
కొద్ది రోజుల క్రితం సీఈవో ఆండీ జెస్సీ ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగుల్లో 18000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వారిలో భారత్‌కు చెందిన 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తొలగింపులతో అమెజాన్ ఇండియా కార్యాలయాల్లో చీకటి వాతావారణం నెలకొంది. పింక్ స‍్లిప్‌లు అందుకున్న ఉద్యోగులు ఆఫీస్‌లోనే బోరున విలపిస్తున్నట్లు వారి సహచర ఉద్యోగులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ ప్రొఫెషనల్ యాప్ గ్రేప్‌వైన్‌లో అమెజాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగి మారుపేరుతో సంస్థలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ఓ పోస్ట్ చేశారు. అందులో సదరు ఉద్యోగి.. నా టీమ్‌లో 75శాతం మంది ఫైర్ అయ్యారు. మిగిలిన 25శాతం మంది పనిచేసేలా వారిని మోటివేట్ చేయలేను. ఎందుకంటే క్యాబిన్‌లోనే ఉద్యోగం నుంచి పోతుంది. కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయని ఏడుస్తున్నారని అందులో పేర్కొన్నారు.
అమెజాన్ ఇండియా ఉద్యోగులు ఎక్కడి వారంటే
అమెజాన్ ఇండియాలో ఉద్యోగుల తొలగింపులు బెంగళూరు, గుర్‌గావ్ కేంద్రంగా అమెజాన్‌లో పనిచేస్తున్న పలు విభాగాలకు చెందిన పనిచేసే ఎక్స్‌పీరియన్స్, ఫ్రెషర్స్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment