పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్‌! | Paytm lays off over 1,000 employees as cost-cutting | Sakshi
Sakshi News home page

పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్‌!

Published Mon, Dec 25 2023 11:37 AM | Last Updated on Mon, Dec 25 2023 12:16 PM

Paytm lays off over 1,000 employees - Sakshi

ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది. 

వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా దేశంలో పలు ప్రాంతాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని పేటీఎం తొలగించినట్లు సమాచారం. ఈ మొత్తం సంఖ్య 10 శాతం కంటే ఎక్కువగా ఉంది.

అయితే గత రెండు మూడేళ్ల క్రితం పేటీఎం ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకుంది. ఇప్పుడు ఉద్వాసన పలికిన ఉద్యోగుల్లో వీళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. ఉద్యోగుల తొలగింపుతో ఖాళీ అయిన విభాగాల్లో ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో భర్తీ చేసినట్లు వెల్లడించారు.  

ఇక వచ్చే ఏడాది పేటీఎం మరో 15వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనుంది. పేటీఎం తన పని విధానంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్‌తో మారుస్తోందని, సంస్థ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పెరిగేందుకు దోహదం చేసేందుకు  వీలుండే ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేసినట్లు పేటీఎం ప్రతినిధి వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement