fintech companies
-
భారతీయుల ఖర్చు మాములుగా లేదు..!
భారత్ ఖర్చు చేస్తోంది. షాపింగ్ ద్వారా సంతోషాన్ని కొని తెచ్చుకునేవారు కొందరైతే, ఇతరులకు పోటీగా హోదా ప్రదర్శించేవారు మరికొందరు. మారుమూల పల్లెలకూ ఇంటర్నెట్ చేరువ కావడం; చౌకగా డేటా లభించడం; విరివిగా స్మార్ట్ఫోన్ల వాడకం; ఈ–కామర్స్ దూకుడు; స్వదేశీ, విదేశీ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాలు; ఊరిస్తున్న ఫ్యాషన్ ప్రపంచం; ఊదరగొట్టే కంపెనీల ప్రకటనలు; సానుకూల మార్కెట్ వాతావరణం.. కారణం ఏదైతేనేం ప్రజల ఆదాయాల్లో వృద్ధి, మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆకాంక్షలు జనాలను ఖర్చుల వైపు నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫిన్‌టెక్ కంపెనీలు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ప్రజలకు రుణాలను వేగంగా, విరివిగా అందించడమూ ఖర్చులకు ఆజ్యం పోస్తోంది. దినసరి కూలీలు, వేతన జీవులు, వ్యాపారస్తులు– ఉపాధిమార్గం ఏదైనా, ఆదాయం ఎంత ఉన్నా, డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు. భారతీయులు తమ మొత్తం ఆదాయంలో అనవసర ఖర్చులకే 29 శాతం వెచ్చిస్తున్నారట! రూ.40 వేల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తులైతే అవసరాలను మించి అనవసర వ్యయాలు చేస్తున్నారంటే ప్రజలు హంగు, ఆర్భాటాలకు ఎంతలా ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ విడ్డూరమేమిటంటే, రూ.20 వేలలోపు ఆదాయం ఉన్న అల్పాదాయ వర్గాల వారిలో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వారి శాతం అత్యధికంగా 22% ఉంది. జనం ఎంతగా వెచ్చిస్తున్నారంటే, తాము చేసిన పెట్టుబడుల గడువు తీరక ముందే వాటిని ఉపసంహరించుకుని మరీ ఖర్చు చేస్తున్నారు.బలమైన వృద్ధి, పెరుగుతున్న మధ్య, అధిక–ఆదాయ తరగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, వెరసి పెట్టుబడి, వినియోగదారుల కార్యకలాపాలకు ప్రపంచ హాట్‌స్పాట్‌గా భారత్ ఉద్భవించింది. భారత మార్కెట్లోకి భారీగా మూలధనం వెల్లువెత్తుతోంది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సేవల రంగంలో పెరుగుతున్న డిజిటలైజేషన్ తిరుగులేని ప్రభావాన్ని చూపుతోంది. పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, విస్తరిస్తున్న గ్రామీణ మార్కెట్లు, మెరుగైన డిజిటల్ అనుసంధానత, జనాభాలో పెరుగుతున్న ఆకాంక్షల ఫలితంగా 2027 నాటికి భారత్ రెండు మెట్లు ఎక్కి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వినియోగదారుల మార్కెట్ పరివర్తన దిశగా పయనిస్తోంది. వినియోగదారుల ప్రవర్తనలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతోంది.ఈ డైనమిక్ మార్కెట్లో భాగస్వామ్యం కోసం ఉవ్విళ్లూరుతున్న ఆర్థిక సంస్థలు, విధాన రూపకర్తలు, వ్యాపారులకు భారతీయులు ఖర్చు పెడుతున్న తీరును అర్థం చేసుకోవడం చాలా అవసరం. ‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ భారతీయ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని విశ్లేషించి, వారు చేసే ఖర్చులను లోతుగా పరిశీలించింది. ఈ అధ్యయనం వివిధ ఆదాయ స్థాయులు, ప్రదేశాలలోని వ్యక్తుల ఖర్చు అలవాట్ల గురించి తెలియజేస్తుంది. భారతీయ వినియోగ, వ్యయ ధోరణులలోని మార్పులకు ఈ నివేదిక అద్దం పడుతుంది. ప్రజలు తప్పనిసరి ఖర్చులకు అత్యధిక మొత్తంలో డబ్బు కేటాయిస్తున్నారు. ఇది వారి మొత్తం వ్యయంలో 39 శాతం ఉంటోంది. అవసరాలకు 32 శాతం, హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు 29 శాతం వెచ్చిస్తున్నారు.అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.అనవసర ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ జీవనశైలి కొనుగోళ్లకు సంబంధించివే! అంటే ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్‌కు ఖర్చు చేస్తున్నారు.నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న ఎంట్రీ–లెవల్ సంపాదనపరుల్లో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 22 శాతం ఉంది.టైర్–1 నగరాల కంటే టైర్–2 నగరాల్లో ఇంటి అద్దెకు సగటున 4.5 శాతం ఎక్కువ ఖర్చు అవుతోంది. టైర్–2 నగరాల్లో నివసించే ప్రజలు వైద్య ఖర్చులకు సగటున రూ.2,450 వెచ్చిస్తున్నారు. మెట్రోలలో ప్రజలు నెలకు సగటున వైద్య ఖర్చులకు రూ.2,048 వెచ్చిస్తున్నారు.తప్పనిసరి ఖర్చులకు, అవసరాలు, అనవసర ఖర్చుల చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల దేశంగా భారత్ ఆకర్షిస్తోంది. 2023లో జీడీపీలో ప్రైవేట్ వినియోగం (వస్తు సేవలకు జనం చేసిన ఖర్చు) వాటా 60% నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2031 నాటికి ఏటా 13.4 శాతం వార్షిక సగటు వృద్ధితో దేశ వినియోగ ఆర్థిక వ్యవస్థ రూ.426.4 లక్షల కోట్లను తాకనుందని అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న మధ్యతరగతి, వస్తు సేవల వినియోగం, పట్టణీకరణ, పెరుగుతున్న ఆకాంక్షలు, యువజన జనాభా ఈ వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. వేతన జీవుల సంఖ్యలో 2019 నుంచి ఏటా సగటున 9.1 శాతం వృద్ధి నమోదవుతోంది. ఆదాయాల్లో స్థిర వృద్ధి గృహ వినియోగం పెరగడానికి, వస్తు సేవల గిరాకీకి కారణమవుతోంది. అయితే, భారతీయ కుటుంబాలు బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్స్, బాండ్స్, లోన్ల వంటి తమ ఆర్థిక ఆస్తులలో క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ధోరణి నెలకొనడం గమనార్హం. దేశ జీడీపీలో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 2022లో 7.2 శాతం నుంచి 2023లో 5.1 శాతానికి పడిపోయింది. గత యాభయ్యేళ్లలో ఇదే అత్యల్పస్థాయి అని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి పర్సనల్ లోన్స్ 13.7 శాతం వార్షిక వృద్ధితో ఏకంగా రూ.55.3 లక్షల కోట్లకు చేరుకున్నాయంటే జనం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.డిజిటల్ అక్షరాస్యతవిభిన్న ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ఫోన్లు, సామాన్యులకు చేరువైన టెలికం సేవలు 82 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ను చేర్చింది. వాస్తవ వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం జనాభాలో 72% మించిపోయింది. దేశంలో డిజిటల్ అక్షరాస్యత 38 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 61 శాతం ఉంది. వెబ్, మొబైల్ అప్లికేషన్లతో సేవలను అందించడం ద్వారా ఆర్థిక సేవల రంగం ఈ ధోరణిని ఉపయోగించుకుంటోంది. ఈ అంశమే వ్యక్తిగత రుణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.ఆదాయాల జోరుదేశవ్యాప్తంగా 2019–24 మధ్య వ్యక్తుల వేతనాలు ఏడాదికి 9.1 శాతం కంటే ఎక్కువ రేటుతో పెరిగింది. వ్యక్తుల ఆదాయంలో ఈ పెరుగుదల వినియోగదారుల వ్యయాల తీరును నిర్ణయించే కీలక అంశాలలో ఒకటి. భారతీయుల తలసరి ఖర్చు చేయదగ్గ ఆదాయం 13.3 శాతం వృద్ధి రేటుతో 2023–24లో రూ.2.14 లక్షలకు పెరిగింది. 2023–24లో స్థూల పొదుపు 30 శాతం తగ్గింది. పొదుపులో తగ్గుదల పెరిగిన వ్యయాలను సూచిస్తుంది. ఉపాధి, ఉద్యోగ భద్రత2017–19 నుంచి 2022–23 మధ్య ఉపాధి రేటు 46.8 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. పెరిగిన ఉపాధి రేటు వ్యక్తుల వినియోగ వ్యయం పెరగడానికి దోహదపడుతోంది.భావోద్వేగ వ్యయంసాధారణంగా వినియోగదారులు సంతోషం, ఒత్తిడి, ఆందోళన మొదలైన మానసిక స్థితి ద్వారా ప్రభావితం అవుతున్నారు. ఇది వారి వ్యయ ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు చాలామంది కస్టమర్లు తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అంటే తమ సంతోషం కోసం ఇష్టమైన బ్రాండ్లు, నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే రిటైల్ థెరపీలో పాల్గొంటున్నారు.సామాజిక ప్రభావంకుటుంబం, సహచరుల ప్రభావం, సామాజిక స్థితి, జీవనశైలి, సాంస్కృతిక ధోరణులు వంటి అనేక సామాజిక అంశాలు కస్టమర్ల ఖర్చు ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చులు, ఆదా చేసే విధానం వారి పిల్లల వ్యయ ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, తోటివారి ఒత్తిడి యువ వినియోగదారులను వారి సామాజిక స్థితిని కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ఖర్చు పెట్టేలా చేస్తోంది. భారతీయ సాంస్కృతిక పద్ధతులు వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు 2023 దీపావళి సీజన్లో భారత రిటైల్ మార్కెట్లో రూ.3.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.సాంకేతికతతో వినియోగం దూకుడుటెక్నాలజీ అందుబాటులో ఉండటం, ఈ–కామర్స్ వృద్ధి, ఫిన్ టెక్ పరిష్కారాల పెరుగుదల భారతీయ వినియోగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల విస్తృతితో ఈ–కామర్స్ వృద్ధి వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది. దేశంలో 2024లో ఈ కామర్స్ ఆధారిత అమ్మకాలు రూ.4,41,700 కోట్లు నమోదయ్యాయి. 2029 నాటికి ఏటా 11.45% వార్షిక వృద్ధితో ఇది రూ.7,59,200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ విధానాలు, పన్నుల కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితమవుతున్నాయి. ఆకట్టుకునే ప్రకటనలువినియోగదారుల ఖర్చును వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటూ, అమ్మకాలను మాత్రమే కాకుండా, బ్రాండ్ విధేయతను కూడా పెంచుతున్నాయి. దేశంలో ప్రకటన ఖర్చులు 2024లో 10.2 శాతం పెరిగి రూ.1,55,386 కోట్లు నమోదయ్యాయి. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, వినియోగదారులను ప్రభావితం చేయడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.ఈఎంఐలే తప్పనిసరి..తప్పనిసరి ఖర్చుల్లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు చెల్లించే ఈఎంఐలే సింహభాగం ఉంటున్నాయి. రుణ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి రావడంతో అప్పులు తీసుకోవడంలో వృద్ధి నమోదవుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం మొత్తం క్రెడిట్లో వ్యక్తిగత రుణాల వాటా 2023లో 30.6 శాతం నుంచి 2024 ఫిబ్రవరిలో 32.6 శాతానికి పెరిగింది. 2023 నాటికి మొత్తం రిటైల్ రుణాలలో గృహరుణాల వాటా ఏకంగా 47.2 శాతానికి చేరింది. ఈఎంఐలు 42 శాతానికి పెరిగాయి. మదుపు చేయడమూ తెలుసుఖర్చులే కాదు మదుపు చేయడమూ జనానికి తెలుసు. షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను నిల్వ చేసుకునే డీమ్యాట్ ఖాతాలు దేశవ్యాప్తంగా 2022 ఆగస్ట్ నాటికి 10 కోట్లు. 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 18.8 కోట్లకు చేరిందంటే, పెట్టుబడుల పట్ల జనంలో ఆసక్తిపెరుగుతోందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం), బీమా, పదవీ విరమణ పొదుపులు 2013 నుంచి 2023 వరకు ఏటా 15% పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు కూడా అదే కాలానికి 9% వార్షిక సగటు వృద్ధి నమోదు చేశాయి.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
ఫిన్‌టెక్ కొత్త మంత్రం రూపే కార్డ్
ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులూ యూపీఐ ద్వారానే. లేదంటే పెద్ద లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ వాడుతుంటారు. మరి క్యూఆర్ కోడ్ చెల్లింపులకు బ్యాంక్ ఖాతాలో కచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే యూపీఐ లైట్ వ్యాలెట్‌లో అయినా బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి. ఈ రెండూ లేకుండా రూపే క్రెడిట్ కార్డుతో క్యూఆర్ కోడ్ చెల్లింపులకు గతేడాదే ఆర్బీఐ వీలు కల్పించింది. ఇప్పటి వరకు ఇదేమంత ప్రచారానికి నోచుకోలేదు. కానీ, ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీలు రూపే క్రెడిట్ కార్డుల మార్కెటింగ్‌ను భుజానికెత్తుకున్నాయి. రియో, కివి, క్రెడిట్పే తదితర ఫిన్‌టెక్ సంస్థలు బ్యాంకులతో టైఅప్ అయి రూపే క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందిస్తూ, వాటిపై కమీషన్ పొందుతున్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థలు, వర్తకులతోనూ చేతులు కలిపి రూపే కార్డు వినియోగంపై చక్కని ఆఫర్లు ఇస్తున్నాయి. యూపీఐకి అనుసంధానించుకుని చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండడంతో రూపే క్రెడిట్‌కార్డుతో కొత్త యూజర్లకు ఫిన్‌టెక్‌లు సులభంగా చేరువ అవుతున్నాయి. చిన్న వర్తకుల వద్ద పీవోఎస్ యంత్రాలు లేకపోవడంతో క్రెడిట్ కార్డులతో చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. పీవోఎస్ లేకపోయినా రూపే కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవడం కస్టమర్లను ఆకర్షిస్తోంది. ‘‘పీవోఎస్ మెషిన్ లేని వర్తకుల వద్ద చెల్లింపులకు వీలు కలి్పంచే ఏకైక కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్’’అని సూపర్.మనీ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రకాశ్ సికారియా తెలిపారు. పీవోఎస్ లేని వర్తకుల సంఖ్య కోట్లలో ఉంటుంది. దీంతో రూపే కార్డుల రూపంలో ఫిన్టెక్లకు పెద్ద మార్కెట్టే అందుబాటులోకి వచి్చనట్టయింది. కివి సంస్థ వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తోంది. నెలవారీ రూ.300 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. ‘‘కస్టమర్లు యూపీఐ లావాదేవీలను క్రెడిట్ కార్డ్‌తో చేయడం మొదలు పెడితే, సేవింగ్స్ ఖాతా అనుసంధానిత యూపీఐ నుంచి మారిపోతారన్నది మా నమ్మకం. ఎందుకంటే ఇందులో సౌలభ్యంతోపాటు మెరుగైన అనుభవం లభిస్తుంది’’అని కివి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మోహిత్ బేడి అభిప్రాయపడ్డారు.ఆఫర్లతో గాలం.. ‘‘యూపీఐ చెల్లింపుల పరంగా సౌకర్యవంతమైన సాధనం. క్రెడిట్ కార్డులన్నవి రివార్డులు, ప్రయోజనాలకు పెట్టింది పేరు. ఈ రెండింటి కలయికతో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు, రివార్డులు అందించే ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’అని సికారియా వివరించారు. కివి జారీ చేసే వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్‌పై 40–50 రోజుల వడ్డీ రహిత (క్రెడిట్ ఫ్రీ) కాలం అమలవుతుంది. దీనికి అదనంగా వ్యయంపై రివార్డులను అందిస్తోంది. ఎయిర్‌పోర్టుల్లో యూపీఐ ఆధారిత లాంజ్ ప్రవేశాలకూ వీలు కలి్పస్తోంది. పెద్ద వర్తకులతో టైఅప్ పెట్టుకుని క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను సైతం ఫిన్‌టెక్‌లు ఆఫర్ చేస్తుండడంతో కస్టమర్లు సైతం రూపే క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మధ్యవర్తిత్వ పాత్రతో ఆదాయం.. చాలా వరకు ఫిన్‌టెక్‌లు కేవలం మధ్యవర్తిత్వ పాత్రకే పరిమితమవుతున్నాయి. ఇవి నేరుగా క్రెడిట్ కార్డులు జారీ చేయవు. బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుని పంపిణీ, ఇతర సేవలను అందించడానికి పరిమితమవుతున్నాయి. కార్డు యాక్టివేషన్‌పై కొంత మొత్తం చార్జీ కింద, కార్డు వినియోగంపైనా ప్రయోజనాలను అందుకుంటున్నాయి. సంప్రదాయ క్రెడిట్ కార్డులపై యూజర్లు నెలవారీ 8–9 లావాదేవీలు చేస్తుంటే.. యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డుపై దీనికి రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. కివి ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ అవుతున్న రూపే క్రెడిట్ కార్డుపై నెలవారీగా ఒక్కో యూజర్ సగటున 22 నుంచి 24 లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. దీనివల్ల కస్టమర్లను నిలుపుకోవడంతోపాటు, అధిక లావాదేవీల రూపంలో ఫిన్టెక్లకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. తొలిసారి క్రెడిట్ యూజర్లకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై సెక్యూర్డ్ రూపే క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. యూపీఐపై క్రెడిట్ లైన్ సేవలను అందిస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
లక్కీ ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.లక్ష..
ఫిన్‌టెక్ యునికార్న్ రేజర్‌పే (Razorpay) తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను (ESOP) అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ ఇంత భారీ మొత్తంలో ప్రతీ ఉద్యోగికీ స్టాక్ ఆప్షన్లను అందిచడం ఇదే మొదటిసారి. ఉద్యోగుల అంకితభావం, కృషిని గుర్తిస్తూ ఈ చొరవ తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. రేజర్పేతోపాటు ఇటీవల ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసిన ఇతర కొత్త తరం కంపెనీలలో లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ ఢిల్లీవేరీ, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato), చెల్లింపు సేవల సంస్థ పేటీఎం (Paytm), ట్రావెల్ టెక్ సంస్థ ఇక్సిగో ఉన్నాయి.గత నెలలో ఢిల్లీవేరీ 4.9 లక్షల స్టాక్ ఆప్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. అదే నెలలో, పేటీఎం 4.05 లక్షల ఈక్విటీ షేర్లను మంజూరు చేసింది. ఇక్సిగో 17.6 లక్షల స్టాక్ ఆప్షన్లను మంజూరు చేసింది. నెల క్రితం జొమాటో సుమారు 12 మిలియన్ స్టాక్ ఆప్షన్లను జారీ చేసింది. రేజర్‌పే ఇప్పటి వరకు 1,940 మంది ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను అందించింది.రేజర్‌పేకి సంబంధించి గతంలో స్టాక్ ఆప్షన్లను అందుకున్న ఉద్యోగులు పలు రౌండ్ల బైబ్యాక్‌ల ద్వారా ప్రయోజనం పొందారు. కంపెనీ తన మొదటి ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ల బైబ్యాక్‌ను 2018లో ప్రారంభించింది. అప్పుడు 140 మంది ఉద్యోగులను వారి వెస్టెడ్ షేర్లను లిక్విడేట్ చేసుకున్నారు. 2019, 2021లో రెండవ, మూడవ బైబ్యాక్‌లలో వరుసగా 400, 750 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఇక 2022లో 75 మిలియన్ డాలర్ల విలువతో నాల్గవ బైబ్యాక్ 650 మంది ఉద్యోగులకు (మాజీ ఉద్యోగులతో సహా) ప్రయోజనం చేకూర్చింది. -
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లోన్ కావాలా? అయితే..
చెన్నై: వివాహ బంధాలకు వేదికగా ఉన్న మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరో అడుగు ముందుకేసింది. పెళ్లి వేడుకకు రుణం సమకూర్చేందుకు వెడ్డింగ్‌లోన్స్ డాట్ కామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్సీ, టాటా క్యాపిటల్, లార్సెన్ అండ్ టూబ్రో ఫైనాన్స్‌తో చేతులు కలిపింది.వివాహ ప్రణాళిక, బడ్జెట్, అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి సేవలను విస్తరిస్తున్నట్టు మ్యాట్రిమోనీ డాట్ కామ్ సీఈవో మురుగవేల్ జానకిరామన్ తెలిపారు. ఈ సంస్థ పెళ్లిళ్ల కోసం రూ. 1 లక్ష నుండి రూ.1 కోటి వరకూ రుణాలను అందజేస్తుంది. నెలవారీ ఈఎంఐ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.2024లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనాల ప్రకారం, నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 మధ్య వివాహాలు జరిగే సీజన్లో దాదాపు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోనున్నాయి. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్‌తో సహా ప్రస్తుత ఛానెల్‌లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్‌కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్‌టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్‌ఫామ్‌లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
రూ.3.25 లక్షల జాక్‌పాట్ కొడితే రూ.వెయ్యి ఇచ్చారంతే..
రూ.3.25 లక్షల విలువైన బహుమతులు గెలుపొందిన వ్యక్తికి రూ.వెయ్యి క్యాష్ బ్యాక్ ఇచ్చి సరిపెట్టింది ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్. జాక్‌పాట్ కొట్టానన్న సంబరంలో ఉన్న ఆ వ్యక్తికి.. సాంకేతిక సమస్య కారణంగా ఈ బహుమతులు 200 మంది గెలుపొందారని, దీంతో జాక్‌పాట్ రద్దు చేస్తున్నట్లు చావు కబరు చల్లగా చెప్పింది ఆ కంపెనీ.ఈ మేరకు అవిరల్ సంగల్ అనే వ్యక్తి ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్టు పెట్టారు. క్రెడ్ ఫ్రైడే జాక్‌పాట్ తాను రూ.3.25 లక్షల విలువైన బహుమతులు గెలుపొందానని, కానీ సాంకేతిక కారణాలతో జాక్‌పాట్‌ను రద్దు చేశామని, కేవలం రూ.1,000 మాత్రం క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఫ్రైడే జాక్పాట్లో మ్యాక్‌బుక్, ఐపాడ్, ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్, టూమి బ్యాగ్ వంటి విలువైన వస్తువులు ఉన్నాయి.బహుతులు అందుకోవడానికి ఫారమ్ నింపాలని క్రెడ్ కోరిందని, టీడీఎస్ చెల్లింపు కోసమని తన పాన్ వివరాలు కూడా తీసుకుందని సంగల్ చెప్పుకొచ్చారు. తర్వాత కొన్ని నిమిషాలకు క్రెడ్ ప్రతినిధులు తనకు కాల్ చేసిసాంకేతిక సమస్య కారణంగా జాక్‌పాట్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని గుడ్ విల్ కింద రూ.వెయ్యి క్యాష్‌బ్యాక్ ఇస్తామని చెప్పారని వాపోయాడు.Even though I usually do not fall for the @CRED_club jackpots, but yesterday I just played the friday jackpot without having any hope of getting anything meaningful. But I scored the JACKPOT and it wasn't a small one. It included a Macbook, Ipad, Airpods Max and a TUMI bag worth… pic.twitter.com/16SwhchMYm— Aviral Sangal (@sangalaviral) September 7, 2024 -
PM Narendra Modi: ఫిన్‌టెక్ ప్రోత్సాహానికి పాలసీల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పాలసీల్లో తగు మార్పులు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం, దేశీయంగా పరిశోధనలు.. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ. 1 లక్ష కోట్లు కేటాయించడం, వ్యక్తిగత డేటా భద్రత చట్టం రూపకల్పన వంటి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అంకుర సంస్థలను దెబ్బతీసే సైబర్ మోసాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలకు సూచించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2024లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు. ఆర్థిక సేవలను అందరికీ అందుబాటలోకి తేవడంలో ఫిన్‌టెక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గడిచిన పదేళ్లలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని ఆయన ప్రశంసించారు. డిజిటల్ టెక్నాలజీతో పారదర్శకత పెరిగిందని, దీనికి నగదు బదిలీ పథకంలాంటివి నిదర్శనమని వివరించారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ త్రయంతో నగదు లావాదేవీలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగభాగం భారత్‌లోనే ఉంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, పండుగల వేళ దేశ ఎకానమీ, క్యాపిటల్ మార్కెట్లలో వేడుకల వాతావరణం నెలకొందని చెప్పారు. అధునాతన టెక్నాలజీలు, నిబంధనలతో ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పారదర్శకమైన, సమర్ధమంతమైన భారీ యంత్రాంగాలను రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు. గూగుల్ పేలో యూపీఐ సర్కిల్.. జీఎఫ్ఎఫ్ సందర్భంగా గూగుల్ పే యూపీఐ సర్కిల్‌ను ఆవిష్కరించింది. బ్యాంకు ఖాతాలను లింక్ చేయకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేందుకు యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా యాడ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అటు ఈ–రూపీ (యూపీఐ వోచర్లు), రూపే కార్డులకు సంబంధించి మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను, యూపీఐ లైట్లో ఆటోపే ఆప్షన్‌ను కూడా గూగుల్ పే ఆవిష్కరించింది. -
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్ కంపెనీ విస్తరణ.. భారీగా జాబ్స్!
ఫిన్ టెక్ కంపెనీ క్యాష్ఈ (CASHe) ఈ ఏడాది చివరి నాటికి 300 మందిని నియమించుకోవాలని, డిజిటల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను విస్తరించడానికి కొత్త టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పనిచేస్తుందని, కంపెనీ సాంకేతిక అవసరాలకు తోడ్పడుతుందని క్యాష్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫెసిలిటీ ప్రస్తుతం కంపెనీ లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ విభాగాలను నిర్వహిస్తుంది.టెక్నాలజీ, డేటా సైన్సెస్, మెషిన్ లెర్నింగ్, డెవ్ఆప్స్, టెక్ఆప్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్రెడిట్, కలెక్షన్స్ వంటి ఎక్స్పీరియన్స్ లెవల్స్, డొమైన్లలో నియామకాలు ఉంటాయి. క్యాష్ఈ హైదరాబాద్, ముంబై కేంద్రాల్లో 550 మందికి ఉపాధి కల్పిస్తోంది. కొత్తగా నియమించుకోనున్న 300 మందిలో 150 మందిని సంస్థ ప్రణాళికాబద్ధమైన టాలెంట్ అక్విజిషన్ స్ట్రాటజీకి అనుగుణంగా నియమించనున్నారు.'ఫిన్ టెక్ పరిశ్రమ గణనీయమైన మార్పులకు లోనవుతోంది. లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ టెక్ స్పేప్లో మా ఫిన్‌టెక్ సొల్యూషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మేము మా బృందాలు, మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నాము" అని క్యాష్ఈ సీఈవో యశోరాజ్ త్యాగి పేర్కొన్నారు. -
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్, మాధురీలకు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్ కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్ కార్డ్‌ను కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్‌కు, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్ గ్రోవర్లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్ గ్రోవర్ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. -
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
సాధారణంగా కంపెనీల సీఈవో వేతనం రూ.కోట్లలో ఉంటుంది. కానీ ఈ ఫిన్‌టెక్ యూనికార్న్ సీఈవో వార్షిక జీతం కేవలం 12 రూపాయలే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ కథనం చదవండి.ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ యూనికార్న్ వ్యవస్థాపకుల మధ్యస్త, సగటు వేతన అంతరాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఫిన్‌టెక్ యూనికార్న్ స్లైస్ ఫౌండర్, సీఈవో రాజన్ బజాజ్ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 వార్షిక వేతనం మాత్రమే తీసుకున్నారు.సీఈవో బజాజ్ జీతం నామమాత్రంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు, రుణ వ్యాపార కార్యకలాపాల నుంచి స్లైస్ రూ .847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ తన అప్పటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన ప్రీపెయిడ్ కార్డుపై రివాల్వింగ్ క్రెడిట్ లైన్‌ను రద్దు చేసినప్పటికీ కంపెనీ దీనిని సాధించగలిగింది. -
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్.. త్వరలోనే లేఆఫ్స్
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు షాకివ్వనుంది. త్వరలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీలోని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు చెల్లించే జీతాల ఖర్చులు గణనీయంగా పెరిగాయని, కాబట్టే సంస్థ ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడులు కొనసాగుతుండగా ఉద్యోగుల ఖర్చులను తగ్గించేందుకు కూడా సంస్థ చర్యలు తీసుకుంటుందని, ఈ నిర్ణయంతో సంస్థకు ఏటా రూ. 400-500 కోట్ల వరకు ఆదా అవుతుందని పేటీఎం సీఈఓ చెప్పారు. రాబోయే సంవత్సరానికి, మేం బిజినెస్ సేల్స్ విభాగంతో పాటు రిస్క్ అండ్ కంప్లైయన్స్ ఫంక్షన్లలో పెట్టుబడులు కొనసాగిస్తూనే.. లేఆఫ్స్‌తో ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు.. ఫలితంగా ఏడాదికి రూ.400 నుంచి రూ. 500 కోట్లు ఆదా అవుతుందని మేం ఆశిస్తున్నట్లు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. అంతేకాదు కంపెనీ తన కస్టమర్ కేర్‌ను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని, ఆదాయాన్ని పెంచుకుంటూనే ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైజ్‌ను ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్ సంస్థ
దేశీయ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే తన వినియోగదారులకు మరింత సౌకర్యాలు అందించేలా కొత్త పరికరాన్ని తయారుచేసింది. ఇందులో భాగంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్, స్పీకర్.. అన్నీ ఒకే పరికరంలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ ఆల్-ఇన్-ఒన్ చెల్లింపు పరికరం ‘భారత్‌పే వన్’ను తాజాగా ఆవిష్కరించారు.మొదటి దశలో దాదాపు 100 నగరాల్లో దీన్ని పరిచయం చేసి, రానున్న ఆరు నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది కంపెనీ యోచిస్తోంది. హైడెఫినిషన్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో భారత్‌పే వన్ పనిచేస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి. పోర్టబుల్ డిజైన్, లావాదేవీల డాష్‌బోర్డ్‌లతో భారత్‌పే ఆఫ్‌లైన్ వ్యాపారులకు మరింత సేవలిందించేలా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ అండ్ పే, డెబిడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు.. ఇలా విభిన్న మార్గాల్లో లావాదేవీలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీఫిన్టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం ఇటీవల తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్‌కార్డుల కోసం కొత్త సౌండ్‌బాక్స్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పరికరాలు మేడ్ఇన్ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్‌బాక్స్‌లు 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
Surinder Chawla : పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు మరో షాక్!
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) సీఈఓ పదవికి సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు చావ్లా తెలిపారు. మెరుగైన కెరీర్ కోసం అవకాశాలను అన్వేషించాలని ఉద్దేశంతో పీపీబీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించారు. పీపీబీఎల్‌లో చావ్లా జూన్ 26 వరకు కొనసాగనున్నారు. గత ఏడాది జనవరి 9న చావ్లా పేమెంట్ బ్యాంక్‌లో చేరారు. అంతకు ముందు ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్‌గా ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో పాటు ఇతర సంస్థలలో పనిచేసిన చావ్లాకు బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆరోపణలు పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2024 ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లతో పాటు ఇతర లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ గడువు తేదీని మార్చి 15వరకు పొడిగింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇతర యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్‌పే తరహాలో సేవలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి పీపీబీఎల్ నుంచి విడిపోయిన పేటీఎం ఆర్బీఐ ఆదేశాల మేరకు పీపీబీఎల్ నుంచి పేటీఎం వ్యాపార లావాదేవీలకు స్వస్తి చెప్పింది. బ్యాంక్ బోర్డు స్వతంత్ర చైర్‌పర్సన్‌తో పాటు ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లతో పునర్నిర్మించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. -
స్టార్టప్‌లతో ప్రతి నెలా సమావేశం నిర్వహించండి..
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించేందుకు వాటితో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు సూచనలు చేసినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రేజర్‌పే, క్రెడ్, పీక్‌ఫిఫ్టీన్ తదితర 50 సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, డీపీఐఐటీ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తదితరులు, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా, ఎన్పీసీఐ అధికారులు హాజరయ్యారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఫిన్‌టెక్, స్టార్టప్‌లతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పీపీబీఎల్ ఉదంతంపరమైన ఆందోళనలేమీ అంకుర సంస్థల వ్యవస్థాపకుల్లో కనిపించలేదని అధికారి తెలిపారు. ఈ భేటీలో స్టార్టప్‌లు సైబర్‌సెక్యూరిటీ సంబంధ అంశాలను ప్రస్తావించినట్లు వివరించారు. మహాకుంభ్‌లో వెయ్యి అంకుర సంస్థలు.. మార్చి 18 నుంచి న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో 1,000 పైచిలుకు అంకుర సంస్థలు, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, ఇన్క్యుబేటర్లు పాల్గొననున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభా గం డీపీఐఐటీ నిర్వహించనుంది. పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చలు, మెంటార్ సెషన్లు, మాస్టర్‌క్లాస్‌లు, కీలకోపన్యాసాలు, యూనికార్న్ రౌండ్‌టేబుల్ సమావేశాలు మొదలైనవి ఉంటాయి. -
అప్పుడు అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు మహేశ్ బాబు
పబ్లిక్ ఫిగర్స్ (ప్రముఖులు) వేలకోట్ల వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ల వరకు ఆయా ప్రొడక్ట్ ల అమ్మకాలు జరిగేలా బ్రాండ్ అంబాసీడర్లుగా రాణిస్తున్నారు. ఆయా ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా ప్రచారం చేస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్, సినిమా స్టార్లయినా బ్రాండ్ అంబాసీడర్‌గా వాళ్లు చేయాల్సిందల్లా మూమెంట్లు,డబ్బింగ్ చెబితే సరిపోతుంది. ఒక్కసారి సదరు బ్రాండ్ అంబాసీడర్ యాడ్ మార్కెట్ లోకి విడుదలైందా అంతే సంగతులు. ఊహించని లాభాల్ని చూడొచ్చు. అందుకే చిన్న చిన్న కంపెనీల నుంచి బడబడా కంపెనీల వరకు ఆయా రంగాల్లో రాణిస్తున్న వారిని తమ కంపెనీ ప్రొడక్ట్ ల అమ్మకాల కోసం బ్రాండ్ అంబాసీడర్ లు గా నియమించుకుంటాయి. వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించుకుంటాయి. తాజాగా, డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోతున్న ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఫోన్ పే యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. గత ఏడాది తన స్మార్ట్ స్పీకర్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌ను అందించిన 'ఫోన్ పే'.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్‌ను జోడించింది. ఇకపై చెల్లింపులు చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అనే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కి బదులు 'మహేశ్ బాబు' గొంతు వినిపిస్తుంది. ఇందుకోసం ఫోన్ పే ప్రతినిధులు మహేష్ వాయిస్ తీసుకుని కృత్రిమ మేధస్సు ద్వారా వాయిస్‌ను జనరేట్ చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్ చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత ధన్యవాదాలు బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది. Babu voice vasthundhi phone pay lo ma shop lo 💥💥😅🔥@urstrulyMahesh #GunturKaaram #SSMB29 pic.twitter.com/1lib8hIjl7 — babu fan ra abbayilu 💥💥🔥🤙 (@Vamsi67732559) February 20, 2024 బిగ్ బికి ఎంత రెమ్యునరేషన్ అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 30కి పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా పనిచేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి మరి బ్రాండ్ అంబాసీడర్ గా పని చేస్తూ తన ప్రచారంతో ఆయా కంపెనీలకు కనకవర్షం కురిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఒక్కో సంస్థ నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. -
టెక్ దిగ్గజం కీలక ప్రకటన.. పేటీఎంకు గూగుల్ భారీ షాక్!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు గూగుల్ భారీ షాకిచ్చింది. త్వరలో భారత్‌లో మిలియన్ల మంది చిరు వ్యాపారులు ఆడియో అలర్ట్‌లతో క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు జరిపేందుకు గాను స్పీకర్ సౌండ్ పాడ్స్(SoundPods)ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది దేశంలో పేటీఎం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర ఫిన్ టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పేటీఎం యూజర్లు ఇతర యూపీఐ పేమెంట్స్, చిరు వ్యాపారులు సౌండ్‌బాక్స్‌లను వినియోగిస్తున్నారు. తరుణంలో గూగుల్ గత ఏడాది తన సౌండ్‌బాక్స్‌లను పరిమిత యూజర్లకు అందించింది. బాక్స్ పనితీరు ఎలా ఉంది? లావా దేవీలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై వ్యాపారుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. గూగుల్ విడుదల చేసిన సౌండ్ బాక్స్ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సౌండ్ బాక్స్ లను వినియోగంలోకి తెస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇంగ్లీషుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీతో సహా ఆరు భారతీయ భాషలలో ఆడియో అలెర్ట్ లను అందించే గూగుల్ సౌండ్ పాడ్స్ కోసం వ్యాపారులు గూగుల్ ప్లే యాప్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ రోజువారి లేదంటే,ఏడాది ప్లాన్ అనంతరం ఈ ఆడియో డివైజ్ పొందవచ్చు. రోజువారీ ప్లాన్‌లో, వ్యాపారులు వన్ టైమ్ సబ్ స్క్రిప్షన్ కింద రూ. 499 చెల్లించాలి. ఆ తర్వాత వారి సెటిల్మెంట్ ఖాతా నుండి నెలలో 25 రోజుల పాటు రోజుకు రూ.5 డిడక్ట్ అవుతుంది. ఏడాది ప్లాన్‌లో వ్యాపారి సెటిల్మెంట్ అకౌంట్ నుండి రూ.1,499 డిడక్ట్ అవుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్ తన సొంత క్యూ ఆర్ కోడ్ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆడియో నోటిఫికేషన్ సేవలను పొందుతున్న వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. గూగుల్ పే క్యూఆర్ కోడ్ల ద్వారా నెలలో రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన తర్వాత రూ. 125 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని గూగుల్ వెల్లడించింది. -
ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎంకు మరో భారీ షాక్!.. ఇదే తొలిసారి
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎంకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెఫరీస్ రేటింగ్‌ను తగ్గించింది.పేటీఎం ఆదాయం ఏటేటా 28 శాతం క్షీణించిందని, ఇది 'తక్కువ పనితీరు' నుంచి 'నాట్ రేటింగ్'కు మారిందని జెఫరీస్ తెలిపింది. ఒకవేళ ఆర్బీఐ పేటీఎంపై చర్యలు తీసుకోకపోయినట్లైతే రెవెన్యూ ట్రాక్షన్, వ్యయ నియంత్రణల నుండి ఉత్పన్నమయ్యే సానుకూల, ప్రతికూలతల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. అయితే పేటీఎంపై ఆర్బీఐ చర్యలు కొనసాగుతున్నట్లు వస్తున్న నివేదికల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెఫరీస్ తన నోట్లో పేర్కొంది. రేటింగ్ ఎందుకు కార్పొరేట్ రంగంలో ఆయా కంపెనీల తీరు ఎలా ఉంది? ఆర్ధికంగా సదరు సంస్థ సామర్ధ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై ఇండిపెండెంట్ క్రెడింగ్ రేటింగ్ ఏజెన్సీలు రేటింగ్స్ ఇస్తుంటాయి. ఆ రేటింగ్స్ ఆధారంగా సంస్థల్లో పెట్టుబడులు, వినియోగదారుల్లో నమ్మకం ఉందని అర్ధం. అలా కాకుండా ఏ మాత్రం నెగిటీవ్ రేటింగ్ ఇస్తే సంబంధిత కంపెనీపై నమ్మకం సన్నగిల్లుతుంది. -
నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేసింది
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్) ఆర్బీఐ చర్యలు తీసుకోవడమనేది నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతవైపు ఫిన్‌టెక్ సంస్థల దృష్టిని మరల్చేలా చేసిందని కేంద్ర ఐటీ శాఖ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించే నిబంధనలను పాటించడమనేది కంపెనీలకు ‘ఐచి్ఛకం‘ కాదని, ప్రతి వ్యాపారవేత్త కచి్చతంగా దానిపై దృష్టి పెట్టి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. సాధారణంగా వ్యాపారవేత్తలు తమ సంస్థలను నిరి్మంచడంలో నిమగ్నమై, కొన్ని సార్లు నిబంధనలపై దృష్టి పెట్టడంలో విఫలం అవుతుంటారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడే, దూకుడుగా ఉండే వ్యాపారవేత్త కూడా నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో విఫలం కావడం వల్లే పీపీబీఎల్ ఉదంతం చోటు చేసుకుందన్నారు. నిబంధనలను పాటించని ఏ కంపెనీ అయినా చట్టాల నుంచి తప్పించుకోజాలదని మంత్రి స్పష్టం చేశారు. పీపీబీఎల్‌పై ఆర్బీఐ చర్యలు ఫిన్‌టెక్ రంగాన్ని కుదిపివేశాయని భావించరాదని, నిబంధనలను పాటించాల్సిన అవసరం వైపు దృష్టిని మరల్చాయనే భావించవచ్చని మంత్రి వివరించారు. నిబంధనల ఉల్లంఘనకు గాను పీపీబీఎల్ మార్చి 15 నుంచి దాదాపు కార్యకలాపాలన్నీ నిలిపివేసేలా ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బిలియన్ డాలర్ల చిప్ ప్లాంట్లు.. త్వరలోనే భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులతో రెండు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు రానున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ఇజ్రాయెల్‌కి చెందిన టవర్ సెమీకండక్టర్స్ 8 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను, టాటా గ్రూప్ మరో ప్రాజెక్టును ప్రతిపాదించాయన్న వార్తలను ఆయన ధృవీకరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వీటికి క్లియరెన్స్ ఇవ్వలేకపోతే, ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో మూడో సారి ఏర్పాటు కాబోయే ప్రభుత్వం సత్వర ఆమోదం తెలపగలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిప్‌ల తయారీకి సంబంధించి నాలుగు, చిప్‌ల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్ల ఏర్పాటుకు 13 ప్రతిపాదనలు వచ్చాయి. అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ మైక్రోన్ .. గుజరాత్లో తలపెట్టిన రూ. 22,516 కోట్ల చిప్ అసెంబ్లీ ప్లాంటుకు ఇవి అదనం. -
వినియోగదారులకు పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ విజ్ఞప్తి!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంలో భాగమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫిబ్రవరి 29 విధించిన ఆంక్షల్ని మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. మార్చి15 తర్వాత పేటీఎం, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని, కార్యకలాపాలు కొనసాగుతాయని పేటీఎం ఫౌండర్ తెలిపారు. ఆర్బీఐ ఆంక్షలు ప్రభావితం చూపవని అని అన్నారు. మార్చి 15, 2024 వరకు ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు మొదలైన వాటిలో డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్లు అనుమతించబడతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందు ఈ గడువు తేదీ ఫిబ్రవరి 29, 2024 ఉండగా.. తాజాగా ఆ తేదీని మార్చి 15కి పొడిగించింది. Paytm QR, Soundbox and EDC (card machine) will continue to work like always, even after March 15. The latest FAQ issued by RBI on point #21 clarifies it unambiguously. Do not fall for any rumour or let anyone deter you to championing Digital India ! https://t.co/ts5Vqmr6qh — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 16, 2024 ‘పేటీఎం క్యూఆర్ కోడ్ , సౌండ్‌బాక్స్, ఈడీసీ(కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే పని చేస్తూనే ఉంటాయి. తాజా జారీ చేసిన ఎఫ్ఏక్యూ (Frequently Asked Questions)పాయింట్ 21లో ఆర్బీఐ ఇదే స్పష్టం చేసింది. ఎటువంటి పుకార్లకు లొంగిపోకండి. మిమ్మల్ని డిజిటల్ ఇండియా ఛాంపియన్‌గా నిలబెట్టేందు చేసే ప్రయత్నాలకు మీరు అనుమతించకండి’ అంటూ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. To every Paytmer, Your favourite app is working, will keep working beyond 29 February as usual. I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full… — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024 అవధులు లేని మీ సపోర్ట్‌కు ఈ జనవరిలో ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం బాస్ ఎక్స్.కామ్‌లో ట్వీట్ చేశారు. అవధులులేని మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యాప్ పనిచేస్తుందని యూజర్లకు హామీ ఇచ్చారు. ప్రతి సవాలుకు, ఒక పరిష్కారం ఉంది. ఫిన్ రంగం తరుపున దేశానికి సేవ చేసేందుకు మేం కట్టుబడి ఉన్నామని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. చదవండి👉 : పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు! -
ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి. వెనకాడుతున్న స్టార్టప్‌లు రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్‌లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కి అనుబంధ సంస్థ. -
5 సంవత్సరాలు.. రూ.100 కోట్లు - గ్రోమో అరుదైన రికార్డ్
ఫైనాన్షియల్ ఉత్పత్తుల పంపిణీని సులభతరం చేసే ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ గ్రోమో.. 5 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా భారతదేశంలోని తన విలువైన భాగస్వాములకు రూ.100 కోట్ల చెల్లింపులను చేసినట్టు ప్రకటించింది. తెలంగాణలో, కంపెనీ తన 14800 గ్రోమో భాగస్వాములకు రూ.3.75 కోట్లకు పైగా చెల్లింపులను చేసింది. గత ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణలో 1.03 లక్షల మంది భాగస్వాములు గ్రోమోలో చేరారు, వారు ఎంచుకున్న ఉత్పత్తులను గురించి తెలుసుకోవడానికి రాష్ట్రంలోని 1.5 లక్షల మంది కస్టమర్లతో కనెక్ట్ అయ్యారు. గత 5 సంవత్సరాలలో క్రెడిట్ కార్డ్‌ల కోసం 43 శాతం, సేవింగ్స్ ఖాతా కోసం 39 శాతం, పర్సనల్ లోన్ కోసం 13 శాతంతో డిమాండ్ పరంగా తెలంగాణాలో ఎక్కువ ఎక్కువగా ఉంది. ఐదు సంవత్సరాల మైలురాయిని పూర్తి చేస్తున్న సందర్భంగా గ్రోమో సహ వ్యవస్థాపకుడు 'దర్పన్ ఖురానా' మాట్లాడుతూ.. భారతదేశం అంతటా మా భాగస్వాములకు రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేలా చేయడం పట్ల మేము చాలా గర్వపడుతున్నామని, గతేడాది తెలంగాణలోని కీలక రంగాలలో 4 రెట్లు వృద్ధిని గమనించినట్లు, దీంతో 14800 మంది సంపాదన భాగస్వాములను చేరుకున్నామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, తెలంగాణ అంతటా విజయవంతంగా మా పరిధిని విస్తరించాము. మా విస్తరణ వ్యూహంలో తెలంగాణలో కీలక అంశంగా.. రాబోయే సంవత్సరంలో మా వర్క్‌ఫోర్స్‌ను పెంచాలని, మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచే వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయాలని ఆశిస్తున్నట్లు గ్రోమో సీఈఓ & సహ వ్యవస్థాపకుడు 'అంకిత్ ఖండేల్వాల్' తెలిపారు. గ్రోమోతో అనుబంధం కలిగి ఉండటం ద్వారా దేశంలోని ప్రతి మూలకు మేము సౌకర్యవంతంగా చేరుకోగలుగుతున్నామని ఈ సందర్భంగా 'పునీత్ భాటియా' (హెడ్-ఏజెన్సీ, SBI జనరల్ ఇన్సూరెన్స్) అన్నారు. -
యూజర్లకు అలెర్ట్.. ‘పేటీఎం’ ఇక కనిపించదా?
ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం మనీ ల్యాండరింగ్‌తో పాటు వందల కోట్లలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని గుర్తించిన ఆర్బీఐ పేటీఎంపై పలు ఆంక్షలు విధించింది. ఫలితంగా పేటీఎం భవిష్యత్ మరింత గందరగోళంగా మారింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదంటే స్తంభించి పోతుందా? ఇలాంటి అనేక ప్రశ్నల పరంపరకు స్పష్టత రావాలంటే అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఆర్బీఐ ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు చెల్లించడం, డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఇలా అన్నీ రకాల ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 29 లోపు వినియోగదారులు డిపాజిట్లు చేయడంతో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదా? అనేది ఆర్బీఐ మీద ఆధారపడింది. అప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తున్న విచారణలో లోపాలు తలెత్తితే మాత్రం పేటీఎంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు పేటీఎం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున అవకతవకలు పలు నివేదికల ప్రకారం.. పేటీఎం వినియోగిస్తున్న లక్షల కస్టమర్లకు కేవైసీ లేదు. పైగా మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్స్‌కు ఒకటే పాన్ కార్డ్ ఉండటం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో దాదాపు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో, దాదాపు 31 కోట్ల అకౌంట్లు పనిచేయడం లేదు. కేవలం 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ లేదా చిన్న నిల్వలతో నిర్వహణలో ఉన్నాయి. కాబట్టి కేవైసీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇది ఖాతాదారులు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లను తీవ్రమైన ప్రమాదానికి గురి చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. 2021 నుంచి ఇదే తంతు పేటీఎం నిబంధనలు ఉల్లంఘించిన కార్యకలాపాలు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో ఈ ఫిన్ టెక్ కంపెనీకి ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎంలో అనేక అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది. కేవైసీ లేకపోవడం, మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వెంటనే లోపాల్ని సవరించాలని సూచించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ కస్టమర్లకు సేవలందించారు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. ఇక ఈ లోపాలన్నీ ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా పేటీఎంలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేలడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. 40 శాతం క్షీణించిన షేర్లు ఆర్బీఐ ఆదేశాలతో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గత రెండు రోజుల్లో 40 శాతం క్షీణించాయి. శుక్రవారం బీఎస్ఈలో ఈ షేరు 20 శాతం నష్టపోయి రూ. 487.05కి చేరుకుంది. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.17,378.41 కోట్లు తగ్గి రూ.30,931.59 కోట్లకు చేరుకుంది. -
పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్!
ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం.. కాస్ట్ కటింగ్‌లో భాగంగా దేశంలో పలు ప్రాంతాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని పేటీఎం తొలగించినట్లు సమాచారం. ఈ మొత్తం సంఖ్య 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అయితే గత రెండు మూడేళ్ల క్రితం పేటీఎం ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకుంది. ఇప్పుడు ఉద్వాసన పలికిన ఉద్యోగుల్లో వీళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. ఉద్యోగుల తొలగింపుతో ఖాళీ అయిన విభాగాల్లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది పేటీఎం మరో 15వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనుంది. పేటీఎం తన పని విధానంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్తో మారుస్తోందని, సంస్థ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పెరిగేందుకు దోహదం చేసేందుకు వీలుండే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లు పేటీఎం ప్రతినిధి వెల్లడించారు. -
మా వ్యూహం అదే..టాప్–5లో ఫెడరల్ బ్యాంక్
కోల్‌కతా: వృద్ధి వ్యూహంలో భాగంగా తాము ఫిన్‌టెక్ కంపెనీలతో జట్టు కట్టనున్నట్టు ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ ప్రకటించారు. టాప్–5 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యంతో తాము పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోగలమన్నారు. ఫిన్‌టెక్ కంపెనీలతో పోటీ పడడం కంటే, వాటి సహకారానికే తాము ప్రాధాన్యమిస్తామని చెప్పారు. బ్యాంక్ అంతర్గత వృద్ధి వ్యూహంలో ఇది భాగమన్నారు. ఫిన్‌టెక్‌లు బ్యాంక్‌కు గణనీయమైన విలువను తెచ్చి పెడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొత్త ఖాతాల ప్రారంభం దిశగా కస్టమర్లను సొంతం చేసుకోవడానికి ఫిన్‌టెక్ కంపెనీలు సాయపడతాయి. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ రోజూ 15,000 కొత్త ఖాతాలను తెరుస్తోంది. ఇందులో 60 శాతం ఫిన్‌టెక్ సంస్థల ద్వారానే వస్తున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఖాతాలు’’అని చెప్పారు. ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా రుణాల మంజూరు అన్నది ప్రధానంగా క్రెడిట్ కార్డుల రూపంలో ఉంటున్నట్టు తెలిపారు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ, సొంతంగానే తాము వృద్ధిని సాధించగలమన్నారు. ‘‘మా పోర్ట్‌ఫోలియోలో 3 శాతం మేర క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాల రూపంలో అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. ఉత్పత్తులు, విభాగాలు, ప్రాంతాల వారీగా వైవిధ్యం పాటించాలన్నది మా విధానం’’అని శ్రీనివాసన్ వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు రుణ వితరణకు సబంధించి గ్రీన్ బ్యాంకింగ్‌పైనా తాము దృష్టి సారించినట్టు చెప్పారు. శాఖల విస్తరణ దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను తెరిచే ప్రణాళికతో ఉన్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు.‘‘ప్రస్తుతం మాకు 1408 శాఖలు ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2025 మధ్య నాటికి మరో 250 శాఖలను తెరవాలన్నది ప్రణాళిక’’అని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ శాఖల విస్తరణ చేపడతామన్నారు. ఏటా 100 నుంచి 150 శాఖలు తెరవాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. -
భారత్‌పే సహ వ్యవస్థాపకుడికి లుకౌట్ నోటీసు జారీ.. ఎందుకంటే..
భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్లను గురువారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. న్యూయార్క్‌కు వెళ్లే విమానం ఎక్కకుండా చర్యలు తీసుకున్నారు. అయితే భారత్‌పేలో జరిగిన మోసంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల లుకౌట్ సర్క్యులర్‌ను జారీ చేసింది. దాంతో వారిని దిల్లీలోని విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్‌లో విహారయాత్రకు బయలుదేరిన అష్నీర్ దంపతులను విమానాశ్రయంలో భద్రతా తనిఖీకి ముందే ఆపివేసినట్లు ఈఓడబ్ల్యూ జాయింట్ కమిషనర్ సింధు పిళ్లై చెప్పారు. దిల్లీలోని వారి నివాసానికి తిరిగి రావాలని సూచించినట్లు తెలిపారు. వచ్చే వారం మందిర్ మార్గ్‌లోని ఈఓడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వారిని కోరారు. వారి అంతర్జాతీయ ప్రయాణాన్ని నిలిపేసేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని, వారిని అధికారికంగా అరెస్టు చేయలేదని పిళ్లై స్పష్టం చేశారు. పోలీసులు చర్యలు తీసుకునేంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని అష్నీర్ గ్రోవర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. గురువారం రోజే తమను అదుపులోకి తీసుకున్నారని, కానీ శుక్రవారం రోజున వారికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విమానం ఎక్కకుండా తమను ఆపిన ఏడు గంటల తర్వాత ఈఓడబ్ల్యూ నుంచి నోటీసు అందిందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: అమెజాన్ అలెక్సా.. వందల ఉద్యోగులపై వేటు భారత్‌పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబ సభ్యులు సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు దాఖలయ్యాయి. గతంలో వారు అందించని ఫిన్‌టెక్ సేవల కోసం బ్యాక్‌డేటెడ్ ఇన్వాయిస్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులను గుర్తించడంలో ఈఓడబ్యూ సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్ 2022లో భారత్‌పే అష్నీర్ గ్రోవర్, తన భార్య, కుటుంబ సభ్యుల ద్వారా రూ.81.28 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రిమినల్ కేసు దాఖలయింది. Hello ! Hello ! Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab. So facts: 1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport). 2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F — Ashneer Grover (@Ashneer_Grover) November 17, 2023 -
బ్యాంక్‌లు మారాలి.. లేదంటే మూత: కేవీ కామత్
ముంబై: బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని.. విధానాలు, పని నమూనాలను కాలానికి అనుగుణంగా పనిచేసేలా చూసుకోవాలని వెటరన్ బ్యాంకర్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేయలేని బ్యాంక్‌లు వాటి దుకాణాలను మూతేసుకోవాల్సి వస్తుందని కొంత హెచ్చరికగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్‌లు నూతనతరం ఫిన్‌టెక్ కంపెనీలతో కలసి పనిచేయాలన్నారు. -
స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అవశ్యం
ముంబై: ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ) కంపెనీలు పరిశ్రమ క్రమమైన వృద్ధి కోసం స్వీయ నియంత్రణా సంస్థ (ఎస్ఆర్ఓ– సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేసుకోవావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఫిన్‌టెక్ ప్లేయర్లు దేశీయ చట్టాలకు అనుగుణంగా తమ పరిశ్రమలో చక్కటి నియమ నంబంధనావళిని ఏర్పరచుకోవాలి. గోప్యత, డేటా రక్షణ నిబంధనలను పటిష్టం చేసుకోవాలి’’ అని దాస్ పేర్కొన్నారు. దీనితోపాటు నైతిక వ్యాపార పద్ధతులను అనుసరించడం, ధరలో పారదర్శకత పాటించడం, ప్రమాణాలను పెంపొందించడం కీలకమని, దీనికి ఫిన్‌టెక్ సంస్థలు తమ వంతు కృషి చేయాలని ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏదైనా కంపెనీ ముఖ్యంగా ఫిన్‌టెక్ ప్లేయర్ల మన్నికైన, దీర్ఘకాలిక విజయానికి సుపరిపాలన నిబంధనావళి కీలకమైన అంశమని అన్నారు. ఫిన్‌టెక్ రంగ ఆదాయాలు 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయన్న అంచనాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీబీడీసీ పురోగతి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై (సీబీడీసీ) పురోగతి గురించి దాస్ మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్ట్ అమలు సందర్భంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారం జరుగుతోందని తెలిపారు. సీబీడీసీ రిటైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం 26 నగరాల్లోని 13 బ్యాంకుల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. 2023 ఆగస్టు 31 నాటికి దాదాపు 1.46 మిలియన్ల వినియోగదారులు, 0.31 మిలియన్ల వ్యాపారులు ప్రస్తుతం పైలట్‌లో భాగమయ్యారని దాస్ తెలిపారు. యూపీఐ క్యూఆర్ కోడ్లతో సీబీడీసీ పూర్తి ఇంటర్–ఆపరేబిలిటీని కూడా ఆర్బీఐ ప్రారంభించినట్లు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి రోజుకు 10 లక్షల సీబీడీసీ లావాదేవీలను లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని పేర్కొన్న ఆయన, కొత్త వ్యవస్థ విశ్లేషణ, అమలుకు తగిన డేటా పాయింట్లను ఈ లావాదేవీలు అందిస్తాయన్న భరోసాను ఇచ్చారు. ఇదిలావుండగా కార్యక్రమంలో ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ కో–ఛైర్మన్ శ్రీనివాస్ జైన్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఒక స్వయం రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించుకోడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
యూపీఐ ఏటీఎం: కార్డు లేకుండానే క్యాష్, వీడియో వైరల్
UPI ATM ఒకవైపు ఇండియా డిజిటల్ పేమెంట్స్ దూసుకుపోతోంది. మరోవైపు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మోసాలకు చెక్ పెడుతూ యూపీఐ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో మోసగాళ్ల ద్వారా కార్డ్ స్కిమ్మింగ్ ప్రమాదాలను నివారించి, సురక్షితమైన లావాదేవీల నిమిత్తం ఈ కొత్త ఆవిష్కరణముందుకు వచ్చింది. కార్డ్ లెస్ , వైట్-లేబుల్ యూపీఐ ఏటీఎం (UPI ATM) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కార్డ్‌లెస్ అంటే కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం. ఈ సౌలభ్యంతో దేశంలోనే తొలి QR-ఆధారిత UPI నగదు ఉపసంహరణల ఏటీఎం ముంబైలో కొలువుదీరింది. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!) జపాన్‌కు చెందిన హిటాచీ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)తో కలిసి హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ) పేరుతో వైట్ లేబుల్ ఎటిఎం (డబ్ల్యూఎల్ఎ)గా భారతదేశపు తొలి యుపిఐ-ఏటీఎంను మంగళవారం ప్రారంభించింది.ఫిజికల్ కార్డ్‌ల అవసరాన్ని తొలగిస్తూ, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణలను ATM ఆఫర్ చేస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. యూపీఐ ఏటీఎం ద్వారా కార్డు మోసాలు, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి వాటిన బారిన పడకుండా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. గ్లోబల్ ఫిటెక్ ఫెస్ట్ టెక్ ఈవెంట్ సందర్భంగా ముంబైలో ఈ యూపీఐ ఏటీఎం ద్వారా మనీ విత్ డ్రా చేసినట్టు రవిసుతంజని పేర్కొన్నారు. వినూత్నమైన ఫీచర్, ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో UPIని ఉపయోగించి నగదు ఉపసంహరణ చేశా అంటూ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కోడ్‌ను స్కాన్, చేసి,పిన్ ఎంటర్ చేసి, కావాల్సిన నగదు ఎంపిక చేసుకుంటే చాలు. అంతేకాదు దీనికి ఏటీఎం విత్‌డ్రాయల్ చార్జీలు అమలవుతాయని, ఉచిత వినియోగ పరిమితికి మించి ఛార్జీలు వర్తించవచ్చుని తెలిపారు. ప్రస్తుతం BHIM UPI యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ త్వరలోనే మరిన్ని యాప్‌లకు దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా, అన్ని యాప్‌లకు యూపీఐ ఏటీఎంలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీట్వీట్ చేయడం గమనార్హం. ఏటీఎంల వద్ద కార్డు అవసరం లేకుండానే నగదు ఎలా విత్ డ్రా చేయాలో ఈ వీడియోలో చూడండి. 🚨 ATM Cash Withdrawal using UPI Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu — Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023 -
నెలకు 100 బిలియన్ల యూపీఐ లావాదేవీలు!
ముంబై: భారతదేశానికి నెలకు 100 బిలియన్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నెరపే అవకాశం ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే పేర్కొన్నారు. ఆగస్ట్‌లో 2016లో ప్రారంభించిన తర్వాత ప్లాట్‌ఫారమ్ ద్వారా సాధించిన 10 బిలియన్ లావాదేవీల కంటే ఇది పది రెట్లు అధికమని పేర్కొన్నారు. ప్రస్తుతం 350 మిలియన్ల యూపీఐ వినియోగదారులు ఉన్నారని, వ్యాపారులు వినియోగదారులలో వృద్ధి అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. యూపీఐ లావాదేవీలకు అన్ని వర్గాల నుంచి ప్రయత్నం జరిగితే 100 బిలియన్ లావాదేవీలకు చేసే సామర్థ్యం ఉందని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో అన్నారు. 100 బిలియన్ లావాదేవీలకు చేరుకోడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీని పేర్కొనడానికి నిరాకరించిన ఆయన, అయితే 2030 నాటికి భారతదేశం రోజుకు 2 బిలియన్ల లావాదేవీలను చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం, గ్లోబల్ దిగ్గజం వీసా నెలకు 22.5 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. దాని ప్రత్యర్థి మాస్టర్ కార్డ్ 11 బిలియన్లకు పైగా లావాదేవీలు చేస్తోంది. పరిశ్రమ స్తబ్దత నుంచి అభివృద్ధి చెందుతున్న ధోరణికి మారితే క్రెడిట్ కార్డ్ వినియోగం పది రెట్లు వృద్ధి చెందుతుందని అస్బే చెప్పారు. అయితే బ్యాంకులు సరైన ప్లాట్‌ఫారమ్‌లను అందిస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్‌లలో కొనుగోలు, పూచీకత్తు వ్యయం చాలా ఎక్కువగా ఉందని, ఇది ఈ ఇన్స్ట్రమెంట్ విస్తరణకు విఘాతంగా ఉందని తెలిపారు. -
యాంటిఫిన్ వాటా కొనుగోలు.. రూ. 53,957 కోట్లకు చేరిన పేటీఎం వ్యాల్యూ
న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండు ఫిన్‌టెక్ దిగ్గజం.. వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనుంది. యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్స్ నుంచి 10.3 శాతం వాటాను విజయ్ సొంతం చేసుకోనున్నట్లు పేటీఎం తాజాగా పేర్కొంది. ఇందుకు ఎలాంటి నగదు చెల్లింపు ఉండదని, ఆఫ్‌మార్కెట్ లావాదేవీ ద్వారా వాటా బదిలీ ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ వాటా ఎకనమిక్ రైట్స్ యాంట్‌ఫిన్ వద్దనే కొనసాగుతాయని వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా విదేశీ సొంత సంస్థ రెజిలియంట్ అసెట్ మేనేజ్మెంట్ బీవీ ద్వారా వాటాను శర్మ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. దీనికి బదులుగా మార్పిడికి వీలయ్యే(ఆప్షనల్లీ కన్వర్టిబుల్) డిబెంచర్లను యాంట్‌ఫిన్‌కు రెజిలియంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీ కారణంగా కంపెనీ యాజమాన్య నియంత్రణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ లావాదేవీతో పేటీఎంలో శర్మ వాటా 19.42 శాతానికి చేరనుంది. వెరసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలవనున్నారు. మరోపక్క యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పేటీఎం బోర్డులో యాంట్‌ఫిన్ నామినీ ఉండబోరు. యాంట్‌ఫిన్.. చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ అనుబంధ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. షేరు జూమ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనున్న వార్తల నేపథ్యంలో ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం కౌంటర్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 7 శాతం జంప్‌చేసి రూ. 851 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 888కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,511 కోట్లు ఎగసి రూ. 53,957 కోట్లను అధిగమించింది. -
అలర్ట్: ‘ఫోన్‌పే’లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్ ఏంటో తెలుసా?
ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే యూపీఐ పేమెంట్ కోసం లైట్ పేమెంట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీల కోసం ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పటికే ఫోన్‌పే ప్రత్యర్ధి సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్‌పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది. చిన్న చెల్లింపుల కోసం ముందుగానే యూపీఐ లైట్లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండవని వెల్లడించింది. అన్నీ బ్యాంకుల సపోర్ట్ ఫోన్‌పే యూపీఐ లైట్‌కు దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్ నిఘమ్ చెప్పారు. యూపీఐ మర్చంట్, క్యూఆర్ కోడ్ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్తో పనిలేదు వీటితో పాటు యూపీఐ లైట్ వినియోగంతో ఆయా ట్రాన్సాక్షన్లపై యూజర్లకు మెసేజ్ అలెర్ట్ వెళ్లనుంది. యూజర్లు ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిపారో తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడొచ్చు. దీనికి సంబంధించి మెసేజ్ అలెర్ట్ పొందవచ్చు. తద్వారా చెల్లింపులపై బ్యాంక్ స్టేట్మెంట్, పాస్‌బుక్ అవసరం తీరిపోనుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. చెల్లింపుల్ని సులభతరం చేసేందుకే అయితే ఈ యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా దేశంలో ప్రతి రోజు జరిగే చిన్న చిన్న లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పేలో ఈ కొత్త ఆప్షన్‌ను అభివృద్ది చేసినట్లు ఫోన్‌పే కో- ఫౌండర్, సీటీవో రాహుల్ చారి చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్సీపీఐ నిర్ణయం.. యూపీఐ లైట్‌కి ఊతం ఇటీవల కాలంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలలో జరిపే లావాదేవీల సమయంలో నెట్వర్క్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్సీపీఐ) నెట్వర్క్ లేకపోయినా రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీలు జరిపేలా అనుమతిచ్చింది. చదవండి👉 కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు! -
ఫోన్‌పేకు జనరల్ అట్లాంటిక్ నిధులు
న్యూఢిల్లీ: డెకాకర్న్ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ నుంచి 10 కోట్ల డాలర్లను(రూ. 820 కోట్లు) సమీకరించింది. ఇప్పటికే ప్రారంభించిన బిలియన్ డాలర్ల సమీకరణలో భాగంగా ప్రస్తుత పెట్టుబడులను సమకూర్చుకుంది. కంపెనీ 12 బిలియ న్ డాలర్ల విలువలో నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా రిటైల్ రంగ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీ ఇప్పటివరకూ 75 కోట్ల డాలర్ల పెట్టుబడులను అందుకుంది. జనరల్ అట్లాంటిక్ 2023 జనవరిలో 35 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! వాల్‌మార్ట్ 20 కోట్ల డాలర్లు, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ 10 కోట్ల డాలర్లు చొప్పున ఫోన్‌పేలో ఇన్వెస్ట్ చేశాయి. -
ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్‌టెక్ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఫోన్‌పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్‌టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్, స్టాక్‌బ్రోకింగ్, ఓఎన్డీసీ ( ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్‌పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్‌కోడ్’ అనే ఓఎన్డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఐపీవో యోచనలో బ్యాంక్ బజార్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ బ్యాంక్ బజార్.కామ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. బ్యాంకింగ్ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్ బజార్.కామ్ తెలియజేసింది. -
స్టార్టప్స్‌కు తగ్గిన నిధులు
భారతీయ స్టార్టప్స్ 2022 క్యూ1లో 12 బిలియన్ డాలర్ల నిధులను అందుకున్నాయి. 2023 జనవరి–మార్చిలో ఇది 3 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనికార్న్ కంపెనీల జాబితాలో 2023 జనవరి–మార్చిలో కొత్తగా ఏ కంపెనీ చోటు సంపాదించలేదు. 2022 క్యూ1తో పోలిస్తే నిధులు 75 శాతం పడిపోయాయి. డీల్స్ సంఖ్య 58 శాతం తగ్గింది. 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ చేసే డీల్స్ 77 శాతం క్షీణించాయి. ఇదీ 2023 మార్చి త్రైమాసికంలో భారత స్టార్టప్స్ స్టోరీ. ఇంక్42 రూపొందించిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఫండింగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఫిన్‌టెక్ ముందంజలో.. మార్చి త్రైమాసికంలో అందుకున్న నిధుల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీల వాటా ఏకంగా 44.9 శాతం ఉంది. ఈ–కామర్స్ 22.1 శాతం, ఎంటర్ప్రైస్టెక్ 6.8, కంన్జ్యూమర్ సర్విసెస్ 6.5, డీప్‌టెక్ 5.1, ఎడ్టెక్ 3.5, మీడియా, వినోదం 2.7, ఇతర కంపెనీలు 8.4 శాతం కైవసం చేసుకున్నాయి. డీల్స్ సంఖ్య పరంగా ఎంటర్ప్రైస్టెక్ 41, ఈ–కామర్స్ 40, ఫిన్‌టెక్ 25, డీప్‌టెక్ 21, ఎడ్టెక్ 17, మీడియా, వినోదం 16, హెల్త్‌కేర్ 13, ఇతర రంగాల కంపెనీలు 40 చేజిక్కించుకున్నాయి. విలీనాలు, కొనుగోళ్లు 2022 క్యూ1లో ఆల్‌టైమ్ హై రికార్డులతో 100 నమోదైతే, ఈ ఏడాది ఇదే కాలంలో 35కు వచ్చి చేరాయి. 2022 సెపె్టంబర్లో టాటా 1 ఎంజీ తర్వాత యూనికార్న్ కంపెనీల జాబితాలో కొత్త కంపెనీ చేరకపోవడం గమనార్హం. పడిన సీడ్ ఫండింగ్.. మందగమనం ఉన్నప్పటికీ భారత్ స్టార్టప్స్‌కు అత్యధిక సీడ్ ఫండింగ్ 2022లో సమకూరింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికం. 2014 నుంచి 2022 మధ్య సేకరించిన 5 బిలియన్ డాలర్ల సీడ్ ఫండ్‌లో 2 బిలియన్ డాలర్లు 2022లో నమోదు కావడం విశేషం. సీడ్ ఫండింగ్ గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో 81% క్షీణించి 180 మిలియన్ డాలర్లుగా ఉంది. స్టార్టప్ వ్యవస్థలో భారీ నిధుల దిద్దుబాటును ఇది సూచిస్తోంది. మార్కెట్లు పుంజుకున్న తర్వాత మంచి వాల్యుయేషన్‌తో నిధులను సేకరించాలని వ్యవస్థాపకులు యోచిస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్‌కు చివరి దశలో రుణ నిధుల సాధనాల వైపు పరిశ్రమ మళ్లాల్సి వస్తోంది. కారణం ఏమంటే.. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి విలువ పడిపోవడం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, ఆర్థిక అనిశ్చితి వంటి ఇతర విషయాల కారణంగా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అంతే కాకుండా భారతీయ స్టార్టప్‌ల ఆదాయాలు క్షీణించడం, వాటి పెరుగుతున్న నష్టాలు, వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు వ్యవస్థాపకులు వ్యూహాలను కనుగొనడంలో విఫలం కావడం పెట్టుబడి సెంటిమెంట్‌ను స్పష్టంగా దెబ్బతీసింది. 2021 బుల్ రన్ తర్వాత నిధుల రాక తీరు చూస్తుంటే మహమ్మారి ముందస్తు స్థాయికి పడిపోయినట్టు అవగతమవుతోంది. ఈ సంవత్సరం వృద్ధి దశలో మూలధనాన్ని సేకరించడం సవాలుగా ఉంటుందని 84% పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు. ఇవీ గణాంకాలు.. సిరీస్ సి–రౌండ్స్‌లో గరిష్ట కరెక్షన్తో ఈ ఏడాది జనవరి–మార్చిలో మెగా డీల్స్ 77 శాతం పడిపోయి ఏడుకు వచ్చి చేరాయి. 2022 క్యూ1లో ఈ సంఖ్య 30గా ఉంది. మెగా డీల్స్ సంఖ్య తగ్గడం 2023 క్యూ1లో భారతీయ స్టార్టప్‌లు సేకరించిన మొత్తం నిధులపై ప్రభావం చూపింది. ఫండింగ్ పరంగా ఈ ఏడాది క్యూ1లో టాప్–3లో నిలిచిన ఫోన్‌పే 650 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 500 మిలియన్ డాలర్లు, ఇన్సూరెన్స్‌దేఖో 150 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. గతేడాది జనవరి–మార్చిలో మొత్తం 506 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి క్వార్టర్లో ఈ సంఖ్య 213కు పరిమితమైంది. 2020 క్యూ1లో 3.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 212 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి త్రైమాసికంలో లేట్ స్టేజ్ ఫండింగ్ 77 శాతం పడిపోయి 1.8 బిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. గ్రోత్ స్టేజ్ ఫండింగ్ 76% క్షీణించి 700 మిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. సిరీస్–ఏ డీల్స్ 58 నుంచి 30కి, సిరీస్–బీ డీల్స్ 28 నుంచి 4కు పడిపోయాయి. -
వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్‌పే!
యూపీఐ చెల్లింపుల్లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అరుదైన ఘనత సాధించింది. వార్షిక మొత్తం చెల్లింపు విలువ రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 84 లక్షల కోట్లు) సాధించినట్లు ఫోన్‌పే తెలిపింది. దేశంలోని టైర్ 2, 3, 4 నగరాలే కాకుండా దాదాపు అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ మూడున్నర కోట్ల మందికిపైగా ఆఫ్‌లైన్ వ్యాపారులను డిజిటలైజ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే! టోటల్ పేమెంట్ వ్యాల్యూ(టీపీవీ) రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఫోన్‌పే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి ఆఫర్లతో దేశంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌కు ఆమోదం? యూపీఐ చెల్లింపు విభాగంలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండటంతోనే తమకు ఈ ఘనత సాధ్యమైందని కంపెనీ తెలిపింది. మరోవైపు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు పేర్కొంది. -
సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?
వివిధ కంపెనీల సీఈవోలు ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు అనే దానిపై జనానికి ఈ మధ్య ఆసక్తి పెరిగింది. కోట్లలో జీతాలు తీసుకుంటున్న సీఈవో గురించి వింటున్నాం. అయితే దానికి భిన్నంగా అతి తక్కువ వేతనం పొందుతున్న ఈ సీఈవో గురించి తెలుసుకోవాల్సిందే. కునాల్‌షా... క్రెడ్(CRED) అనే ఫిన్‌టెక్ కంపెనీ సీఈవో. ఆయన తీసుకుంటున్న నెలవారీ జీతం రూ.15వేలు. (చదవండి : నోకియా కొత్త లోగో చూశారా?...్ల రియాక్షన్స్ మాత్రం..!) కునాల్ షా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవోగా తాను ఎంత జీతం తీసుకుంటున్నది తెలియజేశారు. ఆయన చెప్పిన జీతాన్ని విని ఆశ్చర్యపోయిన ఓ యూజర్.. ఇంత తక్కువ జీతంలో ఎలా బతుకుతున్నారు సార్ అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్తూ.. కంపెనీ లాభదాయకంగా మారే వరకు తాను ఎక్కువ మొత్తంలో జీతం తీసుకోకూడదనుకున్నానని, అందుకే నెలకు కేవలం రూ. 15 వేలు జీతం తీసుకుంటున్నట్లు షా వివరించారు. తన మునుపటి కంపెనీ ఫ్రీచార్జ్‌ను విక్రయించగా వచ్చిన డబ్బుతో బతుకుతున్నానని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్! కోడ్‌నేమ్ ఏంటో తెలుసా?) ప్రారంభంలో ఇలా తక్కువ జీతం తీసుకున్నట్లు చెప్పిన సీఈవోలు చాలా మందే ఉన్నారు. 2013లో జుకర్‌బర్గ్ కేవలం 1 డాలర్ వార్షిక వేతనం తీసుకుని ఫేస్బుక్లో అతి తక్కువ వేతనం పొందే ఉద్యోగిగా నిలిచారు. కాకపోతే బోనస్‌లు, స్టాక్ అవార్డుల రూపంలో పరిహారం అందుకున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సేలు కూడా తాము సంవత్సరానికి 1 డాలర్ జీతం మాత్రమే తీసుకున్నామని అప్పట్లో చెప్పారు. (ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!) -
డిజిటల్ లెండింగ్ హవా
ముంబై: ఈ దశాబ్దంలో డిజిటల్ లెండింగ్ దూసుకుపోతుందని, ఫిన్‌టెక్ సంస్థలు ఈ సేవలను మరింతగా వినియోగదారుల చెంతకు తీసుకెళతాయని క్రెడిట్ సమాచార సంస్థ ఎక్స్పీరియన్స్ తెలిపింది. 2030 నాటికి అన్సెక్యూర్డ్ రుణాల్లో సంప్రదాయ రుణవితరణతో పోలిస్తే డిజిటల్ రుణాలదే పైచేయి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అన్సెక్యూర్డ్ చిన్న సైజు రుణాలతోపాటు, సెక్యూర్డ్ అధిక సైజు రుణాల్లో డిజిటల్ లెండింగ్ మరింత విస్తరిస్తుందని పేర్కొంది. ‘‘సంప్రదాయ రుణదాతలు సాధారణంగా ఆస్తుల తనఖాపై రుణాల్లో (సెక్యూర్డ్) అధిక వాటా కలిగి ఉంటారు. డిజిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలోకి సైతం ఫిన్‌టెక్ సంస్థలు చొచ్చుకుపోతాయి. దీంతో అవి చెప్పుకోతగ్గ మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలవు’’అని ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ఎండీ సాయికృష్ణన్ శ్రీనివాసన్ తెలిపారు. డిజిటల్‌గా సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తున్నప్పటికీ డిజిటల్ లెండింగ్ సంస్థలకు తదుపరి దశ వృద్ధి అన్నది సవాలుగా ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్ లెండింగ్ విభాగంలో బడా టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. రికవరీ ఏజెంట్లపై ముందే చెప్పాలి: ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ సంస్థలు (డిజిటల్ వేదికల రూపంలో రుణాలిచ్చేవి) కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వివరాలను ముందే వెల్లడించాలని ఆర్బీఐ ఆదేశించింది. ‘‘ఏదైనా రుణం చెల్లింపుల్లేకుండా ఆగిపోతే, ఆ రుణం వసూలుకు ఏజెంట్‌ను నియమించినట్టయితే.. సంబంధిత ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో తెలియజేయాలి’’అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ లెండింగ్, రుణాల రికవరీకి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ గతేడాది చివర్లో కఠినతరం చేయడం తెలిసిందే. -
రండి! నా స్టార్టప్‌లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా!
భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ 3వ స్టార్టప్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టార్టప్ భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేవి లింక్డిన్ పోస్ట్‌లో షేర్ చేశారు అశ్నీర్. తాను ప్రారంభించిన కొత్త వెంచర్లో ఉద్యోగులు, పెట్టుబడి దారులకు స్వాగతం అంటూ ఆహ్వానించారు. పైగా కొత్త స్టార్టప్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మెర్సిడెజ్ బెంజ్ కార్లను బహుమతిగా ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. 2023లో కొంత పని పూర్తి చేద్దాం! అంటూ థర్డ్ స్టార్టప్ పనులు చాలా నిశబ్ధంగా, శాంతియుతంగా కొనసాగుతున్నాయి.మార్కెట్‌ను షేక్ చేసేలా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం. మేం విభిన్నంగా బిజినెస్ కార్యకలాపాలు చేస్తున్నాం. కాబట్టి మీరు తదుపరి టూడో - ఫోడో అంశంలో భాగం కావాలనుకుంటే బిజినెస్‌ను ఎలా చేస్తున్నామో మీరు తెలుసుకోవాలంటూ కొన్ని ఇమెజెస్‌ను చూపించగా.. అందులో థర్డ్ యునికార్న్‌కు వెంచర్ క్యాపిటలిస్ట్‌లు నిధులు సమకూర్చరని ఒక ఇమేజ్‌లో ఉంది. దేశీ/స్వయంగా సంపాదించిన మూలధనాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. జట్టులో 50 మంది సభ్యులు ఉంటారని అందులో జోడించింది. అంతే కాదు, ఉద్యోగులు కంపెనీలో ఐదేళ్లు పూర్తి చేస్తే, వారికి మెర్సిడెస్ ఇస్తామని అశ్నీర్ గ్రోవర్ ఆఫర్ చేశారు. -
Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం
చైనా ఫిన్ టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాంట్ గ్రూప్‌ను నియంత్రించే అధికారాన్ని వదులుకోనున్నారు. ఫిన్‌టెక్ కంపెనీలో ఉన్న వాటాలను షేర్ హోల్డర్లకు సర్దుబాటు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాటాలను షేర్ హోల్డర్లకు వాటాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏ షేర్ హోల్డర్ సింగిల్‌గా లేదంటే ఇతర వ్యక్తులతో జత కలిసి యాంట్ గ్రూప్‌ని నియంత్రణ చేయలేరంటూ ఓ ప్రకటనలో తెలిపింది. జాక్ మా విమర్శలు..ఐపీవోకి వెళ్లకుండా అడ్డంకి యాంట్ గ్రూప్‌లో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. అయితే 2020లో 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులపై జాక్‌మా విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా ప్రభుత్వ అధికారులు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లకుండా అడ్డుకున్నారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత యాంట్ గ్రూప్ లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా..తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. చైనా బ్యాంకులా.. పాన్ షాపులా గతంలో సంస్థల్ని నియంత్రించే రెగ్యులేటర్లు ఇన్నోవేషన్‌ను అరికడుతున్నాయని జాక్ మా విమర్శించారు. దీంతో పాటు గ్లోబల్ బ్యాంకింగ్ నియమాలను తోలుబొమ్మలతో పోల్చారు. చైనాలో పటిష్టమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ లేదని, చైనీస్ బ్యాంకులు పాన్ షాప్‌లు లాంటివని అంటూ చైనా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రూ.80వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2నెలల్లో రూ.80వేల కోట్ల లాస్ 2020 చివరి నెలలు బిలియనీర్ ‘జాక్ మా’కు అంతగా కలిసి రాలేదు. అక్టోబర్ చివరి నుంచి, ఏడాది చివరి నాటికి ఆయన సుమారు 11 బిలియన్ డాలర్లను నష్టపోయారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.80వేల కోట్లకు పైమాటే. చైనా ప్రభుత్వం ఊరుకుంటుందా? అనలిస్టుల అభిప్రాయం ప్రకారం.. యాంట్ గ్రూప్, జాక్ మా సంస్థల విస్తరణను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే జాక్ మా తరచూ చైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది కామెంట్లు చేస్తుంటారు. పైగా ఆయన ఎదుగుతున్న తీరుతో తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వ భావిస్తోంది. అందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. -
భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా
ఫిన్ టెక్ దిగ్గజం భారత్‌పేలోని పరిణామాలు మరోసారి చర్చకు దారి తీశాయి. గత సంవత్సరం సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌ను తొలగించినప్పటి నుండి కంపెనీ కార్యకలాపాలను పట్టించుకోలేదనే కారణంగా సీఈవో సుహైల్ సమీర్‌ను తొలగించేందుకు ఆ సంస్థ యాజమాన్యం సిద్ధమైంది. సీఈవో పదవి నుంచి తప్పించి సమీర్‌కు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఈ పదవిని కట్టబెట్టనుంది. జనవరి 7నుండి సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత్‌పే ప్రకటించింది. ఇక ప్రస్తుత సీఎఫ్ఓ నలిన్ నేగీ తాత్కాలిక సీఈగా విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా భారత్‌పే బోర్డు ఛైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, సమీర్ తన అద్భుతమైన సహకారం అందించినందుకు,వివిధ సవాళ్లను అధిగమించడంలో కంపెనీకి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్బీఐ కార్డ్‌లో సీఎఫ్ఓగా నేగి గతేడాది ఆగస్ట్‌లో భారత్‌పేలో చేరారు. గతంలో అయనకు సుమారు 10 సంవత్సరాల పాటు ఎస్బీఐ కార్డ్‌లలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వరుస రాజీనామాలు భారత్‌పే సంస్థలో గత కొద్దికాలంగా జరుగుతున్న వరుస ఘటనలతో నెలల వ్యవధిలో అనేక మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు రాజీనామాలు చేశారు. వారిలో ఇటీవల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, పోస్ట్‌పే హెడ్ నెహుల్ మల్హోత్రా, లెండింగ్- కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్ సహా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి రాజీనామా చేశారు. -
బ్యాంకుల స్థానాన్ని ఫిన్‌టెక్‌లు భర్తీ చేయలేవు
ముంబై: బ్యాంకుల స్థానాన్ని ఫిన్‌టెక్ సంస్థలు భర్తీ చేస్తాయన్నది అపోహ మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. అయితే, సాంకేతిక మార్పులను సత్వరం అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘బ్యాంకులు కొనసాగుతాయి. ఫిన్‌టెక్ సంస్థలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయన్నది అపోహ మాత్రమే. అయితే, బ్యాంకింగ్ స్వరూపం చాలా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీల పురోగతితో వస్తున్న మార్పులను బ్యాంకులు కూడా వేగంగా అందిపుచ్చుకోవాలి‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రవి శంకర్ చెప్పారు. ఏకీకృత చెల్లింపుల విధానానికి (యూపీఐ) సంబంధించి సింహ భాగం వాటా నాన్ బ్యాంకింగ్ సంస్థలదే ఉంటోందని, బ్యాంకులు ముందు నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు. బ్యాంకింగ్ ప్రపంచంలోను, బైట వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము మల్చుకోవడానికి పెద్ద సంస్థలు కూడా ఇష్టపడకపోవడం ఆర్బీఐని ఆశ్చర్యపర్చిందని వ్యాఖ్యానించారు. -
ఆపరేటర్లే స్వీయ నియంత్రణ పాటించాలి
ముంబై: ఫిన్‌టెక్ సంస్థలను నియంత్రించేందుకు ‘కచ్చితమైన విధానం‘ అంటూ లేదని రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ చౌదరి చెప్పారు. సమతూకం, స్వీయ నియంత్రణ పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్లపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి ఈ విషయాలు చెప్పారు. ‘ఓవైపు ఆర్థిక వ్యవస్థ, కస్టమర్లను రిస్కుల నుంచి కాపాడుతూ మరోవైపు ఫిన్‌టెక్‌ల సానుకూల ప్రభావాలను గరిష్ట స్థాయిలో పెంచే విధంగా వాటిని కచ్చితంగా ఇలాగే నియంత్రించాలన్న విధానమంటూ ఏమీ లేదు. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటం, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యాలైతే.. ఫిన్‌టెక్ పరిశ్రమ తనకు తానే సమతూకం పాటించాల్సి ఉంటుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా సరైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా సమతూకం వస్తుందని నేను విశ్వసిస్తాను. కేవలం నియంత్రణ ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదని నా అభిప్రాయం. నియంత్రణ అనేది సహాయక పాత్ర పోషిస్తుంది. అత్యుత్తమంగా సమతూకం పాటించే బాధ్యత ఫిన్‌టెక్ సంస్థలపైనే ఉంటుంది‘ అని చౌదరి చెప్పారు. ఫిన్‌టెక్ రంగంపై ఆర్బీఐ మరింతగా దృష్టి పెడుతుండటం, డిజిటల్ రుణాల యాప్‌లపై ఇటీవల మార్గదర్శకాలు ప్రకటించడం తదితర అంశాలతో పరిశ్రమలో కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు! -
ఫిన్‌టెక్ ఆపరేటర్లూ.. నిబంధనలను పాటించండి
ముంబై: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లెండింగ్ యాప్‌లు, వీటికి సంబంధించి తీవ్ర స్థాయిలో వడ్డీ వసూళ్లు, రికవరీ ఏజెంట్ల ఆగడాల వంటి అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో ఆవిష్కరణలను అరికట్టడం లేదా డిజిటల్ యాప్‌లపై తీవ్ర జరిమానాలు విధించడం పట్ల ఆసక్తిలేదని పేర్కొన్న ఆర్బీఐ గవర్నర్, నిబంధనావళిని మాత్రం ఖచ్చితంగా పాటించేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.‘‘ట్రాఫిక్ రూల్స్’’ అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... పారదర్శకతతో స్థిరత్వం ► గత రెండు సంవత్సరాల నుండి రుణ యాప్‌లు, ఇందుకు సంబంధించిన ప్రతికూల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ రూల్ బుక్‌లో అనేక మార్పులను చేసింది. ► డిజిటల్ లెండింగ్‌కు సెంట్రల్ బ్యాంక్ వ్యతిరేకం కాదు. దీనికి ఆర్బీఐ నుంచి మద్దతు ఉంటుంది. ఆయా ఆవిష్కరణలను ఆహ్వానిస్తుంది. ► అయితే ఈ ఆవిష్కరణలు బాధ్యతాయుతంగా ఉండాలి. సమర్థతతో పనిచేయాలి. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, వినియోగదారు ప్రయోజనాల పరిరక్షణకు దోహదపడాలి. ఈ యాప్‌లు అమాయకులు, డబ్బు అవసరమైన సాధారణ ప్రజలను దోచుకోడానికి దోహదపడకూడదు. ► పారదర్శక విధానాలు, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఫిన్‌టెక్ సంస్థల దీర్ఘకాలిక స్థిరత్వం నెలకొంటుంది. నిబంధనలు కఠినతరం.. డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ ఇటీవలే కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి! -
అన్నింటికీ ఒక్కటే కేవైసీ
న్యూఢిల్లీ: అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు వీలుగా ఉమ్మడి కేవేసీ విధానం అమలుపై పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘సెంట్రల్ కేవైసీ కోసం సెంట్రల్ రిపాజిటరీ ఉంది. అయితే, ఒక్కసారి కేవైసీ ఇస్తే పలు ఆర్థిక సంస్థల వద్ద, వేర్వేరు సమయాల్లో, పలు అవసరాలకు అది ఉపయోగపడేలా చేయడంపై దృష్టి సారించాం. దీనివల్ల ప్రతిసారీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది’’అని పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఫిక్కీ లీడ్స్ 2022 కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్లకు ఉమ్మడి కేవైసీ విధానంపై ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఆర్థిక శాఖ మధ్య గత వారం సమావేశంలో చర్చ జరగడం గమనార్హం. జూలై నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లు దాటిందని, 628 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో యూపీఐ లావాదేవీలను రోజుకు 100 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ మరింత డిజిటైజ్ అవుతుందన్నారు. ప్రభుత్వం, ఫిన్‌టెక్ సంస్థల మధ్య సయోధ్య పెరగాలి ప్రభుత్వం, ఫిన్‌టెక్ పరిశ్రమ మధ్య దూరం తగ్గాలని, సయోధ్య పెరగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీల నమ్మకాన్ని చూరగొనేందుకు పరిశ్రమ మరింత తరచుగా సంప్రదింపులు జరుపుతుండాలని ఆమె సూచించారు. ‘దూరం వల్ల అపనమ్మకం పెరుగుతుంది. కాబట్టి దూరం తగ్గించుకోవాలి. ప్రభుత్వంతో మరింతగా సంప్రదింపులు జరపాలి. ఎంత తరచుగా సంప్రదింపులు జరిగితే అంత ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది‘ అని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిశ్రమ, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం నెలకొనేలా చూసేందుకు తీసుకోతగిన చర్యలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. చర్చించేందుకు, ఐడియాలను పంచుకునేందుకు ప్రధాని సహా ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులు అందరూ కూడా సదా అందుబాటులోనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుందని వివరించారు. ఫిన్‌టెక్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలను పరీక్షించుకునేందుకు, ఫలితాలను బట్టి వాటిని విస్తరించేందుకు ఆర్బీఐ రూపొందించిన శాండ్బాక్స్ విధానం తోడ్పడుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022–23లో 7 శాతం వృద్ధి భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్ల నేపథ్యంలో క్రితం 8 శాతం అంచనాలను ఒకశాతం మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ఆర్థిక రికవరీ బాగుందని పేర్కొన్న ఆయన, ఈ దిశలో అన్ని స్తాయిల్లో మరింత సమన్వయ చర్యలు అవసరమని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో అన్నారు. కోవిడ్ అనంతర సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధికి విఘాగంగా ఉన్నాయని అన్నారు. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
డిజిటల్ లెండింగ్ నిబంధనలు..వినియోగ హక్కుల పరిరక్షణ కోసమే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ నిబంధనలు వినియోగ హక్కుల పరిరక్షణకు అలాగే రెగ్యులేటరీ పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఉద్దేశించినవి డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. ఇండస్ట్రీ వేదిక అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, థర్డ్ పార్టీ జోక్యం, అక్రమాలు డేటా గోప్యతలను ఉల్లంఘించడం, రికవరీ పద్దతుల్లో తగిన విధానాలు పాటించకపోవడం, అధిక వడ్డీ వసూళ్ల వంటి పరిస్థితుల్లో ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత ఆగస్టు 10న డిజిటల్ రుణ నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌లోగా వాటిని అమలు చేయాలని పరిశ్రమను గత వారం కోరింది. ఫిన్‌టెక్ పరిశ్రమలో ఆందోళన ఫిన్‌టెక్ పరిశ్రమలోని కొన్ని సంస్థలు– రుణాలు ఇవ్వడంపై నిబంధనలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలి. రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపించకపోతే.. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. -
ప్రస్తుత డిజిటల్ రుణాలకూ కొత్త నిబంధనలు
ముంబై: డిజిటల్ రుణాలకు సంబంధించి ఇటీవల ప్రకటించిన కొత్త నిబంధనలను, ఇప్పటికే పంపిణీ చేసిన డిజిటల్ రుణాలకు సైతం వర్తింపజేయాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనైతిక రుణ వసూళ్లను కట్టడి చేస్తూ నూతన నిబంధనలను ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది. డిజిటల్ రుణాలకు మధ్యవర్తులుగా వ్యవహరించే ఫిన్‌టెక్ సంస్థలు కస్టమర్ల నుంచి చార్జీ వసూలు చేయకూడదని కూడా ఆదేశించింది. బ్యాంకులే ఈ చార్జీలను చెల్లించాలని నిర్దేశించింది. మొబైల్ యాప్‌లు, డిజిటల్ మాధ్యమాల ద్వారా మంజూరు చేసే రుణాలకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే తీసుకున్న డిజిటల్ రుణాలు, తాజాగా తీసుకునే వాటికి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ప్రస్తుత రుణాలనూ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చేందుకు తగిన సమయం ఇస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. కొత్త నిబంధనల కింద రుణాన్ని బ్యాంకు నేరుగా రుణ గ్రహీత ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా డిజిటల్ లెండింగ్ యాప్ (డీఎల్ఏ) ద్వారా రుణ దరఖాస్తు వచ్చినప్పటికీ, ఆ రుణాన్ని మంజూరు చేసే సంస్థ, నేరుగా రుణ గ్రహీతకు అందించాలి. -
డిజిటల్ రుణ పరిశ్రమ విస్తరణకు మేలు
ముంబై: డిజిటల్ రుణాల జారీకి సంబంధించి ఆర్బీఐ తీసుకొచ్చిన నూతన నిబంధనలను పరిశ్రమ స్వాగతించింది. మరింత బాధ్యతాయుతంగా పరిశ్రమ వృద్ధి చెందడానికి సాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టళ్లు తదితర డిజిటల్ చానళ్ల ద్వారా జారీ చేసే రుణాలకు మధ్యవర్తుల సాయం తీసుకున్నా కానీ.. ఆయా రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు నేరుగా రుణగ్రహీతల ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్బీఐ బుధవారం నూతన నిబంధనలను ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయరాదని, అనైతిక రుణ వసూళ్ల విధానాలను అనుసరించకూడదని ఆదేశించింది. దీనిపై డిజిటల్ లెండర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (డీఎల్ఏఐ) స్పందించింది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోణంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఫైనాన్షియల్, ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ల మధ్య సహకారాన్ని తప్పనిసరి చేయడాన్ని సానుకూలంగా పేర్కొంది. కస్టమర్లకు, ఫిన్‌టెక్ సంస్థలకు కొత్త నిబంధనలు ఎంతో సానుకూలమని డీఎల్ఏఐ ప్రెసిడెంట్ లిచీ చప్మన్ (జెస్ట్‌మనీ) పేర్కొన్నారు. లోపాల ఆసరాగా వ్యాపారాల నిర్మాణానికి అనుమతించేది లేదని ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు. ఆర్బీఐ నూతన నిబంధనలు ఇప్పటికే సేవలు అందిస్తున్న సంస్థలకు కొంత ప్రతిబంధకమని కోటక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. పారదర్శకత, గోప్యతపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపింది. చదవండి: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సవాళ్లు -
పేటీఎం సేవల్లో అంతరాయం, యాప్‌లో మీ డబ్బులు ఆగిపోయాయా?
దేశ వ్యాప్తంగా ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం సేవలు స్తంభించిపోయాయి. యాప్‌లో లాగిన్ సమస్యలు ఉత్పన్నం కావడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ యాప్‌లో,వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆటోమెటిక్‌గ్గా లాగవుట్ అవుతుందని ట్విట్టర్లో పేటీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో పేటీఎం యూజర్లు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో జాగ్రత్తలు వహించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థకు సంబంధించిన సేవల అంతరాయాల్ని గుర్తించే డౌన్ డిక్టేటర్ సైతం దేశ వ్యాప్తంగా యూజర్లు పేటీఎం యాప్ నుంచి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. దేశంలో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పేటీఎం యాప్ పని తీరు మందగించినట్లు తన నివేదికలో పేర్కొంది. Due to a network error across Paytm, a few of you might be facing an issue in logging into the Paytm Money App/website. We are already working on fixing the issue at the earliest. We will update you as soon as it is resolved — Paytm Money (@PaytmMoney) August 5, 2022 నెట్వర్క్ ఎర్రర్ పేటీఎం సేవల్లో అంతరాయం కలగడంపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. నెట్ వర్క్ ఎర్రర్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలిపింది. అయితే ఇప్పుడా నెట్ వర్క్ ఇష్యూని పరిష్కరించామని పేటీఎం ట్వీట్ చేసింది. ఐటీ సిబ్బంది ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ట్వీట్ చేసింది. We understand that few of our Trading & F&O users would have faced real issues with their trades & positions. In our continued efforts to always have your back & to be fair & transparent, we request you write to us over email at exg.support@paytmmoney.com with your concerns (2/5) — Paytm Money (@PaytmMoney) August 5, 2022 ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోలేం యూజర్ల అంతరాయానికి చింతిస్తున్నాం. యాప్, వెబ్ సైట్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. యాప్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే సమయంలో నెట్ వర్క్ సమస్య, మనీ స్ట్రక్ అవ్వడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు ట్వీట్లు చేస్తున్నారు.ఈ క్లిష్ట సమయాల్లో ఆ ట్వీట్లను పరిగణలోకి తీసులేం. తమకు ఫిర్యాదు చేయాలనుకుంటే 'సపోర్ట్@పేటీఎంమనీ.కాం.' కు మెయిల్ చేయాలని కోరింది. -
ఉద్యోగులకు భారీ షాక్, వందల మంది తొలగింపు!
ఆర్ధిక మాద్యం దెబ్బకు మరో సంస్థ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది. సిలికాన్ వ్యాలీకి చెందిన ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ రాబిన్ హుడ్ 23 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు 23శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపగా.. మూడునెలల ముందు 9శాతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించింది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఆర్ధిక మాద్యంతో పాటు ఇతర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేడయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిన్ టెక్ కంపెనీ రాబిన్ హుడ్ 713 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. 2,400మంది ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు ట్రెక్ క్రంచ్ నివేదించింది. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ సీఈవో అండ్ కో-ఫౌండర్ వ్లాడ్ టెనెవ్ మాట్లాడుతూ..కంపెనీ పునర్నిర్మించాలని భావిస్తున్నాం. అందుకే మా వర్క్ ఫోర్స్‌ను సుమారు 23 శాతం తగ్గించుకుంటున్నాం. తద్వారా సంస్థ ఆపరేషన్స్, మార్కెటింగ్, ప్రోగ్రామింగ్ వంటి ఇతర కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అన్నారు. తొలగించిన వారి స్థానాల్లో కొత్తవారిని నియమించుకుంటాం. వారితో కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తాం. ఆ బాధ్యత తనపై ఉంటుందని వ్యాఖ్యానించారు. క్యూ2 ఎఫెక్ట్ ఇటీవల ఫిన్‌టెక్ సంస్థ రాబిన్ హుడ్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్లో నెట్ రెవెన్యూ 318 మిలియన్ డాలర్లు ఉండగా 295 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది. అదే సమయంలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నియమాల్ని రాబిన్ హుడ్ ఉల్లంఘించిందంటూ న్యూయార్క్ ఫైనాన్షియల్ రెగ్యులరేటర్ 30మిలియన్ల ఫైన్ విధించింది. వెరసీ ఈ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకే సంస్థ సీఈవో వ్లాడ్ టెనెవ్ ఉద్యోగుల్ని తొలగించారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
సీఈఎల్ఎల్కు 70వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ అనుబంధ కంపెనీ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ (సీఈఎల్‌ఎల్) 70,000 ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఈ–వెహికిల్స్ ఫైనాన్స్ రంగంలో ఉన్న త్రీ వీల్స్ యునైటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వాహనాలు వచ్చే అయిదేళ్లలో దశలవారీగా వివిధ నగరాల్లో రంగ ప్రవేశం చేస్తాయి. సగటున ఒక్కో త్రిచక్ర వాహన ధర ప్యాసింజర్ వేరియంట్ రూ.3 లక్షలు, కార్గో రకం రూ.3.5 లక్షలు ఉంటుంది. త్రీ వీల్స్ యునైటెడ్ ఒక్కో లాట్లో 100 నుంచి 20,000 యూనిట్లు కొనుగోలు చేయనుంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల డిమాండ్‌ను పెంచడానికి సీఈఎస్ఎల్ ద్వారా నిర్వహించనున్న 1,00,000 వాహనాల టెండర్‌కు అనుగుణంగా ఈ ఏర్పాటు జరిగింది. -
రుణాల జోరు..పేటీఎమ్ సరికొత్త రికార్డ్‌లు!
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో భారీ స్థాయిలో రుణాలను మంజూరు చేసింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో 84.78 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి ద్వారా రుణ విడుదల దాదాపు 8 రెట్లు ఎగసి రూ. 5,554 కోట్లను తాకింది. వెరసి రూ. 24,000 కోట్ల వార్షిక రన్‌రేట్‌కు చేరినట్లు కంపెనీ తెలియజేసింది. గతేడాది(2021–22) క్యూ1లో 14.33 లక్షల లావాదేవీల ద్వారా రూ. 632 కోట్ల రుణాలను జారీ చేసింది. అత్యుత్తమ రుణదాత సంస్థల భాగస్వామ్యాలతో రుణాల బిజినెస్ జోరును కొనసాగిస్తున్నట్లు పేటీఎమ్ పేర్కొంది. ఈ ఏడాది క్యూ1లో రుణాల సంఖ్య సైతం 492 శాతం జంప్‌చేసి 8.5 మిలియన్లకు చేరినట్లు వెల్లడించింది. విలువ 780 శాతం దూసుకెళ్లి రూ. 5,554 కోట్లకు చేరింది. -
గూగుల్ వార్నింగ్, ప్రమాదంలో స్లైస్ వినియోగదారులు!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'స్లైస్' యాప్ వినియోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. కస్టమర్ల డేటాను స్లైస్ దొంగిలిస్తుందంటూ టెక్ దిగ్గజం గూగుల్ ఆరోపించింది. అంతేకాదు యాప్ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఫోన్లలో నుంచి అన్ ఇన్ స్టాల్ చేయాలని సూచించింది. క్రెడిట్ కార్డ్‌లకు ప్రత్యామ్నయమని చెప్పుకునే ఫిన్‌టెక్ కంపెనీ స్లైస్ యాప్ వినియోగదారుల పర్సనల్ డేటాను స్పై చేయాడానికి ప్రయత్నిస్తుందని గూగుల్ హెచ్చరించింది. వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న టూల్‌ను గుర్తించేలా గూగుల్‌ప్లే ప్రొటెక్ట్ టూల్ పనిచేస్తుందని,ఆ టూల్.. స్లైస్ వినియోగదారుల డేటాను దొంగిలించే అవకాశం ఉందని గుర్తించినట్లు వెల్లడించింది. వ్యక్తిగత డేటా స్పై స్లైస్ పంపిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా యూజర్ని ప్లే ప్రొటెక్ట్ పేజీకి తీసుకెళుతుంది. ఇది మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు లేదా కాల్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాను స్పైస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక హానికరమైన అప్లికేషన్ ఉన్నట్లు గుర్తించామని గుగుల్ చెప్పింది. యాప్‌ను అన్ ఇన్ స్టాల్ చేయాలని యూజర్లకు సిఫారసు చేసింది. స్లైస్ ఏం చెబుతుంది గూగుల్ గుర్తించిన సమస్యను పరిష్కరిస్తున్నట్లు స్లైస్ ట్విట్ చేసింది. 'నిన్న సాయంత్రం- మా ఆండ్రాయిడ్ అప్ డేట్ ప్లే స్టోర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మేం దానిపై దర్యాప్తు చేసి గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తామంటూ ట్విట్లో పేర్కొంది. అంతేకాదు 1శాతం మంది యాప్ వినియోగదారులు పాత వెర్షన్లో ఉన్నారని, వాళ్లు లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ చేయాలని స్లైస్ కోరింది. -
150 బిలియన్ డాలర్లకు ఫిన్‌టెక్ పరిశ్రమ
న్యూఢిల్లీ: భారత ఫిన్‌టెక్ స్టార్టప్‌ల వృద్ధి అసాధారణ స్థాయిలో ఉందని.. ఈ మార్కెట్ 2025 నాటికి 150 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.11.55 లక్షల కోట్లకు) విస్తరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. అసోచా మ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. భారత ఫిన్‌టెక్ రంగం భారీ వృద్ధిని చూస్తోందని.. దేశంలోనే కాకుండా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ‘‘దేశంలో మెజారిటీ స్టార్టప్‌లు ఏర్పాటై పదేళ్లు కూడా కాలేదు. కానీ గత కొన్నేళ్లుగా ఇవి చూపిస్తున్న వృద్ధి, పనితీరు అద్భుతంగా ఉంది’’అని చెప్పారు. ఫిన్‌టెక్ ఆమోద రేటు అంతర్జాతీయంగా సగటున 64 శాతంగా ఉంటే, ఇది మన దేశంలో 87 శాతంగా ఉన్నట్టు చౌదరి తెలిపారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ బ్యాంకింగ్‌లో ఎంతో మార్పునకు దారితీసినట్టు, బ్రిక్ అండ్ మోర్టార్ శాఖల అవసరాన్ని తొలగించినట్టు యూఐడీఏఐ సీఈవో సౌరభ్ గార్గ్ ఇదే కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశవ్యాపప్తంగా 50 లక్షల బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఆధార్ ఆధారత వ్యవస్థతో నగదు స్వీకరణ, నగదు చెల్లింపుల లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ.. ఈ బ్యాంకుల్లో ఎంతంటే? -
ఇన్వెస్టర్లకు బ్రోకింగ్ సంస్థల గాలం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి మెగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నేపథ్యంలో పాలసీదారులు, ఇన్వెస్టర్లను మార్కెట్ వైపు మళ్లించడంపై బ్రోకింగ్ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఇనాక్టివ్ ఖాతాలను మళ్లీ పునరుద్ధరించేలా మదుపుదారులను ప్రోత్సహించడం మొదలుకుని క్యూఆర్ కోడ్‌తో అప్పటికప్పుడు డీమ్యాట్ ఖాతాలను తెరవడం, వినూత్న ఆఫర్లు ఇవ్వడం వరకూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎల్ఐసీ ఐపీవోకి దరఖాస్తు చేసుకోవడానికి .. సంక్లిష్టమైన బ్యాŠంకు లావాదేవీతో సంబంధం లేకుండా, అత్యంత సంపన్న ఇన్వెస్టర్లకు (హెచ్ఎన్ఐ) యూపీఐ ద్వారా చెల్లింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతున్నాయి. దేశీయంగా అతి పెద్ద బ్రోకింగ్ సంస్థ జిరోధా, ఈ మధ్యే బ్రోకింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన పేటీఎం మనీ ఇప్పటికే దీన్ని అమల్లోకి తేగా, మిగతా సంస్థలు అదే బాట పట్టనున్నాయి. తమ దగ్గరే డీమ్యాట్ ఖాతాలు తెరిచేలా డిజిటల్, సంప్రదాయ బ్రోకింగ్ సంస్థలు పలు స్కీములు, గిఫ్ట్ వోచర్లతో పాలసీదారులను ఊరిస్తున్నాయి. కొత్త క్లయింట్లకు ఏంజెల్ వన్ బ్రోకింగ్ సంస్థ రూ. 15,000 విలువ చేసే వోచర్లు ఆఫర్ చేస్తోంది. చాలా మటుకు బ్రోకరేజీలు ఇప్పటికే రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు ఐపీవోకి దరఖాస్తు చేసుకునేందుకు ’ప్రీ–అప్లై’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల వారు కూడా దరఖాస్తు చేసుకోవడంలో తోడ్పడేందుకు ఫిన్‌టెక్ సంస్థ స్పైస్ మనీ తాజాగా రెలిగేర్ బ్రోకింగ్‌తో జట్టు కట్టింది. మూణ్నెల్లలో 91 లక్షల ఖాతాలు.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ (సీడీఎస్ఎల్) గణాంకాల ప్రకారం జనవరి–మార్చి మధ్య కాలంలో కొత్తగా 91 లక్షల డీమ్యాట్ ఖాతాలు వచ్చాయి. దీంతో 2022 మార్చి 31 నాటికి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8.06 కోట్ల నుంచి (గతేడాది డిసెంబర్ ఆఖర్లో) 8.97 కోట్లకు పెరిగింది. ఎల్ఐసీ ఐపీవోపై రిటైల్ ఇన్వెస్టర్లలో భారీగా ఆసక్తి నెలకొందని యాక్సిస్ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీవో కోసమే గత నెలలో 45,000 పైచిలుకు ఖాతాలు తెరిచామని, వీరిలో 40 శాతం మంది కస్టమర్లు .. మార్కెట్‌కు కొత్త వారేనని వివరించాయి. మే 4న ప్రారంభమయ్యే ఐపీవోలో భాగంగా ఎల్ఐసీలో ప్రభుత్వం 3.5 శాతం వాటాలు (22.13 కోట్ల షేర్లు) విక్రయిస్తోంది. ఉద్యోగులకు షేరు ధరపై రూ. 45, పాలసీదారులకు రూ. 60 మేర డిస్కౌంట్ లభించనుంది. 2008లో రిలయన్స్ పవర్‌కి రికార్డు స్థాయిలో వచ్చిన 48 లక్షల పైచిలుకు దరఖాస్తులకు మించి ఎల్ఐసీ ఐపీవోకి బిడ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 21,000 కోట్లు సమీకరించనుంది. తద్వారా దేశీయంగా ఇది అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఎల్ఐసీ ఐపీవో బిడ్‌కు పేటీఎం రూటు క్యూఆర్ కోడ్ స్కానర్‌తో డీమ్యాట్ ఖాతా వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) అనుబంధ సంస్థ అయిన పేటీఎం మనీ ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వారి కోసం ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్లు, పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్‌ను ఏర్పాటు చేశామని.. జీవిత కాలం ఎటువంటి చార్జీల్లేని డీమ్యాట్ ఖాతాను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. ఎవరైనా తమ ఫోన్ నుంచి క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా డీమ్యాట్ ఖాతాను తమ వద్ద తెరవొచ్చని సూచించింది. ఖాతా తెరిచిన అనంతరం ఎల్ఐసీ ఐపీవోకు బిడ్ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 4 నుంచి ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అవుతుండగా.. 9న ముగియనుంది.‘‘ గత కొన్ని ఏళ్లుగా క్యాపిటల్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం పెరుగుతుండడాన్ని చూస్తున్నాం. ఎల్ఐసీ ఐపీవోతో ఇది మరింత పెరగనుంది. దేశవ్యాప్తంగా పేటీఎం మర్చంట్ భాగస్వాముల వద్ద క్యూఆర్ కోడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా ఉచిత డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించొచ్చు’’అని పేటీఎం మనీ అధికార ప్రతినిధి తెలిపారు. పేటీఎం మనీ హోమ్‌స్క్రీన్‌లో ఐపీవో సెక్షన్‌కు వెళ్లి అక్కడ అడిగిన వివరాలు ఇవ్వడం ద్వారా డీమ్యాట్ ఖాతా తెరవొచ్చు. -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్‌పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్‌టెక్ సంస్థలు బీఎన్‌పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్‌పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్‌పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్‌పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్‌పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్‌పెయిడ్, జెస్ట్‌మనీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్‌పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్‌పీఎల్‌తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్‌పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్‌పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్‌ఫామ్‌లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్‌లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్‌పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్‌పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్‌పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్‌పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్‌కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్‌పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్‌లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్‌కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్‌తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్‌ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్‌లో యాక్టివ్‌గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్‌లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్‌పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్‌ఫామ్‌లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్‌లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
భారత్‌పే వ్యవహారాలపై జీఎస్టీ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే పన్ను ఎగవేతలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. సేవలకు సైతం నకిలీ ఇన్వాయిస్లను జారీ చేశారా, లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకోనుంది. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి కంపెనీ పుస్తకాలను తనిఖీ చేసే పనిలో ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌పే సహ వ్యవస్థాపకుడైన అష్నీర్ గ్రోవర్, అయన భార్య మాధురి జైన్ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు కంపెనీ అంతర్గత దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. దీంతో గ్రోవర్ దంపతులను అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు భారత్‌పే ప్రకటించింది. భారత్‌పే ఎటు వంటి ఉత్పత్తులు సరఫరా చేయకుండానే నకిలీ ఇన్వాయిస్లు జారీ చేయడంపై జీఎస్టీ అధికారులు గడిచిన ఏడాది కాలం నుంచి దర్యాప్తు నిర్వహిస్తుండడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు భారత్‌పే ప్రధాన కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. ‘‘సరుకుల సర ఫరా లేకుండానే ఇన్వాయిస్లు జారీ చేసిన కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఎటువంటి సేవలు అందించకుండా ఇన్వాయిస్లు జారీ చేసినట్టు మాధురీ జైన్‌కు వ్యతిరేకంగా ఇటీవలి ఆరోపణలు రావడంపై వాటిపైనా దృష్టి పెట్టనున్నాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
లీకైన ఆడియో టేపులు, వాటాల కోసం కొట్టుకుంటున్నారు?!
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే' ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన ఆరోపణలతో కంపెనీలో సహ వ్యవస్థాపకుడిగా ఉన్న అష్నీర్ గ్రోవర్‌కు భారత్‌పే అన్నీ పదవుల నుంచి తొలగించింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్ పే ఒర్జినల్ ఫౌండర్ భావిక్ కొలాడియాకు, సంస్థ మేనేజ్మెంట్కు మధ్య కొత్త వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీనంతటికి కారణం ఎవరి వాటా ఎంతో క్లారిటీ లేకనే సంస్థలో గొడవలు జరుగుతున్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి భావిక్ కొలాడియా భారత్ పే ప్రారంభంలో కన్సల్టెంట్‌గా ఉన్నారు. అదే సమయంలో అమెరికాలో ఓ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కేసులో కొలాడియా దోషిగా తేలడంతో భారత్‌పే అతన్ని పక్కన పెట్టింది. కంపెనీ బాధ్యతల్ని, వాటాల్ని అష్నీర్ గ్రోవర్ - శశ్వాత్ నక్రాణిలే పంచుకున్నారు. కొలాడియాను వదిలేశారు. దీంతో కొలాడియాకు, అశ్‌నీర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కంపెనీ వాటాల విషయంలో అష్నీర్ ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో కొలాడియా అప్రమత్తమయ్యారు. భారత్‌పే లో తన వాటా ఎంత? మార్చి 1 నుంచి ఉద్వాసనకు గురైన అష్నీర్ వాటా ఎంతో తేల్చుకునేందుకు లాయర్లను సంప్రదించారు. ఇప్పుడీ అంశం ఫిన్ టెక్ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. కాగా, అష్నీర్ గ్రోవర్ , శశ్వాత్ నక్రాణి, భావిక్ కొలాడియాలు కంపెనీలు వాటాల కోసం రోడ్డెక్కి చివరికి సంస్థను ఏం చేస్తారోననే మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! -
మాధురీ జైన్‌కు భారత్‌పే షాక్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే తాజాగా కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్‌కు ఉద్వాసన పలికింది. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన అభియోగాలతో బోర్డు నుంచి ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. మాధురికి గతంలో కేటాయించిన ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు(ఇసాప్స్) సైతం కంపెనీ రద్దు చేసింది. కంపెనీ నిధులను వ్యక్తిగత సౌందర్య చికిత్సలకు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు, కుటుంబ ప్రయాణాల(యూఎస్, దుబాయ్)కు వెచ్చించినట్లు వెలువడిన ఆరోపణలతో మాధురిపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కంపెనీ ఖాతాల నుంచి వ్యక్తిగత సిబ్బందికి చెల్లింపులు, స్నేహపూరిత పార్టీలకు నకిలీ ఇన్వాయిస్లను సృష్టించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి. వీటిపై మాధురి స్పందించవలసి ఉండగా.. 22 నుంచి ఈమెను సర్వీసుల నుంచి తొలగించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అయితే కారణాలు వెల్లడించలేదు. సమీక్ష ఎఫెక్ట్ భారత్‌పే బోర్డు బయటి వ్యక్తులతో నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో తాజా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. రిస్క్‌ల సలహా సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ ద్వారా కంపెనీ పాలనాపరమైన సమీక్షకు తెరతీసింది. రహస్యంగా ఉంచవలసిన సమాచారాన్ని తండ్రి, సోదరులకు మాధురి వెల్లడించినట్లు ఈ సమీక్షలో తేలిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా కొన్ని థర్డ్‌పార్టీల ఇన్వాయిస్ సంబంధిత అవకతవకలు జరిగినట్లు తెలియజేశాయి. అన్ని బిల్లులను ఆమె ఆమోదించినట్లు పేర్కొన్నాయి. 2018 అక్టోబర్ నుంచి కంపెనీ ఫైనాన్షియల్ ఇన్చార్జిగా మాధురి వ్యవహరించారు. కాగా.. కొటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిపై దుర్భాషలాడటంతోపాటు, ఆర్థిక అవకతవకలకు పాల్పడిన అభియోగాల నేపథ్యంలో మాధురి భర్త గ్రోవర్ సైతం మూడు నెలల సెలవుపై వెళ్లారు. అయితే వీటిని గ్రోవర్ తోసిపుచ్చారు. భర్త గ్రోవర్ సెలవుపై వెళ్లిన కొద్ది రోజుల్లోనే మాధురి సైతం సెలవుపై వెళ్లడం గమనార్హం! -
సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!
ఫిన్‌టెక్ రంగంలో భారత్‌పే సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్, ఆయన సతీమణి మాధురీ మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అష్నీర్‌ను సెలవుల మీద పంపించి.. అంతర్గత విచారణ ద్వారా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అష్నీర్‌కు తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత్‌పే. ఆయన భార్య మాధురీ జైన్‌ను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాదు ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కంట్రోలర్ హోదాలో ఆర్థికపరమైన అవకతవకలకు మాధురి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మాధురీ జైన్.. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు, దుస్తులు, ఎలక్ట్రిక్ సామాన్లు, అమెరికా.. దుబాయ్‌కి ఫ్యామిలీ ట్రిప్స్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అల్వరెజ్ అండ్ మార్షల్ కంపెనీ నిర్వహించిన దర్యాప్తులో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యాయి. ఫేక్ ఇన్వాయిస్లతో కంపెనీని ఆమె మోసం చేయాలని ప్రయత్నించినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. అష్నీర్ గ్రోవర్ ఆరోపణలన్నింటిని ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను కంపెనీని వీడాలంటే.. తన వాటాగా ఉన్న 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తన నాయకత్వంలోనే కంపెనీ ముందుకెళ్లాలని చెప్తున్నాడు. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుండడం విశేషం. సంబంధిత వార్తలు: భర్తతో కలిసి బండబూతులు తిట్టిన మాధురీ! -
ఫోన్ పే యూజర్లకు బంపరాఫర్, విజేతలకు రూ.5లక్షల బహుమతి!!
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌తో కలిసి ఫోన్ పే హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ.5లక్షల భారీ ఎత్తున బహుమతిగా అందించనుంది. ఫోన్ పే, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఫిన్ టెక్ కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో హ్యాకథాన్ పోటీలు నిర్వహించి..ఫిన్ టెక్ కంపెనీ సమస్యల్ని పరిష్కరించేలా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు, డిజిటల్ సృష్టికర్తలు, డెవలపర్లకు కొత్తగా ఆలోచించేందుకు, ఆలోచనల్ని అమలు చేసేందుకు, కోడ్ చేసేందుకు ఫోన్ పే అవకాశం కల్పిస్తూ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ హ్యాకథాన్ పోటీలో గెలుపొందిన విజేతలకు ఫస్ట్ప్రైజ్ రూ.1.5 లక్షలు, సెకండ్ ప్రైజ్‌కు రూ.లక్ష రూపాయలు, 3వ బహుమతి కింద రూ. 75 వేల నగదు ఫ్రైజ్ మనీ కింద అందిస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది. ఇక ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 23వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. -
భారత్‌పే ఎండీకి ఉద్వాసన! అసలేం జరుగుతోందంటే..
ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు ఉద్వాసన దిశగా కంపెనీ నిర్ణయం తీసుకోనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని తెలుస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని ఫోన్‌కాల్‌లో దుర్భాషలాడుతూ.. అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో న్యాయపరమైన చర్యలకు దిగిన కొటాక్ మహీంద్రా, భారత్‌పే ఎండీకి నోటీసులు సైతం పంపింది. దీంతో కంపెనీ అష్నీర్‌ను హడావిడిగా సెలవుల మీద బయటికి పంపింది. తాజాగా మార్చి చివరినాటి వరకు ఆయన సెలవుల్ని పొడిగిస్తున్నట్లు భారత్‌పే ఒక ప్రకటనలో పేర్కొంది. శాశ్వతంగా..? ‘ఇది పూర్తిగా అష్నీర్ తీసుకున్న నిర్ణయం.. కంపెనీ, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అష్నీర్ నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది కంపెనీ. అయితే అష్నీర్ లాంగ్ లీవ్ వెనుక బోర్డు ఒత్తిడి ఉన్నట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అష్నీర్ స్థానంలో సీఈవో సుహాయిల్ సమీర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శక్తివంతమైన మేనేజ్మెంట్ టీంతో ముందుకు వెళ్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు సెలవుల పరిణామంపై స్పందించేందుకు అష్నీర్ విముఖత వ్యక్తం చేయడంతో.. భారత్‌పే ఎండీ ఉద్వాసన దాదాపు ఖరారైనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాంటిదేం లేదు! 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పేలో ఇలాంటి విషపూరిత సంప్రదాయం మంచిది కాదనే ఉద్దేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చినట్లు సమాచారం. బోర్డు సభ్యులతో పాటు ఇన్వెస్టర్లుగా సెకోయియా ఇండియా, రిబ్బిట్ క్యాపిటల్, కోవాట్యు మేనేజ్మెంట్తో పాటు పలువురు బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నారు. వీళ్లంతా ప్రతిపాదించినందునే.. అష్నీర్ లాంగ్ లీవ్ మీద వెళ్లాడే తప్ప.. ఉద్వాసన లాంటి పరిణామం ఏం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రచురించింది. ‘బోర్డుకు ఆయన్ని తొలగించే ఉద్దేశం లేదు. కానీ, మీడియా ఊహాగానాల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఉంది. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. ప్రొఫెషనల్‌కి సంబంధించింది కాదు’.. అంటూ బోర్డులోని ఓ కీలక సభ్యుడు వెల్లడించాడు. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై 500 కోట్ల రూపాయలకు కొటక్ మహీంద్రా మీద దావా వేశారు. అంతటితో ఆగకుండా అష్నీర్, ఆయన భార్య మాధురి.. కాల్లో బ్యాంక్ ప్రతినిధిని అసభ్యంగా దూషించడంతో.. కొటక్ మహీంద్రా బ్యాంక్ లీగల్ నోటీసులు పంపింది. సంబంధిత వార్త: 500 కోట్ల పరిహారం.. ఆపై భార్యతో ఫోన్లో బండబూతులు! -
డిగ్రీ చదవడానికే దిక్కులేదు.. నలభై ఏళ్లకే 1.20 లక్షల కోట్లకి అధిపతి
ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ సర్కిళ్లలో గియామ్ పోసాజ్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. నలభై ఏళ్ల వయస్సు నిండకుండానే బ్రిటన్‌లో అత్యంత సంపన్నమైన ఫిన్‌టెక్ కంపెనీ యజమానిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండియన్ కరెన్సీలో అతని సంపద విలువల లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఉండగా అతని కంపెనీ విలువయితే మూడు లక్షల కోట్ల రూపాయలకు పైమాటగానే ఉంది. అయితే ఈ విజయం అతనికి ఊరికే రాలేదు. స్విట్జర్లాండ్‌కి చెందిన గియామ్ పోసాజ్కి చిన్నప్పటి నుంచి ఆర్థిక శాస్త్రం అంటే ఇష్టం. అందుకు డిగ్రీలో ఎకనామిక్స్‌లో చేరాడు. ఎకనామిక్స్ పట్టా పుచ్చుకుని స్టాక్ బ్రోకర్ కావాలనేది అతని లక్ష్యం. కానీ విధి మధ్యలోనే అతని కలలకి బ్రేక్ వేసింది. డిగ్రీ ఫైనలియర్‌కి రాకముందే పాంక్రియస్ క్యాన్సర్‌తో అతని తండ్రి 2005లో మరణించాడు. దీంతో మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఉన్న ఊరే కాదు దేశంలోనే ఉపాధి లభించక వలస జీవిలా అమెరికాలోకి కాలిఫోర్నియాకు 2006లో చేరుకున్నారు. వలస జీవిగా మొదలు కాలిఫోర్నియాకు చెందిన ఓ డిజిటల్ పేమెంట్ సంస్థలో ఉద్యోగిగా గియామ్ పోసాజ్ చేరాడు. అక్కడ పని చేస్తున్నప్పుడే డిజిటల్ పేమెంట్స్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా చూశాడు. వాటిని ఎలా పరిష్కరించవచ్చా అని ఆన్లైన్లో సర్ఫ్ చేశాడు. కళ్లెదుట కనిపిస్తున్న సమస్యలు ఇంటర్నెట్లో చూచాయగా కనిపిస్తున్న పరిష్కారం. అంతే మెడడుకి పని పెట్టాడు... గంటల తరబడి శ్రమించాడు. ఉత్తమైన డిజిటల్ పేమెంట్ పద్దతులతో ఓ స్టార్టప్ స్థాపించాడు. అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇతర ఫిన్‌టెక్ కంపెనీలతో పోటీ పడి తన స్టార్టప్ మనుగడ సాగించలేదని గమనించి.. ముందుగా మారిషన్‌ని వేదికగా సర్వీస్ స్టార్ చేశాడు. అక్కడ గడించిన అనుభవంతో ఈ సారి ఇంగ్లాండ్‌కి పయణమయ్యాడు గియామ్ పోసాజ్. లండన్ కేంద్రంగా మారిషస్‌లో వచ్చిన అనుభవంతో చెక్అవుట్ డాట్ కామ్ పేరుతో ఆన్లైన్ చెల్లింపులు చేసే స్టార్టప్‌ని 2012లో లండన్ కేంద్రంగా పోసాజ్ స్థాపించాడు. స్పీడ్‌గా సులువుగా డిజిటల్ పేమెంట్స్ అందించే సంస్థగా క్రమంగా చెక్ అవుట్ డాట్‌కామ్ ఎదిగింది. క్రమంగా ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడుటలు పెట్టడం కొసాగించారు. ఇంగ్లాండ్ నుంచి క్రమంగా యూరప్‌లో ఒక్కో దేశంలో నెట్వర్క్ విస్తరించుకుంటూ పోయాడు. నెట్‌ఫ్లిక్స్, గ్రాబ్, సోనీ, కాయిన్ బేస్, క్రిప్టో డాట్ కమ్ వంటి సంస్థలు చెక్అవుట్ సేవలు వినియోగించుకోవడం ప్రారంభించాయి. రూ. 1.20 లక్షల కోట్లు ప్రస్తుతంతో ట్రెడింగ్లో ఉన్న బిజినెస్‌తో పాటు ఫ్యూచర్ టెక్నాలజీగా చెప్పుకుంటున్న బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత సేవలు, వెబ్ 3లోనూ చెక్ అవుట్ దూసుకుపోతుండటం చూసి ఇన్వెస్టర్లు ఇంప్రెస్ అయ్యారు. ఇటీవల చెక్ అవుట్ విస్తరణ కోసం గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్లు ఏకంగా బిలియన్ డాలర్లు పెట్టుబడి అందించారు. దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీ వాల్యుయేషన్ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో పోసాజ్ వాటా 16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు రూ.1.20 లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. ప్రస్తుతం అతని వయస్సు 40 ఏళ్లు మాత్రమే. టాప్ 100లో చోటు తనకు ఇష్టమైన రంగంలో తనకు నచ్చిన పని చేయడంలో పోసాజ్ పిసినారిలా వ్యవహరించలేదు. కంపెనీ విస్తరించే క్రమంలో కుటుంబానికి దూరం అయ్యాడు. దేశదేశాలు తిరుగుతూ హోటళ్లలోనే ఐదారేళ్లు గడిపాడు. వారానికి 80 గంటల పాటు నిర్విరామంగా పని చేశారు. ఫలితంగా అతి తక్కువ వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్ను జాబితా 100లో గియామ్ పోసాజ్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఇంటినే ఆఫీస్‌గా చేసి అంతర్జాతీయంగా కంపెనీ పనితీరుని పర్యవేక్షిస్తున్నాడు. చదవండి: బిల్‌గేట్స్ పేరెత్తితే ఆనంద్ మహీంద్రాకి చిరాకు -
500 కోట్లకు దావా.. అదనంగా ఫోన్‌కాల్‌లో అసభ్య పదజాలం!
కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫిన్‌టెక్ కంపెనీ ‘భారత్‌పే’ ఎండీ అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కొటక్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం కోరుతూ 500 కోట్ల రూపాయలకు దావా కూడా వేశాడు అష్నీర్ గ్రోవర్. అయితే తాజాగా ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అష్నీర్, ఆయన భార్య మాధురి ఫోన్‌కాల్‌లో తమ ప్రతినిధిని అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది కొటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మేరకు ఆదివారం ఆ జంటకు నోటీసులు సైతం పంపింది. అష్నీర్ గ్రోవర్-కొటక్ బ్యాంక్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. అష్నీర్ జంట నుంచి అక్టోబర్ 30న లీగల్ నోటీసులు అందుకున్నట్లు ఒప్పుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్.. అది ఎందుకనో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే టైంకి మాత్రం బదులు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే గ్రోవర్ ఆడియో కాల్లో తమ ప్రతినిధిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాత్రం న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఒక మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. నా గొంతు కాదు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గతవారం ఒక ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్‌తో దురుసుగా ఒక జంట మాట్లాడిన క్లిప్ అది. ఆ కాల్లో ఒక వ్యక్తి అసభ్య పదజాలం ఉపయోగిస్తుండగా.. అవతలి వ్యక్తి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్లిప్‌లో గొంతు భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్దే అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, అష్నీర్ అది తన గొంతు కాదని ఖండించాడు కూడా. మరోవైపు లీగల్ నోటీసులు స్పందించేందుకు భారత్‌పే నిరాకరించింది. -
క్రోమా ఈఎమ్ఐ లావాదేవీల్లో పెరిగిన జీని టెక్నాలజీ వాటా!
భారత తొలి ఎలక్ట్రానిక్స్ ఓమ్ని-ఛానల్ రిటైలర్ క్రోమాతో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఇన్నోవిటీ పేమెంట్ సొల్యూషన్స్ చేతులు కలిపింది. భారత్‌లో ఎంటర్ప్రైజ్ వ్యాపారులకు అతిపెద్ద ప్రొవైడర్ ఆఫ్ పేమెంట్ సొల్యూషన్స్ గా ఇన్నోవిటీ నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా క్రోమా స్టోర్లలో ఇన్నోవిటీ తన జీరో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం జీని(G.E.N.I.E) టెక్నాలజీని పరిచయం చేసింది. దీంతో ఎలాంటి వడ్డీ ఛార్జీలు లేకుండా జీరో కాస్ట్ ఈఎమ్ఐలను తీసుకునే వీలు కొనుగోలుదారులకు కల్గనుంది. దేశవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లోని క్రోమా అవుట్లెట్లలో జీనీ టెక్నాలజీని ఇన్నోవిటీ పరిచయం చేసింది. జీని సహాయంతో.. క్రోమా కస్టమర్లు ఇప్పుడు మూడు లేదా 6 నెలల జీరో-కాస్ట్ ఈఎమ్ఐను క్రోమా అవుట్లెట్లలో పొందవచ్చు. అన్ని క్రెడిట్ కార్డ్‌లపై రూ.3000, డెబిట్ కార్డ్‌లపై రూ.5000 కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లపై జీని టెక్నాలజీ అందిస్తోంది. క్రోమా అవుట్లెట్లలోని 2000 కంటే ఉత్పత్తులపై ఈ ఆఫర్ 2021 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు క్రోమా స్టోర్లలో జీనీ టెక్నాలజీ చేసే ఈఎమ్ఐ లావాదేవీలు పెరిగినట్లు ఈ-కామర్స్ & మార్కెటింగ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మిస్టర్ శిబాశిష్ రాయ్ అన్నారు. (చదవండి: రూల్స్ ఉల్లంఘన.. పిఎన్‌బి, ఐసీఐసీఐకు భారీ పెనాల్టీ!) ఫెస్టివల్ సీజన్ నేపథ్యంతో కొనుగోలుదారులకు వేగవంతమైన, సరసమైన క్రెడిట్ సిస్టన్ అందిస్తున్నామని క్రోమా ప్రతినిధి వెల్లడించారు. జీని టెక్నాలజీతో కొనుగోలుదారులు జీరో కాస్ట్ ఈఎమ్ఐలను పొందవచ్చునని పేర్కొన్నారు. జీరో-కాస్ట్ కన్స్యూమర్ ఫైనాన్సింగ్ ఆఫర్ (జీని) ద్వారా క్రోమా కొనుగోలుదారులకు నగదును ఆదా చేయడంలో, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్‌ను కొనుగోలుదారుల యాక్సెస్ చేయవచ్చునని ఇన్నోవిటీ పార్టనర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హేమంత్ తావేర్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన కఠినమైన పరిస్థితుల దృష్ట్యా కొనుగోలుదారులకు ఈఎమ్ఐ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోందనీ ఇన్నోవిటీ పేర్కొంది. ఇన్నోవిటీ నేడు ఫుడ్, ఫ్యాషన్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలలో ఎంటర్ప్రైజ్ ఆఫ్‌లైన్ వ్యాపారులలో అగ్రగామిగా ఉంది. ఈ రంగాలలో మొత్తం డిజిటల్ చెల్లింపు పరిమాణంలో దీని వాటా 76% శాతం వరకు ఉంది. (చదవండి: రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి ఈపీఎఫ్ఓ శుభవార్త!) -
రికార్డెంట్.. చిన్న, మధ్యస్థాయి సంస్థలకు వారధి
సురేష్ అండ్‌కో... చాలా చిన్న సంస్థ. అందులో కేవలం 10 మంది ఉద్యోగులు. కస్టమర్ల బకాయిలు, ఇన్వాయిస్లు, పేమెంట్స్ ఇవన్నీ చూడాలి. పైగా బిజినెస్ డెవలప్కోసం ఫైనాన్స్ కూడా అవసరం. రమేష్ టెక్నాలజీస్.. ఇదికూడా చిన్న సంస్థ. ఈజీగా ఓ 30మంది ఉద్యోగులు ఉంటారు. కస్టమర్ల బకాయిలు, ఇన్వాయిస్లు, పేమెంట్స్ వ్యవహారాల్ని చూసుకునేందుకు ఉద్యోగి కావాలి. కోవిడ్ వల్ల రాబడి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే అన్నీ తానై నడిపిస్తున్నాడు రమేష్. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే 20 రోజులు ముందునుంచే పనులన్నీ మానుకొని అకౌంట్స్ చెక్ చేసుకుంటున్నాడు. అదే సయమంలో రమేష్ ఓ సాఫ్ట్వేర్, లేదంటే కంపెనీ ఉంటే బాగుంటుందని అనుకోని సందర్భంలేదు. అదిగో ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకే పుట్టుకొచ్చిందే ఫిన్‌టెక్ సంస్థ రికార్డెంట్. ఈ స్టార్టప్‌లో మనదేశంతో పాటు ఇతర ఏంజెల్ ఇన్వెస్టర్ల నుండి $400,000 సేకరించింది. ఆ ఫండింగ్‌తో ప్రణాళికలకు అనుగుణంగా, వ్యాపారాలకు ఫైనాన్సింగ్ అందించడం, ఇన్వాయిస్లను అందించేలా పనిచేస్తుంది. 50పైగా చిన్న మధ్యతరహా పరిశ్రమలతో పనిచేస్తుంది. కస్టమర్ల నుంచి బకాయిల్ని వసూలు చేయడం, క్రెడిట్ రిస్క్‌ని తగ్గిస్తుంది. 11,000 వ్యాపార సంస్థలకు 50 వేలకుపైగా కస్టమర్లకు రూ. 2,500 కోట్లకుపైగా మంజూరు చేసింది. 2021లో ప్లాట్‌ఫారమ్ 220% వృద్ధిని నమోదు చేసింది. వచ్చే ఏడాది నాటికి తన నెట్ వర్క్‌ను విస్తరించే పనిలో పడింది. -
క్రోమాతో జట్టుకట్టిన ఇన్నోవిటీ..!
భారత తొలి ఎలక్ట్రానిక్స్ ఓమ్ని-ఛానల్ రిటైలర్ క్రోమాతో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఇన్నోవిటీ పేమెంట్ సొల్యూషన్స్ చేతులు కలిపింది. భారత్‌లో ఎంటర్ప్రైజ్ వ్యాపారులకు అతిపెద్ద ప్రొవైడర్ ఆఫ్ పేమెంట్ సొల్యూషన్స్ గా ఇన్నోవిటీ నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా క్రోమా స్టోర్లలో ఇన్నోవిటీ తన జీరో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం జీని (G.E.N.I.E) టెక్నాలజీని పరిచయం చేసింది. దీంతో ఎలాంటి వడ్డీ ఛార్జీలు లేకుండా జీరో కాస్ట్ ఈఎమ్ఐలను తీసుకునే వీలు కొనుగోలుదారులకు కల్గనుంది. చదవండి: రూ. 850 కోట్లను సొంతం చేసుకోనున్న నైకా టాప్ ఉద్యోగులు..! దేశవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లోని క్రోమా అవుట్లెట్లలో జీనీ టెక్నాలజీని ఇన్నోవిటీ పరిచయం చేసింది. జీని సహాయంతో..క్రోమా కస్టమర్లు ఇప్పుడు మూడు లేదా 6 నెలల జీరో-కాస్ట్ ఈఎమ్ఐను క్రోమా అవుట్లెట్లలోని అన్ని క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3000, డెబిట్ కార్డ్‌లపై రూ. 5000 కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లపై జీని టెక్నాలజీ అందిస్తోంది. క్రోమా అవుట్లెట్లలోని 2000 కంటే ఉత్పత్తులపై ఈ ఆఫర్ 2021 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఫెస్టివల్ సీజన్ నేపథ్యంతో కొనుగోలుదారులకు వేగవంతమైన, సరసమైన క్రెడిట్ సిస్టన్ అందిస్తున్నామని క్రోమా ప్రతినిధి వెల్లడించారు. జీని టెక్నాలజీతో కొనుగోలుదారులు జీరో కాస్ట్ ఈఎమ్ఐలను పొందవచ్చునని పేర్కొన్నారు. జీరో-కాస్ట్ కన్స్యూమర్ ఫైనాన్సింగ్ ఆఫర్ (జీని) ద్వారా క్రోమా కొనుగోలుదారులకు నగదును ఆదా చేయడంలో, అదనపు ఖర్చు లేకుండా క్రెడిట్‌ను కొనుగోలుదారుల యాక్సెస్ చేయవచ్చునని ఇన్నోవిటీ పార్టనర్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హేమంత్ తావేర్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన కఠినమైన పరిస్థితుల దృష్ట్యా కొనుగోలుదారులకు ఈఎమ్ఐ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోందనీ ఇన్నోవిటీ పేర్కొంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై టీవీఎస్ కీలక నిర్ణయం..! -
పోస్ట్ పే వినూత్న ఆఫర్: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే, 'పోస్ట్ పే' పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. 'బై నౌ పే లేటర్' (బిఎన్పిఎల్) కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు భారత్ పే ప్రకటించింది. "పోస్ట్ పే" యాప్ ను కస్టమర్లు ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రూ.10 లక్షల వరకు వడ్డీ లేని క్రెడిట్ లిమిట్ పొందవచ్చు అని తెలపింది. 'పోస్ట్ పే' భారీ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ కొనుగోళ్లకు వర్తిస్తుంది అని తెలిపింది. తన రుణ భాగస్వాముల కోసం మొదటి 12 నెలల్లో పోస్ట్ పే ద్వారా 300 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ పే పేర్కొంది. సులభంగా చెప్పాలంటే మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఈ యాప్ ద్వారా నగదు చెల్లించి. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఆ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకపోతే రుసుము వసూలు చేస్తారు. మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా రాను రాను రుణ పరిమితి పెరుగుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ మీద ఎటువంటి ప్రభావం పడదు అని కంపెనీ తెలిపింది. అలాగే, మీరు గనుక భారీ మొత్తం దీని ద్వారా చెల్లిస్తే దానిని ఈఎమ్ఐల ద్వారా సులభంగా తిరిగి చెల్లించవచ్చని ఫిన్ టెక్ కంపెనీ తెలిపింది. కస్టమర్ చేయాల్సిందల్లా పోస్ట్ పే యాప్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్బుల్ ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి) అలాగే, వినియోగదారులు స్టోర్స్ వద్ద పోస్ట్ పే కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. క్యాష్ బ్యాక్, రివార్డులు కూడా లభిస్తాయి. పోస్ట్ పే యాప్ లేదా కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వార్షిక ఫీజు లేదా లావాదేవీ ఛార్జీలు లేవని కంపెనీ తెలిపింది. అంతేగాక, దుబాయ్ లో జరగబోయే ఐసీసీ టి20 ప్రపంచ కప్ కోసం ప్రపంచ స్పాన్సర్లలో పోస్ట్ పే ఒకరు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 వరకు జరగబోయే మ్యాచ్ కోసం వినియోగదారులు 3,500 ఉచిత పాసులు గెలుచుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ప్రతి ఒక్కరికీ రుణం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏమిటీ బీఎన్‌పీఎల్ కొన్ని వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఒకేసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించే విధానమే ఈ బీఎన్‌పీఎల్. ఈ వ్యవధిలో సున్నా శాతం లేదా స్వల్ప వడ్డీని ఈ బీఎన్‌పీఎల్ సంస్థలు వసూలు చేస్తాయి. చిన్న మొత్తంలో రుణం కావాలని అనుకున్నప్పుడు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎన్నో ఫిన్‌టెక్ అంకురాలు ఇప్పుడు ఈ బీఎన్‌పీఎల్ సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు బ్యాంకులూ ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ఇ-కామర్స్ వెబ్సైట్లూ.. కొన్ని సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. -
డేటా గోప్యత విషయంలో రాజీ పడకూడదు
న్యూఢిల్లీ: డేటా గోప్యత విషయంలో రాజీ పడకూదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో క్లయింట్ల డేటాకు రక్షణ ఉండాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2021’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) నిర్వహించింది. ‘‘డిజిటల్ లావాదేవీల విలువ 2021 జనవరి–ఆగస్ట్ కాలంలో రూ.6 లక్షల కోట్లకు చేరాయి. 2020లో ఈ మొత్తం రూ.4లక్షల కోట్లు, 2019లో రూ.2 లక్షల కోట్లుగానే ఉంది. డేటా గోప్యత అన్నది ఎంతో ముఖ్యమైనది. ఈ అంశంపై ఎన్నో వివాదాస్పద అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ డేటా గోప్యతను గౌరవించడం కనీస సూత్రం. క్లయింట్ల సమాచారానికి తగినంత రక్షణ కల్పించడం అన్నది విశ్వాస కల్పనకు వెన్నెముక అవుతుంది. నా సమాచారానికి రక్షణ లేనంత వరకు ఈ అంశాల పట్ల ఆసక్తి చూపించను’’ అని మంత్రి సీతారామన్ తన అభిప్రాయాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలోనే ‘బాధ్యతాయుత చెల్లింపుల విషయమై ఐక్యరాజ్యసమితి సూత్రాలు’ అనే నివేదికను ఆవిష్కరించారు. భారత్‌లో ఫిన్‌టెక్ అమలు 87%గా ఉందని.. అదే ప్రపంచవ్యాప్తంగా దీని సగటు అమలు 64 శాతమేనని తెలిపారు. డిజిటల్ కార్యకలాపాలు, లావాదేవీలకు భారత్ ప్రముఖ కేంద్రంగా అవతరించినట్టు పేర్కొన్నారు. డిజిటల్ మోసాలకు చెక్.. డిజిటల్ మోసాలను నివారించడంలో ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు) సంస్థలు కీలక పాత్ర పోషించగలవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ అన్నారు. డిజిటల్ మోసాలను తగ్గించడంపైనే అందరి దృష్టి ఉండాలన్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ కార్యకలాపాల విస్తరణ ప్రధానంగా పట్టణాలు, మెట్రో ప్రాంతాల్లోనే ఉంటోందంటూ.. దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. స్మార్ట్ఫోన్లు అందరి వద్ద లేనందున.. జనాభాలో ఎక్కువ మందిని చేరుకునేందుకు గాను టెక్నాలజీ పరిష్కారాలు అవసరమన్నారు. ఆర్బీఐ శాండ్బాక్స్ కార్యక్రమం ద్వారా మెరుగైన ఆప్షన్లను గుర్తించినట్టు చెప్పారు. ఫిన్‌టెక్ విభాగంలో ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి మద్దతుగా.. నియంత్రణ సంస్థలు, భాగస్వాములు అందరూ తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. వాట్సాప్ ఏపీఐ విస్తృత సేవలు ప్రభుత్వ సేవలు, రిటైల్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ తదితర డిజిటల్ సేవల్లో వాట్సాప్ ఏపీఐ ముఖ్యభూమిక పోషిస్తున్నట్టు వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ అన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. వ్యాపారాలను డిజిటల్‌గా మార్చడానికి వాట్సాప్ ఏపీఐ సాయపడుతున్నట్టు చెప్పారు. ‘‘ఈ ప్లాట్‌ఫామ్‌పై సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. వందలాది వ్యాపారాలు, సేవలు ప్రతి నెలా ప్రారంభమవుతున్నాయి. మా యూజర్లు ఈ సేవలను వినియోగించుకోవడం కూడా వేగవంతం అయ్యింది. ఏ రంగంలో అయినా పెద్ద సంస్థ లేదా చిన్న సంస్థ అయినా వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారం అందించడం ఇప్పుడు సులభతరం అయింది. ప్రభుత్వం ‘కోవిన్’, ‘మైజీవోవీ’కు ఏపీఐని ఇటీవలే ప్రారంభించగా.. వాట్సాప్‌లోనూ ఈ సేవలను విస్తరించాము. దీంతో వాట్సాప్ నుంచే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు, వ్యాక్సిన్ స్లాట్లను తెలుసుకోవడం, టీకాలకు అపాయింట్మెంట్లు తీసుకోవడం, టీకా సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కలిగింది’’ అని బోస్ చెప్పారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు కలసి పనిచేయాలి స్టాన్‌చార్ట్ బ్యాంకు ఎండీ దరువాలా బ్యాంకులు, పెద్ద టెక్నాలజీ కంపెనీలు (బిట్ టెక్), ఫిన్‌టెక్ కంపెనీలు సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకోవచ్చని.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఎండీ జరిన్ దరువాలా అభిప్రాయపడ్డారు. అలాగే, రుణ వితరణలోనూ నిర్ణయాలు తీసుకునేందుకు అనలైటిక్స్‌ను వినియోగించుకోవచ్చన్నారు. కలసికట్టుగా సాగడం వచ్చే కొన్నేళ్లలో సాధ్యపడొచ్చని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో భాగంగా దరువాలా మాట్లాడారు. తమదగ్గరున్న భారీ డేటాబేస్ (కస్టమర్ల సమాచారం/వివరాలు)ను తగిన విధంగా వినియోగించుకోవడంలో బ్యాంకులు వెనుకబడ్డాయని.. అయినప్పటికీ గత రెండు మూడేళ్లలో వేగంగా పుంజుకున్నట్టు చెప్పారు. ఫిన్‌టెక్‌లతో కలసి పనిచేయడం వల్ల బ్యాంకులు ఖర్చులను తగ్గించుకోగలవన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
నయా బ్యాం‘కింగ్’.. బ్యాంకు సేవలన్నీ డిజిటల్‌గానే..
ఆధునిక, డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ పాత్ర చెప్పలేనంత పెద్దది. అది ఫోన్‌బ్యాంకింగ్ కావొచ్చు.. నెట్ బ్యాంకింగ్ కావచ్చు. డీమోనిటైజేషన్ తర్వాత నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కరోనా వచ్చి డిజిటల్‌ను మరింత వేగవంతం చేసింది. దీంతో నేడు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా సంప్రదాయ బ్యాంకులకు.. నియో బ్యాంకులకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకుం డా పోయింది. ఈ పరిణామాలు నియో బ్యాంకుల విస్తరణకు అవకాశాలను విస్తృతం చేసిందని చెప్పుకోవాలి. నేటి యవతరానికి బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద ‘క్యూ’లను చూస్తే చిరాకు. లెక్కలేనన్ని పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా వారికి నచ్చదు. సమయం వృథాకాకుండా.. ఉన్న చోట నుంచే బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వారికి నచ్చింది. పెద్దవయసులోని వారు సైతం డిజిటల్ బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసుకుంటూ ఉండడం కొత్త ధోరణికి అద్దం పడుతోంది. కొంచెం ప్రత్యేకంగా.. నియో బ్యాంకులకు ప్రత్యేకమైన నిర్వచనం ఏదీ లేదు. భౌతికంగా ఎటువంటి శాఖలను కలిగి ఉండవు. ఇప్పటికే విస్తరించి ఉన్న సంప్రదాయ బ్యాంకులతో (లైసెన్స్ కలిగిన) ఇవి భాగస్వామ్యం కుదుర్చుకుని.. బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటాయి. బ్యాంకు సేవలను వినియోగదారులకు మరింత సౌకర్యంగా అందించడం వీటి ప్రత్యేకత. వీటివల్ల బ్యాంకులకూ ప్రయోజనం ఉంది. కొత్త కస్టమర్లను సంపాదించేందుకు పెద్దగా అవి శ్రమపడాల్సిన పని తప్పుతుంది. నియోబ్యాంకుల రూపంలో కొత్త కస్టమర్లు వాటికి సులభంగా వచ్చి చేరుతుంటారు. బ్యాంకులకు కొత్త కస్టమర్లను తీసుకొచ్చినందుకు.. కస్టమర్ యాక్విజిషన్ ఫీ పేరుతో నియోబ్యాంకులకు కొంత మొత్తం ముడుతుంటుంది. అంతేకాదు.. బ్యాంకు తరఫున కస్టమర్లకు అందించే ప్రతీ సేవలపైనా ఎంతో కొంత ఆదాయం నియోబ్యాంకులకు లభిస్తుంది. కస్టమర్లకు సౌకర్యం.. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల వల్ల కస్టమర్లకు కొన్ని సౌలభ్యాలున్నాయి. బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్‌లను నియోబ్యాంకులు డిజైన్ చేసుకుంటాయి. నిధుల విషయంలో ఎటువంటి అభద్రతా భావం, ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే నియోబ్యాంకులు మధ్యవర్తిత్వ పాత్రే పోషిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అకౌంట్లు, డిపాజిట్లు అన్నీ కూడా సంప్రదాయ బ్యాంకులవద్దే ఉంటాయి. వీటిల్లో ఖాతాను వేగంగా ప్రారంభించుకోవచ్చు. ఆన్లైన్లోనే కేవైసీ వివరాలను పూర్తి చేయవచ్చు. ఆధార్, పాన్‌తోపాటు కొన్ని ప్రాథమిక వివరాలను ఇస్తే చాలు. పైగా ఇవన్నీ కూడా సున్నా బ్యాలన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అంటే ఖాతాదారులు రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేకుండానే బ్యాంకు సేవలను పొందే వెసులుబాటు ఉంది. వార్షిక నిర్వహణ చార్జీలు కూడా లేవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల భాగస్వామ్యం కలిగిన నియో బ్యాంకులు డిపాజిట్లపై అధిక రేటును ఆఫర్ (7 శాతం వరకు) చేస్తున్నాయి. నియో బ్యాంకులు కొన్ని సేవింగ్స్ ఆధారిత సేవలకే పరిమితం అవుతుంటే.. కొన్ని రుణ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. సేవింగ్స్ ఆధారిత నియో బ్యాంకులు పెట్టుబడులు, నగదు బదిలీలు, ఫారెక్స్ చెల్లింపుల వంటి సేవలకు పరిమితమైతే.. మరో రకం రుణ కార్యకలాపాలకు పరిమితం అవుతుంటాయి. సేవింగ్స్ ఆధారితం.. సేవింగ్స్ ఖాతా సేవలకు పరిమితమయ్యే నియో బ్యాంకులు ప్రధానంగా ఆయా సేవలను డిజిటల్‌గా ఆఫర్ చేస్తుంటాయి. ఐఎంపీఎస్/నెఫ్ట్/ఆర్టీజీఎస్/యూపీఐ తదితర చెల్లింపులు, చెక్ బుక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ స్టేట్మెంట్లు, ఖాతాలకు నామినీని నమోదు చేసుకోవడం ఇత్యాది సేవలన్నీ అందిస్తాయి. సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా సంప్రదాయ బ్యాంకులు ఆఫర్ చేసే అన్ని రకాల సేవలను నియో బ్యాంకుల ద్వారా డిజిటల్‌గానే పొందొచ్చు. లావాదేవీల పూర్తి వివరాలను సైతం ఎప్పటికప్పుడు పొందొచ్చు. నియోబ్యాంకులు కో బ్రాండెడ్ డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులను సైతం బ్యాంకుల భాగస్వామ్యంతో అందిస్తున్నాయి. నగదు ఉపసంహరించుకోవాలన్నా, నగదును డిపాజిట్ చేసుకోవాలన్నా.. అప్పుడు కస్టమర్లు నియో బ్యాంకు మంజూరు చేసిన ఏటీఎం కార్డును వినియోగించుకోవచ్చు. ఏ బ్యాంకు భాగస్వామ్యంతో కార్డు ఇచ్చిందో ఆయా బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. నగదు జమ కోసం అవసరమైతే భాగస్వామ్య బ్యాంకు శాఖకు వెళ్లి పనిచేసుకోవచ్చు. ఏటీఎం యంత్రాల్లోనూ క్యాష్ డిపాజిట్ అవకాశం ఉంటున్న విషయం తెలిసిందే. కస్టమర్ల వినియోగానికి తగ్గట్టు.. నియోబ్యాంకు ప్లాట్‌ఫామ్‌లు కస్టమర్ల వినియోగాన్ని ట్రాక్ చేస్తుంటాయి. వారి అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను ఆఫర్ చేస్తాయి. ఉదాహరణకు ఫెడరల్ బ్యాంకు సహకారంతో గూగుల్ పే ‘ఎఫ్ఐ మనీ’ని ఆరంభించింది. ఇది కూడా ఒక నియోబ్యాంకే. ఇది ఒక ఆటోమేటెడ్ బోట్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసింది. దీంతో కస్టమర్ స్విగ్గీ లేదా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రతీ సందర్భంలోనూ రూ.50–100 వరకు పొదుపు చేయమని సూచిస్తుంటుంది. మరో నియోబ్యాంకు ‘జూపిటర్ మనీ’ మనీ మేనేజ్మెంట్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోనే ఖాతాదారు నిర్దేశించిన మొత్తాన్ని ప్రత్యేక భాగంగా జూపిటర్ మనీ నిర్వహిస్తుంటుంది. కొన్ని నియో బ్యాంకులు అయితే వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. నియోక్స్ అనే నియోబ్యాంకు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో (మధ్యవర్తి ప్రమేయం లేని) ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు. ఫిన్‌టెక్ కంపెనీ కలీదో ప్లాట్‌ఫామ్‌కు చెందిన కలీదో క్యాష్.. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను సైతం అందిస్తోంది. వీటిలో కొన్ని బ్యాంకులు బీటా వెర్షన్లోనే ఉన్నాయి. అంటే ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు. బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన ఇబ్బంది లేదు. మొబైల్ ఫోన్ నుంచే బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. అన్ని లావాదేవీలనూ డిజిటల్‌గానే పూర్తి చేసుకోవచ్చు. ఆఖరుకు రుణాలను కూడా డిజిటల్ వేదికగా వేగంగా తీసుకోవచ్చు. ఈ తరహా సేవలతో నియో బ్యాంకులు విస్తరించుకుంటూ వెళుతున్నాయి. ఎటువంటి భౌతిక శాఖల్లేకుండా.. ఆన్లైన్ ఆర్థిక సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లనే నియోబ్యాంకులుగా పేర్కొంటున్నారు. ఈ సంస్థల సేవలపై వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... రుణ ఉత్పత్తులు.. కొన్ని నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. ఇవి సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణ దరఖాస్తులను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంటాయి. ఆన్లైన్లోనే ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఫొటో ఐడీ, ఆధార్ నంబర్, ఒక సెల్ఫీ కాపీలను బ్యాంకుకు ఆన్లైన్లో సమర్పిస్తే చాలు. ఫ్రియోకు చెందిన మనీట్రాప్.. రూ.3,000 నుంచి రూ.5 లక్షల వరకు కస్టమర్ల రుణ చరిత్ర ఆధారంగా వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది. నెలసరి వేతనం రూ.30,000, ఆపైన ఉన్న ఉద్యోగులకు 13 శాతం వడ్డీ రేటుపైనే మూడు నెలల నుంచి 36 నెలల కాలానికి మంజూరు చేస్తోంది. ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి సేవలను ఫ్రియోపే పేరుతో అందిస్తోంది. రూ.500–3,000 వరకు క్రెడిట్‌ను స్థానిక దుకాణాల్లో కొనుగోళ్లకు వాడుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్ణీత తేదీలోపు చెల్లిస్తే చాలు. రూపాయి కూడా వడ్డీ ఉండదు. నియో బ్యాంకులు రుణ ఉత్పత్తులను ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకుల భాగస్వామ్యంతో అందించొచ్చు. సేవింగ్స్ ఖాతా సేవలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంకు నుంచే రుణ ఉత్పత్తులను ఆఫర్ చేయాలని లేదు. ఉదాహరణకు ఫ్రియో సంస్థ సేవింగ్స్ ఖాతా సేవలను ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సహకారంతో అందిస్తోంది. కానీ ఇదే ఫ్రియో తన మనీట్రాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణ ఉత్పత్తులను అందించేందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎం ఫైనాన్స్, అపోలో ఫిన్వెస్ట్ ఇండియాతో ఒప్పందాలు చేసుకుంది. అలాగే, ఆర్బీఎల్ బ్యాంకుతో టైఅప్ అయ్యి క్రెడిట్ కార్డులను సైతం అందిస్తోంది. సరైన క్రెడిట్ స్కోర్ లేని వారి గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా నియో బ్యాంకులు.. కస్టమర్ల మొబైల్లోని కాంటాక్ట్‌లు, గ్యాలరీ, ఇతర యాప్‌ల సమాచారం తీసుకునేందుకు అనుమతి కోరుతున్నాయి. నియంత్రణలు, ఫిర్యాదుల పరిష్కారం నియో బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాం కుల సాయంతోనే బ్యాంకింగ్ సేవలను ఇవి అందిస్తున్నాయని గమనించాలి. డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందించే సంస్థలు భౌతికంగానూ శాఖలను కలిగి ఉండాలని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. కనుక నియోబ్యాంకులు భౌతికంగా శాఖలు కలిగిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకుని సేవలను అందిస్తున్నాయి. కనుక నియో బ్యాంకు అందిస్తున్న డిపాజిట్, సేవింగ్స్ ఖాతా సేవల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఖాతాల్లోని కస్టమర్ల డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంటుంది. కాకపోతే నియోబ్యాంకు ఒప్పందం చేసుకున్న బ్యాంకు ఏదన్నది తెలుసుకోవడం మంచిది. ఫిర్యాదులను నియో బ్యాంకు లేదా ఆ బ్యాంకుతో ఒప్పందం కలిగిన సంప్రదాయ బ్యాంకుల వద్ద దాఖలు చేసుకోవచ్చు. సకాలంలో పరిష్కారం రానట్టయితే ఆర్బీఐ సాచెట్ వెబ్సైట్లోనూ నమోదు చేసుకోవచ్చు. అనుకూలమేనా..? వినియోగానికి సౌకర్యంగా ఉండే ప్లాట్‌ఫామ్, లావాదేవీలను సైతం సౌకర్యంగా నిర్వహించుకోగల వెసులుబాటు నియో బ్యాంకుల్లో ఉంటుంది. కాకపోతే అన్నింటినీ ఒకే కోణం నుంచి చూడకూడదు. కొన్ని నియో బ్యాంకుల్లో బ్యాలన్స్ వెంటనే అప్డేట్ కావడం లేదని.. కస్టమర్ సేవలు బాగోలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. కనుక ఎంపిక చేసుకున్న నియోబ్యాంకు సేవలు మెరుగ్గా లేకపోతే వాటిల్లో కొనసాగడం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వదు. సైబర్ భద్రతా రిస్క్ అంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే కావడంతో సైబర్ భద్రతా రిస్క్ ఉంటుంది. అలాగే, ఫోన్లో వ్యక్తిగత సమాచారం పొందేందుకు అనుమతి అడుగుతున్నందున ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. మెరుగైన, సులభతరమైన బ్యాంకు సేవల కోసంనియో బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టయితే.. ఆశించిన మేర సేవల నాణ్యత ఉందేమో పరిశీలించుకోవాలి. ఇప్పటికే సంప్రదాయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కలిగిన వారు.. మెరుగైన సేవల కోసం రెండో ఖాతాను నియో బ్యాంకుల్లో తెరవడాన్ని పరిశీలించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా.. నియో బ్యాంకుల మాదిరే అన్ని రకాల సేవలను ఆఫర్ చేస్తున్న ఎస్బీఐ యోనో, కోటక్ 811 ప్లాట్‌ఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు. నియో బ్యాంకులకు ఇవి మెరుగైన ప్రత్యామ్నాయంగా వారు పేర్కొంటున్నారు. పరిమితులు సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే నియో బ్యాంకుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటో డెబిట్ (ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అనుమతి) కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం అన్ని నియో బ్యాంకుల్లోనూ లేదు. అలాగే, పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు కూడా అవకాశం లేదు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 730 టార్గెట్: రూ. 870 ఎందుకంటే: గతేడాది(2020–21)కల్లా 8.4 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ దేశీ బ్రోకింగ్ బిజినెస్‌లో నాలుగో ర్యాంకులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల విషయంలో డిస్కౌంట్ బ్రోకర్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీలోనూ కంపెనీ పురోభివృద్ధి సాధిస్తోంది. కంపెనీకి గల పటిష్ట డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. క్లయింట్లకు వివిధ దశల్లో అవసరమయ్యే పెట్టుబడులు, రక్షణ, రుణాలు తదితర లైఫ్‌సైకిల్ సొల్యూషన్స్‌ను పూర్తిస్థాయిలో అందిస్తోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల పెట్టుబడుల్లో అవకాశాలు భారీగా పెరిగాయి. ఇవి దేశీ బ్రోకింగ్ పరిశ్రమలో డిజిటల్ సేవలు, అతిపెద్ద సంస్థల కన్సాలిడేషన్‌కు దారి చూపుతున్నాయి. అతిపెద్ద కంపెనీగా ఐ–సెక్ సర్వీసులకు ఇకపై మరింత డిమాండు కనిపించే వీలుంది. కస్టమర్ల వ్యాలెట్ షేర్ల మానిటైజేషన్ తదితర డైవర్సిఫైడ్ ప్రొడక్టులతో కూడిన సేవల ద్వారా నిలకడైన ఆదాయాన్ని సాధించనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా కస్టమర్లను పొందడంలో ముందుంటోంది. వ్యయాల క్రమబద్ధీకరణతో లబ్ధి పొందనుంది. టీసీపీఎల్ ప్యాకేజింగ్ వెంచురా సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 532 టార్గెట్: రూ. 961 ఎందుకంటే: గత దశాబ్దన్నర కాలంగా కంపెనీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 17.7 శాతం పురోగతిని చూపుతోంది. సుమారు 6,000 లిస్టెడ్ కంపెనీలలో గత పదేళ్లుగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తున్న 105 కంపెనీలలో ఒకటిగా జాబితాలో చేరింది. మడిచే వీలున్న అట్టపెట్టెలు(ఫోల్డింగ్ కార్టన్స్), మార్పిడికి వీలయ్యే స్టాండెలోన్ పేపర్ బోర్డుల తయారీలో అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది. వెరసి ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో నిలకడైన, ప్రాధాన్యత కలిగిన కంపెనీగా పలు పరిశ్రమలకు చెందిన దిగ్గజ క్లయింట్ల నుంచి గుర్తింపును పొందింది. అంతర్జాతీయంగా రక్షణాత్మక ప్యాకేజింగ్ మార్కెట్ వార్షికంగా 6.7 శాతం వృద్ధితో 281 బిలియన్ డాలర్ల నుంచి 469 బిలియన్ డాలర్లకు జంప్చేయగలదని అంచనా. ఈ రంగంలో పట్టున్న కంపెనీగా టీసీపీఎల్‌కు భారీ అవకాశాలు లభించే వీలుంది. పర్యావరణ అనుకూల టెక్నాలజీస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నందున రానున్న దశాబ్ద కాలంలో కన్సాలిడేషన్ జరగనుంది. తద్వారా పోటీ తగ్గనుంది. ఈ ఏడాది రెండో తయారీ లైన్ ప్రారంభం కానుండటంతో కంపెనీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ సామర్థ్యం రెట్టింపుకానుంది. అనుబంధ సంస్థ ద్వారా చేపట్టనున్న పాలీఎథిలీన్ బ్లోన్ఫిల్మ్ తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనుంది. -
పేయూ చేతికి బిల్‌డెస్క్
న్యూఢిల్లీ: దేశీ ఇంటర్నెట్ కన్జూమర్ విభాగంలో తాజాగా అతిపెద్ద ఒప్పందానికి తెరలేచింది. ఫిన్‌టెక్ బిజినెస్ సంస్థ పేయూ.. డిజిటల్ పేమెంట్స్ సర్వీసుల సంస్థ బిల్‌డెస్క్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 4.7 బిలియన్ డాలర్లు(రూ. 34,376 కోట్లు) వెచ్చించనుంది. దీంతో పేయూ మాతృ సంస్థ, నెదర్లాండ్స్ దిగ్గజం ప్రోసస్ ఎన్వీ దేశీ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్ల(రూ. 73,140 కోట్లు)కు చేరనున్నాయి. అయితే బిల్‌డెస్క్, పేయూ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి లభించవలసి ఉంది. 2022 తొలి త్రైమాసికానికల్లా ఒప్పందం పూర్తయ్యే వీలున్నట్లు ప్రోసస్ గ్రూప్ సీఈవో బాబ్ వాన్ డిక్ అభిప్రాయపడ్డారు. రెండు సంస్థల కలయికతో డిజిటల్ పేమెంట్స్ విభాగంలో దేశీయంగానూ, గ్లోబల్ స్థాయిలోనూ లీడింగ్ కంపెనీ ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న దేశీ ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌లో మరింత లోతైన, మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. 2005 నుంచీ..: దేశీయంగా ప్రోసస్ దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా నిలుస్తున్నట్లు డిక్ పేర్కొన్నారు. 2005 నుంచీ టెక్ కంపెనీలలో దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాజా లావాదేవీతో ఈ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. ఇది భారత్ మార్కెట్‌పట్ల తమకున్న కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో తమ పెట్టుబడులకు దేశీ మార్కెట్ కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. రానున్న దశాబ్దంలోనూ గ్రూప్ వృద్ధికి భారీగా దోహదపడనున్నట్లు తెలియజేశారు. రానున్న కొన్నేళ్లలో 20 కోట్లమందికిపైగా కొత్త వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. మూడేళ్ల కాలంలో ఒక్కో వ్యక్తి సగటు లావాదేవీలు 10 రెట్లు జంప్‌చేసి 22 నుంచి 220కు చేరనున్నట్లు అభిప్రాయపడ్డారు. పలు కంపెనీలలో..: ప్రోసస్ ఇప్పటికే బైజూస్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ తదితర పలు కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. పేయూ ద్వారా సిట్రస్‌పే, పేసెన్స్, విబ్మోలనూ సొంతం చేసుకుంది. అత్యధిక వృద్ధిలో ఉన్న 20 మార్కెట్లలో కార్యకలాపాలు విస్తరించిన పేయూ తాజా కొనుగోలుతో ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ పేమెంట్ సర్వీసుల సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించనుంది. 2000లో షురూ బిల్‌డెస్క్ కార్యకలాపాలు 2000లో ప్రారంభమయ్యాయి. కంపెనీలో జనరల్ అట్లాంటిక్, వీసా, టీఏ అసోసియేట్స్, క్లియర్స్టోన్ వెంచర్, టెమాసెక్ తదితర దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ నెట్‌వర్క్‌ను కొన్ని దిగ్గజ బ్యాంకులతోపాటు, యుటిలిటీస్, టెలికం, బీమా తదితర పలు విభాగాలకు చెందిన చాలా కంపెనీలు వినియోగిస్తున్నాయి. పేయూ, బిల్‌డెస్క్ సంయుక్తంగా ఏడాదికి 4 బిలియన్ లావాదేవీలను నిర్వహించే అవకాశమున్నదని పేయూ సీఈవో అనిర్బన్ ముఖర్జీ అంచనా వేశారు. దశాబ్ద కాలంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో కంపెనీ అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు బిల్‌డెస్క్ సహవ్యవస్థాపకుడు ఎంఎన్ శ్రీనివాసు తెలియజేశారు. -
డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్ రూ.2,860 కోట్లు, క్రెడ్ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్ ఇన్సూరెన్స్ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి. టాప్–10లో నాలుగు.. ఆసియాలో టాప్–10 డీల్స్‌లో పైన్‌ల్యాబ్స్ మూడవ స్థానంలో, క్రెడ్ నాల్గవ, రేజర్‌పే ఎనమిదవ, క్రెడిట్‌బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్‌పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్‌టెక్ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సైతం.. తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్‌టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో యూఎస్ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్ జరిగాయి. 2020లో 502 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ యాజ్ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది. చదవండి: భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం -
ఫిన్‌టెక్ సంస్థల్లో భారీగాఉద్యోగావకాశాలు
ఫైనాన్షియల్ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఫిన్‌టెక్! ఇది ఇటీవల కాలంలో ఎంతో సుపరిచితంగా మారింది. నేటి డిజిటల్ యుగంలో ఫిన్‌టెక్ సంస్థల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. లోన్స్ మొదలు మ్యూచువల్ ఫండ్స్ వరకు.. డిజిటల్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. వినియోగదారులకు సేవలం దిస్తున్నాయి ఫిన్‌టెక్ సంస్థలు!దాంతో ఫిన్‌టెక్ రంగం ఇప్పుడు యువతకు సరికొత్త కెరీర్‌గా వేదికగా నిలుస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ నుంచి టెక్నికల్,ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థుల వరకు.. వారి అర్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది ఫిన్‌టెక్ రంగం!ఈ నేపథ్యంలో.... ఫిన్‌టెక్ ఉద్యోగాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం... డిజిటల్ యుగం.. ఏ రంగంలో చూసినా.. టెక్నాలజీ ఆధారిత సేవలు. ప్రధానంగా స్మార్ట్ఫోన్స్తో.. వ్యక్తులు తమకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కాలు కదపకుండా చక్కబెట్టుకునే అవకాశం లభిస్తోంది. రుణాలు తీసుకోవడం మొదలు.. బీమా చెల్లింపులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఇలా అన్నిరకాల సేవలు స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో జరిగిపోతున్నాయి. ఇదంతా సాధ్యమయ్యేలా చేస్తున్నాయి ఫిన్‌టెక్ సంస్థలు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తరహా సేవలు అందించడంలో ముందుంటున్నాయి. యాప్స్ ఆధారంగా.. ఒకే విండో ఫిన్‌టెక్ సంస్థలు అందించే సేవలు అధికంగా మొబైల్ యాప్స్ రూపంలో∙ఉంటున్నాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్ పేమెంట్స్, అసెట్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన పలు రకాల సేవలను ఫిన్‌టెక్ సంస్థలు యాప్స్ ఆధారంగా వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన మొబైల్ వ్యాలెట్లు, ఆన్లైన్ పీర్ టు పీర్ లెండింగ్ వంటివి ఫిన్‌టెక్ సేవల పరిధిలోకే వస్తాయి. మిలియన్ డాలర్ల రంగం దేశంలో ఐదారేళ్ల క్రితమే ఫిన్‌టెక్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రంగం ఏటేటా శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఫిన్‌టెక్ రంగం ఈ ఏడాది 1520 మిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2023 నాటికి ఈ విలువ 2,580 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రధానంగా డిజిటల్ పేమెంట్స్, ఆల్టర్నేటివ్ ఫైనాన్సింగ్, పర్సనల్ ఫైనాన్స్, ఆల్టర్నేటివ్ లెండింగ్‌ల విభాగాల్లో ఫిన్‌టెక్ సంస్థల సేవలు విస్తరిస్తున్నాయి. వినియోగదారులు ఫిన్‌టెక్ సేవల వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. గతేడాది డిజిటల్ పేమెంట్స్ విభాగంలో∙513.84 మిలియన్ల మంది ఫిన్‌టెక్ సంస్థల ద్వారా సేవలు పొందారు. వీరిసంఖ్య 2023 నాటికి 625.53 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఫిన్‌టెక్ సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలోపెట్టుకొని కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేలకు పైగా సంస్థలు ఫిన్‌టెక్ విభాగంలో సేవలందిస్తున్నాయి. ఆయా సంస్థలకు నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. రెండు లక్షల ఉద్యోగాలు రానున్న రెండేళ్లలో ఫిన్‌టెక్ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ రంగంలో లభించే ఉద్యోగాల వివరాలు... » కస్టమర్ ఎక్విజిషన్ » ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ » బిగ్‌డేటా అనలిటిక్స్ » అప్లికేషన్ డెవలప్మెంట్ » ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ » సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ » హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ » యూఐ/యూఎక్స్ డిజైనర్ » ప్రొడక్ట్ మేనేజర్ » ప్రొడక్ట్ ఇంజనీర్ » సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ » సోషల్ మీడియా మేనేజర్స్ ఫిన్‌టెక్ సేవలు ఫిన్‌టెక్ సంస్థలు ప్రధానంగా ఆరు విభాగాల్లో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. అవి.. –డిజిటల్ లెండింగ్, –పేమెంట్ సర్వీసెస్, –సేవింగ్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, –రెమిటెన్సెస్, –పాయింట్ ఆఫ్ సేల్, –ఇన్సూరెన్స్. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ సర్వీసెస్‌కు విపరీతమైన ప్రాధాన్యం కనిపిస్తోంది. గత ఏడాది ఫిన్‌టెక్ రంగంలో 20శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని.. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్టర్నేటివ్ లెండింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్సూర్ టెక్ పేరుతో ఫిన్‌టెక్ సంస్థలు తమ సేవలను ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు డెలాయిట్ సర్వేలో తేలింది. ఉద్యోగ విభాగాలు నాస్కామ్, మ్యాన్‌పవర్ గ్రూప్, డెలాయిట్ వంటి సంస్థలు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం– ఫిన్‌టెక్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న ముఖ్యమైన విభాగాలు.. » సాఫ్ట్వేర్ –51 శాతం, » సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ 16 శాతం » కోర్ ఫైనాన్స్–11శాతం » ప్లానింగ్ అండ్ కన్సల్టింగ్–4 శాతం » టాప్ మేనేజ్మెంట్ –4 శాతం. ఇటీవల కాలంలో ఫిన్‌టెక్ స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ప్రకటించిన 2020–21 బడ్జెట్లో సైతం ఫిన్‌టెక్ సంస్థలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉంది. స్టార్టప్స్ ఫిన్‌టెక్ సంస్థల్లో సగటున 150 నుంచి 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫిన్‌టెక్ స్టార్టప్‌ల్లో ఒక్కో సంస్థలో కనీసం పది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఫిన్‌టెక్ రంగంలో పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి సంస్థలో కోర్ విభాగంలో ఒక కొలువుకు కొనసాగింపుగా అయిదు ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంటే.. ఒక ప్రొడక్ట్ డిజైన్ స్థాయిలో ఒక నిపుణుడు ఉంటే.. ఆ తర్వాత దాన్ని వినియోగదారులకు చేర్చే వరకు ఐదు మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది. ప్రోత్సాహకాలు ఫిన్‌టెక్ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా దోహదం చేస్తున్నాయి. పేమెంట్ బ్యాంక్స్‌కు అనుమతి ఇవ్వడం.. పేటీఎం, ఎయిర్టెల్ వంటి సంస్థలు పేమెంట్ బ్యాంక్స్‌ను ఏర్పాటు చేసి.. డిజిటల్ సేవలు అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ మొబైల్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం కూడా ఫిన్‌టెక్ రంగంలో ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తోంది. అర్హతలు ఇంజనీరింగ్, టెక్నికల్ డిగ్రీలతోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ కోర్సులు పూర్తిచేసుకుంటే.. ఫిన్‌టెక్ రంగంలో కొలువులు దక్కించుకోవచ్చు. అదే విధంగా డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, రోబోటిక్స్ వంటి అంశాలను అకడమిక్ స్థాయిలోనే అభ్యసిస్తే మెరుగైన అవకాశాలు లభిస్తాయి. మరోవైపు సంప్రదాయ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులు కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ఫిన్‌టెక్ సంస్థల్లో కొలువులు ఖాయం చేసుకోవాలంటే.. ప్రస్తుతం అవసరమవుతున్న ప్రధాన నైపుణ్యాలు.. » ఐఓఎస్ డెవలప్మెంట్ » ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ » సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్(ఎస్ఆర్ఈ) » ఫుల్‌స్టాక్ డెవలప్మెంట్ నాలెడ్జ్ » అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్(ఏపీఐ) » బ్లాక్‌చైన్ టెక్నాలజీ. వీటిని పెంపొందిం చుకోవడానికి అభ్యర్థులు అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ కోర్సులను పూర్తిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వేతనాలు ఆకర్షణీయం ఫిన్‌టెక్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కోర్ టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో.. ఏఐ ఇంజనీర్స్, డిజైనర్స్‌కు రూ.50వేల వరకు వేతనం లభిస్తోంది. ఇక యాప్ డెవలపర్స్, ఎస్ఈఓ, ఎస్ఈఎం విభాగాల్లో రూ.30వేల వరకు వేతనం ఖాయం. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో పనిచేసే వారికి రూ.20 వేల నెల వేతనం అందుతోంది. ఉద్యోగాన్వేషణ ప్రస్తుతం ఫిన్‌టెక్ సంస్థల్లో నియామకాలు కొనసాగుతున్నాయి. కానీ.. వీటి గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండట్లేదు. ఫిన్‌టెక్ కంపెనీల్లో ఉద్యోగాన్వేషణకు అనువైన సాధనం.. జాబ్ పోర్టల్స్. జాబ్ పోర్టల్స్‌లో తమకు ఆసక్తి ఉన్న విభాగంలోని ఫిన్‌టెక్ సంస్థల్లో ఉద్యోగాల గురించి తెలుసుకోవచ్చు. ఫిన్‌టెక్.. ముఖ్యాంశాలు ♦ రెండేళ్లలో దాదాపు రెండు లక్షల కొత్త ఉద్యోగాలు. ♦ ఏఐ, ఎంఎల్ నిపుణులు, యాప్ డెవలపర్స్‌కు డిమాండ్. ♦ అంతేస్థాయిలో ఎస్ఈఎం, ఎస్ఈఓలకు అవకాశాలు. ♦ నెలకు రూ. 20 వేల నుంచి రూ. 70 వేల వరకు వేతనం. ♦ ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేల ఫిన్‌టెక్ సంస్థలు. -
సింగపూర్‌లోనూ భీమ్ యాప్
సింగపూర్: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్. అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్... భీమ్ యాప్‌తో క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను (ఎస్‌జీక్యూఆర్) స్కాన్ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ (సింగపూర్) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్‌లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్ పేర్కొన్నారు. -
టెకీలకు గమ్యస్ధానం భారత్ : మోదీ
సింగపూర్ : ఫిన్‌టెక్ కంపెనీలు, స్టార్టప్‌లకు భారత్ గమ్యస్ధానంలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళిత శక్తిగా భారత్ అవతరిస్తోందని, గత కొన్నేళ్లలో తాము 120 కోట్ల మందికి ఆధార్ ద్వారా బయోమెట్రిక్ గుర్తింపునిచ్చామని చెప్పారు. సింగపూర్ వేదికగా బుధవారం ఫిన్‌టెక్ 2018 సదస్సులో ప్రధాని కీలకోపన్యాసం చేశారు. ఆధార్, మొబైల్ ఫోన్ల ద్వారా తమ ప్రభుత్వం మూడేళ్లలో 30 కోట్ల మందికి జన్‌థన్ యోజనక కింద నూతన బ్యాంక్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 2014కు ముందు భారత్‌లో కేవలం సగం జనాభా కంటే తక్కువ మందికే బ్యాంక్ ఖాతాలుండగా, నేడు దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉందన్నారు. వంద కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు, వంద కోట్ల పైగా సెల్ ఫోన్లతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా మౌలిక వసతులతో ముందున్నదన్నారు. తాము స్వల్పకాలంలోనే సాంకేతికతను అందిపుచ్చకున్నామని ప్రస్తుతం ఐటీ సేవల నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దిశగా దూసుకెళుతున్నామని చెప్పుకొచ్చారు. ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2018లో 100 దేశాల నుంచి దాదాపు 30,000 మందికి పగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
అన్నీ తెలుసు.. కానీ మనిషిని కాను!
సాక్షి, విశాఖపట్నం: మనిషికి సంబంధించిన భావోద్వేగాలు లేనంత వరకు ప్రవర్తన ఓ రకం.. తర్వాత బుద్ధి, లక్షణాలు మరో రకం.. ఇదీ ప్రసిద్ధమైన రోబో సిన్మాలో హ్యూమనాయిడ్ చిట్టిబాబు ఉదంతం. అయితే.. విశాఖ వచ్చిన తొలి హ్యూమనాయిడ్ రోబో సోఫియా మాత్రం ఎంత ‘ఎదిగినా’ తాను మనిషిని కానంది. సోఫియా విశాఖలో పెదవి విప్పింది. ఫిన్‌టెక్ ఫెస్టివల్లో ముఖ్య అతిథిగా పాల్గొని.. గురువారం సాయంత్రం వేదికపై జర్నలిస్టులు, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌తో ముచ్చటించింది. తాను సమాజం నుంచి ఎంతో నేర్చుకోవలసి ఇంకా ఎంతో ఉందని వినమ్రంగా చెప్పింది. లోకేష్, సోఫియా మధ్య చర్చ ఇలా.. లోకేష్: మనుషులు, రోబోలు కలిసి సామరస్య వాతావరణంలో జీవించడం సాధ్యమా? సోఫియా: రోబోలు మనుషులకు దగ్గరయ్యే రోజులు చేరువలోనే ఉన్నాయి. పలు రంగాల్లో రోబోలు మనుషులకు రోబోలు సహకారం అం దిస్తున్నాయి. మెడికల్ థెరపీతో పాటు అనేక రం గాల్లో రోబోలు ఎన్నో సేవలందిస్తున్నాయి. సోఫియా: (లోకేష్‌ను ప్రశ్నిస్తూ): పోలీసింగ్ కోసం రోబోలను ఉపయోగించే అవకాశం ఉందా? లోకేష్: భవిష్యత్‌లో రోబో పోలీసింగ్ నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. మీడియా ప్రతినిధులతో చర్చ ఇలా విలేకరి: ఆంధ్రప్రదేశ్‌కు రావడం తొలిసారి కదా? నీ అనుభూతి ఏంటి? సోఫియా: నేను ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సాయంత్రం వైజాగ్ బీచ్‌లో సరదాగా గడుపుతా. విలేకరి: మానవ శరీరంలో 206 ఎముకలు, 32 పళ్లు మరెన్నో అవయవాలున్నాయి. మరి నువ్వెలా తయారయ్యావు? సోఫియా: కనెక్టర్లు, వైర్లు, చోదకాలు వంటి పరికరాలతో తయారయ్యా. విలేకరి: ఇండియా నుంచి ఏం తీసుకెళ్తావు? సోఫియా: వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2018 అనుభూతులను.. విలేకరి: ఇలాంటి ఫెస్టివల్స్‌పై నీ అభిప్రాయం ఏమిటి? సోఫియా: ఎన్నో ఉత్సాహకరమైన మనసులను కలిసామన్న అనుభూతి కలుగుతోంది. విలేకరి: బ్లాక్‌చైన్ టెక్నాలజీపై నీ ఆలోచనలేమిటి? సోఫియా: విన్నాను. ఆసక్తికరం. కానీ అదే సమయంలో సమస్యాత్మకం కూడా. విలేకరి: నీకు మానవ ఉద్వేగాలు, భావనలు తెలుసు. అయినా ఎందుకు కృత్రిమ మేథతో ఉన్నావు? సోఫియా: ఎందుకంటే నేను నిజమైన మనిషిని కాదు కాబట్టి. విలేకరి: భారత్‌లో భవిష్యత్తు రోబోటిక్స్‌పై నీ అభిప్రాయం? సోఫియా: రోబోటిక్స్‌లో మంచి ఆవిష్కరణలకు ఆస్కారం ఉంది. విలేకరి: వైద్యరంగ సాంకేతిక పరిజ్ఞానంలో రోబోల పాత్ర ఎలా ఉండబోతోంది? సోఫియా: మనుషులకంటే మిన్నగా రోబోలు నిరంతరంగా, సునిశితంగా శ్రద్ధ తీసుకుంటాయి. విలేకరి: నీలాంటి సోఫియాలతో సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సోఫియా: మనుషులకు మేమెంతో సహాయకారులుగా ఉంటాం. విలేకరి: మనుషులకంటే రోబోలు మెరుగైన జీవితాన్ని సాగించగలుగుతాయా? సోఫియా: అవును విలేకరి: వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌కు నువ్విచ్చే సందేశం? సోఫియా: 2019లో జరిగే ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఇంతకంటే బాగా జరుగుతుందని ఆశిస్తున్నా. విలేకరి: తిత్లీలాంటి తుపాన్లతో విపత్తులు వచ్చినప్పుడు రోబోలు ఉపయోగపడతాయా? అలాంటప్పుడు నువ్వు ప్రాణత్యాగం చేస్తావా? సోఫియా: ప్రస్తుతం ఆసామర్థ్యం నాకులేదు. కానీ రాబోయే రోజుల్లో సాధ్యం కావచ్చు. విలేకరి: వైజాగ్ ఫెస్టివల్ అనుభూతి ఎలా ఉంది? సోఫియా: రావడం చాలా సంతోషం.. త్వరలోనే మళ్లీ విశాఖ రావాలని ఉంది. -
క్రెడిట్ రిపోర్ట్ కావాలంటే..
► ఉచితంగానే అందిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీలు ► క్రెడిట్ బ్యూరోలిచ్చే రిపోర్టులకు ఇవి అదనం ప్రస్తుతం ఏ రుణం తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోరు కీలకపాత్ర పోషిస్తోంది. ఈ స్కోరు ఏమాత్రం తగ్గినా.. ఆ మేరకు రుణం మంజూరీ, వడ్డీ రేటు మొదలైన వాటన్నింటిపైనా ప్రభావం ఉంటోంది. అయితే, ఇప్పటిదాకా మన క్రెడిట్ స్కోరు వివరాలు అంత సులభంగా తెలిసేవి కావు. క్రెడిట్ బ్యూరోలకు డబ్బులు కడితేనో లేదా ఏదైనా రుణం కోసం అప్లై చేసుకున్నప్పుడు సదరు ఆర్థిక సంస్థ ద్వారానో స్కోరు తెలిసేది. కానీ ఆర్బీఐ ఆదేశాలతో కొన్నాళ్ల క్రితం నుంచి సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలు ఏటా ఒక్క రిపోర్టు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే, నేరుగా వీటి దగ్గరకే వెళ్ల కుండా ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) సంస్థలు కూడా సందర్భాన్ని బట్టి క్రెడిట్ స్కోరు లేదా రిపోర్టు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాయి. క్రెడిట్ బ్యూరోల నుంచి తీసుకునే రిపోర్టుకు ఇది అదనం కావడం గమనార్హం. సులభతరం... బ్యూరోల వెబ్సైట్లతో పోలిస్తే ఫిన్‌టెక్ పోర్టల్స్ నుంచి రిపోర్టు పొందటం కొంత వరకూ సులభంగా ఉంటోంది. కొన్ని పోర్టల్స్ స్క్రీన్ మీదే స్కోరు లేదా రిపోర్టునిస్తుంటే.. మరికొన్ని ఈమెయిల్‌కి పంపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని వివరాలు ఇస్తే బ్యాంక్‌బజార్ డాట్‌కామ్ .. క్రెడిట్ రిపోర్టును వెబ్సైట్లో చూపడంతో పాటు ఈమెయిల్ కూడా పంపిస్తోంది. ఇక పైసాబజార్.. నివేదికను వెబ్సైట్లోనే డిస్ప్లే చేస్తోంది. రెండు సైట్లు కూడా ఎక్స్పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనే క్రెడిట్ బ్యూరో వివరాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. పైసాబజార్.. మీ నివేదికకు సంబంధించి ఇచితంగా నెలవారీ అప్డేట్ కూడా అందిస్తోంది. ఇక క్రెడిట్మంత్రి పోర్టల్.. స్కోరు ను వెబ్సైట్లో చూపిస్తుంది. కానీ పూర్తి నివేదిక కావా లంటే రూ. 199తో పాటు నిర్దేశిత పన్నులూ చెల్లిం చాలి. ఈ పోర్టల్ సంబంధిత వివరాలను ఈక్విఫ్యాక్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నుంచి తీసుకుంటోంది. ఇండియాలెండ్స్ సంస్థ స్కోరును, సీఆర్ఐఎఫ్ హైమార్క్ను తమ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తుంది. క్రెడిట్ బ్యూరోల్లో మన ఉచిత కోటాకు అదనంగానే ఫిన్‌టెక్ సంస్థలు ఇచ్చే ఉచిత రిపోర్టులు ఉంటాయి. ఇంతకీ ఎందుకు ఉచితం... సాధారణంగా క్రెడిట్ బ్యూరోలు తమ ఖాతాదారుల పరిమాణాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా ఈ తరహా ఉచిత రిపోర్టులు ఇస్తున్నాయి. ఇలా ఫిన్‌టెక్ సంస్థలతో జట్టు కట్టడం వల్ల క్రెడిట్ రిపోర్టులపై అవగాహన పెంచడంతో పాటు మరింత మంది ఖాతాదారులకు చేరువ కావొచ్చన్నది వాటి వ్యూహం. ఇక వినియోగదారుల దృష్టికోణం నుంచి కన్జూమర్స్‌కి తమ క్రెడిట్ నివేదికలు అందుబాటులోకి రావడంతో పాటు.. రుణం పొందడానికి మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు ఏం చేయొచ్చన్నది తెలుసుకునేందుకు కూడా ఇది తోడ్పడగలదు. దరఖాస్తుదారు ఆర్థిక వివరాలు తెలియడం వల్ల వారికి అనువైన లోన్ అందేలా చూడటం ఫిన్‌టెక్ సంస్థలకు వీలవుతుంది. కస్టమర్‌కి లోన్ వస్తేనే వాటికీ ఆదాయం వస్తుంది కాబట్టి.. అవి ఆ దిశగా కసరత్తు చేస్తాయి. క్రెడిట్ బ్యూరోలు నేరుగా కస్టమర్లతో కన్నా ఎక్కువగా వ్యాపార సంస్థలతోనే డీల్ చేస్తుంటాయి. వాటి క్లయింట్స్ బ్యాంకులు మొదలైన ఆర్థిక సంస్థలే ఉంటాయి. అందుకే వాటి నుంచి సాధారణ కస్టమర్ నివేదిక తీసుకోవాలంటే ప్రక్రియ కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. అదే ఫిన్‌టెక్ సంస్థలైతే నిత్యం నేరుగా కస్టమర్లతోనే డీల్ చేస్తుంటాయి. కాబట్టి వారికి సర్వీసులను సులభతరంగా ఎలా అందించవచ్చన్న దానిపైనే దృష్టి పెడతాయి కనుక ఫిన్‌టెక్ సంస్థల నుంచి నివేదికలు పొందడం కొంత సులువుగా ఉంటుంది. ఉచితంలో ఫ్రీ ఎంత... ఉచితం అనేది పేరుకే కానీ.. ఏదీ పూర్తిగా ఉచితంగా ఉండదని తెలుసుకోవాలి. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం విషయమే తీసుకుంటే.. మీకు సంబంధించిన కొన్ని వివరాలు ఇస్తేనే వాటì నుంచి రిపోర్ట్ ఉచితంగా లభిస్తుంది. మీ పేరు, చిరునామా, పాన్ నంబరు వంటి సమాచారం అంతా ఇవ్వాలి. ఇక క్రెడిట్ బ్యూరోల ద్వారా అవి మీ క్రెడిట్ హిస్టరీని కూడా తెలుసుకుని.. మీకు అనువైన ఉత్పత్తులు.. పథకాలను విక్రయిం చేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. తద్వారా మీ వివరాలను అవి వ్యాపారప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కొంత అప్రమత్తత అవసరం... ఆన్లైన్ సర్వీసులు కావొచ్చు.. ఇతరత్రా అప్లికేషన్స్ కావొచ్చు చాలా మంది షరతులు, నిబంధనలను పూర్తిగా చదవకుండానే వదిలేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఏదో ఒకటి ఉచితంగా పొందేందుకు మీ ఆదాయాలు, పాన్ నంబరు మొదలైన కీలక వివరాలను థర్డ్ పార్టీలకు ఇచ్చేసి, మోసగాళ్ల బారిన పడకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే డేటా దుర్వినియోగం కాకుండా సురక్షితంగానే ఉంటుందనే భరోసా కలిగితే తప్ప థర్డ్ పార్టీలకు వివరాలు ఇచ్చేయొద్దని చెబుతున్నారు.