Tim Cook
-
యాపిల్ తయారీ ప్లాంట్ అమెరికాకు తరలింపు
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మెక్సికోలోని సంస్థ తయారీ యూనిట్‌ను అమెరికాకు తరలించే యోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కుక్ మెక్సికోలో రెండు ప్లాంట్లను నిలిపివేశారని, దానికి బదులుగా అమెరికాలో ఉత్పత్తులను తయారు చేస్తారని అమెరికా గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. పెరుగుతున్న టారిఫ్ ఒత్తిళ్లు, కొనసాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి ప్రతిస్పందనగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల టిమ్ కుక్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. కానీ గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్‌కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రంప్ కుక్‌తో సమావేశమైన మరుసటి రోజే యూఎస్‌కు తయారీ ప్లాంట్ తరలింపు ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది.అమెరికాలో పెట్టుబడులు..అమెరికాలో వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని కుక్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఈ పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుందని, యూఎస్ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తిని పునరుద్ధరించడం, బాహ్య ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కీలక పరిశ్రమలను రక్షించవచ్చని చెప్పారు. కంపెనీలు తీసుకునే నిర్ణయాలు తన పరిపాలన విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్‌కు రూ.18 లక్షలు చెల్లింపుయాపిల్పై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి యాపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది సంస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించడం ద్వారా దిగుమతి సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇది లాభాల మార్జిన్లు, ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యూహాత్మక మార్పు ఉద్యోగాల కల్పనతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. -
ట్రంప్‌ను కలిసిన యాపిల్ సీఈఓ
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది.వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని చైనా దిగుమతులపై 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చైనాలో ఉత్పత్తి అవుతూ అమెరికాలోకి వస్తున్న యాపిల్ ఉత్పత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది కంపెనీ ఉత్పత్తుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ సుంకాల నుంచి యాపిల్ ఉత్పత్తులను రక్షించడం తన ప్రాథమిక లక్ష్యంగా కుక్ భావించారు. దాంతో ట్రంప్‌ను ప్రత్యక్షంగా కలిసి టారిఫ్ మినహాయింపులు కోరినట్లు తెలిసింది. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్‌కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.గోప్యతా విధానాలపై చర్చవాణిజ్య సమస్యలతో పాటు యాపిల్ గోప్యతా విధానాలపై ట్రంప్, టిమ్కుక్ల మధ్య చర్చ జరిగింది. సమర్థంగా చట్టాలను అమలు చేసేందుకు న్యాయబద్ధమైన సంస్థల కోసం కొన్ని ఐఫోన్లను అన్‌లాక్ చేయాలని ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో కుక్ వినియోగదారుల గోప్యతకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారని సమాచారం.ఇదీ చదవండి: బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధంబలమైన సంబంధంట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనతో బలమైన సంబంధాలను కొనసాగించేందుకు కుక్ కృషి చేస్తున్నారు. యాపిల్ వ్యాపార కార్యకలాపాలపై, సుంకాల ప్రభావాన్ని తగ్గించే మార్గాలపై చర్చించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. -
భారత్‌లో ఐఫోన్ టాప్
న్యూఢిల్లీ: ‘భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్‌పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది’ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ శుక్రవారం తెలిపారు. కౌంటర్‌పాయింట్ రిసర్చ్ ప్రకారం భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో 2024లో విలువ పరంగా 23 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే స్మార్ట్‌ఫోన్స్ సంఖ్య పరంగా టాప్–5గా నిలిచింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో గొప్ప ఫలితాలను సాధించాం. ముఖ్యంగా భారత్‌పై నేను ఆసక్తిగా ఉన్నాను. డిసెంబర్ త్రైమాసికంలో భారత్ రికార్డును నెలకొల్పింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైంది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు రెండవ అతిపెద్ద, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్ పీసీలకు భారత్ మూడవ అతిపెద్దది మార్కెట్. కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్ ఉంది. మరిన్ని యాపిల్ ఔట్లెట్లను ప్రారంభించే యోచనలో ఉన్నాం. యాపిల్ ఇంటెలిజెన్స్‌ను విస్తరిస్తున్నాం. స్థానికీకరించిన ఇంగ్లీష్ వెర్షన్‌ను భారత్‌లో ఏప్రిల్‌లో విడుదల చేస్తాం’ అని టిమ్ కుక్ వివరించారు. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 % వృద్ధితో 124.3 బిలియన్ డాలర్లు నమోదైందని వెల్లడించారు. లాభం 7 శాతం క్షీణించి 33.91 బిలియన్ డాలర్లకు చేరింది. -
భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం 'యాపిల్' (Apple).. సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) జీతాన్ని ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 18 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.వార్షిక వేతనం 18 శాతం పెరగడంతో.. టిమ్ కుక్ వేతనం 74.6 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 643 కోట్లు)కు చేరింది. యాపిల్ సీఈఓ జీతంలో బేసిక్ పే 3 మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, సుమారు 13.5 మిలియన్ డాలర్లు అదనపు పరిహారం వంటివి ఉన్నాయి.కంపెనీ వార్షిక సమావేశం (ఫిబ్రవరి 25) జరగడానికి ముందే యాపిల్ టిమ్ కుక్ జీతం భారీగా పెంచినట్లు ప్రకటించింది. త్వరలో జరగనున్న సంస్థ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కుక్ వేతనం 2023 కంటే ఎక్కువే. అయినప్పటికీ ఈయన 2022లో (100 మిలియన్ డాలర్లు) అందుకున్న వేతనంతో పోలిస్తే చాలా తక్కువే అని సమాచారం.టిమ్ కుక్‌తో పాటు యాపిల్ రిటైల్ చీఫ్, మాజీ సీఎఫ్ఓ, సీఓఓ, జనరల్ కౌన్సిల్ సహా ఇతర యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ 2024లో 27 మిలియన్ డాలర్లకు పైగా వేతనాన్ని పొందనున్నారు. మొత్తం మీద యాపిల్ కంపెనీ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. -
టెక్ సంస్థలకు సారథులు.. ఈ ‘గే’లు! (ఫొటోలు)
-
ఇప్పటివరకు విడుదలైన అన్ని ఐఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
ఐఫోన్ లాంఛ్ ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ కపుల్.. ఫోటోలు
-
ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్'లో గెలిచిన విద్యార్థి డెవలపర్లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్‌ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్‌ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో భాగంగా మైండ్‌బడ్ అనే యాప్‌ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్‌ను రూపొందించినట్లు సమాచారం. మైండ్‌బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్‌లను కలిగి ఉంది.శ్రీవాస్తవ మైండ్‌బడ్‌ని సృష్టించడానికి స్విఫ్ట్‌యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్‌కిట్, ఫైల్‌మేనేజర్‌లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్‌లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.Kicking off #WWDC24 in the best way possible—meeting with student developers who won our Swift Student Challenge. It’s amazing to see their creativity and determination on full display! pic.twitter.com/b56k8kcGZs— Tim Cook (@tim_cook) June 9, 2024 -
ఏటా కొత్త ఐఫోన్ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు?
Why Apple launches new iPhone every year: ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. యాపిల్ (Apple) సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఐఫోన్ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్‌లో జరిగిన యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా వీటిని లాంచ్ చేసింది. కొత్త ఐఫోన్ అమ్మకానికి రాగానే ఆన్‌లైన్‌తోపాటు యాపిల్ స్టోర్లకు కస్టమర్లు క్యూకట్టారు. (iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..) యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను ఎందుకు విడుదల చేస్తుంది.. ఎక్స్చేంజ్ కింద తీసుకున్న పాత ఐఫోన్లను ఏం చేస్తుంది.. అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రశ్నలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ (Tim Cook) స్వయంగా సమాధానాలు చెప్పారు. కొత్త ఐఫోన్ల లాంచ్ గురించి.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్రూట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటా యాపిల్ ఎందుకు కొత్త ఐఫోన్ సిరీస్‌ను తీసుకొస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలని యూజర్లు కోరుకుంటారని, వారికిది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. పాత ఐఫోన్లను ఏం చేస్తామంటే.. అలాగే కొత్త ఐఫోన్ కోసం పాత ఐఫోన్లను ట్రేడ్ చేయడానికి అనుమతించే ఆపిల్ పాలసీ గురించి కూడా టిమ్‌కుక్ మాట్లాడారు. ఈ పాత ఫోన్లను ఏమి చేస్తారో వివరించారు. పనిచేస్తున్న పాత ఐఫోన్లను తిరిగి విక్రయిస్తామని, పని చేయనివాటిని విడదీసి కొత్త ఐఫోన్‌ను తయారు చేయడానికి వాని విడిభాగాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. -
రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది!
యాపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) ఇటీవల తన షేర్లలో భారీ భాగాన్ని విక్రయించి, గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద విక్రయాన్ని నమోదు చేసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనం చూసేద్దాం. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, కుక్ 5,11,000 షేర్లను (శుక్రవారం 2,70,000 షేర్లు, సోమవారం 2,41,000 షేర్లు) విక్రయించి దాదాపు 41.5 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 345 కోట్లు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దాఖలు ప్రకారం, అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 88 మిలియన్ డాలర్లు, మొత్తం టాక్స్ తరువాత అతనికి 41.5 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. 2021 ఆగస్టు తరువాత కుక్ విక్రయించిన అతిపెద్ద ఆపిల్ షేర్లు ఇవే కావడం గమనార్హం. ఇదీ చదవండి: అదే నిజమైతే బిలియనీర్‌కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే? టిమ్ కుక్ తన యాపిల్ షేర్లలో కొన్నింటిని విక్రయించినప్పటికీ, తన వార్షిక ప్రణాళికలో భాగంగా అతను అదే సంఖ్యలో షేర్లను అందుకోవడం వల్ల కంపెనీలో అతని మొత్తం వాటా మారలేదు. ఇప్పటికి కూడా ఇతడు 3.3 మిలియన్ యాపిల్ షేర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం సుమారు 565 మిలియన్ డాలర్లు. -
మనసున్న సీఈవో! ఉద్యోగుల కోసం ఏం చేశాడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఓవైపు లేఆఫ్‌లు.. మరోవైపు తక్కువ జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీల్లో జీతాల పెంపు లేక ఎంప్లాయీస్ అవస్థలు పడుతున్న తరుణంలో ఓ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.. సతీష్ మల్హోత్రా (Satish Malhotra).. అమెరికన్ స్పెషాలిటీ రిటైల్ చైన్ కంపెనీ ‘ది కంటైనర్ స్టోర్’కు సీఈవో (CEO). తమ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు వేతనాల పెంపునకు, ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా 10 శాతం తగ్గించుకున్నారు. సతీష్ 2021 ఫిబ్రవరి నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ చైన్ సెఫోరాలో 20 ఏళ్లు పనిచేశారు. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ఆరు నెలల కాలానికి మల్హోత్రా వార్షిక జీతం 925,000 డాలర్ల (రూ. 7.68 కోట్లు) నుంచి 8,32,500 డాలర్లకు (రూ. 6.9 కోట్లు) తగ్గుతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కాగా గత సంవత్సరం మల్హోత్రా 2.57 మిలియన్ డాలర్ల (రూ. 21.35 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. అయితే ఉద్యోగులకు సగటు పెంపుదల ఎంత ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. కంటైనర్ స్టోర్ దాని ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో 10.1 మిలియన్ డాలర్ల సర్దుబాటు చేసిన నికర నష్టాన్ని నివేదించింది. గూగుల్, యాపిల్ సీఈవోల సరసన.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)తో పాటు ఈ ఏడాది భారీగా వేతనాలు తగ్గించుకున్న సీఈవోల జాబితాలో సతీష్ మల్హోత్రా కూడా చేరారు. ఈ ఏడాది జనవరిలో 12,000 తొలగింపులను ప్రకటించిన 10 రోజుల తర్వాత తనతో సహా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్‌లందరూ తమ వార్షిక బోనస్‌ను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇక యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023 సంవత్సరానికి తన వేతన పరిహారాన్ని 50 శాతం తగ్గించుకున్నారు. -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్‌కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్‌తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్‌ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్‌ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు
Apple iphone Ban: అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. ఐఫోన్ల వాడకంపై నిషేధాన్ని మూడు చైనా మంత్రిత్వ శాఖలతోపాటు, ప్రభుత్వ మద్దతు ఏజెన్సీలు, కంపెనీలకు విస్తరించాలని చైనా యోచిస్తోందన్న నివేదికల నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఏకంగా రెండు రోజుల్లో షేరు సుమారు 6 శాతం నష్టపోయాయి. షేరు ధర సుమారు 175డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ సుమారు 200 బిలియన్ డాలర్లు కోల్పోయింది, గురువారం షేర్లు 2.9 శాతం కుప్పకూలాయి.ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పతనాన్ని నమోదు చేసింది. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) యాపిల్ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద విదేశీ మార్కెట్. గత ఏడాది కంపెనీ మొత్తం ఆదాయంలో ఐదో వంతు చైనానుంచే. ప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఐఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని తాజాగా మరిన్ని శాఖలకు విస్తరించాలనే, చైనా తాజా నిర్ణయం యాపిల్ మరింత నష్టం తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్తపై చైనా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి, యూజర్ల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా ఐఫోన్ వాడకంపై నిషేధం విధించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెల కొన్నాయి. 2 కోట్ల ఐఫోన్ అమ్మకాలు ప్రమాదం చైనాలో బ్యాన్, ప్రత్యర్థి హువావే లాంచింగ్స్‌తో కారణంగా యాపిల్ ఏకంగా 20 మిలియన్ల ఐఫోన్ల్అమ్మకాలు ప్రమాదంలోఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, చైనీస్ ప్రభుత్వ ఉద్యోగులు పని కోసం ఐఫోన్లను ఉపయోగించకుండా నిరోధించినట్లయితే యాపిల్ 5 నుండి కోటి ఐఫోన్లు ప్రమాదంలో పడతాయి. కార్యాలయానికి ఐఫోన్లను తీసుకురావడంపై కూడా చైనా నిషేధాన్ని అమలు చేస్తే ఆ సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు , Oppenheimer విశ్లేషకులు యాపిల్ ప్రత్యర్థి Huawei పోటీ కారణంగా మరోకోటి ఐఫోన్ల ఆర్డర్లను కోల్పోయిట్టు అంచనా. హువావే జోరు అతిత్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ కానున్న తరుణంలో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు Huawei టెక్నాలజీస్ అధునాతన చిప్‌తో Mate 60 స్మార్ట్‌ఫోన్ కొత్త వెర్షన్ ప్రీసేల్స్ను ప్రారంభించింది. అటు ఐఫోన్ల వినియోగంపై అధికారుల నియంత్రణలను చైనా మరింత పెంచే అవకాశం ఉందిన తైపీ మెగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెన్ హువాంగ్ వ్యాఖ్యానించారు. -
టిమ్ కుక్కి చేదు అనుభవం - క్రెడిట్ కార్డుకి అప్లై చేస్తే..
ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువైంది.. సర్వ సాధారణమైపోయింది. నేడు చిన్న జాబ్ చేసే ఉద్యోగి నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల వరకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు సంపాదనను బేస్ చేసుకుని ఈ కార్డులను ప్రొవైడ్ చేస్తాయి. అయితే ప్రముఖ వ్యాపార వేత్తకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్ గోల్డ్‌మన్ సాచ్స్‌తో ఆపిల్ క్రెడిట్ కార్డు అందిస్తుంది. ఇలాంటి క్రెడిట్ కార్డు కోసం ఆపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది. ఆపిల్ అండ్ గోల్డ్‌మన్ సాచ్స్ కలిసి 'ఆపిల్ క్రెడిట్' ఒకే సమయంలో ప్రారంభించాయి. ఆ సమయంలో చాలామంది ప్రముఖులు కూడా దీని కోసం అప్లై చేసుకున్నారు. వారివి కూడా చాలా వరకు రిజెక్ట్ అయ్యాయి. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! టిమ్ కుక్ ధరఖాస్తుని తిరస్కరించడానికి ప్రధాన కారణం అయన పేరుని ఉపయోగించి ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసి ఉండవచ్చనే అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం కుక్ నికర సంపద విలువ 2 మిలియన్ డాలర్లని సమాచారం. -
తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రిటైల్ స్టోర్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తొలి రోజునుంచే అద్భుతమైన అమ్మకాలతో ఐఫోన్ స్టోర్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్టోర్‌గా నిలుస్తోంది. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లోని మొదటి అంతస్తులో 8,417.83 చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు లీజుకు తీసుకుని మరీఈ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ. నెలకు 40 లక్షలతో పాటు కొంత ఆదాయ వాటాను చెల్లించ నుంది. అయితే తొలి పది రోజుల్లోనే యాపిల్ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్, ఐప్యాడ్స్, ఇతర ఉత్పత్తుల్లో భారీ అమ్మకాలను సాధించింది. ఈ మొత్తం అమ్మకాల విలువ దాదాపు రూ. 2 కోట్లని తెలుస్తోంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఇండియాలో రెండో స్టోర్‌గా యాపిల్ సాకేత్‌ను ఢిల్లీలో ఏప్రిల్ 20న యాపిల్ సీఈవో టిక్ కుక్ లాంచ్ చేశారు. అంతకుముందు ముంబైలో తొలిస్టోర్‌ను లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ప్రత్యర్థిబ్రాండ్ల స్టోర్స్ లేకుండా జూలై 2022లో మాల్తో ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్. -
DC Vs KKR: ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్‌లో సందడి చేసిన యాపిల్ సీఈవో.. ఫోటోలు వైరల్
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 57 పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 127 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో జాసన్ రాయ్(43), రస్సెల్(38) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో చాన్నాళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్ శర్మ అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నోర్జే తలా రెండు వికెట్లు సాధించారు. మ్యాచ్‌ను వీక్షించిన యాపిల్ సీఈవో ఇక యాపిల్ రిటైల్ స్టోర్ల ప్రారంభోత్సవం కోసం ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టిమ్ కుక్ తమ రిటైల్ స్టోర్‌ను దేశ రాజధాని ఢిల్లీలో గురువారం(ఏప్రిల్ 20)న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టిమ్ కుక్ సందడి చేశారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో కలిసి ఆయన మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ.. In 2016, the CEO of Apple - Mr. Tim Cook was in Kanpur to witness an IPL contest in presence of Mr. Rajeev Shukla, vice-president of the BCCI. Fast Forward to 2023, he makes his visit to yet another IPL game by attending the #DCvKKR game in Delhi 👏🏻👏🏻@ShuklaRajiv | @tim_cook pic.twitter.com/2j1UovSmPd — IndianPremierLeague (@IPL) April 20, 2023 -
ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటీ
ఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీలో గురువారం ఉదయం యాపిల్ రెండో స్టోర్ లాంఛ్ నేపథ్యంలో.. ఈ సాయంత్రం వీళ్ల భేటీ జరిగింది. భేటీ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. దానికి టిమ్ కుక్ బదులు కూడా ఇచ్చారు. టిమ్ కుక్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం. భారతదేశంలో జరుగుతున్న సాంకేతిక పరివర్తనలను హైలైట్ చేయడం ఆనందంగా ఉంది అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. దానికి టిమ్ కుక్ స్పందిస్తూ.. తనకు దక్కిన స్వాగతంపై ప్రధాని మోదీకి థ్యాంక్స్ తెలియజేశారు. భారత దేశ వృద్ధికి, పెట్టుబడులకు మేం పెట్టడానికి కట్టుబడి ఉన్నాము అంటూ ట్వీట్ చేశారు. An absolute delight to meet you, @tim_cook! Glad to exchange views on diverse topics and highlight the tech-powered transformations taking place in India. https://t.co/hetLIjEQEU — Narendra Modi (@narendramodi) April 19, 2023 ప్రధాని మోదీని కలవడానికి ముందు యాపిల్ సీఈవో కుక్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ సాకేత్‌లో రేపు(ఏప్రిల్ 20వ తేదీన) రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. ముంబై తొలి షోరూం ఓపెనింగ్ తరహాలోనే.. ప్రారంభం సందర్భంగా కస్టమర్లను స్వయంగా టిమ్ కుక్ ఆహ్వానించనున్నారు. అయితే ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ డ్రైవ్‌లోని తొలి యాపిల్ షోరూంతో పోలిస్తే.. సాకేత్ షోరూం చిన్నదిగా తెలుస్తోంది. అయినప్పటికీ.. ముంబై తరహా లాంగ్ క్యూ అనుభవం ఇక్కడా ఎదురు కావొచ్చని యాపిల్ భావిస్తోంది. రేపటి షోరూం లాంఛ్ కోసం బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు టిమ్ కుక్. తొలుత లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్ కు చేరుకున్నారాయన. అంతేకాదు దీనికి కారణమైన ఎస్టీఫ్లస్ ఆర్ట్ ఫౌండేషన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విటర్ ద్వారా ఆ పర్యటన ఫొటోలను షేర్ చేసుకున్నారు. గోవాకు చెందిన కళాకారుడు దత్తారాజ్ నాయక్‌ను ఈ సందర్భంగా టిమ్ కుక్ కలిశాడు. పబ్లిక్ ప్లేస్‌లో తమ కళను ప్రదర్శించేందుకు వీధి కళాకారులకు దక్కిన వేదికే ఈ లోధి ఆర్ట్ డిస్ట్రిక్ట్. దేశ్యవాప్తంగానే కాకుండా.. విదేశాలకు చెందిన 50 మంది కళాకారుల ఆర్ట్ వర్క్ ఇక్కడ కొలువు దీరింది. అటుపై నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం-హస్తకళా అకాడమీని సందర్శించారాయన. Delhi’s Lodhi Art District is a remarkable public space. Congratulations to the St+art India Foundation and so many amazing artists for capturing Indian life so powerfully. And thank you to Dattaraj Naik for showing me how you design your murals on iPad. pic.twitter.com/5JuzlHRvPC — Tim Cook (@tim_cook) April 19, 2023 I could've spent the whole day at the National Crafts Museum & Hastkala Academy. From ancient and vibrant textiles to impossibly intricate wood carvings, it displayed India’s deep—and deeply beautiful— culture of craft. Thanks Sarah Sham and Ruchika Sachdeva for showing me… pic.twitter.com/CzQy0dOi8y — Tim Cook (@tim_cook) April 19, 2023 -
Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్
న్యూఢిల్లీ: దేశంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో యాపిల్ సీఈవో దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబైలలో పర్యటిస్తున్నారు. ముందుగా ముంబైలోని యాపిల్ స్టోర్ ప్రారంబించిన అనంతరం కుక్ దేశ రాజధాని ఢిల్లీలో సందడి చేశారు. గురువారం ఢిల్లీలోని యాపిల్ స్టోర్‌ను కుక్ ప్రారంభించనున్నారు. లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్‌లోని మంత్రముగ్ధుల్ని చేసే కళాత్మక చిత్రాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన కళాకారులు.. 62 ఏళ్ల భారతీయ జీవితాన్ని చాలా శక్తి వంతంగా చిత్రీకరించారంటూ స్టేట్ ఆర్టిస్ట్ ఫౌండేషన్ ఆర్టిస్టులను అభినందించారు. ముఖ్యంగా ఐప్యాడ్‌లో కుడ్య చిత్రాలను ఎలా డిజైన్ చేస్తారో తనకు చూపించిన దత్తరాజ్ నాయక్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇండియాలోకి యాపిల్ఎంటరై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో హాజరు కావడంతో అభిమానులు సందడి చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, అలనాటి అందాల హీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్, తదితర సెలబ్రిటీలు కుక్‌ను కలవడం విశేషంగా నిలిచింది. 1984 నాటి వింటేజ్ కంప్యూటర్ మానిటర్‌తో ఒకయాపిల్ అభిమాని అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను ఏప్రిల్ 20న (రేపు) ఢిల్లీలో ఓపెన్ చేయనున్నారు. Delhi’s Lodhi Art District is a remarkable public space. Congratulations to the St+art India Foundation and so many amazing artists for capturing Indian life so powerfully. And thank you to Dattaraj Naik for showing me how you design your murals on iPad. pic.twitter.com/5JuzlHRvPC — Tim Cook (@tim_cook) April 19, 2023 -
ఊహించని విధంగా.. 90 శాతం తగ్గిన అమెజాన్ సీఈవో వేతనం!
ప్రపంచంలో అత్యదిక వేతనం తీసుకుంటున్న సీఈవోల జాబితా ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్థానం మరింత దిగజారింది. స్వచ్ఛంద సంస్థ ‘As You Sow’ ఏడాదికి అత్యధిక జీతం తీసుకుంటున్న 100 మంది సీఈవోల జాబితా -2022 (100 Most Overpaid CEOs) ను విడుదల చేసింది. అందులో ఆండీ జెస్సీ స్థానం కిందకు పడిపోయింది. 2021లో 212 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం అమెజాన్ ఉద్యోగులకు ఇచ్చే యావరేజీ శాలరీ కంటే 6,474 రెట్లు ఎక్కువ. అయితే, 2022లో 99 శాతం వేతనం కోతను ఎదుర్కొన్నారు. కాబట్టే మోస్ట్ ఓవర్ పెయిడ్ సీఈవోలా జాబితాలో తన స్థానాన్ని కోల్పోయారు. 99 శాతం తగ్గింది 2021లో ఆండీ జెస్సీ శాలరీ 212 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు (సుమారు రూ. 10 కోట్లు) తగ్గిందని అమెజాన్ ఇటీవల దాఖలు చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయినప్పటికీ, జెస్సీ బేస్పే (జీతం మినహా ఇతర బెన్ఫిట్స్ ఉండవు) 175,000 డాలర్ల నుంచి 317,500తో 80 శాతం పెరిగింది. ఆండీ వేతనం తగ్గడానికి 2022లో స్టాక్ గ్రాంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021లో అందించిన అతని షేర్లలో కొంత భాగం ఈ సంవత్సరం అమెజాన్ అందించనుంది. మిగిలిన షేర్లను 2026 నుంచి 2031 చివరి నాటికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర టెక్ దిగ్గజాల సీఈవోల వేతనాలను పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఏడాది 55 మిలియన్లు పొందగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ సుమారు 99.4 మిలియన్లు, 2020లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. -
భారత్‌లో ‘యాపిల్’ స్టోర్ ప్రారంభం.. (ఫొటోలు)
-
ఉద్యోగికి యాపిల్ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్‌కుక్...
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ యాపిల్ తమ ఉద్యోగికి అపూర్వ బహుమతి అందించింది. సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఓ ఉద్యోగి సేవలను గుర్తించి యాపిల్ బహుమతి పంపించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగికి వచ్చిన బహుమతిని డాంగిల్బుక్ప్రో అనే యూట్యూబర్ అన్‌బాక్స్ చేశాడు. అందులో ఏమేమి వచ్చాయో చూపించాడు. సాధారణంగా యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు క్రిస్టల్‌తో తయారు చేసిన అవార్డులు పంపిస్తుంది. కానీ ఈ ఉద్యోగికి అల్యూమినియంతో తయారు చేసిన భారీ పెట్టె లాంటి బహుమతిని పింపించింది. దీనిపై ప్రకాశమంతమైన యాపిల్ లోగో ఉంది. దీంతో పాలిషింగ్ వస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా సంతకం చేసిన నోట్ సైతం పంపించడం గమనార్హం. ఉద్యోగి పదేళ్ల సర్వీస్‌ను సూచిస్తూ బహుమతిపై 10 సంఖ్యను జోడించడం ప్రత్యేకతగా నిలిచింది. పెద్దగా ఉద్యోగులను తొలగించని అతికొద్ది కంపెనీల్లో యాపిల్ ఒకటి. గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్దపెద్ద సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఇదే కాక ఆయా సంస్థల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు సైతం జీతాలు తగ్గించడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బహుమతులు పంపించిన యాపిల్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. (ఇదీ చదవండి: రూ.14 వేలకే ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!) -
భారత్‌లో భారీ పెట్టుబడులు ఇందుకే: సీక్రెట్ రివీల్ చేసిన యాపిల్ సీఈఓ
న్యూఢిల్లీ: భారత్ మార్కెట్‌పై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. భారత్ మార్కెట్ తమకు అత్యంత కీలకమని, అందుకే ఇక్కడ భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. యాపిల్ సంస్థ తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను గురువారం వెల్లడించింది. మొత్తం 117.2 బిలియన్ డాలర్లు (రూ.9,61,775 కోట్లు) రెవెన్యూ ఆర్జించినట్లు తెలిపింది. మార్కెట్ల సంఖ్య పరంగా ఇది ఆల్‌టైమ్ రికార్డ్. కెనడా, ఇండోనేషియా, మెక్సికో, స్పెయిన్, టర్కీ, వియత్నాం, బ్రెజిల్, భారత్ మార్కెట్ల నుంచి ఈ రెవెన్యూ వచ్చింది. భారత్‌లో యాపిల్ డబుల్ గ్రోత్ భారత్‌లో యాపిల్ సంస్థ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తోందని, దీనిపై చాలా సంతృప్తికంగా ఉన్నట్లు టిమ్‌కుక్ పేర్కొన్నారు. భారత్‌లో కంపెనీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగా 2020లో ఇక్కడ ఆన్లైన్ స్టోర్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో యాపిల్ రిటైల్ స్టోర్‌ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు. కోవిడ్ సంక్షోభం తర్వాత భారత్‌లో తమకు బాగా కలిసివచ్చిందన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. 2022లో భారత్‌లో రూ.30వేలుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో యాపిల్ వాటా 11 శాతం. ఇది మార్కెట్ రెవెన్యూలో 35 శాతం. భారత్‌లో గతేడాది ప్రీమియం స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో యాపిల్‌దే అగ్రస్థానం. ఇందులో ఐఫోన్13 అత్యధికంగా అమ్ముడుపోయిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. భారత్‌లో ఓవరాల్ స్మార్ట్‌ఫోన్ రెవెన్యూ షేర్లో 2021లో నాలుగో స్థానంలో ఉన్న యాపిల్.. 2022లో రెండో స్థానానికి ఎగబాకింది. -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్‌తో పాటు ఫేమ్‌ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్‌ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్‌లలో ఉపయోగించే హార్డ్‌వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్‌లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
అంతా తూచ్! యాపిల్ ఆఫీస్ భలే ఉంది: మస్క్ యూటర్న్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్‌తో యుద్ధానికి సై అంటే సై అన్న బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ముఖ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయంలో యాపిల్ సీఈవో టీమ్ కుక్‌తో భేటీ తర్వాత మస్క్ మాట మార్చడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!) టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు మస్క్ పలు ఆరోపణలు చేశారు. తన ట్విటర్‌ను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తే.. తాను కూడా ప్రత్యామ్నాయంగా స్మార్ట్ఫోన్ల తయారీలోకి దిగుతానంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. అయితే అనూహ్యంగా తాను అపార్థం చేసున్నామనీ, ట్విటర్ ను తొలగించాలని ఎప్పుడూ అనుకోలేదంటూ ట్వీట్ చేశారు. అసలేం జరుగుతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్నునిలదీసిన మస్క్ తాజాగా తామిద్దరి మధ్యా మంచి చర్చ జరిగిందనీ, ఇతర విషయాలతోపాటు, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విటర్‌ను తొలగించాలని తామెపుడూ భావించలేదని టిమ్ స్పష్టంగా చెప్పారంటూ పేర్కొన్నారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో "యాపిల్ అందమైన హెచ్‌క్యూ" వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేయడం విశేషం. Thanks @tim_cook for taking me around Apple’s beautiful HQ pic.twitter.com/xjo4g306gR — Elon Musk (@elonmusk) November 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆపిల్ ఈవెంట్ : ఐఫోన్ 14 సిరీస్, కొత్త వాచ్, ఇయర్‌పాడ్స్ వచ్చేశాయ్ ఫోటోలు చూడండి
-
ఆపిల్ ఐపోన్14: ధరలు,స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ లీక్స్
న్యూఢిల్లీ:ఆపిల్ అతిపెద్ద వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్లో నాలుగు కొత్త ఐఫోన్లను-ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ మోడలల్స్గా లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ధరలు,స్పెసికేషన్స్పై చైనీస్ సోషల్ వెబ్సైట్లో తాజా లీక్స్ ఆసక్తికరంగా మారాయి. ఐఫోన్ 14 ప్రొ మాక్స్ : 458ppi పిక్సెల్ డెన్సిటీ 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 2778×1244 రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్ప్లేను లాంచ్ కానుంది. 48ఎంపీ 8కే కెమెరా, 4323 mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధరలు అంచనాలు: 256 జీబీ మోడల్ రూ. 1,25,525, 512 జీబీ వేరియంట్ రూ. 1,42,801 , 1 టీబీ మోడల్ రూ. 1,60,005గా ఉంటుందని అంచనా. ఐఫోన్ 14 ప్రొ: 6.1-అంగుళాలు డిస్ప్లే , 2532×1170 రిజల్యూషన్ 3200mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ధరలు అంచనాలు: 256జీబీ మోడల్ ధర రూ. 1,14,011, 512 జీబీ ధర రూ. 1,31,284 . 1టీబీ వేరియంట్ ధర రూ. 1,49,711 ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 14 ప్లస్: 1000నిట్స్ బ్రైట్‌నెస్‌తో ట్రూ టోన్ P3 డిస్ప్లేతో వస్తోందట. 12ఎంపీ 4కే కెమెరా 4325mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ధరలు అంచనాలు: 128జీబీ ధర రూ. 85,219, 256జీబీ రూ. 93,297 , 512 జీబీ ధర రూ. 1,04, 817గా ఉండనుంది. ఐఫోన్ 14: 6.1 అంగుళాల డిస్ప్లేతో రావచ్చనిఅంచనా. అలాగే 173గ్రా బరువుతో 3279mAh బ్యాటరీతో వస్తోందట. ధరలు అంచనాలు బేస్ మోడల్ధర దాదాపు రూ. 77,112గా ఉండనుంది. 256జీబీ మోడల్ ధర రూ. 85,169, 512 జీబీ వేరియంట్‌కు రూ. 1,04,817గా ఆపిల్ నిర్ణయించిదట. అయితే అధికారిక లాంచింగ్ వరకు ఐఫోన్ మోడల్స్, ఫీచర్లు ధరలపై సస్పెన్స్ తప్పదు. ఇది చదవండి: iPhone 14: మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? -
మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం ఆపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ 14, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా ఎయిర్ పాడ్స్ ప్రొ-2, ఆపిల్ వాచ్ ఎస్ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేదికపై ఎలాంటి విప్లవాత్మక ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆపిల్ ఐఫోన్ 14: కోవిడ్ సంక్షోభం తరువాత నిర్వహిస్తున్న ఆపిల్ అతిపెద్ద ఈవెంట్ కావడంతో మరింత జోష్ నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన పుకార్లు , లీక్‌ల ప్రకారం భారీ అప్డేట్స్ తో ఐఫోన్ -14 సిరీస్‌ను తీసుకొస్తోంది. 6.7 అంగుళాల భారీ డిస్ప్లే, 48ఎంపీ బిగ్ కెమెరా, ఆన్‌లోనే ఉండే డిస్ప్లే లాంటివి ఇందులో ఉన్నాయి. ఆపిల్ స్మార్ట్‌వాచ్ 8: ఆపిల్ 7 వాచ్ డిజైన్‌కు దగ్గరానేఈ కొత్త సిరీస్ ఉన్నప్పటికీ మరిన్ని విప్లవాత్మక మార్పులతో కొత్త వాచెస్ సీరిస్‌ను తీసుకొస్తోంది. ఆపిల్ స్మార్ట్‌వాచ్ వాచ్ 8 ప్రో: అతిపెద్ద డిస్ప్లే, టైటానియం సూపర్ డిజైన్, అదనపు బటన్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకు రానుందని సమాచారం. ఎయిర్‌పాడ్స్ ప్రో 2: తదుపరి జనరేషన్గా వస్తున్న వీటిల్లో ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యాలను పెంచడంతో పాటు కొత్త డిజైన్‌తో లాంచ్ చేయనుంది. అలాగే కొత్త ఛార్జింగ్ కేస్ అంతర్నిర్మిత స్పీకర్‌తో ఫైండ్ మై ఫంక్షనాలిటీ ఫీచర్‌ను కూడా జోడించిందిట. ఈ ఆపిల్ మెగా ఈవెంట్ ఆపిల్ డాట్‌కామ్,యూ ట్యూబ్‌లో లైవ్ ఉంటుంది. -
యాపిల్ ఇండియా ఆదాయం రెట్టింపు
న్యూయార్క్: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయం సుమారు 2 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయం దాదాపు రెట్టింపైనట్లు సంస్థ వెల్లడించింది. ‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లలో జూన్ త్రైమాసికంలో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. సంపన్న, వర్ధమాన మార్కెట్లలో గణనీయంగా వృద్ధి చెందింది. బ్రెజిల్, ఇండొనేషియా, వియత్నాలలో రెండంకెల స్థాయిలోనూ, భారత్‌లో రెట్టింపు స్థాయిలోనూ పెరిగింది‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రష్యా వ్యాపారం, స్థూల ఆర్థిక అంశాలపరంగా కొంత ప్రతికూల ప్రభావాలు పడినప్పటికీ సర్వీసుల విభాగం ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు కస్టమర్లు యాపిల్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కుక్ తెలిపారు. భారత ఐటీ దిగ్గజం విప్రో ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవడంలో ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో మాక్‌బుక్ ఎయిర్ వంటి అత్యుత్తమ పనితీరు కనపర్చే యాపిల్ ఉత్పత్తులపై విప్రో ఇన్వెస్ట్ చేస్తోందని కుక్ వివరించారు. -
వర్క్‌ఫ్రం హోంపై యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇంకా కొత్త వేరియంట్లు భయపెడుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు ఇక వర్క్‌ఫ్రం హోం చాలు ఆఫీసులకు రండి అంటూ తాకీదులు పంపుతున్నాయి. ఈ తరుణంలో ప్రపచంలోనే అతి పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఒకటైన యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ అంశంపై స్పందించారు. ప్రయోగాలు చేస్తున్నాం టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన ఓ సదస్సులో టిమ్ కుక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. వర్క్ ఫ్రం హోం, ఆఫీసు నుంచి పని ఈ రెండు విధానాల విషయంలో యాపిల్ అనేక ప్రయోగాలు చేస్తోందని వివరించారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొలేదు. కాబట్టి ఉద్యోగులు, సంస్థలకు మేలు చేసే విధానం ఏంటనేది తెలుసుకోవాలంటూ రకరకాల ప్రయోగాలు చేయకతప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం యాపిల్‌లో వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రం హోంకి అవకాశం కల్పిస్తున్నట్టు టిమ్‌కుక్ తెలిపారు. మెంటల్ హెల్త్ కరోనా సంక్షోభం రావడానికి ముందు అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. కానీ కరోనా అది మోసుకొచ్చిన అనేక సమస్యలు మెంటర్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపించాయి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే సరిపోదు మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమే అనే భావన కలిగించాయి. కాబట్టి మెంటల్ హెల్త్‌కి ఏ పద్దతి మంచిదనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని కుక్ అన్నారు. ఆఫీస్ వర్క్.. కానీ వ్యక్తిగతంగా తనకు పర్సనల్ రిలేషన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమంటూ ఆఫీసుకు వర్క్‌కే ఆయన మొగ్గు చూపారు. అయితే వర్చువల్ వర్క్ అనేది ఆఫీస్ వర్క్ కంటే తక్కువ స్థాయిది ఏమీ కాదని, అదొక భిన్నమైన పని విధానమంటూ చెప్పుకొచ్చారు టిమ్‌కుక్. మొత్తంగా ఆఫీస్ వర్క్ పని విధానమే మేలైనప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా దాన్ని బలవంతంగా అమలు చేయడం సరికాదన్నట్టుగా టిమ్‌కుక్ వ్యాఖ్యలు చేశారు. చదవండి: Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
పవర్ఫుల్ ఎం2 చిప్‌తో సరికొత్త రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ (ఫోటోలు)
-
నా దారి రహదారి: ఈలాన్ మస్క్ మరో ఘనత
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా నిలిచారు. స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, స్టార్‌లింక్ సంస్థల వ్యవస్థాపకుడు 2021వ సంవత్సరంలో అత్యధికంగా జీతం పొందిన ఫార్చ్యూన్-500 టాప్-10 సీఈవోల తాజా జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 2021లో ఫార్చ్యూన్ 500 టాప్ సీఈవోల యాపిల్ సీఈవో టిమ్ కుక్, నెటిఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల సహా ఇతర టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన వారున్నారు. 2021లో ఎలాన్‌మస్క్ పొందిన వేతనం 23.5 బిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయంపెంచుకున్న టెస్లా గతేడాది ఆదాయం 53. 8 బిలియన్ డాలర్లు. గతేడాది టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం 770.5 మిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్‌కు మూడో స్థానం ఉంది. అంతర్జాతీయంగా చిప్ కొరత సమస్యను ఎదుర్కొన్నా ఆపిల్ మాత్రం టాప్ ర్యాంకులోనే కొనసాగుతోంది. ఇంకా న్విదియా సంస్థ కో ఫౌండర్ హాంగ్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హాస్టింగ్స్ వేతనాల్లో మూడో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5 చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ 2021లో వేతనం పరంగా ఈలాన్ మస్క్ టాప్-1 ప్లేస్‌లో ఉన్నారు. టెస్లా కంపెనీ సాధించిన ఘనమైన ఆదాయాల నేపథ్యంలో 53.8 బిలియన్ల డాలర్ల మొత్తం రాబడి 2020 నుండి 71శాతం పెరిగింది. ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల కంపెనీ 2021లో కీలకమైన యూరోపియన్ ,చైనీస్ మార్కెట్లలో 936,000 వాహనాలను డెలివరీ చేసింది. ఇది 87 శాతం జంప్. యాపిల్ సీఈవో టిమ్ కుక్: 2011 నుండి కుక్ ఆపిల్ సీఈవోగా ఉన్న కుక్ ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. 2021లో ఆయన వేతనం 770.5 మిలియన్ డాలర్లు. ఈ 10 సంవత్సరాల్లో 1.7 బిలియన్ల షేర్లను ఆయనకు దక్కాయి. అలాగే కుక్ హయాంలో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఆపిల్ 2వ స్థానంలో నిలిచింది. 95 బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. న్విదియా, జెన్సన్ హువాంగ్ షీల్డ్ గేమింగ్ కన్సోల్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్కి ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీ న్విదియా సహ వ్యవస్థాపకుడు హువాంగ్ వేతనం 561 మిలియన్ డాలర్లు స్వీకరించాడు. సుమారుగా 60 రెట్లు పెరిగింది. నెట్‌ఫ్లిక్స్, రీడ్ హేస్టింగ్స్ :2021లో నెట్‌ఫ్లిక్స్ సహ-వ్యవస్థాపకుడు సీఈవో రీడ్ హేస్టింగ్స్ వతేనం 453.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్, లియోనార్డ్ ష్లీఫెర్ ఆస్తమా, క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేసే వివిధ రకాల ఔషధాలను తయారు చేసే బయోటెక్ సంస్థ రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు ఫార్చ్యూన్ 500 జాబితాలో ఐదవ అత్యంత వేతనం పొందిన స సీఈవోగా అయిదో స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల 309.4 మిలియన డాలర్లతో ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. -
'జాక్ పాట్' అంటే ఇదేనేమో! యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శాలరీ ఎంతంటే!
ప్రముఖ టెక్ కంపెనీల్లో పనిచేసే సీఈఓల శాలరీ ఎంతుంటుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. కొన్ని కంపెనీలు సీఈఓల జీతభత్యాల గురించి బహిరంగంగా చర్చించవు.అందుకు కారణాలు వేరే ఉన్నాయి..ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 'జీరో శాలరీ'తో షేర్ల ద్వారా తన బిలియన్ డాలర్ల దాహం తీర్చుకుంటున్నారు. లిథియమ్ మెటల్ బ్యాటరీలపై పరిశోధనలు నిర్వహించే అమెరికన్ స్టార్టప్ 'క్వాంటమ్‌స్కేప్ కార్పొరేషన్' సీఈఓగా భారత సంతతికి చెందిన జగ్దీప్ సింగ్ కు కంపెనీ శాలరీ రూపంలో కాకుండా వాటాల రూపంలో షేర్లను కట్టబెట్టినట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. వాటి విలువ అక్షరాల మన కరెన్సీలో 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. మరి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? ►యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏడాదికి రూ.733 కోట్లు తీసుకుంటున్నారని సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. అదనంగా సెక్యూరిటీ, ప్రైవేట్ జెట్ వంటి సౌకర్యాల్ని యాపిల్ కల్పిస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. ►సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ప్రకారం.. కుక్ బేసిక్ శాలరీ సంవత్సరానికి రూ.89.20 కోట్లు ఉండగా.. ఎన్నిరాన్ మెంటల్ సస్టైనబులిటీ గోల్స్ (ఆఫీస్, ఉద్యోగుల కోసం) కింద రూ.10.33 కోట్లు ►ప్రైవేట్ జెట్ కోసం రూ. 5,29,66,072.92 కోట్లు ►సెక్యూరిటీ కోసం రూ.4,68,80,781.95 కోట్లు ►విహార యాత్రల కోసం రూ.17,15,534.95 కోట్లు ►ఎంప్లాయి రిటైర్మెంట్ ప్లాన్ కింద (401(k) plan) రూ.12,93,509.04 కోట్లు ►స్టాక్స్ అవార్డ్ కింద రూ.6,133.02కోట్లు 2021లో యాపిల్ భారీ లాభాల్ని గడించినట్లు ఎస్ఈసీ తెలిపింది. వరల్డ్ వైడ్‌గా లాక్డౌన్, కోవిడ్ విజృంభించినా యాపిల్ అమ్మకాలు వృద్దుతంగా జరిగినట్లు ఎస్ఈసీ తన నివేదికలో పేర్కొంది. ఆపిల్ సుమారు 33 శాతం ఆదాయ వృద్ధితో పాటు అమ్మకాలలో రూ.27,130.47 కోట్లని నివేదించింది. చదవండి: జాక్‌పాట్ కొట్టాడు! ఏకంగా 15వేల కోట్ల రూపాయల ప్యాకేజీ -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
చైనాకు యాపిల్ సీఈవో దాసోహం!
Apple CEO Tim Cook Secretly Signed 275 Billion Deal With China: గ్లోబల్ మార్కెట్లో అమెరికా-చైనా మధ్య జరిగే ట్రేడ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఈ నాటిది కాదు. ‘దేశభక్తి’ నినాదంతో చైనా ఉత్పత్తులను నిషేధించాలని ప్రయత్నించే అమెరికా.. దానికి కఠిన ఆంక్షలతో సమానమైన కౌంటర్ ఇచ్చే చైనా.. వెరసి గ్లోబల్ ట్రేడింగ్‌లో దేశాలు పరస్పరం ఒకదానినొకటి దశాబ్దాలుగా కిందటి లాగేసుకుంటాయి. ఈ తరుణంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ చేసిన నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. అమెరికన్ కంపెనీ యాపిల్ సీఈవో టిమ్ కుక్.. చైనాతో 275 బిలియన్ డాలర్ల రహస్య ఒప్పందం చేసుకున్నాడు. యాపిల్ డివైజ్‌లు, సేవలపై చైనా ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎదురుకాకుండా ఉండేందుకు.. చైనాను శాంతిపజేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ ‘ది ఇన్ఫర్మేషన్’ ఓ కథనం ప్రచురించింది. 2016లో చైనా పర్యటన సందర్భంగా టిమ్ కుక్ ఈ భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడని, నియంత్రణ చర్యలు తప్పించుకునేందుకే అధికారులతో లాబీయింగ్‌లో భాగంగా ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది. అంతేకాదు యాపిల్ డివైజ్‌లలో చైనాకు చెందిన కాంపోనెంట్స్‌ను ఎక్కువగా వాడడం, చైనీస్ సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒప్పందాలు, చైనా యూనివర్సిటీలకు చెందిన సాంకేతికతనే వాడడం, చైనా కంపెనీల్లోనే నేరుగా పెట్టుబడుల.. ఇలాంటి షరతులకు సైతం టిమ్ కుక్ ఒప్పుకున్నట్లు ఆ కథనం తెలిపింది. రిటైల్ స్టోర్స్, రీసెర్చ్ & డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసమే ఆ ఒప్పందం చేసుకున్నట్లు ది ఇన్ఫర్మేషన్ కథనం పేర్కొంది. ఈ ఒప్పందం 2021లోనే ముగియాల్సి ఉండగా.. అధ్యక్షుడు జిన్ పింగ్ తెచ్చిన చట్టాల పరిధిలోకి చేరడం వల్ల వచ్చే ఏడాది చివరినాటిదాకా పొడిగించినట్లయ్యింది. దేశభక్తి విమర్శ అమెరికా కంపెనీలన్నీ ఒకదారి అయితే.. యాపిల్ మరోదారిలో పయనించడం విమర్శలకు తావిచ్చింది. ఊహించని ఈ స్నేహ హస్తం మీద చర్చలూ జరుగుతున్నాయి. సాధారణంగా అమెరికన్ కంపెనీలు ఒప్పందాలకు దూరంగా ఉంటూనే.. చైనా మార్కెట్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. దేశభక్తిని హైలెట్ చేస్తూ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. ఇక ట్రంప్ హయాంలో అయితే యాపిల్ సైతం అమితమైన దేశభక్తిని ప్రదర్శించింది కూడా!. ఈ తరుణంలోనే చైనా విధిస్తున్న కఠిన వాణిజ్య-వ్యాపార నిబంధనలను అంగీకరించలేక.. ఆ దేశం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అమెరికా కంపెనీలు. అయితే యాపిల్ మాత్రం ఇందుకు భిన్నంగా రహస్య ఒప్పందం చేసుకుందన్న కథనం కలకలం సృష్టిస్తోంది. ఇక చైనాలో విదేశీ కంపెనీల వ్యాపారం మొత్తంలో యాపిల్ వాటానే(83 శాతం) ఎక్కువగా ఉంటోంది. అందుకే యాపిల్ ఇలా రహస్య ఒప్పందాలకు సిద్ధపడిందన్న వాదనా వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆంక్షలకు, కఠిన నిబంధనలకు-చట్టాలకు భయపడి.. చైనాకు దాసోహమైన టిమ్ కుక్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కథనంపై యాపిల్ నుంచి స్పందన రావాల్సి ఉంది. -
యాపిల్ పరువు తీసి పడేశాడు.. కొత్తేం కాదుగా!
అమెరికా కంపెనీలన్నా.. వాటి ఉత్పత్తులన్నా టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి ఎనలేని మంట. ఛాన్స్ దొరికినప్పుడల్లా వాటి మీద తన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు కూడా. ఈ తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ మీద తాజాగా ట్విటర్లో వెటకారం ప్రదర్శించాడు. టెస్లా కంపెనీ తెచ్చిన ‘సైబర్‌విజిల్’ను ఎలన్ మస్క్ తాజాగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. 50 డాలర్ల (రూ.3,747) విలువ చేసే ఈ విజిల్‌ను కొనుగోలు చేసి ‘విజిల్ వేయండి’ అంటూ ట్విటర్లో సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా.. తన తర్వాతి పోస్టులో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఉద్దేశిస్తూ ఓ విజ్ఞప్తి చేశాడు మస్క్. Don’t waste your money on that silly Apple Cloth, buy our whistle instead! — Elon Musk (@elonmusk) December 1, 2021 యాపిల్ కంపెనీ అక్టోబర్ నెలలో 19 డాలర్లతో ఓ క్లాత్‌ను తీసుకొచ్చింది. ఈ క్లాత్‌ను సిల్లీగా కొనేసి డబ్బులు వృధా చేసుకోవద్దంటూ జనాలకు సూచనలు కూడా చేశాడు మస్క్. ఇక టెస్లా తీసుకొచ్చిన సైబర్ విజిల్ అచ్చం టెస్లా తీసుకురాబోయే ‘సైబర్‌ట్రక్’ ఆకారాన్ని పోలి ఉంది. ఇది సీరియస్ ప్రొడక్టేనా? లేదంటే యాపిల్‌కు కౌంటరా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక యాపిల్ తన గ్యాడ్జెట్స్‌ను క్లీన్ చేసుకోవడానికి వీలుగా యాపిల్ క్లాత్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చేసుకుని ప్రమోట్ చేసుకునే ఎలన్ మస్క్.. యాపిల్ క్లాత్ విషయంలో గతంలోనూ ఇలాగే స్పందించాడు. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇస్తాంబుల్‌లో కొత్త స్టోర్ గురించి ఓ ట్వీట్ చేయగా.. ఆ స్టోర్‌ను యాపిల్ క్లాత్ కోసమే సందర్శించాలంటూ వెటకారం ప్రదర్శించాడు ఎలన్ మస్క్. Come see the Apple Cloth ™️ — Elon Musk (@elonmusk) October 22, 2021 క్లిక్ చేయండి: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టండి ఇది చదవండి: యాపిల్ సీఈవోగా మస్క్!!.. బూతులు తిట్టేసిన టిమ్ కుక్ -
యాపిల్ ఫోన్ లాంటిదే క్రిప్టో కరెన్సీ- టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు
Tim Cook says he owns cryptocurrency : యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాస్పద కరెన్సీగా చెలమని అవుతోన్న క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా మాట్లాడారు. ఎలన్‌మస్క్ , జాక్డోర్సేల తర్వాత మరో దిగ్గజ కంపెనీ సీఈవో క్రిప్టో పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. యాపిల్ లాంటిదే స్మార్ట్ఫోన్లలో యాపిల్ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో కరెన్సీ విషయంలో క్రిప్టో కరెన్సీ కూడా అలాంటిదేనంటూ క్రిప్టో కరెన్సీ , ఆగ్యుమెంటెడ్ రియాల్టీలకు సంబంధించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ మేరకు బిజినెస్ ఇన్సైడర్ ఓ కథనం ప్రచురించింది. తన పోర్ట్‌ఫోలియోలో క్రిప్ట్ కరెన్సీ కూడా ఉందని టిమ్ కుక్ చెప్పినట్టు ఆ పత్రిక రాసుకొచ్చింది. అయితే ఏ క్రిప్టో కరెన్సీలో టిమ్ కుక్ ఇన్వెస్ట్ చేశారనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడే అనుమతించం క్రిప్టో కరెన్సీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసినంత మాత్రానా యాపిల్ ప్రొడక్టులకు సంబంధించిన లావాదేవీల్లో క్రిప్టోను ఇప్పుడప్పుడే అనుమతించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటీవల టెస్లా కార్ల కొనుగోలు సమయంలో క్రిప్టో కరెన్సీని అనుమతిస్తామంటూ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. చదవండి:ఈ దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం! షరియాకి విరుద్ధమన్న మత పెద్దలు -
యాపిల్‌పై పిడుగు..! ఇప్పట్లో ఐఫోన్ 13లేనట్లే..!
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల విడుదలైన క్యూ3 ఫలితాలతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యాపిల్ ఎన్నడు లేనంతగా ఐఫోన్ 13తో ఇండియన్ మార్కెట్లో సత్తచాటడంపై తెగ సంబరపడిపోయారు. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. చిప్ కొరత కారణంగా ఆ ప్రభావం ఐఫోన్ 13పై పడింది. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐఫోన్ల కొరత ఏర్పడనుంది. ఈ కొరత యాపిల్ కు భారీ నష్టాన్ని మిగల్చనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మనదేశంలో స్మార్ట్ ఫోన్ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్, సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. త్రైమాసికంలో ఐఫోన్13 తో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఐఫోన్13 తో యాపిల్ ఇండియన్ మార్కెట్లో పట్టు సాధించిందని మార్కెట్ వర్గాలు అభివర్ణించాయి. దీంతో ఐఫోన్13ను భారత్‌లో పెద్ద ఎత్తున అమ్ముకాలు ప్రారంభించాలని టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతులోనే 'డిగిటైమ్స్ ఏషియా' రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్13 సిరీస్ స్టాక్ లేవని తెలిపింది. ఫిబ్రవరిలోపు వినియోగదారులకు తగినంత ఐఫోన్లను అందించలేదని రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే డిమాండ్‌కు తగ్గట్లు చిప్ ఉత్పత్తులను పెంచితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి గ్లోబల్‌గా చిప్కొరత డిమాండ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఐఫోన్ 13 పై భారీ ప్రభావం వరల్డ్ వైడ్‌గా టెక్నాలజీ, ఆటోమొబైల్‌తో పాటు ఇతర రంగాలు సెమీకండక్టర్ చిప్‌పై ఆధారపడ్డాయి. గ్లోబల్ చిప్ కొరత కారణంగా సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్13 అమ్మకాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ చిప్ కొరత మనదేశంలో డిమాండ్ ఉన్న ఐఫోన్ 13 సిరీస్ లోని ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్ లపై పడిందని డిగిటైమ్స్ ఏషియా వెల్లడించింది. కానీ డిమాండ్‌కు తగ్గట్లు ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు లేవని స్పష్టం చేసింది. యాపిల్ కు భారీ నష్టమే క్యూ3 (త్రైమాసికం)లో చిప్ కొరత కారణంగా యాపిల్ సుమారు 6 బిలియన్ డాలర్లను కోల్పోయింది. దీంతో పాటు చాలా దేశాల్లో ఫెస్టివల్ సీజన్ కారణంగా పెరిగిన సేల్స్‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌లు లేకపోవడం, చిప్ కొరత ఏర్పడడం మరో కారణమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. అదే సమయంలో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల కోసం యాపిల్ ఐపాడ్లతో పాటు మిగిలిన ప్రొడక్ట్‌ల ఉత్పత్తిని తగ్గించింది. ఐఫోన్లకు చిప్‌లను అందించింది. కానీ తాజాగా భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు తగినంత లేకపోవడం యాపిల్ భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు చిప్‌లు అందుబాటులో ఉంటేనే నష్టాల్ని నివారించ వచ్చనేది మరికొన్ని రిపోర్ట్లు నివేదికల్లో పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా చిప్ కొరత యాపిల్‌కు పెద్ద దెబ్బేనని, ఆటోమోటివ్ రంగంలో మహమ్మారి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏడాది ప్రారంభం నుంచి సెమీకండక్టర్ కొరత ఏర్పడింది. 2023లోపు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ అన్నారు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
దివాళీ బంపర్ ఆఫర్, ఐఫోన్‌పై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
మనదేశంలో దసరా, దివాళీ ఫెస్టివల్ సేల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్స్‌లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఊహించని రీతిలో ఐఫోన్ 13 సేల్స్ జరగడంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనిలో పనిగా భారత్‌లో ఐఫోన్13పై భారీ ఆఫర్లను ప్రకటించారు. యాపిల్ సంస్థ సెప్టెంబర్ 14న ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా ఐఫోన్ 13 ను విడుదల చేసింది. దాని ధర రూ.79,900 ఉంది. తాజాగా ఈ ఫోన్‌పై రూ.14 వేల నుంచి రూ.24వేల వరకు ఆఫర్‌ను ప్రకటించారు. ఐఫోన్ 13ను డిస్కౌంట్, ఎక్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ తో రూ.55.900కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఐఫోన్ 13పై రూ.24 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ.6 వేల వరకు డిస్కౌంట్‌తో పాటు, 64జీబీ పాత ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్ పై ఎక్ఛేంజ్ కింద రూ.15వేలు, అదనంగా మరో రూ.3వేలు బోనస్ అందిస్తున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది. సంతోషంలో టిమ్ కుక్ ఇటీవల న్యూజూ గణాంకాల ప్రకారం.. 91.2 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో చైనా తొలిస్థానంలో ఉండగా భారత్ 43.9 కోట్ల మంది యూజర్లతో రెండో స్థానంలో ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో యాపిల్ సంస్థ బలంగా ఉన్న..భారత్‌లో యాపిల్‌కు చెందిన ఐఫోన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరిగేవికావు. సేల్స్ పెంచేందుకు టిమ్ కుక్ సైతం భారత్‌పై ఫోకస్ చేశారు. దేశంలో సొంత యాపిల్ స్టోర్లు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించే పనిలో ఉన్నారు. అదే సమయంలో యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో టిమ్‌కుక్ ఐఫోన్ 13ను విడుదల చేశారు. విడుదల తరువాత యాపిల్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇదే విషయాన్ని టిమ్ కుక్ బహిరంగంగా ప్రకటించారు. పనిలో పనిగా దీపావళి సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. చదవండి: అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్ -
ఆనందంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉక్కిరి బిక్కిరి..ఎందుకంటే
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో అమ్ముడవుతున్న అన్నీ ఫోన్లలో కంటే యాపిల్ ఐఫోన్లు చాలా ఖరీదు. ఇదే విషయం ఆ ఫోన్ల అమ్మకాల్లో తేలింది. కానీ ట్రెండ్ మారింది. తాజాగా విడుదలైన క్యూ3 ఫలితాల్లో ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల విడుదలైన 2021 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరిగాయని, ఈ విషయంలో యాపిల్ సంస్థ అరుదైన ఘనతను సాధించిందని కొనియాడారు. అయితే భారత్‌లో ఐఫోన్ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 13 తో దశ తిరిగింది. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్ సంస్థ ఐఫోన్ 13 విడుదల ముందు వరకు భారత్‌లో గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఎందుకంటే మిగిలిన టెక్ కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లు,గాడ్జెట్స్ ధరలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండేవి. కానీ యాపిల్ విడుదల చేసే ఐఫోన్లలో ఫీచర్లు బాగున్నా ధరలు ఆకాశాన్నంటేవి. అందుకే ఐఫోన్ అమ్మకాలు ఆశాజనకంగా లేవని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ 13 సిరీస్ విడుదలతో భారత్‌లో యాపిల్ ఐఫోన్ అమ్మకాల దశ తిరిగింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఏం తేల్చింది మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ క్యూ3 ఫలితాల్లో యాపిల్ సంస్థ 212 శాతం వార్షిక వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని పేర్కొంది. యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో (రూ. 30,000 కంటే ఎక్కువ ఉన్న ఫోన్లు) 44 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా కొనసాగుతుందని తెలిపింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో 74 శాతం మార్కెట్ వాటాతో (రూ. 45,000 పైన ఉన్న ఫోన్లు) ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేసింది. అయితే ఇలా సేల్స్ పెరగడానికి యాపిల్ తెచ్చిన ఫీచర్లేనని తెలుస్తోంది. పెద్ద ఐఫోన్ స్క్రీన్లు 2017 నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ల స్క్రీన్ సైజ్‌ను పెంచుతూ వచ్చింది.ఇక తాజాగా స్క్రీన్ సైజ్ పెరిగిన ఫోన్లలో ఐఫోన్ 11,ఐఫోన్ 12, ఐఫోన్ 13 ఫోన్లు ఉన్నాయి. దీంతో పాటు మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్ లతో పోలిస్తే యాపిల్ ఇప్పుడు 6 అంగుళాల డిస్ప్లేతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. తద్వారా ఐఫోన్ వినియోగదారులు ఈజీగా సినిమాలు, గేమ్స్, నెట్ బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం యాపిల్ విడుదల చేస్తున్న ఐఫోన్లలో 4.7 అంగుళాల స్క్రీన్ నుండి 6.7 అంగుళాల వరకు ఐఫోన్లను అమ్ముతుంది. ఐఓఎస్ అప్డేట్లు ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లు చాలా అవసరం. అందుకే అప్డేట్ విషయంలో ఆలస్యం చేసే యాపిల్ సంస్థ గత కొంత కాలంటే సాఫ్ట్వేర్ల విషయంలో అప్డేట్గా ఆలోచిస్తుంది. ఐఫోన్ 13 సిరీస్‌ను ఆవిష్కరించిన కొన్ని రోజుల తర్వాత ఐఓస్ 15 అప్డేట్ చేసింది. 2015లో విడుదలైన ఐఫోన్ 6ఎస్ లో ఓఎస్ అప్డేట్లు చేస్తూ వస్తోంది. ఐఫోన్‌కు మరో అడ్వాంటేజ్ చిప్ సెట్ లు డిస్ప్లే ,సాఫ్ట్వేర్ అప్డేట్లు కాకుండా ఐఫోన్ సేల్స్ పెరగడానికి మరో కారణం చిప్సెట్. యాపిల్ బయోనిక్ చిప్సెట్లను వినియోగిస్తుంది. 2019నుంచి ఈ బయోనిక్ చిప్సెట్ల వినియోగం ప్రారంభమైంది. ఈ బయోనిక్ చిప్ ఉన్న ఐఫోన్ల వినియోగం సులభంగా ఉన్నట్ల ఐఫోన్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజూవారి పనులే కాకుండా గేమింగ్, బ్రౌజింగ్ ఈజీగా చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
అప్పుడే పదేళ్లు.. ఆయన సింగిల్ పీస్: ఆపిల్ సీఈఓ భావోద్వేగ లేఖ
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 10వ వర్ధంతి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్టీవ్ జాబ్స్ కృషిని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం ఆపిల్ సాధించిన ఘన విజయాలను చూసేందుకు జాబ్స్ ఉండి ఉంటే బావుండేదని టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. తన ట్విటర్లో స్టీవ్‌కు సంబందించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. అభిరుచి ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని మంచిగా మార్చగలరు" అని స్టీవ్ నమ్మాడు. అపుడే దశాబ్దం గడిచిపోయిందంటే నమ్మలేకుండా ఉన్నాం. కానీ మీ ఉనికి ఎప్పటికీ సజీవమే ఆయనకు నివాళులర్పించారు. ఆపిల్ తన హోమ్‌పేజీలో జాబ్స్‌కు నివాళుర్పించింది.. స్టీవ్ మరణించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టిమ్ కుక్ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.. స్టీవ్ వదిలిపెట్టిన అసాధారణ వారసత్వాన్ని గుర్తు చేసుకొనేందుకు ఇదొక అపూర్వ సందర్భం అని కుక్ తెలిపారు. ఆయనొక మేధావి.ఎంతో దూరదృష్టి గలవాడు. ప్రపంచం ఎలా ఉండబోతోందో చూడాలని సవాల్ చేసిన మనిషి. వాస్తవానికి తాను స్టీవ్ గురించి ఆలోచించని రోజు లేదని కుక్ పేర్కొన్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అద్భుతమైన వినూత్నమైన ఉత్పత్తులను తీసుకువచ్చాం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేలా ఇన్నోవేటివ్ ఉత్సత్తులపై దృష్టి సారించాం. ఇందుకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. విశ్వంలో కూడా తమంతట తాముగా సత్తా చాటేలా ప్రోత్సహించాం. స్టీవ్ మనందరికీ ఇచ్చిన అనేక బహుమతులలో ఇదొకటి. (Steve jobs: ఫాదర్ ఆఫ్ ది డిజిటల్ రెవల్యూషన్ గుడ్ బై స్పీచ్ విన్నారా?) ఈ క్రమంలో మీ అద్భుతమైన పని తీరు, మీలో దిగి వున్న ఆయన స్ఫూర్తిని చూసేందుకు స్టీవ్ ఇక్కడ ఉండి వుంటే బావుండేదని ఉద్యోగులనుద్దేశించి టిమ్ కుక్ రాశారు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఏమి సృష్టించబోతున్నారో చూడాలని భావిస్తున్నానన్నారు. తాను గర్వించదగ్గ విజయాలు ఇంకా చాలా రాబోతున్నాయని స్టీవ్ ముందే ఊహించారు. ఆయన ప్రతిరోజూ ఎవ్వరూ చూడని భవిష్యత్తును ఊహించుకుంటూ,తన ఆలోచనలకు జీవం పోసేలా నిర్విరామంగా కృషి చేశారంటూ టిమ్ కుక్ పేర్కొన్నారు. ఎదగడం ఎలాగే నేర్పిన వ్యక్తి స్టీవ్. ఆయనకు ఆయనేసాటి. ఆయనను మిస్ అవుతున్నాను. కానీ ఎప్పటికే ఆయనే స్ఫూర్తి అంటూ టిమ్ కుక్ స్టీవ్‌కు ఘన నివాళులర్పించారు. కాగా కేన్సర్‌తో బాధపడుతూ ఆపిల్ సీఈఓ పదవినుంచి వైదొలిగిన రెండు నెలల తరువాత 2011, అక్టోబర్ 5న 56 సంవత్సరాల వయస్సులో స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. స్టీవ్ స్థానంలో టిమ్ కుక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. సుమారు 2026 వరకు ఈ బాధ్యతల్లో టిమ్ కొనసాగనున్నారు. “People with passion can change the world for the better.”— SJ. Hard to believe it’s been 10 years. Celebrating you today and always. pic.twitter.com/x2IUnlO7ta — Tim Cook (@tim_cook) October 5, 2021 -
జీవితం వడ్డించిన విస్తరి కాదు..అయినా లెజెండ్‌గా ఎదిగాడు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ మాంత్రికుడు, ఫాదర్ ఆఫ్ ది డిజిటల్ రెవల్యూషన్‌గా చరిత్రలో నిలిచిపోయిన ఘనత ఆయనది. ఎవరి పేరు చెబితే స్మార్ట్‌ఫోన్ రంగంలో గొప్ప బ్రాండ్ ఇమేజ్ గుర్తు వస్తుందో ఆయనే ప్రపంచంలోనే పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, ఆపిల్ మాజీ చైర్మన్, సీఈఓ స్టీవ్ పాల్ జాబ్స్ . టెక్ ప్రియులను విషాదంలో ముంచేస్తూ అక్టోబరు 5న స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ. ఒక్కరోజులో స్టీవ్ జాబ్స్ ఈ కీర్తిని సంపాదించలేదు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి అంతకన్నా కాదు. బాల్యంలో అనేక కష్టాలు పడుతూ, చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ ఎదిగిన వ్యక్తిత్వం ఆయనది. ఆ తరువాత కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆపిల్ లాంటి కంపెనీని స్థాపించి చరిత్రలో తనకంటూ ఒకస్థానాన్ని మిగిల్చుకున్న వ్యక్తి స్టీవ్ జాబ్స్. దేశంలోని టాప్ 100 సీఈఓలకు సీఈఓ కోచింగ్ అందించడంలో కీలకపాత్ర, కేవలం స్టార్టప్ కంపెనీలకే కాదు అనేక కార్పొరేట్ కంపెనీలకు ఆయనొక మార్గదర్శకుడు. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని ఒక సిరియన్ ముస్లిం కుటుంబంలో స్టీవ్ పాల్ జాబ్స్ 1955, ఫిబ్రవరి 24న జన్మించాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో పాల్, క్లారా దంపతులకు ఆ తరువాత దత్తతకువెళ్లిపోయాడు. ఒకవైపు నచ్చని చదువు, మరోవైపు తల్లితండ్రుల కష్టాల నేపథ్యంలో చదువు శ్రద్ధగా పెట్టలేక పోయాడు. పేపర్ బాయ్‌గా పనిచేశాడు. ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లోని గిడ్డంగిలో పనిచేశాడు. అయినా తను అనుకున్న రంగంపై చిత్తశుద్ధితో కఠోర శ్రమ చేసి ఒక లెజెండ్‌గా ఎదిగాడు. 1972లో అమెరికాలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ యూనివర్సిటీ అయిన రీడ్ కాలేజీలో చేరి, అది నచ్చక దాన్ని వదిలేశాడు. కాలిగ్రఫీ కోర్సు నేర్చుకున్నాడు. స్నేహితులతో కలిసి నేలపై పడుకునేవాడు. ఖాళీ కోక్ బాటిల్స్ అమ్ముకుని జీవించేవాడు. అంతేకాదు వారానికి ఒకసారయినా కడుపు నిండా భోంచేసేందుకు ఏడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ ఇస్కాన్ దేవాలయంలో ఉచిత భోజనం తినేవాడు. అలా 1974లో జాబ్స్ అట్టారి ఒక వీడియో గేమ్ కంపెనీలో టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, అధిపతి అభిమానాన్ని చూరగొన్నాడు. 15 సంవత్సరాల వయస్సులోనే ఒక కారునుసొంతం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో, ఉద్యోగాలు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఇండియాకు వచ్చాడు. జైన, బౌద్ధమతంపై తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. 7 నెలలు భారతదేశంలో ఉన్నాడు . పూర్తి శాకాహారిగా మారిపోయాడు. కొంతకాలం తరువాత కాలిఫోర్నియకు వెళ్లిపోయాడు. జాబ్స్ స్నేహితుడు, క్లాస్మేట్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లంటే ఎంతో ఇష్టమైన స్టీఫెన్ వోజ్నియాకి కలుసుకోవడంతో అతని జీవితం కీలక మలుపు తిరిగింది. 1975 మార్చి 5న, హోమ్మేడ్ కంప్యూటర్స్ క్లబ్ సమావేశం, ఆ తరువాత స్టీఫెన్ వోజ్నియాక్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్టీవ్స్ను, మినీ బస్సును, వోజ్నియాక్ తకెంతో ఇష్టమైన ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్ విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఒక కంపెనీని మొదలు పెట్టారు. క్లబ్లో రెడీమేడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లను విక్రయాలను మొదలు పెట్టారు. 21 ఏళ్ల వయసులో 1976, ఏప్రిల్ 1న కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో గ్యారేజిలో ఆపిల్ పేరుతో కంపెనీ మొదలు పెట్టారు. అలా తొలి ఆవిష్కారం "ఆపిల్ కంప్యూటర్" కు భారీ క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆపిల్ 2 రిలీజ్ చేశాడు. ఇదొక సంచలనం. తద్వారా కోట్ల రూపాయల విలువైన కంపెనీగా ఆపిల్ అవతరించింది. జనవరి 3, 1977లో ఆపిల్ కంప్యూటర్ కంపెనీతో ఆపిల్ కార్పొరేషన్‌గా మారింది. మాకింతోష్ కంప్యూటర్లను కూడా రిలీజ్ చేశాడు. పెప్సీ జాన్ కెల్లీని ఆపిల్ కంపెనీకి తీసుకురావడంతో ఆపిల్ కంపెనీ సీఈవో గారావడం మరింత దూసుకు పోయింది ఆపిల్. ఇంతలో ఆర్థిక మంద్యం ఐబీఎంతో పోటీ, మరోవైపు బోర్డులో విబేధాలతో స్టీవ్‌జాబ్స్ ఆపిల్ కంపెనీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. 1985లో జాబ్స్ NeXT Incని కంప్యూటర్ కంపెనీ, సినిమా నిర్మాణ సంస్తలను స్థాపించాడు. ఇక్కడా అనేక విజయాలతోపాటు, ఇబ్బందులు తప్ప లేదు. చివరికి పోగొట్టుకున్నచోటే వెతుకున్నట్టుగా కొన్నాళ్లకే ఆపిల్ కంపెనీలో తిరిగి చేరిపోయాడు. ఇక అప్పటినుంచి స్టీవ్ జాబ్స్ వెనుదిరిగి చూసింది లేదు. ఎన్నో వినూత్న, విప్లవాత్మక ఆవిష్కరణలకు నాంది పలికాడు. మొదటి తరం ఐపాడ్ అక్టోబర్ 23, 2001 న విడుదలైంది. తొలి ఐఫోన్ జనవరి 2007లో వెలుగులోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్ల ఐపాడ్, ఐఫోన్లను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రతి ఇంటికి కంప్యూటర్, అదీ చవక ధరలో అన్న తన కలను సాకారం దిశగా అడుగులు వేశాడు. 2003లో జాబ్స్ ప్రాణాంతక ప్యాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడ్డాడు. ఆరంభంలో ఈ వ్యాధి చికిత్సకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు జాబ్స్. దాదాపు తొమ్మిది నెలలపాటు అపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించాడు. కానీ వ్యాధి మరింత ముదరడంతో, జూలై 2004లో, ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది.జాబ్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. 2009లో, జాబ్స్ తన అనారోగ్యం గురించి అందరికీ తెలియజేయడంతో పాటు తన వ్యాపారాన్ని టిమ్ కుక్కి అప్పగించాడు. అనంతరం 2009లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి లివర్ డోనేషన్ కారణంగా తను బతికి ఉన్నానని ప్రకటించాడు. అంతేకాదు అందరూ అవయవదానంపై ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేశాడు. 2010 ప్రారంభంలో తిరిగి పనిలో పడినా అనారోగ్యం కారణాల రీత్యా ఆగస్టు 24, 2011న, జాబ్స్ తన పదవీ విరమణను ప్రకటించాడు. ఫలితంగా ఆయన వారసుడిగా టిమ్ కుక్ రంగంలోకి వచ్చాడు. చివరికి ఎనిమిది సంవత్సరాల పాటు క్యాన్సర్‌తో పోరాడి 56 ఏళ్ల వయసులో అక్టోబర్ 5, 2011 ఈ లోకాన్ని వీడాడు జాబ్స్. 2011లో ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2011 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ స్టీవ్ జాబ్స్ నికర ఆస్తులను 7 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అమెరికా బిలియనీర్ల ర్యాంకింగ్‌లో అతడిని 39 వ స్థానంలో నిలిపింది. 2007లో, ఫార్చ్యూన్ మ్యాగజైన్ జాబ్స్ని వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొంది. 2010లో అతను ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో 17 వ స్థానంలో నిలిచాడు. 2011 లో, స్టీవ్ జాబ్స్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2012 లో, స్టీవ్ జాబ్స్ "మన కాలంలోని గొప్ప పారిశ్రామికవేత్త" గా ఖ్యాతి దక్కించుకున్నాడు. మరణానంతరం గ్రామీ ట్రస్టీస్ అవార్డును అందుకున్నారు. డిస్నీ చిత్రం "జాన్ కార్టర్", పిక్సర్ కార్టూన్ "బ్రేవ్" అతనికి అంకితం ఇచ్చింది.. స్టీవ్ జాబ్స్ గురించి 10 పుస్తకాలు. 6 డాక్యుమెంటరీలు, 3 ఫీచర్ ఫిల్మ్‌లు రావడం విశేషం. జాబ్స్ వ్యక్తిగత విషయానికి వస్తే స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ విద్యార్థి లారెల్ పావెల్ ప్రేమించాడు జాబ్స్. మార్చి 18, 1991 వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ : తగ్గిన ధరలు
ఐఫోన్ ప్రియులకు యాపిల్ శుభవార్త చెప్పింది. తాజాగా ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లను లాంచ్ చేసిన సందర్భంగా కొన్ని మోడళ్ల ధరలను తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత మోడళ్లైన యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్ ధరల్ని తగ్గించడం ఆసక్తికరంగా మారింది. కాగా యాపిల్ 'కాలిఫోర్నియా స్ట్రీమింగ్' వర్చువల్ ఈవెంట్లో ఐఫోన్ 13 సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 7, 10.2 అంగుళాల ఐపాడ్, ఐపాడ్ మినీలను యాపిల్ సీఈఓ టీమ్ కుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఐఫోన్ 11, ఐఫోన్ 12 , ఐఫోన్ 12 మినీ ధరలు మోడల్ ఓల్డ్ ప్రైస్ న్యూ ప్రైస్ ఐఫోన్ 11 64జీబీ Rs 54,900 Rs 49,900 ఐఫోన్ 11 128జీబీ Rs 59,900 Rs 54,900 ఐఫోన్ 12 మినీ 64జీబీ Rs 69,900 Rs 59,900 ఐఫోన్ 12 మినీ 128జీబీ Rs 74900 Rs 64,900 ఐ ఫోన్ 12 మినీ 256జీబీ Rs 84,900 Rs 74,900 ఐఫోన్ 12 64 జీబీ Rs 79,900 Rs 65,900 ఐఫోన్ 12 128 జీబీ Rs 84,900 Rs 70,900 ఐఫోన్ 12 256 జీబీ Rs 94,900 Rs 80,900 చదవండి : ఇండియన్ మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరలు -
యాపిల్ ఈవెంట్లో 'దమ్ మారో దమ్'
యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్ ఇండియన్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఐఫోన్ 13 లాంచ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సాంగ్ దమ్ మారో దమ్ మ్యూజిక్ వినిపించి యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ట్విస్ట్ ఇచ్చారు. లాంచ్ చేసే ప్రోడక్ట్స్‌తోపాటు వాటిని లాంచ్ చేసే విధానంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్ అవతరించింది. కానీ భారత్‌లో యాపిల్ మార్కెట్ కేవలం 3 శాతం మాత్రమే ఉంది. ఆ మార్కెట్ షేర్‌ను పెంచేందుకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ నటించిన ఇండియన్ మ్యూజికల్ డ్రామా ఫిల్మిం 'హరేరామ హరేకృష్ణా' సినిమాలోని ప్రముఖ ఆర్డీ బర్మన్-ఆశా భోస్లే'లు పాడిన 'దమ్ మారో దమ్' మ్యాజిక్‌ను వాడారు. దీంతో యాపిల్ బాలీవుడ్ మ్యూజిక్ వాడటంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. క్యూపర్టినోలో జరిగిన ఈవెంట్లో ఫోన్‌ను లాంచ్ చేయడానికి సీఈవో టిమ్ కుక్ వస్తున్న సమయంలోనూ ఈ మ్యూజిక్ వినిపించింది. దీంతో ఔత్సాహికులు ఐఫోన్ 13 సిరీస్‌లోని ఐఫోన్ 13 తో పాటు ఎంట్రీ లెవల్ పాడ్, ఐపాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 ఫీచర్ల కంటే ఎక్కువగా ఈ మ్యూజిక్ గురించే చర్చిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో సైతం ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 13 ఫోన్ ఎలాంటి ప్రమాదాల్లోనైనా చెక్కు చెదరకుండా ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేసింది యాపిల్. ఆ వీడియోలో ఓ యువకుడు తన బైక్‌పై కస్టమర్లకు పార్శిళ్లను అందిస్తుండగా 'దమ్ మారో దమ్' సాంగ్ ఆడియా ట్రాక్ ప్లే అవ్వడం నెట్టింట్లో సందడి చేస్తోంది. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఇండియన్ మార్కెట్లో ఐఫోన్13 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి
iPhone 13 Pro and iPhone 13 series in India.టెక్ దిగ్గజం యాపిల్..ఐఫోన్ 13, ఐఫోన్ 13మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరిట జరిగిన కార్యక్రమంలో యాపిల్ చీఫ్ టిమ్ కుక్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. అయితే స్టాటిస్టా లెక్కల ప్రకారం భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైన యాపిల్..ఆ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ వర్చువల్ ఈవెంట్లో యాపిల్ చీఫ్ టిమ్ కుక్ ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ప్రకటించారు. వాటి ధరలు ఇలా ఉన్నాయి. ఇండియాలో ఐఫోన్ 13 సిరీస్ ధరలు ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ 128జీబీ: రూ.1,29,900 256జీబీ: రూ. 1,39.900 512జీబీ: రూ. 1,59,900 1టెరాబైట్ : రూ. 1,79,900 ఐఫోన్ 13 ప్రో 128జీబీ: రూ. 1,19,900 256జీబీ: రూ. 1,29,900 512జీబీ:రూ. 1,49,900 1టెరాబైట్ : రూ. 1,69,900 ఐఫోన్ 13 128జీబీ: రూ.79,900 256జీబీ: రూ. 89,900 512జీబీ: రూ. 1,09,900 ఐఫోన్ 13 మినీ 128జీబీ: రూ. 69,900 256జీబీ: రూ. 79,900 512జీబీ: రూ. 99,900 ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ప్రీ ఆర్డర్లు అప్పుడే యాపిల్ విడుదల చేసిన ఐఫోన్13 సిరీస్ ఫోన్ ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్17,శుక్రవారం సాయంత్రం 5:30నుంచి ప్రారంభం కానుండగా..సెప్టెంబర్ 24 శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
యాపిల్ మెగా ఈవెంట్.. విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ఫోటోలు
-
భారత తొలి ఆపిల్ స్టోర్‌పై కోవిడ్-19 దెబ్బ..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. భారత మార్కెట్లలో ఆపిల్ స్మార్ట్ఫోన్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. భారత మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఆపిల్ అధికారిక ఆన్లైన్ స్టోర్‌ను 2020 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. ఆపిల్ తన తొలి అధికారిక ఫిజికల్ రిటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 రాకతో భారత్‌లో ఫిజికల్ రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయడంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపిల్ తొలి ఫిజికల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గత ఏడాది 2021 నుంచి భారత్‌లో ఆపిల్ తన తొలి ఫిజికల్‌స్టోర్‌ను తెరవనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత రిటైల్ రంగంలో ఆపిల్ తన స్థానిక ఉనికిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆపిల్ తన పరికరాలను ప్రాంచైజ్ రిటైల్ నెట్వర్క్ కింద పనిచేసే పంపిణీదారుల ద్వారా దేశంలో విక్రయిస్తోంది. ఆప్‌ట్రాన్సిక్స్ వంటి ఫ్రాంచైజ్‌లతో ఆపిల్ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆపిల్ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదుచేసింది. ఆపిల్ టర్నోవర్ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. -
బండ బూతులు.. ఎలన్ మస్క్‌కు ఘోర అవమానం!
వ్యాపార లావాదేవీలు, వ్యవహార శైలితోనే కాదు వివాదాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. అయితే మరో దిగ్గజ కంపెనీ సీఈవో చేతిలో మస్క్ ఘోర అవమానం పాలయ్యాడనే వార్త ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో జోరుగా షికార్లు కొడుతోంది. ఇంతకీ మస్క్‌ను బండ బూతులు తిట్టింది ఎవరో కాదట. యాపిల్ సీఈవో టిమ్ కుక్. అది ఎందుకు జరిగిందంటే.. కాలిఫోర్నియా: చాలా కాలం క్రితం టెస్లాను విలీన ప్రతిపాదన యాపిల్ వద్దకు వచ్చింది. అయితే ఆ డీల్ అనుకున్న విధంగా నడవలేదు. కారణం.. ఆ డీల్ ఓకే కావాలంటే తనను యాపిల్‌కు సీఈవోగా ప్రకటించాలని మస్క్ కోరాడట. అంతే ఆ మాటతో ఉగ్రుడైన కుక్ .. మస్క్‌ను బండబూతులు తిట్టాడని, ‘F’ పదం చాలాసార్లు వాడాడని, కోపంగా ఫోన్ పెట్టిపడేశాడని సమాచారం. ఈ మేరకు ‘ది వాల్ స్స్ర్టీట్ జర్నల్’ రైటర్ టిమ్ హగ్గిన్స్ రాసిన ‘పవర్ ప్లే: టెస్లా, ఎలన్ మస్క్, అండ్ ది బెట్ ఆఫ్ ది సెంచూరీ’ అనే బుక్‌లో వాళ్లిద్దరి మధ్య సంభాషణలకు సంబంధించిన విషయాల్ని ప్రస్తావించాడు. అయితే హగ్గిన్స్ రాతలను ఎలన్ మస్క్, టిమ్ కుక్‌లు ఖండించారు. తాను కుక్ అసలు ఎప్పుడూ మాట్లాడుకోలేదని, ఎలాంటి ప్రత్యుత్తరాలు జరపలేదని క్లారిటీ ఇచ్చాడు ఎలన్ మస్క్. అయితే ఒకానొక దశలో టెస్లాను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశానని, కానీ, కలవడానికే ఆయన నిరాకరించాడని మస్క్ గుర్తు చేసుకున్నాడు. ఇక కుక్ కూడా మస్క్ లాగే స్పందించాడు. ‘ఎలన్‌తో మాట్లాడాలని నేనేప్పుడు అనుకోలేదు. కానీ, అతను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఆ టైంకి టెస్లా విలువ.. ఇప్పుడున్న విలువలో 6 శాతం మాత్రమే ఉంది. బహుశా అందుకే ఆయనకి(కుక్) ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. నాన్ సెన్స్.. ఇలాంటి వాళ్ల రాతలు పనికి మాలినవి అంటూ హిగ్గిన్స్పై మండిపడ్డాడు ఎలన్ మస్క్. ఇదిలా ఉంటే మోడల్ ఎక్స్ అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత టెస్లా ఘోరమైన ఆర్థిక నష్టాల్ని చవిచూసింది. దీంతో 2016లో 60 బిలియన్ డాలర్ల ఒప్పందంతో యాపిల్‌కు టెస్లాను అమ్మే ప్రయత్నం చేశాడు మస్క్. అయితే ఆ డీల్ టైంలో ఇద్దరి మధ్య ‘ఘర్షణ వాతావరణంలోనే’ ఏదో జరిగిందనే వార్తని ఆనాడు ప్రముఖ మీడియా హౌజ్‌లు అన్నీ ప్రకటించాయి. అయితే ఆనాడు జరిగింది ఇదేనంటూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హగ్గిన్స్ ఆ ఫోన్ సంభాషణను బయటపెట్టడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. Higgins managed to make his book both false *and* boring 🤣🤣 — Elon Musk (@elonmusk) July 30, 2021 -
చిక్కుల్లో ఆపిల్.. కారణమేంటీ ?
మనిషిని ఆపరేట్ చేసేది మెదడు. మరి ఆ మెదడునే మనిషి ఆపరేట్ చేస్తే..ఇదిగో ఇలాంటి ఐడియాతో మనిషి మెదడులో కంప్యూటర్ చిప్‌ను అమర్చేందుకు ఎలాన్ మస్క్ న్యూట్రాలింక్ ప్రయోగం తెరపైకి తెచ్చారు. ఆ ప్రయోగం ఎలా ఉన్నా ఇప్పుడు ప్రపంచ దేశాల్ని చిప్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా టెక్ దిగ్గజం ఆపిల్‌పై దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. నేడు మనం వినియోగించే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సెమీ కండక్లర్లు, మైక్రో ప్రాసెసర్లు ఉంటాయి. ఇలాంటి సెమీ కండక్టర్లు, మైక్రో ప్రాసెసర్ల సమాహరాన్నే చిప్ లేదా చిప్‌సెట్‌గా పిలుస్తారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో చిప్‌ల తయారీ గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల్లో ఆన్లైన్ వ్యవహరాలు పెరిగిపోయాయి. జూమ్ మీటింగ్స్, వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసులతో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, మాక్ప్యాడ్, ఐప్యాడ్ల వినియోగం పెరిగింది. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరిగింది. కరోనా సంక్షోభంతో పాటే ఈ సమస్య తలెత్తినా.. గత మార్చి వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అప్పటికే చిప్‌లు స్టాక్ ఉండడంతో సమస్యలు తలెత్తలేదు. ఓ వైపు చిప్ స్టాక్ అయిపోవడం మరో వైపు చిప్‌ల తయారీ ఇంకా పుంజుకోకపోవడంతో సమస్య తల్తెతింది. చిప్‌లు, సెమీ కండర్లు లేకపోవడం వల్ల ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ వ్యాపారం దెబ్బతింటుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ... చిప్ సెట్ల కొరత కారణంగా మాక్, ఐప్యాడ్ అమ్మకాలు క్షీణించినట్లు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికం సమయానికి చిప్ మార్కెట్లోకి రాకపోతే తమకు కష్టమేనన్నారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఆపిల్ ఆదాయం సుమారు 6 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. ఇందులో మాక్ నుంచి వచ్చే ఆదాయం సుమారు రూ .61 వేల కోట్లు ఉండగా ఐప్యాడ్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు 54 వేల కోట్లుగా నమోదు అయ్యింది. -
వర్క్ ఫ్రమ్ ‘ఆఫీస్’.. ఉద్యోగుల్లో ఆగ్రహం
కరోనా కారణంగా ఉద్యోగుల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోంకే ఫిక్స్ అయిపోయారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంటున్న తరుణంలో తిరిగి ఆఫీస్ గేట్లు తెరవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు యాపిల్, గూగుల్ ఎంప్లాయిస్ తమ ఉద్యోగులకు ఆఫీస్‌లకు సిద్ధం కావాలని మెయిల్స్ పెడుతుండగా.. ప్రతిగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. తాము వర్క్ ఫ్రమ్ హోంలోనే కొనసాగుతామని, ఆఫీస్‌లకు రావాలని బలవంతపెడితే రాజీనామాలు చేస్తామని చాలామంది బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు. యాపిల్‌కు లేఖలు జూన్ నెలలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రతిపాదన మేరకు ‘హైబ్రిడ్ మోడల్’ తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు సూచించారు. అయితే తాము ఆఫీస్‌లకు రాలేమని, వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించాలని కొందరు ఎంప్లాయిస్ విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తుండడంతో యాపిల్ కుదరదని తేల్చి చెప్పింది. అయితే ఆఫీస్‌లకు రావాలని బలవంతం చేస్తే.. రిజైన్ చేస్తామని ఉద్యోగులు తాజాగా లేఖలు రాయడం మొదలుపెట్టారు. మరోవైపు కిందటి నెలలో యాపిల్ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం ఉద్యోగులు తాము తమకు వీలున్న రీతిలోనే పనులు చేస్తామని వెల్లడించడం విశేషం. ఈ నేపథ్యంలో కొందరు మేనేజ్మెంట్కు మళ్లీ లేఖలు రాయాలని భావిస్తుండగా.. కోర్టుకు వెళ్లే ఉద్దేశంలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ పునరాలోచన చేస్తుందా? లేదా? అనేది చూడాలి. గూగుల్ కూడా.. ఆఫీస్ రిటర్న్ పాలసీపై గూగుల్ ఉద్యోగుల్లోనూ అసంతృప్తే నెలకొంది. మే నెలలో కంపెనీ సీఈవో సుందర్‌పిచాయ్ ‘హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి 60 శాతం ఉద్యోగులు ఆఫీస్‌లకు రావాలని, మరో 20 శాతం మంది రిమోట్ వర్క్, ఇంకో 20 శాతం మంది రీ లోకేట్ కావాలని పిచాయ్ పిలుపు ఇచ్చాడు. ఇక లొకేషన్ టూల్ ఆధారంగా జీతాలు ఉంటాయని కూడా ప్రకటించాడు. ఈ దశలో గందరగోళానికి గురవుతున్న ఉద్యోగులు.. ఆఫీస్‌లకు రాలేమని చెప్తున్నారు. అంతేకాదు మెయిల్స్ ద్వారా తమ ఫ్రస్టేషన్‌ను వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఆండ్రాయిడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..!
పారిస్: ఆపిల్ సీఈవో టిక్‌కుక్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆపిల్ ఫోన్లతో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలోనే అత్యధికంగా మాల్వేర్ ఉన్నాయని ఆపిల్ సీఈవో టిక్‌కుక్ పేర్కొన్నారు. జూన్ 16 న పారిస్‌లో జరిగిన వివాటెక్ 2021 వర్చ్యువల్ కాన్పరెన్స్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లపై తన అక్కసును బయటపెట్టాడు. ఆపిల్ ఐవోస్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఎక్కువగా మాల్వేర్ దాడులు జరుగుతున్నాయని తెలిపాడు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఆపిల్ కంటే 47 రెట్లు ఎక్కువ మాల్ వేర్ కలిగి ఉందని కుక్ పేర్కొన్నారు. యూరోపియన్ దేశాల్లో తెస్తోన్న డిజిటల్ మార్కెట్ చట్టంతో ఆపిల్,గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం అమలుతో సైడ్‌లోడింగ్ యాప్స్ (థర్డ్ పార్టీ యాప్స్)ను యూజర్లు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏలాంటి అడ్డంకులు రావు. కాగా టిమ్ కుక్ ఈ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్‌ఫుల్‌గా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్‌లో ఉంచుతామని వివరించాడు. చదవండి: ఈ బిల్లులతో అమెజాన్ ప్రైమ్ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..! -
కోవిడ్ సంక్షోభం: భారత్ కు మద్దతుగా ఆపిల్
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం ఆపిల్ స్పందించింది. మహమ్మారి నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలకు టెక్ దిగ్గజం సహకరిస్తుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. "భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరి గురుంచి ఆలోచిస్తున్నాం. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా ఆపిల్ విరాళం ఇవ్వనుంది’’ అని టిమ్ కుక్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. Amid a devastating rise of COVID cases in India, our thoughts are with the medical workers, our Apple family and everyone there who is fighting through this awful stage of the pandemic. Apple will be donating to support and relief efforts on the ground. — Tim Cook (@tim_cook) April 26, 2021 అంతకుముందు, మైక్రోసాఫ్ట్ భారతీయ-అమెరికన్ సీఈఓ సత్య నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కరోనాతో పోరాడుతున్న భారతదేశానికి వారి మద్దతును తెలిపారు. గూగుల్ తరఫున రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు పిచాయ్ ప్రకటించగా, దేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు తోడ్పడేలా ఆక్సిజన్ కాన్సంట్రేషన్ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామని నాదెళ్ల ప్రకటించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశంలో సోమవారం 3.52 లక్షల కొత్త కరోనా వైరస్ కేసులను నమోదయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఒకే రోజులో ఇంత అత్యదిక స్థాయిలో కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటి సారి. చదవండి: టెకీలకు ఊరట: వేతనంతో కూడిన సెలవులు -
భారత్‌లో యాపిల్ వ్యాపారం రెట్టింపు
న్యూయార్క్/న్యూఢిల్లీ: కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ స్టోర్ ఊతంతో భారత మార్కెట్లో టెక్ దిగ్గజం యాపిల్ విక్రయాలు మరింతగా పెరుగుతున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో తమ వ్యాపారం రెట్టింపయినట్లు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. దేశీ ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగంలో శాంసంగ్, వన్‌ప్లస్‌తో యాపిల్ పోటీ పడుతోంది. గత త్రైమాసికంలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 111.4 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కుక్ తెలిపారు. వార్షికంగా 21 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమ్మకాలే 64 శాతంగా ఉన్నట్లు వివరించారు. ‘ఉదాహరణకు భారత్ విషయాన్నే తీసుకుంటే అంతక్రితం ఏడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే వ్యాపారం రెట్టింపయ్యింది. ఆన్లైన్ స్టోర్ పెట్టిన తర్వాత ఇవి తొలి పూర్తి స్థాయి త్రైమాసిక ఫలితాలు. అయితే, అవకాశాల పరిమాణంతో చూస్తే వ్యాపారం ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. కానీ, రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి సాధించబోతున్నాం‘ అని కుక్ చెప్పారు. త్వరలో భారత్‌లో రిటైల్ స్టోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. సెప్టెంబర్ 23న యాపిల్.. భారత్‌లో తమ తొలి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. కౌంటర్‌పాయింట్ వంటి రీసెర్చ్ సంస్థల నివేదికల ప్రకారం 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో యాపిల్ అమ్మకాలు 171% పెరిగాయి. ఐఫోన్ 12 ఆవిష్కరణ, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11పై ఆకర్షణీయ ఆఫర్లు, ఆన్లైన్లో విక్రయాలు వంటివి ఇందుకు దోహదపడ్డాయి. -
కాపిటల్ హిల్ ఘటన : టెక్ దిగ్గజాల స్పందన
వాషింగ్టన్: అమెరికా తాజా అల్లర్లపై అమెరికాకుచెందిన ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు. కాపిటల్ హిల్‌లో హింసను ప్రజాస్వామ్య విరుద్ధ ఘటనగా అభివర్ణించారు. బుధవారం జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ సుందర్ పిచాయ్ తనఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. కంపెనీ తన ఉద్యోగులతో టచ్‌లో ఉందని, ఏదైనా అదనపు ముందు జాగ్రత్త చర్యలు అవసరమైతే ఉద్యోగులను అప్డేట్ చేస్తామని సీఈఓ తెలిపారు. అటు క్యాపిటల్ భవనంపై దాడిని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా తీవ్రంగా ఖండించారు. ఇది విచారకరమైన, సిగ్గుపడాల్సిన రోజు అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ పరిపాలనకు సంబంధించిన పరివర్తనను పూర్తి చేయాలి అంటూ టిమ్ కుక్ ట్వీట్ చేశారు.(ట్రంప్ మద్దతుదారుల వీరంగం.. కాల్పులు) స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, మన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్య పనితీరుకు పునాది అని పేర్కొన్న పిచాయ్ దేశ చరిత్రలోనే ఈ హింసను ఖండిస్తున్నామని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోకారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను జోబైడెన్ తీసుకునే కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. కాగా అధ్యక్ష రేసులో జో బైడెన్ విజయానికి నిరసనగా "మార్చి ఫర్ ట్రంప్" పేరుతో ర్యాలీ నిర్వహించిన ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై విరుచుకుపడ్డారు. వీరు సృష్టించిన బీభత్సం, అల్లర్లతో అమెరికాలోని వాషింగ్టన్ అట్టుడికింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ విషాదంపై యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. Today marks a sad and shameful chapter in our nation’s history. Those responsible for this insurrection should be held to account, and we must complete the transition to President-elect Biden’s administration. It’s especially when they are challenged that our ideals matter most. — Tim Cook (@tim_cook) January 7, 2021 -
నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్
న్యూయార్క్: ప్రస్తుతం మోడల్-3 ఎలక్ర్రిక్ కార్లతో ప్రపంచ మార్కెట్లో దూసుకెళుతున్న టెస్లా ఇంక్ ఒకప్పుడు నిధుల లేమితో సతమతమైంది. దీంతో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. టెస్లా ఇంక్‌ను అమ్మివేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కంపెనీ అమ్మకం కోసం ఒకప్పుడు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్‌ను సంప్రదించినట్లు మస్క్ చెబుతున్నారు. అయితే తన ప్రతిపాదనలపై సమావేశమయ్యేందుకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ నిరాకరించినట్లు వెల్లడించారు. కాగా.. 2024కల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికల్లో యాపిల్ ఉన్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో మస్క్ ట్వీట్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. పదోవంతుకే మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి సమయంలో ఎదురైన ఆర్థిక సమస్యలతో టెస్లాను విక్రయించాలని భావించినట్లు మస్క్ పేర్కొన్నారు. ఇందుకు టిమ్ కుక్‌ను సంప్రదించినప్పటికీ తనతో సమావేశమయ్యేందుకు అంగీకరించలేదని తెలియజేశారు. నిజానికి కంపెనీ ప్రస్తుత విలువలో పదోవంతుకే అంటే 60 బిలియన్ డాలర్లకే టెస్లా ఇంక్‌ను యాపిల్‌కు విక్రయించాలని ఆలోచించినట్లు వెల్లడించారు. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) మోడల్-3 కష్టకాలం ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ ఆటో కంపెనీగా నిలుస్తున్న టెస్లా ఇంక్ రూపొందించిన మోడల్-3 కార్లను అభివృద్ధి చేసే బాటలో 2017లో కష్టకాలాన్ని ఎదుర్కొంది. కార్ల ఉత్పత్తిని పెంచేందుకు నిధులు లేకపోవడంతో మస్క్‌కు ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే కార్ల ఉత్పత్తిని చేపట్టలేకపోవచ్చని కాలిఫోర్నియాలోని ఫ్రెమంట్ ప్లాంటు ఉద్యోగులకు మస్క్ చెప్పారు. అయితే ఇది జరిగిన కొద్ది వారాలకే ఫ్యాక్టరీ పైకప్పు ప్రాంతంలో నిద్రిస్తున్న మస్క్ త్వరలోనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించుకోనున్నట్లు ఉద్యోగులకు తెలియజేశారు. యాపిల్ ప్రణాళికల్లో మార్పు సరిగ్గా మూడేళ్ల క్రితమే టెస్లా ఇంక్‌కు పూర్తిస్థాయి పోటీదారుగా నిలవాలన్న ప్రణాళికలనుంచి ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీవైపు దృష్టి మరల్చుకుంది. గతంలో టెస్లా కంపెనీలో పనిచేసిన పలువురుని ప్రాజెక్ట్ టైటన్‌లో ఇటీవల ఉద్యోగులుగా యాపిల్ చేర్చుకుంది. డ్రైవ్ టెరైన్, కార్ ఇంటీరియర్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించుకుంది. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలనూ కొనుగోలు చేసింది. తద్వారా 2024కల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారును మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికలను ఆవిష్కరించింది. కాగా.. మస్క్ వ్యాఖ్యలపై స్పందించేందుకు యాపిల్ ప్రతినిధి ఒకరు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇదే విధంగా కుక్‌ను మస్క్ ఎప్పుడు సంప్రదించారన్న అంశంపై టెస్లా సైతం జవాబివ్వలేదని తెలియజేసింది. షేరు జోరు 2017 నుంచి చూస్తే.. టెస్లా ఇంక్ షేరు 1400 శాతం ర్యాలీ చేసింది. అయినప్పటికీ యాపిల్ మార్కెట్ విలువతో పోలిస్తే మూడో వంతుకంటే తక్కువగానే ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు వార్తలతో ఈ వారం యాపిల్ షేరు బలపడగా.. టెస్లా షేరు డీలాపడినట్లు తెలియజేశారు. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.24 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడిన టెస్లా కంపెనీ వరుసగా 4 త్రైమాసికాలలో లాభాలు ఆర్జించడం ద్వారా ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో చోటు సంపాదించింది. తద్వారా అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాదిలోనే షేరు 700 శాతం ర్యాలీ చేయడం విశేషం! దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) 607 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా ఆవిర్భవించింది. వెరసి అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ తదుపరి 150 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా మస్క్ అవతరించడం గమనార్హం! -
ఆపిల్ రికార్డు సేల్స్ : 8 లక్షల ఐఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తన తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్ కు బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. భారతీయ స్మార్ట్ ఫోన్ విభాగంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అమెరికా, యూరప్ ఆసియా పసిఫిక్ దేశాలతోపాటు ఇండియాలో ఈ త్రైమాసికంలో రికార్డు అమ్మకాలను సాధించామని ఫలితాల వెల్లడి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న తమ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన నేపథ్యంలో మంచి ఆదరణ లభించిందని ప్రకటించారు. ఇందుకు యూజర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు) (ఐఫోన్ 12, 12 ప్రో సేల్ షురూ, డిస్కౌంట్స్) నిన్న (అక్టోబరు 29) క్యూ4 ఫలితాలను ఆపిల్ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం స్వల్పంగా పుంజుకుని 64.7 బిలియన్ డాలర్లుగా ఉంది. లాభం 7 శాతం తగ్గి 12.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఫోన్ గ్లోబల్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండియాకు ఆపిల్ 8 లక్షలకు పైగా ఐఫోన్లను రవాణా చేసింది. తద్వారా రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని నివేదించింది. ధరల పరంగా మార్కెట్‌ను ఆపిల్ పూర్తిగా అర్థం చేసుకుంటోందనీ, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11వంటి హాట్-సెల్లింగ్ ఫోన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో నెమ్మదిగా, స్థిరంగా ప్రవేశిస్తోందని కౌంటర్ పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ వ్యాఖ్యానించారు. ఐఫోన్12తో రాబోయే త్రైమాసికంలో తన స్థానాన్ని ఆపిల్ మరింత పటిష్టం చేసుకుంటుందన్నారు. (ఐఫోన్స్ ప్రీబుకింగ్‌పై ‘సంగీత’ భారీ ఆఫర్లు) ఆపిల్ తన కొత్త ఆన్లైన్ స్టోర్‌తో ఉత్సాహాన్ని పుంజుకుందనీ, ప్రీ-ఆర్డర్ల పరంగా ఐఫోన్ 12 సిరీస్‌కు మంచి ఆదరణ లభించిందని సీఎంఆర్ హెడ్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజి) ప్రభు రామ్ తెలిపారు. మరోవైపు అక్టోబర్ 23 న ప్రారంభించిన కొత్త ఐఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ 12, 12 ప్రోలకు అద్భుతమైన ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశీయంగా ఆపిల్ తన తొలి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. తద్వారా తమ కస్టమర్లకు మరింత చేరువవుతున్నట్టు తెలిపారు.(ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు) సెప్టెంబర్ 23 న భారత్‌లో తొలి స్టోర్ ను ప్రారంభించనున్నామని టిమ్ కుక్ ట్వీట్ చేశారు తమకు ఇష్టమైన వారితో, చుట్టూ ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం తమ కస్టమర్లకు ఎంత ముఖ్యమో తెలుసు. అందుకే సెప్టెంబర్ 23న ఆన్లైన్లో ఆపిల్ స్టోర్‌తో కస్టమర్లకు కనెక్ట్ అవుతున్నామన్నారు. భారతదేశంలో విస్తరిస్తున్నందుకు గర్వంగా ఉందని, యూజర్లకు మద్దతు, సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ'బ్రియన్ అన్నారు. ఆపిల్ స్పెషలిస్టుల ద్వారా వినియోగదారులు సలహాలు పొందవచ్చని, కొత్త ఆపిల్ ఉత్పత్తులపై ఇంగ్లీష్, హిందీ ఇతర భాషలలో తెలుసుకోవచ్చని హామీ ఇచ్చారు. కస్లమర్ల సౌలభ్యంకోసం చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నామన్నారు. మాక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసే విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుందని పేర్కొంది. అలాగే ఆపిల్ ఇతర యాక్ససరీస్, కేర్ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఈ పండుగ సీజన్లో, ఆపిల్ సిగ్నేచర్ గిఫ్ట్ ర్యాప్, ఎంచుకున్నఉత్పత్తులపై స్పెషల్ ఎంగ్రేవింగ్ సదుపాయం కూడా అందించనుంది. ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు భాషలలో ఎమోజీ లేదా టెక్స్ట్ చేసుకోవచ్చు. ఆపిల్ ఎయిర్ పాడ్, ఐప్యాడ్ లో ఆపిల్ పెన్సిల్ ఫీచర్ అందిస్తున్నట్టు ఆపిల్ పత్రికా ప్రకటనలో తెలిపింది. కాగా ఇటీవల నిర్వహించిన ఆపిల్ ఈవెంట్ లో సంస్థ వాచ్ సిరీస్. ఐప్యాడ్స్, కొత్త ఆపరేటింగ్ సిస్టంను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. We know how important it is for our customers to stay in touch with those they love and the world around them. We can’t wait to connect with our customers and expand support in India with the Apple Store online on September 23! 🇮🇳https://t.co/UjR31jzEaY — Tim Cook (@tim_cook) September 18, 2020 -
స్టీవ్ జాబ్స్ కలను నెరవేర్చిన యాపిల్ సీఈఓ
కాలిఫోర్నియా: మొబైల్ ఫోన్లను సాంకేతింగా, ఆకర్శనియంగా తీర్చిదిద్దడంలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. కాగా స్టీవ్ జాబ్స్ 2011సంవత్సరంలో క్యాన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ జాబ్స్, టిమ్ కుక్‌లు ఇద్దరు సాంకేతికంగా యాపిల్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. స్టీవ్ మరణించాక కుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టే సమయానికి 400 బిలియన్ డాలర్లు మాత్రమే యాపిల్ వద్ద మూలధనంగా ఉండేది. కానీ ఇప్పుడు కుక్ సారథ్యంలో యాపిల్ సంస్థ ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. ప్రస్తుతం యాపిల్ సంస్థ మార్కెట్లో ఐఫోన్లతో తన హవా కొనసాగిస్తు యూఎస్‌లో 2 ట్రిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన మొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. యాపిల్ సంస్థ బ్రాండ్ కోల్పోకుండా కుక్ తీవ్రంగా శ్రమించారు. ఆయన ఎదుర్కొన్న ముఖ్య సవాళ్లు: ఎఫ్‌బీఐ విపరీత ఆంక్షలు, చైనాతో యూఎస్ ట్రేడ్ వార్, కరోనా వైరస్, ఆర్థిక మాంధ్యం ఇన్ని సమస్యలను అధిగమంచి యాపిల్‌ను ఉన్నత స్థానంలో కుక్ నిలిపాడు. పౌర హక్కులు, పునరుత్పాదక శక్తి లభ్యతపై తన అభిప్రాయాన్ని ప్రపంచానికి చెప్పి మేధావుల మన్ననలను అందుకున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక సాఫ్టవేర్, వారంటీ ప్రోగ్రామ్‌లు సంగీతం, వీడియో, ఆటలు తదితర విభాగాలను ప్రారంభించి వినియోగదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించారు. ఎంటర్టైన్మెంట్ యాప్ నెట్ఫ్లక్స్ను కొనుగోళ్లు చేసి కుక్ తన సత్తా చాటాడు. కంపెనీలకు రేటింగ్ ఇచ్చే ఫార్చ్యూన్ సంస్థ యాపిల్ 50 బిలియన్ వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు ఇవ్స్ సంస్థ అంచనా ప్రకారం యాపిల్ సేవల విభాగంలో 750బిలియన్ డాలర్ల మూలధనం ఉన్నట్లు తెలిపింది. స్టీవ్ జాబ్స్ కలలు కన్న యాపిల్ సంస్థను కుక్ నెరవేరుస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్ -
బిలియనీర్ల క్లబ్లో ఆపిల్ బాస్ : చాలా ప్రత్యేకం
కాలిఫోర్నియా: ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (59) బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించు కున్నారు. ఆగస్టు 2011లో ఆపిల్ బాస్ గా బాధ్యతలను చేపట్టిన తొమ్మిది సంవత్సరాల తరువాత ఆయన ఈ ఘనతను సాధించారు. తాజాగా ఆపిల్ సంస్థ కీలక మైలురాయిని అధిగమించి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మార్కెట్ విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో టిమ్ కుక్ అధికారికంగా బిలియనీర్‌గా మారారని బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక తెలిపింది. బిలియనీర్స్ ఇండెక్స్ లెక్కల ప్రకారం, టిమ్ కుక్ నికర సంపద 1 బిలియన్ డాలర్లను మించింది. ఆపిల్ షేర్ ధర గత వారం దాదాపు 5 శాతం పెరిగింది. దీంతో ఎలైట్ క్లబ్లో టిమ్ చేరారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 187 బిలియన్ డాలర్లతో ఈ జాబితో టాప్‌లో ఉండగా, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ 121 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 102 బిలియన్ డాలర్లు, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. బిలియనీర్ల జాబితాలో టిమ్ కుక్ చేరడం అసాధారణమైందని మార్కెట్ పండితులు విశ్లేషించారు. ఒక వ్యవస్థకు చెందిన ఫౌండర్ కాని సీఈఓ బిలియనీర్ గా అవతరించడం చాలా అరుదు అని పేర్కొన్నారు. గత నెల జూలైలో సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు కంపెనీని వెనక్కి నెట్టి మరీ, ఆపిల్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలిపిన ఘనత కుక్ దే అని ప్రశంసించారు. ఆయన సారధ్యంలో ఆపిల్ ఆదాయం, లాభాలు రెట్టింపు అయ్యాయని గుర్తు చేశారు. కాగా 44 సంవత్సరాల కితం స్టీవ్ జాబ్స్ ఆపిల్ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. జాబ్స్ మరణించినప్పుడు ఆపిల్ నికర విలువ సుమారు 350 బిలియన్ డాలర్లు. -
చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ భారత దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు ఐదో వంతు చైనా నుండి భారతదేశానికి తరలించాలని యోచిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన భారత ప్రభుత్వ కొత్త ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలని ఆపిల్ భావిస్తోందట. ఈ మేరకు గత కొన్ని నెలలుగా ఆపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య పలు భేటీలు కూడా పూర్తయ్యాయని, రాబోయే ఐదేళ్ళలో సుమారు 40 బిలియన్ డాలర్లు విలువైన ఉత్తులను తీసుకురానుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే, ఐఫోన్ తయారీదారు భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం స్థానిక సోర్సింగ్ నిబంధనలపై ఇచ్చిన సడలింపులపై ఆపిల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. ప్రస్తుతం, ఆపిల్ తన స్మార్ట్ఫోన్లు ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి కోసం తయారీదారులైన ఫాక్స్ కాన్, విస్ట్రాన్‌లను ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంట్రాక్టర్ల ద్వారానే భారతదేశంలో 40 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ప్రధానంగా ఈ ఉత్పత్తులను ఎక్కువగా ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చాలా తక్కువ మార్కెట్ శాతం ఉన్న నేపథ్యంలో ఎగుమతి ప్రయోజనాల కోసం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచనుందని అంచనా. దేశీయంగా ఆపిల్ ఐఫోన్ 7 ఐఫోన్ ఎక్స్ఆర్ను ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6 ఎస్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని భావించినా, గ్లోబల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో నుండి వీటిని తొలగించడంతో దీనికి బ్రేక్ పడింది. (భారీ పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ : రిలయన్స్ దూకుడు) ఆపిల్ ప్రస్తుతం భారతదేశంలో రీసెల్లర్స్ ద్వారా మాత్రమే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇటీవల దేశంలో రిటైల్ స్టోర్ల ఏర్పాటు ప్రయత్నాలను వేగవంతం చేస్తోందన్న అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. 2021 లో దేశంలో మొట్టమొదటి ఆపిల్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఫిబ్రవరిలో పెట్టుబడిదారుల సమావేశంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటించడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆపిల్ గత త్రైమాసికంలో భారతదేశ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 62.7శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. కాగా ఈ నివేదికలను ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు. (పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ విచారణ షురూ!) -
యాపిల్‌కు కరోనా దెబ్బ
బెర్కిలీ, అమెరికా: కరోనా వైరస్ వ్యాప్తిపరమైన ప్రతికూల పరిణామాలతో టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు మందగించాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ఐఫోన్ విక్రయాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7 శాతం తగ్గాయి. సంస్థ లాబాలు 2 శాతం క్షీణించి 11.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సరఫరాపరమైన సమస్యలు, వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమలవుతున్న లాక్డౌన్ కారణంగా స్టోర్స్ మూతబడటం తదితర అంశాలు ఇందుకు కారణం. అయితే, ఆదా యం స్వల్పంగా 1 శాతం పెరిగి 58.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2007– 2009 కాలంలో తలెత్తిన మాం ద్యం నాటి పరిస్థితి కన్నా ప్రస్తుత మందగమ నం మరింత తీవ్రంగా ఉండవచ్చని యాపిల్ సీఈవో టిమ్ పేర్కొన్నారు. అయితే, అనలిస్టుల అంచనాలకన్నా యాపిల్ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశ్రమవర్గాలు తెలిపా యి. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదా యం 6% పడొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. -
కరోనా : యాపిల్ రీటైల్ స్టోర్లు బంద్
కోవిడ్-19 (కరోనా వైరస్) విలయంతో టెక్దిగ్గజం యాపిల్ కూడా కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. మార్చి 27 వరకు తన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలన్నీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఒక ప్రకటించింది.అయితే కరోనా వైరస్ మొదలైన చైనాలో పరిస్థితి కాస్త కుదుటు పడ్డంతో, అక్కడ యాపిల్‌స్టోర్‌ను తిరిగి ప్రారంభించింది. అయితే ప్రపంచదేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తుండటం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా స్టోర్లను తాత్కాలిగా మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. యాపిల్ కార్యాలయాలు, ఉద్యోగుల్లో, కరోనా వ్యాప్తిని నివారించడానికి చేయగలిగినదంతా చేయాలి. ఈ నేపథ్యంలోనే మార్చి 27వరకు గ్రేటర్ చైనా వెలుపల అన్ని దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్టు యాపిల్ సీఈవో ట్విటర్లో వెల్లడించారు. అయితే యాపిల్ అధికారిక వెబ్సైట్ (www.apple.com) యాప్ స్టోర్ ద్వారా ఆన్లైన్లో వినియోగదారులకు అందుబాటులోవుంది. ఏవైనా సందేహాలుంటే వినియోగదారులు ఆన్లైన్ ఆపిల్ కస్టమర్ కేర్‌ను సందర్శించవచ్చు. అంతేకాదు కోవిడ్-19కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు ఒకవిభాగాన్ని కూడా ప్రారంభించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఆపిల్ తన డెవలపర్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆన్లైన్ ఫార్మాట్‌ను ఆశ్రయిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2020 ఆన్లైన్ కీనోట్, సెషన్లు ఆన్లైన్లోనే వుంటాయని గ్లోబల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫిల్ షిల్లర్ తెలిపారు. రానున్న వారాల్లో మరింత సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతానికి, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 1,45,000 మందికి పైగా సోకింది. 5400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో ఈ కోరన్ కోరలకు చిక్కిన వారి సంఖ్య శనివారం నాటికి 84కు చేరింది. జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించగా, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అన్ని విద్యాలయాలు, సినిమా థియేటర్లను, షాపింగ్‌మాల్స్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటిచాయి. In our workplaces and communities, we must do all we can to prevent the spread of COVID-19. Apple will be temporarily closing all stores outside of Greater China until March 27 and committing $15M to help with worldwide recovery. https://t.co/ArdMA43cFJ — Tim Cook (@tim_cook) March 14, 2020 -
శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్
వారెన్ బఫెట్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెం. 1 స్థానంలో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం బిలియనీర్ వారెన్ బఫెట్ ఓ అద్భుతం చేశాడు. ఆపిల్ పెట్టుబడిదారుడుగా ఉన్న ఆయన ఎట్టకేలకు స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. అదీ శాంసంగ్‌కు బై చెప్పి, ఆపిల్ ఐ ఫోన్‌ను తీసుకోవడం విశేషం. సుదీర్ఘ కాలం నుంచి ఆయన ఉపయోగిస్తున్న శాంసంగ్ హెవెన్ ఫ్లిప్ ఫోన్‌ను పక్కకు పడేసి తాజాగా ఐఫోన్ 11 తీసుకున్నారు. అయితే ఐఫోన్ 11లో ఏ రకం మోడల్ ఉపయోగిస్తున్నారనేది మాత్రం చెప్పలేదు.(యాపిల్‌కూ ‘వైరస్’) ఇప్పటికే ఆపిల్ సంస్థలో 5.6 శాతం వాటాను బఫెట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని విలువ 70 బిలియన్లు. ఇప్పటి వరకు ఫ్లిప్ ఫోన్‌ను ఉపయోగించిన బఫెట్ ప్రస్తుతం దానిని వాడటం లేదని స్మార్ట్ ఫోన్‌ను స్వీకరిస్తున్నానని వెల్లడించారు. నా ‘ఫ్లిప్ ఫోన్ శాశ్వతంగా పోయింది’ ఆయన అని పేర్కొన్నారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ దీనిపై స్పందించారు. చాలా కాలం నుంచి బఫెట్‌కు కొత్త ఫోన్ కొనాలని సూచించానని.. ఇప్పుడు ఆయన ఐఫోన్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా కొత్త ఐఫోన్ కొన్నా కేవలం ఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగిస్తానని, అందులోని ఆప్షన్ల జోలికి వెళ్లనని వారెన్ బఫెట్ తెలిపారు. బఫెట్ వద్ద ప్రస్తుతం ఐపాడ్ కూడా ఉంది. దానిని పరిశోధన కొరకు, స్టాక్ మార్కెట్ ధరలను చూసుకోడానికి వాడుతానని ఆయన పేర్కొన్నారు. చదవండి : (ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు) -
యాపిల్ లాభం 2,200 కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ గత ఏడాది అక్టోబర్– డిసెంబర్ క్వార్టర్లో రికార్డ్ స్థాయి ఆదాయాన్ని, నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది అక్టోబర్– డిసెంబర్ క్వార్టర్‌కు గాను 2,200 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.1,56,200 కోట్లు) నికర లాభం సాధించామని యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ తెలియజేశారు. మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో 9,180 కోట్ల డాలర్లకు (రూ.6,51,780 కోట్లకు) పెరిగిందని పేర్కొన్నారు, నికర లాభం, ఆదాయాల పరంగా తమ కంపెనీకి ఇవే అత్యధిక మొత్తాలని వెల్లడించారు. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ అమ్మకాల శాతం 61గా ఉన్నట్లు చెప్పారు. 5,600 కోట్ల డాలర్లకు ఐఫోన్ ఆదాయం డిసెంబర్ క్వార్టర్లో ఐఫోన్ల ఆదాయం 8 శాతం వృద్ధితో 5,600 కోట్ల డాలర్లకు పెరిగింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉండటమే దీనికి కారణం. ఐప్యాడ్ల ఆదాయం 600 కోట్ల డాలర్లు, మ్యాక్‌ల ఆదాయం 720 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. భారత్‌లో...: యాపిల్ కంపెనీ అమ్మకాలు భారత్‌లో జోరుగా ఉన్నాయి. ఐఫోన్ అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించగా, ఐపాడ్ల అమ్మకాలు పటిష్టంగానే ఉన్నాయి. డిసెంబర్ క్వార్టర్లో వేగంగా వృద్ధి సాధించిన బ్రాండ్లలో ఒకటిగా యాపిల్ నిలిచిందని రీసెర్చ్ సంస్థ, కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. భారత్‌లో అమ్మకాలు గణనీయంగా పెరగగలవని యాపిల్ భావిస్తోంది. అందుకే ఇక్కడ ఐఫోన్ల తయారీ జోరును పెంచింది. ఐఫోన్ ఎక్స్ఆర్ తయారీని గతేడాది ప్రారంభించింది. చెన్నైలోని మూతపడిన నోకియా ప్లాంట్‌ను టేకోవర్ చేస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ఈ మార్చి నుంచి ఆరంభమవుతాయని అంచనా. ఇక్కడ చార్జర్లు, ఇతర పరికరాలను యాపిల్ కంపెనీ తయారు చేయనుంది. -
యాపిల్ స్పెషల్ ఈవెంట్ అదిరిపోయే ఫోటోలు
-
‘ఎలా ఉన్నారు టిమ్ యాపిల్’
వాషింగ్టన్ : జీవితంలో మనం కలవాలనుకున్న ముఖ్యమైన వ్యక్తిని నిజంగా కలిసినప్పుడు ఆనందంతో మాటలు రావు. ఒక వేళ మాట్లాడిన ఆ ఉద్వేగంలో ఏం మాట్లాడతామో మనకే తెలీదు. ఇదే పరిస్థితి ఢిల్లీకి చెందిన పలాశ్ తనేజా అనే కుర్రాడికి ఎదురయ్యింది. ఆ సమయంలో అతడు ఏం చేశాడో ఆ వివరాలు.. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలవాలనేది పలాశ్ చిరకాల కోరిక. కొన్ని రోజుల క్రితం ఆ కల నిజమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఓ 13 మంది విద్యార్థులను టిమ్ కుక్ ఆహ్వానించారు. వీరిలో పలాశ్ కూడా ఉన్నాడు. ఈ విద్యార్థులతో పాటు యాపిల్ సిబ్బంది కుక్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కుక్ రానే వచ్చారు. అప్పుడు పలాశ్ యాపిల్ సీఈవోను ఉద్దేశిస్తూ.. ‘టిమ్ యాపిల్.. ఎలా ఉన్నారు’ అని ప్రశ్నించాడు. పలాశ్ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కంటే ముందు టిమ్ కుక్‌తో సహా అక్కడున్న సభ్యులంతా ఒక్క సారిగా నవ్వారు. ఆ తర్వాత కుక్ ‘నేను బాగున్నాను. నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నేను అర్థం చేసుకోగలను’ అంటూ చిరునవ్వుతో ముందుకు సాగారు. ఇంతకు ఇక్కడ విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో టిమ్ కుక్‌తో సమావేశమయ్యారు. ట్రంప్‌ది అసలే హాఫ్ మైండ్ కదా. దాంతో యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కాస్తా టిమ్ యాపిల్‌గా సంభోందించారు. టిమ్ ఇంటి పేరును.. కంపెనీ లోగోను కలిపి ఇలా పిల్చారన్నమాట. ఈ ప్రయోగం ఏదో బాగుందని భావించిన కుక్ ఆ రోజు నుంచి తన ట్విటర్ పేరును కాస్తా టిమ్ యాపిల్‌గా మార్చుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పలాశ్ టిమ్ కుక్‌ను.. టిమ్ యాపిల్‌గా సంభోదించడం.. దానికి కుక్ నవ్వడం జరిగాయి. ఇక పలాశ్ విషయానికోస్తే.. ఎనిమిదో తరగతి నుంచే అతను కోడింగ్ మీద ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ ఆసక్తే అతనికి టిమ్‌తో సమావేశమయ్యే అవకాశం కల్పించింది. భారత్‌ను నుంచి కేవలం పలాశ్‌కు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సమావేశంలో అతను అతడు కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత ప్రాజెక్టులను తయారు చేసి టిమ్‌కు చూపించారు. ప్రస్తుతం పాఠశాల విద్య పూర్తి చేసిన పలాశ్(18) యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చేరనున్నాడు. -
మేం చేసిన తప్పు మీరూ చేయకండి : ఆపిల్ సీఈవో
లూసియానా : సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు. కానీ ఈ క్రమంలో పర్యావరణానికి జరుగుతోన్న నష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. తాజాగా పర్యావరణ పరిరక్షణపై ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తులెన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న టిమ్ కుక్.. యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘పర్యావరణా న్ని పరిరక్షించడంలో మా తరం విఫలమైంది. మేమంతా కేవలం చర్చల పేరిట సమయాన్నంతా వృథా చేశాం. దీంతో మా తరంలో చర్చలు ఘనం, ఫలితాలు మాత్రం శూన్యం అన్నట్లుగా మారింది. మేం చేసిన తప్పు మీరు చేయకండి, ఈ తప్పు నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేయాల’ని కుక్ పిలుపునిచ్చారు. -
భారత మార్కెట్ సవాళ్లమయం..
న్యూయార్క్: దీర్ఘకాలికంగా తమకు కీలకమైనదిగా భావిస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా మాత్రం భారత మార్కెట్లో చాలా సవాళ్లున్నాయని ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయడం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి చర్యలతో భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘దీర్ఘకాలికంగా భారత్ మాకు చాలా కీలకమైన మార్కెట్‌గా భావిస్తున్నాం. స్వల్పకాలికంగా మాత్రం ఇక్కడ చాలా సవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే వీటిని అధిగమించడమెలాగన్నది నేర్చుకుంటున్నాం. భారత్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాల్లో కొన్ని మార్పులు చేశాం. ప్రాథమికంగా అవి కాస్త మెరుగైన ఫలితాలే ఇస్తున్నాయి‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కుక్ చెప్పారు. భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ సెగ్మెంట్లో తీవ్రమైన పోటీ కారణంగా గత నెలలో యాపిల్ తమ ఐఫోన్ ఎక్స్ఆర్ రేటును ఏకంగా 22 శాతం తగ్గించింది. అలాగే దేశీయంగా తయారీ కూడా ప్రారంభించిన యాపిల్.. క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. భారత్‌లో రిటైల్ స్టోర్స్ ఏర్పాటు కోసం అనుమతులు పొందేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కుక్ తెలిపారు. భారత మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధిపత్యం ఉంటుండటంపై స్పందిస్తూ.. తమ సంస్థ ఎదగడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయనడానికి దీన్ని నిదర్శనంగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. లాభం 16 శాతం డౌన్.. 2019 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో యాపిల్ లాభం 16% క్షీణించింది. 11.56 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అటు ఆదాయం కూడా అయిదు శాతం తగ్గి 58 బిలియన్ డాలర్లకు తగ్గింది. -
ట్రంప్ చర్యతో పేరు మార్చుకున్న ఆపిల్ సీఈఓ..!
వాషింగ్టన్: టిమ్‌కుక్. నేటి కాలంలో ఈ పేరు తెలియని వారుండరు. ప్రఖ్యాత మొబైల్ కంపెనీ ‘ఆపిల్’ సీఈఓగా ఆయన సుపరిచితులు. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ పనితో ఆయన తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో టిమ్‌కుక్, డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే, ఆపిల్ సీఈఓ పేరును ట్రంప్ పలుమార్లు తప్పుగా ఉచ్చరించారు. టిమ్ కుక్ బదులు.. ‘టిమ్ ఆపిల్’ అని పలికాడు. దీంతో టిమ్ అవాక్కయ్యారు. అయితే, తన ఉన్నతిని పేర్కొంటూ ట్రంప్ అలా చమత్కరించాడని గ్రహించిన టిమ్ అతన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. సమావేశం అనంతరం టిమ్ తన ట్విటర్ ప్రొఫైల్‌లో మార్పులు చేశారు ప్రొఫైల్ నేమ్.. ‘టిమ్‌తో పాటు ఉన్న ఆపిల్ సింబల్’ను జోడించాడు. టిమ్ చర్యపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వచ్చాయి. ట్రంప్ కూతురు ఇవాంకా లాఫింగ్ రియాక్షన్ ఇచ్చారు. కాగా, పేర్లను తప్పుగా ఉచ్చరించడం అమెరికా అధ్యక్షుడికి ఇది కొత్త కాదు. గతంలో లాక్‌హీడ్ మార్టీన్ సీఈఓ మారీలీన్ పేరును.. మారీలీన్ లాక్హీడ్గా పేర్కొన్నారు. 🤣🤣🤣 https://t.co/KVB6Y4VsFA — Ivanka Trump (@IvankaTrump) 7 March 2019 -
యాపిల్ టిమ్ వేతనం @రూ. 110 కోట్లు
వాషింగ్టన్: టెక్ దిగ్గజం యాపిల్ అమ్మకాలు భారీగా పెరిగిన నేపథ్యంలో సంస్థ సీఈవో టిమ్ కుక్ జీతభత్యాలు గతేడాది ఏకంగా 22 శాతం పెరిగాయి. 2018లో ఆయన ఏకంగా 15.7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 110 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. ఇందులో 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 21 కోట్లు) మూల వేతనం కాగా, 12 మిలియన్ డాలర్ల (దాదాపు 84 కోట్లు) బోనస్, 6,80,000 డాలర్లు ఇతరత్రా భత్యాల కింద చెల్లించినట్లు యాపిల్ పేర్కొంది. 2018లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా టిమ్ జీతభత్యాలు పెంచినట్లు సంస్థ వివరించింది. 2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్.. 2016లో 8.7 మిలియన్ డాలర్లు, 2017లో 12.8 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు. -
నేను గే కావడం దేవుడిచ్చిన వరం : యాపిల్ సీఈవో
న్యూయార్క్ : స్వలింగ సంపర్కడి(గే)గా ఉండటం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని ఐటీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను గే అయినందుకు గర్వపడుతున్నాను. నేను గే అని ప్రపంచానికి తెలిసాక చాలా మంది నాకు ఉత్తరాలు రాసి వారి బాధలు చెప్పుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వారి ఆవేదనను పంచుకున్నారు. నేను గే అని తెలిసాక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి చాలా మంది బయటపడ్డారు. అలాంటి వారిలో ధైర్యం నింపెందుకు నేను ప్రయత్నిస్తున్నాను. స్వలింగ సంపర్కులైనా జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు.’ అని తెలిపారు. కాగా 2014లో టిమ్‌కుక్ తాను స్వలింగ సంపర్కుడినంటూ బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో పన్నులకు సంబంధించి అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్ పాలసీలను సైతం ప్రస్తావించారు. కార్పోరేట్ పన్ను కోతలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కుక్ ప్రశంసించారు. ఇది అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు సహాయపడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. -
లెజెండరీ సింగర్ కన్నుమూత
లెజెండరీ సింగర్ అరెతా ఫ్రాంక్లిన్ (76) కన్నుమూశారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె డెట్రాయిట్‌లోని తన ఇంటిలో ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. మార్చి 25, 1942న పుట్టిన అరేత లూయిస్ ఫ్రాంక్లిన్ 14 ఏళ్ళ వయసులోనే మొదటి ఆల్బం "ది గాస్పల్ సౌండ్ అఫ్ అరేతా ఫ్రాంక్లిన్" ను విడుదల చేశారు. తన మొదటి ఆల్బంతోనే సంగీతప్రియులకు ఉర్రూత లూగించారు. మహిళల హక్కుల కోసం "రెస్పెక్ట్" (1967) గీతంతో బాగా పాపులర్ అయ్యారు. 1968లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంత్యక్రియలలో ఫ్రాంక్లిన్ "ప్రియస్ లార్డ్, టేక్ మై హ్యాండ్" పాట, అమెరికా అధ్యక్షుడి బరాక్ ఒబామా ప్రమాణీస్వీకార ఉత్సవ వేడుకల్లో "మై కంట్రీ," "ఈస్ ఆఫ్ థీ" ఆమె కరియర్లో మైలురాళ్లు. అంతేకాదు ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రభావవంతమైన కళాకారులు అందుకునే రాక్ హాల్ ఆఫ్ ఫేమ పురస్కారాన్ని అందుకున్నతొలి మహిళ. 18 గ్రామీ అవార్డులను అందుకున్నారు. అరెతా మృతిపై పలువురు సెలబ్రిటీలు, ఇతర గాయకులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆమె లేకుండా ప్రపంచాన్ని ఊహించటం కష్టం, ఆమె ఒక ప్రత్యేకమైన గాయకురాలు మాత్రమే కాదు, పౌర హక్కులకు, మహిళాసాధికారత కోసం పనిచేసిన గొప్ప మనిషి. ఆమె నిబద్ధతతో ప్రపంచంపై చెరగని ప్రభావాన్ని చూపించారంటూ బార్బ్రా స్ట్రీసాండ్, జాన్ లెజెండ్ తదితరులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందిస్తూ సంగీతం ద్వారా ఆమె ప్రపంచానిచ్చారు. ఆమె స్వరం మనకు ఊతమిస్తూనే వుంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ఆమె కుటుంబానికి, అభిమానులకు సానుభూతిని ప్రకటించారు. We mourn the passing of Aretha Franklin, the Queen of Soul. Her voice will keep lifting us, through the music she gave the world. Our thoughts are with her family, her loved ones and fans everywhere. Take her hand, precious Lord, and lead her home. 🎶 pic.twitter.com/I84HTEVZU1 — Tim Cook (@tim_cook) August 16, 2018 This photo was taken in 2012 when Aretha & I performed at a tribute celebration for our friend Marvin Hamlisch. It’s difficult to conceive of a world without her. Not only was she a uniquely brilliant singer,but her commitment to civil rights made an indelible impact on the world pic.twitter.com/Px9zVB90MM — Barbra Streisand (@BarbraStreisand) August 16, 2018 -
ఆపిల్ వాచ్ 76 ఏళ్ల వ్యక్తిని కాపాడింది!
హాంకాంగ్ : ఆపిల్ వాచ్.. ఐఫోన్‌కు కొనసాగింపుగా టెక్ దిగ్గజం తీసుకొచ్చిన వినూత్న ప్రొడక్ట్. యూజర్ల ఫోన్ కాల్స్, మెసేజ్‌ల నుంచి, హెల్త్ ఫిట్నెస్ ట్రాకర్ వరకు అన్ని రకాల పనులను ఇది చేస్తోంది. హార్ట్ రేటు స్టేటస్‌ను కనుగొనడంలో ఈ డివైజ్‌లకు మించినది మరేమీ లేదంటే అతిశయోక్తి లేదు. తాజాగా ఈ ఆపిల్ వాచే ఓ 76 ఏళ్ల వ్యక్తి ప్రాణాల్ని కాపాడింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ప్రకారం హాంకాంగ్‌కు చెందిన గాస్టన్ డీఅక్వినోను ఒక్కసారిగా హార్ట్ రేటు సాధారణ స్థాయి నుంచి ఎక్కువకి పెరిగిపోయింది. ఆ విషయాన్ని ఆపిల్ వాచ్ కనిపెట్టేసి, హార్ట్ ఎటాక్ సూచనలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. చర్చిలో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో ఆపిల్ వాచ్ ద్వారా ఈ సంకేతాలు వచ్చాయని గాస్టన్ పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్తే, నిజంగానే గుండె పోటు సంభవించబోతున్నట్టు ముందుగానే తెలిసినట్టు తెలిపారు. ‘ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలియదని డాక్టర్‌కి చెప్పా. కానీ నా హార్ట్ రేటు పెరుగుతుందని నా వాచ్ చెప్పింది’ అని గాస్టన్ అన్నారు. గాస్టన్ మాటలు విన్న డాక్టర్, మీకైనా ఆరోగ్యం కాస్త తేడాగా అనిపిస్తుందా అని గాస్టన్‌ను అడిగారు. కానీ అతను అంతా బాగున్నట్టు చెప్పినట్టు సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు రిపోర్టు చేసింది. కానీ డాక్టర్లు ఆయన ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్(ఈసీజీ) మిషన్ ద్వారా పరీక్షిస్తే, నిజంగానే హార్ట్ ఎటాక్ సంభవిస్తున్నట్టు తెలిసినట్టు పేర్కొంది. అప్పటికే గాస్టన్ గుండెకు చెందిన మూడు ప్రధాన హృదయ ధమనుల్లో రెండు పూర్తిగా మూసుకుపోయాయని, మూడోది కూడా దాదాపు 90 శాతం బ్లాక్ అయినట్టు నిర్ధారణ అయినట్టు డాక్టర్లు చెప్పారు. దీనివల్ల గుండె పోటు అధికంగా సంభవించి, మనిషి ప్రాణాలను హరింపజేస్తుందని తెలిపారు. వెంటనే డాక్టర్లు గాస్టన్కు శస్త్రచికిత్స చేశారు. గుండెకు రక్తం సరఫరా అయ్యేలా చికిత్స చేసి, గాస్టన్‌ను డిశ్చార్జ్ చేశారు. ఆపిల్ వాచ్ వల్లే తన ప్రాణాలను కాపాడుకోగలిగానని గాస్టన్ చెప్పారు. ఆపిల్ వాచే తనకు కొత్త జీవితం ఇచ్చిందని, తనకు ప్రసాదించిన ఆపిల్ వాచ్ ప్రొడక్ట్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు ఈమెయిల్ పంపారు. కార్డియాక్ సమస్యలు ఉన్న వారు ఆపిల్ వాచ్‌ను వాడితే బాగుంటుందని ఆయన సూచించారు. తన కజిన్ కూడా గత రెండు వారాల క్రితం తీవ్రమైన గుండె పోటుతో ప్రాణాలు వదిలారని, నిజంగానే తన వద్ద కూడా ఆపిల్ వాచ్ ఉంటే, తనలాగే ప్రాణాలు కాపాడుకునే అవకాశముండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గాస్టనో పంపిన ఈమెయిల్‌కు సమాధానమిచ్చిన టిమ్ కుక్, మీ స్టోరీని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు, ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆపిల్ వాచ్ యూజర్ల ప్రాణాలు కాపాడటం ఇదే తొలిసారి కాదు, ఏప్రిల్ నెలలో కూడా ఇలాంటి సంఘటనే మూడు చోటు చేసుకున్నాయి. ఆపిల్ వాచ్‌లు యూజర్లు హెల్త్ స్టేటస్‌ను పరిశీలించి, ముందస్తుగానే వారి ఆరోగ్యంపై హెచ్చరికలు, సూచనలు చేస్తున్నాయి. -
పిచాయ్ దిగ్భ్రాంతి.. సత్య నాదెళ్ల విచారం!
సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ వీడియో షేరింగ్ కంపెనీ యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ మంగళవారం ఉదయం కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం ఆమె తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచింది. కాలిఫోర్నియాలోని సాన్ బ్రునోలో ఉన్న యూట్యూబ్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారి కాల్పులు చోటుచేసుకోవడంతో బెంబేలెత్తిపోయిన యూట్యూబ్ ఉద్యోగాలు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పరిగెత్తారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయోత్పాతాన్ని నింపింది. ఈ కాల్పుల ఘటనపై గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విటర్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని పేర్కొన్నారు. ‘ఈ రోజు జరిగిన విషాదాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. ఈ కష్టసమయంలో, మా ఉద్యోగులు, యూట్యూబ్ కమ్యూనిటీకి అండగా ఉండేందుకు నేను, సుసాన్ వొజ్సిస్కి (యూట్యూబ్ సీఈవో) ప్రయత్నిస్తున్నాం. వెంటనే స్పందించిన పోలీసులకు, మాకు అండగా సందేశాలు పంపిన వారికి కృతజ్ఞతలు’ అని పిచాయ్ పేర్కొన్నారు. అటు యాపిల్, మైక్రోసాఫ్ట్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ కాల్పుల ఘటనలోని బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. గూగుల్ ఉద్యోగులకు, సంస్థకు తమ మద్దతు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ట్విట్టర్ సీఈవో, కో ఫౌండర్ జాక్ డోర్సె తదితరులు గూగుల్, యూట్యూబ్ ఉద్యోగులకు అండగా ట్వీట్ చేశారు. ఈ కష్టసమయంలో తాము వారికి అండగా ఉన్నామని, వారు త్వరగా ఈ షాక్ నుంచి కోలుకోవాలని పేర్కొన్నారు. -
ఇక యూజర్ల ఇష్టం : ఆపిల్ సీఈఓ
శాన్ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం ఆపిల్ పాత ఐఫోన్లను కావాలనే స్లో డౌన్ చేసిందని వస్తున్న ఆరోపణలపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు. ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. ఐఫోన్ బ్యాటరీ సమర్థత విషయంలో మరింత పారదర్శకంగా ఉండేలా ఆపిల్ తదుపరి ఐఓఎస్ అప్ డేట్ ఉంటుందని పేర్కొన్నారు. బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక కోసం ఫోన్ స్లో డౌన్ చేసుకోవాలా లేదా అనేది యూజర్లే మానిటర్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఇంతకు ముందులేని విధంగా బ్యాటరీ పరిస్థితిని యూజర్లే విజిబుల్‌గా చెక్ చేసుకునే అవకాశం ఇచ్చి మరింత పాదర్శకంగా ఆపిల్ ఉండనుందని చెప్పారు. బ్యాటరీ మన్నిక కోసం స్లోడౌన్ చేసుకోవాలని సూచనలు వస్తే.. అది పూర్తిగా యూజర్ల ఇష్టంపైనే అధారపడి ఉంటుందన్నారు. బ్యాటరీ విషయంలో తలెత్తుతున్న సమస్యల పట్ల యూజర్లను ఆపిల్ గత ఏడాది డిసెంబర్లో తన వెబ్సైట్లో క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. పాత ఐఫోన్ మోడల్స్ స్లోగా మారడానికి తామే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అయితే యూజర్ల విధేయతను గుర్తించడానికి, నమ్మకాన్ని మళ్లీ చూరగొనడానికి ఐఫోన్లలో పలు మార్పులు చేపడుతున్నట్టు తెలిపింది. అంతేకాక పాత ఐఫోన్ల బ్యాటరీలను రిప్లేస్ చేయడానికి సంస్థ అంగీకరించింది. చాలా తక్కువ ధరకు ఆపిల్ కొత్త బ్యాటరీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 79 డాలర్లు(సుమారు రూ.5000)గా ఉన్న బ్యాటరీ రీప్లేస్మెంట్ ధరను 29 డాలర్లకు(రూ.1,850) తగ్గించినట్టు పేర్కొంది. త్వరలోనే ఈ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది. కొత్త ఐఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో డౌన్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఫోన్ లైఫ్‌ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు ఆపిల్ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఐఫోన్ డివైజ్‌లను స్లోడౌన్ చేసిందని కంపెనీపై కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎనిమిది దావాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో లీగల్ ఫిర్యాదు కూడా దాఖలైంది. ఫిర్యాదుదారులు మిలియన్ డాలర్లను పరిహారంగా కూడా కోరుతున్నారు. ఇజ్రాయిల్ ఇదే సమస్యపై సుమారు 120 మిలియన్ డాలర్లకు ఓ దావా దాఖలైంది. -
భారీగా జీతం, ప్రైవేట్ విమానంలోనే జర్నీ
శాన్ఫ్రాన్సిస్కో : ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం భారీగా ఎగిసింది. వేతనంతో పాటు ఈయనకు భద్రత కూడా అదే స్థాయిలో పెరిగింది. టిమ్ కుక్ వేతనం 47 శాతం జంప్ చేసి, 2017లో సుమారు 13 మిలియన్ డాలర్లుగా(రూ.83 కోట్లుగా) ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. అంతేకాక ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోనే ప్రయాణించాలని పేర్కొంది. భద్రతాపరమైన కారణాలతో ఆయన వ్యక్తిగత అవసరాలకు కూడా ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌నే వాడాలని తెలిపింది. న్యూస్ షేర్‌హోల్డర్ ప్రొక్సీ స్టేట్మెంట్లో నమోదుచేసిన వివరాల ప్రకారం, టిమ్ కుక్ వ్యాపార లేదా వ్యక్తిగత అవసరాలకు ఎక్కడికి ప్రయాణించాలన్న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోనే ప్రయాణించేలా బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టు బిజినెస్ ఇన్సైడర్ గురువారం రిపోర్టు చేసింది. తమ గ్లోబల్ ప్రొఫైల్‌లో భాగంగా భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2017 నుంచి టిమ్‌కుక్‌కు ఈ పాలసీ అమలు చేస్తున్నామని, సీఈవోగా టిమ్ కుక్ బాధ్యత చాలా ముఖ్యమైనదని ఆపిల్ షేర్‌హోల్డర్ ప్రొక్సీ స్టేట్మెంట్లో ఫైల్ చేసింది. టెలిగ్రాఫ్ వివరాల ప్రకారం కుక్ 2017లో 12.8 మిలియన్ డాలర్లను ఇంటికి తీసుకెళ్లారని, దానిలో 3.06 మిలియన్ డాలర్ల వేతనం, 9.3 మిలియన్ డాలర్లు నగదు బోనస్‌లు, మిగిలినవి అదనపు పరిహారాలున్నాయని తెలిసింది. అంతకముందు ఆయనకు 5.4 మిలియన్ డాలర్ల బోనస్‌లు మాత్రమే చెల్లించేవారని రిపోర్టు పేర్కొంది. పరిహారాల ప్యాకేజీల్లో భాగంగా టిమ్ కుక్ వ్యక్తిగత ప్రయాణానికి 2017లో 93,190 డాలర్లు ఖర్చు అయినట్టు తెలిసింది. '' ఏ సమయంలోనైనా టిమ్ కుక్ వ్యక్తిగత అవసరాల కోసం ఆపిల్ ప్రైవేట్ జెట్‌ను వాడుకోవచ్చు. ఈ వ్యయాలను అదనపు పరిహారాలుగా పరిగణలోకి తీసుకుంటాం. దీనిలోనే ఆయన పన్నులు చెల్లించాలి'' అని ఆపిల్ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాక టిమ్ కుక్కు వ్యక్తిగత భద్రతా సేవలను కూడా ఆపిల్ అమలు చేస్తోంది. -
యాపిల్ ఐఫోన్10 వచ్చేసింది..
► 5.8 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లోకి ► ఐఫోన్ 8, 8ప్లస్ కూడా... యాపిల్ వాచ్ సిరీస్ 3, 4కే యాపిల్ టీవీ సైతం 8 సిరీస్ ధరలు 699 డాలర్ల నుంచి ► ఐఫోన్10 ఆరంభ ధర 999 డాలర్లు అక్టోబర్ 27 నుంచి ప్రీ–బుకింగ్... నవంబర్ 3 నుంచి డెలివరీలు క్యుపర్టినో, అమెరికా: కొత్త ఐఫోన్ సిరీస్‌కు సంబంధించిన ఊహగానాలకు తెరవేస్తూ టెక్ దిగ్గజం యాపిల్ తన తాజా ఫోన్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ‘ఐఫోన్గీ (రోమన్ 10)’ పేరిట తన తాజా సంచలనాన్ని మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటితో పాటు ఐఫోన్8, ఐఫోన్8 ప్లస్ పేరిట మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసింది. ఐఫోన్ 10ను యాపిల్ అధినేత టిమ్ కుక్ విడుదల చేయటం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... యాపిల్ ఐఫోన్ 10 స్క్రీన్ పరిమాణం 5.8 అంగుళాలు. ఓఎల్ఈడీ టెక్నాలజీతో పాటు స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, గ్లాస్ బ్యాక్, త్రీడీ టచ్, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలు దీని సొంతం. 64, 256 జీబీ సామర్థ్యాల్లో లభ్యం. ఇక ఐఫోన్ 8లో స్క్రీన్ 4.7 అంగుళాలు, ఐఫోన్ 8 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. వీటిలో 3డీ టచ్, ట్రూ టోన్ డిస్ప్లే ఫీచర్స్, ఏ11 ప్రాసెసర్ (సిక్స్ కోర్) ఉంటాయి. సిల్వర్, స్పేస్ గ్రే, బంగారం రంగుల్లో ఇవి లభిస్తాయి. ఐఫోన్ 8లో రియర్ కెమెరా 12 ఎంపీగాను, 8 ప్లస్‌లో 12 ఎంపీ సామర్ధ్యంతోను డ్యుయల్ కెమెరాలు ఉంటాయి. ఐఫోన్–8 ధర 699 డాలర్ల నుంచీ ఆరంభమవుతుండగా... 8 ప్లస్ ధర మాత్రం 799 డాలర్ల నుంచీ మొదలవుతోంది. ఐఫోన్స్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 3, వాచ్ ఓఎస్4, 4కే హెచ్డీఆర్ వీడియో ఫీచర్‌తో కొత్త యాపిల్ టీవీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. కొత్తగా నిర్మించిన యాపిల్ పార్క్ కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో వీటిని ఆవిష్కరించారు. 2007 జనవరి 9న అప్పటి యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్‌ను ప్రవేశపెట్టి.. మొబైల్ కంప్యూటింగ్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అదే ఏడాది జూన్ 29 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాక ఐఫోన్ రాత్రికి రాత్రే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. స్టీవ్ జాబ్స్ ఎప్పటికీ తమ జ్ఞాపకాల్లో ఉండిపోతారని టిమ్ కుక్ చెప్పారు. యాపిల్ పార్క్ కార్యాలయంలోకి ఈ ఏడాది ఆఖరునాటికి కార్యకలాపాలను తరలిస్తామని తెలియజేశారు. యాపిల్ వాచ్..: యాపిల్ వాచ్ సిరీస్ 3లో ఎల్టీఈ టెక్నాలజీ ఆధారిత బిల్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ సిమ్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్ మొదలైనవి ప్రత్యేకతలు. దీని ధర 329 డాలర్ల నుంచి 399 డాలర్ల దాకా (సెల్యులార్ ఆప్షన్‌తో) ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి ఆర్డర్లు స్వీకరించనుండగా, 22 నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. రోలెక్స్, ఫాసిల్, ఒమెగా, కార్టియర్ మొదలైన వాటిని దాటేసి యాపిల్ వాచ్ ప్రస్తుతం నంబర్ వన్ వాచ్‌గా ఉందని టిమ్ కుక్ చెప్పారు. -
భారత్ మాకు కీలకం
ముంబై: అపార అవకాశాలున్న భారత మార్కెట్ తమకు కీలకమని టెక్ దిగ్గజాలు యాపిల్, ఎడోబ్ పేర్కొన్నాయి. తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి 30 శాతం సిబ్బంది భారత్‌లోనే ఉన్నారని ఎడోబ్ గ్లోబల్ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్ బుధవారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. నోయిడా, బెంగళూరు తదితర మూడు కేంద్రాల్లో సుమారు 4,200 మంది ఉద్యోగులు ఉన్నారని.. ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బం ది సంఖ్యలో ఇది నాలుగో వంతు అని బుధవారం ఆయన విలేకరులకు చెప్పారు. ఎడోబ్ ప్రతి ఉత్పత్తిలో భారత సిబ్బంది వాటా ఎంతో కొంత ఉంటుందన్నారు. భారత్‌ను కేవలం తమ ఉత్పత్తుల విక్రయానికి మార్కెట్‌గా మాత్రమే పరిగణించడం లేదని, వినూత్న ఉత్పత్తుల రూపకల్పన కోసం ఇన్నోవేషన్ హబ్‌గా తాము భావిస్తామని నారాయణ్ పేర్కొన్నారు. అమెరికా కంపెనీల్లో విదేశీ నిపుణుల నియామకాలు, కార్యకలాపాల ఔట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వీసా నిబంధనలు కఠినతరం చేయడం వంటి రక్షణాత్మక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నారాయణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, భారత మార్కెట్లో పైరసీ సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని నారాయణ్ చెప్పారు. దేశీ మార్కెట్‌పై యాపిల్ దృష్టి.. న్యూయార్క్: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడంపైనా, స్థానం పటిష్టం చేసుకోవడంపైనా దృష్టి పెడుతున్నట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ భారత మార్కెట్లో తమ కార్యకలాపాలు ఇంకా పూర్తిగా విస్తరించాల్సి ఉందన్నారు. మార్చి క్వార్టర్లో భారత్‌లో తాము రికార్డు స్థాయి అమ్మకాలు సాధించామని, ఆదాయం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందిందని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా న్యూయార్క్‌లో ఆయన వివరించారు. భారత్‌లో 4జీ నెట్వర్క్ విస్తరణ మిగతా ఏ దేశంలోనూ లేనంత వేగంగా జరుగుతోందని.. యాపిల్ కార్యకలాపాల వృద్ధికి ఇది ఊతమివ్వగలదని కుక్ వివరించారు. భారత్, థాయ్‌లాండ్, కొరియా తదితర దేశాల్లో యాపిల్ అమ్మకాల వృద్ధి రేటు 20 శాతం పైగా నమోదైంది. ఏప్రిల్ 1తో ముగిసిన రెండో త్రైమాసికంలో యాపిల్ ఆదాయం 50.6 బిలియన్ డాలర్ల నుంచి 52.9 బిలియన్ డాలర్లకు ఎగిసింది. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ అమ్మకాల వాటా 65 శాతంగా ఉంది. -
ఆపిల్ ఐఫోన్‌కు బంపర్ బూస్ట్!
ఐఫోన్ అమ్మకాలు పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్న అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్‌కు తాజా క్వార్టర్ ఫలితాలు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. తాజాగా ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఆ కంపెనీ రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టిన ఐఫోన్-7కు భారీ డిమాండ్ ఏర్పడటంతో గడిచిన త్రైమాసికంలో యాపిల్ ఆదాయం గణనీయంగా పెరిగింది. గడిచిన త్రైమాసికంలో యాపిల్ 78.4 బిలియన్ డాలర్ల (రూ. 5.30 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుమునుపు ఏడాది ఇదే త్రైమాసికానికి ఆపిల్ రెవెన్యూ 75.9 డాలర్లు (రూ. రూ. 5.13 లక్షల కోట్లు) మాత్రమే. అయితే, ఆపిల్ ఆదాయం పెరిగినప్పటికీ.. డిసెంబర్‌తో ముగిసే గడిచిన త్రైమాసికంలో లాభం 2.6శాతం తగ్గి.. 17.9 బిలియన్ డాలర్లు (రూ. 1.21 లక్షల కోట్లు) నమోదుచేసింది. గడిచిన హాలిడే త్రైమాసికంలో 7.83 కోట్ల ఐఫోన్లను ఆపిల్ అమ్మింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే ఇది ఐదుశాతం అధికం. ‘మా హాలిడే క్వార్టర్ లో గతంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయిలో ఆదాయం ఆర్జించి.. పలు రికార్డులు బద్దలుకొట్టడం ఆనందంగా ఉంద’ని రెవెన్యూ వివరాలు వెల్లడిస్తూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఐఫోన్ అమ్మకాలు సాధించామని, దీంతో కంపెనీకి గణనీయమైన రెవెన్యూ వచ్చిందని ఆయన తెలిపారు. ఆపిల్ ఫలితాలు వెలువడటంతో ఆ కంపెనీ షేరు స్టాక్మార్కెట్లో మూడుశాతం పెరిగి 125.19 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఇండియా గ్రేట్: ఆపిల్ సీఈవో ప్రశంసలు
న్యూయార్క్: భారత్ లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ భావిస్తోంది. చాలా విషయాల్లో ఇండియాతో చర్చలు జరుపుతున్నామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రిటైల్ స్టోర్లసహా పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. ‘భారత్ లో ప్రధానంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడులకు భారత్ గొప్ప ప్రదేశమ’ని కుక్ పేర్కొన్నారు. ఇండియాలో పాత పెద్ద నోట్ల రద్దును ఆయన సమర్థించారు. డీమోనిటైజేషన్ గొప్ప ముందుడుగు అని వర్ణించారు. డీమోనిటైజేషన్ తో దీర్ఘకాలంలో లాభాలు కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘డీమోనిటైజేషన్ లో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ గత క్వార్టర్ లో తమ సంస్థ మెరుగైన ఆదాయ ఫలితాలు సాధించింది. నోట్ల రద్దు గొప్ప ముందడుగు. దీనితో మున్ముందు మరింత మేలు జరుగుతుంద’ని అన్నారు. భారత్ లో తమ కంపెనీ పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆపిల్ సీఈవోకు జీతం కట్!
-
ఆపిల్ సీఈవోకు జీతం కట్!
టెక్ దిగ్గజం ఆపిల్ తన టాప్ ఎగ్జిక్యూటివ్, సీఈవో టిమ్ కుక్కు ఝలకిచ్చింది.. రెవన్యూలు, లాభాలు లక్ష్యాలను చేధించలేకపోవడంతో 2016లో ఆయనకు అందించే పరిహారాలను తగ్గించేసింది. సెక్యురిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించిన ప్రకటనలో టిమ్ కుక్ గతేడాది 2016లో ఆర్జించిన మొత్తం పరిహారం 8.75 మిలియన్ డాలర్ల(రూ.59 కోట్లకుపైగా)గా ఆపిల్ పేర్కొంది. ఆయన జీతం 1 మిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ, ఏడాదికి ఆయనకు అందే పరిహారం మాత్రం తగ్గిపోయినట్టు చెప్పింది. 2015లో టిమ్ కుక్ 10.28 మిలియన్ డాలర్ల(రూ.69 కోట్లకు పైగా) ఆదాయన్ని ఆర్జించారు. వారి టార్గెట్ వార్షిక ప్రోత్సహకాల్లో భాగంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు 89.5 శాతం పొందుతారు. కానీ కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు 4 శాతం మందగించాయి. 223.6 బిలియన్ డాలర్లగా పెట్టుకున్న లక్ష్యాన్ని కంపెనీ చేధించలేకపోయింది. నిర్వహణ ఆదాయం 0.5 శాతం పడిపోయింది. మొత్తంగా 2016లో కంపెనీ నికర విక్రయాలు, నిర్వహణ ఆదాయాలు 7.7 శాతం, 15.7 శాతం పడిపోయినట్టు ఆపిల్ పేర్కొంది. ఇది ఎగ్జిక్యూటివ్ పరిహారంపై పడినట్టు తెలిపింది. గత 15 ఏళ్లలో మొదటిసారి ఆపిల్ తన రెవెన్యూలను కోల్పోయింది. -
టిమ్ కుక్ రాయని డైరీ
కంపెనీలు ఫ్లాప్ అయినట్లే కంట్రీలూ ఫ్లాప్ అవుతుంటాయి. నలభై యేళ్ల ఆపిల్ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద ఫ్లాప్.. ‘గేమ్స్ కన్సోల్’. కంపెనీకే మచ్చ. ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఐపాడ్లు, మ్యాక్‌లు.. ఎన్ని గొప్ప ఇన్వెన్షన్లు! కానీ మచ్చ మచ్చే. హిస్టరీని మెరుపుల కన్నా, మరకలే బాగా పట్టేసుకుంటాయి. మెరుపు మెరిసిన ప్రతిసారీ మచ్చ కనబడిపోతుంది. నలభై నాలుగు మంది గొప్ప అధ్యక్షులతో మెరిసిన అమెరికా ఇప్పుడు చేజేతులా తన ముఖం మీదికి మచ్చను తెచ్చుకుంది. ట్రంప్ ఇప్పుడు అమెరికాకు నలభై ఐదవ అధ్యక్షుడిగా మాత్రమే కాదు, అమెరికాలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈఓగా కూడా కనిపిస్తున్నాడు! నా క్యాబిన్ వైపు నడుస్తున్నాను. ఒక్క చిరునవ్వూ లేదు. ఆగి అడిగాను. ఏంటలా ఉన్నారని! ‘‘గుడ్మాణింగ్ మిస్టర్ ప్రెసిడెంట్’’ అనేసిందో ఇంటెర్నీ! వెంటనే తేరుకుని, ‘సారీ సర్’ అంది! తను అమెరికన్ కాదు. కానీ తన లాంటి వాళ్లు లేకుండా నా అమెరికన్ కంపెనీ లేదు. నవ్వుతూ తన వైపు చూశాను. ‘అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే మారాడు. ఆపిల్ కంపెనీ ఎప్పటిలానే ఉంది’ అని చెప్పాను. అమెరికా లాంటిదే ఆపిల్ కంపెనీ. అన్ని దేశాలూ ఉంటేనే అమెరికా. అన్ని దేశాల ఉద్యోగులు ఉంటేనే ఆపిల్ కంపెనీ. ‘‘ఫ్రెండ్స్.. ట్రంప్ ఎలాగైతే అమెరికా అధ్యక్షుడో, మనమంతా అలాగ ఆపిల్ ఉద్యోగులం. ఆయనది వైట్ హౌస్ అయితే మనది ఆపిల్ హౌస్’’ అన్నాను నవ్వుతూ. ఎవరూ నవ్వలేదు. నవ్వు ముఖం మాత్రం పెట్టారు. ట్రంప్ క్యాంపెయిన్ స్పీచ్ వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లుంది! ‘‘సీ.. మనల్ని ఎవరూ విడదీయలేరు. కలిసి పని చేయడమే ఇక్కడ మనం చేయవలసిన పని కాబట్టి మనల్ని ఎవరూ విడదీయలేరు. కొత్తగా వచ్చేవాళ్లనీ మనతో కలవనీయకుండా ఎవరూ చెయ్యలేరు. కొత్త ఐడియాలతోనే మనం ఎప్పుడూ పనిచేస్తుండాలి కాబట్టి మనతో ఎవర్నీ కలవనీయకుండా చేయలేరు. ట్రంప్ గురించి నాకు తెలుసు. ఆపిల్ ప్రోడక్ట్లను ఎవరూ కొనద్దని ఆయన ట్వీట్ చేసిన మాట నిజమే. కానీ ఎలా ట్వీట్ చేశారో తెలుసా? ఆపిల్ ఐఫోన్లోంచి!’’ ఒక్కసారిగా నవ్వులు. ఏడు ఖండాల నవ్వులు. ఏడు సముద్రాల నవ్వులు. ఈజ్ అవుతున్నారు నా స్టాఫ్ కొద్దికొద్దిగా. ‘‘అందరం కలిసే పనిచేద్దాం. ట్రంప్‌కి ఓటు వేసివచ్చినవాళ్లం, ట్రంప్‌కి వెయ్యకుండా వచ్చినవాళ్లం.. అందరం కలిసే పని చేద్దాం. ముందు ఏముందో తెలియదు. కానీ ముందుకేగా వెళ్లాలి. అంతా కలిసే వెళదాం’’. ‘‘యా.. సర్’’ అంది .. అంతకుక్రితం నన్ను ‘మిస్టర్ ప్రెసిడెంట్’ అని సంబోధించిన అమ్మాయి నవ్వుతూ. తన నవ్వుతో ఆపిల్ కంపెనీ మొత్తానికే వెలుగు వచ్చినట్లుగా అనిపించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని నిరంతరం వెలిగిస్తూ ఉండేవి ఇలాంటి భయం లేని నాన్–అమెరికన్ నవ్వులే. -మాధవ్ శింగరాజు -
టిమ్ కుక్ వర్సస్ సుందర్ పిచాయ్.. గెలుపెవరిదో?
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్‌ను అధిగమించి, భారత్ మార్కెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆపిల్ ఓ వైపు ప్రయత్నిస్తుండగా.. సొంత ఆండ్రాయిడ్ డివైజ్లతో మార్కెట్లను ఏలాలని గూగుల్ రంగంలోకి దిగింది. చైనా తర్వాత ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఎక్కువగా దృష్టిసారించిన భారత్ మార్కెట్లో.. ఆ కంపెనీకి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గట్టిపోటీని ఇస్తున్నారు. ఆపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్లను భారత్ లో లాంచ్ చేయగా...గూగుల్ తన సొంత బ్రాండులోని కొత్త ఫిక్సెల్ స్మార్ట్ఫోన్లను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి గూగుల్ లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా .. ముందస్తుగానే ఆండ్రాయిడ్ మార్కెట్ అంతటిన్నీ తన సొంతం చేసుకుంది. భారత్‌లో 94 శాతం స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆండ్రాయిడ్ ఓఎస్ డివైజ్లే ఏలుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు అత్యాధునికమైన డివైజ్‌లుగా ఆపిల్‌కు ఎంతో పేరుంది. ఆపిల్‌కు పోటీగా హై ఎండ్ డివైజ్‌లను తాము తీసుకొచ్చామంటూ గూగుల్ సీఈవో ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రకటించిన ఆపిల్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఆపిల్ విక్రయాలు గ్లోబల్‌గా దెబ్బతిన్నప్పటికీ, భారత్ మార్కెట్లో మెరుగైన ఫలితాలనే సాధించింది. భారత్‌లో ఐఫోన్ విక్రయాలను 50 శాతం పెంచుకున్నట్టు ప్రకటించింది. అయితే గూగుల్ కంపెనీ నుంచి తమకు గట్టి పోటీ వాతావరణం నెలకొందని పేర్కొంది. కానీ ఆండ్రాయిడ్ డివైజ్ ల ఆధిపత్యాన్ని తాము ఎలాగైనా కొల్లగొడతామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గట్టిగా నొక్కి చెప్పారు. చైనా తర్వాత తాము ఎక్కువగా ఇండియా మార్కెట్‌పైనే దృష్టిసారించామని టిమ్ కుక్ తెలిపారు. రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్ సహకారంతో గూగుల్, శాంసంగ్‌లను తాము అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒక్కసారి ఆండ్రాయిడ్ కస్టమర్లు ఐఫోన్ల వైపు మరిలితే, వారు ఇతర ఓఎస్‌లను కనెత్తి కూడా చూడరని విశ్లేషకులంటున్నారు. గూగుల్, తన ఆండ్రాయిడ్ కస్టమర్లను వదులుకుంటే, మళ్లీ వారిని తనవైపు మరలుచుకోవడం కొంత కష్టతరమేనంటున్నారు విశ్లేషకులు. అంతేకాక పాతుకుపోయిన ఆండ్రాయిడ్ డివైజ్‌లను మార్కెట్ నుంచి తొలగించడం ఆపిల్‌కూ ఓ పెద్ద సవాలేనట. ధర పరంగా కూడా ఆపిల్ కొత్త ఐఫోన్7, గూగుల్ కొత్త పిక్సెల్ ఫోన్ లు గట్టి పోటీ ఇంచుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భారత్ మార్కెట్ ఇటు ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు, అటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న మార్కెట్లో గెలుపెవరిదో వేచిచూడాల్సిందే. ఎవరి వ్యూహాలు ఎలా ఫలిస్తాయో. -
ఔను! మమల్ని టార్గెట్ చేశారు!
డబ్లింగ్: తమ కంపెనీపై యూరోపియన్ యూనియన్ రూ. లక్ష కోట్ల (13 బిలియన్ యూరోల) పన్ను జరిమానా విధించడంపై యాపిల్ సీఈవో టిమ్ కుక్ తీవ్రంగా స్పందించారు. ఈ జరిమానా పనికిమాలిన రాజకీయ చర్య అని ఆయన విమర్శించారు. అమెరికా వ్యతిరేక భావజాలం ఈ తీర్పునకు కారణం కావొచ్చునని ఆయన ఓ దినపత్రిక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఐర్లాండ్‌తో కలిసి గట్టిగా పోరాడుతామని, నిజాలతో, చట్టాలలో ప్రమేయం లేకుండా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని ఆయన మండిపడ్డారు. 'మేం ఏ తప్పు చేయలేదు. మేం కలిసి ముందుకు సాగుతాం. ఐర్లాండ్‌ను ఎంచుకొని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదు' అని కుక్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన బహుళ జాతి కంపెనీలపై వ్యతిరేకత వల్ల తమపై ఇంత భారీమొత్తంలో జరిమానా విధించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. 'యాపిల్‌ను టార్గెట్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. ఇందుకు అమెరికా వ్యతిరేక సెంటిమెంటు ఒక కారణం కావొచ్చు' అని కుట్ ఆ పత్రికతో వ్యాఖ్యానించారు. ఐర్లాండ్ చేసుకున్న పన్నుమినహాయింపు ఒప్పందాలను సాకుగా పెట్టుకొని యూరప్‌లో తన ఉత్పత్తుల అమ్మకాలపై యాపిల్ పన్ను ఎగ్గొడుతున్నదని, ఇందుకు దాదాపు రూ. లక్ష కోట్ల జరిమానాను చెల్లించాలని యూరోపియన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మ్యాక్ కంప్యూటర్లతో మార్కెట్ ను దోచేస్తాం
కోల్ కత్తా : భారత్ లో కేవలం ఐఫోన్ అమ్మకాలను మాత్రమే కాదు.. మ్యాక్ కంప్యూటర్లపై కూడా టెక్ దిగ్గజం యాపిల్ దృష్టి సారిస్తోంది. చిన్న చిన్న పట్టణాలకు మ్యాక్ కంప్యూటర్లను తీసుకెళ్తూ.. మ్యాక్ కంప్యూటర్ అమ్మకాల పంపిణీని పెంచుకుని భారత మార్కెట్ ను దోచేయాలని చూస్తోంది. ఇతర కంపెనీల ఎలక్ట్రానిక్ స్టోర్ల ద్వారా మ్యాక్ కంప్యూటర్లను వినియోగదారులకు చేరువలో ఉంచాలని భావిస్తోంది. మ్యాక్ కంప్యూటర్లకు టాప్-10 మార్కెట్ గా ఉన్న భారత్ లో, పర్సనల్ కంప్యూటర్ల పెట్టుబడులు పెంచాలని ప్రస్తుతం ఈ టెక్ దిగ్గజం ప్లాన్ చేస్తుందని యాపిల్ కు సంబంధించిన ఇద్దరు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 75 సిటీలుగా ఉన్న మ్యాక్ కంప్యూటర్ల పంపిణీ అందుబాటును, వచ్చే రెండు, మూడేళ్లలో రెండింతలు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న కంప్యూటర్ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ స్టోర్ల ద్వారా యాపిల్ మ్యాక్ కంప్యూటర్ల పంపిణీని పెంచుకోనుందని చెప్పారు. ఇప్పడివరకూ మ్యాక్ కంప్యూటర్లు కేవలం యాపిల్ స్టోర్లలోనూ, ఆన్ లైన్ లోనూ, అతిపెద్ద రిటైల్ చైన్స్ క్రోమా, రిలయెన్స్ డిజిటల్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. యాపిల్ కలిగి ఉన్న కన్సూమర్ పీసీ విభాగ 8-9శాతం మార్కెట్ల షేరులో భారత్ కూడా ఒకటి. మ్యాక్ వ్యాపారాల రెవెన్యూలు గత కొన్నేళ్లలో 100శాతానికి పైగా పెరిగాయి. యాపిల్ కు మ్యాక్ పీసీ సరుకు రవాణా ఏడాదియేడాదికి 50 శాతం పైగా పెరుగుతున్నాయి. ఐఫోన్ బిజినెస్ లు పడిపోయి యాపిల్ నిరాశలో ఉన్నప్పటికీ మ్యాక్ కంప్యూటర్లకు వస్తున్న ఆదరణ ప్రస్తుతం యాపిల్ కు ఊరటగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ ట్రాకర్ ఐడీసీ నివేదిక ప్రకారం, భారత్ లో కంప్యూటర్ విభాగంలో 32.7శాతం షేరుతో జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అగ్రస్థానంలో ఉంది. హెచ్ పీ 29.1శాతం షేరు, డెల్ 17.1శాతం మార్కెట్ షేరును కలిగి ఉన్నాయి. -
ఇక యాపిల్ మేకిన్ ఇండియా!
ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటీ - యాపిల్ ఉత్పత్తుల తయారీ అవకాశాలపై చర్చ న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్... శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ అవకాశాలపై, యువత నైపుణ్యాలు, ఉపాధి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా ఎన్స్క్రిప్షన్ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. టిమ్ కుక్ భారతీయ యువతను మెచ్చుకున్నారు. భారతీయ యువతలో మంచి నైపుణ్యాలు, సామర్థ్యాలున్నాయని, వాటిని యాపిల్ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో యాప్ డెవలప్మెంట్ వృద్ధి ఆవశ్యకతను వివరించారు. భారత్‌లో కంపెనీ భవిష్యత్ కార్యాచరణను వివరిస్తూ.. బెంగళూరులో యాప్ డెవలప్మెంట్ సెంటర్ ఆవిష్కరణ, హైదరాబాద్‌లో మ్యాప్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. అలాగే పునరుత్పాదక ఇంధనం, దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల ఏర్పాటు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. తాజా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోదీ ఆయనకు డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి వివరించారు. దీని ద్వారా ఈ-విద్య, ఆరోగ్యం, రైతుల ఆదాయం పెరుగుదల అంశాలను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాపిల్ భాగస్వామిగా మారాలని కోరారు. భారత ఆతిథ్యం అపూర్వం భారత్‌లో స్వాగత మర్యాదలు బాగున్నాయని కుక్ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ముంబై సిద్ధి వినాయక గుడి దర్శనం, కాన్పూర్ క్రికెట్ మ్యాచ్ వీక్షణం వంటి అంశాలకు సంబంధించిన అనుభూతులను మోదీతో పంచుకున్నారు. దానికి మోదీ స్పందిస్తూ... ‘‘కళ్లారా చూడటమే నమ్మకం’’ అన్నారు. ‘‘భారత్‌లోని మీ అనుభవాలు మీ వ్యాపార నిర్ణయాలను తప్పక ప్రభావితం చే స్తాయని భావిస్తున్నాం’’ అని కూడా చెప్పారు. కుక్‌తోపాటు ఉన్న కొందరు కంపెనీ ప్రతినిధులు రాజస్తాన్‌లోని సౌర విద్యుత్‌తో కళకళలాడుతున్న కొన్ని గ్రామీణ ప్రాంతాల గురించి, సౌర విద్యుత్ ఉపకరణాల అసెంబ్లింగ్‌లో మహిళలు చూపిస్తున్న నైపుణ్యాల గురించి మోదీతో ముచ్చటించారు. ఇదే సరైన సమయం భారత్‌లో తాము సుదీర్ఘకాలం పాటు కార్యకలాపాలను సాగించాలనుకుంటున్నట్లు కుక్ చెప్పారు. దేశంలో టెలికం సంస్థలు 4జీ హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభిస్తుండటంతో ఇక్కడ విస్తరించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తుండటం.. భారత్‌లో మాత్రం 56 శాతం పెరగ డం.. వంటి అంశాల నేపథ్యంలో యాపిల్ తన వృద్ధి కోసం ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది. కాగా కంపెనీ తన సెకండ్ హ్యాండ్ ఫోన్లను భారత్‌లో విక్రయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మోదీ-కుక్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘నరేంద్ర మోదీ’ యాప్ నరేంద్రమోదీ మొబైల్ యాప్‌లో కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. మోదీతో సమావేశం సందర్భంగా టిమ్ కుక్.. ఈ అప్డేటెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఇన్ఫోగ్రాపిక్స్, మీడియా కవరేజ్, వాచ్ లైవ్, మన్ కీ బాత్ ప్రసంగాలు, ఇంటర్వ్యూ, బ్లాగ్స్, బయోగ్రఫీ, గవర్నెన్స్ వంటి తదితర విభాగాలున్నాయి. ఇన్ఫోగ్రాఫిక్స్లోకి వెళితే అక్కడ ప్రభుత్వ పాలనకు సంబంధించిన గ్రాఫిక్స్ కనిపిస్తాయి. బయోగ్రఫీపై క్లిక్ చేస్తే మోదీ జీవిత విశేషాలను తెలుసుకోవచ్చు. అలాగే యాప్‌లో ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లను, ప్రధాని ప్రసంగాలను వినొచ్చు. ప్రధానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా మన అభిప్రాయాలను ఆయనకు పంపొచ్చు. యాప్‌లో కొత్తగా ‘మై నెట్వర్క్’ అనే ఫీచర్ పొందుపరిచారు. ఇక్కడ ఒక అంశం గురించి చర్చను ప్రారంభించవచ్చు. అలాగే ఇతరులను చర్చలోకి ఆహ్వానించవచ్చు. -
మోదీ యాప్ విడుదల చేసిన ఆపిల్ సీఈవో
న్యూఢిల్లీ: ఆపిల్ సీఈవో టిమ్ కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ' మొబైల్ యాప్ ను కుక్ విడుదల చేశారు. టిమ్ కుక్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, భారత్ లో పర్యటించడం పట్ల మోదీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అందుకు సమాధానం ఇచ్చిన కుక్ త్వరలో మరోసారి ఇండియాకు రావడానికి ఇప్పటినుంచి ప్రణాళికలు తయారుచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా విడుదల చేసిన అప్ డేటెడ్ యాప్ లో వాలంటరీంగ్ సంబంధించిన సరికొత్త వివరాలున్నాయని వెల్లడించారు. కుక్ చేతుల మీదుగా యాప్ రిలీజ్ కావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు. -
భారత్‌తో మరో వెయ్యేళ్ల బంధం మాది..!
నేను ఇక్కడివాడినేనన్న అనుభూతి కలుగుతోంది... ♦ సెకండ్ హ్యాండ్ ఫోన్లను కూడా విక్రయిస్తాం.. ♦ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడి న్యూఢిల్లీ: ‘భారత్‌ను చరిత్రాత్మక దృష్టితో చూస్తున్నా. ఏడాదో లేదంటే కొన్నేళ్ల కోసమో మేం ఆలోచించడం లేదు. వచ్చే వెయ్యేళ్లపాటు మేము (యాపిల్) ఇక్కడ ఉండాలన్నదే మా లక్ష్యం. అసలు నేను ఇక్కడివాడినేనన్న అనుభూతికి లోనవుతున్నా’ అంటూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. భారత్ పర్యటనలో ఉన్న కుక్ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్. ఇక్కడ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నాం. మా ఉత్పత్తి ఏదైనా అత్యుత్తమంగానే ఉంటుంది. అంతేకానీ, భారీ సంఖ్యలో విక్రయాల కోసం మేం చూడం. ఏదైనా ఉత్పత్తిని రూపొందించామంటే అది మాకు గర్వకారణంగా నిలవాల్సిందే. అలాకాకుంటే వాటిజోలికే వెళ్లం. ఇక్కడి రిటైల్ మార్కెట్లో యాపిల్‌కు అద్వితీయమైన భవిష్యత్తు ఉంది. చైనాతో పోలిస్తే భారత్ పూర్తిగా భిన్నమైన మార్కెట్’ అని కుక్ చెప్పారు. కొత్త వారంటీతో ప్రీ-ఓన్డ్(సెకండ్ హ్యాండ్) ఫోన్లను కూడా ఇక్కడ విక్రయించనున్నామని ఆయన వెల్లడించారు. ఇది ఆరంభం మాత్రమే... బెంగళూరులో యాప్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు, హైదరాబాద్‌లో మ్యాప్స్ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని ఉద్దేశిస్తూ.. ఇది యాపిల్ భారత్ ప్రస్థానంలో ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. కాగా, భారత్‌తో మరో వెయ్యేళ్ల బంధం అని ప్రకటించినందుకు కుక్‌ను కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కొనియాడారు. తయారీ రంగంలో పెట్టుబడుల వృద్ధి విషయంలో యాపిల్‌తో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శుక్రవారమిక్కడ జరిగిన అసోచామ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని అన్ని మొబైల్ తయారీ కంపెనీలూ భారత్‌కు క్యూ కట్టాయని.. స్మార్ట్ఫోన్లకు డిమాండ్ అంతకంతకూ జోరందుకుంటోందని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా, తన పర్యటన చివరిరోజైన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో కుక్ భేటీ కానున్నారు. భారత్‌లో రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్లను విక్రయించే అంశాన్ని ఈ సందర్భంగా కుక్ ప్రధానితో చర్చించవచ్చని భావిస్తున్నారు. రీఫర్బిష్డ్ (సెకండ్ హ్యాండ్) మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్న యాపిల్.. ఇందుకు తగిన అనుమతుల కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ముందుగా యాపిల్‌ను ఇక్కడ తయారీని ప్రారంభించేలా చూడాలని... భారత్‌లో ఉత్పత్తి అయిన హ్యాండ్‌సెట్స్‌కు మాత్రమే రీఫర్బిష్డ్ విక్రయాలను పరిమితం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. యాపిల్ పే సేవలనూ అందిస్తాం... భారత్‌లో 4జీ సేవలు పూర్తిస్థాయిలో వేళ్లూనుకుంటే సిగ్నల్ నాణ్యత కూడా పెరుగుతుందని.. దేశ ప్రగతికి ఇది చాలా కీలకమని కుక్ వ్యాఖ్యానించారు. ఇక్కడ యాపిల్ పే సేవలను ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. యాపిల్ డివెజైస్ ద్వారా మొబైల్ పేమెంట్స్‌కు ఉపయోగపడే డిజిటల్ వాలెట్ సేవలు ఇవి. సునీల్ మిట్టల్‌తో భేటీ... దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌తో కుక్ శుక్రవారం సమావేశమయ్యారు. దేశంలో తొలిసారిగా 4జీ సేవలు ప్రవేశపెట్టడంతోపాటు దేశవ్యాప్తంగా విస్తరించడంలో ముందున్న నేపథ్యంలో కుక్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని ఎయిర్టెల్ కార్యాలయంలో గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎయిల్టెల్ ఎండీ, సీఈఓ, గోపాల్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు కెవిన్ మిట్టల్ (సునీల్ మిట్టల్ కుమారుడు) కూడా కుక్‌తో సమావేశంలో పాల్గొన్నారు. హైక్ మెసెంజర్‌కు వస్తున్న ఆదరణ, వృద్ధి గురించి ఆయనకు వివరించారు. శుక్రవారం ఢిల్లీలోని యాపిల్ కార్పొరేట్ ఆఫీస్‌ను సందర్శించిన తర్వాత కుక్.. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ గ్యాలెరియాలో ఉన్న యాపిల్ స్టోర్‌కు వెళ్లారు. యాపిల్ ఉత్పత్తులకు తమ కస్టమర్లే పెద్ద బలమని.. కస్టమర్ల నోటిమాటద్వారా జరిగే మార్కెటింగ్‌ను మించిందిలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
యాపిల్ సెంటర్ ఆరంభం
♦ టిమ్ కుక్‌తో కలసి ప్రారంభించిన సీఎం కేసీఆర్ ♦ దాదాపు 4వేల ఉద్యోగాలొస్తాయన్న యాపిల్ సీఈఓ ♦ అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తామని వ్యాఖ్య ♦ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరిన కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా మ్యాప్స్ అభివృద్ధి కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. కంపెనీ సీఈవో టిమ్ కుక్, తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు సమక్షంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు గురువారం దీన్ని ప్రారంభించారు. స్థానికంగా సమర్ధులైన నిపుణుల లభ్యతను కుక్ ఈ సందర్భంగా ప్రశంసించారు. మరింత మంది భాగస్వాములతో చేతులు కలపడం ద్వారా కార్యకలాపాలను పెంచుకుంటామన్నారు. ‘మేం అందరికన్నా ముందుగా కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించకపోవచ్చు. కానీ ఎప్పుడూ ఉత్తమమైనవే అందించేందుకు ప్రయత్నిస్తాం. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చే.. జీవితాలను ప్రభావితం చేసే అత్యుత్తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందించడంలో యాపిల్ ఎప్పుడూ ముందుంటుంది’ అని కుక్ చెప్పారు. మ్యాప్స్ డెవలప్మెంట్ సెంటర్‌పై పెట్టుబడులను వెల్లడించని యాపిల్... దీని ద్వారా దాదాపు 4,000 దాకా ఉద్యోగాలొస్తాయని ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం సుమారు 6,40,000 పైచిలుకు ఐవోఎస్ యాప్ డెవలపర్స్, ఐవోఎస్ సంబంధిత ఉద్యోగాలకు తోడ్పాటునిస్తున్నట్లు తెలిపింది. అయిదు రోజుల పర్యటన కోసం టిమ్ కుక్ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టీసీఎస్ ఎండీ ఎన్.చంద్రశేఖరన్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ తదితరులతో భేటీ ఆయ్యారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశమవుతారు. మ్యాప్స్ ప్రాజెక్టు కోసం యాపిల్ తమతో జట్టు కట్టడంపై ఐటీ సేవల సంస్థ ఆర్ఎంఎస్ఐ సీఈవో అనూప్ జిందాల్ హర్షం వ్యక్తం చేశారు. క్యాంపస్ కూడా ఏర్పాటు చేయాలి: కేటీఆర్ యాపిల్ సొంత క్యాంపస్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అలాగే టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ-హబ్‌తో కూడా చేతులు కలపాలని ఈ సందర్భంగా టిమ్ కుక్‌ను కేటీఆర్ కోరారు. మ్యాప్స్ డెవలప్మెంట్ ఆఫీస్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను యాపిల్ ఎంపిక చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ క్రియాశీలకతకు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పుష్కలంగా నిపుణుల లభ్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. యాపిల్ కార్యాలయంతో స్థానికంగా వేల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు యాపిల్ రాకతో అమెరికా వెలుపల భారీ కార్యాలయాలున్న అయిదు అతి పెద్ద దిగ్గజాల్లో నాలుగు సంస్థలకు హైదరాబాద్ కేంద్రమైనట్లయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్లు ఇప్పటికే ఉండగా.. గత మేలో గూగుల్ వచ్చిందని, తాజాగా ఈ ఏడాది మే లో యాపిల్ కార్యాలయం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం తాను ప్రస్తావించిన గొప్ప విశేషం గురించి స్పందిస్తూ.. ‘నేను చెప్పిన గొప్ప వార్త బహుశా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానికి సమాధానం అయి ఉంటుందని మీరంతా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ విషయం నాకూ తెలియదు. కావాలంటే మిత్రుడు రానా దగ్గుబాటినే అడగాలి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కీలకంగా భారత మార్కెట్..: యాపిల్‌కు ఇప్పటిదాకా అమెరికా తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్ చైనానే. ఇప్పటిదాకా అటువైపే మొగ్గు చూపిన కంపెనీ... భారత్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే, ఇటీవల చైనాలో అమ్మకాలు మందగించడంతో పాటు ఐట్యూన్స్ స్టోర్ ద్వారా అందించే ఐమూవీ, ఐబుక్స్ మొదలైన సర్వీసులను అక్కడి ప్రభుత్వం అకస్మాత్తుగా మూసివేసింది. ఈ పరిణామాలతో కంపెనీ కలవరపడుతోంది. చాలా కాలం తర్వాత ఇటీవలి త్రైమాసికంలో కంపెనీ లాభాలు కూడా 12 శాతం క్షీణించాయి. అదే సమయంలో భారత్‌లో అమ్మకాలు మెరుగవుతుండటం కనిపించింది. ఈ నేపథ్యంలో వంద కోట్లకు పైగా జనాభా గల, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారత్‌పై యాపిల్ దృష్టి పెట్టింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్ల ఆధిపత్యం ఉన్న భారత మార్కెట్లో చొచ్చుకుపోయేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే ఐఫోన్ ఎస్ఈని కూడా ఇక్కడి యూజర్లను దృష్టిలో పెట్టుకునే విడుదల చేసింది. ఈ పరిణామాలన్నింటి దరిమిలా టిమ్ కుక్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐ లవ్ హైదరాబాద్.. ‘ఈ పర్యటనలో నేను ప్రధానంగా భారతీయుల ఆదరాభిమానాలు, సంస్కృతి గురించి తెలుసుకున్నాను. ఎంతో నేర్చుకున్నాను. నా స్వదేశం సహా నేను పర్యటించిన మిగతా ఏ దేశం కూడా దీనికి సాటి రాదు. ఇనుమడించిన ఉత్తేజంతో తిరిగి వెడతాను. కేసీఆర్ గారూ!.. ఇప్పటికే హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు చూపిన ఆదరాభిమానాలు ఎంతగానో నచ్చాయ్’ అని కుక్ వ్యాఖ్యానించారు. కుక్.. రాక్‌స్టార్: షారూక్ ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్.. యాపిల్ సీఈవో టిమ్ కుక్కు తన బంగ్లా మన్నత్‌లో విందును ఏర్పాటు చేశారు. దీనికి బాలీవుడ్‌లోని అతిరథులందరూ విచ్చేశారు. అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయ, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్, మాధురి దీక్షిత్, ఏఆర్ రెహ్మాన్, సానియా మీర్జా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షారూక్.. టిమ్ కుక్‌ను రాక్‌స్టార్ అంటూ కొనియాడారు. కుక్‌తో ఫోటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. -
బిజీ బిజీగా టిమ్ కుక్...
భారత్ పర్యటనలో తొలిరోజు కార్పొరేట్లతో సమావేశం ముంబై: భారత్‌లో తొలిసారి పర్యటిస్తోన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ బుధవారం బిజీ బిజీగా గడిపారు. ఈయన దిగ్గజవ్యాపారవేత్తలను, కంపెనీ హెడ్స్‌ను, బ్యాంకర్లను, బాలీవుడ్ ప్రముఖులను కలిశారు. బీజింగ్ నుంచి ప్రైవేట్ జెట్‌లో భారత్‌కు వచ్చిన కుక్.. తాజ్‌మహల్ ప్యాలెస్‌లో దిగారు. ఉదయాన్నే దక్షిణ మధ్య ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ దేవాలయ ప్రాంగంణంలోనే ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు అనంత్ అంబానీతో ముచ్చటించారు. తర్వాత ఆయన తాజ్ ప్యాలెస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీని, టీసీఎస్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.చంద్రశేఖరన్‌ని, వోడాఫోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ సూద్‌ని కలిశారు. అటుపై నలుగురు యాప్ డెవలపర్లతో మాట్లాడారు. చందా కొచర్‌తో సమావేశం: బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ టవర్స్‌లో ఉన్న హెడ్‌క్వార్టర్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ సహా బ్యాంక్ ఇతర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్స్‌తో గంటకుపైగా కుక్ సమావేశమయ్యారు. యాపిల్ వాచ్‌లో బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించిన తొలి సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్. ముకేశ్ అంబానీ ఇంట్లో భోజనం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత విలాసవంతమైన గృహం ‘అంటిల్లా’లో కుక్ భోజనం చేశారు. తర్వాత అనంత్ అంబానీతో కొంతసేపు మాట్లాడారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ అమెరికాలో ఉన్నారు. బుధవారం రాత్రి కుక్.. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తో కలసి డిన్నర్ చేశారు. ఇక కుక్ చివరిగా శనివారం ప్రధా ని మోదీతో భేటీ కానున్నారు. ఇందులో యాపిల్ స్టోర్ల ఏర్పాటు విషయం చర్చకు రావచ్చు. హైదరాబాద్ కేంద్రం ఆరంభం నేడే.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గురువారం హైదరాబాద్‌లో మ్యాపింగ్ డేటా అభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసిన ‘డెవలప్మెంట్ సెంటర్’ను ఆరంభిస్తారు. గచ్చిబౌలిలోని టిస్మన్ స్పేయర్ భవనంలో దీన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం హైదరాబాద్ చేరుకునే టిమ్ కుక్... తన బృందంతో కలిసి మొదట ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకుంటారని విశ్వసనీయంగా తెలిసింది. తరవాత అక్కడి నుంచే నేరుగా మ్యాపింగ్ డెవలప్మెంట్ సెంటర్‌కు వెళతారు. ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూడా ఈ మ్యాపింగ్ సెంటర్ ఆరంభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియవచ్చింది. గురువారం నాడు ఒక పెద్ద వార్త వింటారంటూ మంగళవారం కేటీఆర్ ట్వీట్ చేయడం తెలిసిందే. అలాంటి ప్రకటన ఏమైనా ఉంటే డెవలప్మెంట్ సెంటర్ ఆరంభం సందర్భంగా ఉంటుందని సమాచారం. కాగా, ప్రారంభోత్సవం అనంతరం దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరులో ‘యాప్’ డెవలప్మెంట్ సెంటర్ సాక్షి, బెంగళూరు: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తన ‘ఐఓఎస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్’ను కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సంస్థ ద్వారా భారతదేశంలోని యువ ఇంజనీరింగ్ నిపుణులకు మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నట్లు వివరించింది. ఈ సెంటర్లో యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అప్లికేషన్స్(యాప్స్‌ను) తయారు చేసే డెవలపర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక బృందం శిక్షణ ఇవ్వడంతోపాటు యువ డెవలపర్లు తయారుచేసిన అప్లికేషన్స్‌కు తన ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై స్థానాన్ని కల్పించనుంది. ఐఓఎస్‌తో పాటు మాక్, యాపిల్ టీవీ, యాపిల్ వాచ్లకు సంబంధించిన అప్లికేషన్లను తయారుచేసే దిశగా యువ డెవలపర్లను తీర్చిదిద్దనుంది. ఈ సెంటర్ 2017 నాటికి అందుబాటులోకి రావచ్చని అంచనా. ఈ విషయంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందిస్తూ..‘యాప్స్ రూపకల్పనలో ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యాలుగల యువ డెవలపర్లు భారత్‌లో ఉన్నారు. బెంగళూరు కేంద్రం ద్వారా అలాంటి ఎంతో మంది లో దాగి ఉన్న నైపుణ్యాలను మేము మరింత మెరుగుపరచనున్నాం. తద్వారా వారు ప్రపంచంలోని వినియోగదారులకు మరింత మెరుగైన, సృజనాత్మకమైన యాప్స్‌ను రూపొందించి ఇవ్వగలిగేందుకు అవకాశం ఏర్పడుతుంద’ని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో యాపిల్ సొంత కేంద్రం!
♦ డెవలప్మెంట్ సెంటర్ ఆరంభం రేపు... ♦ దీనికోసమే ఇక్కడికి వస్తున్న కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ ♦ ఈ సందర్భంగా అతిపెద్ద వార్త వింటారంటూ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే నంబర్-1 కార్పొరేట్ కంపెనీ... టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్‌కుక్ హైదరాబాద్‌కు రానున్నారు. భారత్‌లో తొలిసారిగా అడుగు పెడుతున్న ఆయన... గురువారం హైదరాబాద్‌కు వస్తారు. ఈ సందర్భంగా ఆయన యాపిల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశముంది. సిటీలో టిమ్‌కుక్ మూడు గంటలపాటు ఉంటారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను గచ్చిబౌలిలోని టిస్మన్ స్పియర్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో 2.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అమెరికా వెలుపల సంస్థకు ఇదే తొలి ఫెసిలిటీ కూడా. దీనికోసం యాపిల్ రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. యాపిల్ మ్యాప్స్ టెక్నాలజీకి కావాల్సిన సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. 2,500 మంది ఉద్యోగులు పనిచేసే వీలుంది. తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు పర్యవేక్షణలో కంపెనీకి అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయటం గమనార్హం. కుక్ వారంరోజుల భారత పర్యటన నిమిత్తం తన ప్రైవేటు జెట్‌లో మంగళవారం అర్థరాత్రి ముంబైకి చేరుకున్నారు. 19న హైదరాబాద్ వచ్చి... అట్నుంచి ఢిల్లీ వెళతారు. 20, 21 తేదీల్లో అక్కడే ఉంటారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. మేకిన్ ఇండియా అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం. ఇతర రంగాల్లోనూ యాపిల్ పెట్టుబడులు! టిమ్‌కుక్ రాక నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ... ‘అతి పెద్ద వార్తను మీతో ఎల్లుండి పంచుకోబోతున్నాను. అప్పటి వరకు సస్పెన్స్’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం లీజు కార్యాలయంలో డెవలప్మెంట్ సెంటర్‌ను ఆరంభించినా... సొంత కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని యాపిల్ చూస్తోందని, ఈ క్రమంలో ప్రభుత్వం యాపిల్‌కు స్థలాన్ని కేటాయించే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా కేటీఆర్ ఈ ప్రకటన చేయొచ్చని తెలిసింది. అంతేకాక ఈ మధ్య యాపిల్ తన పంథా మార్చుకుని ఇతర రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఇటీవలే చైనాలో రైడ్ షేరింగ్ సంస్థ ‘దీదీ’లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. చైనాలో యాపిల్ ఐట్యూన్స్‌ను నిషేధించిన నేపథ్యంలో ఆ ప్రభుత్వంతో సాన్నిహిత్యం కోసమే ఈ పెట్టుబడి పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే భారత్‌లోనూ కొన్ని పెట్టుబడులను ప్రకటించే అవకాశం లేకపోలేదని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ మరిన్ని ఊహాగానాలకు అవకాశం కల్పించింది. అవకాశాల విపణి..! ఐఫోన్, ఐప్యాడ్లను విక్రయిస్తున్న యాపిల్... ఇప్పటిదాకా తాను విక్రయిస్తున్న మార్కెట్లలో గరిష్ఠ అమ్మకాల దశకు చేరుకుంది. అక్కడ వృద్ధి ఆశించినంతగా లేదు. దీంతో అభివృద్ధి చెందుతున్న చైనా, భారత్‌లపై ఫోకస్ చేసింది. గతేడాదితో పోలిస్తే 2016 జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అమ్మకాలు దేశంలో 62 శాతం వృద్ధి చెందాయి. యాపిల్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్‌కు భారత్‌లో ప్లాంట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలోనూ ప్లాంటు ఉంది. కాగా యాపిల్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలో నెలకొల్పే అవకాశముందని, 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫెసిలిటీ రానుందని ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. -
భారత్‌కు యాపిల్ సీఈవో!
ముంబయి/న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ వారంలో ఆయన భారత్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవనున్నట్లు కీలక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఐఫోన్ అమ్మకాలు అమాంతంగా తగ్గుముఖం పట్టడంతో ఐఫోన్ మార్కెట్‌కు అనుకూలమైన భారత్‌లో పర్యటించడం ద్వారా సంస్థకు కొంత మేలు జరగవచ్చనే అభిప్రాయంతో ఈ పర్యటన ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా యాపిల్ సంస్థను తిరిగి పురోగతి బాట పట్టించే ఉద్దేశంతో ఉన్న కుక్ భారత్ సందర్శనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే చైనాలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం భారత్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పర్యటన వివరాలు కావాలనే సదరు కంపెనీ బహిర్గతం చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్‌లో తొలి ఔట్ లెట్ సెంటర్‌ను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యంకానుంది. -
అక్కడ పట్టుకోసం యాపిల్ ఆరాటం
బీజింగ్ : చైనాలోఎదుర్కొంటున్న ఎదురుదెబ్బలపై యాపిల్ గట్టి పోరాటం సాగిస్తోంది. ఎలాగైనా తమ మార్కెట్ ను పునర్ నిర్మించుకోవాలని యాపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ ప్రయత్నిస్తున్నారు. ఆ దేశంలో రెండో అతిపెద్ద రవాణా సర్వీసులను అందిస్తున్న దిది చుక్సింగ్ తో వంద కోట్ల డాలర్లు (ఒక బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు డీల్ కుదుర్చుకున్న వెంటనే టిమ్ కుక్ బీజింగ్ పర్యటనకు వెళ్లారు. అమెరికా తర్వాత చైనానే ఈ కంపెనీకి రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉంది. అయితే ఇటీవలి కాలంలో చైనాలో యాపిల్ కు గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఐఫోన్ ట్రేడ్ మార్కు కేసులో యాపిల్ ఇంక్ ఓడిపోవడంతో పాటు, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పడిపోయాయి. దీంతో చైనాలో ఎలాగైనా తమ అమ్మకాలను పెంచుకోవాలని యాపిల్ ప్రయత్నిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా చైనా ప్రభుత్వ పెద్దలతో కుక్ సమావేశం కానున్నారు. బీజింగ్ లోని యాపిల్ లో స్టోర్ లో దిది చుక్సింగ్ ప్రెసిడెంట్ జీన్ లియుతో కుక్ భేటీ అయ్యారు. ప్రస్తుతం యాపిల్ కు అతిక్లిష్టంగా ఉన్న చైనీస్ మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి ఈ పెట్టుబడులు దోహదం చేస్తాయని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. ఇతతర్రా యాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లతో కూడా టిమ్ కుక్ భేటీ అయ్యారు. -
యాపిల్ కు ‘నెట్ వర్క్’ కష్టాలు!
♦ స్లో నెట్వర్క్, సరైన రిటైలింగ్ వ్యవస్థ లేకపోవడమే భారత్‌లో మాకు అడ్డంకి ♦ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ వ్యాఖ్య ♦ 13 ఏళ్లలో తొలిసారి ఆదాయాల్లో క్షీణత న్యూయార్క్: భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ టెలికం నెట్ వర్క్‌లో తగినంత వేగం లేకపోవడం, రిటైల్ షోరూమ్‌ల స్వరూపం అస్తవ్యస్తంగా ఉండటం వంటివి తమకు అడ్డంకిగా మారాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. తమ కంపెనీ భారత్ మార్కెట్లో జోరును ప్రదర్శించలేకపోవడానికి ఇవే ప్రధాన కారణాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా పరిశ్రమ విశ్లేషకులతో కన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. గడిచిన 13 ఏళ్లలో యాపిల్ ఆదాయం తొలిసారి క్షీణించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్. అయితే, స్లో నెట్వర్క్, కొనుగోలు శక్తి వంటి అంశాలతో ఇక్కడ చౌక స్మార్ట్ఫోన్ల హవానే కొనసాగుతోంది. అందుకే మా స్థాయికి తగ్గట్లుగా తగినంత మార్కెట్ వాటాను సంపాదించలేకపోతున్నాం. అయితే, పదేళ్లక్రితం చైనాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే భారత్‌లోనూ అద్భుతమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క’ అని కుక్ పేర్కొన్నారు. కాగా, అమెరికా తర్వాత యాపిల్‌కు రెండో అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో మార్చి క్వార్టర్ ఐఫోన్ల అమ్మకాలు 11 శాతం పడిపోగా, భారత్‌లో మాత్రం 56 శాతం ఎగబాకడం గమనార్హం. బారత్‌లో ఇంకా 4జీ(ఎల్టీఈ) నెట్వర్క్ ఈ ఏడాదే పూర్తిస్థాయిలో ఆరంభమైందని.. రానున్న కాలంలో ఈ మరిన్ని కంపెనీలు నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచితే తమకు మంచి అవకాశాలు లభిస్తాయని కుక్ చెప్పారు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్ల శక్తిసామర్థ్యాలు 4జీ వంటి వేగవంతమైన నెట్‌వర్క్‌లతోనే వినియోగదారులకు తెలిసొస్తాయన్నారు. షాకింగ్ ఫలితాలు... యాపిల్ మంగళవారం ప్రకటించిన 2016, జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు కంపెనీ ఇన్వెస్టర్లకు షాకిచ్చాయి. గత పదమూడేళ్లలో తొలిసారిగా ఆదాయం క్షీణించింది. 2015 ఇదే త్రైమాసికంలో ఆదాయం 58 బిలియన్ డాలర్లతో పోలిస్తే 13% దిగజారి 50.6 డాలర్లకు పడిపోయింది. నికర లాభం 22% క్షీణతతో 13.6 బిలియన్ డాలర్ల నుంచి 10.6 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఐఫోన్ల విక్రయాలు కూడా తొలిసారిగా(క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే) పడ్డాయి. గత మార్చి క్వార్టర్లో 6.2 కోట్ల ఐఫోన్లు అమ్ముడవగా.. ఈ మార్చి త్రైమాసికంలో 5.2 కోట్ల ఫోన్లను కంపెనీ విక్రయించింది. కాగా, ఫలితాలపై కుక్ స్పందిస్తూ... ఇదేమంత పెద్ద ప్రతికూలాంశం కాదని.. యాపిల్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇండియాలో భారీ పెట్టుబడులు
♦ అక్కడ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టే ♦ ఐఫోన్‌కు మున్ముందు ♦ అదే పెద్ద మార్కెట్: టిమ్ కుక్ న్యూయార్క్: భారత్‌లో రానున్న కాలంలో వ్యాపారానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్ దేశంగా భారత్ అవతరిస్తుందన్నారు. ‘‘ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ ఉంది. ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలపై సానుకూలంగా ఉంది. అందుకే మేం ఆ దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దీర్ఘకాలంలో అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తాం’’ అని వివరించారు. భారత్ మంచి వృద్ధి రేటు నమోదు చేస్తోందంటూ... చైనా, అమెరికా తర్వాత మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అక్కడే ఉందన్నారు. చైనా మార్కెట్‌తో పోలిస్తే.. భారత్ జనాభాలో దాదాపు సగం మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారని తెలిపారు. చైనాలో యువ జనాభా వయసు సగటున 37 ఏళ్లుగా ఉంటే, ఇండియాలో 27 ఏళ్లుగా ఉందన్నారు. 74.8 మిలియన్ల ఐఫోన్ విక్రయాలు... డిసెంబర్ 26తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఐఫోన్ విక్రయాలు 74.8 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఐఫోన్ విక్రయాలు 74.5 మిలియన్ యూనిట్లు. వార్షిక ప్రాతిపదికన చూస్తే విక్రయాలు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఐఫోన్ బ్రాండ్ విక్రయాలు ప్రారంభమైనప్పటి (2007) నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి వృద్ధి అని టిమ్ కుక్ తెలియజేశారు. భారత్‌లో ఐఫోన్ విక్రయాలు వృద్ధి 76 శాతంగా నమోదయిందన్నారు. అలాగే ఇండియాలో ఆదాయం కూడా 38 శాతం పెరిగిందన్నారు. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర ఆదాయం 2 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాగా ఇటీవల యాపిల్ కంపెనీ భారత్‌లో రిటైల్ ఔట్లెట్స్ ఏర్పాటు కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)కి దరఖాస్తు చేసుకుంది. -
చైనా అధినేతతో టాప్ సీఈఓల భేటీ
బీజింగ్ : చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 23న సియాటెల్‌లో జరిగే వ్యాపార చర్చల్లో ఆయనతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, పెప్సి ఇంద్రా నూయి, ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఆలీబాబా జాక్ మా తదితర టాప్ 30 సీఈఓలు పాల్గొననున్నారు. అమెరికా, చైనాలకు చెందిన చెరో 15 దిగ్గజ వ్యాపార కంపెనీల సీఈఓలు ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. ఈ రౌంట్ టేబుల్ సమావేశానికి అమెరికా మాజీ ఆర్థిక మంత్రి హెన్రీ పాల్సన్ అధ్యక్షత వహించనున్నారు. వ్యాపార, వాణిజ్యాంశాల్లో చైనా, అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, అవకాశాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇరు దేశాల దైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. -
టిమ్ కుక్ 'గే' ఎఫెక్ట్: స్టీవ్ జాబ్స్ విగ్రహం ధ్వంసం!
మాస్కో: ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని ధ్వంస చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రష్యాలోని సెయింట్ పీటర్ బర్గ్ లో గత శుక్రవారం చోటు చేసుకుంది. తాను స్వలింగ సంపర్కుడినని ఆపిల్ కంపెనీ ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ రూపంలో ఆరు అడుగుల స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ కాలేజీ ఆవరణలో 2013 సంవత్సరం జనవరిలో రష్యాకు చెందిన జెడ్ఈఎఫ్ఎస్ గ్రూప్ ప్రతిష్టించింది. స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా జెడ్ఈఎఫ్ఎస్ సంస్థ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ కారణంగా తాము స్టీవ్ జాబ్స్ విగ్రహాన్ని తొలగించినట్టు ఆ సంస్థ తెలిపింది. -
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన
న్యూయార్క్: తాను స్వలింగ సంపర్కుడినని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన చేశారు. ఓ బిజినెస్ మ్యాగజైన్ కు రాసిన వ్యాసంలో 'నేను స్వలింగ సంపర్కుడి' నని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని కుక్ వెల్లడించారు. తన లింగత్వంపై వచ్చిన కథనాలను ఎప్పుడూ ఖండించలేదని, బహిరంగంగా ప్రకటన చేయలేదన్నారు. ఆపిల్ కంపెనీలో చాలా మంది సహచరులకు తాను స్వలింగ సంపర్కుడినన్న విషయం తెలుసన్నారు. స్వలింగ సంపర్కుడినని చెప్పడం అంత సులభం కాలేదని, ఇతరులకు ఉపయోగంగా ఉంటుందని ఈ విషయాన్ని బహిరంగపరిచానని వివరణ ఇచ్చారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని ఆయన తెలిపారు. ప్రజలందరికి సమాన హోదా ఉండేందుకు పోరాటం చేస్తానన్నారు. అంతేకాకుండా ఉత్తమ సీఈఓగా గుర్తింపు పొందడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని టిమ్ కుక్ అన్నారు. -
యాపిల్.. ఐప్యాడ్ ఎయిర్ 2
ప్రపంచంలోనే అత్యంత పల్చని ట్యాబ్లెట్ ధర 499 డాలర్లు వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐప్యాడ్ ఎయిర్ 2 ట్యాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత పల్చని ట్యాబ్లెట్గా కంపెనీ సీఈవో టిమ్ కుక్ దీన్ని అభివర్ణించారు. దీని ధర 499 డాలర్లుగా ఉంటుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా, సుమారు 3 బిలియన్ ట్రాన్సిస్టర్లు ఉండే కొత్త తరం ఏ8ఎక్స్ చిప్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంటాయి. ఈ కోటింగ్‌ను ఉపయోగించడం ట్యాబ్లెట్లో ఇదే తొలిసారని కుక్ పేర్కొన్నారు. అలాగే, స్లో మోషన్ వీడియోలు తీసుకునే వీలుండటం ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకతని వివరించారు. మరోవైపు స్వల్పంగా అప్‌గ్రేడ్ చేసిన ఐప్యాడ్ మినీ 3ని, సరికొత్త మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కుక్ ఆవిష్కరించారు. ఎయిర్, మినీ ట్యాబ్లెట్లలో టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయి. మినీ ధర 399 డాలర్ల నుంచి మొదలవుతుందని కుక్ చెప్పారు. వీటికి ప్రీ-ఆర్డర్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక, కొత్త మొబైల్ పేమెంట్స్ విధానం యాపిల్ పేని విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 బ్యాంకులు, మరెన్నో భారీ రిటైల్ సంస్థలు ఈ డిజిటల్ చెల్లింపుల విధానానికి మద్దతునిచ్చేందుకు అంగీకరించాయని కుక్ పేర్కొన్నారు. -
వంగిపోతున్న యాపిల్ ఐఫోన్ 6
న్యూయార్క్ : మార్కెట్లో విడుదలైన వారంలోనే దుమ్మురేపిన యాపిల్ ఐఫోన్ 6 సమస్యలు ఎదుర్కొంటోంది. ఫోన్ వంగిపోతుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయాయి. ఇప్పటి వరకూ వినియోగదారుల నుంచి తొమ్మిది ఫిర్యాదులను అందుకుంది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఐ ఫోన్ వివాదంపై యాపిల్ సంస్థ స్పందించింది. ఐఫోన్ 6, 6 ప్లస్ లను స్టెయిన్ లెస్ స్టీల్, టైటానియంతో అత్యంత నాణ్యతతో డిజైన్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్యాంటు పలుచగానూ, టైట్ గానూ ఉండటం వల్ల వెనక్కి పెట్టినప్పుడు ఐఫోన్ 6 ప్లస్ వంగిపోయి ఉండవచ్చనన్న మొబైల్ నిపుణుల వాదనతో కంపెనీ ఏకీభవించింది. ఎక్కువ సేపు ఐఫోన్‌ను ప్యాంటు వెనక జేబులో పెట్టినప్పుడు ఎలర్ట్ చేస్తుందని దాన్ని పట్టించుకోన్నప్పుడు సమస్యలు వస్తాయని కంపెనీ చెబుతోంది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు మన్నించాలని యాపిల్ సంస్థ ప్రతినిధి కోరారు. ప్రస్తుత వెర్షన్‌ను తర్వలోనే సరిచేస్తామని పేర్కొన్నారు. -
ఐఫోన్6 దుమ్మురేపింది!
న్యూయార్క్: మార్కెట్ లోకి విడుదలైన వారం రోజుల్లోనే భారీ సంఖ్యలో ఐఫోన్6 అమ్ముడైనట్టు ఆపిల్ సంస్థ ప్రకటించింది. తొలి వారాంతంలో కోటి పైగా ఐఫోన్లు అమ్ముడయ్యాయని వ్యాపార విశ్లేషకులు అంచనావేస్తున్నారు. స్టాక్ అందుబాటులో ఉంటే భారీ సంఖ్యలోనే ఐఫోన్ లు అమ్ముడయ్యే అవకాశం ఉండేదని ఆపిల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వెల్లడించారు. సెప్టెంబర్ 12 తేది 40 లక్షల మంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని కంపెనీలు తెలిపారు. తాజా అమ్మకాల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ నాస్ డాక్ పై కూడా కనిపించింది. నాస్ డాక్ లో ఆపిల్ 100.58 డాలర్లుగా నమోదు చేసుకుంది. తొలి త్రైమాసికంలో ఆపిల్ కంపెనీ రెవెన్యూ 9 శాతం పెరిగడం కాకుండా వాల్ స్ట్రీట్ అంచనాలను మించిందని బిజినెస్ అనలిస్ట్ జీనె మునస్టర్ తెలిపారు. గత సంవత్సరం విడుదలైన తొలి వారాంతంలోనే ఐఫోన్ 5ఎస్, 5సీ మోడల్స్ చైనాతోపాటు 11 దేశాల్లో 90 లక్షల ఫోన్లు అమ్ముడైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఐఫోన్ 6 వచ్చేసింది...
క్యూపర్టినో: యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను మంగళవారం అర్ధరాత్రి(భారత కాల మానం ప్రకారం)ఆవిష్కరించింది. వీటితో పాటు ఐవాచ్‌ను కూడా కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆవిష్కరించారు. ఈ నెల 12 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, ఈ నెల 19 నుంచి డెలివరీలు ప్రా రంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రెండు ఫోన్లను ఏ8 చిప్‌తో యాపిల్ కంపెనీ రూపొందించింది. ఇంతకు ముందటి ఐఫోన్లలోని చిప్‌లతో పోల్చితే ఇది 25% అధిక వేగంగానూ, 50 శాతం మెరుగ్గానూ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 6లో 4.7 అంగుళాల డిస్ప్లే, 6.9 ఎంఎం మందం, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 14 గంటల టాక్‌టైమ్, 11 గంటల వీడియో, 10 రోజుల స్టాండ్‌బై, 4జీని సపోర్ట్ చేస్తుంది. ధరలు 16 జీబీ మోడల్ 199 డాలర్లు, 299 డాలర్లు(64 జీబీ), 399 డాలర్లు(128 జీబీ). అమెరికాలో టెల్కోల కాంట్రాక్టుతో ధరలివి.ఇక ఐఫోన్ 6ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్, 7.1 ఎంఎం మందం, రెటీనా డిస్ప్లే హెచ్డీ, 16 గంటల స్టాండ్‌బై టైమ్, 14 గంటల వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ధరలు 16 జీబీ మోడల్ 299 డాలర్లు, 399 డాలర్లు(64 జీబీ),499 డాలర్లు(128 జీబీ). ఇగ్లీష్ కథనం కోసం -
డిసెంబర్ కల్లా యాపిల్ చౌక ఐఫోన్
-
డిసెంబర్ కల్లా యాపిల్ చౌక ఐఫోన్
స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో పూర్వ వైభవం పొందడం, కొత్త మార్కెట్లకు విస్తరించడం లక్ష్యాలుగా యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్లను ఆవిష్కరించింది. భారత్, చైనాల్లో చౌక ధరల స్మార్ట్ఫోన్లు బాగా అమ్ముడవుతుండటంతో, శామ్సంగ్, ఇతర దేశీయ కంపెనీల స్మార్ట్ఫోన్లకు పోటీగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 5సీని మార్కెట్లోకి తెచ్చింది. పసుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు, ఎరుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ధరలను (రెండేళ్ల పాటు మొబైల్ ఆపరేటర్లతో కాంట్రాక్ట్‌తో) 16జీబీ 99 డాలర్లు, 32 జీబీ 199 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. మల్టీ టచ్ ఇంటర్ఫేస్తో లభ్యమయ్యే ఈ ఫోన్లో 4 అంగుళాల రెటినా డిస్ప్లే, ఫుల్ ఎస్ఆర్జీబీ, ఏ6 పవర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక టాప్ఎండ్ మోడల్, యాపిల్ ఐఫోన్ 5 ఎస్‌ను హై గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. మూడు వెర్షన్లలో లభించే వీటి ధరలను 199 డాలర్లు(16జీబీ), 299 డాలర్లు(32జీబీ), 399 డాలర్లు(64జీబీ)గా కంపెనీ నిర్ణయించింది. ఏ7(ఏ-64 బిట్) చిప్, యాక్సిలరో మీటర్, గైరోస్కోప్, కాంపాస్ సపోర్ట్, ఎం7(మోషన్ కో-ప్రాసెసర్) వంటి ప్రత్యేకతలున్నాయి. 10 గంటల 3జీ టాక్‌టైమ్, 250 గంటల స్టాండ్‌బై, 10 గంటల ఎల్టీఈ బ్రౌజింగ్, 40 గంటల మ్యూజిక్ ప్లే బాక్నిచ్చే బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు కొత్త ఫోన్లు ఈ ఏడాది డిసెంబర్ కల్లా భారత్‌లో లభ్యమవుతాయి.