
సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన సమయంలో.. అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' యాపిల్ సహా కంపెనీలు తమ ఉత్పత్తులను దేశంలో తయారు చేయాలని కోరుకున్నారు. కానీ నిపుణులు, పరిశ్రమ నాయకులు అమెరికాలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల తయారీ సాధ్యం కాదని చెప్పారు.
టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ 'టిమ్ కుక్' చైనాను తమ ఉత్పత్తులను తయారు చేయడానికి ఎందుకు ఎంచుకుంటారనే దానిపై 2024లో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఒక నిమిషం కంటే తక్కువ నిడివి కలిగిన వీడియోలో టిమ్ కుక్.. చైనాలో కార్మికులు తక్కువ ధరకే లభిస్తారు. కార్మిక వ్యయాలు తక్కువగా ఉండటం వల్లనే.. దిగ్గజ కంపెనీలన్నీ చైనాలో ఉత్పత్తులు చేయడానికి ఆసక్తి చూపుతాయి. అంతే కాకుండా నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య కూడా చైనాలో చాల ఎక్కువగా ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
అమెరికాలో ఉన్న టూలింగ్ ఇంజనీర్లను మొత్తం సమావేశపరిచిన.. ఒక గది నిండదు. అదే చైనాలో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు ఒక పెద్ద ఫుట్‌బాల్ గ్రౌండ్ నిండేంతకంటే ఎక్కువ ఉన్నారని టిమ్ కుక్ వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారు.
Tim Cook breaks down why Apple builds in China and why the U.S. isn’t ready to replace it yet.
pic.twitter.com/OiEpyIEZlN— Nigel D'Souza (@Nigel__DSouza) April 11, 2025