ప్రపంచంలో అత్యదిక వేతనం తీసుకుంటున్న సీఈవోల జాబితా ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్థానం మరింత దిగజారింది. స్వచ్ఛంద సంస్థ ‘As You Sow’ ఏడాదికి అత్యధిక జీతం తీసుకుంటున్న 100 మంది సీఈవోల జాబితా -2022 (100 Most Overpaid CEOs) ను విడుదల చేసింది.
అందులో ఆండీ జెస్సీ స్థానం కిందకు పడిపోయింది. 2021లో 212 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం అమెజాన్ ఉద్యోగులకు ఇచ్చే యావరేజీ శాలరీ కంటే 6,474 రెట్లు ఎక్కువ. అయితే, 2022లో 99 శాతం వేతనం కోతను ఎదుర్కొన్నారు. కాబట్టే మోస్ట్ ఓవర్ పెయిడ్ సీఈవోలా జాబితాలో తన స్థానాన్ని కోల్పోయారు.
99 శాతం తగ్గింది
2021లో ఆండీ జెస్సీ శాలరీ 212 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు (సుమారు రూ. 10 కోట్లు) తగ్గిందని అమెజాన్ ఇటీవల దాఖలు చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయినప్పటికీ, జెస్సీ బేస్‌పే (జీతం మినహా ఇతర బెన్ఫిట్స్ ఉండవు) 175,000 డాలర్ల నుంచి 317,500తో 80 శాతం పెరిగింది.
ఆండీ వేతనం తగ్గడానికి 2022లో స్టాక్ గ్రాంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021లో అందించిన అతని షేర్లలో కొంత భాగం ఈ సంవత్సరం అమెజాన్ అందించనుంది. మిగిలిన షేర్లను 2026 నుంచి 2031 చివరి నాటికి ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇతర టెక్ దిగ్గజాల సీఈవోల వేతనాలను పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఏడాది 55 మిలియన్లు పొందగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ సుమారు 99.4 మిలియన్లు, 2020లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment