Andy Jassy
-
Amazon Layoffs: అమెజాన్ మళ్లీ షాక్ ఇచ్చింది: ఈసారి ఎవరంటే..!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్(Amazon) లో మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.గ్లోబల్ కమ్యూనికేషన్స్ కీలకమైన విభాగాల్లో ఈ లేఆఫ్‌లను ప్రకటించింది. డెడ్‌లైన్ నివేదిక ప్రకారం దేశీయ, అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ విభాగాలలో దాదాపు 5 శాతం ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ప్రైమ్ వీడియో, మ్యూజిక్ సహా కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగాలను ఇది ప్రభావితం చేయనుందని డెడ్‌లైన్ రిపోర్ట్ చేసింది. ప్రభావిత ఉద్యోగులకు 60 రోజుల వ్యవధిలో వారి రెగ్యులర్ జీతం, ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే తొలగించిన ఉద్యోగులు విభజన ప్యాకేజీలు, పరివర్తన ప్రయోజనాలు, ఉద్యోగ నియామకంలో సహాయం కోసం అర్హులు. Amazon Studios, Amazon Prime వీడియో, Amazon Music వర్టికల్స్కి సంబంధించిన కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అమెజాన్ ఇటీవల ఉద్యోగాల కోతలను ప్రకటించింది. కాగా టెక్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా వేలాదిమందిని ఉద్యోగులనుంచి తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అమెజాన్ 2022 నవంబర్- జనవరి 2023 మధ్యకాలంలో 18వేలమందిని తొలగించింది. క్లౌడ్ కంప్యూటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, అడ్వర్టైజింగ్ చ ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్వంటి రంగాలపై దృష్టి సారించి, అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో, గ్రాసరీ విభాగాల్లో మరికొంతమందిని తీసివేసింది. 2023 మార్చిలో 9వేల మందిని తొలగించింది. దాదాపు 27 వేల మందిని తొలగించడం కష్టమైనదే అయినప్పటికీ కంపెనీ మంచి ఫలితాన్నిస్తుందని అమెజాన్ సీఈవోఆండీ జాస్సీ కంపెనీ వార్షిక సర్యసభ్య సమావేశంలోప్రకటించిన సంగతి తెలిసిందే. -
నో వర్క్ ఫ్రమ్ హోం.. లేదంటే ఇంటికెళ్లిపోండి!
అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ మరోమారు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్ రావాల్సిందేనని ఆదేశించారు. అయితే, సీఈవో నిర్ణయంపై అసంతృప్తిలో ఉన్న సిబ్బంది ఉద్యోగాలకు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవచ్చంటూ ఇంటర్నల్‌గా జరిగిన సమావేశంలో ఆండీ జెస్సీ పునరుద్ఘాటిస్తూ చెప్పడంతో ఉత్కంఠతకు దారి తీసింది. ఈ ఏడాది ప్రారంభంలో, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సిందేనని అన్నారు. ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కి తిరిగి రావాలని, సహోద్యోగులతో కలిసి పని చేయాలని భావించగా..మరికొందరు జర్నీ, ఇతర ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరం అయితే, మూకుమమ్మడిగా విధులు నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అమెజాన్ కంపెనీలో ఈ అసమ్మతి పర్వం కొనసాగుతుండగా.. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు రాజీనామాకు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కంపెనీ తీసుకున్న నిర్ణయం విషయంలో మరోమారు ఆలోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎటు దారి తీస్తుందోనని అమెజాన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమెజాన్‌లో లేఆఫ్స్.. భారత్‌లో 500 మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని తొలగిస్తున్నట్లు సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. రానున్న రోజుల్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని, ఆర్ధిక భారం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇక, లేఆఫ్స్‌పై త్వరలోనే ఉద్యోగులకు సమాచారం ఇస్తామని అన్నారు. అమెజాన్ కఠిన నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో 500 మంది భారతీయులు ఉన్నారు. తొలగింపుకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. తాజా లేఆఫ్స్‌తో ఏడాదిలో ఇప్పటివరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఊహించని విధంగా.. 90 శాతం తగ్గిన అమెజాన్ సీఈవో వేతనం!
ప్రపంచంలో అత్యదిక వేతనం తీసుకుంటున్న సీఈవోల జాబితా ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్థానం మరింత దిగజారింది. స్వచ్ఛంద సంస్థ ‘As You Sow’ ఏడాదికి అత్యధిక జీతం తీసుకుంటున్న 100 మంది సీఈవోల జాబితా -2022 (100 Most Overpaid CEOs) ను విడుదల చేసింది. అందులో ఆండీ జెస్సీ స్థానం కిందకు పడిపోయింది. 2021లో 212 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం అమెజాన్ ఉద్యోగులకు ఇచ్చే యావరేజీ శాలరీ కంటే 6,474 రెట్లు ఎక్కువ. అయితే, 2022లో 99 శాతం వేతనం కోతను ఎదుర్కొన్నారు. కాబట్టే మోస్ట్ ఓవర్ పెయిడ్ సీఈవోలా జాబితాలో తన స్థానాన్ని కోల్పోయారు. 99 శాతం తగ్గింది 2021లో ఆండీ జెస్సీ శాలరీ 212 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు (సుమారు రూ. 10 కోట్లు) తగ్గిందని అమెజాన్ ఇటీవల దాఖలు చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయినప్పటికీ, జెస్సీ బేస్పే (జీతం మినహా ఇతర బెన్ఫిట్స్ ఉండవు) 175,000 డాలర్ల నుంచి 317,500తో 80 శాతం పెరిగింది. ఆండీ వేతనం తగ్గడానికి 2022లో స్టాక్ గ్రాంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021లో అందించిన అతని షేర్లలో కొంత భాగం ఈ సంవత్సరం అమెజాన్ అందించనుంది. మిగిలిన షేర్లను 2026 నుంచి 2031 చివరి నాటికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర టెక్ దిగ్గజాల సీఈవోల వేతనాలను పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఏడాది 55 మిలియన్లు పొందగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ సుమారు 99.4 మిలియన్లు, 2020లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. -
అమెజాన్ ఉద్యోగులకు మరో షాక్
-
27వేల మంది తొలగింపు: అమెజాన్ సీఈవో కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: ఉద్యోగుల తొలగింపుపై ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో 27 వేల మందిని తొలగించడం అనేది చాలా కఠినమై నిర్ణయం.. కానీ తప్పలేదని తెలిపారు. ఖర్చులను నియంత్రించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నా మని చెప్పారు. ఈ మేరకు సంస్థ అధికారిక వెబ్సైట్లో ఆయన ఒక లేఖను పోస్ట్ చేశారు. కంపెనీ ఎదుర్కొన్నసవాళ్లను వివరిస్తూ వాటాదారులకు సీఈవో వార్షిక లేఖ రాశారు. ఖర్చు తగ్గించే ప్రయత్నాలు కంపెనీ వృద్ధికి సహాయపడతాయనే విశ్వాసాన్నివ్యక్తం చేశారు. ఉద్యోగులను తొలగించే నిర్ణయం కష్టమైనదే కానీ దీర్ఘకాలంలో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. (టైమ్స్ మాగజైన్ 100: ఈ రంగం నుంచి వీరిద్దరే, ఆ సూపర్స్టార్లు ఎవరంటే?) కంపెనీ సంక్షేమంపై లోతుగా సమీక్షిస్తూ, ఒక్కో బిజినెస్‌ను స్టడీ చేసిన అనంతరం తీసుకున్న తమ నిర్ణయంతో రానున్న రోజుల్లో కంపెనీకి మంచి జరుగుతుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు. అలాగే ఖర్చులను తగ్గించేందుకు అమెజాన్ కంపెనీకి చెందిన ఫిజకల్ స్టోర్స్‌ను మూసి వేశా మన్నారు. అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ ఎఫర్ట్స్‌ను కూడా మూసివేసినట్లు చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు తెగతెంపుల చెల్లింపు, తాత్కాలిక ఆరోగ్య బీమా ప్రయోజనాలతోపాటు బయట ఉపాధిని కనుగొనడంలో సహాయం అందిస్తుంది. అలాగే, మే నెల నుండి సిబ్బంది వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేస్తారని కూడా ఆండీ జాస్సీ పేర్కొన్నారు. కాగా అమెజాన్‌లో రెండు దఫాలుగా 27 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) -
అమెజాన్ ఉద్యోగులకు అలర్ట్: మే 1 నుంచి..!
సాక్షి,ముంబై: ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కార్పొరేట్ ఉద్యోగులను కోరింది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఫిబ్రవరి 17న సిబ్బందికి మెమో ద్వారా సమాచారం అందించారు. ఈ విధనం మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఎక్కువ సమయం ఆఫీసులో, సహోద్యోగులతో కలిసి ఉన్నప్పుడు నేర్చుకోవడానికి, సంస్కృతిన బలోపేతం కావడానికి ఎక్కువ దోహదపడుతుందని జెస్సీ తెలిపారు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సహకారంతో కొత్త ఆవిష్కారాలుసులభమవుతాయనీ, వ్యక్తిగతంగా ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడం ఈజీ అని పేర్కొన్నారు. అలాగే తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే వ్యాపారానికి, ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందని ఆండీ జెస్సీ బ్లాగ్ పోస్ట్ సందేశంలో పేర్కొన్నారు. కాగా గ్లోబల్‌గా కరోనా పరిస్థితి చక్కబడుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. గత నెలలో, స్టార్‌బక్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కోరింది.డిన్నీ కూడా వారానికి నాలుగు రోజులు ఆఫీసు నుంచి పని విధానం మార్చినుంచి ప్లాన్ చేసుకోవాలని డిస్నీ ఉద్యోగులను కోరుతోంది. వాల్‌మార్ట్ రెగ్యులర్ ఇన్-ఆఫీస్ పని దినాలను ప్లాన్ చేసు కోవాలని ఇటీవల తన టెక్ టీంలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
అమెజాన్ ఉద్యోగాల కోత, ‘ఆఫీస్‌లో వెక్కివెక్కి ఏడుస్తున్న ఉద్యోగులు’!
కొద్ది రోజుల క్రితం సీఈవో ఆండీ జెస్సీ ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగుల్లో 18000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వారిలో భారత్‌కు చెందిన 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తొలగింపులతో అమెజాన్ ఇండియా కార్యాలయాల్లో చీకటి వాతావారణం నెలకొంది. పింక్ స్లిప్‌లు అందుకున్న ఉద్యోగులు ఆఫీస్‌లోనే బోరున విలపిస్తున్నట్లు వారి సహచర ఉద్యోగులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రొఫెషనల్ యాప్ గ్రేప్‌వైన్‌లో అమెజాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగి మారుపేరుతో సంస్థలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ఓ పోస్ట్ చేశారు. అందులో సదరు ఉద్యోగి.. నా టీమ్‌లో 75శాతం మంది ఫైర్ అయ్యారు. మిగిలిన 25శాతం మంది పనిచేసేలా వారిని మోటివేట్ చేయలేను. ఎందుకంటే క్యాబిన్‌లోనే ఉద్యోగం నుంచి పోతుంది. కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయని ఏడుస్తున్నారని అందులో పేర్కొన్నారు. అమెజాన్ ఇండియా ఉద్యోగులు ఎక్కడి వారంటే అమెజాన్ ఇండియాలో ఉద్యోగుల తొలగింపులు బెంగళూరు, గుర్గావ్ కేంద్రంగా అమెజాన్‌లో పనిచేస్తున్న పలు విభాగాలకు చెందిన పనిచేసే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. -
భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు భారీ షాక్!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ సీఈవో ఆండీ జెస్సీ 18వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్న ప్రకటించారు. ఆ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో అమెజాన్ షేర్ వ్యాల్యూ ఒక్క శాతం కోల్పోయింది. దీంతో బెజోస్ ఒక్క రోజే 670 మిలియన్ డాలర్లు నష్టపోయారు. రెండ్రోజుల క్రితం ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా అమెజాన్ ర్యాపిడ్‌గా ఉద్యోగుల్ని నియమించుకుంది. కానీ గత కొద్ది కాలంగా ఆర్దిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది. కాబట్టే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. బెజోస్ కొంపముంచిన ప్రకటన ఆ ప్రకటనే బెజోస్ కొంప ముంచింది. ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటనతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. స్టాక్ మార్కెట్లో అమెజాన్ షేర్లను అమ్ముకోవడంతో ఒక్కరోజే 600మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన అధినేత బుధవారం ఒక్కరోజే 675 మిలియన్లు కోల్పోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 108 బిలియన్ డాలర్లు ఉండగా.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు. కాలం కలిసి రావట్లేదా? గత కొద్ది కాలంగా బిలియనీర్ల జాబితాలో బెజోస్ తన స్థానాన్ని కోల్పోతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టారు. బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బెజోస్‌ను అధిగమించి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2022లో గతేడాది దిగ్గజ కంపెనీలకు ఏమాత్రం కలిసి రాలేదంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2022లో అమెజాన్ మార్కెట్ విలువ సుమారు 834.06 బిలియన్ డాలర్లు కోల్పోయింది. ఆ తర్వాత అమెజాన్ కంటే ఎక్కువగా టెక్ దిగ్గజం యాపిల్ 846,34 బిలియన్ డాలర్లు కరిగాయి. -
వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు
న్యూయార్క్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నాయి. ఎంత మందిని తొలగించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. వార్షిక సమీక్ష ప్రక్రియ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని, కస్టమర్ల అవసరాలు.. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏయే విభాగాల్లో ఎంత మంది సిబ్బందిని తగ్గించుకోవాలనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉద్యోగులకు పంపిన నోట్లో జస్సీ పేర్కొన్నారు. తీసివేతల గురించి డివైజ్‌లు, బుక్స్ విభాగాల సిబ్బందికి బుధవారం తెలియజేశామని, కొందరికి స్వచ్ఛందంగా పదవీ విరమణ అవకాశాలను కూడా ఆఫర్ చేశామని ఆయన వివరించారు. తాను సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో సిబ్బందిని తగ్గించుకునే అంశం అత్యంత కష్టతరమైన నిర్ణయమని జస్సీ పేర్కొన్నారు. అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గంటలవారీగా పని చేసే వర్కర్లు ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని తమ కార్యాలయాల్లో 260 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని మూడు రోజుల క్రితం అధికారులకు తెలియజేసింది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న పలు టెక్ కంపెనీలు .. తాజాగా సిబ్బందిని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలాన్ మస్క్ సగానికి పైగా ఉద్యోగులను తీసివేశారు. -
నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 55,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ రాయిటర్స్ కు తెలిపారు. ఆండీ జాస్సీ జూలైలో అమెజాన్ సీఈఓ పదవీ చేపట్టిన తర్వాత తన మొదటి పత్రికా ఇంటర్వ్యూలో ఇతర వ్యాపారాలతో పాటు రిటైల్, క్లౌడ్ డిమాండ్ ను కొనసాగించడానికి సంస్థకు మరింత మంది అవసరమని చెప్పారు. ప్రాజెక్ట్ కైపర్ అని పిలిచే బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను విస్తృతం చేయడానికి, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి సంస్థకు చాలా మంది అవసరమని ఆయన అన్నారు.(చదవండి: Amazon: రైతులకు టెక్నికల్‌గా సాయం) అమెజాన్ వార్షిక జాబ్ ఫెయిర్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. జాస్సీ నియామకాల కోసం ఇది మంచి సమయమని భావిస్తున్నారు. "ఈ మహమ్మారి సమయంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా మారిన సంగతి తెలిసందే. కొత్త ఉద్యోగాల గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు" అని అన్నారు. మేము తీసుకున్న కెరీర్ డే (https://www.amazoncareerday.com) అనే ఆలోచన సకాలంలో చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని అని అన్నారు. ఈ కొత్త నియామకాలు వల్ల అమెజాన్ టెక్, కార్పొరేట్ సిబ్బంది 20 శాతం పెరగనున్నారు అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2,75,000 మంది పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది. జాస్సీ ప్రకటించిన 55,000 కు పైగా ఉద్యోగాలలో 40,000 కంటే ఎక్కువ అమెరికాలో ఉంటాయి. మిగిలిన ఉద్యోగాలు భారతదేశం, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో ఉన్నాయి.