Apple iphone Ban: అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐఫోన్‌ల వాడకంపై నిషేధాన్ని మూడు చైనా మంత్రిత్వ శాఖలతోపాటు, ప్రభుత్వ మద్దతు ఏజెన్సీలు, కంపెనీలకు విస్తరించాలని చైనా యోచిస్తోందన్న నివేదికల నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఏకంగా రెండు రోజుల్లో షేరు సుమారు 6 శాతం నష్టపోయాయి. షేరు ధర సుమారు 175డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ సుమారు 200 బిలియన్ డాలర్లు కోల్పోయింది, గురువారం షేర్లు 2.9 శాతం కుప్పకూలాయి.ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పతనాన్ని నమోదు చేసింది. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్)
యాపిల్ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద విదేశీ మార్కెట్. గత ఏడాది కంపెనీ మొత్తం ఆదాయంలో ఐదో వంతు చైనానుంచే. ప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఐఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని తాజాగా మరిన్ని శాఖలకు విస్తరించాలనే, చైనా తాజా నిర్ణయం యాపిల్ మరింత నష్టం తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్తపై చైనా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి, యూజర్ల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా ఐఫోన్ వాడకంపై నిషేధం విధించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెల కొన్నాయి.
2 కోట్ల ఐఫోన్ అమ్మకాలు ప్రమాదం
చైనాలో బ్యాన్, ప్రత్యర్థి హువావే లాంచింగ్స్‌తో కారణంగా యాపిల్ ఏకంగా 20 మిలియన్ల ఐఫోన్ల్‌అమ్మకాలు ప్రమాదంలోఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, చైనీస్ ప్రభుత్వ ఉద్యోగులు పని కోసం ఐఫోన్‌లను ఉపయోగించకుండా నిరోధించినట్లయితే యాపిల్ 5 నుండి కోటి ఐఫోన్లు ప్రమాదంలో పడతాయి. కార్యాలయానికి ఐఫోన్లను తీసుకురావడంపై కూడా చైనా నిషేధాన్ని అమలు చేస్తే ఆ సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు , Oppenheimer విశ్లేషకులు యాపిల్ ప్రత్యర్థి Huawei పోటీ కారణంగా మరోకోటి ఐఫోన్ల ఆర్డర్‌లను కోల్పోయిట్టు అంచనా.
హువావే జోరు
అతిత్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ కానున్న తరుణంలో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు Huawei టెక్నాలజీస్ అధునాతన చిప్‌తో Mate 60 స్మార్ట్‌ఫోన్ కొత్త వెర్షన్ ప్రీసేల్స్‌ను ప్రారంభించింది. అటు ఐఫోన్‌ల వినియోగంపై అధికారుల నియంత్రణలను చైనా మరింత పెంచే అవకాశం ఉందిన తైపీ మెగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెన్ హువాంగ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment