భారత్‌లో పేదరికం తగ్గుతోంది: నీతి అయోగ్‌ రిపోర్ట్‌! | India Poverty Level Below 5 Percent Claims Niti Aayog CEO | Sakshi
Sakshi News home page

భారత్‌లో 5% మేర పేదరికం తగ్గుతోంది: నీతి అయోగ్‌ రిపోర్ట్‌

Published Mon, Feb 26 2024 11:36 AM | Last Updated on Mon, Feb 26 2024 12:13 PM

India Poverty Level Below 5 Percent Claims Niti Aayog CEO - Sakshi

భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు ఫలవంతమయ్యాయి. భారత్‌లో శుభ పరిణామాం మొదలవుతోందన్న కొత్త ఆశలను అందిచింది నీతి అయోగ్‌ సర్వే. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో పేదరికం ఎంత మేర తగ్గిందో సవివరంగా పేర్కొంది. దీన్ని గృహ వినియోగం సర్వేని ఆధారంగా చేసుకుని అంచనా వేసింది. 

నీతి అయోగ్‌ సర్వే ఏం చెప్పిందంటే..
భారతదేశంలో పేదరికం ఐదు మేర తగ్గిందని నీతి అయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజ గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని దీన్ని అంచనావేసినట్లు తెలిపారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ప్రకారం..గ్రామీణ , పట్టణ ప్రాంతాల రెండింటిలోనూ 2.5 పెరుగుదల కనిపించింది. పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5% మేర పెరిగి రూ. 3,510కి చేరుకుంది.

అయితే గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42% పెరుగుదలలో రూ. 2,008కి చేరుకుంది. ఈ డేటాల ఆధరాంగా దేశంలో పేదరికం 5% లేదా అంతకంటే తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది. ఆహార వ్యయం పరంగా గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50% కంటే తక్కువ ఆహారం కేటాయించినట్లు సర్వే తెలిపింది. అలాగే పట్టణ గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91% నుంచి 2022-23 నాటికి 71% తగ్గిందని సర్వే పేర్కొంది. అయితే ఆహారంలో పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం, పాలు, పండ్ల వినయోగం పెరుగుతోందని వెల్లడించింది. ఈ సర్వే ఒక వైవిధ్యమైన సమతుల్య వినియోగ సూచన ఇచ్చిందిన నీతి అయోగ్‌ సీఈవో బీవీర్‌ సుబ్రహ్మణ్య అన్నారు. 

దేశంలోని పేదరిక నిర్మూలను హైలెట్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పలు పథకాలు పతాక స్థాయిలో విజయవంతమయ్యాయని దీన్ని బట్టి చెప్పొచ్చు. అలాగే ఈ సర్వే ఒకరకంగాపేదరికం, లేమీ వంటివి దాదాపు అదృశ్యమవుతాయని చెబుతోంది. ఇది నిజంగా శుభపరిణామాం కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల తట్టుకుని మరీ ఇలా చక్కటి పురోగతి దిశగా అడుగులు వేయండ విశేషం.  

(చదవండి: బోర్డ్‌ ఎగ్జామ్‌ కూడా రాయలేదు..కానీ ఏకంగా రూ. 41 కోట్లు..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement