దేశీయ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే తన వినియోగదారులకు మరింత సౌకర్యాలు అందించేలా కొత్త పరికరాన్ని తయారుచేసింది. ఇందులో భాగంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్, స్పీకర్.. అన్నీ ఒకే పరికరంలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ ఆల్-ఇన్-ఒన్ చెల్లింపు పరికరం ‘భారత్‌పే వన్’ను తాజాగా ఆవిష్కరించారు.
మొదటి దశలో దాదాపు 100 నగరాల్లో దీన్ని పరిచయం చేసి, రానున్న ఆరు నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది కంపెనీ యోచిస్తోంది. హైడెఫినిషన్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో భారత్‌పే వన్ పనిచేస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి.
పోర్టబుల్ డిజైన్, లావాదేవీల డాష్‌బోర్డ్‌లతో భారత్‌పే ఆఫ్‌లైన్ వ్యాపారులకు మరింత సేవలిందించేలా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ అండ్ పే, డెబిడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు.. ఇలా విభిన్న మార్గాల్లో లావాదేవీలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ
ఫిన్‌టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం ఇటీవల తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్‌కార్డుల కోసం కొత్త సౌండ్‌బాక్స్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పరికరాలు మేడ్‌ఇన్‌ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్‌బాక్స్‌లు 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment