ్యవసాయ రంగం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో వలసలు పెరిగాయి.సాంకేతిక పరిజ్ఞానం అందుబాటుతో పాటు మెరుగైన అవస్థాపనా సౌకర్యాల అందుబాటు కారణంగా సౌకర్యవంతమైన జీవనం సాగించవచ్చనే అభిప్రాయంతో గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు. పట్టణాలు, నగరాల సంఖ్య ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు గ్రామీణ సమాజం పట్టణ సంస్కృతిని అలవర్చుకుంటోంది. పట్టణ ప్రజల వాణిజ్య సంస్కృతిని అవలంబించటం గ్రామీణ సమాజంలో కనిపిస్తోంది. విద్యావ్యాప్తి కారణంగా అక్షరాస్యత రేటు పెరిగి, గ్రామీణ ప్రజల్లో ఆధునికత పెరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం. మహిళల్లో ఆలోచనా పరిజ్ఞానం పెరగటం. ఆధునిక రవాణా, సమాచార సౌకర్యాల పెరుగుదల. రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనటం. బ్యాంకులు, అనేక విత్త సంస్థలు అందుబాటులో ఉండటం. గ్రామీణ వినియోగదారుల్లో అవేర్నెస్ పెరగటం. అధునాతన వస్తు ఉత్పత్తులకు డిమాండ్. భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయటంలో భాగంగా పట్టణీకరణ లక్ష్యాన్ని పదకొండో ప్రణాళికలో ఎంచుకోవటం. సంస్కరణల అమలు కాలంలో ప్రైవేటురంగ ప్రాధాన్యత పెరగటంతో పాటు ప్రైవేటు రంగ పెట్టుబడులు అధికంగా పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమవటం. దేశవిభజన సమయంలో ప్రజల వలస. సహజంగా పట్టణ జనాభా పెరగటానికి మరణరేటు తగ్గుదలతోపాటు జననాల రేటు ఎక్కువగా ఉండటం కారణమైంది. పట్టణీకరణ ప్రభావం ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, పర్యావరణ అంశాలు పట్టణీకరణపై ప్రభావం చూపుతాయి. సామాజికంగా, సాంస్కృతికంగా మీడియా పట్టణీకరణను ప్రోత్సహిస్తోంది. పెద్ద నగరాల్లో చెత్త పెద్ద సమస్యగా నిలిచింది. వాయు, నీటి, ధ్వని కాలుష్యం వంటి సమస్యలు పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలుగజేస్తాయి. మురికివాడలు పెరగటంతోపాటు పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెరిగి ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది. అధిక పట్టణీకరణ కారణంగా నేరాల రేటు పెరుగుతోంది. నేరాల రేటు పెరుగదలకు పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ వైఫల్యం కారణమవుతోంది. పట్టణీకరణ ప్రయోజనాలు ఆర్థికవ్యవస్థలో వృద్ధిరేటు పెరుగుదల. వాణిజ్యకార్యకలాపాల్లో వృద్ధి. సాంఘిక, సాంస్కృతిక సమన్వయం (ఇంటిగ్రేషన్). సమర్థమైన సేవల అందుబాటు. వనరుల అభిలషణీయ వినియోగం. -
మరింత మానవత..!
పేదరికం, పర్యావరణంపై ప్రపంచానికి పోప్ ఫ్రాన్సిస్ పిలుపు * ఐరాస, ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి * ప్రకృతి వనరులను ధ్వంసం చేసే హక్కు మనిషికి లేదు * ఐరాస సర్వప్రతినిధి సమావేశంలోప్రసంగం న్యూయార్క్: పేదల ప్రయోజనాలను, పర్యావరణాన్ని గౌరవించే మరింత మానవీయమైన అంతర్జాతీయ వ్యవస్థ కావాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి పిలుపునిచ్చారు. బలహీనులను అభివృద్ధి ఫలాలకు దూరం చేసే ఆర్థిక వ్యవస్థపై విమర్శలు సంధించారు. అమెరికాలో పర్యటిస్తున్న పోప్ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ సమావేశంలో ప్రసంగించారు. సంస్కరణవాదిగా పేరొందిన ఆయన ఉన్నతమైన ప్రపంచ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. క్రైస్తవులపై వేధింపులు, ఇరాన్ అణు ఒప్పందం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బాలికల విద్యా హక్కు వంటి కీలక వర్తమాన సమస్యలను స్పృశించారు. ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థల్లో, రుణదాతల సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల దుర్వినియోగాన్ని, అధిక వడ్డీరేట్లకు అడ్డుక ట్ట వేయడానికి ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. సంస్కరణవాద ఆలోచనలతో నాస్తికుల మెప్పు కూడా పొందుతున్న 78 ఏళ్ల పోప్ ఆయా అంశాలపై ఏమన్నారో ఆయన మాటల్లోనే.. సుస్థిర అభివృద్ధి కావాలి.. దేశాల సుస్థిర అభివృద్ధిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కాపాడాలి. అణచివేత రుణ విధానాలకు, జనాన్ని మరింత పేదరికంలో ముంచే విధానాలకు దూరంగా ఉండాలి.(పోప్ స్వదేశం అర్జెంటీనా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ఆంక్షలతో ఆర్థిక సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు). ఇరాన్‌తో అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం శక్తిమంతమైన రాజకీయ సౌహార్దానికి, నిజాయితీకి, సహనానికి చిహ్నం. వాతావరణ మార్పులను అరికట్టాలి.. వాతావరణ మార్పుల నిరోధంపై డిసెంబర్లో ప్యారిస్‌లో జరిగే ఐరాస ఉన్నత సమావేశంలో మౌలికమైన, శక్తిమంతమైన ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాను. ఈ విశ్వం.. సృష్టికర్త ఇచ్చిన ప్రేమాస్పద ఫలం. దాన్ని దుర్వినియోగం, విధ్వంసం చేసే అధికారం మానవజాతికి లేదు. స్వార్థం, అధికారం కోసం, భౌతిక సంపదల కోసం అంతులేని దాహం సహజవనరుల విధ్వంసానికి దారి తీస్తోంది. బలహీనులను వాటికి దూరం చేస్తోంది. పర్యావరణ దుర్వినియోగంతో పేదలు దారుణ అన్యాయానికి గురవుతున్నారు. క్రైస్తవుల భద్రత తదితరాలపై.. ప్రపంచమంతా శాంతి పరిఢవిల్లాలి. సిరియా, ఇరాక్లలో తీవ్రవాదులు వేధిస్తున్న క్రైస్తవులకు, ఇతర మతాల వారికి భద్రత కావాలి. లక్షలాదిమందిని నిశ్శబ్దంగా చంపుతున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలి. బాలికలతోపాటు బాలలందరికీ విద్యాహక్కు కల్పించాలి. దీనికి ఐరాస గురుతర బాధ్యత తీసుకోవాలి. అసంబద్ధమైన పద్ధతులు, జీవన శైలులను బలవంతంగా రుద్దకూడదు. కాగా శుక్రవారం అమెరికన్లు న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి పోప్‌కు ఘన స్వాగతం పలికారు. -
పేదరిక రహిత ప్రపంచం మనందరి కల కావాలి: మోదీ
న్యూయార్క్: పేదరిక రహిత ప్రపంచం మనందరి కల కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఐర్లాండ్ నుంచి ఐదురోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ఆయన శుక్రవారం న్యూయార్క్ లోని ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి, ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పులపై ఉమ్మడి ఒప్పందం ఆవశ్యకతపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రపంచంలో 1.3 బిలియన్లు(నూటముఫ్ఫై కోట్లు) మంది పేదరికంలో ఉన్నారని చెప్పారు. పేదరికం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉందని హితవు పలికారు. 2030 నాటికి అభివృద్ధి అజెండా పూర్తి చేసుకోవాలని మోదీ సూచించారు. ఐరాస సభలో మోదీ ప్రస్తావించిన మరికొన్ని కీలక అంశాలు.. ⇒ విద్య, నైపుణ్యాభివృద్ధికే మా ప్రాధాన్యత ⇒ పేదరిక నిర్మూలనే మా ప్రధాన బాధ్యత ⇒ మహిళ సాధికారిత సాధించడమే మా లక్ష్యం ⇒ సుస్థిర అభివృద్ధితోనే వాతావరణ మార్పుల సవాల్‌ను ఎదుర్కోగలం -
ఓ ప్రకటన... జీవితాలను మార్చేసింది...
ఒకప్పుడు ఆ గ్రామం గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదో పర్యటక కేంద్రంగా మారిపోయింది. అక్కడి ప్రజల కుల వృత్తులు, కళలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. లగ్జరీ లైఫ్ ను... లక్షల జీతాన్ని వదులుకున్న యువ ఇంజనీర్ సౌరభ్ పాట్ దార్ ఆశయం గ్రామంలో అనూహ్య మార్పును తెచ్చింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ముంబై కి దగ్గరలోని తానే జిల్లా జవహర్ గ్రామం గురించి ఇప్పుడు ఆ చుట్టుపక్కల తెలియనివారుండరు. సౌరభ్ లక్ష్యం సాధించేందుకు ఎంతో కష్టపడ్డాడు. గ్రామాల్లో ప్రజలకు ముందుగా తాను అవగాహన కల్పించాడు. రూరల్ టూరిజం ను ప్రవేశపెట్టి తన ప్రాజెక్టును ప్రారంభించాడు. పల్లె ప్రజల కళ్ళల్లో కాంతులు చూడాలనుకున్న సౌరభ్... BAIF సహాయంతో జవహర్ గ్రామాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు తీవ్ర కృషి చేశాడు. దోరాబ్జీ టాటా ట్రస్ట్ సహాయంతో గ్రామాల్లోని వస్తువులు అక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా చేశాడు. జవహర్ గ్రామం గురించి దగ్గర్లోని అన్ని స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళి ప్రచారం చేశాడు. గ్రామంలోని ప్రాధాన్యతలను వివరించాడు. అయితే సౌరభ్ గ్రామంలో కొనుగోలుదారులను ఆకట్టుకునే సరైన వస్తువులు లేవని, అమ్మకాలు చేపట్టేందుకు అక్కడి ప్రాధమిక సదుపాయాలు సరిపోవని తెలుసుకున్నాడు. గ్రామాభివృద్ధికి టూరిజం వారు ఇచ్చిన డబ్బును క్రమ పద్ధతిలో ఖర్చుపెట్టి, విలేజ్ టూరిజం ను అభివృద్ధి చేసేందుకు స్థానికులను ఒప్పించాడు. పలు సంస్థల్లో భాగస్వామ్యం పొంది, పర్యటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. పర్యటనకు వచ్చినవవారికి కావలసిన వసతులను, బస చేసేందుకు వీలైన సౌకర్యాలను గ్రామంలో ఏర్పాటు చేశాడు. ట్రైబల్ డాన్స్, ఆటలు, పాటలు వంటి వివిధ కార్యక్రమాలతో అధిక సంఖ్యలో పర్యటకులు గ్రామాన్ని సందర్శించేలా చేశాడు. తాను అనుకున్నది సాధించేందుకు సౌరభ్ మరో ప్రయత్నం కూడ చేశాడు. తన స్నేహితునితో కలసి దగ్గరలోని గ్రామాల్లో వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారిని, కళాకారులను కలిశాడు. ఎంతో కష్టపడి వారు తయారు చేసే అందులో భాగంగా వర్లి పెయింటింగ్స్ వేసే సదానంద్ నాకర్ ను కలిశాడు. మూగ, చెవిటి వాడైన సాకర్ కుటుంబమంతా తొమ్మిది నుంచి పద్ధెనిమిది గంటల పాటు కష్టపడితే ఓ పెయింటింగ్ తయారవుతుంది. అది అమ్మితే వారికి 75 రూపాయలు వస్తుంది. దాంతో వారి కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. అది చూసిన సౌరభ్... నాకర్ కు సహాయపడేందుకు నిశ్చయించుకున్నాడు. తన ప్రాజెక్ట్ లో భాగంగా ఆ కళాకారుడిని ప్రోత్సహించి అతని జీవితాన్ని మెరుగు పరచాలనే ఉద్దేశ్యంతో అతడి పెయింటింగ్స్ ను మార్కెట్ చేసేందుకు స్థిద్ధపడ్డాడు. ముంబైకి తీసుకెళ్ళి అమ్మకాలు ప్రారంభించాడు. వర్లి పెయింటింగ్స్ కు అత్యంత ఆదరణ లభించడంతో సౌరభ్ సదానంద్ కు తన క్లైంట్లను పరిచయం చేశాడు. ప్రస్తుతం సదానంద్ పెయింటింగ్స్ కు మార్కెట్లో అత్యంత ఆదరణ లభించడంతో ఒక్కో పెయింటింగ్ సుమారు లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. అంతేకాదు తన మార్కెట్ జర్మనీకి కూడ విస్తరించాడు. ప్రస్తుతం వర్లి పెయింటింగ్ బిజినెస్ కు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ లభిస్తోంది. సౌరభ్ ఆశయం నెరవేరింది. తన ప్రాజెక్టు పూర్తవ్వడంతో పాటు... సదానంద్ జీవితంలో పెను మార్పు రావడం ఆనందం కలిగించింది. అయితే లక్షల జీతంతో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నసౌరభ్ తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు పేపర్లో వచ్చిన 'ఎస్ బీ ఐ యూత్ ఫర్ ఇండియా' ప్రకటన ఎంతగానో సహాయ పడింది. ఎస్ బీ ఐ ఫెలోషిప్ ను వినియోగించుకొన్న సౌరభ్.. వర్లి పెయింటింగ్ ప్రాజెక్టుకు ఎస్ బీ ఐ నుంచి అధికారికంగా అనుమతి కూడ లభించింది. గ్రామాభివృద్ధికి పాటుపడ్డ సౌరభ్ ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకోవడంతో పాటు మరెందరో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
బాల్యం బందీ
వలస బాటపడుతున్న మత్స్యకార బాలలు ఇప్పుడు వంటపనికి... రాబోయే రోజుల్లో వేటకు ఆర్థిక అవసరాలకోసం తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్న వైనం పేదరికం కారణంగా చదువుకు దూరం వేళ్లూనుకుంటున్న బాలకార్మిక వ్యవస్థ పేదరికం వారిపాలిట శాపంగా మారుతోంది. ఏడాది పొడవునా పనిదొరక్క ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పిల్లల్ని వలసబాట పట్టించాల్సిన దుస్థితి దాపురించింది. చిన్నతనంలో వంటపనివారిగా... రాబోయే కాలంలో చేపలవేట కార్మికునిగా మార్చాల్సి వస్తోంది. విలువైన వారి బాల్యం బందీగా మార్చి చదువుకు దూరం చేస్తోంది. ఎచ్చెర్ల: జిల్లాలోని విశాల తీరప్రాంతంలో వేలాది మత్స్యకార కుటుంబాలకు వేటే జీవనాధారం. పరిస్థితుల ప్రభావం... ప్రకృతి సహకరించకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. వేటకు దూరం కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో వారు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకు 194 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన తీరప్రాంతంలోని 12 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 98,450 మంది జనాభా ఉండగా, 53,469 మందికి చేపల వేటే ప్రధాన వృత్తి. 1225 ఇంజిన్ బోట్లు, 2598 సంప్రదాయ నాటుపడవలు వేటకు వినియోగిస్తున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధం అమలవుతుంది. ఈ రోజుల్లో జీవనభృతికోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అక్కడ చేపలు వేటాడితే కాంట్రాక్టర్లు రూ.20 వేల వరకు నెలకు జీతం చెల్లిస్తారు. ఇదే అదనుగా పిల్లల తరలింపు ఇదే తరుణంలో 15ఏళ్ల లోపు పిల్లలు చదువుకు స్వస్తి చెప్పి వలసలు వెళ్తున్నారు. వారి తల్లిదండ్రులు కాంట్రాక్టర్లనుంచి రూ.50 వేలు వరకు అడ్వాన్స్ తీసుకొని గుజరాత్‌లోని వీరావల్, సూరత్, మహారాష్ట్రలోని ముంబాయి, పూనే వంటి ప్రాంతాలకు పంపిస్తారు. వీరు అక్కడ వంట మనుషులుగా పనిచేస్తారు. అందుకు నెలకు రూ.5వేల వరకు జీతంగా వస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వీరూ చేపల వేట నేర్చు కుని ఆ వృత్తిలోకి మారుతారు. ఈ విధంగా పిల్లల బాల్యం మసకబారుతోంది. చదువుకు దూరమై వలస కార్మికులుగా మారిపోతున్నారు. స్వచ్ఛంద సంస్థల సర్వేతో... ఎచ్చెర్ల మండలంలో డి.మత్స్యలేశం, బడేవానిపేట, బుడగట్లపాలెం అనే మూడు మత్స్యకార గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు నిర్మూలనకు పాటుపడుతోంది. పాఠశాలకు ఈ మధ్య విద్యార్థులు వెళ్లకపోవటాన్ని గుర్తించిన ఈ సంస్థ దీనిపై ఆరా తీయగా విద్యార్థులు వలస వెళ్లిన విషయం వెలుగు చూసింది. వెంటనే వారు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయగా ఈ మూడు పంచాయతీల్లో 70 మంది విద్యార్థులను వలస వెళ్లకుండా ముస్కాన్, ఐసీడీఎస్, పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖలు అడ్డుకున్నాయి. దీనిపై పిల్లల తల్లిదండ్రులు గుర్రుగా ఉన్నారు. అయితే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా వలసలను శాశ్వతంగా నివారించవచ్చన్నది నిపుణుల సూచన. బాలల భవిష్యత్తు దెబ్బ తింటుంది మత్స్యకార గ్రామాల్లో బాలకార్యిక వ్యవస్థ, బాల్య వివాహాలు రెండూ ప్రధాన సమస్యలు. ఈ రెండింటిపైనా ప్రజలను చైతన్య పరుస్తున్నాం. తల్లిదండ్రులు తమ ఆర్థిక అవసరాలకోసం పిల్లలను వలస పంపిస్తున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బ తింటుంది. చదువు విలువ సైతం ప్రజలకు తెలియటం లేదు. దీనిపై వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం అధికారులు చర్యలు చేపట్టాలి. 10వ తరగతి వరకు మత్స్యకార గ్రామాల్లో నిర్బంధ విద్య అమలు చేయాలి. - గురుగుబెల్లి నరసింహమూర్తి, హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్, కార్యదర్శి -
కటిక పేదరికంలోనూ వీడని దురదృష్టం!
►దాతలూ ఆదుకోరూ... ► గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కుమార్తె ► తట్టుకోలేక కుప్పకూలి మృతి చెందిన తండ్రి ► చందాలతో చికిత్స చేయిస్తున్న గ్రామస్తులు మందస: చిన్నతనం నుంచీ కూతురిని ప్రేమగా పెంచాడు. అయితే పేదరికం కారణంగా వివాహం జరిపించలేకపోయాడు. భార్య మరణంతో మరింత కుంగిపోయిన ఆశలన్నీ కూతురిపైనే పెట్టుకున్నారు. ఓ వైపు పేదరికం పట్టిపీడిస్తున్న ఆ కుటుంబాన్ని మరోవైపు దురదృష్టం వెంటాడింది. హఠాత్తుగా కుమార్తె గుండెపోటుతో ఆస్పత్రి పాలవగా..విషయం తెలిసిన ఆ తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ సంఘటన మండలంలోని డిమిరియా గ్రామంలో చోటుచేసుకుంది. కుమార్తెకు తండ్రి మరణ వార్త తెలియజేయకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన డంకూరు రాములు(65) వృత్తిరీత్యా రజకుడు. ఆయన భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. వీరికి కేశమ్మ, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు బతుకుదెరువు కోసం వలసపోయారు. రాములు తన కుమార్తెతో కలసి గ్రామంలోనే ఓ పూరిగుడిసెలో నివాసం ఉండే వారు. కుమార్తెకు పెళ్లీడు వచ్చినప్పటికి పెళ్లి చేసే స్తోమత లేకపోవడంతో అవివాహితగానే ఉండిపోయింది. ఆమె కొన్నాళ్ల క్రితం నుంచి వెలుగు కార్యాలయంలో సీసీగా పని చేస్తున్నారు. కాయకష్టంపై ఆధారపడి జీవిస్తున్న సమయంలో దురదృష్టం వారిని వెంటాడింది. కేశమ్మ మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో గ్రామస్తులు 108లో కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి, చందాలు వేసుకుని ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. ఆ సమయంలో తండ్రి రాములు కూలి పనికోసం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి విషయం తెలిసి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ఊపిరి వదిలేశాడు. దీంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. దాతలసాయం కోసం ఎదురు చూపు నిరుపేద కుటుంబానికి చెందిన కేశమ్మ గ్రామస్తుల సహకారంతో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమెకు విశాఖపట్నంలోని ఓ పెద్ద ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించాలని, అందుకు సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు, బంధువులు విలపిస్తున్నారు. సహృదయం గల దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిండు జీవితం ప్రసాదించాలని కేశమ్మ కోరుతోంది. దాతలు 9866386936 సెల్ నంబర్‌ను సంప్రదించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ముస్లింలపై లోతైన అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధిత స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ ముస్లింలకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణలోని ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ పనితీరు, కార్యాచరణపై సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్రం నియమించిన కుంద్ కమిటీ సభ్యులు అమీరుల్లాఖాన్, ప్రొఫెసర్ అబ్దుల్ షాబాన్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ చైర్మన్ జి.సుధీర్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన సచార్ కమిటీ, కుంద్ కమిటీలు, మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన రహమాన్ కమిటీ ఎలా అధ్యయనం చేసింది... దానికి అనుసరించిన పద్ధతులను గురించి సమీక్షలో చర్చించారు. తెలంగాణలో అధ్యయనం ఎలా జరగాలో సీఎం ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. లోతుగా అధ్యయనం జరగాలి దేశవ్యాప్తంగా జరిగిన సర్వేల కంటే మరింత లోతుగా, శాస్త్రీయంగా తెలంగాణలో ముస్లింలపై అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో పర్యటించి పట్టణ గ్రామీణ ముస్లింలను కలవాలన్నారు. వారి స్థితిగతులపై వివరాలు సేకరించటంతో పాటు జీవన విధానంపై ఫొటోలు, వీడియోలు తీయాలన్నారు. ఏజెన్సీలలో కూడా సర్వే జరపాలన్నారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు, ముస్లిం సమాజాల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. అధ్యయనం తర్వాతే ముస్లింల కోసం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించాలన్నారు. తెలంగాణలో దాదాపు 12 శాతం ముస్లింలున్నారని, వారిలో ఎక్కువ శాతం నిరుపేదలే అని సీఎం చెప్పారు. కనీసం నెలకు రూ.1,000 కూడా సంపాదన లేని వారుండటం బాధాకరమన్నారు. ఎన్నికల సందర్భంగా ముస్లింల జీవన స్థితిగతుల్లో మార్పు తెస్తామని హామీ ఇచ్చామని, వాటిని వందకు వంద శాతం అమలు చేస్తామని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు పెంచటంతో పాటు షాదీ ముబారక్, హాస్టళ్లు, నివాసగృహాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నామన్నారు. జనాభా ప్రకారం పేద ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అవలంబించిన పద్ధతులను అనుసరిస్తామన్నారు. కమిషన్ ఆఫ్ఎంక్వైరీస్ నివేదిక రాగానే ముస్లింలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు. కమిషన్‌లో మరో ఇద్దరు కుంద్ కమిటీలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి అమీరుల్లాఖాన్, అబ్దుల్ షాబాన్‌లను జి.సుధీర్ నేతృత్వంలోని కమిషన్‌లో సభ్యులుగా నియమించారు. షాబాన్ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన రహమాన్ కమిటీ సభ్యుడు. పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు జరిగినందున ఆగస్టు మొదటివారంలో సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందిం చుకోవాలని సీఎం సూచించారు. -
రోటీ బ్యాంకు!
మార్గం ఎప్పుడూ ఉంటుంది. ఉండాల్సింది మనసే! మనసున్న ఆ యువకులు ఆకలితో అలమటించే వాళ్ల కడుపులు నింపాలనుకున్నారు. అది చిన్న విషయమేమీ కాదు. ఎంత ఖర్చవుతుందో వాళ్లకి తెలుసు. అయినప్పటికీ వాళ్లు ఖర్చుకు భయపడలేదు. ‘మా కోరిక సాధ్యపడుతుందా?’ అని ఒకటికి పదిసార్లు ఆలోచించలేదు. మనసు ఉంది... మార్గం తెరుచుకుంది. ఆ మార్గమే... ‘రోటీ బ్యాంక్’! రోటీ బ్యాంకు అంటే ఒక చల్లని నీడ. పేదోళ్ల కంటిపాప. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా వెనకబడిన జిల్లా. ఈ జిల్లా కేంద్రంలో సౌకర్యాలు, అభివృద్ధి మాట అలా ఉంచి... ఏ మూల చూసినా పేదరికం ఉట్టిపడుతున్నట్లు ఉంటుంది. అన్ని పక్కల్నుంచీ ఆకలికేకలు వినిపిస్తున్నట్లుగానే ఉంటుంది. ఈ పరిస్థితికి చలించిన ఐదుగురు యువకులు... అన్నార్తుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఒక బృందంగా ఏర్పడ్డారు. వారికి మరో అయిదుగురు తోడయ్యారు. ఆ అయిదుగురికి ఇంకో అయిదుగురు... ఇలా మొత్తం నలభై మంది యువకులు ఒక బృందంగా ఏర్పడ్డారు. రోటీ బ్యాంకును స్థాపించారు. ఈ బృందంలోని యువకులు రోజూ పట్టణమంతా తిరుగుతూ ధనికులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి రొట్టెలను, కూరలను సేకరిస్తారు. ప్రతి ఇంటి నుంచి రెండు రొట్టెలు సేకరించాలని నియమంగా పెట్టుకున్నారు. నిజానికి ఇలా సేకరించడం మొదట కష్టంగా ఉండేది. కొందరు రేపుమాపు అని తప్పించుకునే వారు. మరి కొందరు ‘‘ ఈ రొట్టెలను ఎక్కడైనా అమ్ముకుంటారా ఏమిటి?’’ అని అనుమానంగా ప్రశ్నించేవాళ్లు. కొందరైతే వాసన వచ్చే నిల్వ రొట్టెలు ఇచ్చేవారు. అయినా కూడా బృంద సభ్యులు నిరాశ పడలేదు. వెనక్కి తగ్గాలనుకోలేదు. తమ ఆలోచన గురించి, ఆశయం గురించి ఓపిగ్గా చెప్పడం ప్రారంభించారు. మెల్లగా అందరిలోనూ కదలిక వచ్చింది. ప్రతి ఇంటివారూ రెండు తాజా రొట్టెలను ఇవ్వడం ప్రారంభించారు. స్థానిక పత్రికల ద్వారా రోటీ బ్యాంకు గురించి అందరికీ తెలిసింది. ఇక అపార్థాలు బంద్. మూతివిరుపులు బంద్. పాచి రొట్టెలు, పనికి రాని రొట్టెలు ఇవ్వడం బంద్. పట్టణాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాలకు సంబంధిం చిన బాధ్యతలను పంచుకున్నారు ఈ నలభైమంది యువకులు. మెల్లగా ‘రోటీ బ్యాంక్’లో రొట్టెల సంఖ్య రోజురోజుకూ పెరగడం ప్రారంభించింది. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందడం మొదలైంది. రొట్టెలు ఇవ్వలేనివారు పిండి ఇస్తే, దానితో వాలంటీర్లు రొట్టెలు చేసి పంచుతుంటారు. చిన్నగా మొదలైన ‘రోటీ బ్యాంకు’ ఇప్పుడు ఒక ఉద్యమంగా మారి రోజూ నాలుగు వందల మంది ఆకలి తీరుస్తోంది. రైల్వేస్టేషన్ ముందు కనిపించే యాచకులు, చెత్త ఏరుకునే వాళ్ల నుంచి మొదలు... ఆస్పత్రిలో బీద పేషెంట్ల వరకు ఈ ‘రోటీ బ్యాంకు’ ఎందరి ఆకలినో తీరుస్తోంది. అరవై ఏళ్ల రామ్‌ప్రకాశ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న ‘రోటీ బ్యాంకు’ ప్రతిరోజూ అతడి ఆకలిని తీరుస్తోంది. ఇరవై నాలుగేళ్ల సురేష్ నిరుద్యోగి. రోజంతా ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో ప్రయత్నిస్తుంటాడు. ఎక్కడికి వెళ్లినా కాలినడకనే వెళ్లే సురేష్ దగ్గర చిల్లర డబ్బులు కూడా ఉండవు. అతడి ఆకలినీ తీరుస్తోంది రోటీ బ్యాంక్. ఇంతమంది కడుపులు నింపుతోన్న రోటీ బ్యాంక్ అంటే మహోబాలోని వారికి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల వారికీ ఎంతో గౌరవం. ‘‘ఆ యువకులను... పేదవాళ్ల కోసం దేవుడు పంపించాడు’’ అంటాడు కృతజ్ఞత నిండిన కంఠంతో రామ్‌ప్రకాశ్. ‘‘రోటీబ్యాంక్ అనేది లేకుంటే ఆకలితో చనిపోయేవాడిని’’ అంటాడు సురేష్. ‘‘ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే. దయచేసి మా బ్యాంకుకు తాజా రొట్టెలను మాత్రమే ఇవ్వండి’’ అంటు న్నాడు ‘రోటీ బ్యాంకు’ సభ్యుడైన హాజీ మహ్మద్. మరిన్ని నగరాలలో ‘రోటీ బ్యాంక్’ కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది నలభైమంది యువకుల ఆశయం. వారి ఆశయం త్వరగా ఫలించాలని ఆశిద్దాం! -
పేదరికం పెరుగుతోంది
ఈ దేశంలో రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా సంపద పెంచుకుంటే ఆర్థికాభివృద్ధి ఫలాలు జాలువారి (ట్రికిలింగ్ ఎఫెక్ట్ థియరీ) కింద ఉన్న పేదలకు అందుతాయనీ, అది ఒక్కటే పేదరికం నిర్మూలనకు మార్గమనే వాదన ప్రస్తుత పాలక వర్గా నిది. ఆర్థికాభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాలనే వాదన యూపీఏ సర్కార్‌ది. ఒకరు తానే ఫలానా నగరాన్ని అభివృద్ధి చేశానంటూ గొంతు చించుకుంటారు. మరొకరు తానే తన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో వేగంగా నడిపించి అద్భుతాలు సృష్టించాననీ, అదే పని దేశవ్యాపితంగా చేస్తాననీ చెప్పుకుంటారు. పేదరికం నిర్మూలన కోసమే తమ పార్టీ పాటుపడిందని ఇంకొకరు చాటుకుంటారు. దాదాపు ఏడు దశాబ్దాల స్వపరిపాలన, అనేక పంచవర్ష ప్రణాళికలూ, వివిధ సంక్షేమ పథకాల తర్వాత మనం ఎక్కడున్నాం? చైనా కంటే వేగంగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) పెరుగుతోందనీ, మరి కొన్ని సంవత్సరాలలో అమె రికా, చైనా తర్వాత మనమే ప్రబలమైన ఆర్థికశక్తిగా ఎదగబోతున్నామనీ సగర్వంగా చాటుకుంటున్న మనం ఆత్మవంచన చేసుకుంటున్నామా? కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం విడుదల చేసిన సామాజికార్థిక, కుల (సోషియోఎకానమిక్, కాస్ట్)సర్వే (సెక్) ఫలితాలు మనకు రుచించని, అంగీక రించడానికి సిద్ధంగా లేని నిప్పులాంటి నిజాన్ని నిగ్గు తేల్చాయి. గ్రామీణ భారతంలో సగానికి పైగా కుటుంబాలు (51శాతం) కూలిచేసుకొని పొట్ట నింపుకోవలసిన దుస్థితిలో ఉన్నాయని సెక్ నిర్ధారించింది. మూడింట ఒక కుటుంబానికి భూమి లేదు. 23.5 శాతం గ్రామీణ కుటుంబాలలో చదువుకున్న వయోజనులు లేరు. ఇట్లా దిగ్భ్రాంతి, మనస్తాపం కలిగించే అనేక వాస్తవాలను ఈ సర్వే వెల్లడించింది. కులాల వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) విశ్లేషిస్తున్నారు. వాటిని పార్లమెంటుకు సమర్పిస్తారని ప్రభుత్వం చెబుతుంటే బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వెనుకబడిన కులాల సంఖ్యావివరాలను తొక్కిపెట్టారంటూ యదుభూషణులు ఎత్తిపొడుస్తున్నారు. దారిద్య్రరేఖ నిర్ధారణ గ్రామీణ ప్రాంతంలో ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఆహార, ఆహారేతర అవసరాలకోసం రోజుకు రూ. 26లు కానీ అంతకంటే తక్కువ కానీ ఖర్చు చేస్తు న్నట్లయితే ఆ కుటుంబం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు గుర్తిస్తున్నామనీ, అదే పట్టణ ప్రాంతమైతే రూ. 32లు కానీ అంత కంటే తక్కువగానీ ఖర్చు చే స్తున్న కుటుంబాన్ని పేదరికంలో ఉన్నట్టు లెక్కిస్తున్నామనీ ప్రణాళికా సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నది. అనంతరం సురేష్ టెండూల్కర్ కమిటీ కుటుంబం ఖర్చు మొత్తాన్ని స్వల్పంగా హెచ్చించింది. ఒక కుటుంబానికి ఏమేమి వసతులు ఉన్నాయో తెలుసుకొని ఆ కుటుంబం పేదదా కాదా అనే నిర్ణయానికి వచ్చే పద్ధతి ఒకటి. ఎటువంటి ఇల్లు ఉంది? ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారు? ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు? అక్షరాస్యత ఉన్నదా లేదా? పిల్లలు ఏమి చేస్తున్నారు? ఇటువంటివే మొత్తం 13 సూచీల ద్వారా సమాచారం సేకరించి ఫలానా కుంటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నదా లేదా అనే విషయం గుర్తించేవారు. 2002లో జరిగిన ఇటు వంటి సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 28.3 శాతం కుటుంబాలూ, పట్టణ ప్రాంతంలో 27.5 కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్టు తీర్మానించారు. ఈ కుటుంబాలన్నిటికీ ఆహారం, గృహ నిర్మాణం, వైద్యం, విద్య వగైరా అంశాలలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు అన్నీ అందాలి. యూపీఏ ప్రభుత్వం 2011లో కొత్త సూచీల ఆధారంగా సరికొత్త సర్వే (సెక్)కు శ్రీకారం చుట్టింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనం ఉన్నా, కారు ఉన్నా, వ్యవసాయ పనిముట్లు ఉన్నా, క్రెడిట్‌కార్డు ఉన్నా, కుటుంబ సభ్యులలో ఒక్కరైనా రూ. 10,000లు లేదా అంతకు మించి ఆదాయం సంపాదిస్తున్నా, కుటుంబంలో ఎవరైనా ఆదాయం పన్ను కానీ వృత్తి పన్నుకానీ చెల్లిస్తున్నా (ఇటు వంటివే మొత్తం 14 సూచీలలో ఏ ఒక్క సూచీకి అవునని సమాధానం వచ్చినా) పేదరికం లేనట్టే. దీని ఫలితంగా గ్రామీణ భారతంలోని మొత్తం 17.91 కోట్ల కుటుంబాలలో 7.05 కోట్ల (39.39 శాతం) కుటుంబాలు దారిద్య్రరేఖకు ఎగువనే ఉంటాయి. వాటికి ప్రభుత్వ సబ్సిడీలు వర్తించవు. అదే విధంగా, గూడులేని వారూ, సఫాయి కార్మికులూ, చట్టబద్ధంగా విముక్తి పొందిన కట్టు బానిసలూ, భిక్షాటనంపైన బతికేవాళ్లూ, అనాథలూ గ్రామీణ భారతంలో 16.50 లక్షల కుటుంబాలలో ఉన్నార ని సర్వే తేల్చింది. ఈ కుటుంబాలకు ప్రభు త్వ సాయం పూర్తిగా అందవలసి ఉంటుంది. సరైన ఇల్లు లేనివారికీ, దళితు లకూ, ఆదివాసీలకూ, అక్షరాస్యత లేని కుటుంబాలకూ, కూలిపని చేసుకొని బతి కులీడ్చేవారికీ అన్ని సంక్షేమ పథకాలు కాకుండా వారికి అవసరమైన పథకాల ద్వారా ప్రభుత్వం సహాయం చేయాలి. ఉదాహరణకు ఒక్కగది మాత్రమే ఉన్న ఇంట్లో నివసిస్తున్నవారికీ ఇందిర గృహనిర్మాణ పథకం కింది ఇళ్ళు కట్టించాలి. ఇటువంటి కుటుంబాలు 8.69 లక్షలు ఉంటాయి. అంత్యోదయ పథకం మాదిరే వీరికి వెంటనే సహాయం అందించాలి. గ్రామీణ భారతంలో సుమారు రెండు కోట్ల కుటుంబాలకు ఏ లోటూ లేదు. ఈ కుటుంబాలనూ, సూచీల ఆధారంగా చూసినప్పుడు సబ్సిడీలు వర్తించని 7.05 కోట్ల కుటుంబాలనూ కలిపితే మొత్తం 9.05 కుటుంబాలను ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి మినహాయించవచ్చునని ‘సెక్’ ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రెండు కుటుంబాలలో ఒక కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం వర్తించాలి. ఇంకా ఎక్కువ కుటుం బాలకు సంక్షేమ పథకాలను అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. 2002 నాటి సర్వే ప్రకారం 27.5 శాతం గ్రామీణ కుటుంబాలనే దారిద్య్రరేఖకు దిగు వన ఉన్నట్టూ, సంక్షేమ కార్యక్రమాలకు అర్హులైనవన్నట్టూ గుర్తించినప్పటికీ ఆహార సబ్సిడీలను అనేక రాష్ట్రాలు 45 శాతం గ్రామీణ కుటుంబాలకు అందిం చాయి. ప్రముఖ ఆర్థికవేత్త, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ రంగరాజన్ నిరుడు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 31శాతం గ్రామీణ కుటుంబాలను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు గుర్తించాలని సిఫార్సు చేశారు. నిజంగా ఎంత మంది నిరుపేదలు గ్రామీణభారతంలో ఉన్నారో తాజా సర్వే శాస్త్రీయంగా లెక్క తేల్చింది. మోదీ మార్గం నరేంద్రమోదీకి ముందు 14మంది ప్రధానులు ఈ దేశాన్ని ఏలారు. ఎన్నెన్నో పథకాలు అమలు చేశారు. అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. పేదరికం వెక్కిరిస్తూనే ఉంది. నరేంద్రమోదీ ప్రభుత్వం సైతం మరికొన్ని లక్షల కోట్లు ఖర్చు చేయవచ్చు. అయినా సరే, పేదరికం నిర్మూలించగలరనే నమ్మకం లేదు. మనం నేల విడిచి సాము చేస్తున్నాం. గ్రామాలను నిర్లక్ష్యం చేసి పట్టణా లను విస్తరించుకుంటూ పోతున్నాం. గ్రామాలలోనూ, పట్టణాలలోనూ ఉపాధి అవకాశాలు కల్పించలేక పోతున్నాం. ఇన్నేళ్ల నిర్వాకం తర్వాత పేదలకూ, సంపన్నులకూ మధ్య, గ్రామాలకూ, పట్టణాలకూ మధ్య అంతరం విపరీతంగా పెరిగింది. పల్లెసీమలు సస్యశ్యామలంగా ఉన్నప్పుడు పంటలు పండేవి. రైతులకూ, వ్యవసాయ కూలీలకే కాకుండా వృత్తిపనులవారికి చేతి నిండా పని ఉండేది. కడుపునిండా తిండి ఉండేది. అదంతా గతం. పల్లెను నాశనం చేసుకున్నాం. పొట్టపట్టుకొని పట్టణాలకు వచ్చినవారు ఉపాధి దొరకక అశాంతితో, ఆకలితో అలమటిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో చదువుకొని ఉపాధి లేక నైరాశ్యం ఆవరించిన యువత ఆవేశంతో ఎటు పోతుందోనన్న భయం ఆలోచ నాపరులను పట్టిపీడిస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా యువతీ యువకులు చిన్న ఎదురు దెబ్బ తగిలినా, నిరాశ కలిగినా తట్టుకోలేక ఆత్మ హత్యకు ఒడిగడుతున్నారు. వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు ప్రభుత్వాలు తక్షణం చేపట్టాలి. ఈ దేశంలో రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా సంపద పెంచుకుంటే ఆర్థికాభివృద్ధి ఫలాలు జాలువారి (ట్రికిలింగ్ ఎఫెక్ట్ థియరీ) కింద ఉన్న పేదలకు అందుతాయనీ, అది ఒక్కటే పేదరికం నిర్మూలనకు మార్గమనే వాదన ప్రస్తుత పాలక వర్గానిది. ఆర్థికాభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాలనే వాదన యూపీఏ సర్కార్‌ది. సామ్యవాదం వెనకబడింది. యూరప్‌లో సత్ఫలితాలు ఇచ్చిన అభివృద్ధి నమూనా భారత్ వంటి సువిశాల దేశంలో ఇవ్వకపోవచ్చు. సింగపూర్ వంటి చిన్న నగరరాజ్యంతో మనం పోల్చుకోవడం, దానిని అనుసరించడానికి వెంపర లాడటం వెర్రితనం. చైనా కూడా మూడున్నర దశాబ్దాల కిందటి వరకూ మన లాగే వ్యవసాయ ప్రధాన దేశం. 1978లో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత చైనా స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ శాతం తగ్గడం వ్యవసాయరంగం ఉత్పత్తి పడిపోవడం వల్ల కాదు. చైనా ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పెరగడం వల్ల. ప్రస్తుతం వ్యవసాయం వాటా మన జీడీపీలో 13.9 అయితే చైనా జీడీపీలో 9.2 శాతం. అక్కడ రైతులు చితికిపోలేదు. ప్రభుత్వ అండదండలతో హాయిగా ఉన్నారు. చైనా పాలకులు వ్యవసాయ ఉత్పత్తులకు ఆద్భుతమైన మార్కెటింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. రవాణా వసతులు కల్పించారు. అనేక దేశాలకు చైనా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. అటువంటి ప్రయత్నమేదీ మన దేశంలో అవసరమైన స్థాయిలో జరగడం లేదు. మేక్ ఇన్ ఇండియా నినాదం మంచిదే. డిజైన్ ఇన్ ఇండియా కూడా స్వాగతించవలసిందే. ‘సెక్’ సర్వే ప్రకారం కూడా గ్రామీణ భారతంలో 30 శాతం కుటుంబాలు వ్యవసాయంపైన ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా లక్షల కుటుంబాలు వ్యవసాయ రంగంపైన బతుకుతున్నాయి. సంస్కరణలంటే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీ ర్యం చేసి ప్రైవేటు చేతుల్లో పెట్టడం అనే తప్పుడు అవగాహన మన రాజకీయ నాయకులది. చైనాలో ఇప్పటికీ పెద్ద కంపెనీలన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. చైనా పోస్టు ప్రపంచంలోనే అతి పెద్దది. చైనా బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే చాలా రెట్లు పెద్దది. మన వాళ్ళు చైనా వెళ్లి పెద్ద వ్యాపార సంస్థల ప్రతినిధులను కలిసి, వారికి భూములూ, విద్యుత్తూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామంటూ హామీలు గుప్పించడం కాకుండా వివిధ రంగాలలో అభివృద్ధి సాధించడానికి చైనీస్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు ఏమిటో తెలుసు కొని వాటిని ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మలచుకొని అమలు చేయడం వివేకవంతులు చేయవలసిన పని. ఇక్కడ పరిశ్రమలు మన చొరవతో, మన శ్రమతో, మన నైపుణ్యంతో అభివృద్ధి చెందాలి. ఉత్పత్తిరంగాన్ని వృద్ధి చేసుకోవాలి. సేవారంగంపైన మాత్రమే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఒకానొక దశలో చతికిలపడుతుంది. ప్రణాళికా సంఘం విఫలమైన మాట యూపీఏ ప్రభుత్వమే అంగీకరించింది. దారిద్య్రరేఖను నిర్ణయించే విధానం మారాలని కూడా యూపీఏ సర్కార్ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా ఇంటా బయటా యూపీఏనీ, మన్మోహన్సింగ్నూ, సోనియాగాంధీనీ ఆడిపోసుకోవడం మాని మోదీ గట్టి మేలు తలపెట్టాలి. తాజాగా వెల్లడైన ‘సెక్’ గణాంకాల దృష్ట్యా పేదరికాన్ని పారదోలడానికి సరైన వ్యూహాలు రచించి సమర్థంగా అమలు చేయవలసిన బాధ్యత ఎన్డీఏ సర్కార్‌ది. - కె.రామచంద్రమూర్తి -
అక్క.. తమ్ముడు.. ఓ కోతి..
ఓ వైపు పేదరికం... మరో వైపు బతుకు సమరం... పోరాడక తప్పదు... ఊహ తెలియని వయసులో ఓ అక్క తన తమ్ముడితో కలిసి ఓ కోతిని వెంటపెట్టుకొని రోడ్డుపైకి బయలుదేరింది. నలుగురు కనిపించిన చోట కోతితో ఆట మొదలు పెడుతోంది. ఎండ తాపం తట్టుకోలేక అలసి సొలసి ఇలా సేదతీరుతున్న దృశ్యం నెక్లెస్ రోడ్డులో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. ఫొటోలు : దయాకర్ తూనుగుంట్ల -
పేపర్.. సూపర్
తెల్లారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడే అన్నీ, అంతటా.. ప్లాస్టిక్‌మయం. ఆధునికత పేరిట ఆడంబరాన్ని చాటుకునేందుకు పర్యావరణానికి చేటు తెచ్చే వస్తువులను ఎడాపెడా వాడేస్తున్నాం. అయితే, వాటి వాడకాన్ని తగ్గించాలని చెప్పడమే కాదు.. అటువంటి వాటికి ప్రత్యామ్నాయాలను సృష్టిస్తున్నారు ఇద్దరు యువతులు. అంతేనా.. మహిళా సాధికారతకు దారి చూపిస్తున్నారు. వారి పరిచయం.. - ఓ మధు ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన అనుభవం గౌరీ మహేంద్రది. టీచ్ ఫర్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లు ఆమె ఇక్కడ పనిచేసినపుడు స్కూల్లో హాజరు శాతం పెరగకపోవడం కలవరపరిచింది. సమీపంలోని మురికివాడల్లో తిరిగి పరిశీలించింది. పూట గడవడానికి పిల్లలు బడి మాని పనికి వెళ్తున్న పరిస్థితి కళ్లకుకట్టింది. కడు పేదరికంతో ఉన్న ఆ కుటుంబాలకు కాసింత ఉపాధి చూపితే్త తప్ప వారి పిల్లలను బడికి మళ్లించడం కష్టమని అర్థమైంది ఆమెకు. వారందరికీ ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి! ‘ఈ ఆలోచన నన్ను తొలిచేసింది. ఈ సమయంలో రాజస్థాన్‌లో బేర్‌ఫుట్ కాలేజీ కమ్యూనిటీకి వెళ్లాను. అక్కడ అరుణారాయ్ వద్ద ఉపాధి శిక్షణ ఇవ్వదగ్గ వివిధ అంశాల గురించి తెలుసుకున్నా. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక.. నాలాంటి ఆలోచనలతోనే ఉన్న ఉదితా చడ్డాతో కలిసి ఆర్గనైజేషన్ ప్రారంభించాను. దాని పేరే ఉమీద్’ అని వివరించింది గౌరీ. మహిళా సాధికారత... ‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలి. అలాగే ముడి సరుకు కోసం ఎక్కువ ఖర్చు కాకూడదు. పర్యావరణానికి హాని కలిగించకూడదు. ఇలా ఆలోచించి వేస్ట్ న్యూస్‌పేపర్‌తో విభిన్నమైన వస్తువులు రూపొందించేలా శిక్షణ ఇస్తున్నాం. యూసుఫ్‌గూడ, ఓల్డ్‌సిటీ, అబిడ్స్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పది మంది మహిళలు పేపర్‌తో అద్భుతమైన కళాకృతులు తయారు చేశారు. వాటిని లామకాన్‌లో ప్రదర్శనకు పెట్టినప్పుడు మంచి స్పందన లభించిందని’ చెప్పింది ఒకే ఆశయం కోసం గౌరీతో కలిసి నడుస్తున్న ఉదితా చడ్డా. పెన్ స్టాండ్స్, టేబుల్ డెకరేటివ్ ఐటెమ్స్, వాల్ హ్యాంగింగ్స్... ఇలా ప్రదర్శనలో ఏది చూసినా వాటి వెనుక కళాకారుల అద్భుత పనితనం కనిపిస్తుంది. కాగితంతో వివిధ కళాత్మక ఐటెమ్స్ తయారు చేయించడమే కాదు.. స్కిల్ ట్రైనింగ్, మైండ్‌సెట్ మార్చడానికి టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే వేదికను కల్పించడం కూడా తమ బాధ్యతగా భావిస్తున్నారు వీరిద్దరూ. స్నేహితుల సహకారంతో మొదలుపెట్టిన ‘ఉమీద్’కు ‘అన్లిమిటెడ్ ఇండియా’ హైదరాబాద్ చాప్టర్ నుంచి ఎల్ వన్ స్టేజ్‌లో కొంత ఫండింగ్ అందుతోంది. నిఫ్ట్ కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది వాలంటీర్లుగా డిజైనింగ్, క్రాఫ్ట్స్, ప్రమోషన్స్‌లో సంస్థకు సహకారం అందిస్తున్నారు. ‘రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మహిళా సాధికారత సాధించాలన్నది మా ప్రయత్నం’ అంటూ చెప్పుకొచ్చారు గౌరీ, ఉదిత. ఉమీద్లో భాగస్వాములు కావాలనుకొంటే లాగిన్ అవ్వండి. www.facebook.com/UMEEDsocialmedia/info?tab=page_info -
సాధికారత వల్లే బంగారు భవిత
సమాజాన్ని చీల్చే శక్తులు పదే పదే ఓడిపోతున్నాయి. అయినా ఆ శక్తుల కుట్రలు ఆగలేదు. చిన్న పగులునైనా పెను అగాధంగా మార్చడానికి అలాంటి వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. స్వీయ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే దళారులకు, కపట రాజకీయవేత్తలకు కాలం చెల్లింది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, నిండైన విశ్వాసంతో ముందడుగేయడానికి యువత కదులుతున్నది. వారికి తిరుగులేని సాధికారత కల్పిస్తే ఈ దేశానికి బంగారు భవితవ్యం సాధ్యమవుతుంది. అనుభవమే మన గురువైనప్పుడు జ్ఞానం బహు రూపాల్లో లభిస్తుంది. చాన్నాళ్లక్రితం ఓ పాలకుడిని కలుసుకున్న ప్రతినిధి బృందంలో నేనూ ఒక సభ్యుణ్ణి. మైనారిటీల్లో విద్య విస్తృతి, నాణ్యత, గాఢత ఏమేరకు ఉన్నాయో తెలుసుకోవడమే మా ఏక సూత్ర ఎజెండా. ముఖ్యంగా ముస్లిం బాలికల కోసం ఇంకేమి చేయవచ్చునో తెలుసుకోవడం మా ఉద్దేశం. ఓ సత్కార్యం కోసం ఉత్తములందరూ కలిశారు. ప్రతినిధి బృం దంలో సంపాదకులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అప్పుడప్పుడు సామాజిక సేవలందించేవారూ ఉన్నారు. పాలకుడి కార్యాలయానికి చేర్చి ఉన్న ఓ గదిలో అందరం కూర్చున్నాం. అందరి మొహాలూ పరమానందంగా వెలిగిపోతున్నాయి. తప్పనిసరి నిరీక్షణ తర్వాత గంభీర వదనాలతో ఒకరి వెనక ఒకరం ఆయన గదిలోకి ప్రవేశించాం. ఆ గౌరవనీయ నేత సమక్షంలో అందరూ అర్ధంలేని నవ్వులు చిందించడం పూర్తయ్యాక ఒకాయన గొంతు సవరించుకుని ఏదో చెప్పారు. ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆయన దాన్ని సావధానంగా చదివారు. మా సమష్టి జ్ఞానం ఆయన సైద్ధాంతిక పరిధిని విస్తృతపరిచిన జాడ కనబడింది. అంగీకార సూచకంగా ఆయన తలపంకించారు. అంతే...ఒక్కసారిగా గందరగోళం. ప్రతినిధి బృందంలోని వారంతా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం మొదలెట్టారు. నిర్ఘాంతపోవడం నావంతైంది. అందరూ సిగ్గువిడిచి ఎవరికి కావలసినవి వారు అడగటం ప్రారంభించారు. ఓ చిన్న పత్రికకు సంపాదకుడిగా ఉన్నాయనకు మరిన్ని వాణిజ్య ప్రకటనలు కావాలి. ఖాళీ అయిన ఒక సంస్థకు అధిపతి కావడం మరొకాయన కోరిక. అంత వ్యామోహంతో, అంత శ్రద్ధతో తమ తమ దురాశలను వారు వ్యక్తంచేసిన తీరు వ్యాపార శాస్త్రంలో ఒక అధ్యాయం అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇందులో కొందరి కోరికలు నెరవేరాయని అనంతరకాలంలో నాకు తెలిసింది. ఇక మైనారిటీల విద్య సంగతంటరా...అందులో పెద్ద మార్పేం రాలేదు. అది మెరుగుపడకపోయినా...మరింత క్షీణించనందుకు మనం సంతృప్తిపడి ఊరుకోవాలి. ఈ నేపథ్యంలో కొందరు ముస్లిం మత పెద్దల బృందం ప్రధాని నరేంద్ర మోదీని ఓ వారం క్రితం కలిసి సంప్రదాయానికి భిన్నమైన సమస్యల గురించి ప్రస్తావించారని తెలుసుకోవడం ఆసక్తి కలిగిస్తుంది. డబ్బు దన్నుతో కొన్నేళ్లనుంచి పుంజుకుంటూ, ఇటీవలి సంవత్సరాల్లో చురుగ్గా కదులుతున్న వహాబీ ఉద్యమం మన ముస్లింలపై చూపుతున్న ప్రభావం గురించి, వారికి చెందిన సంస్థల నియంత్రణ గురించి మాట్లాడటానికి ఆ బృందం సభ్యులు వెళ్లారు. అయితే, మన దేశంలో మత సామరస్యానికి అసాధారణమైన శక్తి ఉంది. ఆ శక్తి మత బోధనల్లో ఉంది. మన స్వాతంత్య్రోద్యమ మూలాల్లో ఈ సమ్మిళిత సందేశం ఉంది. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్ వంటి మత, సామాజిక దార్శనికుల ప్రసంగాల్లో ఉంది. పటిష్టమైన, సమైక్య భారత నిర్మాణమే ఇతరేతర పాక్షిక ప్రయోజనాలకన్నా వారికి అత్యంత ముఖ్యమైనది. బ్రిటిష్ వారు మూర్ఖులేమీ కాదు గనుక సమైక్య భారత శక్తి ముందు తమ పాలన నిలబడటం కష్టమని గ్రహించారు. అందువల్లే అన్ని మతాల్లోనూ సామరస్యాన్నికాక చీలికలను ప్రోత్సహించే సంస్థలకు దన్నుగా నిలిచారు. పాకిస్థాన్ భావన ఉనికిలోనికి రావడానికి చాలా ముందే చీలిక రాజకీయాలను పెంచి పోషించారు. ఇందుకు 1905 నాటి బెంగాల్ విభజన ఒక్కటే కాదు...చాలా ఉదాహరణలున్నాయి. అయితే ఈ దేశ పౌరులు ఇతర మతాలవారితో సహజీవనానికే మొగ్గుచూపారు. చీలికవాదులు మాత్రం తమ ఓటమిని అంగీకరించలేదు. జనబాహు ళ్యంలో, రాజకీయ చట్రంలో మాటువేశారు. చిన్న పగులు కనబడినా దాన్ని అగాధంగా మార్చడానికి వేచిచూస్తున్నారు. దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవమతాలవారందరికీ ఇది మౌలికమైన సవాలు. విధానపరమైన అంశాల్లో వినియోగించే ‘సామాజిక-ఆర్థిక’ అనే పదబంధం ఉపఖండంలో అదనపు అర్థాన్ని సంతరించుకుంది. వివిధ వర్గాల ప్రజలు విద్యకు దూరంకావడానికి... అసమానత, అగౌరవం, భయానక పేదరికం కోరల్లో వారు చిక్కుకోవడానికి సంస్కృతి, విశ్వాసం కూడా దోహదపడటమే ఇందుకు కారణం. మూలాల్లో సమస్య ఉన్నప్పుడు పరిష్కారాలూ అక్కడే లబిస్తాయి. మైనారిటీల సమస్యలను దళారులకు విడిచిపెట్టడం స్వాతంత్య్రా నంతరం ఈ ఆరున్నర దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. ఫలితంగా ఆ వర్గాలవారుగాక దళారులే ఎక్కువగా బాగుపడ్డారు. రాజకీయ రంగం నిండా అలాంటివారే కనిపిస్తారు. ఈ కపట రాజకీయ నేతల ఆసక్తి అంతా స్వీయ సంక్షేమమే గనుక...వీరంతా వేర్పాటువాదాన్ని ప్రవచించే వారితోనే చేతులు కలుపుతారు. ఈ పాత రాజకీయాలకు కొత్తగా ఒక బద్ధ శత్రువు బయల్దేరింది. ఈ ఇరవైయ్యొకటో శతాబ్దంలోని యువత తమ పెద్దలకు లభించని లేదా వారికి నిగూఢంగా మిగిలిపోయిన ఒక అంశాన్ని పోల్చుకోగలిగారు. పరస్పరం పంచుకునే, సమానావకాశాలు లభించే చలనశీలమైన భారత్‌లో ఆర్థిక అభివృద్ధికి ఆస్కారమున్నదని గుర్తించారు. మన యువతకు అవకాశాన్ని, భరోసాను, విద్యను కల్పిస్తే... తిరుగులేని సాధికారతను కల్పిస్తే...ఉపాధి అవకాశాలు దండిగా లభించే, విస్తరించే ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది. దశాబ్దాల క్రితం వాగ్దానం చేసినా మనకు అందకుండా పోతున్న భవితవ్యం మనదవుతుంది. ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
పేదరికం ఉన్నంతకాలం పోరు!
సాక్షితో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సాక్షి, హైదరాబాద్: ‘‘సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంతకాలం మా పోరాటం ఉంటుంది. మేం ఔనన్నా కాదన్నా మా బలం తగ్గినమాట నిజం. అంతమాత్రాన కనుమరుగైనట్టు కాదు. గత 25 ఏళ్లలో జరిగిన తప్పొప్పులేమిటో గుర్తించాం. వచ్చే మహాసభల్లో చర్చించబోతున్నాం. గతకాలపు అనుభవాల పునాదులపై భవిష్యత్‌ను నిర్మించబోతున్నాం..’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. పార్టీ 21వ జాతీయ మహాసభలు విశాఖపట్నంలో మంగళవారం నుంచి జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’కిచ్చిన ఆన్లైన్ ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వివరించారు. ప్రాంతీయ బూర్జువా పార్టీలతో జాతీయస్థాయి పొత్తులు, ఎత్తులు ఉండవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ లౌకికత్వాన్ని సమర్థిస్తున్నా అది కూడా బూర్జువా పార్టీయేనని, నయా ఉదారవాద ఆర్థిక విధానాలను పాటించే పార్టీయేనని అన్నారు. తమ పార్టీ పునాదుల్ని పటిష్టం చేసుకుని సొంతకాళ్లపై ఎదుగుతూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని ఏకం చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీల విలీనం తమ ఎజెండాలో లేదన్నారు. ఇంటర్వ్యూలో కారత్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాంతీయ పార్టీల పాత్ర.. ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావం ప్రాంతీయ పార్టీలపైనా ఉంది. ప్రధానమైన ప్రాంతీయపార్టీలపై భూస్వాములు, సంపన్న రైతులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల పట్టు పెరిగింది. దీంతో ఈ పార్టీల పుట్టుక సమయంలో ఉన్న ప్రాధమ్యాలకు, ఇప్పటికి తేడా వచ్చింది. అవి వాటి అవసరాలకోసం పట్టుబడుతున్నాయేతప్ప జాతీయస్థాయి ప్రయోజనాలపై దృష్టి పెట్టట్లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఒడిశా, యూపీ వంటి రాష్ట్రాలలో సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాం. ఈ అనుభవాలతో మూడో ప్రత్యామ్నాయం, జాతీయ ప్రత్యామ్నాయం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. సొంతంగా పెరగడమే మార్గం... ఈ నేపథ్యంలో పార్టీని స్వతంత్రంగా పటిష్టం చేసుకోవడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించాం. బహుముఖ సమస్యలపై విస్తృత పోరాటాలు చేయడమే ఇందుకున్న మార్గం. దీంతోపాటు ప్రజల తక్షణ సమస్యలపై ఇతర రాజకీయ, ప్రజాతంత్ర శక్తులతో కలసి పోరాటాలు చేయాలి. ప్రస్తుతం మా దృష్టంతా సొంతంగా ఎదగడంపైనే. మేము పెరుగుతూ ఇతర వామపక్ష పార్టీలతో కలసి ఐక్య పోరాటాలు చేస్తాం. విలీనం మా ఎజెండాలో లేదు. అవసరమైనప్పుడు చర్చిస్తాం. దేశ లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పు ముంచుకొస్తోంది. భావస్వేచ్ఛపై దాడి ఎక్కువైంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ఎదుర్కోవడానికి లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌తోనైనా కలసి పనిచేస్తాం. అంతవరకే అది పరిమితం. నా పదవీకాలం ముగిసింది... పార్టీ నిబంధనావళి ప్రకారం నేనిక ప్రధాన కార్యదర్శిగా ఉండలేను. మహాసభ నూతన కమిటీని, ప్రధాన కార్యదర్శిని, పొలిట్‌బ్యూరోను ఎన్నుకుంటుంది. అది ఈ నెల 19న జరుగుతుంది. మా ముందున్న సవాళ్లు.. మా బలం తగ్గింది. ఇది నిష్టుర సత్యం. బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుని సొంత బలాన్ని కోల్పోయామని పార్టీకి చెందిన కొన్ని రాష్ట్ర శాఖలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో గత పాతికేళ్లలో మేము అనుసరించిన రాజకీయ, ఎత్తుగడల పంథాను పునస్సమీక్షించుకోవాల్సిన అవసరమేర్పడింది. అంతేకాదు.. పార్టీ అనుబంధ సంఘాల సభ్యులను మా రాజకీయ విధానంవైపు ఆకర్షించలేకపోవడం, ఓట్లుగా మలుచుకోలేకపోవడంతోపాటు సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావాన్ని గుర్తించడంలోనూ ఒడిదుడుకులున్నాయి. వచ్చే మహాసభల్లో వీటిని సవరించుకుని ఎత్తుగడల పంథాను ఖరారు చేసుకోవాల్సి ఉంది. గతానికి భిన్నంగా ఈ మహాసభల్లో తొలిసారి రాజకీయ, ఎత్తుగడల పంథాను చర్చించబోతున్నాం. 1988-89లో తిరువనంతపురంలో జరిగిన 13వ మహాసభలో ఆమోదించిన రాజకీయ ఎత్తుగడల పంథాను సమీక్షించబోతున్నాం. మూడు రాష్ట్రాలకేపరిమితమయ్యాం... పార్టీకి భారీగా సభ్యత్వం ఉన్నప్పటికీ అది కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలకే పరిమితమైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో సభ్యత్వం పెరిగి నప్పటికీ రాజకీయ ప్రభావాన్ని చూపలేకపోయింది. దీన్నిబట్టి మా ఎత్తుగడల పంథాలో లోపం ఉందని తేలింది. దిద్దుబాటు చర్యలు చేపట్టాం. -
ఇంకెన్నాళ్లీ అగచాట్లు..
బాలికల చదువుకు ఎన్నో అడ్డంకులు.. ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి అరకొర అవకాశాలు, ఆకలి, పేదరికం.. ఆర్థిక సమస్యలే అధికం వారంలో రెండు రోజులు కూలికి వెళ్తున్న విద్యార్థినులు 60 శాతంపైగానే.. లైంగిక వేధింపులకు గురవుతున్నామని చెప్పినవారు 34.1 శాతం మంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునేందుకు ఆడపిల్లలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. చదువుకునే అవకాశాల దగ్గరి నుంచి కుల వివక్ష, లైంగిక వేధింపుల వ రకూ నిత్యం ఏదో ఒక సమస్యతో వారు కొట్టుమిట్టాడుతున్నారు. సర్కారు బడులు, కాలేజీల్లో చదువుతున్న బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అధ్యయనంలో ఇటువంటి ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ శైలాజా రామయ్యర్, జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా ఈ సర్వే వివరాలను విడుదల చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ర్యాండమ్ పద్ధతిలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ప్రైవేట్ కళాశాలలు, నాలుగు రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులను ప్రశ్నించి.. ఈ సర్వే నివేదికను రూపొందించారు. పరిస్థితులకు అద్దం పడుతున్నాయి..: ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఇంటర్ బోర్డు కమిషనర్ శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. విద్యార్థినులకు ఫీజుల చెల్లింపు, హాస్టల్ సౌకర్యం, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థినులకు ఉచిత బస్‌పాస్‌లను అందించడం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి... ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ సర్వే వివరాల ద్వారా బాలికల దుర్భర పరిస్థితి వెల్లడైందని.. వారి చదువుకు తోడ్పడేలా ప్రభుత్వం విధానాలు రూపొందించాలని శాంతసిన్హా పేర్కొన్నారు. విద్యార్థినులకు చదువుకునే అవకాశాన్ని మెరుగుపర్చాలంటే మొదట ప్రతి నియోజకవర్గంలో ఒక బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఈనాటికీ అక్షరాలు నేర్వని, నేర్చుకునే వీలులేని పరిస్థితులు ఉండడం విచారకరమని ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఎం.వెంకటరెడ్డి పేర్కొన్నారు. సర్వే వివరాలివీ.. రాష్ట్రంలోని 62.7 శాతం మంది బాలికలు జూనియర్ కాలేజీ స్థాయిలోనూ కూలి పనికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. వారానికి రెండు రోజులు కూలిపనికి వెళుతున్నామని 46.2 శాతం బాలికలు వెల్లడించారు. వారానికి 1 నుంచి 3 రోజులు మాత్రమే కాలేజీకి వెళ్లే ముందు తింటామని, మిగతా రోజుల్లో ఖాళీ కడుపుతోనే కాలేజీకి వెళ్లాల్సి ఉంటుందని 30.2 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న దళిత, ఆదివాసీ విద్యార్థినుల్లో 98.1 శాతం మంది ఉపాధ్యాయుల నుంచి కులవివక్ష ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇక 19.6 శాతం మంది బాలికలు ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురైనట్లు సర్వే వెల్లడించింది. వారిలో 37 శాతం మంది బాలికలు ప్రాథమిక స్థాయిలోనే లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. ఇక 12 శాతం మంది ఉపాధ్యాయుల నుంచి లింగ వివక్ష ఎదుర్కొన్నామని చెప్పారు. దాదాపు అందరు విద్యార్థినులు తాము ఇంటినుంచి కళాశాలకు వెళ్లడం, రావడం వల్ల వారికి సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా హాస్టళ్లను నెలకొల్పితే చదువు కొనసాగించగలుగుతామన్నారు. 73.7 శాతం మంది బాలికలు తమ తల్లి మద్దతుతోనే చదువును కొనసాగించగలుగుతున్నామని, తండ్రి నుంచి ప్రోత్సాహం ఉండడం లేదని పేర్కొన్నారు. -
అంతులేని వ్యథ
పాతబస్తీ.. హైదరాబాద్ షాన్కెంత ప్రసిద్ధో.. గరీబీకీ అంతే పరిచయం! ఆ పేదరికం.. అనుభవించేవాళ్లనందరినీ కష్టపెడుతున్నా బలికోరుతున్నది మాత్రం ఆడపిల్లలనే! ఎప్పుడో జరిగిన అమీనా నిఖానే కాదు ఇప్పటికీ ఆగని ఆ పెళ్లిళ్లు, బాలికావధువులే అందుకు ఉదాహరణ.. ఇప్పుడు చదవబోయే రుబీనా (పేరు మార్చాం) కథ కూడా అలాంటిదే.. ..:: సరస్వతి రమ జావేద్ఖాన్ (పేరు మార్చాం), రజియా (పేరు మార్చాం)లకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లలో పెద్దమ్మాయే రుబీనా. జావేద్ఖాన్ భార్య రజియాని బాగా హింసించేవాడు. అది తట్టుకోలేక రజియా ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పుడు రుబీనాకు మూడేళ్లు. రజియా వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లిదగ్గర వదిలాడు జావేద్ఖాన్. ఓ నాలుగేళ్లు నానమ్మ దగ్గరున్నారు పిల్లలు. తర్వాత.. రుబీనా నానమ్మకు గల్ఫ్‌లో పనిదొరకడంతో ఆ దేశానికి టేకాఫ్ అయింది. పిల్లలు తల్లి గూటికి చేరారు. అప్పటికే రజియా ఇంకో పెళ్లిచేసుకుంది. ఇటు జావేద్ఖాన్ తాగుడికి బానిసయ్యాడు, డ్రగ్స్‌కీ అలవాటు పడ్డాడు. రుబీనా సవతి తండ్రి ఈ పిల్లల్ని శ్రద్ధగా చూసేవాడుకాదు. బాగా కొట్టేవాడు. స్కూల్‌కి పంపకుండా దగ్గర్లో కార్ఖానాల్లో పనికి పంపేవాడు. అదంతా రజియాకు మళ్లీ హింసలా తయారైంది. పదమూడేళ్లు వచ్చేసరికి.. ముగ్గురు పిల్లల్నీ తీసుకొని ఇల్లు వదిలింది రజియా. పాతబస్తీలోనే ఓ ఇల్లు తీసుకొని ఉండసాగింది. ఓ ఏడాది గడిచాక నెమ్మదిగా రుబీనాకు పెళ్లిచేసేస్తే తన బాధ్యత కొంత తీరుతుందనుకొని ఆ పిల్లకు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. ఈలోపే సవతి తండ్రి మళ్లీ వీళ్లను చేరాడు. దాంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లి దగ్గర పెట్టింది రజియా. అయితే అమ్మమ్మ పద్నాలుగేళ్ల రుబీనాకు 55 ఏళ్ల అరబ్ షేక్‌తో పెళ్లి జరిపించింది. రుబీనా అసలు తండ్రితోపాటు, సవతి తండ్రీ వచ్చి ఆమె అమ్మమ్మతో గొడవ పెట్టుకున్నారు. అంతా అయిపోయాక ఎంత గొడవపడితే ఏం లాభం? మళ్లీ ఇంటికి.. ఈ వ్యవహారం సద్దుమణిగాక రజియా మిగిలిన ఇద్దరు పిల్లల్ని సముదాయించి, వాళ్లను తీసుకొని రెండో భర్తతో వెళ్లిపోయింది. ఓ రెండు నెలలు గడిచాయి. అరబ్‌షేక్ వెళ్లిపోయాడు. రుబీనా తల్లిదగ్గరికి వచ్చేసింది. ఓ వారానికి రుబీనా గర్భవతి అని తేలింది. అరబ్షేక్కి ఫోన్‌చేసి విషయాన్ని చెవినవేశారు. ‘అయితే నాకేంటి? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? చేయొద్దు’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టి ఫోన్‌పెట్టేశాడు. ఆరు నెలల వరకు డబ్బులు పంపించి ఆపై ఆపేశాడు. అంతేకాదు రుబీనాను అనుమానిస్తూ ఆమెకు వివాహేతర సంబంధం ఉందంటూ నిందవేశాడు. రుబీనా ఆడపిల్లను కన్నది. బిడ్డ పుట్టిందని మళ్లీ అరబ్షేక్కి ఫోన్ చేసినా అక్కడి నుంచి ఎలాంటి పలుకూ లేదు. మధ్యవర్తుల ద్వారా చెప్పించినా స్పందనలేదు. ఇంట్లో భయంకరమైన పేదరికం. ముగ్గురు పిల్లలకు తోడు చంటిది. పాలబొట్టూ కరువైంది ఆ పసిదానికి. రెండో తప్పు.. ఈ పేదరికం నుంచి బయటపడటానికి రజియా తన రెండో కూతురికీ అరబ్షేక్ని వె దికింది. అక్క జీవితాన్ని కళ్లారా చూసిన ఈ చెల్లి తనకూ అదే గతి పడుతుందని గ్రహించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే రుబీనా తన కూతురు, మూడో చెల్లెలితో తండ్రి దగ్గరికి వచ్చేసింది. కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. తర్వాత రోడ్డుమీదకి తెచ్చాడు. మళ్లీ తల్లి ఇల్లే గతి అయింది వాళ్లకు. ఈసారి సవతి తండ్రి రుబీనాకు ఆఫ్రికన్ వరుడిని వెదికాడు. ప్రమాదం పసిగట్టిన రుబీనా బిడ్డను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత నిస్సహాయులైన మహిళలకు ఆసరగా నిలుస్తున్న ‘షాహీన్’ సంస్థను చేరుకుంది. అక్కడే టైలరింగ్ నేర్చుకుంటూ తన బిడ్డకు మంచి జీవితాన్నివ్వాలని ఆశపడుతోంది. ఆమె కూతురికిప్పుడు నాలుగేళ్లు. రుబీనా ఎంచుకున్న దార్లో ఆమెను నడవనిద్దాం.. అలసిపోయినప్పుడు అండగా నిలబడదాం.. ఆ పసిబిడ్డను కాపాడుకుందాం! -
నిరుపేద భారతం
భారత దేశంలో ఇప్పటికీ ఇంత మంది నిరుపేదలా? ఆశ్చర్యపడవలసిందేమీలేదు. ఇవి ఎవరో చెప్పిన లెక్కలు కావు. సాక్షా త్తూ ఐక్యరాజ్య సమితే స్వయంగా ఈ విషయాన్ని పేర్కొంది. మన దేశంలో కనీస వసతులు లేని వారు నేటికీ 30 కోట్ల మంది ఉన్నారంటే దారుణం. ఎన్ని ప్రభుత్వాలు మారినా నిరుపేదల గురించి అవి చేస్తాం ఇవి చేస్తాం అని ప్రణాళికలు రూపొందించడం, అవి అలాగే మిగిలిపోవడం తప్ప కార్యరూపం మాత్రం దాల్చకపోవడం దురదృష్టకరం! ఇన్ని కోట్ల మంది ప్రజలు కనీసం మంచినీరు, కనీస విద్య, సరైన వైద్య వసతికి కూడా నోచుకోని దుస్థితిలో ఉన్నారంటే ఇక మన భారతావని అభివృద్ధి గూర్చి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. స్వచ్చ భారత్ కాదు గరీబ్ హటావో అనే ఉద్యమం మొదలు పెట్టాలి. కానీ మన పాలకులకు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం చీమైనా కుట్టినట్టు ఉండదు. వాళ్ల సుఖాలు వాళ్లు చూసుకుంటారు వాళ్లకు నిరుపేదల గురించి అలోచించే వ్యవధి ఎక్కడిది? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోడానికే సమయం సరిపోవటం లేదు. సరిగ్గా ఇదే మాట మన సర్వోత్తమ న్యాయస్థానం (సుప్రీం కోర్టు) కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దేశాన్ని బాగు చేయడం దేముడి తరం కూడా కాదేమో! - శొంఠి విశ్వనాధం చిక్కడపల్లి, హైదరాబాద్ -
నేను సైతం
టీచర్ కావాలనుకున్న ఆయన కలను పేదరికం మొగ్గలోనే తుంచివేసింది. కానీ... సమాజ మార్పుకోసం తనకు చేతనైనంత పని చేయాలన్న ఆయన తృష్ణను మాత్రం తుంచలేకపోయింది. అందుకోసం తన పాన్ డబ్బానే వేదికగా చేసుకున్నాడు నర్సింహారెడ్డి. తాను రాసిన మహాత్ముల నీతి వాక్యాలు, పదునైన నినాదాలతో... రోజుకు వేలమంది వెళ్లే ఆ మార్గంలో ఒక్కరిలో మార్పు వచ్చినా చాలంటున్నాడు. హోటల్ మారియట్ దగ్గర కవాడిగూడ చౌరస్తా. రోడ్డు పక్కన చిన్న పాన్ డబ్బాను నిర్వహిస్తున్నాడు నరసింహారెడ్డి. షామీర్పేట అతని స్వస్థలం. ఉపాధ్యాయుడు కావాలన్న ఆయన కలకు పేదరికం అడ్డంకిగా మారింది. అంతే చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. ఓవైపు పోలియో కారణంగా వచ్చిన వైకల్యం. అయినా ఎక్కడా కుంగిపోలేదు. వైకల్యాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. 1992లో ఓ పాన్ డబ్బా ఏర్పాటు చేశాడు. అది మొదలు... ఉదయం ఆ డబ్బా ఓపెన్‌చేయగానే తనను ఆకర్షించిన ఏదో ఒక నినాదం రాసి ఆ బోర్డును డబ్బాకు తగిలిస్తాడు న ర్సింహారెడ్డి. 23 ఏళ్లుగా తన అక్షరాల ద్వారా చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. సూక్తులెన్నో... ‘ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు, సమాజానికి సేవాలయాలు, దేవాలయాలు. కానీ, అవినీతికి అడ్డాగా మారాయి’ అంటూ రాసి ఉన్న ఓ సూక్తి నడుస్తున్న చరిత్రకు అద్దం పడుతోంది. ఆ పక్కనే మరో బోర్డుపై ‘భారతదేశానికి గత 65 ఏళ్లుగా ఉత్తమ నాయకుల, అధికారుల కొరత ఉంది. ప్రతి నియోజకవర్గం గుండె చప్పుడు అదే’ అన్న మరో సూక్తి కూడా ఇట్టే ఆకర్షిస్తోంది. ‘నీ మీద నీకు నూరు శాతం నమ్మకముంటే ఓ మహాత్ముడిగా, మహర్షిగా ఎదుగుతావు’, ‘ఉత్తమ గురువంటే ఎవరు?, నిజమైన నాయకుడు ఎలా ఉండాలి?, ఈ దేశ సంపదలో నల్లధనం ఎన్ని కోట్లుంది?’ అని ప్రతి మనిషికీ అర్థమయ్యేలా వివరిస్తుంటాడు నర్సింహారెడ్డి.. సామాజిక బాధ్యత... ‘ఇలా రోజూ నాలుగైదు వాక్యాలు పదిమందికి తెలిసేలా బోర్డులపై రాసి పాన్ డబ్బా వద్ద ప్రదర్శిస్తుంటా. ఒకరోజు రాసినవి మరో రోజు ఉండవు. ఈ సూక్తులు రాయడానికి పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. పుస్తక పఠనం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పదిమందికి పంచడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నా. ఓ రకంగా నేను కలగన్న ఉపాధ్యాయ వృత్తి అభిలాషను ఇలా తీర్చుకుంటున్నా’నని చెబుతున్నాడు నర్సింహారెడ్డి. -
హ్యాట్సాఫ్..! నాగేంద్రకుమార్!!
ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఐదేళ్ల వయసులో విధి చిన్న చూపు చూడటంతో అతడు రెండు చేతులూ కోల్పోయాడు. తోటి వారంతా ఉత్సాహంగా గంతులు వేస్తుంటే కలత చెందలేదు. తన తలరాత ఇంతేనని నాలుగు గోడల మధ్య కూర్చొని చింతించలేదు. జీవితానికి చదువే ఆయుధమనుకున్నాడు. ఇక్కడా అతనికి చేదు అనుభవమే. ఉన్నత చదువుకు ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. ఇప్పుడు సాయం కోసం చేయి చాస్తున్నాడు. మంచిగా చదివి కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాడు. * ఐదేళ్ల వయసులో విద్యుదాఘాతం * రెండు చేతులూ మోచేయి వరకు తొలగింపు * అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం * ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం * పేదరికంతో విద్యకు ఆటంకం * ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు ఒంగోలు టౌన్ : మేదరమెట్ల మండలం సోమవరప్పాడులో దాట్ల చినకోటయ్య, సుబ్బరత్నం దంపతులకు ఇద్దరు సంతానం. వారు కూలీ నాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు నాగేంద్రకుమార్ ఐదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫలితంగా రెండు చేతులూ మోచేతుల వరకు వైద్యులు తీసేశారు. ఇంటికి పెద్ద కుమారుడు వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రెండు చేతులు లేకున్నా ఆ విద్యార్ధి ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. ఇతర విద్యార్థుల మాదిరిగానే అన్ని విషయాల్లోనూ పోటీ పడుతూ వచ్చాడు. ఎలాగోలా గ్రిప్ సాధించుకొని పెన్నూ పుస్తకం పట్టాడు. వేగంగా రాయడం.. వేగంగా పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించాడు. ఇంతలో పదో తరగతికి చేరాడు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై అందరిచేత ‘శభాష్’ అనిపించుకున్నాడు. ఇంటర్లో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం మేదరమెట్లలోని శారదా డిగ్రీ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సైకిల్‌ను అవలీలగా తొక్కేయగలడు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాడు. పింఛన్‌తో చదువుకుంటూ.. తల్లిదండ్రులకు నాగేంద్రకుమార్‌ను చదివించడం కష్టంగా మారింది. రెండు చేతులు లేకపోవడంతో ఏమి చదువుతాడులే అని మొదట్లో వారు కూడా కలత చెందారు. చివరకు తమ కుమారుడు చదువులో రాణిస్తుంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు సంపాదించే కూలీ డబ్బులు కుటుంబ అవసరాలకు అంతంత మాత్రంగా ఉండటంతో నాగేంద్రకుమార్‌కు పింఛన్ అండగా నిలిచింది. ప్రతినెలా వచ్చే వికలాంగ పింఛన్‌తో ఒకరిపై ఆధారపడకుండా చదువుకుంటూ ముందంజలో ఉన్నాడు. ఒకవైపు వయసు పెరుగుతుండటం, ఇంకోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పడుతుండటంతో స్వయం ఉపాధి సాధించాలని నాగేంద్రప్రసాద్ మనసులో పడింది. చదువుకుంటూనే ఉపాధి ద్వారా కుటుంబానికి ఆసరాగా ఉండాలని భావిస్తున్నాడు. నాగేంద్రకుమార్‌ను ఆదుకోవాలనుకునేవారు 90522 06762 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
దీనావస్థలో భీమ్ వారసులు
వెలుగులోకి వచ్చిన భీమ్ మనుమరాళ్లు కనీస సౌకర్యాలకు నోచుకోని కుటుంబాలు కూలీ పని చేస్తే తప్ప పూట గడవని దుస్థితి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు రాష్ట్ర చరిత్ర పుటల్లోకెక్కిన గిరిజన యోధుడు కొమురం భీమ్ ఏ ఆశయం కోసమైతే నిజాం సర్కారుతో పోరాటం సాగించాడో ఆ ఆశయం.. వాటి ఫలాలు.. ఆ అమరవీరుడి వారసులకే దక్కడం లేదు. దీంతో నేటికీ వారు దీనావస్థలో కాలం వెల్లదీస్తున్నారు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. భీమ్ వారసులకు ఉండడానికి సరైన ఇల్లు లేదు. చేయడానికి చేతిలో పనిలేదు. ఉన్న కొంత సాగుభూమిలో పంట దిగుబడి రాలేదు. ఫలితంగా కూలే వారికి జీవనాధారమైంది. కూలీ చేస్తేనే వారి కడుపు నిండుతుంది. నిన్నటి వరకు కొమురం భీమ్‌కు మనుమడు కొమురం సోనేరావు, మనుమరాలు కొమురం సోంబాయిలే ఉన్నారని అందరికీ తెలుసు. మరో మనుమడు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారనే విషయం ఇటీవల వెలుగులోకి వ చ్చింది. వారి జీవన స్థితిగతులపై కథనం. జంగుబాయి ఇల్లు పునాదులకే పరిమితం కెరమెరి మండలంలోని కొఠారి గ్రామంలో కొన్నేళ్లుగా కొమురం జంగుబాయి నివసిస్తోంది. వీరికి ఉండేందుకు పెంకుటిల్లె దిక్కవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం ముంజూరైన ఇందిరమ్మ గృహం పునాదులకే పరిమితమైంది. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా వీరి ఇంటిని పూర్తి చేసే నాథుడే కరువయ్యాడు. మరోసారి గృహం కోసం దరఖాస్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. మూడెకరాలు సాగు భూమి ఉంది. వర్షాధారంపై ఆధారపడి వేసిన పంట నట్టేట ముంచింది. పంటల్లో దిగుబడి రాలేదు. దీంతో కూలీ చేసి తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతవరకు ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. జంగుబాయికి భర్త జంగు, ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలి. తాత కొమురంభీమ్ పేరిట వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మా కుటుంబాల గురించి పట్టించుకోవాలి. మమ్మల్ని కూడా గుర్తించి తగిన సహాయం అందించాలి. ఐటీడీఏ నుంచి ఆర్థిక సహాయం చేయాలి. - ఆడ జంగుబాయి, కొఠారి కాసుబాయికి కనిపించని ఆర్థిక ఆధారం కెరమెరి మండలంలోని సాకడ గ్రామంలో నివసిస్తున్న కొమురం భీమ్ చిన్న మనుమరాలు కొమురం కాసుబాయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఇల్లు మంజూరైనా బిల్లు మాత్రం అందకపోవడంతో అప్పులు చేసి రేకుల ఇల్లు నిర్మించింది. ఉన్న మూడెకరాల సాగు భూమిలో పంట దిగుబడి రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఇప్పటికి షావుకారుల వద్ద నుంచి చేసిన అప్పులు తీర్చేదెలాగని ఆమె ఆందోళన చెందుతోంది. భీమ్ పేరు ఘనమైనా వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగడంలేదు. భీమ్ వారసులన్నట్లు కూడా అధికారులకు తెలియదు. అసలు ఆ దిశగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నం సాగించలేదు. కాసుబాయికి భర్త కొమురం భీమ్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భూమి పంచివ్వాలి మ తల్లి గారి భూమి దోబే గ్రామంలో ఉంది. ఒక్క మనుమడే లాభం తీసుకుంటున్నడు. అది అందరికీ దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికి 4 ఎకరాలు భూమిని పంచి ఇవ్వాలి. మా పరిస్థితులను బాగు చేయాలి. - కొమురం కాసుబాయి, సాకడ ఎల్లుది కూడా అదే దుస్థితి కెరమెరి మండలంలోని కొఠారి గ్రామంలో ఉంటున్న భీ మ్ మనుమడు చహకటి ఎల్లు పరిస్థితి కూడా ఇంచుమిం చు అలాగే ఉంది. మూడెకరాల సాగు భూమి ఉన్నా రాళ్లురప్పలతో కూడుకుంది. ముప్పై వేలు వెచ్చించి వేసిన పత్తి పంటలో దిగుబడి రాలేదు. దీంతో ప్రస్తుతం ఆయన కూ లీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంకాలం వరకు ఎక్కడికో వెళ్లి కూలీ చేస్తేనే సాయంత్రం ఆయన కుటుంబానికి బువ్వ దొరుకుతుంది. పొలం పనులు చేసేందుకు ఎడ్లు కూడా లేకపోవడంతో వ్యవసాయ పనులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో బతుకు భారమవుతోంది. భార్య చిత్తుబాయి, కొడుకు వినోద్, సంజు ఉన్నారు. ఎడ్ల జతలివ్వాలి వ్యవసాయం చేసేందుకు కనీసం ఎడ్ల జతలన్న ఇవ్వాలి. ఎలాంటి సహకారం లేకపోవడంతో అష్టకష్టాల్లో ఉన్నాం. సాగుభూమి ప్రభుత్వ పరంగా అందించాలి. కొమురం సోనేరావుకు ఇచ్చిన ట్లే మాకూ ఆర్థిక సహాయం అందించాలి. - చహకటి ఎల్లు, కొఠారి వారసత్వంపై అలసత్వం కొమురం భీమ్‌కు ఇద్దరు పిల్లలు. కొడుకు మాధవరావు, కూతురు రత్తుబాయి. కొడుకు మాధవరావుకు ముగ్గురు పిల్లలు. సోనేరావు, భీమ్రావు. వీరు సిర్పూర్(యు) మండలంలోని దోబే గ్రామంలో నివసిస్తున్నారు. కూతురు రాధాబాయిది ఆసిఫాబాద్ మండలం మోవాడ్. భీమ్ కొడుకు పిల్లల పరిస్థితి ఒకింత బాగానే ఉన్నా.. కూతురు చహకటి రత్తుబాయి నలుగురు పిల్లల్లో ముగ్గురి పరిస్థితి దయనీయంగా ఉంది. రత్తుబాయికి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు. ఓ కూతరు కొమురం సోంబాయి జోడేఘాట్‌లో నివసిస్తోంది. ఈమె పరిస్థితి కాక మిగితా ముగ్గురు దీనస్థితిలో ఉన్నారు. అందులో ఆడ జంగుబాయి, చహకటి ఎల్లు కొఠారి గ్రామంలో ఉండగా.. చిన్న కూతురు కొమురం కాసుబాయి సాకడలో బతుకుతోంది. తాత ఎంతో గొప్పవ్యక్తి. అనేక మంది ఆదివాసీలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన్ను గుర్తించింది. దాంతో జోడేఘాట్ కొత్త పుంతలు తొక్కనుంది. ఆయన చేసి త్యాగానికి సూచిగా రాష్ట్ర సర్కారు కూడా అడుగులేస్తోంది. కానీ ఆయన వారసుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఇకనైనా తమ బతుకులు బాగుపడతాయనుకుంటే అధికారులు గుర్తించడం లేదంటూ భీమ్ మనమరాళ్లు ఆడ జంగుబాయి, కుంరం కాసుబాయి, చహకటి ఎల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధర (బేసిక్ మార్కెట్ వాల్యూ)ను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు 125 గజాల్లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్థలాల క్రమబద్ధీకరణపై విస్తృత చర్చ జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలనే అంశంపై ఏకీభవించిన అఖిలపక్ష ప్రతినిధులు.. ఆపైబడిన స్థలాల క్రమబద్ధీకరణకు శ్లాబ్‌ల వారీగా నిర్దిష్ట ధరలను అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతికి ఊరట! పేదలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం.. 126-250 గజాల వరకు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల విషయంలోనూ కొంత ఉదారత ప్రదర్శిస్తోంది. అల్పాదాయవర్గాలను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధీకరణకు నామమాత్రపు రుసుమును వసూలు చేయాలన్న ప్రతినిధుల అభిప్రాయానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని, ఆక్రమితులు కూడా క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. అలాగే రెగ్యులరైజ్‌కు కేటగిరీల వారీగా ధరలను నిర్దేశించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 126-250 గజాలకు ఒక ధర, 256-500 చదరపు గజాల వరకు ఇంకో ధర, 500 గజాల పైబడిన స్థలాలకు భారీ మొత్తంలో వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, 500 గజాల వరకు క్రమబద్ధీకరించే అధికారం జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టాలని, ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలావుండగా, స్థలాల క్రమబద్ధీకరణకు 2008 కనీస ధరనుప్రామాణికంగా తీసుకోవాలని మెజారిటీ ప్రతినిధులు పట్టుబట్టగా, ప్రస్తుత ధరను నిర్దేశించాలని మరికొన్ని పార్టీలు వాదించాయి. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా, కట్టడాలు మినహా ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించకూడదని సర్కారు భావిస్తోంది. కాగా, ప్రభుత్వం క్రమబద్ధీకరణపై విధానపర నిర్ణయం తీసుకుంటే జిల్లాలో 1.01 లక్షల నిర్మాణాలకు ప్రయోజనం చేకూరనుంది. -
వైఎస్ పథకాలతో పేదరికం తగ్గింది
లోక్‌సభలో మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాల కారణంగా పేదరికం తగ్గిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో రాష్ట్రంలో పేదరికం 29.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గిందని తెలిపారు. రాష్ట్ర సీఎంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉపాధి, సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని తెలిపారు. సోమవారం లోక్‌సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు వలసబాట పట్టకుండా తెచ్చిన ఉపాధి హామీ చట్టం మంచి ఫలితాలనే ఇచ్చిందనీ దీనిని కొనసాగించాలనీ కోరారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీతో పాటు ఉచిత విద్యుత్తు, కిలో 2 రూపాయల బియ్యం పథకం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు అమలుచేశారనీ తద్వారా 9.5 శాతానికి పేదరికం తగ్గిందన్నారు. -
నొప్పి తెలియని దారిద్య్రం
ప్రజలను ఓటర్లుగా మాత్రమే కొనసాగించినంతకాలం రాజకీ య నేతలు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజారంజక పాలనను కొనసాగిస్తున్న వారు ప్రభుత్వాల ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారు. కాని ఏ మంత్రి కాని, ఆధికారి కాని ప్రజలను పొదుపు చేయడానికి శ్రమించాలని కానీ, పరిమిత సంతానాన్ని పాటించాలని కాని చెప్పిన పాపానపోవడం లేదు. ఈ నేపథ్యంలో సంక్షేమంపై పెడుతున్న ఖర్చు, ప్రజలను ఓటర్లుగా మిగిలిస్తూ వారిని నొప్పిలేని దారిద్య్రంలో కొనసాగేవారిగా మలుస్తోంది. మన వెనుకబాటుతనానికి ఇదే ముఖ్య కారణం. - డా. టి. హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్ -
ఓడిపోతున్న అమ్మతనం
వంశోద్ధారకుడు కావాలన్న ఆరాటం.. ఆడపిల్లను సాకలేమన్న నిస్సహాయత.. ఏదైతేనేమీ.. జిల్లాలో శిశు విక్రయాల దుష్ట సంప్రదాయం కొనసాగుతుండడం దురదృష్టకరం. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం తండాలను వీడడం లేదు. ఇక..ఆధునికతకు పేరొందిన పట్టణ ప్రాంతాల్లో ‘కని’కరం లేకుండా ఆడశిశువులను రోడ్డు పక్కన, చెత్తకుప్పల్లో.. మురుగు కాల్వల్లో వేస్తున్న సంఘటనలు అనేకం.. ఆడశిశువులను ‘కని’కరం లేకుండా వదిలించుకుంటున్న విషాదాలకు జిల్లాలో ఇక.. ముగింపు లేదా...? విషసర్పాలైన పాములు కూడ గత్యంతర లేని పరిస్థితుల్లో మాత్రమే తాము కన్న పిల్లలను వధిస్తాయని తెలిసిందే. పేదరికం, అధిక సంతానం మనుషులను కూడ కర్కోటకులుగా మారుస్తోంది. నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి సైతం ప్రేమను త్వజించి పేగు తెంచుకుపుట్టిన పసిగుడ్డును పాషాణంగా వదిలేస్తోంది. ⇒ పసిగుడ్డులను పడేస్తున్న కొందరు.. ⇒ దత్తత పేరుతో విక్రయిస్తున్న మరికొందరు ⇒ జిల్లాలో ఇంకా కొనసాగుతున్న దుష్ట సంప్రదాయం నల్లగొండ అర్బన్: రోజులు, నెలలు, సంవత్సరాలతోపాటు క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ అడశిశువులను వదిలించుకునే అనాచారం నుంచి గిరి‘జనం’ బయటపడలేకపోతోంది. ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా, బంగారుతల్లి, కల్యాణ లక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టినా ఈ దుష్ట సంప్రదాయాన్ని నిలువరించలేకపోతున్నారు. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం గిరిజన తండాలను వీడడం లేదు. శిశు విక్రయాలతో దశాబ్దన్నర క్రితమే పత్రికల్లో పతాక శీర్షికల్లోకెక్కిన దేవరకొండ ప్రాంతంలో తరచు ఇలాంటి అనాచారపు ఆనవాళ్లు మెదలుతూనే ఉండగా, దుష్ట సంస్కృతి తాజాగా జిల్లా కేంద్రమూ మినహాయింపుకాదనే సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు వెళ్లేదారిలో అవాంఛిత మృతశిశువు ఉదంతం వెలుగులోకిచ్చి పదిరోజులైనా కాకముందే దత్తత ముసుగులో శిశు విక్రయ సంఘటన కలకలం రేపడం చర్చనీయాంశమైంది. వదిలించుకుంటున్న శిశువులు రోజుల వయస్సు వారు కావడంతో తల్లిపాలు పొందడం, తల్లిదండ్రుల వద్ద సహజ వాతావరణంలో పెరగడంలాంటి ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారు. 1999 నుంచి.. 1999 మార్చిలో దేవరకొండ మండలం కొండమల్లేపల్లి శివారు గౌరికుంట తండాలో ఇంద్రావత్ మంగ్లి అనే గిరిజన మహిళ 3 నెలల పసికందును భర్తకు తెలియకుండా అమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో దాదాపు 75 మంది శిశు విక్రయాలు జరిగాయని పరిశోధనల్లో తెలింది. ‘‘ఆడశిశువులను అమ్ముకుంటే ఎంతో కొంతలాభం...లేకుంటే పెంచి పెద్దచేసి పెళ్లిచేస్తే లక్షలవుతది. అందుకే అమ్ముకుంటున్నాం’’ అని పలువురు గిరిజన మహిళలు పేర్కొనడం వారి పరిస్థితులకు అద్దంపట్టింది. అత్యధికంగా చందంపేట మండలంలో ఆ తర్వాత డిండి, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో విక్రయాలు జరిగినట్లు తేలాయి. ప్రత్యేక ప్యాకేజీ అనంతరం కొంతమేర తగ్గడం, ఆతర్వాత ‘ఊయల’ పేరుతో శిశుగృహలకు తరలించే ఏర్పాటు చేయడంతో మరికాస్త చైతన్యం వచ్చినా, దత్తత పేరుతో అడపాదడపా శిశు విక్రయాల ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సాటుమాటుగా కొనసాగుతున్న విక్రయాలు.. పెంపకానికనో, దత్తత ఇచ్చామనే సాకులతో శిశు విక్రయాలు సాటుమాటుగా కొనసాగుతూనే ఉన్నాయి. వెలుగుచూసేవి కొన్నైతే...వెలుగులోకి రానివి ఇంకొన్ని. చందంపేట మండలం పోలేపల్లి శివారు ఫకీర్‌నాయక్ తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానమైన నెలవయస్సు దాటని ఆడశిశువును మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ. 15వేలకు కొండమల్లేపల్లి విద్ద విక్రయించారు. విషయం పోలీసులకు తెలియడంతో శిశువును స్వాధీనం చేసుకుని దేవరకొండలోని శిశు గృహకు తరలించిన సంఘటన తెలిసిందే. తాజాగా హాలియా మండలంలోని రంగుండ్ల తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానంలో జన్మిం చిన ఆడశిశువును మునుగోడు మండలానికి చెందిన ఓవ్యక్తి అప్పగించడం.. నల్లగొండలో జరిగిన వాగ్వివాదంతో విషయం అధికారుల దాకా వెళ్లి పాపను శిశుగృహకు తరలించారు. ఒకప్పుడు గొంతులో వడ్లగింజవేసి అక్కడిక్కడే అవాంఛిత శిశువుల ఉసురు తీసిన సంఘటనల నుంచి శిశు విక్రయాలు, దత్తత ముసుగులో వ్యాపారాలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’తోనైనా ఆగేనా... ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ఏటా కొంత నగదును ఇస్తూ మొత్తంగా రూ.2.16లక్షలను అందజేయడం ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ పథకం కొనసాగింపు అస్పష్టంగానే ఉంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారానైనా ఆడపిల్లల జీవితాలకు భరోసా కలగాలని ఆశిద్దాం. ఆడశిశువైతే వీడాల్సిందే...! వంశోద్ధారకుడు కావాలనే తాపత్రయంతో రెండు, మూడు కాన్పుల వరకు చూసి ఆపై కూడ ఆడ సంతానమే కలిగితే వదిలించుకుంటున్న సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఆస్తి, యాజమాన్యత, దారిద్య్రం, లింగవివక్షలు, వరకట్న సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్న విపత్కర పరిస్థితుల ప్రేరేపణతో నవమాసాలు మోస్ఙికన్న’ ఆ పేగే బరువైపోతోంది. ఈ అనాచారం విశృంఖలంగా మారి పరిస్థితి ఘోరంగా తయారవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ మొదలు అసెంబ్లీ కమిటీల వరకు గిరిజన తండాల్లో పర్యటించి శిశు విక్రయ నిరోధానికి సలహాలు, సూచనలిచ్చాయి. రూ.26 కోట్ల ప్యాకేజీతో కొంతతగ్గినా... శిశు విక్రయాల సంఘటనలను తీవ్రంగా పరిగణించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ 2001లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటన తర్వాత..దాని నివేదిక ప్రకారం 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి మరికొంత ఆర్థిక సాయం అందించింది. దీంతో కొన్నాళ్లపాటు ఈ అనాచార, ఉదంతాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత యథాతధమయ్యాయి. -
‘మ్యాజిక్ బస్’ ఆటపాఠాలు
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ..నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేముసైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్నపదవ కథనమిది... మురికి వీధుల్లో మసులుతున్న బాల్యం.. పెద్దయ్యాక భారంగా మారుతుంది. అదే బాల్యాన్ని అక్కున చేర్చుకుని అక్కరకు వచ్చే విషయాలు చెబితే.. భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. గుడిసెల చుట్టూ గిరి గీసుకుని బతుకుతున్న పేదపిల్లలకు ప్రపంచాన్ని దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తోంది ‘మ్యాజిక్ బస్’. అక్షర జ్యోతి వెలిగించినంత మాత్రాన పేదరికం చీకట్లలో ఉన్న వారి జీవితాల్లో వెలుగులు ప్రకాశించవు. మారుతున్న లోకంలో నిలబడే జ్ఞానం అందించాలి. ఆ పని మేం చేస్తామంటోంది ‘మ్యాజిక్ బస్’. మాథ్యూస్పేసి ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారి. ఓసారి ముంబై వీధుల్లో ఆయనేదో గేమ్ ఆడుతున్నాడు. అదే సమయంలో ఆ పక్కనే మురికివాడల్లో ఉన్న యువకులను గమనించి.. నిండు మనసుతో వారికి ఉద్యోగాలు ఇప్పించాడు. కానీ.. ఏం లాభం.. కాస్తో కూస్తో చదువున్నా.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ యువకులు ఉద్యోగాల్లో కొనసాగలేకపోయారు. ఇచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోవడం మాథ్యూస్పేసికి కోపం తెప్పించలేదు. వారికే కాదు.. మురికివాడల్లో ఉన్న మరెందరికో దారి చూపాలన్న ఆలోచనకు బీజం వేసింది. అలా పుట్టిందే ‘మ్యాజిక్ బస్’ అనే స్వచ్ఛంద సంస్థ. రైట్.. రైట్.. మురికివాడల్లో మరుగున పడి పోతున్న బాల్యాన్ని మేలిమి ముత్యంలా తయారు చేయడమే మ్యాజిక్ బస్ లక్ష్యం. ఆ సంస్థ సభ్యులు వారాంతాల్లో స్లమ్స్‌కు వెళ్తారు. చిన్నారులను ఆటపాటలతో ఆకట్టుకుంటారు. ఆ తర్వాత పాఠాలు చెబుతారు. విద్య, వైద్యం, జెండర్ ఈక్వాలిటీ, సోషియల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్.. ఇలా ఐదు అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్విహ స్తారు. పదిహేనేళ్ల కిందట ముంబైలో స్టార్ట్ అయిన మ్యాజిక్ బస్ దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లోని మురికివాడల్లో చక్కర్లు కొడుతోంది. మూడు లక్షల మంది పేదపిల్లల జీవితాలను మ్యాజిక్ చేసే పనిలో బిజీగా ఉంది. భాగ్యనగరంలో.. మ్యాజిక్ బస్ సేవలు 2009 నుంచి హైదరాబాద్‌లో మొదలయ్యాయి. ప్రస్తుతం నగరంలో రెండు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. పాతబస్తీలోని మురికివాడల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సాయం చేయాలనే తపన ఉన్న యువకుల సహకారంతో చిన్నారుల జీవితాల్లో చిరునవ్వులు నింపుతోంది. ‘పాతబస్తీలో 90 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరంతా వారి వారి ప్రాంతాల్లోని మురికివాడల్లో పనిచేస్తారు. ఉదయం రెండు గంటల పాటు పాఠాలు బోధిస్తారు. తర్వాత పిల్లలకు ఇష్టమైన ఆటలు ఆడిస్తారు. వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఖోఖో వంటి ఆటలకు కావాల్సిన కిట్స్, డ్రెస్‌లను కూడా మా సంస్థే సమకూరుస్తుంది. ఆటల్లో ప్రతిభ కనబరిచే పిల్లలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం. పాతబస్తీ ఏరియాలో రెండున్నర వేల మంది చిన్నారులు మా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా సంస్థ రెండో కేంద్రం శామీర్‌పేట దగ్గర్లోని బాలాజీ నగర్లో ఉంది. అక్కడ కూడా ఇదే స్థాయిలో పిల్లలున్నారు’ అని చెప్పారు మ్యాజిక్ బస్ సీనియర్ జనరల్ మేనేజర్ సంధ్యాశ్రీనివాస్. దేశవ్యాప్తంగా 7,500 మంది వాలంటీర్లు మ్యాజిక్బస్లో పని చేస్తున్నారు. వీరిని కమ్యూనిటీ యూత్ లీడర్ అని పిలుస్తారు. నాలుగు అక్షరం ముక్కలు.. ఆటపాటలు పిల్లల దగ్గరికి వెళ్లి జీవిత పాఠాలు నేర్పిస్తాం రండి అంటే ఎవరొస్తారు..? అందుకే ముందుగా ఆటలు.. ఆ తర్వాత పాఠాలు చెబుతూ పిల్లలకు చేరువవుతోంది మ్యాజిక్ బస్. నాలుగు అక్షరం ముక్కలు.. కాసింత లోక జ్ఞానం.. కొద్దిపాటి ప్రోత్సాహం.. ఈ మూడూ ఉంటే ఓ సామాన్యుడు కూడా మాన్యుడు కాగలడని చరిత్రలో ఎన్నోసార్లు చదువుకున్నాం. ఈ మూడింటినీ అందిస్తున్న మ్యాజిక్ బస్, ఈ సంస్థ పయనంలో అండగా నిలుస్తున్న యువ వాలంటీర్లకు సలామ్ చేద్దాం. బస్తీల్లో తిరుగుతున్న ఈ బస్ మరెందరో చిన్నారులను పికప్ చేసుకోవాలని, వారిని బంగారు భవిష్యత్తు వైపు తీసుకెళ్లాలని కోరుకుందాం. గేమ్ అండ్ గోల్ ‘మా చేతిలో వాలీబాల్ ఉంటే పిల్లలు మా చుట్టూ చే రిపోతారు. కాసేపు ఆడుకున్నాక.. మిగతా విషయాలను కూడా వారి బుర్రలకెక్కిస్తాం. పేదరికంలో పెరిగే చిన్నారులకు అక్షరజ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. వ్యక్తిత్వ వికాసానికి అవకాశం కూడా ఇవ్వాలి. మ్యాజిక్‌బస్ ఇదే చెబుతుంది. వారి జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పుతామని చెప్పడం లేదు. కానీ, వారిని అమాయకత్వం నుంచి జ్ఞానం వైపు నడిపించగల్గుతున్నామని.. గర్వంగా చెప్పగలం’. - ధీమంత్ టొవాటియా, సీనియర్ మేనేజర్ ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
పోషించలేక.. విక్రయానికి
బాలుడిని బాల సదనం చేర్చిన అధికారులు ఇందూరు : పేదరికం కారణంగా ఓ తండ్రికి కుమారుడు భారమయ్యాడు. అతడిని పోషించే మార్గం కానరాక.. విక్రయానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని బాలసదనానికి చే ర్చారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన రాజుకు చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు రెండేళ్ల కుమారుడితో పాటు మతి స్థిమితం లేని భార్య ఉంది. పేదరికం కారణంగా కుమారుడిని ఎలా పోషించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. ఆరోగ్యం, ఆర్థి క పరిస్థితి సహకరించకపోవడం తో బాలుడిని అమ్మాలని నిర్ణయిం చుకున్నాడు. కాలూరు రోడ్డు శివారులో నివసించేవారికి విషయం తెలిపాడు. వారు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ విభాగం సిబ్బంది జ మ్రు, బాబు, గంగామోహన్, నిజామాబాద్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తండ్రితో పాటు బాలుడిని సుభాష్‌నగర్‌లోని బాల సదనానికి తరలించారు. రాజుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తన భార్యకు మతి స్థిమితంలేదని, కుమారుని తరచూ కొడుతుందని అతడు పేర్కొన్నాడు. కుమారుడిని పో షించే శక్తి లేకపోవడంతో అమ్మాల నుకున్నానని, ఎవరైనా దత్తత అడిగినా ఇవ్వాలనుకున్నానని తెలిపాడు. ఇతరులకు అప్పగిస్తే వారైనా బాగా చూసుకుంటారని భావించానంటూ కన్నీరుపెట్టాడు. తన కుమారుడిని పెంచి, మంచి భవిష్యత్ ఇవ్వాలని అధికారులను కోరాడు. -
ప్రపంచంలో శక్తివంతమైన మహిళ ఇందిర
గాంధీభవన్‌లో ఇందిరాగాంధీ 97వ జయంతిలో పొన్నాల సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కొనియాడారు. ఇంది రాగాంధీ 97వ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరిక నిర్మూలన , దేశాభి వృద్ధి విషయంలో ఇందిరాగాంధీ విధానాలనే ప్రపంచంలోని సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాలు అనుసరించాయని పేర్కొన్నారు. అంతకు ముందు పొన్నాల నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
ఆర్థిక మానవతావాది!
నవంబర్ 3న ఆమర్త్య సేన్ జన్మదినం సత్వం: ఆర్థికశాస్త్రవేత్త పేదరికం గురించి మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు... అయితే పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా అని ఆయన అంటారు. సాధారణంగా అంకెలు అంకెల్లానే వ్యవహరిస్తాయి. వాటికి ఆత్మాభిమానం, అణచివేత, క్షోభ, సామాజిక వ్యత్యాసం లాంటివేమీ తెలియదు. వృద్ధిరేటు ఎంత శాతం ఉంది? స్థూల జాతీయోత్పత్తి ఏ మేరకు పెరిగింది? ఇవి అవసరమే. కానీ వీటిని మాత్రమే ఆమర్త్య సేన్ లెక్కలోకి తీసుకోరు. ఆ అంకెలు ఉపరితలం నుంచి వచ్చినవా? అట్టడుగు వర్గాలను కూడా కలుపుకొన్నవా? అందుకే ఆయన మాటతీరు ఆర్థిక శాస్త్రవేత్తకన్నా మానవ హక్కుల న్యాయవాదిని తలపిస్తుంది. ‘ఆర్థికశాస్త్రానికి నైతిక కొలతను పునఃస్థాపించినవాడిగా’ ఆయనకు 1998లో నోబెల్ పురస్కారం దక్కింది ఈ కారణంగానే! 1933లో శాంతినికేతన్లో రవీంద్రనాథ్ టాగూర్ చేత నామకరణం చేయించుకున్న ఆమర్త్య కుమార్ సేన్... గాంధీజీ ‘విశ్వాసపు బాట’కన్నా, రవీంద్రుడి ‘హేతువు తోవ’కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చరఖా కన్నా పలక మిన్న అన్న గురుదేవుడి స్ఫూర్తిని జీర్ణించుకున్న ఆయన... పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్‌తో కలిసి ‘మానవాభివృద్ధి సూచిక’ను రూపొందించారు. ఆయా దేశాల్లోని జీవన ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ఈ సూచిక ఆధారంగానే లెక్కిస్తోంది. దీనిప్రకారం భారత్‌ది 135వ స్థానం. ప్రస్తుతం బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గానూ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక, తత్వశాస్త్రాల బోధకుడిగానూ పనిచేస్తున్న ఆమర్త్య సేన్... తలసరి ఆదాయం మాత్రమే దేశాభివృద్ధికి సూచిక కాదంటారు. ‘మానవ సామర్థ్య’ పెరుగుదల మరింత ప్రాధాన్యమైన అంశం అంటారు. నిరక్షరాస్యత, కనీస ఆరోగ్య సౌకర్యాల లేమి, లైంగిక అసమానత్వం గురించి నొక్కి చెబుతారు. భిన్నవర్గాలకు గొంతుక ఇవ్వడంలో ఏ మేరకు సఫలీకృతమైందన్న దాన్ని బట్టే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటారు. అయితే, ప్రజాస్వామ్యం దేనికీ గ్యారంటీ ఇవ్వదు. హక్కుల కోసం పోరాడాల్సివుంటుంది. కానీ ప్రాథమిక విద్యలాంటిదాన్ని ఉద్యమరూపంలోకి మలచడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. నిరంతర సంవాదం ద్వారా మౌలికావసరాల్ని సామూహిక స్పృహలోకి తేవాల్సి ఉందంటారు. రెండు రకాల ఆర్థిక విధానాల గురించిన చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్లే స్థూలజాతీయోత్పత్తిని పెంచుతారు, దానిలో భాగంగా పేదవాళ్లు కూడా దాని ఫలాలు అందుకుని పైకి ఎగబాకుతారనే ‘జీడీపీ వృద్ధి’ విధానం ఒకటీ; విద్య, ఆరోగ్యం లాంటివాటికి తొలి ప్రాధాన్యమిచ్చే ‘మానవ సామర్థ్య వృద్ధి’ విధానం మరొకటీ. చిత్రంగా మొదటిదానికే మన ప్రభుత్వాలు మరింత ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. దీన్ని ఆమర్త్యసేన్ వ్యతిరేకిస్తారు. ఏ దేశమూ కూడా మానవ సామర్థ్యాన్ని పెంపొందించకుండా అద్భుతమైన పెరుగుదలను సాధించలేదంటారు. జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, థాయ్‌లాండ్, యూరప్, అమెరికా, బ్రెజిల్... ఇవేవీ ట్రాక్ 1లో అభివృద్ధి చెందలేదంటారు. ‘సామ్యవాద ఆర్థికవ్యవస్థల్ని అణచివేత సహా ఎన్నో రాజకీయ, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టివున్నాయి. యాభై ఏళ్లక్రితం ఏ లక్ష్యాలైతే జనాన్ని సామ్యవాదంవైపు ఆకర్షించాయో, ఆ లక్ష్యాలు ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినవే!’ మహిళలు ఎదుర్కొనే అణచివేత గురించి ఆయన 1960ల్లోనే రాశారు. విద్య, పోషణ విషయంలో ఒక కుటుంబంలో ఉండే పంపకాల్లోని అసమానతల గురించి చర్చించారు. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఇవన్నీ మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు. ‘పేదరికం నాకు ఆసక్తి. బాలికల నిష్పత్తి నాకు ఆసక్తి. బాలల సంక్షేమం నాకు ఆసక్తి. శిశు మరణాలు నాకు ఆసక్తి’... ‘పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా!’ అంటారు. భిన్న సంస్కృతులు స్నేహపూర్వకంగా మనగలిగే సమాజాన్ని ఆయన కాంక్షిస్తారు. ప్రజాస్వామ్యం కేవలం అత్యధికుల పాలనావిధానం కాదనీ, అది సహనానికి సంబంధించినదనీ, అల్పసంఖ్యాకుల అభిప్రాయాల్నీ, విమర్శలనీ సహించడంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగుందనీ చెబుతారు. కొందరి ప్రయోజనాలకు భంగం కలిగినా, కొందరు మార్కెట్ వెలుపలే ఉండిపోయినా కూడా కొందరైనా వ్యక్తిగతంగా లాభపడేలా చేస్తుంది కాబట్టి, మార్కెట్ ఎకానమీయే విజయం సాధిస్తుందంటారు. అయితే, నీకు చదువు లేకుండా, వ్యక్తిగత రుణం పొందే అవకాశం లేకుండా అందులో ఎప్పటికి పాల్గొనాలి? పెట్టుబడీదారి విధానం సూత్రప్రాయంగా బలమైన వ్యక్తివాదాన్ని ప్రోత్సహించేదే అయినప్పటికీ, ఆచరణలో సమైక్యతకే దారితీసిందనీ, మన జీవితాల్ని మరింత పరస్పరాధారితంగా మార్చిందనీ చెబుతారు. ప్రపంచీకరణను ప్రతికూల దృష్టితో చూడనవసరం లేదంటారు. ‘అది ప్రపంచాన్ని సాంస్కృతికంగా, శాస్త్రీయంగా బలోపేతం చేసింది. ఎంతోమంది ఆర్థికంగా కూడా బలపడ్డారు’. ప్రతిదీ అందరికీ అందే దృష్టిలో దాన్ని స్వాగతిస్తారు. అలాగే దాన్ని మరింత మానవీయమైనదిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, అలా చేయడం కోసం జరిగే పోరాటాల్నీ సమర్థిస్తారు. -
పట్టాలెక్కిన పసితనం!
పేదరికం... ప్రపంచాన్ని వణికించే ఎన్నో విషయాల్లో ఈ నాలుగక్షరాల పదం కూడా ఉంది. ఇది ఎన్నో దేశాలను శాసిస్తోంది. ఎన్నో జీవితాలను వేధిస్తోంది. గుప్పెడు మెతుకులు కరువై కడుపును రగిల్చే ఆకలి మంటలు, తల దాచుకోవడానికి చిన్న గూడైనా లేని బతుకులు, ఒంటిని కప్పుకోవడానికి జానెడు గుడ్డ కరువైన జీవితాలు... ఇవన్నీ పేదరికానికి సాక్ష్యాలు! ప్రముఖ ఫొటోగ్రాఫర్ తుర్జాయ్ చౌదరి కెమెరా కళ్లు ఎప్పుడూ ఈ పేదరికాన్ని చూసి చెమ్మగిల్లుతుంటాయి. ఎక్కడ ఎవరు దీనావస్థలో కనిపించినా చప్పున బంధిస్తాయి. ఈ ఫొటో వాటిలో ఒకటి. బంగ్లాదేశ్‌లోని ఓ మురికివాడలో సంచరిస్తున్నప్పుడు... అనుకోకుండా ఈ దృశ్యం చౌదరి కంటపడింది. అమ్మానాన్నలు కూలిపనికి వెళ్లిపోతే, తన చిట్టి తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ చిన్నారి తల్లిమీద పడింది. ఆకలితో ఏడుస్తోన్న తమ్ముడికి బువ్వ తినిపించడానికి అమ్మ అవతారమెత్తింది. ఆడిస్తూ, లాలిస్తూ ఇలా పట్టాల మధ్యకు చేరింది. రైళ్లు వస్తాయన్న భయం లేదు. ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందన్న చింత లేదు. ఎలాగైనా తన తమ్ముడి బుల్లి బొజ్జ నింపాలన్న తపన తప్ప! ఆ తపనను ఒడిసిపట్టాడు చౌదరి. పేదరికం సాక్షిగా పట్టాలెక్కిన బతుకుల్ని ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు! -
భిక్షాటనలో బాల్యం
పట్టించుకోని పాలకులు గూడూరు టౌన్ : బాల్యం భిక్షాటన చేస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో బాల్యం ప్రశ్నార్థకంగా మారింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల పలువురు బాలలు యాచకులుగా మారుతున్నారు. ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమాలతో బడీఈడు పిల్లలను బడికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. భిక్షాటన చేస్తున్న బాలల కోసం అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఎందుకూ పనికి రావడం లేదు. భిక్షాటనే వృత్తిగా.. : జిల్లాలో 2 వేలకు పైగా చిన్నారులు భిక్షాటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమాహాళ్లు, కళాశాలలు, షాపింగ్‌మాల్స్, కూడలి ప్రాంతాలు, ఆలయాల వద్ద అనేక మంది చిన్నారులు యాచిస్తున్నారు. బడిఈడు పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలకు పంపేలా ఐసీపీఎస్, ఐసీడీఎస్, విద్యాశాఖాధికారులతో పాటు ప్రభుత్వంలోని అన్నిశాఖల అధికారులు పని చేయాల్సి ఉంది. భిక్షాటన చేస్తు న్న వారిలో ఎక్కువగా 14 ఏళ్లలోపు చిన్నారులే ఉంటున్నారు. నెల్లూరులోని సుందరయ్య కాలనీ, గూడూరు, కావలి రైల్వేస్టేషన్ల సమీపంలో నివాసముంటున్న వారి పిల్లలే అధికంగా భిక్షాటన చేస్తున్నారు. కొంతమంది అయ్యప్పమాల సీజన్లో స్వామి మాలలు ధరించి భిక్షాటన చేస్తున్నారు. తూతూ మంత్రంగా పథకాలు అమలు.. నిర్బంధ విద్య, బడి పిలుస్తోంది తదితర పథకాలు తూతూ మంత్రంగా అమలవుతుండడంతో చిన్నారుల జీవితాలు భిక్షాటనతో బుగ్గిపాలవుతున్నాయి. భిక్షాటన చేస్తున్న బాలలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా వారు మారడం లేదని ఐసీపీఎస్ అధికారులు అంటున్నారు. అందుకే పోలీసుల సాయంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో బాలికల కోసం ఐదు పునరావాస కేంద్రాలున్నాయన్నాయన్నారు. బాలురకు పునరావాస కేంద్రాలు లేవు. వారిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న కేంద్రాలకు పంపుతున్నట్లు వారు తెలిపారు. -
పేదరికంలో పుట్టి..పెకైదిగిన జట్టి
చెక్కలను అందమైన ఆకృతులుగా మలిచే ఓ వడ్రంగి తన కుటుంబ జీవితాన్ని సుందరంగా మలచుకోవాలని కలలు కన్నాడు. అప్పులుచేసి సౌదీకి వెళ్లాడు. కల నెరవేరకనే గుండెపోటుతో కన్నుమూశాడు. ఇక్కడ అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. బిడ్డల బతుకు ఎలా దేవుడా అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బి.కొత్తకోట: బి.కొత్తకోట పోకనాటి వీధికి చెందిన ఎల్.హాషీంఖాన్ (35) వృత్తిరీత్యా కార్పెంటర్. 13ఏళ్ల కిత్రం నయీమాతో వివాహమైంది. బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాలోని ఆల్గస్సీమ్ బురేదాలో ఓ షేక్ వద్ద పనికి కుదిరాడు. నెలకు *15 వేల వేతనం పొందుతున్నాడు. అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలతో కొన్ని రోజులు గడిపి తిరిగి వెళ్లేవాడు. ఈ ఏడాది జూలై 29న రంజాన్ పండుగకు బి.కొత్తకోటకు వచ్చాడు. భార్య, కుమార్తెలు సానియా (10), మహీరా (6), సభా (2)తో ఆనందంగా గడిపాడు. సెలవులు పూర్తి కావడంతో సౌదీకి బయలుదేరాడు. త్వరలోనే మళ్లీ వస్తానని వీడ్కోలు తీసుకున్నాడు. అదే వారికి ఆఖరి చూపు అవుతుందని ఊహించలేదు. శుక్రవారం సాయంత్రం సౌదీ నుంచి అందిన కబురు ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దుఃఖసాగరంలో ముంచెత్తింది. సాయంత్రం 4 గంటలకు హాషీంఖాన్ గుండెపోటుతో మరణించాడన్నదే ఆ కబురు సారాంశం. అతడి మృతదేహాన్ని బి.కొత్తకోటకు తీసుకొచ్చే అవకాశాలు లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ‘అమ్మీ!.. అబ్బాకు క్యా హువా హై? అబ్బా ఆతేని క్యా?’ (అమ్మా! నాన్నకేమైంది?..నాన్న రాడా?) అంటూ చిన్నారులు అమాయకంగా ప్రశ్నిస్తుంటే సమాధానం కరువవుతోంది. ‘హమ్ కో సహారా కౌన్ హై? హమ్ కైసే దీనా హై..హే భగవాన్! హమ్ కోహీ ఐసా క్యోం కర్ రహే హో’(మాకు దిక్కెవరు? ఇక ఎట్లా బతకాలి? భగవంతుడా..మాపట్ల ఎందుకిట్లా చేశావు?) పిల్లలను పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్న నయీమాను చూసి పలువురు విచలితులయ్యారు. హాషీం పనిచేస్తున్న షేక్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఇక్కడి నుంచి న్యాయపరమైన ప్రక్రియ చేపట్టారు. హాషీం సోదరుడు, కొందరు బంధువులు సౌదీలోనే ఉండడంతో వారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. -
ప్రత్యామ్నాయ వనరులందించే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్!
ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు వనరులు అదేస్థాయిలో తరిగిపోతున్నాయి. ఫలితం.. కరవు కాటకాలు, ఆకలి, పేదరికం, యుద్ధాలు, అశాంతి వంటి సామాజిక రుగ్మతలు పంజా విసురుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు భయానకమే. ఈ నేపథ్యంలో మానవుడు చేయాల్సింది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను కాపాడుకోవడం, ప్రత్యామ్నాయ వనరులను తయారు చేసుకోవడం. ఈ రెండూ ఏకకాలంలో జరగాలి. భూగర్భంలో నీరు, చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి విలువైన వనరులు తగ్గిపోతుండడంతో ప్రత్యామ్నాయాలపై ఇప్పటికే పరిశోధన ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వనరులను, పర్యావరణ హితమైన వస్తువులను ప్రజలకు అందించేవారే.. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అన్నిదేశాలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో హరిత వ్యాపారవేత్తలకు అవకాశాలు పెరుగుతున్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహం: అంతరిస్తున్న పచ్చదనం, పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత వంటి కారణాలతో జనం ఆలోచనల్లో మార్పు వస్తోంది. పర్యావరణ హితమైన వస్తువుల వాడకంపై అవగాహన పెరుగుతోంది. దీంతో గ్రీన్ బిజినెస్ ఊపందుకుంటోంది. కరెంటు కోతల నేపథ్యంలో సౌరశక్తి వినియోగం పెరుగుతోంది. సోలార్ పరికరాలకు, పర్యావరణ హిత వస్తువులకు అధిక డిమాండ్ ఉంది. వీటిని రూపొందించే సంస్థల్లో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దేశ విదేశాల్లో కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కెరీర్ ప్రారంభిస్తే.. ప్రస్తుతం అవకాశాలకు కొదవే లేదు. ఔత్సాహికులకు ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందుతోంది. కావాల్సిన నైపుణ్యాలు: గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వ్యాపార నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. తమ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించేందుకు, లావాదేవీలు నిర్వహించేందుకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. నిత్య అధ్యయనమే ఇందుకు మార్గం. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఉండాలి. పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ వనరుల తయారీపై ఆసక్తి అవసరం. ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేందుకు మెరుగైన మార్కెటింగ్ నైపుణ్యాలు ఉండాలి. అర్హతలు: భారత్‌లో పలు విద్యాసంస్థలు పర్యావరణ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. గ్రీన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం బిజినెస్ స్కూళ్లలో కోర్సులు ఉన్నాయి. ఎంబీఏలో స్పెషలైజేషన్లుగా వీటిని అందిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైనవారు ఆయా కోర్సుల్లో చేరొచ్చు. వేతనాలు: హరిత వ్యాపారవేత్తలు తమ వ్యాపార ఆలోచనలను అమల్లో పెట్టి ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో నెలకు కనీసం రూ.30 వేలకుపైగానే ఆర్జించే వీలుంది. వినూత్నమైన ఆలోచనలతో మార్కెట్లోకి ప్రవేశిస్తే ఆదాయానికి హద్దే ఉండదు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in/ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.ceeindia.org/ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎంలు), వెబ్సైట్: www.iimcal.ac.in/,www.iimahd.ernet.in/, www.iimb.ernet.in/ www.iiml.ac.in/ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ -న్యూఢిల్లీ. వెబ్సైట్: www.imi.edu/ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ. వెబ్సైట్: http://fms.edu/ ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్-అహ్మదాబాద్. వెబ్సైట్: www.mica.ac.in/ డీఎస్సీ సోషల్ మెథడ్సలోని ‘బోధన లక్ష్యాలు - స్పష్టీకరణాలు’ పాఠ్యాంశం నుంచి అడిగే ప్రశ్నల సరళిని వివరించండి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? - కె. మాళవిక, దిల్సుఖ్నగర్ గత డీఎస్సీ పరీక్షలో ఆశయం, లక్ష్యం, స్పష్టీకరణాలపై విషయ అవగాహనను పరీక్షిస్తూ ప్రశ్నలు అడిగారు. కాబట్టి అభ్యర్థులు మెథడాలజీలో ఉన్న అంశాలను పాఠ్య విషయంలోని అంశాలతో అనుసంధానం చేస్తూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు గత పరీక్షలో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: ఇటీవల ఏర్పడిన తుఫానులు ఏ వర్షపాతానికి ఉదాహరణ అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు మాపనం చేయదల్చుకున్న లక్ష్యం? సమాధానం: అవగాహన. మెథడాలజీలోని లక్ష్యాలు - స్పష్టీకరణాలతో పాటు కంటెంట్‌ను కూడా అవగాహన చేసుకోవాలనే విషయం పై ప్రశ్న ద్వారా అర్థం అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఏడు లక్ష్యాలు, ఆ లక్ష్యాల్లోని నిర్దిష్ట లక్ష్యాలు, 66 స్పష్టీకరణాలను ఉదాహరణల పూర్వకంగా చదవడం వల్ల ‘లక్ష్యాలు - స్పష్టీకరణాలు’ పాఠ్యాంశంలో పట్టు సాధించవచ్చు. ఇన్పుట్స్: డాక్టర్ ఎస్.ఎస్.మోజెస్, సీనియర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో పీజీ పాట్నాలోని డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్.. పీజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఇన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ 2013-14 స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 25 వెబ్సైట్: www.dmi.brlps.in పీజీ డిప్లొమా బెంగళూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపీఎం).. పీజీ డిప్లొమాలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. క్యాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2015 వెబ్సైట్: www.iipmb.edu.in ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్.. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజి డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విభాగాలు: ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్, మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ (10+2+3) ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్ స్కోరు అవసరం. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30 వెబ్సైట్: http://www.spjimr.org పీహెచ్డీ ప్రోగ్రామ్ భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్.. పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీహెచ్డీ అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్ విభాగం: మేనేజ్మెంట్ అర్హతలు: 55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 5 వెబ్సైట్: w3.ximb.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే 2015 అకడమిక్ సెషన్‌కు సంబంధించి గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కు దరఖాస్తులు కోరుతోంది. ఆక్స్ఫర్డ్- అండర్సన్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్ అర్హతలు: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో చేరినవారు అర్హులు. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేది: జనవరి 23, 2015 వెబ్సైట్: http://www.ox.ac.uk -
కన్నీళ్లకే కన్నీరొచ్చే..
వీడని పేదరికం వెంటాడిన వ్యాధులు వేధించిన భర్త తాగుడు పిల్లలతో సహా కాలువలో దూకిన తల్లి మండ్య : ఎంత శ్రమించిన పూట గడవడమే కష్టం... దీనికి తోడు ఎంత ఖర్చు పెట్టినా నయం కాని దీర్ఘకాలిక వ్యాధులు! మరో వైపు భర్త తాగుడు వెరసి జీవితంపై విరక్తి పెంచుకున్న ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా నెలమనె సమీపంలో ఉన్న హనుమంత నగరకు చెందిన రాము, కెంపమ్మ(31) దంపతులు. వీరికి విజయ్ (3), జ్యోతి(6), పల్లవి(7) పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకు దంపతులిద్దరూ కూలీ పనులు చేసేవారు. కెంపమ్మకు చాలా కాలంగా చర్మ, మూర్ఛ వ్యాధులతో బాధపడుతోంది. ఈ వ్యాధుల బారిన పిల్లలు కూడా పడ్డారు. ఎందరు డాక్టర్లకు చూపినా వ్యాధులు నయం కాలేదు. రోజురోజుకూ మందుల ఖర్చుల ఎక్కువవుతోంది. సంపాదన మాత్రం పెరగలేదు. వ్యాధి తీవ్రత ఉన్న సమయంలో కెంపమ్మ పనికి వెళ్లలేకపోయేది. ఆ సమయంలో ఆ కుటుంబానికి ఒక పూట మాత్రమే భోజనం దక్కేది. కుటుంబానికి బాసటగా నిలుస్తాడనుకున్న భర్త మద్యానికి బానిసై తన సంపాదన మొత్తాన్ని తాగుడుకే ఖర్చు పెట్టసాగాడు. ఆ వ్యసనాన్ని వీడి కుటుంబ పోషణకు సహకరించాలని పలుమార్లు భార్య వేడుకున్నా ఫలితం లేకపోయింది. వ్యాధి తీవ్రత ఎక్కువై భరించలేని స్థితికి చేరుకుంది. వైద్యం చేయించుకునేందుకు డబ్బు ఇచ్చి సహకరించాలని తన తల్లి జయమ్మను కెంపమ్మ వేడుకుంది. మూడ్రోజుల్లో డబ్బు సర్దుతానని ఆమె చెప్పడంతో కెంపమ్మకు దిక్కుతోచలేదు. చర్మ వ్యాధి తీవ్రతను తట్టుకోలేక చిన్నారులు ఏడుస్తుంటే తల్లి హృదయం తల్లడిల్లింది. ఆదివారం సాయంత్రం సీడీఎస్ కాలువను చేరుకుని పిల్లలతో సహ దూకింది. సోమవారం ఉదయానికి పాండవపుర తాలూకాలోని దేవెగౌడనకొప్పలు - చిక్కాడ సమీపంలో విజయ్ మృతదేహం తేలింది. మధ్యాహ్నానికి కొడలకుప్పె సమీపంలో దొడ్డబట్ట వద్ద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్పి భూషన్ జి.బోరసే, సీఐ దీపక్, ఎస్ఐ బి.జి.కుమార్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప‘రేషన్’
నిజాంసాగర్: సంక్షేమ పథకాల అమలులో అక్రమాలపై విచార ణ చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అనర్హుల వద్ద ఉన్న ‘తెల్లరేషన్ కార్డుల’ ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల ద్వారా సక్రమంగా అందాలన్న సంకల్పంతో రేషన్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసం ధానం చేసుకోవాలని సూచించింది. ఫలితంగా ఒక కుటుంబానికి రెండు చొప్పున ఉన్న రేషన్‌కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్న కార్డుల ఏరివేతకు అవకాశం లభించింది. గత ప్రభుత్వం మూడవ విడత రచ్చబండ కార్యక్రమం ద్వారా పంపిణీ చేసిన రేషన్ కూపన్లపైనా అధికారులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యుల ఫొటోల ఆధారంగా పరిశీలన ప్రారంభించారు. ఆధార్ నంబర్లను నమో దు చేసుకోని కూపన్‌దారులకు రేషన్ సరుకులను నిలిపివేశారు. సరుకుల పంపిణీలో జాప్యం జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు, 718 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న సుమారు 6.5 లక్షల కుటుంబాలకు ప్రభుత్వంసరుకులను రాయితీపై అందిస్తోంది. ఇందుకోసం జిల్లాకు 10,700 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తోంది. డీలర్లు నెలనెలా డీడీలు కట్టి సరుకులను తీసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. గత నెల యథావిధిగా రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టినా జిల్లాకు మాత్రం కోటాను కేటాయించలేదు. దీంతో సెప్టెం బర్ నెల సరుకుల పంపిణీ ఆలస్యమవుతోంది. లబ్ధిదారులు దుకాణాల చుట్టు చక్కర్లు కొడుతున్నారు. అయోమయంలో ‘రచ్చబండ’ కూపన్‌దారులు గత ప్రభుత్వం నిర్వహించిన మూడో విడత రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు పొందిన లబ్ధిదారులు తమకు సరుకులు వస్తాయోలేదోనని ఆయోమయంలో పడిపోయారు. అప్పటికే తెల్ల రేషన్‌కార్డులలో పేర్లు ఉండి, కొత్తగా రేషన్ కూపన్లు పొందిన కుటుంబాలను గుర్తించేందుకు అధికారు లు యత్నిస్తున్నారు. దీంతో సరుకుల పంపిణీ ఆలస్యమవుతోందని సమాచారం. కూపన్ల ద్వారా రేషన్‌సరుకులు పొం దుతున్నవారు ఆధార్ నంబర్‌ను నమోదు చేయించకపోవడంతో ప్రభుత్వం కూపన్లకు సరుకులను నిలిపి వేసిందని డీలర్లు చెబుతున్నారు. దీంతో అసలైన లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. 60 వేల కుటుంబాల సంగతి అంతేనా! జిల్లావ్యాప్తంగా 60 వేల కుటుంబాలకు రేషన్ కూపన్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు కుటుంబాల ఫొటో, ఆధార్ నంబర్లను డీలర్లు, రెవెన్యూ అధికారులకు అందించలేదు. దీంతో వీరికి సరుకులు అందే అవకాశం లేదు. బోగస్‌కార్డులు కలిగినవారితోపాటు, ఉద్యోగాలు ఉన్నవారికి సర్కారు సరుకులను నిలిపివేస్తోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడం కోసమే సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటాను ప్రభుత్వం జిల్లా, మండలాలు, గ్రామాలవారీగా కేటాయించలేదు. అందుకే సరుకుల పంపిణీ ఆలస్యం కానుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 5 లోగా నమోదు చేసుకోవాలి మూడవ విడత రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు పొందినవారు కుటుంబాల ఫొటోలు, ఆధార్ నంబర్లను ఈ నెల ఐదులోగా కంప్యూటర్లలో నమోదు చేయించుకోవాలి. రేషన్ కార్డులలో పేర్లు ఉండి కూపన్లు పొందినవారిని ఏరి వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. - కొండల్రావు, డీఎస్ఓ -
హామేరీకోమ్స్
పేదరికం ఎదురు నిలిచినా... కుటుంబం బాధ్యతలు మోపినా... సంకల్పమే ఆమెకు బలం. పట్టుదలే ప్రోత్సాహం. లక్ష్యం ఉండాలే గానీ... ఏవీ అడ్డంకులు కాదన్నది ఆమె నమ్మిన సిద్ధాంతం. కృషే పెట్టుబడిగా... సవాళ్లే నిచ్చెనగా చేసుకొని ఎదిగిన వుట్టిలో మాణిక్యం.. బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్. పవర్ పంచ్‌లతో రింగ్‌లో ప్రత్యర్థులను వుట్టికరిపిస్తున్న ఈ వుణిపూర్ వుణిపూస స్ఫూర్తితో వున సిటీలోనూ పుట్టుకొస్తున్నారు మేరీకోమ్‌లు. కృష్ణప్రియ, ధ్రువిక, ప్రవల్లిక, ఒసామా, సునీత, నసీరున్, తన్మయ్ యాదవ్... ఒకరా ఇద్దరా... మెరుపు పంచ్‌లు విసురుతూ అకుంఠిత దీక్షతో ‘టార్గెట్’ వైపు దూసుకుపోతున్నారు ఎందరో బాలికలు. కృష్ణప్రియ. నిరుపేద కుటుంబం. నాన్న జ్ఞానేశ్వర్ ఫుట్‌పాత్‌పై హెల్మెట్స్ అమ్ముతుంటాడు. ప్యారడైజ్ నల్లగుట్ట గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. పీఈటీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జింఖానా గ్రౌండ్లో రెండేళ్ల నుంచి బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. నగ్మా రెడ్‌హిల్స్‌లోని ఇండో గ్రామర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. తండ్రి షేక్ ముక్తా నాంపల్లిలో మెకానిక్. ఆమె గతేడాది అసోంలో జరిగిన నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చూపింది. జిల్లాస్థాయి టోర్నీల్లోనూ పలు పతకాలను సాధించింది. ఆ నలుగురు... బి.కృష్ణవేణి, మౌనిక, నవ్య, రోజా సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. పీఈటీలు హరిశ్చంద్రప్రసాద్, శ్రీనివాస్మూర్తిల పర్యవేక్షణలో బాక్సింగ్‌లో రాటుదేలుతున్నారు. గతేడాదిలో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో గోల్డ్‌మెడల్స్ దక్కించుకున్నారు. కృష్ణవేణికి అమ్మ లే దు. నాన్న గాంధీ వాచ్‌మన్. మౌనిక నాన్న నాగేశ్వర్రావు చిరు వ్యాపారి. నవ్య తండ్రి యాదగిరి రిక్షాపుల్లర్. రోజా ఫ్యామిలీదీ రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి హనుమంతు, తల్లి కమలమ్మ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు. వీరందరూ కడుపుకట్టుకొని కన్నబిడ్డల కలలు నెరవేర్చేందుకు కష్టపడుతున్నారు. ఈ అమ్మాయిలందరిదీ ఒకేమాట.. ‘లక్ష్యాన్ని చేరుకునేదాకా పిడిగుద్దుల వర్షం కురిపిస్తాం.’ శిక్షణ ఇలా... ఎల్బీ స్టేడియం, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో బాక్సింగ్‌లో శాప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ‘పే అండ్ ప్లే’ పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. నిజాం కాలేజీలోని శిక్షణ కేంద్రానికి ఉస్మానియా వర్సిటీ నిధులు సమకూరుస్తోంది. ఎల్బీ స్టేడియం కోచ్ ఓంకార్ యాదవ్ -99851 55357, జింఖానా మైదానం కోచ్ శ్రీకాంత్‌రెడ్డి -94920 35789, నిజాం కళాశాల కోచ్ కేఆర్ స్టీవన్ -92465 38129. ఎల్బీ స్టేడియం కేంద్రంలో ప్రవేశానికి కనీసం 11 ఏళ్లు నిండి ఉండాలి. 14 ఏళ్లలోపు వారు రూ.35, 14 ఏళ్లు పైబడినవారు రూ.70 ప్రవేశ రుసుం చెల్లించాలి. నెల ఫీజూ అంతే మొత్తం. జింఖానాగ్రౌండ్‌లో ప్రవేశానికి 14 ఏళ్ల లోపు బాలలు రూ.70, ఆ వయసు పైబడినవారు రూ.110 ప్రవేశ రుసుం చెల్లించాలి. 14 ఏళ్లలోపు వారు రూ.30, 14 ఏళ్లు పైబడినవారు రూ.50 ప్రతినెలా ఫీజు చెల్లించాలి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నారు. మెళకువలపై పట్టు ముఖ్యం... పదిహేనేళ్లుగా బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నా. మెలకువల్లో పట్టు సాధిస్తే బాక్సింగ్‌లో రాణించడం తేలికే. మా కేంద్రంలో బాక్సర్లకు కావలసిన సామగ్రి అంతా అందుబాటులో ఉంది. - ఓంకార్ యాదవ్, శాప్ బాక్సింగ్ కోచ్, ఎల్బీ స్టేడియం జీహెచ్ఎంసీ శిక్షణ కేంద్రాలు.. కోచ్‌లు రీహ ంపురా ప్లే గ్రౌండ్- పురానాపూల్-అనిల్ కుమార్-99081 99383 కులీకుతుబ్ షా-మోహన్‌దాస్ మఠ్ పురానాపూల్-బహుదూర్ సింగ్-8801093421 సలర్-ఈ-మిల్లార్ చందూలాల్ బరాదరి- బహుదూర్‌పురా ఇస్మాయిల్ 9885963502 ఫలక్‌నుమా ప్లే గ్రౌండ్ అబిద్ ముస్తఫా-9652924694 విక్టరీ ప్లే గ్రౌండ్-చాదర్‌ఘాట్ దుర్గాప్రసాద్-98666 72227 జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్- షెనాయ్ నర్సింగ్ హోం-మారేడ్ పల్లి కె.కృష్ణ -9290218047 గురుమూర్తి స్విమ్మింగ్ పూల్ పరేడ్ గ్రౌండ్స్ (అశోక్ కుమార్) - వాంకె శ్రీనివాస్ -
పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు
కర్నూలులో స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేయలేదు. దీంతో చాలా సమస్యలొచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విద్వేషాలు పెంచుకోవడం తెలుగు జాతికి మంచిది కాదు. హైదరాబాద్ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తాం.. ఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తాం మెగా సిటీలుగా విశాఖ, తిరుపతి, విజయవాడ.. జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలు రాష్ట్రంలో 14 విమానాశ్రయాలు, 14 పోర్టుల అభివృద్ధి అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాల అమలు ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా ఆరోగ్యశ్రీ.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీరు వచ్చే నెల నుంచి ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్‌కార్డులు.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఆర్బీఐ అడ్డంకులు సృష్టించినా రుణాలు మాఫీ చేస్తాం ఒక్కో సంఘానికి రూ. లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీ.. ఎస్సీ, ఎస్టీల ఇతర రుణాలూ మాఫీ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పేదరిక నిర్మూలనే లక్ష్యమని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దిన తొలి వేడుకలను శుక్రవారం కర్నూలులోని ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దళాల (కంటింజెంట్ల) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఉత్సవాల్లో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, సి.ఎం.రమేష్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్య, బీసీ జనార్థన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు శిల్పామోహన్‌రెడ్డి, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ పాల్గొనలేదు. సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సీఎంతోపాటు వేదిక మీద ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాజధానిని రాష్ట్రానికి మధ్యలోనే ఏర్పాటు చేసినా, స్వాతంత్య్ర వేడుకలను ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాం జిల్లాకొక పర్యాటక ప్రాజెక్టు రూపొందిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తాం విశాఖ, తిరుపతి, విజయవాడలను మిగతా 2వ పేజీలో ఠ మెగాసిటీలుగా, జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం - 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు అభివృద్ధి చేస్తాం. తద్వారా మన రాష్ట్రం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు, దిగుమతులు చేయొచ్చు - అన్ని గ్రామాలకు రోడ్లు, అన్ని ఇళ్లకు కేబుల్, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చూస్తాం. పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ ఇస్తాం - రాష్ట్రాన్ని సిలికాన్ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తాం. ప్రపంచంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. జిల్లాకొక హైదరాబాద్, సైబరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం - రాజధాని పేరతో 13 జిల్లాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది - అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం - ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా మారుస్తాం. చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచుతాం - ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీటిని సరఫరా చేస్తాం - వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను 7 గంటల విద్యుత్ 9 గంటలకు పెంచుతాం. అక్టోబర్ 2 నుంచి ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత సరఫరాను అమలు చేస్తాం - అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం - వృద్ధాప్య పింఛన్లను రూ. 1,000కు, వికలాంగుల పింఛన్లను రూ. 1,500కు పెంచి అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తాం. ఎన్టీఆర్ కేంటీన్లు కూడా అదే రోజున ప్రారంభిస్తాం. ఈ పథకం కింద రూ. 5కే భోజనం అందిస్తాం. తొలుత మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత మిగతా జిల్లాలకు విస్తరిస్తాం - ధరలను నియంత్రిస్తాం. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశాం - ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం ద్వారా పేదలకు చౌకగా నిత్యావసర సరకులు అందిస్తాం. ధరలు పెరిగితే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని తగ్గించడానికి చర్యలు చేపడుతుంది - ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్ కార్డులు ఇస్తాం. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ధారించాం. వచ్చే నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది - రైతుల రుణాలు ఒక్కో కుటుంబానికి రూ. 1.5 లక్షల వరకు మాఫీ చేస్తాం. ఆర్బీఐ అడ్డంకలు సృష్టించినా రుణ మాఫీపై వెనక్కి తగ్గం. డ్వాక్రా రుణాలు సంఘానికి రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తాం. ఎస్సీ, ఎస్టీలు తీసుకున్న ఇతర రుణాలనూ మాఫీ చేస్తాం. - ప్రతి ఇంట్లో కనీసం ఒక డ్వాక్రా గ్రూపు సభ్యురాలు ఉండేలా చర్యలు చేపడతాం. ఇసుక మైనింగ్‌ను డ్వాక్రా సంఘాలకే ఇవ్వనున్నాం - పింఛన్లు, రేషన్, స్కాలర్షిప్లు, పక్కా ఇళ్లతోపాటు అన్ని సంక్షేమ పథకాలూ ఆన్లైన్లోనే అమలుచేస్తాం. ఆధార్ ఎన్రోల్మెంట్ కూడా రాష్ట్రంలో దాదాపు నూరు శాతం పూర్తయింది - పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం. ఒక కుటుంబం ఆనందంగా జీవించడానికి అనుకూలంగా పక్కా ఇంటిని మెరుగుపరుస్తాం - వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంవల్ల కూలీల ఖర్చు తగ్గిస్తాం. భూసార పరీక్షలు చేసి, వ్యవసాయ దిగుబడులు భారీగా పెరిగేలా చర్యలు చేపడతాం - పోలవరం ప్రాజెక్టును నాలుగైదు సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాష్ట్రంలో కరువు లేకుండా చేయవచ్చు - రాయలసీమను విత్తన రాజధానిగా, పరిశ్రమల హబ్‌గా మారుస్తాం. సీమలో జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించి సమీపంలోని ఓడరేవులతో అనుసంధానం చేసి 4 జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. కర్నూలు - ప్యాపిలి - పోరుమామిళ్ల - కృష్ణపట్నం, కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య 6 లేన్ల రోడ్లు నిర్మిస్తాం - పరిశ్రమలు, పెట్టుబడులే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలను అందిస్తుంది - పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సవరించి మరింత మెరుగ్గా అమలు చేస్తాం. - త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం - బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ అమలు చేస్తాం. కాపులు, బలిజలను బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలనూ ఆదుకుంటాం - శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడం. అరాచక శక్తులను, శాండ్, లాండ్, మైన్, వైన్ మాఫియాలను అణచివేస్తాం. బెల్టు షాపుల నిర్మూలనకు చర్యలు చేపట్టాం. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం - సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారి మీద పెట్టిన కేసులు దశలవారీగా ఎత్తేస్తాం - రూ. 15 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. కొత్త రాష్ట్రంలో పునాదుల నుంచి నిర్మాణం మొదలుపెట్టాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అంతకు మించిన వనరులూ ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. అన్ని వనరులు, అవకాశాలను వాడుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దా. ఇందులో ప్రజల సహకారం చాలా అవసరం. మీ అండదండలు నాకు ఇవ్వండి - దేశ విదేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులూ (ఎన్నారైలు) మాతృభూమికి రండి. ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా రాష్టాన్ని నిర్మించుకుందాం -
గ్రామీణావృద్ధితోనే పేదరిక నిర్మూలన
హైదరాబాద్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించనుందని ఇంట ర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ (ఐఫాడ్) అధ్యక్షుడు కినాయో ఎఫ్.నువాన్జే తెలిపారు. ఇక్కడి ఇక్రిశాట్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత, పౌష్టికాహారంతోపాటు వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఐరాస వచ్చే ఏడాది సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుందన్నారు. అందులో 17 ముఖ్యాంశాల్ని గుర్తించగా, గ్రామీణ ప్రాంతాల్లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేయనున్నట్టు వివరించారు. ‘మిలీనియం డెవలప్మెంట్ గోల్స్’కు పొడిగింపుగా ఈ కొత్త లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీలో సెక్రటరీ జనరల్ దీనిపై ఒక ప్రకటన చేయనున్నారన్నారు. ఐరాస నేతృత్వంలోని ఐఫాడ్ వ్య వసాయాభివృద్ధి, గ్రామాల్లో పేదరిక నిర్మూలన పథకాలకు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. -
సహకార స్ఫూర్తితో ప్రతిఘటించాలి
మహాసభలో ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ వరంగల్ : బహుళజాతి సంస్థల ఆధిపత్యాన్ని సహకార స్ఫూర్తితో సంఘటిత ఉద్యమం ద్వారా ప్రతిఘటించాలని ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపు నిచ్చారు. హన్మకొండలోని నందనాగార్డెన్ (సుందరయ్య నగర్)లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పాటూరి రామయ్య అధ్యక్షతన గురువారం జాతీయ 8వ మహాసభలు జరిగాయి. పట్నాయక్ ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలో బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోవడం వల్ల ఆకలి, పేదరికం, దారిద్య్రం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు. జాతీయ ఆర్థిక రంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. వ్యవసాయ కార్మికుల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాల, భూ పంపిణీ చేపట్టాలనే డిమాండ్ ప్రధానమైనదిగా పేర్కొన్నారు. భూస్వాముల వద్ద ఉన్న సాగు చేయని భూములను పంచి చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సబ్సిడీలు, అప్పులు ఇచ్చేలా.. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. ఆహార భద్రత, పనిహక్కు, సరైన వైద్యం, విద్య, పెన్షన్లు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతగా పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగాలను విస్మరించారు... భూ సంస్కరణల లోపం, కొందరు వ్యక్తుల చేతుల్లో భూమి పరాధీనం కావడంతో వ్యవసాయ రంగ పురోభివృద్ధి నిలిచిపోయిందని ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ముఖ్యంగా మార్కెట్లో ధరల సమస్య, సబ్సిడీల అందజేత, ఆహార ధాన్యాల నిల్వలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషించారు. బ్యాంకుల జాతీయకరణ తర్వాత పాలకులు ప్రాధాన్యత రంగాలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదు దశాబ్దాల కాలంలో వ్యవసాయ ఆర్థికాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. నూతన ఆర్థిక, సరళీకరణ విధానాల ప్రభావం పెరిగిందని, వ్యవసాయరంగానికి సబ్సిడీల తగ్గింపు, విదేశీ మార్కెట్లో పెరిగిన పోటీ, పెట్టుబడి పెరగకపోవడం, మార్కెట్లో ధరల తగ్గుదల వల్ల సంక్షోభం నెలకొందన్నారు. పెరిగిన దారిద్య్రం పేదలు ఆకలితో అల్లాడుతుంటే దేశంలో 82 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ చేయడం సిగ్గుచేటని ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ నిల్వలలను ప్రజలకు పంపిణీ చేయడం వల్ల మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వ విధానాలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, కార్పొరేట్ శక్తుల వల్ల పేదలకు ఆహారం అందించలేకపోతున్నాయని వివరించారు. జాతీయ సర్వే ప్రకారం గ్రామీణ పేదలకు 2,400 కాలరీల ఆహారం నుంచి 2వేలకు పడిపోయిందన్నారు. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న వారి సంఖ్య 1973లో 56.3శాతం ఉంటే... 1983లో 56శాతం... 1993లో 69.5 శాతం... 2009లో 75.5శాతానికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉపాధి’ని దెబ్బతీసే కుట్ర గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు సాగుతున్నాయని ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు 100 రోజుల పనిదినాలు కల్పించాలనే హక్కును హరించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పనిదినాలు కల్పించకుంటే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ పథకానికి బదులు ప్రజాకర్షక పథకాలు చేపడితే కార్పొరేట్ల జేబులు నిండుతాయనేది పాలకుల అసలు ఉద్దేశమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను లోతుగా పరిశీలిస్తే ఈ పథకంపై జరుగుతున్న దాడి తెలుస్తుందన్నారు. బాజిల్త్రీ పేరుతో ఆసియాదేశాల్లో కొనసాగిస్తున్న నిబంధనల వెనుక ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే కుట్ర దాగుందన్నారు. సభలో కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, నాయకులు శ్రీనివాస్, ఏపీ కార్యదర్శి మధు, సంఘం నాయకులు జి.నాగయ్య, వెంకట్, మురళీకృష్ణ, చుక్కయ్య, మెట్టు శ్రీనివాస్, రంగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఉదారవాద విధానాలతో తీవ్ర నష్టం
* ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ * హన్మకొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు వరంగల్: దేశంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం మితిమీరి...ఆకలి, పేదరికం, దారిద్య్రం పెరుగుతున్నాయని ప్రముఖ ఆర్థిక వేత్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సరళీకరణ విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకొని రైతులు, కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండలో గురువారం ప్రారంభమైన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజా ఉద్యమాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నీరుగార్చేందుకు చేస్తున్న కుట్రలను నిలదీయాలన్నారు. కా గా, హన్మకొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల ప్రారం భం సందర్భంగా సంఘం జెండాను జాతీయశాఖ అధ్యక్షుడు పాటూరు రామయ్య ఆవిష్కరించారు. మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ జి.నాగయ్య స్వాగత ఉపన్యాసం, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సభల్లో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు తదితరులు పాల్గొన్నారు. 29 రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యూరు. మరో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయి. -
నిరుపేద గిరిజనం
పేదరికం గుప్పెట్లో మన్యం ప్రయోగాల పేరుతో నిధులు వృథా ఐటీడీఏకు 38 ఏళ్లు వ్యయం వేలకోట్లు అయినా బాగుపడని ఆదివాసీ బతుకులు విశాఖ ఏజెన్సీలో అభివృద్ధి జాడలు కానరావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఏర్పడి 38 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ మారుమూల గూడేల్లోని వారి జీవనంలో మార్పు కానరాదు. రోడ్లు, రక్షిత తాగునీరు, విద్య, వైద్య వంటి మౌలిక వసతులకు దూరంగానే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన ‘పేదరిక సూచిక’దీనికి అద్దం పడుతోంది. రాష్ట్రంలోని116 మండలాల వివరాలు ప్రకటించగా, వాటిలో జిల్లాలోని పెదబయలు మండలం అత్యంత వెనుకబడి ఉండడం విశేషం. తర్వాత స్థానాల్లో జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాలు ఉన్నాయి. ఇది మన్యంలోని దుస్థితికి తార్కాణంగా నిలుస్తోంది. పాడేరు: ఏజెన్సీ11 మండలాలు పరిధిలోని 3,574 గిరిజన గ్రామాలతోపాటు, సబ్ ప్లాన్ మండలాల్లోని గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ 1975లో ఏర్పడింది. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం రూ. వందల కోట్లు కేటాయిస్తున్నాయి. నాబార్డు, ప్రపంచబ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు కూడా గిరిజనుల కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాల అమలుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. కానీ సంపూర్ణ గిరిజనాభివృద్ధి కలగానే మారింది. ఐటీడీఏకు పీవోలుగా వస్తున్న అధికారులు గిరిజనాభివృద్ధికి ప్రయోగాలతో నిధులను వృథా చేయడం తప్పా ఎలాంటి ప్రగతిని సాధించ లేకపోతున్నారు. తొమ్మిదేళ్లుగా ఐటీడీఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు తగ్గింది. అంతకు ముందు ఐఫాడ్ తదితర నిధులు పుష్కలంగా ఉండేవి. ఏ పీవో ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారో కూడా అంచనా వేయడానికి కూడా వీలుండేది కాదు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర ముఖ్యమైన కార్యక్రమాలకు ఇప్పటికి సుమారు రూ. వెయ్యి కోట్లకు పైనే ఖర్చు పెట్టారు. కానీ ఈ రంగాల్లో ప్రగతి కానరాలేదు. సుమారు 1500 గ్రామాల గిరిజనులకు సురక్షిత తాగునీరు కరువైంది. గిరిజనులు తరచూ రోగాల బారిన పడేందుకు కలుషిత నీరే కారణమని అధికారులకు తెలిసినా సమస్య పరిష్కారం కావడం లేదు. మారుమూల ప్రాంతాల రోడ్లు ఇప్పటికి అభివృద్ధికి నోచుకోలేదు. కాలినడకతోనే తెల్లారుతున్న దుస్థితి నెలకొంది. వ్యవసాయరంగానికి రూ. వందల కోట్లు ఖర్చు పెట్టినా వర్షం పడితేనే పంటలు దక్కే పరిస్థితి. సాగునీటి రంగం కూడా అభివృద్ధి చెందలేదు. విద్య, వైద్యరంగాల్లో కూడా నిర్లక్ష్యం కొట్టొస్తోంది. ఇప్పటికి ఐటీడీఏకు వి.వినయ్‌చంద్‌తో కలిసి మొత్తం 49 మంది ప్రాజెక్టు అధికారులు పని చేశారు. కానీ సంపూర్ణ గిరిజనాభివృద్ధి కానరాలేదు. -
పేదరికంపై పవర్ పంచ్
లక్ష్యం వారి కుటుంబాల నేపథ్యం సాధారణం.. అమ్మానాన్నలది కాయకష్టం.. కుటుంబ పోషణ కూడా వారికి కనాకష్టం... అయినా ఆ ఇద్దరమ్మాయిలు కష్టాలనే ఇష్టాలుగా మలుచుకుని పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే బీజం పడ్డ వారి ఉన్నత లక్ష్యాన్ని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా తమకు చేతనైనంతగా ప్రోత్సాహం అందించారు అమ్మానాన్నలు. పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందేందుకు నడుంకట్టిన ఈ అమ్మాయిలు ఎనిమిదేళ్లుగా కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆ అమ్మాయిలే మంగళగిరికి చెందిన నగీనా, సలోమీలు. స్నేహితులైన ఈ ఇద్దరూ పవర్ లిఫ్టింగ్వైపు ఎలా అడుగులు వేశారంటే... నగీనా తండ్రి సుభాని మెకానిక్. అమ్మ అమీరున్నీసా గృహిణి. ముగ్గురు ఆడపిల్లల్లో రెండో అమ్మాయి నగీనా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నగీనాకు పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి ఎలా కలిగిందో ఆమె మాటల్లోనే... సీకే గరల్స్ హైస్కూల్లో నా సీనియర్ మట్టుకొయ్య సలోమి, మరికొందరు... అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ పొందుతున్నారు. వారిని చూసి నాకు కూడా వెళ్లాలనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెప్పా! అమ్మ ప్రోత్సహించడంతో ఎనిమిదో తరగతి (2006)లో ఉండగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యలో కొన్నాళ్లు మానుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో బీకాం (2010-13) చదువుతూ శిక్షణను కొనసాగించాను. ఏమి సాధించిందంటే... కృష్ణా యూనివర్సిటీ తరపున గుడివాడలో, విజయవాడ లయోల కళాశాలలో జరిగిన అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల కేటగిరీలో స్వర్ణపతకం, వర్సిటీ స్ట్రాంగ్ ఉమెన్ అవార్డు; గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర్ కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్‌మెడల్; సౌత్ ఇండియా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సీనియర్స్ విభాగం 63 కేజీల కేటగిరీలో గోల్డ్‌మెడల్. ఇక మట్టుకొయ్య సలోమీది మంగళగిరి మండలం మక్కెవారిపేట. తండ్రి చిన్నవెంకయ్య రాడ్ బెడ్డింగ్ పనిచేస్తారు. అమ్మ వరదానం గృహిణి. ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలోనే ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న సలోమి సీకే గరల్స్ హైస్కూల్లో చదివేటప్పుడు పీఈటీ ప్రోత్సాహంతో కోచ్ సందాని వద్ద చేరింది. అక్కడ తీసుకున్న శిక్షణతో 2008లో మిజోరాంలో జరిగిన జాతీయస్థాయి గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పవర్ లిఫ్టింగ్‌పై ఆసక్తి కలగడంతో ఆ దిశగా సాధన చేస్తోంది. సలోమీ ఏమి సాధించిందంటే... ఏఎన్‌యూ అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లలో 72 కేజీల కేటగిరీలో మూడేళ్లు వరుసగా బంగారు పతకాలు; సౌత్ ఇండియా స్థాయిలో కోయంబత్తూరు (2011)లో జరిగిన పవర్ లిఫ్టింగ్ టోర్నీలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్, హైదరాబాద్ (2012), కేరళ రాష్ట్రం (2013)లలో జరిగిన టోర్నమెంట్స్‌లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్, సీనియర్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్. గత జనవరిలో నిమ్రా కాలేజ్‌లో జరిగిన జేఎన్టీయూకే పరిధిలోని అంతర కళాశాలల పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో గోల్డ్‌మెడల్. ఇటువంటి మట్టిలో మాణిక్యాలు రాష్ర్టంలో మరెందరో ఉన్నారు. వీరికి ప్రభుత్వ ప్రోత్సాహం, పెద్దల సహాయసహకారాలు లభిస్తే, ఎన్నో సంచలనాలు సృష్టించి, రాష్ట్రానికి వన్నె తెస్తారనడంలో సందేహం లేదు. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు - ఫొటో: నందం బుజ్జి, మంగళగిరి -
పేదల అభ్యున్నతికి రూ. 450 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా బాగా వెనుకబడిన కుటుంబాలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకుని రావడానికి వీలుగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ‘తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ది పథకం’(టీఆర్జీఐపీ) అమలు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తెలంగాణలోని 150 మండలాల్లో అతి నిరుపేదలకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.నిరక్ష్యరాస్యత, శిశు మరణాలు అరికట్టడం, బాలింతల మరణాలు, అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం వంటి కార్యక్రమాలు ఈ పథకంతో చేపడతారు. ఎస్సీ, ఎస్టీ రైతులు ఆధునిక వ్యవసాయం చేసే విధంగా వారికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయించారు. -
జనం పెరిగితే రణమే
విజయనగరం ఆరోగ్యం: ఆకలి బాధలు, దొంగతనాలు, దోపిడీలు, నిరుద్యోగ సమస్య, ఆరోగ్య ఇబ్బందులు, పేదరికం, నివాస సమస్య..మంద ఎక్కువైతే మజ్జిగ పలచనైందన్న చందాన జనాభా పెరిగితే ఏర్పడే ఇబ్బందులు ఇవి. కుటుంబమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే అది జనాభాపైనే అధారపడి ఉంటుంది. శు క్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజల్లో జనాభా నియంత్రణపై అవగాహన పెరిగినప్పటికీ అది ఇంకా సరిపోనట్టు గోచరిస్తోంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానం భారతదేశానిది. ప్రస్తుత భారత దేశజనాభా 128 కోట్లుకాగా ఆంధ్రప్రదేశ్ జనాభా4.5 కోట్లు ఉంది. జిల్లా జనాభా ప్రస్తుతం 23,68,219. ఇందులో పురుషులు 11,62,136 కాగాస్త్రీలు 12,06,083మంది. ఆరు ఏళ్ల లోపు బాలురు 1,23,311కాగా బాలికలు 1,18,357 మంది . 4954 మంది. జనాభా ఇలా పెరుగుతూ పోతుండడం వల్ల దేశంలో చాలామంది మూడు పూటలా కడుపు నిండా తినడానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అన్నింటి కంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఒక ఉద్యోగం సాధించడానికి వందలాది మంది పోటీ పడుతున్నారు. జనాభా ఎక్కువగా ఉండడం వల్ల దేశంలోనూ, జిల్లాలోనూ ప్రజలకు తాగడానికి నీరు కూడా పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల నీటి యుద్ధాలు కూడా తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 1987లో తీవ్రమైన ఆహార కొరత, అంటువ్యాధులు, నిరుద్యోగం పెరిగిపోవడంతో జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో ఆ ఏడాది జూలై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనాభా పెరుగుదల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జనాభా తక్కువగా ఉంటే.. జనాభా తక్కువైతే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మంచి ఆహారం దొరుకుతుంది. మంచి ఇళ్లు కట్టుకోగలరు. ఉద్యోగం అందరికీ దొరుకుతుంది. పేదరికం తగ్గి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అవగాహన చేపడుతున్నాం జనాభా నియంత్రణకోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఆడపిల్ల 21 సంవత్సరాలు, పురుషుడు 25 సంవత్సరాలకు వివాహం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా బిడ్డకు, బిడ్డకు మధ్య కనీసం ఐదు సంవత్సరాలు ఎడం పాటించేలా కుటుంబ సంక్షేమ తాత్కాలిక పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తున్నాం. బడిలో బిడ్డ ఒడిలో బిడ్డ అనే నినాదంతో పనిచేస్తున్నాం. ప్రతి ఏడాదీ కళాశాలల్లోనూ సీహెచ్‌సీ స్థాయిల్లో జనాభా పెరుగు దల వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తున్నాం. యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ