భారత్‌లో తగ్గిన పేదరికం | Rural poverty falls faster than Urban says SBI Research | Sakshi
Sakshi News home page

భారత్‌లో తగ్గిన పేదరికం

Published Sat, Jan 4 2025 6:25 AM | Last Updated on Sat, Jan 4 2025 6:25 AM

Rural poverty falls faster than Urban says SBI Research

4 నుంచి 4.5% వరకూ అంచనా 

2023–24లో 4.86 శాతంగా గ్రామీణ పేదరికం

2011–12 ఈ రేటు ఏకంగా 25.7%

ఇదే కాలంలో పట్టణ పేదరికం13.7 శాతం నుచి 4.09 శాతానికి డౌన్‌ 

ఎస్‌బీఐ రీసెర్చ్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: భారత్‌లో గ్రామీణ, పట్టణ పేదరికం గణనీయంగా పడిపోయినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. 2011–12 ఆర్థిక సంవత్సరంలో 25.7 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం 2023–24లో 4.86 శాతానికి దిగివచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇక ఇదే సమయంలో పట్టణ పేదరికం కూడా 13.7 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. 

వార్షికంగా చూస్తే, 2022–23లో 7.2 శాతంగా గ్రామీణ పేదరికం ఉంటే, పట్టణ పేదరికం 4.6 శాతంగా ఉంది. అంటే వార్షికంగా గ్రామీణ పేదరికం తగ్గితే (7.2 శాతం నుంచి 4.86 శాతానికి), పట్టణ పేదరికం స్వల్పంగా (4.06 శాతం నుంచి 4.09 శాతం) పెరిగింది. ఇక భారత్‌లో  పేదరికం రేట్లు ఇప్పుడు 4–4.5 శాతం పరిధిలో ఉండవచ్చని సర్వే భావించింది.  

ప్రభుత్వ కార్యక్రమాల దన్ను 
పేదరికం తగ్గడానికి ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. నేరుగా లబ్ధిదారులకు నిధుల బదిలీ (డీబీటీ), గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలను ఆ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది. వినియోగం, వ్యయాలపై ఎస్‌బీఐ సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 
→ ప్రభుత్వ పథకాల మద్దతుతో దిగువ ఆదాయ వర్గాల వ్యయాల్లో 5% వరకూ పెరుగుదల కనిపించింది.  
→ ఆహార ధరల స్థిరత్వం వల్ల ఖర్చులు తగ్గాయి. 
→ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో గ్రామీణ–పట్టణ ఆదాయ వ్యత్యాసాలు తగ్గాయి. 2023 ఆగస్టు–2024 జూలై మధ్య గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.  
→ ఎక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రాలు జాతీయ సగటు (31%) కంటే అధిక పొదులపు రేటును నమెదుచేసుకున్నాయి.  
→ ఉత్తర ప్రదేశ్, బీహార్‌ వంటి రాష్ట్రాలలో తక్కువ సేవింగ్స్‌ రేటు కనిపించింది. అధిక సంఖ్యలో ఆ రాష్ట్రాల నుంచి వలసలు దీనికి కారణం కావచ్చు.  
→ పట్టణ పేదరికం మరింత తగ్గుతుందని  విశ్వసిస్తున్నాము.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement